అలస్కాను భూకంపం వణికించింది. రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రత నమోదైందని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. దీంతో యూఎస్‌లోని పలు ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. భూకంప తీవ్రత భూమిలోపల 9.3 కిలోమీటర్ల మేర సంభవించినట్లు పేర్కొన్నారు.
అలస్కా ద‍్వీపకల్పంతో సహా అలూటియన్ దీవులు, కుక్ ఇన్‌లెట్ ప్రాంతాల్లో ఒక్కసారిగా ప్రకంపనలు సంభవించాయని అధికారులు తెలిపారు. కాగా.. ప్రమాదంలో ప్రాణ, ఆస్తి నష్టం ఇప్పుడే అంచనా వేయలేమని వెల్లడించారు. అలస్కా ప్రాంతం పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌లో భాగంగా ఉంది. తరచూ భూకంపాలకు నిలయంగా మారుతోంది.
Notable quake, preliminary info: M 7.4 - 106 km S of Sand Point, Alaska https://t.co/ftepDWDKb7
— USGS Earthquakes (@USGS_Quakes) July 16, 2023
అలస్కాలో చివరిసారిగా అత్యధికంగా 1964లో 9.2 తీవ్రతతో భూకంపం నమోదైంది. అలస్కా ద్వీపకల్పం, యూఎస్ పశ్చిమ తీరం, హవాలీని సునామీ అతలాకుతలం చేసింది. 250 మందికి పైగా ప్రాణనష్టం జరిగింది.
ఇదీ చదవండి: America PPP Fraud: ప్రపంచంలోనే అత్యంత ఘరానా మోసం.. అమెరికా సర్కార్‌కే షాక్!
Comments
Please login to add a commentAdd a comment