ఇండోనేషియాలో భూకంపం..10 మంది మృతి | Ten Killed As Powerful Earthquake Hits Indonesia | Sakshi
Sakshi News home page

ఇండోనేషియాలో భూకంపం..10 మంది మృతి

Published Sun, Jul 29 2018 8:48 AM | Last Updated on Sun, Jul 29 2018 11:18 AM

Three Killed As Powerful Earthquake Hits Indonesia - Sakshi

భూకంపం ధాటికి ధ్వంసమైన ఇల్లు

జకార్తా : ఇండోనేషియాలోని లోమ్‌బాక్‌ దీవిలో ఆదివారం ఉదయం భూకంపం సంభవించింది. ఈ సంఘటనలో పది మంది చనిపోగా, సుమారు 33 మంది గాయపడ్డారు. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 6.4 గా నమోదైంది. భూకంపం ధాటికి పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. భూకంప కేంద్రం భూ ఉపరితలం నుంచి 7 కిలోమీటర్ల లోపల ఉన్నట్లు గుర్తించారు. అధికారులు ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. సుమారు 40 సార్లు భూ ప్రకంపనలు నమోదైనట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.

పెద్ద ఆపద ఏదో సంభవించబోతుందని ముందే భావించామని భూకంప కేంద్రానికి సమీపంలో నివసిస్తున్న ఓ వ్యక్తి తెలిపారు. భూకంప తీవ్రత ఎక్కవగా ఉండటంతో తమ ఇంట్లో ఉన్నవాళ్లంతా భయంతో బయటికి పరుగులు పెట్టారని జుల్‌కిఫ్లి అనే స్థానికుడు పేర్కొన్నాడు. ఇండోనేషియా దేశం చిన్న చిన్న దీవుల సమూహం. ఈ దేశం పసిఫిక్‌ రింగ్‌ ఆఫ్‌ పైర్‌ అనే భూఫలకాల మీద ఉంది. వీటిని భూకంపాన్ని సూచించే హాట్‌స్పాట్స్‌ అని పిలుస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement