
ఉత్పాతం.. ఉఫ్..
ఉత్పాతం ముంచుకొచ్చేస్తోంది.. సునామీ తరుముకొచ్చేస్తోంది.. ఈ ఫొటోను చూడగానే కలిగే భావన అదే. అయితే.. ఈ ఉత్పాతాన్ని సైతం మనం ఉఫ్‌మని ఊదేయొచ్చు. ఎందుకంటే.. అది సునామీ కాదు.. కేవలం పొగమంచు! అమెరికా న్యూజెర్సీ తీరంలో ఇటీవల చోటుచేసుకున్న విచిత్రం. వేడి, చల్లని గాలుల కలయిక వల్ల ఇలా భారీఎత్తున పొగమంచులా ఏర్పడింది. చూడ్డానికి సునామీని తలపిస్తూ.. అందరినీ ఆందోళనకు గురిచేసింది.