సునామీ బాధితుల కోసం ‘ఆపరేషన్‌ సముద్ర మైత్రి’ | India launches 'Operation Samudra Maitri' to help tsunami-hit Indonesia | Sakshi
Sakshi News home page

సునామీ బాధితుల కోసం ‘ఆపరేషన్‌ సముద్ర మైత్రి’

Published Thu, Oct 4 2018 6:41 AM | Last Updated on Thu, Oct 4 2018 6:41 AM

India launches 'Operation Samudra Maitri' to help tsunami-hit Indonesia - Sakshi

న్యూఢిల్లీ: భారీ భూకంపం, సునామీ ధాటికి సర్వంకోల్పోయిన ఇండోనేసియా ప్రజల కోసం భారత్‌ ఆపన్నహస్తం అందిస్తోంది. సహాయక సామగ్రి, మందులతో నింపిన రెండు నేవీ నౌకలు, రెండు విమానాలను ఇండోనేసియాకు పంపినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. వైద్యసిబ్బందితోపాటు తాత్కాలిక ఆస్పత్రిని ఏర్పాటుచేసేందుకు కావాల్సిన సామగ్రినీ తరలించారు. చెన్నై నుంచి 25 బ్యారెళ్ల కిరోసిన్‌ను విమానంలో పంపారు. 1,400 మందికిపైగా మృతిచెందిన ఇండోనేసియాలోని పలూ పట్టణంలో సహాయక చర్యలను వేగవంతం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement