TOKYO
-
టోక్యో : ఫిగర్ స్కేటింగ్.. అద్భుత విన్యాసాలు (ఫొటోలు)
-
రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. తెలంగాణలో నీటి లభ్యత, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అనువైన స్థలాలకు లోటు లేనందున రాష్ట్రమంతా గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయవచ్చన్నారు. దేశంలో గ్రీన్ హైడ్రోజన్‌కు చిరునామాగా తెలంగాణ నిలవాలని ఆకాంక్షించారు. జపాన్ పర్యటనలో భాగంగా రాజధాని టోక్యోకు 100 కి.మీ. దూరంలో ఉన్న యమానాషీ గ్రీన్ హైడ్రోజన్ కంపెనీని ఆయన సందర్శించారు. గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్, ఇతర పునరుత్పాదక విద్యుత్ సాంకేతికతలను పరిశీలించి అక్కడి శాస్త్రవేత్తల బృందంతో మాట్లాడారు. సౌర విద్యుత్ వినియోగించి నీటిని ఎలక్రో్టలైజింగ్ ప్రక్రియ ద్వారా హైడ్రోజన్, ఆక్సిజన్‌గా విడగొట్టే యంత్ర విభాగాలను ఈ సంస్థ తయారు చేస్తోంది. ఇలా ఉత్పత్తి చేసిన హైడ్రోజన్‌ను రేసింగ్ కార్లకు ఇంధనంగా, సూపర్ మార్కెట్లలో ఫ్యూయల్ సెల్స్‌గా, ఫ్యాక్టరీల్లో బాయిలర్లకు ఉష్ణాన్ని అందించేందుకు ఇంధనంగా వినియోగిస్తున్నారని నిర్వాహకులు భట్టికి వివరించారు. ఈ ప్రక్రియలో సోలార్ విద్యుత్‌ను వినియోగిస్తుండటంతో దీన్ని గ్రీన్ హైడ్రోజన్‌గా పేర్కొంటున్నామని వివరించారు. రాష్ట్రంలో ఉత్పత్తి కానున్న గ్రీన్ హైడ్రోజన్‌ను స్థానిక ఎరువుల కర్మాగారాలు, ఆరీ్టసీ, ఇతర పరిశ్రమలకు సరఫరా చేయొచ్చని భట్టి అన్నారు. థర్మల్ విద్యుత్‌కు ప్రత్యామ్నాయంగా పునరుత్పాదక విద్యుదుత్పత్తిని ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట్రంలో సౌర విద్యుత్, గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ఉమ్మడిగా ప్లాంట్ల ఏర్పాటుకు కలిసిరండి.. కంపెనీ తయారు చేస్తున్న ‘బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం’బ్యాటరీల తయారీ విభాగాన్ని భట్టి విక్రమార్క పరిశీలించారు. సోలార్ విద్యుత్ ప్లాంట్లు పగటిపూట ఉత్పత్తి చేసే విద్యుత్‌లో మిగులు విద్యుత్‌ను నిల్వ చేయడానికి ఈ బ్యాటరీలను ఉత్పత్తి చేస్తున్నారు. సింగరేణి ఏర్పాటు చేసిన 245 మెగావాట్ల సామర్థ్యంగల సోలార్ ప్లాంట్లతోపాటు త్వరలో ఏర్పాటు చేయనున్న మరో వెయ్యి మెగావాట్ల సోలార్ ప్లాంట్లకు ఈ సాంకేతికత ఎంతగానో ఉపయోగపడుతుందని భట్టి అన్నారు.తెలంగాణలో గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టం ప్లాంట్లను ఉమ్మడి భాగస్వామ్యంతో ఏర్పాటు చేసేందుకు తమతో కలిసి రావాలని కంపెనీ ప్రతినిధులను కోరారు. దీనిపై యమానాషీ అధికారులు సానుకూలంగా స్పందించారు. ఉన్నత స్థాయిలో చర్చించి నిర్ణయిస్తామన్నారు. ఈ పర్యటనలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ పాల్గొన్నారు. -
జపాన్‌లో భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
టోక్యో: జపాన్ తీరంలోని పసిఫిక్ మహాసముద్రంలో భూకంపం సంభవించింది. మంగళవారం త్లెలవారుజామున రిక్టార్ స్కేల్‌పై 5.9 తీవ్రతతో భూకంపం సంభవించటంతో.. జపాన్ దీవులైన ఇజు, ఒగాసవారాలకు అధికారులు సునామీ హెచ్చరికలు జారీచేశారు. జపాన్ రాజధాని టోక్యోకు 600 కిలోమీటర్ల దూరంలోని తోరిషిమా ద్వీపంలో సంభవించిన భూకంపంతో ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని ఆ దేశ వాతావరణ సంస్థ వెల్లడించింది. భూకంపం కారణంగా పెద్దగా ప్రకంపనలు చోటుచేసుకొనప్పటికీ.. భూకంపం సంభవించిన 40 నిమిషాల్లోనే ఇజు దీవుల్లోని హచిజో ద్వీపంలో దాదాపు 50 సెంటీమీటర్ల అతి చిన్న సునామీ వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే, సముద్రపు నీరు ఒక మీటరు ఎత్తులో ఎగసిపడితే సునామి ప్రభావం తీవ్రంగా ఉంటుందని అధికారులు అందోళన వ్యక్తం చేస్తున్నారు.All tsunami warnings lifted for Japan's Izu and Ogasawara islands after earlier 5.6 magnitude earthquake https://t.co/bWfknc7WAj— Factal News (@factal) September 24, 2024క్రెడిట్స్: Factal Newsఈ క్రమంలోనే అధికారులు.. ముందస్తుగా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తరచూ భూకంపాలు సంభవించే జపాన్‌లో గత రెండు నెలల్లో అనేక చిన్న భూకంపాలు చోటుచేసుకున్నాయి. సెప్టెంబరు 23న తైవాన్‌లో 4.8 తీవ్రత, సెప్టెంబర్ 22న ఎహిమ్‌లో 4.9 తీవ్రత, సెప్టెంబర్ 21న చిబాలో 4.6 తీవ్రతతో చిన్న భూకంపాలు సంభవించాయి.చదవండి: వింత శబ్దాల మిస్టరీ వీడింది -
టోక్యోలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు
-
టోక్యోలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు
జపాన్ రాజధాని టోక్యో నగరంలో వినాయక చవితి వేడుక ఉత్సాహంగా జరిగింది. తెలుగు అసోసియేషన్ జపాన్ (TAJ) వారి ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు విఘ్ననాయకుడికి అత్యంత భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించి, ఆది దేవుడి ఆశీస్సులు పొందారు.అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలుగు వారంతా కలిసి విగ్రహాన్ని ప్రతిష్టించి గణనాథుడికి ఘనంగా పూజలు నిర్వహించారు. అనంతరం ఆదివారం అట్టహాసంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ నిమజ్జన కార్యక్రమంలో పెద్దలు, పిల్లలు ఆనందంతో పాల్గొన్నారు. -
నీలిరంగు చీరలోన జపాన్‌లో ఒక సందమామ
‘రోమ్‌లో రోమన్‌లా ఉండాలి’ అంటారు కొందరు. ‘అయినా సరే, నేను నాలాగే ఉంటాను’ అంటారు కొందరు. రెండో కోవకు చెందిన డిజిటల్ క్రియేటర్, ఎంటర్ప్రెన్యూర్ మహిశర్మ వీడియో వైరల్ అయింది. గోల్డెన్ బార్డర్స్ బ్లూ శారీ ధరించి జపాన్‌లోని టోక్యో వీధుల్లో చిద్విలాసంగా నడుస్తున్న ఆమె వీడియో ప్రపంచవ్యాప్తంగా వ్యూయర్స్ దృష్టిని ఆకర్షించింది. ‘ఐ వోర్ ఏ శారీ ఇన్ జపాన్ రియాక్షన్స్ ఆర్’ కాప్షన్‌తో ΄ోస్ట్ చేసిన ఈ వీడియో ఏడు మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకుంది. వీడియోలో ఆబాలగోపాలం మహిశర్మను ఆశ్చర్యంగా చూస్తున్న, సెల్ఫీలు తీసుకుంటున్న దృశ్యాలు కనిపిస్తాయి. -
Japan Earthquake: జపాన్‌లో కంపించిన భూమి..
టోక్యో: తైవాన్ భూకంప ఘటన మరువకముందే తాజాగా జపాన్‌లో భూమి కంపించింది. గురువారం ఉదయం హోన్షు తూర్పు తీరంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు యూరోపియన్-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. దీంతో, రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.3గా నమోదైనట్లు వెల్లడించింది. కాగా, తూర్పు ఆసియా దేశాలను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. బుధవారం తైవాన్‌లో భూకంపం వచ్చిన మరుసటి రోజే నేడు జపాన్‌లో భూమి కంపించింది. హోన్షు తూర్పు తీరంలో రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.3గా నమోదైనట్లు వెల్లడించింది. భూమికి 32 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించారు. అయితే, ఈ ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం తెలియరాలేదు. జపాన్ రాజధాని టోక్యోలో కూడా ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. 🚨🇯🇵 BREAKING: 6.3 magnitude earthquake near the east coast of Japan pic.twitter.com/Ro97HguPVZ — Kacee Allen 🇺🇸 (@KaceeRAllen) April 4, 2024 ఇదిలా ఉండగా.. తైవాన్‌లో బుధవారం రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ క్రమంలో 25 ఏండ్లలో అతి పెద్ద భూకంపం ఇదే అని స్థానిక అధికారులు తెలిపారు. ఈ భూకంపం కారణంగా దాదాపు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ భూకంపం ధాటికి తైవాన్ రాజధాని తైపీ సహా అనేక ప్రాంతాల్లో భవనాలు బీటలు వారాయి. A dog sensed an earthquake in Taiwan seconds before it happened and alerted its owner..🐕🐾😳#Taiwan #Tsunami #Japan #TaiwanEarthquake #earthquake pic.twitter.com/10SdmUDENd — Zainab Fatima (@ZainabFati18) April 4, 2024 తైవాన్‌లో భూకంపం సందర్భంగా చిన్నారులను కాపాడిన నర్సులు.. ⚡️Nurses in a #Taiwan Hospital protecting babies during #earthquake.#Taiwan #earthquake #Japanpic.twitter.com/rF5It43iYO — Tajamul (@Tajamul132) April 4, 2024 -
ఇన్నేళ్లకు కల నిజమైంది: రష్మికా మందన్నా
చిన్ననాటి కల నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉందంటున్నారు హీరోయిన్ రష్మికా మందన్నా. జపాన్‌లోని టోక్యోలో జరిగిన ఎనిమిదో ఎడిషన్ ‘క్రంచీ రోల్ అనిమే’ అవార్డ్స్ ఫంక్షన్‌కు అతిథిగా వెళ్లారు రష్మిక. విజేతలకు అవార్డులను అందజేశారు. జపాన్‌కు వెళ్లడం పట్ల రష్మికా మందన్నా ఈ విధంగా స్పందించారు.‘‘నా చిన్నతనంలో జపాన్‌కు వెళ్లాలనే కల ఉండేది. అయితే అది అసాధ్యం అనుకున్నాను. కానీ ఇన్నేళ్లుగా జపాన్‌కు వెళ్లాలనే కల మాత్రం అలానే ఉంది. ఇప్పుడు అది సాధ్యమైనందుకు సంతోషంగా ఉంది. కొన్నేళ్ల నా కల నిజమైంది. జపాన్‌లోని ఆహారం, వాతావరణం, ఇక్కడి ప్రజలు నాపై చూపించిన ప్రేమ, ఆదరణ నాకు ఆనందాన్నిచ్చాయి. జపాన్ నాకు ఇప్పుడు చాలా స్పెషల్’’ అని ‘ఎక్స్’ వేదికగా షేర్ చేశారు రష్మిక. ఇక సినిమాల విషయానికి వస్తే.. అల్లు అర్జున్ ‘పుష్ప 2’, ధనుష్ ‘డీఎన్ఎస్’ (వర్కింగ్ టైటిల్), హిందీ ‘ఛావా’లో హీరోయిన్గా నటిస్తున్నారామె. అలాగే ‘ది గాళ్ ఫ్రెండ్’, ‘రెయిన్ బో’ అనే ఉమెన్‌సెంట్రిక్ ఫిల్మ్స్ కూడా చేస్తున్నారు రష్మికా మందన్నా. -
జపాన్ క్రష్ - రష్మిక గ్లోబల్ ఈవెంట్ కు నేషనల్ క్రష్
-
మంటల్లో విమానం!
టోక్యో: తీవ్ర భూకంపం ధాటికి పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం చోటుచేసుకోవడంతో పెనువిషాదంలో మునిగిపోయిన జపాన్‌లో మరో దుర్ఘటన జరిగింది. భూకంప బాధితుల కోసం సహాయక సామగ్రిని చేరవేయాల్సిన విమానం ప్రమాదంలో చిక్కుకొని ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. విమానాశ్రయం రన్‌వేపై ల్యాండ్ అవుతున్న విమానం మరో విమానాన్ని ఢీకొట్టింది. మొదటి విమానంలో ఉన్న 379 మంది క్షేమంగా ప్రాణాలతో బయటపడడంతో ఊరటనిచ్చింది. ఏమాత్రం ఆలస్యం జరిగినా ఊహించని ఉత్పాతమే జరిగేదని ప్రత్యక్షసాక్షులు చెప్పారు. రాజధాని టోక్యోలోని హనెడా ఎయిర్‌పోర్టు జపాన్‌లో అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటి. నూతన సంవత్సరం సెలవుల సందర్భంగా ప్రయాణికుల రాకపోకలతో మంగళవారం మరింత రద్దీగా మారింది. హొక్కైడోలోని షిన్ చిటోస్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరిన జపాన్ ఎయిర్‌లైన్స్ విమానం జేఏఎల్–516(ఎయిర్‌బస్ ఏ–350) హనెడా ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ఇందులో 12 మంది సిబ్బంది సహా మొత్తం 379 మంది ఉన్నారు. రన్‌వేపై దిగుతూ కుదుపులకు లోనైంది. రన్‌వేపై ల్యాండ్ అవుతూ, ఒక పక్కగా నిలిపి ఉన్న జపాన్ తీర రక్షక దళానికి చెందిన విమానం ఎంఏ–722ను అనూహ్యంగా ఢీకొట్టి కొద్దిదూరం దూసుకెళ్లి ఆగిపోయింది. క్షణాల వ్యవధిలోనే జేఏఎల్ విమానం రెక్క భాగంలో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన విమాన సిబ్బంది వెంటనే తలుపులు తెరిచి ప్రయాణికులకు బయటకు పంపించారు. మంటలు వేగంగా దూసుకొస్తున్నా లెక్కచేయకుండా ప్రయాణికులంతా బయటకు వచ్చారు. తర్వాత విమానం మొత్తం మంటల్లో చిక్కుకుంది. ఎయిర్‌పోర్టు ప్రాంగణమంతా పొగతో నిండిపోయింది. అగి్నమాపక సిబ్బంది మంటలను అర్పివేశారు. విమానం నుంచి ప్రయాణికులను భద్రంగా బయటకు పంపించిన అందులోని సిబ్బందిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎలా వ్యవహారించాలన్న దానిపై వారికి శిక్షణ ఇచి్చనట్లు అధికారులు చెప్పారు. ‘సాయం’ అందించకుండానే... ప్రమాదం జరిగిన వెంటనే తీర రక్షక దళం విమానం పైలట్ అక్కడి నుంచి పరారయ్యాడని జపాన్ కోస్ట్‌గార్డు అధికారులు చెప్పారు. ఈ విమానంలో ఉన్న ఆరుగురు కోస్ట్‌గార్డు సిబ్బందిలో ఐదుగురు మరణించారని స్థానిక మీడియా వెల్లడించింది. కోస్ట్‌గార్డు విమానం సహాయక సామగ్రితో జపాన్ పశి్చమ తీరంలోని నిగాటాకు బయలుదేరాల్సి ఉంది. కానీ అక్కడి భూకంప బాధితులకు సామగ్రిని అందించకుండానే ప్రమాదం జరగడం, ఐదుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం ఆవేదన కలిగిస్తోంది. ఊపిరాడక నరకంలా అనిపించింది జేఏఎల్–516 విమానంలో తనకు ఎదురైన భయానక అనుభవాన్ని 17 ఏళ్ల స్వీడి ఆంటోన్ డీబె మీడియాతో పంచుకున్నాడు. తొలుత ఏం జరిగిందో అర్థం కాలేదని, విమానం లోపలంతా దట్టమైన పొగ కమ్ముకుందని, ఊపిరాడక నరకంలా అనిపించిందని చెప్పాడు. సీట్లలో నుంచి కిందపడిపోయామని, ఎవరో ఎమర్జెన్సీ డోర్లు తెరవడంతో ప్రాణాలతో బయటపడ్డామని తెలిపాడు. -
టోక్యో ఎయిర్ పోర్ట్ లో రెండు విమానాలు ఢీ
-
ఎయిర్‌పోర్టులో రెండు విమానాలు ఢీ.. అయిదుగురి మృతి
జపాన్ ఎయిర్‌పోర్టులో మంగళవారం ఘోర ప్రమాదం సంభవించింది. రాజధాని టోక్యోలోని ఓ ఎయిర్‌పోర్టు రన్‌వేపైని విమానంలో అనూహ్యంగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో అయిదుగురు మృత్యువాతపడ్డారు. వివరాలు.. హోకియాడో నుంచి వస్తున్న జపాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన JAL 516 విమానం ప్రమాదానికి గురైంది. హనెడా ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతుండగా మంటలు వ్యాపించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. దీంతో విమానంలోని 379 ప్రయాణికులు, 12 మంది సిబ్బందిని వెంటనే ఖాళీ చేయించారు. JAL plane on fire at Tokyo Airport pic.twitter.com/EL9s7kVJbi — アトリン ✊🏾 (@phoojux) January 2, 2024 అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. అందరూ సురక్షితంగా బయటపడ్డారు. విమానం నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందులో విమానం రన్‌వేపై దిగుతుండగానే దాని చక్రాల నుంచి మంటలు వెలువడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అనంతరం అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని.. దాదాపు 70 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. JAL plane on fire at Tokyo Airport pic.twitter.com/EL9s7kVJbi— アトリン ✊🏾 (@phoojux) January 2, 2024 ప్రమాదానికి గల స్పష్టమైన కారణం తెలియరాలేదు కానీ.. విమానం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతుండగా అక్కడే ఉన్న కోస్ట్‌గార్డ్ విమానాన్ని ఢీ కొనడం వల్లే ఈ ఘటన జరిగినట్లు విమానాశ్రయ అధికారులు జాతీయ మీడియా ఎన్‌హెచ్‌కేకు తెలిపారు. ప్రమాద ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. అయితే కోస్ట్‌గార్డ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో మొత్తం ఆరుగురు సిబ్బంది ఉండగా.. వారిలో అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఒకరు మాత్రమే సురక్షితంగా బయటకు వచ్చారు. ఈ ఘటన అనంతరం హనెడా విమానాశ్రాయాన్ని పూర్తిగా మూసివేసినట్లు చెప్పారు. -
జపాన్‌లో భారీ భూకంపం.. 155సార్లు కంపించిన భూమి
జపాన్‌లో భారీ భూకంపం అప్డేట్స్: ► జపాన్‌లో సునామి హెచ్చరికలు, సలహాలను అధికారులు ఎత్తివేశారు. అయితే సముద్రపు అలల్లో మార్పులు రావడానికి ఇంకా అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు భూకంప బాధితుల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. Officials Lift Tsunami Warnings After Powerful Quake Off Chilean Coast - https://t.co/NuaBIIWbA6 pic.twitter.com/TtEX1f2w2Z — Alaska Native News (@AKNativeNews) December 26, 2016 ► జపాన్‌లో భీభత్సం సృష్టించిన భూకంపంలో 30 మంది మృత్యువాత పడ్డారని స్థానిక అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే ఈ మృతు సంఖ్య ఇంకా పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మృతి చెందిన 30 మందిలో సగం మంది వాజిమా నగరంలో చనిపోయినట్టు తెలుస్తోంది. #UPDATE The death toll from a powerful earthquake in central Japan rose to 30 on Tuesday, local authorities say, with 14 others seriously injured. Half the deaths were recorded in the city of Wajima, where a huge blaze tore through homes, the Ishikawa prefectural government says pic.twitter.com/BS1lEa0vJ5 — AFP News Agency (@AFP) January 2, 2024 ► సముద్రపు అలలు 5 అడుగులపైకి దూసుకురావటంతో అధికారులు సునామి హెచ్చరికలు జారీ చేశారు. భూకంపంతో సమారు 33 వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. #Japan | Roads Split Open and Swallow Cars. #JapanEarthquake #JapanTsunami (AP) pic.twitter.com/G81rGMr4Xh — Mansi Bhagat (@mansibhagat1009) January 2, 2024 ► జపాన్‌లో సంభవించిన భారీ భూకంపం కారణంగా మృతుల సంఖ్య పెరుగొచ్చని, ఇప్పటి వరకు 20 మంది మృత్యువాత పడ్డారని జపాన్ స్థానిక మీడియా వెల్లడించింది. After earthquake cars roads and building being wash away by tsunami flood. #Japan pic.twitter.com/sLsuVXvJaN — Agha Akakhel (@AghaAkakhel) January 1, 2024 ► జపాన్‌లో సంభవించిన భారీ భూకంపంలో సహాయ చర్యలపై ప్రధానమంత్రి పుమియో కిషిడా సమీక్ష నిర్వహించారు. ‘భూకంపంతో తీవ్రమైన నష్టం జరిగింది. ఆస్తి, ప్రాణ నష్టం చోటు చేసుంది. పలు చోట్ల భవనాలు కూలిపోయాయి. భూకంపంతో కొన్ని చోట్ల అగ్ని ప్రమాదం జరిగింది’ అని తెలిపారు. భూకంపంతో ఇబ్బందులు పడుతున్న వారికి సహయక చర్యలు కొనసాగిస్తున్నామని తెలిపారు. పలు కూలీపోయిన భవనాల శిథిలాల్లో చిక్కుకున్నవారిని బయటకు తీసుకురావడానకి రెస్య్కూ టీం సాయం అందిస్తోందని పేర్కొన్నారు. ► జపాన్ భారీ భూకంపంతో సోమవారం నుంచి 155 సార్లు భూమి కంపించింది. భారీ భూకంపంతో పలు భవనాలు కూలిపోయాయి. పలు రోడ్లపై పగుళ్లు వచ్చాయి. భూకంప తీవ్రతకు తెలిపే CCTV ఫుటేజీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ వీడియోల్లో రోడ్ల పగుళ్లు, రైల్వే స్టేషన్లో బోర్డులు ఊగిపోవటం కనిపిస్తున్నాయి. Some of the Footage coming out of Japan following the 7.6 Magnitude Earthquake which Struck the Country earlier this morning is Insane and truly shows the Power of Geological Forces on this Planet. pic.twitter.com/iwCRB3jmCv — OSINTdefender (@sentdefender) January 1, 2024 ► భారీ భూకంపం జపాన్ను కుదిపేసింది. సోమవారం రిక్కార్ స్కేల్‌పై 7.6 తీవ్రతో భూకంపం నమోదైనట్లు జపాన్ వాతారణ సంస్థ పేర్కొంది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ఇళ్లు నేలకూలాయి. మరికొన్ని ఇళ్లకు పగుళ్లు కనిపించాయి. అయితే ఇప్పటివరకు ఎనిది మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. We must stand with the people of Japan , during this tough time in which they are experiencing a Tsunami and earthquake. May God protect the children mothers & people of Japan from the Tsunami #Japan #earthquake #Tsunami#JapanEarthquake #JapanTsunamipic.twitter.com/dSfvKBZu7M — Kohlified 🗿 (@ShreeGZunjarrao) January 1, 2024 అదేవిధంగా జపాన్‌లో చోటుచేసుకున్న భూకంపం కారణంగా ఇషికావా నగరంలో భారీగా మంటలు చెలరేగాయి. పలు భవనాలు మంటల్లో కాలిపోయాయి. 30,000 కంటే ఎక్కువ గృహాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. THE SITUATION IS GETTING MORE COMPLICATED: A fire broke out at one of the Japanese nuclear plants A fire broke out at the Shiga nuclear power plant in Japan after the devastating earthquakes that hit the country today, Japanese media reported. pic.twitter.com/3ZSrBqY8ph — Vlado Gorski (@VGorski011) January 1, 2024 ఇషిగావా రాష్ట్రంలో సముద్ర తీర ప్రాంతాల్లో వరుసగా భూప్రకంపనలు సంభవించాయి. ఇషిగావాలోని నోటో ప్రాంతం నుంచి 300 కిలోమీటర్ల మేర సునామీ అలలు విస్తరించే అవకాశం ఉందని స్థానిక వాతావరణ సంస్థలు అంచనా వేశాయి. భూకంపం వల్ల ఇళ్లు కంపిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. భూప్రకంపనలతో భయాందోళనకు గురైన జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కొందరు కుర్చీలు, టేబుళ్ల కింద దాక్కున్నారు. -
వెల్కమ్ దాసరి హర్షిత.. జపాన్ నుంచి నేడు స్వదేశానికి..
సాక్షి, కరీంనగర్: తొమ్మిదో జాతీయ ఇన్స్పైర్ అవార్డుల పోటీల్లో సత్తాచాటి జిల్లా పేరు ఇనుమండింపజేసిన దాసరి హర్షిత అంతర్జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొని ఆదివారం స్వదేశానికి చేరుకోనుంది. రామగిరి మండలం చందనాపూర్ జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్న హర్షిత ఈనెల 4 నుంచి 11వ తేదీ వరకు జపాన్ రాజధాని టోక్యో వేదికగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సకూర కార్యక్రమంలో పాల్గొంది. గతేడాది సెప్టెంబర్ 14 నుంచి 16వ తేదీ వరకు ఢిల్లీ వేదికగా నిర్వహించిన 9వ జాతీయ ఇన్స్పైర్ అవార్డుల ప్రదర్శన పోటీల్లో జిల్లా నుంచి నలుగురు విద్యార్థులు హాజరవగా.. హర్సిత ప్రతిభ చూపించింది. కేంద్ర శాస్త్ర,సాంకేతిక శాఖమంత్రి జితేంద్రసింగ్ నుంచి అవార్డును అందుకున్నట్లు డీఈవో మాధవి తెలిపారు. అలాగే ఈఏడాది ఏప్రిల్ 10 నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన ఫైన్ కార్యక్రమంలో పాల్గొని నేరుగా రాష్ట్రపతికి తను రూపొందించిన బహుళ ప్రయోజనకర హెల్మెట్ గురించి వివరించి మన్ననలు పొందింది. జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా ఢిల్లీ ప్రగతిమైదాన్‌లో మే 10, 11, 12వ తేదీల్లో నిర్వహించిన ప్రత్యేక ప్రదర్శనలోనూ ప్రతిభ చాటింది. మనరాష్ట్రం నుంచి 9వ జాతీయ ప్రదర్శన పోటీల్లో విజేతలైన 8 మంది విద్యార్థులతో కలిసి అంతర్జాతీయ కార్యక్రమానికి ఎంపికై ంది. దేశం నలుమూలల నుంచి ఏడు, ఎనిమిది, తొమ్మిదో జాతీయ ఇన్స్పైర్ అవార్డు– మనక్ పోటీల్లో విజేతలైన 59 మంది విద్యార్థులు, అధికారులు ఇందులో పాల్గొన్నారు. మనరాష్ట్రం నుంచి ఆరుగురు విద్యార్థులు ఇందులో ఉన్నారు. ఆదేశంలోని మన రాయబార కార్యాలయంతోపాటు పలు విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక వారసత్వం కలిగిన 15కు పైగా ప్రదేశాలను తిలకించి రావడం హర్షిత ప్రత్యేకత. పాఠశాల స్థాయి నుంచే.. పాఠశాలస్థాయి ప్రదర్శన నుంచే చైనా, సైప్రస్, ఉజ్బెకిస్తాన్, తజబిస్తాన్ లాంటి దేశాల విద్యార్థులు పాల్గొన్న అంతర్జాతీయస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొనడానికి అరుదైన అవకాశం మనదేశంలోని గ్రామీణి ప్రాంతానికి చెందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని హర్షితకు రావడం విశేషం. ఆమెను ప్రో త్సాహించిన గైడ్ టీచర్ సంపత్‌కుమార్‌ను డీఈవో మాధవి, జిల్లా సైన్స్ అధికారి రవినందన్‌రావు, హెచ్ఎం లక్ష్మి, ఉపాధ్యాయులు అభినందించారు. -
అంతర్జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనలో.. జపాన్‌కు పయనమైన హర్షిత!
సాక్షి, కరీంనగర్/పెద్దపల్లి: రామగిరి మండలం చందనాపూర్ ప్రభుత్వ పాఠశాల పదో తరగతి విద్యార్థి డి.హర్షిత శుక్రవారం జపాన్‌కు బయలుదేరి వెళ్లింది. దాసరి మహేశ్–స్వప్న దంపతుల కుమార్తె దాసరి హర్షిత.. గైడ్ టీచర్ సంపత్‌కుమార్ సహకారంతో తను తయారుచేసిన బహుళప్రయోజనకర(హెల్మెట్) హెల్మెట్ ప్రాజెక్ట్ జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చూపి అంతర్జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికైంది. ఈనెల 5 నుంచి పదో తేదీ వరకు జపాన్‌లోని టోక్యో నగరంలో నిర్వహించనున్న అంతర్జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనలో తన ప్రాజెక్ట్‌ను ప్రదర్శించన్నుట్లు హెచ్ఎం లక్ష్మి, గైడ్ టీచర్ సంపత్ కుమార్ తెలిపారు. ఈసందర్భంగా హర్షిత మాట్లాడుతూ, అంతర్జాతీయ వేదికపై తన ప్రాజెక్టు ప్రదర్శించడం సంతోషంగా ఉందని పేర్కొంది. -
ఇచ్చట బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అద్దెకు లభించును!
టోక్యో: దేశంలో అత్యధికంగా ఉన్న ఒంటరి యువతీయువకులకు జపాన్ దేశం ఒక బంపర్ ఆఫర్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒంటరిగా ఉన్న యువతీ యువకులు అద్దె చెల్లించి బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ ని సొంతం చేసుకోవచ్చు. పెళ్లికాని యువతీయువకుల ఆవేదనని అర్ధం చేసుకుంది జపాన్ ప్రభుత్వం. జీవితంలో ఎవ్వరి తోడులేక మొడుబారిన ఒంటరి వ్యక్తుల బ్రతుకుల్లో కొత్త ఆశలను చిగురించేలా చేసింది. ఆన్లైన్ పోర్టల్ ద్వారా యువతీ యువకులు గంటల ప్రతిపాదికన సహచరులను ఎంపిక చేసుకునే బృహత్తర కార్యక్రమానికి ఆమోదం తెలిపింది. దీంతో జపాన్ దేశంలో బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ లేనివారు ఎవరైనా అద్దెకు వారిని పొందవచ్చు. గంటకు రూ.3000 చెల్లించి బాయ్ ఫ్రెండ్ లేనివారు ప్రియుడిని గర్ల్ ఫ్రెండ్ లేని వారు ప్రియురాలిని సొంతం చేసుకోవచ్చు. ఎంచుకునే అభ్యర్థిని బట్టి అదనంగా మరో 1200 చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు సదరు ఆన్లైన్ పోర్టల్ నిర్వాహకులు. షిహో అనే ఒక ఆన్లైన్ గర్ల్ ఫ్రెండ్ మాట్లాడుతూ ఈ సర్వీసును వినియోగించుకునే వారిలో అత్యధికులు వారి జీవితంలో ఎటువంటి తోడు లేనివారు, పెళ్లి కానీవారే. ఈ సేవలు వినియోగించుకునే వారు ఆన్లైన్ పార్ట్ నర్ కు ఎటువంటి ఖరీదైన కానుకలు ఇవ్వడానికి లేదు, డైరెక్టుగా మాట్లాడే అవకాశమూ లేదు. ఆన్లైన్ బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ కావాలనుకునేవారు వీటితోపాటు అనేక నిబంధనలను కూడా పాటించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ సర్వీసు ఏదో బాగుంది కదూ. కేవలం బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ మాత్రమే కాదు, జపాన్ దేశంలో కుటుంబ సభ్యులు కావాలన్నా కూడా అద్దెకు దొరుకుతారట. ఇది కూడా చదవండి: సంప్రదాయం పేరిట సముద్రంలో దారుణం.. -
రన్‌వేపై రెండు ప్యాసింజర్ విమానాలు ఢీ
ఎయిర్‌పోర్ట్‌లోని రన్‌వేపై రెండు ప్యాసింజర్ విమానాలు ఢీ కొన్నాయి. దీంతో అధికారులు రన్‌వేని మూసేశారు. ఈ ఘటకు గల కారణాలు అస్పష్టంగా ఉన్నాయి. ఈ ప్రమాదం జపాన్ రాజధాని టోక్యలో హనెడా విమానాశ్రయం వద్ద చోటుచేసుకుంది. ఈ షాకింగ్ ఘటనలో ప్రయాణికులకు తీవ్ర గాయలైనట్లు జపాన్ మీడియా పేర్కొంది. అయితే ప్రభుత్వం మాత్రం ఎవరికీ ఏం కాలేదని అంటోంది. టోక్యోలోని హనెడా విమానాశ్రయం వద్ద టాక్సీవేలో ప్రయాణికులతో కూడిన రెండు విమానాలు ఢీ కొన్నాయి. దీంతో రన్‌వే ఒక్కసారిగా మూసివేశారు అధికారులు. బ్యాంకాకు బయలుదేరిని థాయ్ ఎయిర్వేస్ ఇంటర్నేషనల్ జెట్ ప్రమాదవశాత్తు తైపీకి వెళ్తున్న ఎవా ఎయిర్వేస్ విమానాన్ని ఢీ కొట్టింది. ఈ షాకింగ్ ఘటన కారణంగా మిగతా విమానాలకు అంతరాయం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. జపాన్ రవాణా మంత్రిత్వ శాఖ ఈ ఘటన శనివారం ఉదయం 11 గంటలకు జరిగినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, ఎలాంటి నష్టం వాటిల్ల లేదని పేర్కొంది. కానీ జపాన్ స్థానిక మీడియాలు మాత్రం ప్రయాణికులు కొద్దిపాటి గాయాలయ్యాయని, అలాగే ఓ విమానం రెక్కదెబ్బతిందని పేర్కొంది. ఈ ప్రమాద సమయంలో టోక్యో విమానాశ్రయం సత్వరమే స్పందించడంలో జాప్యం చేసిందని పలు విమర్శనాత్మక కథనాలు వెలువరించడం గమనార్హం. కాగా, అసలు ఈ ఘటనకు దారితీసిన కారణాలేంటో తెలియాల్సి ఉంది. (చదవండి: రాజ భవనంలాంటి ఆ బంగ్లా.. ఎలుకలు ఉన్నాయని కూల్చేస్తున్నారు!) -
ప్రపంచంలోని టాప్ 10 అతిపెద్ద నగరాలు
-
జపాన్ పర్యటనలో ప్రముఖులతో ప్రధాని మోదీ (ఫొటోలు)
-
ప్రధాని మోదీతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భేటీ
టోక్యో: భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భేటీ అయ్యారు. జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా ఆహ్వానం మేరకు జీ7 సదస్సుకు ప్రత్యేక అతిధిగా భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ క్రమంలోనే.. మోదీతో జెలెన్ స్కీ సమావేశమయ్యారు. ఉక్రెయిన్ కోసం, అలాగే శాంతి కోసం భారత్ ఎలాంటి ప్రయత్నానికైనా సిద్ధమని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. 2022, ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ఉక్రెయిన్‌పై రష్యా పూర్తిస్థాయి దురాక్రమణ మొదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీ-జెలెన్స్కీల తొలిసారి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్ తో రష్యా సంబంధాల దృష్ట్యా .. ఉక్రెయిన్, రష్యాల మధ్య రాజీ చర్చలకు ప్రస్తుత పరిస్థితుల్లో మోదీకి మించిన నాయకుడు ఇంకొకరు లేరు. రెండు పక్షాలు నమ్మదగిన ఏకైక దేశం, వ్యక్తి మోదీనే. ఇప్పటికే యుద్ధం వల్ల లక్షలాది మంది చనిపోవడం, గాయపడడం లేదా శరణార్థులుగా మారిన దృష్ట్యా.. అర్జంటుగా యుద్ధం ఆపాల్సిన సమయం ఆసన్నమయింది. ఇదిలా ఉంచితే, మోదీపై తన ఆప్యాయతను ప్రదర్శించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ఇద్దరూ ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. శనివారం హిరోషిమా(జపాన్)లో జీ7 సదస్సు సందర్భంగా ఈ సన్నివేశం చోటు చేసుకుంది జీ7 సదస్సుకు ప్రత్యేక అతిధిగా భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ క్రమంలోనే.. బైడెన్ రాకను గమనించి కుర్చీలోంచి లేచి మరీ ఆలింగనం చేసుకున్నారాయన. ఈ సందర్భంగా బైడెన్‌తో మోదీ ప్రత్యేకంగా భేటీ అయినట్లు తెలుస్తోంది. ఇక ఇదే వేదికగా బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ను సైతం ప్రధాని మోదీ ఆలింగనం చేసుకుని పలకరించారు. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో, జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ తో సైతం మోదీ భేటీ అయ్యారు.జీ7 సదస్సు కోసం ఒకరోజు ముందుగానే జపాన్‌కు చేరుకున్న ప్రధాని మోదీ.. ఆ దేశ ప్రధాని కిషిదాతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. #WATCH | Prime Minister Narendra Modi and US President Joe Biden share a hug as they meet in Hiroshima, Japan. pic.twitter.com/bbaYMo1jBL — ANI (@ANI) May 20, 2023 Prime Minister Narendra Modi met Indonesian President Joko Widodo and his wife in Hiroshima, Japan. "India attaches great priority to strong ties with Indonesia," the Prime Minister tweets. pic.twitter.com/l7xcCpC1Uo — ANI (@ANI) May 20, 2023 Ukrainian President Volodymyr Zelensky arrives in Japan's Hiroshima for #G7Summit (Picture source: AFP News Agency) pic.twitter.com/AJc6fJWh7J — ANI (@ANI) May 20, 2023 #G7HiroshimaSummit | British PM Rishi Sunak and PM Narendra Modi share a hug as they meet in Hiroshima, Japan. (Pic source: Rishi Sunak's Twitter handle) pic.twitter.com/fVM91pe4cW — ANI (@ANI) May 20, 2023 -
విజిటింగ్ ప్రొఫెసర్‌గా ‘అలీబాబా’ జాక్ మా
టోక్యో: చైనా ఈ–కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ సహ వ్యవస్థాపకుడు జాక్ మా కాలేజీ ప్రొఫెసర్‌గా మారనున్నారు. ప్రతిష్టాత్మక యూనివర్సిటీ ఆఫ్ టోక్యోకు చెందిన పరిశోధన సంస్థ టోక్యో కాలేజీలో విజిటింగ్ ప్రొఫెసర్ కానున్నారు. సుస్థిర వ్యవసాయం, ఆహారోత్పత్తి అంశంపై ఆయన పరిశోధనలు చేస్తారని వర్సిటీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఎంట్రప్రెన్యూర్షిప్, కార్పొరేట్ మేనేజ్మెంట్ తదితర రంగాల్లో తన అనుభవాన్ని విద్యార్థులు, అధ్యాపకులతో జాక్ మా పంచుకుంటారని తెలిపింది. 1990ల్లో ఈ– కామర్స్ సంస్థ అలీబాబాను స్థాపించిన జాక్ మా ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనికుడు. -
టోక్యోకు టాటా..!
జనాభా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తేనే అభివృద్ధి అంటున్న కిషిదా సర్కార్ రాజధాని పొమ్మంటోంది. తట్టాబుట్టా సర్దుకొని వెళ్లిపొమ్మంటోంది. జన ప్రభంజనం ఒక్కచోటే ఉంటే ఆ ఊరు తట్టుకోవడం కష్టం. అందుకే జపాన్ ప్రభుత్వం టోక్యోకు టాటా చెప్పేవారికి భారీగా తాయిలాలు ఆశ చూపిస్తోంది జపాన్ రాజధాని టోక్యోకు ఎందుకీ పరిస్థితి వచ్చింది...? డబ్బులిచ్చి మరీ జనాన్ని వెళ్లిపొమ్మని చెప్పడానికి కారణాలేంటి ? జపాన్ రాజధాని విడిచి పెట్టి వెళ్లిపోవడానికి అక్కడ ప్రభుత్వం భారీ తాయిలాలు ప్రకటించింది. కుటుంబంలోని పిల్లలకి ఒక్కొక్కరికి 10 లక్షల యెన్ అంటే భారత్ కరెన్సీలో రూ. 6 లక్షలు ఇస్తామని ఆశ చూపిస్తోంది. జపాన్‌లో జనాభా దేశవ్యాప్తంగా సమానంగా విస్తరించలేదు. అక్కడ నగరాలు, పట్టణాలు జనంతో కిక్కిరిసిపోతూ ఉంటే గ్రామీణ ప్రాంతాలు, చిన్న పల్లెలు ఖాళీ అయిపోతున్నాయి. టోక్యో, ఒసాకా వంటి నగరాల్లో జనాభా అంతకంతకూ పెరిగిపోతోంది.అందుకే కుటుంబంలో ఒక్కో పిల్లకి 10 లక్షల యెన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. జపాన్‌కు ఇదేమీ కొత్త కాదు. మూడేళ్ల క్రితం కూడా టోక్యోకి టాటా చెప్పండంటూ 3 లక్షల యెన్లు ప్రకటించించింది. జనాలెవరూ రాజధాని వీడి వెళ్లడానికి ఇష్టపడ లేదు. దీంతో ఈ సారి ఇన్సెంటివ్ను భారీగా పెంచి 10 లక్షల యెన్లు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో వెళ్లేవారికి ఈ ఇన్సెంటివ్ లభిస్తుంది. టోక్యో ఉక్కిరిబిక్కిరి జపాన్‌లో నానాటికి జనాభా తగ్గిపోతోంది. 1973 నుంచి ఆ దేశంలో జననాల రేటు తగ్గుతూ వస్తోంది. 2020–21 సంవత్సరంలో రికార్డు స్థాయిలో 6,44,000 మంది తగ్గిపోయారు. 2022 సంవత్సరం జనవరి–సెప్టెంబర్ మధ్య జపాన్‌లో కొత్తగా 5,99,636 మంది జన్మించారు. ప్రస్తుతం జపాన్ జనాభా 12.50 కోట్లు కాగా టోక్యో జనాభా 1.5 కోట్లు. దేశంలో మొత్తం జనాభాలో ఇంచుమించు 10శాతం మంది రాజధానిలోనే నివసిస్తున్నారు. ఈ నగరంలో జన సాంద్రత (చదరపు కి.మీ. నివసించేవారి సంఖ్య) 6,158గా ఉంది. జపాన్‌లో జనాభా తగ్గుతూ వస్తూ ఉంటే టోక్యోలో జనాభా గత దశాబ్దంలో 16% పెరిగింది. యువతీ యువకులు ఉపాధి అవకాశాల కోసం రాజధాని బాట పడుతున్నారు. దీంతో ఇసుక వేస్తే రాలనంత జనాభాతో టోక్యో ఊపిరి పీల్చుకోలేకపోతోంది. 2020 నాటికి జపాన్‌లో జనాభాలో 52% మంది మూడు అతి పెద్ద మెట్రోపాలిటన్ ప్రాంతాలైన టోక్యో, ఒసాకో, నగోయాలో నివసిస్తున్నారు. మిగిలిన ప్రాంతాల్లో 48% మంది ఉన్నారు.2050 నాటికి ఈ మూడు నగరాల్లోనే 57% మంది నివసిస్తారని, మిగిలిన ప్రాంతాల్లో 43% మంది ఉంటారని అంచనాలున్నాయి. దేశ రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక కార్యకలాపాలన్నింటికీ టోక్యో కేంద్ర బిందువుగా ఉంది. దీంతో ఈ ప్రాంతంలో భూకంపం వచ్చే ముప్పు పెరిగిపోయిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే జనాభా అన్ని ప్రాంతాలకు విస్తరించాలని ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉంది. ప్రభుత్వ ప్రయత్నాలు ఫలిస్తాయా ? దేశంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలంటే జనాభా వికేంద్రీకరణ కూడా జరగాలని జపాన్ అధ్యక్షుడు ఫ్యూమియో కిషిదా భావిస్తున్నారు. అందుకే పల్లెలకు, ఇతర పట్టణాలకు కూడా ప్రజలు వెళ్లి స్థిరపడేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పల్లెల్లో కాలుష్యం లేని జీవనంపై ప్రత్యేకంగా వీడియోలు విడుదల చేస్తూ జనాన్ని ఆకర్షించే ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తోంది. ప్రతీ ఒక్కరూ రాజధానిలో మకాం ఉంటే జరిగే అనర్థాల గురించి ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేస్తోంది. పిల్లల సంరక్షణ, విద్య, ఆరోగ్యంతో పాటు నగరాల్లో ఉంటే సదుపాయాలన్నీ పల్లెల్లో కల్పిస్తోంది. ఏ ప్రాంతంలోనైనా జనం ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది. కరోనా తర్వాత ఉద్యోగాలన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువ కావడంతో టోక్యోలో ఉండాల్సిన పని లేదని, ఇతర చోట్లకు వెళ్లాలంది. 2019లో 71 కుటుంబాలు టోక్యోని వీడి వెళితే, 2021లో 1184 కుటుంబాలు ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. 2027 నాటికి ఏడాది 10 వేల కుటుంబాలు మకాం మారుస్తాయని అంచనాలు వేస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
టెక్ దిగ్గజం యాపిల్‌కు రూ.870 కోట్ల ఫైన్!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్‌కు జపాన్ ప్రభుత్వం భారీ ఎత్తున ఫైన్ విధించింది. జపాన్ రాజధాని టోక్యో నుంచి యాపిల్ సంస్థ ఐఫోన్ అమ్మకాల్ని నిర్వహిస్తుంది. అయితే టోక్యోకి వచ్చే విదేశీయులకు యాపిల్ కంపెనీ భారీ ఎత్తున ఐఫోన్లతో పాటు ఇతర డివైజ్‌లపై ఎలాంటి దిగుమతి సుంకం చెల్లించకుండా బల్క్‌లో ఫ్రీగా అమ్ముకోవడం ఏంటని ప్రశ్నించింది. నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు నిర్వహించిన యాపిల్ 105 మిలియన్లు (రూ. 870 కోట్లు) చెల్లించాలని ఆదేశాలు జారీ చేసినట్లు క్యోడో మీడియా పలు కథనాల్ని ప్రచురించింది. క్యోడో నివేదిక ప్రకారం..జపాన్‌లో యాపిల్ సంస్థ $1,04,16,84,000 (రూ. 8,634 కోట్లు) పన్ను మినహాయింపు పొందింది. ఇంపోర్ట్ డ్యూటీ చెల్లించకుండా సెప్టెంబర్ 2021 నుండి రెండు సంవత్సరాల పాటు విక్రయాలు సాగించినట్లు ట్యోక్యో రీజనల్ ట్యాక్సేషన్ బ్యూరో అధికారులు గుర్తించారు. యాపిల్ తన వ్యాపార ప్రయోజనాల కోసం ప్రొడక్ట్‌లపై రీసేల్ నిర్వహించినట్లు పేర్కొంది. అనైతికంగా వ్యాపారం యాపిల్ అనైతికంగా నిర్వహిస్తున్న బిజినెస్‌పై దృష్టిసారించిన ట్యాక్సేషన్ బ్యూరో గతేడాది నుంచి విచారణ చేపట్టింది. ఈ విచారణలో అసాదారణ లావేదేవీలు, యాపిల్ స్టోర్ నుంచి వందల సంఖ్యలోని యాపిల్ డివైజ్‌లను టూరిస్ట్‌లకు అమ్మినట్లు గుర్తించిందని జపాన్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. అందుకే తక్కువ సేల్స్ (underreported) నిర్వహించిన ప్రొడక్ట్‌లపై 105 మిలియన్ల అదనపు పన్ను, ట్యాక్స్ చెల్లించాల్సిన ఉత్పత్తులపై అదనపు వినియోగపు పన్నును భారీగా విధించనుంది. టూరిస్ట్‌ల ముసుగులో జపాన్‌కు వచ్చిన విదేశీయులు ఆరు నెలలలోపు కొనుగోలు చేసే వస్తువులపై ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే అదే వస్తువుల్ని రీసేల్ చేస్తే.. జరిపిన విక్రయాలను బట్టి పన్ను కట్టాలి. కాబట్టే యాపిల్..ఐఫోన్లు, ఇతర ప్రొడక్ట్‌లను జపాన్‌కు వచ్చే టూరిస్ట్‌లకు విక్రయించి.. ఆపై వాటిని విదేశాలకు భారీ ఎత్తున తరలించి పన్ను మినహాయింపు పొందేలా బిజినెస్ కార్యకలాపాల్ని నిర్వహిస్తున్నట్లు ట్యాక్స్ బ్యూరో అధికారులు అనుమానిస్తున్నారు. చైనా పౌరులపై కేసులు 2020లో జపాన్ను సందర్శించేందుకు టూరిస్ట్, ఇతర వీసాలను ఉపయోగించిన ఏడుగురు చైనీయులపై కేసులు నమోదయ్యాయి. ఒసాకా ప్రాంతీయ ట్యాక్స్ బ్యూరో అధికారులు వారి కొనుగోళ్లపై సుమారు $56,58,162 (దాదాపు రూ. 46 కోట్లు)ను వసూలు చేసింది. క్యోడో నివేదించిన ప్రకారం రూ. 475 కోట్ల విలువైన లగ్జరీ బ్రాండ్ వస్తువులు. వాచీలు, హ్యాండ్‌బ్యాగ్‌లతో కూడిన ఉత్పత్తులను రీసేల్ కోసం కొనుగోలు చేసినట్లు గుర్తించారు. కాగా, ఈ ఏడాది జూన్‌లో రీసేల్ నిర్వహించేందుకు డిపార్ట్మెంటల్ స్టోర్లలో కాస్మోటిక్స్‌తో పాటు ఇతర ఉత్పత్తులను పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరిపిన సందర్భాలు వెలుగులోకి రావడంతో ట్యాక్స్ బ్యూరో అడ్మినిస్ట్రేటీవ్ అధికారులు అప్రమత్తమయ్యారు. డిపార్ట్మెంట్ స్టోర్ల యజమానులు అనైతికంగా విక్రయాలు జరపొద్దని ఆదేశాలు జారీ చేశారు. చదవండి👉 ఎలాన్ మస్క్‌కు మరో ఎదురు దెబ్బ..‘టిమ్ కుక్ ఇక్కడ ఏం జరుగుతోంది’? -
చైనా బిలియనీర్ జాక్ మా ఆచూకీ తెలిసింది.. ఆరు నెలలుగా అక్కడే
చైనా పారిశ్రామిక దిగ్గజం, అలీబాబా కంపెనీ సహవ్యవస్థాపకుడు జాక్ మా ఆచూకీ తెలిసింది. గత ఆరు నెలలుగా జాక్ మా జపాన్ రాజధాని టోక్యోలో నివసిస్తున్నట్లు తెలుస్తోంది. టోక్యోలోని గింజా, మారునౌచి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తిగత చెఫ్, భద్రతా సిబ్బందితో కలిసి నివసిస్తున్నట్లు సమాచారం. జపాన్ నుంచే తరుచూ అమెరికా, ఇజ్రాయిల్ దేశాలకు వెళ్లి వస్తున్నట్లు తెలిసింది. స్పెయిన్, నెదర్లాండ్‌లోనూ ఆయన కనిపించినట్లు సమాచారం. కాగా జాక్ మా టోక్యోకు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ కార్పోరేషన్ వ్యవస్థాపకుడు మసయోషి సన్‌కు సన్నిహిత మిత్రుడు. అంతేగాక మసయోషి అలీబాబాలో పెట్టుబడిదారుడు కూడా. జాక్ మా ఒకప్పుడు చైనాలో అత్యంత సంపన్నమైన వ్యక్తిగా, ప్రఖ్యాత పారిశ్రామికవేత్తగా వెలుగొందారు. అయితే ఆ మధ్య చైనా ప్రభుత్వ విధానాలను బహిరంగ వ్యతిరేకించారు. చైనా నియంత్రణలో పనిచేసే ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరు సరిగా లేదంటూ విమర్శలు గుప్పించారు. బ్యాంకింగ్‌ను నియంత్రించే సంస్థలు కూడా అసమర్ధంగా ఉన్నాయని ఆరోపించారు. ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో జాక్ మా సంస్థలపై చైనా ఆయన వ్యాపారాలపై దృష్టి పెట్టింది. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ గుత్తాధిపత్య విధానాలను అవలంబిస్తున్నాయని నియంత్రణ సంస్థలు జాక్ మా వ్యాపారాలపై విమర్శలు చేశాయి. అప్పటి నుంచి జాక్ మా స్థాపించిన ‘యాంట్’, ‘ఆలీబాబా’ సంస్థలు నిబంధనలు పాటించడం లేదని నోటీసులు ఇవ్వడం ప్రారంభించాయి. ‘యాంట్’ సంస్థ 37 బిలియన్ డాలర్ల ఐపీఓని చైనా ప్రభుత్వం నిషేధించింది. అలాగే, ఆలీబాబా కంపెనీపై 2.8 బిలియన్ డాలర్ల జరిమానా విధించింది. ప్రభుత్వంతో విబేధాల కారణంగా 2020 ఆయన బహిరంగంగా కనిపించడం మానేశారు. చైనాను వీడి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. చదవండి: ఇరాన్ ఫుట్ బాల్ జట్టు ఓటమి.. స్వదేశంలో సంబరాలు.. కారణం ఇదే! -
గిన్నిస్‌లోకి ‘హిరోకజు టనాకా’లు
ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులైతే దాదాపు ఏడుగురి దాకా ఉంటారంటారుగానీ ఒకే పేరుగల వారి సంఖ్యకు మాత్రం కొదవేం ఉంది. మన వీధి, ఊరు, ప్రాంతం మొదలు విదేశాల వరకు ఒకే పేరుతో బోలెడు మంది ఉంటుంటారు. వారిలో కొందరు మనకు తారసపడుతుంటారు కూడా.. మరి అలాంటి వారంతా ఒకేచోటకు చేరితే? జపాన్ రాజధాని టోక్యోలోని ఓ ఆడిటోరియంలో ఇదే జరిగింది. ‘హిరోకజు టనాకా’ అనే పేరుగల 178 మంది ఒకేచోట కలుసుకొని ‘ఒకే పేరుగల వ్యక్తులతో కూడిన అతిపెద్ద సమూహం’గా సరికొత్త గిన్నిస్ రికార్డు సృష్టించారు. హిరోకజు టనాకా అనే పేరుగల వాళ్లలో మూడేళ్ల బుడతడు దగ్గర నుంచి వియత్నాం నుంచి వచ్చిన 80 ఏళ్ల బామ్మ వరకు ఉన్నారు. టోక్యోలో పనిచేసే హిరోకజు టనాకా అనే ఓ కార్పొరేట్ కంపెనీ ఉద్యోగి ఒకరోజు తన పేరుతోనే ఉన్న ఓ బేస్‌బాల్ ఆటగాడి ప్రతిభ గురించి తెలుసుకొని ముచ్చటపడ్డాడు. ప్రపంచవ్యాప్తంగా తన పేరుతోనే ఉన్న వ్యక్తులందరినీ ఒకేచోటకు చేర్చాలనుకొని అందుకోసం ప్రచార ఉద్యమం మొదలుపెట్టాడు. అతని ప్రయత్నం ఫలించి ఆ పేరుతో ఉన్న 178 మంది ఒకేచోటకు చేరుకున్నారన్నమాట. గతంలో ఈ రికార్డు మార్తా స్టివార్ట్స్ అనే పేరుతో ఉన్న 164 మంది పేరిట ఉండేది. 2005లో వారంతా ఇలాగే అమెరికాలో కలుసుకున్నారు. -
ఫేస్ టు ఫేస్ విత్ మరియప్పన్ తంగవేలు
-
Japan Open: పోరాడి ఓడిన ప్రణయ్
జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత అగ్రశ్రేణి ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్ పోరాటం ముగిసింది. టోక్యోలో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 18వ ర్యాంకర్ ప్రణయ్ 17–21, 21–15, 20–22తో ఆరో ర్యాంకర్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. 80 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కీలకదశలో ప్రణయ్ తడబడి మూల్యం చెల్లించుకున్నాడు. ముఖాముఖిగా ఇప్పటివరకు చౌ తియెన్ చెన్, ప్రణయ్ ఎనిమిదిసార్లు తలపడగా... ఐదుసార్లు చౌ తియెన్ చెన్, మూడుసార్లు ప్రణయ్ గెలిచారు. క్వార్టర్ ఫైనల్లో ఓడిన ప్రణయ్‌కు 4,125 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 3 లక్షల 28 వేలు)తోపాటు 6,050 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
కాంస్యం నెగ్గిన సాత్విక్-చిరాగ్ శెట్టి.. అయినా చరిత్రే
అంచనాలకు మించి రాణిస్తున్న సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జంట ప్రతిష్ఠాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించింది. శనివారం(ఆగస్టు 27న) జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో సాత్విక్-చిరాగ్ శెట్టి జంట.. మలేషియాకు చెందిన ఆరోన్ చియా-వూయి యిక్ సోహ్లతో 22-20, 18-21, 16-21తో ఓటమి పాలయ్యారు. తొలి గేమ్‌ను 22-20తో గెలిచిన సాత్విక్- చిరాగ్.. అదే టెంపోనూ తర్వాతి గేమ్స్‌లో కొనసాగించలేకపోయారు. తొలి గేమ్ ఓడినప్పటికి వరల్డ్ నెంబర్-7 అయిన మలేషియా జంట ఫుంజుకొని భారత ద్వయానికి మరో అవకాశం ఇవ్వకుండా వరుస గేముల్లో ఓడించి మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల డబుల్స్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం. ఇటీవలి కాలంలో సాత్విక్-చిరాగ్ జంట బ్యాడ్మింటన్‌లో అద్భుతాలు చేస్తున్నారు. ఆల్‌ఇంగ్లండ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ వరకు.. ఆ తర్వాత ఇండియా ఓపెన్, థామస్ కప్, కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణాలు చేజిక్కించుకున్నారు. తాజాగా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచిన సాత్విక్- చిరాగ్ శెట్టి జోడి కొత్త చరిత్ర లిఖించింది. BWF World Championships 2022 Men's Doubles - Semi Finals Aaron Chia/Soh Wooi Yik 🇲🇾 vs Satwiksairaj Rankireddy/Chirag Shetty 🇮🇳 20-22, 21-18, 21-16 Alhamdulillah they finally break the SF curse! 🤧 Huge congrats for advancing to the FINAL ChiaSoh 👏👏 #BWC2022 pic.twitter.com/uCWsJtBo3p — レディディラ (@ladydyla__) August 27, 2022 చదవండి: Rafael Nadal-Serena Williams: అద్భుత దృశ్యం.. దిగ్గజాలు ఎదురుపడిన వేళ సాత్విక్–చిరాగ్ ‘డబుల్స్’ ధమాకా -
బ్యాడ్మింటన్‌లో కొత్త చరిత్ర.. కొడుకుతో కలిసి తల్లి ప్రపంచ రికార్డు
వయసు అనేది ఒక సంఖ్య మాత్రమే అని కొందరు అంటారు. వయసు ఎక్కువైతే ఆట ఆడొద్దని ఎవరు అనరు. ఎందుకంటే ఎలాంటి ఆటైనా సరే వయసుతో సంబంధం ఉండదు(క్రికెట్, ఫుట్‌బాల్ లాంటివి మినహాయిస్తే). 99 ఏళ్ల వయసులోనూ కొందరు తాతలు, బామ్మలు పతకాలు సాధిస్తూ చరిత్ర సృష్టించడం చూస్తూనే ఉన్నాం. తాజాగా టోక్యో వేదికగా జరుగుతున్న బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్‌షిప్ 2022లో ఒక అద్భుతం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్‌కు చెందిన 64 ఏళ్ల మహిళా ప్లేయర్ స్వెత్లానా బీడబ్ల్యూఎఫ్ చాంపియన్‌షిప్‌లో మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తొలి విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో బీడబ్ల్యూఎఫ్ చరిత్రలో ఒక మ్యాచ్‌లో విజయం సాధించిన అత్యంత పెద్ద వయస్కురాలిగా స్వెత్లానా చరిత్ర సృష్టించింది. ఇంతకీ ఆమె జత కట్టింది ఎవరితో తెలుసా.. తన కన్నకొడుకు మిషా జిల్బర్మన్. అవునండీ స్వెత్లానా, మిషా జిల్బర్మన్లు తల్లి కొడుకు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మంగళవారం మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తొలి రౌండ్ మ్యాచ్‌లో ఇజ్రాయెల్‌కు చెందిన స్వెత్లానా- మిషా జిల్బర్మన్ ద్వయం.. ఈజిప్ట్‌కు చెందిన దోహా హని-ఆడమ్ హాటెమ్ ఎల్గమల్ జోడిపై 16-21, 21-1, 21-11తో విజయం సాధించి ప్రి క్వార్టర్స్‌కు చేరుకున్నారు. మ్యాచ్‌లో తొలి సెట్‌ను తల్లి కొడుకు పోగొట్టుకున్నప్పటికి.. మిగిలిన రెండు సెట్లలో ఆధిపత్యం ప్రదర్శించి సంచలన విజయం సాధించారు. ఇక 64 ఏళ్ల స్వెత్లానా.. ఆమె కొడుకు మిషా జిల్బర్మన్ను బీడబ్ల్యూఎఫ్ నిర్వాహకులు అభినందనల్లో ముంచెత్తారు. ''64 ఏళ్ల వయసులో స్వెత్లానా బీడబ్ల్యూఎఫ్‌లో మరో విజయాన్ని సాధించింది. 2009లో ఆమె బీడబ్ల్యూఎఫ్‌లో తొలి మ్యాచ్ ఆడింది.ఈ విజయం మాకు గర్వకారణం'' అంటూ ట్వీట్ చేసింది. ఇజ్రాయెల్‌కు చెందిన స్వెత్లానా జిల్బర్మన్ 1986లో యూరోపియన్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో సింగిల్స్ విభాగంలో కాంస్య పతకం సాధించింది. ఇజ్రాయెల్ జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో 17 సార్లు సింగిల్స్ విజేతగా.. మరో 21సార్లు మిక్స్డ్ డబుల్స్‌లో విజయాలు సాధించింది. #MondayMotivation At 6⃣4⃣ years old, Svetlana Zilberman 🇮🇱 has won her first #BWFWorldChampionships opening round match. 👏👏 She made her competition debut in 2⃣0⃣0⃣9⃣. 😮#Tokyo2022 📸 @badmintonphoto https://t.co/Ne3CgUTS9o pic.twitter.com/4odEEV3o5m — BWF (@bwfmedia) August 22, 2022 చదవండి: BWF Championship 2022: అదరగొట్టిన సైనా నెహ్వాల్.. నేరుగా మూడో రౌండ్‌కు -
BWF World Championships 2022: షటిల్ సమరం...
థామస్ కప్‌లో చారిత్రక విజయం... కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాల పంట... ఈ రెండు గొప్ప ప్రదర్శనల తర్వాత భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు మరో ప్రతిష్టాత్మక పోరుకు సిద్ధమయ్యారు. నేటి నుంచి జపాన్ రాజధాని టోక్యోలో మొదలయ్యే ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్లో పురుషుల సింగిల్స్, డబుల్స్, మహిళల సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాలలో కలిపి మొత్తం 26 మంది భారత క్రీడాకారులు సత్తా చాటుకునేందుకు సై అంటున్నారు. ఈ మెగా ఈవెంట్ చరిత్రలో అత్యధికంగా ఐదు పతకాలు గెలిచిన భారతీయ ప్లేయర్‌గా ఘనత వహించిన స్టార్ షట్లర్ పీవీ సింధు గాయం కారణంగా తొలిసారి ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనడం లేదు. 2011 నుంచి జరిగిన ప్రతి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు కనీసం ఒక్క పతకమైనా లభిస్తోంది. టోక్యో: అంతర్జాతీయ బ్యాడ్మింటన్ వేదికపై గత పదిహేనేళ్లుగా నిలకడగా రాణిస్తూ... ‘బ్యాడ్మింటన్ పవర్‌హౌస్’గా భావించే చైనా, ఇండోనేసియా, మలేసియా, థాయ్‌లాండ్, కొరియా, జపాన్ దేశాలకు దీటుగా ఎదిగిన భారత క్రీడాకారులు మరో సమరానికి సిద్ధమయ్యారు. తొలిసారి ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పోటీలకు ఆతిథ్యమిస్తున్న జపాన్ గడ్డపై భారత ఆటగాళ్లు పతకాలు సాధించాలని పట్టుదలతో ఉన్నారు. మహిళల సింగిల్స్‌లో స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు మినహా మిగతా అగ్రశ్రేణి క్రీడాకారులు భారత్ తరఫున బరిలో ఉన్నారు. గత ఏడాది స్పెయిన్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ రజతం, లక్ష్య సేన్ కాంస్యం సాధించి సంచలనం సృష్టించగా... కేరళ ప్లేయర్ హెచ్ఎస్ ప్రణయ్ క్వార్టర్ ఫైనల్ చేరాడు. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గిన సాయిప్రణీత్‌తోపాటు ఈసారి శ్రీకాంత్, లక్ష్య సేన్, ప్రణయ్‌లపై భారత్ ఆశలు పెట్టుకుంది. నేడు జరిగే పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)తో 20వ ర్యాంకర్ సాయిప్రణీత్... 39వ ర్యాంకర్ ఎన్‌హట్ ఎన్గుయెన్ (ఐర్లాండ్)తో 13వ ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్... 19వ ర్యాంకర్ విటింగస్ (డెన్మార్క్)తో 10వ ర్యాంకర్ లక్ష్య సేన్... 94వ ర్యాంకర్ లుకా వ్రాబెర్ (ఆస్ట్రియా)తో 18వ ర్యాంకర్ ప్రణయ్ తలపడనున్నారు. సాయిప్రణీత్ ‘డ్రా’ పై భాగంలో... శ్రీకాంత్, లక్ష్య సేన్, ప్రణయ్ ముగ్గురూ ‘డ్రా’ కింది భాగంలో ఉన్నారు. దాంతో శ్రీకాంత్, లక్ష్య సేన్, ప్రణయ్‌లలో ఒక్కరు మాత్రమే సెమీఫైనల్ చేరుకోగలరు. ఈ ముగ్గురికీ క్లిష్టమైన ‘డ్రా’నే ఎదురైంది. పతకాలు సాధించాలంటే వీరందరూ తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది. ఇటీవల కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించి లక్ష్య సేన్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. చౌ తియెన్ చెన్‌తో ఆడిన నాలుగుసార్లూ సాయిప్రణీత్ ఓడిపోవడం... కొన్నాళ్లుగా ఫామ్‌లో లేకపోవడంతో సాయిప్రణీత్ తొలి రౌండ్ అడ్డంకి దాటడం అనుమానమే. డిఫెండింగ్ చాంపియన్ లో కీన్ యు (సింగపూర్), మాజీ చాంపియన్స్ కెంటో మొమోటా (జపాన్), అక్సెల్సన్ (డెన్మార్క్), జిన్‌టింగ్ (ఇండోనేసియా), లీ జి జియా (మలేసియా) టైటిల్ ఫేవరెట్స్‌గా ఉన్నారు. సైనా మెరిసేనా... మహిళల సింగిల్స్‌లో ఈసారి భారత్ నుంచి ఇద్దరే బరిలో ఉన్నారు. గాయం కారణంగా పీవీ సింధు వైదొలగగా... సైనా నెహ్వాల్, మాళవిక బన్సోద్ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. నేడు జరిగే తొలి రౌండ్లో లినె క్రిస్టోఫెర్సన్ (డెన్మార్క్)తో మాళివిక... మంగళవారం జరిగే తొలి రౌండ్లో చెయుంగ్ ఎన్గాన్ యి (వియత్నాం)తో సైనా ఆడతారు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 12వసారి ఆడుతున్న సైనా 2015లో రజతం, 2017లో కాంస్యం గెలిచింది. అయితే ఈ ఏడాది సైనా గొప్ప ఫామ్‌లో లేదు. ఈ సీజన్లో ఆమె తొమ్మిది టోర్నీలలో ఆడితే ఏ టోర్నీలోనూ క్వార్టర్ ఫైనల్ దాటి ముందుకెళ్లలేకపోయింది. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ అకానె యామగుచి (జపాన్), రెండో సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ), మూడుసార్లు చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్), ఆన్ సె యంగ్ (కొరియా), చెన్ యు ఫె, హి బింగ్ జియావో (చైనా) టైటిల్ ఫేవరెట్స్‌గా కనిపిస్తున్నారు. ఆ ఇద్దరిపైనే... పురుషుల డబుల్స్‌లో భారత్‌కు ఇప్పటివరకు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకం రాలేదు. అంతా సవ్యంగా సాగితే ఈసారి సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి ద్వయం ఆ లోటు తీర్చే అవకాశముంది. కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించిన సాత్విక్–చిరాగ్ జోడీకి తొలి రౌండ్లో ‘బై’ లభించింది. ఇక మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్‌లో భారత్‌కు అంతగా పతకావకాశాలు లేవు. భారత ఆటగాళ్ల వివరాలు పురుషుల సింగిల్స్: లక్ష్య సేన్, శ్రీకాంత్, ప్రణయ్, సాయిప్రణీత్. మహిళల సింగిల్స్: సైనా నెహ్వాల్, మాళవిక. పురుషుల డబుల్స్: సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి, సుమీత్ రెడ్డి–మనూ అత్రి, అర్జున్–ధ్రువ్ కపిల, కృష్ణప్రసాద్–విష్ణువర్ధన్ గౌడ్. మహిళల డబుల్స్: సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప, దండు పూజ–సంజన, పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ, అశ్విని భట్–శిఖా. మిక్స్డ్ డబుల్స్: ఇషాన్–తనీషా క్రాస్టో, వెంకట్ గౌరవ్ ప్రసాద్–జూహీ దేవాంగన్. మన పతక విజేతలు.. 1983: ప్రకాశ్ పడుకోన్ (పురుషుల సింగిల్స్‌లో కాంస్యం); 2011: గుత్తా జ్వాల–అశ్విని పొన్నప్ప (మహిళల డబుల్స్‌లో కాంస్యం); 2013: సింధు (మహిళల సింగిల్స్‌లో కాంస్యం); 2014: సింధు (మహిళల సింగిల్స్‌లో కాంస్యం); 2015: సైనా (మహిళల సింగిల్స్‌లో రజతం); 2017: సింధు (మహిళల సింగిల్స్‌లో రజతం); 2017: సైనా (మహిళల సింగిల్స్‌లో కాంస్యం); 2018: సింధు (మహిళల సింగిల్స్‌లో రజతం); 2019: సింధు (మహిళల సింగిల్స్‌లో స్వర్ణం); 2019: సాయిప్రణీత్ (పురుషుల సింగిల్స్‌లో కాంస్యం); 2021: శ్రీకాంత్ (పురుషుల సింగిల్స్‌లో రజతం); 2021: లక్ష్య సేన్ (పురుషుల సింగిల్స్‌లో కాంస్యం). -
ప్రపంచ చాంపియన్‌షిప్‌పై కసరత్తు
న్యూఢిల్లీ: జపాన్‌లాంటి కోర్టుల్లో ఆడాలంటే చాలా ఓపిక కావాలని భారత స్టార్ షట్లర్ హెచ్.ఎస్.ప్రణయ్ అన్నాడు. త్వరలో అక్కడ జరగనున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ చాంపియన్‌షిప్ కోసం కసరత్తు చేస్తున్నానని చెప్పాడు. ‘నేను రెండు వారాలుగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఎప్పట్లా రొటిన్‌గానే సన్నద్ధమవుతున్నా. నా ప్రాక్టీస్‌లో తేడా ఏమీ లేదు. కానీ టోక్యోలోని బ్యాడ్మింటన్ కోర్టులు మందకొడిగా ఉంటాయి. అక్కడ ఆడాలంటే నేర్పుంటే చాలదు. చాలా ఓర్పు కావాలి. అందుకే నేను ఆటతీరులో సహనం, సంయమనంపై దృష్టిపెట్టాను’ అని అన్నాడు. ఈ నెల 22 నుంచి టోక్యోలో ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీలు జరుగనున్నాయి. స్పెయిన్‌లో జరిగిన గత మెగా ఈవెంట్లో ప్రణయ్ క్వార్టర్ ఫైనల్స్ చేరాడు. ఈ సీజన్లో నిలకడగా ఆడుతున్న అతను ర్యాంకు మెరుగుపర్చుకునే పనిలో పడ్డాడు. ‘ర్యాంకుల్లో ఎగబాకడం ఇప్పుడు అంత సులభం కాదు. ఒక్క రేటింగ్ పాయింట్ కూడా కీలకమే. నేను మళ్లీ టాప్–20 ర్యాంకుల్లోకి రావాలంటే ఒక్కో టోర్నీలో నిలకడగా క్వార్టర్స్, సెమీస్, ఫైనల్స్ చేరుతుండాలి. అప్పుడు అనుకున్న ర్యాంకుకు చేరుకోగలం’ అని అన్నాడు. ఒకానొక దశలో చక్కని ఆటతీరుతో ప్రపంచ ఎనిమిదో ర్యాంకుకు ఎగబాకిన ప్రణయ్‌ని 2020 నవంబర్‌లో కోవిడ్ దెబ్బతీసింది. మహమ్మారి అతని ప్రదర్శనపై పెను ప్రభావమే చూపింది. ఆ తర్వాత ‘గో స్పోర్ట్స్ ఫౌండేషన్’ సహకారంతో ఆరోగ్యాన్ని, తర్వాత ఫిట్నెస్ను మెల్లిగా ఆటతీరును మెరుగుపర్చుకున్నాడు. ఈ సీజన్లో ఇండోనేసియా, మలేసియా ఓపెన్లలో సెమీస్ చేరిన ప్రణయ్ స్విస్ ఓపెన్‌లో రన్నరప్‌తో తృప్తి చెందాడు. థామస్ కప్ విజయంతో ఆత్మవిశ్వాసం పెంచుకున్నాడు. అయితే పెద్ద పెద్ద ఎండార్స్మెంట్లు లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులుంటున్నాయని, మేజర్ టోర్నీల్లో గెలిస్తేనే బ్రాండింగ్ దక్కుతుందని చెప్పాడు. -
ఆఫీసులో నిద్రకు న్యాప్బాక్సెస్..
ఆఫీసులో నిద్ర వస్తోందా? అయితే భోజనం చేసిన తరువాత హాయిగా నిద్రపోవచ్చు. కాకపోతే ఇక్కడ కాదు.. జపాన్‌లో. నిద్ర పునరుత్తేజాన్నిస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. రోజంతా అధిక పనితో అలసిపోయినా... రాత్రి మంచి నిద్రతో మరునాడు ఉత్సాహంగా పనిచేస్తాం. మరి పగటిపూట అధిక పనిగంటల వల్ల అలసిపోతే..? అది ఉత్పాదకతను దెబ్బతీస్తుంది. సీఎన్‌బీసీ తాజా నివేదిక ప్రకారం.. ప్రపంచంలో అత్యధిక గంటలు పనిచేసేది జపనీయులేనట. అందుకే పది గంటలకు పైగా పనిచేయించుకునే రెండు జపాన్ కంపెనీలు పరిష్కారమార్గాన్ని కనిపెట్టాయి. నిద్రలేమితో బాధపడుతున్న తమ ఉద్యోగుల కోసం టోక్యోకి చెందిన ఫర్నిచర్ కంపెనీ ఇటోకీ, ప్లైవుడ్ కంపెనీ కొయొజు గోహన్ సంస్థలు సంయుక్తంగా న్యాప్బాక్స్ కాన్సెప్ట్‌ను తీసుకొచ్చాయి. మధ్యాహ్నం భోజనం తరువాత కొద్దిసేపు ఆ న్యాప్ బాక్సుల్లో కునుకుతీయొచ్చు. కొద్దిపాటి పవర్‌న్యాప్ తరువాత మళ్లీ కొత్త శక్తితో పనిచేయొచ్చన్నమాట. ఆహా... బెడ్ మీద హాయిగా అడ్డం ఒరిగేయొచ్చని ఆనందించకండి. అవి నిట్టనిలువునా ఉండే బాక్సెస్. వీటిని ‘కమిన్ బాక్సెస్’అంటున్నారు. ఫ్లెమింగోలాగా నిలబడే నిద్రపోవాలన్నమాట. అయితే తల, మోకాళ్లకు ఇబ్బంది లేకుండా, మనిషి పడిపోకుండా సౌకర్యవంతమైన సపోర్ట్ సిస్టమ్ ఉంటుందని చెబుతున్నారు. పనినుంచి తప్పించుకోవడానికి ఉద్యోగులు బాత్రూమ్లో ఎక్కువ సేపు గడిపేకంటే.. ఈ కమిన్ బాక్సెస్‌లో కునుకు బెటర్ అని ఇటోకి కమ్యూనికేషన్స్ డైరెక్టర్ సీకో కవాషిమా చెబుతున్నారు. అయితే... బ్లూమ్‌బర్గ్ దీన్ని ట్విట్టర్ వేదికగా పంచుకోగా... నెటిజన్లు పలు విధాలుగా స్పందిస్తున్నారు. ఆరోగ్యకరమైన పని పరిస్థితులని ఒకరు మెచ్చుకుంటే... శవపేటికలను తలపిస్తున్న వాటిలో పడుకోవడం ఊహించడానికే కష్టంగా ఉందని మరొకరు కామెంట్ చేశారు. వీటికంటే పాశ్చాత్య దేశాల్లోని స్లీపింగ్ రూమ్స్‌లా సౌకర్యవంతంగా ఏర్పాటు చేస్తే మంచిదని ఇంకొకరు సలహా ఇచ్చారు. -
దుండగుడు చంపాలనుకుంది అబేను కాదట.. కానీ!
టోక్యో: జపాన్ మాజీ ప్రధానమంత్రి షింజో అబే గురువారం దారుణ హత్యకు గురవటం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. నారా ప్రాంతంలోని రైల్వే స్టేషన్ ముందు ప్రసంగిస్తున్న సమయంలోనే దుండగుడు కాల్పులు జరిపాడు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు అబే. ఈ ఘాతుకానికి పాల్పడింది కొన్నేళ్ల క్రితం నౌకాదళంలో పని చేసిన తెత్సుయ యమగామి(41)గా గుర్తించారు పోలీసులు. అయితే.. తాను మొదట చంపాలనుకుంది అబేను కాదని పోలీసులకు తెలిపినట్లు జపాన్ మీడియాల్లో కథనాలు వెలువడ్డాయి. ఓ మత సంస్థకు చెందిన గురువును హత్య చేయాలని అనుకున్నట్లు పేర్కొన్నాయి. మత సంస్థపై తనకు కోపం ఉందని, దానితో షింజో అబేకు సంబంధాలు ఉన్నాయనే అనుమానంతోనే హత్యకు పాల్పడ్డానని పోలీసులతో చెప్పినట్లు క్యోడో న్యూస్ తెలిపింది. అబే రాజకీయ విశ్వాసలను వ్యతిరేకిస్తున్న క్రమంలో తాను నేరం చేశానని భావించటం లేదని పేర్కొన్నట్లు వెల్లడించింది. అయితే.. ఆ మత గురువు ఎవరనే విషయం తెలియరాలేదు. నౌకాదళంలో మూడేళ్లు విధులు: మీడియా కథనాల ప్రకారం.. దుండగుడు యమగామి తన హైస్కూల్ విద్య తర్వాత భవిష్యత్తులో ఏం చేయాలనే విషయంపై స్పష్టత లేదని తేలింది. తన గ్రాడ్యూయేషన్ ఇయర్ బుక్‌లో సైతం అదే రాశాడు. ప్రభుత్వ వర్గాల ప్రకారం అతడు 2005లో హిరోసిమా, క్యూర్ బేస్‌లోని నౌకాదళంలో చేరి మూడేళ్లు పని చేశాడు. 2020లో కన్సాయి ప్రాంతంలోని ఓ తయారీ సంస్థలో ఉద్యోగంలో చేరిన యమగామి.. దానిని సైతం రెండు నెలల క్రితమే మానేశాడు. అలసిపోయాననే కారణం చెప్తూ.. ఆ ఉద్యోగాన్ని వదులుకున్నాడు. దుండగుడి ఇంట్లో పేలుడు పదార్థాలు, తుపాకులు: నారా ప్రాంతంలోని అతని అపార్ట్మెంట్లో పోలీసులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. అతని ఇంటి నుంచి పేలుడు పదార్థాలు, నాటు తుపాకులు స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక మీడియాలు వెల్లడించాయి. షింజో అబే భౌతికకాయాన్ని శుక్రవారం టోక్యోకు తరలించారు. మంగళవారం అంతిమసంస్కారాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. చదవండి: షింజో అబే మృతి.. అమెరికా అధ్యక్షుడి ప్రగాఢ సంతాపం, భావోద్వేగ నోట్ -
Tokyo 2020 Paralympics: వినోద్‌కుమార్‌కు మరో భారీ షాక్!
టోక్యో పారాలింపిక్స్-2020లో డిస్కస్ త్రోలో కాంస్యం గెలిచినట్టే గెలిచి పతకాన్ని చేజార్చుకున్న భారత పారా అథ్లెట్ వినోద్ కుమార్‌కు మరో భారీ షాక్ తగిలింది. రెండేళ్ల పాటు అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనకుండా ది బోర్డ్ ఆఫ్ అప్పీల్ ఆఫ్ క్లాసిఫికేషన్(బీఏసీ) నిషేధం విధించింది. పారాలింపిక్స్‌లో డిస్కస్ త్రో ఈవెంట్ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు గానూ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆగష్టు 2023 వరకు వినోద్ కుమార్‌పై నిషేధం కొనసాగుతుందని పేర్కొంది. ఈ మేరకు.. ఉద్దేశపూర్వకంగానే నిబంధనలు ఉల్లంఘించి.. పారా అథ్లెట్‌గా క్లాసిఫికేషన్‌లో పొందుపరిచిన వివరాలకు భిన్నంగా కుమార్ వ్యవహరించాడని తన ప్రకటనలో పేర్కొంది. ఈ నేపథ్యంలో వరల్డ్ పారా అథ్లెటిక్స్ క్లాసిఫికేషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ క్రమశిక్షణా రాహిత్యం కింద అతడిపై చర్యలు చేపట్టినట్లు తెలిపింది. కాగా పారాలింపిక్స్‌లో కుమార్ ప్రవర్తనను గమనించిన తోటి పోటీదారులు అతడిపై ఫిర్యాదు చేయగా.. క్లాసిఫికేషన్‌కు విరుద్ధంగా అతడు వ్యవహరించినట్లు తేలింది. దీంతో ఎఫ్52 డిస్కస్ విభాగంలో మూడో స్థానంలో నిలిచినప్పటికీ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించినందున కాంస్య పతకాన్ని వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. అసలేం జరిగింది? పారా అథ్లెట్ల వైకల్యం రకం, తీవ్రతను బట్టి వర్గీకరణ చేస్తారు. అదే స్థాయిలో వైకల్యం ఉన్న ఇతర పారా అథ్లెట్లతో పోటీ పడేందుకు అనుమతినిస్తారు. డిస్కస్ త్రోలో ఎఫ్52 క్లాస్‌లో .. కండరాల శక్తి, వాటి కదలికల్లో అడ్డంకులు వంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటారు. తద్వారా కొంతమందికి వీల్‌చైర్‌లో కూర్చుని ఆడేందుకు అవకాశం ఇస్తారు. అయితే, ఈ విషయంలో వినోద్ కుమార్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో పారాలింపిక్స్‌లో అతడిని అనర్హుడిగా పేర్కొన్నారు. ఇప్పుడు రెండేళ్ల పాటు నిషేధం విధించారు. చదవండి: Who Is Teja Nidamanuru: అరంగేట్రంలోనే అర్థ శతకంతో మెరిసి.. ఎవరీ తేజ నిడమనూరు? -
పరస్పర విశ్వాసం, చిత్తశుద్ధి...ఇవే క్వాడ్ బలం: మోదీ
టోక్యో: పరస్పర విశ్వాసం, చిత్తశుద్ధే క్వాడ్ కూటమి బలమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇండో పసిఫిక్‌ను స్వేచ్ఛాయుత ప్రాంతంగా రూపుదిద్దడంలో ఈ నాలుగు దేశాల కూటమిది కీలక పాత్ర అంటూ ప్రశంసించారు. భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలతో కూడిన క్వాడ్ శిఖరాగ్ర సదస్సు మంగళవారం టోక్యోలో జరిగింది. కూటమిని మరింత ముందుకు తీసుకెళ్లే మార్గాలు తదితరాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా, జపాన్ ప్రధానులు అల్బనీస్, ఫుమియో కిషిడాలతో మోదీ లోతుగా చర్చించారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో క్వాడ్ నిర్మాణాత్మక పాత్ర పోషిస్తోందన్నారు. ఉగ్రవాదాన్ని క్వాడ్ శిఖరాగ్రం ముక్త కంఠంతో ఖండించింది. పాకిస్తాన్ పాల్పడ్డ ముంబై, పఠాన్‌కోట్ ఉగ్ర దాడులను తీవ్రంగా నిరసించింది. సీమాంతర దాడులకు ప్రోత్సాహాన్ని, ఉగ్రవాద తండాలకు సైనిక, ఆర్థిక, వ్యూహాత్మక మద్దతును మానుకోవాలని పాకిస్తాన్‌ను ఉద్దేశించి హితవు పలికింది. చైనా విస్తరణవాదాన్ని, పొరుగు దేశాల సరిహద్దుల్లో చొరబడుతున్న తీరును కూడా నిరసించింది. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో యథాతథ స్థితిని మార్చేందుకు, ఉద్రిక్తతలను పెంచేందుకు జరుగుతున్న ఏకపక్ష ప్రయత్నాలను, కవ్వి ంపు చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు పేర్కొంది. క్వాడ్ నేతలు ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. అనంతరం కిషిడా, అల్బనీస్‌లతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. పరస్పర బంధాలను బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. పుతిన్‌పై బైడెన్ నిప్పులు ఉక్రెయిన్‌పై ఆటవిక యుద్ధానికి తెరతీసి కనీవినీ ఎరగని మానవ సంక్షోభానికి కారకుడయ్యారంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై బైడెన్ మండిపడ్డారు. కిషిడా కూడా రష్యా తీరును తీవ్రంగా నిరసించారు. మోదీ మాత్రం దీనిపై వ్యూహాత్మక మౌనం పాటించారు. సభ్య దేశాల మధ్య ఈ సందర్భంగా పలు ఒప్పందాలు కుదిరాయి. సభ్య దేశాల సముద్ర జలాల పరిరక్షణను పరిపుష్టం చేసేందుకు, చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు ఇండో–పసిఫిక్ మారిటైం డొమైన్ అవేర్నెస్ (ఐపీఎండీఏ) ఏర్పాటు విపత్తుల సమర్థ నిర్వహణకు హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ (హెచ్ఏడీఆర్) ఏర్పాటు వాతావరణ మార్పుల సమస్యను దీటుగా ఎదు ర్కొనేందుకు క్వాడ్ క్లైమేట్ చేంజ్ అడాప్టేషన్ అం డ్ మిటిగేషన్ ప్యాకేజీ (క్యూ–చాంప్) ఏర్పాటు. -
క్వాడ్ నేతల మూడో శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ
-
క్వాడ్.. మంచి కోసం ఓ శక్తి: ప్రధాని మోదీ
టోక్యో: క్వాడ్ సభ్య దేశాల పరస్పర విశ్వాసం, సంకల్పం ప్రజాస్వామ్య శక్తులకు కొత్త శక్తిని మరియు ఉత్సాహాన్ని ఇస్తోందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. క్వాడ్ అనేది మంచి కోసం పుట్టుకొచ్చిన ఒక శక్తి అని, అది ఇండో-పసిఫిక్‌ను మెరుగుపరుస్తుందని అభివర్ణించారు. మంగళవారం టోక్యో వేదికగా క్వాడ్ నేతల సమావేశం జరిగింది. భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా, ఆస్ట్రేలియా నూతన ప్రధాని ఆంటోనీ అల్బనీస్ ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. క్వాడ్ సభ్య దేశాల పరస్పర విశ్వాసం, సంకల్పం ప్రజాస్వామ్య శక్తులకు కొత్త శక్తిని మరియు ఉత్సాహాన్ని ఇస్తోందని అన్నారు. క్వాడ్ తక్కువ వ్యవధిలో ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకుందని, ఇండో-పసిఫిక్‌లో శాంతిని నిర్ధారించిందని పేర్కొన్నారు. ముఖ్యంగా కరోనా కష్టకాలంలో సభ్యదేశాల మధ్య.. వ్యాక్సిన్ పంపిణీ, క్లైమేట్ యాక్షన్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఆర్థిక తోడ్పాటుతో పరస్పర సహకారం మరింతగా వృద్ధి చెందిందని మోదీ పేర్కొన్నారు. అంతేకాదు.. ప్రమాణం చేసిన కొన్ని గంటలకే క్వాడ్ సదస్సుకు హాజరైన ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్‌ను ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందించారు. సదస్సుకు ముందు.. బైడెన్, కిషిదా, అల్బనీస్‌లతో విడివిడిగా భేటీ అయ్యి ద్వైపాకక్షిక సంబంధాల గురించి చర్చించారు ప్రధాని మోదీ. మార్చి 2021లో వర్చువల్‌గా క్వాడ్ నేతల మధ్య భేటీ జరగ్గా.. సెప్టెంబర్ 2021 వాషింగ్టన్ డీసీలో ఇన్ పర్సన్, మార్చి 2022లో వర్చువల్ మీటింగ్ జరగ్గా.. ఇప్పుడు టోక్యో వేదికగా జరుగుతున్న సమావేశం నాలుగవది. -
12 దేశాల భాగస్వామ్యంతో... ఐపీఈఎఫ్
టోక్యో: కరోనా, ఉక్రెయిన్ యుద్ధ ప్రభావాల నుంచి బయట పడి ఆర్థికంగా మరింత బలోపేతం కావడంతో పాటు చైనాకు చెక్ పెట్టే లక్ష్యంతో 12 ఇండో పసిఫిక్ దేశాల మధ్య ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ (ఐపీఈఎఫ్) పేరిట సరికొత్త వర్తక ఒప్పందం కుదిరింది. ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ పీఎం ఫుమియో కిషిడాతో కలిసి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం ఈ మేరకు ప్రకటన చేశారు. ఐపీఈఎఫ్‌లో భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియా, న్యూజిలాండ్, మలేసియా, ఫిలిప్పీన్స్, వియత్నాం, థాయ్‌లాండ్, సింగపూర్, బ్రూనై భాగస్వాములు. భావి సవాళ్లను కలసికట్టుగా ఎదుర్కొనేందుకు ఐపీఈఎఫ్ దోహదపడుతుందంటూ ఈ 12 దేశాలూ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఈ సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ, ‘‘21వ శతాబ్దపు ఆర్థిక వ్యవస్థను శాసించేది ఇండో పసిఫిక్ ప్రాంతమే. సగానికి పైగా ప్రపంచ జనాభాకు, 60 శాతానికి పైగా ప్రపంచ జీడీపీకి ఈ ప్రాంతం ప్రాతినిధ్యం వహిస్తోంది. అందుకే తాజా ఒప్పందానికి ఎంతో ప్రాధాన్యముంది’’ అని అన్నారు. ఐపీఈఎఫ్‌లో మున్ముందు మరిన్ని దేశాలు భాగస్వాములు అవుతాయన్నారు. సరఫరా వ్యవస్థ, డిజిటల్ వర్తకం, స్వచ్ఛ ఇంధనం, ఉద్యోగుల భద్రత, అవినీతి నిరోధం తదితర రంగాల్లో సభ్య దేశాలన్నీ మరింత సన్నిహితంగా కలిసి పని చేసేందుకు ఐపీఈఎఫ్ వీలు కల్పిస్తుందని వైట్‌హౌస్ ఒక ప్రకటనలో పేర్కొంది. దీని స్వరూప స్వభావాలపై అక్టోబర్‌కల్లా స్పష్టత వస్తుందని తెలిపింది. చైనాను రెచ్చగొట్టొద్దనే ఉద్దేశంతో ప్రస్తుతానికి తైవాన్ను ఐపీఈఎఫ్‌లో భాగస్వామిగా చేసుకోకపోయినా ఆ దేశంతో సన్నిహిత ద్వైపాక్షిక ఆర్థిక బంధం కొనసాగుతుందని అమెరికా ప్రకటించింది. మూడు ‘టి’లే మూలస్తంభాలు: మోదీ ప్రపంచ ఆర్థిక వృద్ధికి ఇండో–పసిఫిక్‌ను ప్రధాన చోదక శక్తిగా మార్చేందుకు ఐపీఈఎఫ్ భాగస్వామిగా భారత్ కృషి చేస్తుందని మోదీ ప్రకటించారు. ఈ ప్రాంతంలో శాంతి, సౌభాగ్యాలు నెలకొనాలన్న సభ్య దేశాల ఉమ్మడి ఆకాంక్షలకు, ఆర్థిక సవాళ్లను అధిగమించాలన్న సమిష్టి సంకల్పానికి ఐపీఈఎఫ్ ప్రతిరూపమన్నారు. ఇలాంటి భాగస్వామ్యానికి రూపమిచ్చినందుకు బైడెన్‌కు కృతజ్ఞతలన్నారు. ‘‘నిర్మాణ, ఆర్థిక కార్యకలాపాలకు, అంతర్జాతీయ వర్తక, పెట్టుబడులకు ఇండో పసిఫిక్ ప్రాంతం ప్రధాన కేంద్రం. ఈ ప్రాంతంలో వర్తక కార్యకలాపాలకు భారత్ ప్రధాన కేంద్రం. ఇందుకు చరిత్రే సాక్షి’’ అని చెప్పారు. ప్రపంచంలోనే అతి పురాతన వాణిజ్య నౌకాశ్రయం గుజరాత్‌లోని లోథాల్లో ఉందని గుర్తు చేశారు. ఒప్పందంలో భాగంగా సభ్య దేశాల మధ్య నెలకొనబోయే కీలక సరఫరా వ్యవస్థలకు ట్రస్ట్ (నమ్మకం), ట్రాన్స్పరెన్సీ (పారదర్శకత), టైమ్లీనెస్ (సమయపాలన) అనే మూడు ‘టి’లు మూల స్తంభాలుగా నిలవాలని పిలుపునిచ్చారు. విఫల యత్నమే: చైనా భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా ఇండో పసిఫిక్ భాగస్వామ్యంపై చైనా మరోసారి అక్కసు వెలిగక్కింది. 12 ఇండో పసిఫిక్ దేశాల భాగస్వామ్యంతో తాజాగా తెరపైకి వచ్చిన ఐపీఈఎఫ్ విఫలయత్నంగా మిగిలిపోతుందని జోస్యం చెప్పింది. వీటి ముసుగులో ఇండో పసిఫిక్‌లో సైనిక స్థావరాల ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించింది. వాటిని అడ్డుకోవాలని ఇండో పసిఫిక్ దేశాలకు పిలుపునిచ్చింది. భారత్ చలో.. భారత్ సే జుడో జపాన్ ఎన్నారైలకు మోదీ పిలుపు భారత్, జపాన్ సహజ భాగస్వాములని ప్రధాని మోదీ అన్నారు. భారత అభివృద్ధి యాత్రలో జపాన్ పెట్టుబడులు ప్రధాన పాత్ర పోషించాయన్నారు. ముంబై–అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్, ఢిల్లీ–ముంబై ఇండస్ట్రియల్ కారిడార్, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ల వంటివి ఇరు దేశాల పరస్పర సహకారానికి నిదర్శనాలని చెప్పారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం జపాన్‌లోని ఎన్నారైలతో టోక్యోలో ఆయన భేటీ అయ్యారు. ‘భారత్ చలో, భారత్ సే జుడో’ ఉద్యమంలో భాగస్వాములు కావాల్సిందిగా పిలుపునిచ్చారు. అరాచకం, ఉగ్రవాదం, వాతావరణ మార్పుల వంటి సవాళ్లను అధిగమించేందుకు బుద్ధుని బాటే ఆదర్శమన్నారు. ప్రతి భారతీయుడూ జీవితంలో ఒక్కసారైనా జపాన్ సందర్శించాలని అప్పట్లో స్వామి వివేకానంద అన్నారు. ప్రతి జపాన్ పౌరుడూ ఒక్కసారైనా భారత్ సందర్శించాలని నేనంటున్నా’’ అని చెప్పారు. మంగళవారం ఆయన క్వాడ్ శిఖరాగ్రంలో పాల్గొనడంతో క్వాడ్ దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. -
భారత్‌లో మరింత ఇన్వెస్ట్ చేయండి
టోక్యో: అపార వ్యాపార అవకాశాలు ఉన్న భారత్‌లో మరింతగా ఇన్వెస్ట్ చేయాలంటూ జపాన్ కార్పొరేట్లను ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించారు. భారతదేశ అభివృద్ధి ప్రస్థానంలో జపాన్‌ది చాలా కీలకపాత్ర అని ఆయన పేర్కొన్నారు. దీన్ని పురస్కరించుకుని ’జపాన్ వారోత్సవాల’ను నిర్వహించడంపై ప్రధాని ప్రతిపాదన చేశారు. జపాన్ పర్యటనలో భాగంగా వ్యాపార దిగ్గజాలతో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ప్రధాని పాల్గొన్నారు. 34 సంస్థల సీఈవోలు, టాప్ ఎగ్జిక్యూటివ్‌లు దీనికి హాజరయ్యారు. ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, ఉక్కు, టెక్నాలజీ, ట్రేడింగ్, బ్యాంకింగ్, ఫైనాన్స్ తదితర రంగాల కంపెనీల ప్రతినిధులు వీరిలో ఉన్నట్లు ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. జపాన్ కంపెనీలు భారత్‌లో మరింతగా ఇన్వెస్ట్ చేయాలని మోదీ ఈ సందర్భంగా ఆహ్వానించినట్లు వివరించింది. ‘టాప్ వ్యాపార సంస్థల సీఈవోలతో భేటీ అయ్యాను. భారత్‌లో పుష్కలంగా ఉన్న పెట్టుబడి అవకాశాల గురించి వివరించాను‘ అని ప్రధాని ఒక ట్వీట్లో పేర్కొన్నారు. హోండా, సుజుకీ, టయోటా వంటి ఆటోమొబైల్ సంస్థలు, సుమిటోమో కెమికల్, ఫ్యుజిత్సు, నిప్పన్ స్టీల్ కార్పొరేషన్, మిత్సుబిషి కార్పొరేషన్ తదితర సంస్థల ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొన్నారు. చాలామటుకు కంపెనీలకు భారత్‌లో పెట్టుబడులు, కార్యకలాపాలు ఉన్నాయి. రికార్డు స్థాయిలో ఎఫ్‌డీఐలు.. భారత్, జపాన్ సహజమైన భాగస్వాములని సమావేశం సందర్భంగా ప్రధాని చెప్పారు. భారత్–జపాన్ సంబంధాలు బలోపేతం అయ్యేందుకు వ్యాపార వర్గాలు బ్రాండ్ అంబాసిడర్ల పాత్ర పోషిస్తున్నారని ఆయన ప్రశంసించారు. గత ఆర్థిక సంవత్సరంలో (2021–22) అంతర్జాతీయంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) మందగించినా, భారత్‌లోకి రికార్డు స్థాయిలో 84 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్లు వచ్చాయని ప్రధాని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా చెప్పారు. భారత ఆర్థిక వృద్ధి సత్తాపై ఇన్వెస్టర్లకు ఉన్న ధీమాకు ఇది నిదర్శనమని ఆయన తెలిపారు. ఈ ఏడాది మార్చిలో జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా భారత పర్యటన సందర్భంగా ద్వైపాక్షిక పెట్టుబడులను వచ్చే అయిదేళ్లలో 5 లక్షల కోట్ల ఎన్ల స్థాయికి పెంచుకోవాలని ఇరు దేశాలు నిర్దేశించుకున్నాయని ప్రధాని చెప్పారు. ఇటీవలి కాలంలో ఇండియా–జపాన్ ఇండస్ట్రియల్ కాంపిటీటివ్నెస్ పార్ట్నర్షిప్ (ఐజేఐసీపీ), క్లీన్ ఎనర్జీ పార్ట్నర్షిప్ మొదలైన ఒప్పందాలు కుదిరాయని పేర్కొన్నారు. -
‘బీ కేర్‌ఫుల్’.. చైనాకు జో బైడెన్ స్ట్రాంగ్ వార్నింగ్
Joe Biden Serious Warning to China on Taiwan: ఉక్రెయిన్‌లో రష్యా దాడులు కొనసాగుతున్న వేళ డ్రాగన్ కంట్రీ చైనాకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ తైవాన్ను చైనా ఆక్రమించుకోవాలని చూస్తే ‘ప్రమాదంతో ఆటలాడుకున్నట్టే’ అంటూ బైడెన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆసియా దేశాల పర్యటనలో భాగంగా అగ్ర రాజ్యం అధ్యక్షుడు బైడెన్ సోమవారం జపాన్ రాజధాని టోక్యో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ సమావేశంలో బైడెన్ మాట్లాడుతూ.. వన్ చైనా పాలసీని తాము అంగీకరిస్తామని, ఆ ఒప్పందంపై సంతకం కూడా చేశామని చెప్పారు. ఈ క్రమంలోనే చైనా.. తైవాన్ను బలవంతంగా ఆక్రమించాలని చూస్తే.. తాము(అమెరికా) సైనికపరంగా చైనాను అడ్డుకుంటుదని హెచ్చరించారు. తైవాన్ను ఆక్రమించే న్యాయపరమైన హక్కు చైనాకు లేదని బైడెన్ తెలిపారు. ఇక, తైవాన్ విషయంలో చైనా ఏదైనా కవ్వింపు చర్యలకు పాల్పడితే ఉక్రెయిన్‌లో ఏం జరిగిందో తెలుసుకోవాలని బైడెన్ హితవు పలికారు. కఠిన చర్యలు తీసుకుంటామని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌లో జరుగుతున్న అకృత్యాలకు పుతిన్ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. రష్యా సుదీర్ఘకాలం ఆ మూల్యాన్ని చెల్లించుకుంటుందని పేర్కొన్నారు. అయితే, ఉక్రెయిన్‌లో రష్యా దాడులు చేస్తున్న సమయంలో చైనాకు పుతిన్‌కు ప్రత్యక్షంగా సపోర్ట్ చేసిన విషయం తెలిసిందే. రష్యాకు ఆర్థికంగా, ఆయుధాలను కూడా అందించినట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. VIDEO: President Joe Biden says United States would defend Taiwan militarily if Beijing invaded the self-ruled island. "That's the commitment we made... We agreed with the One China policy, we signed on to it... but the idea that it can be taken by force is just not appropriate" pic.twitter.com/gWkmj2y7d9 — AFP News Agency (@AFP) May 23, 2022 ఇది కూడా చదవండి: భారత్ సహా 16 దేశాలపై ట్రావెల్ బ్యాన్, ఎందుకంటే.. -
నిర్ణయాల పురోగతిని సమీక్షిస్తాం
న్యూఢిల్లీ: క్వాడ్ కూటమి ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాల అమలు పురోగతిని టోక్యో శిఖరాగ్ర సమావేశాల్లో సమీక్షిస్తామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. సభ్య దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటామని చెప్పారు. ఈ నెల 23, 24వ తేదీల్లో జపాన్‌లో జరగనున్న క్వాడ్ శిఖరాగ్ర భేటీకి బయలుదేరే ముందు ప్రధాని ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయా దేశాల నేతల రెండో ముఖాముఖి భేటీలో ఇండో–పసిఫిక్ ప్రాంతంతోపాటు, పరస్పరం ఆసక్తి ఉన్న ఇతర అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలను పంచుకుంటామన్నారు. జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా ఆహ్వానం మేరకు టోక్యో వెళ్తున్నానన్నారు. ఇండో–జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా కిషిడాతో చర్చలుంటాయని ప్రధాని వెల్లడించారు. ఆస్ట్రేలియా నూతన ప్రధాని అంటోనీ అల్బనీస్ కూడా మొదటిసారిగా ఈ సమావేశానికి వస్తున్నారని చెప్పారు. భారత్–ఆస్ట్రేలియా మధ్య బహుళ రంగాల్లో సహకారాన్ని విస్తరించుకోవడంపై, పరస్పరం ఆసక్తి ఉన్న అంశాలపైనా చర్చలు జరుపుతామన్నారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనా విస్తరణ వాదానికి అడ్డుకట్ట వేయడమేలక్ష్యంగా ఏర్పడిన క్వాడ్‌లో భారత్‌తోపాటు జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా ఉన్నాయి. బైడెన్‌తో నిర్మాణాత్మక చర్చలు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో జరిగే సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తరించుకోవడంతోపాటు, ప్రాంతీయ, వర్తమాన అంతరా>్జతీయ పరిణామాలపైనా చర్చిస్తామని ప్రధాని మోదీ చెప్పారు. ఎటువంటి దాపరికాలు లేకుండా, నిర్మాణాత్మకంగా ఈ చర్చలు ఉంటాయన్నారు. రష్యా–ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో రష్యాపై తీవ్ర చర్యలు తీసుకోవాలన్న అమెరికా వైఖరిని జపాన్, ఆస్ట్రేలియా బలపరుస్తుండగా, సమస్యకు శాంతియుత పరిష్కారం కనుగొనాలని భారత్ గట్టిగా కోరుతోంది. -
ప్రధాని మోదీ జపాన్ టూర్: 40 గంటల్లో 23 కార్యక్రమాలు
న్యూఢిల్లీ: జపాన్‌లోని టోక్యోలో ఈ నెల 24న జరగనున్న క్వాడ్ సదస్సుకు వెళ్లనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిజీ బిజీగా గడపనున్నారు. జపాన్‌లో 40 గంటల సేపు ఉండనున్న ఆయన మూడు దేశాల నేతలతో భేటీ సహా 23 కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా, ఆస్ట్రేలియా ప్రధానితో విడివిడిగా చర్చలు జరుపుతారు. మోదీ పర్యటనలో పారిశ్రామికవేత్తలు, దౌత్యవేత్తలు, వివిధ వర్గాల వారితో చర్చలు జరుపుతారు. జపాన్‌కు చెందిన 36 మంది సీఈవోలతో సమావేశమవుతారని, భారత సంతతికి చెందిన వారితో కూడా మాట్లాడతారని అధికార వర్గాలు వెల్లడించాయి. -
లక్ష్యం చేరలేదు..!
బర్మింగ్‌హామ్: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ గెలిచిన మూడో భారతీయుడిగా నిలవాలని ఆశించిన భారత యువతార లక్ష్య సేన్‌కు నిరాశే ఎదురైంది. టైటిల్ సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన లక్ష్య సేన్ బలమైన ప్రత్యర్థి ముందు నిలవలేక ఓటమి పాలయ్యాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో వరల్డ్ నంబర్‌వన్, టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్) 21–10, 21–15 స్కోరుతో లక్ష్య సేన్‌పై విజయం సాధించి రెండోసారి ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టైటిల్ సాధించాడు. 2020లోనూ అక్సెల్సన్ ఈ టోర్నీలో విజేతగా నిలిచాడు. 53 నిమిషాల పాటు సాగిన ఫైనల్లో కొన్నిసార్లు లక్ష్య సేన్ దీటుగా పోరాడినా తుది ఫలితం మాత్రం ప్రతికూలంగా వచ్చింది. గత ఏడాది ఇదే టోర్నీ ఫైనల్లో అనూహ్యంగా ఓటమి పాలై రన్నరప్‌గా సంతృప్తి చెందిన అక్సెల్సన్ ఈసారి తన స్థాయికి తగ్గ ఆటతో చాంపియన్ అయ్యాడు. విజేత అక్సెల్సన్కు 70 వేల డాలర్లు (రూ. 53 లక్షల 17 వేలు), రన్నరప్ లక్ష్య సేన్‌కు 34 వేల డాలర్లు (రూ. 25 లక్షల 83 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. సుదీర్ఘ ర్యాలీలతో... ఫైనల్ పోరుకు ముందు అక్సెల్సన్తో ముఖాముఖి సమరాల్లో లక్ష్య 1–4తో వెనుకంజలో ఉన్నాడు. అయితే ఆ ఒక్క విజయం ఎనిమిది రోజుల ముందే జర్మన్ ఓపెన్‌లో సెమీఫైనల్లో వచ్చింది. దాంతో ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్న సేన్‌పై అంచనాలు కూడా ఏర్పడ్డాయి. అయితే విక్టర్ ఆరంభంలోనే సేన్‌ను దెబ్బ కొట్టాడు. వరుస పాయింట్లతో దూసుకుపోయిన అతను 6–0తో ముందంజలో నిలిచిన తర్వాత గానీ లక్ష్య తొలి పాయింట్ సాధించలేకపోయాడు. తొలి గేమ్ మొత్తం దాదాపు ఇదే తరహాలో సాగింది. అక్సెల్సన్ ఆధిపత్యం ముందు సేన్ జవాబివ్వలేకపోయాడు. 2–8 వద్ద 61 షాట్ల ర్యాలీ కూడా రావడంతో సేన్ బాగా అలసిపోయాడు. చక్కటి డిఫెన్స్ ప్రదర్శిస్తూ 11–2తో ముందంజ వేసిన డానిష్ ఆటగాడు దానిని కొనసాగిస్తూ అలవోకగా తొలి గేమ్‌ను గెలుచుకున్నాడు. రెండో గేమ్‌లో సేన్ కొంత పోటీనిచ్చాడు. ముఖ్యంగా అతని స్మాష్‌లు మంచి ఫలితాలనిచ్చాయి. అయితే 4–4తో సమంగా ఉన్న స్థితి నుంచి అక్సెల్సన్ 11–5 వరకు తీసుకుపోగా, విరామం తర్వాత కోలుకొని వరుసగా మూడు పాయింట్లు సాధించి సేన్ 9–12తో అంతరాన్ని తగ్గించాడు. ఈ దశలో విక్టర్ మళ్లీ చెలరేగి 10–17తో ఆధిక్యంలో నిలిచాడు. ఈ సమయంలో ఇద్దరు హోరాహోరీగా తలపడుతూ 70 షాట్ల ర్యాలీ ఆడగా, సేన్‌కు పాయింట్ దక్కి స్కోరు 11–17కు చేరింది. అయితే చివర్లో లక్ష్య మూడు మ్యాచ్ పాయింట్లు కాపాడుకున్నా... అప్పటికే ఆలస్యమైపోయింది. అనుభవలేమి, ఒత్తిడిలో ఓటమి పాలైనా... వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచిన తర్వాత ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలవడం 20 ఏళ్ల లక్ష్య సేన్ కెరీర్‌కు కొత్త ఉత్సాహాన్నిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. -
కిల్లింగ్ స్టోన్: ఆ రాయిని తాకిన అందరూ చనిపోయారు.. ఈ మధ్యే..
అది జపాన్‌లోని టోక్యోకు ఉత్తరం వైపున్న టొచిగి పర్వత ప్రాంతం.. అక్కడి కొండల మధ్యలో ఓ రాయి.. ఏముందీ కొండల్లో ఉండేవి రాళ్లే కదా అంటారా.. కానీ ఇది చాలా స్పెషల్. ఇప్పుడు అప్పుడు అని కాదు.. దాదాపు వెయ్యేళ్లనాటి చరిత్ర ముడిపడి ఉన్న ఈ రాయి మాత్రం జపాన్‌లో జనాలను వణికించేస్తోంది. రాయి ఏమిటి, వణికించడం ఏమిటో తెలుసా? జపాన్ పురాణాల్లోని ఓ గాథ ఈ రాయి ఏమిటో చెప్తుంది. 1107–1123 సంవత్సరాల మధ్య జపాన్ను పాలించిన టోబా చక్రవర్తిని కొందరు కుట్ర చేసి చంపేశారు. అందులో ముఖ్యమైనది టమామో నోమీ అనే ఓ మహిళా మంత్రగత్తె. అయితే చక్రవర్తి మరణించాక ఓ యుద్ధవీరుడు టమామోను చంపేయగా.. వెంటనే ఆమె మృతదేహం ఓ పెద్ద రాయిగా మారిపోయిందట. ఆ రాయిని ఎవరు తాకినా చనిపోయేవారట. అప్పటి నుంచీ ఆ రాయిని ‘సెషో సెకి (కిల్లింగ్ స్టోన్) అని పిలవడం మొదలుపెట్టారు. మంత్రగత్తె ఆత్మ అందులోనే బందీ అయి ఉందని భావించేవారు. ఈ రాయి ఈ మధ్యే రెండుగా విరిగిపోయింది దీంతో ఆ దెయ్యపు మంత్రగత్తె బయటికి వచ్చేసిందంటూ.. అక్కడి జనాలు బెంబేలెత్తుతున్నారు. ఇది అక్కడి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. The Sessho-seki, a famous rock in Nasu, Japan that was said to have imprisoned the evil nine-tailed fox demoness Tamamo-no-Mae, was found broken in half. After nearly 1,000 years, the demon vixen is presumably once again on the loose. https://t.co/Fz3yRLy4qQ — Nick Kapur (@nick_kapur) March 6, 2022 వెయ్యేళ్ల తర్వాత దెయ్యం బయటికి వచ్చేసిందని కొందరు అంటుంటే.. రాయి మధ్యలోంచి ఏదో బయటికి వచ్చినట్టుగా పగిలిందంటూ మరికొందరు సాక్ష్యం చూపుతున్నారు. ఏదో కీడు జరుగుతుందేమో అంటూ ఇంకొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ రాయికి కొన్నేళ్ల కిందే పగుళ్లు వచ్చాయని, ఇటీవలి భారీ వర్షాలతో నీటి ప్రవాహం దెబ్బకు రాయి విరిగి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. చిత్రమేమిటంటే.. ఈ రాయి ఉన్న చోటు ఓ పర్యాటక ప్రాంతం. ఇన్నాళ్లూ జనం బాగానే పోటెత్తేవారు. రాయి విరిగిందని తెలిసినప్పటి నుంచి అటువైపు చూడటమే మానేశారు. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
అద్భుతం.. యంత్రజాలం (ఫొటోలు)
-
ఉద్యోగుల కోసం క్యాబిన్లు, ఇకపై ట్రైన్లలో ఆఫీస్ వర్క్ చేసుకోవచ్చు
ప్రపంచ దేశాల్లో టెక్నాలజీతో పాటు అన్నీ రంగాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇంధన వాహనల నుంచి ఎలక్ట్రిక్ వెహికల్స్ వరకు, వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి హైబ్రిడ్ వర్క్ కల్చర్ మారుతుంది. తాజాగా జపాన్ దేశం మరో అడుగు ముందుకు వేసింది. ఉద్యోగులు ఆఫీస్ వర్క్ చేసేందుకు వీలుగా ఈస్ట్ జపాన్ రైల్వే సంస్థతో కలిసి 'ఆఫీస్ కార్స్'ను లాంఛ్ చేసింది. ఇప్పుడు ఈ బుల్లెట్ రైళ్లు కార్పొరేట్ ఆఫీసుల్ని తలపిస్తున్నాయి. ట్రైన్లలో ఆఫీస్ క్యాబిన్లు జపాన్ ప్రభుత్వం షింకన్సెన్ బుల్లెట్ ట్రైన్ మార్గంలో ఈ ఆఫీస్ కార్లును ప్రారంభించింది. దేశ రాజధాని టోక్యోతో పాటు దేశంలోని నార్తన్, సెంట్రల్ భాగాలను కలుపుతూ సేవల్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ ఆఫీస్ కార్స్లో అదనపు ఛార్జీలు లేకుండా ఉద్యోగులు ఆఫీస్ పనులు చేసుకోవచ్చు. ఇందుకోసం ట్రైన్లో ప్రత్యేకంగా ఉద్యోగుల కోసం క్యాబిన్లను ఏర్పాటు చేసింది. ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు. ఆఫీస్‌లో జరిగే వర్చువల్ మీటింగ్స్ సైతం పాల్గొనేలా సదుపాయాల్ని అందుబాటులోకి తెచ్చినట్లు జపాన్ మీడియా 'జిన్హువా' తన కథనంలో పేర్కొంది. ఉద్యోగుల కోసం స్మార్ట్ గ్లాసెస్ ఈ ఆఫీస్ కార్స్లో ఉద్యోగులు తమ ల్యాప్‌టాప్ స్క్రీన్లను దగ్గరగా మరింత ఆసక్తికరంగా చూసేందుకు స్మార్ట్ గ్లాసెస్‌ను వినియోగించుకోవచ్చు. 'తోహోకు' బుల్లెట్ ట్రైన్ మార్గంలో బుల్లెట్ రైళ్లలో సీట్ల చుట్టూ చిన్న డివైడర్లను ఉద్యోగులు ఉచితంగా ఉపయోగించవచ్చు. అయితే జపాన్ తెచ్చిన ఈ ఆఫీస్ కల్చర్‌ను వినియోగించుకునేందుకు ఉద్యోగుల తాకిడి ఎక్కువైంది. వారిని కట్టడి చేసేందుకు వీకెండ్స్ తో పాటు కొన్ని గవర్నమెంట్ హాలిడేస్‌లో వర్క్‌స్పేస్ సేవల్ని నిలిపివేస్తూ జపాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కోవిడ్ కారణంగా తగ్గిన వ్యాపార ప్రకటనల డిమాండ్‌ను పెంచేందుకు ఈ ఆన్లైన్ వర్క్ కల్చర్ తోడ్పడుతుందని ఈస్ట్ జపాన్ రైల్వే భావిస్తున్నాయి. కాగా ,సెంట్రల్ జపాన్ రైల్వే , వెస్ట్ జపాన్ రైల్వే సైతం అక్టోబర్ నుండి ప్రధాన నగరాల గుండా నడిచే రైళ్లలో ఆన్‌బోర్డ్ వర్క్‌స్పేస్‌లను ప్రవేశపెట్టేందుకు ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. -
రాచరికపు హోదా వదులుకొని... ప్రేమను గెలిపించుకుంది
ప్రేమ దేశం యువరాణి పూతప్రాయం విరబోణి ఏరికోరి మెచ్చావే ఈ తోట రాముణ్ణి అని అంటూ సినిమాల్లోనే కోటలో రాజకుమారి తోటలో సామాన్యుడిని పెళ్లి చేసుకోవడం చూశాం. కానీ ఇక్కడ నిజజీవితంలో జపాన్ యువరాణి మాకో తాను ప్రేమించినవాడితో జీవితాన్ని పంచుకోవడం కోసం అన్నీ వదులుకొని సామాన్యురాలిగా మారిపోయింది. డబ్బుని, విలాసవంతమైన జీవితాన్ని, రాచరిక హోదాని వదులుకొని అత్యంత నిరాడంబరంగా ప్రేమికుడు కీశాన్ కొమురొని పెళ్లాడింది. వారిద్దరి వివాహ ధ్రువీకరణ పత్రాన్ని రాజభవనం అధికారులు మంగళవారం అధికారికంగా విడుదల చేశారు. రాజభరణాన్ని తిరస్కరించి.. జపాన్ రాచరిక చట్టాల ప్రకారం అమ్మాయిలు సామాన్యుల్ని పెళ్లి చేసుకుంటే రాణీవాసాన్ని, రాజభోగాల్ని వదులుకోవాలి. అందు కోసం రాజభరణం కింద 14 కోట్ల యెన్లు (దాదాపుగా రూ 9.30 కోట్లు) చెల్లిస్తారు. కానీ మాకో తమ ప్రేమ ముందు అన్నీ తృణప్రాయంగా భావించింది. రాజభరణాన్ని తిరస్కరించి కట్టుబట్టలతో రాజప్రసాదాన్ని వీడింది. రెండో ప్రపంచయుద్ధం తర్వాత రాజభరణాన్ని వద్దనుకొని సామాన్యుడి వెంట అడుగులు వేసిన యువరాణి మాకో ఒక్కరే. కొమురొ, మాకో జంట అమెరికాలోని న్యూయార్క్‌లో తమ భావి జీవితాన్ని గడపనున్నారు. న్యూయార్క్‌లో కొమురొ లాయర్ వృత్తిలో ఉన్నారు. వీరిద్దరినీ ఇప్పుడు బ్రిటన్ రాచరిక జంట ప్రిన్స్ హ్యారీ, మేఘాన్ మార్కెల్లతో పోలుస్తున్నారు. అతనో పెన్నిధి దేశం విడిచి వెళ్లే ముందు కొత్త జంట మీడియాతో మాట్లాడారు. కొమురొ వెలకట్టలేని ఒక పెన్నిధి అని, తమ మనసులు మరింతగా పెనవేసుకొని జీవితాంతం ఆనందంగా గడపడానికే ఈ పెళ్లిచేసుకున్నామని మాకో చెప్పారు. మరోవైపు కొమురొ కూడా మాకోపై అంతే ప్రేమను కురిపించారు. ‘‘మాకోని నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను. ఈ జీవితం ఒక్కటే. ఇది ఆమె ప్రేమలోనే గడిపేస్తాను’’అని భావోద్వేగంతో చెప్పారు. కష్టమైనా, సుఖమైనా కలిసి పంచుకుంటూ, ఒకరికొకరు తోడు నీడగా ఉంటామన్నారు. – టోక్యో ఆది నుంచి వివాదాలే కోటలో యువరాణి మనసిచ్చిన సామాన్యుడ్ని మనువాడడం అంత సులభం కాదు. వీరి జీవితంలోనూ సినిమాల్లో చూపించే మలుపులు, వివాదాలు ఎన్నో ముసురుకున్నాయి. జపాన్ చక్రవర్తి నరుహితోకు మేనకోడలైన మాకో , టోక్యోలోని ఇంటర్నేషనల్ క్రిస్టియన్ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు కొమురొ క్లాస్మేట్. అలా వారిద్దరి పరిచయం ప్రేమగా మారింది. 2017 సెప్టెంబర్‌లోనే వారిద్దరూ తాము ప్రేమలో ఉన్నామని ప్రకటించారు. ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. అయితే కొమురొ తల్లితో వచ్చిన ఒక ఆర్థికపరమైన వివాదం కారణంగా అప్పట్లో వారి వివాహం ఆగిపోయింది. కొమురొ తల్లి ఆమె మాజీ ప్రియుడి నుంచి డబ్బులు తీసుకొని ఎగవేశారన్న ఆరోపణలున్నాయి. కొమురొ, మాకో పెళ్లికి ఆ ఆరోపణలతో సంబంధం లేదని రాజకుటుంబం అప్పట్లోనే ప్రకటించింది. అప్పట్నుంచి మీడియాలో వారిద్దరి ప్రేమపై లెక్కలేనన్ని కథనాలు వచ్చాయి. కొమురొ యువరాణికి తగిన జోడీ కాదని మీడియాలో హోరెత్తిపోయింది. ప్రజలు కూడా యువరాణి ప్రేమని మెచ్చలేదు. ఆ స్థాయిలో వ్యతిరేకతను తట్టుకోలేక మాకో మానసికంగా కుంగిపోయింది. ఆ డిప్రెషన్ నుంచి కోలుకోవడానికి ఆమెకు మూడేళ్లు పట్టింది. ఎన్నో వివాదాలు, వ్యతిరేకతల్ని ఎదుర్కొని సంపదని, రాజభోగాల్ని వదులుకొన్న యువరాణి మాకో రియల్ హీరోయిన్ అనిపించుకుంది. -
Japan: జపాన్‌లో భారీ భూకంపం
టోక్యో: జపాన్ రాజధాని టోక్యోలో గురువారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. టోక్యోలోని చిబా ఫ్రిఫెక్చర్‌లో 6.1 తీవ్రతతో భూమి కంపించిందని అధికారులు తెలిపారు. టోక్యోకు తూర్పున ఉన్న చిబా ప్రిఫెక్చర్లో 80 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమైందని వాతావరణ సంస్థ తెలిపింది. ఈ భూకంప ప్రభావంతో అనేక భవనాలు కాసేపు కదిలాయి. కానీ ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. కొన్ని కార్యాలయాల పైకప్పు భవనాలు కదిలాయి. సునామీ లాంటి ప్రమాదం సంభవించలేదని అధికారులు ప్రకటించారు. షింకాన్సెన్ సూపర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు టోక్యో బయటే నిలిపివేయబడ్డాయి. భూకంప ఘటనపై నూతనంగా ఎన్నికైన ప్రధాని ఫుమియో కిషిడా స్పందించారు. ‘దయచేసి ప్రజలంతా మీ ప్రాణాలను కాపాడుకునేందుకు చర్యలు తీసుకోండి’అంటూ ట్విట్ చేశారు. చదవండి:తాలిబన్లను చర్చలకు ఆహ్వానించిన రష్యా -
జపాన్‌లో అస్థిరత
వెనకవుండి సలహాలు, సూచనలు అందిస్తూ అధినేత విజయపథంలో పయనించడానికి తోడ్పడటం వేరు...తానే నాయకుడై పాలించడం వేరు. నిరుడు సెప్టెంబర్ 16న జపాన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన యొషిహిడే సుగా తొందరలోనే ఈ తత్వాన్ని బోధపరుచుకుని ఆ పదవికి గుడ్ బై చెప్పారు. పర్యవసానంగా పట్టుమని ఏడాది కాకముందే ఆయన వారసుడి ఎంపిక కోసం అధికార లిబరల్ డెమొక్రాటిక్ పార్టీ(ఎల్డీపీ) అన్వేషణ ప్రారంభించక తప్పలేదు. జపాన్‌కు రాజకీయ అస్థిరత కొత్తగాదు. 2006–12 మధ్య ఆ దేశం ఆరుగురు ప్రధానులను చూసింది. అందులో షింజో అబే కూడా ఒకరు. కానీ 2012లో రెండోసారి అధికారంలోకొచ్చాక అబే తీరు మారింది. అయిదేళ్లపాటు సుస్థిర పాలన అందించడమేకాక, 2017లో మరోసారి మంచి మెజారిటీతో అధికారంలోకొచ్చి మూడేళ్లు పాలించారు. ఆ తర్వాత అనారోగ్య కారణాలతో నిరుడు తప్పుకున్నారు. ఆయన వారసు డిగా వచ్చిన సుగాపై అందరూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే, తెరవెనకుండి షింజో అబేను విజయపథంలో నడిపించింది ఆయనే. అబే తీసుకున్న ప్రతి విధాన నిర్ణయం వెనకా ఆయ నదే కీలకపాత్ర. కేబినెట్ రూపురేఖలు నిర్ణయించటంలో, దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దటంలో, విదేశాంగ విధానం రూపకల్పనలో, పర్యాటక రంగాన్ని పరుగులెత్తించడంలో సుగా ప్రమేయ ముంది. అస్థిర ప్రభుత్వాలతో, ఆర్థిక ఒడిదుడుకులతో, వరస విపత్తులతో కుంగిపోయిన జపాన్‌కు ఈ నిర్ణయాలు జవసత్వాలిచ్చాయి. సమస్యలు ముంచుకొచ్చినప్పుడు ప్రజాదరణ దండిగా ఉన్న రాజకీయ నేత స్పందించే తీరుకూ, ఒక ఉన్నతాధికారి ఆలోచించే తీరుకూ వ్యత్యాసముంటుంది. అది తన సొంత ఆలోచనైనా, ఎవరి సలహాల పర్యవసానమైనా దాన్ని అందరితో ఒప్పించడంలో, ముందుకు నడిపించడంలో, ఆ నిర్ణయం సమర్థవంతంగా అమలు చేయడంలో, మెరుగైన ఫలితాలు రాబట్టడంలో రాజకీయ నాయ కుడి శైలి భిన్నంగా ఉంటుంది. ఉన్నతాధికారిగా అబే తరఫున అన్నీ చక్కబెట్టి, ఆయనకు పేరుప్రఖ్యా తులు రావడంలో ప్రధాన పాత్ర పోషించిన సుగా నేరుగా పాలనా పగ్గాలు చేపట్టాక వైఫల్యాలను మూటగట్టుకోవడంలోని సూక్ష్మం ఇదే. వాస్తవానికి రెండు శిబిరాలుగా చీలిన పాలక పార్టీలో సుగా అందరివాడుగా నిరూపించుకోగలిగారు. పార్టీ ఎంపీలు 151 మందిలో అబే వర్గానికి చెందిన 96 మంది, ఆర్థికమంత్రి తారో అసో అనుకూలురైన 55 మంది ఆయనకు అండదండలందించారు. ఈ రెండు వర్గాలకూ సుగా తన కేబినెట్లో సమాన ప్రాతినిధ్యమిచ్చి, అన్నిటా వారి సలహాలు తీసుకు న్నారు. ఎవరినీ నొప్పించకుండా పనిచేశారు. ప్రధాని పదవికి తామే అర్హులమని భావించే నేతలు ఎల్డీపీలో అరడజనుమంది వరకూ ఉన్నారు. కానీ కరోనా విలయంతోపాటు, ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వక తప్పని పరిస్థితులు ముంచుకొస్తుండటంతో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా రాజకీ యంగా దెబ్బతింటామేమోనన్న భయాందోళనలు వారందరిలోనూ ఉన్నాయి. అందుకే అబేను విజయపథంలో నిలిపిన సుగావైపే ఇరుపక్షాలూ అప్పట్లో మొగ్గుచూపాయి. ప్రధానిగా వచ్చిన సుగా తనకంటూ సొంత ఎజెండా ఉన్నదని నిరూపించుకోలేకపోయారు. అంతక్రితం అబే అమలు చేసిన విధానాలు తనవే కావొచ్చుగానీ, వాటి లోటుపాట్లను సరిదిద్దకుండా కొనసాగిస్తుండటం, కరోనా కట్టడిలో వైఫల్యాలు ఎదుర్కొనడం, వ్యాక్సిన్లు అందరికీ అందించలేక పోవడం సుగా ప్రతిష్టను బాగా దెబ్బతీశాయి. లాక్డౌన్ల కారణంగా ఆర్థిక సంక్షోభం తలెత్తినా, సాధారణ ప్రజానీకాన్ని ఆదుకొనడానికి పకడ్బందీ ప్రణాళికలు కొరవడ్డాయి. ఇప్పటికీ కొన్ని నగ రాలు కొవిడ్ ఎమర్జెన్సీలో కాలం గడుపుతున్నాయి. కరోనా రోగులను చేర్చుకునేది లేదంటూ ఆసు పత్రులు వెనక్కి పంపిన ఉదంతాలు జనంలో ఆగ్రహాన్ని రగిల్చాయి. ఇలాంటి స్థితిలో ఒలింపిక్స్ నిర్వహించడమేమిటన్న ప్రశ్నలు అందరిలో తలెత్తాయి. ఏతావాతా అధికార పగ్గాలు చేపట్టేనాటికి 70 శాతం రేటింగ్ ఉన్న సుగా ప్రస్తుతం 26 శాతానికి దిగజారారు. ఒకప్పుడు తెరవెనక సలహాలిచ్చిన అనుభవమున్న నేత... ఏ నిర్ణయం తీసుకుంటే ఏమవుతుందోనన్న సందేహంలో పడ్డారు. తీసుకున్న నిర్ణయంలోని మంచిచెడ్డలను ప్రజలకు సమర్థవంతంగా చెప్పి ఒప్పించే నేర్పు ఆయనకు లేదు. దాని కితోడు వచ్చే నెలతో ప్రస్తుత సభ కాలపరిమితి ముగుస్తోంది. నవంబర్‌లోగా ఎన్నికల నిర్వహణ తప్పనిసరి.అటు ఎన్నికల్లో పార్టీకి సారథ్యం వహించటం, ఇటు పాలనాపరంగా లోటుపాట్లు సరి దిద్దటం తనకు కత్తి మీద సాము అవుతుందని సుగా సరిగానే గ్రహించారు. దాదాపు 13 కోట్ల జనాభాగల జపాన్‌లో జనం నిరాశానిస్పృహలకు లోనయ్యారు. ఎల్డీపీ జాతీయవాద పార్టీయే అయినా వారిని సమ్మోహన పరిచి, ఒప్పించి మెప్పించగల మంత్రదండమేదీ దాని దగ్గర లేదు. విపక్షం బలహీనంగా ఉండటమే ప్రస్తుతానికి ఆ పార్టీకున్న ఏకైక బలం. ఈ నెలా ఖరులోగా కొత్త సారథిని ఎన్నుకోవటం, వారి సారథ్యంలో ఎన్నికలకు వెళ్లటం ఒకరకంగా ఎల్డీపీకి అగ్ని పరీక్ష. చైనా, దక్షిణ కొరియాలతో సంబంధాలు, రక్షణ రంగాన్ని పటిష్టం చేయడం, ఆర్థిక వ్యవస్థను చక్కదిద్ది, నిరుద్యోగిత తగ్గించటం వంటి అంశాల్లో ఏమేం చేయదల్చుకున్నదీ కొత్త ప్రధాని ప్రజలకు వివరించాల్సి వుంటుంది. పరిణత ప్రజాస్వామ్యం ఉన్న జపాన్‌లో జాగ్రత్తగా అడుగులేయకపోతే ఎంతటి నేత అయినా, పార్టీ అయినా పల్టీలు కొట్టడం ఖాయమని సుగా ఉదంతం నిరూపించింది. కొత్తగా వచ్చే నేత ఎలాంటివారైనా దీన్ని విస్మరించటం అంత తేలిక కాదు. -
Tokyo Paralympics: టేబుల్ టెన్నిస్ ఫైనల్స్‌కు భవీనాబెన్
టోక్యో: పారాలింపిక్స్‌లో భారత్‌కు పతకం ఖాయమైంది. టేబుల్ టెన్నిస్ విభాగంలో భవీనాబెన్ పటేల్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీఫైనల్లో చైనా క్రీడాకారిణి జాంగ్ మియావోను 3-2 తేడాతో ఓడించింది. ఈ విజయంతో భవానిబెన్ దేశానికి కనీసం రజతం ఖాయం చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. భవీనాబెన్ సెమీఫైనల్లో ఆధ్యంతం ఆధిపత్యం ప్రదర్శించింది. చైనాకు చెందిన జాంగ్ మియావోను 7-11, 11-7, 11-4, 9-11, 11-8 తేడాతో ఓడించింది. దాదాపుగా 34 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో తన సత్తా ఏంటో చూపించింది. తొలి గేములో భవీనాకు ఎదురుదెబ్బ తగిలింది. ఐతే మంచి లయలో ఉన్న ఆమె వెంటనే పుంజుకుంది. వరుసగా రెండు గేములు కైవసం చేసుకొని 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మూడో గేమ్‌ను ఆమె కేవలం 4 నిమిషాల్లో గెలుచుకోవడం ప్రత్యేకంగా నిలిచింది. చదవండి: Tokyo Paralympics 2021: భళా భవీనా... గుజరాత్‌లోని వాద్‌నగర్‌కు చెందిన భవీనా 12 నెలల వయసులో పోలియో బారిన పడింది. ఆమె నాలుగో తరగతి చదువుతున్న సమయంలో తల్లిదండ్రులు శస్త్ర చికిత్స కోసం భవీనాను విశాఖపట్నం తీసుకొచ్చారు. శస్త్ర చికిత్స తర్వాత డాక్టర్లు సూచించిన వ్యాయామాలు చేయకపోవడంతో భవీనా ఆరోగ్యం కుదుటపడలేదు. రోజులు గడుస్తున్నకొద్దీ ఆమె కాళ్లు అచేతనంగా మారిపోయాయి. 2004లో భవీనా తండ్రి ఆమెకు అహ్మదాబాద్‌లోని బ్లైండ్ పీపుల్ అసోసియేషన్‌లో సభ్యత్వం ఇప్పించాడు. ఆ అసోసియేషన్‌లో క్రీడా కార్యకలాపాలు కూడా ఉండటంతో భవీనా టేబుల్ టెన్నిస్‌ను ఎంచుకుంది. కోచ్ లలన్ దోషి పర్యవేక్షణలో భవీనా టీటీలో ఓనమాలు నేర్చుకుంది. ఒకవైపు గుజరాత్ విశ్వవిద్యాలయం ద్వారా దూరవిద్యలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన భవీనా మరోవైపు టీటీలోనూ ముందుకు దూసుకుపోయింది. -
Tokyo Paralympics 2021: భారత్‌కు తొలి పతకం ఖరారు
గత నెలలో టోక్యో సమ్మర్ ఒలింపిక్స్‌లో మహిళా వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను ప్రదర్శనతో భారత్ పతకాల బోణీ కొట్టగా... తాజాగా టోక్యోలోనే జరుగుతున్న దివ్యాంగుల విశ్వ క్రీడల్లోనూ (పారాలింపిక్స్) మహిళా క్రీడాకారిణి ద్వారానే భారత్ పతకాల ఖాతా తెరిచింది. టేబుల్ టెన్నిస్ (టీటీ) మహిళల క్లాస్–4 సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారిణి భవీనాబెన్ పటేల్ సెమీఫైనల్ చేరుకోవడం ద్వారా కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. తద్వారా పారాలింపిక్స్‌లో పతకం అందించనున్న తొలి భారతీయ టీటీ ప్లేయర్‌గా 34 ఏళ్ల భవీనాబెన్ కొత్త చరిత్ర లిఖించింది. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ చాంపియన్ మియావో జాంగ్‌తో భవీనాబెన్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భవీనా స్వర్ణ–రజత పతకాల కోసం ఫైనల్లో ఆడుతుంది. సెమీస్‌లో ఓడిపోతే మాత్రం కాంస్య పతకం లభిస్తుంది. టోక్యో: పారాలింపిక్స్ క్రీడల మూడో రోజు భారత మహిళా టేబుల్ టెన్నిస్ (టీటీ) ప్లేయర్ భవీనాబెన్ పటేల్ శుభవార్త వినిపించింది. మహిళల టీటీ క్లాస్–4 సింగిల్స్ విభాగం క్వార్టర్ ఫైనల్లో భవీనా కేవలం 18 నిమిషాల్లో 11–5, 11–6, 11–7తో 2016 రియో పారాలింపిక్స్ స్వర్ణ పతక విజేత, ప్రపంచ ఐదో ర్యాంకర్ బొరిస్లావా పెరిచ్ రాన్కోవిచ్ (సెర్బియా)పై సంచలన విజయం సాధించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఈ భారత నంబర్‌వన్ 12–10, 13–11, 11–6తో జాయ్స్ డి ఒలివియెరా (బ్రెజిల్)ను ఓడించింది. నడుము కింది భాగం అచేతనంగా మారిన వారు క్లాస్–4 విభాగం పరిధిలోకి వస్తారు. తొలిసారి పారాలింపిక్స్‌లో ఆడుతున్న గుజరాత్‌కు చెందిన 34 ఏళ్ల భవీనా సెమీఫైనల్ చేరుకోవడం ద్వారా పతకాన్ని ఖాయం చేసుకుంది. పారాలింపిక్స్ టీటీ నిబంధనల ప్రకారం సెమీఫైనల్లో ఓడిన ఇద్దరికీ కాంస్య పతకాలు అందజేస్తారు. నేడు జరిగే తొలి సెమీఫైనల్లో ప్రపంచ చాంపియన్, 2016 రియో పారాలింపిక్స్ రజత పతక విజేత మియావో జాంగ్ (చైనా)తో భవీనా ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో మియావో జాంగ్ 11–0తో భవీనాపై ఆధిక్యంలో ఉండటం విశేషం. జియోడాన్ జు (చైనా), యింగ్ జై (చైనా) మధ్య రెండో సెమీఫైనల్ జరుగుతుంది. పోలియో బారిన పడి... గుజరాత్‌లోని వాద్‌నగర్‌కు చెందిన భవీనా 12 నెలల వయసులో పోలియో బారిన పడింది. ఆమె నాలుగో తరగతి చదువుతున్న సమయంలో తల్లిదండ్రులు శస్త్ర చికిత్స కోసం భవీనాను విశాఖపట్నం తీసుకొచ్చారు. శస్త్ర చికిత్స తర్వాత డాక్టర్లు సూచించిన వ్యాయామాలు చేయకపోవడంతో భవీనా ఆరోగ్యం కుదుటపడలేదు. రోజులు గడుస్తున్నకొద్దీ ఆమె కాళ్లు అచేతనంగా మారిపోయాయి. 2004లో భవీనా తండ్రి ఆమెకు అహ్మదాబాద్‌లోని బ్లైండ్ పీపుల్ అసోసియేషన్‌లో సభ్యత్వం ఇప్పించాడు. ఆ అసోసియేషన్‌లో క్రీడా కార్యకలాపాలు కూడా ఉండటంతో భవీనా టేబుల్ టెన్నిస్‌ను ఎంచుకుంది. కోచ్ లలన్ దోషి పర్యవేక్షణలో భవీనా టీటీలో ఓనమాలు నేర్చుకుంది. ఒకవైపు గుజరాత్ విశ్వవిద్యాలయం ద్వారా దూరవిద్యలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన భవీనా మరోవైపు టీటీలోనూ ముందుకు దూసుకుపోయింది. ముందుగా జాతీయస్థాయిలో విజేతగా నిలిచిన భవీనా ఆ తర్వాత అంతర్జాతీయ టోర్నీలలో పతకాలు సాధించడం మొదలుపెట్టింది. 2011లో థాయ్‌లాండ్ ఓపెన్ పారా టీటీ టోర్నీలో భవీనా రజత పతకం సాధించింది. ఆ తర్వాత 2013లో ఆసియా చాంపియన్‌షిప్‌లో రజతం కైవసం చేసుకుంది. ఆ తర్వాత జోర్డాన్, చైనీస్ తైపీ, చైనా, కొరియా, జర్మనీ, ఇండోనేసియా, స్లొవేనియా, థాయ్‌లాండ్, స్పెయిన్, నెదర్లాండ్స్, ఈజిప్ట్ దేశాల్లో జరిగిన అంతర్జాతీయ టోర్నీలలో భవీనా భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. ఓవరాల్‌గా ఐదు స్వర్ణాలు, 13 రజత పతకాలు, ఎనిమిది కాంస్య పతకాలను ఆమె గెల్చుకుంది. 2017లో గుజరాత్‌కు చెందిన రాష్ట్రస్థాయి మాజీ క్రికెటర్ నికుంజ్ పటేల్‌ను వివాహం చేసుకున్న భవీనా 2018 ఆసియా పారా గేమ్స్‌లో డబుల్స్ విభాగంలో రజత పతకం సాధించింది. సకీనాకు ఐదో స్థానం పారాలింపిక్స్ పవర్ లిఫ్టింగ్‌లో మహిళల 50 కేజీల విభాగంలో సకీనా ఖాతూన్ ఐదో స్థానంలో నిలిచింది. ఆమె 93 కేజీలు బరువెత్తింది. పురుషుల 65 కేజీల విభాగంలో భారత లిఫ్టర్ జైదీప్ మూడు ప్రయత్నాల్లోనూ విఫలమయ్యాడు. షాట్‌పుట్‌లో నిరాశ పురుషుల అథ్లెటిక్స్ ఎఫ్–54 షాట్‌పుట్ ఈవెంట్లో భారత ప్లేయర్ టెక్ చంద్ ఎనిమిదో స్థానంలో నిలిచాడు. పారాలింపిక్స్ ప్రారంభోత్సవంలో భారత బృందానికి పతాకధారిగా వ్యవహరించిన టెక్ చంద్ ఇనుప గుండును 9.04 మీటర్ల దూరం విసిరాడు. బ్రెజిల్‌కు చెందిన వాలెస్ సాంతోస్ ఇనుప గుండును 12.63 మీటర్ల దూరం విసిరి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు. శుభారంభం.... ఆర్చరీ పురుషుల కాంపౌండ్ ర్యాంకింగ్ రౌండ్ లో భారత ఆర్చర్ రాకేశ్ కుమార్ 699 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో, శ్యామ్ సుందర్ స్వామి 682 పాయింట్లు స్కోరు చేసి 21వ స్థానంలో నిలిచారు. పురుషుల రికర్వ్ ర్యాంకింగ్ రౌండ్లో భారత ప్లేయర్లు వివేక్ 609 పాయింట్లు స్కోరు చేసి పదో స్థానంలో, హర్వీందర్ 600 పాయింట్లు స్కోరు చేసి 21వ స్థానంలో నిలిచారు. పారాలింపిక్స్‌లో నేటి భారత షెడ్యూల్ మహిళల టీటీ క్లాస్–4 సింగిల్స్ సెమీఫైనల్: భవీనాబెన్ X మియావో జాంగ్ (చైనా); ఉదయం గం. 6:10 నుంచి. ఆర్చరీ పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగం ఎలిమినేషన్ రౌండ్: శ్యామ్ సుందర్ X మ్యాట్ స్టుట్‌మన్ (అమెరికా); ఉదయం గం. 6:38 నుంచి; రాకేశ్ కుమార్ ్ఠ సులేమాన్ (ఇరాక్) లేదా ఎన్గాయ్ (హాంకాంగ్); ఉదయం గం. 8:38 నుంచి అథ్లెటిక్స్ పురుషుల ఎఫ్–57 జావెలిన్ త్రో ఫైనల్: రంజీత్ భాటి (మ. గం. 3:30 నుంచి) పారాలింపిక్స్‌లో పతకం గెలిచిన రెండో భారతీయ క్రీడాకారిణి భవీనాబెన్. 2016 రియో పారాలింపిక్స్‌లో అథ్లెట్ దీపా మలిక్ షాట్‌పుట్ ఎఫ్–53 విభాగంలో రజతం గెలిచింది. -
Tokyo Paralympics 2021: ‘మాకూ రెక్కలున్నాయి...’
టోక్యోలో నెల రోజుల వ్యవధిలో మరో ప్రారంభోత్సవ కార్యక్రమం అదరగొట్టింది... ప్రధాన ఒలింపిక్స్‌కు ఏమాత్రం తగ్గని రీతిలో పారాలింపిక్స్ వేడుకలను కూడా నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పైకి ఎగసేందుకు ప్రయత్నించే దివ్యాంగ క్రీడాకారుల ఆశలను ప్రతిబింబించేలా ‘మాకూ రెక్కలున్నాయి’ అనే నేపథ్యంతో సాగిన ఈ ఉత్సవం ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులందరి మనసులూ దోచుకుంది. టోక్యో: కరోనా సమస్యలను దాటి ఒలింపిక్స్‌ను విజయవంతంగా నిర్వహించిన జపాన్ ఇప్పుడు పారాలింపిక్స్‌ను అంతే స్థాయిలో అద్భుతంగా జరిపేందుకు సిద్ధమైంది. మంగళవారం జరిగిన ప్రారంభోత్సవ వేడుకలు అందుకు నిదర్శనం. మొదటినుంచి చివరి వరకు స్టేడియాన్ని రంగులమయంగా మారుస్తూ జరిపిన ప్రదర్శనలు జపాన్ కళలు, సంస్కృతిని చూపించడంతో పాటు పారాలింపిక్స్ అథ్లెట్ల పట్టుదలను దృశ్య రూపంలో ఆవిష్కరించాయి. బుధవారంనుంచి ప్రధాన పోటీలు ప్రారంభం కానుండగా... సెప్టెంబర్ 5 వరకు ఈ క్రీడలు జరుగుతాయి. ముగ్గురు జ్యోతిని వెలిగించగా... స్టేడియంలో ప్రేక్షకులకు అనుమతి లేకపోయినా పోటీల్లో పాల్గొంటున్న అథ్లెట్లలో మెగా ఈవెంట్ భావోద్వేగం కనిపించింది. గత ఏడాది కాలంగా కోవిడ్ విఘ్నాలను అధిగమించి 4,403 మంది ఆటగాళ్లు ఎదురు చూసి క్షణం రానే వచ్చింది. ముందుగా జపాన్ జాతీయ పతాకం మైదానంలోకి తీసుకు రావడంతో కార్యక్రమం మొదలైంది. దీనిని తెచ్చిన వారిలో ఆటగాళ్లతో పాటు టోక్యో అగ్నిమాపక విభాగానికి చెందిన కార్మికుడికి కూడా అవకాశం కల్పించడం విశేషం. ‘ఆప్టిక్ నెర్వ్ హైపోప్లాసియా’తో బాధపడుతూ పూర్తి అంధురాలిగా మారిన సటో హిరారి జపాన్ జాతీయ గీతం ఆలపించినప్పుడు స్టేడియంలోనివారంతా జేజేలు పలికారు. ఆ తర్వాత ‘పారా ఎయిర్పోర్ట్’ పేరుతో సాగిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. పెద్ద సంఖ్యలో శారీరక లోపాలు ఉన్నవారిని ఎందరినో ఈ రూపకంలో భాగం చేశారు. అనంతరం నృత్య, విభిన్న సంగీత ప్రదర్శనలు జరిగాయి. అయితే అన్నింటికి మించి హైలైట్‌గా నిలిచిన అంశం ‘వన్ వింగ్డ్ ప్లేన్’. చక్రాల కుర్చీలో కూర్చున్న అమ్మాయి ఒకటే రెక్క ఉన్న విమానంలో ఎగురుకుంటూ వచ్చి తాను అందరిలాగే ఎగరాలనే కోరికను కనబర్చే అంశానికి చప్పట్లు మార్మోగాయి. మార్చ్‌పాస్ట్‌లో మొత్తం 162 జట్లకు చెందిన బృందాలు పాల్గొనగా రెఫ్యూజీ పారాలింపిక్ టీమ్ అందరికంటే ముందుగా నడిచింది. తాలిబన్ల కారణంగా తమ దేశంలో ఎదురైన అనూహ్య పరిస్థితుల నేపథ్యంలో అఫ్గానిస్తాన్ జట్టు చివరి నిమిషంలో పోటీలనుంచి తప్పుకుంది. అయితే వారికి సంఘీభావంగా ఒలింపిక్ కమిటీ తమ వాలంటీర్ ద్వారా మార్చ్‌పాస్ట్‌లో అఫ్గాన్ జాతీయ జెండాను కూడా ప్రదర్శించింది. ముగ్గురు జపాన్ పారా అథ్లెట్లు యు కమిజి, షున్‌షుకె ఉచిదా, కరిన్ మరిసకి సంయుక్తంగా ఒలింపిక్ జ్యోతిని వెలిగించడంతో అధికారికంగా పోటీలు ప్రారంభమయ్యాయి. అఫ్గాన్ జెండాతో... ఫ్లాగ్ బేరర్‌గా టెక్ చంద్... భారత జట్టు మార్చ్‌పాస్ట్‌కు సంబంధించి అనూహ్య మార్పు చోటు చేసుకుంది. ఫ్లాగ్ బేరర్‌గా ప్రకటించిన రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత మరియప్పన్ తంగవేలు చివరి నిమిషంలో తప్పుకున్నాడు. టోక్యోకు మరియప్పన్‌తో కలిసి ప్రయాణించిన విదేశీ ఆటగాడు ఒకడు కరోనా పాజిటివ్‌గా తేలడమే అందుకు కారణం. ముందు జాగ్రత్తగా తంగవేలును పక్కన పెట్టాలని నిర్వాహకులు భారత జట్టుకు సమాచారం అందించారు. దాంతో షాట్‌పుట్‌లో పోటీ పడుతున్న టెక్ చంద్ ఫ్లాగ్ బేరర్‌గా ముందుకు సాగాడు. మొత్తంగా భారత బృందంనుంచి 9 మంది మార్చ్‌పాస్ట్‌లో పాల్గొన్నారు. పారాలింపిక్స్‌లో నేడు (భారత్) మహిళల సింగిల్స్ టేబుల్ టెన్నిస్: సోనల్ బెన్ పటేల్ – క్లాస్ 3 (ఉ.గం.7.30), భావినా బెన్ పటేల్ – క్లాస్ 4 (ఉ.గం.8.50) -
నేటినుంచి టోక్యోలో మళ్లీ క్రీడా సంబరం
టోక్యో ఒలింపిక్స్ భారత్‌కు తొలిరోజు నుంచే పతకాన్ని, సంతోషాన్ని పంచింది. అలాగే పారాలింపిక్స్ కూడా ఈ సంతోషాన్ని, పతకాలను రెట్టింపు చేయాలని భారత పారాఅథ్లెట్ల బృందం గంపెడాశలతో బరిలోకి దిగుతోంది. స్టార్ జావెలిన్ త్రోయర్ దేవేంద్ర ఝఝారియా, హైజంపర్ మరియప్పన్ తంగవేలు రియో పారాలింపిక్స్‌కు రీప్లే చూపాలనే పట్టుదలతో ఉన్నారు. ఈసారి పదికిపైగా పతకాలు సాధించాలని, స్వర్ణాల వేట కూడా పెరగాలని భారత బృందం లక్ష్యంగా పెట్టుకుంది. టోక్యో: మరో విశ్వ క్రీడా వేడుకకు టోక్యో సిద్ధమైంది. రెగ్యులర్ ఒలింపిక్స్‌కు దీటుగా పారాలింపిక్స్‌ను నిర్వహించేందుకు సై అంటున్న జపాన్, మంగళవారం అట్టహాసంగా ఆరంభ సంబరాలు నిర్వహించనుంది. అనంతరం పారాథ్లెట్ల పోరాటం మొదలవనుంది. కరోనా మహమ్మారిని ఓ కంట కనిపెడుతూనే ఈ మెగా ఈవెంట్‌ను కూడా విజయవంతంగా నిర్వహించాలని టోక్యో ఆర్గనైజింగ్ కమిటీ పగలురేయి శ్రమిస్తోంది. ప్రేక్షకులను ఈ పోటీలకు కూడా అనుమతించడం లేదు. క్రమం తప్పని కోవిడ్ టెస్టులు, ప్రొటోకాల్ తదితర పకడ్బంది చర్యలతో పోటీలు నిర్వహిస్తారు. చదవండి: Miguel Oliveira: సవతి సోదరితో నెల రోజుల కిందట పెళ్లి.. త్వరలోనే.. ఎవరికెవరూ తీసిపోరు... పారాలింపియన్ల పట్టుదల ముందు వైకల్యం ఎప్పుడూ ఓడిపోతూనే ఉంది. పారాలింపిక్ దిగ్గజం, బ్రెజిల్ స్విమ్మర్ డానియెల్ డియాస్ వరుసగా నాలుగో మెగా ఈవెంట్లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. 24 పతకాలు గెలుచుకున్న డానియెల్ ఈ సారి ఆ సంఖ్యను 30కి చేర్చుతాడనే అంచనాలున్నాయి. అమెరికా మహిళా స్విమ్మర్లు జెస్సికా లాంగ్, మెకెంజీ కోన్లు కూడా టోక్యో కొలనులో రియో టైటిళ్లను నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. జర్మనీ లాంగ్‌జంపర్, మార్కస్ రెమ్, ఇరాన్ ఆర్చర్ జహ్రా నెమటి, బ్రిటన్ వీల్‌చైర్ టెన్నిస్ ప్లేయర్ జోర్డాన్ విలీ, జపాన్ పారాథ్లెట్ సాటో తొమకి తదితర స్టార్లతో టోక్యో వేదిక మురిసిపోనుంది. ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 5 వరకు 13 రోజుల పాటు జరిగే పారా విశ్వక్రీడల్లో 163 దేశాలకు చెందిన సుమారు 4500 మంది అథ్లెట్లు పాల్గొననున్నారు. 22 క్రీడలకు సంబంధించి 540 ఈవెంట్లలో పోటీలు నిర్వహిస్తారు. తంగవేలు పతాకధారి ఐదుగురు అథ్లెట్లు, ఆరు మంది అధికారులు మొత్తం 11 మందితో కూడిన భారత జట్టు మార్చ్‌పాస్ట్‌లో పాల్గొంటుంది. పతాకధారి మరియప్పన్ తంగవేలు మన జట్టును ముందుండి నడిపించనున్నాడు. ఇరాన్ తర్వాత 17వ దేశంగా భారత్ స్టేడియంలోకి అడుగుపెట్టనుంది. పారాలింపిక్స్ మార్చ్‌పాస్ట్‌లో అథ్లెట్లకు పరిమితులేమీ లేవు. అయితే టోక్యోకు భారత్ నుంచి ఇప్పటివరకు కేవలం ఏడుగురు అథ్లెట్లు మాత్రమే వచ్చారు. ఇందులో ఇద్దరు టేబుల్ టెన్నిస్ ప్లేయర్లు సోనల్ పటేల్, భవిన పటేల్‌లకు మరుసటి రోజు (బుధవారం) పోటీలున్నాయి. దీంతో వారిని మినహాయించి ఐదుగురు అథ్లెట్లకు జతగా ఆరుగురు అధికారులు మార్చ్‌పాస్ట్ చేస్తారని భారత పారాలిం పిక్ కమిటీ కార్యదర్శి, చెఫ్ డి మిషన్ గుర్శరణ్ చెప్పా రు. మువ్వన్నెల పతాకధారి మరియప్పన్ తంగవేలుతో పాటు వినోద్ కుమార్ (డిస్కస్ త్రో), టెక్ చంద్ (జావెలిన్ త్రో), జైదీప్, సకీనా ఖాతూన్ (పవర్ లిఫ్టర్లు)లు ప్రారంభోత్సవంలో కవాతు చేయనున్నారు. చదవండి: హాకీ ఆటగాళ్లకు అరుదైన గౌరవం అఫ్గాన్ జెండా రెపరెపలు అఫ్గానిస్తాన్‌లో పౌర ప్రభుత్వం కూలి... తాలిబన్ల తుపాకి రాజ్యం నడుస్తోంది. అక్కడి భీతావహ పరిస్థితులు, పౌర విమాన సేవలు లేక ఆ దేశ అథ్లెట్లు ఎవరూ పారాలింపిక్స్‌లో పాల్గొనడం లేదు. అయినాసరే వారి జాతీయ పతాకం మాత్రం రెపరెపలాడుతుందని అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ చీఫ్ అండ్రూ పార్సన్స్ స్పష్టం చేశారు. సంఘీభావానికి సంకేతంగా అఫ్గాన్ జాతీయ జెండా ప్రారంభవేడుకల్లో ఎగురుతుందని చెప్పారు. ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రతినిధి అఫ్గాన్ పతాకాధారిగా మార్చ్‌పాస్ట్‌లో పాల్గొంటారని పార్సన్స్ తెలిపారు. -
జపాన్ ఫార్ములావన్ రద్దు
టోక్యో: ఏడాది వాయిదా పడినా కూడా ఒలింపిక్స్‌ను అద్భుతంగా నిర్వహించిన దేశం జపాన్. పారాలింపిక్స్ కూడా ఈ నెల 24 నుంచి అక్కడే జరగనున్నాయి. అయితే వందల సంఖ్యలో దేశాలు, వేల సంఖ్యలో అథ్లెట్లు పాల్గొనే మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమిచ్చిన టోక్యో నగరం పదుల సంఖ్యలో జరిగే ఫార్ములావన్ జపనీస్ గ్రాండ్ ప్రి ఈవెంట్‌ను నిర్వహించలేమని చేతులెత్తేసిం ది. కరోనా మహమ్మారి కారణంగా తమ దేశంలో జరగాల్సిన ఫార్ములావన్‌ను రద్దు చేస్తున్నట్లు బుధవారం నిర్వాహకులు ప్రకటించారు. సుజుకా ట్రాక్‌పై అక్టోబర్ 10న జపాన్ గ్రాండ్ ప్రి జరగాల్సివుంది. ప్రభుత్వం, రేస్ ప్రమోటర్లు, ఫార్ములావన్ వర్గాలు దీనిపై చర్చించిన అనంతరం ఈ సీజన్ రేసు రద్దయింది. -
సుడోకు రూపకర్త కన్నుమూత
టోక్యో: అంకెలతో ఆసక్తి పుట్టించే సుడోకు రూపకర్త మాకి కాజీ కన్నుమూశారు. బైల్ డక్ట్ కేన్సర్‌తో బాధపడుతూ 69 ఏళ్ల వయసులో మరణించారని ఆయన స్థాపించిన నికోలి కో. సంస్థకు చెందిన ఉద్యోగులు వెల్లడించారు. 2004 నుంచి ఇది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. జపనీయులు సుడోకును స్థానికంగా సుజి–వా–డోకుషిన్–ని–కగిరు అని పిలుస్తారు. దాన్ని షార్ట్‌కట్‌లో సుడోకుగా వాడుకలోకి వచ్చింది. మాకి కాజీ దాదాపు 30 దేశాల్లో సుడోకు పజిల్స్ గురించి చెబుతూ పర్యటించారు. సుడోకు చాంపియన్‌షిప్‌ల ద్వారా దాదాపు 100 దేశాల్లో 20 కోట్ల మందికి చేరువయ్యామని నికోలి కంపెనీ తెలిపింది. -
టోక్యో పారా ఒలింపిక్స్‌కు పయనమైన భారత బృందం
న్యూఢిల్లీ: టోక్యో పారా ఒలింపిక్స్‌కు భారత బృందం పయనమైంది. 54 మందితో టోక్యోకు భారత బృందం బయల్దేరింది. ఆటగాళ్లకు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ వీడ్కోలు పలికారు. పారా ఒలింపిక్స్‌లో 9 క్రీడాంశాల్లో భారత ఆటగాళ్లు పోటీపడనున్నారు. ఈనెల 27న ఆర్చరీతో భారత్ మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి. కాగా రియో పారా ఒలింపిక్స్ 2016లో చైనా 105 స్వర్ణాలు, 81 రజతాలు, 51 కాంస్యాలు కలిపి మొత్తంగా 237 పతకాలు సాధించింది. ఇక బ్రిటన్ 64, ఉక్రెయిన్ 41, అమెరికా 40 స్వర్ణాలు సాధించాయి. బ్రెజిల్ 14 బంగారం పతకాలు సాధించి ఎనిమిదో స్థానంలో నిలువగా.. భారత్ రెండు స్వర్ణాలు, ఒక రజతం, కాంస్యం సాధించి 42వ స్థానంలో నిలిచింది. -
మీరు ఆడండి.. మేము అండగా ఉంటాం.. ‘టోక్యో’తో మారిన సీన్!
టోక్యో ఒలింపిక్స్ భారత క్రీడా ముఖ చిత్రాన్ని మార్చనున్నాయా? క్రికెట్‌తో పాటు ఇతర క్రీడలకు కార్పోరేటు దన్ను విస్తరించనుందా? ఆటగాళ్లకు మెరుగైన సౌకర్యాలు, శిక్షణ లభించనున్నాయా అంటే అవుననే సమాధానం వస్తోంది. సాక్షి, వెబ్‌డెస్క్: అనేక అనుమానాల మధ్య మొదలైన టోక్యో ఒలింపిక్స్ భారత క్రీడలపై భారీ ప్రభావం చూపింది. ఆరంభంలో అపజయాలు పలకరించినా విశ్వ క్రీడల చివరల్లో భారత ఆటగాళ్లు చూపిన తెగువ, పోరాడిన తీరు ఇండియన్ల మనసుపై చెరగని ముద్రని వేశాయి. గట్టి ప్రోత్సాహం లభిస్తే మన ఆటగాళ్లు విశ్వవేదికలపై మరింత మెరుగైన ప్రదర్శన, పతాకలు తేవడం గ్యారంటీ అనే భరోసా ఇచ్చాయి. దీంతో ఆటగాళ్లకు మెరుగైన శిక్షణ, వసతులు కల్పించడంతో పాటు ఆర్థికంగా అండగా ఉండేందుకు కార్పోరేటు కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ప్రైవేటు రంగంలో కోచింగ్ సెంటర్లు ఒలింపిక్ క్రీడల్లో అథ్లెటిక్స్ విభాగంలో అప్పుడెప్పుడో రన్నింగ్ రేసులో పీటీ ఉష పతకం ఆశలు రేపగా దాదాపు నలభై ఏళ్లకు జావెలిన్ త్రోలో నీరజ్ చోప్డా ఆ కలను నిజం చేశాడు. రెజ్లింగ్‌లో భజరంగ్ పునియా రజతంతో మెరిశాడు. అయితే వీరిద్దరు ఒలింపిక్స్‌కి ముందు ఇన్స్పైర్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఐఐఎస్)లో శిక్షణ పొందారు. ఇండియా నుంచి ఒలింపిక్స్‌లో పోటీ పడుతున్న క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణ ఇచ్చేందుకు ఐఐఎస్ పని చేస్తోంది. దీనికి ఆర్థిక సహకారాన్ని జిందాల్ ఇండస్ట్రీస్‌తో పాటు కోటక్ గ్రూప్, ఇండస్ఇండ్, సిటీబ్యాంక్, బ్రిడ్జిస్టోన్, బోరోసిల్ ఇలా మొత్తం 20కి పైగా కార్పోరేట్ కంపెనీలు ఆర్థిక సాయం అందిస్తున్నాయి. ప్రభుత్వ పరంగా కాకుండా క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణ ఇచ్చే ప్రైవేటు ఇన్సిస్టి్యూట్గా ఐఐఎస్ పేరు మార్మోగిపోతుంది. పెరుగుతున్న ఫండింగ్ ఐఐఎస్‌లో శిక్షణ తీసుకున్న ఇద్దరు ఒలింపిక్ పతకాలు తేవడంతో ఈ ఏడాది ఐఐఎస్‌కు తమ ఫండింగ్‌ను 40 శాతం పెంచుతామంటూ జేఎస్‌డబ్ల్యూ సిమెంట్స్ ఎండీ పార్థ్ జిందాల్ ప్రకటించారు. తమలాగే రిలయన్స్, ఆదానీ, టాటాలు కూడా పెంచే అవకాశం ఉందంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషఁంలో రిలయన్స్ ఒక అడుగు ముందుకు వేసి గోస్పోర్ట్స్ ఫౌండేషన్ పేరుతో ఎన్జీవోని నిర్వహిస్తోంది. కంపెనీలకు అవసరమే మనదేశంలో క్రికెట్‌కి క్రేజ్ ఎక్కువ. బ్రాండ్ ప్రచారం చేసుకోవాలన్నా క్రికెట్ ప్రధానంగా అయ్యింది. అయితే క్రికెట్ స్సాన్సర్షిప్, ఆటగాళ్ల ఎండార్స్మెంట్ ఫీజులు కోట్లలో ఉంటున్నాయి. వీటిని దక్కించుకోవాలంటే భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో ఇతర క్రీడలను ప్రోత్సహించడం అనివార్యత ఎప్పటి నుంచో ఉంది. ఎడిల్‌వైస్ కంపెనీ అయితే 2008 నుంచి ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ (ఏజీక్యూ) పేరుతో ప్రత్యేకంగా ఫండ్ ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తోంది. అయితే దేశం మొత్తం గుర్తించి... సెలబ్రేట్ చేసుకునే స్థాయిలో ఆటగాళ్ల నుంచి విజయాలు రాలేదు. ఒలింపిక్ చరిత్రలోనే ఈసారి ఇండియాకు అత్యధిక పతకాలు వచ్చాయి. దీంతో మెరుగైన ఆటగాళ్లకు స్పాన్సర్ చేసేందుకు ఒలింపిక్ అసోసియేషన్‌తో ఎడిల్‌వైస్ కంపెనీ చర్చలు ప్రారంభించింది. పీపీపీ మోడ్ ఒడిషా, టాటా గ్రూపులు సంయుక్తంగా పబ్లిక్, ప్రైవేటు పార్ట్నర్షిప్లో పురుష, మహిళా హకీ జట్లను స్పాన్సర్షిప్ అందించాయి. నలభై ఏళ్ల తర్వాత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకం సాధించగా మహిళల జట్టు తృటిలో పతకాన్ని కోల్పోయినా స్ఫూర్తిదాయక ఆటతీరుని కనబరిచింది. దీంతో పీపీపీ మోడ్‌లో ఆటగాళ్లకు అండగా నిలించేందుకు రియలన్స్, జిందాల్‌లు ముందుకు వచ్చాయి. అథ్లెటిక్స్‌కి రిలయన్స్ స్పాన్సర్ చేస్తుండగా స్విమ్మింగ్‌కి చేదోడుగా ఉండేందుకు జిందాల్ అంగీకారం తెలిపింది. ఒడిషా తరహాలో ఒక్కో రాష్ట్రం ఒక్కో క్రీడకు అండగా నిలిస్తే విశ్వపోటీల్లో ఇండియా ప్రదర్శన మరో స్థాయిలో ఉంటుందని జిందాల్ స్పోర్ట్స్ హెడ్ వినీల్ కార్నిక్ తెలిపారు. -
13 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో భారత జాతీయ గీతం: వైరల్ వీడియో
టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ అథ్లెట్ నీరజ్ చోప్రా స్వర్ణం గెలిచి భారత్ త్రివర్ణ పతకాన్ని అంతర్జాతీయ వేదికపై రెపరెపలాడించారు. దీంతో 13 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో భారత జాతీయ గీతాన్ని వినిపించారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో అభినవ్ బింద్రా పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో బంగారు పతకం సాధించినపుడు భారత జాతీయ గీతాన్ని వినిపించగా.. మళ్లీ ఇన్నేళ్లకు నీరజ్ చోప్రా స్వర్ణం సాధించడంతో ఒలింపిక్స్‌లో జాతీయ గీతాన్ని వినిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మొదటి ప్రయత్నంలో చోప్రా జావెలిన్‌ను 87.03 మీటర్లకు విసిరారు. రెండో ప్రయత్నంలో 87.58 మీటర్లకు విసిరారు. కాగా రెండో స్థానంలో చెక్ రిపబ్లిక్కు చెందిన వడ్లెక్ నిలిచారు. ఈయన గరిష్ఠంగా 86.67 మీటర్లకు జావెలిన్‌ను విసిరారు. అంతే కాకుండా చెక్ రిపబ్లిక్కు చెందిన విటెజ్స్లావ్ వెస్లీ మూడో స్థానంలో నిలిచారు. ఆయన గరిష్టంగా 85.44 మీటర్లకు జావెలిన్‌ను విసిరారు. ఇక అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన గంట వ్యవధిలోనే లక్షకు పైగా నెటిజనులు వీక్షించారు. అంతేకాకుండా నీరజ్ చోప్రాకు సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురిపిస్తూ.. అభినందనలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా నీరజ్ చోప్రాకు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి అభినందనలు తెలిపారు. #IND National Anthem at Olympic Stadium in #Tokyo2020 Thank you @Neeraj_chopra1 #NeerajChopra pic.twitter.com/68zCrAX9Ka — Athletics Federation of India (@afiindia) August 7, 2021 -
ప్యాసింజర్ రైలులో కలకలం.. ఆడవాళ్లు సంతోషంగా ఉంటే నచ్చదట!
టోక్యో: 2020 ఒలింపిక్స్ గేమ్స్ వేదిక, జపాన్ రాజధాని నగరం టోక్యోలో కత్తి దాడి ఘటన సంచలనం సృష్టించింది. టోక్యో ప్యాసింజర్ రైలులో ఒక అగంతకుడు(36) అకస్మాత్తుగా కత్తితో మహిళలపై దాడికి తెగబడ్డాడు. దీంతో ఒక యువతి తీవ్రంగా గాయపడగా, మరో పదిమంది గాయపడ్డారు. ప్రధాన స్టేడియానికి సుమారు 15 కిలోమీటర్లు దూరంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. సంతోషంగా కనిపించే మహిళలను హత్య చేయాలన్న పథకంతోనే ఈ దాడి చేశానన్న నిందితుడి ప్రకటన కలకలం రేపింది. జపాన్ మీడియా నివేదిలక ప్రకారం పశ్చిమ ప్రాంతంలో ఓడక్యు లైన్లో 36 ఏళ్ల వ్యక్తి సడన్‌గా మహిళలపై కత్తితోఎటాక్ చేశాడు. ఈ ఘటనలో యూనివర్సిటీ విద్యార్థిని తీవ్రంగా గాయ పడింది. ఈమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరో పది మందికి స్వల్ప గాయాలయ్యాయి. సమీపంలోని స్టేషన్లో రైలు నిలిపివేసిన అధికారులు తీవ్రంగా గాయపడిన యువతి సహా తొమ్మిది మందిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. మరో వ్యక్తి ఆచూకీ తెలియరాలేదు. మరోవైపు దాడి చేసిన వ్యక్తిని యూసుకే సుషిమాగా గుర్తించారు. అయితే పోలీసులు విచారణలో నిందితుడు విస్తుపోయే అంశాలను వెల్లడించాడు. సంతోషంగా కనిపించే మహిళలను చంపాలని ఆరేళ్ల క్రితమే నిర్ణయించుకున్నా.. అలాంటి వారిని చూస్తే తనకు కోపం వస్తుందని, అందుకే ఏ మహిళలైనా సరే, చాలా మందిని ఖతం చేయాలనుకున్నాను అని చెప్పడంతో పోలీసులు సైతం ఖంగుతిన్నారు. అంతేకాదు అనుమానితుడు వంట నూనె, లైటర్ని కూడా వెంట తెచ్చుకున్నాడనీ, రైల్లో నిప్పు పెట్టాలని కూడా ప్లాన్ చేశాడంటూ పోలీసులను ఉటంకిస్తూ ఎన్‌హెచ్‌కే నివేదించింది. అయితే ఈ వార్తలపై స్పందించేందుకు స్థానిక అధికారి నిరాకరించారు. చదవండి : Women's Hockey: కన్నీరు మున్నీరైన అమ్మాయిలు, అనునయించిన మోదీ Mirabai Chanu: మరోసారి మనసు దోచుకున్న చాను, ప్రాక్టీస్ షురూ, ఫోటో వైరల్ -
వరల్డ్ ఫేమస్ దొంగల ముఠా.. ప్రతీదీ ట్విస్టే!
ఎంటర్టైన్మెంట్కి ఎల్లలు లేవు. అందుకే లోకల్ కంటెంట్‌తో పాటు గ్లోబల్ కంటెంట్‌కు ఆదరణ ఉంటోంది. ఇక ఓటీటీ వాడకం పెరిగాక.. దేశాలు దాటేసి మరీ సినిమాలు, సిరీస్‌లను డిజిటల్ తెరలపై చూసేస్తున్నారు మనవాళ్లు. ఆ లిస్ట్‌లో ఒకటే ‘మనీ హెయిస్ట్’. ఎక్కడో స్పెయిన్‌లో తెరకెక్కిన ఈ టీవీ సిరీస్‌కి.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఫ్యాన్స్.. అందులో తెలుగువాళ్లూ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు ప్రపంచంలో ఇప్పటిదాకా ఎక్కువమంది(ఇండియన్స్‌తో సహా) చూసిన నాన్–ఇంగ్లీష్ సిరీస్ కూడా ఇదే(ఇదొక రికార్డు). మనీ హెయిస్ట్కి ఇంతలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడటానికి ప్రధాన కారణాలు.. ఈ సిరీస్ మూలకథ, ప్రధాన పాత్రలతో వ్యూయర్స్ పెంచుకున్న కనెక్టివిటీ. అందుకే ఐదో పార్ట్ రూపంలో అలరించేందుకు సిద్ధమైంది ఈ దొంగల ముఠా డ్రామా. సాక్షి, వెబ్‌డెస్క్: క్రైమ్ థ్రిల్లర్స్‌ని ఇష్టపడేవాళ్లకు ‘మనీ హెయిస్ట్’ ఒక ఫుల్ మీల్స్. ఒరిజినల్‌గా ఇది స్పానిష్ లాంగ్వేజ్‌లో తెరకెక్కింది. నాన్–స్పానిష్ ఆడియెన్స్ కోసం ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో సిరీస్‌ను అందిస్తున్నారు. మొదటి సీజన్ 2017 మే 2న స్పానిష్ టీవీ ఛానెల్ ‘అంటెనా 3’ లో టెలికాస్ట్ అయ్యింది. స్పానిష్‌లో మనీ హెయిస్ట్ ఒక టెలినోవెలా.. అంటే టెలిసీరియల్ లాంటిదన్నమాట. మనీ హెయిస్ట్ టెలికాస్ట్ తర్వాత.. అప్పటిదాకా ఉన్న స్పానిష్ టీవీ వ్యూయర్షిప్ రికార్డులన్నీ చెరిగిపోయాయి. ఆ పాపులారిటీని గుర్తించి నెట్‌ఫ్లిక్స్ మనీ హెయిస్ట్ రైట్స్‌ని కొనుగోలు చేసింది. అలా నెట్‌ఫ్లిక్స్ నుంచి ప్రపంచం మొత్తం ఈ ట్విస్టీ థ్రిల్లర్‌కు అడిక్ట్ అయ్యింది. మరో రికార్డ్ ఏంటంటే.. నెట్‌ఫ్లిక్స్‌లో ఎక్కువ వ్యూయర్షిప్ ఉన్న టీవీ సిరీస్ కూడా ఇదే!. మనీ హెయిస్ట్ ఇప్పటిదాకా రెండు సీజన్స్.. నాలుగు పార్ట్లు.. 31 ఎపిసోడ్స్‌గా టెలికాస్ట్ అయ్యింది. ఇప్పుడు రెండో సీజన్లో ఐదో పార్ట్‌గా పది ఎపిసోడ్స్‌తో రాబోతోంది. సెప్టెంబర్ 3న ఐదు వాల్యూమ్స్(ఎపిసోడ్స్‌గా) రిలీజ్ కానుంది. ఆ పై డిసెంబర్లో మిగిలిన ఐదు రిలీజ్ అవుతాయి. దీంతో ఎప్పుడెప్పుడు చూసేద్దామా అనే ఎగ్జయిట్మెంట్ ఫ్యాన్స్‌లో మొదలైంది. ఎందుకంత అడిక్షన్? మనీ హెయిస్ట్ ఒరిజినల్(స్పానిష్) టైటిల్ ‘లా కాసా డె పాపెల్’. బ్యాంకుల దోపిడీ(హెయిస్ట్) నేపథ్యంలో సాగే కథ ఈ సిరీస్‌ది. దోపిడీకి ప్రయత్నించే గ్యాంగ్.. ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవాలని చూసే పోలీసులు.. వెరసి ఇంట్రెస్టింగ్ సీక్వెన్స్‌తో కథ ముందుకెళ్తుంది. అలాగని స్టోరీ నార్మల్‌గా ఉండదు. సీన్‌కి సీన్‌కి ఆడియెన్స్‌లో హీట్ పెంచుతుంది. ట్విస్టుల కారణంగా ‘ప్రతీ సీన్ ఒక క్లైమాక్స్‌లా’ అనిపిస్తుంది. కథలో తర్వాతి సీన్ ఏం జరుగుతుందనేది వ్యూయర్స్ అస్సలు అంచనా వేయలేరు. ఆ ఎగ్జయిట్మెంటే చూసేవాళ్లను సీటు అంచున కూర్చోబెడుతుంది. కథలో ఒక్కోసారి ఫ్లాష్‌బ్యాక్ సీన్స్ వస్తుంటాయి. వాటి ఆధారంగానే కథ సరికొత్త మలుపు తిరుగుతుంది. ఆడియెన్స్‌ని ప్రధానంగా ఆకట్టుకునే అంశం కూడా ఇదే. ఇక స్క్రీన్‌ప్లే సైతం గ్రిప్పింగ్‌గా ఉంటుంది. ప్రతీ క్యారెక్టర్ చెప్పే డైలాగులు ఫిలసాఫికల్ డెప్త్‌తో ఉంటాయి. అందుకే ఒక్కసారి ఇన్వాల్వ్ అయ్యారంటే వదలకుండా చూస్తుంటారు. ఈ సిరీస్‌కి సంబంధించిన ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే ట్విట్టర్లో ఒకటి, రెండు రోజులు ట్రెండింగ్‌లో ఉంటుందంటే అర్థం చేసుకోవచ్చు మనీ హెయిస్ట్ క్రేజ్ ఏపాటిదో. క్యారెక్టర్స్ కనెక్టివిటీ కాస్టింగ్ ఎక్కువగా ఉన్నప్పుడు.. ప్రతీ క్యారెక్టర్‌కి కరెక్ట్ సీన్లు పడటం కొంచెం కష్టంతో కూడుకున్న పని. కానీ, మనీ హెయిస్ట్‌లో ప్రతీ క్యారెక్టర్‌కి సమాన ప్రాధాన్యం ఉంటుంది. క్యారెక్టర్లను ఒక్కొక్కటిగా పరిశీలిస్తే.. ఈ కథ నారేటర్, దోపిడీ ముఠాలో ఫస్ట్ మెంబర్ ‘టోక్యో’. ఇక మెయిన్ క్యారెక్టర్ ‘ఎల్’ ఫ్రొఫెసర్. దోపిడీ వెనుక మాస్టర్ మైండ్ ఇతనే. నిజానికి అతని యాక్చువల్ ప్లాన్ వేరే ఉంటుంది. ప్రొఫెసర్‌తో పాటు నైరోబీ, బెర్లిన్(ప్రొఫెసర్ బ్రదర్) అనే మరో రెండు క్యారెక్టర్లు టోటల్‌గా ఈ సిరీస్‌కే కిరాక్ పుట్టించే క్యారెక్టర్లు. అందుకే వాటికి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అసలు కథ విషయానికొస్తే.. ఆరంభంలో ఒక బ్యాంక్ దొంగతనం చేయబోయి ఆ ప్రయత్నంలో ఫెయిల్ అవుతుంది ఒలివెయిరా(టోక్యో). ఆమెను పోలీసుల బారి నుంచి రక్షిస్తాడు ప్రొఫెసర్. ఆమెతో పాటు మరో ఏడుగురిని ఒకచోట చేర్చి భారీ దోపిడీలకు ప్లాన్ గీస్తాడు. ఆ ముఠాలో ప్రొఫెసర్ బ్రదర్ అండ్రెస్ డె ఫోనోల్లోసా(బెర్లిన్) కూడా ఉంటాడు.ఆ గ్యాంగ్‌లో ఒకరి వివరాలు ఒకరికి తెలియవు. కానీ, ఎక్కడో దూరంగా ఉండి ప్రొఫెసర్ ఇచ్చే సూచనల మేరకు పని చేస్తుంటారు. పోలీసుల నుంచి రక్షించుకునే క్రమంలో జరిగే పోరాట సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. ఈ క్రమంలో వాడే మోడరన్ టెక్నాలజీ, వెపన్స్ ప్రత్యేకంగా ఉంటాయి. మధ్యమధ్యలో క్యారెక్టర్ల రిలేషన్స్, ఎమోషన్స్, లవ్ ట్రాక్స్.. ఇలా కథ సాగుతూ పోతుంటుంది. కథలో ప్రతీ క్యారెక్టర్‌ను వ్యూయర్స్ ఓన్ చేసుకున్నారు కాబట్టే.. అంతలా సూపర్ హిట్ అయ్యింది ఈ సిరీస్. సాల్వడోర్‌కు గౌరవసూచికంగా.. మనీ హెయిస్ట్ కథలో మరో ప్రధాన ఆకర్షణ.. క్యారెక్టర్ల పేర్లు. ముఠాలోని సభ్యులకు ఒరిజినల్ పేర్లు వేరే ఉంటాయి. వాళ్ల ఐడెంటిటీ మార్చేసే క్రమంలో వివిధ దేశాల రాజధానుల పేర్లు పెడతాడు ప్రొఫెసర్. టోక్యో, మాస్కో, బెర్లిన్, నైరోబీ, స్టాక్‌హోమ్, హెల్సెంకీ... ఇలాగన్నమాట. ఒకరకంగా ఈ పేర్లే మనీ హెయిస్ట్ను ఆడియెన్స్‌కి దగ్గర చేశాయి.. హయ్యెస్ట్ వ్యూయర్షిప్తో బ్రహ్మరథం పట్టేలా చేశాయి. కథలో ఆకట్టుకునే విషయం దోపిడీ ముఠా ధరించే మాస్క్‌లు. ఈ మాస్క్‌లకూ ఒక ప్రత్యేకత ఉంది. స్పానిష్ ప్రముఖ పెయింటర్ సాల్వడోర్ డాలి. ఆయన గౌరవార్థం.. ఆయన ముఖకవళికలతో ఉన్న మాస్క్‌ను ఈ సిరీస్‌కు మెయిన్ ఎట్రాక్షన్ చేశాడు ‘లా కాసా డె పాపెల్’ క్రియేటర్ అలెక్స్ పీనా. ఈ టీవీ షో తర్వాతే అలెక్స్ పీనా పేరు ప్రపంచం మొత్తం మారుమోగింది. ఆయనకి బడా ఛాన్స్‌లు తెచ్చిపెట్టింది. ఊపేసిన బెల్లా చావ్ మనీ హెయిస్ట్ థీమ్ మ్యూజిక్ కంటే.. ఈ సిరీస్ మొత్తంలో చాలాసార్లు ప్లే అయ్యే పాట బెల్లా సియావో(బెల్లా చావ్)కి ఒక ప్రత్యేకత ఉంది. బెల్లా సియావో ఒక ఇటాలియన్ జానపద గేయం. ఇంగ్లీష్‌లో దానర్థం ‘గుడ్‌బై బ్యూటిఫుల్’ అని. పాత రోజుల్లో ఇటలీలో మాండినా(సీజనల్ వ్యవసాయ మహిళా కూలీలు) తమ కష్టాల్ని గుర్తించాలని భూస్వాములకు గుర్తు చేస్తూ ఈ పాటను పాడేవాళ్లు. 19వ శతాబ్దం మొదట్లో నార్త్ ఇటలీలో వ్యవసాయ కూలీలు దారుణమైన పరిస్థితుల్ని ఎదుర్కొనేవాళ్లు. ఆ టైంలో ఈ పాట ఉద్యమ గేయంగా ఒక ఊపు ఊపింది. 1943–45 టైంలో యాంటీ–ఫాసిస్టులు ఈ పాటను ఎక్కువగా పాడేవాళ్లు. ఆ తర్వాత ఈ పాట వరల్డ్ కల్చర్‌లో ఒక భాగమైంది. చాలా దేశాల్లో రీమేక్ అయ్యింది. 1969 నుంచి మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో కూడా బెల్లా సియావో ఒక భాగమైంది. కానీ, మోస్ట్ పాపులర్ సాంగ్‌గా గుర్తింపు పొందింది మాత్రం మనీ హెయిస్ట్ సిరీస్‌తో. మెయిన్ క్యారెక్టర్స్ ఎల్ ప్రొఫెసర్, బెర్లిన్(అన్నదమ్ములు) కలిసి పాడిన ఈ పాట తర్వాత సీజన్ల మొత్తం నడుస్తూనే ఉంటుంది. 2018 సమ్మర్లో ‘బెల్లా సియావో’ యూరప్‌లో ఒక చార్ట్బస్టర్సాంగ్గా గుర్తింపు పొందింది. తెలుగులో మహేష్ బాబు ‘బిజినెస్ మేన్’లో.. ‘పిల్లా.. చావే...’ సాంగ్ దీని నుంచే స్ఫూర్తి పొందిందన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. -
బాక్సింగ్ రింగ్ వద్దే కూర్చొని నిరసన
టోక్యో: ఒలింపిక్స్‌లో ఆదివారం జరిగిన ఓ బాక్సింగ్ పోరు సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఫ్రెంచ్ బాక్స్ మౌరాద్ అలీవ్ సుమారు గంట పాటు బాక్సింగ్ రింగ్ వద్దే కూర్చొని నిరసన తెలిపాడు. తనపై అనర్హత వేటు వేయడంతో అసహన వ్యక్తం చేశాడు మౌరాద్. హెవీవెయిట్ బాక్సింగ్ క్వార్టర్ ఫైనల్లో భాగంగా బ్రిటన్‌కు చెందిన ఫ్రెజర్ క్లార్క్‌తో జరిగిన బౌట్ సందర్భంగా మౌరాద్ అలీవ్ అనర్హతకు గురయ్యాడు. అదే సమయంలో ఫ్రెజర్‌ను విజేతగా ప్రకటించారు. ప్రత్యర్థి ఫ్రెజర్‌ను పదే పదే తలతో కొట్టి గాయ పర్చడంతో మౌరాద్ అలీవ్‌పై వేటు పడింది. బాక్సింగ్ తొలి రౌండ్లో అలీవ్ పూర్తి ఆధిపత్యం కనబరిచాడు. ఐదుగురు జడ్జిలు అతనికే ఎక్కువ పాయింట్లు ఇచ్చారు. కానీ రెండో రౌండ్లో మాత్రం ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇరువురు బాక్సర్లు హోరాహోరీగా తలపడ్డారు. ఆ క్రమంలోనే అలీవ్ తలతో దాడికి దిగాడు. ఇది నిబంధనలకు విరుద్ధంగా కావడంతో అలీవ్‌పై అనర్హత వేటు వేస్తు నిర్ణయం తీసుకోగా ఫ్రెజర్ సెమీస్‌కు చేరినట్లు ప్రకటించారు. దీన్ని జీర్ణించుకోలేని అలీవ్ బాక్సింగ్ రింగ్ వద్దే కూర్చొండి పోయాడు. కాగా, అక్కడి అధికారులు అతనితో మాట్లాడిన తర్వాత వెళ్లిపోయిన అలీవ్.. మళ్లీ 15 నిమిషాల తర్వాత వచ్చి మళ్లీ అక్కడే కూర్చొండిపోయాడు. ఇలా గంటకు పైగా కూర్చొని నిరసన తెలిపాడు. తనకు ఎటువంటి వార్నింగ్ ఇవ్వకుండా పోరును అర్థాంతరంగా ఆపేసి తాను మ్యాచ్‌ను కోల్పోతున్నట్లు ప్రకటించారని అలీవ్ ఆరోపిస్తున్నాడు. తాను గెలిచే మ్యాచ్‌ను జడ్జిలే లాగేసుకున్నారని విమర్శలు గుప్పించాడు. ఈ మెగా టోర్నీ కోసమే తన లైఫ్‌ను పణంగా పెట్టానని, అటువంటి ఇలా ఎందుకు చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. -
ఒలింపిక్స్ రాష్ట్రంలో కరోనా కల్లోలం.. ఎమర్జెన్సీ విధింపు
టోక్యో: విశ్వ క్రీడా సంబురం ఒలింపిక్స్ పోటీలు జపాన్‌లో హోరాహరీగా సాగుతున్నాయి. అంతేస్థాయిలో ఆ దేశంలో కరోనా కేసులు కూడా పెరుగుతున్నాయి. మహమ్మారి విజృంభణ తీవ్రస్థాయిలో ఉండడంతో జపాన్ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్ జరుగుతున్న టోక్యో రాష్ట్రంతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. కరోనా వ్యాప్తి కట్టడి కోసం పటిష్ట చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశ రాజధాని టోక్యోతో పాటు సైతమ, చిబ, కనగవ, ఒసాకా, ఒకినవ రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రధానమంత్రి సుగ ప్రకటించారు. ఆగస్ట్ 31వ తేదీ వరకు ఎమర్జెన్సీ కొనసాగుతుందని స్పష్టం చేశారు. హొక్కయిడో, ఇషికవ, క్యోటో, హ్యోగో, ఫకుఒక, ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) వెల్లడించింది. అయితే కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండడంతో ప్రజలకు పలు సూచనలు చేసింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రజలకు సూచించింది. ప్రయాణాలు విరమించుకోవాలని తెలిపింది. కరోనా నిబంధనలు పక్కాగా పాటించాలని హెచ్చరించింది. ఆగస్ట్ నెలాఖరు వరకు 40 శాతం ప్రజలకు రెండు డోసులు అందించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొంది. ఆ దేశంలో గతవారంతో పోలిస్తే పది శాతం మేర కేసులు పెరిగాయి. ఏప్రిల్, జూన్ నెల మధ్యలో నెమ్మదించిన కరోనా జూలై తీవ్రమైంది. ముఖ్యంగా ప్రమాదకరమైన డెల్టా వేరియంట్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ప్రస్తుతం దేశ రాజధాని టోక్యో వేదికగా ఒలింపిక్స్ క్రీడలు జరుగుతున్నాయి. దీంతో జపాన్‌లో పెరుగుతున్న కరోనాతో ఇతర దేశాలు కూడా భయాందోళన చెందుతున్నాయి. తమ క్రీడాకారుల ఆరోగ్యంపై దృష్టి సారించాయి. PM Suga: For the period until August 31, we have decided to apply the declaration of a state of emergency to Tokyo, Saitama, Chiba, Kanagawa, Osaka, and Okinawa Prefectures, and to apply priority measures to prevent the spread of disease to Hokkaido, Ishikawa, Kyoto, (1/4) pic.twitter.com/W3n8GAzvX7 — PM's Office of Japan (@JPN_PMO) July 31, 2021 -
పెంచిన ప్రేమను చంపమంటూ.. విద్యార్థులకు పరీక్ష!
టోక్యో: ప్రేమ అజరామరం. దానికి కొలతలు ఉండవు. అది కన్న ప్రేమైనా.. పెంచిన ప్రేమైనా.. చంపాలంటే మనసు అంగీకరించదు అనేది తెలిసిందే. కానీ జపాన్‌లోని నిప్పాన్ ఫౌండేషన్ పాఠశాలల విద్యార్థులకు ఇలాంటి ప్రాజెక్ట్‌ను ఆరు సంవత్సరాలు (2019)గా సెంటర్ ఫ్యాకల్టీ పాఠ్యాంశాల్లో భాగంగా ఉంది. వివరాల్లోకి వెళితే.. పాజెక్ట్‌లో భాగంగా జపాన్‌లో పాఠశాల విద్యార్థులకు ఓ చేపను ఇస్తారు. విద్యార్థులు ఆ చేపకు తల్లీదండ్రులుగా ఆలన పాలన చూసుకోవాలి. ఒకవేళ ఆ చేప మరణిస్తే మళ్లీ మరొకటి ఇస్తారు. ఈ విధంగా ఓ ఎనిమిది నెలలు పెంచి పెద్ద చేసి చేపను వారే స్వయంగా చంపి తినాలి లేదా సముద్రంలో విడిచి పెట్టాలి. అంగీకరించని అనుబంధం 2020 అక్టోబర్‌లో పశ్చిమ షిజువాకాలోని హమామత్సు మహానగరంలో ఉన్న ఒక సెంటర్ ఫ్యాకల్టీలో పెంచిన చేపలను ఏం చేయాలనుకుంటున్నారో.. చెప్పాల్సిందిగా అధ్యాపకులు రెండు సూచనలు చేశారు. పెంచిన చేపలను తినడమా? సముద్రంలో వదిలి వేయడమా? అయితే 11 మంది కళాశాల విద్యార్థులు చేపలను తినడానికి అంగీకరించారు. మరో ఆరుగురు సముద్రంలో వదిలివేయాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ అప్పటి వరకు వాటితో ఉన్న అనుబంధం వల్ల ఆ విద్యార్థులు తినడానికి ఇబ్బంది పడ్డారు. దీనిపై జపనీస్ అధ్యాపకులు మాట్లాడుతూ.. విద్యార్థులు నిర్ణయం తీసుకోవడంలో నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఈ పద్ధతిని ఎన్నుకున్నట్లు తెలిపారు. ఇది ప్రకృతి సహజమని తెలియజేస్తుందని అన్నారు. -
టోక్యోలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. ఇప్పటివరకు ఇవే అత్యధికం
టోక్యో: విశ్వక్రీడలు జరుగుతున్న వేళ టోక్యో నగరంలో కరోనా కేసులు ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. నగరంలో ఇవాళ ఏకంగా 2848 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మహమ్మారి మొదలైన తర్వాత టోక్యోలో ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. పెరుగుతున్న కేసులతో టోక్యోలోని ఆసుపత్రులపై మళ్లీ ఒత్తిడి పెరుగుతున్నట్టు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే, ఒలింపిక్ గ్రామంలో ఇప్పటివరకు 155 మంది కరోనా బారిన పడ్డట్టు నిర్వహకులు తెలిపారు. ఇవాళ కొత్తగా మరో ఏడు కేసులు నమోదైనట్లు, ఇందులో నలుగురు అథ్లెట్లు కూడా ఉన్నట్లు ప్రకటించారు. ఒలింపిక్ గ్రామంలో కరోనా కేసులు చాపకింద నీరులా పాకుతుండటం ఒలింపిక్ నిర్వహకులతో సహా అథ్లెట్లను ఆందోళనకు గురి చేస్తుంది. మరోవైపు టోక్యో నగరంలో కరోనా కేసులు అధికమవుతుండటంతో క్రీడలను రద్దు చేయాలంటూ టోక్యో వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. -
రండి చీర్స్ చేద్దాం: ఒలింపిక్స్‌పై ప్రధాని మోదీ పిలుపు
సాక్షి, న్యూఢిల్లీ: విశ్వ క్రీడా సంబురం శుక్రవారం నుంచి ప్రారంభమైంది. ఒలింపిక్స్ క్రీడా పోటీల ప్రారంభోత్సవం అట్టహాసంగా సాగింది. భారతదేశానికి చెందిన క్రీడాకారులు వేదికపైకి రాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చప్పట్లతో స్వాగతం పలికారు. టీవీలో క్రీడా ప్రారంభోత్సవాలు చూస్తూ మన క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ‘అందరూ చీర్స్ ఫర్ ఇండియా చేద్దాం రండి’ అంటూ ప్రధాని ప్రజలకు పిలుపునిచ్చారు. ఢిల్లీలోని తన నివాసంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒలింపిక్స్ క్రీడా వేడుకలను టీవీలో స్వయంగా వీక్షించారు. భారత క్రీడాకారులు వేదిక మీదకు రాగానే ప్రధాని మోదీ లేచి నిలబడి చప్పట్లు చరుస్తూ వారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వజ్రాల్లాంటి క్రీడాకారులంటూ ప్రశంసిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఒలింపిక్స్ వేదికపై భారత పురుషుల హాకీ టీమ్ కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్, మహిళా దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ భారత జెండాని పట్టుకుని భారత బృందాన్ని నడిపించారు. భారత్ నుంచి 119 మంది క్రీడాకారులు టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. వీరిలో 67 మంది ఫురుషులు, 52 మంది మహిళా క్రీడాకారులు ఉన్నారు. ఆగస్టు 8వ తేదీ వరకూ టోక్యో ఒలింపిక్స్ కొనసాగనున్నాయి. Come, let us all #Cheer4India! Caught a few glimpses of the @Tokyo2020 Opening Ceremony. Wishing our dynamic contingent the very best. #Tokyo2020 pic.twitter.com/iYqrrhTgk0 — Narendra Modi (@narendramodi) July 23, 2021 భారత క్రీడాకారులు వేదికపైకి వస్తున్న వీడియో చూడండి #ओलम्पिकखेल भारतीय दल का मार्च पास्ट#Tokyo2020 #cheers4india #TeamIndia pic.twitter.com/jx0NSzgpDR — Doordarshan National दूरदर्शन नेशनल (@DDNational) July 23, 2021 -
క్రీడా గ్రామం బయటే బార్టీ బస
టోక్యో: మహిళల టెన్నిస్ ప్రపంచ నంబర్‌వన్ యాష్లే బార్టీ ఒలింపిక్స్ క్రీడా గ్రామం (స్పోర్ట్స్ విలేజ్)లో అడుగుపెట్టేందుకు విముఖంగా ఉంది. అథ్లెట్ల కోసమే నిరి్మంచిన ఈ విలేజ్‌లో ఇటీవల వరుసగా కరోనా కేసులు బయటపడటంతో ఆ్రస్టేలియన్ స్టార్ బార్టీ మరో చోట బస చేయనుందని ఆసీస్ చెఫ్ డి మిషన్ ఇయాన్ చెస్టర్‌మన్ తెలిపారు. ఇటీవలే వింబుల్డన్ చాంపియన్‌గా నిలిచిన ఆమె అదే ఉత్సాహంతో ఒలింపిక్స్ స్వర్ణం సాధించాలనే లక్ష్యంతో ఉంది. ఈ నేపథ్యంలో కరోనా బారిన పడకుండా పటిష్టమైన బుడగలో ఉండాలని ఆమె నిర్ణయించుకున్నట్లు చెస్టర్‌మన్ పేర్కొన్నారు. అయితే కొన్ని దేశాలకు చెందిన అథ్లెట్లకు దూరంగా ఉండాలని తమ అథ్లెట్లకు ఎలాంటి సూచనలు చేయలేదని ఆయన చెప్పారు. వ్యాఖ్యాతగా మైకేల్ ఫెల్ప్స్ స్టామ్ఫోర్డ్ (అమెరికా): అత్యధిక పతకాలతో ఒలింపిక్స్ పుటలకెక్కిన అమెరికా దిగ్గజ స్విమ్మర్ మైకేల్ ఫెల్ప్స్ ఇప్పుడు సరికొత్త పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యాడు. అమెరికాలోని ప్రముఖ బ్రాడ్‌కాస్టింగ్ సంస్థ అయిన ఎన్బీసీకి ఫెల్ప్స్ కరస్పాండెంట్, వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని ఎన్బీసీ నెట్వర్క్ అధికారికంగా వెల్లడించింది. ప్రధాన ఈవెంట్ల (ప్రైమ్‌టైమ్) ప్రసారంలో అతని కామెంట్రీ ఉంటుందని సంస్థ పేర్కొంది. గత నెలలో జరిగిన అమెరికా స్విమ్మింగ్ ట్రయల్స్‌లో అతను ఎన్బీసీ కవరేజ్‌కు సంబంధించిన కార్యక్రమాల్లో పాలుపంచుకున్నాడు. రికార్డు స్థాయిలో 2000 నుంచి 2016 వరకు జరిగిన ఐదు ఒలింపిక్స్ల్లో పోటీపడిన ఫెల్ప్స్ 23 స్వర్ణాలు సహా 28 పతకాలతో చరిత్ర సృష్టించాడు. -
టోక్యో ఒలింపిక్స్.. నాలుగు కొత్త క్రీడాంశాలు అరంగేట్రం
టోక్యో: విశ్వ క్రీడల్లో ఈసారి ఏకంగా నాలుగు కొత్త క్రీడాంశాలు అరంగేట్రం చేయనున్నాయి. స్కేట్ బోర్డింగ్, సర్ఫింగ్, స్పోర్ట్ క్లైంబింగ్, కరాటే క్రీడలకు తొలిసారి ఒలింపిక్స్‌లో చోటు లభించాయి. జపాన్‌లో అత్యంత ఆదరణ కలిగిన కరాటేకు ఈ క్రీడల్లో స్థానం ఇస్తున్నా... 2024 పారిస్ ఒలింపిక్స్‌లో మాత్రం కరాటేను కొనసాగించడంలేదు. 2008 బీజింగ్ ఒలింపిక్స్ తర్వాత బేస్‌బాల్, సాఫ్ట్‌బాల్ క్రీడలు పునరాగమనం చేయనున్నాయి. బెరెటిని కూడా...ఒలింపిక్స్‌కు ఇటలీ టెన్నిస్ స్టార్ దూరం రోమ్: విశ్వ క్రీడలకు దూరమవుతున్న టెన్నిస్ క్రీడాకారుల జాబితా ఇంకా పెరుగుతోంది. తాజాగా ఈ జాబితాలో ఈ ఏడాది వింబుల్డన్ టోర్నీ పురుషుల సింగిల్స్ రన్నరప్, ఏడో ర్యాంకర్ మాటియో బెరెటిని కూడా చేరాడు. తొడ గాయం కారణంగా ఒలింపిక్స్‌కు దూరమవుతున్నానని... ఈ గాయం నుంచి కోలుకోవడానికి కనీసం రెండు వారాలు పడుతుందని బెరెటిని అన్నాడు. ఇప్పటికే పురుషుల సింగిల్స్‌లో 20 గ్రాండ్‌స్లామ్ టోర్నీ టైటిల్స్ చొప్పున నెగ్గిన రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), రాఫెల్ నాదల్ (స్పెయిన్)... గత ఏడాది యూఎస్ ఓపెన్ చాంపియన్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా), ఈ ఏడాది వింబుల్డన్ సెమీఫైనలిస్ట్, ప్రపంచ పదో ర్యాంకర్ డెనిస్ షపోవలోవ్ (కెనడా), మూడు గ్రాండ్‌స్లామ్ టోర్నీల విజేత వావ్రింకా (స్విట్జర్లాండ్)... మహిళల సింగిల్స్‌లో గ్రాండ్‌స్లామ్ చాంపియన్స్ సెరెనా విలియమ్స్ (అమెరికా), సిమోనా హలెప్ (రొమేనియా), విక్టోరియా అజరెంకా (బెలారస్), ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ), బియాంక ఆండ్రెస్కూ (కెనడా) టోక్యో ఒలింపిక్స్ నుంచి వైదొలిగారు. -
ఇద్దరు దక్షిణాఫ్రికా ఫుట్‌బాలర్లు ‘పాజిటివ్’
టోక్యో: ఒలింపిక్ క్రీడా గ్రామంలో కరోనా కలకలం... ఆటగాళ్లు గేమ్స్ విలేజ్‌లోకి వచ్చిన తర్వాత తొలిసారి కోవిడ్ కేసులు బయట పడ్డాయి. దక్షిణాఫ్రికా ఫుట్‌బాల్ జట్టుకు చెందిన ఇద్దరు ఆటగాళ్లు ఆదివారం ‘పాజిటివ్’గా తేలారు. థబిసో మొన్యానే, కమొహెలో మహలత్సి అనే ఇద్దరు ఆటగాళ్లకు కరోనా సోకినట్లు దక్షిణాఫ్రికా ఒలింపిక్ కమిటీ అధికారికంగా ప్రకటించింది. క్రీడా గ్రామం బయట ఉంటున్న ఇదే జట్టు వీడియో ఎనలిస్ట్ మారియో మాషా కూడా పాజిటివ్‌గా తేలినట్లు స్పష్టం చేసింది. వీరందరినీ ఐసోలేషన్‌కు పంపించడంతో పాటు తదుపరి పరీక్షల వరకు జట్టు ఇతర సభ్యులు కూడా ప్రాక్టీస్‌కు దిగరాదని నిర్వాహకులు ఆదేశించారు. మరోవైపు ఒలింపిక్స్‌లో ఫేవరెట్ అయిన దక్షిణాఫ్రికా రగ్బీ టీమ్ కోచ్ నీల్ పావెల్‌కు కూడా కరోనా సోకింది. ఈయన కూడా గేమ్స్ విలేజ్‌లోనే ఉంటున్నారు. ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న జట్లలో భాగమై కోవిడ్ సోకిన నలుగురూ దక్షిణాఫ్రికాకు చెందినవారే కాగా... నిర్వహణా ఏర్పాట్ల బృందంలోని మరో ఆరుగురితో కలిపి ఆదివారం మొత్తం 10 కేసులు బయటపడ్డాయి.ఓవరాల్‌గా ఒలింపిక్స్ తో సంబంధం ఉన్న పాజిటివ్‌ల సంఖ్య 55కు చేరింది. గేమ్స్ విలేజ్‌లో భారత బృందం ఉన్న టవర్ 15లోనే దక్షిణాఫ్రికా టీమ్ ఉంటోంది. -
కోట్లాది అభిమానుల ఆశలను మోస్తూ..
ఏడాది కాలంగా అంతులేని ఉత్కంఠ... అంతకుమించి ఆందోళన... విశ్వ క్రీడల్లో సత్తా చాటేందుకు అవకాశం దక్కుతుందా లేక కోవిడ్‌తో తమ నాలుగేళ్ల కష్టం కరిగిపోతుందా అనే సందేహాలు... అసలు ఒలింపిక్స్ జరుగుతాయా లేక ఈసారికి ఇంతే అంటూ ఆటలకు అడ్డు చెబుతారా అనే అనుమానాలు... ఒలింపిక్స్‌పై గురి పెట్టిన క్రీడాకారుల మానసిక పరిస్థితి ఇది. ఇలాంటి అవరోధాలు దాటి ఎట్టకేలకు మన ఆటగాళ్లు జపాన్ గడ్డపై అడుగు పెట్టారు. కోట్లాది అభిమానుల ఆశలను మోస్తూ టోక్యో చేరిన తొలి భారత బృందం దారిలో తమ సమస్యలన్నీ పసిఫిక్ మహా సముద్రంలో పడేసి ఇక మైదానంలో పతకాల వేటకు సన్నద్ధమైంది. టోక్యో: ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు 88 మందితో కూడిన మన దేశపు తొలి బృందం ఆదివారం ఉదయం టోక్యో చేరుకుంది. అక్కడికి వెళ్లగానే కీలకమైన కరోనా పరీక్షల తంతును విజయవంతంగా ముగించడంతో తొలి ఘట్టం పూర్తయింది. అందరికీ విమానాశ్రయంలోనే కోవిడ్ పరీక్షలు నిర్వహించగా, అంతా ‘నెగెటివ్’గా తేలారు. దాంతో తమ తమ క్రీడాంశాల్లో సోమవారం నుంచే సాధన చేసేందుకు అవకాశం లభించింది. ఇందులో బ్యాడ్మింటన్, ఆర్చరీ, టేబుల్ టెన్నిస్, హాకీ తదితర క్రీడాంశాలకు చెందిన వారు ఉన్నారు. ఈ తొలి బృందంలో ఉన్న ప్రధాన ఆటగాళ్లలో కొందరు పీవీ సింధు, మేరీకోమ్, అమిత్ పంఘాల్, దీపిక కుమారి, మనికా బాత్రా. శనివారం రాత్రి ఢిల్లీ నుంచి బయల్దేరిన మన జట్టుకు టోక్యోలో భారత డిప్యూటీ చెఫ్ డి మిషన్ డాక్టర్ ప్రేమ్ వర్మ స్వాగతం పలికారు. ఊహించినట్లుగానే విమానాశ్రయంలో లాంఛనాలు పూర్తి చేసేందుకు ఆరు గంటల సమయం పట్టింది. కరోనా ఫలితాలు వచ్చిన తర్వాత అథ్లెట్లంతా క్రీడా గ్రామంలోకి అడుగు పెట్టారు. ‘ఇక్కడికి చేరుకున్న దగ్గరి నుంచి ఇప్పటి వరకు అంతా బాగుంది. గేమ్స్ విలేజ్‌లో సౌకర్యాలు, భోజనంవంటి విషయాలు సహా ఇతరత్రా కూడా ఎలాంటి ఫిర్యాదులు లేవు. కరోనా ప్రొటోకాల్‌ను అంతా సరిగా పాటిస్తే చాలు’ అని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఘనంగా వీడ్కోలు... టోక్యో బయల్దేరడానికి ముందు న్యూఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారత బృందానికి ప్రత్యేక వీడ్కోలు కార్యక్రమం జరిగింది. కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, సహాయ మంత్రి నిషిత్ ప్రమాణిక్, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధికారులు ఇందులో పాల్గొని ఆటగాళ్లకు ‘బెస్ట్ ఆఫ్ లక్’ చెప్పారు. ఒలింపిక్స్‌కు వెళుతున్న ఆటగాళ్లు, కోచ్‌లు తదితరులను సాధారణ ప్రయాణీకులు, సిబ్బంది చప్పట్లతో ప్రోత్సహిస్తూ సాగనంపడంతో ఇందిరాగాంధీ విమానాశ్రయం హోరెత్తడం విశేషం. ఆంక్షలేమీ లేవు... కరోనా కేసుల నేపథ్యంలో భారత్ నుంచి వస్తున్న అథ్లెట్లకు అదనపు ఆంక్షలు విధిస్తున్నట్లు గతంలో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని తేలింది. మన క్రీడాకారులు గేమ్స్ విలేజ్‌లో తొలి రోజు నుంచే ఎక్కడైనా స్వేచ్ఛగా తిరగవచ్చని చెఫ్ డి మిషన్ డాక్టర్ ప్రేమ్ వర్మ చెప్పారు. మూడు రోజులు తప్పనిసరిగా ఎవరితో కలవకుండా ఐసోలేషన్‌లో ఉండాలనే నిబంధన కూడా ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు. ‘గత బుధవారం నుంచి మేం గేమ్స్ విలేజ్‌లో ఉన్నాం. అందరూ తిరిగే కారిడార్, డైనింగ్ హాల్ వంటి వాటిని ఉపయోగించుకుంటున్నాం. మన అథ్లెట్లకు కూడా ఎలాంటి ఆంక్షలు లేవు. క్రీడా గ్రామంలో వారు ఎక్కడైనా స్వేచ్ఛగా వెళ్లవచ్చు. వారు ఉండే టవర్‌లో అన్ని సౌకర్యాలను తొలి రోజు నుంచే వాడుకోవచ్చు’ అని ఆయన వెల్లడించారు. గేమ్స్ విలేజ్‌లో భారత ఆటగాళ్లు టవర్ 15లోని 11, 12, 13 అంతస్తుల్లో ఉంటున్నారు. మన బృందం కోసం మొత్తం 182 గదులు కేటాయించారు. ఇదే టవర్‌లో డెన్మార్క్, దక్షిణాఫ్రికా, నార్వే, బెల్జియం ఆటగాళ్లు ఉన్నారు. టోక్యో క్రీడా గ్రామంలో భారత బాక్సర్ మేరీకోమ్ -
టోక్యో ఒలింపిక్స్ విలేజ్‌లో తొలి కరోనా కేసు
-
టోక్యోకు భారత్ నుంచి తొలి బృందం
న్యూఢిల్లీ: శతకోటి ఆశలను, ఆకాంక్షలను మోసుకుంటూ భారత్ నుంచి క్రీడాకారులు, క్రీడాధికారులతో కూడిన తొలి బృందం శనివారం రాత్రి టోక్యోకు పయనమైంది. తొలి బృందంలో 88 మంది ఉన్నారు. ఇందులో ఆర్చరీ, హాకీ, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, జూడో, జిమ్నాస్టిక్స్ పోటీల్లో పాల్గొనే 54 మంది క్రీడాకారులు ఉన్నారు. మిగతా వారు సహాయ సిబ్బంది ఉన్నారు. భారత్ నుంచి మొత్తం 127 మంది క్రీడాకారులు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించగా... విదేశాల్లో శిక్షణకెళ్లిన పలువురు క్రీడాకారులు అక్కడి నుంచే నేరుగా టోక్యో చేరుకుంటున్నారు. షూటర్లకు క్వారంటైన్ లేదు విదేశాల్లో శిక్షణ తీసుకున్న భారత షూటర్లు నేరుగా టోక్యోకు చేరడంతో క్వారంటైన్ తప్పింది. దీంతో వారంతా సోమవారం నుంచి ప్రాక్టీస్ చేసుకునే వీలు చిక్కింది. ఒలింపిక్స్‌కు అర్హత పొందిన 15 మంది షూటర్లలో 13 మంది క్రొయేషియాలో, ఇద్దరు స్కీట్ షూటర్లు ఇటలీలో తుది కసరత్తు చేశారు. ఆటలకు సమయం దగ్గరపడటంతో ఆమ్‌స్టర్‌డామ్‌లో ఒక్కటైన షూటింగ్ జట్టు అక్కడి నుంచి శనివారం ఉదయం టోక్యోకు చేరుకుంది. -
గందరగోళం.. 14 లేదా 17న...
న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌కు మరో రెండు వారాల సమయం మాత్రమే మిగిలి ఉన్న స్థితిలో కూడా భారత బృందం టోక్యో వెళ్లే తేదీ విషయంపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ఆటగాళ్లు ఈ నెల 14న వెళతారా లేక 17న అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఆటగాళ్లంతా 17న బయల్దేరతారని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు నరీందర్ బాత్రా మూడు రోజుల క్రితం ప్రకటించగా, 14న పయనం కావాల్సి ఉందంటూ తాజాగా అదే ఐఓఏ నుంచి ఆటగాళ్లు, క్రీడా సమాఖ్యలకు మెసేజ్ వచ్చింది. నిబంధనల ప్రకారం స్వదేశం నుంచి బయల్దేరే ముందు వరకు వరుసగా ఏడు రోజుల పాటు అథ్లెట్లు ఆర్టీ–పీసీఆర్ కోవిడ్ టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది. 14న బయల్దేరాలంటే కచ్చితంగా బుధవారం నుంచే వారి కోవిడ్ పరీక్షలు ప్రారంభం కావాలి. ఆలస్యమైతే మరో మూడు రోజులు అదనంగా పరీక్షలు చేయించుకోవాలి. ముఖ్యంగా జూలై 23 నుంచే ఆర్చరీ పోటీలు జరుగుతాయి కాబట్టి ఆర్చర్లు ఇక్కడ ముందుగానే సాధన నిలిపేయాల్సి ఉంటుంది. ఈ గందరగోళ పరిస్థితిని నివారించి తమకు పక్కా సమాచారం అందించాలని వివిధ క్రీడా సమాఖ్యలు ఐఓఏను కోరుతున్నాయి. మరోవైపు ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ల విషయంలోనైతే ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోగా... ఎప్పుడైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని, 24 గంటల ముందు మాత్రమే తెలియజేస్తామని చెప్పడం విశేషం. -
ఇక అక్కడ పనిదినాలు నాలుగు రోజులే!
కరోనా వైరస్ ఎన్నో మార్పులు తీసుకొస్తోంది. రిమోట్ నుంచి హైబ్రిడ్ వర్కింగ్ విధానానికి దారితీసింది. ఇందులో భాగంగా జపాన్ మరో అడుగు ముందుకు వేయబోతోంది. పని దినాలను ఐదు నుంచి నాలుగు రోజులకు తగ్గించాలని అనుకుంటోంది. ఈ మేరకు ఒక ప్రతిపాదనను వార్షిక ఆర్థిక విధానాల మార్గదర్శకాలలో కీలకంగా చేర్చింది. టోక్యో: జపాన్ గవర్నమెంట్ 2021 కొత్త ఆర్థిక విధానాలతో వార్షిక మార్గదర్శకాల్ని విడుదల చేసింది. అందులో ఐదురోజుల పనిదినాలకు బదులు.. నాలుగు రోజులే పనిరోజులు ఉండాలని ప్రతిపాదించింది. ఉద్యోగుల పని-జీవితం ఈ రెండు విషయాల్ని పరిగణనలోకి తీసుకుని.. వాటిని సమతుల్యం చేసే విధంగా ఈ విధానాల్ని రూపొందించినట్లు ప్రభుత్వం పేర్కొంది. జపాన్ అంటే హార్డ్వర్కింగ్కు కేరాఫ్ అనే ముద్ర ప్రపంచం మొత్తం ఉంది. అలాంటి దేశంలో తమ పని గంటల్ని తగ్గించాలని ఉద్యోగులు చాలా ఏళ్లుగా కోరుకుంటున్నారు.. ఉద్యమిస్తున్నారు. ఈ తరుణంలో నాలుగు రోజుల పనిరోజులు ఊరట కలిగించేదే అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ వ్యవహారంలో రాజకీయ నేతలు సైతం జోక్యం చేసుకుంటున్నారు. కొందరు నేతలు కార్పొరేట్ ప్రతినిధులతో ఎంప్లాయిస్ పనిగంటల తగ్గింపు, వర్క్‌ఫ్రమ్ హోం లాంటి అంశాల గురించి చర్చిస్తున్నారు. ఇక తాజా మార్గదర్శకాలపై వాళ్లంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. నెలలోపే నాలుగు రోజుల పనిదినం పాలసీ అమలులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే మేధావులు మాత్రం రెండు వర్గాలుగా విడిపోయి చర్చించుకుంటున్నారు. నాలుగు రోజుల పనిదినాల వల్ల అవుట్‌పుట్ తగ్గిపోతుందని, ప్రొడక్టివిటీపెరగకపోయినా.. ఉత్తేజంగా పని చేస్తారని, అదే టైంలో జీతాల కోతల గురించి కూడా ఉద్యోగులు ఆలోచించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. కరోషి మరణాలు వర్క్‌ప్లేస్ మరణాలకు జపాన్ ఉద్యోగులు పెట్టుకున్న పేరు. తీవ్ర పని ఒత్తిడితో గుండెపోటు తదితర అనారోగ్య సమస్యలతో చనిపోయినా, లేదంటే ఒత్తిడితో ఆత్మహత్యలుచేసుకున్నా వాటిని కరోషి మరణాలుగా పరిగణిస్తారు. 2015, క్రిస్మస్‌నాడు మట్సూరి టకహషి(24) అనే యువతి.. పని ఒత్తిడి తట్టులేక ఆత్మహత్య చేసుకోవడంతో జపాన్ పని వాతావరణం, పని గంటల గురించి వీర లెవల్లో చర్చ జరిగింది. చదవండి: బఫెట్ రాజీనామా! ఎం జరిగిందంటే.. -
జపాన్‌లో భూకంపం: రిక్టర్ స్కేల్‌పై 5.5 తీవ్రత
టోక్యో: జపాన్‌లో భూకంపం సంభవించింది. ఈ భూకంపం రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 5.5గా నమోదైనట్లు యూఎస్ జీయోలాజికల్ సర్వే శనివారం వెల్లడించింది. జపాన్‌లోని తకాహగికి 125 కిలో మీటర్ల దూరంలో ఈ భూకంపం కేంద్రీకృతం అయినట్లు అధికారులు తెలిపారు. భూకంపం వల్ల ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు. చదవండి: Hong Kong: జిమ్మీలాయ్కి 14 నెలల జైలు -
Tokyo Olympics: దయచేసి రద్దు చేయండి: వైద్యులు
టోక్యో: దేశంలో కరోనా కేసులు మరోసారి పెరుగుతున్న నేపథ్యంలో జూలై–ఆగస్టులలో జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్‌ను రద్దు చేయాల్సిందిగా జపాన్ ప్రధాని యోషిహిడే సుగాకు టోక్యోకు చెందిన ఆరు వేల మంది వైద్యులు లేఖ రాశారు. కరోనా కేసులతో ఇప్పటికే టోక్యోలోని ఆసుపత్రులు నిండిపోయాయని, కొత్త వారికి చికిత్స అందించేందుకు సరిపడా వైద్య సిబ్బంది కూడా లేరని లేఖలో వారు పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఒలింపిక్స్‌ను రద్దు చేస్తేనే మేలని ప్రధానికి సూచించారు. చదవండి: టోక్యో ఒలింపిక్స్‌పై స్పష్టత ఇవ్వాలి: ఫెడరర్ -
టోక్యో ఒలింపిక్స్‌పై స్పష్టత ఇవ్వాలి: ఫెడరర్
బెర్న్: జపాన్‌లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈసారైనా టోక్యో ఒలింపిక్స్ జరుగుతాయో లేదో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, గేమ్స్ నిర్వాహకులు స్పష్టత ఇవ్వాలని స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం ఫెడరర్ కోరాడు. ఒకవేళ ఒలింపిక్స్ రద్దయితే ఎందుకు రద్దు చేశారో తాను అర్ధం చేసుకోగలనని 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో డబుల్స్ స్వర్ణం, 2012 లండన్ ఒలింపిక్స్‌లో సింగిల్స్‌లో రజతం నెగ్గిన ఫెడరర్ అన్నాడు. ఒకవేళ ఒలింపిక్స్ జరిగితే తాను బరిలోకి దిగుతానని ఫెడరర్ తెలిపాడు. -
అసలు ఈ మగాళ్లకు ఏమైంది!
టోక్యో ఒలింపిక్స్ కమిటీ నుంచి మళ్లీ ఇంకొకాయన దిగిపోయారు! పేరు హిరోషి ససాకి. తీరు బాయిష్ టాక్. వయసు 66. బుద్ధి వికసించని మగపిల్లలు.. ఎదుగుతున్న వయసులోని ఆడపిల్లల్ని బాడీ షేమింగ్ చేస్తుంటారు. అలా ఈయన నవోమి వతనబి అనే 33 ఏళ్ల ‘చబ్బీ అండ్ క్యూట్’ మూవ్మెంట్ సెలబ్రిటీని ‘ఒలిం–పిగ్’ అనేశాడు! అన్నది ఎప్పుడో. ఇప్పుడు బయట పడింది. ‘లైవ్’ అనే చాట్ గ్రూప్ లో.. ‘ఒలింపిక్స్ ఓపెనింగ్ సెర్మనీకి ఆ ఒలిం–పిగ్ ని ఆహ్వానిద్దాం‘ అన్నారట హిరోషి. ఒలింపిక్స్ ప్రారంభ, ముగింపు ఉత్సవాల నిర్వహణ కమిటీకి క్రియేటివిటీ హెడ్ ఆయన. క్రియేటివిటీ కాస్త మితి, మతి తప్పినట్లుంది... అంత మాట అనేసి, అపాలజీ చెబుతూ తన పదవికి రాజీనామా చేశారు. కొద్ది రోజుల క్రితమే యెషిరో అనే 83 ఏళ్ల పెద్ద మనిషి.. ‘ఈ మహిళలున్నారే మీటింగ్స్‌లో అధిక ప్రసంగం చేస్తారు’ అని కామెంట్ చేసి, ‘స్టెప్ డౌన్’ అయ్యారు. ఒలింపిక్స్ నిర్వహణ కమిటీ అధ్యక్షుడు ఆయన! అసలు ఈ మగాళ్లకు ఏమైంది! ఎందుకిలా ‘బాయ్స్’ లా మాట్లాడతారు? ఇందుకు వాళ్లేం (పురుషులు) చెబుతున్నారు? వీళ్లేం (మహిళలు) అంటున్నారు. నవోమి వతనబి ప్లస్–సైజ్ కమెడియన్. వసపిట్ట. మాటలతో పొట్టల్ని చెక్కలు చేస్తారు. ఆమెను చూడగానే నవ్వు గుర్తుకు రావడానికి ఆమె మాటలతో పాటు ఆమె రూపం కూడా కొంత కారణం. లావుగా ఉంటారు నవోమి. ప్లస్–సైజ్‌లో! ఆమె నవ్వింపులు, కవ్వింపుల టాపిక్ కూడా అదే.. ప్లస్ సైజ్. లావుగా ఉండటాన్ని తను సీరియస్‌గా తీసుకోరు, ఎవర్నీ తీసుకోనివ్వరు కూడా. బాడీ షేమింగ్ చేసేవాళ్లని తన మృదువైన చిరునవ్వు పలుకులతో బాది పడేస్తారు. జపాన్ రాజధాని టోక్యోలో ఏ పెద్ద ఈవెంట్ జరిగినా ఉల్లాసభరితమైన ఆమె స్వాగత వచనాలతో అది ప్రారంభం కావడం కానీ, ముగింపునకు రావడం కానీ జరుగుతుంది. అంతగా ఆమె పావులర్ అవడానికి ఇంకొక కారణం ‘పొచాకవాయి’! ఈ మాటను ఇంగ్లిష్‌లోకి అనువదిస్తే ‘చబ్బీ అండ్ క్యూట్’ అనే అర్థం వస్తుంది. బొద్దుగా, ముద్దుగా అని. లావుగా ఉన్నవాళ్లలో సాధారణంగా ఉండే చిన్నబుచ్చుకునే స్వభావాన్ని పోగొట్టి, లావుగా ఉన్నవాళ్లను చిన్నబుచ్చే వాళ్లను ‘కాస్త విశాలంగా ఆలోంచించండి’ అని చెప్పడానికి నవోమి చేపట్టిన ఉద్యమం పేరే.. పొచాకవాయి. అలా ఉద్యమకారిణిగా కూడా జపాన్‌లో నవోమికి పేరుంది, గౌరవం ఉంది. అంతటి మనిషిని పట్టుకుని హిరోషి ససాకి (66) అనే పెద్ద మనిషి పిగ్ అనేశాడు! సరిగ్గా ఆయన అన్న మాటైతే.. ‘ఒలిం–పిగ్’ అని! పెద్దమనుషులు ఎక్కడైనా అలా అంటారా? ‘‘నోరు జారాను సారీ’’ అన్నారు కనుక హిరోషిని పెద్దమనిషి అనే అనుకోవాలి. అంతేకాదు తన పదవికి బుధవారం రాత్రి రాజీనామా చేశారు. చిన్న పదవి కాదు ఆయనది. టోక్యోలో ఈ ఏడాది జరగబోతున్న ఒలింపిక్స్‌కి ప్రారంభ, ముగింపు ఉత్సవాలను నిర్వహించే కమిటికీ క్రియేటివ్ హెడ్! సికొ హషిమొటో, ఒలింపిక్స్ కమిటీ కొత్త అధ్యక్షురాలు ఆయన అలా అన్నందుకు నవోమీ ఏమీ బాధపడలేదు. పురుషుల గుణగణాలు ఆమెకు తెలియనివేవీ కాదు. హిరోషి మాత్రం పశ్చాత్తాపంతో కుమిలిపోయినంత పని చేశాడు. ‘నేను ఆమెను అవమానపరిచాను. అలా అని ఉండాల్సింది కాదు’ అంటూ.. రాజీనామా సమర్పణకు ముందు ఆమెకు సారీ చెబుతూ ఒక ప్రకటన చేశారు. ‘ఒలిం–పిగ్’ అని హిరోషి ఇప్పుడు అన్నమాట కాదు. గత ఏడాది ఆఖరులో.. టోక్యో ఒలింపిక్స్ ప్రారంభోత్సవాలకు ఎవరెవర్ని పిలవాలో టీమ్ అంతా కలిసి, మెసేజింగ్ యామ్ ‘లైన్’లో గ్రూప్ చాటింగ్ చేస్తున్నప్పుడు.. ‘ఆమె ఉంది కదా నవోమీ.. ఆమెకు ఒలింపిగ్ రోల్ ఇద్దాం. సరిగ్గా సరిపోతుంది’ అన్నారు హిరోషి. ఆమె లావుగా ఉంటుంది కనుక, తను క్రియేటివ్ హెడ్డు కనుక ఆమె లావును, తన క్రియేటివిటీని కలిపి ఒలిం–పిగ్ అనే మాటను వాడేశారు హిరోషి. దాన్నిప్పుడు ఒక పత్రిక బయట్టేసింది! ఆ మాట చివరికి అతడికే తలవంపులు తెచ్చిపెట్టింది. తల దించుకుని మెట్లు దిగి వెళ్లిపోయాడు. నవోమి కమెడియన్ మాత్రమే కాదు, నటి, ఫ్యాషన్ డిజైనర్ కూడా. తనని పిగ్ అన్నందుకు ఆమె రాద్ధాంతం ఏమీ చెయ్యలేదు. ‘‘పురుషులు ఎందుకనో ఇలాగే ఉంటారు. సంస్కారవంతులు అనుకున్నవాళ్లు కూడా తమ సమూహంలో ఉన్నప్పుడు ఆడవాళ్లను తేలిగ్గా మాట్లాడతారు. అది గొప్ప అనుకుంటారు’’ అని ఈ చేదు సందర్భంలోనూ తియ్యగా నవ్వించారు నవోమి. హిరోషి కూడా.. ‘‘ఆరోజు నాకేమయిందో తెలియదు. నా ఆలోచనలు సరిగా లేవు. ఒక స్త్రీని నేను అలా అనగలనని ఇప్పటికీ అనుకోలేకపోతున్నాను. మాట జారాను. నేను ఇక ఈ సీట్లో ఉండేందుకు తగినవాడిని కాదు’’ అని ఏమాత్రం సంకోచించకుండా తన గురించి చెప్పుకున్నారు. ‘పురుషజాతి ప్రక్షాళనకు ఆ ఒప్పుకోలు మాట ఒక్కటి చాలు’ అనిపించేటంతగా ఆయన తనని మన్నించమని మహిళా లోకాన్ని వేడుకున్నారు. ఐ యామ్ వెరీ సారీ యొషిరొ మొరి: తన విపరీత వ్యాఖ్యలతో కొత్త అధ్యక్షురాలు రావడానికి కారణమైన పాత అధ్యక్షుడు. టోక్యో ఒలింపిక్స్ నిర్వహణ కమిటీలో ఇది రెండో అతిపెద్ద రాజీనామా. అది కూడా ఒక నెల వ్యవధిలో జరిగిన మహాభినిష్క్రమణ. ఫిబ్రవరి రెండో వారంలో కమిటీ ముఖ్యాధ్యక్షుడు యొషిరొ మొరి (83).. మహిళల మీద తగని వ్యాఖ్యాలు చేసినందుకు గద్దె దిగి వెళ్లిపోవలసి వచ్చింది. ఒలింపిక్స్ నిర్వహణకు అనేక కమిటీలు ఉంటాయి. వాటన్నిటిపైన ఉండే అత్యున్నత కమిటీకి యొషిరో అధ్యక్షులు. ఆ రోజు ఏదో కీలకమైన సమావేశం ఉంది. అది పూర్తయ్యాక ఆ వివరాలు ఇవ్వడం కోసం యొషిరో మీడియా ముందుకు వచ్చారు. మీడియా వాళ్లు సహజంగానే వెయ్యవలసిన ప్రశ్నే వేశారు. ‘‘మీ కమిటీలో నామమాత్రంగా కూడా మహిళలు ఉన్నట్లు లేరు. కారణం ఏమిటి?’’ అని అడిగారు. యోషిరో వెంటనే.. ‘‘ఆడవాళ్లు మీటింగులలో అధిక ప్రసంగం చేస్తారు. సమయం వృధా అవుతుంది. అందుకే వాళ్లను కమిటీలోకి తీసుకునే ఉద్దేశం లేదు’’ అనేశారు! అది దెబ్బకొట్టేసింది ఆయన ప్రతిష్టని. దేశవ్యాప్తంగా మహిళా సంఘాలు, యూనివర్సిటీ విద్యార్థులు, విద్యావంతులు నిరసన ప్రదర్శనలు జరిపారు. తక్షణం ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంలో పెద్దవాళ్ల నుంచి కూడా ఒత్తిడి రావడంతో చివరికి ఆయన తన పదవిని త్యజించవలసి వచ్చింది. ఆయన స్థానంలోకి సికో హషిమొటొ అనే మహిళ వచ్చారు. వచ్చీ రావడంతోనే కమిటీ ఎగ్జిక్యూటివ్ బోర్డులోకి పన్నెండు మంది మహిళల్ని తీసుకున్నారు. ‘‘నేను అన్న ఉద్దేశం వేరు. మహిళలు కమిటీలో ఉంటే వాళ్లు మాట్లాడుతున్నప్పుడు ఒకే అంశంపై వాళ్లను ఉంచలేము. సమయాన్ని దృష్టిలో పెట్టుకుని అలా అన్నాను తప్ప మహిళల్ని కించపరచాలని కాదు. నాకసలు అలాంటి ఆలోచనే లేదు’’ అని యొషిరో అననైతే అన్నారు కానీ మూల్యమైతే చెల్లించుకోవలసి వచ్చింది. పురుషులు అనే ఇటువంటి మాటల్ని ‘సెక్సిస్టు కామెంట్స్’ అంటారు. తెలుగులో ఈ మాటకు సులువైన అర్థం.. ‘నేను మగాణ్ణి. ఏమైనా అంటాను’ అనే ధోరణితో కూడిన వ్యాఖ్యలు. నిజానికి అది ధోరణి కాదు. తరాలుగా జీర్ణించుకుపోయిన పురుషాధిక్య భావన. ఏమైనా పురుషులు ఇప్పుడిప్పుడు మహిళల మనోభాలు దెబ్బతినకుండా మాట్లాడ్డం నేర్చుకుంటున్నారు. ఆ ప్రయత్నంలోనే.. మాట అన్నాక ఏ మాత్రం రోషానికి పోకుండా మాటను వెనక్కు తీసుకుంటున్నారు. క్షమాపణ చెబుతున్నారు. ‘మారేందుకు సమయం పట్టడం సహజమే’ అని మహిళలూ సహనంగా వేచి చూస్తున్నారు. -
‘దెయ్యం జుట్టు’ అని కూడా వెక్కిరించారు
టోక్యో(జపాన్)కు చెందిన రిన్ కంబే మోడల్, డ్యాన్సర్. మోడలింగ్, డ్యాన్స్ వల్ల ఆమెకు పెద్దగా పేరేమి రాలేదుగానీ కేవలం జుట్టు వల్ల బోలెడు పేరు వచ్చింది. ఆమె శిరోజాల పొడవు అక్షరాలా ఆరు అడుగుల మూడు అంగుళాలు. పదిహేను సంవత్సరాల నుంచి జుట్టును కత్తిరించడం లేదట. తన జుట్టు గురించి రిన్ కంబే చాలా మురిపెంగా చెప్పుకుంటుంది.. ‘నా జుట్టు భావవ్యక్తీకరణకు బలమైన ఆయుధం’ ‘నా జుట్టు ఆసియా అందానికి ప్రతీక’....ఇలా గొప్పగా చెప్పుకోవడమే కాదు, ‘దెయ్యం జుట్టు’ అనే వెక్కిరింపుల గురించి కూడా ప్రస్తావిస్తుంది. జుట్టు పెంచడం, సంరక్షించడం అంతా వీజీ కాదని, తాను ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నది అనర్గళం గా చెబుతుంది. ఆమె కష్టం వృథా పోలేదు. పొడవైన జుట్టు తనకు ప్రత్యేక గుర్తింపు తీసుకు వచ్చింది. -
టోక్యో ఒలింపిక్స్ నిర్వహించి తీరుతాం
ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడాది జూలై–ఆగస్టులలో టోక్యో ఒలింపిక్స్ నిర్వహించి తీరుతామని ఆతిథ్య దేశం పునరుద్ఘాటించింది. కార్యనిర్వాహక కమిటీ అధ్యక్షుడు యోషిరో మోరీ మాట్లాడుతూ ‘ఎలాంటి పరిస్థితులెదురైనా... కరోనా మహమ్మారి ప్రభావం ఎలా వున్నా... మేమైతే మెగా ఈవెంట్ నిర్వహిస్తాం’ అని తమ ఉద్దేశాన్ని బలంగా చెప్పారు. ఒలింపిక్స్ జరుగుతాయా లేదా అన్న చర్చకు బదులు ఎలా నిర్వహించాలన్న చర్చే ఇకపై జరుగుతుందని... ముందుగా అనుకున్నట్లే మార్చి 25న టార్చ్ రిలే పునఃప్రారంభమవుతుందని ఆయన అన్నారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) కూడా టోర్నీ నిర్వహణపైనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. గత ఏడాదే జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ కరోనా కారణంగా ఈ ఏడాదికి వాయిదా పడింది. -
జపాన్‌లో కరోనా కొత్త వర్షన్: టోక్యో బంద్
టోక్యో: కరోనా వైరస్ ప్రబలి ఏడాదిన్నర అవుతున్నా నాశనం కావడం లేదు. కొత్త రూపాల్లో ఆ వైరస్ వెలుగు చూడడం ప్రపంచ దేశాలను కలవరం రేపుతోంది. నిన్న మొన్నటి దాకా బ్రిటన్, అమెరికా, దక్షిణాఫ్రికా దేశాల్లో ఈ వైరస్ కొత్త వెర్షన్లో వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు తాజాగా జపాన్ దేశంలోనూ ఈ వైరస్ రూపం మార్చుకుని దాడి చేయడం మొదలుపెట్టింది. దీంతో జపాన్‌లో కలకలం రేగింది. జపాన్‌లో వెలుగులోకి వచ్చిన వైరస్ అమెరికా, బ్రిటన్, దక్షిణాఫ్రికా దేశాల వైరస్ కన్నా భిన్నంగా ఉందని అక్కడి వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఈ వైరస్‌ను బ్రెజిల్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల్లో గుర్తించినట్లు వివరణ ఇచ్చింది. ఈ ఇద్దరికి మొదట ఎలాంటి లక్షణాలు లేవు. కొన్ని రోజులకు వీరిలో ఒకరికి శ్వాస తీసుకోవడం ఇబ్బంది ఏర్పడడంతో ఆస్పత్రిలో చేరాడు. అక్కడ పరీక్షలు చేయగా ఈ వైరస్ వెలుగులోకి వచ్చిందని నిర్ధారించారు. అనంతరం రెండో వ్యక్తికి జ్వరం, తలనొప్పి లక్షణాలు కనిపించాయి. దీంతో జపాన్ ప్రభుత్వం అప్రమత్తమై వారికి ప్రత్యేక వైద్యం అందిస్తోంది. ఈ వైరస్‌పై సమగ్ర దర్యాప్తు చేయాలని శాస్త్రవేత్తలు, వైద్యులను ఆ దేశ ప్రభుత్వం ఆదేశించింది. జపాన్‌లో ఇప్పటికే బ్రిటన్, దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త రకం వైరస్ కేసులు 30 వరకు ఉన్నాయి. 2,80 వేల కేసులు నమోదవగా, 4 వేల మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. అత్యధికంగా కేసులు నమోదవుతుండడంతో దేశ రాజధాని టోక్యోలో అత్యవసర పరిస్థితి విధించారు. దీని ప్రభావం ఒలంపిక్స్ గేమ్స్‌పై పడే అవకాశం ఉంది. క్రీడా సంబరాలను వాయిదా.. లేక రద్దు చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.