tsunami
-
ఆ అమ్మ సునామీకి జన్మనిచ్చింది!
ఎప్పుడూ చూసే సముద్రమే ఆ రోజు కొత్తగా ఉంది. భయంగా ఉంది. ఎప్పుడూ నవ్వుతూ పలకరించే సముద్రం విలయ విధ్వంసానికి సిద్ధంగా ఉంది. ఆరోజు... ఏ రోజూ మరచిపోలేని రోజు. సునామీ విశ్వరూపాన్ని చూపిన రోజు. ఇరవై సంవత్సరాల తరువాత కూడా... నిన్ననే జరిగినట్లు వెన్నులో చలిపుట్టించే రోజు...అండమాన్ నికోబార్‌లోని హట్ బే దీవిలో భీకర అలల ధాటికి నమిత రాయ్ ఇల్లు పూర్తిగా దెబ్బతిన్నది. అప్పుడు నమిత వయసు పాతిక సంవత్సరాలు. దిక్కుతోచని పరిస్థితుల్లో పాములకు ప్రసిద్ధి చెందిన అడవిలో ఆశ్రయం పొందారు. ఎటు నుంచి ఏ విషసర్పం వచ్చి ప్రాణం తీస్తుందో తెలియని భయానక పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లోనే ఆ పాముల అడవిలోనే పండంటి పిల్లాడికి జన్మనిచ్చింది నమిత.ఆ పిల్లాడికి ‘సునామీ’ అని పేరు పెట్టారు. రెండు దశాబ్దాల తరువాత మళ్లీ ఆ రోజుల్లోకి వెళ్లింది నమిత రాయ్...‘ఆ చీకటి రోజును గుర్తు చేసుకుంటే ఇప్పటికీ ఒంట్లో వణుకు పుడుతుంది. అప్పుడు నేను గర్భవతిని. రోజువారీ పనులతో బిజీగా ఉన్నాను. ఉన్నట్టుండి భయంకరమైన నిశ్శబ్దం ఆవరించింది. మా తీరం నుండి మైళ్ళ దూరంలో సముద్రం తగ్గుముఖం పట్టడం చూసి షాక్ అయ్యాను. కొన్ని సెకనుల తరువాత మా దీవి వైపు భారీ సముద్రపు అలలు దూసుకొస్తున్నాయి, ఆ తర్వాత బలమైన ప్రకంపనలు వచ్చాయి. ప్రజలు కేకలు వేస్తూ గుట్ట వైపు పరుగెత్తడం చూశాను. పానిక్ ఎటాక్ వచ్చి స్పృహ తప్పి పడిపోయాను.కొన్ని గంటల తరువాత స్పృహలోకి వచ్చాను. కొండ అడవిలో వేలాది మంది స్థానికుల మధ్య నేను ఉన్నాను. నా భర్త, పెద్ద కొడుకును చూడగానే ప్రాణం లేచి వచ్చింది. మా ద్వీపంలోని చాలాప్రాంతాలు రాక్షస అలల తాకిడికి నాశనం అయ్యాయి. ఆస్తి అనేది లేకుండా పోయింది.ఒకరోజు రాత్రి పదకొండు గంటల తరువాత నాకు పురిటినొప్పులు వచ్చాయి. కానీ చుట్టుపక్కల డాక్టర్లు ఎవరూ లేరు. నేను ఒక బండరాయిపై పడుకొని సహాయం కోసం ఏడ్చాను. నా భర్త ఎంత ప్రయత్నించినా వైద్యసహాయం అందలేదు. అడవిలో ఆశ్రయం పొందిన కొందరు మహిళలను నా భర్త వేడుకున్నాడు. వారి సాయంతో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో సునామీకి జన్మనిచ్చాను.తిండి లేదు. సముద్రానికి భయపడి అడవి నుండి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో నా బిడ్డ బతుకుతాడా అనే బాధ మొదలైంది. కొబ్బరి నీళ్లే ఆహారమయ్యాయి. లాల్ టిక్రీ హిల్స్‌లో నాలుగు రాత్రులు గడిపిన మమ్మల్ని రక్షణ సిబ్బంది కాపాడారు. చికిత్స కోసం నన్ను పోర్ట్ బ్లెయిర్‌లోని జీబీ పంత్ ఆసుపత్రికి ఓడలో తీసుకువెళ్లారు. హట్ బే నుంచి పోర్ట్ బ్లెయిర్‌కు 117 కిలోమీటర్ల దూరం. సుమారు ఎనిమిది గంటల సమయం పట్టింది’ అంటూ గతాన్ని గుర్తు చేసుకుంది నమిత.కోవిడ్ మహమ్మారి సమయంలో భర్త లక్ష్మీ నారాయణ మరణించడంతో ఇద్దరు కుమారులు సౌరభ్, సునామీలతో కలిసి పశ్చిమబెంగాల్లోని హుగ్లీలో నివసిస్తుంది నమితా రాయ్.నమిత పెద్ద కుమారుడు సౌరభ్ ఒక ప్రైవేట్ షిప్పింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. చిన్న కుమారుడు సునామీ ‘ఓషనోగ్రాఫర్’ కావాలనుకుంటున్నాడు.‘మా అమ్మే నాకు సర్వస్వం. ఆమె ధైర్యశాలి. నాన్న చనిపోయాక మమ్మల్ని పోషించడానికి చాలా కష్టపడింది. ఫుడ్ డెలివరీ సర్వీసును నిర్వహించింది. దానికి సునామీ కిచెన్ అని సగర్వంగా పేరు పెట్టింది’ అంటున్నాడు సునామీ రాయ్.‘2004లో సమర్థవంతమైన హెచ్చరిక వ్యవస్థ లేకపోవడంతో పెద్ద ఎత్తున విధ్వంసం,ప్రాణ నష్టం జరిగింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 1.400కు పైగా హెచ్చరిక కేంద్రాలు(వార్నింగ్ స్టేషన్స్) ఉన్నాయి. సునామీ నాటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు మేము సర్వసన్నద్ధంగా ఉన్నాం’ అంటున్నారు అండామన్ నికోబార్ దీవుల అడ్మినిస్ట్రేషన్ సీనియర్ అధికారులు. -
2 లక్షల మందిని మింగేసిన రాకాసి అల
-
20 Years of Tsunami: రాకాసి అలలను దాటి.. విషసర్పాల కారడవిలో శిశువుకు జన్మనిచ్చి..
సరిగ్గా 20 ఏళ్ల క్రితం తమిళనాడు తీరంలో సముద్రపు రాకాసి అలలు సృష్టించిన బీభత్సాన్ని నేటికీ ఎవరూ మరచిపోలేరు. 2004 డిసెంబర్ 26న ఏకంగా 6,605 మందిని బలిగొన్న సునామీ మిగిల్చిన విషాదం ఇప్పటికీ స్థానికులను వెంటాడుతూనే ఉంది. నాటి సునామీ బాధితులలో నమితా రాయ్ ఒకరు. ఆనాడు ఆమెకు అనూహ్య అనుభవం ఎదురయ్యింది. దానిని తలచుకున్నప్పుడల్లా ఆమె నిలువెల్లా వణికిపోతుంటుంది.ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీలో ఉంటున్న నమితా రాయ్ నాటి సునామీ అనుభవాలను మీడియాకు తెలిపారు. అవి ఆమె మాటల్లోనే.. ‘2004లో నేను కుటుంబంతోపాటు అండమాన్, నికోబార్‌లోని హాట్‌బే ద్వీపంలో ఉండేవాళ్లం. ఆ సమయంలో నేను గర్భవతిని. ఆ రోజు నేను రోజువారీ పనుల్లో బిజీగా ఉన్నాను. అకస్మాత్తుగా హట్ బే ద్వీపం దిశగా సముద్రపు అలలు ఎగసిపడుతూ వచ్చాయి. వాటిని చూసిన వారంతా పెద్దగా కేకలు పెడుతూ, కొండపైకి పరుగులు తీశారు. దీనిని చూసిన నేను భయంతో స్పృహ కోల్పోయాను.నేను తేరుకుని కళ్లు తెరచి చూసేసరికి దట్టమైన అడవిలో ఉన్నాను. నా చుట్టూ చాలామంది ఉన్నారు. అంతకుముందు అపస్మారక స్థితిలో ఉన్న నన్ను నా భర్త, పెద్ద కుమారుడు ఇక్కడికి తీసుకువచ్చారు. భీకరమైన అలల తాకిడికి హాట్‌బే ద్వీపమంతా ధ్వంసమయ్యిందని చెప్పారు. ఆ మాట వినగానే షాక్‌కు గురయ్యాను. ఆరోజు రాత్రి 11.49 గంటల సమయంలో నాకు అకస్మాత్తుగా పురిటి నొప్పులు వచ్చాయి. దగ్గర్లో డాక్టర్లెవరూ లేరు.పురిటి నొప్పులతో బాధపడుతూ మెలికలు తిరిగిపోయాను. దీనిని గమనించిన నా భర్త నన్ను ఒక చదునైన బండరాయిపై పడుకోబెట్టారు. సహాయం కోసం వైద్యులకు కాల్ చేశారు. ఎంత ప్రయత్నించినా వైద్య సహాయం అందలేదు. వెంటనే నా భర్త.. నేను పడుతున్న పురిటినొప్పల గురించి అక్కడున్న మహిళలకు చెప్పి,సాయం అర్థించారు. వెంటనే వారు అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో నాకు పురుడు పోశారు. అంతటి విపత్కర సునామీ పరిస్థితుల మధ్య నేను నా కుమారునికి జన్మనిచ్చాను. ఆ ఆడవిలో లెక్కకు మించిన విష సర్పాలు ఉంటాయి. వాటి మధ్యనే నేను పురుడు పోసుకున్నాను. నా కుమారునికి ‘సునామీ’ అని పేరు పెట్టుకున్నాను.అయితే అధిక రక్తస్రావం కారణంగా నా ఆరోగ్య పరిస్థితి దిగజారింది. అతికష్టం మీద నా బిడ్డకు పాలు తాగించాను. అయితే అంతకుమందు నేను ఏమీ తినకపోవడంతో నా పిల్లాడికి కావాల్సినంత పాలు ఇవ్వలేకపోయాను. దీనిని గమనించిన చుట్టుపక్కల మహిళలు నా కుమారుని చేత కొబ్బరి నీళ్లు తాగించారు. అటువంటి దుర్భర పరిస్థితుల్లో అదే ప్రాంతంలో మేము నాలుగు రోజులు ఉండాల్సి వచ్చింది. తరువాత రక్షణ సిబ్బంది అక్కడికి వచ్చి మమ్మల్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు. అక్కడి నుంచి నన్ను వైద్య చికిత్స కోసం పోర్ట్ బ్లెయిర్‌లోని జీబీ పంత్ ఆసుపత్రికి ఓడలో తీసుకెళ్లారు.కోవిడ్ -19 మహమ్మారి సమయంలో నా భర్త లక్ష్మీనారాయణ కన్నుమూశారు. ప్రస్తుతం నేను నా కుమారులు సౌరభ్, సునామీలతో పాటు హుగ్లీలో ఉంటున్నాను. పెద్ద కొడుకు సౌరభ్ ఒక ప్రైవేట్ షిప్పింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. రెండవవాడు సునామీ భవిష్యత్‌లో సముద్ర శాస్త్రవేత్త కావాలని అనుకుంటున్నాడు’ అని నమితా రాయ్ తెలిపారు.అనంతరం ఆమె కుమారుడు సునామీ మీడియాతో మాట్లాడుతూ ‘మా అమ్మే నాకు సర్వసం. మా నాన్నగారు మరణించాక అమ్మ మమ్మల్ని పెంచిపెద్ద చేసేందుకు ఎంతో శ్రమించింది. సునామీ కిచెన్‌ను నడుపుతూ కుటుంబాన్ని నెట్టుకువచ్చింది. భవిష్యత్‌లో నేను సముద్ర శాస్త్రవేత్త కావాలనుకుంటున్నాను’ అని తెలిపారు.ఇది కూడా చదవండి: Veer Bal Diwas: మొఘలులను ఎదిరించిన ఆ చిన్నారుల బలిదానానికి గుర్తుగా.. -
భాగ్య నగర కీర్తి ‘కెరటం’.. ఇంకాయిస్
హిందూ మహాసముద్రంతో అనుబంధం ఉన్న 28 దేశాలకు సునామీ హెచ్చరికలు మన భాగ్యనగరం నుంచే వెళ్తుంటాయి. సముద్రాల్లో ఏర్పడే భూప్రకంపనల నుంచి సునామీ రాక, సముద్రపు అలల ఎత్తు, వేగం, వాటి తీవ్రత ఏమేర ఉంటుందో క్షణాల్లో భారత్‌తోపాటు ఆయా దేశాలకు చేరవేసే విజ్ఞాన వాహిని భాగ్యనగర సొంతం. నగర కీర్తి కెరటంగా ‘ఇంకాయిస్’ (భారత జాతీయ మహాసముద్ర సమాచార సేవా కేంద్రం) పరిఢవిల్లుతోంది.సనత్‌నగర్ (హైదరాబాద్): ప్రపంచంలో మూడు దేశాల్లో సునామీ హెచ్చరిక కేంద్రాలు ఉంటే అందులో హైదరాబాద్‌లోని ఇంకాయిస్ ఒకటి. మిగతా రెండు ఇండోనేసియా,ఆ్రస్టేలియాలో ఉన్నాయి. 2004 హిందూమహాసముద్ర సునామీ 20వ వార్షికోత్సవాన్ని గురువారం ప్రగతినగర్‌లోని ఓషన్ వ్యాలీలో గల ఇంకాయిస్లోజరపనున్నారు. దీనికి కేంద్ర భూవిజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖ సహాయమంత్రి డాక్టర్ జితేంద్రసింగ్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. నాటి సునామీలో ప్రాణాలు విడిచిన వారికి నివాళులు అర్పించనున్నారు.ఈ సందర్భంగా ఇంకాయిస్ అందిస్తున్నసేవలపై ప్రత్యేక కథనం.తొలుత మత్స్యకారుల సేవల కోసం..1999లో మత్స్యకారులకు సేవలు అందించేందుకు పొటెన్షియల్ ఫిషింగ్ జోన్ (పీఎఫ్జెడ్)గా ఇంకాయిస్ ఆవిర్భవించింది. సముద్రంలో చేపలు ఎక్కువగా లభ్యమయ్యే ప్రాంతాలను గుర్తించి సమాచారాన్ని వారికి చేరవేసే కేంద్రంగానే ఉండేది. ఆ తరువాత కొద్దికాలానికి సముద్రంలో వాయు దిశ, అలల వేగం, వాటి ఎత్తు, ఉష్ణోగ్రత వివరాలను అందిస్తూ ఓషియన్ స్టేట్ ఫోర్కాస్ట్ సేవలకు అంకురార్పణ చేసింది. 2004కు ముందు వరకు సునామీ అంటే భారత్‌కు పరిచయం లేని పదం. 2004లో వచ్చిన సునామీతో 2,40,000 మందికి పైగా చనిపోయిన విషయం తెలిసిందే. 14 దేశాలపై సునామీ ప్రభావం పడింది. ఆ సమయంలోనే సునామీ అంటే ఏంటో అందరికీ తెలిసింది. అప్పటివరకు సునామీ వస్తుందన్న ముందస్తు సమాచారం ఇచ్చే కేంద్రం ప్రపంచదేశాల్లో ఎక్కడా లేదు. దీంతో భారత ప్రభుత్వం కూడా తేరుకుని సునామీ హెచ్చరిక కేంద్రం ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ఆ మేరకు అప్పటికే ఇంకాయిస్ ద్వారా మహాసముద్ర సమాచార సేవలు అందుతుండటంతో దీనికి అనుబంధంగానే సునామీ హెచ్చరిక కేంద్రం నెలకొల్పింది. 2005లో ప్రక్రియ ప్రారంభించి 2007లో పూర్తిస్థాయిలో హిందూ మహాసముద్ర సునామీ ముందస్తు హెచ్చరిక కేంద్రంగా అవతరించింది.సునామీలు ఎలా ఏర్పడతాయంటే..? సముద్రంలో భూకంపాలు, అగ్ని పర్వతాలు బద్దలవ్వడం, కొండచరియలు విరిగిపడటం వంటి కారణాలతో సునామీలు ఉత్పన్నమవుతాయి. అయితే ఎక్కువ శాతం భూకంపాల ద్వారానే సునామీలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. భూకంప తీవ్రత 6.5 కంటే ఎక్కువ ఉంటే సునామీ వచ్చే ప్రమాదం ఉంది. సునామీ సమయంలో సముద్రం మధ్య భాగంలో వాయువేగం గంటకు 800 కి.మీ., కెరటాల ఎత్తు ఒక మీటరు కంటే తక్కువగా ఉంటాయి. అదే తీరప్రాంతాన్ని తాకే సమయంలో వాయువేగం గంటకు 30 కి.మీ.కు పడిపోయి అలల ఎత్తు మాత్రం 30 మీటర్లకు పెరిగిపోతుంది. అందుకే సునామీ వచ్చే ప్రాంతంలో ఎత్తైన ప్రదేశంలో ఉండాలని నిపుణులు హెచ్చరిస్తారు. తీరాన్ని తాకుతున్న కొద్దీ అలల ఎత్తు పెరుగుతుంది. సునామీ రాకను సామాన్య ప్రజలు కూడా గుర్తించవచ్చు. ఆ సమయంలో సముద్రం వెనుకకు వెళ్లిపోతుంది. అలల శబ్ద తరంగాల్లో మార్పు గమనించవచ్చు. ఇంకాయిస్ ఎలా గుర్తిస్తుందంటే.. సునామీకి ముందు మొదట సముద్రంలో భూమి కంపిస్తుంది. అలా భూప్రకంపనలు జరిగిన 5–6 నిమిషాలకు ఇంకాయిస్‌కు సమాచారం అందుతుంది. సముద్ర భూభాగంలో అమర్చిన సిస్మో మీటర్ల ఆధారంగా శాటిలైట్ ద్వారా భూప్రకంపనలు జరిగిన సమాచారం ఇంకాయిస్‌కు చేరుతుంది. ఆ తరువాత భూకంపం ప్రభావంతో సునామీ వచ్చే అవకాశం ఉందా? లేదా? అనే దానిపై దృష్టిసారిస్తారు. సముద్ర జలాలకు కొద్ది కిలోమీటర్ల దూరంలో ఏర్పాటుచేసిన ‘సునామీ బోయ్ నెట్వర్క్’ పరికరాల ఆధారంగా కెరటాల ఎత్తు, వాయు దిశను పరిశీలించి సునామీని గుర్తిస్తారు. సాధారణ రోజుల్లో బోయ్ నెట్వర్క్ పరికరాలు శాటిలైట్ ద్వారా 15 నిమిషాలకో మారు అలలు, సముద్ర స్థితిగతులకు సంబంధించిన సమాచారం ఇంకాయిస్‌కు చేరవేస్తుంది.అదే సునామీ వస్తుందంటే నిమిషానికోమారు సందేశం పంపుతుంది. దాని ఆధారంగా సునామీని పసిగడతారు. ఒక్కో బోయ్ నెట్వర్క్ పరికరం రూ.6 కోట్ల వరకు ఉంటుంది. నిమిషాల్లో సమాచారం...ఇంకాయిస్ సేకరించిన సమాచారాన్ని జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉండే విపత్తు నిర్వహణ కేంద్రాలకు, భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖకు వెబ్సైట్, మెయిల్, ఎస్ఎంఎస్ల ద్వారా కేవలం పది నిమిషాల లోపే చేరవేస్తుంది. మూడుస్థాయిల్లో ఇంకాయిస్ సమాచారం అందిస్తోంది. వార్నింగ్, అలర్ట్, వాచ్ స్థాయిల్లో సందేశం పంపుతుంది. వార్నింగ్ అని సందేశం పంపారంటే తీవ్రత అధికంగా ఉన్నట్లు అర్ధం. సాధారణంగా భూ ప్రకంపనలు జరిగిన తరువాత సునామీ తీరాన్ని చేరుకోవడానికి రెండు గంటలు పడుతుంది.ఆ లోపు సునామీ ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించే అవకాశం ఉంటుంది. ఒక్క అండమాన్ దగ్గర సునామీ ఏర్పడితే మాత్రం 20 నిమిషాల వ్యవధిలోనే తీరాన్ని దాటే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. యునెస్కో ఆదేశాల మేరకు 2011 నుంచి సునామీకి సంబంధించిన సమాచారాన్ని హిందూ మహాసముద్రానికి అనుబంధంగా ఉన్న 28 దేశాలకు ఇంకాయిస్ చేరవేస్తుంది. ఆయా దేశాల ప్రభుత్వాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంది. -
సునామీ @20 ఏళ్లు: అలా జరిగి ఉంటే పెను విధ్వంసం తప్పేది!
ప్రశాంత సాగర తీరంలో ఒక్కసారిగా చెలరేగిన అలజడి.. హహాకారాలతో ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగులు పెడుతూ చెల్లాచెదురైన జనం.. రెప్పపాటులో వాళ్లను ముంచేసిన రాకాసి అలలు.. నేలకూలిన భవనాలు-ముక్కలైన జీవనాధారాలు.. వెతికేకొద్దీ బయటపడ్డ శవాలు.. వెరసి ఎటుచూసినా కన్నీళ్లే!. సరిగ్గా.. 20 ఏళ్ల క్రితం సునామీ(Tsunami) సృష్టించిన విధ్వంసపు జ్ఞాపకాలివి. అప్పటిదాకా సాగర ఆటుపోట్లను ఆహ్లాదంగా భావించిన తీర ప్రాంత ప్రజలు.. ఘోర విపత్తును చూసింది మాత్రం అదే తొలిసారి!. ఇంతకీ ఆరోజు అసలేం జరిగింది? వేలు, లక్షల సంఖ్యలో ప్రాణాలను బలిగొనే విలయాన్ని పసిగట్టడంలో శాస్త్రవేత్తలు, అధికారుల అంచనాలు ఎక్కడ తప్పాయి?.డిసెంబర్ 26, 2004.. సమయం ఉదయం 7.58నిమిషాలు. ఇండోనేషియాలోని సుమత్రా ఉత్తర వైపున్న సముద్రంలో ఒక్కసారిగా అలజడి రేగింది. ప్రపంచంలోనే అత్యధికంగా భూకంపాలు సంభవించే.. ‘రింగ్ ఆఫ్ ఫైర్’(పసిఫిక్ మహాసముద్రం) ప్రాంతమది. దీంతో అగ్నిపర్వతాలు బద్దలవడం, భూకంపాలు, వరదలు షరామాములుగా మారిందక్కడ. ఆ పూట సంభవించిన వాటిని కూడా తేలికపాటి ప్రకంపనలుగానే అధికారులు భావించి తేలికగా తీసుకున్నారు. కానీ, ఆ ప్రకంపనలు ఒక ప్రళయాన్నే తీసుకొచ్చాయి. 🌊తీవ్ర భూకంప ప్రభావంతో.. సముద్రంలో 50 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడ్డాయి అలలు. ఆ అలలు తీర ప్రాంతం నుంచి ఐదు కి.మీ పాటు భూభాగంలోకి చొచ్చుకొచ్చేశాయి.ఇండోనేషియా.. అచె ప్రాంతంలోనే లక్షా యాభై వేల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు.శ్రీలంక.. సుమత్రాకు 1,700 కిలోమీటర్ల దూరంలోని శ్రీలంక తీర ప్రాంతాల్లో ఊహకందని నష్టం వాటిల్లింది. వివిధ తీర ప్రాంతాల్లో రాకాసి అలల ధాటికి 35 వేల మంది మరణించారు.భారత్.. తమిళనాడు తీవ్రంగా నష్టపోయింది. ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్లోనూ నష్టం జరిగింది. కేరళకు స్వల్ప నష్టం వాటిల్లింది. మొత్తంగా 16, 389 మంది మరణించారు.థాయ్‌లాండ్.. భూకంప కేంద్రానికి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖావో లాక్‌లో తీవ్ర నష్టం వాటిల్లింది. 8 వేలమంది మరణించారు. వీళ్లలో క్రిస్మస్, న్యూఇయర్ సెలవులకు వచ్చిన టూరిస్టులే అధికంగా ఉన్నారు.🌊2004 హిందూ మహాసముద్రంలో ఏర్పడిన సునామీ కారణంగా.. మొత్తంగా రెండున్నర లక్షల మంది ప్రాణాలు విడిచారు. చెల్లాచెదురైనవాళ్లు లెక్కలేనంత మంది. నిరాశ్రయులైనవాళ్లు ఇంకొందరైతే.. జీవనాధారాలను కోల్పోయారు మరికొందరు. ప్రాణ నష్టంతో పాటు తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లింది. ఆయా దేశాల పర్యాటక రంగం కుదేలు కావడమే కాకుండా.. ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపెట్టింది. ఏకంగా 10 బిలియన్ డాలర్ల మేర ఆర్థిక నష్టం వాటిల్లింది. మానవతా ధృక్పథంతో ప్రపంచవ్యాప్తంగా అందించిన సాయం.. చరిత్రలోనే అతిపెద్ద సాయంగా నిలిచిపోయింది. అయినప్పటికీ.. తీర ప్రాంతాలు, మానసికంగా అక్కడి ప్రజలు కోలుకోవడానికి ఏళ్ల సమయం పట్టింది.10 నిమిషాల భూకంపం!రిక్టర్ స్కేల్‌పై 9.1-9.3 మధ్య తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. సముద్ర గర్భంలో భూమి పది నిమిషాలపాటు కంపిస్తూనే ఉంది. ఆ కారణంతోనే సముద్రపు అలలు రాకాసి రూపం సంతరించుకున్నాయి. తీర ప్రాంతాలను క్షణాల్లో చుట్టుముట్టాయి. ఇండోనేషియా, శ్రీలంక, భారత్, థాయ్‌లాండ్, మాల్దీవులు.. ఇలా 14 దేశాలను సముద్రపు అలలు ముంచెత్తాయి. అమెరికా, యూకే, అంటార్కిటికా తదితర ప్రాంతాల్లో కూడా అలలు ఎగిసిపడ్డాయి. ఎక్కడో 9వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికా స్టేట్ ఓక్లాహామాలోనూ దీని ప్రభావం కనిపించిందంటే తీవ్రత అర్థం చేసుకోవచ్చు. సునామీ అనే పేరు మనవాళ్లు విన్నది అప్పుడే తొలిసారి!.ఆసియాలో అత్యంత శక్తివంతమైన భూకంపంగా రికార్డు21వ శతాబ్దంలో అత్యంత శక్తివంతమైన భూకంపంప్రపంచంలో ఇప్పటిదాకా సంభవించిన భూకంపాల్లో మూడో శక్తివంతమైందిఈ భూకంపం 23 వేల ఆటంబాంబుల పేలుళ్లతో సమానం!2004 సునామీ 21వ శతాబ్దంలో సంభవించిన అత్యంత ఘోరమైన విపత్తుగా చరిత్రకెక్కింది*భూకంపాల కొలమానం.. సిస్మోగ్రఫీ అనేది 1900 సంవత్సరం నుంచి ప్రారంభమైంది. చదవండి: ఆధునిక చరిత్రలోనే అత్యంత భీకర సునామీ ఏదో తెలుసా?. 🌊సునామీ.. మనిషి నిలువరించలేని ఓ ప్రకృతి విపత్తు!. తక్షణ స్పందన, సహాయక చర్యలతో ఈ విపత్తుల వల్ల కలిగే నష్టాలను, పర్యవసాలను కొంతవరకు తగ్గించవచ్చు. అలాగే సునామీని ముందుగానే గుర్తించగలిగే గ్లోబల్ వార్నింగ్ వ్యవస్థ మాత్రం ఒకటి ఉంది. సముద్ర భూగర్భంలో చెలరేగే అలజడులు.. అలల తీవ్రత ఆధారంగా సునామీ హెచ్చరికలు జారీ చేస్తుంటారు. ఇందుకోసం ‘సునామీ వార్నింగ్ సిస్టమ్’(TWS) పని చేస్తుంది. 🌊ప్రపంచంలోనే తొలి సునామీ హెచ్చరికల వ్యవస్థ.. 1920లో హవాయ్లో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత సంభవించిన విపత్తుల ఆధారంగా దానిని ఆధునీకరించుకుంటూ వచ్చారు. ఫసిఫిక్ సముద్రం, నార్త్ అమెరికా సంబంధిత వ్యవస్థలు తర్వాతి కాలంలో ఏర్పాటయ్యాయి. కానీ.. 2004 దాకా హిందూ మహాసముద్రంలో సునామీల హెచ్చరికలకు సంబంధించి ఇలాంటి వ్యవస్థ లేదు. అలాంటి వ్యవస్థ లేకపోవడం.. ఇంతటి విషాదానికి కారణమైందన్న వాదన ఇప్పటికీ వినిపిస్తుంటుంది.🌊2004 బాక్సింగ్ డే సునామీ తర్వాత.. ఆ మరుసటి ఏడాది IOTWMSను యునెస్కో ఏర్పాటు చేసింది. భారత్ తరఫున Indian Tsunami Early Warning Centre (ITEWC), ఈ IOTWMSతో సమన్వయం జరుపుతోంది. హైదరాబాద్‌లోని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్‌లో ITEWCను 2007లో ఏర్పాటు చేశారు. సముద్ర గర్భంలో చోటు చేసుకునే మార్పులు, సునామీల మీద అధ్యయనాలు.. పరిశోధనలు జరుగుతున్నాయి ఇక్కడ. 🌊ప్రపంచంలో.. దాదాపు అన్ని సముద్ర రీజియన్లలో ఇలాంటి వ్యవస్థలను ఏర్పాటు చేశారు. అయితే ఇలాంటి వ్యవస్థలు కచ్చితత్వం విషయంలోనూ కొన్ని లోపాలు బయటపడ్డాయి. దీంతో విపత్తులకు తగ్గట్లుగా మార్పులు చేస్తూ వస్తున్నారు. 2018 డిసెంబర్లో అగ్నిపర్వతం బద్ధలై సునామీ ముంచెత్తింది. దీంతో.. ఆ గ్యాప్‌ను భర్తీ చేయడానికి సముద్ర మట్టం స్థాయికి సెన్సార్లను ఏర్పాటు చేశారు. అలా.. అప్పటినుంచి సునామీ హెచ్చరికలు తరచూ జారీ అవుతుండడం చూస్తున్నాం. అయితే ఇలాంటి వ్యవస్థ 20 ఏళ్ల కిందట ఉండి ఉంటే.. ఆనాడు అంతటి విధ్వంసం తప్పేది ఏమో!.🌊సునామీ అంటే?.. Tsunami అనే పదం Tsu(Harbour), nami(waves) అనే జపాన్ పదాల కలయిక. తీరపు అల(రాకాసి అల) అని దీనర్థం. సముద్రపు అడుగు భాగంలో భూకంపాలు సంభవించడం, అగ్ని పర్వతాల ఉద్భేదనం, భూతాపాల వల్ల ఏర్పడిన అధిక శక్తి కలిగిన సముద్ర కెరటాలు తీరాన్ని చేరడాన్ని 'సునామీ'అంటారు. ఈ కెరటాలకు తరంగ దైర్ఘ్యం ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల అధిక మొత్తంలో నీరు తీరాన్ని తాకి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. సాధారణంగా.. భూకంప తీవ్రత 6.5 కంటే అధికంగా ఉంటే సునామీ వచ్చే ప్రమాదం ఉంది. సునామీ వేగం నీటి లోతును బట్టి ఉంటుంది. 4 వేల మీటర్ల లోతులో అయితే దీని వేగం గంటకు 500- 700 కి.మీ ఉంటుంది. అదే 10 మీటర్ల నీటి లోతులో దీని వేగం గంటకు 36 కి.మీ.కు తగ్గుతుంది. సాధారణంగా సునామీలు అలల లాగే కన్పిస్తాయి. కానీ సునామీకి సాధారణ కెరటాలకు చాలా తేడా ఉంది. కెరటాలు గాలి వల్ల లేచి 5 నుంచి 20 సెకన్లలో పూర్తవుతాయి. అయితే సునామీ అలా కాదు. 5 నిమిషాల నుంచి దాదాపు గంటన్నర వరకు ఉంటుంది. ఈ రాకాసి అలలు కలిగించే నష్టం కూడా తీవ్రస్థాయిలో ఉంటాయి.. 2004, 2011లో వచ్చిన సునామీల వల్ల వాటిల్లిన విధ్వంసమే ఇందుకు ఉదాహరణ.:::సాక్షి వెబ్‌డెస్క్ -
అది చూశాక.. జీవితంలో మొదటిసారిగా నాకు నోట మాటరాలేదు!
డిసెంబర్ 26వ తేదీ వచ్చిందంటే విషాద ఛాయలు ఆవ రిస్తాయి. సునామీ (2004 Tsunami) మన దేశపు సముద్రపు తీరప్రాంతాన్ని 2004 డిసెంబర్ 26 నాడు ఎంత గట్టి దెబ్బ కొట్టిందో... ఆ క్రమంలో చోటుచేసుకున్న అన్ని దృశ్యాలూ నా కళ్లముందు ప్రత్యక్షమవుతాయి.నేను కెనడియన్ హైకమిషన్ ఢిల్లీ కార్యాలయంలో సీనియర్ సలహాదారునిగా పనిచేసి 2015లో పదవీ విరమణ చేశాను. నా ఉద్యోగ బాధ్యతల్లో ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన పని ఒక కీలక భాగం. విశాలమైన మన దేశంలో ఏడాదంతా ప్రకృతి వైపరీత్యాలు పలురూపాల్లో (వరదలు, కరువు, అకాల వర్షాలు, భూకంపాలు, తుఫానులు, అడవి కార్చిచ్చులు, (Wild Fire) వేడి–చలిగాలులతో చావులు) జీవజాలాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయి. ప్రాణనష్టంతో పాటు మౌలిక వసతుల్ని నాశనంచేసి... సవాళ్లను ప్రభుత్వ పరిపాలనా యంత్రాంగాలకు వదిలేసి వెనుదిరిగి పోతాయి.ప్రకృతి వైపరీత్యాలతో నా బంధం 1999 అక్టోబర్ 29 నాడు ఒరిస్సాలో వచ్చిన సూపర్ సైక్లోన్‌తో (Super Cyclone) మొదలయ్యింది. అదొక పెద్ద విషాదం. ఇరవై వేలకి పైగా జనాన్ని పొట్టన పెట్టుకొంది. ఆ తర్వాత రెండు సంవత్సరాలకే అంటే 2001 జనవరి 26న (రిపబ్లిక్ డే) గుజరాత్‌లోని భుజ్ ప్రాంతాన్ని కుదిపిన బలమైన భూకంపం వచ్చింది. ఉద్యోగ రీత్యా ఫీల్డ్ విజిట్ కోసం వెళ్ళాను. వందశాతం నెలకొరిగిన గ్రామాలను చూసి చలించిపోయాను. విధ్వంసపు తీవ్రతని కళ్ళారా చూశాక, జీవితంలో మొదటిసారిగా నాకు నోట మాటరాలేదు. బాంబుల దాడికి సంపూర్ణంగా నాశనమైన గ్రామాల మధ్యలో నడుస్తున్న భావన. కూలిన ఇండ్లు, విసిరి పడేసినట్టుగా ఇంటి సామాన్లు, పిల్లల వస్తువులు, చెల్లాచెదురుగా పడి ఉన్న దేవుళ్ళ పటాలు, పెళ్లి ఫోటోలు... ఎనభై సెకండ్ల భూకంపానికి చిన్నా భిన్నమైన జన జీవన దృశ్యాలు! నాలోని రచయిత ఏదైనా రాద్దాం (కథో, నవలో...) అనే ఆలోచనల్లో పడి ఓ వైపు సామగ్రినంతా చక్కగా అమర్చి పెట్టుకొన్నాను. కథలో మరణమృదంగం ఇమడలేదు. బలమైన వస్తువు కదా... నవల రాద్దాం అంటే సమయం దొరకలేదు. గుజరాత్ భూకంపపు (Gujarat Earthquake) ప్రాజెక్టుల్ని పూర్తిచేసి కాస్త ఊపిరి పీల్చుకొంటున్నామో లేదో, 2004 డిసెంబర్ రానే వచ్చింది. సునామీతో మనదేశపు తూర్పుతీర ప్రాంతాన్ని చావుదెబ్బ కొట్టింది. మన దేశంతో సహా పదమూడు దేశాల్లో మహా బీభ త్సాన్ని వదిలి వెళ్లింది సముద్రం. మనదేశంలో ఇరవై వేలకి పైగా చనిపోయారంటారు. కానీ అంత కంటే ఎక్కువే అని అనధికారికంగా చెబుతుంటారు. జనవరి (2005) మొదటి వారంలో ఫీల్డ్ విజిట్ మొదలు పెట్టి రెండువారాలు మూడు రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ) దెబ్బ తిన్న ప్రదేశాల్ని చూస్తూ తిరిగాను. ఎన్నో కష్టాల కోర్చి అంకిత భావంతో పనిచేస్తున్న స్వచ్ఛంద సేవాసంస్థలను కలిశాను. ప్రభావితులైన వారి స్థితి ఏంటి? తక్షణ అవసరాలేమిటి? ఎవరు ఎలాటి సహాయ కార్యక్రమాలను చేపట్టారు? దాతలు సహాయాన్నందించడానికి ఎలా ముందుకు వస్తు న్నారు వంటి విషయాలపై ఒక అవగాహన కోసం ఎందరినో కలిశాను. మూడు రాష్ట్రాలూ పుస్తకాల్లో దొరకని జ్ఞానపు గనుల్ని నా ముందుకు తెచ్చాయి. 2009 వరకు కెనడా దేశం ఆర్థిక సహాయాన్నిచ్చిన ప్రాజె క్టులు పూర్తయ్యాయి.చదవండి: బాలికా విద్యపై ఇంకా వివక్షా?ప్రాజెక్టు పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ నాలోని రచయిత ఏం రాయాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడే ఊపు అందుకొంటున్న ‘నానీల’ ప్రక్రియ పట్ల ఆకర్షితుడనై, ‘సునామీ నానీలు’ అనే 45 పేజీల పుస్తకాన్ని వంద నానీలతో ప్రచురించి సునామీ వచ్చి సంవత్సరం పూర్తికాకముందే ప్రచురించాను. నాకు గొప్ప తృప్తినిచ్చింది. తరువాత ఇది ఇంగ్లీష్, హిందీ భాషల్లోకి అనువదింపబడి రెండు భాషల సాహితీ ప్రియులకీ చేరింది. ఈ చిరు పుస్తకాల అమ్మకాలతో వచ్చిన డబ్బుని (రూ. 37,000) రెండు స్వచ్ఛంద సేవా సంస్థలకు విరాళంగా ఇచ్చాను.చదవండి: ఒక దేశం ఒక ఎన్నికపై... ఒక మాట!ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఫైళ్లని మూసేశాము. మళ్ళీ ఆ ప్రదేశాల్ని తిరిగి చూసే అవకాశాలు రావు. అయిదేళ్లుగా తరచుగా వెళ్లి తిరిగిన ప్రాజెక్టు ప్రాంతాల్లో ఇరవై సంవత్సరాల్లో చాలా మార్పులు తప్పక వచ్చి ఉంటాయి. అప్పటి పిల్లలు యువకులైపోయుంటారు. మధ్య వయస్కులు అరవై దాటి వృద్ధాప్యంలోకి అడుగు పెట్టి ఉంటారు. పిల్లల్ని కోల్పోయిన తల్లులు మళ్ళీ పిల్లల్ని కని ఉంటారు. వారందరి మోహాలపై నవ్వుల్ని చూసే అవకాశం రాదు. రానే రాదు. అందరూ సునామీ తమకి మిగిల్చిన విషాదాన్ని పీడకలగా భావించి ఆశావాదంతో నెమ్మదిగా నిలదొక్కుకొంటూ, కాలక్రమేణా ముందుకు దూసుకుపోయి ఉంటారని ఊహించుకొంటూ ప్రతి డిసెంబర్ చివరివారం గడుపుతుంటాను.- డాక్టర్ టి. సంపత్ కుమార్ ఢిల్లీలోని కెనడియన్ హైకమిషన్‌లో మాజీ సీనియర్ సలహాదారు(2004 నాటి సునామీకి రేపటితో ఇరవై ఏళ్లు) -
జపాన్‌లో భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
టోక్యో: జపాన్ తీరంలోని పసిఫిక్ మహాసముద్రంలో భూకంపం సంభవించింది. మంగళవారం త్లెలవారుజామున రిక్టార్ స్కేల్‌పై 5.9 తీవ్రతతో భూకంపం సంభవించటంతో.. జపాన్ దీవులైన ఇజు, ఒగాసవారాలకు అధికారులు సునామీ హెచ్చరికలు జారీచేశారు. జపాన్ రాజధాని టోక్యోకు 600 కిలోమీటర్ల దూరంలోని తోరిషిమా ద్వీపంలో సంభవించిన భూకంపంతో ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని ఆ దేశ వాతావరణ సంస్థ వెల్లడించింది. భూకంపం కారణంగా పెద్దగా ప్రకంపనలు చోటుచేసుకొనప్పటికీ.. భూకంపం సంభవించిన 40 నిమిషాల్లోనే ఇజు దీవుల్లోని హచిజో ద్వీపంలో దాదాపు 50 సెంటీమీటర్ల అతి చిన్న సునామీ వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే, సముద్రపు నీరు ఒక మీటరు ఎత్తులో ఎగసిపడితే సునామి ప్రభావం తీవ్రంగా ఉంటుందని అధికారులు అందోళన వ్యక్తం చేస్తున్నారు.All tsunami warnings lifted for Japan's Izu and Ogasawara islands after earlier 5.6 magnitude earthquake https://t.co/bWfknc7WAj— Factal News (@factal) September 24, 2024క్రెడిట్స్: Factal Newsఈ క్రమంలోనే అధికారులు.. ముందస్తుగా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తరచూ భూకంపాలు సంభవించే జపాన్‌లో గత రెండు నెలల్లో అనేక చిన్న భూకంపాలు చోటుచేసుకున్నాయి. సెప్టెంబరు 23న తైవాన్‌లో 4.8 తీవ్రత, సెప్టెంబర్ 22న ఎహిమ్‌లో 4.9 తీవ్రత, సెప్టెంబర్ 21న చిబాలో 4.6 తీవ్రతతో చిన్న భూకంపాలు సంభవించాయి.చదవండి: వింత శబ్దాల మిస్టరీ వీడింది -
వింత శబ్దాల మిస్టరీ వీడింది
సరిగ్గా ఏడాది క్రితం ఆర్కిటిక్ నుంచి అంటార్కిటికా దాకా ప్రపంచమంతటా 9 రోజులపాటు తరచుగా వినిపించిన వింత శబ్దాల రహస్యం వీడిపోయింది. ఈ శబ్దాలకు భూప్రకంపనలు కారణం కాదని పరిశోధకులు తేల్చారు. గ్రీన్లాండ్లోని మారుమూల ప్రాంతం డిక్సన్ ఫోర్డ్లో భారీగా మంచు చరియలు విరిగిపడడం వల్ల భూమి స్వల్పంగా కంపించడంతో ఉత్పత్తి అయిన శబ్దాలుగా గుర్తించారు. ఈ అధ్యయనం వివరాలను సైన్స్ జర్నల్‌లో ప్రచురించారు. భూకంపాలను అధ్యయనం చేసే పరిశోధకులు 2023 సెపె్టంబర్లో రహస్య శబ్ద సంకేతాలను గుర్తించారు. గతంలో ఇలాంటి సంకేతాలు ఎన్నడూ కనిపెట్టలేదు. ఇవి సాధారణ భూప్రకంపనల్లాంటివి కాకపోవడంతో వారిలో ఆసక్తి పెరిగింది. ఒకే వైబ్రేషన్ ప్రీక్వెన్సీతో శబ్దాలు వినిపించాయి. దీనిపై అధ్యయనం కొనసాగించి, గుట్టు విప్పారు. డిక్సన్ ఫోర్డ్లో మంచు కొండల నుంచి విరిగిపడిన మంచు, రాళ్లతో 10 వేల ఒలింపిక్ ఈత కొలనులు నింపవచ్చని తెలిపారు. మంచు చరియల వల్ల మెగా సునామీ సంభవించి, సముద్రంలో 200 మీటర్ల ఎత్తుకు అలలు ఎగిసిపడ్డాయని చెప్పారు. లండన్‌లోని బిగ్ బెన్ గడియారం కంటే రెండు రెట్ల ఎత్తుకు అలలు ఎగిశాయని వెల్లడించారు. భారీ అలల ప్రభావం ఏకంగా 9 రోజులపాటు కొనసాగిందని అన్నారు. దీనికారణంగానే వింత శబ్దాలు వినిపించినట్లు స్పష్టంచేశారు. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయి గ్రీన్లాండ్లో మంచు కరుగుతోంది. సముద్రంలో దశాబ్దాలపాటు స్థిరంగా నిలిచి ఉన్న భారీ మంచు పర్వతాలు సైతం చిక్కిపోతున్నాయి. అవి బలహీనపడి, మంచు ముక్కలు జారిపడుతున్నాయి. వాతావరణ మార్పులు, భూతాపం వల్ల హిమానీనదాలు గత కొన్ని దశాబ్దాల్లో పదుల మీటర్ల పరిమాణంలో చిక్కిపోయాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భూ ధ్రువ ప్రాంతాల్లో మంచు చరియలు విరిగిపడడం, సునామీలు ఇక సాధారణ అంశంగా మారిపోతాయని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. భూగోళం వేడెక్కడం ఇంకా కొనసాగితే అవాంఛనీయ పరిణామాలు సంభవించడం తథ్యమని పేర్కొన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సునామీలో కొట్టుకుపోయిన భార్య, 13 ఏళ్లుగా వెతుకులాట!
మనకు అత్యంత ప్రియమైన వాళ్లను ఏదైన దుర్ఘటనలో కోల్పోతే ఆ బాధ మాటలకందనిది. ఇది అలాంటి ఇలాంటి ఆవేదన కాదు. అందులోనూ తల్లి బిడ్డలు, భార్యభర్తల్లో ఎవ్వరైన కానరాని లోకలకు వెళ్తే ఆ బాధ అంత తేలిగ్గా మర్చిపోలేంది. బతుకున్నన్ని రోజులు ఆ శోకాన్ని మోస్తుంటాం. అయితే కొన్నేళ్లుకు మాములు మనుషులుగా అవుతాం. రాను రాను వారి జ్ఞాపకాలతో కాలం వెళ్లదీసే ప్రయత్నం చేస్తాం. కానీ జపాన్‌కి చెందిన వ్యక్తిని చూస్తే ఓ దుర్ఘటనలో గల్లంతైన వ్యక్తి కోసం ఇంతలా కళ్లల్లో ఒత్తులు వేసుకుని అన్వేషిస్తారా అని ఆశ్యర్యపోతారా. ప్రేమంటే ఇది కదా అనే ఫీల్ వస్తుంది. ఎవరతను? అతడి గాథ ఏంటంటే..జపనీస్ వ్యక్తి యసువో టకామట్సుకి 2011లో సంభవించిన ప్రకృతి విపత్తు భార్యను దూరం చేసి, తీరని ఎడబాటు మిగిల్చింది. అయితే ఆ భయానక సునామీలో భార్య కోల్పోయినప్పటికీ ఇప్పటి వరకు ఆమె అవశేషాలు కనిపించలేదు. ఆమెకు అంత్యక్రియలు మంచిగా చేయాలనే ఆశతో ఆ నాటి నుంచి నేటి వరకు ఆమె అవశేషాల కోసం తీవ్రంగా గాలిస్తున్నాడు. నిజానికి ఆ సునామీలో సుమారు 20 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక యుసువో భార్య యుకో ఓ బ్యాంకులో పనిచేస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఆమె ఎగిసిన రాకాసి అలల తాకిడికి కొట్టుకుపోయింది. దీంతో తకామాట్సు ఆమె అవశేషాల కోసం ఒక వాలంటీర్ సహాయంతో అన్వేషించడం మొదలుపెట్టాడు. అంతేగాదు తన భార్య అవశేషాలు దొరక్కపోతాయా..? అని డైవింగ్ నేర్చుకుని మరీ మురికినీటిలో ముమ్మరంగా గాలిస్తున్నాడు. మంచు జలాలతో అపారమైన సవాళ్లు ఉన్నప్పటికీ తన భార్య అవశేషాల కోసం ఆ ఇరువురు వెతకడం విశేషం. ఇక యుకో చివరిగా తన భర్త కోసం ఫోన్లో రెండు సందేశాలను పంపింది. ఒకటి పంపేలోపు దుర్ఘటన భారిన పడగా ఇంకొకటి ఈ ఘటనకు కొద్ది క్షణాల ముందు పంపించింది. ఆమె చివరి సందేశం మీరు బాగున్నారా..? ఇంటికి వెళ్లాలనుకుంటున్నా అని పంపించింది. పంపాలనుకున్న సందేశం.. సునామీ అత్యంత వినాశకరమైనద అని నాటి దుర్ఘటనను వివరించే యత్నం చేసింది. కాగా, తకామట్సు ఈ అన్వేషణ ఫలించడం కష్టమని తెలుసు కానీ తాను చేయగలిగింది ఏమన్నా ఉందంటే ఆమె అవశేషాల కోసం అన్వేషించడం మాత్రమే అని ఆవేదనగా చెప్పాడు. అంతేగాదు ఈ సముద్రంలో వెతుకుతూ ఉంటే తాను ఆమెకు దగ్గరగా ఉన్న అనుభూతి కలుగుతుందని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ దంపతులు ప్రేమకు అసలైన అర్థం ఇచ్చారు కదా..!. అంతేగాదు భార్యభర్తలు ఒకరికొకరుగా ఉండటం అనే పదానికి అసలైన భాష్యం ఇచ్చారు ఈ ఇరువురు.(చదవండి: ప్రధాని మోదీకి రాఖీ కట్టేందుకు సరిహద్దులు దాటి వచ్చే పాక్ సోదరి ఎవరో తెలుసా..) -
జపాన్‌లో భారీ భూకంపం
జపాన్లోభారీ భూకంపం సంభవించింది. దక్షిణ ద్వీపం క్యుషు ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున స్వల్ప వ్యవధిలో రెండుసార్లు భూమి కంపించింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం రిక్టర్‌స్కేల్‌పై తొలిసారి 6.9 తీవ్రతతో, రెండోసారి 7.1 తీవ్రతతో భారీ భూకంపం నమోదైంది . జపాన్ వాతావరణ కేంద్రం ప్రకారం దక్షిణ జపాన్‌లోని క్యుషు తూర్పు తీరంలో సుమారు 30 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమై ఉంది.ఈ భూ ప్రకంపనల ధాటికి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, కార్యాలయాల నుంచి ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు.అదే విధంగా జపాన్‌కు వాతావరణ శాత సునామీ హెచ్చరిక జారీ చేసింది. పశ్చిమ దీవులైన క్యుషు, షికోకులోని పసిఫిక్ తీరంలో సముద్ర మట్టం ఒక మీటరు మేర పెరిగే ప్రమాదం ఉందని, ప్రజలు సముద్రం, నదీ తీరాలకు దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. -
ఫిలిప్పీన్స్‌లో 6.7 తీవ్రతతో భూకంపం
ఫిలిప్పీన్స్‌లోని మిండనావో ద్వీపం తూర్పు తీరంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.7గా నమోదైంది. భూకంప కేంద్రం భూమికి 10 కిమీ (6.21 మైళ్ళు) లోతులో ఉందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (జిఎఫ్‌జెడ్) వెల్లడించింది.యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపిన వివరాల ప్రకారం భూకంప తీవ్రత 6.8గా నమోదైంది. ఈ విపత్తు కారణంగా ఎలాంటి సునామీ ముప్పు లేదని అమెరికా జాతీయ సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఫిలిప్పీన్ సిస్మోలజీ ఏజెన్సీ పేర్కొన్న వివరాల ప్రకారం భూకంపం వల్ల ఎలాంటి నష్టం జరగలేదు. అయితే ఈ భూకంపం అనంతర కూడా ప్రకంపనలు వస్తాయని హెచ్చరించింది. ఫిలిప్పీన్స్ దేశం పసిఫిక్ మహాసముద్రం తీరంలోని రింగ్ ఆఫ్ ఫైర్ జోన్లో ఉంది. ఇక్కడ అగ్నిపర్వతాలు బద్దలు కావడం, భూకంపాలు రావడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. -
పెరూలో భారీ భూకంపం
పెరూ: దక్షిణ పెరూలోని ఎరెక్విపా ప్రాంతంలో శుక్రవారం(జూన్28) భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.0గా నమోదైంది. భూకంపం తర్వాత వెంటవెంటనే చిన్న భూకంపాలు రావడం వల్ల కొన్ని చోట్ల కొండచరియలు విరిగి పడ్డాయి. కొండ చరియలు విరిగిపడిన ఘటనల్లో తీవ్రంగా గాయపడ్డవారికి ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నట్లు పెరూ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. భూకంపం తర్వాత వెంటవెంటనే చిన్న భూకంపాలు రావడం వల్ల కొన్ని చోట్ల కొండచరియలు విరిగి పడ్డాయి. భూకంపం వల్ల ఎంత నష్టం జరిగింది అనే దానిని అంచనా వేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. భూకంపం తర్వాత ఎలాంటి సునామీ హెచ్చరిక జారీ చేయలేదని ప్రధాని గుస్తావో అడ్రియన్జెన్ తెలిపారు. -
పేలిన అగ్ని పర్వతం.. సునామీ ముప్పు?
ఇండోనేషియాలో ఒక అగ్నిపర్వతం పేలడంతో స్థానికుల్లో భయాందోళనలు చెలరేగుతున్నాయి. ఈ పేలుడు దరిమిలా సునామీ ముప్పు పొంచివుంది. పేలుడు కారణంగా అగ్నిపర్వతంలోని కొంత భాగం సముద్రంలో పడిపోనున్నదని, ఫలితంగా 1871లో సంభవించిన మాదిరిగా భారీ సునామీ వచ్చే అవకాశం ఉందని స్థానిక అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో హైఅలర్ట్ ప్రకటించారు. ఇండోనేషియాలోని రుయాంగ్ అగ్నిపర్వతం గత కొన్ని రోజులుగా యాక్టివ్‌గా ఉంది. బూడిద, పొగను వెదజల్లుతోంది. అగ్నిపర్వతంలోని కొంత భాగం బలహీనంగా మారిందని, అది ఎప్పుడైనా సముద్రంలో పడవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది జరిగితే, ఇది భారీ సునామీ సంభవిస్తుందని, ఇది సమీపంలోని తీర ప్రాంతాలలో భారీ విధ్వంసం కలిగించవచ్చని స్థానిక అధికారులు అంటున్నారు. ALERT: Indonesia volcano eruption sparks tsunami fears, alert level raised to highest — Officials worry that part of the volcano could collapse into the sea and cause a tsunami, as happened in 1871. pic.twitter.com/idTYAjuImo — Insider Paper (@TheInsiderPaper) April 17, 2024 సునామీ ముప్పు నేపధ్యంలో తీర ప్రాంతాల్లోని వారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. అలాగే బీచ్‌లను సందర్శించడం, సముద్రంలోకి వెళ్లడం లాంటి పనులు చేయకూడదని అధికారులు తెలిపారు. మరోవైపు ప్రభుత్వం, విపత్తు నిర్వహణ సంస్థలు పరిస్థితిని పర్యవేక్షిస్తూ, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నాయి. -
వీడియోలు: భూకంపంతో తల్లడిల్లిన తైవాన్.. సునామీ హెచ్చరిక జారీ
తైపీ: తైవాన్‌లో భారీ భూకంపం చోటు చేసుకుంది. బుధావారం తెల్లవారుజామున తైవాన్ రాజధాని తైపీలో రిక్టర్ స్కేల్‌లోపై 7.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. తైవాన్‌లో హువాలియన్ సిటీకి దక్షిణంగా 18 కిలో మీటర్ల దూరంలో 34.8 కిలో మిటర్ల లోతులో ఈ భూకంపం కేంద్రీకృతమైనట్లు అధికారులు తెలిపారు. ఈ భూకంపం వల్ల వివిధ ప్రాంతాల్లో 7 మంది మృతి చెందగా.. సుమారు 730 మంది గాయపడినట్లు తెలుస్తోంది. తీవ్రమైన ఆస్తి నష్టం జగరినట్లు సమాచారం. భూకంపానికి ఓ బిల్డింగ్ ప్రమాదకర స్థాయిలో కుంగిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. గత 25 ఏళ్లలో ఇదే భారీ భూకంపమని అధికారులు తెలిపారు. 🚨🇹🇼 Building Collapse in Taiwan Due to Earthquakes | Visible Structural Damage Source: @northicewolf https://t.co/cpytWyIx4y pic.twitter.com/Qc0XS4ZXXx — Mario Nawfal (@MarioNawfal) April 3, 2024 మియాకోజిమా ద్వీపంతో సహా జపాన్ దీవులకు సుమారు మూడు మీటర్ల ఎత్తులో సముద్ర అలలు ఎగిసిపడి సునామి వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో తైవాన్ ప్రజలు ఒక్కసారిగా గందరగోళానికి గురయ్యారు. పెద్దసంఖ్యలో జనాలు రోడ్లమీదకు వచ్చారు. ఇక.. సునామి రాబోతుంది అందరూ ఖాళీ చేయండని అక్కడి టీవీ ఛానెల్స్ ప్రసారం చేస్తున్నాయి. జపాన్ సైతం సునామి హెచ్చరికలు జారీ చేసింద. తైవాన్‌లో తరచూ భూకంపాలు వస్తూ ఉంటాయన్న విషయం తెలిసిందే. ఇక.. 1999లో 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 2400 మంది తైవాన్ ప్రజలు మృత్యువాత పడ్డారు. JUST IN: 7.5 magnitude earthquake strikes Taiwan, rocking the whole island and even causing several buildings to collapse. The earthquake triggered a tsunami warning of up to 10 feet from Japan. "Tsunami is coming. Please evacuate immediately. Do not stop. Do not go back,"… pic.twitter.com/E1783aoN3k — Collin Rugg (@CollinRugg) April 3, 2024 భూకంపం కారణంగా తైవాన్ రాజధాని తైపీలో అనేక బిల్డింగుల్లో పగుళ్లు వచ్చాయి. జపాన్‌లోని కొన్ని దీవుల్లో పెద్ద ఎత్తున ఆస్తీ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. భూప్రకంపనాలు సంభవిస్తున్న సమయంలో ఓ స్విమ్మింగ్ పూల్ నీళ్లు.. సముద్రంలో అలల్లా స్విమింగ్ పూల్‌లో అలజడికి గురయ్యాయి. స్మిమింగ్‌పూల్ ఉన్న భయభ్రాంతులకు గురయ్యాడు. దీనికిసంబంధించి ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. This is not just another funny video on social media. These visuals capture the scary moment a 7.4 earthquake hit Taiwan, even affecting a swimming pool. Prayers for Taiwan & Japan. 🙏 #Taiwan #Japan pic.twitter.com/iuGtutTeMo — Prayag (@theprayagtiwari) April 3, 2024 -
చరిత్రలో అత్యంత భీకర సునామీ ఏదో తెలుసా?
అనూహ్యంగా విజృంభించే ప్రకృతి ప్రళయాల నుంచి తప్పించుకోవడం మానవాళికి అసాధ్యం!. హిందూ మహాసముద్ర తీర ప్రాంతంలో 2004 డిసెంబర్ 26వ తేదీన సునామీ విధ్వంసం సృష్టించే వరకు సునామీ అనే ఓ విపత్తు గురించి సామాన్య ప్రజలకు పెద్దగా తెలియదు. తాజాగా జపాన్‌లో.. అదీ కొత్త సంవత్సరం నాడే సునామీ అలజడి రేగింది. ఈ నేపథ్యంలో చరిత్రలో ఇప్పటిదాకా నమోదు అయిన అత్యంత భీకర సునామీలను.. అవి కలగజేసిన నష్టాల్ని ఓసారి తిరగేద్దాం. 🌊ఎన్షునాడా సముద్రం, జపాన్, 1498 రిక్టర్ స్కేల్‌పై 8.3 తీవ్రతతో కూడిన భూకంపం దెబ్బకు సంభవించిన ఈ సునామీ జపాన్‌లోని పలు తీర ప్రాంతాల్ని ముంచెత్తింది. సుమారు 31 వేల మందిని బలితీసుకుంది. 🌊ఐస్ బే జపాన్, 1586 రిక్టర్ స్కేల్‌పై 8.2 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం వల్ల ఏర్పడిన ఈ సునామీలో సముద్ర అలలు 6 మీటర్ల ఎత్తుమేర ఎగిసిపడి పలు పట్టణాల్ని ధ్వంసం చేశాయి. బివా అనే సముద్రం ఐస్ బే పట్టణం ఆనవాళ్లు కనిపించనంత స్థాయిలో ముంచెత్తింది. ఇందులో 8 వేల మంది మరణించారు. 🌊నాంకైడో, జపాన్, 1707 8.4 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల ఏర్పడిన సునామీ దెబ్బకు సముద్ర అలలు 25 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడ్డాయి. ఇందులో సుమారు 30 వేల మంది చనిపోగా, భారత్‌లోని కొచ్చిలో బలమైన సముద్ర అలలు తీరాన్ని దాటుకుని చొచ్చుకొచ్చాయి. 🌊లిస్బన్, పోర్చుగల్, 1755 8.5 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి పోర్చుగల్ పశ్చిమ తీరం, స్పెయిన్ దక్షిణ తీరాల్లో సునామీ వచ్చింది. కొన్నిచోట్ల సముద్ర అలలు 30 మీటర్ల ఎత్తుకు లేచాయి. పోర్చుగల్, మొరాకో, స్పెయిల్ దేశాల్లో సుమారు 60 వేల మంది చనిపోయారు. 🌊రైకూ దీవులు, జపాన్, 1771 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపంతో ఏర్పడిన సునామీ వల్ల ఈ ప్రాంతంలోని పలు దీవులు దెబ్బతిన్నాయి. ఇషిగాకి దీవిలో 85.4 ఎత్తు మేర అలలు ఎగిసిపడ్డాయి. ఇందులో సుమారు 3 వేల ఇళ్లు ధ్వంసం కాగా, 12 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. సునామీ అనేది జపనీస్ భాషకు చెందింది. దానికి అర్థం హార్బర్ కెరటం. సునామీలు ఏర్పడినప్పుడు రాకాసి అలలు 100 అడుగుల ఎత్తు వరకు వెళతాయి.సునామీ అలలు గంటకి 805 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఒక జెట్ విమానం స్పీడ్‌తో ఇది సమానం.ప్రపంచంలో జపాన్ తర్వాత అమెరికాలోని హవాయి, అలస్కా, వాషింగ్టన్, ఒరెగాన్, కాలిఫోర్నియాకు సునామీ ముప్పు ఎక్కువ. అందులో హవాయి దీవులకి ఉన్న ముప్పుమరెక్కడా లేదు. ప్రతీ ఏడాది అక్కడ సునామీ సంభవిస్తుంది. ప్రతీ ఏడేళ్లకి తీవ్రమైన సునామీ ముంచేస్తుంది. పసిఫిక్ మహాసముద్రంలో రింగ్ ఆఫ్ ఫైర్ కారణంగానే 80 శాతానికి పైగా సునామీలు సంభవిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 5వ తేదీన సునామీ అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు. 🌊ఉత్తర చిలీ, 1868 8.5 తీవ్రతతో సంభవించిన రెండు వేర్వేరు భూకంపాల వల్ల ఈ సునామీ ఏర్పడింది. 21 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడిన అలల మూడు రోజుల పాటు విధ్వంసం సృష్టించాయి. ఇందులో సుమారు పాతిక వేల మంది చనిపోగా, 300 మిలియన్ల మేర ఆర్థిక నష్టం వాటిల్లింది. 🌊క్రకటోవా, ఇండోనేసియా, 1883 క్రకటోవా అగ్నిపర్వతం బద్దలవడం వల్ల ఈ సునామీ సంభవించింది. 37 మీటర్ల ఎత్తులో ఎగిసిపడిన అలలు అంజీర్, మెరాక్ పట్టణాల్లో విధ్వంసం సృష్టించాయి. బాంబేలో తీరం నుంచి సముద్రం వెనక్కిపోయినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ సునామీలో సుమారు 36 వేల మంది చనిపోయారు. 🌊సాంక్రికు, జపాన్, 1896 జపాన్‌లోని సాంక్రికు తీరంలో సంభవించిన భూకంపం దెబ్బకు ఏర్పడిన సునామీ వల్ల 38.2 మీటర్ల ఎత్తు మేర సముద్ర అలలు ఎగిసిపడ్డాయి. ఇందులో 11 వేల ఇళ్లు నేలమట్టం కాగా, సుమారు 22 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో చైనాలో సంభవించిన సునామీలో 4 వేల మంది చనిపోయారు. 🌊సుమత్రా, ఇండోనేసియా, 2004 9.1 తీవ్రతతో కూడిన భూకంపం కారణంగా సంభవించిన ఈ సునామీ ఇండోనేసియాతో పాటు శ్రీలంక, భారత్ తీర ప్రాంతాల్లో పెను ప్రళయం సృష్టించింది. 50 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడిన సముద్ర అలలు తీర ప్రాంతం నుంచి 5 కి.మీ దూరం వరకు చొచ్చుకొచ్చాయి. సుమారు 2 లక్షల మంది మృత్యువాత పడగా, 10 బిలియన్ డాలర్ల మేర ఆర్థిక నష్టం వాటిల్లింది. ఇప్పటి వరకు తెలిసిన అత్యంత భీకర సునామీ ఇదేనని భావిస్తున్నారు. దీని ప్రభావంతో అమెరికా, యూకే, అంటార్కిటికా తదితర ప్రాంతాల్లో కూడా అలలు ఎగిసిపడ్డాయి. ఈ భూకంపం 23 వేల ఆటంబాంబుల పేలుళ్లతో సమానం. 🌊ఉత్తర పసిఫిక్ తీరం, జపాన్, 2011 పది మీటర్లకు పైగా ఎగిసిపడిన రాకాసి అలలు 18 వేల మందిని బలిగొన్నాయి. అంతకుముందు, 24.4 తీవ్రతతో సంభవించిన భూకంపం ఇప్పటి వరకు వచ్చిన నాలుగో అతి పెద్దదని భావిస్తున్నారు. ఈ దెబ్బకు సుమారు 4.50 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. భూ ప్రకంపనలకు ఫుకుషిమా దైచీ అణు విద్యుత్ కేంద్రం నుంచి రేడియోధార్మిక వాయువులు లీకు కావడంతో భారీగా నష్టం వాటిల్లింది. ఈ నష్టాన్ని అధిగమించడానికి జపాన్‌కు ఐదేళ్లు పట్టింది. -
జపాన్ను తాకిన సునామీ
కొత్త సంవత్సరం తొలిరోజే.. తూర్పు ఆసియా ద్వీప దేశం జపాన్ భారీ భూ కంపం, సునామీతో వణికిపోయింది. సోమవారం కేవలం గంటన్నర వ్యవధిలోనే 21సార్లు భూమి కంపించింది అక్కడ. సునామీ ధాటికి అలలు ఎగిసి పడడంతో.. తీర ప్రాంత ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు. మరిన్ని ప్రకంపలు వచ్చే అవకాశం.. సునామీ ముప్పు ఇంకా తొలగిపోకపోవడంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మరోవైపు సునామీ తీర ప్రాంతాలన్నింటికి తాకవచ్చని అక్కడి ప్రభుత్వం టీవీ ఛానెల్స్ ద్వారా హెచ్చరించింది. ఇషికావాలో ఐదు మీటర్ల ఎత్తులో అలలు ఎగసి పడొచ్చని అంచనా వేసింది. అంతకు ముందు.. తీర ప్రాంత ప్రజలు ఖాళీ చేయాలని హెచ్చరికలు జారీ చేసింది. ఒకవేళ అలలు ఎగసిపడే పరిస్థితులు కనిపిస్తే వెంటనే పరుగులు తీయాలని ప్రజలకు సూచించింది. మరోవైపు భూకంపం తర్వాత టయోమా, ఇషికావా, న్నిగాటాలో దాదాపు 35 వేల నివాసాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఇతర నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. HAPPENING NOW: First visuals of HUGE wave hitting Suzu City in Japan#Earthquake #Japan #tsunami pic.twitter.com/1KH8D5yCTw — JAMES - ONTHERIGHT (@Jim_OnTheRight) January 1, 2024 భారత కాలమానం ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం ఇషికావా రాష్ట్రంలోని నోటో ప్రాంతంలో వరుసగా భూప్రకంపనలు వచ్చాయి. మొదట 5.7 తీవ్రతతో ఆ ప్రకంపనలు మొదలయ్యాయి. ఒక దశలో తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.6గా నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. A #tsunami warning was issued after the #earthquake in #Japan. And warnings are being made that the western coastal areas should be evacuated and everyone should move to higher ground. pic.twitter.com/QLp5ImoSxe — Daenerys Targaryen (@ve95153819) January 1, 2024 ఉత్తర కొరియా, రష్యా కూడా.. ఈ భారీ భూకంపంతో జపాన్‌తో పాటు ఉత్తర కొరియా, రష్యాకు కూడా సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ హెచ్చరికలను రష్యా అధ్యక్ష కార్యాలయం ధ్రువీకరించింది. జపాన్‌కు సమీపంలో ఉన్న సఖాలిన్ ద్వీపంలోని కొన్ని ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు రష్యా ఎమర్జెన్సీ మంత్రి వెల్లడించారు. ఇంకోవైపు రెండు మీటర్ల ఎత్తునన అలలు ఎగసి పడే అవకాశం ఉండడంతో ఉత్తర కొరియా తన రేడియో ఛానెల్ ద్వారా హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. Strange behaviour of birds at time of earthquake in #Japan. #Tsunami #石川県 #緊急地震速報 #地震 #震度7 #津波#SOS pic.twitter.com/qY3wLcDM7r — Yamaan Shahid (@realYamaan) January 1, 2024 I am deeply saddened by the news of the earthquake and the tsunami warning in Japan. I hope the people of Japan are safe and supported in this time of crisis.#Japan #Tsunami #earthquake #Ishikawa pic.twitter.com/SKfK1OtMhX — Darshan Ahirrao (@Darsh_D_Ahirrao) January 1, 2024 భారత్ ఎమర్జెన్సీ నెంబర్లు జపాన్‌లోని భారత రాయబార కార్యాలయం కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది. సహాయం కోసం ఆయా నెంబర్లను సంప్రదించాలని సూచించింది. Embassy has set up an emergency control room for anyone to contact in connection with the Earthquake and Tsunami on January I, 2024. The following Emergency numbers and email IDs may be contacted for any assistance. pic.twitter.com/oMkvbbJKEh — India in Japanインド大使館 (@IndianEmbTokyo) January 1, 2024 రేడియో ఆక్టివిటీ ఛాయల్లేవ్ సునామీ ఆందోళన నేపథ్యంలో.. అక్కడి న్యూక్లియర్ రియాక్టర్ కేంద్రాల నుంచి అణుధార్మికత విడుదలై ఉంటుందా? అనే ఆందోళన వ్యక్తం అయ్యింది. అయితే ఇప్పటివరకు అలాంటిదేం జరగలేదని అక్కడి అధికారులు ప్రకటించారు. అయితే.. ఇంకా భూకంప భయం వీడకపోవడంతో ఏదైనా జరగవచ్చే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Frightening visuals from Japan as it begins new year suffering a massive 7.6 magnitude earthquake. pic.twitter.com/e3gyiVkq8f — Science girl (@gunsnrosesgirl3) January 1, 2024 -
ఇండోనేషియా: భారీ భూకంపం.. సునామీ హెచ్చరికల్లేవ్
బాలీ: ఇండోనేషియా తీరం వెంట భారీ భూకంపం సంభవించింది. బాలీ సముద్ర ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున 1.25 గంటల సమయంలో భూమి కంపించినట్లు తెలుస్తోంది. రిక్టర్ స్కేలుపై 7.0 తీవ్రత నమోదు అయ్యిందని యూరోపియన్-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ వెల్లడించింది. మటారమ్కు ఉత్తరాన 201 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదైందని వెల్లడించింది. ఇక భూ అంతర్భాగంలో 518 కిలోమీటర్లు దిగువన కదలికలు సంభవించాయని సిస్మోలాజికల్ సెంటర్ వెల్లడించింది. అయితే ఇది శక్తివంతమైన భూకంపమే అయినా.. సునామీ హెచ్చరికలు జారీ కాలేదు. మరోవైపు యూఎస్ జియోలాజికల్ సర్వే మాత్రం భూకంప తీవ్రత 7.1గా పేర్కొంది. ఇక.. సముద్ర గర్భంలో చాలా లోతులో కదలికలు సంభవించడంతో సునామీ (Tsunami) వచ్చే ప్రమాదం లేదని వెల్లడించింది. Notable quake, preliminary info: M 7.1 - Bali Sea https://t.co/nBlmJ2rQia — USGS Earthquakes (@USGS_Quakes) August 28, 2023 ఇదిలా ఉంటే.. 6.5 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలసీ (NCS) పేర్కొంది. అలాగే.. మంగళవారం వేకువజామున 3.50 గంటలకు అండమాన్ సముద్రంలో (Andaman Sea) కూడా భూమి కంపించిందని ఎన్సీఎస్ వెల్లడించింది. దీని తీవ్రత 4.3గా నమోదయిందని, భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని పేర్కొంది. Earthquake of Magnitude:4.1, Occurred on 29-08-2023, 10:13:33 IST, Lat: 28.95 & Long: 83.26, Depth: 10 Km ,Location: 244km NW of Kathmandu, Nepal for more information Download the BhooKamp App https://t.co/xaeC85fU3v@Dr_Mishra1966@KirenRijiju@ndmaindia@Indiametdept pic.twitter.com/cTUd6bvz6h — National Center for Seismology (@NCS_Earthquake) August 29, 2023 -
ఫ్యుకుషిమా నుంచి అణు జలాల విడుదల
ఒకుమా: జపాన్ను 12 ఏళ్ల క్రితం కుదిపేసిన పెను భూకంపం, సునామీతో దెబ్బ తిన్న ఫ్యుకుషిమా అణు ప్లాంట్ నుంచి వ్యర్థ జలాలను పసిఫిక్ సముద్రంలోకి విడుదల చేసే కార్యక్రమం మొదలైంది. ఇరుగు పొరుగు దేశాల నిరసనల మధ్య గురువారం నాడు తొలి విడతగా శుద్ధి చేసిన వ్యర్థ జలాలను సముద్రంలోకి విడుదల చేసే ప్రక్రియను మొదలు పెట్టినట్టు టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ (టెప్కో) ప్రకటించింది. వివిధ దశల్లో శుద్ధి చేసిన జలాలు అణు ప్లాంట్‌లోని కంట్రోల్ రూమ్ నుంచి విడుదల ప్రారంభానికి సంబంధించిన వీడియో కవరేజ్‌ను జపాన్ మీడియా లైవ్‌లో చూపింది. గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు నీటి విడుదల కార్యక్రమం మొదలైనట్టుగా అణుప్లాంట్ ఆపరేటర్ చెప్పారు. ఈ అణు జలాల విడుదలపై సొంత దేశంలో వివిధ స్వచ్ఛంద సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. నీటి విడుదలతో సముద్ర జలాలు విషతుల్యంగా మారి మత్స్య సంపదకు అపార నష్టం చేకూరుతుందని జపాన్, చైనా, దక్షిణకొరియా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పర్యావరణం, మనుషుల ఆరోగ్యంపై దీని ప్రభావం ఉంటుందని జపాన్ ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. అయితే జపాన్ ప్రభుత్వం తన చర్యను సమర్థించుకుంది. అణు ప్లాంట్‌ను మూసేయాలంటే జలాలు విడుదల చేయక తప్పదని స్పష్టం చేసింది. 13.4 కోట్ల టన్నుల వ్యర్థ జలాలు వెయ్యి ట్యాంకుల్లో భద్రపరిచామని, ఆ ట్యాంకులకు ప్రమాదమేదైనా జరిగితే మరింత ముప్పు వాటిల్లుతుందని టెప్కో పేర్కొంది. అణు జలాలను శుద్ధి చేసి అవి సురక్షితమని తేలాక విడుదల చేస్తున్నట్టు సెంటర్ ఫర్ రేడియేషన్ రీసెర్చ్ డైరెక్టర్ టోనీ హూకర్ చెప్పారు. జపాన్ సీఫుడ్‌పై నిషేధం: చైనా జపాన్‌ది పూర్తిగా స్వార్థపూరిత, బాధ్యతారహిత చర్య అని చైనా మండిపడింది. జపాన్ నుంచి సీఫుడ్‌పై నిషేధం విధించింది. జపాన్ చేస్తున్న పనితో సముద్రంలో మత్స్య సంపదకి, వాతావరణానికి ఎంత ముప్పు ఉంటుందో ఎవరూ అంచనా వేయలేరని ఒక ప్రకటనలో దుయ్యబట్టింది. జపాన్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందంటూ వివిధ దేశాలు జలాల విడుదలను ఖండిస్తున్నాయి. -
7.4 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..
అలస్కాను భూకంపం వణికించింది. రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రత నమోదైందని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. దీంతో యూఎస్‌లోని పలు ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. భూకంప తీవ్రత భూమిలోపల 9.3 కిలోమీటర్ల మేర సంభవించినట్లు పేర్కొన్నారు. అలస్కా ద్వీపకల్పంతో సహా అలూటియన్ దీవులు, కుక్ ఇన్లెట్ ప్రాంతాల్లో ఒక్కసారిగా ప్రకంపనలు సంభవించాయని అధికారులు తెలిపారు. కాగా.. ప్రమాదంలో ప్రాణ, ఆస్తి నష్టం ఇప్పుడే అంచనా వేయలేమని వెల్లడించారు. అలస్కా ప్రాంతం పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌లో భాగంగా ఉంది. తరచూ భూకంపాలకు నిలయంగా మారుతోంది. Notable quake, preliminary info: M 7.4 - 106 km S of Sand Point, Alaska https://t.co/ftepDWDKb7 — USGS Earthquakes (@USGS_Quakes) July 16, 2023 అలస్కాలో చివరిసారిగా అత్యధికంగా 1964లో 9.2 తీవ్రతతో భూకంపం నమోదైంది. అలస్కా ద్వీపకల్పం, యూఎస్ పశ్చిమ తీరం, హవాలీని సునామీ అతలాకుతలం చేసింది. 250 మందికి పైగా ప్రాణనష్టం జరిగింది. ఇదీ చదవండి: America PPP Fraud: ప్రపంచంలోనే అత్యంత ఘరానా మోసం.. అమెరికా సర్కార్కే షాక్! -
ఉత్తరకొరియా మళ్లీ అణ్వస్త్ర డ్రోన్ పరీక్ష
సియోల్: అణుధార్మిక సునామీని సృష్టించగల అండర్‌వాటర్ డ్రోన్‌ను మరోసారి విజయవంతంగా పరీక్షించినట్లు ఉత్తరకొరియా తెలిపింది. ఈ కొత్త రకం డ్రోన్ హెయిల్–2ను శుక్రవారం తీర నగరం టంచోన్ వద్ద సుముద్ర జలాల్లో ప్రయోగించినట్లు వెల్లడించింది. నీటి అడుగున ఇది 71 గంటలకు పైగా ప్రయాణించి నిర్దేశిత లక్ష్యాన్ని ఛేదించిందని తెలిపింది. వెయ్యి కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను హెయిల్–2 తుత్తునియలు చేయగలదని అధికార వార్తా సంస్థ కేసీఎన్ఏ పేర్కొంది. -
జపాన్‌లో భారీ భూకంపం.. రిక్టరు స్కేలుపై 6.1 తీవ్రత..
టోక్యో: జపాన్‌లో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై తీవ్రత 6.1గా నమోదైంది. ఉత్తర్ జపాన్‌లోని అమోరిలో 20 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు ఆ దేశ వాతావరణ సంస్థ తెలిపింది. అయితే భూకంపం కారణంగా ఏమైనా ప్రాణ, ఆస్తినష్టం సంభవించిందా? అనే విషయాలపై మాత్రం ఇంకా ఎలాంటి సమాచారం లేదు. భూకంప తీవ్రత భారీగా నమోదైనప్పటికీ అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. చదవండి: అన్నంత పని చేస్తున్న కిమ్! 'ఆయుధాలను పెంచాలని పిలుపు' -
ప్రకంపనలు రేపుతున్న ఉత్తర కొరియా ప్రకటన.. సునామీని పుట్టించే..
సునామీని పుట్టించే అణు సామర్థ్యమున్న అండర్ వాటర్ డ్రోన్ ‘హెయిల్’ను విజయవంతంగా పరీక్షించినట్టు ఉత్తర కొరియా చేసిన ప్రకటన ప్రకంపనలు రేపుతోంది. దీని సాయంతో భారీ సునామీలు పుట్టించి తీరంలో నౌకాశ్రయాలనూ, సముద్ర మధ్యంలో శత్రు నౌకలను నాశనం చేయగల సామర్థ్యం తమకు సమకూరిందని అది చెబుతోంది. అదే నిజమైతే రష్యా తర్వాత ఈ సామర్థ్యమున్న రెండో దేశమవుతుంది. ఇలాంటి డ్రోన్లను ప్రయోగిస్తే సముద్ర మట్టం అనూహ్యంగా పెరిగి పరిసర ప్రాంతాలను పూర్తిగా ముంచెత్తుతుంది. దీనితో సముద్ర మధ్యంలో అయితే శత్రు నౌకలను నీట ముంచవచ్చు. అదే తీర ప్రాంతంలో ప్రయోగిస్తే సమీప నౌకాశ్రయాలతో పాటు నగరాలు, జనావాసాలు కూడా నామరూపాల్లేకుండా పోయే ప్రమాదముంది! కాకపోతే హెయిల్ను రష్యా అండర్ వాటర్ డ్రోన్ పొసెయ్డాన్తో ఏ మాత్రమూ పోల్చలేం. ఎందుకంటే అత్యాధునిక హంగులతో కూడిన పొసెయ్డాన్ను జలాంతర్గాముల నుంచీ ప్రయోగించవచ్చు. స్వయంచాలిత న్యూక్లియర్ ప్రొపెల్షన్ వ్యవస్థ సాయంతో ఎంతకాలమైనా ప్రయాణం చేయగల సత్తా దాని సొంతం. హెయిల్కు అంత సీన్ లేదని నిపుణులు చెబుతున్నారు. అమెరికాతో సంయుక్త సైనిక విన్యాసాలు చేస్తున్న దక్షిణ కొరియాను బెదిరించేందుకే ఇలాంటి ప్రకటన చేసి ఉండఉండవచ్చన్నది వారి విశ్లేషణ. అణు డ్రోన్‌ను పరీక్షించాం: ఉత్తర కొరియా భారీ రేడియో ధార్మిక సునామీని పుట్టించగల అణుసామర్థ్యంతో కూడిన అండర్ వాటర్ డ్రోన్ ‘హెయిల్’ను విజ యవంతంగా పరీక్షించినట్టు ఉత్తర కొరియా ప్రకటించింది! ఈ ఆందోళనకర పరిణామం కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలను మరింత పెంచింది. ‘‘ఈ డ్రోన్‌ను తీరం వద్ద మోహరించవచ్చు. నౌకలపై సముద్రం లోపలికి తీసుకెళ్లీ ప్రయోగించవచ్చు. నీటి లోపల ఇది సృష్టించే పేలుడు దెబ్బకు పుట్టుకొచ్చే రేడియో ధార్మిక సునామీ నౌకాశ్రయాలతో పాటు నడి సముద్రంలో శత్రు యుద్ధ నౌకలను కూడా తుత్తునియలు చేయగలదు’’అని ఉత్తర కొరియా అధికార వార్తా సంస్థ కేసీఎన్ఏ చెప్పుకొచ్చింది. ‘‘ఈ దిశగా మూడు రోజులుగా సాగుతున్న ప్రయోగాలను అధ్యక్షుడు కిమ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు’’అని తెలిపింది. టోర్పెడో వంటి పరికరం పక్కన కిమ్ నవ్వుతున్న ఫొటోను ఉత్తరకొరియా పత్రిక రొండొంగ్ సిన్మున్ ప్రచురించింది. ఆ పరికరమేమిటనేది వివరించలేదు. సముద్ర జలాలు ఉవ్వెత్తున లేచి పడుతున్న ఫొటోలను కూడా ముద్రించింది. ‘‘ఈ అలలు డ్రోన్ మోసుకెళ్లిన అణ్వాయుధం పేలుడు ఫలితం. మంగళవారం ప్రయోగించిన ఈ డ్రోన్ నీటి అడుగున 60 గంటల పాటు ప్రయాణించి, 150మీటర్ల లోతులో లక్ష్యాన్ని ఛేదించింది’’అని పేర్కొంది. 2012 నుంచి అభివృద్ధి చేస్తున్న ఈ డ్రోన్‌ను గత రెండేళ్లలో 50 సార్లకు పైగా పరీక్షించి చూసినట్లు తెలి పింది. అయితే ఉత్తర కొరియా ప్రకటనలో విశ్వసనీయ తపై నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హెయిల్ అంటే కొరియా భాషలో సునామీ. ఈ డ్రోన్ గురించి ఉత్తర కొరియా అధికారికంగా వెల్లడించడం ఇదే తొలిసారి! ఉత్తర కొరియా దుందుడుకు చర్యలకు మూల్యం తప్పదంటూ దక్షిణ కొరియా అధ్యక్షుడు హెచ్చరించిన కొద్ది గంటల్లోనే ఈ పరీక్ష గురించిన ప్రకటన వెలువడింది! కొరియా సముద్ర జలాల్లో విమానవాహక నౌకలను మోహరిస్తామని అమెరికా ప్రకటించడం తెలిసిందే. పొసెయ్‌డాన్.. రష్యా డ్రోన్.. ► ఇది అణు సామర్థ్యమున్న సూపర్ టోర్పెడో. చరిత్రలో అతిపెద్ద టోర్పెడో కూడా ఇదే! నాటో దళాలు దీన్ని కాన్యాన్గా పిలిచే పొసెయ్డాన్ను టోర్పెడో, డ్రోన్ రెండింటి క్రాస్ బ్రీడ్‌గా చెప్పవచ్చు. తొలి జత పొసెయ్‌డాన్ టోర్పెడోలను విజయవంతంగా ఉత్పత్తి చేసినట్టు గత జనవరిలో రష్యా స్వయంగా ప్రకటించింది. వీటిని బెల్ గొరోడ్ అణు జలాంతర్గామిలో మోహరిస్తామని పేర్కొంది. అయి తే పొసెయ్‌డాన్ తయారీ గురించి రష్యా అధ్యక్షుడు పుతిన్ 2018లోనే ప్రకటన చేశారు. ‘‘దీని రేంజ్ అపరిమితం. అంతేగాక సముద్రాల్లో అత్యంత అట్టడుగుల్లోకీ వెళ్లి దాడులు చేయ గల సత్తా దీని సొంతం. పైగా ప్రస్తుతమున్న అన్ని టోర్పెడోల కంటే కొన్ని రెట్లు ఎక్కువ వేగంతో, అదే సమయంలో ఏమా త్రం శబ్దం చేయకుండా దూసుకెళ్తుంది. తనంతతానుగా ప్రమాదాన్ని గుర్తించి ప్రయాణ మార్గాన్ని మార్చేసుకోగ లేదు. కనుక దీన్ని శత్రువు నాశనం చేయడం దాదాపుగా అసాధ్యం. సముద్రంలో దీన్ని ఎదుర్కోగల ఆయుధమే లేదు’’అని ధీమాగా పేర్కొన్నారు. రష్యాతో పాటు చైనా కూడా ఇలాంటివి తయారు చేసే పనిలో ఉందని అమెరికా అనుమానిస్తోంది. అయితే అమెరికా వద్ద ఇలాంటివి ఎప్పటినుంచో ఉన్నట్టు రక్షణ నిపుణులు చెబుతున్నారు! ► స్టేటస్–6 ఓషియానిక్ మల్టీపర్పస్ సిస్టంగా కూడా పిలిచే పొసెయ్‌డాన్ గురించి తెలిసింది చాలా తక్కువ. ► దాదాపు ఆరడుగుల వ్యాసార్థ్యం, 24 మీటర్ల పొడవు, 2 లక్షల పౌండ్ల బరువుండే దీన్ని అణు జలాంతర్గామి నుంచి ప్రయోగించవచ్చు. ► ఈ డ్రోన్లు ఎంత పెద్దవంటే అంతటి జలాంతర్గామిలో కేవలం ఆరంటే ఆరు మాత్రమే పడతాయట! ► ఇది అణు, సంప్రదాయ ఆయుధాలు రెండింటినీ మోసుకెళ్లగలదు. ► ఇందులో ఏకంగా ఓ అణు రియాక్టరే ఉంటుంది. దాని సాయంతో ఇది స్వయం చాలితంగా పని చేస్తుంది. ► పొసెయ్‌డాన్ శత్రు యుద్ధ నౌకలను, తీర ప్రాంతాల్లోని లక్ష్యాలను నాశనం చేస్తున్నట్టున్న దృశ్యాలతో కూడిన వీడియోలను రష్యా రక్షణ శాఖ విడుదల చేసింది. ► అమెరికాలోని దాదాపు అన్ని తీర ప్రాంత నగరాలూ దీని పరిధిలోకి వస్తాయని రష్యా చెబుతోంది! ఏమిటీ అండర్ వాటర్ డ్రోన్? ► వీటిని ఒకరకంగా చిన్నపాటి మానవరహితజలాంతర్గాములుగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా సముద్ర గర్భంలో వరుస పేలుళ్ల ద్వారా అతి పెద్ద రాకాసి అలల్ని పుట్టించి పరిసర ప్రాంతాలను నీట ముంచేస్తాయి. ఇవి స్వయంచాలితాలు. యుద్ధనౌకలు, లేదా ఇతర ప్రాంతాల నుంచి కంప్యూటర్లు, సెన్సర్ల ద్వారా వీటిని నియంత్రిస్తుంటారు. ఇలాంటి అండర్‌వాటర్ డ్రోన్లు 1950ల నుంచే ఉనికిలో ఉన్నట్టు్ట్ట బార్డ్ సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ ద డ్రోన్ చెబుతోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 250కి పైగా ఇలాంటి డ్రోన్లు వినియోగంలో ఉన్నట్టు అంచనా. మిలిటరీ డాట్‌కామ్ వివరాల మేరకు వీటిని జలాంతర్గాముల ద్వారా అమెరికా నేవీ 2015లో తొలిసారిగా మోహరించింది. ‘‘ఇది ప్రమాదకరమైన పనులెన్నింటినో అండర్‌వాటర్ డ్రోన్ గుట్టు గా చక్కబెట్టగలదు. ఒకవైపు వీటిని ప్రయోగించి శత్రు లక్ష్యాలను ఛేదించవచ్చు. శత్రువు దృష్టిని అటువైపు మళ్లించి ప్రధాన జలాంతర్గామి తన ప్రధాన లక్ష్యం మీద మరింత మెరుగ్గా దృష్టి సారించవచ్చు. అంటే రెట్టింపు ప్రయోజనమన్నమాట’’అని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. -
విశాఖపట్నం : గంగమ్మా.. చల్లంగా చూడమ్మ (ఫొటోలు)
-
Viral Video: ప్రమాద ఘంటికలు.. అంటార్కిటికాలో విరిగిపడ్డ హిమానీనదం
గ్లోబల్ వార్మింగ్ తాలూకు ప్రమాద ఘంటికలు నానాటికీ తీవ్రస్థాయికి పెరుగుతున్నాయి. మంచు ఖండం అంటార్కిటికాలో వేడి దెబ్బకు విలియం అనే భారీ హిమానీ నదం వేలాది ముక్కలుగా విడిపోయింది. దాంతో మొత్తంగా 10 ఫుట్‌బాల్ మైదానాలంత పరిమాణంలో మంచు పలకలు విరిగిపడ్డాయి. ఆ ధాటికి సముద్రపు లోతుల్లో ఏకంగా సునామీ చెలరేగిందట! ఆ సమయంలో యాదృచ్ఛికంగా అక్కడున్న బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే నౌక ఆర్ఆర్ఎస్ జేమ్స్ క్లార్క్ రాస్కు చెందిన పరిశోధకులు దీన్ని కళ్లారా చూసి వీడియో తీశారు. అదిప్పుడు వైరల్‌గా మారింది. ఈ హిమానీ నదం ముందుభాగం సముద్ర మట్టానికి ఏకంగా 40 మీటర్ల ఎత్తుంటుంది. అది విసురుగా విడిపోవడంతో 78 వేల చదరపు మీటర్ల పరిమాణంలో మంచు సముద్రంలోకి చెల్లాచెదురుగా కొట్టుకుపోయింది. ఆ దెబ్బకు సముద్రంలో లోలోతుల దాకా నీరు గోరువెచ్చగా మారిపోయిందట. అప్పటిదాకా 50 నుంచి 100 మీటర్ల లోతు దాకా చల్లని నీరు, ఆ దిగువన గోరువెచ్చని నీటి పొర ఉండేదట. ‘‘హిమానీ నదాలు ఇలా విరిగిపడటం వల్ల సముద్రపు ఉపరితలాల్లో పెను అలలు రావడం పరిపాటి. కానీ అవి అంతర్గత సునామీకీ దారి తీయడం ఆసక్తికరం. ఇలాంటి సునామీలు సముద్ర ఉష్ణోగ్రతలు, అందులోని జీవ వ్యవస్థ తదితరాలపై పెను ప్రభావం చూపుతాయి. లోతుగా పరిశోధన జరగాల్సిన అంశమిది’’ అని సైంటిస్టులు చెప్పుకొచ్చారు. ఈ పరిశోధన ఫలితాలను జర్నల్ సైన్స్ అడ్వాన్సెస్‌లో ప్రచురించారు. కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా హిమానీ నదాలు శరవేగంగా చిక్కిపోతున్న వైనం పర్యావరణవేత్తలను కలవరపెడుతోంది. -
వామ్మో.. వందల అణు బాంబుల ఎఫెక్ట్‌తో బద్ధలైందా?
హుంగా టోంగా-హుంగా హాపై.. పదిరోజుల క్రితం దాకా పసిఫిక్ మహాసముద్రంలోని జనావాసరహిత దీవిగా ఉండేది. మరి ఇప్పుడో?.. ఏకంగా మ్యాప్ నుంచే కనుమరుగు అయిపోయింది. కారణం.. ఆ దీవిలోని అగ్నిపర్వతం భారీ శబ్ధాలతో బద్ధలైపోవడమే!. జనవరి 15వ తేదీన చిన్న దీవి దేశం టోంగాకు దగ్గర్లో ఉన్న ‘హుంగా టోంగా-హుంగా హాపై’ అగ్నిపర్వత దీవి.. మహాసముద్రం అడుగులోని అగ్నిపర్వతం బద్ధలుకావడంతో పూర్తిగా నాశనమైంది. ఆ ప్రభావం ఎంతగా ఉందంటే.. సముద్రం ముందుకు వచ్చి పెద్ద పెద్ద అలలతో సునామీ విరుచుకుపడింది. టోంగా రాజధాని నుకువాలోఫాపై దట్టమైన మందంతో విషపూరితమైన బూడిద అలుముకుంది. తాగే నీరు కలుషితం అయ్యింది. పంటలు దెబ్బతిన్నాయి. రెండు గ్రామాలు ఏకంగా జాడ లేకుండా సముద్ర గర్భంలో కలిసిపోయాయి!. ఈ ప్రకృతి విలయంపై నాసా సైంటిస్టులు ఇప్పుడు సంచలన ప్రకటన చేశారు. టోంగా అగ్నిపర్వతం బద్ధలైన ఘటన.. వంద హిరోషిమా అణు బాంబు ఘటనలకు సమానమని నాసా పేర్కొంది. ఐదు నుంచి ముప్ఫై మెగాటన్నుల టీఎన్టీ(ఐదు నుంచి 30 మిలియన్ టన్నుల) పేలితే ఎలా ఉంటుందో.. అంత శక్తితో ఆ అగ్నిపర్వతం పేలింది. అందుకే అగ్ని పర్వత శకలాలు 40 కిలోమీటర్ల ఎత్తులో ఎగసిపడ్డాయి అని నాసా సైంటిస్టుల జిమ్ గార్విన్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇదిలా ఉంటే 1945, ఆగష్టులో హిరోషిమా(జపాన్) పడిన ఆటం బాంబు 15 కిలోటన్నుల(15 వేల టన్నుల) టీఎన్టీ డ్యామేజ్ చేసింది. కేవలం ఒక్క నగరాన్ని మాత్రమే నామరూపాలు లేకుండా చేసింది. ఇప్పుడు అగ్నిపర్వతం ధాటికి సముద్రం కదిలి.. ఎక్కడో వేల కిలోమీరట్ల దూరంలోని తీరాల దగ్గర ప్రభావం చూపెట్టింది. ఇక టోంగాలో సునామీ ధాటికి ప్రాణ నష్టం పెద్దగా సంభవించకపోయినా!(స్పష్టత రావాల్సి ఉంది).. ఆస్తి నష్టం మాత్రం భారీగానే జరిగినట్లు తెలుస్తోంది. జపాన్, న్యూజిలాండ్‌తోపాటు పసిఫిక్ తీరంలోని చాలా దేశాలు సునామీ అలర్ట్ జారీ చేసి.. 48 గంటల పరిశీలన తర్వాత విరమించుకున్నాయి. సంబంధిత వార్త: సునామీకి ఎదురీగిన తాత.. అందుకే ప్రపంచం జేజేలు