telugu association
-
ట్రయాంగిల్ తెలంగాణ అసోసియేషన్ (TTGA) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రైయాంగిల్ తెలంగాణ అసోసియేషన్ (TTGA) ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ ఉత్సవాలు అద్భుతంగా ముగిశాయి. సుమారు 7వేలమంది మంది పాల్గొన్న కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక వైభవం విశ్వవ్యాప్తంగా ప్రదర్శితమైంది. 25 అడుగుల ఎత్తైన కమల పీఠం బతుకమ్మల అందంతో అలరించింది. అష్టలక్ష్మి అలంకరణలు, 6 గంటలపాటు నిరాటంకంగా జరిగిన బతుకమ్మ నృత్యం కార్యక్రమం ఆకట్టుకున్నాయి. ఈ ఉత్సవానికి రెండు నెలల పాటు కఠోర సాధన చేసి మరీ బతుకమ్మను అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో సెనేటర్ జే జె చౌదరి, మారిస్విల్ మేయర్ టిజే కౌలీ, మేయర్ ప్రో టెం సతీష్ గరిమెల్ల, కౌన్సిల్ సభ్యులు లిజ్ జాన్సన్, స్టీవ్ రావు, కేరీ టౌన్ కౌన్సిల్ సభ్యురాలు సరికా బన్సాల్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం స్థానికులను మాత్రమే కాకుండా ఉత్తర కరోలినా ,ఇతర రాష్ట్రాలనుంచి వచ్చిన భారతీయులను ఆకర్షించింది. స్థానిక డెల్టా కంపెనీ ఐటీ డైరెక్టర్ స్టెఫనీ షైన్ తోపాటు, ఇతర వ్యాపార ప్రతినిధులు, ఐటీ డైరెక్టర్లు, ఇతర ప్రముఖులు హాజరు కావడం విశేషం.అతిథులకు భోజనవసతి, శాటిలైట్ పార్కింగ్ నుండి స్టేడియం వరకు రవాణా సౌకర్యం అందించారు. ఈ విజయవంతమైన కార్యక్రమాన్ని నిర్వహించడానికి TTGA నాయుకత్వంలో రెండు నెలలు ప్రణాళికా సూత్రాలను అమలు చేశారు.బతుకమ్మ కోసం ప్రత్యేక పాటను రూపొందించి మరింత ప్రత్యేకంగా నిలిచింది. ఈ కార్యక్రమం TTGA అధ్యక్షుడు మహిపాల్ బిరెడ్డి, ఉపాధ్యక్షురాలు భారతి వెంకన్నగారి, ఈవెంట్ డైరెక్టర్ శశాంక్ ఉండీల, సాంస్కృతిక డైరెక్టర్ పూర్ణ అల్లె, యువత డైరెక్టర్ శ్రీకాంత్ మందగంటి, ఫెసిలిటీ డైరెక్టర్ రఘు యాదవ్, ఫుడ్ డైరెక్టర్ మహేష్ రెడ్డి, కోశాధికారి రవి ఎం, కమ్యూనిటీ సర్వీస్ డైరెక్టర్ స్వాతి గోలపల్లి, మెంబర్షిప్ డైరెక్టర్ ఉమేష్ పారేపల్లి, కమ్యూనికేషన్ డైరెక్టర్ మాధవి కజా నాయకత్వంలో విజయవంతంగా సాగింది.ఈ బతుకమ్మ వేడుకలు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటించడంతో పాటు, ఉత్తర కరోలినాలో భారత సాంస్కృతిక ఉత్సవాల పెరుగుదలలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. ఈ ఉత్సవాల ద్వారా సాంస్కృతిక బంధాలను మరింత బలపరుస్తూ విజయవంతంగా ముందుకు సాగుతుందని TTGA ప్రకటించింది. -
అంబరాన్నంటిన సింగపూర్ తెలుగు సమాజం బతుకమ్మ సంబరాలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. స్థానిక టాంపినీస్ సెంట్రల్ పార్క్ లో సింగపూర్ బతుకమ్మ వేడుకలకు సింగపూర్ లోని వివిధ ప్రాంతాల ఆడపడచులు, పిల్లలు, మరియు పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పూలతో తయారు చేసిన అందమైన బతుకమ్మలను పేర్చి, జానపద పాటలు పాడుతూ, ఆడుతూ లయబద్ధంగా చప్పట్లు కొడుతూ ఆనందంగా వేడుక జరుపుకున్నారు. సాంప్రదాయ వస్త్రధారణలో చిన్నాపెద్దా అందరూ ఆడిపాడి సందడి చేశారు. సింగపూర్ స్థానికులు కూడా ఈ వేడుకను ఆసక్తిగా తిలకించారు. అనంతరం బతుకమ్మలను శాస్త్రోక్తంగా నిమజ్జనం చేశారు.ఈ పండుగ తెలుగువారి ఐక్యతను ప్రపంచమంతా చాటుతుందనీ సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు. తెలుగువారంతా మమేకమై ఈ సంబరం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. తెలుగు సమాజంలో సభ్యత్వం తీసుకోవాలని, అందరూ కలిసి ఈ సంస్కృతి పునరుద్ధరణకు కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమాన్ని ఆర్ ఆర్ హెచ్ సి , నార్పాణి టాంపినీస్ సిసి ఐఎఇసి వంటి స్ధానిక సంస్ధల సహకారంతో విజయవంతంగా నిర్వహించినట్లు కార్యక్రమ నిర్వాహకులు పుల్లనగారి శ్రీనివాసరెడ్డి తెలిపారు.అందంగా అలంకరించిన మూడు బతుకమ్మలకు ప్రత్యేక బహుమతులు అందజేశారు. అలాగే ఈ సంవత్సరం 8 ప్రోత్సాహక బహుమతులు కూడా ప్రదానం చేశారు. కొత్త సుప్రియ సారధ్యంలో నడుస్తున్న ‘అమ్మ చారిటబుల్’ సంస్థ సహకారంతో ఈ బహుమతులు అందించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమానికి సుమారు 2000 మంది హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారని.. గౌరవ కార్యదర్శి పోలిశెట్టి అనిల్ కుమార్ పేర్కొన్నారు. కుంభకర్ణ, Mr.బిరియాని, ఫ్లేవర్స్, తందూర్ లాంజ్, ఆంధ్రకర్రీ, మరియు బంజార రెస్టారెంట్ వంటి వారి భాగస్వామ్యం లో భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వేడుకను విజయవంతం చేసేందుకు సహకరించిన ప్రతిఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఆన్ లైన్ ద్వారా సుమారు 6000 మంది ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారని, 10 మంది లక్కీ విజేతలకు వెండి , ఇతర ఆకర్షణీయ బహుమతులు అందజేశారని చెప్పారు.సింగపూర్ లో తెలుగు వాసుల ఐక్యతను చాటుతూ, వారి సాంస్కృతిక భావాలను పదిలపరిచిన ఈ బతుకమ్మ వేడుక సింగపూర్ తెలుగు సమాజానికి మరింత గౌరవం తీసుకొచ్చినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. -
టాంటెక్స్ ''నెలనెల తెలుగువెన్నెల'': తెలుగు సాహిత్య వేదిక 206వ సాహిత్య సదస్సు
ఈ నెల (సెప్టెంబరు నెల) 21వ తేదీ శనివారం డల్లాస్ ఫోర్ట్ వర్త్, ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం , టాంటెక్స్ ''నెలనెల తెలుగువెన్నెల'' ,తెలుగు సాహిత్య వేదిక 206 వ సాహిత్య సదస్సు ఘనంగా జరిగింది. ఈ 53 వ టెక్సాస్ సాహిత్య సదస్సు కోపెల్, టెక్సాస్ నగరంలో నిర్వహించారు. 'న భూతో న భవిష్యత్' అన్నట్లుగా ఈ సదస్సు జరిగింది. ఈ ''సంగీత సాహిత్య సమలంకృత నెలనెలా తెలుగు వెన్నెల'' సదస్సు ప్రారంభ సూచికగా శ్రీరామ చంద్ర మూర్తి ని స్తుతిస్తూ పురందరదాసు విరచిత కన్నడ ''"రామ నామ ఉమ్మే....'' భక్తి గీతాన్ని చిరంజీవి సమన్విత తన మధుర కంఠంతో రాగయుక్తంగానూ వీనుల విందుగాను పాడి సాహితీ ప్రియులను భక్తి పారవశ్యులను చేసింది. టాంటెక్స్ పాలక మండలి సభ్యులు, సాహితీ వేదిక సమన్వయ కర్త దయాకర్ మాడా గారు స్వాగతోపన్యాసం చేశారు. ఇటీవలే దివంగతులయిన ప్రముఖ సినీ లలిత గీతాల రచయిత కీ,శే.వడ్డేపల్లికృష్ణ సంస్మరణగా చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించి.. ఒక నిముషం పాటు మౌనం పాటించారు పలువురు వక్తలు వడ్డేపల్లి కృష్ణగారితో తమకు గల అనుబంధాన్ని అనుభవాలను పంచుకొన్నారు.తర్వాత మహిళా కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ శ్రీమతి అద్దేపల్లి సుగుణ గారు ''సాహిత్యంలో నారీభేరీ''అంశం గా ప్రస్తుత సమాజంలో మహిళల స్థితిగతులపై మాట్లాడారు. అనంతరం సుప్రసిద్ధ అవధాని శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారి ''రామాయణ కల్పవృక్షం ''కావ్య వైశిష్ట్యాన్ని వివరించారు. అలాగే కవి సామ్రాట్ బిరుదాంకితులైన విశ్వనాథవారు తెలుగు పడికట్టును, పలుకుబడిని ఆమహాకావ్యంలో సజీవంగా ప్రతిబింబింబింప చేసిన వైనాన్ని ఉదాహరణంగా వివరించటమేగాక వారి రచనలలోని తెలుగు భాషా మాధుర్యాన్ని వివరణాత్మక ఉపన్యాసించడాన్ని గుర్తుచేశారు. డాక్టర్ నరసింహా రెడ్డి ఊరిమిండి గత 77 మాసాలుగా నిరాటంకంగా నిర్వహిస్తున్న ''మన తెలుగు సిరి సంపదలు'' అందరినీ ఆకట్టుకున్నది. ఈ కార్యక్రమంలో శ్లేష అలంకార భూషిత పద ప్రయోగాలతో పాటు, అక్షరాల పద భ్రమకాలుకొంటె ప్రశ్నలుగా సంధించి సాహితీ ప్రియుల నుంచిసమాధానాలను రాబట్టడంలో విజయవంతమయ్యారు.మహాకవి గురజాడ 162 వ జయంతిని పురస్కరించుకొని ఇండియన్ జర్నలిస్టు యూనియన్ జాతీయ కార్యదర్శి డి.సోమసుందర్ గారు గురజాడ రచనల్లోని ఆధునికత శాస్త్రీయ దృష్టి గురించీ , తన సమకాలీకులలో ఆయన ప్రత్యేకతలను గురించి మాట్లాడారు. కన్యాశుల్కం నాటకం రాయడంలో ఆనాటి సమాజంలో పేరుకొని పోయిన ద్వంద ప్రమాణాలను కపటత్వాన్ని గురజాడ మహాకవి ఎండగట్టిన తీరును సోమసుందర్ గారు అద్భుతంగా వివరించారు. ప్రాధమిక విద్యాస్థాయిలో తెలుగు బోధనా భాషగా ఉండాలని సోమసుందర్ అకాంక్షించారు. ప్రముఖ సాహితీ విశ్లేషకులు బి.లలితానంద ప్రసాద్, పుస్తక పరిచయంలో విశ్వ మానవుడు సంజీవ్ దేవ్ ఆలోచనా సరళిని అర్ధం చేసుకోవాలని అన్నారు. తర్వాత ''సాహిత్యంలో శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి సాహితీ వీక్షణంలో కృష్ణశాస్త్రి గారి రచన ప్రతిభా పాటవాల్ని" శ్రీ నరేందర్ చక్కగా విశ్లేషించడం జరిగింది. ''సాహిత్యము, దాని ప్రభావము-మానవజీవన పరివర్తన'' అనే అంశముపై విట్టల్ రామశర్మ గారి ప్రసంగము,,''శ్రీ రామ రక్ష'' అంశంపై డా వెంకట నక్త రాజు గారి ప్రసంగము, ''సమాజంపై గురువుల ప్రభావం''అంశంపై శ్రీరామకృష్ణ శర్మగారి ప్రసంగం, శ్రీనివాస్ ఇరువంటి చదివి వినిపించిన '''శ్రీమతి ప్రేమలేఖ ''కథ సాహితీ ప్రియుల మనసులను రంజింప చేశాయనడంలో సందేహం లేదు .అనంతరం వేటూరి, దాశరథి,వడ్డేపల్లి కృష్ణ వ్రాసిన సినీ గీతాలను శ్రీ చంద్రహాస్ మద్దుకూరి ,శ్రీమతి ఆకునూరి శారద,డాక్టర్ ఆళ్ళ శ్రీనివాస రెడ్డి బృందం అద్భుతంగా ఆలపించారు. గురజాడ విరచిత ''దేశమును ప్రేమించుమన్నా''గేయాన్ని దయాకర్ మాడ, డాక్టర్ ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డి, అనంత్ మల్లవరపు, లెనిన్ వేముల , చంద్రహాస్ మద్దుకూరి బృందం శ్రావ్యంగా ఆలపించడం జరిగింది. డాక్టర్ ఇస్మాయిల్ పెనుగొండ గారు ఇటీవల ప్రచురితమైన నాలుగు పుస్తకాలను పరిచయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు శ్రీ సతీష్ బండారు సంస్థ ఔన్నత్యానికి ఆర్ధికంగా, హార్దికంగా తోడ్పడుతున్న పోషక దాతలకూ, కార్యకర్తలకు, అలాగే మంచి విందు భోజనాన్ని అందించిన 'సింప్లి సౌత్' యాజమాన్యానికి అందుకు కృషి చేసిన శ్రీకాంత్ పోలవరపు గారికి, ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియ చేశారు.ఉత్తర టెక్సాస్ తెలుగుసంఘం కార్యవర్గ సభ్యులు రఘునాథ రెడ్డి కుమ్మెత, వీర లెనిన్ తుల్లూరి, సంస్థ పూర్వాధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర, జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, చంద్ర కన్నెగంటి, చిన సత్యంల తోపాటు పుదూర్ జగదీశ్వరన్, రమణ జువ్వాడి, శ్రీధర్, సుమ, సాయి, కిరణ్మయి, గౌతమి, స్వర్ణ మరియు డాలస్,హ్యూస్టన్ ,ఆస్టిన్, టెంపుల్ నగరాల నుంచి అనేక మంది సాహితీ ప్రియులు పాల్గొనడంతో సదస్సు విజయవంతమైంది. దయాకర్ మాడ వందన సమర్పణ గావించారు. ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ప్రస్తుత అధ్యక్షులు సతీష్ బండారు , సమన్వయ కర్త దయాకర్ మాడా, సంస్థ పాలక మండలి అధికార కార్యవర్గ బృందం సభ్యులు అభినందనీయులు .(చదవండి: డాలస్‌లో ఘనంగా అక్కినేని శతజయంతి వేడుకలు..!) -
టోక్యోలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు
జపాన్ రాజధాని టోక్యో నగరంలో వినాయక చవితి వేడుక ఉత్సాహంగా జరిగింది. తెలుగు అసోసియేషన్ జపాన్ (TAJ) వారి ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు విఘ్ననాయకుడికి అత్యంత భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించి, ఆది దేవుడి ఆశీస్సులు పొందారు.అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలుగు వారంతా కలిసి విగ్రహాన్ని ప్రతిష్టించి గణనాథుడికి ఘనంగా పూజలు నిర్వహించారు. అనంతరం ఆదివారం అట్టహాసంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ నిమజ్జన కార్యక్రమంలో పెద్దలు, పిల్లలు ఆనందంతో పాల్గొన్నారు. -
నీదా.. నాదా!.. సై అంటే సై
-
తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్-యూకేలో ఉగాది సంబరాలు!
తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్-యూకే (తెలుగు సంఘం) వార్షిక ఉగాది సంబరాలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ఇది తెలుగు సంస్కృతి మరియు సంప్రదాయాలకు ఒక చిరస్మరణీయ వేడుక. ఉత్సాహభరితమైన సాంస్కృతిక కార్యక్రమాలతో, ఈ కార్యక్రమం సంస్థకు ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. అంతేకాకుండా 2024-26 కాలానికి కొత్తగా ఎన్నికైన ఎగ్జిక్యూటివ్ కమిటీని ప్రకటించారు.ఎడిన్బర్గ్ కాలేజ్-గ్రాంటన్ క్యాంపస్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 400 మంది తెలుగువారు హాజరయ్యారు. స్కాట్లాండ్లో నివశిస్తున్న తెలుగు సమాజంలో ఉన్నటువంటి బలమైన బంధం, ఐక్యతకు ప్రతిబింబంగా నిలిచింది.ముఖ్య అతిథులుగా భారత కాన్సుల్ జనరల్ బిజయ్ సెల్వరాజ్, లోథియన్ ప్రాంతానికి చెందిన ఎంఎస్పిలు సారా బోయాక్, ఫోయ్సోల్ చౌదరి, కొల్లిన్టన్ కౌన్సిలర్ స్కాట్ ఆర్థర్ సహా ప్రముఖులు గౌరవ అతిథులుగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వారి ఉనికి ఈ కార్యక్రమం వైభవాన్ని పెంచింది. గొప్ప సాంస్కృతిక వైవిధ్యం ఉన్న ఎడిన్బర్గ్ లాంటి నగరంలో ఉగాదిని జరుపుకోవడం గురించి, దాని ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది.“టాస్-యుకె ఉగాది సంబరాలు 2024” లో తెలుగు సమాజం ప్రతిభ, సంప్రదాయాలకు సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు అధికారులు.సిలికానాంధ్రా వారి ‘మనబడి’ ద్వారా తెలుగు నేర్చుకునే పిల్లలు “మా తెలుగు తల్లికి” ప్రార్థనాగీతంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.2022-24 కాలానికి గాను సాంస్కృతిక కార్యదర్శిగా వ్యవహరించిన విజయ్ కుమార్ పర్రి తెలుగు ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, అతిథులు, ముఖ్య అతిథులు మరియు ప్రేక్షకులకు హృదయపూర్వక స్వాగతం పలుకుతూ క్రార్యక్రమాన్ని ప్రారభించారు. సమూహ నృత్యాలు, సోలో గానం, తెలుగు కవితల పారాయణ, అనంత్ రామానంద్ గార్లపాటి చేసిన ముఖ్యమైన ఉగాది పంచాంగంతో సహా మంత్రముగ్దులను చేసే ప్రదర్శనలతో వేదిక ఆకర్షణీయంగా మారింది. ఐదుగురు గాయకులు, బ్యాండ్ ప్లేయర్లతో కూడిన స్థానిక భారతీయ బ్యాండ్ "వాయిస్ ఆఫ్ ఎకో" ప్రదర్శన ఈ కార్యక్రమానికి ముఖ్య ఆకర్షణగా నిలిచింది. వారి ఆకర్షణీయమైన ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసి, ఉత్సవాలకు అదనపు ఉత్సాహాన్ని జోడించాయి.హోస్ట్స్ సత్య శ్యామ్ జయంతి, రంజిత్ నాగుబండి, శ్రుతి పల్లెమోని, స్రవంతి పొట్లూరి, హిమజా మాచిరాజు రోజంతా జరిగే ఈ కార్యక్రమంలో ప్రేక్షకులకు నైపుణ్యంగా మార్గనిర్దేశం చేసి, శక్తిని, ఉత్సాహాన్ని నింపారు. వారి చమత్కారమైన పరిహాసం, ఆకర్షణీయమైన సంభాషణలు హాజరైనవారిని రోజంతా వినోదభరితంగా ఉంచాయి.సాంస్కృతిక ప్రదర్శనలతో పాటు, ఈ కార్యక్రమంలో సాంప్రదాయ సమకాలీన దుస్తులలో వివిధ ఋతువుల పోకడలను ప్రదర్శించే ఫ్యాషన్ షో ప్రదర్శన కూడా జరగడం విశేషం.ఎడిన్బర్గ్ దీపావళి, కన్నడ అసోషియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ - ఎడిన్బర్గ్, ఎడిన్బర్గ్ హిందు మందిర్ అండ్ కల్చరల్ సెంటర్, ఇండియన్ ఆర్ట్స్ కనెక్షన్, 3 గుడ్ డీడ్స్, స్కాటిష్ ఇండియన్ ఆర్ట్స్ ఫోరం, ఒడిశా సొసైటి ఆఫ్ స్కాట్లాండ్, బీహార్ కమ్యూనిటీ మరియు స్కాటిష్ ఇండియన్ ముస్లిం అసోషియేషన్ వంటి ఇతర భారతీయ సంఘాల అతిథులు చేరడం ఔత్సాహికుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది.వేడుకను విజయవంతం చేయడంలో ఈవెంట్ స్పాన్సర్లు ప్రధాన స్పాన్సర్లు బ్రైటర్ మోర్టగేజెస్, బెల్లి ఇంటర్నేషనల్ రియల్ ఎస్టేట్, సహ-స్పాన్సర్ అల్లి భవన్లు కీలక పాత్ర పోషించారు, .ఇక 2024-26 సంవత్సరానికి కొత్తగా ఎన్నికైన టాస్-యూకే ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్పర్సన్ శివ చింపిరి, అధ్యక్షుడు ఉదయ్ కుమార్ కుచాడి, ప్రధాన కార్యదర్శి వెంకటేష్ గడ్డం, సంయుక్త కార్యదర్శి నిరంజన్ నూక, కోశాధికారి విజయ్ కుమార్ పర్రి, మహిళా మరియు ప్రాజెక్టుల కార్యదర్శి మాధవిలత దండూరి, కల్చరల్ సెక్రెటరీ పండరి జైన్ కుమార్ పోలిశెట్టి, క్రీడా కార్యదర్శి బాలాజీ కర్నాటి, యువజన శాఖా కార్యదర్శి రాజశేఖర్ సాంబ, ఐటి కార్యదర్శి జాకీర్ షేక్, పిఆర్ కార్యదర్శి నరేష్ దీకొండలను సభ్యులకు పరిచయం చేశారు.చివరిగా మాజీ చైర్పర్సన్ మైథిలి కెంబూరి చేసిన గణనీయమైన కృషికి గుర్తింపుగా, గౌరవనీయ చైర్‌పర్సన్‌గా సత్కరించారు.జన గణ మన, కొత్తగా నియమితులైన జనరల్, జాయింట్ సెక్రటరీల ధన్యవాదాలతో కార్యక్రమం ముగిసింది. ఇక ఈ కార్యక్రమంలో హాజరైన తెలుగువారు సంస్కృతి, స్నేహం, వేడుకలతో నిండిన రోజుగా మధురమైన జ్ఞాపకాలతో బయలుదేరారు.“టాస్-UK ఉగాది సంబరాలు 2024” ఒక తెలుగు వారసత్వ వేడుక మాత్రమే కాదు. తెలుగు సమాజం ఐక్యత, స్థితిస్థాపకతకు నిదర్శనం. టాస్-యుకె అభివృద్ధి చెందడమేగాక ఉగాది స్ఫూర్తిని తెలుగు వారిలో నింపుతూ.. రాబోయే సంవత్సరాల్లో మరింత మార్గదర్శకంగా, స్ఫూర్తిదాయకంగా తెలుగు వారి శ్రేయస్సుకు చేదోడుగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. (చదవండి: టంపాబే లో అనాథల కోసం నాట్స్ సరికొత్త సేవా కార్యక్రమం!) -
ఉత్తర టెక్సాస్‌లో ఘనంగా సంక్రాంతి సంబరాలు!
తెలుగు భాష, సాహిత్య, సాంస్కృతిక రంగాలకు పట్టం కట్టే ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్.. సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించింది. ఫ్రిస్కోలోని రీడీ హై స్కూల్లో జరిగిన ఈ వేడుకలకు ప్రవాసులు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి సందడి చేశారు. సంస్థ అధ్యక్షులు సతీష్ బండారు ఆధ్వర్యంలో కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను బావితరం మర్చిపోకుండా సంక్రాంతి సంబరాలలో పలు కార్యక్రమాలు చేపట్టింది టాంటెక్స్. సంక్రాంతి పాటలు, ముగ్గులు, ముచ్చట్లతో పాటు అత్యంత సుందరంగా బొమ్మల కొలువుతో వేదికను అలంకరించారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నాయి. ప్రముఖ సింగర్స్ శ్రీకాంత్, దీప్తి తమ గాత్రంతో ఆకట్టుకున్నారు. సంక్రాంతి గొప్పతనం చాటిచెప్పేలా కార్యక్రమాలు ఏర్పాటు చేసి పండగ వాతారవరణాన్ని సృష్టించారు. ఈ సందర్భంగా పలు పోటీలు నిర్వహించి, బహుమతులు అందజేశారు. సంక్రాంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన పలు స్టాల్స్‌కు విశేష స్పందన వచ్చింది. ఇక సంస్థ ఆధ్వర్యంలో జరిగిన స్వచ్చంద మరియు సాంస్కృతిక కార్యక్రమాలను వివరించారు. నార్త్ అమెరికా తెలుగు సొసైటీ నాట్స్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. మార్చిలో నాట్స్ సంబరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డల్లాస్‌లో జరిగే నాట్స్ తెలుగు వేడుకల్లో అందరికీ పాల్గొని విజయవంతం చేయాలని సంస్థ సభ్యులు కోరారు. ఇక సంక్రాంతి సంబరాలు గ్రాండ్ సక్సెస్ అవటం పట్ల నిర్వహకులు ఆనందం వ్యక్తం చేశారు. సంస్థ మద్దతుగా ఉంటూ సహాయసహాకారాలు అందిస్తున్న దాతలకు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. (చదవండి: సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు) -
హాంగ్‌కాంగ్‌లో ముచ్చటైన తెలుగు సాంస్కృతిక ఉత్సవం
సౌత్ చైనా సముద్ర తీరాన వున్న చిన్న ద్వీపం 'హాంగ్‌కాంగ్' లో ఇతర భారతీయ ప్రాంతాల వారితో పాటు మన ఉభయ తెలుగు రాష్ట్రాల వారు ఇక్కడ నివసిస్తున్నారు. వారి సంఖ్య చాలా తక్కువే అయినా, మన తెలుగు భాష , దేశ సంస్కృతీ సంప్రదాయాలను భావి తరాలకి అందించే కృషి లో భాగంగా తెలుగు సాంస్కృతిక ఉత్సవాలు గత కొన్ని సంవత్సరాల కాలంగా నిర్వహిస్తున్నారు. క్రిస్మస్ పండుగ, ఆంగ్ల నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగల ఉత్సాహాన్ని మేళవించి ఈ కార్యక్రమాన్ని రూపొందించామని అధ్యక్షులు తెలిపారు. ఈ సంవత్సరం కూడా 'తెలుగు సాంస్కృతిక ఉత్సవం' లో ముద్దులొలికే చిన్నారుల ఫాన్సీ డ్రెస్ ,పద్యాలు - శ్లోకాలు, భక్తి పాటలు, టాలీవుడ్ - కూచిపూడి నృత్యాలు, వయోలిన్ , కీబోర్డ్ , తబలా వాయిద్యాల తో చక్కని చిక్కని కర్నాటిక్ సంగీతాలు, అక్షరమాలలో సంపూర్ణ రామాయణం కథ, చిత్ర లేఖనం ..ఇలా అనేక అంశాలలో పిల్లలు తమ ప్రతిభలతో అందరిని మురిపించారు. వ్యాఖ్యాతలుగా ఇక్కడ పెరిగి పెద్దయి, ఇదే వేదిక మీద ప్రదర్శనలు ఇచ్చిన రజిత మరియు హర్షిత, ఇద్దరు అక్కాచెల్లెలిద్దరు చక్కటి తెలుగులో నిర్వహించారు. ముఖ్య అతిధులుగా కౌన్సలార్ శ్రీ. కె. వెంకట రమణ గారు,కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఇన్ హాంగ్ కాంగ్ & మకావ్, స్థానిక ఇంటర్నేషనల్ ప్రైమరీ స్కూల్ హెడ్ శ్రీమతి ప్రియా కాంతన్ మరియు హాంగ్ కాంగ్ ఆర్ట్అఫ్ లివింగ్ టీచర్ శ్రీమతి సీమా హిరానందాని విచ్చేసి, పిల్లల ప్రతిభలని చూసి ఆనందించి, మెచ్చుకొని తల్లి తండ్రులని ప్రశంసించారు. పిల్లల్ని ఇలాగే తమ భాష, సంస్కృతీ, దేశం గురించిన ఇటువంటి కార్యక్రమాలలో ఎప్పుడు పాల్గొనే లా ప్రోత్సహించాలని, సంస్థ చేస్తున్న సేవలను కొనియాడారు. అతిధులకు తమ కృతజ్ఞతలు తెలుపుతూ వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి జయ పీసపాటి, కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో తమ కార్యవర్గ సభ్యులను, వ్యాఖ్యాతలను, పిల్లలను వారి తల్లి తండ్రులకు దయవాదాలు తెలుపుతూ, అభినందించారు. -
క్రౌన్ ప్లాజాలో ఘనంగా 'మన అమెరికన్ తెలుగు అసోసియేషన్' సమావేశం
మన అమెరికన్ తెలుగు అసోసియేషన్(మాట) 3వ బోర్డు మీటింగ్ ఫిలడెల్ఫియా, క్రౌన్ ప్లాజాలో ఘనంగా జరిగింది. మాట వ్యవస్థాపకులు శ్రీనివాస్ గనగోని, ప్రదీప్ సామల ఆధ్వర్యంలో జరిగిన ఈ బోర్డు మీటింగ్‌లో సలహా మండలి, బోర్డు,గౌరవ సలహాదారులు సహా పలువురు మాట ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థ ఇప్పటివరకు చేసిన పలు కార్యక్రమాలతో పాటు భవిష్యత్ కార్యచరణపై సమావేశంపై చర్చించారు. ప్రధానంగా ఏప్రిల్‌లో నిర్వహించనున్న మాట మొదటి కన్వెన్షన్ గురించి ప్రధానంగా ముచ్చటించారు. అమెరికాలోని పలు రాష్ట్రాల్లో నిర్వహించిన కిక్ ఆఫ్ ఈవెంట్ గురించి చర్చించారు. కార్యక్రమంలో ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. చిన్నారుల డాన్స్ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యువతి, యువకుల సంగీతం, నృత్య ప్రదర్శనలు ఆడియన్స్‌లో జోష్ నింపాయి. ఇక సింగర్స్ తమ గాత్రంతో మైమరపించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురిని సన్మానించి, సత్కరించారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో మాట మొట్టమొదటి కన్వెన్షన్ గ్రాండ్‌గా నిర్వహించేలా ప్రణాళిక రూపొందించినట్లు సభ్యులు వివరించారు. -
దుబాయ్ తెలుగు సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం
తెలుగు అసోసియేషన్-యూఏఈ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం దుబాయ్‌లో అట్టహాసంగా నిర్వహించారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ, ఆంధప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యవస్థాపక సభ్యుల ప్రతినిధులు నియమితులైన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో హైదరాబాద్‌కు చెందిన బాలుస వివేకానంద చైర్మన్‌గా ఎన్నికవగా, వైస్ చైర్మన్‌గా సుదర్శన కటారు, అధ్యక్షుడిగా మసివుద్దీన్ మొహమ్మద్, నాయకత్వ బాధ్యతలు నిర్వహించారు. వీరితో పాటు ప్రధాన కార్యదర్శి విజయ భాస్కర్ రెడ్డి, కోశాధికారి శ్రీనివాస్ గౌడ్ వాడకొండ, మార్, వంగ్ డైరెక్టర్ శ్రీనివాసరావు యెండూరి, అంతర్జాతీయ వ్యవహారాల విభాగ డైరెక్టర్‌గా సురేంద్రనాథ్ ధనేకుల,ఆంధ్రప్రదేశ్ సంక్షేమ కార్యక్రమాల విభాగ డైరెక్టర్‌గా శ్రీధర్ దామర్ల , తెలంగాణ సంక్షేమ కార్యక్రమాల విభాగ డైరెక్టర్‌గా చైతన్య చకిల సేవల డైరెక్టర్స్‌గా భీం సంకర్ బంగారి, సాంస్కృతిక కార్యక్రమాల విభాగ డైరెక్టర్‌గా శ్రీమతి లతా నగేష్ మీడియా విభాగ డైరెక్టర్‌గా అబ్దుల్ ఫహీం షేక్ , న్యాయ మరియు కార్యాలయ వ్యవహారాల విభాగ నిర్వహకుడిగా సత్యసాయి ప్రకాష్ సుంకు బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులందరూ ఒక్కక్కరుగా వేదికపైకి విచ్చేసి మాతృభాషలో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి, గల్ఫ్ మైనారిటీ కమ్యూనిటీ (GMC) తరపున అబ్దుల్లా, ఖాజా, షరీఫుద్దీన్, జాఫర్ అలీ, ఆంధ్రప్రదేష్ ప్రవాసీయుల తెలుగు సంఘం (APNRT) తరపున అక్రం, చక్రి, ఉదయభాస్కర్ రెడ్డి విచ్చేసి నూతన కార్యవర్గ సభ్యులందరిని శాలువాలతో సత్కరించి, అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా తెలుగు అసోసియేషన్ సాధించిన ప్రగతిని ప్రశంసిస్తూ, నూతన కార్యవర్గం రాబోయే రెండేళ్లలో మరెన్నో మంచి కార్యక్రమాలతో ముందుకు రావాలని,యూఏఈలోని తెలుగు వారందరినీ కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఒకే తాటిపైకి తెచ్చేందుకు మరింత చొరవ చూపాలని ఆకాంక్షించారు. పదవీ విరమణ చేసిన కోశాధికారి మురళీకృష్ణ, నూతన కార్యవర్గ సభ్యులందరికి పుష్పగుచ్చము అందజేసి పూలమాలలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చైర్మన్ వివేకానంద్ బలుసు , అధ్యక్షుడు మన్మద్దీన్ మొహమ్మద్ ప్రసంగిస్తూ తమ నూతన కార్యవర్గం ప్రణాళికలను క్లుప్తంగా అందిరికి వివరించారు. -
దుబాయ్ తెలుగు సంఘం అధ్యక్షుడిగా హైదరాబాద్ వాసి
దుబాయిలోని తెలుగు ప్రజల సామాజిక సంక్షేమ మరియు సాంస్కృతిక విభాగాలను, అలాగే అసోసియేషన్ నడిపించడానికి జరిగిన ఎన్నికల్లో కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఓపెన్ బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఈ ఎన్నికల్లో చైర్మన్, వైస్ చైర్మన్, జనరల్ సెక్రెటరీ, ట్రెజరర్ మరియు డైరెక్టర్లను ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో నూతన కార్యవర్గం ఎన్నికయ్యింది. ఎలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికల్లో చైర్మన్ సహా, వైస్ చైర్మన్, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్, డైరెక్టర్లను ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ, ఆంధప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యవస్థాపక సభ్యుల ప్రతినిధులు నియమితులయ్యారు. ఈ ఎన్నికల్లో అధ్యక్షునిగా హైదరాబాద్ నగరానికి చెందిన బాలుస వివేకానంద ఎన్నికయ్యారు. ఎన్నికల్లో కొత్తగా నియమితులైన బోర్డు సభ్యులు వీళ్లే.. 1. ఛైర్మ న్ - వివేకానింద్ బలుసా 2. వైస్ చైర్మ న్ – సుదర్శన కటారు 3. ప్రధాన కార్యదర్శి –విజయ భాస్కర్ 4. కోశాధికారి- శ్రీనివాస్ గౌడ్ 5. ఎమిరాటీ బోర్డు సభ్యులు - మిస్టర్ రాషెడ్, మిసర్ట ఖలీద్ 6. డైరెక్టర్లు(AP) - షేక్ అబ్దదల్ ఫహీమ్ ,లతా నగేష్ 7. డైరెక్టర్లు(TS) -భీమ్ శింకర్, చైతనా చకినాల 8. డైరెక్టర్లు(FM) – మసియుద్ధీన్ మహమ్మద్, శ్రీనివాస్ రావు యెండూరి, సురేంద్రనాథ్ ధనేకుల, శ్రీధర్ ఈ ఎన్నికల్లో 100% ఓటింగ్ నమోదు కావడం గొప్ప విశేషం. ఇప్పటివరకు యూఏఈ దేశంలో జరిగిన ఏ ఎన్నికలతో పోల్చినా దుబాయ్ తెలుగు అసోసియేషన్ లో జరిగిన పోలింగే అత్యంత ఎక్కువ. దుబాయిలో నివసించే వేరువేరు తెలుగు ప్రజలను వేర్వేరు వృత్తుల్లో ఉన్న తెలుగు ప్రజలు అలాగే వేర్వేరు నమ్మకాలు కలిగి ఉండి , వేర్వేరు కార్యక్రమాలు చేపట్టే ప్రజలందరినీ ఒక తాటిపై తేవడమే దుబాయ్ తెలుగు అసోసియేషన్ లక్ష్యం. దుబాయ్ తెలుగు అసోసియేషన్‌కు జరిగిన ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో స్థిరపడ్డ ప్రవాసాంధులు చాలామంది ఆసక్తి చూపించారు. ఈ ఎన్నికల నిర్వహణను ఒక ప్రొఫెషనల్ ఎలక్షన్ కమిటీ పర్యవేక్షించింది. అత్యంత పకడ్బందీగా ఈ ఎన్నికలను నిర్వహించింది. విదేశాల్లో ఉన్న దుబాయ్ తెలుగు అసోసియేషన్ సభ్యులకు కూడా నిర్వహించింది. కమ్యూనిటీ డెవలప్మెంట్ అథారిటీ కింద దుబాయ్ లోని తెలుగు కమ్యూనిటీ కోసం ఈ తెలుగు అసోసియేషన్ వివిధ రకాలైన కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఈ అసోసియేషన్ పూర్తిగా అధీకృత చట్టపరమైన సంస్థ. దుబాయ్ తెలుగు అసోసియేషన్‌కు ఎన్నికైన కొత్త కార్యవర్గం తెలుగు ప్రజల ఆశలకు అనుగుణంగా, అలాగే తెలుగు ప్రజలకు అండగా, వారి విజయానికి దోహదపడుతుందని దుబాయ్ సమాజానికి సేవ చేస్తుందని కొత్త కార్యవర్గం తెలిపింది. -
‘తానా ప్రపంచసాహిత్య వేదిక’
డెట్రాయిట్, అమెరికా: ఉత్తరఅమెరికా తెలుగుసంఘం సాహిత్యవిభాగం – ‘తానా ప్రపంచసాహిత్య వేదిక’ ఆద్వర్యంలో ప్రముఖ సినీకవి, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి సమగ్రసాహిత్యాన్ని సిరివెన్నెల కుటుంబసభ్యుల సహకారంతో అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన మొత్తం ఆరు సంపుటాలలో ముద్రించి సిరివెన్నెల అభిమానులకు, సాహితీ ప్రియులకు ఇటీవలే కానుకగా అందించిన సంగతి విదితమే. ఇప్పడు అదే స్ఫూర్తితో సుప్రసిద్ధ కవి, రచయిత కొసరాజు రాఘవయ్య చౌదరిగారి సమగ్ర సాహిత్యాన్ని తానా పూర్వాధ్యక్షులు, తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు అయిన డా. ప్రసాద్ తోటకూర గారి నేతృత్వంలో ముద్రించి త్వరలో తెలుగు భాషాభిమానులకు, సాహితీప్రియులకు అందజేయనున్నామని తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు కొసరాజుగారి 37వ వర్దంతి (అక్టోబర్ 27) సందర్భంగా ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించారు. ఇది తానా సంస్థ ఒక మహాకవికి ఇచ్చే ఘన నివాళిగా నిలుస్తుందని ఆయన అన్నారు. తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు, డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “దాదాపు నాల్గు దశాబ్దాలుగా సాగిన కవిరత్న, జానపద కవి సార్వభౌమ కొసరాజు రాఘవయ్య చౌదరిగారి సాహితీ ప్రయాణంలో “ఏరువాక సాగాలోరన్న”; “అయయో చేతిలో డబ్బులు పోయెనే, అయయో జేబులు ఖాళీ ఆయెనే”; “భలే ఛాన్సులే భలే ఛాన్సులే, ఇల్లరికంలో ఉన్న మజా”; “సరదా సరదా సిగరెట్టు, ఇది దొరలు కాల్చు సిగరెట్టు”; “రామయతండ్రి, ఓ రామయ తండ్రి, మానోములన్ని పండినాయి రామయ తండ్రీ”; “ఆడుతుపాడుతూ పనిజేస్తుంటే, అలుపూ సొలుపేమున్నది” లాంటి పాటలలో అచ్చతెలుగులోని అందాలు, జానపదుల భాషలోని సొగసులు, పల్లెపట్టు భాషలోని చమత్కారాలు, విరుపులు కొసరాజు గారి కలంనుండి రెండువందల చిత్రాలలో వెయ్యికి పైగా పాటలు జాలువారాయి. కేవలం సినిమా పాటలేగాక కొసరాజు గారు “గండికోట యుద్ధము” అనే ద్విపద కావ్యము; “కడగండ్లు” అనే పద్యసంకలనం, “కొసరాజు విసుర్లు”, “కొండవీటి చూపు”, “నవభారతం”, “భానుగీత” లాంటి గ్రంధాలు, యక్షగానాలు, వీధిభాగవతాలు, హరికథలు, జముకుల కథలు, బుర్రకథలు, భజనగీతాలు, పగటివేషగాళ్ళ పాటలు, రజకుల పాటలు, పాములోళ్ళ పాటలు, గంగిరెద్దుల గీతాలు లాంటవి ఎన్నో రాశారని అన్నారు”. ఈ సందర్భంగా కొసరాజు గారి కుటుంబసభ్యులతో మాట్లాడి ఎన్నో విషయాలను ఇప్పటికే సేకరించడం జరిగిందని, ఈ కార్యక్రమంలో పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న కొసరాజు గారి కుటుంబసభ్యులకు, కొసరాజు గారి సమగ్ర సాహిత్యాన్ని త్వరలో తెలుగు ప్రజలకు అందించే తానా ప్రపంచసాహిత్యవేదిక తలపెట్టిన సాహితీ మహాయజ్ఞంలో ప్రముఖ పాత్ర పోషించనున్న పేరెన్నికగన్న సాహితీవేత్త, పరిశోధకులు, అనుభవజ్ఞులు అయిన అశోక్ కుమార్ పారా (మనసు ఫౌండేషన్) కు కృతజ్ఞతలు అన్నారు తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర. -
APTA: అట్లాంటా వేదికగా సెప్టెంబర్ లో "ఆప్తా" కన్వెన్షన్..!
అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (APTA) 15 ఏళ్ల జాతీయ కన్వెన్షన్.. జార్జియా రాష్ట్రంలోని అట్లాంటాలో.. సెప్టెంబర్ ఒకటి నుంచి మూడు వరకు నిర్వహిస్తున్నట్టు అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కొట్టే ఉదయ భాస్కర్, ఏ. బాబి ప్రకటించారు. హైదరాబాద్ లో జరిగిన మీడియా సమావేశంలో వారు ప్రసంగించారు. ఆప్తా ఏర్పడి 15 ఏళ్ల అయిందని సుమారు పదివేల మంది కి పైగా స్కాలర్ షిప్ లు అందిస్తున్నదని నిర్వాహకులు తెలియజేశారు. మీడియా సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు సుబ్బు కోలా ఉదయభాస్కర్ కొట్టి, విజయ్ గుడిసె, గోపాల్ గుడిపాటి, అడ్డా బాబి తదితరులు ప్రసంగించారు. ఈ సంవత్సరానికి ఆప్తా కన్వెన్షన్ కు సుమారు 7000 మంది సభ్యులు హాజరవుతారని భావిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో కమ్యూనిటీ లీడర్లకు, పాఠశాలలకు, దాతలకు, వ్యాపారవేత్తలకు, ఇతర వివిధ రంగాల ప్రముఖులకు ఆహ్వానాలు అందజేసినట్టు వివరించారు. 15 ఏళ్ల క్రితం ఏర్పడిన ఈ సంస్థ చదువు, సేవే పరమార్థంగా పనిచేస్తుందని తెలిపారు. మహిళా సాధికారత కోసం పనిచేస్తున్నట్టుగా వివరించారు. అమెరికాకు వచ్చే వేలాదిమంది విద్యార్థులకు ఇమ్మిగ్రేషన్ సేవలు విద్య ఉపాధి సౌకర్యాలను కూడా కల్పించేందుకు తాము కృషి చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఆప్తా కన్వెన్షన్ కు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రముఖులందరూ తరలి రావాల్సిందిగా కోరారు. తెలుగు సంఘాలు ఎన్ని ఉంటే అంత మేలు జరుగుతుందని అమెరికాలో ఎవరికీ పోటీ కాదని అందరం కలిసి మెలిసే పని చేస్తామని వారు చెప్పారు. ప్రశ్నించుకుంటాం తప్ప ఒకరికి ఒకరు పోటీ కాదని తెలిపారు. త్వరలో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాలలోనూ మీడియా సమావేశాలు నిర్వహించి తమ సదస్సు ఉద్దేశాలను వివరిస్తున్నట్టు తెలిపారు. తెలుగు అంటే రెండు రాష్ట్రాలే కాదని ఐదు రాష్ట్రాలకు పైగా ప్రతినిధులు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, తమిళనాడు, పాండిచ్చేరి, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని.. అమెరికాలోని సేవ కార్యక్రమాలను ఈ రాష్ట్రాల ప్రజలకు అందిస్తున్నట్టుగా తెలిపారు. సదస్సు కర్తవ్యాన్ని మర్చిపోకుండా సుమారు 500 మంది వాలంటీర్లు నిరంతరం పనిచేస్తున్నారని చెప్పారు. (చదవండి: పెన్సిల్వేనియాలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు) -
డల్లాస్‌లో అమెరికన్ తెలుగు అసోసియేషన్ ATA బోర్డు సమావేశం
-
యూఏఈ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో రంజాన్ నిత్యావసర సరుకుల పంపిణీ
పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని దుబాయ్ లోని సోనాపూర్ లేబర్ క్యాంపులో ఆదివారం (ఏప్రిల్ 16) అక్కడి కార్మికులకు తెలుగు అసోసియేషన్ వారు (tauae.org) నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. బియ్యం, పప్పు దినుసులు, నూనె, పండ్లు తదితర నిత్యావసర సరుకులతో కూడిన కిట్స్ అందజేశారు. తెలుగు అసోసియేషన్ వారు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న ఈ సహాయ కార్యక్రమం పట్ల కార్మికులు ఆనందాన్ని వ్యక్తపరుస్తూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. మున్ముందు కూడా ఈ సేవా కార్యక్రమాలు కొనసాగాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి తెలుగు అసోసియేషన్ తరఫున కమ్యూనిటీ సర్వీసెస్ డైరెక్టర్లు రవి ఉట్నూరి, సాయి ప్రకాష్ సుంకు సంయుక్త ఆధ్వర్యంలో విజయ భాస్కర్, భీం శంకర్, శరత్ చంద్ర, శ్రీమతి ఉషాదేవి, శ్రీమతి లతానగేష్ కీలక బాధ్యతలు నిర్వహించారు. తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు దినేష్ కుమార్ ఉగ్గిన, ఉపాధ్యక్షుడు మసిఉద్దీన్, ప్రధాన కార్యదర్శి వివేకానంద బలుసా, వెల్ఫేర్ డైరెక్టర్ శ్రీనివాసరావు యండూరి, మార్కెటింగ్ డైరెక్టర్ అంబేడ్కర్, లీగల్ డైరెక్టర్ శ్రీధర్ దామర్ల, ఫహీమ్, మోహన కృష్ణ, సీహెచ్ శ్రీనివాస్, చైతన్య తదితరులు కార్యక్రమానికి హాజరై ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. -
కాలిఫోర్నియాలో స్టార్‌నైట్ కార్యక్రమం
-
లండన్‌లో ఘనంగా సంక్రాంతి సంబరాలు
లండన్: లండన్‌లో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. యునైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్ (యుక్తా) ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులందరూ ఒకే చోట చేరి సంక్రాతి పండుగ జరుపుకున్నారు. ఈ వేడుకకు భారీ ఎత్తున ప్రవాస తెలుగు ప్రజలు హాజరయ్యారు. చిన్నారుల బోగి పళ్ళ కార్యక్రం వీక్షకులను అలరించింది. నూతన పరిచయాలతో కూడిన కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక నృత్యాలతో ఆడి పాడారు. మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణా, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన ప్రవాసులు అధికంగా నివసించే లండన్‌లో ఇలాంటి పండుగలు జరుపుకోవటం ద్వారా యావత్ బ్రిటన్‌లోని తెలుగు వారికి, ప్రవాస భారతీయులకి చేరువవటమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నామని యుక్తా కార్యవర్గం తెలిపింది. రానున్న సంవత్సరంలో మరిన్ని జనరంజకమైన కార్యక్రమాలతో ప్రవాస తెలుగు వారి సమైక్యతకు, గుర్తింపుకు కృషి చేయనున్నట్లు యుక్తా నూతన అధ్యక్షుడు ప్రసాద్ మంత్రాల తెలిపారు. ఈ సందర్భంగా ఆయన 2016-18కుగానూ ఎన్నికైన నూతన కార్యవర్గాన్ని పరిచయం చేస్తూ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. అధ్యక్షుడు - ప్రసాద్ మంత్రాల ఉపాధ్యక్షుడు - రాజశేఖర్ కుర్బా కార్యనిర్వహణాధికారి - సత్య ప్రసాద్ మద్దసాని కోశాధికారి - నరేంద్ర మున్నలూరి మీడియా, సామాజిక మాధ్యమాలు - రుద్ర వర్మ బట్ట సాంఘిక సంబంధాలు - బలరాం విష్ణుభొట్ల ఐటి - అమర్నాథ్ రెడ్డి చింతపల్లి, ఆదిత్యవర్ధన్ అల్లాడి, కృష్ణ యలమంచిలి సాంస్కృతిక విభాగం - పూర్ణిమా రెడ్డి చల్లా వాణిజ్య విభాగం - ఉదయ ఆర్యన్ ఆరేటి క్రీడలు, సామాజిక కార్యక్రమాలు - కృష్ణ సనపల, సుధీర్ కొండూరు అధికార ప్రతినిధి - శ్రీ సత్య ప్రసాద్ కిల్లి గీతా మోర్ల, డాక్టర్ అనిత రావు, డాక్టర్ పద్మ కిల్లి ట్రస్టీలు గా వ్యవహరించనున్నారు. -
దక్షిణ కొరియాలో ఉగాది సంబరాలు
దక్షిణ కొరియా తెలుగు సంఘం(టాస్క్) ఆధ్వర్యంలో ఆదివారం దుర్ముఖినామ ఉగాది సంబరాలు ఘనంగా నిర్వహించారు. సియోల్ దగ్గరగా ఉన్న సువాన్ నగరంలోని క్యోంఘీ విశ్వ విద్యాలయంలో ఈ సంబరాలు జరిగాయి. ఇందులో దక్షిణ కొరియాలోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్న తెలుగు ఉద్యోగులు, విద్యార్థులు తమతమ కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు. పూజ, పంచాంగ శ్రవణం అనంతరం ఆటపాటలతో ఆనందంగా గడిపారు. ‘టాస్క్’ కమిటీ సభ్యులు హరినారాయణ అంకంరెడ్డి, డాక్టర్ కోపల్లి స్పందన వేడుకలను పర్యవేక్షించారు. -
నెల్లూరుకు సింధు భౌతిక కాయం
నెల్లూరు (అర్బన్) : అమెరికాలోని కాలిఫోర్నియాలో మృతి చెందిన నెల్లూరుకు చెందిన సాయిసింధు (25) భౌతికకాయం ఆదివారం నగరానికి చేరుకుంది. సింధుని ఆమె భర్తే కడతేర్చాడని ఈ నెల 11వ తేదీన ఆమె తల్లిదండ్రులు కిన్నెర కృష్ణయ్య, ఉమామహేశ్వరి ఎస్పీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇండియన్ ఎంబసీ అధికారులు, స్థానిక తెలుగు అసోసియేషన్ సహకారంతో సింధు భౌతికకాయం నెల్లూరుకు తెప్పించారు. అమెరికా నుంచి కార్గో విమానంలో శనివారం సింధు భౌతికకాయం హైదరాబాద్‌కు చేరుకుంది. అక్కడ నుంచి తల్లిదండ్రులు, బంధువులు అంబులెన్స్‌లో ఆది వారం ఉదయం 8.30 గంటలకు నగరంలోని సవరాల వీధిలో ఉన్న ఆమె ఇంటికి తీసుకువచ్చారు. సింధు భౌతికకాయం రావడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. బంధుమిత్రులు వచ్చి సింధు మృతదేహాన్ని చూసి విలపించారు. తల్లిదండ్రులు తమ కుమార్తె మృతదేహం రావడంతో చూసి గుండెలవిసేలా రోదించారు. పోలీసులకు ఫిర్యాదు : ఇది వరకే ఎస్పీకి ఫిర్యాదు చేసిన సాయి సింధు తల్లిదండ్రులు ఆదివారం తమ కుమార్తె మృతి పై అనుమానాలు ఉన్నాయని, మరోసారి మూ డో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రీ పోస్టుమార్టం నిర్వహించి నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. సీఐ బాజీజాన్ సైదా, ఎస్ఐ నాగేశ్వరరావు కేసు నమోదు చేశారు. నెల్లూరు తహశీల్దార్ జనార్దన్‌రావు సమక్షంలో శవ పంచనామా నిర్వహించారు.డీఎస్ఆర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో సింధు భౌతికకాయానికి రీ పోస్టుమార్టం చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సింధు ఇక లేదని... పిల్లా పాపలతో సంతోషంగా ఉండాల్సిన తమ కుమార్తె సాయి సింధు పెళ్లయిన మూడున్నర సంవత్సరాలకే చనిపోవడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. వీరిని చూసి చుట్టుపక్కల వాళ్లు చలించిపోయారు. గతేడాది ఆగస్టులో సింధు నెల్లూరులోని తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. భర్త ఉదయ్‌కుమార్ వేధిస్తున్నాడని వారి దృష్టికి తీసుకు వచ్చింది. వాళ్లు తమకు ఉండేది ఇద్దరు కుమార్తెలని, ఆస్తి వారికే ఇస్తామని చెప్పి ఒక ఎకరా పొలం రాసిస్తామన్నారు. భర్త సరేనని ఒప్పుకోవడం సింధు అమెరికాకు వెళ్లింది. అంతా సజావుగా ఉందనుకున్న సమయంలో ఈ నెల 6వ తేదీన సింధు ఆత్మహత్యాయత్నం చేసిందని, 9వ తేదీన చనిపోయిందని ఉదయ్‌కుమార్ సింధు తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పిన విషయం తెలిసిందే. దీంతో వాళ్లు అప్పటి నుంచి సింధు భౌతికకాయాన్ని నెల్లూరుకు తెప్పించేందుకు ప్రయత్నాలు చేశారు. -
విదేశీ విశ్వవిద్యాలయాల్లో తెలుగు పీఠాల ఏర్పాటుకు తీర్మానం
ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అవనిగడ్డ : తెలుగును ప్రపంచ భాషగా గుర్తించాలని, విదేశాల్లో ఉన్న విశ్వవిద్యాలయాల్లో తెలుగు పీఠాలు ఏర్పాటు చేయాలని కోరుతూ యూకే (యునెటైడ్ కింగ్డమ్) తెలుగు సంఘం సభల్లో ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ చెప్పారు. ఆయన స్థానిక తన కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. బ్రిటన్, అమెరికాలో పర్యటిం చిన తాను, తెలుగు భాష, సంస్కృతుల పరిరక్షణకు ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రులతో చర్చించినట్లు చెప్పారు. గూగుల్ సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపి ప్రపంచ భాషగా తెలుగును గుర్తించి, గూగుల్‌లో చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరినట్లు పేర్కొన్నారు. తమ విజ్ఞప్తిని మన్నించినా సంస్థ ప్రతినిధులు మరుసటి రోజే గూగుల్‌లో తెలుగుకు స్థానం కల్పించారని, ప్రత్యేక తెలుగు పాంట్లు రూపొందించారని వివరించారు. ప్రపంచ విద్యావ్యవస్థలో తెలుగుకు రెండో భాషగా ప్రాముఖ్యత కల్పించడానికి తాముచేసిన కృషి సత్ఫాలితలనిచ్చే దిశగా సాగుతోందన్నారు. గత నెల 26, 27 తేదీల్లో జరిగిన ప్రపంచ తెలుగు సాంస్కృతిక కార్యక్రమంలో ప్రపంచ భాషగా తెలుగుకు గుర్తింపు ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. విదేశీయులు సైతం తెలుగు అభ్యసించటానికి ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. జన్మభూమిపై ప్రవాసాంధ్రుల ఆసక్తి రాష్ట్రంలో అమలుచేస్తున్న జన్మభూమి కార్యక్రమంపై ప్రవాసాంధ్రులు ఆసక్తి చూపుతున్నారని బుద్ధప్రసాద్ చెప్పారు. ఈ కార్యక్రమం స్ఫూర్తితో వారు జన్మించిన గ్రామాల అభివృద్ధికి కృషి చేయడానికి నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు. అమెరికాలో సమావేశాలు జరుగుతున్న తరుణంలోనే తుపాను నష్టంపై ప్రాథమిక సమాచారం అందించటంతో స్పందించిన అమెరికాలోని తెలుగువారు విరాళాలు ప్రకటించారని బుద్ధప్రసాద్ తెలిపారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ కార్యక్రమంలో ప్రవాసాంధ్రులను భాగస్వాములను చేయటానికి వారికి సహకారం అందించటానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల ఏర్పాటుకు ప్రవాసాంధ్రులు ఆసక్తితో ఉన్నారని పేర్కొన్నారు. -
దుబాయ్‌లో తెలుగు వెలుగులు
దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని తెలుగువారు 'వేవ్ రెసోనెన్స్ ఈవెంట్స్' ఏడో వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. యూఏఈలోని ఏడు ఎమిరేట్స్ కలయికగా ఇంద్రధనుస్సులోని ఏడు వర్ణాల శోభతో దుబాయి డేయిరా ఎమిరేట్స్ హాల్ లో ఈ నెల 6న ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఏడు ఎమిరేట్స్‌లోని తెలుగువారు ఈ వైభవాన్ని తిలకించడానికి తరలిరాగా, ముఖ్య అతిథిగా దక్షిణ భారత నటి శ్రీమతి సుహాసిని మణిరత్నం విచ్చేసారు. టీవీ యాంకర్ శశి కార్యక్రమాన్ని సరదాగా నిర్వహించారు. భారతీయ సాంప్రదాయ కళలకు అద్దం పట్టేలా వేవ్ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. విశేషాలు వేవ్ ప్రెసిడెంట్ శ్రీమతి గీతా రమేష్ మరియు ముఖ్య అతిథి శ్రీమతి సుహాసిని మణిరత్నం దీపారాధన తో కార్యక్రమం ప్రారంభం గణపతి ప్రార్థన మరియు కుమారి మోనిక నారాయణన్ భరతనాట్యంతో వినోద కార్యక్రమాలు కవలలైన కుషిత్ కుష్మిత్ల గాత్రం ఆభయకారుడయిన శ్రీ హనుమంతుని జయకార నాట్యం చేసిన బాలురు. ఆకర్షించిన చిన్ని హనుమంతుడు వేవ్ సభ్యులు చేసిన మాయాబజార్, శశిరేఖ పరిణయం హాస్య కార్యక్రమం డిస్ని ఫేయిరి టేల్స్‌లో బహుళ ప్రాచుర్యం పొందిన కథలను కలిపి చిన్నారుల నృత్యరూపకం తెలంగాణ సాంప్రదాయమైన బోనాలు పండుగ పాటకు మహిళల జానపద నృత్యం మహారాష్ట్ర సుప్రసిద్ధమైన లావణి మరియు మృత్స్యకారుల నృత్య కదంబం యువతీయువకులచే గీతా రమేష్ నేతృత్వంలో కన్నులపండుగగా సాగిన ఈ వార్షికోత్సవంలో సుహాసిని పాటలు పాడటం, వేవ్ సభ్యులతో కలిసి డాన్స్ చేయటం ప్రత్యేక ఆకర్షణ. తెలుగువారి ఆరాధ్యదైవం ఏడుకొండల శ్రీనివాసుని కళ్యాణ కార్యక్రమం. యూఏఈ చిన్నారులు శాస్త్రీయ నృత్యరూపకం గోవిందనామ స్మరణతో ఆడిటోరియం మారుమోగగా సభికులు హర్షధ్వానాలతో చిన్నారులని దీవించారు -
తెలుగు సంఘాలకు మరో సవాల్
తమిళ హాస్యనటుడు వడివేలు హీరోగా నిర్మించిన ‘జగబల భుజబల తెనాలిరామన్’ చిత్ర వివాదం చిలికి చిలికి గాలీవానగా మారింది. రెండు రోజుల క్రితం రాజకీయ నేత సీమాన్, బుధవారం నాడు తమిళ సినీ దర్శకుడు గౌతమన్ , తెలుగు సంఘాల వారికి హెచ్చరికలు జారీచేసి వివాదానికి ఆజ్యం పోశారు. చెన్నై, సాక్షి ప్రతినిధి: శ్రీకృష్ణదేవరాయలు ఒక్క తెలుగువారికే కాదు అందరికీ ఆరాధ్యుడు, ఆదర్శనీయుడు. వీరునిగా, కవి, పండితా పోషకుడుగా ప్రసిద్ధుడు. శ్రీకృష్ణదేవరాయల ఇతివృత్తంతో తెలుగులో వచ్చిన అనేక చిత్రాలు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేశాయి. అటువంటి మహానాయకుని ఒక జోకర్గానూ, బహుభార్యాతత్వం కలిగిన విలాసజీవిగా చిత్రీకరించినట్లుగా తెనాలిరామన్ ప్రచార చిత్రాలే చెబుతున్నాయి. ఇది తెలుగువారి హృదయాలను తీవ్రంగా గాయపరిచింది. ఈనెల 18న తెనాలిరామన్ తమిళనాటంతా విడుదలకు సిద్ధమైంది. తమకున్న అనుమానాల నివృత్తి కోసం విడుదలకు ముందే సినిమాను చూపాల్సిందిగా కొందరు తెలుగు ప్రముఖులు చిత్రదర్శకుడు యువరాజన్ను కోరగా ఆయన అంగీకరించారు. అయితే విడుదలకు ముందు సినిమాను చూపేది లేదని చిత్రనిర్మాత రంగరాజన్ మరుసటి రోజే ప్రెస్‌మీట్ పెట్టి మరీ రెచ్చగొట్టే ప్రకటన చేశారు. తెలుగువారంతా గవర్నర్ కే రోశయ్యను కలిసి ఈ వివాదంపై వినతిపత్రం అందజేశారు. తెలుగు సంఘాల ఐక్యవేదిక కింద సుమారు 20 తెలుగు సంఘాలు ఏకమై చిత్ర ప్రదర్శనను అడ్డుకుంటామని హెచ్చరించారు. మరో తెలుగు బృందం వడివేలు ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేసింది. కేతిరెడ్డి ఖండన తెలుగు సంఘాలకు సీమాన్, గౌతమన్ చేసిన హెచ్చరికలనుతమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తీవ్రంగా ఖండించారు. తెలుగువారి మనోభావాలను కించపరుస్తూ నిర్మించిన సినిమాను అడ్డుకునే హక్కు తెలుగువారికి లేదా అని ప్రశ్నించారు. మహోన్నతుడైన కృష్ణదేవరాయలకు 36 మంది భార్యలు, 52 మంది సంతానం ఉన్నట్లుగా చిత్రీకరించడం ఎంతవరకు సబబని వారిని ఆయన ప్రశ్నించారు. తమిళనాడులోనే పుట్టి రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములైన తెలుగువారు తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. తెలుగువారిని స్థానికేతరులుగా భావిస్తూ కొందరు సాగించే బెదిరింపులకు తాము భయపడబోమని హెచ్చరించారు. మరో పది రోజుల్లో వివాదాస్పద తెనాలిరామన్ విడుదల కావడం, ఆ నిర్మాణ సంస్థను ఎటువంటి హామీలు రాకపోవడం, సీమాన్, గౌతమన్ ఇలా వరుసగా హెచ్చరికలు జారీచేయడం వంటివి జరిగిపోతున్నాయి. అయినా తెలుగు సంఘాల ఐక్యవేదిక తరపున సంఘటితమైన తెలుగు సంఘాల వారెవ్వరూ ఇంతవరకు నోరు మెదపకపోవడం శోచనీయం. -
వార్నింగ్
తమిళ హాస్యనటుడు వడివేలు హీరోగా నిర్మించిన ‘జగబల భుజబల తెనాలిరామన్’ చిత్ర వివాదం చినికి చినికి గాలీ వానగా మారింది. రెండు రోజుల క్రితం రాజకీయ నేత సీమాన్, బుధవారం నాడు తమిళ సినీ దర్శకుడు గౌతమన్ , తెలుగు సంఘాల వారికి హెచ్చరికలు జారీచేసి వివాదానికి ఆజ్యం పోశారు. చెన్నై, సాక్షి ప్రతినిధి: శ్రీకృష్ణదేవరాయలు ఒక్క తెలుగువారికే కాదు అందరికీ ఆరాధ్యుడు, ఆదర్శనీయుడు. వీరునిగా, కవి, పండితా పోషకుడుగా ప్రసిద్ధుడు. శ్రీకృష్ణదేవరాయల ఇతివృత్తంతో తెలుగులో వచ్చిన అనేక చిత్రాలు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేశాయి. అటువంటి మహానాయకుని ఒక జోకర్గానూ, బహుభార్యాతత్వం కలిగిన విలాసజీవిగా చిత్రీకరించినట్లుగా తెనాలిరామన్ ప్రచార చిత్రాలే చెబుతున్నాయి. ఇది తెలుగువారి హృదయాలను తీవ్రంగా గాయపరిచింది. ఈనెల 18న తెనాలిరామన్ తమిళనాడంతా విడుదలకు సిద్ధమైంది. తమకున్న అనుమానాల నివృత్తి కోసం విడుదలకు ముందే సినిమాను చూపాల్సిందిగా కొందరు తెలుగు ప్రముఖులు చిత్రదర్శకుడు యువరాజన్ను కోరగా ఆయన అంగీకరించారు. అయితే విడుదలకు ముందు సినిమాను చూపేది లేదని చిత్రనిర్మాత రంగరాజన్ మరుసటి రోజే ప్రెస్‌మీట్ పెట్టి మరీ రెచ్చగొట్టే ప్రకటన చేశారు. తెలుగువారంతా గవర్నర్ కే రోశయ్యను కలిసి ఈ వివాదంపై వినతిపత్రం అందజేశారు. తెలుగు సంఘాల ఐక్యవేదిక కింద సుమారు 20 తెలుగు సంఘాలు ఏకమై చిత్ర ప్రదర్శనను అడ్డుకుంటామని హెచ్చరించారు. మరో తెలుగు బృందం వడివేలు ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేసింది. నిన్న సీమాన్, నేడు గౌతమన్ తెనాలిరామన్ చిత్రంపై నిరసనలను తీవ్రంగా పరిగణించిన నామ్ తమిళర్ కట్చి అధ్యక్షులు సీమాన్ రెండు రోజుల క్రితం ధ్వజమెత్తగా, బుధవారం తమిళ సినీ దర్శకుడు గౌతమన్ తెలుగు సంఘాలపై మండిపడ్డారు. తమిళనాడులో తమిళునికే బెదిరింపులా అంటూ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆనాటి హాస్య ప్రముఖులు ఎన్ఎస్ కృష్ణన్, టనల్ తంగబాలు, గౌండమణిల సరసన వడివేలు అర్హత సంపాదించారన్నారు. అలాంటి వడివేలు ఇంటికే వెళ్లి బెదిరింపులకు పాల్పడటం అనాగరిక చర్యగా ఆయన అభివర్ణించారు. సినిమాకి ప్రధాన బాధ్యులైన కథా రచయిత, నిర్మాత, దర్శకులకు వివాదాన్ని చెప్పకుండా వడివేలును వేలెత్తిచూపడం తగదన్నారు. ఎంతోకాలం తరువాత విడుదలవుతున్న వడివేలు చిత్రం కోసం తమిళులంతా ఎదురుచూస్తుండగా తెలుగువారు అడ్డుకోవడం బాధాకరమన్నారు. దీన్ని ఒక తమిళునిపై దాడిగా తాము భావిస్తున్నామని చెప్పారు. తమిళులంతా ఏకమైతే జరగబోయే తీవ్రపరిణామాలను తెలుగు సంఘాలు ఎదుర్కొనక తప్పదని ఆయన హెచ్చరించారు. కేతిరెడ్డి ఖండన తెలుగు సంఘాలకు సీమాన్, గౌతమన్ చేసిన హెచ్చరికలనుతమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఖండించారు. తెలుగువారి మనోభావాలను కించపరుస్తూ నిర్మించిన సినిమాను అడ్డుకునే హక్కు తెలుగువారికి లేదా అని ప్రశ్నించారు. మహోన్నతుడైన కృష్ణదేవరాయలకు 36 మంది భార్యలు, 52 మంది సంతానం ఉన్నట్లుగా చిత్రీకరించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. తమిళనాడులోనే పుట్టి రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములైన తెలుగువారు తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తెలుగువారిని స్థానికేతరులుగా భావిస్తూ కొందరు సాగించే బెదిరింపులకు తాము భయపడబోమని హెచ్చరించారు. అయితే సీమాన్, గౌతమన్ వరుస హెచ్చరికలపై తెలుగు సంఘాల ఐక్యవేదిక తరపున సంఘటితమైన తెలుగు సంఘాల ప్రతినిధుల వారెవ్వరూ ఇంతవరకు నోరు మెదపకపోవడం శోచనీయం. -
అనుభూతుల భరిణె!
ప్రముఖ సినీ రచయిత, నటుడు, ‘మిథునం’ చిత్ర దర్శకుడు తనికెళ్ల భరణి ఇటీవల దక్షిణాఫ్రికా వెళ్లొచ్చారు. ఆయన యాత్రానుభవాలు, అక్కడి విశేషాలు...‘సాక్షి’ పాఠకులకు ప్రత్యేకం. దక్షిణాఫ్రికా తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఫోన్ చేసి, ‘మేము ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ చేస్తున్నాం మీ ‘మిథునం’ అక్కడ ప్రదర్శించాలనుకుంటున్నాం. మీరూ, బాలూ గారు వస్తే బావుంటుంది’ అన్నారు. అమెరికా, యూరోపు వెళుతుంటాం కానీ దక్షిణాఫ్రికా వెళ్ళడం తక్కువే అవడంతో ఆ ప్రదేశం, అక్కడి తెలుగు వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏమిటో చూద్దామనిపించి, సరే అని ఒప్పుకున్నాను. అలా జనవరి 16న నాతోపాటు ‘అంతకుముందు ఆ తర్వాత’ సినిమా దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ, హీరోయిన్ ఇషా, మా అబ్బాయి కూడా బయలుదేరారు. వెల్కమ్ టు ఆఫ్రికా... హైదరాబాద్ - బాంబే - నైరోబీ మీదుగా జోహన్స్‌బర్గ్ చేరుకున్నాం. ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే అక్కడి తెలుగు అసోసియేషన్ వారు స్వాగతం పలికారు. 17వ తేదీ సాయంత్రం నాతో ముఖాముఖి కార్యక్రమం, 18న అక్కడి లోకల్ థియేటర్లో ‘మిథునం’ ప్రదర్శన ఏర్పాటు చేశారు. దాని తర్వాత అరికల్ అనే ఫేమస్ థియేటర్‌కు వెళ్తున్నామని, అక్కడే పెద్ద సభ ఏర్పాటు చేశామని చెప్పారు వాళ్లు. అరికల్ థియేటర్ ... అన్బిలీవబుల్! పాతకాలం నాటి బిల్డింగులాంటి కాంప్లెక్స్‌కు చేరుకున్నాం. అక్కడ లాస్వెగాస్లా పెద్ద జూద గృహం, పేకాడేవాళ్ళు, స్లాట్మిషన్ బారు, డాన్సులు కనపడ్డాయి. వాటన్నిటినీ దాటుకుంటూ, పైకి వెళ్తే థియేటర్ కనిపించింది. అది మన రవీంధ్రభారతికి కనీసం రెండింతలైనా ఉంటుంది. ఎప్పుడయినా మన వాళ్ళు అలాంటిది కడతారా, అక్కడ మనం ఓ నాటకం వేస్తే ఎంత బాగుండు అనిపించేలా అద్భుతంగా ఉంది అది! కార్యక్రమం మొదట సౌతాఫ్రికా సాంస్కృతిక మంత్రి రెండు దేశాల సంబంధాల గురించి అద్భుతమైన ఉపన్యాసం ఇచ్చారు. దాని తర్వాత స్టేజీ బద్దలయిపోతుందా? అవి రబ్బర్‌తో చేసిన శరీరాలా? వాటికి ఎముకలుండవా? అనిపించేలా సౌతాఫ్రికా ‘రబ్బర్ బ్యాండ్’ గ్రూప్ వాళ్లు ఒళ్లు విరిచి చేసిన డ్యాన్సులు అబ్బురపరిచాయి! ఇక ఆ తర్వాత బాలు గారికి ‘జీవన సాఫల్య’ అవార్డు ఇవ్వడంతో ఆరోజు కార్యక్రమం ముగిసింది. ఇండియన్ కల్చరల్ సెంటర్... మర్నాటి పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్ చేసి ఒక ఇండియన్ కల్చరల్ సెంటర్‌కు వెళ్ళాం. అక్కడ మరాఠీ, కన్నడ తదితర ఆర్టిస్టులు, ముందురోజు ఫెస్టివల్‌కు వచ్చిన వాళ్లూ వచ్చారు. స్థానిక కళాకారులతో పాటు 50 మందితో ఇంటరాక్షన్ సెషన్‌తో మొదలై, మోహనకృష్ణ చిత్ర ప్రదర్శనతో ముగిసింది ఆరోజు కార్యక్రమం. కీకారణ్యాన్ని తలపించే రిసార్టులు... కీకారణ్యంలా ఉన్న ఓ రిసార్ట్‌కి వెళ్లాం. అది తమిళవాళ్లది. నేను పదేళ్ళ పాటు మద్రాసులో ఉండిన వాణ్ణి గనక వెంటనే నేను వారితో తమిళంలో మాట్లాడ్డం మొదలుపెట్టాను. వాళ్ళు - ‘సారీ సర్... వియ్ నో ద వోన్లీ వర్డ్ వణక్కం’ అన్నారు. ఎప్పుడో తమ పూర్వీకులు వచ్చి స్థిరపడ్డారట! రిసార్ట్స్‌లో కొన్ని కార్యక్రమాల అనంతరం విశ్రాంతి తీసుకున్నాక, అక్కడి నుంచి ఆఫ్రికన్ సఫారీకి వెళ్లాం. వందల ఎకరాలలో సఫారీ... ఆ అడవి స్థలం ఒక వెయ్యి ఎనిమిది వందల ఎకరాలు. పెద్ద చెట్లుండవు. కానీ సింహం జూలులా గడ్డి గుబురుగా ఉంటుంది. సింహాలు అందులో కలిసిపోవడానికి వీలుగా కావచ్చు! ఒక్క సింహాలే కాదు, చిరుత పులులు, హైనాలు... అయ్య బాబోయ్! చెప్పడానికి వీల్లేదు! మనవూర్లో కుక్కల్ని చూసినట్లు దగ్గర్నించీ సింహాల్ని చూడ్డం అంటే తెలియని గగుర్పాటు కలిగింది! ప్రకృతి ప్రసాదం వండర్ కేవ్స్... అక్కడ పది కిలోమీటర్ల దూరంలో భూగృహంలో మన బొర్రాగుహలు లాంటిది ఒకటుంది. పేరు వండర్స్ కేవ్స్! అది యాభై లక్షల లేదా కోటి సంవత్సరాల క్రితం ఏర్పడి ఉండవచ్చు అని తెలుసుకోగానే ఆశ్చర్యపోయాను! పైనించీ పెద్ద కాల్షియం సున్నపు రాళ్ళ రకరకాల ఆకృతులు వేళ్లాడుతున్నాయి. ఆఫ్రికాలో వజ్రాలగనులు, బంగారు, వెండి..వీటి తవ్వకాల్లో బయట పడ్డ గుహలన్న మాట ఇవి! నిజంగా ఆ గుహ నాకు దివ్యమైన అనుభూతిని మిగిల్చింది. కేప్‌టౌన్... కేఫ్‌టౌన్ మౌంటెయిన్ పైభాగమంతా బల్లపరుపుగా ఉంటుంది. కోణాకారం పక్కనే శివలింగాకారంలో పెద్దకొండ! అది కేప్‌టౌన్‌లో ఉంది కాబట్టి దాన్ని ‘కేపేశ్వర స్వామి’ అన్నాను సరదాగా! అక్కడ నిప్పు కోడి ఆకృతులు, వాటిలో బల్బులు పెట్టి వెలిగించడం, ఎన్నో రకాల జంతువుల చర్మ ప్రదర్శన చూశాం. నిప్పుకోడి గుడ్డు పై మనం నిల్చున్నా అది పగలదు. అక్కడి నుంచి కేబుల్ కారులో ప్రయాణం! పైన రెండువేల జాతుల వృక్షాలున్నాయట. వృక్షశాస్త్రం పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళు రోజుల తరబడి అక్కడ పరిశోధనలు చేస్తుంటారు. మొత్తం అక్కడినించి కేప్‌టౌన్ అంతా పరిశీలించాం. అపార్థైడ్ మ్యూజియం.... తరువాత రోజు‘అపార్డైడ్ మ్యూజియం’కి వెళ్ళాం. వర్ణవివక్ష మీద ఆఫ్రికన్లని ఆంగ్లేయులు వేరు చేశారు. ఇక్కడ ఇంగ్లీషు వాళ్ళకు వేరు హోటళ్లు, మిగతావారికి వేరు. వాళ్ళ స్థలాల్లోనికి వీళ్ళు వెళ్ళకూడదు. డర్బన్‌లోనే కదా గాంధీగారిని ట్రెయిన్ నించి దింపేసింది! ప్రపంచ దేశాలన్నీ సౌతాఫ్రికా శ్వేత దురహంకారాన్ని వెలివేశాయి. దాని తాలుకా అణచివేత, తిరుగుబాటు, పదమూడేళ్ళ కుర్రాడు చనిపోవడం, సౌతాఫ్రికా అగ్నిగుండం కావడం, దాదాపు రెండు మూడు దశాబ్దాల పాటు మండేలాను జైల్లో పెట్టడం... వాటి విశేషాలతో నిండిన మ్యూజియం అది! అక్కడ రెండు గేట్లు ఉన్నాయి. ఒకటి తెల్లవాళ్ళకి, ఒకటి నల్లవాళ్ళకి. ఇప్పుడెందుకు ఇంకా అలా పెట్టారంటే వాళ్ళకి నాటి ఫీలింగ్ కలగడానికి అని చెప్పారు. ఆ మ్యూజియంలో మండేలా బట్టలు, కారు, ఫోటోలు, జన్మవిశేషాలు, వీడియో క్లిప్పింగ్స్ వేస్తుంటారు. ఒక క్లిప్పింగ్ చూసి మటుకు షాక్ తిన్నా! 150 మంది ఉద్యమనాయకుల్ని ఉరి తీస్తే, ఆ ఉరితాళ్లనీ ఒక గదిలో వేలాడుతున్నాయి. ఆ దృశ్యాన్ని భరించలేకపోయాను! బయటికొచ్చాక ఆఫ్రికన్ సంస్కృతికి గుర్తులుగా పూసలు, గాజులు కొన్నాం. అలా పదిరోజుల పాటు అక్కడి వారితో ఉండి, ఆ అనుబంధాన్ని తలుచుకుంటూ పదకొండోరోజు ఉదయాన్నే తిరిగి ఇండియాకు బయల్దేరాం. కేప్‌టౌన్... ఓ అద్భుత దృశ్యకావ్యం! కేప్‌టౌన్ వెళ్లడానికి ఆన్లైన్లో బుక్ చేశాం. ఉదయం నాలుగుకల్లా నలుగురం సిద్ధమై, దగ్గర్లో ఉన్న డొమెస్టిక్ ఫ్లైట్ ఎక్కి ‘కేఫ్‌టౌన్’ వెళ్ళాం. అంటే కొలంబస్ వచ్చిననాటి ‘కేఫ్ ఆఫ్ గుడ్‌హోప్’ అన్నమాట! అట్లాంటిక్ సముద్రతీరం..... రెండు సముద్రాలు కలిసే స్థలం... అంతా నీలం... మాటలకందని అద్భుత దృశ్యకావ్యమది! అక్కడే మెక్‌డొనాల్డ్‌లో తినేసి, కాఫీ తాగి కార్లో ‘కేఫ్‌టౌన్’బీచ్‌లో సముద్రతీరం వెంబడే వెళుతోంటే మోహనకృష్ణ ఎంత ఎగ్జైటయిపోయాడంటే తను తరువాతి సినిమా పాటలు యిక్కడే కేఫ్‌టౌన్ బీచ్‌లో తియ్యడానికి నిర్ణయించుకున్నాడు! -
ఆకలి రుచెరిగిన అక్షరం...
ఆకలి రుచి ఎరిగిన ఓ అక్షరం తెలుగు సాహిత్యం నుంచి వీడ్కోలు తీసుకుంది. గుప్పెడు అక్షరాలనే పిడికెడు ముద్దగా మలుచుకున్న ఒక కలం తెలుగు సాహిత్యానికి తనవైన కవి లి కట్టలను మూటగా ఇచ్చి అనంతలోకాలకు సాగిపోయింది. అక్షరం అంటే అగ్రవర్ణాల సొత్తు అనీ, ఏనుగు అంబారీ ఎక్కి తిరిగే పం డితుల పట్టు శాలువాల అంచుకు వేలాడే ముల్లె అని ప్రచారం అవుతున్న రోజుల్లో అక్ష రం ఒక పేదవాడి సొత్తు అని నిరూపించిన గొప్ప రచయిత- రావూరి భరద్వాజ (జూలై 5, 1927-అక్టోబర్ 18, 2013). దివ్య లోకా లలో అక్షర సరోవరాల చెంత సేద తీరడానికి పయనమై వెళ్లారు. వందలాది పేజీలలో ఆయన జీవితాను భవాలు పరుచుకున్నాయి. అయినా ఇంకొన్ని మిగిలే ఉన్నాయి కాబోలు. జ్ఞానపీఠ్ పురస్కా రం లభించాక ఏ సత్కార సభలో ప్రసంగిం చినా ఆయన మనసు దొంతరల మధ్య పొం చి ఉన్న పాత జ్ఞాపకాలు కొత్తకొత్తగా వెలుగు చూశాయి. 2012 సంవత్సరానికి గాను భార తదేశ అత్యున్నత సాహిత్య పురస్కారం జ్ఞాన పీఠ్‌ను డాక్టర్ రావూరి భరద్వాజకు ఈ ఏప్రి ల్లో ప్రకటించారు. మండుటెండలో వాసంత సమీరంలా తెలుగువారందరినీ ఆ వార్త ఆహ్లా ద పరిచింది. తెల్లటి గెడ్డంతో, చక్రాల కుర్చీలో వచ్చి తన అభిమానులను ఆయన పలక రించడం ఇప్పటికీ కళ్ల ముందు కదులుతోంది. ముదిమితో మూసుకుపోయిన గొంతు నుంచి ప్రతి సభలోను ఆయన జీవితానుభవాలే చీల్చుకుని వచ్చేవి. కంపించే కంఠం నుంచి బాధల గాథలే ఉబికాయి. వాటిలోని విషాదం అంత పదునైనది. పేదరికంలో పుట్టడం ఎక్కైడెనా జీవితాన్ని ప్రశ్నార్థకం చేస్తుంది. దాన్ని ఛేదించినా, వెన్ను నిలుపుకుంటూ, అందునా రచయితగా బతకడం అంటే పెను సవాళ్ల మధ్య సాగడమే. భరద్వాజ జ్ఞానపీఠం అధిరో హించారు. ఆ పర్వతం మీదకు ఆయన ప్రయాణం సాగింది అక్షరాలా పాకుడురాళ్ల మీదనే. భరద్వాజ పేరు చెబితే ‘పాకుడురాళ్లు’ నవల జ్ఞప్తికి వస్తుంది. ఆ నవలలో మంజరి స్త్రీ, నటి. కాబట్టి ఆమె బాధలు వేరు. వెండి తెర వెలుగుల్లో వాటి రూపం, నేపథ్యం వేర్వేరు. కానీ భరద్వాజ నిజ జీవితంలో రచ యితగా నిలబడడానికీ ఎదగడానికీ తెర వెను క పడిన కష్టాలు తక్కువేమీ కాదు. ఆయన నడిచి వెళ్లింది కూడా పాకుడురాళ్ల మీదే. వెండి తెర మీది చీకటిరేఖలను చెప్పే ఈ నవల ఆయనకు చిరకీర్తిని తెచ్చింది. 1960 దశకంలో భరద్వాజ ‘పరిస్థితుల వారసులు’ అన్న శీర్షికతో కథ రాశారు. నిజం గానే ఆనాటి చాలా పరిస్థితులకు భరద్వాజ వారసుడు. భరద్వాజ సాహిత్య రంగంలో అడుగుపెట్టే కాలానికి సాహిత్య వ్యాసంగం ఒక వర్గం చేతిలో ఉంది. అటువంటి సమ యంలో కేవలం వానాకాలం చదువుతోనే ఆయన కలం పట్టి నెగ్గుకు వచ్చారు.అదే వర్గం వాడైనా ఆప్తమిత్రుడు ’శారద’ విషాదం మరో కోణం. భావసంపన్నుడైన శారదపేదరికానికి బలైనవాడు. తనను రచయితగా తీర్చిదిద్దినవే పరిస్థితులని భరద్వాజ ప్రగాఢ నమ్మకం. అం దుకే జ్ఞానపీఠ్ పురస్కారం ప్రకటించిన తరు వాత, ‘నా రచనా వ్యాసంగం నా ఒక్కడి కృషి వల్లనే సాధ్యమైంది కాదు. పరిస్థితులు నన్ను అందుకు ప్రేరేపించాయి. నా అనుభవాలకే నేను అక్షరరూపం ఇచ్చాను. చాలా జీవితా నుభవాలనే నేను రచనలలో నింపాను’ అన్నా రాయన. ఆ అనుభవాలు 140 పుస్తకాలై మన ముందు తెరుచుకున్నాయి. గతకాలపు రష్యన్ సాహిత్యకారులకు మల్లే రావూరి భరద్వాజ కూడా కార్మికుల్లో కార్మికుడిగా, కర్షకుల్లో కర్షకుడిగా జీవితం ప్రారంభించారు. పతితులను, భ్రష్టులను, బాధాసర్పదష్టులనూ చూశారు. ఆకలి విశ్వ రూపం ఎత్తితే మనిషి తన విలువలనూ వ్యక్తి త్వాన్ని పక్కనపెట్టి గడ్డిపోచలాగా ఎలా కొట్టు కువెళతాడో దర్శించారు. అందుకే అక్షరం మనిషికి ఒక ఆలంబనగా ఉండాలని భావిం చాడాయన. జీవన సమరంలో అలిసి ముడు తలు పడ్డ ఆయన నుదుటిపై ఒక ముద్దుపెట్టి ఆయనను సేద తీర్చింది. వచన రచన అంటే తీరిగ్గా చేసే, బుద్ధి పుట్టినప్పుడు గిలికే సోమ రిపని కాదని, కాయకష్టం చేసే మనిషి వలే, రచయిత కూడా కాయకష్టం చేసి రచనలను పండిస్తూ సమాజం మేధ కోసం, బుద్ధి వైశా ల్యం కోసం ఆహారం అందిస్తూనే ఉండాలని ఆచరణతోనే సందేశం ఇచ్చిన భరద్వాజ ఒక తరానికి, ఒక శ్రమకు ఆఖరి గుర్తు. చెరిగిపోని జ్ఞాపకం. శిరస్సు వొంచి స్మరించదగ్గ గౌరవం. -గిరీష్