జపాన్‌లో భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ | Japan Issues Tsunami Warning In Izu And Ogasawara Pacific Ocean, Check Weather Condition Updates | Sakshi
Sakshi News home page

జపాన్‌లో భూకంపం..సునామీ హెచ్చరిక జారీ

Published Tue, Sep 24 2024 8:11 AM | Last Updated on Tue, Sep 24 2024 9:52 AM

Japan Issues Tsunami Warning In Izu And Ogasawara Pacific Ocean

టోక్యో: జపాన్ తీరంలోని పసిఫిక్ మహాసముద్రంలో భూకంపం సంభవించింది. మంగళవారం త్లెలవారుజామున రిక్టార్‌ స్కేల్‌పై 5.9 తీవ్రతతో భూకంపం సంభవించటంతో.. జపాన్ దీవులైన ఇజు, ఒగాసవారాలకు అధికారులు సునామీ హెచ్చరికలు జారీచేశారు. జపాన్‌ రాజధాని టోక్యోకు 600 కిలోమీటర్ల దూరంలోని తోరిషిమా ద్వీపంలో సంభవించిన భూకంపంతో ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని  ఆ దేశ వాతావరణ సంస్థ వెల్లడించింది. 

భూకంపం కారణంగా పెద్దగా ప్రకంపనలు చోటుచేసుకొనప్పటికీ.. భూకంపం సంభవించిన 40 నిమిషాల్లోనే ఇజు దీవుల్లోని హచిజో ద్వీపంలో దాదాపు 50 సెంటీమీటర్ల అతి చిన్న సునామీ వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే, సముద్రపు నీరు ఒక మీటరు ఎత్తులో ఎగసిపడితే సునామి ప్రభావం తీవ్రంగా ఉంటుందని అధికారులు అందోళన వ్యక్తం చేస్తున్నారు.

క్రెడిట్స్‌: Factal News

ఈ క్రమంలోనే అధికారులు.. ముందస్తుగా సునామీ హెచ్చరికలు జారీ చేశారు.  తరచూ భూకంపాలు సంభవించే జపాన్‌లో గత రెండు నెలల్లో అనేక చిన్న భూకంపాలు చోటుచేసుకున్నాయి. సెప్టెంబరు 23న తైవాన్‌లో 4.8 తీవ్రత, సెప్టెంబర్ 22న ఎహిమ్‌లో 4.9 తీవ్రత, సెప్టెంబర్ 21న చిబాలో 4.6 తీవ్రతతో చిన్న భూకంపాలు సంభవించాయి.

చదవండి:  వింత శబ్దాల మిస్టరీ వీడింది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement