లండన్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు
లండన్: లండన్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. యునైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్ (యుక్తా) ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులందరూ ఒకే చోట చేరి సంక్రాతి పండుగ జరుపుకున్నారు. ఈ వేడుకకు భారీ ఎత్తున ప్రవాస తెలుగు ప్రజలు హాజరయ్యారు. చిన్నారుల బోగి పళ్ళ కార్యక్రం వీక్షకులను అలరించింది. నూతన పరిచయాలతో కూడిన కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక నృత్యాలతో ఆడి పాడారు.
మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణా, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన ప్రవాసులు అధికంగా నివసించే లండన్లో ఇలాంటి పండుగలు జరుపుకోవటం ద్వారా యావత్ బ్రిటన్లోని తెలుగు వారికి, ప్రవాస భారతీయులకి చేరువవటమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నామని యుక్తా కార్యవర్గం తెలిపింది. రానున్న సంవత్సరంలో మరిన్ని జనరంజకమైన కార్యక్రమాలతో ప్రవాస తెలుగు వారి సమైక్యతకు, గుర్తింపుకు కృషి చేయనున్నట్లు యుక్తా నూతన అధ్యక్షుడు ప్రసాద్ మంత్రాల తెలిపారు. ఈ సందర్భంగా ఆయన 2016-18కుగానూ ఎన్నికైన నూతన కార్యవర్గాన్ని పరిచయం చేస్తూ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
అధ్యక్షుడు - ప్రసాద్ మంత్రాల
ఉపాధ్యక్షుడు - రాజశేఖర్ కుర్బా
కార్యనిర్వహణాధికారి - సత్య ప్రసాద్ మద్దసాని
కోశాధికారి - నరేంద్ర మున్నలూరి
మీడియా, సామాజిక మాధ్యమాలు - రుద్ర వర్మ బట్ట
సాంఘిక సంబంధాలు - బలరాం విష్ణుభొట్ల
ఐటి - అమర్నాథ్ రెడ్డి చింతపల్లి, ఆదిత్యవర్ధన్ అల్లాడి, కృష్ణ యలమంచిలి
సాంస్కృతిక విభాగం - పూర్ణిమా రెడ్డి చల్లా
వాణిజ్య విభాగం - ఉదయ ఆర్యన్ ఆరేటి
క్రీడలు, సామాజిక కార్యక్రమాలు - కృష్ణ సనపల, సుధీర్ కొండూరు
అధికార ప్రతినిధి - శ్రీ సత్య ప్రసాద్ కిల్లి
గీతా మోర్ల, డాక్టర్ అనిత రావు, డాక్టర్ పద్మ కిల్లి ట్రస్టీలు గా వ్యవహరించనున్నారు.