
జపాన్ రాజధాని టోక్యో నగరంలో వినాయక చవితి వేడుక ఉత్సాహంగా జరిగింది. తెలుగు అసోసియేషన్ జపాన్ (TAJ) వారి ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు విఘ్ననాయకుడికి అత్యంత భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించి, ఆది దేవుడి ఆశీస్సులు పొందారు.

అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలుగు వారంతా కలిసి విగ్రహాన్ని ప్రతిష్టించి గణనాథుడికి ఘనంగా పూజలు నిర్వహించారు. అనంతరం ఆదివారం అట్టహాసంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ నిమజ్జన కార్యక్రమంలో పెద్దలు, పిల్లలు ఆనందంతో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment