united kingdom
-
పంజాబ్ పోలీసులు వర్సెస్ బ్రిటన్ ఆర్మీ
లండన్: జగ్జీత్సింగ్ అనే బ్రిటన్ సైనికుడు భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న విషయం తమ విచారణలో తేలిందని పంజాబ్ పోలీసులు ప్రకటించడం వివాదాస్పదమవుతోంది. ఈ విషయాన్ని బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఖండించింది. పంజాబ్ పోలీసులు చెప్పిన జగ్జీత్సింగ్ పేరుతో బ్రిటిష్ ఆర్మీలో ఎవరూ పని చేయడం లేదని తెలిపింది.‘జగ్జీత్సింగ్ అనే వ్యక్తి ఫతేసింగ్ బాగీ అనే మారుపేరుతో ఖలిస్తానీ జిందాబాద్ ఫోర్స్ అనే ఉగ్రవాద సంస్థ నడుపుతున్నాడు. జగ్జీత్సింగ్ ప్రస్తుతం బ్రిటీష్ ఆర్మీలో జవానుగా పనిచేస్తున్నాడు’అని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ సోషల్‌మీడియాలో పోస్టు చేశారు. దీనికి సంబంధించి తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పారు.పంజాబ్ డీజీపీ వెల్లడించిన ఈ విషయాన్ని యూకే ప్రభుత్వం కొట్టిపారేసింది. కాగా,2021లో అమృత్సర్ పోలీసులకు పట్టుబడ్డ ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులు జగ్జీత్సింగ్ పేరు చెప్పారు. తమకు ఆయుధాలు, డబ్బులు ఇచ్చింది జగ్జీత్సింగ్ అని వారు విచారణలో చెప్పడం గమనార్హం. -
ఒక సొరంగం.. రూ.16.96 లక్షల కోట్లు
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్, యునైటెడ్ కింగ్‌డమ్‌లోని లండన్ నగరాల మధ్య దూరం 3 వేల మైళ్లు(4,828 కిలోమీటర్లు). విమానంలో కాకుండా సముద్రంలో నౌకలపై ప్రయాణించాలంటే రోజుల తరబడి సమయం పడుతుంది. కానీ, సముద్రంలో కేవలం గంట సమయంలో ప్రయాణించే అవకాశం వస్తే? నిజంగా అద్భుతం. ఇప్పుడు ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. రెండు కీలక నగరాలను అనుసంధానించడానికి అట్లాంటిక్ మహాసముద్రంలో సొరంగం(టన్నెల్) నిర్మించాలన్న ఆలోచన తెరపైకి వచ్చింది. ఇది సాధారణ సొరంగం కాదు. వాక్యూమ్ ట్యూబ్ టెక్నాలజీతో నిర్మించే సొరంగం. ఈ ప్రాజెక్టుకు రూ.16.96 లక్షల కోట్లకుపైగా(20 ట్రిలియన్ డాలర్లు) ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఇది నిజంగా అమల్లోకి వస్తే ప్రపంచంలోనే అత్యంత పొడవైన సముద్ర గర్భ టన్నెల్‌గా రికార్డుకెక్కడం ఖాయం. ప్రస్తుతం ఉత్తర యూరప్‌లో ఫెమార్న్బెల్ట్ సొరంగం నిర్మాణ దశలో ఉంది. డెన్మార్క్, జర్మనీని అనుసంధానించే ఈ సొరంగం 2029లో అందుబాటులోకి రానుంది. ఇది ప్రపంచంలో అత్యంత పొడవైన రోడ్ అండ్ రైల్ టన్నెల్‌గా రికార్డు సృష్టించబోతోంది. మరోవైపు దక్షిణ యూరప్‌లోనూ భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. గ్రీస్, టర్కీని కలిపేలా సముద్రంపై కొత్త వంతెన నిర్మించబోతున్నారు. -
బంగ్లాదేశ్‌కు వెళ్లొద్దు: బ్రిటన్ హెచ్చరిక
లండన్:బంగ్లాదేశ్‌కు వెళ్లొద్దని బ్రిటన్ తన పౌరులకు సూచించింది. అక్కడ ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించింది.ఉగ్రవాదుల దాడులతో పాటు ఆయుధాలతో బెదిరించి దోపిడీ చేయడం,అత్యాచారం,భౌతిక దాడులు జరిగే అవకాశాలున్నాయని తెలిపింది.బంగ్లాదేశ్‌లో ఉన్న యూకే పౌరులు జాగ్రత్తగా ఉండాలని కోరింది. ఈ మేరకు బ్రిటన్ తాజాగా ఒక అడ్వైజరీ జారీ చేసింది.అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా బంగ్లాదేశ్‌లో రద్దీ ఎక్కువగా ఉండే అన్ని ప్రదేశాల్లో ముఖ్యంగా విదేశీయులు సంచరించే ప్రాంతాల్లో దాడులు జరగొచ్చని తెలిపింది.దేశంలో ఇస్లాం మతానికి చెందని వారిని కొన్ని గ్రూపులు లక్ష్యంగా చేసుకున్నాయని పేర్కొంది.కాగా, బంగ్లాదేశ్‌లో షేక్‌హసీనా ప్రభుత్వం పడిపోయి మధ్యంతర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడ శాంతిభద్రతలు పూర్తిగా దిగజారిపోయాయి. ముఖ్యంగా మైనారిటీలైన హిందువులపైన దాడులు పెరిగాయి. -
15 ఏళ్ల వేట.. చివరకు చిక్కిన మోస్ట్‌వాంటెడ్
వాషింగ్టన్: అమెరికా మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న నేరస్తుడిని బ్రిటన్‌లో అరెస్టు చేశారు. 2009లో కాలిఫోర్నియా బయోటెక్నాలజీ సంస్థపై జరిగిన బాంబు దాడి ఘటనలో డేనియల్ ఆండ్రియాస్ ప్రధాన అనుమానితుడు. అమెరికాలో అప్పట్లో అతన్ని మోస్ట్ వాంటెడ్ నేరగాళ్ల లిస్టులో చేర్చారు.బాంబు దాడి తర్వాత పరారీలో ఉన్న డేనియల్ను బ్రిటన్‌లోని వేల్స్లో అరెస్టు చేసినట్లు ఎఫ్‌బీఐ ప్రకటించింది.బ్రిటన్ పోలీసులు,ఎఫ్‌బీఐ సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో డేనియల్ను అరెస్టు చేసినట్లు ఎఫ్‌బీఐ వెల్లడించింది.డేనియల్ 2009 నుంచి పరారీలో ఉన్నా తాము అతడిని వెంబడించడం ఆపలేదని ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్రిస్టోఫర్ వ్రే తెలిపారు.2009కు ముందు కూడా డేనియల్ పలు హింసాత్మక ఘటనలకు కారణమయ్యాడన్నఅభియోగాలుండడంతో అతడిని మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చారు. -
విషప్రచారపు కోరల్లో...
చేతిలోని కత్తిని మంచికి వాడవచ్చు, చేయాలనుకుంటే చెడు కూడా చేయవచ్చు. మరి, ప్రపంచాన్ని చేతిలోకి తీసుకొచ్చిన స్మార్ట్ఫోన్నీ, అందులోని సోషల్ మీడియా వేదికల్నీ ఇప్పుడు మనం దేనికి వాడుతున్నట్టు? దాని దుర్వినియోగం, విషప్రచారం తాలూకు విపరిణామాల ఫలితం యునైటెడ్ కింగ్డమ్ (యూకే) ప్రత్యక్షంగా అనుభవిస్తోంది. అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థ, విభిన్న వర్గాల మధ్య అనుమానాలు సహా ఇప్పటికే అనేక సమస్యలతో సతమతమవుతున్న బ్రిటన్ సోషల్ మీడియా సాక్షిగా తీవ్రతర మితవాద బృందాల అసత్య ప్రచారం వల్ల అల్లర్లు, దహనాలతో అట్టుడుకుతోంది. మనసును కదిలించే ముగ్గురు పసిపిల్లల పాశవిక హత్య కారణంగా వారం క్రితం మొదలైన ఈ హింసాత్మక నిరసనల్ని అదుపు చేయడానికి పాలనా యంత్రాంగం కిందా మీదా అవుతోంది. చివరకు యూకేలో ‘అంతర్యుద్ధం అనివార్యం’ అంటూ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు దుందు డుకు వ్యాఖ్యలు చేస్తుంటే, బ్రిటన్ కొత్త ప్రధాని కీర్ స్టార్మర్ ఖండించాల్సిన పరిస్థితి. ఇటీవలే పగ్గాలు పట్టిన లేబర్ పార్టీ ప్రభుత్వానికి తాజా పరిణామాలు సవాలుగా మారాయి. ఇంగ్లండ్ వాయవ్య ప్రాంతంలోని సౌత్‌పోర్ట్‌లో జూలై 29న ఓ డ్యాన్స్ క్లాస్‌లో ముక్కుపచ్చలారని ముగ్గురు చిన్నారులపై ఓ ఆగంతకుడు కత్తితో దాడి చేసి చంపిన దారుణ సంఘటన చివరకు దేశమంతటా కార్చిచ్చుకు దారి తీయడం నమ్మశక్యం కాని నిజం. దాడి చేసిన వ్యక్తి వలసదారు, మైనారిటీ మతస్థుడు, గత ఏడాదే ఒక చిన్న పడవలో బ్రిటన్‌లో ప్రవేశించాడు అంటూ అంతర్జాలంలో అసత్యాలు ప్రచారమయ్యాయి. అదే అదనుగా వలసదారులకూ, ముస్లిమ్‌లకూ వ్యతిరేకంగా నిరస నలు చేయాలంటూ తీవ్రతర మితవాద బృందాలు సామాజిక మాధ్యమ వేదికలైన ‘ఎక్స్’ వగైరాల్లో పిలుపునిచ్చాయి. నిజానికి, పిల్లలపై కత్తి దాడికి పాల్పడింది ముస్లిమ్ వలసదారు కాదనీ, రువాండాకు చెందిన తల్లితండ్రులకు జన్మించిన ఓ 17 ఏళ్ళ క్రైస్తవ టీనేజర్ అనీ అధికారులు గుర్తించారు. ఆ పసిపాపల్ని చంపడమే కాక, గతంలోనూ కనీసం పదిసార్లు ఆ కుర్రాడు హత్యాయత్నాలకు పాల్పడి నట్టు పోలీసులు గుర్తించారు. అరెస్టు కూడా చేశారు. అయితే, నిజం ఇంటి గడప దాటే లోపల అబద్ధం ఊరంతా షికారు చేసింది. హంతకుడి గురించి పుకార్లు, విద్వేష నిరసనల పిలుపులు విస్తృతంగా విషాన్ని విరజిమ్మాయి. సోషల్‌మీడియా లోని వివాదాస్పద ఇన్ఫ్లుయెన్సర్ల తప్పుడు కథనాలతో మసీదులు, శరణార్థులకు నీడనిచ్చిన హోటళ్ళే లక్ష్యంగా దాడులు సాగాయి. చివరకు గడచిన దశాబ్ద కాలం పైచిలుకుగా యునైటెడ్ కింగ్డమ్ (యూకే)లో ఎన్నడెరుగని స్థాయిలో అల్లర్లు, దహనకాండ, లూటీలకు ఆజ్యం పోశాయి. జూలై 30 నుంచి దేశవ్యాప్తంగా సాగుతున్న ఘర్షణల్లో ఇప్పటికి కనీసం 400 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయినా పరిస్థితులు చక్కబడలేదు. చివరకు లండన్‌లోని భారత హైకమిషన్ సైతం బ్రిటన్‌కు వచ్చే భారత జాతీయులు జాగ్రత్తగా ఉండాలని మంగళవారం సూచనలు జారీ చేయాల్సి వచ్చింది. నైజీరియా, మలేసియా, ఇండొనేషియా సహా పలు దేశాలు అదే పని చేశాయి. ప్రపంచమంతటా సత్వర సమాచార, వ్యాఖ్యా ప్రసారానికి ఉపయోగపడాల్సిన వాట్సప్ మొదలు ‘ఎక్స్’ దాకా సోషల్ మీడియా వేదికలన్నీ తుంటరుల చేతిలో అదుపు లేని ఆయుధాలుగా మారడం విషాదం. వాటిలోని విద్వేషపూరిత అసత్యాలు, రెచ్చేగొట్టే మాటలకు ఎవరు, ఎక్కడ, ఎలా అడ్డుకట్ట వేయగలరో అర్థం కాని పరిస్థితి. బ్రిటన్‌లో సాంకేతిక శాఖ మంత్రి సైతం గూగుల్, ఎక్స్, టిక్‌టాక్, మెటా సంస్థల ప్రతినిధులతో సమావేశమై, అసత్య సమాచారం వ్యాపించకుండా ఆపడంలో ఆ సంస్థల బాధ్యతను మరోసారి నొక్కిచెప్పాల్సి వచ్చింది. అసలు అలాంటి అంశాలను తొలగించే బాధ్యత, భారం ఆ యా సోషల్ మీడియా సంస్థలదేనని బ్రిటన్ సర్కార్ కొంత కాలంగా ఒత్తిడి పెట్టాలని చూస్తోంది. తాజా ఘర్షణలతో ప్రభుత్వం ఆగి, తన వంతుగా తానూ బాధ్యత తీసుకోక తప్పదు. నిజానికి, ‘బ్రెగ్జిట్’ తర్వాత నుంచి బ్రిటీషు సమాజం నిలువునా చీలిపోయింది. ఈ చీలిక లకు మునుపటి కన్జర్వేటివ్ పార్టీ ప్రభుత్వాలు హ్రస్వ దృష్టితో అనుసరించిన విధానాలు తోడయ్యే సరికి పెను ప్రభావం పడింది. అన్నీ కలసి తాజా దాడులుగా విస్ఫోటించాయి.ఈ హింసను అదుపు చేసి, శాంతిభద్రతల్ని పునరుద్ధరించడం స్టార్మర్ సర్కారుకు సవాలే. కానీ, తీవ్రతర మితవాదులు రేపుతున్న విద్వేషం, విదేశీయుల పట్ల వైముఖ్యానికి కళ్ళెం వేయడం అసలు సిసలు ఛాలెంజ్. మొత్తం వచ్చిన ఓట్ల రీత్యా బ్రిటన్ తాజా ఎన్నికల్లో తీవ్రతర మితవాద రాజకీయ పార్టీ ‘రిఫార్మ్ యూకే’ మూడోస్థానంలో నిలిచింది. అంటే, దేశంలోని రాజకీయ, ఆర్థిక అనిశ్చితుల మధ్య దానికి ఆ మేరకు మద్దతుందన్న మాట. అదే సమయంలో పాలనలో మార్పు కోరిన జనం బ్రిటన్ పునర్నిర్మాణ వాగ్దానం చూసి స్టార్మర్‌కు ఓటేశారు. పాత పాలన సమస్యలకు తోడు ప్రస్తుత పరిస్థితుల్లో వలసలు, మితవాద జనాకర్షక విధానాల లాంటి సంక్లిష్ట అంశాలపై ఆయన ఆచితూచి అడుగేయక తప్పదు. చరిత్రలో వలసరాజ్య పాలనకు పేరొందిన బ్రిటన్‌లో ఇప్పుడు వలసదారులపై రచ్చ రేగడమే వైచిత్రి. పొట్ట చేతబట్టుకొని శరణు కోరి వచ్చినవారినే అన్నిటికీ కారణమని నిందించడం, అకారణ శత్రుత్వం వహించడం బ్రిటన్‌కు శోభనివ్వదు. అసత్య కథనాల పట్ల జనచైతన్యంతో పాటు జనజీవన స్రవంతిలో వలసజీవులు కలిసిపోయే విధానాలకు ప్రభుత్వం ప్రాధాన్యమివ్వడం ముఖ్యం. వాటివల్లే అపోహలు, ప్రతికూలభావాలు పోతాయి. విధ్వంసకారులపై కఠిన చర్యలు తీసు కుంటూనే సరైన నాయకత్వం, సహానుభూతితో వ్యవహరించాలి. మతవైరాలకు తావివ్వక న్యాయం, సమానత్వానికి నిలబడడమే ఇప్పుడు బ్రిటన్ మరింత పటిష్ఠంగా ముందుకు నడవడానికి మార్గం. -
యూకే వెళ్లాలనుకునే భారతీయులకు కేంద్రం అడ్వైజరీ
బ్రిటన్‌లోని భారతీయులను కేంద్రం అప్రమత్తం చేసింది. ఇటీవల యూకేలో నెలకొన్న నిరసనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో బ్రిటన్ వెళ్లాలనుకునే వారు అప్రమత్తంగా ఉండాలని భారత పౌరులకు సూచించింది. ఈ మేరకు లండన్‌లోని భారత హైకమిషన్ మంగళవారం భారతీయులకు ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది.‘యూకేలోని పలు ప్రాంతాల్లో ఇటీవల జరిగిన అల్లర్ల గురించి భారత ప్రయాణికులకు తెలిసే ఉంటుంది. లండన్‌లోని భారత హైకమిషన్ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. భారత్ నుంచి యూకేకు వచ్చే సందర్శకులు అప్రమత్తంగా ఉండాలి. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. స్థానిక భద్రతా సంస్థలు, మీడియా సంస్థలు జారీ చేసే సూచనలను అనుసరించాలి. నిరసనలు జరుగుతున్న ప్రాంతాలకు దూరంగా ఉండటం మంచిది’ అని పేర్కొంది. మీ వ్యక్తిగత భద్రత కోసం నిరసనలు జరుగుతున్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించింది.Advisory for Indian Citizens visiting the UK.@VDoraiswami @sujitjoyghosh @MEAIndia pic.twitter.com/i2iwQ7E3Og— India in the UK (@HCI_London) August 6, 2024కాగా వలస వ్యతిరేక గ్రూప్‌లు బ్రిటన్‌లోని పలు నగరాలు, పట్టణాల్లో నిరసనలు చేపట్టాయి. ఇవి దేశమంతా విస్తరించిన క్రమంలో హింసాత్మకంగా మారాయి. గతవారం ఓ డ్యాన్స్ క్లాస్‌లో చిన్నారులపై దుండగులు కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు మృతి చెందారు. దేశవ్యాప్త ఆందోళనలకు కారణమైన ఈ ఘటన మెల్లమెల్లగా వలస వ్యతిరేక నిరసనలకు దారి తీసింది. పలు నగరాల్లో నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆందోళనకారులు రాళ్లు రువ్వడం, బాణసంచా కాల్చి విసరడం, శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తున్న హోటల్స్‌పై దాడి వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆందోళనకారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని కీర్ స్మార్టర్ అధికారులను ఆదేశించారు. -
యూకే సమ్మిట్‌కు హెచ్‌సీయూ విద్యార్థిని..
రాయదుర్గం: యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ది సైన్స్ బరీ లాబోరేటరీ సమ్మర్ కాన్ఫరెన్స్‌కు ప్రపంచ వ్యాప్తంగా 20 మందికి అవకాశం కలి్పంచగా అందులో హెచ్‌సీయూ విద్యారి్థనికి అవకాశం లభించింది. హెచ్‌సీయూలో స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ పరిశోధక విద్యార్థి ప్రజ్ఞాప్రియదర్శిని ఎంపికయ్యారు. ‘ప్రారంభ కెరీర్ పరిశోధకుల కోసం మొక్కలు–సూక్ష్మజీవుల పరస్పర చర్యలపై వేసవి సదస్సు’లో పాల్గొనేందుకు అవకాశం రావడం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేశారు. ఇటీవల ప్రారంభమైన ఈ సదస్సు ఈనెల 26 వరకూ సాగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి 20 మంది పరిశోధకులను ఎంపిక చేశారు. ఇందులో 20 మంది అంతర్జాతీయ ప్రతిని«ధులు, 8 మంది ముఖ్య వక్తలు, 10 మంది స్థానిక వక్తలు భాగస్వాములయ్యారు. ప్రజ్ఞ హెచ్‌సీయూలోని డిపార్ట్మెంట్ ఆప్ ప్లాంట్ సైన్సెస్ ప్రాఫెసర్ ఇర్ఫాన్ ఆహ్మద్ఘాజీ పర్యవేక్షణలో పనిచేస్తున్నారు. ఆమె థీసిస్ వివిధ రకాల వరి(ఒరైజాసటైవా)లో బాక్టీరియల్ లీఫ్ బ్లెట్(బీఎల్బీ) నిరోధకతకు సంబంధించిన జన్యువుల గుర్తింపుపై ఆధారపడింది. -
బ్రిటన్ ప్రధానమంత్రిగా కియర్ స్టార్మర్... పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘనవిజయం... రిషి సునాక్ రాజీనామా.. ఇంకా ఇతర అప్డేట్స్
-
యూకే ఎన్నికల్లో గెలిచిన కైర్ స్టార్మర్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు
బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించిన లేబర్‌పార్టీ అభ్యర్థి కైర్ స్టార్మర్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. రెండు దేశాల మధ్య సంబంధాల బలోపేతం కోసం యూకేతో కలిసి నడిచేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ఎక్స్ ఖతాలో ఒక పోస్ట్ పెట్టారు.‘యూకే సార్వత్రిక ఎన్నికలలో అపూర్వ విజయం సాధించిన కీర్ స్టార్మర్‌కు హృదయపూర్వక అభినందనలు. భారత్-యూకే మధ్య పరస్పర వృద్ధి, శ్రేయస్సును పెంపొందిస్తూ అన్ని రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మీ సానుకూల, నిర్మాణాత్మక సహకారం కోసం నేను ఎదురు చూస్తున్నాను.’ అని పేర్కొన్నారు.అదేవిధంగా ఎన్నికల్లో ఓటమి పాలైన కన్జర్వేటివ్ పార్టీ నేత, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు సైతం మోదీ తన సందేశాన్ని అదించారు. సునాక్ అద్బుతమైన నాయకత్వం, భారత్-యూకే సంబంధాలను బలోపేతం చేయడంలో ఆయన చేసిన కృషికి ప్రధాని ధన్యవాదాలు తెలిపారు.కాగా యూకే సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ భారీ విజయం సాధించింది. అత్యధికంగా 400కి పైగా స్థానాల్లో నెగ్గి చరిత్రాత్మక విజయం కైవసం చేసుకుంది. మరోవైపు.. దశాబ్దంన్నరపాటు అప్రతిహతంగా బ్రిటన్ను ఏలిన కన్జర్వేటివ్ పార్టీకి ఈ ఎన్నికల్లో భంగపాటు ఎదురైంది. రిషి సునాక్ సారధ్యంలో ఆ పార్టీ కేవలం 119 స్థానాల్లో నెగ్గి ఓటమి చవిచూసింది. Heartiest congratulations and best wishes to @Keir_Starmer on the remarkable victory in the UK general elections. I look forward to our positive and constructive collaboration to further strengthen the India-UK Comprehensive Strategic Partnership in all areas, fostering mutual…— Narendra Modi (@narendramodi) July 5, 2024 -
బ్రిటన్ కొత్త ప్రధానిగా కీర్ స్టార్మర్.. 50 ఏళ్లకు రాజకీయాల్లోకి ఎంట్రీ.. ఆసక్తికర నేపథ్యం
బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్ష లేబర్ పార్టీ చారిత్రాత్మక విజయం దిశగా సాగుతోంది. 650 సీట్లున్న పార్లమెంట్లో లేబర్ పార్టీ ఇప్పటివరకు 400 సీట్లకు పైగా గెల్చుకుంది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 326 సీట్లు వస్తే సరిపోతుంది. దీంతో లేబర్ పార్టీకి చెందిన నేత కీర్ స్టార్మర్ బ్రిటన్ తదుపరి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.కీర్ స్టార్మర్ మాజీ మానవ హక్కుల న్యాయవాది, పబ్లిక్ ప్రాసిక్యూటర్, మ్యూజీషియన్ కూడా. ఆయన వయసు ప్రస్తుతం 61 ఏళ్లు. గత 50 ఏళ్లలో ఈ వయసులో బ్రిటన్ ప్రధానమంత్రి అయిన వ్యక్తిగా స్టార్మర్ నిలిచారు. అంతేగాక పార్లమెంట్‌కు ఎన్నికైన తొమ్మిదేళ్లలోనే ప్రధానమంత్రి పదవి చేపడుతుండటం మరో విశేషం.సెప్టెంబరు 2, 1962న జన్మించిన కీర్.. రోడ్నీ స్టార్మర్, లండన్ శివార్లలో ఒక ఇరుకైన ఇంట్లో బాల్యాన్ని గడిపాడు. అతనికి ముగ్గురు తోబుట్టువులు. లీడ్స్, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయాలలో న్యాయ విద్యను అభ్యసించాడు. అనంతరం వామపక్ష కారణాలు, డిఫెండింగ్ ట్రేడ్ యూనియన్లు, మెక్‌డొనాల్డ్స్ వ్యతిరేక కార్యకర్తలు, విదేశాల్లోని ఖైదీల మరణ శిక్షలు వంటి వాటిపై దృష్టి సారించాడు. అనంతరం మానవ హక్కుల న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించాడుతొలుత 2003లో ఉత్తర ఐర్లాండ్‌లోని పోలీసులు మానవ హక్కుల చట్టంలో చిన్న ఉద్యోగంలో చేరాడు. అయిదేళ్ల తర్వాత లేబర్ పార్టీకి చెందిన గోర్డాన్ బ్రౌన్ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో ఇంగ్లాండ్ అండ్ వేల్స్‌కు పబ్లిక్ ప్రాసిక్యూషన్స్ డైరెక్టర్‌గా నియమితుడయ్యాడు.2008 నుంచి 2013 మధ్య వరకు ఎంపీలు తమ ఖర్చులను దుర్వినియోగం చేయడం, జర్నలిస్టుల ఫోన్ హ్యాకింగ్, గ్లండ్‌లో యువత అల్లర్ల వంటి విచారణలను ఆయన పర్యవేక్షించాడు. తన పనితనంతో క్వీన్ ఎలిజబెత్ 2 చేత నైట్ ర్యాంక్ బిరుదు పొందారు. 50 ఏళ్ల వయసులో కీర్ స్టామర్ రాజకీయాల్లోకి రావడం గమనార్హం. 2015 నార్త్ లండన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు.స్టార్మర్‌కు వివాహం కాగా భార్య పేరు విక్టోరియా. ఆమె నేషనల్ హెల్త్ సర్వీస్‌లో ఆక్యుపేషనల్ థెరపిస్ట్‌గా పనిచేస్తుంది. వీరికి ఇద్దరు పిల్లల ఉన్నారు. శుక్రవారం వరకు పనిలో నిమగ్నమయ్యే కీర్.. శని, ఆదివారాలు మాత్రం పూర్తిగా కుటుంబానికి కేటాయిస్తాడు.రాజకీయాల్లోకి రాకముందు న్యాయవాద వృత్తిలో సుధీర్ఘకాలం కొనసాగారు. ఆయన ఆధునిక రాజకీయ నాయకులకు భిన్నంగా ఉంటారనే పేరు ఉంది. ఈ ఎన్నికల్లో బ్రిటన్‌లో రాజకీయాలను తిరిగి సేవలోకి తీసుకురావాలి.. పార్టీ కంటే దేశం ముందు అనే ప్రధాన నినాదాలతో ప్రచారంలో ముందుకు సాగారు. గత 14 ఏళ్లలో కన్జర్వేటివ్ పార్టీ అయిదుగురు ప్రధానులను మార్చిన ఉద్దేశంలో ఆయన ఈ నినాదాలను నడిపించారు.ప్రజలు మార్పును కోరుకుంటే వారు లేబర్ పార్టీకి ఓటు వేయాలని ఎన్నికలకు ముందు స్పష్టంగా చెప్పారు. దేశాన్ని గడ్డు పరిస్థితుల నుంచి బయటకు తీసుకురావడానికి మా పార్టీ ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా దేశ ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టాలి.2019 తర్వాత లేబర్ పార్టీ ప్రధాన నాయకుడిగా అవతరించిన కీర్.. తమ ప్రభుత్వం మొత్తం దృష్టి దేశ ఆర్థిక వ్యవస్థ, జాతీయ ఆరోగ్య సేవపైనే ఉంటుందని చెప్పారు.కాగా యూకే పార్లమెంట్లో మొత్తం 650 సీట్లు ఉండగా 400కు పైగా మెజార్టీ స్థానాల్లో లేబర్ పార్టీ అభ్యర్ధులు ముందంజలో ఉన్నారు. ఆపార్టీ చీఫ్ కీర్ స్టార్మర్ తన నియోజకవర్గం లండన్‌లోని హోల్బోర్న్ అండ్ సెయింట్ పాన్‌క్రాస్‌లో 18,884 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తాను గెలిపించినందుకు నియోజకవర్గంలోని ప్రతి వ్యక్తికి సేవ చేస్తానంటూ ఈ సందర్భంగా స్టార్మర్ ప్రకటించారు.ఇక రిషి సునక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ కేవలం 112 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. దీంతో 14 ఏళ్లుగా అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీ ప్రభుత్వానికి ముగింపు పడబోతుంది. భారత్- బ్రిటన్ మధ్య సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి..లేబర్ పార్టీ అధినేత కీర్ స్టార్మర్ ప్రధానమంత్రి అయిన తర్వాత భారత్-యూకే సంబంధాలు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది. యూకే- భారత్ సంబంధాలను బలోపేత చేయడం తన విదేశాంగ విధానం ఎజెండాలో కీలక అంశమని గతంలో స్టార్మర్ పేర్కొన్నాడు. కశ్మీర్ వంటి సమస్యలపై లేబర్ పార్టీ వైఖరిని కూడా తెలియజేస్తూ.. భారత్‌తో కొత్త వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA), సాంకేతికత, భద్రత, విద్య, వాతావరణ మార్పులలో మెరుగైన ద్వైపాక్షిక సహకారానికి కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటైన భారత్‌తో సంబంధాలను పెంచుకోవాలనే ఆశయంతో ఉన్నట్లు నొక్కిచెప్పారు. ఇక భారత్‌తో కొత్త వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగించాలనే నిబద్ధతతో ఉన్నట్లు అతని మేనిఫెస్టోలో సైతం పొందుపరిచారు. కాగా గత రెండు ఏళ్లుగా ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై భారతదేశం, బ్రిటన్ మధ్య చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. -
ఘోర పరాజయంపై రిషి సునాక్ క్షమాపణలు
బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. గురువారం మొదలైన ఓట్ల లెక్కింపులో ప్రతిపక్ష లేబర్ పార్టీకే ప్రజలు పట్టం కట్టారు. దాదాపు 300కు పైగా స్థానాల్లో ముందంజలో కొనసాగుతూ అధికారం చేపట్టే దిశగా దూసుకుపోతుంది. భారత సంతతికి చెందిన ప్రధాని రిషి సునాక్ నాయకత్వంలోని కన్జర్వేటివ్ పార్టీకన్జర్వేటివ్ పార్టీ కేవలం 63 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. దీంతో బ్రిటన్ను 14 ఏళ్ల పాటు అప్రతిహతంగా ఏలిన కన్జర్వేటివ్ పార్టీకి భంగపాటు ఖాయంగా మారింది. ఇక బ్రిటన్ ఎన్నికల్లో కన్వర్జేటివ్ పార్టీ ఓటమిని ప్రధాని రిషి సునాక్ అంగీకరించారు. రిచ్మండ్ అండ్ నార్తర్న్ అలెర్టన్లో తన మద్దతుదారులను ఉద్దేశించి రిషి సునాక్ మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికల్లో కన్వర్జేటివ్ పార్టీ ఓటమికి తాను బాధ్యత వహిస్తున్నట్లు చెప్పారు. ఇందుకు ఆయన దేశ ప్రజలను క్షమాపణలు కోరారు.‘ఈ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయాన్ని సొంతం చేసుకుంది.. ఈ సందర్భంగా ఆ పార్టీ నేత కీర్ స్టామర్కు అభినందనలు తెలియజేస్తున్నాను. అధికారం శాంతియుతంగా, సరైన పద్దతిలో చేతులు మారుతుంది. ఇది మన దేశ భవిష్యత్తు, స్థిరత్వంపై అందరికీ విశ్వాసం కలిగిస్తుంది’ అని సునాక్ అన్నారు.ఈ క్రమంలో లేబర్ పార్టీకి చెందిన కీర్ స్టార్మర్ (61) బ్రిటన్ తదుపరి ప్రధాన మంత్రి అవనున్నారు. ఫలితాలు తమకు అనుకూలంగా ఉన్నాయనే సంకేతాలు వెలువడటంతో ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ‘మార్పు చెందిన లేబర్ పార్టీపై నమ్మకం ఉంచిన కార్యకర్తలు, ఓటర్లకు ధన్యవాదాలు’ అని రాసుకొచ్చారు. -
బ్రిటన్‌లో నేడే పార్లమెంట్ ఎన్నికలు... 650 స్థానాలకు జరుగనున్న పోలింగ్.. బరిలో 107 మంది బ్రిటిష్ ఇండియన్లు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
UK general election 2024: స్టార్మర్... సరికొత్త ఆశాకిరణం
కెయిర్ రాడ్నీ స్టార్మర్. ఈ 61 ఏళ్ల లేబర్ పార్టీ నాయకుని పేరు ఇప్పుడు బ్రిటన్‌లో మార్మోగుతోంది. ఆర్థిక ఇక్కట్లు మొదలుకుని నానా రకాల సమస్యలతో సతమతమవుతున్న ప్రజలు ఆయనలో తమ నూతన నాయకున్ని చూసుకుంటున్నారని సర్వేలన్నీ చెబుతున్నాయి. జూలై 4న జరగనున్న ఎన్నికల్లో లేబర్ పార్టీని ఆయన ఘనవిజయం దిశగా నడిపించడం, ప్రధాని పీఠమెక్కడం ఖాయమని ఘోషిస్తున్నాయి. అదే జరిగితే 14 ఏళ్ల అనంతరం లేబర్ పార్టీని గెలుపు బాట పట్టించిన నేతగా స్టార్మర్ నిలవనున్నారు. సాక్షి, నేషనల్ డెస్క్నిరుపేద నేపథ్యం..దేశంలోనే పేరుమోసిన లాయర్. ఐదేళ్ల పాటు బ్రిటన్ చీఫ్ ప్రాసిక్యూటర్. ఆ హోదాలో రాజవంశానికి చేసిన సేవలకు గుర్తింపుగా లభించిన అత్యున్నత పౌర పురస్కారమైన సర్. ఇదంతా 61 ఏళ్ల స్టార్మర్ నేపథ్యం. దాంతో ఆయన సంపన్నుల ప్రతినిధి అంటూ కన్జర్వేటివ్ పార్టీ ప్రత్యర్థులు తరచూ విమర్శిస్తుంటారు. వీటన్నింటికీ తన నేపథ్యమే సమాధానమని సింపుల్‌గా బదులిస్తారు స్టార్మర్. కలవారి కుటుంబంలో పుట్టి, మల్టీ బిలియనీర్ కూతురిని పెళ్లాడిన తన ప్రత్యరి్థ, ప్రధాని రిషి సునాక్‌దే సిసలైన సంపన్న నేపథ్యమంటూ చురకలు వేస్తుంటారు. స్టార్మర్ 1963లో లండన్ శివార్లలో ఓ నిరుపేద కుటుంబంలో పుట్టారు. తండ్రి పనిముట్లు తయారు చేసే కారి్మకుడు. తల్లి నర్సు. నలుగురు సంతానం కావడంతో నిత్యం డబ్బు కటకట మధ్యే పెరిగారాయన. తన నిరుపేద నేపథ్యాన్ని ఎన్నికల ప్రచారంలో స్టార్మర్ పదేపదే ప్రస్తావిస్తున్నారు. ‘‘ద్రవ్యోల్బణమంటే ఏమిటో, కుటుంబాలను అది ఎంతగా కుంగదీస్తుందో నాకు చిన్నప్పుడే అనుభవం. ధరల పెరుగుదల ఎంత దుర్భరమో కన్జర్వేటివ్ పార్టీ నేతలందరి కంటే నాకంటే ఎక్కువగా తెలుసు. పోస్ట్‌మ్యాన్ వస్తున్నాడంటే చాలు, ఏ బిల్లు తెచి్చస్తాడో, అది కట్టడానికి ఎన్ని ఇబ్బందులు పడాలో అని ఇంటిల్లిపాదీ బెదిరిపోయేవాళ్లం. ఫోన్ బిల్లు కట్టలేక నెలల తరబడి దాన్ని వాడకుండా పక్కన పెట్టిన సందర్భాలెన్నో’’ అంటూ చేస్తున్న ఆయన ప్రసంగాలకు విశేష స్పందన వస్తోంది. తన కుటుంబంలో కాలేజీ చదువు చదివిన తొలి వ్యక్తి స్టార్మరే కావడం విశేషం. లీడ్స్ వర్సిటీ, ఆక్స్‌ఫర్డ్‌లో లా చేశారు. పేదరికమే తనలో కసి నింపి చదువుల్లో టాపర్‌గా నిలిచేందుకు సాయపడిందంటారు. 50 ఏళ్ల తర్వాత రాజకీయ అరంగేట్రం 50 ఏళ్లు దాటాక స్టార్మర్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2015లో పార్లమెంటుకు ఎన్నికయ్యారు. రెండు వరుస ఎన్నికల్లో పార్టీని గెలిపించడంలో జెరెమీ కోర్బిన్ విఫలం కావడంతో 2020లో లేబర్ పార్టీ పగ్గాలతో పాటు విపక్ష నేత బాధ్యతలు కూడా చేపట్టారు. వస్తూనే పారీ్టలో అంతర్గతంగా ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. బాధ్యతాయుతంగా, మేనేజర్ తరహాలో, కాస్త డల్‌గా కనిపించే వ్యవహార శైలి స్టార్మర్ సొంతం. ఆర్థిక సమస్యల సుడిగుండంలో చిక్కి సతమతమవుతున్న బ్రిటన్‌కు ఇప్పుడు కావాల్సిన సరిగ్గా అలాంటి నాయకుడేనన్నది పరిశీలకుల అభిప్రాయం. చరిష్మా ఉన్న నేత కంటే నమ్మకం కలిగించగల నాయకుడినే బ్రిటన్వాసులు కోరుకుంటున్నారని చెబుతున్నారు. అందుకు తగ్గట్టే నాలుగేళ్లుగా విపక్ష నేతగా తన పనితీరుతోనూ, కీలక విధానాంశాలపై స్పష్టమైన అభిప్రాయాలతోనూ ప్రజలను స్టార్మర్ బాగా ఆకట్టుకుంటూ వస్తున్నారు. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, హౌజింగ్ సంక్షోభం వంటి పెను సమస్యల పరిష్కారంలో భారత మూలాలున్న తొలి ప్రధాని రిషి సునాక్ విఫలమయ్యారన్న అభిప్రాయం దేశమంతటా బాగా విని్పస్తోంది. ఈ నేపథ్యంలో 14 ఏళ్ల కన్జర్వేటివ్ పార్టీ పాలనకు తెర పడటం ఖాయమన్న విశ్లేషణలే విని్పస్తున్నాయి. అందుకే కొద్ది రోజులుగా వెలువడుతున్న ఎన్నికల సర్వేలన్నీ లేబర్ పార్టీ ఘనవిజయం ఖాయమని చెబుతున్నాయి. విజయమే లక్ష్యంగా... కన్జర్వేటివ్ పార్టీ పాలనపై దేశమంతటా నెలకొన్న తీవ్ర వ్యతిరేకతను స్టార్మర్ ముందుగానే పసిగట్టారు. అందుకే ఘనవిజయమే లక్ష్యంగా కొద్ది నెలలుగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. బ్రెగ్జిట్ తప్పుడు నిర్ణయమంటూనే తాను అధికారంలోకి వస్తే దాన్ని సమీక్షించబోనని చెబుతున్నారు. ఇది ఆయన సిద్ధాంతరాహిత్యానికి నిదర్శనమన్న కన్జర్వేటివ్ నేతల విమర్శలను తేలిగ్గా తోసిపుచ్చుతున్నారు. తాను కేవలం మెజారిటీ ప్రజల ఆకాంక్షలను అంగీకరిస్తున్నానంటూ దీటుగా బదులిస్తున్నారు. ‘‘నేను కారి్మక కుటుంబం నుంచి వచ్చాను. జీవితమంతా పోరాడుతూనే వస్తున్నా. ఇప్పుడు దేశ ప్రజల స్థితిగతులను మెరుగు పరిచి వారికి బంగారు భవిష్యత్తు అందించేందుకు మరింతగా పోరాడతా’’ అంటూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ‘పార్టీ కంటే దేశమే ముందు’ నినాదంతో దూసుకుపోతున్న స్టార్మర్లో బ్రిటన్ ప్రజలు ఇప్పటికే తమ ప్రధానిని చూసుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులంతా ముక్త కంఠంతో చెబుతున్నారు. 18 ఏళ్ల కన్జర్వేటివ్ పాలనకు 1997లో తెర దించిన టోనీ బ్లెయిర్ ఫీటును ఈసారి ఆయన పునరావృతం చేస్తారన్న భావన అంతటా వ్యక్తమవుతోంది.కొసమెరుపు లేబర్ పార్టీ తొలి నాయకుడు కెయిర్ హార్డీ మీద అభిమానంతో స్టార్మర్‌కు తల్లిదండ్రులు ఆయన పేరే పెట్టుకున్నారు. ఇప్పుడదే లేబర్ పారీ్టకి ఆయన నాయకునిగా ఎదగడం విశేషం!ప్రస్తుత బలాబలాలుబ్రిటన్ పార్లమెంట్ లో దిగువ సభ అయిన హౌస్ ఆఫ్ కామన్స్‌లోని 650 స్థానాలకు జూలై 4న ఎన్నికలు జరగనున్నాయి. మెజారిటీ మార్కు 326.పార్టీ స్థానాలుకన్జర్వేటివ్ 344లేబర్ 205ఎస్ ఎన్ పీ 43లిబరల్ డెమొక్రాట్స్ 15ఇతరులు 43 -
బ్రిటన్ నుంచి భారత్ కు భారీగా బంగారం నిల్వలు తరలింపు
-
జట్టుకు ఎంపిక చేయమన్న రిషి సునాక్: ఇప్పుడే కుదరదన్న ఈసీబీ!
యూకే ప్రధాన మంత్రి రిషి సునాక్ మరోసారి ఇంగ్లండ్ క్రికెటర్లతో మమేకమయ్యారు. ఆట పట్ల మరోసారి తన అభిరుచిని చాటుకున్నారు. దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్‌లో తన బ్యాటింగ్ నైపుణ్యాలు ప్రదర్శించారు. కాగా క్రికెట్‌ను మరింతగా అభివృద్ధి చేసే క్రమంలో ప్రధాని రిషి సునాక్ 35 మిలియన్ బ్రిటిష్ పౌండ్ల(GBP- British pound sterling ) ప్యాకేజీని ప్రకటించారు. పాఠశాల స్థాయి నుంచే క్రికెట్ పట్ల ఆసక్తి కనబరిచే వారికి ప్రోత్సాహం అందించేందుకు ఈ భారీ మొత్తం ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. దాదాపు తొమ్మిది లక్షల మందికి ప్రయోజనం చేకూర్చేవిధంగా ప్రణాళికలు రచించినట్లు రిషి సునాక్ వెల్లడించారు. ఇక ఈ విషయాన్ని ప్రకటించే క్రమంలో లండన్‌లో ఆయన.. ఇంగ్లండ్ క్రికెటర్లతో పాటు వర్ధమాన ఆటగాళ్లను కలిశారు. ఈ సందర్భంగా.. ఆండర్సన్‌తో ఫ్యాన్ బాయ్ మూమెంట్‌ను సునాక్ షేర్ చేసుకోవడం ఆయన హుందాతనానికి నిదర్శనంగా నిలిచింది. అదే విధంగా.. యువ క్రికెటర్లను సైతం ఉత్సాహరుస్తూ వారికి ఆటోగ్రాఫ్‌లు ఇచ్చారు సునాక్. కాగా ఆండర్సన్‌ను ఎదుర్కొనేందుకు తాను ముందుగానే నెట్ సెషన్లో పాల్గొన్నానంటూ రిషి సునాక్ వెల్లడించడం విశేషం. ఇందుకు బదులిచ్చిన ఆండర్సన్ ఆయన అభిమానానికి ఫిదా అయ్యాడు. ఇక ఈ విశేషాలకు సంబంధించిన వీడియో షేర్ చేసిన రిషి సునాక్.. ‘‘ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు పిలుపునకు సిద్ధంగా ఉన్నా’’ అని తన సెలక్షన్ గురించి ఈసీబీకి సరదాగా రిక్వెస్ట్ పెట్టారు. ఇందుకు బదులిచ్చిన ఈసీబీ.. ‘‘బాగానే ఆడారు. కాకపోతే మీరు ఇంకొన్ని నెట్ సెషన్లు పూర్తి చేయాల్సి ఉంటుంది’’ అని అంతే సరదాగా స్పందించింది. కాగా 2026లో మహిళా టీ20 ప్రపంచకప్, 2030లో పురుషుల టీ20 వరల్డ్‌కప్‌నకు ఇంగ్లండ్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ క్రమంలో ఈసీబీకి మరింత బూస్ట్ ఇచ్చేలా ప్రధాని రిషి సునాక్ ఈమేరకు ప్యాకేజీ ప్రకటించడం విశేషం. ఈ నేపథ్యంలో ఆండర్సన్ సహా పలువురు క్రికెటర్లు హర్షం వ్యక్తం చేశారు. Not bad, perhaps a few more net sessions first 😉 https://t.co/u7AHCOMO08 — England Cricket (@englandcricket) April 5, 2024 -
లండన్‌లో భారత విద్యార్థి మృతి..
నవంబర్ నెలలో బ్రిటన్‌లో అదృశ్యమైన భారతీయ విద్యార్థి కథ విషాదాంతమైంది. లండన్‌లోని థేమ్స్ నదిలో 23 ఏళ్ల మిత్ కుమార్ పటేల్ మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. కాగా ఉన్నత చదువుల కోసం మిత్‌కుమార్ రెండు నెలల క్రితం (సెప్టెంబరు) యూకే వెళ్లాడు. నవంబర్ 17 నుంచి అతడు కనిపించకుండా పోయాడు. అదృశ్యమయ్యాడు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదయ్యింది. ఈ క్రమంలో నవంబర్ 21న తూర్పు లండన్‌లోని కానరీ వార్ఫ్ ప్రాంతం సమీపంలోని థేమ్స్ నదిలో అతని మృతదేహాన్ని మెట్రోపాలిటన్ పోలీసులు కనుగొన్నారు. అతను ఎలా ప్రాణాలు కోల్పోయాడు? అన్న విషయంపై స్పష్టత లేదు. కానీ అతను హత్యకు గురవ్వలేదని, అనుమానాస్పద మృతి కాదని పోలీసులు చెబుతున్నారు. మిత్‌కుమార్ పటేల్ వ్యవసాయ కుటుంబానికి చెందిన యువకుడు కావడంతో అతడి తల్లిదండ్రులకు ఆర్థిక సాయం చేసేందుకు నిధులు సమీకరిస్తున్నట్టు అతడి బంధువు పార్త్ పటేల్ అనే వ్యక్తి వెల్లడించాడు. ‘గో ఫండ్ మీ’ ఆన్లైన్ ఫండ్ రైజర్ ద్వారా నిధుల సేకరణ ప్రారంభించామని తెలిపాడు. వారం వ్యవధిలో జీబీపీ(గ్రేట్ బ్రిటన్ పౌండ్స్) 4,500కి(4 లక్షల 76 వేలు) పైగా వచ్చాయని తెలిపాడు. మిత్‌కుమార్ వయసు 23 సంవత్సరాలని, 19 సెప్టెంబర్ 2023న యూకే వచ్చాడని చెప్పాడు. నవంబర్ 20న షెఫీల్డ్ హాలమ్ వర్సిటీలో డిగ్రీ కోర్సు ప్రారంభించాల్సి ఉందని, అమెజాన్‌లో పార్ట్‌టైమ్ జాబ్ కూడా లభించిందని తెలిపాడు. ఇంతలోనే నవంబర్ 17న డైలీ వాక్కు వెళ్లిన పటేల్.. తిరిగి ఇంటికి వెళ్లలేదని చెప్పాడు. నవంబర్ 21న పోలీసులు మృతదేహాన్ని గుర్తించారని.. ఉన్నత చదువుల కోసం వచ్చిన వ్యక్తి ఈ విధంగా చనిపోవడం బాధ కలిగిస్తోందని, అతడి కుటుంబానికి సహాయం చేయాలని భావించామని చెప్పాడు. మిత్‌కుమార్ మృతదేహాన్ని భారత్‌కు పంపిస్తామని అన్నాడు. సేకరించిన నిధులను ఇండియాలోని మిత్‌కుమార్ కుటుంబానికి అందిస్తామని చెప్పాడు. -
Bhavana Reddy: ఓ విశ్వవ్యాప్త భావన
‘మెరుపు మెరిసినట్లు ఉంటుందామె నాట్యం. నాట్యానికి ఆమె చేసే న్యాయం అద్భుతంగా ఉంటుంది. భారతీయ శాస్త్రీయ నాట్యానికి ఆమె ప్రత్యేకమైన ఆకర్షణ’. ...ఇవన్నీ భావనారెడ్డి నాట్య ప్రతిభకు అందిన ప్రశంసలు. జాతీయ, అంతర్జాతీయ పత్రికల అక్షర పురస్కారాలు. ఇప్పుడామె కొత్త నాట్యతరంగాలను సృష్టించే పనిలో ఉన్నారు. కూచిపూడి కళాకారిణి భావనారెడ్డి నాట్యాన్ని అధ్యయనం చేశారు, నాట్యంలో పరిశోధన చేశారు. నాట్యాన్ని ప్రదర్శిస్తున్నారు. నాట్యాన్ని భావితరాలకు అందించడానికి శిక్షణనిస్తున్నారు. అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా, సింగపూర్, యూరప్‌దేశాలలో మన కూచిపూడి అడుగులు వేయిస్తున్నారు. చిన్నారులకు కూచిపూడి అభినయ ముద్రలు నేర్పిస్తున్నారు. నాట్యకళాకారిణి నుంచి నాట్యగురువుగా మారి గురుశిష్యపరంపరకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 26వ తేదీన(ఆదివారం) ఆమెరికా, కాలిఫోర్నియాలో ఆమె శిష్యబృందం ప్రదర్శన ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె సాక్షితో తన అభిప్రాయాలను పంచుకున్నారు. కళామతల్లి దక్షిణ ‘‘నాట్యం ఎంతగా సాధన చేసినప్పటికీ ‘ఇకచాలు’ అనే ఆలోచన ఎప్పటికీ రాదు. ఇంకా ఏదో చేయాలనే తపన నేర్చుకున్న అడుగులకు కొత్తదనం అద్దమని పోరుతూనే ఉంటుంది. పౌరాణిక, ఆధ్యాత్మిక, సామాజిక అంశాలను నాట్యం ద్వారా అత్యంత లలితంగా వ్యక్తం చేయగలుగుతాం. అందుకే మన శాస్త్రీయ నాట్యప్రక్రియలు నిత్యనూతనం. తరతరాలుగా కొనసాగుతున్న ఈ కళారూపాన్ని నేను మా తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నాను. దేశవిదేశాల్లో ప్రదర్శనలిచ్చాను. నా వంతు బాధ్యతగా కొత్త తరాలకు శిక్షణనిస్తున్నాను. ఇది నేను నాట్యానికి తిరిగి ఇస్తున్న కళాదక్షిణ. నాట్యానికి డిజిటల్ వేదిక కూచిపూడిని విశ్వవ్యాప్తం చేయడానికి లెక్కలేనన్ని ప్రదర్శనలిచ్చాను. కళాభిమానుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాను. కోవిడ్ కారణంగా ప్రపంచం స్తంభించి పోయింది. దాంతో నాట్య ప్రదర్శనలు ప్రశ్నార్థక మయ్యాయి. అప్పటికే నిర్ణయమైన కార్యక్రమాలు రద్దయ్యాయి కూడా. కరోనా వైరస్ ప్రదర్శననైతే నిలువరించగలిగింది కానీ నాట్యసాధనను కాదు. నా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలను చూసి చాలా మంది నాట్యం నేర్పించమని అడిగారు. మన సంప్రదాయాన్ని గతం నుంచి భవిష్యత్తుకు చేర్చే మాధ్యమాలుగా మా కళాకారుల మీద ఎంతో బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతను నిర్వర్తించడానికి మంచి సమయం అనిపించింది. అలా మూడేళ్ల కిందట అమెరికాలో ‘ద ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ కూచిపూడి డాన్స్’ సంస్థను స్థాపించాను. దాదాపు యాభై మందికి కూచిపూడి నాట్యంలో శిక్షణనిచ్చాను. ఈ ప్రదర్శనలో గణనాట్య, పుష్పాంజలి, జతికట్టు, మండూక శబ్దం, దశావతారాల ప్రదర్శనలో మొత్తం 15 మంది చిన్నారులు పాల్గొన్నారు. అమ్మ దిద్దిన వ్యక్తిత్వం నాట్య ప్రక్రియల్లో కాలానుగుణంగా కొద్దిపాటి మార్పులు తోడవుతుంటాయి. కానీ శిక్షణనిచ్చే విధానంలో సంప్రదాయం కొనసాగుతుంది. డాన్స్ క్లాస్‌ను నాట్యమందిరంగా గౌరవించడంలో ఎటువంటి మార్పూ ఉండదు. రాజారెడ్డి, రాధారెడ్డి, కౌసల్యారెడ్డి... ఈ ముగ్గురూ కూచిపూడికి ప్రతీకలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. వారి బిడ్డలుగా అక్క యామిని, నేను ఆ పరంపరను కొనసాగిస్తున్నాం. నన్ను శిల్పంలా చెక్కడంలో, విలువలతో కూడిన వ్యక్తిగా తీర్చిదిద్దడంలో అమ్మ కౌసల్య కృషిని మాటల్లో వర్ణించలేం. నా భర్త డెనిస్ నిల్సన్ది స్వీడన్. ఆయన సంగీతకారుడు. ఇద్దరమూ కళాకారులమే కావడం నా కళాసేవకు మరింతగా దోహదం చేస్తోంది. వారి సొంతదేశం స్వీడన్. మేము అమెరికాలో నివసిస్తున్నాం. మా అబ్బాయికి ఐదు నెలలు. నడకతోపాటు నాట్యం నేర్చుకుంటాడో, మాటలతోపాటు పాటలు నేర్చుకుంటాడో చూడాలి’’ అని నవ్విందామె. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ∙ -
రిషి సునాక్ పాపులారిటీ రేటింగ్ 25%
లండన్: యునైటెడ్ కింగ్డమ్(యూకే) ప్రధానమంత్రి రిషి సునాక్‌కు, అధికార కన్జర్వేటివ్ పార్టీకి ఇదొక పెద్ద ఊరట. ఇటీవల మంత్రివర్గంలో మార్పుల తర్వాత సునాక్ ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. పార్టీలో అసమ్మతి మొదలైంది. అయితే, శీతాకాల బడ్జెట్లో కొన్నిరకాల పన్నులను తగ్గించనున్నట్లు ప్రకటించారు. దీంతో రిషి సునాక్‌తోపాటు ప్రభుత్వానికి ప్రజాదరణ స్వల్పంగా పెరిగినట్లు తాజాగా ‘ద టైమ్స్’ పత్రిక నిర్వహించిన ఓపీనియన్ పోల్స్‌లో వెల్లడయ్యింది. బడ్జెట్‌ను బుధవారం పార్లమెంట్లో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పన్ను మినహాయింపుల పట్ల ప్రజలు సానుకూలంగా స్పందించారు. సర్వేలో సునాక్ ప్రభుత్వ పాపులారిటీ రేటింగ్ 25 శాతానికి చేరినట్లు తేలింది. గత వారంతో పోలిస్తే ఇది 4 పాయింట్లు అధికం కావడం విశేషం. ఇటీవలి కాలంతో కన్జర్వేటివ్ పారీ్టకి దక్కిన అత్యధిక రేటింగ్ ఇదే. ఇదిలా ఉండగా, ప్రతిపక్ష లేబర్ పార్టీ రేటింగ్‌లో ఎలాంటి మార్పు జరగలేదు. ప్రజాదరణ 44 శాతంగానే ఉన్నట్లు సర్వే వెల్లడించింది. -
ఖలిస్తానీల ఆగడాలను అడ్డుకోండి
లండన్: దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ దుర్వినియోగం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని యునైటెడ్ కింగ్డమ్(యూకే) హోం శాఖ మంత్రి జేమ్స్ క్లెవర్లీ, జాతీయ భద్రతా సలహాదారు టిమ్ బారోకు భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ విజ్ఞప్తి చేశారు. యూకేలో ఖలిస్తాన్ తీవ్రవాదం నానాటికీ పెరిగిపోతుండడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఖలిస్తాన్ సభ్యుల ఆగడాలు, భారత్‌కు వ్యతిరేకంగా వారు సాగిస్తున్న కార్యకలాపాలను జేమ్స్ క్లెవర్లీ, టిమ్ బారో దృష్టికి తీసుకెళ్లారు. జైశంకర్ బుధవారం లండన్‌లో వారిద్దరితో సమావేశమయ్యారు. ఖలిస్తాన్ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని కోరారు. అనంతరం యూకే ప్రధానమంత్రి రిషి సునాక్‌తో భేటీ అయ్యారు. ఇండియా–యూకే సంబంధాల్లో పురోగతిపై చర్చించారు. ఇండియా–యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ప్రస్తుతం జరుగుతున్న సంప్రదింపులతోపాటు రోడ్‌మ్యాప్–2030 అమలు తీరును ఇరువురు నేతలు సమీక్షించారు. ఇరు దేశాల మధ్య సంబంధాల్లో సానుకూల పురోగతి కనిపిస్తోందని వారు హర్షం వ్యక్తం చేశారు. యూకేలో జైశంకర్ ఐదు రోజుల పర్యటన బుధవారం ముగిసింది. -
కంపెనీ సీఈవోకు గుండెపోటు.. ప్రాణాలు కాపాడిన స్మార్ట్ వాచ్
ఓ స్మార్ట్ వాచ్ 42 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కాపాడింది. మార్నింగ్ జాగింగ్‌కు వెళ్లిన కంపెనీ సీఈవోకు ఉన్నట్టుండి ఛాతిలోనొప్పి రావడంతో.. స్మార్ట్‌వాచ్ అతన్ని రక్షించింది. స్మార్ట్‌ఫోన్ సాయంతో భార్యకు సమాచారం ఇవ్వగా.. నిమిషాల్లో ఆసుపత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. గుండెపోటు నుంచి బయటపడటానికి స్మార్ట్ వాచ్ ఎలా సాయపడిందనే విషయాన్ని ఆయనే స్వయంగా వివరించారు. ఈఘటన బ్రిటన్‌లో జరిగింది. హాకీ వేల్స్ కంపెనీ సీఈవో పాల్ వాపమ్ స్వాన్సీలోని మోరిస్టన్ ప్రాంతంలో నివిసిస్తుంటారు. ఆయనకు రోజూ జాగింగ్‌కు వెళ్లడం అలవాటు. ఓ రోజు ఉదయం 7 గంటలకు ఇంటి సమీపంలోనే జాగింగ్‌కు వెళ్లారు. పరుగెత్తుతుండగా అయిదు నిమిషాలకు అకస్మాత్తుగా అతనికి ఛాతీలో తీవ్రమైన నొప్పి వచ్చింది. గుండె బిగుతుగా అనిపించడంతో ఒక్కసారిగా రోడ్డుమీద కుప్పకూలిపోయారు. వెంటనే తన చేతికున్న స్మార్ట్ వాచ్ ద్వారా భార్య లారాకు ఫోన్ చేశాడు. ఆమె అక్కడికి చేరుకొని తన కారులో అతన్ని నిమిషాల వ్యవధిలో ఆసుపత్రికి తీసుకెళ్లింది. చదవండి: బ్రిటన్ ప్రధాని ఇంట.. దీపావళి సంబరాలు డాక్టర్లు సైతం సరైన సమయంలో వైద్యం అదించడంతో సీఈవో ప్రాణాలు నిలిచాయి. అయితే గుండె ధమనుల్లో ఒకటి పూర్తిగా బ్లాక్ అవ్వడం కారణంగా గుండెపోటు వచ్చినట్లు వైద్యులు తెలిపారు. అదే ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేసుకొని ఆరు రోజులు తరువాత ఇంటికి చేరుకున్నారు. కాగా ఈ ఘటన తనతోపాటు తన కుటుంబాన్ని షాక్‌కు గురి చేసిందని చెప్పారు. అంతేగాక తనకు ఉబకాయ సమస్యలు ఏం లేవని రోజు ధృడంగా ఉండటానికి ప్రయత్నిస్తానని తెలిపారు. సరైన సమయంలో సాయం చేసిన స్మార్ట్ వాచ్, భార్య, ఆసుపత్రి సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల కాలంలో ఆపిల్ వాచ్ సిరీస్ 8 వంటి ఎల్టీఈ కనెక్టివిటీ, ఈ-సిమ్‌తో కూడిన స్మార్ట్‌వాచ్‌లలో ఫోన్లు దగ్గరలో లేకునప్పటికీ కాల్ చేసే సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. దీనివల్ల గతంలో గుండెపోటు లక్షణాలను స్మార్ట్‌వాచ్‌లు ముందుగానే గుర్తించి అప్రమత్తం చేయడంతో పలువురి ప్రాణాలు దక్కిన విషయం తెలిసిందే. స్మార్ట్‌వాచ్‌ల్లో ఉండే హార్ట్‌రేట్, ఈసీజీ వంటి సెన్సర్లు గుండెపోటు ప్రమాదాన్ని ముందుగానే గుర్తించడంలో సాయపడుతున్నాయి. -
భారత్‌లో దౌత్యవేత్తల తొలగింపు.. కెనడాకు మద్దతుగా అమెరికా, బ్రిటన్
ఖలిస్తానీ సానుభూతిపరుడు హర్‌ప్రీత్‌సింగ్ నిజ్జర్ హత్య విషయంలో భారత్, కెనడా మధ్య నెలకొన్న విభేదాలు రోజురోజుకీ మరింత ముదురుతున్నాయి. భారత్, కెనడా దౌత్యపరమైన వివాదంలో ఇతర దేశాల ప్రమేయం పెరగడంతో కొత్త మలుపులు చోటుచేసుకుంటున్నాయి. భారత్‌లోని 41 మంది దౌత్యవేత్తలను కెనడా వెనక్కి రప్పించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో అమెరికా, బ్రిటన్ కల్పించుకొని కెనడాకు మద్దతుగా నిలిచాయి. కెనడా దౌత్యపరమైన ఉనికిని తగ్గించాలని భారత ప్రభుత్వం పట్టుబట్టవద్దని కోరాయి. ‘భారత్‌లో కెనడా తమ దౌత్యవేత్తలను తగ్గించాలని ఢిల్లీ ఆదేశించడం, ఈ మేరకు కెనడా తమ దౌత్య సిబ్బందిని వెనక్కి రప్పించడం ఆందోళన కలిగిస్తోంది.’ అని యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తెలిపారు. చదవండి: భారత్ చర్యతో లక్షల మంది జీవితాలు దుర్భరం: ట్రూడో ‘క్షేత్రస్థాయిలో విభేదాలను పరిష్కరించడానికి దౌత్యవేత్తలు అవసరం. దౌత్య సిబ్బందిని తగ్గించాలని పట్టుబడ్డవద్దని మేము భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే నిజ్జర్ హత్య విషయంలో కెనడా దర్యాప్తుకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దౌత్య సంబంధాలపై 1961 వియన్నా ఒప్పందం ప్రకారం భారత్ తన బాధ్యతలను నిలబెట్టుకుంటుందని ఆశిస్తున్నాం’ అని ఆయన పేర్కొన్నారు. కెనడా ఆరోపణలో తీవ్రంగా పరిగణిస్తున్నట్లు అమెరికా పేర్కొంది. తామకు భారత్‌తో సంబంధాలు అత్యంత కీలమని చెబుతూ.. ఖలీస్తానీ ఉగ్రవాది హత్య విచారణలో కెనడాకు సహకరించాలని న్యూఢిల్లీపై ఒత్తిడి తెస్తున్నాయి. యూఎస్ బాటలోనే బ్రిటన్ నడుస్తోంది. కెనడా విషయంలో భారత్ వైఖరిని తప్పుబడుతూ శుక్రవారం బ్రిటన్ విదేశాంగ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. పదుల సంఖ్యలో కెనడా దౌత్యవేత్తలు దేశాన్ని విడిచిపెట్టి వెళ్లాలంటూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో మేము ఏకీభవించడం లేదని బ్రిటన్ విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు. కెనడా దౌత్య వేత్తల ఏకపక్ష తొలగింపు, వియన్నా ఒప్పంద సూత్రాలకు అనుగుణం కాదని అభిప్రాయపడింది సిక్కు వేర్పాటువాది, కెనడా పౌరుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనక భారత సీక్రెట్ ఏజెంట్ల హస్తం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడంతో ఇరు దేశాల మధ్య దౌత్య వివాదం మొదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కెనడాలోని మన దౌత్యవేత్తలను ఆ దేశం బహిష్కరించడం, బదులుగా దౌత్యపరమైన సంఖ్యను తగ్గించుకోవాలని భారత్ గత నెలలో కోరింది. భారత్ విధించిన డెడ్‌లైన్ ముగియడంతో కెనడా 41 మంది దౌత్యవేత్తలను ఉపసంహరించుకుంది. అంతేగాక చండీగఢ్, ముంబై, బెంగళూరు నగరాల్లోని కాన్సులేట్లలో వ్యక్తిగత కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కెనడా శుక్రవారం తెలిపింది. -
ఇజ్రాయెల్‌కు పూర్తి మద్ధతు: రిషి సునాక్
టెల్ అవివ్: బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ గురువారం యుద్ధ ప్రభావిత ప్రాంతం ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్నారు. హమాస్‌తో పోరాడుతున్న ఇజ్రాయెల్‌కు తాము పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పుడూ, ఎప్పుడూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఈ దేశం పక్షాన నిలబడతామని పేర్కొన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇజ్రాయెల్‌లో అడుగుపెట్టిన రిషి సునాక్‌కు.. ఆ దేశ అధ్యక్షుడు బెంజమిన్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇరు దేశాల అగ్రనేతలు ఉమ్మడి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రిషి సునాక్ మీడియాతో మాట్లాడారు. హమాస్లా కాకుండా తమ పౌరులకు ఏ హానీ జరగకుండా ఇజ్రాయెల్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న విషయం తమకు తెలుసన్నారు. యుద్ధ ప్రాంతం నుంచి బ్రిటిష్ పౌరులను తరలించినందుకు నెతన్యాహుకి ధన్యవాదాలు తెలిపారు. ఇజ్రాయెల్ పౌరులే కాక పాలస్తీనియన్లు కూడా హమాస్ బాధితులని తాము గుర్తించినట్లు పేర్కొన్నారు. To have a child taken from you is a parent’s worst nightmare. This morning I heard from families going through this unbearable agony. Working with our partners, we’re determined to secure the release of the hostages taken by Hamas terrorists. pic.twitter.com/F7AV021o9x— Rishi Sunak (@RishiSunak) October 19, 2023 మానవతా సహాయం కోసం సరిహద్దులను తెరిచినందుకు సంతోషంగా ఉందన్నారు. అన్నింటికంటే మించి ఇజ్రాయెల్ ప్రజలకు సంఘీభావాన్ని తెలియజేయడానికి ఇక్కడకు వచ్చినట్లు చెప్పారు. ఇజ్రాయెల్ మాటల్లో చెప్పలేని భయంకరమైన తీవ్రవాద చర్యను ఎదుర్కొంటుందని, యునైటెడ్ కింగ్డమ్, తాను ఆ దేశానికి అండగా ఉన్నామని భరోసా ఇస్తున్నట్లు తెలిపారు. చదవండి: పాలస్తీనాకు మద్దతుగా అమెరికాలో ఆందోళనలు British PM Rishi Sunak arrives in Tel Aviv, Israel, according to Reuters. (Photo source: Reuters) pic.twitter.com/V2plUYLe2p — ANI (@ANI) October 19, 2023 కాగా పాలస్తీనా ఉగ్ర సంస్ధ హమాస్ దాడులు, ఇజ్రాయెల్ ప్రతిదాడులతో మిడిల్ ఈస్ట్ అట్టుడుకుతోంది. మరింత ప్రాంతాలకు వ్యాపించకుండా యుద్ధంవెంటనే ఆపాలని ప్రపంచ నేతలు కోరుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్‌లో పర్యటించారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, అధ్యక్షుడితో సమావేశమై యుద్ధ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. హమాస్‌కు వ్యతిరేకంగా చేస్తోన్న పోరులో ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతుగా నిలుస్తుందని చెప్పారు. యుద్ధం నేపథ్యంలో తర్వాత చేపట్టాల్సిన చర్యలపైనా చర్చించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆ వెంటనే నేడు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ యుద్ధ భూమిలో అడుగుపెట్టారు. -
లాంగ్ కోవిడ్‌తో అవయవాలకు ముప్పు
లండన్: కోవిడ్–19 మహమ్మా రి బారినపడి, ఆసుపత్రిలో చికిత్స తర్వాత ఆరోగ్యం మెరుగైన వారిలో కూడా అవయవాలు దెబ్బతింటున్నట్లు యునైటెడ్ కింగ్డమ్(యూకే)లో వివిధ యూనివర్సిటీల సైంటిస్టులు సంయుక్తంగా నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. లాంగ్ కోవిడ్‌తో శరీరంలోని కొన్ని ప్రధాన అవయవాలు క్రమంగా పనిచేయడం ఆగిపోతున్నట్లు గుర్తించామని పరిశోధకులు చెప్పారు. కరోనా బాధితుల మ్యాగ్నెటిక్ రెసోనెన్స్ ఇమేజింగ్(ఎంఆర్ఐ) స్కానింగ్లతో ఈ విషయం కనిపెట్టినట్లు వెల్లడించారు. ముఖ్యంగా ఊపిరితిత్తులు, మెదడు, మూత్రపిండాలకు లాంగ్ కోవిడ్ ముప్పు మూడు రెట్లు అధికంగా పొంచి ఉందని అన్నారు. మనిషిపై దాడి చేసిన కరోనా వైరస్ తీవ్రతను బట్టి ముప్పు తీవ్ర కూడా పెరుగుతున్నట్లు తెలియజేశారు. ఈ అధ్యయనం వివరాలను ‘లాన్సెట్ రెస్పిరేటరీ మెడిసిన్’ పత్రికలో ప్రచురించారు. 259 మంది కరోనా బాధితులపై అధ్యయనం నిర్వహించారు. ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యాక 5 నెలల తర్వాత వారి ఎంఆర్ఐ స్కానింగ్ రిపోర్టులను క్షుణ్నంగా పరిశీలించారు. కరోనా సోకని వారితో పోలిస్తే వారి శరీరంలోని ప్రధాన అవయవాల్లో కొన్ని వ్యత్యాసాలను గుర్తించారు. అన్నింటికంటే ఊపరితిత్తులే అధికంగా ప్రభావితం అవుతున్నట్లు తేల్చారు. గుండె, కాలేయం ఏమాత్రం దెబ్బతినడం లేదని గమనించారు. లాంగ్ కోవిడ్‌కు మరింత ప్రభావవంతమైన చికిత్సలను అభివృద్ధి చేయడానికి ఈ అధ్యయనం తోడ్పడుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. -
ఏయూతో యూకే యూనివర్సిటీ ఎంవోయూ
ఎంవీపీకాలనీ (విశాఖపట్నం): ఆంధ్ర విశ్వవిద్యాలయంతో యునైటెడ్ కింగ్డమ్(యూకే)కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ హైలాండ్స్ అండ్ ఐస్లాండ్స్ అవగాహన ఒప్పందం చేసుకుంది. ఏయూ ఈసీ హాల్లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి, సౌత్ ఇండియా బ్రిటిష్ కౌన్సిల్ డైరెక్టర్ జనక పుష్పనాథన్ సమక్షంలో ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.కృష్ణమోహన్, యూకే ఇంటర్నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషనర్ సనమ్ అరోరా ఈ ఎంవోయూపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి మాట్లాడుతూ ఒప్పందంలో భాగంగా ఎంబీఏ, ఎమ్మెస్సీ అప్లయిడ్ డేటా ప్రాసెస్ కోర్సుల్లో రెండు యూనివర్సిటీలు సంయుక్త సహకారంతో ముందుకెళ్తాయని చెప్పారు. ఏయూ ద్వారా రాష్ట్రంలోని ఏ విద్యార్థి అయినా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని చెప్పారు. యూకే ఇండియా ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా ఈ కోర్సులు చేసే విద్యార్థులకు 10 శాతం ఫీజు రాయితీతో పాటు స్కాలర్షిప్ అందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రపంచంలోని టాప్ వర్సిటీల్లో ఏపీ విద్యార్థులు ఉన్నత చదువులు చదివి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనలకు అనుగుణంగా ఆంధ్రా యూనివర్సిటీ విదేశాల్లోని ప్రఖ్యాత వర్సిటీలతో అవగాహన ఒప్పందాలు చేసుకుంటున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఏయూ రెక్టార్ ఆచార్య కె.సమత, బేమ్ గ్లోబల్ సొసైటీ సీఈవో నవిందర్ కెప్లీష్, ఏయూ ఇంటర్నేషనల్ అఫైర్ అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీనివాసరావు, ఏయూ మీడియా రిలేషన్స్ డైరెక్టర్ ఆచార్య చల్లా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగిని వేధించిన కంపెనీ.. నష్టపరిహారం కోట్లలోనే..?
లండన్: యూకేలో రాయల్ మెయిల్ మాజీ ఉద్యోగి కామ్ ఝూటి కంపెనీలో జరుగుతున్న అవకతవకలపై ఎంప్లాయి ట్రిబ్యునల్ లో చేసిన పోరాటానికి ఫలితంగా సదరు కంపెనీ ఆమెకు రూ.24 కోట్లు పరిహారం చెల్లించాల్సిందిగా సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. 2014లో రాయల్ మెయిల్ మీడియా ప్రతినిధిగా పనిచేస్తోన్న బ్రిటీష్ ఇండియన్ కామ్ ఝూటికి తన సహచర ఉద్యోగికి చట్టవిరుద్ధంగా బోనస్ అందుతున్న విషయంపై అనుమానమొచ్చింది. దీంతో విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకుని వెళ్ళింది. తీరా యాజమాన్యం ఆమె ఫిర్యాదుకు స్పందించకపోగా ఆమెను తిరిగి వేధించడం ప్రారంభించింది. విషయం బయటకు పొక్కకుండా ఉంచేందుకు మొదట ఆమెకు మూడు నెలల జీతం ఇస్తామన్న రాయల్ మెయిల్ ప్రతినిధి తర్వాత ఏడాది జీతం ఇస్తామని కూడా ఆశ చూపించారు. ఝూటి అందుకు అంగీకరించకపోవడంతో వేధించడం ప్రారంభించారు. వేధింపులకు తాళలేక ఆమె ఉద్యోగానికి రాజీనామా చేసి తానెదుర్కొన్న శారీరక, మానసిక సమస్యలను వివరిస్తూ 2015లో సుప్రీం కోర్టులోని ఎంప్లాయి ట్రిబ్యునల్ ను ఆశ్రయించింది. ఎనిమిదేళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత 2022లో ట్రిబ్యునల్ రాయల్ మెయిల్ కంపెనీలో తారాస్థాయిలో అవినీతి జరిగిందని, ఉద్యోగి పట్ల యాజమాన్యం వేధింపులు కూడా నిజమేనని ఇచ్చిన నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. కామ్ ఝూటి పట్ల రాయల్ మెయిల్ కంపెనీ వ్యవహరించిన తీరు అభ్యంతరకరమైనదని, ఆమె అనుభవించిన మానసిక క్షోభ వర్ణనాతీతమని తక్షణమే ఆమెకు వారు రూ.24 కోట్లను పరిహారంగా చెల్లించాలని న్యాయస్థానం తీర్పునిచ్చింది. అయితే కంపెనీ వారు మాత్రం ఈ తీర్పును సవాలు చేస్తూ.. ప్రస్తుతానికైతే రెండున్నర లక్షలు పరిహారం చెల్లించారు. ఇది కూడా చదవండి: తిరుగుబాటు నాయకుడు ప్రిగోజిన్ తో పుతిన్ భేటీ..? -
యునైటెడ్ కింగ్‌డమ్‌లోని టాప్ 10 అందమైన ప్రదేశాలు
-
అంగరంగ వైభవంగా..చార్లెస్ పట్టాభిషేకం
లండన్: రవి అస్తమించినా అలనాటి రాజ వైభవానికి, అట్టహాసాలకు, ఆడంబరానికి మాత్రం ఏ లోటు లేని రీతిలో బ్రిటన్ రాజ సింహాసనంపై చార్లెస్ 3 కొలువుదీరారు. వెయ్యేళ్లకు పైగా కొనసాగుతున్న సంస్కృతీ సంప్రదాయాల ప్రకారం బ్రిటన్ 40వ రాజుగా పట్టాభిషిక్తుడయ్యారు. పలువురు దేశాధినేతలు, ముఖ్య నేతలు తదితరుల సమక్షంలో లాంఛనంగా కిరీటధారణ చేశారు. దాంతో బ్రిటన్‌కు లాంఛనప్రాయ అధినేతగా చార్లెస్ అధికారికంగా పూర్తిస్థాయిలో పగ్గాలు చేపట్టినట్టయింది. లండన్ వీధుల గుండా భార్యాసమేతంగా బంగారు రథంలో ఊరేగుతూ కార్యక్రమానికి విచ్చేసిన ఆయన పట్టాభిషేకానంతరం దారి పొడవునా ప్రజలు, అభిమానుల అభినందనలు స్వీకరిస్తూ బకింగ్‌హాం రాజప్రాసాదానికి చేరుకున్నారు. అనంతరం చారిత్రక బాల్కనీ నుంచి రాజ దంపతులు మరోసారి అందరికీ అభివాదం చేయడంతో కార్యక్రమం ముగిసింది. అత్యంత లేటు వయసులో బ్రిటన్ సింహాసనాన్ని అధిష్టించిన రికార్డును కూడా 74 ఏళ్ల చార్లెస్ సొంతం చేసుకున్నారు! ఆయనతో పాటు భార్య కెమిల్లా (75)కు కూడా రాణిగా పట్టాభిషేకం జరిగింది. 2022 సెప్టెంబర్‌లో తన తల్లి, బ్రిటన్ రాణి ఎలిజబెత్–2 మరణానంతరం బ్రిటన్ రాజుగా చార్లెస్ బాధ్యతలు స్వీకరించడం తెలిసిందే. 70 ఏళ్ల తర్వాత... అప్పుడెప్పుడో 70 ఏళ్ల కిందట, అంటే 1953లో బ్రిటన్ రాణిగా ఎలిజబెత్–2కు పట్టాభిషేకం జరిగింది. తర్వాత మళ్లీ ఇంతకాలానికి జరిగిన పట్టాభిషేక క్రతువు అందరినీ ఎంతగానో ఆకర్షించింది. అప్పట్లాగే శనివారం కూడా కార్యక్రమం ఆసాంతం వాన పడటం విశేషం. దేశ విదేశాల్లో లక్షలాది మంది కార్యక్రమాన్ని అత్యంత ఆసక్తిగా వీక్షించారు. మరోవైపు ఈ ప్రజాస్వామిక యుగంలోనూ ఇంకా ఈ కాలం చెల్లిన రాచరికపు పోకడలు ఏమిటంటూ జోరుగా విమర్శలు కూడా వచ్చాయి. వందలాది నిరసనకారులు రాజ దంపతుల ఊరేగింపు మార్గంలో బారులు తీరి నినాదాలకు దిగారు. ముందుజాగ్రత్తగా వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. సునాక్ బైబిల్ పఠనం ఆర్చిబిషప్ ఆఫ్ కాంటర్బరీ సమక్షంలో మొదలైన కార్యక్రమం రాజుగా చార్లెస్‌ను గుర్తించడం, ప్రమాణం, ప్రకటన, కిరీటధారణ, పట్టాభిషేకం... ఇలా ఐదు దశల్లో 2 గంటలపాటు సాగింది. ముందుగా చార్లెస్‌ను సభికులందరికీ ఆర్చిబిషప్ పరిచయం చేశారు. చార్లెస్ అందరికీ కన్పించేలా నాలుగు దిక్కులకూ తిరిగారు. తర్వాత చట్టాన్ని కాపాడుతూ న్యాయంగా, దయతో పాలిస్తానని, ఇంగ్లండ్ చర్చికి విధేయుడైన క్రైస్తవునిగా ఉంటానని చార్లెస్ రెండు ప్రమాణాలు చేశారు. ఈ సందర్భంగా సంప్రదాయం ప్రకారం కెమిల్లాకు చార్లెస్ ఉంగరం తొడిగారు. తద్వారా రాజ దంపతులు లాంఛనంగా మళ్లీ పెళ్లాడారు. అనంతరం బ్రిటన్ తొలి హిందూ ప్రధాని రిషి సునాక్ ప్రభుత్వ సారథి హోదాలో బైబిల్ పంక్తులు చదివి వినిపించారు! హిందూ, ముస్లిం, సిక్కు, బౌద్ధ, యూదుమత ప్రతినిధులను కూడా తొలిసారిగా కార్యక్రమానికి ఆహ్వానించారు. హిందూ ప్రతినిధి రాజ చిహ్నాన్ని చార్లెస్‌కు అందజేశారు. అనంతరం బంగారు అంగవస్త్రం ధరించి దాదాపు 800 ఏళ్ల నాటి సింహాసనాన్ని అధిష్టించారు. దాని కింది అరలో స్కాట్లాండ్ నుంచి తెప్పించిన పవిత్ర శిలనుంచారు. చార్లెస్‌పై తెరచాటుగా చాతి, చేతులు, ముఖంపై జెరూసలేం నుంచి ప్రత్యేకంగా తెప్పించిన పవిత్ర తైలం చిలకరించారు. చార్లెస్‌కు తెరచాటు కోసం ఉపయోగించిన వస్త్రంపై 56 కామన్వెల్త్ దేశాలకు ప్రతీకగా 56 ఆకులతో కూడిన చెట్టును చిత్రించారు. తర్వాత శిలువతో కూడిన గోళాకారపు బంగారు రాజముద్ర, రాజదండాన్ని ఆర్చిబిషప్ చేతుల మీదుగా చార్లెస్ అందుకున్నారు. వేలికి రాజముద్ర తొడిగాక చివరగా అతి ప్రధాన ఘట్టంలో 360 ఏళ్ల నాటి సెయింట్ ఎడ్వర్డ్ స్వర్ణ కిరీటాన్ని చార్లెస్ ధరించారు. దీన్ని ఆయన మరింకెప్పుడూ ధరించబోరు. ఆ వెంటనే గాడ్ సేవ్ ద కింగ్ గీతాలాపనతో, గంటల మోతతో వెస్ట్ మినిస్టర్ అబే మారుమోగింది. అనంతరం చార్లెస్ రాజఖడ్గం చేబూని 1937లో క్వీన్ ఎలిజబెత్ దంపతులు పట్టాభిషేకానికి వాడిన సింహాసనంపై ఆసీనులయ్యారు. ఆర్చిబిషప్‌తో పాటు చార్లెస్ పెద్ద కుమారుడు ప్రిన్స్ విలియం మోకాళ్లపై కూర్చుని ఆయన కుడిచేతిని ముద్దాడారు. తర్వాత నిరాడంబరంగా కెమిల్లాకు రాణి కిరీటధారణ జరిగింది. ఆహూతుల కళ్లెదుట రాణిపై పవిత్ర తైలం చిలకరించారు. తర్వాత 1911లో క్వీన్ మేరీ ధరించిన 2,200 వజ్రాలు పొదిగిన కిరీటాన్ని ఆమె ధరించారు. కోహినూర్ సహా మూడు పెద్ద వజ్రాలతో ఈ కిరీటం మెరిసిపోయేది. వివాదాలకు తావు లేకుండా ఇటీవల కోహినూర్‌ను కిరీటం నుంచి తొలగించారు. అనంతరం ఎడ్వర్డ్ కిరీటాన్ని తీసేసి అధికారిక రాజ కిరీటాన్ని చార్లెస్ ధరించారు. రాణితో కలిసి దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ బంగారు రథంలో బకింగ్‌హాం ప్యాలెస్‌కు తిరిగి వెళ్లారు. ప్యాలెస్ బాల్కనీ నుంచి పెద్ద కుమారుడు ప్రిన్స్ విలియం దంపతులతో కలిసి చార్లెస్ దంపతులు ప్రజలకు దర్శనమివ్వడంతో పట్టాభిషేక కార్యక్రమానికి తెరపడింది. చివరగా రాయల్ ఎయిర్‌ఫోర్స్ విమానాలు విన్యాసాలతో అలరించాయి. వర్షం కారణంగా చాలా కార్యక్రమాలను కుదించి త్వరగా ముగించారు. బంగారు ఆకుల డిజైన్లలో బైబిల్ చార్లెస్ ప్రమాణస్వీకారం కోసం వాడిన బైబిల్‌ను ఆక్స్ఫర్డ్ ప్రెస్‌లో ప్రత్యేకంగా తయారు చే యించారు. బంగారు ఆకులు తదితర డిజైన్లతో తీర్చిదిద్దారు. అందులో దాదాపు 350 అచ్చు తప్పులను సరిచేసి మరీ కార్యక్రమం కోసం సిద్ధం చేశారు. అచ్చం 1611 నాటి కింగ్ జేమ్స్ బైబిల్లా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. రాజు వెడలె... లండన్‌లోని వెస్ట్ మినిస్టర్స్ అబేలో శనివారం చార్లెస్ 3 పట్టాభిషేక కార్యక్రమం కన్నులపండువగా జరిగింది. 1066లో విలియం ద కాంకరర్కి ఇక్కడే పట్టాభిషేకం జరిగింది. నాటి నుంచీ ఈ కార్యక్రమం ఇక్కడే జరుగుతోంది. చార్లెస్, కెమిల్లా దంపతులు ఉదయం 11 గంటలకు బకింగ్‌హాం ప్యాలెస్ నుంచి ప్రత్యేక బంగారు రథంలో ఊరేగింపుగా వెస్ట్ మినిస్టర్స్ అబేకు తరలి వెళ్లారు. ఈ రథాన్ని 1831 నుంచి ప్రతి పట్టాభిషేక వేడుకకూ ప్రత్యేకంగా వాడుతున్నారు. సైనిక సిబ్బంది గుర్రాలపై, కాలి నడకన రథాన్ని అనుసరించారు. వేలాదిగా ప్రజలు సెంట్రల్ లండన్ వీధుల నిండా బారులు తీరి రాజ దంపతులకు చేతులూపుతూ కన్పించారు. దేశ విదేశాల నుంచి వచ్చిన 2,200 మంది పై చిలుకు ఆహూతులు అబే వద్ద రాజ దంపతులకు స్వాగతం పలికారు. భారత్ తరఫున ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ ఖడ్ దంపతులు పాల్గొన్నారు. వారు కామన్వెల్త్ దేశాధినేతల వరుసలో కూర్చున్నారు. దూరదూరంగా హారీ రాచరికాన్ని వదులుకుని రాజ కుటుంబానికి దూరమైన చార్లెస్ రెండో కుమారుడు హారీ పట్టాభిషేక కార్యక్రమంలో అంటీ ముట్టనట్టుగా పాల్గొన్నారు. 10 వరుసల ఆవల మౌనంగా కూర్చుని కార్యక్రమాన్ని వీక్షించారు. ఆయన భార్య మెగన్ మార్కెల్, ఇద్దరు పిల్లలు కార్యక్రమానికి రాకుండా అమెరికాలోనే ఉండిపోయారు. శనివారమే నాలుగో పుట్టినరోజు జరు పుకున్న కుమారుడు ఆర్చీ కోసం కార్యక్రమం ముగియగానే హారీ అమెరికా పయనమయ్యా రు. రాజ దంపతులు, అన్న విలియం తనను ఎన్నడూ సరిగా చూడలేదంటూ ఇటీవలి ఆత్మకథలో ఆయన తూర్పారబట్టడం తెలిసిందే. చార్లెస్ తమ్ముడు కూడా... రాచరిక హోదాను కోల్పోయిన చార్లెస్ తమ్ముడు ఆండ్రూ కూడా దూరంగా కూర్చుని కార్యక్రమాన్ని వీక్షించడానికే పరిమితమయ్యారు. లైంగిక వేధింపుల కేసు తదితరాల్లో చిక్కడంతో ఆండ్రూ రాచరికపు హోదాలను తల్లి ఎలిజబెత్ తొలగించారు. 𝐓𝐡𝐞 𝐂𝐫𝐨𝐰𝐧𝐢𝐧𝐠 𝐨𝐟 𝐓𝐡𝐞 𝐊𝐢𝐧𝐠 The Archbishop of Canterbury places St Edward’s Crown on The King’s anointed head. The clergy, congregation and choir all cry ‘God Save The King’.#Coronation pic.twitter.com/kGrV3W0bky — The Royal Family (@RoyalFamily) May 6, 2023 look at camilla she can’t believe what her and charles have gotten away with and that smirk says it all #Coronation pic.twitter.com/gtQ9rIGiEj — ᴀᴅᴇʏᴇᴍɪ 🚩 (@LE4NDROAI) May 6, 2023 చదవండి: యూకే ‘స్థానికం’లో అధికార పక్షానికి ఎదురుదెబ్బ -
నేడే చార్లెస్–3 పట్టాభిషేకం
లండన్: చరిత్రాత్మక ఘట్టానికి తెరలేచింది. బ్రిటన్ రాజుగా చార్లెస్–3 పట్టాభిషేక సంబరానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ అబేలో శనివారం ఆయనకు సంప్రదాయబద్ధంగా కిరీటధారణ చేయనున్నారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుంది. బీబీసీలో ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. ఎలిజబెత్–2 మృతితో ఆయన తనయుడు చార్లెస్–3 బ్రిటన్ రాజుగా ఇప్పటికే బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు లాంఛనంగా పట్టాభిషేక కార్యక్రమం నిర్వహించనున్నారు. 74 ఏళ్ల చార్లెస్–3, 75 ఏళ్ల ఆయన భార్య కెమిల్లా శనివారం ఉదయమే గుర్రాలు పూన్చిన ప్రత్యేక బంగారు రథంలో బకింగ్‌హామ్ ప్యాలెస్ నుంచి వెస్ట్‌మినిస్టర్ అబేకు చేరుకుంటారు. అక్కడ లాంఛనప్రాయంగా జరిగే కార్యక్రమాలు ముగిసిన అనంతరం రాజుకు, రాణికి కిరీటధారణ చేస్తారు. సెయింట్ ఎడ్వర్డ్ కిరీటాన్ని చార్లెస్–3, సెయింట్ మేరీస్ కిరీటాన్ని కెమిల్లా ధరిస్తారు. ఈసారి కోహినూర్ వజ్రాన్ని ఈ కిరీటంలో చేర్చడంలేదు. కిరీటధారణ తర్వాత చరిత్రాత్మక కుర్చీలో రాజు, రాణి ఆసీనులవుతారు. 1953లో జరిగిన క్వీన్ ఎలిజబెత్–2 పట్టాభిషేక మహోత్సవానికి 8,000 మందిని ఆహ్వానించారు. చార్లెస్–3 పట్టాభి షేకానికి కేవలం 2,200 మందికి ఆహ్వానం పంపించారు. దేశంలో ఆర్థిక పరిస్థితి దిగజారడం, జీవన వ్యయం పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. క్రైస్తవ పద్ధతిలో రాజు పట్టాభిషేకం జరగడం సంప్రదాయంగా వస్తోంది. ఈసారి కొంత ఆధునికతను జోడించారు. ఇతర మతాలకు సైతం చోటు కల్పించారు. వివిధ మతాల గురువులు, పెద్దలు రాజును ఆశీర్వదించనున్నారు. హిందూమతం తరపున నరేంద్ర బాబూభాయి పటేల్ రాజుకు ఉంగరం అందజేస్తారు. బ్రిటన్ తొలి హిందూ ప్రధానమంత్రి రిషి సునాక్ బైబిల్ సూక్తులు చదివి వినిపిస్తారు. చార్లెస్–3 పట్టాభిషేక వేడుకలో పాల్గొనేందుకు వివిధ దేశాల అధినేతలు, దేశ విదేశీ అతిథులు లండన్‌కు చేరుకుంటున్నారు. భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ దంపతులు శుక్రవారం లండన్‌కు చేరుకున్నారు. బ్రిటిష్ ఎంపైర్ మెడల్(బీఈఎం) స్వీకరించినవారిని ఈ పట్టాభిషేకానికి ఆహ్వానించారు. ఇలా ఆహ్వానం అందుకున్న వారిలో భారత సంతతికి చెందిన పాకశాస్త్ర ప్రవీణురాలు మంజు మాల్హీ కూడా ఉన్నారు. పట్టాభిషేకం సందర్భంగా జరిగే సైనిక పరేడ్‌లో బ్రిటిష్ సైనికులతోపాటు కామన్వెల్త్ దేశాల జవాన్లు కూడా పాల్గొంటారు. 7,000 మంది జవాన్లతో జరిగే కవాతు కనువిందు చేయనుంది. -
లండన్‌లో హైదరాబాద్ యువతి మృతి
సాక్షి, హైదరాబాద్: ఫస్ట్ టర్మ్ అయిపోయింది.. సెలవు తీసుకుని ఇంటికొస్తానని చెప్పిన ఆ యువతి శాశ్వతంగా సెలవు తీసుకుంది. హైదరాబాద్ యువతి సాయి తేజస్వి కొమ్మారెడ్డి (24) లండన్‌లో దుర్మరణం చెందింది. ఒక్కగానొక్క బిడ్డ మృతి చెందడం, మృతదేహం రావడానికి సమయం పడుతుండటంతో నగరంలోని ఆమె కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. యాదాద్రి జిల్లా మోటకొండూరుకు చెందిన కొమ్మారెడ్డి శశిధర్ రెడ్డి, జ్యోతి దంపతులు నగరంలోని ఐఎస్‌సదన్ డివిజన్ లక్ష్మీనగర్ కాలనీలో ఉంటున్నారు. వీరి కుమార్తె తేజస్వి సైదాబాద్‌లో ఇంజనీరింగ్ (సీఎస్ఈ) పూర్తి చేశారు. లండన్‌లోని క్రాన్ ఫీల్డ్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేయడానికి గతేడాది సెప్టెంబర్‌లో వెళ్లారు. ఈ నెల 11న తన స్నేహితులతో కలిసి అక్కడి బ్రైటన్ బీచ్‌లో విహారయాత్రకు వెళ్లి సముద్రంలో కొట్టుకుపోయారు. వెంట ఉన్న సహ విద్యార్థులు ఎమర్జెన్సీ రెస్పాన్స్‌కు సమాచారం ఇచ్చారు. అక్కడి బలగాలు గాలించి తేజస్వి మృతదేహాన్ని గుర్తించి ససెక్స్ కౌంటీ హాస్పిటల్‌కు తరలించారు. ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆమె మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ విషయంపై కేటీఆర్‌కు ట్వీట్ చేసిన తేజస్వి బంధువులు మృతదేహం ఇక్కడకు తరలించడానికి సహకరించాలని కోరారు. బుధవారం మృతురాలి ఇంటికి వెళ్లిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడించారు. మృతదేహం శుక్రవారం నాటికి నగరానికి చేరుకుంటుందని ఆమె కుటుంబీకులకు సమాచారం అందింది. ‘‘చనిపోవడానికి ముందు రోజు తేజస్వి తల్లిదండ్రులతో వీడియోకాల్‌లో మాట్లాడింది. ఫస్ట్ టర్మ్ పూర్తయిన విషయం చెప్పింది. వీలుంటే వారం లేదా పది రోజులు సెలవు తీసుకుని రమ్మని వాళ్లు చెప్పారు. ఆరేడు నెలల్లో గ్రాడ్యుయేషన్ కూడా ఉండటంతోసెర్మనీకి వెళ్లడానికి తల్లిదండ్రులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈలోపు ఇలా జరిగింది’’అని తేజస్వి బంధువులు తెలిపారు. చదవండి: ఎంసెట్‌లో ఇంటర్ మార్కుల వెయిటేజ్ ఎత్తివేత -
సుధామూర్తికి పద్మభూషణ్.. అత్తపై బ్రిటన్ ప్రధాని ప్రశంసలు
సుధామూర్తి.. భారతీయులకు పరిచయం అక్కర్లేని వ్యక్తి. టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి సతీమణిగానే కాకుండా రచయిత్రి, విద్యావేత్త సామాజిక వేత్తగా అందరికీ సుపరిచితురాలే. తన కోసం మాత్రమే కాకుండా సమాజం కోసం ఆలోచించే వారు అతి తక్కువమంది కనిపిస్తుంటారు. అలాంటి వారిలో సుధామూర్తి ముందువరుసలో ఉంటారు. వేల కోట్లకు అధినేత అయినా.. సింప్లీ సిటీకి మారుపేరులా ఉంటారు. కంప్యూటర్ ఇంజనీర్‌గా జీవితాన్ని ప్రారంభించి ఇన్ఫోసిస్ ఫౌండేషన్,. గేట్స్ ఫౌండేషన్ ప్రజారోగ్య విభాగాలలో కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇప్పటికే పలు అనాథాశ్రయాలను ప్రారంభించిన ఆమె.. గ్రామీణాభివృద్ధి, విద్య, ఆరోగ్య రంగాల్లో సేవలందింస్తున్నారు. కర్ణాటకలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్లు అందించి పేద విద్యార్థులు కూడా ఉచితంగా కంప్యూటర్ జ్ఞానాన్ని పొందగలిగేందుకు తోడ్పడుతున్నారు. సుధామూర్తి సమాజానికి చేస్తున్న సేవలను గుర్తించి ఇటీవల భారత ప్రభుత్వం ఆమెను పద్మభూషన్ అవార్డుతో సత్కరించిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. తల్లికి దక్కిన గౌరవంపై మురిసిపోతూ ఆమె కూతురు, యూకే ప్రధాని రిషి సునాక్ భార్య అక్షత మూర్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టారు. రాష్ట్రపతి నుంచి మా అమ్మ పద్మభూషన్ను అందుకుంటున్న క్షణాలను చూసి ఎంతో గర్వంగా ఫీల్ అయ్యానని అన్నారు. సమాజం కోసం చేసిన సేవకు ఆమెకీ అవార్డు దక్కిందని చెప్పుకొచ్చారు ‘25 సంవత్సరాలుగా స్వచ్చంద సంస్థలను ఏర్పాటు చేసి అక్షరాస్యతను పెంపొందించడానికి వివిధ కార్యక్రమాలలు నిర్వహిస్తుంది. ఆమె జీవితం నాకొక ఉదాహరణ. ఎలా జీవించాలో తనను చూసి నేర్చకున్నాను. గుర్తింపుకోసం అమ్మ ఎప్పుడూ ఎదురు చూడలేదు. కానీ నిన్న దక్కిన గుర్తింపు ప్రత్యేకం. మా తల్లిదండ్రులు మాకు(తమ్ముడు, నాకు) కష్టపడి పనిచేయడం, మానవత్వం చూపడం, నిస్వార్థంగా జీవించడం వంటి ఎన్నో విలువలు నేర్పించారు’ అంటూ తల్లిపై ప్రేమను చాటుకున్నారు. అక్షతమూర్తి పోస్టుపై అల్లుడు రిషి సునాక్ స్పందించారు. సుధామూర్తి ఘనతను కొనియాడుతూ.. ‘గర్వించదగ్గ రోజు’ అంటూ క్లాప్ ఎమోజీని షేర్ చేశారు. కాగా ఇప్పటికే సుధామూర్తి అందించిన సామాజిక కార్యక్రమాలకుగానూ 2006లో ఆమెను పద్మశ్రీ అవార్డు వరించిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Akshata Murty (@akshatamurty_official) -
యూకేలో పాస్‌పోర్ట్ సిబ్బంది సమ్మె
లండన్: దేశంలో ద్రవ్యోల్బణం రెండంకెలకు ఎగబాకిందని, ధరలు పెరిగిపోతున్నాయని, తమ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ కింగ్డమ్(యూకే)లో పాస్‌పోర్ట్ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది సోమవారం సమ్మె ప్రారంభించారు. ఐదు రోజులపాటు ఈ సమ్మె కొనసాగనుంది. దీంతో విదేశాలకు వెళ్లాల్సినవారు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. పాస్‌పోర్ట్‌లు సకాలంలో అందకపోతే ప్రయాణాలు మానుకోవాల్సి వస్తుందని చెబుతున్నారు. యూకేలో ద్రవ్యోల్బణం 10.4 శాతానికి చేరుకుంది. ఆహారం, ఇంధనం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. జీవన వ్యయం భారీగా పెరిగిపోయింది. తక్షణమే వేతనాలు పెంచాలన్న డిమాండ్‌తో వైద్యులు, ఉపాధ్యాయులు, రైళ్లు, బస్సుల డ్రైవర్లు, ఎయిర్‌పోర్టుల్లో పనిచేసి సిబ్బంది, పోస్టల్ సిబ్బంది ఇదివరకే సమ్మెకు దిగారు. మళ్లీ టీచర్ల సమ్మెబాట యూకే ప్రభుత్వం ఆఫర్ చేసిన వేతన 4.5 శాతం పెంపు, 1,000 పౌండ్ల వన్‌టైమ్ చెల్లింపును టీచర్లు తిరస్కరించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 27, మే 2న సమ్మె చేపట్టాలని నిర్ణయించినట్లు నేషనల్ ఎడ్యుకేషన్ యూనియన్ ప్రకటించింది. -
టి20 ఛాంపియన్స్‌తో క్రికెట్ ఆడిన బ్రిటన్ ప్రధాని
-
వేల కోట్లు ఎగొట్టి.. ఇప్పుడేమో డబ్బులు లేవు, అప్పు తీసుకోవాలంటున్న ఘనుడు!
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) రూ.11వేల కోట్ల ఎగనామం పెట్టి విదేశాలకు చెక్కేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కొన్ని వేల కోట్లు స్కాంలో కీలక నిందితుడు అయిన నీరవ్ దగ్గర ప్రస్తుతం డబ్బులు లేవని చెబుతున్నాడు. వినడానికి విడ్డూరంగా ఉన్నా స్వయంగా అతనే ఈ వ్యాఖ్యలు చేశాడు. నీరవ్ విషయంలో కేంద్రం తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అతన్ని స్వదేశానికి తీసుకొచ్చే ప్రయాత్నాలు చేస్తూనే.. మరోవైపు బ్యాంకులకు ఎగనామం పెట్టిన మొత్తాన్ని ముక్కుపిండి వసూలు చేసే పనిలో పడింది. పైసలు లేవు.. అప్పు తీసుకుంటా ప్రస్తుతం నీరవ్ నైరుతి లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలులో ఉన్నాడు. అతడిని భారత్‌కు అప్పగించే విచారణలో భాగంగా చట్టపరమైన ఖర్చులు చెల్లించాలని లండన్‌లోని హైకోర్టు ఆదేశించింది. అయితే ఈ చెల్లింపులకు సంబంధించి నీరవ్ అక్కడి నుంచే వర్చువల్ ద్వారా తూర్పు లండన్‌లోని బార్కింగ్‌సైడ్ మేజిస్ట్రేట్ కోర్టులో ముందు హాజరయ్యాడు. చెల్లింపులపై వజ్రాల వ్యాపారి న్యాయస్థానానికి ఈ రకంగా విన్నవించుకున్నాడు.. తాను కోర్టు తీర్పు ప్రకారం డబ్బులను ఒకేసారి చెల్లించలేనని, నెలకు 10 వేల పౌండ్ల చొప్పున కడతానని అభ్యర్థించాడు. ఎందుకంటే భారత ప్రభుత్వం తన ఆస్తులన్నీ సీజ్ చేయడంతో డబ్బులు పరంగా చాలా ఇబ్బంది పడుతున్నట్లు చెప్పుకొచ్చాడు. అనంతరం దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ.. ఆ 10 వేల పౌండ్లను ఎక్కడి నుంచి తెస్తావని అడగగా.. కోర్టుకు చెల్లించాల్సిన మొత్తం కోసం రుణం తీసుకుంటున్నానని చెప్పాడు. కాగా ఈ వ్యాపారవేత్తపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అభియోగాల ఆధారంగా నేరవ్ మోదీని 2019 మార్చిలో అరెస్టు చేసిన మూడేళ్ల తర్వాత అప్పీల్‌ను తిరస్కరించడం జరిగింది. -
ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ హాస్పిటల్స్ సీయివోగా మేఘన.. ఆమెనే ఎందుకు?
భారతీయ మూలాలు ఉన్న ప్రొఫెసర్ మేఘనా పండిత్ బ్రిటన్‌లోని ప్రసిద్ధ ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ హాస్పిటల్స్ సీయివోగా నియమితురాలై ఈ బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా ప్రత్యేకత చాటుకుంది. గత సంవత్సరం జులై నుంచి బ్రిటన్‌లోని ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ హాస్పిటల్స్(వోయుహెచ్), నేషనల్ హెల్త్ సర్వీసెస్ ట్రస్ట్(ఎన్హెచ్ఎస్)కు తాత్కాలిక సీయివోగా బాధ్యతలు నిర్వహించిన మేఘన ఇప్పుడు శాశ్వత ప్రాతిపదికన ఆ బాధ్యత లు చేపట్టబోతోంది. ‘సీయివోగా మేఘన నియామకం సంతోషం కలిగిస్తుంది. విషయం మీద ఆసక్తి, అనురక్తి మాత్రమే కాదు అంకితభావం, క్రమశిక్షణ ఉంటే ఉన్నతస్థాయికి ఎదగవచ్చు అని చెప్పడానికి ఆమె ఉదాహరణ. ఉద్యోగులతో కలిసి పనిచేసే తీరు ఆమెలోని నాయకత్వ లక్షణాలకు అద్దం పడుతుంది. ట్రస్ట్‌కు సంబంధించిన విలువలు కాపాడడంలో, ట్రస్ట్ కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లడంలో ఆమె నాయకత్వ బలం ఉపయోగపడుతుంది’ అంటున్నారు ట్రస్ట్ చైర్పర్సన్ జోనాథన్. ‘ఎన్హెచ్ఎస్’కు బ్రిటన్‌లో ఎన్నో టీచింగ్ హాస్పిటల్స్ ఉన్నాయి. యూరప్‌లో అత్యధిక సంఖ్యలో హాస్పిటల్స్ ఉన్నాయి. ట్రస్ట్ ఆధ్వర్యంలో విలువైన పరిశోధనలు జరుగుతున్నాయి. గతంలో ‘ఎన్హెచ్ఎస్’కు సంబంధించి చీఫ్ మెడికల్ ఆఫీసర్(సిఎంవో)గా విధులు నిర్వహించింది మేఘన. వార్విక్ యూనివర్శిటీ హానరరీ ప్రొఫెసర్‌గా నియామకం అయింది. ముంబైలో ఎంబీబీఎస్ చేసిన మేఘనా పండిత్ బోధన నుంచి నిర్వహణ వరకు తనదైన ప్రతిభతో ముందుకు దూసుకువెళ్తోంది. చదవండి: మీకంటే తోపు లేడనుకుంటున్నారా? అయితే సమస్యే..! -
బ్రిటన్కేమైంది? ముసురుకుంటున్న మాంద్యం.. తీవ్ర ఆర్థిక సంక్షోభం!
యునైటెడ్ కింగ్డమ్. స్థిరత్వానికి మారుపేరు. ఎన్ని సంక్షోభాలు, ప్రపంచ యుద్ధాలు జరిగినా ఆర్థిక మూలాలు చెక్కు చెదరని దేశం. కానీ ఇప్పుడు ఆ దేశం కనీవినీ ఎరుగని గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది. ఏడాదిలో ముగ్గురు ప్రధానమంత్రులు మారారు. అయినా బలహీనపడిపోతున్న ఆర్థిక వ్యవస్థని కాపాడే దిక్కు లేకుండా పోయింది. ధనిక దేశాల కంటే అన్నింట్లోనూ వెనుకబడిపోతూ మాంద్యం ఉచ్చులో చిక్కుకుంటోంది. నానాటికీ పతనం... బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకి పతనమైపోతోంది. ధరాభారం ప్రజల జేబుల్ని గుల్ల చేస్తోంది. పెరుగుతున్న ధరలకి తగ్గట్టుగా ఆదాయాలు పెరగకపోవడంతో ప్రజలకి కొనుక్కొని తినే స్థోమత కూడా కరువు అవుతోంది.దీంతో సమాజంలోని వివిధ వర్గాలు వేతనాల పెంపు డిమాండ్‌తో సమ్మెకు దిగుతున్నాయి. ప్రపంచంలోని మిగిలిన అభివృద్ధి చెందిన దేశాలు ఈ ఏడాది ఆర్థికంగా పుంజుకుంటే బ్రిటన్ మరింత క్షీణిస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) అంచనా వేస్తోంది. ఆర్థిక మాంద్యం ఎదుర్కోక తప్పదని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రతో చమురు లభ్యత చాలా దేశాలకు అతి పెద్ద సమస్యగా మారింది. అమెరికా తన సొంత గడ్డపై లభించే శిలాజ ఇంధనాలపై ఆధారపడితే, ఫ్రాన్స్ అణు విద్యుత్‌పైనా, నార్వే జలవిద్యుత్‌పైన ఆధారపడ్డాయి. యూకే గ్యాస్‌పైనే ఆధారపడే దేశం కావడంతో విద్యుత్ బిల్లులు తడిసిపోపెడైపోయాయి. ఒకానొక దశలో 100% పెరిగాయి. దేశం ఆర్థికంగా కుదేలు కావడానికి ఇంధనం అసలు సిసలు కారణమని ఫిస్కల్ స్టడీస్ ఇనిస్టిట్యూట్ డిప్యూటీ డైరెక్టర్ కార్ల్ ఎమ్మర్సన్ అభిప్రాయపడ్డారు. జీ–7 దేశాల్లో వెనక్కి అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్ వంటి సంపన్న దేశాల కంటే బ్రిటన్ ఎందుకు వెనుకబడిందనే చర్చ జరుగుతోంది. కరోనా మహమ్మారి, ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ప్రపంచ ఆర్థిక వ్యవస్థలనే ఛిన్నాభిన్నం చేశాయి. కరోనా విసిరిన సవాళ్ల నుంచి కోలుకునే దశలో ఉక్రెయిన్‌పై రష్యా ప్రారంభించిన యుద్ధం పులి మీద పుట్రలా మారింది. అన్నింటిని తట్టుకొని ధనిక దేశాలు మళ్లీ పూర్వ స్థితికి వస్తూ ఉంటే బ్రిటన్ మాత్రం కోలుకోలేకపోతోంది. ఇందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి. రాజకీయాలు, వాతావరణ పరిస్థితులు వంటివి కూడా ప్రభావం చూపిస్తాయి. ఇతర దేశాలు విద్య, ఆరోగ్య రంగం ఆధారంగా పరిస్థితుల్ని అంచనా వేస్తే బ్రిటన్ మాత్రం సేవల ఆధారంగా నిర్ణయిస్తుంది. జీ–7 దేశాలన్నీ ఈ ఏడాది కోలుకుంటాయని ఐఎంఎఫ్ వంటి సంస్థలు అంచనా వేస్తున్నాయి. కానీ బ్రిటన్ పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. డాలర్‌తో పౌండ్ విలువ : 0.83 బ్రిటన్ జీడీపీ వృద్ధి రేటు అంచనా: 0.6% ద్రవ్యోల్బణం : 10.1% బ్రెగ్జిట్ దెబ్బ... ప్రపంచదేశాలు కరోనా, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం వంటి సంక్షోభాలను ఎదుర్కొంటే బ్రిటన్ ఆర్థిక సమస్యలకు బ్రెగ్జిట్ అదనపు కారణంగా నిలిచింది. 2016లో యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచీ దేశానికి ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి. బ్రెగ్జిట్ కారణంగా యూకే ఆర్థిక వ్యవస్థకు ఏడాదికి ఏకంగా 10 వేల కోట్ల పౌండ్ల నష్టం వాటిల్లుతోందని బ్లూమ్‌బర్గ్ నివేదిక వెల్లడించింది. దీర్ఘకాలంలో బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ 4 శాతానికి తగ్గుతుందని తెలిపింది. 2021 జనవరి నుంచి బ్రిటన్ నుంచి ఈయూకు ఎగుమతులు 16% పడిపోయాయి. ఈయూ నుంచి వచ్చే పెట్టుబడులు 2,900 కోట్ల పౌండ్లు తగ్గిపోయాయి. శ్రామికులు కావలెను... బ్రెగ్జిట్ ముందు వరకు ఈయూ నుంచి బ్రిటన్‌కి స్వేచ్ఛగా పని చేయడానికి వచ్చేవారు. ఇప్పుడు వర్కర్లు రావడం మానేశారు. ఫలితంగా ఆతిథ్యం, వ్యవసాయం, సేవా రంగాల్లో సిబ్బంది కొరత ఏర్పడింది. యువత పని చేయడం కంటే ఉన్నత చదువులపై దృష్టి పెడుతూ ఉంటే, వయసు మీద పడ్డ వారు ముందస్తుగా పదవీ విరమణ చేస్తున్నారు. అత్యధికులు రోగాల పాలై ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్నారే తప్ప పని చేసే వారి సంఖ్య తగ్గిపోతూ వస్తోంది. ఇవన్నీ దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మన టీ, సమోసాకు ఆ దేశంలో యమా క్రేజ్..! విజయసాయి రెడ్డి ట్వీట్
లండన్: సాయంత్రమయ్యేసరికి వేడి వేడి సమోసా తిని, పొగలు గక్కే టీ ఒక కప్పు లాగిస్తే ఎలాగుంటుంది. ఆ కాంబినేషన్ ఇచ్చే కిక్కు వేరుగా ఉంటుంది కదా. మన దేశానికి మాత్రమే ప్రత్యేకమైన ఈ చాయ్, సమోసా కాంబినేషన్‌కి ఇప్పడు బ్రిటన్ యువతరంలో యమా క్రేజ్ పెరుగుతోంది. సాధారణంగా తెల్లవారు టీతో పాటు బిస్కెట్లు తింటారు. ఇప్పుడు వారి జిహ్వలు కొత్త రుచులు కోరుకుంటున్నాయని యునైటెడ్ కింగ్డమ్ టీ అండ్ ఇన్ఫ్యూజన్స్ అసోసియేషన్ నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. వెయ్యి మందితో ఈ సర్వేని నిర్వహిస్తే సాయంత్రం స్నాక్‌గా గ్రానోలా బార్స్ (ఓట్స్‌తో చేసేది) చాలా బాగుంటుందని మొదటి స్థానం ఇచ్చారు. ఇక రెండోస్థానాన్ని మన సమోసా కొట్టేసింది. సర్వేలో పాల్గొన్న యువతరంలో 8 శాతం మంది సమోసాకి మొగ్గు చూపించారు. విజయసాయి రెడ్డి ట్వీట్ యూకే పేవరేట్ మెనూలో మన చాయ్, సమోసా చేరడంపై ట్విట్టర్ వేదికగా ఆనందం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. బ్రిటన్ యువత తమ స్నాక్స్ లో స్వీట్లకు బదులు వీటికి ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. 16-24 ఏళ్ల మధ్య వయస్కుల్లో సగానికిపైగా.. టీతో కలిపి స్వీట్ బిస్కెట్ రుచిని ఆస్వాదిస్తున్నారని ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి. It is happy to note that tea and samosa have become favourite menu in UK. The young there prefer them instead of sweets as snacks. 16 to 24-year-olds are half as likely to enjoy a sweet biscuit with their tea as those over 55. #indianculture #foodie #uk #india pic.twitter.com/bRTlbIZq1W — Vijayasai Reddy V (@VSReddy_MP) January 23, 2023 -
సీట్ బెల్ట్ వివాదం.. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు జరిమానా
లండన్: బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్‌కు అక్కడి పోలీసులు జరిమానా విధించారు. కారులో సీట్ బెల్ట్ ధరించకుండా ప్రయాణించినందుకు 100 పౌండ్ల ఫైన్ విధించినట్లు లంకాషైర్ పోలీసులు తెలిపారు. కాగా కారులో ప్రయాణిస్తున్న రిషి సునాక్ ఓ ప్రచార కార్యక్రమం కోసం సీటు బెల్టు తొలగించి వీడియో చిత్రీకరించిన విషయం తెలిసిందే. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వివాదం రాజుకుంది. ప్రధాని అయ్యి ఉండి నిబంధనలు ఉల్లంఘించారంటూ రిషిసునాక్పై నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో రిషి సునాక్ బ్రిటన్ ప్రజలకు క్షమాపణలు తెలియజేశారు. సీటుబెల్ట్ ధరించకుండా ప్రయాణించడం తప్పేనని ఒప్పుకున్నారు. ప్రతి ఒక్కరూ సీటు బెల్ట్ ధరించాలని కోరారు. అయితే యూకే చట్టాల ప్రకారం బ్రిటన్‌లో కారులో ప్రయాణించే సమయంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సీటు బెల్టు ధరించాల్సి ఉంటుంది. అత్యవసర వైద్యం పొందాల్సిన వ్యక్తి మినహా ప్రతీఒక్కరూ సీటు బెల్టు ధరించాల్సిందే. లేదంటూ డ్రైవర్లు, ప్రయాణీకులకు భారీగా జరిమానా విధిస్తారు. సీట్ బెల్ట్ పెట్టుకోకుండే అక్కడికక్కడే 100 పౌండ్లు జరిమానా చెల్లించాలి. వ్యవహారం కోర్టుకు చేరితే 500 పౌండ్ల వరకు జరిమానా పెరిగే అవకాశం ఉంటుంది. చదవండి: గోడపై మూత్రం పోస్తే చింది మీదనే పడుతుంది Apologies for not wearing a seatbelt, but I thought that rule only applied to other people and not to us. You know, like all the other rules.#LevellingUpFundpic.twitter.com/ZzFmiHcgFL — Parody Rishi Sunak (@Parody_PM) January 19, 2023 -
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్టాంపు
ఈ ఫొటోలో కనిపిస్తున్నది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్టాంపు. నిజానికి దీనిని ముద్రించి, విడుదల చేసినప్పుడు దీని ఖరీదు ఒక సెంటు (నాలుగు పైసలు) మాత్రమే! ఇప్పుడు దీని ధర ఏకంగా 8.5 మిలియన్ డాలర్లు (రూ.70.33 కోట్లు). అవాక్కయ్యారా? దీని ప్రాచీనత కారణంగానే ఇప్పుడు దీనికి ఇంత రేటు పలుకుతోంది. బ్రిటిష్ గయానాకు చెందిన ఈ తపాలా స్టాంపు 1856 నాటిది. బరువు ప్రకారం చూసుకుంటే, ప్రస్తుతానికి ఇదే ప్రపంచంలోని అత్యంత విలువైన వస్తువు. ఈ స్టాంపు బరువు 40 మిల్లీగ్రాములు. ఇదే బరువు గల నాణ్యమైన వజ్రం ధర దాదాపు 700 డాలర్లు (రూ.58 వేలు). ఇదే బరువు గల ఖరీదైన మాదకద్రవ్యం ఎల్ఎస్డీ ధర దాదాపు 5000 డాలర్లు (రరూ.4.13 లక్షలు). ఈ లెక్కన బ్రిటిష్ గయానాకు చెందిన ఈ ఒక సెంటు తపాలా స్టాంపు ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువని నిపుణులు తేల్చి చెబుతున్నారు. అత్యంత విలువైన ఈ స్టాంపు ఇప్పటి వరకు తొమ్మిదిమంది యజమానుల చేతులు మారింది. ఇటీవల జరిగిన వేలంలో స్టేన్లీ గిబ్బన్స్ అనే కంపెనీ దీనిని సొంతం చేసుకుంది. -
ఘోరమైన వేడి-చల్లదనం.. ఈ ఏడాది అట్లుంది మరి!
లండన్: మునుపెన్నడూ లేనంతంగా వాతావరణంలో విపరీతమైన మార్పులను యూకే చవిచూస్తోంది. ఈ ఏడాదిలోనే యూకే చరిత్రలోనే అత్యంత వేసవి పరిస్థితులను చవిచూసింది. వేడికి ఏకంగా రైలు పట్టాలే కాలి కరిగిపోయి.. సర్వీసులను నిలిపి వేయాల్సి వచ్చింది. వేల మంది మృత్యువాత పడ్డారు. ఇక ఇప్పుడు చలి వంతు వచ్చింది. మైనస్ 10 నుంచి 12 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలతో బ్రిటన్ గజగజ వణికిపోతోంది. ఈ సీజన్లో ఐస్‌ల్యాండ్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో చలిపులి పంజా విసురుతోంది. విపరీతంగా కురుస్తున్న మంచుతో రోడ్లపై ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒకదానికొకటి ఢీకొంటున్నాయి. ముందున్న వాహనం కూడా కనిపించని పరిస్థితి. వాహనాలతో రోడ్లపైకి రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రయాణాలు మానుకోవాలని చెప్పారు. చాలాచోట్ల యజమానులు తమ కార్లను రహదారుల పక్కన వదిలేసి వెళ్లిపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. కాట్స్‌వాల్డ్, బ్రిస్టల్, సౌత్ వేల్స్, హియర్ఫోర్డ్షైర్, కాంబ్రియా, షెఫీల్డ్ తదితర ప్రాంతాల్లో మంచు పెద్ద ఎత్తున పేరుకుపోయింది. కొన్నిచోట్ల పట్టాలపై మంచు కప్పేయడంతో రైళ్లను పాకిక్షంగా రద్దు చేశారు. మరికొన్ని ప్రాంతాల్లో రైళ్లు ఆలస్యంగా నడిచాయి. ఇక లండన్‌లోని హిత్రూ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఉదయం ఏకంగా 48 విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. కొన్ని విమానాలు ఆలస్యంగా నడిచాయి. హిత్రూ ఎయిర్‌పోర్ట్‌లో జనం బారులు తీరారు. కెంట్, ఎస్సెక్స్, లండన్‌లో భారీగా మంచు కురిసే అవకా శం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. లండన్ సహా సౌత్, సెంట్రల్ ఇంగ్లాండ్‌లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. స్కాట్లాండ్లో మైనస్ 15 డిగ్రీలు నమోదైంది. దీనికి ఆర్కిటిక్ బ్లాస్టే కారణమని నిపుణులు చెబుతున్నారు. ‘‘ధ్రువాల వద్ద తక్కువ పీడనం వల్ల ఇలా జరుగుతుంది. వాతావరణంలో తీవ్ర మార్పులు, ఉష్ణోగ్రతలు హఠాత్తుగా పడిపోవడం ఆర్కిటిక్ బ్లాస్ట్ ప్రభావమే’’ అంటున్నారు. ఇదీ చదవండి: ఆంక్షలను ఎత్తేయడంతో.. అల్లకల్లోలంగా తయారైంది -
బ్రిటన్, చైనా మధ్య స్వర్ణయుగం ముగిసింది: రిషి సునాక్
లండన్: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ చైనాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. లండన్‌లో సోమవారం జరిగిన సమావేశంలో తొలిసారి విదేశాంగ విధానంపై ప్రసంగించారు. బ్రిటన్ చైనా మధ్య స్వర్ణ యుగంగా పిలవబడే సంబంధాలు ముగిశాయని వ్యాఖ్యానించారు. యూకే విలువలు, ఆసక్తులపై చైనా వ్యవస్థాగత సవాలు విసరుతోందని, ఇది మరింత తీవ్రమవుతున్నాయని మండిపడ్డారు. చైనా నిరంకుశ పాలనపట్ల బ్రిటన్ దృక్పథాన్ని అభివృద్ధి పరచాల్సిన సమయమిదని అన్నారు. చైనాలో మానవ హక్కుల అణచివేత జరుగుతోందని విమర్శించారు. ‘సామాజిక రాజకీయ సంస్కరణలకు దారితీస్తుందనే అమాయక ఆలోచనతో పాటు మాజీ ప్రధాని డేవిడ్ కెమెరూన్ కాలంలో స్వర్ణయుగంగా పిలవబడిన సంబంధాలు బ్రిటన్, చైనా మధ్య ముగిశాయని స్పష్టం చేస్తున్నాను. మన విలువలు, ఆసక్తులకు వ్యతిరేకంగా డ్రాగన్ దేశం వ్యవస్థాగత సవాలు విసురుతుందని మేము గుర్తించాం. ఇది తీవ్రతరమవుతూ.. మరింత నిరంకుశత్వం వైపు మళ్లుతోంది’ అని అన్నారు. కోవిడ్ ఆంక్షలకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలను కవర్ చేస్తున్న బీబీసీ జర్నలిస్ట్‌ను చైనా పోలీసులు అరెస్ట్ చేసి దాడి చేసిన ఘటనను ఖండిస్తూ రిషి సునాక్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఆర్థిక స్థిరత్వం, వాతావరణ మార్పు వంటి ప్రపంచ వ్యవహారాల్లో చైనా అందించిన ప్రాముఖ్యతను మరచిపోలేదని రిషి సునాక్ తెలిపారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్‌తోపాటు అనేక ఇతర దేశాలు కూడా దీనిని అర్థం చేసుకున్నాయని అన్నారు. అలాగే ఉక్రెయిన్‌కు గత ప్రధానులు బోరిస్, ట్రస్ అందించిన మద్దతును కొనసాగిస్తామని తెలిపారు. వచ్చే ఏడాది ఉక్రెయిన్‌కు సైనిక, మానవతా సాయాన్ని అందిస్తామని పేర్కొన్నారు. ఇండో-పసిఫిక్ మిత్రదేశాలతో వాణిజ్యం, భద్రతా సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. చదవండి: మంకీపాక్స్ పేరు మార్చిన డబ్ల్యూహెచ్ఓ.. ఇకపై ఇలానే పిలవాలి..! కాగా రిషి సునాక్ చైనాపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదేం తొలిసారి కాదు. ప్రధాని రేసులో ఉన్న సమయంలో కూడా బ్రిటన్‌తోపాటు ప్రపంచ భద్రతకు చైనా అతిపెద్ద ముప్పుగా పరిణమించిందంటూ విమర్శలు గుప్పించారు. అమెరికా నుంచి భారత్ వరకు ఎన్నో దేశాలను చైనా లక్క్ష్యంగా చేసుకుందనడానికి తన దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు. బ్రిటన్ ప్రధానిగా తాను ఎన్నికైతే డ్రాగన్ దేశం నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎన్నో ప్రణాళికలు తన దగ్గర ఉన్నాయన్నారు. చైనా సాంకేతిక దూకుడుకు ముక్కుతాడు వేసేందుకు నాటో మాదిరి సరికొత్త మిలటరీ వ్యవస్థను రూపొందిస్తానని తెలిపారు ‘జీరో కోవిడ్’ పేరుతో చైనా నాయకత్వం అమలు చేస్తున్న కఠిన ఆంక్షలను ఆ దేశ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. చైనాలోని పెద్దపెద్ద నగరాలు, యూనివర్సిటీలలో నిరసనలు చెలరేగుతున్నాయి. షాంఘైలో నిరసనకు దిగిన కొందరు, ‘షీ జిన్‌పింగ్ దిగిపోవాలి’ అంటూ నినాదాలు చేస్తున్నారు. చైనాలో కోవిడ్ ఆంక్షలకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన ప్రదర్శనలను కవర్ చేస్తున్న సమయంలో బీబీసీ జర్నలిస్టు ఒకరిని పోలీసులు అరెస్టు చేసి కస్టడిలో ఆమెపై దాడి చేసినట్లు తెలిసింది. బీబీజీ ప్రతినిధిపై దాడి ఘటన తీవ్రంగా కలవరపరిచిందని యూకే విదేశాంగ కార్యదర్శి జేమ్స్ క్లెవర్లీ అన్నారు. చదవండి: రిషి తోటలో రూ.12 కోట్ల శిల్పం.. వివాదాస్పదంగా ప్రధాని అధికార నివాసం -
Video: కూచిపూడి డ్యాన్స్‌తో అలరించిన రిషి సునాక్ కూతురు
లండన్: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కూతురు అనౌష్క సునాక్ శుక్రవారం లండన్‌లో సంప్రదాయ నృత్యం కూచిపూడి ప్రదర్శన ఇచ్చింది. తొమ్మిదేళ్ల అనౌష్క కొంతకాలంగా కూచిపూడి నేర్చుకుంటోంది. ఈ క్రమంలో రేజ్- ఇంటర్నేషనల్ కూచిపూడి డ్యాన్స్ ఫెస్టివల్ 2022లో భాగంగా పలువురు చిన్నారులతో కలిసి కూచిపూడి నృత్యంలో పాల్గొన్నారు. అనౌష్క చేసిన కూచిపూడి నృత్యం అందరిని ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా యూకేలో జరిగే డ్యాన్స్ ఈవెంట్స్‌లో ఇదే అతిపెద్దది. నాలుగు నుంచి 85 ఏళ్ల వయసున్న దాదాపు వందమంది కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంగీత విద్వంసులు, డ్యాన్సర్స్, వీల్‌చెయిర్ నృత్యకారులు, పోలాండ్లోని నటరంగ్ గ్రూప్‌కు చెందిన అంతర్జాతీయ బర్సరీ విద్యార్థులు ఇందులో పాలుపంచుకున్నారు. ఈ డ్యాన్స్ ఈవెంట్‌కు రిషి సునక్ తల్లిదండ్రులతో పాటు అనౌష్క తల్లి అక్షతా మూర్తి హాజరయ్యారు. Watch: Rishi Sunak's Daughter Performs Kuchipudi At UK Event https://t.co/cTDhegSN9Y pic.twitter.com/IisEz55stc — NDTV (@ndtv) November 26, 2022 కాగా యూకే ప్రధాని పదవిని చేపట్టిన తొలి భారత సంతతికి చెందిన వ్యక్తిగా రిషి సునాక్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. 42 ఏళ్ల రిషి బ్రిటన్ పగ్గాలు చేపట్టిన అత్యంత పిన్న వయస్కుడిగా కూడా అవతరించారు. ప్రధాని రిషి సునాక్‌కు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కృష్ణ, అనౌష్క. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కూతురు అక్షతామూర్తిని రిషి పెళ్లి చేసుకున్నారు. చదవండి: బాక్సర్తో కలిసి మీసాలు తిప్పిన రాహుల్ గాంధీ.. వీడియో వైరల్ -
భారత్‌తో సాధ్యమైనంత త్వరగా ఎఫ్‌టీఏ: రిషి సునాక్
లండన్: భారత్‌తో సాధ్యమైనంత త్వరగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ) కుదుర్చొనేందుకు కృత నిశ్చయంతో ఉన్నామని యునైటెడ్ కింగ్డమ్(యూకే) ప్రధానమంత్రి రిషి సునాక్ చెప్పారు. ఈ ఒప్పందంపై చర్చలను త్వరలోనే విజయవంతంగా ముగించాలని భావిస్తున్నామని తెలిపారు. రిషి సునాక్ తాజాగా యూకే పార్లమెంట్ దిగువ సభలో మాట్లాడారు. ఇండోనేషియాలో జీ–20 సదస్సు సందర్భంగా భారత ప్రధాని మోదీతో జరిగిన భేటీలో ఎఫ్‌టీఏ పురోగతిపై సమీక్షించానని వెల్లడించారు. భారత్‌తో ఒప్పందాన్ని ఎప్పటిలోగా కుదుర్చుకుంటారో చెప్పాలని ప్రతిపక్ష లేబర్ పార్టీతోపాటు అధికార కన్జర్వేటివ్ ఎంపీలు కోరారు. ఒప్పందంపై ప్రధాని మోదీతో ఇప్పటికే మాట్లాడానని, ఈ విషయంలో భారత్–యూకే మధ్య చర్చలకు సాధ్యమైనంత త్వరగా విజయవంతమైన ముగింపు పలకాలన్నదే తమ ఉద్దేశమని వివరించారు. వాస్తవానికి అక్టోబర్ ఆఖరులోనే ఇరు దేశాల చర్చలు ముగింపు దశకు చేరుకున్నాయని తెలిపారు. కొన్ని అంశాలపై సందేహాలను నివృత్తి చేసుకోవాల్సి ఉందని, పరస్పరం సంతృప్తికరమైన పరిష్కారం కనుక్కొంటామన్నారు. భారత్–యూకే బంధం వాణిజ్యానికి పరిమితమైందని కాదని, అంతకంటే విస్తృతమైనదని సునాక్ తేల్చిచెప్పారు. -
అమర్, అక్బర్, ఆంటోనీ సినిమాను తలపిస్తున్న యూకే నేతల మత సామరస్యం
-
Rishi Sunak: రిషి సునాక్ సక్సెస్ సీక్రెట్ ఇదే..
బ్రిటన్ కొత్త ప్రధానిగా భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ ఎన్నికయ్యారు . దీంతో బ్రిటన్ ప్రధానిగా మొట్టమొదటి భారత సంతతి వ్యక్తిగా ఈయన చరిత్ర సృష్టించారు. బ్రిటన్ పార్లమెంట్లో సునాక్‌కు 193 మంది ఎంపీల మద్దతు ఉంది. దేశంలో ఆర్థిక సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ప్రధాని పదవికి లిజ్ ట్రస్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ట్రస్ రాజీనామాతో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్లో టోరీ సభ్యులు ఈసారి రిషి వైపే మొగ్గు చూపారు. ఆయనే తమ దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించగలరని విశ్వసించారు. దీంతో బ్రిటన్ పగ్గాలు చేపట్టే అరుదైన అవకాశం రిషి సునాక్‌ను వరించింది. నెలన్నర రోజుల క్రితం లిజ్‌ట్రస్ చేతిలో ఓటమిపాలైన అదే సునాక్.. నేడు దేశ ప్రధానిగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం.. కుటుంబ నేపథ్యం: రిషి సునాక్ 1980 మే 12న ఇంగ్లాండ్‌లోని సౌథాంప్టన్‌లో జన్మించారు. ఆయన పూర్వీకులు పంజాబ్‌కు చెందిన వారు. వారు తొలుత తూర్పు ఆఫ్రికాకు వలస వెళ్లి.. అక్కడి నుంచి పిల్లలతో సహా యూకేకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. సునాక్ తండ్రి యశ్వీర్ కెన్యాలో.. తల్లి ఉష టాంజానియాలో జన్మించారు. వీరి కుటుంబాలు బ్రిటన్‌కు వలసవెళ్లాక వివాహం చేసుకున్నారు. ఉద్యోగం- వివాహాం : స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీ నుంచి ఎంబీఏ చేసిన రిషి.. తొలుత కొన్ని సంస్థల్లో ఉద్యోగం చేశారు. కాలిఫోర్నియాలో చదువుతున్న రోజుల్లో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అక్షతాతో పరిచయం ప్రేమగా మారి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ► ప్రస్తుతం 42 ఏళ్ల వయసున్న రిషి సునాక్.. బ్రిటన్ ప్రధాని పదవి చేపట్టిన అతిపిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించారు. ► ఈ పదవి చేపట్టిన మొట్టమొదటి భారత సంతతి వ్యక్తిగా, తొలి హిందూ వ్యక్తిగా నిలిచారు. అలాగే.. తొలి శ్వేత జాతీయేతర ప్రధానిగా గుర్తింపు పొందారు. ► చదువుకునే రోజుల్లోనే కన్జర్వేటివ్ పార్టీలో కొంతకాలం ఇంటర్న్‌షిప్ చేశారు. ఆ తర్వాత 2014లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ► 2015లో జరిగిన సాధారణ ఎన్నికల్లో రిచ్మాండ్ నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మరోసారి రిషి విజయం సాధించారు. 2020లో బోరిస్ ప్రధాని బాధ్యతలు చేపట్టాక తన తొలి కేబినెట్లో ఆర్థిక మంత్రిగా రిషిని నియమించారు. ► కరోనా సంక్షోభ సమయంలో వ్యాపారులు, కార్మికుల కోసం వందల కోట్ల పౌండ్ల ప్యాకేజీ తీసుకొచ్చి రిషి మంచి గుర్తింపు పొందారు. ► రిషిపై కొన్ని వివాదాలు కూడా వచ్చాయి. ఆయన భార్య ట్యాక్స్ వివాదం, అమెరికా గ్రీన్ కార్డు, బ్రిటన్ జీవన వ్యయం సంక్షోభం సమయంలో ఆయన కాస్త నెమ్మదిగా స్పందించారనే ఆరోపణలు ఉన్నాయి. ► డౌన్స్ట్రీట్లో సమావేశానికి హాజరై కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా రిషికి జరిమానా విధించారు. -
మనిషినే తాడుగా తిప్పుతూ.. నిమిషంలో 57 సార్లు స్కిప్పింగ్ చేసి రికార్డ్
శరీరాన్ని, మనసును దృఢంగా ఉంచుకునేందుకు చాలామంది చాలా రకాల వ్యాయామాలు చేస్తుంటారు. ఫిట్‌నెస్‌కు తోడ్పడే వ్యాయామాలలో స్కిప్పింగ్ కూడా ఒకటి. రోజువారీగా స్కిప్పింగ్ చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా చూసుకోవచ్చు. అంతేగాక దీనివల్ల శారీరక, మానసిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. తాజాగా కొందరు వ్యక్తులు స్కిప్పింగ్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డునే సృష్టించారు . దీనికి సంబంధించిన వీడియోను గిన్నిస్ రికార్డ్స్ వాళ్లు తమ ట్విటర్లో షేర్ చేశారు. ఇందులో పోటీపడే వాళ్లు రెండు గ్రూప్‌లుగా విడిపోయి టైటిల్ కోసం తలపడ్డారు. అయితే సాధారణ తాడుతో ఆడి కాకుండా వినూత్నంగా రికార్డ్ క్రియేట్ చేశారు. తాడుకు బదులు మనిషిని ఉపయోగిస్తూ స్కిప్పింగ్ చేశారు. మనిషిని పైకి కిందకు తిప్పుతూ కేవలం నిమిషంలో ఏ జట్టు ఎక్కవసార్లు స్కిప్‌లు చేస్తే వారు విజేతలుగా నిలిచినట్లు అవుతుంది. ఇందులో యూకేకు చెందిన అక్రోపోలిస్(బ్లూ డ్రెస్) అనే జట్టు, వైల్డ్ క్యాట్స్ చీర్ టీమ్‌తో తలపడింది. అయితే నిమిషంలో 57 సార్లు స్కిప్‌లు పూర్తి చేసి యూకే టీం గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లక్షల్లో వ్యూస్, వేలల్లో లైక్‌లు, కామెంట్లు వచ్చి చేరుతున్నాయి. అయితే దీనిని చూసిన నెటిజన్లు ఆశ్యర్చం వ్యక్తం చేస్తున్నారు. కొందరు ‘వావ్.. అద్భుతం’ అని కామెంట్ చేస్తుంటే.. మరికొందరు.. ‘ఇది పూర్తయిన తరువాత ఆ అబ్బాయి పాపం వాంతి చేసుకుని ఉంటాడు. బాలుడి తల నేలకు తాకితే ఎంత ప్రమాదం.. దయచేసి ఇలాంటివి అనుకరించవద్దు’ అని సూచిస్తున్నారు. The cheapest skipping rope is a human one... Which team can get in the most skips in one minute? pic.twitter.com/6GJWsj9nAN — Guinness World Records (@GWR) October 21, 2022 -
Liz Truss: యూకే ప్రధాని ట్రస్ రాజీనామా
లండన్: సొంత పార్టీ సభ్యుల నుంచే అసమ్మతి సెగ ఎదుర్కొంటున్న యునైటెడ్ కింగ్డమ్(యూకే) ప్రధానమంత్రి లిజ్ ట్రస్(47) గురువారం పదవికి రాజీనామా చేశారు. ఆర్థికంగా పెను సవాళ్లు ఎదురవ్వడం, మినీ బడ్జెట్‌తో పరిస్థితి మరింత దిగజారడం, రష్యా నుంచి గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో ఖజానాపై విద్యుత్ బిల్లుల భారం పెరిగిపోవడం, ధనవంతులకు పన్ను మినహాయింపుల పట్ల ఆరోపణలు రావడం, డాలర్‌తో పోలిస్తే పౌండు విలువ దారుణంగా పడిపోవడం, వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతినడం వంటి అంశాలు ఆమెపై విపరీతమైన ఒత్తిడిని పెంచాయి. మరోవైపు సొంత పార్టీ ఎంపీలు తనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధపడడంతో రాజీనామాకే ట్రస్ మొగ్గుచూపారు. కన్జర్వేటివ్ నాయకురాలి పదవి నుంచి తప్పుకున్నారు. అనూహ్య రీతిలో కేవలం 45 రోజుల్లో తన భర్తతో కలిసి ‘10 డౌనింగ్ స్ట్రీట్’ నుంచి భారంగా నిష్క్రమించారు. పార్టీ నాయకత్వం తనకు కట్టబెట్టిన బాధ్యతను నెరవేర్చలేకపోయాయని, ఆర్థిక అజెండాను అమలు చేయలేకపోయానని, అందుకే పదవికి రాజీనామా చేశానని చెప్పారు. కొత్త ప్రధానమంత్రి ఎన్నికయ్యే దాకా ప్రధానిగా ట్రస్ కొనసాగుతారు. నూతన ప్రధాని ఎవరన్నది వారం రోజుల్లోగా తేలిపోనుంది. పార్టీ, ప్రజల విశ్వాసం పొందలేక లిజ్ ట్రస్ గత నెల 6వ తేదీన యూకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. మార్గరెట్ థాచర్, థెరెసా మే తర్వాత మూడో మహిళా ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. కానీ, సొంత పార్టీ ఎంపీలతోపాటు యూకే ప్రజల విశ్వాసాన్ని పొందలేకపోయారు. కేవలం 45 రోజులపాటు అధికారంలో కొనసాగారు. యునైటెడ్ కింగ్డమ్ చరిత్రలో అతితక్కువ కాలం అధికారంలో ఉన్న ప్రధానమంత్రిగా మరో రికార్డును లిజ్ ట్రస్ నెలకొల్పారు. తెరపైకి పలువురి పేర్లు లిజ్ ట్రస్ తాజా మాజీ ప్రత్యర్థి, భారత సంతతికి చెందిన అధికార కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ రిషి సునాక్ తదుపరి ప్రధానమంత్రి రేసులో ముందంజలో ఉన్నారు. ఆయనను కొత్త ప్రధానమంత్రిగా ఎన్నుకొనే విషయంలో కన్జర్వేటివ్ పార్టీ అంతరంగం ఏమిటన్నది అంతుచిక్కడం లేదు. పార్టీలోని కొందరు సభ్యులు ఆయన పట్ల విముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికైతే పార్టీలో ఏకాభిప్రాయం లేదని స్పష్టంగా చెప్పొచ్చు. మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ పేరు తెరపైకి వస్తుండడం గమనార్హం. జాన్సన్‌ను మళ్లీ ప్రధానిని చేయాల్సిందేనని ఆయన మద్దతుదారులు గొంతు విప్పుతున్నారు. అలాగే గతంలో ఈ పదవికి పోటీ పడిన పెన్నీ మోర్డాంట్, భారత సంతతికి చెందిన సుయెల్లా బ్రేవర్మన్, రక్షణ శాఖ మంత్రి బెన్ వాలెస్ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. సుయెల్లా బ్రేవర్మన్ దేశ హోం శాఖ మంత్రి పదవికి బుధవారమే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దేశంలో అస్తవ్యస్త ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వాన్ని రద్దు చేసి, తక్షణమే సాధారణ ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్ష లేబర్ పార్టీ డిమాండ్ చేస్తుండడం ఆసక్తికరంగా మారింది. అనిశ్చితికి తెరపడాలంటే ఎన్నికలు నిర్వహించడం ఒక్కటే మార్గమని లేబర్ పార్టీ నేత సర్ కీర్ స్టార్మర్ చెప్పారు. అధికార కన్జర్వేటివ్ పార్టీ గత 12 ఏళ్లుగా వైఫల్యాల బాటలో కొనసాగుతోందని అన్నారు. అవన్నీ ఇప్పుడు తారస్థాయికి చేరాయని ఆక్షేపించారు. జీవించి ఉన్న ఏడుగురు మాజీలు ఆధునిక చరిత్రలో యూకేలో ఏడుగురు మాజీ ప్రధానమంత్రులు జీవించి ఉండడం ఇదే మొదటిసారి. ఒకరకంగా చెప్పాలంటే మాజీ ప్రధానుల జాబితా పెరుగుతోంది. బోరిస్ జాన్సన్, థెరెసా మే, డేవిడ్ కామెరూన్, గోర్డాన్ బ్రౌన్, సర్ టోనీ బ్లెయిర్, సర్ జాన్ మేయర్ సరసన ఇప్పుడు ట్రస్ చేరారు. 45 రోజుల ప్రధానమంత్రి యూకేలో పలువురు ప్రధానమంత్రులు ఏడాది కంటే తక్కువ కాలమే అధికారంలో కొనసాగారు. పదవిలో ఉండగానే మరణించడం లేదా రాజీనామా వంటివి ఇందుకు కారణాలు. తాజాగా 45 రోజుల ప్రధానిగా ట్రస్ రికార్డు సృష్టించారు. బాధ్యత నెరవేర్చలేకపోయా దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతానన్న నమ్మకంతో తనను ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారని, ఆ బాధ్యతను నెరవేర్చడంలో విఫలమయ్యానని లిజ్ ట్రస్ పేర్కొన్నారు. అందుకే పదవి నుంచి తప్పుకుంటున్నానని స్పష్టం చేశారు. గురువారం రాజీనామా అనంతరం ఆమె లండన్‌లోని డౌనింగ్ స్ట్రీట్‌లో మీడియాతో మాట్లాడారు. రాజీనామాకు దారితీసిన కారణాలను వెల్లడించారు. అధికార కన్జర్వేటివ్ పార్టీ నాయకురాలి పదవికి రాజీనామా చేశానంటూ రాజు చార్లెస్‌కు తెలియజేశానని అన్నారు. అస్థిరమైన ఆర్థిక వ్యవస్థ, ప్రతికూల అంతర్జాతీయ పరిస్థితుల నడుమ యునైటెడ్ కింగ్డమ్(యూకే) ప్రధానమంత్రిగా అధికార బాధ్యతలు చేపట్టానని గుర్తుచేశారు. లిజ్ ట్రస్ ఇంకా ఏం చెప్పారంటే.. ‘‘బిల్లులు చెల్లించలేక ప్రజలు, వ్యాపారవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఆదాయాలు లేకపోవడంతో బిల్లులు ఎలా కట్టాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఉక్రెయిన్‌పై రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రారంభించిన చట్టవిరుద్ధమైన యుద్ధం మన భద్రతకు ముప్పుగా మారింది. ఆర్థిక వృద్ధి క్రమంగా పడిపోతోంది. మన దేశం వెనుకంజ వేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇలాంటి తరుణంలో ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టి, దేశాన్ని ముందుకు నడిపిస్తానన్న విశ్వాసంతో కన్జర్వేటివ్ పార్టీ నన్ను ప్రధానమంత్రిగా ఎన్నుకుంది. ఇంధన బిల్లులు, జాతీయ ఇన్సూరెన్స్‌లో కోత వంటి అంశాల్లో కార్యాచరణ ప్రారంభించాం. తక్కువ పన్నులు, ఎక్కువ ఆర్థిక వృద్ధిని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. బ్రెగ్జిట్ వల్ల లభించిన స్వేచ్ఛను వాడుకోవాలన్నదే మన ఉద్దేశం. కానీ, వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకున్నా. పార్టీ నాకు అప్పగించిన బాధ్యతను నెరవేర్చడంలో విఫలమయ్యానని గుర్తించా. రాజు చార్లెస్‌తో మాట్లాడా. కన్జర్వేటివ్ పార్టీ నేత పదవికి రాజీనామా చేశానని తెలియజేశా. ఈ రోజు ఉదయమే ‘1922 కమిటీ’ చైర్మన్ సర్ గ్రాహం బ్రాడీతో సమావేశమయ్యా. వారం రోజుల్లోగా నూతన నాయకుడి (ప్రధానమంత్రి) ఎన్నిక ప్రక్రియను పూర్తిచేయాలని మేము ఒక నిర్ణయానికొచ్చాం. మనం అనుకున్న ప్రణాళికలను సక్రమంగా అమలు చేయడానికి, మన దేశ ఆర్థిక రంగంలో స్థిరత్వాన్ని సాధించడానికి, దేశంలో భద్రత కొనసాగించడానికి నూతన ప్రధానమంత్రి ఎన్నిక దోహదపడుతుందని భావిస్తున్నా. నా వారసుడు(కొత్త ప్రధాని) ఎన్నికయ్యే దాకా పదవిలో కొనసాగుతా’’. చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ కెమెరా ఇదే.. మెగాపిక్సెల్ ఎంతంటే? -
రిషి సునాక్‌ను ప్రధాని చేసేందుకు కుట్ర!
లండన్: యూకే సంక్షోభం నడుమ ప్రధాని పీఠం నుంచి లిజ్ ట్రస్‌ను దించేసి.. రిషి సునాక్‌తో భర్తీ చేయడానికి రెబెల్స్ పన్నాగం పన్నినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మెజార్టీ కన్జర్వేటివ్ పార్టీ రెబల్స్ అభిప్రాయంతో కూడిన ఓ నివేదిక బహిర్గతమైంది. ట్రస్ సారథ్యంలో ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్‌తో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలై గందరగోళానికి దారి తీసింది. ఈ బడ్జెట్‌తో దేశంలో ఆర్థిక మాంద్యం తలెత్తుతుందన్న ఆందోళనలు అధికమయ్యాయి. ఊహించని ఈ పరిణామాలతో ఏకంగా తన మద్దతుదారు, ఆర్థిక మంత్రి అయిన క్వాసీని పదవి నుంచి తప్పించి.. ఆ స్థానంలో జెరెమీ హంట్‌ను కొత్త ఆర్థిక మంత్రిగా నియమించారామె. అయితే.. కన్జర్వేటివ్ పార్టీలో ఈ పరిణామాలేవీ సహించడం లేదు. ప్రత్యేకించి రెబల్స్ మాత్రం లిజ్ ట్రస్‌ను పార్టీ నేతగా తప్పించి.. మాజీ ప్రధాని ప్రత్యర్థి రిషి సునాక్‌ను గద్దె ఎక్కించే యత్నం జరుగుతోందని ది టైమ్స్ YouGov పోల్ వెల్లడించింది. అంతేకాదు కన్జర్వేటివ్‌లో సగం మంది తాము తప్పుడు అభ్యర్థిని ఎన్నుకున్నామనే భావనలోకి చేరుకున్నట్లు ఆ పోల్ సర్వే తెలిపింది. సుమారు 62 శాతం మంది తమది రాంగ్ ఛాయిస్ అయ్యిందనే పశ్చాత్తంలో ఉండిపోయారట. ఇక.. 15 శాతం సభ్యులు మాత్రం తమ నిర్ణయం సరైందే అనే అభిప్రాయం వ్యక్తం చేశారట. అదే సమయంలో రిషి సునాక్‌తో పాటు ప్రత్యామ్నాయ అభ్యర్థుల పరిశీలన సైతం టోరీ సభ్యులు ప్రారంభించారని.. అందులో ప్రధాని అభ్యర్థి రేసులో మూడో స్థానంలో నిలిచిన పెన్నీ మోర్డాంట్ సైతం ఉన్నారని ఆ పోల్ వెల్లడించింది. అయితే యూకే చట్టాల ప్రకారం టెక్నికల్‌గా లిజ్ ట్రస్‌కి ఏడాదిపాటు పదవి గండం ఎదురు కాదు. ఒకవేళ 1922 బ్యాక్‌బెంచ్ ఎంపీల కమిటీ తన రూల్స్ మారిస్తే గనుక ట్రస్‌కు సవాల్ ఎదురుకావొచ్చు. అప్పుడు కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల మద్దతుతో రిషి సునాక్, పెన్నీ మోర్డాంట్‌లు ప్రధాని, ఉపప్రధాని పదవులను అందుకోవచ్చు. ఇదికాగా.. నేరుగా పెన్నీ మోర్డాంట్ ప్రధాని అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ, ఇదంతా సులభమైన విషయమేమీ కాదని మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ మద్దతుదారు, ఎంపీ నాడైన్ డోరీస్ చెప్తున్నారు. అదే సమయంలో అధికార మార్పు అనుకున్నంత ఈజీనే అంటూ కన్జర్వేటివ్ సీనియర్ సభ్యులు ఒకరు చేసిన వ్యాఖ్యల్ని ది టైమ్స్ కథనం ఉటంకించింది. ఇదీ చదవండి: ఉక్రెయిన్‌తో యుద్ధంపై పుతిన్ కీలక ప్రకటన -
శరీరాన్ని స్ప్రింగులా వంచేసి.. రికార్డులు కొట్టేసి..
పై ఫొటోలో అమ్మాయిని చూశారా? స్ప్రింగ్‌లు మింగినట్లుగా వెన్నును మెలి తిప్పింది కదా! అందుకే...ప్రపంచంలోనే అత్యంత ఫ్లెక్సిబుల్ గాళ్‌గా రికార్డు సృష్టించింది. యూకేలోని పీటర్‌బరోకు చెందిన 14 ఏళ్ల లిబర్టీ బారోస్.. జిమ్నాస్ట్. 30 సెకన్లలో ఛాతీని ఫ్లోర్ వరకు పదకొండుసార్లు వంచేసి గిన్నిస్ రికార్డు నెలకొల్పింది. తనకు మాత్రమే సొంతమైన ఈ బెండ్కు ‘ద లిబర్టీ లోడౌన్’అని పేరు కూడా పెట్టింది. 2017లో ఓసారి.. రిహన్నా అంబ్రెల్లా డ్యాన్స్ మూవ్స్ ప్రాక్టీస్ చేస్తుండగా తన శరీరాన్ని ఎలాగైనా వంచగలనని తెలుసుకున్న లిబర్టీ.. అప్పటినుంచి తన శరీరాన్ని స్ప్రింగ్‌లా తిప్పేస్తూ బోలెడు క్రేజ్ సంపాదించుకుంది. -
అదృష్టం అంటే ఇది.. కిచెన్‌లో బంగారు నాణేలు.. ఊహించని ధరతో షాక్!
అదృష్టం ఆవగింజంత, దురదృష్టం దబ్బకాయంత అనే సామెత తెలిసే ఉంటుంది. అయితే, యూకేలోని ఓ కుటుంబానికి మాత్రం అది వర్తించలేదు. వారికి అదృష్టం కూడా దబ్బకాయంత పట్టుకుంది. పదేళ్లుగా నివాసం ఉంటున్న తమ ఇంటిలో భారీ ఎత్తున బంగారు నాణేలు లభించిన వార్త సెప్టెంబరు నెలలో చదివే ఉంటారు! తాజాగా ఆ వార్త తాలూకు మరో విషయం వైరల్‌గా మారింది. ఇంటి వంటగదిలో మరమ్మతులు చేస్తుండగా క్రీ.శ.1700 ప్రారంభ కాలానికి చెందిన 254 గోల్డ్ కాయిన్స్ బయల్పడిన సంగతి తెలిసిందే. అయితే, వాటిని అమ్మితే సుమారు రూ.2.3 కోట్లు (2,50,000 యూకే పౌండ్లు) రావొచ్చని అంచనావేశారు. కానీ, ఆ అంచనా తప్పయింది. అంతకు మూడింతలు అంటే సుమారు రూ.7 కోట్లు ఆ సంపద ధర పలికిందని లండన్‌కు చెందిన వేలం సంస్థ స్పింక్ అండ్ సన్ ప్రతినిధి గ్రెగరీ ఎడ్మండ్ తెలిపారు. ఫెర్న్లీ-మాయిస్టర్స్ కాలానికి చెందిన నాణేలు కావడంతో అంత విలువ చేకూరిందని తెలిపారు. 292 ఏళ్ల పూర్వ కాలానికి చెందిన ఈ సంపదను చేజిక్కిచ్చుకునేందుకు ప్రపంచంలోని చాలామంది ఔత్సాహికులు పోటీ పడ్డారని ఆయన వెల్లడించారు. ముందుగా అనుకున్నదానికంటే మూడు రెట్లు అధికంగా ధర రావడం ఇంతకుముందెప్పుడూ చూడలేదని అన్నారు. కాగా, పాతకాలానికి చెందిన ఆ బంగారు సంపదను చిన్న మొత్తాల్లో విక్రయించారని మెట్రో నివేదిక పేర్కొంది. (చదవండి: ఆస్కార్ లెవల్ యాక్టింగ్.. బోనులోని పులిని అడవిలోకి తెచ్చేసరికి!) -
యూకేలో హిందూ ఆలయాలపై వరుస దాడులు
-
మందేయడంలో గిన్నిస్ రికార్డ్.. 17 గంటల్లో 56 పబ్‌లకు.. 30 లీటర్లు తాగడంతో
ఇంగ్లండ్‌లోని బ్రైటన్‌కు చెందిన నాదన్ క్రింప్ అనే 22 ఏళ్ల యువకుడు మందేయడంలో సరికొత్త గిన్నిస్ సృష్టించాడు! మందుకొట్టడం కూడా రికార్డేనా అని చులకనగా భావించకండి. ఎందుకంటే.. అతను సాధించింది అలాంటి, ఇలాంటి రికార్డు కాదు మరి... కేవలం 17 గంటల వ్యవధిలోనే ఏకంగా 67 పబ్‌లకు వెళ్లి అతను ‘పానీయం’ పుచ్చుకున్నాడు. తద్వారా 24 గంటల వ్యవధిలో అత్యధిక పబ్‌లను సందర్శించిన వ్యక్తిగా గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించాడు. ఈ ఏడాది మొదట్లో ఇంగ్లాండ్‌కే చెందిన గ్యారెత్ మర్ఫీ అనే యువకుడు 17 గంటల్లో 56 పబ్‌లను సందర్శించి నెలకొల్పిన రికార్డును క్రింప్ బద్దలుకొట్టాడు. గిన్నిస్ నిర్వాహకుల నిబంధనల ప్రకారం సందర్శించే ప్రతి పబ్‌లోనూ మద్యమే సేవించాల్సిన అవసరం లేనప్పటికీ క్రింప్ మాత్రం ఒక పబ్‌లో మద్యం, మరో పబ్‌లో పానీయం సేవిస్తూ ముందుకెళ్లాడు. అయితే ఈ తతంగమేదీ ఆషామాషీగా జరగలేదని అతను చెప్పుకొచ్చాడు. చదవండి: హడలెత్తించిన కుక్క.. ఆవుపై దాడి.. అమాంతం నోటితో కరిచి పట్టుకొని.. ముందుగా తమ ప్రాంతంలో ఉన్న పబ్‌లను జీపీఎస్ పరికరం ద్వారా మార్కింగ్ చేసుకొని తన ప్రయాణం మొదలుపెట్టాడట. తాను పబ్‌లను సందర్శించి మద్యం లేదా పానీయం తాగినట్లు ప్రతి పబ్ నుంచి రశీదులు, సాక్షి సంతకాలు కూడా సేకరించాడట. ఈ విషయంలో అతనికి ముగ్గురు స్నేహితులు సహకరించారు. తన పానీయాల జాబితాలో బీర్, ‘బేబీ గిన్నిస్’ షాట్స్, టకీలా, లేగర్ మొదలైనవి ఉన్నట్లు క్రింప్ తెలిపాడు. ఇలా రోజంతా సుమారు 30 లీటర్ల మేర ‘పానీయాలు’ సేవించడం వల్ల తాను ఎక్కువసార్లు బాత్రూంకు వెళ్లాల్సి వచ్చిందని... 17 గంటల సమయంలో దీనికే ఎక్కువ సమయం పోయిందని చెప్పుకొచ్చాడు. అయితే ఎందుకోసం ఇదంతా చేశావంటే.. కేన్సర్‌తో మృతిచెందిన తన కుక్క జ్ఞాపకార్థంతోపాటు శునకాల ట్రస్టుకు నిధుల సమీకరణకు ఈ మార్గం ఎంచుకున్నట్లు క్రింప్ వివరించాడు. -
ప్రాణాలు కాపాడిన స్మార్ట్‌వాచ్
స్మార్ట్ వాచ్... ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడింది. వాచ్ ప్రాణాలు కాపాడమేంటి? అదెలా సాధ్యమైందని ఆశ్చర్యపోతున్నారా? అదెలా జరిగిందంటే... యూకేకు చెందిన 54 ఏళ్ల డేవిడ్‌కు ఇటీవల పుట్టినరోజు సందర్భంగా అతని భార్య సారా, యాపిల్ స్మార్ట్ వాచ్ గిఫ్ట్‌గా ఇచ్చింది. అది మణికట్టుకు పెట్టుకోగానే.. పల్స్రేట్ 30గా చూపించింది. సాధారణంగా ఆ వయసులో ఉన్న పురుషుల హృదయ స్పందనలు నిమిషానికి 100 చొప్పున ఉండాలి. కానీ డేవిడ్‌కు 30 మాత్రమే నమోదవుతుండటంతో వాచ్ సరిగ్గా పనిచేయట్లేదేమోనని డేవిడ్ అనుకున్నాడు. కానీ అతని భార్య పదేపదే వెంటపడటంతో హాస్పిటల్‌కు వెళ్లాడు. ఎమ్ఆర్ఐ స్కాన్ చేయిస్తే... అతను కార్డియాక్ అరెస్టుతో మృతి చెందే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరించారు. హార్ట్ బ్లాక్ వల్ల గుండెలోని ‘జంక్షన్ బాక్స్’ పనిచేయడం ఆగిపోతోందన్నారు. అలా 48 గంటల్లో 138 సార్లు పదేసి సెకన్లపాటు అతని గుండె పనిచేయడం మానేసింది. డేవిడ్ నిద్రిస్తున్న సమయంలో ఇలా జరిగిందట. అంతేకాదు.. అది ఆగిపోయినప్పుడు అతని గుండెలోని మరో భాగం రక్త ప్రవాహాన్ని కిక్ స్టార్ట్ చేసిందన్నమాట. గుండె సంబంధిత జబ్బు లక్షణాలు కనిపించకపోవడం, అతను ఆరోగ్యంగా ఉండటం చూసి డాక్టర్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చివరకు సర్జరీతో గుండెలోని బ్లాక్స్‌ను తొలగించారు. అలాగే భవిష్యత్తులో అతని హృదయ స్పందనల్లో ఏమైనా తేడాలు సంభవిస్తే ముందుగానే పసిగట్టేందుకు.. గుండె కవాటాలు సమన్వయంతో పనిచేసేలా చేసేందుకు వీలుగా గుండెలో ఒక ‘పేస్‌మేకర్’ పరికరాన్ని సైతం అమర్చారు. దీంతో ఇప్పుడు అతని గుండె పనితీరు మెరుగుపడింది. ‘నా భార్య నాకు స్మార్ట్‌వాచ్‌ను బహుమతిగా ఇచ్చి ఉండకపోతే నా సమస్య బయటపడేది కాదు... నేను బతికి ఉండేవాడిని కాదు. నేను ఎప్పటికీ ఆమెకు రుణపడి ఉంటాను. ఒక్క చార్జింగ్ సమయంలో తప్ప వాచ్ ఎప్పుడూ నా చేతికే ఉంటుంది’ అని డేవిడ్ చెబుతున్నాడు. -
రాజుగా ఛార్లెస్-3.. పట్టాభిషేకానికి ఆలస్యం ఎందుకంటే..
లండన్: క్వీన్ ఎలిజబెత్-2 మరణంతో.. ఆమె తనయుడు ఛార్లెస్-3 అధికారికంగా యునైటెడ్ కింగ్డమ్కు రాజు అయ్యారు. శనివారం.. ప్రవేశ మండలిAccession Council అధికారికంగా ఆయన పేరును ప్రకటించింది. బ్రిటన్ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా.. ఈ ప్రకటన కార్యక్రమాన్ని టెలివిజన్ ప్రసారం చేసింది కౌన్సిల్. సాధారణంగా.. సింహాసనంపై ఉన్నవాళ్లు మరణిస్తే.. వారసులే ఆటోమేటిక్‌గా తదుపరి బాధ్యతలు స్వీకరిస్తారు. అంతర్గతంగా ఆ కార్యక్రమం ఉంటుంది. కానీ, బ్రిటన్ రాజరికంలో తొలిసారి ఇలా టీవీ టెలికాస్టింగ్ ద్వారా ప్రకటించడం విశేషం. భారత కాలమానం ప్రకారం.. శనివారం మధ్యాహ్నాం సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో ఈ కార్యక్రమం జరిగింది. 73 ఏళ్ల ఛార్లెస్ అధికారికంగా బాధ్యతలు చేపడుతూ.. ‘అనితరమైన సార్వభౌమాధికారానికి సంబంధించిన బాధ్యతలు తనకు తెలుస’ని ప్రమాణం చేశారు. ► వందల కొద్దీ ప్రైవేట్ కౌన్సిలర్లు.. అందులో బ్రిటన్ తాజా ప్రధాని లిజ్ ట్రస్, క్వీన్ ఎలిజబెత్-2 వారసులు, ఛార్లెస్ భార్య క్యామిల్లా, పెద్ద కొడుకు..తదుపరి వారసుడు విలియమ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా ఛార్లెస్ లేని ప్రత్యేక ఛాంబర్లో ఆయన్ని అధికారికంగా రాజుగా ప్రకటించింది యాక్సెషన్ కౌన్సిల్. ► అనంతరం.. ఆయన సమక్షంలోనే మరోసారి ‘ప్రిన్స్ ఛార్లెస్ ఫిలిప్ ఆర్థర్ జార్జ్’ ఇకపై యూకేకు సార్వభౌమాధికారి.. రాజు అంటూ ప్రకటించింది. ఆ వెంటనే ఆయన ప్రమాణం చేసి.. రాజపత్రాలపై సంతకం చేశారు. ఇక లోపలి కార్యక్రమం పూర్తికాగానే.. మధ్యాహ్నం 3గం.30ని. ప్రాంతంలో ట్రంపెట్ ఊది ఛార్లెస్-3ను అధికారికంగా బాహ్యప్రపంచానికి రాజుగా ప్రకటించింది మండలి. అయితే.. ► బ్రిటన్ రాజుగా ఛార్లెస్-3ని ప్రకటించినప్పటికీ ఇంకా ఒకటి బ్యాలెన్స్ ఉంది. అదే మహారాజుగా ఆయనకు జరగాల్సిన పట్టాభిషేకం. తల్లి మరణించిన వెంటనే ప్రిన్స్ ఆఫ్ వేల్స్ అయిన ఛార్లెస్.. రాజు హోదా దక్కించుకున్నారు. అయితే.. క్వీన్ ఎలిజబెత్-2 మరణంతో సంతాప సమయం ముగిశాకే.. ఆయనకు అంగరంగ వైభవంగా పట్టాభిషేకం నిర్వహిస్తారు. ► బ్రిటన్ రాజరికాన్ని గమనిస్తే ఇంతకు ముందు.. 1952 ఫిబ్రవరి 6వ తేదీన జార్జ్-6 మరణించారు. ఆ సమయంలో వారసురాలు ప్రిన్స్ ఎలిజబెత్-2 రాణిగా ప్రకటించబడ్డారు. అయితే.. క్వీన్ ఎలిజబెత్-2 పట్టాభిషేకం మాత్రం 1953, జూన్ 2న జరిగింది. అయితే ఆమె భర్త ఫిలిప్.. ఆ తర్వాతి కాలంలోనూ ప్రిన్స్‌గానే కొనసాగారు. ► ఇవాళ జరిగిన.. ప్రవేశ వేడుక(ceremony of Accession), తర్వాత జరగబోయే పట్టాభిషేక వేడుక(ceremony of Coronation) మధ్య తేడా ఏంటంటే.. ప్రవేశ వేడుకలో కేవలం అధికారిక ప్రకటన, ప్రమాణం ఉంటుంది. కానీ, పట్టాభిషేకం అనేది కాంటర్బరీ ఆర్చ్‌బిషప్ నిర్వహించిన మతపరమైన వేడుక. లండన్‌లోని వెస్ట్మిన్స్టర్ అబ్బేలో గత 900 సంవత్సరాలుగా పట్టాభిషేక సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. ► సింహాసనంపై ఉన్నవాళ్లు మరణించాక.. తదనంతర రాజు/రాణికు వైభవంగా పట్టాభిషేకం నిర్వహించేందుకే అంత గ్యాప్ తీసుకుంటారు. ► పట్టాభిషేక సమయంలో సదరు వ్యక్తి రాజు/రాణి.. చట్టం ప్రకారం పాలించడం, దయతో న్యాయం చేయడం, చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్‌ను నిర్వహించడం లాంటి ప్రమాణాలు చేస్తారు. ► అనంతరం ఆర్చ్‌బిషప్ సమక్షంలో.. కింగ్ ఎడ్వర్డ్ సింహానం మీద అధిరోహిస్తారు. ఆపై సెయింట్ ఎడ్వర్డ్ కిరీటాన్ని రాజు/రాణి తలపై ఉంచుతారు ఆర్చిబిషప్. భర్త ప్రిన్స్ ఫిలిప్‌తో క్వీన్ ఎలిజబెత్-2 ► 1626 నుంచి బ్రిటన్ సింహాసనం విషయంలో ఈ కార్యక్రమం జరుగుతూ వస్తోంది. ► బ్రిటన్ పట్టాభిషేక కార్యక్రమానికి.. రాజరిక వంశస్థులతో పాటు చట్ట సభ్యులు, చర్చ్ సభ్యులు, కామన్వెల్త్ దేశాలకు చెందిన ప్రధానులు.. ప్రతినిధులు, ఇతర దేశాలకు చెందిన ప్రతినిధులూ హాజరవుతారు. -
ఎలిజబెత్-2 వివాహానికి ఖరీదైన డైమండ్ నెక్లెస్‌ను గిఫ్గ్‌గా ఇచ్చిన నిజాం నవాబు
క్వీన్ ఎలిజబెత్2.. పేరుకు తగ్గట్టే జీవితాంతం మహారాణిలా బతికారు. 75 ఏళ్లపాటు బ్రిటన్ రాణిగా ఉన్న ఎలిజబెత్.. సుదీర్ఘకాలం ఆ హోదాలో కొనసాగిన వ్యక్తిగా రికార్డ్ సృష్టించారు. కొంత కాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. స్కాట్లాండ్లోని బాల్మోరల్ కోటలో తుది శ్వాస విడిచారు. క్వీన్ ఎలిజబెత్‌కు భారత్‌తో ఎంతో అనుబంధం ఉంది. భారత్‌ను 200 ఏళ్లపాటు పాలించిన బ్రిటిషర్లు.. దేశానికి స్వాతంత్య్రాన్ని ప్రకటించిన అయిదేళ్ల తర్వాత క్వీన్ ఎలిజబెత్ మహారాణిగా ఎంపికయ్యారు. 1952లో బ్రిటన్ సింహాసనాన్ని అధిరోహించారు. రాణి అయ్యాక ఆమె మూడుసార్లు భారత్‌ను సందర్శించారు. 1961లో తొలిసారి భారత్‌ను సందర్శించగా.. 1983, 1997లోనూ క్వీన్ ఎలిజబెత్ భారత్‌లో పర్యటించారు. క్విన్ ఎలిజబెత్ వివాహానికి హైదరాబాద్ నిజాం నవాబు తన హోదాకు తగ్గట్టు అత్యంత విలువైన బహుమతిని ఇచ్చారు. 1947లో క్వీన్ ఎలిజబెత్ వివాహం జరగగా.. 300 వజ్రాలు పొదిగిన ఐకానిక్ ప్లాటినమ్ నెక్లెస్ సెట్‌ను అప్పటి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ యువరాణిగా గిఫ్ట్‌గా ఇచ్చాడు. ప్రిన్సెస్ ఎలిజబెత్ తన వివాహ కానుకను స్వయంగా ఎంచుకోవాలని నిజాం లండన్‌కు చెందిన ప్రఖ్యాత ఆభరణాల తయారీ సంస్థ కార్టియర్ ప్రతినిధులను ఆమె వద్దకు పంపించాడు. దీంతో ఆమె తనకెంతగానో నచ్చిన ప్లాటినం నక్లెస్‌ను ఎంపిక చేసుకున్నారని రాయల్ ఫ్యామిలీ స్వయంగా వెల్లడించింది. చదవండి: King Charles: బ్రిటన్ రాజుకు గల అసాధారణ ప్రత్యేకతలు ఇవే View this post on Instagram A post shared by The Royal Family (@theroyalfamily) తన 70 ఏళ్ల పాలనలో ఎంతో మంది నుంచి ఎన్నో విలువైన వస్తువులను, అభరణాలను కానుకగా స్వీకరించినప్పటికీ.. ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్ ‘కార్టియర్’ తయారు చేసిన 300 వజ్రాలతో పొదిగిన ప్లాటినం నెక్లెస్ సెట్ బ్రిటన్ రాయల్ ఫ్యామిలీ దగ్గరున్న అత్యంత ప్రసిద్ధ ఆభరణాలలో ఒకటి. ఎంతో ఇష్టంగా తీసుకున్న ఈ నెక్లెస్‌ను క్వీన్ ఎలిజబెత్ తరచుగా ధరించేవారు. ప్రస్తుతం దీని విలువ 66 మిలియన్ పౌండ్లకు పైగా ఉంటుందని అంచనా. రాణి నెక్లెస్ ధరించి దగిన ఫోటోలను ది రాయల్ ఫ్యామిలీ అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో జూలై 21న పోస్ట్ చేశారు. ఇందులో క్వీన్ ఎలిజబెత్ 1952 ఫిబ్రవరిలో బ్రిటన్ రాణి హోదా స్వీకరించిన కొద్ది రోజుల తర్వాత తీసిన ఫోటో ఉంది. ఈ నెక్లెస్‌ను ఎలిజబెత్ తన మనవడి భార్యకు అప్పుగా కూడా ఇచ్చారు. ఆమె దానిని 2014లో నేషనల్ పోర్ట్రెయిట్ గ్యాలరీలో, 2019లో డిప్లొమాటిక్ కార్ప్స్ రిసెప్షన్లో ధరించింది. -
King Charles: బ్రిటన్ రాజుకు గల అసాధారణ ప్రత్యేకతలు ఇవే
లండన్: బ్రిటన్ను సుధీర్ఘకాలం పాలించిన మహారాణి రెండవ ఎలిజబెత్ కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఎలిజబెత్ గురువారం మధ్యాహ్నం స్కాట్లాండ్లోని బల్మోరల్ కోటలో తుదిశ్వాస విడిచారు. 25 ఏళ్లకే బ్రిటన్ రాణి కిరీటం అందుకున్న ఎలిజబెత్ 70 ఏళ్లకు పైగా ఆ హోదాలో కొనసాగారు. ఇక ఎలిజబెత్ మరణంతో ఆమె కుమారుడు ప్రిన్స్ చార్లెస్ బ్రిటన్ రాజుగా అవతరించనున్నారు. చార్లెస్‌కు అధికారికంగా పట్టాభిషేకం చేసేందుకు కొన్ని నెలలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. బ్రిటన్ రాజకుటుంబ నిబంధనల ప్రకారం... రాజు లేదా రాణి మరణిస్తే వారి వారసుడు/వారసురాలిగా మొదటి వరుసలో ఉన్నవారు తక్షణమే బ్రిటన్ రాజు/రాణిగా మారిపోతారు. రాణి ఎలిజబెత్-2 మరణంతో ఆమె పెద్ద కుమారుడు చార్లెస్ (73) బ్రిటన్‌కు కొత్త రాజు కానున్నారు. చార్లెస్ 1948 నవంబరు 14న బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో జన్మించారు. ఎలిజబెత్ నలుగురు సంతానంలో చార్లెస్ పెద్దవారు. 1981లో డయానాను వివాహమాడిన చార్లెస్ దంపతులకు ఇద్దరు కుమారులు.. ప్రిన్స్ విలియమ్, ప్రిన్స్ హ్యారీ. వ్యక్తిగత కారణాలతో చార్లెస్ డయానా దంపతులు 1992లో విడిపోయారు. అనంతరం 2005లో 56 ఏళ్ల వయసులో చార్లెస్.. కెమెల్లా పార్కర్‌ను రెండో వివాహం చేసుకున్నారు. మాజీ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ అయిన చార్లెస్.. కింగ్ చార్లెస్-3గా వ్యవహరించనున్నారు. అలాగే 14 కామన్వెల్త్ దేశాలకూ రాజుగా కూడా ఉంటారు. బ్రిటన్ కొత్త రాజుకు గల అసాధారణ ప్రత్యేకతలు పాస్‌పోర్టు లేకుండా విహారం బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్-III పాస్‌పోర్టు లేకుండా ఎక్కడికైనా వెళ్లగలరు. లైసెన్స్ లేకుండా ప్రయాణించగలరు. రాజకుటుంబంలోని ఇతర సభ్యుల మాదిరి ఆయనకి పాస్‌పోర్టు అవసరం లేదు. బ్రిటన్ రాజు ఎక్కడా, ఎలాంటి అవాంతరాలు లేకుండా స్వేచ్ఛగా ప్రయణించగలడు. వారికి అవసరమైన సహాయాన్ని, రక్షణ అందిస్తూ బ్రిటన్ రాజు పేరు మీద ప్రత్యేక డాక్యుమెంట్ జారీ చేస్తారు. ఈ కారణంతో బ్రిటన్‌లో ఎక్కడైనా లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయగల ఏకైక వ్యక్తి రాజు మాత్రమే. రెండు పుట్టినరోజులు చార్లెస్ తల్లి, క్వీన్ ఎలిజబెత్-2 రెండు పుట్టినరోజులు జరుపుకుంటారు. ఆమె అసలు పుట్టిన రోజుఏప్రిల్ 21. దీనిని ప్రైవేట్‌గా జరుపుకుంటారు. అయితే వేసవి వాతావరణం అవుట్డోర్ పరేడ్స్(బహిరంగ కవాతులకు) అనుకూలంగా ఉంటుందని జూన్ నెలలోని రెండో మంగళవారాన్ని రాణి అధికారిక బహిరంగ వేడుకగా నిర్వహిస్తారు. ఇక చార్లెస్ పుట్టినరోజు కూడా శీతాకాలం ప్రారంభమయ్యే నవంబర్ 14న ఉండటంతో అతని బర్త్‌డేను కూడా వేసవి నెలలో 2అధికారిక పుట్టినరోజు’గా జరిపే అవకాశం ఉంది. ఈ బహిరంగ వేడుకల్లో 1,400 కంటే ఎక్కువ మంది సైనికులు, 200 గుర్రాలు, 400 మంది సంగీతకారులు పాల్గొంటారు. సెంట్రల్ లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్ బాల్కనీ నుంచి రాజ కుటుంబ సభ్యులు చూస్తుండగా రాయల్ ఎయిర్ ఫోర్స్ ఫ్లై-పాస్ట్‌తో ఈ వేడుక కార్యక్రమాలను ముగిస్తుంది. నో ఓటింగ్ బ్రిటిష్ చక్రవర్తి ఎప్పుడు ఓటింగ్‌లో పాల్గొనరు. అలాగే ఎన్నికల్లో పోటీచేయరు. దేశాధినేతగా, అతను రాజకీయ వ్యవహారాల్లో ఖచ్చితంగా తటస్థంగా వ్యవహరించాల్సి ఉంటుంది. వీరు పార్లమెంటరీ సమావేశాలను లాంఛనంగా ప్రారంభిస్తారు. పార్లమెంటు నుంచి వచ్చే చట్టాలకు ఆమోదముద్ర వేస్తారు. అదే విధంగా ప్రధానమంత్రితో వారానికోసారి సమావేశాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రజలకే కాదు బ్రిటీష్ చక్రవర్తి ప్రజలను మాత్రమే పరిపాలించరు. 12వ శతాబ్దం నుంచి ఇంగ్లాండ్, వేల్స్ అంతటా బహిరంగ జలాల్లోని మూగ హంసలు చక్రవర్తి ఆస్తిగా పరిగణించబడుతున్నాయి. వీటితోపాటు బ్రిటీష్ జలాల్లోని స్టర్జన్(ఒక రకం చేప), డాల్ఫిన్లు, తిమింగలాలకు కూడా రాయల్ ప్రత్యేకాధికారం వర్తిస్తుంది. అధికారిక రచయిత బ్రిటన్ చక్రవర్తి కోసం పద్యాలను రచించేందుకు ప్రతి 10 సంవత్సరాలకు ఆస్థాన కవిని నియమిస్తారు. ఈ సంప్రదాయం 17వ శతాబ్దం నుంచి వస్తోంది. 2009లో కరోల్ ఆన్ డఫీ రచయితగా నామినేట్ అయిన మొదటి మహిళగా నిలిచారు. ఆమె 2011లో ప్రిన్స్ విలియం వివాహం, 2013లో క్వీన్ ఎలిజబెత్ II పట్టాభిషేక 60వ వార్షికోత్సవం, 2018లో ప్రిన్స్ హ్యారీ వివాహం కోసం పద్యాలను కంపోజ్ చేశారు. రాయల్ వారెంట్ చక్రవర్తికి వస్తువులు సరఫరా చేసే., సేవలను అందించే కంపెనీలకు రాయల్ వారెంట్ జారీ చేస్తారు. ఈ వారెంట్ వారికి గొప్ప గౌరవాన్ని అందించడమే కాకుండా అమ్మకాల ప్రోత్సాహనికి ఉపయోగపడుతుంది. వారెంట్ పొందిన కంపెనీలు తమ వస్తువులపై రాజ ఆయుధాలను ఉపయోగించేందుకు అధికారం కలిగి ఉంటాయి. బర్బెర్రీ, క్యాడ్బరీ, జాగ్వార్ కార్స్, ల్యాండ్ రోవర్, శాంసంగ్, వెయిట్రోస్ సూపర్ మార్కెట్లు రాయల్ వారెంట్ ఉన్న కంపెనీలలో ఉన్నాయి. -సాక్షి, వెబ్‌డెస్క్ -
క్వీన్ ఎలిజబెత్-2 ప్రస్థానంలో కీలక ఘట్టాలివే!
ఒక్కవైపు ప్రజాస్వామ్యం ఉన్నా.. బ్రిటిష్ రాజరిక పాలన కిందే కొనసాగుతూ వస్తోంది. అందునా బ్రిటన్ చరిత్రలో అత్యంత సుదీర్ఘ కాలంగా రాణిగా కొనసాగారు ఎలిజబెత్-II. బ్రిటన్ రాణిగా ఆమె పాతికేళ్ల వయసు(1952) నుంచి ఆ హోదాలో ఉన్నారు. తాజాగా.. ఆరోగ్యం విషమించిన పరిస్థితుల్లో చికిత్స పొందుతూ గురువారం రాత్రి కన్నుమూశారు. ఆమె రాణి ప్రస్థానం గమనిస్తే.. కీలక పరిణామాలకు మౌనసాక్షి 70 ఏళ్లకు పైగా పాలనా కాలంలో ఎలిజబెత్–2 రాణి ప్రపంచంలో యునైటెడ్ కింగ్డమ్ ప్రాభవం వేగంగా క్షీణించడం, ప్రపంచాన్ని ఒంటిచేత్తో పాలించిన బ్రిటన్ ఒక చిన్న ద్వీపదేశంగా మిగిలిపోవడం, ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో బ్రిటిష్ పాలన అంతం కావడం వంటి ముఖ్యమైన పరిణామాలను మౌనంగా వీక్షించారు. బ్రిటిష్ ఛత్రఛాయ కింద ఉన్న దేశాల్లో స్వతంత్ర దేశాలుగా అవతరించాయి. గణతంత్ర రాజ్యాలుగా మారాయి. కొన్ని సందర్భాల్లో రాజకుటుంబంలో చోటుచేసుకున్న పరిణామాలు ఎలిజబెత్ రాణికి ఇబ్బందికరంగా పరిణమించాయి. విమర్శలకు తావిచ్చాయి. ఆమె నలుగురి సంతానంలో ముగ్గురి వివాహాలు విచ్ఛిన్నమయ్యాయి. కోడలు డయానా విషయంలో నిర్దయగా ప్రవర్తించి, ఆమె మరణానికి కారణమయ్యారంటూ ఎలిజబెత్‌పై ప్రసార మాధ్యమాలు సంస్థలు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాయి. అయినప్పటికీ ఆమె ప్రతిష్ట దెబ్బతినలేదు. ఆటుపోట్ల సమయంలో బ్రిటన్ ప్రజలు మద్దతుగా నిలిచారు. ఎలిజబెత్–2 హయాంలో బ్రిటన్‌కు 15 మంది ప్రధానమంత్రులు సేవలందించారు. ఎలిజబెత్ కుమారుడు చార్లెస్‌ను బ్రిటన్ రాజుగా ప్రకటించే అవకాశం ఉంది. అదే జరిగితే ఆయన కింగ్ చార్లెస్–3గా పదవిలో కొనసాగుతారు. నిరాడంబర జీవితం క్వీన్ ఎలిజబెత్ నిరాడంబరంగా ఉండేందుకే ఇష్టపడేవారు. అధికారిక విధులు, కార్యక్రమాల్లోనూ హంగు ఆర్భాటాలకు దూరంగా ఉండేవారు. ప్రభుత్వ పరిపాలనా, ప్రజల బాగోగులపై ఎక్కువగా దృష్టి పెట్టేవారు. గుర్రాల పరుగు పందేలంటే రాణికి ఆసక్తి ఎక్కువ. రేసు గుర్రాలను పోషించేవారు. తరచుగా రేసులకు హాజరయ్యేవారు. ఆమె స్వయంగా మంచి రౌతు కూడా కావడం గమనార్హం. క్వీన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఆస్తులున్నాయి. ప్రపంచంలోని అత్యంత ధనిక మహిళల్లో ఆమె ఒకరిగా గుర్తింపు పొందారు. ► ఎలిజబెత్-2.. ఏప్రిల్ 21వ తేదీ, 1926లో లండన్‌లోని 17 బ్రూటన్ స్ట్రీట్‌లో జన్మించారు. ► తల్లిదండ్రులు.. కింగ్ జార్జ్-6, క్వీన్ ఎలిజబెత్ ► గ్రీస్ యువరాజు, నేవీ లెఫ్టినెంట్ ఫిలిప్ మౌంట్‌బాటెన్‌ను 1947లో ఆమె వివాహం చేసుకున్నారు. వీళ్లకు.. ప్రిన్స్ ఛార్లెస్, ప్రిన్సెస్ అన్నె, ప్రిన్స్ ఆండ్రూ, ప్రిన్స్ ఎడ్వర్డ్ సంతానం. ► 1952, ఫిబ్రవరి 6వ తేదీన తండ్రి మరణించడంతో వారసురాలిగా ఆమె ప్రకటించబడ్డారు. అయితే ఆ టైంకి ఆమె రాయల్ టూర్లో కెన్యాలో ఉన్నారు. ఏడాది తర్వాత జూన్ 2వ తేదీన ఆమె వెస్ట్మిన్స్టర్ అబ్బేలో బ్రిటన్‌కు రాణిగా అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ► క్వీన్ ఎలిజబెత్-2 పట్టాభిషేకానికి.. సోవియట్ యూనియన్, చైనా, యునైటెడ్ స్టేట్స్ నుంచి జోసెఫ్ స్టాలిన్, మావో జెదాంగ్, హ్యారీ ట్రూమన్ హాజరయ్యారు. అప్పుడు బ్రిటన్ ప్రధానిగా విన్స్టన్ చర్చిల్ ఉన్నారు. ► 15 మంది ప్రధానులు.. ఈమె హయాంలో బ్రిటన్‌కు పని చేశారు. అమెరికాకు 14 మంది అధ్యక్షులు పని చేశారు. అందులో లిండన్ జాన్సన్‌ను తప్ప ఆమె అందరినీ కలిశారు. ► యునైటెడ్ కింగ్‌డమ్‌తోపాటుగా పద్నాలుగు దేశాల సార్వభౌమత్వం ఈమె చేతిలోనే ఉంది. ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, జమైకా, ఆంటిగ్వా, బార్బుడా, బెహమస్, బెలిజే, గ్రెనెడా, పాపువా న్యూ గినియా, సోలోమన్ ఐల్యాండ్స్, సెయింట్ కిట్స్ అండ్ నేవిస్, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్, ది గ్రెనాడైన్స్, తువాలుకు కూడా క్వీన్ ఎలిజబెత్-2 మహారాణిగా వ్యవహరిస్తున్నారు. ► ప్రపంచ చరిత్రలో రాచరిక వ్యవస్థలో అత్యధిక కాలం పాలించిన వారిలో బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 రెండో స్థానానికి చేరారు. ఈ విషయంలో ఇప్పటి వరకు సెకండ్ ప్లేస్‌లో ఉన్న థాయ్‌లాండ్ రాజు భూమి బోల్ అదుల్యదేజ్ (1946-2016 మధ్య 70 ఏండ్ల 126 రోజులు పాలన చేశారు)ను ఎలిజబెత్-2 దాటేశారు. మొదటి స్థానంలో ఫ్రాన్స్‌కి చెందిన లూయిస్-14 (1643-1715 మధ్య కాలంలో 72 ఏండ్ల 110 రోజులు) ఉన్నారు. ► 2015 నాటికే ఎలిజబెత్-2 ఇప్పటికే క్వీన్ విక్టోరియాను దాటేసి బ్రిటన్ పాలకురాలిగా అత్యధిక కాలం ఉన్న వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ► భర్త ఫిలిప్ 2021 ఏప్రిల్‌లో కన్నుమూశారు. ► ఫిబ్రవరి 6, 2022న ఆమె సింహాసం అధిరోహించి 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ప్లాటినమ్ జూబ్లీ వేడుకలు నిర్వహించారు. ► అనారోగ్యంతో ఆమె మరణించిన క్రమంలో ‘‘లండన్ బ్రిడ్జ్ ఈజ్ డౌన్’’ అని కోడ్ భాషలో ప్రకటించింది బకింగ్ హామ్ ప్యాలస్. ఆపరేషన్ లండన్ బ్రిడ్జి పేరిట ఇప్పటికే ఆమె మృతి అనంతర పరిస్థితులను ఎలా ఎదుర్కొవాలో ఇప్పటికే సిద్ధపడ్డారు అధికారులు. ► ఎలిజబెత్-II తర్వాత ఆమె కొడుకు ప్రిన్స్ ఛార్లెస్ ను బ్రిటన్ రాజుగా ప్రకటించే అవకాశం ఉంది. ఆయన బ్రిటన్ రాజుగా బాధ్యతలు స్వీకరిస్తే కింగ్ చార్లెస్ III పేరుతో కొనసాగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. -
బ్రిటన్ కొత్త ప్రధాని మేరీ ఎలిజబెత్ ట్రస్
-
Indian Economy: త్వరపడితేనే... నిలబడతాం!
భారత ఆర్థిక వ్యవస్థకు దక్కిన కొత్త కిరీటం ఇది. దేశంలో సామాన్యుల స్థితిగతులు ఎలా ఉన్నా, పరిమాణ రీత్యా విశ్వవేదికపై మన ఆర్థిక వ్యవస్థ ఏకంగా 5వ స్థానంలో నిలిచింది. అమెరికా, చైనా, జపాన్, జర్మనీల తర్వాత స్థానం ఇప్పుడు భారత్‌దేనని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) గత వారం వెల్లడించింది. భారీగా పెరిగిన జీవన వ్యయంతో సతమతమవుతున్న బ్రిటన్ ఆరో స్థానానికి నెట్టేసి, గత ఆర్థిక సంవత్సరం ఆఖరి మూడు నెలల్లో భారత్ ముందుకు దూసుకు వచ్చింది. దశాబ్ది క్రితం ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 5వ స్థానంలో బ్రిటన్, 11వ స్థానంలో భారత్ ఉండేవి. ఆ దశ నుంచి ఇంత పైకి ఎగబాకడం ఆనందమే. సంపద పెంపులో ముందుండడం సంతోషమైనా, సామాన్యులకు సంపద పంపిణీలో ఎక్కడున్నామన్నది ఆలోచించుకోవాలి. బ్రిటన్ వెనుకబాటుకూ, భారత్ ముందంజకూ అనేక కారణాలున్నాయి. గత నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత వేగంగా బ్రిటన్‌లో ద్రవ్యోల్బణం పెరుగుతోంది. 2024 దాకా ఆ దేశానికి ఆర్థిక మాంద్యం ముప్పు పొంచి ఉందని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ లాంటివే అంటున్నాయి. ఈ పరిస్థితుల్లో బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం మొన్న మార్చితో ముగిసిన త్రైమాసికంలో ‘నామమాత్రపు’ నగదు లెక్క ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ 854.7 బిలియన్ డాలర్ల వద్ద ఉంటే, బ్రిటన్ 814 బిలియన్ డాలర్ల స్థాయిలోనే మిగిలింది. డాలర్ మారకం రేటు ప్రకారం ఈ లెక్క కట్టారు. ఇక, వర్తమాన ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికంలోనూ అమెరికన్ డాలర్ల లెక్కన భారత్ ముందంజ కొనసాగించినట్టు ఐఎంఎఫ్ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) గణాంకాల మాట. మరోపక్క ఈ ఏడాది భారత రూపాయితో పోలిస్తే బ్రిటన్ పౌండ్ 8 శాతం పడిపోయింది. వెరసి, వార్షిక ప్రాతిపదికన కూడా ఈ ఏడాది బ్రిటన్ను భారత్ దాటేస్తుందని ఐఎంఎఫ్ అంచనా. బ్రిటన్‌లోని పరిస్థితికి భిన్నంగా భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది కనీసం 7 శాతానికి పైగా వృద్ధి సాధిస్తుందని చెబుతున్నారు. రెండొందల ఏళ్ళు ఎవరి పాలనలో ఉన్నామో ఆ పాలక దేశాన్ని, పాలిత భారతదేశం అధిగమించడం విధి వైచిత్రి. అదీ బ్రిటీష్‌వారిపై పోరాడి, స్వాతంత్య్రం సాధించి 75 వసంతాలు నిండిన వేళ ఇలాంటి కిరీటం విశేషమే. నిజానికి, ఇలా బ్రిటన్ను వెనక్కి నెట్టి, భారత్ ముందుకు రావడం ఇటీవల ఇది రెండోసారి. 2019లో తొలిసారిగా భారత్ ఆ ఘనత సాధించింది. తర్వాత ఆ స్థానాన్ని భారత్ చేజార్చుకుంది. ఇంతలో బ్రిటన్ చిక్కుల్లో పడిపోవడంతో మనం మళ్ళీ ముందుకొచ్చాం. ‘వలస పాలకులపై ఇది స్వీట్ రివెంజ్’ అని కొందరి వ్యాఖ్య. అలా సంతోషపడ వచ్చేమో కానీ, అంతటితో సరిపెట్టుకొని అనేక ఇతర సూచికలను పట్టించుకోకుంటేనే కష్టం. కరోనా, ఉక్రెయిన్‌లో యుద్ధం లాంటి వాటితో ద్రవ్యోల్బణం, ఇంధన సంక్షోభం బ్రిటన్ లాంటి పాశ్చాత్యదేశాల్ని చుట్టుముట్టాయి. ఆ సంక్షోభాలను తట్టుకొని మన దేశం ఈ మేరకు నిలబడడం విశేషమే. కానీ ఇది చాలదు. మనం ఇవాళ్టికీ బ్రిటన్‌తో పోలిస్తే తలసరి జీడీపీలో వెనకబడే ఉన్నాం. ఇప్పటికీ మన దగ్గరే దారిద్య్ర స్థాయి ఎక్కువ. బ్రిటన్ తలసరి ఆదాయం 47 వేల డాలర్లు కాగా, మనమింకా 2.5 వేల డాలర్ల దగ్గరే ఉన్నాం. విద్య, వైద్యం, జీవన ప్రమాణాల మేళవింపైన మానవాభివృద్ధి సూచిలోనూ ఇండియా వెనకబడి ఉంది. మన దేశం త్వరితగతిన అడుగులు వేస్తున్నా, కనీసం 1980లో బ్రిటన్ ఉన్న స్థాయికి మనం చేరాలన్నా మరో దశాబ్ది పడుతుందట. దేశ సంపన్నతకు చిహ్నం జీవన నాణ్యత గనక ‘సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ కవరేజ్’ (యూహెచ్‌సీ) లెక్కన చూసినా భారత్ సుదూరం ప్రయాణించాల్సి ఉంది. 2016 నాటికే బ్రిటన్ను దాటి మన దేశం అయిదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఒకప్పటి అంచనా. తీరా అది ఇంత ఆలస్యమైంది. కానీ, పెరుగుతున్న యువభారత జనాభా, పటిష్ఠ మవుతున్న డిజిటల్ వ్యవస్థ రీత్యా రాగల కాలంలో భారత్ మరింత వృద్ధి సాధించవచ్చని ఓ ఆశాభావం. ఈ దశాబ్ది చివరికే భారత్ మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుందని ఎస్బీఐ రీసెర్చ్ మాట. అలాగే, వచ్చే 2027 కల్లా ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ల లక్ష్యం చేరుస్తామంటున్న పాలకులు అది నిజం చేయాలంటే ఆలోచన, ఆచరణలో చిత్తశుద్ధి అవసరం. ఉదాహరణకు, జీడీపీలో 4 నుంచి 6 శాతం విద్యారంగంపై ఖర్చు చేయాలని యునెస్కో అభ్యర్థన. కానీ, మన కేంద్రం, రాష్ట్రాలన్నీ కలి పినా గత ఆర్థిక వత్సరం విద్యారంగంపై బడ్జెటరీ వ్యయం జీడీపీలో 3 శాతమే. ఇలాంటివి మారాలి. అలాగే, దేశ జీడీపీ పెరుగుతున్నా, ఆర్థిక అసమానతలూ పెరుగుతూ పోవడం ఆందోళనకరం. ఇప్పటికీ అల్ప–మధ్య ఆదాయ దేశమైన భారత్‌లో సంపద సృష్టితో పాటు సంపద పంపిణీపైనా దృష్టి పెట్టాలి. జీడీపీకి తగ్గట్టు దేశంలోని కోట్లాది నిరుపేదలను సంపన్నుల్ని చేయడం పాలకుల బాధ్యత. స్వాతంత్య్ర శతవసంతాల 2047 నాటికి భారత్‌ను మధ్య ఆదాయ దేశంగా నిలబెట్టి, తలసరి ఆదాయం 10 వేల డాలర్లు చేయాలంటే, నిలకడగా 7 నుంచి 7.5 శాతం వృద్ధి రేటు అవసరం. అందుకు మనకున్న అతి పెద్ద యువ జనాభాను సానుకూల అంశం చేసుకోవాలి. బ్రిటన్ (78 శాతం), అమెరికా (62 శాతం)తో పోలిస్తే, మన దగ్గర శ్రామికశక్తి భాగస్వామ్యం రేటు తక్కువ (48 శాతం). కానీ నిరుద్యోగమేమో ఎక్కువ (8 నుంచి 9 శాతం). దీన్ని మార్చాలి. ప్రైవేట్ రంగంలో ఉపాధి పెరిగేలా చూడాలి. అవసరమైన అన్ని సంస్కరణలూ చేపట్టాలి. ‘సాధించినదానికి సంతృప్తిని చెంది, అదే విజయమనుకొంటే పొరపాటోయి’ అన్న కవి వాక్కే నిత్యం దిశానిర్దేశం కావాలి. -
ఐదో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్: 5 కీలక అంశాలు
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. బ్రిటన్ను వెనక్క నెట్టి ఇండియాఐదోస్థానానికి ఎగబాకింది. ఇప్పటివరకు ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న బ్రిటన్ ఆరో స్థానానికి చేరింది. ఒక దశాబ్దం క్రితం, భారతదేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో 11వ స్థానంలో ఉండగా, యూకే 5వ స్థానంలో ఉంది. 2047 నాటికి భారతదేశానికి స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాల నాటికి "అభివృద్ధి చెందిన" దేశంగా అవతరించాలని ప్రధానమంతత్రి నరేంద్ర మోదీ కోరుతున్న నేపథ్యంలో ఈ వార్త ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ యూకేను, అదీ రెండు శతాబ్దాల పాటు భారత ఉపఖండాన్ని పరిపాలించిన ఒకదానిని దాటడం ఒక ప్రధాన మైలురాయిగా భావిస్తున్నారు. కరోనా మహమ్మారి, లాక్డౌన్ ఆంక్షలతో భారత్‌సహా వివిధ దేశాల ఆర్థికవ్యవస్థలు అతలాకుతలమైనాయి. ఎక్కడిక్కడ వ్యాపారాలు, రవాణా వ్యవస్థలు స్థంభించి పోవడంతో వృద్ధిరేటు పతమైంది. అయితే ఈసంక్షోభంనుంచి శరవేగంగా పుంజుకున్న ఇండియనన్ ఎకానమీ ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ముఖ్యంగా ఎగుమతులను పెంచి, దిగుమతులను తగ్గించుకోవడం ద్వారా కోవిడ్ కారణంగా క్షీణించిన దేశ ఆర్థికవ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు చేసిన ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తోంది. బ్లూమ్‌బెర్గ్ ప్రకారం, భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. తాజా లెక్కల ప్రకారం, 2022 మార్చి చివరిలో యునైటెడ్ కింగ్డమ్ను అధిగమించి ఇండియా ప్రపంచంలోని ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. దీనిపై చాలా నివేదికలు వచ్చాయి బ్లూమ్‌బెర్గ్ ఏఎంఎఫ్ డేటాబేస్ , చారిత్రాత్మక మారకపు ధరలను ఉపయోగించడం ద్వారా ఈ నిర్ణయానికి వచ్చింది. ఈఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ 85,407 కోట్ల డాలర్లకు చేరుకుంది. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ 81,600 కోట్ల డాలర్లుగా భారత్ తరువాతి స్థానంలో ఉంది. అమెరికా, యూరప్, చైనా, జపాన్ వంటి దేశాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి.కానీ భారత్ మాత్రం తన వృద్ధిరేటును మెరుగుపర్చుకుని ఐదో స్థానానికి చేరడం విశేషం. రానున్న సంవత్సరాలలో భారతదేశం, బ్రిటన్ మధ్య భారీ అంతరం ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. 5 కీలక అంశాలు, పోలికలు ఇరు దేశాలమధ్య జనాబా, తలసరి జీడీపీ, పేదరికం, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్,యూనివర్సల్ హెల్త్‌కేర్ కవరేజ్ అంశాలను పోల్చింది. రెండు దేశాల మధ్య ఉన్న అత్యంత ప్రాథమిక వ్యత్యాసాలలో జనాభా. 2022 నాటికి, భారతదేశంలో 1.41 బిలియన్ల జనాభా ఉండగా, యూకేజనాభా 68.5 మిలియన్లు. మరో మాటలో చెప్పాలంటే, భారత జనాభా 20 రెట్లు ఎక్కువ. రెండు దేశాల జనాభా వ్యత్యాసం నేపథ్యంలో తలసరి జీడీపీతో పోలిస్తే సగటు భారతీయుని ఆదాయం చాలా తక్కువ. దీన్ని దేశంలో పేదరిక స్థాయిని అంచనా వేయవచ్చు. 19వ శతాబ్దం ప్రారంభంలో, భారత్‌తో పోలిస్తే అత్యంత పేదరికంలో ఉన్న బ్రిటన్ ఇపుడు మెరుగ్గానే ఉంది. అయితే పేదరికాన్ని అరికట్టడంలో భారతదేశం భారీ ప్రగతిని సాధించినప్పటికీ బ్రిటన్ కంటే మెరుగ్గాలేదు. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ జీడీపీ డేటా వేగవంతమైన ఆర్థిక వృధ్దిని సూచిస్తుంది. ఆరోగ్యం, విద్య , జీవన ప్రమాణాల సమ్మేళనమైన హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్‌లో మాత్రం, 1980లో బ్రిటన్ ఉన్న స్థితికి భారతదేశం ఇంకా ఒక దశాబ్దం పట్టవచ్చు. యూనివర్సల్ హెల్త్‌కేర్ కవరేజ్ ఒక దేశంగా ధనవంతులుగా మారడానికి కీలకమైన అంశం పౌరులకు అందుబాటులో ఉండే జీవన నాణ్యత. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ఇండెక్స్ పునరుత్పత్తి, తల్లి, నవజాత, శిశు ఆరోగ్యం, అంటు వ్యాధులు, నాన్-కమ్యూనికేబుల్ వ్యాధులు, సర్వీసెస్ సహా అవసరమైన సేవల సగటు కవరేజ్ విషయంలో భారత్ వేగవంతమైన ఆర్థిక వృద్ధి సాధించినా 2005 నుండి ఆరోగ్య సంరక్షణ పథకాలపై ప్రభుత్వ విధాన దృష్టి భారతదేశానికి ప్రత్యేకమైన మెరుగుదలను అందించినప్పటికీ, బ్రిటన్‌తో పోలిస్తే ఇంకా చాలా గ్యాప్ ఉంది. -
పోలీసులకు చిక్కకుండా గర్ల్‌ఫ్రెండ్ టెడ్డీబేర్‌లో దాక్కున్న దొంగ.. చివరికి
కొత్తగా ఏదైనా షాప్ ఓపెన్ అయినప్పుడు.. కార్టూన్ క్యారెక్టర్స్ వేషంలో ప్రమోషన్స్ చేయడం చూస్తూనే ఉంటాం. కానీ.. టెడ్డీబేర్‌ను మరీ కొత్తగా వాడాడు మాంచెస్టర్‌కు చెందిన ఓ యువకుడు. పోలీసులకు చిక్కకుండా ఉండటానికి టెడ్డీబేర్‌లో దాక్కున్నాడు. అసలేం దొంగతనం చేశాడు? అలా ఎలా దాక్కున్నాడంటే? 18 ఏళ్ల జాషువా డాబ్సన్ చిన్నచిన్న దొంగతనాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్నాడు. ఇటీవల ఓ కారును దొంగిలించాడు. దాంట్లో ఫ్యూయల్ పోసుకుని బంక్‌లో డబ్బులు కట్టకుండా వెళ్లిపోయాడు. దీంతో అతనిమీద మరో రెండు కేసులు నమోదయ్యాయి. పోలీసులు తనకోసం వెతుకుతుండటంతో భయపడ్డ డాబ్సన్ దాక్కోవడానికి గర్ల్‌ఫ్రెండ్ ఇంటికి వెళ్లాడు. అక్కడ ఉన్న ఐదు అడుగుల టెడ్డీబేర్‌ను కట్‌చేసి, అందులో కొంత స్టఫ్ తీసేసి, మనోడు అందులో కూర్చున్నాడు. పోలీసులు చివరకు డాబ్సన్ గర్ల్‌ఫ్రెండ్ ఇంటికి వచ్చి వెదకడం మొదలుపెట్టారు. టెడ్డీబేర్ శ్వాస తీసుకుంటున్న చప్పుడు రావడంతో అనుమానం వచ్చి దాన్ని కట్ చేసి చూశారు. ఇంకేముంది... అందులోంచి డాబ్సన్ బయటికొచ్చాడు. కార్ల దొంగతనంతోపాటు, అతనిపై రెండుమూడు పెటీ కేసులు కూడా ఉండటంతో డాబ్సన్కు కోర్టు తొమ్మిదినెలల జైలు శిక్ష విధించింది. అలాగే డ్రైవింగ్ చేయకుండా అతనిపై 27 నెలలపాటు నిషేధించింది. మాంచెస్టర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ఫేస్బుక్లో షేర్ చేసిన ఈ వార్త వైరల్ అవుతూ నెటిజన్స్‌కు నవ్వులు పంచుతోంది. ‘సూపర్ క్రియేటివిటీ’, ‘పా పెట్రోల్’, ‘‘అన్ ‘బేర’బుల్’’, ‘టెడ్డీబేర్‌ను ఇలా కూడా వాడుకోవచ్చా’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. చదవండి: ఇదేం పెళ్లి.. భార్యకాని భార్యతో కలసి పోజులిచ్చి -
Manju: 85 ఏళ్ల బామ్మ! గుజరాత్లో పుట్టి.. ఆఫ్రికాలో పెరిగి.. బ్రిటన్‌లో రెస్టారెంట్!
ఇండియాలో పుట్టి, ఆఫ్రికాలో పెరిగి, ఇంగ్లాండ్‌లో స్థిరపడింది. అయినా భారతీయ వంటకాలను అద్భుతంగా వండుతూ ఎంతోమంది కస్టమర్ల మనసులను దోచుకుంటోంది 85 ఏళ్ల బామ్మ. తొమ్మిది పదులకు చేరువలో ఉన్నప్పటికీ ఎంతో చలాకీగా దేశీయ వంటకాలను వండివార్చుతూ మంచి కుక్‌గా పేరు తెచ్చుకున్న ఈ పెద్దావిడే మంజు. రుచికరమైన ఈ వంటకాలను యూరోపియన్లు సైతం లొట్టలేసుకుని లాగించేస్తూ వావ్ అంటున్నారు. గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలో మధ్యతరగతి కుటుంబంలో 1936లో మంజు పుట్టింది. తండ్రి వృత్తిరీత్యా ఉగాండాలో స్థిరపడడంతో అమ్మతో కలిసి ఆ దేశం వెళ్లింది. మంజుకు పన్నెండేళ్ల వయసులో తండ్రి మరణించాడు. దీంతో కుటుంబం ఆర్థికంగా కుదేలైంది. ఇంట్లో తనే పెద్ద కావడంతో..∙తోబుట్టు వుల భారం కూడా తనపై పడింది. దీంతో తల్లికి చేదోడు వాదోడుగా ఉంటూ రోజూ వివిధ రకాల అల్పాహారాలు తయారు చేయడం నేర్చుకుని, పద్నాలుగేళ్ల వయసులో టిఫిన్లు తయారు చేసి విక్రయించేది. అమ్మతో కలిసి పనిచేస్తోన్న సమయంలో చనా దాల్ మంజుకు బాగా నచ్చింది. దీంతో గుజరాతీ సంప్రదాయ వంటకాలన్నింటినీ తల్లి దగ్గర నేర్చుకుని రుచికరంగా తయారు చేసేది. ఒకపక్క టిఫిన్లు విక్రయిస్తూనే, ట్యూషన్లు కూడా చెప్పేది. పెళ్లి తరువాత కూడా.. చిన్నప్పటి నుంచి అనేక కష్టాలను ఎదుర్కొంటూ పెరిగిన మంజుకి పెళ్లి తరువాత కూడా ఒడిదొడుకులు తప్పలేదు. 1964లో గుజరాత్ మూలాలున్న ఆఫ్రికన్ వ్యాపారవేత్తతో మంజుకు పెళ్లయ్యింది. వెంటవెంటనే ఇద్దరు కొడుకులు నైమేష్, జైమిన్లు పుట్టారు. వాళ్లకు ఆరేళ్లు ఉన్నప్పుడు ఉగాండలో రాజకీయ పరిస్థితులు మారి అక్కడ నిబంధనలు మారడంతో ఇద్దరు పిల్లలను తీసుకుని ఆఫ్రికా నుంచి ఇంగ్లాండ్‌కు వలస వెళ్లింది. అక్కడ చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేసేవారు. ఉదయం స్విచ్‌బోర్డుల తయారీ ఫ్యాక్టరీలో మంజు ఉద్యోగానికి వెళ్తే భర్త పిల్లల్ని చూసుకునేవాడు. రాత్రి అతను ఉద్యోగం చేస్తే మంజు పిల్లలను చూసుకునేది. అలా ఇద్దరూ ఎంతో కష్టపడి పిల్లలిద్దరినీ పెంచారు. ఏళ్లపాటు ఫ్యాక్టరీలో పనిచేసిన మంజు 65 ఏళ్ల వయసులో రిటైర్ అయ్యింది. బాధ్యతలు తీరాయి కానీ... కుటుంబ బాధ్యతల్లో ఎంత తీరిక లేకుండా ఉన్నప్పటికీ.. చిన్నప్పటి నుంచి వంటలు చేసే అలవాటు ఉండడం వల్ల చిన్న రెస్టారెంట్ పెట్టాలని కోరిక ఉండేది మంజుకి. కానీ ఏళ్లు గడుస్తున్నప్పటికీ తన దగ్గర రెస్టారెంట్ నడపడానికి కావలసినన్ని డబ్బులు ఉండేవి కావు. తన కల ఎప్పుడు నెరవేరుతుందా... అని ఎదురు చూస్తుండేది. అమ్మకోరికను ఎలాగైనా నెరవేర్చాలన్న సంకల్పంతో కొడుకులిద్దరూ తాము దాచుకున్న డబ్బులతో లండన్ నగరానికి దగ్గర్లో ఉన్న బ్రిటన్‌లో చిన్న రెస్టారెంట్‌ను ప్రాంభించారు. దీంతో మంజు ఎంతోకాలంగా ఎదురు చూస్తోన్న కల 80 ఏళ్ల వయసులో నిజమైనట్లనిపించింది. పూర్తిగా గుజరాతీ శాకాహార భోజనం, నాణ్యమైన నూనె, ఇతర దినుసులతోనే వండడం, నాలుగు రకాల పదార్థాలతో షేరింగ్ థాలీని అందుబాటులో ఉంచడంతో రెస్టారెంట్ కొద్దికాలంలోనే యూరోపియన్లను అమితంగా ఆకర్షించింది. దీంతో చుట్టుపక్కల అనేక ఇండియన్ రెస్టారెంట్లు ఉన్నప్పటికీ మంజు రెస్టారెంట్‌కే కస్టమర్లు ఎగబడేవారు. దీనికి తోడు ఉదయాన్నే ఐదున్నర గంటలకు నిద్ర లేచి రాత్రి పన్నెండు గంటల వరకు రెస్టారెంట్లో వంటకాలను తన స్వహస్తాలతో తయారు చేయడం బాగా కలిసి వచ్చింది. కొడుకులతో పాటు కోడళ్లు దీపాలీ, కిట్టీలు కిచెన్‌లో మంజుకి సాయం చేస్తుండడంతో తక్కువమంది సిబ్బందితో రెస్టారెంట్ చక్కగా నడిపిస్తున్నారు. సంప్రదాయం ఉట్టిపడేలా.. మంజు ఇండియా వచ్చింది కేవలం మూడుసార్లే అయినప్పటికీ..తన తల్లిదగ్గర నేర్చుకున్న అనుభవంతో పానీపూరి, బేల్‌పూరి, పనీర్ మసాలా, కనడ పాలక్, కధీ, ఆలుకీ సబ్జి, దాల్ ధోక్లి, ఉందాయు, తెప్లా, ఖందవి వంటి రుచికరమైన వంటకాలను రెస్టారెంట్లో అందిస్తోంది. దేశీయ రుచులతోపాటు... భారతీయ సంప్రదాయ పండగలను వేడుకగా నిర్వహించడం, పండుగకు తగ్గట్టుగా రెస్టారెంట్‌ను అలంకరించడం, ప్రత్యేకమైన మెనూ, సంప్రదాయ దుస్తులు ధరించడం వంటివి అక్కడి వాళ్లను ఎంతగానో అకట్టుకుంటున్నాయి. గుజరాత్ సంస్కృతీ సంప్రదాయం ఉట్టిపడేలా రెస్టారెంట్లో పాత్రలు, పోస్టర్లు, సిబ్బంది డ్రెíస్సింగ్ ఉంటుంది. మంజు కస్టమర్లలో ఇంగ్లిష్, ఇండియన్, విఐపీలు ఉన్నారు. ఆమె చేసిన నిమ్మకాయ పచ్చడికి గాను ‘గ్రేట్ టేస్ట్’ అవార్డును కూడా అందుకుంది. సంకల్పం గట్టిదైతే ఏళ్లుగడిచినా అనుకున్నది తప్పక నెరవేరుతుందనడానికి మంజు జీవితం ఉదాహరణగా నిలుస్తోంది. చదవండి: అమ్మా ఉద్యోగం వచ్చింది ... నాక్కూడా బాబూ! -
'లవర్‌ను వివస్త్ర చేసి గెంటివేత'.. మాజీ ఫుట్‌బాలర్‌పై ఆరోపణలు
మాంచెస్టర్ యునైటెడ్ మాజీ ఫుట్‌బాలర్.. వేల్స్ ఫుట్‌బాల్ మేనేజర్ రియాన్ గిగ్స్ చిక్కుల్లో పడ్డాడు. మాజీ గర్ల్‌ఫ్రెండ్ కేట్ గ్రీవెల్లిని నగ్నంగా హోటల్ రూం నుంచి బయటకు గెంటేశాడనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కేట్ కోర్టుమెట్లను ఆశ్రయించడంతో ప్రస్తుతం రియాన్ గిగ్స్ యునైటెడ్ కింగ్డమ్ కోర్టులో ట్రయల్‌లో ఉన్నాడు. విషయంలోకి వెళితే.. వేల్స్ ఫుట్‌బాల్ మేనేజర్.. రియాన్ గిగ్స్ కేట్ గ్రీవెల్లిని ఇష్టపడ్డాడు. మొదట్లో అతని ప్రవర్తన నచ్చి ఆమె అతన్ని ఇష్టపడింది. ఆ తర్వాత రియాన్ కేట్‌పై వేధింపులకు దిగేవాడు. దాదాపు మూడేళ్లుగా ఆమెను శారీరకంగా వేధించడమే గాక ఆమె ఫోన్‌కు అసభ్యకర సందేశాలు పంపించేవాడు. ప్రతీరోజు సెక్స్ చేయాలని.. లేకుంటే తనతో చనువుగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానంటూ బ్లాక్మెయిల్ చేసేవాడు. గతంలో చాలాసార్లు కేట్తో గొడవపడి కొట్టిన సందర్బాలు ఉన్నాయి. దీంతో కేట్ గ్రీవెల్లి రియాన్ గిగ్స్‌తో తెగదెంపులు చేసుకోవాలని భావించింది. కూర్చొని మాట్లాడుకుంటే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని రియాన్ గిగ్స్.. కేట్కు ఫోన్ చేసి హోటల్‌కు ఆహ్వానించాడు. అయితే కేట్ తన సోదరి ఎమ్మాతో కలిసి హోటల్‌కు వచ్చింది. ఆమె వచ్చే సమయానికి గిగ్స్ మరొక మహిళతో రిలేషిన్‌షిప్‌లో ఉన్నాడు. ఇది చూసిన కేట్స్కు విపరీతంగా కోపమొచ్చింది. వెంటనే లోపలికి వెళ్లిన కేట్స్.. మాట్లాడుకుందామని పిలిచి ఏం చేస్తున్నావు ? అంటూ నిలదీసింది. అయినా నీతో మాట్లాడి ప్రయోజనం లేదు.. మనిద్దరం విడిపోవడమే బెటర్ అని తన వెంట తెచ్చుకున్న సూట్‌కేసు తీసుకొని బయలుదేరుతుండగా.. గిగ్స్ కోపంతో ఆమె జుట్టు పట్టుకొని లాగాడు. ఇద్దరి మధ్య కాసేపు పెనుగులాట జరిగింది. కేట్స్ తలను గట్టిగా నేలకేసి కొట్టాడు గిగ్స్. ఈ క్రమంలో ఆమె పెదవులు చిట్లి నోటి నుంచి రక్తం వచ్చింది. అనంతరం ఆమెను వివస్త్రను చేసి హోటల్ రూం నుంచి బయటకు గెంటేశాడు. అడ్డువచ్చిన కేట్స్ చెల్లి ఎమ్మాను కూడా కొట్టి బయటకు తోశాడు. కేట్ సోదరి ఎమ్మా సమాచారంతో గిగ్స్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ ఆదివారం(ఆగస్టు7న) కోర్టులో ప్రవేశపెట్టారు. కాగా వాదనలు విన్న కోర్టు గిగ్స్పై వచ్చిన ఆరోపణలు నిజమేనని.. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశించారు. ప్రస్తుతం గిగ్స్ ట్రయల్‌పై రిమాండ్‌లో ఉన్నాడు. చదవండి: కాబోయే భార్యతో సాగర తీరంలో టీమిండియా ఆల్‌రౌండర్.. ఫొటోలు వైరల్ -
రాజయోగం.. ఎలక్ట్రీషియన్ వృత్తి నుంచి ఓ దీవికి రాజుగా..!
నిన్న మొన్నటి వరకు అతడొక సాధారణ ఎలక్ట్రీషియన్. ఇప్పుడతడు ఏకంగా ఒక దీవికి రాజయ్యాడు. వాయవ్య ఇంగ్లాండ్‌లోని కంబ్రియా కౌంటీ ఫర్నెస్ తీరానికి దాదాపు మైలు దూరంలో ఉంది ‘పీల్ ఐలాండ్’ అనే దీవి. దీని విస్తీర్ణం 26 ఎకరాలు. ఈ దీవిని సొంతం చేసుకోవడానికి సుమారు రెండువందల మంది దరఖాస్తులు పెట్టుకున్నారు. అదృష్టం వరించడంతో ఆరన్ సాండర్సర్ అనే ముప్పయి మూడేళ్ల సామాన్య ఎలక్ట్రీషియన్ ఈ దీవిని ఇటీవల సొంతం చేసుకోగలిగాడు. అంతేకాదు, 170 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం ప్రకారం ‘కింగ్ ఆఫ్ పీల్ ఐలాండ్’గా త్వరలోనే పట్టాభిషక్తుడు కానున్నాడు. ఇంతకీ ఈ సామాన్యుడు ఎలా రాజు అయ్యాడనుకుంటున్నారా? అదంతా ఒక సంప్రదాయ ప్రక్రియ ప్రకారం జరిగిపోయింది. పర్యాటక కేంద్రమైన ‘పీల్ ఐలాండ్’లో ఒక పబ్ ఉంది. ఇంగ్లాండ్ నలుమూలల నుంచి ఇక్కడకు జనాలు తరచుగా వస్తుంటారు. అప్పుడప్పుడు చుట్టుపక్కల యూరోపియన్ దేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు. సెలవు రోజుల్లో ఈ దీవిలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. పర్యాటకులు ఇక్కడి టెంట్లలో బస చేస్తుంటారు. టెంట్లలో బస చేయడానికి రోజుకు 5 పౌండ్లు (సుమారు రూ.500) వసూలు చేస్తారు. చిరకాల సంప్రదాయం ప్రకారం క్రంబియా కౌంటీ ఈ దీవిలోని పబ్‌ను నడిపేందుకు టెండర్లు ఆహ్వానించింది. రెండువందల మందికి పైగా దీనిని దక్కించుకునేందుకు పోటీ పడ్డారు. చివరకు ఆరన్ సాండర్సన్‌కు ఇది దక్కింది. పబ్ యాజమాన్యంతో పాటు, దీవికి రాజుగా పట్టాభిషేకం, దాంతో పాటే ఇంగ్లాండ్ రాణి ఎలిజబెత్ అనుగ్రహించే ‘నైట్‌హుడ్’ కూడా ఇతడికి త్వరలోనే దక్కనున్నాయి. కౌన్సిల్ సభ్యులు ఈ విషయం తనతో చెబితే మొదట నమ్మలేకపోయానని, ఈ దీవికి రాజుగా పట్టాభిషిక్తుణ్ణి కానుండటం ఎంతో సంతోషంగా ఉందని సాండర్సన్ మీడియా ఎదుట ఉబ్బితబ్బిబ్బయ్యాడు. పీల్ ఐలాండ్‌లో పబ్‌తో పాటు పురాతనమైన కోట కూడా పర్యాటక ఆకర్షణగా ఉంటోంది. ఫర్నెస్ ప్రాంతానికి చెందిన మతగురువులు పన్నెండో శతాబ్దిలో ఇక్కడ పెద్ద రాతికోటను నిర్మించారు. ఈ దీవి నుంచి ఫర్నెస్ తీరానికి రాకపోకలు జరిపేందుకు ఒక మరపడవ అందుబాటులో ఉంటుంది. ఈ మరపడవలో పదిహేను నిమిషాల్లో ఫర్నెస్ తీరానికి చేరుకోవచ్చు. రాడ్ స్కార్ అనే వ్యక్తి ఇప్పటివరకు ఈ దీవికి రాజుగా కొనసాగుతున్నాడు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో సాండర్సన్ అతడి నుంచి పదవీ బాధ్యతలు స్వీకరించి, అధికార లాంఛనాలతో పట్టాభిషిక్తుడు కానున్నాడు. పట్టాభిషేకం తర్వాత పబ్ నిర్వహణతో పాటు దీవి మొత్తం అతడి అధీనంలోనే ఉంటుంది. అదృష్టం కలిసొస్తే, ఇలా అనుకోకుండానే ‘రాజ’యోగం పడుతుందేమో! -
Johnson Government: సంక్షోభంలో జాన్సన్ సర్కారు
లండన్: బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఇప్పటికే పలు సమస్యలతో సతమతమవుతున్న బోరిస్ జాన్సన్ సర్కారుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ప్రభుత్వంలోని ఇద్దరు సీనియర్ మంత్రులు మంగళవారం రాజీనామా చేశారు. భారత మూలాలున్న ఆర్థిక మంత్రి రిషి సునక్ (42)తో పాటు పాక్ మూలాలున్న ఆరోగ్య శాఖ మంత్రి సాజిద్ జావిద్ తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం కలకలం రేపుతోంది. పార్టీ గేట్ మొదలుకుని పలు ఆరోపణలు, సమస్యలతో అల్లాడుతున్న జాన్సన్ ప్రభుత్వం తాజా పరిణామాలతో కుప్పకూలే ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. ప్రధాని నాయకత్వంపై నమ్మకం కోల్పోయామంటూ ఆయనకు రాసిన రాజీనామా లేఖల్లో మంత్రులిద్దరూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాటిని ట్విట్టర్లో పెట్టారు. కొంతకాలంగా జాన్సన్ పనితీరు దారుణమంటూ లేఖలో సునక్ దుయ్యబట్టారు. ‘‘ప్రభుత్వం సజావుగా, సమర్థంగా, సీరియస్‌గా పని చేయాలని ప్రజలు ఆశిస్తారు. ఆ ప్రమాణాలు లోపించాయి గనుకనే తప్పుకుంటున్నా’’ అంటూ కుండబద్దలు కొట్టారు. ‘‘చాలా సందర్భాల్లో మీ వైఖరిని వ్యక్తిగతంగా ప్రశ్నించినా ప్రజాప్రయోజనాల దృష్ట్యా అందరి ముందూ మాత్రం సమర్థించాను. కానీ మౌలికంగా మనిద్దరివీ వేర్వేరు దారులు. ఇలా కలిసి కొనసాగలేమన్న నిర్ధారణకు వచ్చా’’ అని చెప్పుకొచ్చారు. ఇలాంటి ప్రధాని నాయకత్వంలో పని చేసేందుకు తన అంతరాత్మ అంగీకరించడం లేదని సాజిద్ కూడా లేఖలో పేర్కొన్నారు. తానిక మళ్లీ మంత్రి చేపట్టకపోవచ్చని సునక్ చెప్పగా, జాతీయ ప్రయోజనాలను కన్జర్వేటివ్ పార్టీ సమర్థంగా కాపాడుతుందన్న ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయామంటూ సాజిద్ తన లేఖలో పదునైన విమర్శలు చేశారు. జాన్సన్ నేతృత్వంలో పరిస్థితులు మెరుగు పడే అవకాశాలు ఏ మాత్రమూ లేవని తేల్చేశారు. వారి రాజీనామాకు ముందు మంగళవారం రోజంతా భారీ పొలిటికల్ డ్రామా నడిచింది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సొంత పార్టీ ఎంపీ క్రిస్ పించర్‌ను డిప్యూటీ చీఫ్ విప్‌గా కీలక పదవిలో నియమించడం పొరపాటేనంటూ జాన్సన్ ప్రకటన చేశారు. అందుకు తీవ్రంగా చింతిస్తున్నట్టు చెప్పారు. ఆ వెంటనే జాన్సన్ తీరుపై తీవ్ర వ్యాఖ్యలతో మంత్రుల రాజీనామా ప్రకటనలు వెలువడ్డాయి. కరోనా ఉధృతంగా ఉన్న రోజుల్లో అధికార నివాసంలో మందు పార్టీ చేసుకున్నారన్న ఆరోపణలపై జాన్సన్ ఇప్పటికే పలుమార్లు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి రావడం, క్షమాపణలు చెప్పడం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీలో కూడా ఆయనకు మద్దతు నానాటికీ తగ్గిపోతూ వస్తోంది. ఇటీవలి బలపరీక్షలో జాన్సన్ బొటాబొటిగా బయటపడ్డారు. -
‘సీలాండ్'.. దేశ జనాభా 27 మంది మాత్రమే!
యునైటెడ్ కింగ్‌డమ్‌లోని సఫోక్ సముద్ర తీరానికి దాదాపు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఏర్పడిన వింతదేశం పేరు ‘సీలాండ్’. సముద్రంలో ఏర్పాటు చేసిన రెండు భారీ స్తంభాలపై పూర్తిగా మానవ నిర్మిత ప్రదేశం ఇది. ఒక మానవ నిర్మిత ప్రదేశమే దేశంగా ఏర్పడటం దీని ప్రత్యేకత. ఇది 1967 సెప్టెంబర్ 2న ప్రత్యేక దేశంగా ఆవిర్భవించింది. రెండో ప్రపంచయుద్ధం జరుగుతున్నప్పుడు 1943లో అప్పటి యూకే ప్రభుత్వం సముద్రం మధ్య రెండు భారీ రాతి స్తంభాలను కలుపుతూ ఇక్కడ తన రక్షణ అవసరాల కోసం కోటను నిర్మించుకుంది. యుద్ధం ముగిశాక ఖాళీగా మిగిలిన ఈ కోటకు జాక్ మూరే, అతని కూతురు జేన్ చేరుకున్నారు. వాళ్లిద్దరూ ‘వండర్ఫుల్ రేడియో లండన్’ అనే పైరేట్ రేడియో స్టేషన్ తరఫున ఇక్కడకు వచ్చారు. ఆ పైరేట్ రేడియో స్టేషన్ అధినేత ప్యాడీ రాయ్ బేట్స్ 1967 సెప్టెంబర్ 2న ఈ కోటను ఆక్రమించుకుని, ప్రత్యేక దేశంగా ప్రకటించుకున్నాడు. ఈ దేశానికి ప్రత్యేక కరెన్సీ, జెండా, జాతీయగీతం కూడా ఉన్నాయి. ఈ దేశం తన పౌరులకు పాస్‌పోర్టులూ ఇస్తోంది. ఈ దేశ జనాభా 27 మంది మాత్రమే! చదవండి: World Zoonoses Day: కని‘పెట్’కుని ఉండాలి..! లేదంటే కష్టమే! -
US Independence Day: ఒకప్పుడు బ్రిటిష్ పాలనలో అమెరికా.. ఈ విషయాలు తెలుసా?
జూలై 4.. ‘బర్త్ ఆఫ్ అమెరికన్ ఇండిపెండెన్స్’డే.. ఈరోజు ‘అగ్రరాజ్యం’ 246వ స్వాతంత్య్ర దినోత్సవం... ప్రస్తుతం ప్రపంచ రాజకీయాల్లో ‘పెద్దన్న’ పాత్ర పోషిస్తున్న అమెరికా కూడా ఒకప్పుడు ‘బానిస’గానే బతికిందని మీకు తెలుసా? బ్రిటిష్ పాలన నుంచి స్వతంత్ర దేశంగా అవతరించే క్రమంలో జరిగిన పరిణామాలు.. అందుకు దారి తీసిన పరిస్థితుల గురించి కొన్ని ఆసక్తికర అంశాలు.. 246 ఏళ్ల క్రితం.. రవి అస్తమించని సామ్రాజ్యంగా పేరొందిన బ్రిటీష్ పోకడలను వ్యతిరేకిస్తూ 13 కాలనీల్లోని అమెరికన్లంతా ఒక్కటయ్యారు. శిస్తులు విపరీతంగా పెంచడం, పంచదార, కాఫీ, టీ తదితర ఉత్పత్తులపై దిగుమతి సుంకం పెంచడం.. కాలనిస్టుల అభిప్రాయం కోరకుండానే కాలనీల్లో సైన్యాన్ని మోహరించడం, ప్రజలపై కాల్పులకు తెగబడటం సహా కాలనిస్టులకు పార్లమెంటులో సముచిత స్థానం కల్పించకపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో.. 1760-1770 మధ్య అమెరికన్ కాలనీలు, బ్రిటిష్ పాలకుల మధ్య తలెత్తిన సంఘర్షణ చివరకు అమెరికన్ విప్లవానికి తెరతీసింది. ఈ క్రమంలో గ్రేట్ బ్రిటన్ నుంచి పూర్తిగా విముక్తి పొందితేనే బానిసత్వం తొలగిపోతుందటూ 1775 ఏప్రిల్‌లో కాలనిస్టులు ప్రజల్లో స్వతంత్ర కాంక్ష రగిల్చారు. ఇందులో భాగంగా 1776లో రాజకీయవేత్త థామస్ పేన్ ‘కామన్ సెన్స్’ పేరిట ప్రచురించిన కరపత్రాలతో ప్రజలను చైతన్యవంతులను చేశారు. ఈ నేపథ్యంలో కాంటినెంటల్ కాంగ్రెస్ (బ్రిటిష్ అమెరికన్ కాలనీల ప్రతినిధులు) అదే ఏడాది జూన్ 7న ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా స్టేట్ హౌజ్(ఈ తర్వాత ఇండిపెండెన్స్ హాల్‌గా గుర్తింపు పొందింది)లో నిర్వహించిన సమావేశంలో.. వర్జీనియా ప్రతినిధి రిచర్డ్ హెన్రీ లీ కాలనీల స్వాతంత్ర్యం కోసం తీర్మానం ప్రవేశపెట్టారు. వాడి వేడి చర్చల అనంతరం లీ తీర్మానంపై ఓటింగ్ వాయిదా వేసిన కాంటినెంటల్ కాంగ్రెస్.. థామస్ జెఫర్సన్(వర్జీనియా), జాన్ ఆడమ్స్(మసాచుసెట్స్), రోజర్ షెర్మన్(కనెక్టికట్), బెంజమిన్ ఫ్రాంక్లిన్(పెన్సిల్వేనియా), రాబర్ట్ ఆర్ లివింగ్స్టన్(న్యూయార్క్) తదితర ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. గ్రేట్ బ్రిటన్ పెత్తనాన్ని కాలనీలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో తెలుపుతూ, స్వరాజ్య కాంక్షను సమర్థిస్తూ అధికారిక ప్రకటన చేసేందుకు వీలుగా ముసాయిదా రూపొందించాలని పేర్కొంది. డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్.. అనేక పరిణామాల అనంతరం జూలై 2న లీ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసిన కాంటినెంటల్ కాంగ్రెస్.. బ్రిటీష్ సింహాసనాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. ఆ తర్వాత రెండు రోజుల అనంతరం అంటే జూలై 4న డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ పేరిట స్వాతంత్య్రం ప్రకటించుకుంది. ‘ఆల్ మెన్ ఆర్ ఈక్వల్ క్రియేటెడ్(మనుషులంతా సమానంగా సృష్టించబడ్డారు- అందరికీ సమాన హక్కులు అనే ఉద్దేశంతో)’ అంటూ థామస్ జెఫర్సన్ ఓ ప్రకటన విడుదల చేశారు. అదే విధంగా.. ‘‘ఇప్పటి నుంచి మన ముందు తరాలు ఓ గొప్ప పండుగను ప్రతి ఏటా జరుపుకొంటాయి. సంబరాలు చేసుకుంటాయి. పరేడ్లు, ఆటలు, గంటల మోత, టపాసుల కాంతులు ఖండమంతటా విస్తరిస్తాయి’’అంటూ మసాచుసెట్స్ ప్రతినిధి జాన్ ఆడమ్స్ తన భార్యకు రాసిన లేఖలో స్వాతంత్ర్యం ఖరారైందనే శుభవార్త పంచుకున్నారు. ఇలా ఓ వైపు బ్రిటీష్ బలగాలతో కాంటినెంటల్ ఆర్మీ యుద్ధం కొనసాగుతుండగానే మరోవైపు స్వాతంత్ర్య ప్రకటన వెలువడింది. ఈ క్రమంలో 1778లో ఫ్రాన్స్ అమెరికా కాలనీల తరఫున రంగంలోకి దిగడంతో.. ఎట్టకేలకు 1781లో వర్జీనియాలోని యార్క్‌టౌన్‌లో కొన్ని బ్రిటీష్ సేనలు లొంగిపోయాయి. అయితే 1783 ముగిసేనాటికి కూడా ఈ యుద్ధం ముగిసిపోలేదు. మరలా అనేక యుద్ధాలు, పరిణామాల అనంతరం 1941లో జూలై 4ను అమెరికా కాంగ్రెస్ ఫెడరల్ హాలిడేగా ప్రకటించింది. కాగా జార్జ్ వాషింగ్టన్, జాన్ ఆడమ్స్, థామప్ జెఫర్సన్, జేమ్స్ మాడిసన్, జేమ్స్ మన్నో, జాన్ క్విన్సీ ఆడమ్స్, ఆండ్రూ జాక్సన్, మార్టిన్ వాన్ బ్యూరెన్, విలియం హెన్రీ హారిసన్, జాన్ టైలర్ తదితరులు అమెరికా స్వాతంత్ర్య పోరాట యోధుల్లో ముఖ్యులుగా చరిత్రకెక్కారు. జార్జ్ వాషింగ్టన్ 1789-97 వరకు అమెరికా ప్రథమ అధ్యక్షుడిగా సేవలు అందించారు. ఇక 246 ఏళ్ల చరిత్రలో అమెరికా ఉపాధ్యక్ష పదవి చేపట్టిన తొలి మహిళగా భారత సంతతికి చెందిన కమలా హారిస్ చరిత్ర సృష్టించిన విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 13 కాలనీలు 1. ప్రావిన్స్ ఆఫ్ మసాచుసెట్స్ బే 2. ప్రావిన్స్ ఆఫ్ హాంప్‌షైర్ 3. కనెక్టికట్ కాలనీ 4.కాలనీ ఆఫ్ రోడే ఐలాండ్ 5.డెలావేర్ కాలనీ 6.ప్రావిన్స్ ఆఫ్ న్యూయార్క్ 7.ప్రావిన్స్ ఆఫ్ న్యూజెర్సీ 8. ప్రావిన్స్ ఆఫ్ పెన్సిల్వేనియా 9. కాలనీ అండ్ డొమీనియన్ ఆఫ్ వర్జీనియా 10. ప్రావిన్స్ ఆఫ్ మేరీలాండ్ 11. ప్రావిన్స్ ఆఫ్ నార్త్ కరోలినా 12. ప్రావిన్స్ ఆఫ్ సౌత్ కరోలినా 13. ప్రావిన్స్ ఆఫ్ జార్జియా చదవండి: కోటీశ్వరుల వలస.. మళ్లీ మొదలైంది -
షాకింగ్.. కడుపు నొప్పితో టాయిలెట్లోకి వెళ్లి.. బిడ్డతో బయటకొచ్చిన యువతి
కడుపు నొప్పితో విలవిల్లాడుతూ వాష్‌రూమ్‌లోకి వెళ్లిన యువతి అనుకోకుండా ఓ బిడ్డకు జన్మనిచ్చింది. యువతికి కనీసం పొట్ట పొరగడం, ప్రెగ్నెన్సీకి సంబంధించి ఎలాంటి లక్షణాలు కూడా లేకపోవడం మరింత చోద్యంగా మారింది. ఈ వింత ఘటన యూనైటెడ్ కింగ్డమ్లో వెలుగు చూసింది. జెస్ డేవిస్ అనే 20 ఏళ్ల యువతి యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్‌లో చదువుతోంది. ఓ రోజు రాత్రి యువతికి తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో పీరియడ్స్(నెలసరి) అని భావించి వాష్‌రూమ్‌లోకి వెళ్లింది. టాయిలెట్లో కూర్చొని ఉండగా అకస్మాత్తుగా 3 కేజీల మగబిడ్డకు జన్మనివ్వడంతో ఆశ్చర్యపోయింది. అసలు తాను గర్భవతిననే విషయం కూడా ఆమెకు తెలియదు. ఇక బిడ్డను ప్రసవించిన మరుసటి రోజే జెస్ డేవిస్ తన 20వ పుట్టిన రోజును జరుపుకోవడం విశేషం. విషయంపై సదరు యువతి మాట్లాడుతూ.. ‘నాకు పీరియడ్స్ ఎప్పుడూ రెగ్యులర్‌గా రావు. కాబట్టి నేను పెద్దగా పట్టించుకోలేదు. అప్పుడప్పుడు వికారంగా అనిపించేది. అందుకు కొన్ని మందులు వాడటం ప్రారంభించాను. ఆ రోజు ఉదయం తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. పీరియడ్స్ మొదలవుతున్నాయేమో అనుకున్నా. నడవలేని స్థిలిలో ఉన్నాను. కనీసం మంచం మీద పడుకోలేకపోయాను. అర్ధరాత్రి దాటాక కడుపునొప్పి ఎక్కువైంది. వెంటనే లేచి వాష్‌రూమ్‌కు వెళ్లా. నా పొట్టను కిందకు పుష్ చేశా. చదవండి: అక్కడ పానీ పూరీ అమ్మకాలు నిషేధం! ఎందుకంటే?... అప్పటికీ నాకు అనుమానం రాలేదు. కొద్దిసేపటి తర్వాత బిడ్డ ఏడుపు వినిపించింది. ఆ తరువాతే గానీ జరిగిందేంటో అర్థం కాలేదు. బాత్రూమ్లో బిడ్డను చూసి ముందు నేను కల కంటున్నానేమో అనుకున్నాను. కానీ జీవితంలో ఇంత కంటే పెద్ద షాక్ మరొకటి లేదు. వెంటనే షాక్ నుంచి తేరుకొని బిడ్డను చేతుల్లోకి తీసుకున్నా. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో వెంటనే నా స్నేహితురాలికి ఫోన్ చేసి విషయం చెప్పా. తాను అంబులెన్స్‌లో హాస్పిటల్‌కు వెళ్లామని చెప్పింది. మొదట్లో శిశువుతో సమయం గడిపేందుకు కొంత టైం పట్టింది. కానీ ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను’ అని వివరించింది. ఆసుపత్రిలో శిశువును ఇంక్యుబేటర్‌లో ఉంచారు. శిశువు 35 వారాలకే జన్మించినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం తల్లీ, బిడ్డ కోలుకుంటున్నారని పేర్కొన్నారు. చదవండి: రోడ్డు మీద వెళ్తున్న మహిళ.. తలపై పడిన కొబ్బరికాయ.. వైరలవుతోన్న వీడియో -
Sakshi Cartoon: ...అవిశ్వాసం నెగ్గిన శుభ సందర్భంలో పార్టీ అంటే..
...అవిశ్వాసం నెగ్గిన శుభ సందర్భంలో పార్టీ అంటే బావుండదేమో సార్! -
అలా చేస్తే ఉక్రెయిన్‌దే విజయం..బ్రిటిష్ రక్షణ మంత్రి బెన్ వాలెస్
తాము అందజేసే హైటెక్ రాకెట్ సిస్టమ్స్‌తో ఉక్రెయిన్ సైనిక సామర్థ్యం బలోపేతం అవుతుందని బ్రిటిష్ రక్షణ మంత్రి బెన్ వాలెస్ సోమవారం చెప్పారు. రష్యా దాడులను తిప్పికొట్టేందుకు తాము అందజేసే ఆయుధాలు తోడ్పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ సమాజం నుంచి సహకారం ఇలాగే కొనసాగితే రష్యాపై యుద్ధంలో ఉక్రెయిన్ విజయం సాధించడం తథ్యమని తేల్చిచెప్పారు. 80 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదించే ఎం270 రాకెట్ వ్యవస్థలను ఉక్రెయిన్‌కు ఇవ్వబోతున్నట్లు యూకే రక్షణ శాఖ వెల్లడించింది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ విదేశీ పర్యటన రద్దయ్యింది. నిజానికి ఆయన త్వరలో సెర్బియాలో పర్యటించాల్సి ఉంది. అయితే, లావ్రోవ్ విమానం తమ గగనతలంపై ప్రయాణించడానికి వీల్లేదని, అందుకు అనుమతి ఇవ్వబోమని సెర్బియా పొరుగు దేశాలైన బల్గేరియా, నార్తు మాసిడోనియా, మాంటినెగ్రో తేల్చిచెప్పాయి. చదవండి: Russia-Ukraine war: రష్యా భీకర దాడులు -
Sakshi Cartoon: కనీసం ప్రభుత్వాన్ని విమర్శించేందుకైనా అనుమతి తీసుకోవాలని షరతు..
కనీసం ప్రభుత్వాన్ని విమర్శించేందుకైనా అనుమతి తీసుకోవాలని షరతు పెడదాం సార్! -
England: లాటరీలో రూ.1,800 కోట్లు గెలుచుకున్న జంట
-
అదృష్టం అంటే వీరిదే.. లాటరీలో రూ.1,800 కోట్లు గెలుచుకున్న జంట
లండన్: యూకేలోనే అతిపెద్ద యూరో మిలియన్స్ లాటరీని లండన్‌లోని గ్లూసెస్టర్‌కు చెందిన జంట గెలుచుకుంది. గురువారం నిర్వహించిన లక్కీడిప్‌లో జో(49), జెస్‌థ్వైట్(44) అనే దంపతులు సుమారు రూ.1,800 కోట్ల (184 మిలియన్ పౌండ్ల) జాక్‌పాట్ కొట్టేశారు. దీంతో, సాధారణ జీవితం గడుపుతున్న వీరు రాత్రికి రాత్రే కుబేరులైపోయారు. భరత జో.. కమ్యూనికేషన్స్ సేల్స్ మేనేజర్ కాగా, జెస్ హెయిర్ డ్రెస్సింగ్ సెలూన్ నిర్వహిస్తోంది. వీరికి స్కూలుకెళ్లే వయస్సున్న ఇద్దరు పిల్లలున్నారు. తమ కలలను సాకారం చేసుకునే గొప్ప అవకాశం వచ్చిందని జో, జెస్ ఆనందం వ్యక్తం చేశారు. కాగా, 2019 అక్టోబర్‌లో ఓ గుర్తు తెలియని వ్యక్తి 170 మిలియన్ పౌండ్ల భారీ లాటరీ గెలుచుకోవడమే ఇప్పటి దాకా రికార్డుగా ఉంది. ఈ రికార్డును జో జంట తుడిచిపెట్టారు. చదవండి: ఇదేం చిత్రం.. ముసుగు వేసుకుని వార్తలు చదవాలట! -
ఆరేళ్లుగా తన మూత్రాన్ని తానే తాగుతున్న వ్యక్తి.. 10 ఏళ్లు యవ్వనంగా..
ప్రపంచంలో ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు ఉంటుంది. చాలా మంది నిత్యం అందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. ఇందుకు చాలామంది ఆహార నియమాలు పాటిస్తారు. వ్యాయామం, యోగా, డైట్ తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతుంది. కానీ ఓ వ్యక్తి చాలా విచిత్రంగా మూత్రం(యూరిన్) తాగడం వల్ల తన వయసు తగ్గి యవ్వనంగా కనిపిస్తున్నట్లు చెబుతున్నాడు. మానసిక ఒత్తిడిని సైతం జయించినట్లు పేర్కొన్నాడు. అతనే ఇంగ్లాండ్‌కు చెందిన 34 ఏళ్ల హ్యారీ మెటాడీన్.. యూకేలోని హాంప్‌షైర్‌కు చెందిన హ్యారీ 2016 నుంచి ఇప్పటి వరకు రోజూ తన మూత్రాన్ని తానే తాగుతున్నాడు. ఇలా చేయడం వల్ల దాదాపు 10 ఏళ్లు యంగ్‌గా కనిపిస్తున్నట్లు పేర్కొన్నాడు. గతంలో తనకు మానసిక సమస్యలను ఎదురవ్వగా వాటి నుంచి బయట పడేందుకు ఈ ’యూరిన్ థెరపీ’ ప్రారంభించినట్లు తెలిపాడు. దీంతో తనకు శాంతి, ప్రశాంతత వంటి కొత్త అనుభూతిని ఇచ్చిందని వెల్లడించాడు. అప్పటి నుంచి సొంత మూత్రాన్ని తాగుతున్నట్లు చెప్పాడు. తన మూత్రాన్ని బాటిల్స్‌లో స్టోర్ చేసుకొని.. రోజుకో 200 మి. లీ చొప్పున తాగుతుంటాడు. మూత్రాన్ని బాటిల్స్‌లో నింపి.. రెండు మూడు నెలల తర్వాత తాగుతున్నట్లు తెలిపాడు. దీనిని తాగినప్పుడు ఎంతో శక్తివంతంగా ఉంటుందని, ఒత్తిడి దూరమై, మెదడు చురుకుగా పనిచేస్తుందని హ్యరీ తెలిపాడు. అలాగే మూత్రాన్ని మాయిశ్చరైజర్‌గా తన ముఖానికి మసాజ్ చేస్తానని కూడా వెల్లడించాడు. ఇలా చేయడం వల్ల తన చర్మం యవ్వనంగా, మృదువుగా, మెరుస్తూ కనిపిస్తుందంటున్నాడు. ఇక 90 శాతం నీరు ఉన్న మూత్రానికి శరీరంలో ఉన్న అన్ని రోగాలను నయం చేసే శక్తి ఉందని హ్యారీ విశ్వసిస్తున్నాడు. చదవండి: Pakistan: ఇమ్రాన్‌ఖాన్‌కు మరో బిగ్ షాక్ మూత్రం తాగడం వల్ల తనకు ఎంతో మేలు జరిగిందని.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అలవాటును మార్చుకోనని చెబుతున్నాడు. దీనిని తయారు చేసేందుకు ఖర్చుకూడా లేకపోవడంతోపాటు నిత్య మూత్రం తాగడం వల్ల శరీరంలో అనూహ్య మార్పులు వచ్చాయని చెప్పారు. కాగా గతంలో సింగర్స్ మడోన్నా, కేషా కూడా మూత్రం తాగుతామని వెల్లడించారు. అయితే ఈ నిర్ణయాన్ని వైద్యులు వ్యతిరేకిస్తున్నారు. మూత్రం తాగడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ పెరుగుతుందని.. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు వస్తాయని హెచ్చరిస్తున్నారు. -
కష్టకాలంలో జాన్సన్ పర్యటన
పార్టీ గేట్ వ్యవహారంలో ఇంట్లో ఈగల మోత మోగుతున్న వేళ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రెండు రోజుల పర్యటన కోసం గురువారం భారత్‌లో అడుగుపెట్టారు. తనకు లభించిన స్వాగత సత్కారాల సంరంభం చూసి పరమానందభరితుడయ్యారని ఆయన వ్యాఖ్యానాలే చెబుతున్నాయి. ‘ప్రపంచంలో మరెక్కడా ఈ స్థాయి అతిథి మర్యాదలు లభించే అవకాశం లేద’న్నది ఆయన అభిప్రాయం. 2019లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర్నుంచి ఆయన భారత్ రావడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ కరోనా కారణంగా రెండుసార్లు వాయిదా పడక తప్పలేదు. నిరుడు రిపబ్లిక్ డే వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనాల్సి ఉండగా చివరి నిమిషంలో రద్దయింది. ఆ తర్వాత నిరుడు ఏప్రిల్‌లో అనుకున్నారు. అప్పుడు రెండో దశ కరోనా విజృంభణ మొదలైంది. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ యుద్ధం మొదలైన దగ్గరనుంచి రష్యాతో వ్యాపార, వాణిజ్య లావాదేవీలు విరమించుకోవాలని అమెరికా మనపై ఒత్తిడి తెస్తోంది. బ్రిటన్ అభిప్రాయమూ అదే అయినా, దాని వైఖరి భిన్నం. ఈ నెల మొదట్లో మన దేశం వచ్చిన బ్రిటన్ విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ స్వరమే అందుకు సాక్ష్యం. సంక్షోభ కాలాల్లో ఎలా వ్యవహరించాలో భారత్‌కు ఉపన్యాసం ఇవ్వదల్చుకోలేదని ఆమె చెప్పారు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు ముగిశాక జరిగిన విలేకరుల సమావేశంలో కూడా జాన్సన్ ఆ బాణీలోనే మాట్లాడారు. ఉక్రెయిన్ అంశంలో ఇప్పటికే పలుమార్లు మోదీ పుతిన్‌తో మాట్లాడారనీ, రష్యా విధానాలు సరికాదని చెప్పారనీ జాన్సన్ ప్రశంసించారు. బ్రిటన్ ఎంత ఆచితూచి వ్యవహరిస్తున్నదో చెప్పడానికి ఇది చాలు. కారణాలు మనకు తెలియనివేమీ కాదు. యూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి వెలుపలికొచ్చాక బ్రిటన్ ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ప్రపంచ దేశాలన్నిటితో, మరీ ముఖ్యంగా భారత్ వంటి అతి పెద్ద మార్కెట్ ఉన్న దేశంతో వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవాలని తహతహలాడుతోంది. కారణాలు ఏమైనా గత దశాబ్దంగా ఇరు దేశాల వాణిజ్యంలో స్తబ్దత ఏర్పడింది. రెండు దేశాల వాణిజ్యం 2020లో మొత్తంగా 2,400 కోట్ల డాలర్లుంది. ఇదే కాలంలో మనకంటే చిన్న దేశమైన బెల్జియంతో బ్రిటన్ వాణిజ్యం ఇంతకన్నా రెట్టింపుంది. ఈ నేపథ్యంలో మనతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ) ఖరారుకు సంబంధించిన చర్చలు నిరుడు జనవరిలో మొదలయ్యాయి. ఇప్పటికి రెండు దఫాలు పూర్తయ్యాయి. ఈ వారం ఆఖరులో మూడో రౌండ్ చర్చలు పూర్తయితే ఎఫ్‌టీఏ ఒక కొలిక్కి వస్తుంది. జాన్సన్ ఆశిస్తున్నట్టు దీపావళి నాటికి ఇరు దేశాల మధ్యా ఆ ఒప్పందం ఖరారైతే 2035 కల్లా బ్రిటన్ నుంచి మన దేశానికి ఏటా 2,145 కోట్ల డాలర్ల మేర ఎగుమతులు పెరుగుతాయని అంచనా. వాణిజ్య వివాదాల పరిష్కారానికి అనుసరించాల్సిన విధివిధానాలపై ఇంకా ఏకాభిప్రాయం కుదరని పరిస్థితుల్లో జాన్సన్ పర్యటన ప్రస్తుతం ఉపాధి అవకాశాలు, వీసాల మంజూరు తదితర అంశాలపైనే దృష్టి కేంద్రీకరించింది. అదనపు వీసాలు మంజూరు చేస్తేనే వాణిజ్య ప్రతిబంధకాలను సడలిస్తామని మన దేశం చెబుతోంది. స్థానికులను కాదని వెలుపలివారికి అవకాశాలివ్వడమేమిటన్నది జాన్సన్‌కు చెందిన కన్సర్వేటివ్ పార్టీ ఎప్పటినుంచో వాదిస్తోంది. ఇప్పుడు అందుకు భిన్నంగా నిర్ణయం తీసుకుంటే రాజకీయంగా సమస్యలెదురవుతాయని ఆయన భయం. రష్యా రక్షణ ఉత్పత్తులపై ప్రధానంగా ఆధారపడిన భారత్‌ను ఇప్పటికిప్పుడు ఆ దేశంతో తెగతెంపులు చేసుకోమని ఒత్తిడి చేయడం సరికాదని బ్రిటన్ భావిస్తున్నది. తన రక్షణ ఉత్పత్తుల ఎగుమతిని క్రమేపీ పెంచుతూ రష్యాపై ఆధారపడే స్థితిని తప్పించాలనుకుంటోంది. వాస్తవానికి ఒకప్పుడు బ్రిటన్ మన రక్షణ అవసరాలకు ప్రధాన వనరుగా ఉండేది. కానీ కాలం గడిచేకొద్దీ అది క్షీణించి, ప్రస్తుతం మన రక్షణ దిగుమతుల్లో ఆ దేశం వాటా 3 శాతానికి పరిమితమైంది. ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నత స్థాయికి చేరితే పూర్వవైభవం ఖాయమని బ్రిటన్ ఆలోచన. కానీ అందుకు ప్రతిబంధకాలున్నాయి. బ్రిటన్ పార్లమెంటులో కశ్మీర్‌పై చర్చ జరగడం, అక్కడ ఖలిస్తాన్ అనుకూల ఉద్యమాలు పెరగడం మన దేశానికి నచ్చలేదు. అలాగే మైనారిటీలపై దాడులు, అసమ్మతిని అణిచేయడం వంటి అంశాలు ఆ దేశంలో ప్రధానంగా చర్చకు రావడం సైతం అయిష్టంగానే ఉంది. భారత్ వచ్చేవారికి ఈ–వీసాల మంజూరు నిబంధనలు సరళం చేయాలని బ్రిటన్ కోరుతోంది. అదే సమయంలో భారత్‌నుంచి వచ్చేవారిపై బ్రిటన్ అమలు చేస్తున్న నిబంధలపై మన దేశం తీవ్ర అసంతృప్తితో ఉంది. ఇండో–పసిఫిక్ ప్రాంత దేశాల కూటమిలో మనతోపాటు బ్రిటన్ కూడా భాగస్వామి గనుక భారత్‌లో తనకు పుష్కలంగా అవకాశాలుంటాయని ఆ దేశం విశ్వసిస్తోంది. నిరుడు మే నెలలో జరిగిన ఆన్లైన్ శిఖరాగ్ర సదస్సులో ఆరోగ్యం, వాతావరణ మార్పులు, రక్షణ, భద్రత వగైరా అంశాలు చర్చకొచ్చాయి. లాక్డౌన్ కాలంలో నిబంధనలు బేఖాతరు చేసి మిత్రులు, పార్టీ నేతలతో మూడుసార్లు విందులు వినోదాల్లో మునిగి తేలారన్నది జాన్సన్‌పై అభియోగం. అది నిజం కాదని అబద్ధమాడి పార్లమెంటును పక్కదోవ పట్టించారన్న ఆరోపణపై గురువారం హౌస్ కమిటీ ఏర్పాటయింది. ఆ కమిటీ జాన్సన్‌ను దోషిగా నిర్ధారిస్తే నిబంధనల ప్రకారం ఆయన పదవి నుంచి తప్పుకోవాలి. ఈలోగా భారత్‌తో చరిత్రాత్మకమైన ఎఫ్‌టీఏ సాకారం కావాలనీ, తన పేరు చిరస్థాయిగా నిలవాలనీ జాన్సన్ కోరుకుంటున్నారు. అదెంతవరకూ సాధ్యమో చూడాలి. -
బ్రిటన్ ప్రధానితో మోదీ భేటీ, పలు అంశాలపై చర్చలు
TIME 01:30PM ప్రధాని మోదీ, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సమక్షంలో భారత్-యూకే మధ్య వివిధ ఒప్పందాలు జరిగాయి. 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' సందర్భంగా ప్రధాని బోరిస్ జాన్సన్ భారత్ పర్యటన చారిత్రాత్మకమని ప్రధాని మోదీ కొనియాడారు. ఇరు దేశాలు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై(ఎఫ్‌టీఏ) పని చేస్తున్నాయన్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఎఫ్‌టీఏను ముగించేందుకు కృషి చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌తో రక్షణ రంగం, వాణిజ్యం, వాతావరణం, ఇంధన భద్రతపై చర్చలు జరిగాయని నరేంద్ర మోదీ తెలిపారు. అదే విధంగా ఇండో-ఫసిఫిక్ ప్రాంతంలో భద్రత పరంగా సహకారాన్ని అందించుకోవడంపై కూడా చర్చించినట్లు పేర్కొన్నారు. కాగా గతేడాది భారత్-యూకే మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రారంభించామని తెలిపిన ప్రధాని మోదీ ఎఫ్టీఏకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. TIME 01:00PM ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌తో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. బోరిస్ జాన్సన్ భారత్‌ను తమ స్నేహితుడిగా అర్థం చేసుకున్నాడని అన్నారు. #WATCH Prime Minister Narendra Modi and British PM Boris Johnson hold talks at Delhi's Hyderabad House (Source: DD) pic.twitter.com/AlMBrLLB1f — ANI (@ANI) April 22, 2022 TIME 12:00PM ఇండో-ఫసిఫిక్ ప్రాంతంలో భద్రత పరంగా సహకారాన్ని అందించుకోవడం, ఇరు దేశాల మధ్య దౌత్య ఆర్థిక భాగస్వామ్యం వంటి అంశాలపై రెండు దేశాల ప్రధానులు చర్చించుకోనున్నారు. అలాగే బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌తో విదేశాంగ మంత్రి జైశంకర్ సమావేశమయ్యారు. External Affairs Minister Dr S Jaishankar calls on British PM Boris Johnson in Delhi Discussed our expanding partnership and implementing the India-UK Roadmap 2030, EAM says. pic.twitter.com/Y1b5zGky33 — ANI (@ANI) April 22, 2022 TIME 11:00AM బ్రిటన్ ప్రధానికి కలుసుకోవడం సంతోషంగా ఉందని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. సుధీర్ఘకాలంగా ఎదురుచుస్తున్న నా స్నేహితుడు @ బోరిస్ జాన్సన్‌కు ఇండియాలో చూడటం చాలా అద్భుతంగా ఉంది. చర్చలు కోసం ఎదురుచూస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. మోదీని కలవక ముందు.. నా స్నేహితుడితో సమావేశమయ్యేందుకు ఎదురు చూస్తున్నానని బోరిస్ ట్వీట్ చేశారు. నిరంకుశ రాజ్యాల నుంచి పెరుగుతోన్న బెదిరింపు వేళ.. వాతావారణ మార్పులు, ఇంధన భద్రత, రక్షణ వంటి అంశాల్లో మన ప్రజాస్వామ్య దేశాల భాగస్వామ్యం ముఖ్యమంటూ పేర్కొన్నారు. Wonderful to see you, my friend PM @BorisJohnson in India on a long-awaited visit. Look forward to our discussions today. https://t.co/6gUxR1PwPH pic.twitter.com/z6Ufv8zgAb — Narendra Modi (@narendramodi) April 22, 2022 TIME 10:00AM ►బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాష్ట్రపతి భవన్లో గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా తనకు అద్భుత స్వాగతం పలికినందుకు మోదీకి బ్రిటన్ ప్రధాని ధన్యవాదాలు తెలిపారు.. ‘భారత్- యూకే మధ్య పరిస్థితులు ఇంతకముందు కంటే ఇప్పుడు మరింత బలంగా, మంచిగా ఆన్నాయి’ అని బోరిస్ జాన్సన్ అన్నారు. #WATCH | "Thank you for the fantastic welcome...I don't think the things have ever been as strong or as good between us (India-UK) as they are now," UK PM Boris Johnson said in Delhi pic.twitter.com/f7tuRbFGKj — ANI (@ANI) April 22, 2022 న్యూఢిల్లీ: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రెండు రోజుల భారత్ పర్యటనలో భాగంగా శుక్రవారం ఢిల్లీకి చేరుకున్నారు. రాష్ట్రపతి భవన్ వద్ద బోరిస్‌కు ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికారు. ఇద్దరు కలిసి రాజ్‌ఘట్ చేరుకున్నారు. వాస్తవానికి గత ఏడాదిన్నర కాలంలోనే బ్రిటన్ ప్రధాని బోరిస్ జూన్సన్ భారత పర్యటనకు రావాల్సి ఉండగా.. కరోనా, రష్యా ఉక్రెయిన్ యుద్ధం వంటి సంక్షోభాల నేపథ్యంలో పర్యటన వాయిదాపడుతూ వచ్చింది. #WATCH | Prime Minister Narendra Modi receives UK PM Boris Johnson at Rashtrapati Bhavan pic.twitter.com/IpbQMKAWPb — ANI (@ANI) April 22, 2022 -
భారత్ కు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్
-
కామ్రేడ్ బాలా కన్నుమూత
లండన్: యునైటెడ్ కింగ్డమ్(యూకే)లో భారత సంతతికి చెందిన మావోయిస్టు నేత అరవిందన్ బాలాకృష్ణన్ అలియాస్ కామ్రేడ్ బాలా(81) మృతి చెందారు. ఇంగ్లండ్‌లోని హెచ్ఎంపీ డార్ట్మూర్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఆయన శుక్రవారం మరణించినట్లు యూకే ప్రిజన్ సర్వీసు అధికారి ప్రకటించారు. లైంగిక వేధింపుల కేసులో యూకే కోర్టు 2016 జనవరిలో కామ్రేడ్ బాలాకు 23 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. అసభ్య ప్రవర్తన కింద ఆరు కేసులు, అత్యాచారం కింద నాలుగు కేసులు, చిత్రహింసల కింద రెండు కేసుల్లో 23 ఏళ్లు జైలు శిక్షను న్యాయస్థానం ఖరారు చేసింది. అప్పటి నుంచి కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నారు. లండన్‌లో రహస్యంగా మావోయిస్టు ఉద్యమాన్ని నడిపించిన అరవింద్ బాలకృష్ణన్‌ను అనుచరులు కామ్రేడ్ బాలా అని పిలుచుకునేవారు. కామ్రేడ్ బాలా భారత్‌లోని కేరళ రాష్ట్రంలో ఓ గ్రామంలో జన్మించారు. సింగపూర్, మలేషియాలో పెరిగారు. అక్కడే కమ్యూనిస్టు నాయకుడిగా చెలామణి అయ్యారు. సింగపూర్ పౌరసత్వం పొందారు. 1963లో యూకేకు చేరుకున్నారు. ప్రఖ్యాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదువుకున్నారు. అక్కడే టాంజానియాకు చెందిన చందా పాట్నీని కలిశారు. 1969లో ఆమెను పెళ్లి చేసుకున్నారు. సొంత కుమార్తెను 30 ఏళ్లపాటు బంధించినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఆయన నేరం రుజువయ్యింది. సేవా కార్యక్రమాల ముసుగులో ఎంతోమంది మహిళలపై బాలా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, వారిని క్రూరంగా హింసించాడని స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అప్పట్లో న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. -
చైనా ఎందుకలా చేస్తోంది.. ఇప్పటికైనా మేల్కొంటే బెటర్!
లండన్: రష్యా, ఉక్రెయిన్ సంక్షోభంలో సరైన పక్షంవైపు నిలవాల్సిందిగా చైనాకు ఇంగ్లండ్ ప్రధాని బోరిస్ జాన్సన్ సూచించారు. నియంతృత్వ ప్రపంచ స్థాపనకు కలలుగంటున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధ పిపాసను చైనా ఇప్పటికీ ఖండించడం లేదంటూ తప్పుబట్టారు. చైనా మదిలో మరేదో ఆలోచన ఉందని జాన్సన్ అనుమానం వ్యక్తం చేశారు. సండే టైమ్స్ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ ప్రతిఘటన పుతిన్‌తో పాటు చైనాను కూడా షాక్‌కు గురి చేసిందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా చైనా మేల్కోవాలని తప్పుడు వైఖరితో ఇబ్బందుల్లో పడొద్దని సూచించారు. యుద్ధం అనేది దురదృష్టకర ఘటన అని.. అయితే, ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అని తర్కించలేనని అన్నారు. ఏదేమైనా తమ మద్దతు మాత్రం ఉక్రెయిన్కేనని ఆయన స్పష్టం చేశారు. చాలా దేశాలు పుతిన్ దూకుడుచూసి భయపడుతున్నాయని, అయితే ఉక్రెయిన్ త్వరగా కోలుకుంటుందని జాన్సన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా.. పుతిన్‌తో చర్చలకు సిద్ధమని జెలెన్స్కీ మరోసారి చెప్పారు. సమస్యలను చర్చలతో పరిష్కరించుకుందామని రెండేళ్లుగా చెప్తూ వస్తున్నానన్నారు. చర్చలు తప్ప యుద్ధాన్ని ఆపడానికి మరో మార్గం లేదన్నారు. చర్చల ప్రయత్నాలు విఫలమైతే మూడో ప్రపంచ యుద్ధ అనివార్యమని ఆయన హెచ్చరించారు. (చదవండి: బడిపై రష్యా బాంబుల వర్షం.. 150 మంది సేఫ్.. మిగతావారి పరిస్థితి!) -
అనూహ్య నిర్ణయం! ఏటీఎంలు అన్నీ బంద్..!
ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ క్రిప్టోకరెన్సీలు బిట్‌కాయిన్, ఈథిరియం, డోజీకాయిన్ విలువ గణనీయంగా పెరిగాయి. దీంతో ఆయా క్రిప్టోకరెన్సీలు మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ కూడా అమాంతం పెరిగాయి. ఇదిలా ఉండగా బిట్‌కాయిన్ క్రిప్టో కరెన్సీ ఏటీఎంలపై యుకే ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. చట్ట విరుద్దమైనవే..! యూకేలోని క్రిప్టోకరెన్సీ ఇన్వెస్టర్లకు ఆ దేశ ఫైనాన్షియల్ కండక్ట్ అథారిటీ (ఎఫ్సీఏ) గట్టి షాక్‌ను ఇచ్చింది. క్రిప్టో ఎక్సేఛేంజ్స్పై కొత్త ఉత్తర్వులను జారీ చేసింది. క్రిప్టో ఏటీఎం ఆపరేటర్లు వారి మెషీన్లు క్లోజ్ చేయాలని ఆదేశించింది. లేదంటే కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. కొత్త రూల్స్ ప్రకారం క్రిప్టో ఎక్స్చేంజ్ సర్వీసులు అందించే క్రిప్టో కరెన్సీ ఏటీఎంలు అన్నీ ఎఫ్సీఏ వద్ద రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే క్రిప్టో ఏటీఎంలు అన్నీ యూకే మనీ ల్యాండరింగ్ నిబంధనలకు అనుగుణంగానే పని చేయాల్సి ఉంటుంది. చట్టవిరుద్దంగా క్రిప్టో కరెన్సీ ఏటీఎం సర్వీసులు అందిస్తే మాత్రం కఠినమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరికలను జారీ చేసింది. క్రిప్టో లావాదేవీలు సులువు..! యుకేతో పాటుగా పలు దేశాల్లో ఇన్వెస్టర్లకు సులవుగా క్రిప్టోలను కొనుగోలు లేదా సేల్ చేసేందుకుగాను క్రిప్టో ఎటీఎంలను ఎక్సేఛేంజ్స్ ఏర్పాటుచేశాయి. ఇవి సాధారణ ఎటీఎం వలె కన్పిస్తాయి. ప్రజలు తమ బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి బిట్‌కాయిన్ వంటి క్రిప్టో-కరెన్సీ కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తాయి.కాగా యుకేలోని క్రిప్టో-కరెన్సీ సేవలను అందించే ఏ కంపెనీకి క్రిప్టో-ATMని ఆపరేట్ చేయడానికి లైసెన్స్ లేదు. క్రిప్టో ఏటీఎం డైరెక్టరీ కాయిన్ ఎటీఎం రాడార్ ప్రకారం..యుకేలో సుమారుగా 81 ఫంక్షనల్ క్రిప్టో ఎటీఎంలు ఉన్నాయి.ఎఫ్సీఏ నిర్ణయంతో ఆ దేశ క్రిప్టో ఇన్వెస్టర్లకు కొత్త చిక్కులను తెచ్చిపెట్టనుంది. చదవండి: 40 ఏళ్ల తరువాత కేంద్రం షాకింగ్ నిర్ణయం..! కారణం అదేనట..? -
ఆ జంట కళ్లు చెబుతాయి ‘ప్రేమ’ ఎంత స్వచ్ఛమైనదో!
మనసుకు నచ్చాలే కానీ మనిషి రూపంతో పనేముంటుంది? ప్రేమ గుడ్డిదని అనేవాళ్లు అంటూనే ఉంటారు. ఒక్కటైన ఆ జంట కళ్లు చెబుతాయి తమ ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో? ఈ అరుదైన బ్రిటన్ జంటే అందుకు ఉదాహరణ. క్లో లస్టెడ్ అనే మహిళ ఎత్తు 5 అడుగుల 4 అంగుళాలు. ఆమె భర్త జేమ్స్.. పొడవు 3 అడుగుల 7 అంగుళాలు మాత్రమే. 2016లో వీరి పెళ్లి వార్త ప్రపంచాన్నే అబ్బురపరచింది. 2021, జూన్ 2న ఈ కారణంతోనే (ఇలా భార్యాభర్తల మధ్య ఉండే ఎత్తుల తేడాతో) గిన్నిస్ రికార్డ్‌లకు ఎక్కింది ఈ జంట. ప్రస్తుతం జేమ్స్ (33) నటుడుగా, టెలివిజన్ వ్యాఖ్యాతగా పని చేస్తున్నాడు. క్లో (27) ఉపాధ్యాయురాలు గా పనిచేస్తోంది. వీరికి పెళ్లై ఐదేళ్లు కాగా.. వారికి ఒలీవియా అనే రెండేళ్ల కూతురు కూడా ఉంది. ఎముకలపై ప్రభావం చూపే డయాస్ట్రోఫిక్ డిస్ప్లేసియా అనే రుగ్మతతో బాధ పడుతున్న జేమ్స్.. ఎదుగుదల లేకుండా పొట్టిగానే ఉండిపోయాడు. 2012లో మొదటిసారి వీళ్లు కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఒకరిని ఒకరు కలుసుకున్నారు. 2014లో జేమ్స్... క్లోను ప్రపోజ్ చేశాడట. ప్రస్తుతం తమ రెండేళ్ల కూతురితో కలసి దిగిన వీరి ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. -
Emma Raducanu: వెంబడించి, వేధించాడు.. చాలా భయపడ్డా!
Emma Raducanu: బ్రిటన్ టెన్నిస్ సంచలనం ఎమ్మా రాడుకానును వెంబడిస్తూ వేధించిన కేసులో అమ్రిత్ మగర్ అనే వ్యక్తికి యునైటెడ్ కింగ్డమ్ కోర్టు మొట్టికాయలు వేసింది. ఎమ్మాను వేధించినందుకు గానూ ఈ సైకో అభిమానిని ఐదేళ్లపాటు ఆమెకు చుట్టుపక్కలకు వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు న్యాయస్థానం ‘రిస్ట్రెయినింగ్ ఆర్డర్’(నిషేధాజ్ఞ) జారీ చేసింది. కాగా గతేడాది నవంబరు 1 నుంచి డిసెంబరు 4 వరకు మగర్ ఎమ్మాను వెంబడించాడు. మూడుసార్లు ఆమె ఇంటికి వెళ్లి వివిధ బహుమతులు, కార్డులు అక్కడ పెట్టాడు. తాను ఎమ్మాను కలిసేందుకు 23 మైళ్ల దూరం నడిచానని, కాబట్టి తాను ఆమె ప్రేమకు పాత్రుడినని ఓ నోట్ రాశాడు. అంతేకాదు ఎమ్మా ఇంటి వద్ద ఉన్న క్రిస్మస్ ట్రీని కూడా అతడు దొంగిలించాడు. అంతేగాక ఆమె తండ్రి షూ కూడా ఎత్తుకొచ్చాడు. ఈ క్రమంలో ఎమ్మా రాడుకాను తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడిని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన కోర్టు మగర్‌ను దోషిగా తేల్చింది. ఇక ఈ వేధింపుల గురించి ఇటీవల ఎమ్మా మాట్లాడుతూ... అతడి ప్రవర్తన తనను భయాందోళనకు గురిచేసిందని, ఈ ఘటన తర్వాత ఒంటరిగా బయటకు వెళ్లలేకపోయానని చెప్పుకొచ్చింది. నా ఇంట్లోనే నాకు భద్రత లేదంటే మరి ఎక్కడ రక్షణ ఉంటుంది అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. కాగా 19 ఏళ్ల ఎమ్మా యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. చదవండి: IND vs SL: విజయం సాధించినప్పటికి నిరాశలో రోహిత్.. కారణం? -
యూకేను వణికిస్తున్న ‘యూనిస్’
లండన్: గంటకు 90 మైళ్ల వేగంతో కూడిన ఈదురుగాలులతో యూనిస్ తుపాను బ్రిటన్ను భయపెడుతోంది. వారం వ్యవధిలోనే దూసుకొచ్చిన ఈ రెండో తుపాను తీవ్రతపై యూకే ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేసింది. తీర ప్రాంతాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని, ప్రయాణాలను మానుకుని ఇళ్లకే పరిమితం కావాలని ప్రజలను హెచ్చరించింది. యూనిస్ తుపాను ప్రభావంతో జర్మనీ, పోలండ్‌లలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. చదవండి: (రష్యా అణు విన్యాసాలు) -
బ్రిటన్ లో ప్లాటినం జూబ్లీ వేడుకలు
-
యూకే నుంచి వచ్చి.. రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం
సాక్షి, మల్కాజిగిరి/ఏటూరునాగారం : ఉన్నత విద్య కోసం యూకే వెళ్లిన ఆ యువకుడు సెలవులకు ఇంటికి వచ్చి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు జిల్లా ఏటూరునాగారానికి చెందిన హర్షవర్ధన్‌రెడ్డి(26) యూకేలో ఎంఎస్ చేస్తున్నాడు. క్రిస్మస్ సందర్భంగా అక్కడ సెలవులు ఇవ్వడంతో సొంతవూరికి వచ్చాడు. వచ్చే నెలలో తిరిగి యూకేకు వెళ్లాల్సివుంది. మల్కాజిగిరిలో ఉంటున్న తన స్నేహితుడు రాహుల్‌ను కలవడానికి బుధవారం తన బైక్ మీద మల్కాజిగిరికి వస్తుండగా ఆర్.కె.నగర్ ప్రాంతంలో ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో హర్షవర్ధన్‌రెడ్డికి తీవ్రగాయాలు కావడంతో పోలీసులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఈ సంఘటన పై అతని సోదరుడు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన దురదృష్టకరం.. : ఎమ్మెల్యే మైనంపల్లి ఉన్నత చదువు చదువుకుంటున్న విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తనను కలిచివేసిందని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. గతంలో కూడా అదే ప్రాంతంలో జరిగిన ప్రమాదాల్లో మరి కొందరు మృతి చెందినట్లు తెలిసిందన్నారు. ఆ ప్రాంతంలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. -
ఒమిక్రాన్‌పై డబ్ల్యూహెచ్‌వో తీవ్ర హెచ్చరిక.. అక్కడ సగం మందికి ఒమిక్రాన్!
సాక్షి, న్యూఢిల్లీ: ఒమిక్రాన్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. రానున్న ఆరు నుంచి ఎనిమిది వారాల్లో.. యూరోప్‌లో సగం మందికి ఒమిక్రాన్ వేరియంట్ సోకే ప్రమాదం ఉన్నట్లు డబ్ల్యూహెచ్‌వో వైద్య నిపుణుడు డాక్టర్ హన్స్ క్లూజీ చెప్పారు. పశ్చిమం నుంచి తూర్పు దిశగా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది తొలి వారంలోనే యూరోప్‌లో 70 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయని, దీని ఆధారంగా డబ్ల్యూహెచ్‌వో ఈ అంచనా వేసినట్లు ఆయన పేర్కొన్నారు. కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఇన్ఫెక్షన్లు రెండింతలు అయినట్లు తెలుస్తోంది. యూరోప్‌లో 8 వారాల్లోగా సగం మందికి ఒమిక్రాన్ సోకుతుందని సియాటిల్‌కు చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యువేషన్ సంస్థ వెల్లడించినట్లు డాక్టర్ క్లూజీ తెలిపారు. ఇదిలాఉండగా.. ప్రపంచవ్యాప్తంగా 150 దేశాలకు ఒమిక్రాన్ వ్యాపించింది. 2,46,780 కేసులతో యూకే తొలి స్థానంలో ఉండగా.. 66,563 కేసులతో డెన్మార్క్ రెండో స్థానంలో ఉంది. ఇక భారత్‌లో 4,868 ఒమిక్రాన్ కేసులున్నాయి. (చదవండి: వాసనతో ప్రమాదం పసిగట్టి గోల్డ్ మెడల్ అందుకున్న చిట్టి హీరో.. ఇక లేడు) -
బ్రిటన్‌లో ఒమిక్రాన్ విలయం.. లక్ష దాటిన కొత్త కేసులు
UK Reports Over 1 Lakh Daily Covid Cases: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దెబ్బకు ప్రపంచదేశాలు చిగురుటాకులా వణుకుతున్నాయి. మిగతా వేవ్‌ల కంటే ఒమిక్రాన్ విస్తృత వేగంతో వ్యాపిస్తోంది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా వంటి యూరప్ దేశాల్లో ఒమిక్రాన్ పంజా విసురుతోంది. ముఖ్యంగా బ్రిటన్‌లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రపంచంలోనే అధిక కేసులతో ఆ దేశం అతలాకుతలం అవుతోంది. తాజాగా రికార్డు స్థాయిలో లక్షలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. మహమ్మారి వెలుగులోకి వచ్చినప్పటి నుంచి బ్రిటన్‌లో ఈ స్థాయిలో కరోనా కేసులు రావడం ఇదే తొలిసారి. యూకేలో గడిచిన 24 గంటల్లో 106,122 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 13 వేలకు పైగానే ఉంది. ఇక ఇప్పటి వరకు యూకేలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 69 వేలు దాటినట్లు అక్కడి ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మూడవ టీకా అంటే బూస్టర్ డోస్ తీసుకోవాలని యూకే ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. అదే విధంగా ఐదేళ్ల నుంచి 11 సంవత్సరాల పిల్లలకు కోవిడ్ టీకాను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఫైజర్-బయోఎన్‌టెక్ అభివృద్ధి చేసిన ఫైజర్ టీకాను పిల్లలకు అందించేందుకు బ్రిటిష్ రెగ్యులేటర్లు బుధవారం అంగీకరించారు. చదవండి: బ్రిటన్‌ని వెనక్కి నెట్టిన భారత్.. నెక్ట్స్ టార్గెట్ చైనానే కాగా ఐరోపా దేశాల్లో కరోనా విజృంభిస్తున్న దేశాల్లో బ్రిటన్ ముందు వరుసలో ఉంది. కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు కోవిడ్ -19 కారణంగా 147,573 మంది మరణించారు. 11 మిలియన్ల మంది ప్రజలు కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇప్పటివరకు 30 మిలియన్లకు పైగా ప్రజలు ఇక్కడ బూస్టర్ మోతాదులను తీసుకున్నారు. బ్రిటన్‌లో ఇప్పటివరకు 37,101 ఓమిక్రాన్ కేసులు నిర్ధారించారు. చదవండి: ఒమిక్రాన్‌తో కరోనా విశ్వరూపం! ఇంతకముందు బ్రిటన్‌లో కోవిడ్ సెల్ఫ్ ఐసొలేషన్ సమయాన్ని పది రోజుల నుంచి ఏడు రోజులకు తగ్గించారు. క్వారంటైన్ ప్రారంభమైనప్పటి నుంచి ఆరు, ఏడు రోజుల్లో వరుసగా రెండు నెగిటివ్ ఫలితాలు వస్తే వారి క్వారంటైన్‌ను ఇక అక్కడితో ముగించేయవచ్చునని బ్రిటన్ ఆరోగ్య శాఖ కార్యదర్శి సాజిద్ జావిద్ బుధవారం తెలిపారు. -
విజృంభిస్తున్న ఒమిక్రాన్..క్రిస్మస్ తర్వాత రెండు వారాల లాక్డౌన్!
UK Omicron Lockdown:: వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ వేరియెంట్ విస్తృతిని అడ్డుకోవడానికి కిస్మస్ తర్వాత రెండు వారాల లాక్డౌన్ విధించే ప్రణాళిక యునైటెడ్ కింగ్డమ్ (యూకే) ప్రభుత్వం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కోవిడ్–19 కట్టడికి శాస్త్రవేత్తల సలహా బృందం (సేజ్) ప్రధాని బోరిస్ జాన్సన్ ముందు ఉంచిన పలు ప్రతిపాదనల్లో రెండు వారాల లాక్డౌన్ సిఫారసు కూడా ఉంది. యూకేలో గురువారం 88,376, శుక్రవారం 93,045 కేసులు వచ్చాయి. లండన్‌లో శుక్రవారం ఒక్కరోజే 26 వేలకు పైగా కేసులు నమోదు కావడంతో నగర మేయర్ సాదిక్ ఖాన్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించారు. ఒకవైపు ఆసుపత్రుల్లో చేరే వారే సంఖ్య పెరుగుతుండగా... మరోవైపు సిబ్బంది గైర్హాజరు పెరుగుతోంది. దాని కి తోడు లండన్, స్కాట్లాండ్లలో ఒమిక్రాన్ కేసులు ఎక్కవగా నమోదవుతున్నాయి. సాధారణ పరిస్థితుల్లో ప్రభుత్వాసుత్రుల్లో అందేస్థాయి సేవలు అందకపోవచ్చనే సంకేతాలను మేయర్ ఇచ్చారు. ► నెదర్లాండ్‌లో ఆదివారం నుంచి కఠిన లాక్‌డౌన్‌ను అమలు చేయనున్నట్లు అపద్ధర్మ ప్రధాని మార్క్ రుట్టే ప్రకటించారు. ఒమిక్రాన్‌తో ఐదోవేవ్ విరుచుకుపడుతున్నందువల్ల తప్పట్లేదన్నారు. ► ఫ్రాన్స్ నూతన సంవత్సర వేడుకలపై నిషేధం విధించింది. ‘జనవరి ఆరంభానికల్లా ఒమిక్రాన్ ప్రధాన వేరియెంట్‌గా అవతరించే అవకాశాలున్నాయి. ఐదోవేవ్ వచ్చేసింది, పూర్తిస్థాయిలో విరుచుపడుతోంది’ అని ఫ్రాన్స్ ప్రధాని జీన్ కాస్తక్స్ ప్రకటించారు. క్రిస్మస్కు పెద్ద సంఖ్యలో గుమిగూడొద్దని, వేడుకల్లో పాల్గొనే కుటుంబసభ్యుల సంఖ్యను కూడా పరిమితం చేయాలని కోరారు. ► డెన్మార్క్ థియేటర్లను, సంగీత కచేరి నిర్వహించే హాళ్లను, మ్యూజియంలు, అమ్యూజ్మెంట్ పార్కులను మూసివేసింది. డెల్టా కంటే ఒమిక్రాన్ వేగమెక్కువ: డబ్లు్యహెచ్‌ఓ జెనీవా: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ను 89 దేశాల్లో గుర్తించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్లు్యహెచ్‌ఓ) తెలిపింది. డెల్టా కన్నా ఇది చాలా వేగంగా వ్యాపిస్తోందని, దీని వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాల్లో 1.5–3 రోజుల్లోనే ఇది రెట్టింపవుతోందని హెచ్చరించింది. అందుబాటులో ఉన్న గణాంకాల ఆధారంగా శుక్రవారం ఒమిక్రాన్‌పై సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది. సమూహ వ్యాప్తి జరుగుతున్న చోట డెల్టాను ఈ వేరియంట్ మించిపోగలదని తెలిపింది. -
బ్రిటన్ మహారాణి ఎలిజబెత్2 కు మరోసారి అనారోగ్యం
-
భూగోళానికి పెనుముప్పు
గ్లాస్గో: వాతావరణ మార్పుల కారణంగా భూగోళానికి పెనుముప్పు పొంచి ఉందని, ప్రపంచ దేశాలు తక్షణమే మేలుకొని, దిద్దుబాటు చర్యలు ప్రారంభించకపోతే పరిస్థితి చెయ్యి దాటిపోతుందని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ హెచ్చరించారు. స్కాట్లాండ్లో గ్లాస్గో నగరంలోని స్కాటిష్ ఈవెంట్ క్యాంపస్‌లో ఆయన సోమవారం భాగస్వామ్య పక్షాల 26వ శిఖరాగ్ర సదస్సులో (కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్–కాప్) భాగంగా రెండు రోజులపాటు జరిగే ప్రపంచ దేశాల అధినేతల సదస్సును లాంఛనంగా ప్రారంభించారు. బ్రిటన్ ఆతిథ్యం ఇస్తున్న కాప్–26 నవంబర్ 12 దాకా కొనసాగనుంది. సోమవారం భారత ప్రధాని మోదీ సహా దాదాపు 120 దేశాల అధినేతలు, ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశం ప్రపంచం అంతం కాకుండా పోరాడే జేమ్స్‌బాండ్ ఆగమనం లాంటిదేనని బోరిస్ జాన్సన్ అభివర్ణించారు. అర్ధరాత్రి కావడానికి మరొక్క నిమిషం మాత్రమే ఉందని, మనం ఇప్పుడే ముందడుగు వేయాలని ఉద్బోధించారు. మాట తప్పితే ప్రజలు క్షమించరు 2015లో పారిస్‌లో జరిగిన కాప్ సదస్సులో నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు ఏకాభిప్రాయం సాధించడంతోపాటు కర్బన ఉద్గారాలకు కత్తెర వేసే దిశగా కొత్త లక్ష్యాలను ఏర్పరచుకోవడానికి గ్లాస్గోలో కాప్–26 నిర్వహిస్తున్నారు. వాతావరణ మార్పుల ఉద్యమకారిణి గ్రేటా థన్‌బర్గ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను జాన్సన్ గుర్తుచేశారు. పాలకులు ఇస్తున్న హామీలన్నీ నీటి మూటలవుతున్నాయని థన్‌బర్గ్ ఆరోపించారని అన్నారు. మాట తప్పితే ప్రజలు మనల్ని క్షమించబోరని చెప్పారు. ‘ఇండియా గ్రీన్ గ్యారంటీ’ భారత్‌లో హరిత ప్రాజెక్టుల కోసం అదనంగా 750 మిలియన్ పౌండ్లు విడుదల చేయడానికి ప్రపంచ బ్యాంక్‌కు ‘ఇండియా గ్రీన్ గ్యారంటీ’ ఇస్తామని బ్రిటన్ ప్రకటించింది. క్లీన్ ఎనర్జీ, రవాణా, పట్టణాభివృద్ధి తదితర రంగాల్లో మౌలిక సదుపాయాల కోసం ఈ నిధులను ఖర్చు చేయనున్నారు. భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీతోపాటు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో గ్రీన్ ప్రాజెక్టులకు ప్రైవేట్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ గ్రూప్ నుంచి 210 మిలియన్ పౌండ్ల రుణ సాయం అందిస్తామని యూకే ప్రకటించింది. తక్షణమే కార్యాచరణ ప్రారంభించాలి: బైడెన్ గ్లోబల్ వార్మింగ్ విసురుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు చేతులు కలపాలని అమెరికా అధ్యక్షుడు జో బైడైన్ పిలుపునిచ్చారు. ఈ విషయంలో మీనమేషాలు లెక్కిస్తూ కూర్చోవడానికి సమయం లేదని, తక్షణమే కార్యాచరణకు శ్రీకారం చుట్టాలని చెప్పారు. ఆయన కాప్–26లో మాట్లాడారు. వాతావరణ మార్పుల వల్ల తలెత్తుతున్న దుష్పరిణామాలను నివారించడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. సంక్షోభంలోనూ అవకాశాలు వెతుక్కోవాలని తెలిపారు. పర్యావరణాన్ని కాపాడుకునే విషయంలో ప్రపంచ దేశాలకు మరింత సాయం చేయాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. 2050 నాటికి అమెరికాను క్లీన్ ఎనర్జీ దేశంగా మారుస్తామంటూ జో బైడెన్ ప్రభుత్వ యంత్రాంగం తన ప్రణాళికను విడుదల చేసింది. పారిస్ ఒప్పందం నుంచి అమెరికా తప్పుకోవడం పట్ల జో బైడెన్ విచారం వ్యక్తం చేశారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై ఆయన కాప్ సదస్సుకు క్షమాపణ చెప్పారు. -
పారిస్ ఒప్పందానికి.. కట్టుబడి ఉన్నది మేమే
గ్లాస్గో: వాతావరణ మార్పులను ఎదుర్కొనే విషయంలో పారిస్ ఒప్పందాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్న ఏకైక దేశం భారత్ మాత్రమేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ ఒప్పందానికి భారత్ సంపూర్ణంగా కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. ఆయన సోమవారం యునైటెడ్ కింగ్డమ్(యూకే)లో గ్లాస్గో నగరంలో కాప్–26లో భాగంగా నిర్వహించిన ప్రపంచ దేశాల అధినేతల సదస్సులో మాట్లాడారు. మానవళి మనుగడకు ముప్పుగా మారుతున్న వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా తాము అంకితభావంతో కృషి సాగిస్తున్నామని చెప్పారు. ప్రపంచ జనాభాలో 17 శాతం మంది భారత్‌లో నివసిస్తున్నప్పటికీ మొత్తం ప్రపంచ కర్బన ఉద్గారాల్లో తమ దేశ వాటా కేవలం 5 శాతమేనని మోదీ చెప్పారు. ప్రపంచ స్థాపిత పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో భారత్ నాలుగో స్థానంలో ఉందని వివరించారు. మొత్తం ఇంధన వినియోగంలో సంప్రదాయేతర ఇంధన వనరుల వాటాను గత ఏడేళ్లలో 25 శాతం పెంచామని పేర్కొన్నారు. ఇప్పుడు వినియోగంలో సంప్రదాయేతర ఇంధన వనరుల వాటా 40 శాతానికి చేరుకుందని తెలిపారు. జీవన విధానంలో మార్పులు చేసుకుంటే భూగోళాన్ని కాపాడుకోవడం సులభమేనని అభిప్రాయపడ్డారు. పర్యావరణహిత జీవన విధానాన్ని అలవర్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇది గ్లోబల్ మిషన్‌గా మారాలని ఆకాంక్షించారు. క్లైమేట్ ఫైనాన్స్ కింద ట్రిలియన్ డాలర్లు అందజేస్తామంటూ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అభివృద్ధి చెందిన దేశాలను కోరారు. సాధ్యమైనంత త్వరగా ఈ నిధులు సమకూర్చాలని విన్నవించారు. హామీలు ఇచ్చి, ఆచరించకుండా వెనుకడుగు వేస్తున్న అభివృద్ధి చెందిన దేశాలపై ఒత్తిడి పెంచుతామని, అప్పుడే న్యాయం జరుగుతుందని వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణ విషయంలో భారత్ సంకల్పాన్ని వివరిస్తూ ప్రధాని మోదీ ఐదు సూత్రాల ప్రణాళికలను ప్రకటించారు. ప్రకృతితో సహ జీవనం వాతావరణ మార్పులపై కేవలం చర్చలకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని వాటిని ఎదిరించేందుకు అవసరమైన కార్యాచరణకు ఇవ్వడం లేదని మోదీ ఆక్షేపించారు. తద్వారా ఈ మార్పుల వల్ల ప్రభావితమవుతున్న దేశాలకు అన్యాయం జరుగుతోందని చెప్పారు. సంప్రదాయ పద్ధతుల ప్రకారం ప్రకృతితో కలిసి జీవించడాన్ని పాఠశాలల్లో పాఠ్య ప్రణాళికలో(సిలబస్) చేర్చాల్సిన అవసరం ఉందని సూచించారు. ఇప్పటికీ ఎన్నో సంప్రదాయ తెగలు ప్రకృతితో కలిసి జీవిస్తున్నాయని గుర్తుచేశారు. ఆ పరిజ్ఞానం ఆయా తెగల ప్రజలకు ఉందని అన్నారు. ఇది ముందు తరాలకు సైతం అందాలంటే సిలబస్‌లో చేర్చాలని చెప్పారు. భారత్‌తో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వాతావరణ మార్పులు వ్యవసాయ రంగానికి విసురుతున్న సవాళ్లు తక్కువేమీ కాదని తెలిపారు. ఈ సవాళ్ల కారణంగా పంటల సాగు తీరే మారిపోతోందని అన్నారు. అకాల వర్షాలు, వరదలు, పెనుగాలులు పంటలను దెబ్బతీస్తున్నాయని వివరించారు. ప్రభుత్వాల విధాన నిర్ణయాల్లో వాతావరణ మార్పులపై పోరాటానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఈ విషయంలో తాము చొరవ తీసుకుంటున్నామని చెప్పారు. ఇంటింటికీ కుళాయి ద్వారా తాగునీరు, క్లీన్ ఇండియా మిషన్, వంట గ్యాస్ సరఫరా వంటి చర్యలు చేపట్టామన్నారు. ఇవన్నీ ప్రజల జీవన నాణ్యత పెరిగేందుకు దోహదపడుతున్నాయని వెల్లడించారు. బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్‌తో మోదీ సోమవారం సమావేశమయ్యారు. గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధన వనరులు, క్లీన్ టెక్నాలజీ, ఆర్థికం, రక్షణ తదితర రంగాల్లో పరస్పర సహకారంపై చర్చించారు. జాన్సన్, మోదీ మధ్య జరిగిన తొలి భేటీ ఇదే కావడం విశేషం. ఐదు సూత్రాల అజెండా 1. శిలాజ ఇంధనాల వినియోగానికి క్రమంగా స్వస్తి. సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 2030 నాటికి 500 గిగావాట్లకు పెంచుతాం. 2. పునరుత్పాదక ఇంధన వనరులకు పెద్ద పీట. 2030 నాటికి దేశ ఇంధన అవసరాల్లో 50 శాతం ఇంధనం పునరుత్పాదక వనరుల ద్వారా సమకూర్చుకుంటాం. 3. ఇప్పటి నుంచి 2030 దాకా ఒక బిలియన్ (100 కోట్ల) టన్నుల మేర కర్బన ఉద్గారాల తగ్గిస్తాం. 4. కర్బన ఉద్గారాల వల్ల ఆర్థిక వ్యవస్థపై పడే ప్రతికూల ప్రభావాన్ని 2030 నాటికి 45 శాతం కంటే తక్కువకు పరిమితం చేస్తాం. 5. నెట్ జిరో(శూన్య) కర్బన ఉద్గారాలు అనే లక్ష్యాన్ని 2070 నాటికి భారత్ సాధిస్తుంది. -
జి–20 సదస్సుకు ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఇటలీలోని రోమ్‌లో ఈ నెల 30న ప్రారంభం కానున్న జి–20 దేశాల అధినేతల 16వ శిఖరాగ్ర సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్నట్లు విదేశాంగ శాఖ ఆదివారం వెల్లడించింది. ప్రధాని ఈ నెల 29 నుంచి నవంబర్ 2వ తేదీదాకా ఇటలీతోపాటు యునైటెడ్ కింగ్డమ్(యూకే)లో పర్యటిస్తారని తెలియజేసింది. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్(కాప్)–26 ప్రపంచ దేశాల అధినేతల సదస్సులోనూ ఆయన పాల్గొంటారని పేర్కొంది. జి–20 కూటమికి ప్రస్తుతం ఇటలీ నాయకత్వం వహిస్తోంది. ఈ నెల 30, 31న.. రోమ్‌లో రెండో రోజులపాటు జరిగే శిఖరాగ్ర సదస్సుకు ఆ దేశమే ఆతిథ్యం ఇస్తోంది. అఫ్గానిస్తాన్ పరిణామాలు, వాతావరణ మార్పులు మానవాళికి విసురుతున్న సవాళ్లు, కరోనా వైరస్ వంటి కీలక అంశాలపై జి–20 సదస్సులో ప్రధానంగా చర్చ జరగనుంది. 1999 నుంచి జి–20 సదస్సును ప్రతిఏటా నిర్వహిస్తున్నారు. కాప్–26 సదస్సు ఈ నెల 31 నుంచి నవంబర్ 12 దాకా యూకేలోని గ్లాస్గోలో జరగనుంది. -
యూకేను వణికిస్తున్న కరోనా వైరస్ కొత్తరకం వేరియెంట్
లండన్/వాషింగ్టన్: కరోనా వైరస్ కొత్తరకం వేరియెంట్ ప్రపంచ దేశాలను భయపెడుతోంది. డెల్టా వేరియెంట్ ఉపవర్గమైన ఏవై.4.2 రకం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రెండేళ్లుగా కరోనా వైరస్‌లో జన్యుపరమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయితే డెల్టా వేరియెంట్ తరహాలో మరేది ఇప్పటివరకు వ్యాప్తి చెందలేదు. ఇప్పుడు డెల్టా ఉపవర్గమైన ఏవై.4.2 కరోనా కేసులు యునైటెడ్ కింగ్డమ్(యూకే)ను వణికిస్తున్నాయి. అమెరికా, రష్యా, ఇజ్రాయెల్‌లో కూడా ఈ కొత్త రకం వేరియెంట్ కేసులు నమోదవుతున్నాయి. గత ఏడాది అక్టోబర్‌లో తొలిసారిగా భారత్‌లో వెలుగులోకి వచ్చిన డెల్టా వేరియెంట్లో ఇప్పటిదాకా 55 సార్లు జన్యుపరమైన మార్పులు జరిగాయి. కానీ, అవేవీ పెద్దగా ప్రమాదకరంగా మారలేదు. తాజాగా ఏవై.4.2 వ్యాప్తి తీరుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ వేరియెంట్ తొలి సారిగా జూలైలో యూకేలో బయటపడింది. కరో నా వైరస్‌లోని స్పైక్ ప్రొటీన్ మ్యుటేషన్లు అయిన ఏ222వీ, వై145హెచ్‌ల సమ్మేళనంగా ఈ కొత్త వేరియెంట్ పుట్టిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిత్యం 50 వేలకుపైగా కేసులు బ్రిటన్‌లో రోజు రోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. గత వారం రోజులుగా ప్రతిరోజూ 50 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గురువారం ఒక్క రోజే 52,009 కేసులు నమోదయ్యాయి. జూలై 17 తర్వాత అత్యధికంగా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. కరోనా కేసుల పెరుగుదలని నిశితంగా గమనిస్తున్నామని బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ చెప్పారు. ఇటీవలి కాలంలో యూకేలో కరోనా రోగుల నుంచి సేకరించిన శాంపిల్స్‌లో 96 శాతం ఏవై.4.2 వేరియంట్‌వే కావడం ఆందోళన కలిగిస్తోంది. యూకేలో డెల్టా రకం కరోనా కేసులతో పోలిస్తే ఈ కేసులు 10 శాతం అధికంగా వ్యాప్తి చెందుతున్నట్టుగా లండన్ జెనెటిక్స్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఫ్రాంకోయిస్ బల్లాక్స్ వెల్లడించారు. రష్యాలో రికార్డు స్థాయిలో కరోనా మరణాలు, కేసులు మాస్కో: రష్యాలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోద వుతుండటంతోపాటు మరణాలు సంభవిస్తున్నాయి. 24 గంటల వ్యవధిలో 37,141 కొత్త కేసులు నమోదు కాగా, 1,064 మరణాలు సంభవించినట్లు తెలిపింది. యూరప్‌లోనే అత్యధికంగా రష్యాలో 2,28,453 కరోనా మరణాలు రికార్డయ్యాయి. దీంతో, అక్టోబర్ 30 నుంచి నవంబర్ 7 వరకు ఇళ్లలోనే ఉండిపోవాల్సిందిగా అధ్యక్షుడు పుతిన్ ప్రజల ను కోరారు. మాస్క్ ధరించకపో వడంతోనే కేసులు తీవ్రంగా పెరుగుతున్నట్లు భావిస్తున్న యంత్రాంగం ప్రజా రవాణా వ్యవస్థను కూడా బంద్ చేయాలని యోచిస్తోంది. రాజధాని మాస్కోలోని స్కూళ్లు, సినిమా హాళ్లు, వినోద ప్రదేశాలు, స్టోర్లను ఈనెల 28 నుంచి మూసి వేయనున్నారు. పిల్లలకీ ఫైజర్ టీకా సురక్షితం! 91% సమర్థంగా పనిచేస్తోందన్న కంపెనీ అమెరికాకు చెందిన ఫైజర్ కంపెనీ అభివృద్ధి చేసిన కోవిడ్–19 వ్యాక్సిన్ 5–11 ఏళ్ల వయసు వారిలో 91 శాతం సమర్థవంతంగా పని చేస్తున్నట్లు ఈ కంపెనీ చేసిన అధ్యయనంలో వెల్లడైంది. పిల్లలకి కూడా ఈ వ్యాక్సిన్ అత్యంత సురక్షితమేనని తేలింది. ఇప్పటికే 12 ఏళ్ల పైబడిన వారికి అమెరికాలో టీకాలు ఇస్తున్నారు. 5 నుంచి 11 ఏళ్ల వయసు వారికి నవంబర్ నుంచి ఇవ్వడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. క్రిస్మస్ పండుగ నాటికి కరోనా మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేయడానికి జో బైడెన్ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. పిల్లల్లో ఫైజర్ వ్యాక్సిన్‌కి సంబంధించిన అధ్యయనం వివరాలను ఆన్లైన్లో ఉంచారు. దీనిపై అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ తన సొంత సమీక్ష చేసిన తర్వాత పిల్లలకు వ్యాక్సిన్‌ను సిఫారసు చేయనుంది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ టీకాపై తుది నిర్ణయం తీసుకుంటుంది. అమెరికాలో 5–11 ఏళ్ల వయసు మధ్య వారు దాదాపుగా 2.8 కోట్ల మంది ఉంటారు. వీరందరికీ టీకాలు ఇవ్వాలని, అప్పుడే నిర్భయంగా పిల్లలందరూ స్కూళ్లకి వస్తారని తల్లిదండ్రులు అంటున్నారు. పిల్లలకిచ్చే టీకాలకు సంబంధించి సూదుల్ని ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. -
పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్: తెలిసినవారి పేర్లు కూడా మర్చిపోతున్నారా?
దాదాపు ఏడాదిన్నర కింద మొదలైన కరోనా విలయం ఇప్పుడిప్పుడే సర్దుకుంటోంది. కానీ దాని ప్రభావం మాత్రం ఇప్పటికీ ప్రమాదకరంగానే కనిపిస్తోందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కరోనా సోకి తగ్గినవారిలో పైకి ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా.. అంతర్గతంగా అవయవాల పనితీరును దెబ్బతీస్తోందని, మెదడుపైనా ప్రభావం చూపుతోందని తాజాగా గుర్తించారు. ఈ పరిశోధన వివరాలు ఏమిటో తెలుసుకుందామా? - సాక్షి సెంట్రల్ డెస్క్ మానసిక సమస్యలను ముందే గుర్తించినా.. కరోనా కారణంగా శారీరకంగానే కాకుండా మానసికంగా పలు సమస్యలు ఎదురవుతున్నట్టు శాస్త్రవేత్తలు ఇంతకుముందే గుర్తించారు. కరోనా వచ్చి తగ్గిపోయాక (పోస్ట్ కోవిడ్ సమయంలో) చిన్న విషయాలకే ఆందోళనకు లోనవడం, కుంగుబాటు (డిప్రెషన్), స్వల్పస్థాయి మతిమరుపు, గందరగోళానికి లోనవడం లక్షణాలు కనిపిస్తున్నట్టు తేల్చారు. అందులోనూ 45-50 ఏళ్లు పైబడిన వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. అయితే కరోనా సోకి ఒంటరిగా క్వారంటైన్లో ఉండాల్సిరావడం, తమకు ఏదైనా అవుతుందేమోనన్న భయం, కరోనాతో ఉపాధి కోల్పోయి ఆర్థికపరమైన సమస్యలు తలెత్తడం వంటివి ఈ మానసిక సమస్యలకు కారణమన్న నిర్ధారణకు వచ్చారు. అయితే కరోనా వైరస్ వల్ల మెదడు కుంచించుకుపోతోందని, ఇది కూడా సమస్యలకు కారణమవుతోందని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద ఎకో అర్బన్ పార్క్ ‘తెలంగాణలో..’ 45 వేల మందిపై పరిశోధన కరోనా వల్ల మెదడు, నాడీ మండలంపై ప్రభావంపై అమెరికాలోని టెక్సాస్ ఏఅండ్ఎం యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ ఏడాది ఆగస్టులో విస్తృతమైన పరిశోధన మొదలుపెట్టారు. ‘యూకే బయోబ్యాంక్’ సంస్థ వద్ద ఉన్న సుమారు 45 వేల మంది మెదడు స్కానింగ్ డేటాను తీసుకుని అధ్యయనం. కరోనా సమయంలోనేగాకుండా అంతకుముందటి పరిస్థితిని పోల్చి చూసేందుకు.. 2014 నాటి నుంచి 2021 జూలై వరకు నమోదు చేసిన అన్ని వయసుల వారి డేటాను పరిగణనలోకి తీసుకున్నారు. కరోనాకు ముందు, తర్వాత మెదడులో జరిగిన మార్పులను పరిశీలించారు. స్వల్ప స్థాయి కోవిడ్ ఉన్నా.. వయసు, ఆరోగ్య పరిస్థితి, ప్రాంతం వంటివన్నీ దాదాపు ఒకేలా ఉండి.. కరోనా సోకిన, సోకని వ్యక్తుల మెదడు స్కానింగ్‌లను శాస్త్రవేత్తలు పోల్చి చూశారు. కరోనా సోకనివారితో పోలిస్తే.. సోకినవారి మెదడులోని కొంతభాగం లో గ్రే మేటర్ (మెదడు కణాలైన న్యూరాన్ల సమూహం) మందం తగ్గిపోయినట్టు గుర్తించారు. తీవ్రస్థాయి కరోనా సోకినవారిలోనే కాకుండా.. స్వల్పంగా కరోనా లక్షణాలు ఉన్నవారిలోనూ మెదడు కుంచించుకుపోతోందని తేల్చా రు. ఆ మేరకు సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ (సీఎస్ఎఫ్) పరిమాణం పెరుగుతోందని గుర్తించారు. సాధారణంగా 40 సంవత్సరాల వయసు దాటాక ఏళ్లు గడిచినకొద్దీ మెదడులో గ్రేమేటర్ కుంచించుకుపోతూ ఉంటుందని.. కానీ కరోనా సోకినవారిలో తక్కువ వయసులోనే, ఎక్కువ వేగంగా కుంచించుకుపోతోందని గుర్తించారు. ముఖ్యంగా 45-50 ఏళ్ల వయసు దాటినవారిలో ఈ ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు తేల్చారు. ఆలోచన శక్తి, మానసిక సామర్థ్యాలకు దెబ్బ కరోనా సోకినవారిలో మొదటినుంచీ కనిపిస్తున్న ముఖ్య లక్షణం వాసన, రుచి చూసే సామర్థ్యం కోల్పోవడం. మెదడు ముందుభాగంలో ఉండే ‘ఆల్ఫాక్టరీ బల్బ్’గా పిలిచే ప్రాంతం ద్వారా.. మిగతా భాగాలకు వాసనకు సంబంధించిన సిగ్నల్స్ వెళతాయి. ఈ భాగంపై కరోనా వైరస్ ప్రభావం చూపడం వల్లే వాసన చూడలేని పరిస్థితి ఏర్పడుతుంది. ‘ఆల్ఫాక్టరీ బల్బ్’తోపాటు మెదడులోని టెంపోరల్ లోబ్, హిప్పోకాంపస్ భాగాలకు అనుసంధానం ఉంటుంది. మన జ్ఞాపకశక్తి, ఆలోచనా శక్తికి ఈ భాగాలే కీలకం. కరోనా సోకినవారిలో ఈ భాగాలు కూడా కుంచించుకుపోతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనివల్లే ఆలోచన శక్తిపై ప్రభావం పడుతోందని, మానసికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ముఖ్యంగా జ్ఞాపకశక్తి తగ్గిపోవడం వంటి సమస్యలు వస్తున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంతా బాగానే ఉన్నట్టు అనిపించినా.. కొన్నిసార్లు తెలిసినవారి పేర్లు, చిన్నచిన్న ఘటనలు కూడా కాసేపు గుర్తురాని పరిస్థితి ఉంటోందని వివరిస్తున్నారు. ఇంకా తేల్చాల్సినవీ ఉన్నాయి వయసు మీద పడినకొద్దీ మెదడులో జరిగే మార్పుల తరహాలో కోవిడ్ బారినపడ్డవారిలో మార్పులు కనిపిస్తున్నాయని.. దీని ప్రభావం దీర్ఘకాలంలో ఎలా ఉంటుందన్న దానిపై అధ్యయనం చేస్తున్నామని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త జెస్సికా బెర్నార్డ్ తెలిపారు. కోవిడ్ వల్ల దెబ్బతిన్న మెదడు మళ్లీ కోలుకుంటుందా? ఈ సమస్య ఎంతకాలం ఉంటుందన్నది తేలాల్సి ఉందని వెల్లడించారు. -
వ్యాక్సిన్ వేసుకున్నా పరిగణనలోకి తీసుకోరు
లండన్: భారత్ సహాకొన్ని దేశాల వారు కోవిడ్–19 వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నా సరే వ్యాక్సినేషన్ అయినట్లుగా పరిగణించబోమని యూకే తెలిపింది. తమ దేశానికి వచ్చే ఆయా దేశాల వారు 10 రోజుల క్వారంటైన్ తప్పనిసరిగా పాటించాలంటూ యూకే కొత్త ప్రయాణ నిబంధనలను తీసుకువచ్చింది. ఆఫ్రికా, దక్షిణ అమెరికా ప్రాంత దేశాలతోపాటు యూఏఈ, భారత్, టర్కీ, జోర్డాన్, థాయ్‌లాండ్, రష్యాకు చెందిన వారు తమ దేశాల్లో వ్యాక్సిన్ వేయించుకున్నట్లయితే, వారిని టీకా తీసుకున్నట్లుగా పరిగణించట్లేదని తెలిపింది. ఈ దేశాల వారు క్వారంటైన్ నిబంధనలను పాటించాల్సి ఉంటుందని తెలిపింది. ఇప్పటి వరకు దేశాలను మూడు కేటగిరీ(గ్రీన్, అంబర్, రెడ్)లుగా విభజించి యూకే ప్రయాణ నిబంధనలను అమలు చేస్తోంది. ఇందులో భారత్ అంబర్ కేటగిరీలో ఉంది. తాజా, నిబంధనల ప్రకారం కేవలం ఒకే కేటగిరీ–రెడ్ మాత్రమే ఉంది. ఈ నిబంధనలు అక్టోబర్ 4వ తేదీ ఉదయం 4 గంటల నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. మిగతా దేశాలకు మాత్రం ప్రయాణ ఆంక్షలను సడలిస్తున్నట్లు యూకే ప్రభుత్వం తెలిపింది. ఇది జాతి వివక్షే: కాంగ్రెస్ కోవిషీల్డ్ టీకా వేసుకున్న భారతీయ ప్రయాణికులకు యూకే ప్రభుత్వం క్వారంటైన్ ఆంక్షలు విధించడం జాతి వివక్షేనని కేంద్ర మాజీ మంత్రులు జైరాం రమేశ్, శశిథరూర్ పేర్కొన్నారు. ఆక్స్ఫర్డ్ వర్సిటీ తయారు చేసిన టీకానే సీరం ఇన్స్టిట్యూట్ కోవిషీల్డ్‌గా ఉత్పత్తి చేస్తోందని, దీనినే దేశవ్యాప్త వ్యాక్సినేషన్లో వాడుతున్న విషయాన్ని జైరాం రమేశ్ గుర్తు చేశారు. యూకే నిబంధనల కారణంగా కేంబ్రిడ్జి యూనియన్ డిబేటింగ్ సొసైటీ చర్చా కార్యక్రమంతోపాటు తన పుస్తకం ‘ది బ్యాటిల్ ఆఫ్ బిలాంగింగ్’యూకే ఎడిషన్ ఆవిష్కరణ కార్యక్రమం నుంచి వైదొలిగానని థరూర్ చెప్పారు. యూకే వెళ్లాల్సిన భారతీయులు.. ►ప్రయాణానికి మూడు రోజుల ముందుగా కోవిడ్–19 పరీక్ష చేయించుకోవాలి. ►అక్కడికి చేరుకున్న 2వ, 8వ రోజున జరిపే కోవిడ్ పరీక్షలకు ముందుగానే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ►ఇంగ్లండ్ చేరుకునేందుకు 48 గంటల ముందుగా ప్యాసింజర్ లొకేటర్ ఫాంను పూర్తి చేయాలి. ఇంగ్లండ్ చేరుకున్న తర్వాత చేయాల్సినవి.. ►ఇంట్లో గానీ, 10 రోజులపాటు మీరు ఉండాల్సిన ప్రాంతంలో గానీ క్వారంటైన్ పాటించాలి. ►2వ రోజు ముందు, 8వ రోజుగానీ, ఆ తర్వాత గానీ కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలి. ►యూకేలో రెండు డోసుల టీకా వేయించుకున్న వారు అక్కడి నుంచి బయలుదేరే ముందు టెస్ట్ చేయించుకోవాల్సిన పనిలేదు. -
వైరల్: 6500 మీటర్ల ఎత్తులో రెండు హాట్ ఎయిర్ బెలూన్ల మధ్య నడక
కొంతమంది ఎలాంటి సాహసాలు చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. రికార్డులు, ఫేమస్ అవ్వడం కోసం హద్దులు చెరిపేసి ఎంత రిస్క్ చేసేందుకైనా వెనకాడరు. ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు ప్రాణాలకే ప్రమాదం ఉంటుంది. రిస్క్ చేస్తన్నంతసేపు టెన్షన్‌తో రోమాలు నిక్కపొడుచుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. అయితే ఇది ఇప్పటిది కాదు. 17 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనకు సంబంధించినది. దీనిని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ మళ్లీ తన ఇన్స్టాగ్రామ్ పేజ్‌లో పోస్టు చేసింది. వివరాల్లోకి వెళితే బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తి రెండు హాట్ ఎయిర్ బెలూన్ల మధ్య నడుస్తూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. మైక్ హోవార్డ్ అనే వ్యక్తి 21,00 అడుగులు(6,522 మీటర్లు) ఎత్తులో రెండు హాట్ ఎయిర్ బెలూన్లను కలిపే మెటల్ ప్లాంక్‌పై తీగల సాయంతో నడుస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. ఇది 50 ఏళ్లు, 50 రికార్డులు టీవీ షో కోసం 2004 సెప్టెంబర్ 1న తీసిన వీడియో. తాజాగా మళ్లీ వైరలవ్వడంతో నెటిజన్లు భారీగా స్పందిస్తున్నారు. హోవార్డ్ ధైర్య సాహసాలను మెచ్చుకోవడంతోపాటు ఆశ్చర్యపోతున్నారు. మరికొందరు ఇలా చేయడం చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. చదవండి: కూరగాయలు అమ్ముతున్న ఐఏఎస్ అధికారి.. అసలు నిజం ఇదే! Viral Video : సముద్ర తీరంలో అద్భుతం! View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords) -
జర చూసి తినండి: పిజ్జాలో ఇనుప నట్లు, బోల్టులు
మారిన జీవనశైలితో ప్రజలు వండడం తగ్గించేసి ఆన్లైన్ ఫుడ్ యాప్‌లపై పడ్డారు. ఇట్ల ఆర్డర్ చేస్తే అలా ఇంటి గడప ముందుకు వస్తుండడంతో ప్రజలు బద్ధకస్తులై వంట గది వైపు చూడడం లేదు. ఇలా ఆన్లైన్లో వచ్చే ఆహారాన్ని కొంచెం చూసి తినాలి. ఫుడ్ యాప్‌లు అందిస్తున్న ఆహారంలో గతంలో ఎన్నోసార్లు ఆహారం సక్రమంగా లేకపోవడం.. పాడవడం.. లేదా ఇతర పదార్థాలు రావడం జరిగాయి. తాజాగా ఓ మహిళకు పిజ్జా ఆర్డర్ చేయగా పిజ్జాలో ఇనుప నట్లు.. బోల్టులు వచ్చాయి. అది చూసి నోరెళ్లబెట్టిన ఆమె వెంటనే ఫిర్యాదు చేయడంతో న్యాయం జరిగింది. ఈ సందర్భంగా ఆమె కొంచెం చూసి తినాలని సూచిస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. (చదవండి: ‘అమ్మాయిలూ ‘జట్టు విరబూసుకుని రావొద్దు’ ‘సెల్ఫీలు దిగొద్దు’) యూకే (ఇంగ్లాండ్)లోని లాంకషేర్ రాష్ట్రం థార్టన్ క్లెవెలెస్ జంట నగరాలకు చెందిన ఓ మహిళ గతనెల 29వ తేదీన డోమినోస్‌లో పిజ్జా ఆర్డర్ చేసింది. ఇంటికి చేరిన పిజ్జాను తీసుకుని తింటుండగ ఇనుప నట్లు, బోట్లు కనిపించాయి. ఒక్కసారిగా ఆమె షాక్‌కు గురయ్యింది. వాటిని ఫొటో తీసి పెట్టుకుని డోమినోస్‌కు ఫిర్యాదు చేసింది. నట్లు, బోట్లు రావడంపై సంస్థ క్షమాపణ చెప్పింది. తన డబ్బులు చెల్లించమని అడగడంతో సంస్థ తిరిగి ఇచ్చేసింది. అయితే అంతకుముందే ఆమె ఈ విషయాన్ని తన సోషల్‌మీడియా అకౌంట్లలో షేర్ చేసింది. (చదవండి: గుండెల్ని పిండేస్తున్న అమెజాన్ వీడియో) మహిళ: ‘తినడానికి ముందు మీ పిజ్జాలను ఒకసారి చూసుకోండి. ముఖ్యంగా థోర్టన్ క్లెవ్లీస్లోని డొమినోస్ నుంచి పిజ్జా ఆర్డర్ పెట్టేప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి’ అని ఆమె సూచించింది. డొమినోస్: ‘అసౌకర్యానికి క్షమాపణలు. ఇటువంటి సంఘటనలు మళ్లీ జరగకుండా ఉండేందుకు స్టోర్‌తో మాట్లాడాం. డొమినోస్ వినియోగదారుడి సంతృప్తి, భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తుంది. ఇలాంటి సంఘటనలు అరుదుగా జరుగుతాయి. ఇకపై ఇవి కూడా జరగకుండా చర్యలు తీసుకుంటాం’ అని ఓ ప్రకటనలో తెలిపింది. -
Tokyo Olympics: చరిత్రలో తొలిసారి స్వర్ణ పతకం
టోక్యో: బెర్ముడా దేశ జనాభా సుమారు 64 వేలు. ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలో యునైటెడ్ కింగ్డమ్ పర్యవేక్షణలో ఉన్న అతి చిన్న దేశం. అక్కడి ప్రజలు మంగళవారం పెద్ద ఎత్తున సంబరాల్లో మునిగారు. 1936 నుంచి ఒక్కసారి మినహా ప్రతీసారి తమ దేశం తరఫున ఆ జట్టు ఒలింపిక్స్‌కు జట్టును పంపిస్తోంది. ఇప్పుడు మొదటిసారి ఒక స్వర్ణపతకం బెర్ముడా ఖాతాలో చేరింది. 33 ఏళ్ల ట్రయాథ్లెట్ ఫ్లోరా డఫీ ఆ కలను నిజం చేసి చూపించింది. ఫలితంగా ఒలింపిక్ స్వర్ణం నెగ్గిన అతి చిన్న దేశంగా బెర్ముడా గుర్తింపు పొందింది. టోక్యోలో ఆ దేశం తరఫున డఫీతోపాటు అలీజదె దారా (రోయింగ్) మాత్రమే బరిలోకి దిగారు. గతంలో ఆ దేశం ఖాతాలో ఒకే ఒక కాంస్యం ఉంది. 1976 మాంట్రియల్ ఒలింపిక్స్‌లో పురుషుల బాక్సింగ్‌లో క్లారెన్స్ హిల్ ఈ ఘనత సాధించాడు. ఇన్నేళ్లకు బెర్ముడాకు స్వర్ణంతో ఆనందం దక్కింది. రేసును గంటా 55 నిమిషాల 36 సెకన్లలో పూర్తి చేసి డఫీ మొదటి స్థానంలో నిలిచింది. కఠోర శ్రమతో... 1500 మీటర్ల స్విమ్మింగ్... 40 కిలోమీటర్ల సైక్లింగ్... 10 కిలోమీటర్ల పరుగు... ఈ మూడూ ఒలింపిక్ ట్రయాథ్లాన్లో భాగం. ఒకటి తర్వాత మరొకటి వరుసగా పూర్తి చేయాల్సిన కఠినమైన ఈవెంట్ ఇది. ఎంతో ఫిట్నెస్, పట్టుదల ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. డఫీ తొలిసారి 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో పాల్గొని రేస్ కూడా పూర్తి చేయలేకపోయింది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో 45వ స్థానంలో నిలిచింది. దీనికి తోడు కెరీర్లో వరుస గాయాలు. ఒకదశలో ఒకదాని వెంట మరొకటి దాదాపు పది రకాల భిన్నమైన గాయాలతో ఆమె బాధపడింది. వీటికి తోడు ఎనీమియా బారిన కూడా పడింది. దాంతో విసుగెత్తి ఏడాది పాటు ఆటకు గుడ్‌బై చెప్పేసి చదువుపై దృష్టి పెట్టింది. అయితే డిగ్రీ పూర్తి చేసిన తర్వాత పునరాగమనం చేసింది. 2016 రియో ఒలింపిక్స్‌లో ఈసారి 8వ స్థానం. వరల్డ్ ట్రయాథ్లాన్ సిరీస్‌లలో గెలుస్తున్నా... అసలు లక్ష్యం మాత్రం ఒలింపిక్ పతకమే. దీని కోసం ఎంతో కష్టపడిన డఫీ ఇప్పుడు సగర్వంగా విజేతగా నిలిచింది. వేదికపై బెర్ముడా జాతీయ గీతం వినిస్తుండగా ఆమె కంట ఆనందబాష్పాలు కనిపించాయి! -
చిన్నారులపై కరోనా ప్రభావం స్వల్పమే
లండన్: కోవిడ్–19కు కారణమయ్యే సార్స్–కోవ్–2 వైరస్ ప్రభావం చిన్నారులు, టీనేజీ యువతలో చాలా స్వల్పమేనని యునైటెడ్ కింగ్డమ్(యూకే)లో నిర్వహించిన తాజా అధ్యయనంలో తేటతెల్ల మయ్యింది. వైరస్ కారణంగా వీరిలో తీవ్రమైన అనారోగ్యం, మరణాలు వంటివి అంతగా సంభవించడం లేదని తేలింది. అయితే, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడంతోపాటు ఇతర వ్యాధులతో బాధపడుతున్న పిల్లలు, యువతపై కరోనా పంజా విసురుతున్నట్లు స్పష్టమయ్యింది. యూకేలోని యూనివర్సిటీ కాలేజీ లండన్(యూసీఎల్), యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్, యూనివర్సిటీ ఆఫ్ యార్క్, యూనివర్సిటీ ఆఫ్ లివర్‌పూల్ ఆధ్వర్యంలో 18 ఏళ్లలోపు వారిపై ఈ అధ్యయనం నిర్వహించారు. ప్రతి 4,81,000 మందిలో ఒకరు కరోనాకు గురయ్యే అవకాశం ఉన్నట్లు గర్తించారు. అంటే ప్రతి 10 లక్షల మంది ఇద్దరు మాత్రమే వైరస్ బారినపడే ప్రమాదం ఉందని అధ్యయనకర్తలు పేర్కొన్నారు. ఆరోగ్యవంతులైన పిల్లలు, యువత కోవిడ్–19కు భయపడాల్సిన పనిలేదని, వారిపై ఈ మహమ్మారి పెద్దగా ప్రభావం చూపదని యూసీఎల్ ప్రొఫెసర్ రస్సెల్ వినెర్ చెప్పారు. -
వామ్మో.. చూస్తుండగానే 60 అడుగుల కొండపై నుంచి..
లండన్: మనలో చాలా మంది కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో కలిసి కొండలపైకి, కొత్త ప్రదేశాలకు వెళ్లడానికి ఇష్టపడుతుంటారు. అక్కడ తమ వారితో సరదాగా గడిపి ఒత్తిడిని దూరం చేసుకుంటారన్న విషయం తెలిసిందే. ఒక్కొసారి ఈ విహారయాత్రలో అనుకోని సంఘటనలు చోటుచేసుకుంటాయి. దీంతో, ఆ విహార యాత్ర కాస్త, విషాద యాత్ర గా మారిపోతుంది. అయితే, యూకేలోజరిగిన ఒక విషాదయాత్ర ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. కార్న్‌వాల్ లోని లామోర్నా కోవ్ పట్టణంలో రెబెకా క్రాఫోర్డ్ అనే 37 ఏళ్ల మహిళ తన కుటుంబంతో కలిసి ఉండేది. ఆమె గతేడాది తన సోదరి రెబెకా డెబ్స్తో కలిసి స్థానికంగా ఒక ఎత్తైన కొండపైకి వెళ్లారు. అక్కడ సరదాగా గడపాలను కున్నారు. ఈ క్రమంలో వారిద్దరు మాట్లాడుకుంటూ కొండ అంచుల వద్ద చేరుకున్నారు. అక్కడ చల్లగాలిని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, వారు మాటల్లో పడి కొండ అంచున ఉన్న విషయం కూడా మరిచిపోయారు. అప్పుడు, రెబెకా క్రాఫోర్డ్ కొండపై నుంచి చూస్తుండగానే కాలుజారి కింద పడింది. దీంతో, రెబెకా డెబ్స్ ఒక్కసారిగా షాకింగ్‌కు గురయ్యింది. తన సోదరి కొండపై నుంచి కింద పడటాన్ని చూసింది. ఆమె నోటినుంచి మాట రాలేదు. తన అక్క అరుపులు, కేకలు వినిపించాయి. వెంటనే తేరుకుని యూకేలోని డయల్ అంబూలెన్స్‌కు ఫోన్ చేసింది. ఆ ప్రాంతం కొండపైన ఉండటంతో కాసేపటికి ఎయిర్ అంబూలెన్స్ సర్వీస్ అక్కడికి చేరుకున్నారు. ఆమెను వెంటనే యూకేలోని ఆసుపత్రికి తరలించారు. ఆమెకు మెరుగైన చికిత్స అందించారు. అయితే, రెబెకా ప్రస్తుతం కోలుకుంటుదని వైద్యులు తెలిపారు. అయితే, తాజాగా రెబెకా క్రాఫోర్డ్.. మెట్రో.కో.యూకే తో జరిగిన ఇంటర్వ్యూలో ఆ విషాదాన్ని గుర్తుచేసుకున్నారు. ‘ఆ భయంకర సంఘటన నా జీవితంలో మరిచిపోలేను’.. నేను నా సోదరితో కలిసి ఎత్తైన కొండపై ఉన్నప్పుడు అనుకోకుండా కింద పడ్డాను. నా సోదరి అరుపులు నాకు వినిపించాయి. నేను కిందకు పడిపోయేటప్పుడు ఏదైనా పట్టుకోవడానికి ప్రయత్నించాను. కానీ నాకు ఏ ఆధారం దొరకలేదు. నేను బండలపై పడ్డాను. ఆ తర్వాత, నేను స్పృహ కోల్పోయాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తులేదు. రెబెకా డెబ్స్ మాట్లాడుతూ.. ఇలాంటివి బహుశా సినిమాల్లో చూసుంటారు. 60 అడుగుల ఎత్తైన కొండపైనుంచి పడి బతకడం చాలా అరుదని వైద్యులు తెలిపారు. అదృష్టవశాత్తు మా సోదరికి పెద్ద గాయాలేవి కాలేవు. ఏలాంటి, రక్త స్రావం జరుగలేదు. కానీ, ముఖం దగ్గర మాత్రం కుట్లు పడ్డాయని తెలిపింది. నడుము దగ్గర చిన్నగా ఫాక్చర్ అయ్యిందని వివరించింది. కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే ఆసుపత్రి నుంచి వైద్యులు డిశ్చార్జ్ చేశారని తెలిపింది. తమ సోదరిని సమయానికి ఆసుపత్రికి చేర్చిన ఎయిర్ అంబూలెన్స్ సిబ్బందికి రెబెకా సిస్టర్స్ ధన్యవాదాలు తెలిపారు. -
జులై 19 తర్వాత అక్కడ మాస్క్‌లు వాడక్కర్లేదు..?
లండన్: కరోనా మహమ్మారి నుంచి యావత్ ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ, నిబంధనలను పక్కాగా అమలు చేయడం వల్ల కరోనా రక్కసి ప్రభావాన్ని తగ్గించగలుగుతున్నారు. ఈ నేపథ్యంలో మహమ్మారి ధాటికి విలవిలలాడి, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న బ్రిటన్‌లో జులై 19 తరువాత ఆంక్షలు ఎత్తివేయాలని అక్కడి ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మాస్క్ వాడకం, భౌతిక దూరం పాటించడంతో పాటుగా పలు రకాల నిబంధనలు ఎత్తివేసే యోచనలో బ్రిటన్ ప్రధాని ఉన్నట్లుగా సండే టైమ్స్ తెలిపింది. అలాగే జిమ్, రెస్టారెంట్స్, మ్యూజియం తదితర వాటిల్లో స్కానింగ్ నిబంధనలను పక్కన పెట్టే అవకాశం ఉందని సండే టైమ్స్ కథనంలో పేర్కొంది. వేగంగా అమలు చేస్తున్న వ్యాక్సిన్ విధానం సత్ఫలితాలు ఇస్తుండటంతో, మాస్క్ వాడాలా, వద్దా అనేది ప్రజల ఇష్టానికి వదిలేయాలని అక్కడి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఏడాదిన్నర కాలంగా ఆంక్షలతో మగ్గిపోయిన ప్రజలు స్వేచ్ఛను కోరుకుంటున్నారని, వారి ఆలోచనలకు అనుగుణంగానే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని బ్రిటన్ గృహనిర్మాణ శాఖ మంత్రి పేర్కొన్నారు. -
పీఏతో మంత్రి రాసలీలలు.. ఫొటోలు లీక్
కరోనా టైం.. అందులో కఠిన ఆంక్షలు అమలులో ఉన్నవేళ. సోయి మరిచి తన అనుచరురాలితో ఆఫీసులోనే రాసలీలలు సాగించాడు ఓ మంత్రి. ఆ మంత్రి రొమాంటిక్ యాంగిల్ఫొటోలు మీడియా ద్వారా జనాల్లోకి లీక్ అయ్యాయి. ఇంకేం ప్రజాగ్రహం పెల్లుబిక్కింది. రాజకీయ విమర్శలు చుట్టు ముట్టాయి. చివరికి యూకే ఆరోగ్యశాఖా మంత్రి మ్యాట్ హాంకాక్ రాజీనామా చేయాల్సి వచ్చింది. లండన్: ఆరోగ్య శాఖ మంత్రి, కార్యదర్శి మ్యాట్ హాంకాక్ యవ్వారం.. వారం నుంచి యూకే రాజకీయాలను కుదేలు చేస్తోంది. వివాహితుడైన హాంకాక్.. ఓ మహిళను ఏరికోరి తన అసిస్టెంట్‌గా నియమించుకున్నాడు. ఆమెతో తన కార్యాలయంలోనే రాసలీలు కొనసాగించాడు. ఆమెను ముద్దులు పెట్టుకున్నట్లుగా ఓ ఫొటోతో ‘పీఏతో హాంకాక్ రాసలీలలు’ పేరుతో ది సన్ టాబ్లాయిడ్ ప్రముఖంగా ప్రచురించింది. పైగా కరోనా నిబంధనలు అమలులో ఉన్న టైంలో ఆ పని చేశాడంటూ కథనం ప్రచురించింది. ఇంకేం విమర్శలు మొదలయ్యాయి. ఈ బంధం ఏనాటిదో.. కాగా, ఆ ఫొటోలు మే 6 నుంచి 11 మధ్య కాలంలో, అది కూడా మ్యాట్ కార్యాలయంలోనే తీసినవని సమాచారం. అయితే ఆ ఫొటోల్ని ఎలా సంపాదించింది మాత్రం సన్ వెల్లడించలేదు. అప్పటికీ ఇంకా లాక్డౌన్ కఠిన నిబంధనల్ని, ఆంక్షల్ని ఎత్తివేయలేదని మాత్రం పేర్కొంది. ఇంట్లో వ్యక్తులతో తప్ప బయటివారిని కౌగిలించుకోవడం, వారితో శారీరక సంబంధం పెట్టుకోవడానికి అనుమతించని రోజుల్లో ఈ ఘటన జరిగిందని తెలిపింది. అంతేకాకుండా ఆ ఫొటోలో ఉన్న మహిళను హాంకాక్.. 2000 సంవత్సరంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కలిశాడని, పోయిన నెలలోనే ఆమెను ఇన్‌కంటాక్స్ విభాగంలో తన సహాయకురాలిగా నియమించుకున్నాడని తేలింది. ఎట్టకేలకు రాజీనామా కరోనా టైంలో మాస్క్‌లు లేకుండా తిరగొద్దని హాంకాక్ విస్తృతంగా ప్రచారం చేశాడు. పైగా భావోద్వేగంగా ఉపన్యాసాలు దంచాడు. అలాంటి వ్యక్తే.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంపై విమర్శలు వెలువెత్తాయి. ఈ మేరకు శనివారం ప్రధాని బోరిస్ జాన్సన్‌కు, మాట్ హాంకాక్‌కు ఓ క్షమాపణ లేఖ రాశాడు. నేనే మార్గదర్శకాల్ని ఉల్లంఘించా.. అందుకే రాజీనామా చేస్తున్నా అని తెలిపాడు. ఇక విమర్శల నేపథ్యంలో హాన్కాక్ రాజీనామాను ఆమోదించిన బోరిస్.. అప్పటిదాకా ఆయన అందించిన సేవలను కొనియాడాడు. చదవండి: పార్లమెంట్లో పొంగుతున్న బీర్లు -
అతడు 3 అడుగుల ఎత్తు.. ఆమె 5 అడుగులు.. వారికి ఓ చిన్నారి!
సాక్షి, వెబ్‌డెస్క్: అతడు నటుడు.. ఆమె టీచర్.. స్నేహితుల ద్వారా ఓ పబ్‌లో ఇద్దరికీ పరిచయం ఏర్పడింది... మొదటి చూపులోనే ఆమె.. అతడిని ఇష్టపడింది.. అతడికి కూడా ఆమెపై ప్రేమ చిగురించింది.. ఇద్దరి మనసులు కలిశాకా ఇంకేం ఉంటుంది.. మూడేళ్ల పాటు ప్రేమలో మునిగితేలాక.. ఓ మంచిరోజు చూసి ఐదేళ్ల కిత్రం పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.. సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు.. వారి ప్రేమకు గుర్తుగా ముద్దులొలికే రెండేళ్ల చిన్నారి ఒలీవియా. ఇందులో విశేషం ఏముంది.. సాధారణంగా లవ్స్టోరీలన్నీ ఇంచుమించు ఇలాగే ఉంటాయి కదా అంటారా..! అసలు విషయం తెలిస్తే మీరు కూడా ఈ జంటను ప్రశంసించక మానరు! యునైటెడ్ కింగ్డంకు చెందిన జేమ్స్(33), చోలే లస్టడ్(27) ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. జేమ్స్ ఎత్తు 109.3 సెంటీమీటర్లు(మూడు అడుగుల 7 అంగుళాలు). ఆయన భార్య చోలే.. 166.1 సెం.మీ.(5 అడుగుల నాలుగు అంగుళాలు) ఎత్తు ఉంటారు. ఇద్దరి ఎత్తులో సుమారు 56.8 సెం.మీ. వ్యత్యాసం ఉంది. ఇదే.. వారు గిన్నిస్ ప్రపంచ రికార్డు సొంతం చేసుకునేందుకు దోహదం చేసింది. ప్రపంచంలోనే ఎత్తులో అత్యంత తేడా కలిగిన దంపతులుగా ఘనత సాధించేలా చేసింది. నిజానికి జేమ్స్‌కు డ్వార్ఫిజం డయాస్ట్రొఫిక్ డైస్ప్లాఏసియా అనే అరుదైన వ్యాధి వల్ల మరుగుజ్జుతనం వచ్చింది. చిన్న చిన్న లోపాలకే ప్రేమించిన వ్యక్తిని కాదనుకుని వెళ్లిపోయే ఈ రోజుల్లో.. జేమ్స్‌ను పెళ్లి చేసుకుని, ఆయనతో జీవితాన్ని పంచుకుంటున్న చోలే నిజంగా చాలా మందికి స్ఫూర్తిగా నిలుస్తారని వీరి ప్రేమకథ తెలిసిన వారు ప్రశంసలు కురిపిస్తున్నారు. అసలైన ప్రేమ ముందు ఈ రికార్డులు చిన్నబోతాయని అంటున్నారు. ఏదేమైనా గిన్నిస్ రికార్డు సాధించినందుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఏంటీ.. ప్రేమ గుడ్డిది అంటారా? కానేకాదు.. ఎదుటి వ్యక్తి మనసుని మనోనేత్రంతో మరింత లోతుగా చూడగలిగే మహోన్నత శక్తి గల పవిత్రమైన భావన.. కాదంటారా?! చదవండి: వధువు వాళ్లు మటన్ వండలేదని పెళ్లికొడుకు ఎంత పనిచేశాడు.. View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords) -
డెల్టా వేరియంట్‌తో పెనుముప్పు: ఫౌచీ
వాషింగ్టన్: కోవిడ్ మహమ్మారి నిర్మూలన కోసం అమెరికా ప్రభుత్వం సాగిస్తున్న ప్రయత్నాలకు డెల్టా వేరియంట్ పెనుముప్పుగా పరిణమించిందని అంటువ్యాధుల నిపుణుడు, వైట్‌హౌస్ చీఫ్ మెడికల్ అడ్వైజర్ డాక్టర్ ఆంథోనీ ఫౌచీ అన్నారు. వ్యాప్తిలో ఉన్న వేరియంట్లతో పోలిస్తే డెల్టా వేరియంట్ ప్రభావం తీవ్రంగా ఉంటోందని గుర్తుచేశారు. అమెరికాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల్లో 20 శాతానికి పైగా కేసులు డెల్టా వేరియంట్‌కు సంబంధించినవేనని తెలిపారు. వారం రోజుల క్రితం ఈ సంఖ్య 10 శాతమే ఉండేదన్నారు. అంటే కేవలం వారం రోజుల్లోనే ఈ వేరియంట్ వ్యాప్తి రెట్టింపు అయ్యిందని వెల్ల డించారు. యునైటెడ్ కింగ్డమ్(యూకే)లోని డెల్టా రకం వణికిస్తోందని పేర్కొన్నారు. అమెరికాలో అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్లు డెల్టా వేరియంట్‌పై సమర్థంగా ప్రభావం చూపుతున్నాయని, ఇది గుడ్‌న్యూస్ అని చెప్పారు. -
థర్డ్‌వేవ్ భయంతో లాక్డౌన్ ఎత్తివేత్తపై యూకే తర్జనభర్జన!
లండన్: బ్రిటన్‌లో కరోనా డెల్టా వేరియంట్ కేసులు వారంలో 33,630కి పెరిగాయి. దీంతో దేశంలో మొత్తం డెల్టా వేరియంట్ కేసుల సంఖ్య 75,953కు చేరింది. ప్రస్తుతం దేశంలో నమోదవుతున్న కేసులన్నింటిలో 99 శాతం డెల్టా వేరియంట్‌కు సంబంధించినవేనని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. యూకేలో వేరియంట్ ఆఫ్ కన్సెర్న్(వీఓసీ– ఆందోళన కరమైన వేరియంట్) కేసులను పర్యవేక్షించే పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్(పీహెచ్ఈ), ప్రకారం ఆల్ఫా వీఓసితో పోలిస్తే డెల్టా వీఓసీతో ఆస్పత్రి పాలయ్యే రిస్కు అధికంగా ఉంది. దేశంలో ఇచ్చిన కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారికి డెల్టా వేరియంట్‌తో ఆస్పత్రి పాలయ్యే ముప్పు గణనీయంగా తగ్గిందని పీహెచ్ఈ గణాంకాలు వెల్లడించాయి. కాగా జూన్ 14 నాటికి డెల్టా వేరియంట్ కారణంగా దేశంలో 806మంది ఆస్పత్రి పాలయ్యారు. వీరిలో 527 మంది టీకా తీసుకోనివారు కాగా, 84 మంది రెండు డోసులు తీసుకున్నవారున్నారు. డెల్టా వేరియంట్ కారణంగా మరణాలు ఎక్కువగాలేవని, అయితే సాధారణంగా కొత్త వేరియంట్లు వచ్చిన తర్వాత మరణాల రేటు కొన్ని వారాల అనంతరం పెరుగుతుందని, అందువల్ల డెల్టా వేరియంట్ మరణకారక రేటును ఇప్పుడే మదింపు చేయలేమని పీహెచ్ఈ తెలిపింది. కోవిడ్ టీకా తీసుకున్న వారిలో మరోమారు కరోనా వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు అధ్యయనాలు వెల్లడించాయని తెలిపింది. యూకేలో థర్డ్ వేవ్‌కు డెల్టా వేరియంట్ కారణమవుతుందన్న భయాలతో లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేయడానికి ప్రభుత్వం వెనకాముందాడుతోంది. చదవండి: డెల్టాప్లస్ మూడో వేవా? కొత్త వేరియంట్‌పై ఆందోళన -
పాడుబడిన భవంతిని రూ.5.16 కోట్లు పలికేలా చేసింది
వేల్స్/లండన్: ఓ మహిళ పాడుపడిన తన రిటైల్ షాపును అందమైన భవంతిగా మార్చింది. ఒకప్పుడు దాన్ని కొనడం కాదు కదా కనీసం చుడ్డానికి కూడా ఇష్టపడని వారు.. ఇప్పుడు ఆ భవంతికి కోట్లు చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు. ఆ వివరాలు.. యూకే వేల్స్‌కు చెందిన ఎలిజబెత్ అనే మధ్య వయసు మహిళకు ఓ చిన్న రిటైల్ షాప్ ఉంది. ఏళ్ల క్రితం నాటి దుకాణం కావడంతో పాడు పడింది. అమ్మకానికి పెట్టినా పెద్దగా డబ్బులు రావు. అన్నింటికంటే ముఖ్య విషయం ఏంటంటే ఆ షాప్‌ని అమ్మడం ఎలిజబెత్‌కు ఇష్టం లేదు. ఈ క్రమంలో ఎలిజబెత్‌కు ఓ ఆలోచన వచ్చింది. ఆ షాపును కూల్చివేసి ఆ స్థలంలో తన కలల సౌధం నిర్మించాలనుకుంది. ఈ క్రమంలో కేవలం ఆరు వారాల్లోనే తనకు నచ్చినట్లు ఇంటిని నిర్మించుకుంది. మూడు బెడ్రూంలు, ఒపెన్ కిచెన్, లాంజ్, గార్డెన్లతో అందమైన ఇంటిని నిర్మించుకుంది ఎలిజబెత్. అయితే ఈ ఇంటి నిర్మాణం అనుకున్నంత సులభంగా జరగలేదన్నారు ఎలిజబెత్. తన షాప్ ఉన్న స్థలంలో ఎలాంటి సౌకర్యలు ఉండకపోగా చాలా మురికిగా.. తేమగా ఉండేదని తెలిపారు. అయితే ఇవేవి ఎలిజబెత్‌ను ఆపలేకపోయాయి. ఇంటిని నిర్మించాలనుకున్న ఆమె సంబంధిత అధికారులను సంప్రదించి అనుమతులు పొందారు. ఆ తర్వాత కాంట్రాక్టర్స్‌ని సంప్రదించారు. ఇక ఎలిజబెత్ న్యూటన్ బీచ్‌కు చాలా దగ్గరగా ఉండటంతో తీరప్రాంత అనుభూతి పొందాలనుకున్నారు. దీని గురించి తన ఆర్కిటెక్ట్ పీటర్ లీతో చర్చించారు. ఈ క్రమంలో అతను బోట్‌హౌస్ డిజైన్‌లో ఆమె ఇంటిని నిర్మించాడు. ఇక ఇంటి నిర్మాణం అంతా పర్యావరణ హితంగా సాగింది. కేవలం ఆరు వారాల వ్యవధిలో పాడుబడిన బిల్డింగ్ స్థానంలో అత్యద్భతమైన ఇంటిని నిర్మించారు. ఇప్పుడు దీన్ని అమ్మకానికి పెట్టారు. ప్రస్తుతం ఈ ఇల్లు 5,00,000 పౌండ్స్ (రూ.5.16 కోట్లు) ధర పలుకుతుంది. అంతకంటే ఎక్కువ రావచ్చంటున్నారు ఎలిజబేత్. చదవండి: అవును, 139 ఏళ్ల భవనం రోడ్డు దాటుతోంది! -
100 కోట్ల టీకా డోసులిద్దాం
కార్బిస్‌బే: కరోనా మహమ్మారిపై ఉమ్మడి పోరాటం, సంపూర్ణ వ్యాక్సినేషనే లక్ష్యంగా గ్రూప్ ఆఫ్ సెవెన్(జీ7) దేశాల మూడు రోజుల శిఖరాగ్ర సదస్సు ఆతిథ్య దేశం యునైటెడ్ కింగ్డమ్(యూకే)లో శుక్రవారం ప్రారంభమయ్యింది. కార్బిస్‌బే రిసార్టులో ఏర్పాటు వేదిక నుంచి యూకే ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ప్రపంచదేశాల అధినేతలకు అభివాదం చేసి, సదస్సుకు శ్రీకారం చుట్టారు. కరోనాపై కలిసి పోరాడుదామని పిలుపునిస్తూ ప్రారంభోపన్యాసం చేశారు. ప్రపంచంపై కోవిడ్–19 వైరస్ దాడి మొదలయ్యాక ఇదే మొదటి జీ7 సదస్సు. యూకే, అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ పాల్గొంటున్నాయి. మళ్లీ మెరుగైన సమాజాన్ని నిర్మిద్దాం (బిల్డింగ్ బ్యాక్ బెట్టర్ ఫ్రమ్ కోవిడ్–19) అన్న నినాదంతో జరుగుతున్న జీ7 సదస్సులో భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా అతిథి దేశాలుగా భాగస్వాములవుతున్నాయి. భారత ప్రధాని మోదీ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించనున్నారు. జీ7 సదస్సులో మొదటిరోజు దేశాల అధినేతలు ఉల్లాసంగా కనిపించారు. ప్రధానంగా కరోనా వ్యాప్తి, నియంత్రణ చర్యలు, వ్యాక్సినేషన్ పైనే చర్చించారు. కనీసం 100 కోట్ల కరోనా టీకా డోసులను ప్రపంచ దేశాలకు అందజేయాలని, మహమ్మారి వల్ల నష్టపోయిన దేశాలకు చేయూతనందించాలని ఈ సంపన్న దేశాధినేతలు నిర్ణయానికొచ్చారు. 10 కోట్ల డోసులిస్తాం: బోరిస్ జాన్సన్ తమ వద్ద అవసరానికి మించి ఉన్న 10 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను ఏడాదిలోగా ప్రపంచ దేశాలకు ఉదారంగా అందజేస్తామని యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. జీ7 సదస్సు ప్రారంభోపన్యాసంలో ఆయన.. కరోనా మహమ్మారిని అంతం చేసే యజ్ఞంలో పాలు పంచుకుంటున్నామని తెలిపారు. ఇందులో భాగంగా 10 కోట్ల టీకా డోసులను ఇతర దేశాలకు ఇస్తామన్నారు. కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి కోసం ఆక్స్ఫర్డ్ వర్సిటీ–ఆస్ట్రాజెనెకాకు నిధులు సమకూర్చామని గుర్తుచేశారు. లాభార్జనను పక్కనపెట్టామని, తమ కృషి ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా 160 దేశాలకు ఇప్పటిదాకా 50 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు అందాయని వెల్లడించారు. జీ7 సదస్సులో పాల్గొంటున్న దేశాల అధినేతలు సైతం ఇలాంటి దాతృత్వాన్నే ప్రదర్శిస్తారని ఆశిస్తున్నట్లు బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు. 50 కోట్ల టీకా డోసులు అందజేస్తాం సదస్సులోఅమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలకు 50 కోట్ల కోవిడ్ టీకా డోసులు అందజేస్తామని ప్రకటించారు. బహుళ జాతి కార్పొరేట్ సంస్థలపై కనీసం 15 శాతం పన్ను విధించాలన్న ప్రతిపాదన జీ7 సదస్సులో చర్చకు వచ్చింది. ఈ మేరకు దీనిపై ఆయా దేశాల ఆర్థిక మంత్రుల మధ్య వారం క్రితం ఒక ఒప్పందం కుదిరింది. కాలుష్యం, వాతావరణ మార్పుల అంశం కూడా జీ7 సదస్సు అజెండాలో ఉంది. కాగా, సదస్సు జరుగుతున్న కార్బిస్‌బే రిసార్టు ఎదుట వందలాది మంది వాతావరణ పరిరక్షణ ఉద్యమ కార్యకర్తలు గుమికూడారు. వాతావరణ మార్పులను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు.సెయింట్ ఇవీస్లో జరిగిన ర్యాలీలో 500 మంది పాల్గొన్నారు. నిరసనకారులు ఆకుపచ్చ, నీలి రంగు దుస్తులు ధరించారు. హామీలతో తుంగలో తొక్కుతున్న జీ7, మాటలే తప్ప చేతల్లేవ్ అని రాసి ఉన్న జెండాలను ప్రదర్శించారు. -
షాకింగ్: మాస్క్ అడగడంతో ఉమ్మేసి మహిళ పరుగు
లండన్: మహమ్మారి వైరస్ రాకుండా ముందస్తుగా ప్రపంచం మొత్తం మాస్క్ ధరిస్తున్నారు. కొందరు మాస్క్ ధరించడంలో నిర్లక్ష్యం వహిస్తుండడంతో ఇప్పుడు ప్రతిచోట ‘మాస్క్ ధరిస్తేనే అనుమతి’ అనే బోర్డులు విధించారు. మాస్క్ లేని వారిని అనుమతించడం లేదు. అయితే ఒక షాపింగ్‌మాల్ వద్ద మాస్క్ లేకుండా వచ్చిన మహిళ బీభత్సం సృష్టించింది. మాస్క్ లేదని అడిగిన సెక్యూరిటీ గార్డుపై ఉమ్మేసి పరుగులు పెట్టిన ఘటన వైరల్‌గా మారింది. ఈ సంఘటన యూకేలోని లండన్‌లో జరిగింది. లండన్‌లోని ఓ షాపింగ్‌మాల్‌కు ఇద్దరు మహిళలు వచ్చారు. అయితే వారు మాస్క్ ధరించకపోవడంతో వారిని సెక్యూరిటీ గార్డు నిలువరించాడు. మాస్క్ ధరించి రావాలని సూచించాడు. దీంతో ఆ మహిళలు సెక్యూరిటీ గార్డుతో గొడవకు దిగారు. ఆ చిన్న గొడవ కాస్త పెద్దగా మారింది. లోపలకు వెళ్లేందుకు ఆమె ప్రయత్నించగా సెక్యూరిటీ అడ్డుకోవడంతో అతడిని దుర్భాషలాడింది. ఇష్టమొచ్చిన మాటలతో తిట్టింది. అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అయితే ఆ ఇద్దరిలోని ఓ మహిళ దూరంగా వచ్చినట్టు చేసి వెంటనే సెక్యూరిటీ గార్డు వద్దకు వెళ్లి ముఖంపై ఉమ్మేసి పరుగులు పెట్టింది. షాక్‌కు గురయిన సెక్యూరిటీ గార్డులు వెంటనే ఆమెను పట్టుకునేందుకు ఉరుకులు పెట్టారు. చివరకు ఆమె చిక్కింది. ఆమెపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. మాస్క్ ధరించడం వదిలేసి తనకు తానే ఆమె ఇబ్బందులను కొని తెచ్చుకుంది. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె తీరుపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. మాస్క్ పెట్టుకోనిదే కాక సెక్యూరిటీ గార్డుపై ఉల్టా దాడి చేసుడు ఏందమ్మా? అని ప్రశ్నిస్తున్నారు. -
వైరల్.. ఈ ఫోటోలో ‘దెయ్యం’ ఉంది..చూశారా!
ఒక్కొక్కరికీ ఒక్కో భయం ఉంటుంది. కొందరు నీళ్లు, ఎత్తైన ప్రదేశాలు, పాము ఇలా రకరకాలైన వాటిని చూసి భయంతో జంకుతారు. సాధారణంగా అధిక శాతం మందికి దెయ్యాలంటే భయం ఉంటుంది. ఇప్పటికీ అక్కడక్కడా చేతబడి, క్షుద్రపూజల నేపథ్యంలో జరిగిన నేరాల గురించి వార్తలు చూస్తూనే ఉన్నాం. అయితే దెయ్యాలపై పరిశోధనలు చేసేవారు దెయ్యాలు ఉన్నాయని కొన్ని రకాల ఆధారాలు చూపిస్తుంటారు. కానీ అవన్నీ వాస్తవానికి దగ్గగరా ఉండవు. అందుకే నేటికి సైతం దెయ్యం అంటే నమ్మని, నమ్మే వాళ్ల చర్చ జరుగుతూనే ఉంది. ఇక సోషల్ మీడియా డెవలప్ అయ్యాక ఈ దెయ్యాల గురించి తెలుసుకోవాళ్లన్న ఆసక్తి ఎక్కువవుతోంది. తాజాగా యునైటెడ్ కింగ్డమ్కు చెందిన రెబెకా గ్లాస్‌బరో మహిళ కొన్ని నెలల క్రితం తన ఇంట్లో పార్టీ ఏర్పాటు చేసి స్నేహితులతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసింది. తమ ఆనందాలను బంధించేందుకు గుర్తుగా ఫోటోలు కూడా తీసుకున్నారు. తరువాత ఓ రోజు పార్టీలో దిగిన ఫోటోలు చూసుకుంటే అందులో అందరికంటే వెనకాల మరో ముఖం కనిపిస్తోంది. ముక్కు, కళ్లు, నోరు, జుట్టు ఉండి అచ్చం ఓ అమ్మాయి రూపం కంటపడింది. ఫోటో చూస్తుంటే నిజంగానే దెయ్యంలా అనిపిస్తోంది. అయితే ఈ ఘటన గతేడాది అక్టోబర్‌లో చోటుచేసుకోగా ఇటీవల సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ప్రస్తుతం వైరలవుతోంది. అయితే రెబెకా నివాసముంటున్న ఫ్లాట్‌లో ఇంతకముందు ఎవరో చనిపోయారని ప్రచారంలో ఉంది. దీంతో ఫోటోలో మరో ముఖం కనిపించడంతో తన స్నేహితులంతా ఆ ఇంట్లో క్షుణ్ణంగా పరిశీలించారు. కానీ అక్కడ వాళ్లకు ఏం కనిపించలేదు. ఈ సంఘటన జరిగిప్పటి నుంచి సదరు యువతికి భయంతో అప్పటి నుంచి నిద్ర పట్టడం లేదు. ఇక ఈ విషయం నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. "ఇది మీ వెన్నెముకకు వణుకు పుట్టించే ఫోటో. నిజంగా చాలా భయానకంగా ఉంది. ఓహ్ అది ఏమిటి. చాలా విచిత్రంగా ఉంది’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కొందరు మాత్రం ఇది నిజం కాదని కొట్టి పారేస్తున్నారు. చదవండి: వైరల్: దుస్తులు చించేసి, మరీ ఘోరంగా.. వైరల్: ఈమె మనిషా.. దెయ్యామా?! -
కరోనా వైరస్ ప్రధాన లక్ష్యం మనిషిలోని ఆ భాగాలే..
లండన్: కరోనా వైరస్ ప్రధాన లక్ష్యం మనిషి ఊపిరితిత్తులే. ఈ వైరస్ వల్ల చనిపోతున్న వారిలో ఎక్కువ మందికి ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకింది. వైరస్ బారినపడి, చికిత్సతో కోలుకున్న తర్వాత కూడా 3 నెలలపాటు ఊపిరితిత్తులు దెబ్బతినే ఉంటాయని యునైటెడ్ కింగ్డమ్ (యూకే)లోని షెఫీల్డ్ యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకుల సంయుక్త అధ్యయనంలో తేలింది. కొన్ని కేసుల్లో ఈ వ్యవధి మరింత ఎక్కువ కాలం.. 9 నెలల వరకూ కొనసాగే ప్రమాదం ఉంటుందని వెల్లడయ్యింది. అంటే కరోనా నుంచి కోలుకున్నాక లంగ్స్ పూర్తిగా సాధారణ స్థితికి చేరాలంటే 3 నెలలకు పైగానే సమయం పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. అప్పటిదాకా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. కరోనా అనంతరం ఊపిరితిత్తులకు కొనసాగుతున్న నష్టాన్ని సాధారణ సీటీ స్కాన్, క్లినికల్ పరీక్షల ద్వారా గుర్తించలేమని పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని గుర్తించడానికి పరిశోధకులు ఇమేజింగ్ అనే ఆధునిక విధానాన్ని ఉపయోగించారు. కరోనా బారినపడినప్పటికీ ఆసుపత్రిలో చేరకుండా ఇంట్లోనే చికిత్స పొందినవారిలో దీర్ఘకాలం శ్వాస సమస్య ఉంటే వారి ఊపిరితిత్తులు ఇంకా కోలుకోనట్లే భావించాలని వారు వెల్లడించారు. అయితే, దీనిపై మరింత అధ్యయనం జరగాల్సి ఉందని అంటున్నారు. ఈ స్టడీ వివరాలను రేడియాలజీ జర్నలిజంలో ప్రచురించారు. హైపర్‌పోలరైజ్డ్ జినాన్ ఎంఆర్ఐ (జిఎంఆర్‌ఐ) పరీక్ష ద్వారా ఊపిరితిత్తుల్లో అపసవ్యతలను తెలుసుకోవచ్చని పరిశోధకులు సూచించారు. -
Arun Mummalaneni: యూకే ఎన్నికల్లో ‘అరుణోదయం’
తెనాలి టౌన్: గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ముమ్మలనేని అరుణ్ (45) యునైటెడ్ కింగ్డమ్ (యూకే)లోని హ్యాంప్‌షైర్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో బేజింగ్ స్టోక్ ఆగ్నేయ నియోజకవర్గం నుంచి కౌన్సిలర్‌గా పోటీ చేసి గెలుపొందారు. అక్కడ ఈ నెల 6న ఎన్నికలు జరిగాయి. 7న వెలువడిన ఫలితాల్లో కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థిగా అరుణ్ గెలిచారు. కాగా, ఈ నియోజకవర్గం నుంచి మొదటిసారిగా ఒక తెలుగు వ్యక్తి కౌన్సిలర్‌గా గెలుపొందడం విశేషం. ఈ పదవిలో అరుణ్ నాలుగేళ్ల పాటు కొనసాగనున్నారు. రేపల్లె సమీపంలోని మైనేనివారిపాలెం గ్రామంలో జన్మించిన అరుణ్ అమృతలూరు మండలం మోపర్రులో అమ్మమ్మ ఇంటి వద్ద పెరిగారు. ప్రస్తుతం యూకేలో డిఫెన్స్ కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్నారు. అరుణ్ తండ్రి వెంకటరావు ఎక్స్ సరీ్వస్‌మెన్. తల్లి కృష్ణకుమారి గృహిణి. అరుణ్ కొత్తగూడెంకు చెందిన యువతిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. చదవండి: Sara Chhipa: మెమరీ క్వీన్.. సారా! ప్రవాస ఆంధ్రులకు రూ.10 లక్షల ప్రమాద బీమా -
భారత్‌కు ఈయూ చేయూత
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ఉధృతితో అల్లాడిపోతున్న భారత్‌కు విదేశాలు బాసటగా నిలుస్తున్నాయి. అత్యవసర ప్రాణాధార ఔషధాలను, ఆక్సిజన్ ఉత్పత్తి పరికరాలను పంపిస్తున్నాయి. ఇటలీ సోమవారం ఒక నిపుణుల బృందాన్ని, వైద్య పరికరాలను భారత్‌కు పంపింది. ఇక యునైటెడ్ కింగ్డమ్(యూకే) నాలుగో దశ సాయం అందించింది. ఇందులో 60 వెంటిలేటర్లు, ఇతర పరికరాలు ఉన్నారు. ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్‌ను కూడా అందించింది. ఈ ప్లాంట్ ద్వారా ఒక ఆసుపత్రికి అవసరమైన ప్రాణ వాయువును ఉత్పత్తి చేయొచ్చు. దీన్ని గ్రేటర్ నోయిడాలోని ఐటీబీపీ ఆసుపత్రిలో నెలకొల్పనున్నారు. ఇటలీ నుంచి వచ్చిన బృందానికి ఇండియాలోని ఆ దేశ రాయబారి విన్సెంజో డి లూకా స్వాగతం పలికారు. ఇక యూరోపియన్ యూనియన్(ఈయూ) అదనంగా అత్యవసర వైద్య సాయాన్ని భారత్‌కు అందిస్తామని ప్రకటించింది. తన సభ్యదేశాలైన డెన్మార్క్, స్పెయిన్, నెదర్లాండ్స్ నుంచి సాయాన్ని భారత్‌కు అందిస్తామంది. కరోనాపై పోరాటంలో భారత్ వెంట నిలుస్తామని డి లూకా చెప్పారు. ఈ వైరస్ ప్రపంచానికే ఒక సవాలు అని అన్నారు. అందరం కలిసికట్టుగా ఎదిరించాలని పిలుపునిచ్చారు. భారత్‌కు అవసరమైన సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఉద్ఘాటించారు. భారత్‌కు అండగా నిలుస్తున్న యూకేకు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. డెన్మార్క్ నుంచి 53 వెంటిలేటర్లు, స్పెయిన్ నుంచి 119 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 145 వెంటిలేటర్లు పంపుతున్నట్లు ఈయూ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇక నెదర్లాండ్స్ నుంచి 100 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 30 వేల డెమ్‌డెసివిర్ వయల్స్, 449 వెంటిలేటర్లు పంపిస్తామని పేర్కొంది. జర్మనీ కూడా 15 వేల యాంటీ వైరల్ డ్రగ్స్ వయల్స్ పంపింది. అలాగే 516 ఆక్సిజన్ సిలిండర్లు అందజేసింది. -
కరోనా సంక్షోభం: 16 ఏళ్ల తర్వాత భారత్‌లో కీలకమార్పు
సాక్షి, న్యూఢిల్లీ: గతేడాది దేశంలో ప్రవేశించిన కరోనా మహమ్మారి ఈ ఏడాది సెకండ్ వేవ్‌లో తన తీవ్రరూపాన్ని ప్రదర్శిస్తోంది. దీంతో ప్రతీరోజు 3 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఒక్కసారిగా చికిత్స పొందాల్సిన రోగుల సంఖ్య లక్షల్లో పెరిగిపోవడంతో ఆసుపత్రులు ఆక్సిజన్, మందులు మరియు వైద్య పరికరాల కొరతను ఎదుర్కొంటున్నాయి. దీంతో దేశ ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలింది. కనీసం అందాల్సిన ఆక్సిజన్ సరైన సమయంలో దొరకని పరిస్థితుల్లో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో గత 16ఏళ్ళుగా భారత్ అవలంబిస్తున్న ఒక కీలక విధానాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మహమ్మారి నుంచి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన సహాయాన్ని విదేశాల నుంచి తీసుకోవడం తప్ప ఇతర మార్గమేదీ కేంద్రప్రభుత్వం ముందు లేకుండా పోయింది. దీంతో 16 సంవత్సరాల తరువాత విదేశీ సహాయం పొందే విధానంలో భారత్ పెద్ద మార్పు చేసింది. ఈ మార్పు తరువాత విదేశాల నుంచి విరాళాలు, సహాయాన్ని స్వీకరించడం మొదలైంది. అంతేగాక చైనా నుంచి వైద్య పరికరాలు కొనేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే దేశంలో విలయతాండవం చేస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు విదేశీ సహాయం పొందడంలో రెండు పెద్ద మార్పులు ప్రస్తుతం కనిపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పొరుగుదేశమైన చైనా నుంచి ఆక్సిజన్ సంబంధ పరికారాలతో పాటు, ఔషదాలను తీసుకోవడంలో ఇప్పుడు భారత్‌కు ఎలాంటి సమస్య లేదు. అదే సమయంలో ప్రస్తుతం దేశంలో ఉన్న పరిణామాల నేపథ్యంలో సహాయం అందించేందుకు పాకిస్తాన్ సైతం ముందుకొచ్చింది. అయితే పాకిస్తాన్ సహాయానికి సంబంధించినంతవరకు, ఈ విషయంలో భారత్ ఎటువంటి నిర్ణయం ఇప్పటివరకు తీసుకోలేదు. ప్రస్తుతం ఉన్న సంక్షోభ సమయంలో ప్రజల ప్రాణాలను రక్షించే మందులను నేరుగా విదేశీ ఏజెన్సీల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయగలవని, ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం అడ్డుపడే పరిస్థితిలేదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తంచేశారు. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలకు ధీటుగా భారత్ అభివృద్ధి చెందుతోందని, శక్తివంతమైన దేశంగా ఆత్మనిర్భర భారత్ ఇమేజ్‌ని ఇతర దేశాలకు తెలియచేసేందుకు 16 ఏళ్ళ క్రితం 2004లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఎ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందులోభాగంగా విదేశీ వనరుల నుంచి గ్రాంట్లు, సహాయం తీసుకోరాదని నిర్ణయించింది. అంతకుముందు ఉత్తరకాశి భూకంపం(1991), లాతూర్ భూకంపం (1993), గుజరాత్ భూకంపం(2001), బెంగాల్ తుఫాను (2002), బిహార్ వరదలు (2004) సమయంలో భారత్ విదేశీ ప్రభుత్వాల సహాయాన్ని అంగీకరించింది. అయితే 2004 డిసెంబర్ నెలలో వచ్చిన సునామీ సమయంలో ఈ పరిస్థితిని తామే ఎదుర్కోగలమని నమ్ముతున్నామని, అవసరమైతే సహాయం తీసుకుంటామని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించారు. మన్మోహన్ చేసిన ఈ ప్రకటన భారతదేశ విపత్తు సహాయ విధానంలో కీలక ఘట్టంగా అభివర్ణించుకోవచ్చు. ఈ నిర్ణయంతో వచ్చిన విధానాన్ని , ఆ తరువాత వచ్చిన విపత్తుల సమయంలో భారత్ అనుసరించింది. 2005లో కశ్మీర్ భూకంపం, 2013లో సంభవించిన కేదార్నాథ్ విషాదం, 2014లో కశ్మీర్ వరదలు వచ్చినప్పుడు సైతం విదేశీ సహాయాన్ని కోరేందుకు కేంద్రప్రభుత్వం నిరాకరించింది. ఆ తరువాత 2018లో వచ్చిన కేరళ వరదల సమయంలోనూ భారత్ విదేశాల నుంచి ఎటువంటి సహాయాన్ని అంగీకరించలేదు. కేరళ విపత్తుకు రూ.700 కోట్లు ఆర్థిక సహాయం అందించేందుకు యూఏఈ ముందుకొచ్చిందని రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి తెలపగా, కేంద్రప్రభుత్వం విపత్తు ఉపశమనం, పునరావాస అవసరాలను తామే తీర్చుతామని తెలిపింది. కానీ యూఏఈ అందిస్తామన్న ఆర్థిక సహాయాన్ని తీసుకొనేందుకు మాత్రం కేంద్రప్రభుత్వం నిరాకరించింది. కానీ కేరళ విపత్తు జరిగిన మూడేళ్ళ అనంతరం దేశంలో పరిస్థితులు కరోనా దెబ్బకి ఒక్కసారిగా మారిపోయాయి. గతేడాది కరోనా సంక్రమణతో మొదలైన ఆర్థిక సవాళ్ళకు తోడు ఈ ఏడాది సెకండ్ వేవ్‌తో వైద్య సవాళ్ళు ఒక్కసారిగా ఎక్కువ య్యాయి. దేశంలో చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య పెరిగిపోవడం, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు పతనమౌతున్న వైద్య వ్యవస్థను అత్యవసరంగా నిలబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో 16ఏళ్ళ క్రితం తీసుకున్న కీలక విధానాన్ని పక్కనపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం దేశంలో భయాందోళనలు, దయనీయ పరిస్థితుల్లో చిక్కుకున్న ప్రజలను మహమ్మారి నుం చి కాపాడేందుకు భారతదేశానికి సహాయం చేయడానికి దాదాపు 40 దేశాలు ముందుకు వచ్చాయి. ప్రస్తుతం అమెరికా, యుకే, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, స్వీడన్, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, ఫిన్లాండ్, స్విట్జర్లాం డ్, బెల్జియం, రుమేనియా, లక్జెంబర్గ్, పోర్చుగల్, భూటాన్,సింగపూర్, సౌదీ అరేబియా, హాంకాంగ్, థాయ్‌లాండ్, నార్వే, ఇటలీ, యూఏఈ దేశాలు భారత్‌కు వైద్య సహాయం పంపుతున్నాయి. విదేశాల నుంచి భారత్‌కు అందనున్న వైద్య సహాయం.. ఆక్సిజన్ – ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్.. ►బ్రిటన్ నుంచి వచ్చిన రెండో స్టాక్‌లో 120 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ►అమెరికా నుంచి 1700 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, 1100 సిలిండర్లు, ఆక్సిజన్ ఉత్పత్తి యూనిట్లు ►ఫ్రాన్స్ నుంచి 5 లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ కంటైనర్లు రానున్నాయి. దీంతో రోజుకి 10వేల మందికి ఆక్సిజన్ అందించవచ్చు. ►ఐర్లాండ్ 700 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ►రుమేనియా 80 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, 75 ఆక్సిజన్ సిలిండర్లు ►జర్మనీ మూడు నెలల కోసం మొబైల్ ఆక్సిజన్ ఉత్పత్తి కర్మాగారాన్ని పంపిస్తోంది. ►పోర్చుగల్ నుండి 20,000 లీటర్ల ఆక్సిజన్ ►సౌదీ అరేబియా నుంచి 250 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, 4 క్రయోజెనిక్ ఆక్సిజన్ కంటైనర్లు, 80 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ ►యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి 6 క్రయోజెనిక్ ఆక్సిజన్ కంటైనర్లు ►హాంకాంగ్ నుంచి 800 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ►థాయ్‌లాండ్ నుంచి 4 క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకులు ►రష్యా నుంచి 20 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ వెంటిలేటర్లు – మాస్క్‌లు... ►అమెరికా నుంచి 15 కోట్ల ఎన్95 మాస్క్‌లు ►రష్యా నుంచి 75 వెంటిలేటర్లు ►ఫ్రాన్స్ నుంచి 28 వెంటిలేటర్లు ►ఐర్లాండ్ నుంచి 365 వెంటిలేటర్లు ►స్వీడన్ నుంచి 120 వెంటిలేటర్లు ►లక్జెంబర్గ్ నుంచి 58 వెంటిలేటర్లు ►జర్మనీ నుంచి 120 వెంటిలేటర్లు, 8కోట్ల కెఎన్ 95 మాస్క్‌లు ఆక్సిజన్ జనరేటర్లు.. ►ఫ్రాన్స్ నుంచి 8 ఆక్సిజన్ జనరేటర్లు... ఒక్కొక్కటి 250 పడకల ఆసుపత్రికి 10 సంవత్సరాల పాటు నిరంతరాయంగా ఆక్సిజన్ సరఫరా చేసే సామర్థ్యం ►ఐర్లాండ్ నుంచి ఒక ఆక్సిజన్ జనరేటర్ రెమిడెసివిర్‌తో పాటు ఇతర వైద్య సామాగ్రి.. ►అమెరికా నుంచి 10 లక్షల రాపిడ్ డయాగ్నొస్టిక్ టెస్ట్ కిట్లతో పాటు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ►రష్యా నుంచి 150 బెడ్ సైడ్ మానిటర్లు, మందులు ►పోర్చుగల్ నుంచి 5వేల రెమిడెసివిర్ వయల్స్ ►బెల్జియం నుంచి 9వేల మోతాదుల రెమిడెసివిర్ -
బ్రిటన్‌లో భారత సంస్థల హవా
లండన్: బ్రెగ్జిట్, కరోనా వైరస్ విజృంభణ వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ యునైటెడ్ కింగ్డమ్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న భారతీయ కంపెనీల సంఖ్య గణనీయంగా పెరిగింది. అలాగే ఆయా సంస్థలు కల్పిస్తున్న ఉద్యోగావకాశాలు కూడా భారీగా పెరిగాయి. ‘ఇండియా మీట్స్ బ్రిటన్ ట్రాకర్’ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. కన్సల్టెన్సీ సంస్థ గ్రాంట్ థార్న్టన్, భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) దీన్ని రూపొందించాయి. బ్రిటన్ ఎకానమీ వృద్ధిలో భారత సంస్థల పాత్రను మదింపు చేసేందుకు ఉద్దేశించిన ఈ నివేదిక ప్రకారం 2020లో బ్రిటన్‌లో 842 భారతీయ సంస్థలు ఉండగా 2021లో ఇది 850కి చేరింది. అలాగే, వీటిలో ఉద్యోగాలు చేస్తున్న వారి సంఖ్య 1,10,793 నుంచి 1,16,046కి పెరిగింది. ఈ కంపెనీల మొత్తం టర్నోవరు 41.2 బిలియన్ పౌండ్ల నుంచి 50.8 బిలియన్ పౌండ్లకు చేరింది. ఇక గతేడాది బోర్డులో కనీసం ఒక్క మహిళా డైరెక్టరయినా ఉన్న సంస్థలు 20 శాతంగా ఉండగా తాజాగా ఇది 47 శాతానికి పెరిగింది. భారతీయ ‘ఇన్వెస్టర్లకు బ్రిటన్ ఆకర్షణీయమైన కేంద్రంగా కొనసాగుతోందనడానికి ఇది నిదర్శనం. ఈ సంస్థలు ఇటు ఉద్యోగాలు కల్పించడంతో పాటు బోర్డు స్థాయిలో మహిళలకు కూడా ప్రాధాన్యం కల్పిస్తుండటం హర్షణీయం’ అని వర్చువల్‌గా నివేదికను విడుదల చేసిన సందర్భంగా బ్రిటన్ పెట్టుబడుల శాఖ మంత్రి లార్డ్ గెరీ గ్రిమ్‌స్టోన్ పేర్కొన్నారు. కరోనా పరిస్థితుల్లోనూ ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడుల కార్యకలాపాలు సానుకూలంగానే కొనసాగడం స్వాగతించతగ్గ పరిణామం అని బ్రిటన్‌లో భారత హై కమిషనర్ గెయిట్రీ ఇసార్ కుమార్ తెలిపారు. లెక్క ఇలా.. బ్రిటన్‌లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భారతీయ సంస్థలను ఈ నివేదిక ట్రాక్ చేస్తుంది. 5 మిలియన్ పౌండ్ల పైగా టర్నోవరు, వార్షికంగా కనీసం 10 శాతం వృద్ధి రేటు, కనీసం రెండేళ్ల పాటు బ్రిటన్‌లో కార్యకలాపాలు ఉన్న సంస్థలను ఇది పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ ఏడాది 49 కంపెనీలు ఈ ప్రమాణాలకు అనుగుణంగా నిల్చాయి. సగటున 40 శాతం ఆదాయ వృద్ధి రేటు కనపర్చాయి. ఈ ట్రాకర్ ప్రారంభించినప్పట్నుంచీ గత ఎనిమిదేళ్లుగా లిస్టులో టెక్నాలజీ, టెలికం సంస్థల సంఖ్య భారీగా ఉంటోంది. ఈ ఏడాది ఫార్మా, కెమికల్స్ కంపెనీల సంఖ్య 15 శాతం నుంచి 27 శాతానికి పెరిగింది. బ్రిటన్ ఎకానమీ వృద్ధిలోను, ఉద్యోగాల కల్పనలోనూ భారతీయ సంస్థలు కూడా కీలకపాత్ర పోషిస్తున్నాయనడానికి ఈ గణాంకాలు నిదర్శనమని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ తెలిపారు. -
మరోసారి రద్దు: భారత్‌కు రాలేకపోతున్న బోరిస్
లండన్: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తన భారత భారత పర్యట నను రద్దు చేసుకు న్నారు. భారత్‌లో కరోనా తీవ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం వెల్లడించారు. ఆయన వచ్చే వారం భారత్‌కు రావాల్సి ఉంది అయితే తాజా నిర్ణయంతో ఆ పర్యటన రద్దైంది. దీనికి ముందు గణతంత్ర దినోత్సవ వేడుకలకే ఆయన రావాల్సి ఉండగా, అప్పుడు బ్రిటన్‌లో కరోనా తీవ్రంగా ప్రబలి ఉండటంతో రాలేకపోయారు. పర్యటన రద్దుపై ఆయన స్పందిస్తూ.. భారత్‌లో కరోనా తీవ్ర పంజా విసురుతున్న నేపథ్యంలో పర్యటనను రద్దు చేసుకోవడం మంచి నిర్ణయమని భావిస్తున్నట్లు తెలిపారు. భారత ప్రధాని మోదీతో చర్చించిన అనంతరం ఇరువురూ కలసి ఈ నిర్ణయానికి వచ్చినట్లు పేర్కొన్నారు. గతంలో తాము కూడా కరోనా వల్ల దెబ్బతిన్నామని, అదే స్థితిలో ఇప్పుడు భారత్ ఉందని చెప్పారు. ఈ స్థితి నుంచి భారత్ కోలుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పర్యటన రద్దైన నేపథ్యంలో త్వరలోనే ఓ వర్చువల్ సమావేశం ఉంటుందని కేంద్రం ప్రకటించింది. ఈ ఏడాది చివర్లో వ్యక్తిగతంగా ఆ దేశ అధికారులను కలిసే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇలా ఉండగా, బ్రిటన్‌లో ఇటీవల భారత మూలాలున్న డబుల్ మ్యూటంట్ వైరస్ కేసులు 77 నమోదైన నేపథ్యంలో.. భారత్‌ను ప్రయాణ నిషేధ జాబితాలో చేరుస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. చదవండి: హే! హెర్డ్ ఇమ్యూనిటీ ఉత్త ముచ్చట చదవండి: తస్మాత్ జాగ్రత్త! లింక్ నొక్కితే.. నిలువు దోపిడీ -
నదిలో పొంగి పొర్లిన పాలు, కారణం తెలియక షాకైన ప్రజలు
లండన్: నదుల్లో నీరు ప్రవహించడం సర్వ సాధారణం. మరి పాలు ప్రవహిస్తే? ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ .. ఓ నదిలో పాలు ప్రవహించాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. చూసిన వారు ఏంటీ వింత అని ఆశ్చర్యపోతున్నారు. ఈ సంఘటన యునైటెడ్ కింగ్‌డమ్‌లోని వేల్స్ నగరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... దులైస్ నదిలో ఎప్పటిలానే నీరు ప్రవహిస్తూ ఉంది. కానీ అకస్మాత్తుగా ఏప్రిల్ 14వ తేదీన పాలు నదిలో ప్రవహించడం మొదలుపెట్టాయి. కారణం ఏంటంటే.. నదికి సమీపంలో ప్రమాదం జరిగి ఓ భారీ పాల ట్యాంకర్ బోల్తా పడింది. సుమారు 28,000 లీటర్ల పాలు వరదలా పోటెత్తి నదిలోకి ప్రవహించాయి. దీంతో దులైస్ నది క్షీర ప్రవాహాన్ని తలపించింది. నదిలో పాల ప్రవాహాన్ని చూసిన జనాలు ఇదెక్కడి ఆశ్చర్యం అంటు షాక్‌కు తిన్నారు. ఏదో మాయలా ఉందే అని ఆ ప్రాంతంలోని కొందరు స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాద విషయం తెలియడంతో ఊపిరిపీల్చుకున్నారు. ( చదవండి: యాక్టింగ్ ఇరగదీశాడు.. అయినా పోలీసులకు దొరికిపోయాడు.. ) -
భారత్‌కు నీరవ్ మోదీ అప్పగింత!
లండన్: పంజాబ్ నేషనల్ బ్యాంకును దాదాపు రూ.13,000 కోట్ల మేర మోసగించిన కేసులో ప్రధాన నిందితుడైన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ(50)ని భారత్‌కు రప్పించేందుకు దాదాపు రంగం సిద్ధమయ్యింది. అతడిని భారత్‌కు అప్పగించేందుకు యునైటెడ్ కింగ్డమ్(యూకే) ప్రభుత్వం అంగీకారం తెలిపింది. అప్పగింత ఉత్తర్వుపై యునైటెడ్ కింగ్డమ్ హోంశాఖ మంత్రి(సెక్రెటరీ) ప్రీతి పటేల్ సంతకం చేసినట్లు యూకేలోని భారత రాయబార వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. ఇండియాలో పంజాబ్ నేషనల్ బ్యాంకు రుణాలకు సంబంధించి మోసం, మనీలాండరింగ్ కేసులు నీరవ్ మోదీపై నమోదయ్యాయి. ఆయన ప్రస్తుతం లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలులో ఉన్నారు. హోంశాఖ సెక్రెటరీ జారీ చేసిన తాజా ఉత్తర్వుకు వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించేందుకు అనుమతి కోరడానికి నీరవ్ మోదీకి 14 రోజుల గడువు ఇచ్చారు. ఆధారాల పట్ల కోర్టు సంతృప్తి నీరవ్ మోదీ తన మామ మెహుల్ చోక్సీతో కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసగించినట్లు ఇండియాలో కేసులు నమోదయ్యాయని, అతడు ఇండియాలోని న్యాయస్థానాలకు సమాధానం చెప్పుకోవాలని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు ఫిబ్రవరి 25న స్పష్టం చేసింది. నీరవ్‌పై నమోదైన కేసుల విషయంలో ఇండియాలో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగదనడానికి ఎలాంటి ఆధారాలు లేవని తేల్చిచెప్పింది. నీరవ్‌ను భారత్ అప్పగించే విషయంలో నిర్ణయాన్ని హోంశాఖకు వదిలేసింది. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని, ఇండియాలో అయితే సరైన వైద్యం అందదన్న నీరవ్ వాదనను న్యాయస్థానం కొట్టిపారేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన కేసులో నీరవ్ మోదీ నిందితుడని చెప్పేందుకు ఉన్న ఆధారాల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొంది. మనీ లాండరింగ్, సాక్షులను బెదిరించడం, ఆధారాలను మాయం చేయడం తదితర అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నమోదు చేసిన కేసుల్లో నీరవ్ మోదీ నిందితుడని స్పష్టంగా బయటపడుతోందని గుర్తుచేసింది. అందుకే బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు తెలియజేసింది. యూకే అప్పగింత చట్టం–2003 ప్రకారం.. న్యాయమూర్తి తన అభిప్రాయాన్ని హోంశాఖ సెక్రెటరీకి తెలియజేస్తారు. ఇండియా–యూకే మధ్య కుదిరిన నేరస్తుల అప్పగింత ఒప్పందాన్ని పర్యవేక్షించే అధికారం ఉన్న యూకే కేబినెట్ మంత్రి దీనిపై రెండు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దీనిప్రకారమే నీరవ్ మోదీ అప్పగింతకు హోంశాఖ మంత్రి ప్రీతి సుముఖత వ్యక్తం చేశారు. అప్పగింత ఎప్పుడు? నీరవ్ మోదీని వాండ్స్‌వర్త్ జైలు నుంచి ముంబైలోని ఆర్థర్ రోడ్ కారాగారంలో ఉన్న 12వ నంబర్ బ్యారక్‌కు తరలించేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. యూకే హోంమంత్రి ఉత్తర్వులను సవాలు చేస్తూ లండన్ హైకోర్టును ఆశ్రయించేందుకు నీరవ్ మోదీకి అవకాశం కల్పించారు. ఆయన ఒకవేళ హైకోర్టును ఆశ్రయిస్తే అక్కడే మరికొంత కాలం విచారణ జరుగనుంది. యూకే సుప్రీంకోర్టులో కూడా నీరవ్‌మోదీ అప్పీల్ దాఖలు చేసుకునేందుకు వీలుందని సమాచారం. అయితే, లండన్ హైకోర్టు అనుమతిస్తేనే అది సాధ్యమవుతుంది. తాజా పరిణామాలపై నీరవ్ మోదీ లీగల్ టీమ్ ఇంకా స్పందించలేదు. హైకోర్టుకు వెళ్తారా? లేదా? అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. యూకేలో అన్ని దారులు మూసుకుపోయిన తర్వాతే నీరవ్ మోదీ భారత్‌కు చేరుకుంటారు. అసలేమిటి కేసు? నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీతోపాటు మరికొందరు లెటర్స్ ఆఫ్ అండర్‌టేకింగ్‌ను (ఎల్ఓయూ) దుర్వినియోగం చేశారని పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ 2018 జనవరి 31న నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీతోపాటు ఇతరులపై కేసు నమోదు చేసింది. ఎల్ఓయూ అంటే తమ ఖాతాదారులకు విదేశాల్లోని తమ బ్యాంకుశాఖల నుంచి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు జారీ చేసే గ్యారంటీ పత్రం. పంజాబ్ నేషనల్ బ్యాంకు ఇచ్చిన ఎల్‌ఓయూతో నీరవ్ మోదీ ముఠా వివిధ కంపెనీల పేరిట విదేశాల్లోని పీఎన్బీ బ్యాంక్ శాఖల నుంచి రూ.13,000 కోట్లకుపైగా రుణాలుగా తీసుకొని, తిరిగి చెల్లించకుండా ఎగ్గొట్టింది. ఈ కేసులో సీబీఐ 2018 మే 14న నీరవ్‌తోసహా మొత్తం 25 మంది నిందితులపై మొదటి చార్జిసీట్ కోర్టులో దాఖలు చేసింది. 2019 డిసెంబర్ 20న 30 మందిపై రెండో చార్జిషీట్ దాఖలు చేసింది. మొదటి చార్జిషీట్లో ఉన్నవారంతా రెండో చార్జిషీట్లోనూ ఉన్నారు. బ్యాంకుల నుంచి కొల్లగొట్టిన సొమ్మును నీరవ్ మోదీ ముఠా దుబాయ్, హాంకాంగ్‌లోని తమ డొల్ల కంపెనీలకు మళ్లించినట్లు ఆరోపణలున్నాయి. ముత్యాల ఎగుమతి, దిగుమతుల పేరిట ఈ సొమ్మును దారిమళ్లించారు. నీరవ్ మోదీ 2018 జనవరి 1న ఇండియా నుంచి తప్పించుకున్నాడు. ట్రయల్ కోర్టు అతడిపై నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. 2018 జూన్‌లో ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేసింది. 2019 మార్చిలో యూకే పోలీసులు నీరవ్ మోదీని లండన్‌లో అరెస్టు చేశారు. తనకు బెయిల్ ఇవ్వాలంటూ అతడు పలుమార్లు దాఖలు చేసిన పిటిషన్లను వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు, లండన్ హైకోర్టు కొట్టివేశాయి. నీరవ్ మోదీని తమకు అప్పగించాలంటూ భారత ప్రభుత్వం యూకేను అభ్యర్థించింది. -
ఈమె జీతం గంటకు రూ.54 లక్షలు
గంటకు రూ.54 లక్షలు..! రోజుకు రూ.13 కోట్లు..!! ఏడాదికి 4వేల కోట్లు!!! ఏంటి ఈ లెక్కలు? 2019–20 ఆర్థిక సంవత్సరం ముగిసింది కాబట్టి ఏదైనా కంపెనీ ఆదాయం వివరాలు అనుకుంటున్నారా? మీరూహించిందాంట్లో సగమే నిజం.. ఇది కంపెనీ ఆదాయం కాదు డెనిస్ కొయెత్స్ అనే మహిళ వార్షిక వేతనం. ఆ.. !! అని నోరెళ్లబెడుతున్నారా? ఇంకా ఉంది ఆగండి. ఈమె పేరు చెప్పాం కదా.. ఉండేది లండన్‌లో.. వయసు 53 ఏళ్లు. ఆన్లైన్ జూదానికి కేరాఫ్ అడ్రస్ అయిన బెట్ 365 కంపెనీ గురించి మనలో చాలా మందికి తెలుసు కదా? దాని బాస్ ఈమే. మొన్నటితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి కంపెనీ ఆదాయం వివరాలు లెక్క తీస్తే వేతనం రూపేణా ఈమెకు అందేది 469 మిలియన్ పౌండ్లు. ఇందులో వేతనం 421 మిలియన్ పౌండ్లతోపాటు, కంపెనీలో 50 శాతం వాటా ఉన్నందున డివెడెండ్ కింద మరో 48 మిలియన్ పౌండ్లు అదనం. అంటే ఈ రెండూ కలిపితే ఆరోజు నాటి పౌండుతో రూపాయి విలువ ప్రకారం దాదాపు 4742,59,83,500 కోట్లు!! అందుకే ఇది యూకే చరిత్రలోనే అత్యధిక వార్షిక వేతనంగా రికార్డు సృష్టించింది. ఇంకా చెప్పాలంటే బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వార్షిక వేతనం కంటే సుమారు 2,360 రెట్లు డెనిస్ సొంతమైంది. అలాగే బ్రిటన్‌లోని 100 పెద్ద కంపెనీల సీవోల వార్షిక వేతనం కలిపినా అంతకంటే ఎక్కువే. కాగా, 2016తో పోలిస్తే డెనిస్ వార్షిక వేతనంలో పెరుగుదల 45శాతం అధికంగా నమోదైంది. అలాగే ఈ నాలుగేళ్లలో డెనిస్ మొత్తం ఆస్తి 1.3 బిలియన్ పౌండ్లకు చేరి, బ్రిటన్‌లోని అత్యంత ధనవంతులైన మహిళల్లో ఐదో స్థానం పొందింది. -
ప్రిన్స్ ఫిలిప్‌కు గన్ సెల్యూట్
లండన్: విండ్సర్ కోటలో శుక్రవారం కన్నుమూసిన రాణి ఎలిజెబెత్–2 భర్త, డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బరో ప్రిన్స్ ఫిలిప్(99)కు సంతాప సూచికంగా గన్ సెల్యూట్ చేశారు. 8 రోజుల సంతాప ప్రారంభ సూచికగా యునైటెడ్ కింగ్డమ్ (యూకే)లోని రాజధానులు లండన్, కార్డిఫ్, బెల్ఫాస్ట్, ఎడిన్బరోలలో శనివారం మధ్యాహ్నం నిమిషానికి ఒక రౌండ్ చొప్పున 41 రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. దేశవ్యాప్తంగా ఇలా గన్ సెల్యూట్ చేసే జాతీయ ప్రాముఖ్యత ఉన్న ఈ కార్యక్రమం 18వ శతాబ్దం నుంచి ఆనవాయితీగా వస్తోందని రాయల్ వెబ్సైట్ తెలిపింది. ఇలాంటి గన్ సెల్యూట్ రాణి విక్టోరియా చనిపోయిన సమయంలో 1901లోనూ పాటించారని వివరించింది. రెండో ప్రపంచయుద్ధంలో పాల్గొన్న డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బరోకు రాయల్ నేవీతో ఉన్న అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకుని గన్ సెల్యూట్ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపింది. గన్ సెల్యూట్ కార్యక్రమాలు ఆన్‌లైన్‌తోపాటు టీవీల్లోనూ ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారమయ్యాయి. పార్లమెంట్ కొత్తగా ఎలాంటి చట్టాలు చేయదు. సంప్రదాయం ప్రకారం, రాణి ఎలిజెబెత్ ఎలాంటి ప్రభుత్వ, ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనరు. కొత్తగా ఎలాంటి చట్టాలను ప్రభుత్వం ఆమె ఆమోదం కోసం పంపించదు. డ్యూక్ జీవిత కాలాన్ని ప్రతిబింబిస్తూ అబ్బేలోని టెనోర్ బెల్‌ను శుక్రవారం సాయంత్రం 6 గంటలు మొదలుకొని నిమిషానికి ఒకసారి చొప్పున 99 పర్యాయాలు మోగించనున్నారు. రాయల్ సెరిమోనియల్ ఫ్యూనె రల్ పూర్తి వివరాలు త్వరలో ఖరారు కానున్నాయి. -
ఐసిస్ వధువు షమీమాకు యూకేలో నో ఎంట్రీ
లండన్: ఇస్లామిక్ స్టేట్ టెర్రర్ గ్రూప్ (ఐఎస్ఐఎస్)లో చేరేందుకు చిన్నప్పుడే సిరియాకి పారిపోయిన, బంగ్లాదేశ్ సంతతికి చెందిన లండన్ యువతి షమీమా బేగం(21)ని తిరిగి దేశంలోకి అనుమతి నిరాకరిస్తూ సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో యూకే ప్రభుత్వం, న్యాయపోరాటంలో అతిపెద్ద విజయం సాధించినట్టయ్యింది. 15 ఏళ్ల పాఠశాల విద్యార్థిని షమీమా బేగం ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టు గ్రూప్‌లో చేరేందుకు 2015 ఫిబ్రవరిలో పారిపోయింది. ఈ కేసులో ఐదు ప్రధాన కోర్టులకు చెందిన న్యాయమూర్తులు బేగంని తిరిగి దేశంలోకి అనుమతించరాదని ఏకగ్రీవంగా ఈ తీర్పునిచ్చారు. ఫిబ్రవరి 2019లో సిరియా శరణార్థి శిబిరంలో బేగంని గుర్తించిన తరువాత, జాతీయ భద్రతా కారణాల రీత్యా ఆమె బ్రిటిష్ పౌరసత్వాన్ని రద్దు చేశారు. సుప్రీంకోర్టు ఏకగ్రీవంగా హోం శాఖ చేసిన అన్ని విజ్ఞప్తులను అనుమతించింది. బేగం క్రాస్ అప్పీల్‌ను కొట్టివేసినట్టు సుప్రీంకోర్టు అధ్యక్షుడు లార్డ్ రాబర్ట్‌రీడ్ చెప్పారు. బ్రిటన్‌లోని బంగ్లాదేశ్‌కి చెందిన దంపతులకు బేగం జన్మించారు. డచ్‌కి చెందిన ఐఎస్ఐఎస్ తీవ్రవాది యోగో రియడ్జిక్‌తో వివాహం నేపథ్యంలో ఐసిస్ వధువుగా బేగంని పిలుస్తున్నారు. తన బ్రిటిష్ పౌరసత్వాన్ని రద్దు చేస్తూ యూకే హోంశాఖ తీసుకున్న నిర్ణయాన్ని బేగం సవాల్ చేశారు. ప్రస్తుతం బేగం సిరియాలో సాయుధ దళాల నియంత్రణ శిబిరంలో ఉన్నారు. -
టైమ్ 100 జాబితాలో భారతీయులు
న్యూయార్క్: ట్విట్టర్ ఉన్నతస్థాయి న్యాయవాది విజయ గద్దెతో యూకె ఆర్థిక మంత్రి రిషి సునక్ సహా, భారతీయ సంతతికి చెందిన సామాజిక కార్యకర్తకు టైమ్ మ్యాగజైన్ వార్షిక ‘’ఎమర్జింగ్ లీడర్స్ çహూ ఆర్ షేపింగ్ ద ఫ్యూచర్’’జాబితాలో చోటు సంపాదించుకున్నారు. భవిష్యత్తుని తీర్చిదిద్దుతూ ఎదుగుతోన్న 100 మంది ప్రపంచ స్థాయి అత్యంత ప్రతిభావంతమైన నేతల పేర్లను 2021 టైమ్ 100 జాబితా ప్రకటిస్తుంది. ‘‘ఈ జాబితాలో చేరిన వ్యక్తులంతా చరిత్రసృష్టిస్తారు. నిజానికి చాలా మంది ఆ పనిచేసే ఉంటారు’’. టైమ్ 100 ఎడిటోరియల్ డైరెక్టర్ డాన్మాక్సై చెప్పారు. ► టైమ్ 100 జాబితాలో పేరు దక్కించుకున్న మిగిలిన భారతీయ సంతతికి చెందిన నేతలు ఇన్‌స్టాకార్ట్ వ్యవస్థాపకులు, సీఈఓ అపూర్వ మెహతా, డాక్టర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నాన్‌ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ‘గెట్ ఆన్ పీపీ ఈ’శిఖా గుప్తా, మరో స్వచ్ఛంద సంస్థకు చెందిన రోహన్ పావులూరి ఉన్నారు. ► భీంఆర్మీ చీఫ్ చంద్ర శేఖర్ ఆజాద్ కూడా ప్రపంచస్థాయి ప్రముఖ నేతల సరసన చేరారు’’ఇక టైమ్ మ్యాగజైన్. బ్రిటన్ ఆర్థిక మంత్రి రిషి సునాక్ ప్రొఫైల్‌లో ‘‘కొద్దికాలం క్రితం ఈ 40 ఏళ్ల బ్రిటన్‌లోని చాలా తక్కువ మందికి తెలిసిన జూనియర్ మినిస్టర్ అతి స్వల్పకాలంలోనే బ్రిటన్ ఆర్థిక వ్యవస్థకు నేతృత్వం వహించే స్థాయికి ఎదిగారు’అని రాశారు. సునాక్ దేశంలోని అత్యంత ప్రాచుర్యం పొందిన రాజకీయ వేత్త ’’అని పేర్కొనడం గమనార్హం. ► జనవరి 6న క్యాపిటల్ ఎటాక్ అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఎకౌంట్‌ని రద్దు చేస్తున్నట్టు ట్విట్టర్ సీఈఓ జాక్ డార్సేకి చెప్పింది విజయ గద్దె అన్న విషయాన్ని ప్రస్తావించిన టైమ్ ప్రొఫైల్, అత్యంత శక్తివంతమైన ట్విట్టర్ ఎగ్జిక్యూటివ్ విజయ గద్దెని ప్రశంసించింది. ► భీం ఆర్మీ నాయకుడు 34 ఏళ్ల చంద్రశేఖర్ ఆజాద్ నడుపుతోన్న పాఠశాలలు విద్య ద్వారా దళితుల్లో పేదరికాన్ని పారదోలేందుకు కృషి చేస్తున్నాయి. కులపరమైన అణచివేత, హింసపై గళం విప్పుతూ, వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమిస్తోంది’అంటూ భీం ఆర్మీ నాయకుడిని గురించి టైం ప్రస్తావించింది. ఉత్తర ప్రదేశ్‌లోని హత్రాస్‌లో దళిత యువతిపై జరిగిన సామూహిక అత్యాచారంపై భీంఆర్మీ ఉద్యమాన్ని టైమ్ గుర్తించింది. ► వైట్‌హౌస్ టాస్క్‌ఫోర్స్‌లో గుప్తా లేకపోయినప్పటికీ, ఆయన అత్యంత కీలక కోవిడ్ సంక్షోభకాలంలో వైట్‌హౌస్ లో నాయకత్వ లేమిని పూరిస్తూ, దేశవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య నిపుణులకు అవసరమైన ఆరోగ్య పరికరాలను సమకూర్చారు. గుప్తా సారథ్యంలో 6.5 మిలియన్ల పీపీఈ కిట్లను ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌కి అందించగలిగారు. ► 25 ఏళ్ల పావులూరి ఫ్రీ ఆన్లైన్ టూల్‌కి ఆద్యుడు. కోవిడ్–19 సంక్షోభంలో అగ్రరాజ్యం అమెరికా ఎన్నో ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంది. వీటి నుంచి బయటపడేందుకు పావులూరి తయారుచేసిన యాప్ సమర్థంగా పనిచేసింది. -
‘కెంట్’ త్వరలో ప్రపంచమంతటా..!
లండన్: ‘యూకేలో బయట పడిన కరోనా స్ట్రెయిన్ ‘కెంట్’ త్వరలో ప్రపంచమంతటా వ్యాపించే అవకాశం ఉంది. ఈ తరహా మ్యుటేషన్ కనీసం 10 ఏళ్ల పాటు కొనసాగవచ్చు’ అంటూ యూకే కోవిడ్–19 యూకే కన్సార్టియం డైరెక్టర్ ప్రొఫెసర్ పీకాక్ అభిప్రాయపడ్డారు. 2020 సెప్టెంబర్‌లో బయటపడిన ఈ స్ట్రెయిన్ ఇప్పటికే యూకేతో పాటు మరో 50 దేశాలకు వ్యాపించిందని ఆమె చెప్పారు. వైరస్ మ్యుటేషన్ జరగకుండా ఆగిపోతే బాధపడాల్సిన అవసరం లేదని, కానీ ఈ మ్యుటేషన్ కనీసం 10 ఏళ్ల పాటు కొనసాగవచ్చని భావిస్తున్నాను అంటూ హెచ్చరించారు. అయితే పదేళ్ల పాటు మహమ్మారి కొనసాగకపోవచ్చని, కానీ పాజిటివ్ కేసుల్లో వచ్చే మ్యుటేషన్ ప్రపంచంలో అక్కడక్కడా బయట పడొచ్చని అభిప్రాయపడ్డారు. -
కరోనా యూకే వేరియంట్‌తో పెను ముప్పు..
లండన్: బ్రిటన్‌లో కనిపించిన కొత్త రకం కరోనా(యూకే కెంట్ కోవిడ్ వేరియంట్) చాలా ప్రమాదకరంగా మారవచ్చని అక్కడి టాప్ సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రకం వైరస్ వ్యాక్సిన్లను సైతం బోల్తా కొట్టిస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. యూకేలో కోరలు చాచిన ఈ వేరియంట్.. ప్రపంచాన్ని మొత్తం గడగడలాడిస్తుందని యూకే జీనోమిక్స్ డైరెక్టర్ షారన్ పీకాక్ వెల్లడించారు. ఈ వేరియంట్‌కు తగట్టుగా వ్యాక్సిన్లను తయారు చేయాల్సి ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ఈ వేరియంట్‌పై బాగానే పని చేస్తున్నా.. వైరస్ కొత్త రూపాలు వ్యాక్సిన్ పనితీరును దెబ్బతీస్తాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం యూకేని గడగడలాడిస్తున్న ఈ వేరియంట్‌ను కరోనా 1.1.7గా పిలుస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ వేరియంట్ యూకే వ్యాప్తంగా విస్తరిస్తోందని, అది మరోసారి మ్యుటేట్ అయితే చాలా ప్రమాదకరంగా మారుతుందని పీకాక్ తెలిపారు. ప్రస్తుతం యూకే వేరియంట్ వైరస్‌తోపాటు దక్షిణాఫ్రికా, బ్రెజిల్ వేరియంట్లు చాలా ప్రమాదకరంగా రూపాంతరం చెందుతున్నాయన్నారు. ఒక మ్యుటేషన్‌పై విజయం సాధిస్తే, వైరస్ మరో మ్యుటేషన్‌తో సవాలు విసురుతుందని, ఇలా కనీసం పదేళ్ల పాటు మ్యుటేషన్ల నుంచి సవాల్లు ఎదుర్కోక తప్పదని పీకాక్ హెచ్చరించారు. -
కరోనా తెలియని కుర్రోడు!
ప్రపంచంలో ఏ మూలన ఉన్న వ్యక్తినైనా కరోనా అంటే ఏంటీ అని అడిగితే.. వెంటనే కరోనా కారణంగా వారు పడ్డ కష్టాలను ఏకరువు పెడతారు. అటువంటిది 19 ఏళ్ల ఓ టీనేజర్‌కు మాత్రం కరోనా ఊసే తెలియదు. అవును మీరు చదివింది నిజమే. యూకేకు చెందిన 19 జోసెఫ్ ఫ్లావిల్ 11 నెలలపాటు కోమాలో ఉండడంవల్ల అతనికి కోవిడ్ సంగతులు ఏవీ తెలియదు. రెండు రోజుల క్రితం జోసెఫ్ కళ్లు తెరవడం తో వార్తల్లోకెక్కాడు. కాగా ప్రపంచంలో కరోనా అంతగా వ్యాప్తిచెందక ముందు మార్చి 1న జోసెఫ్ రోడ్డు మీద నడిచి వెళ్తుంటే ఒక కారు గుద్దింది. తలకు దెబ్బతగలడంతో మెదడుకు తీవ్ర గాయం అయింది. దీంతో అతను అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే 11 నెలలపాటు కోమాలోనే ఉండిపోయాడు. ఆ తరువాత ప్రపంచదేశాల్లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. స్పృహలో ఉన్న ప్రతి ఒక్కరూ కరోనా కష్టాలు పడ్డవారే. ఇక యూకేలో అయితే మహమ్మారి రెండుసార్లు విజృంభించి ఎంతోమంది ప్రాణాలు బలిగొంది. ‘‘అయితే ఇప్పుడు ఈ ప్రపంచాన్ని చూస్తున్న జోసెఫ్‌కు ఇవన్నీ చెబితే ఎలా తీసుకుంటాడో అర్థం కావడం లేదని జోసెఫ్ ఆంటీ అన్నారు. తను కోలుకున్నాక మెలమెల్లగా అన్నీ అర్థమయ్యేలా చెబుతామని కుటుంబసభ్యులు చెప్పారు. -
మార్చి 8దాకా బడి బంద్
లండన్: ఇంగ్లాండ్‌లో కరోనా వైరస్ ఉధృతి ఇంకా తగ్గకపోవడంతో పాఠశాలలను మార్చి 8వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు యునైటెడ్ కింగ్డమ్(యూకే) ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ చెప్పారు. ఆయన తాజాగా పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో మాట్లాడారు. మార్చి 8 తర్వాత పాఠశాలలను తెరవడంపై అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామన్నరు. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోందని గుర్తుచేశారు. దేశంలో లాక్‌డౌన్‌ను దశలవారీగా ఎత్తివేయడానికి రోడ్‌మ్యాప్ సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఫిబ్రవరి 15న దీనిపై నిపుణులతో సమీక్ష నిర్వహిస్తామన్నారు. ఈ సమీక్షలో వెల్లడైన అంశాల ఆధారంగానే లాక్‌డౌన్‌పై తుది నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. పాఠశాలలు పునఃప్రారంభమయ్యదాకా అర్హులైన విద్యార్థులకు ఫుడ్ పార్సెళ్లు/ఓచర్లు అందుతాయని బోరిస్ జాన్సన్ స్పష్టం చేశారు. -
గడ్డు స్థితిలో జీ–7 అడుగులు
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ ఏటికి ఎదురీదుతున్న వర్తమానంలో అందరూ కొత్త అవకాశాల కోసం, సరికొత్త సాన్నిహిత్యాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరికొన్ని నెలల్లో జరగబోయే జీ–7 దేశాల శిఖరాగ్ర సమావేశాలకు రావాల్సిందిగా మన దేశాన్ని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆహ్వానించారు. కరోనా వైరస్ విరుచుకుపడిన తర్వాత సంపన్న రాజ్యాలు కూడా సమస్యల్లో చిక్కుకున్నాయి. అన్ని దేశాలూ ఈ ఏడాది తెరిపినపడే అవకాశం వున్నదని ఇటీవలే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) తెలిపింది. అలాగని కరోనా ముందున్నప్పటి స్థితి ఇప్పట్లో అసాధ్యమని కూడా వివరించింది. అందుకు సుదీర్ఘకాలం పడుతుంది. నిర్దిష్టంగా దాన్ని అంచనా వేయటం కుదర దని ఆర్థిక నిపుణులు కూడా అంటున్నారు. కొత్త ఆర్థిక సంవత్సరంలో 5.2 శాతం వృద్ధి నమోదవు కావొచ్చన్నది ఒక అంచనా. ఆ వృద్ధిలో ఎవరికి వారు తాము కూడా భాగస్వాములం కావాలని ఉవ్విళ్లూరుతున్నారు. అందుకే బోరిస్ జాన్సన్ జీ–7 శిఖరాగ్ర సదస్సు కోసం ఉత్సాహపడుతున్నారు. సదస్సులో ఆయనే అధ్యక్షుడవుతారు. యూరప్ యూనియన్(ఈయూ) నుంచి బ్రిటన్ ఇటీవలే తప్పుకుంది. ఈ ఒంటరి ప్రస్థానం నేపథ్యంలో అంతర్జాతీయంగా చురుకైన పాత్ర నిర్వహించాలని, సాధ్యమైనంత త్వరగా స్వీయ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దాలని ఆ దేశం ఆత్రంగా వుంది. జీ–7 దేశాల శిఖరాగ్ర సదస్సులో నేరుగా దేశాధినేతలు పాల్గొని రెండేళ్లవుతోంది. కరోనా వైరస్ మహమ్మారి బెడద లేకపోతే నిరుడు అమెరికాలో అధినేతలంతా కలిసేవారే. 2019లో ఫ్రాన్స్‌లో జరిగిన సంస్థ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఇందులో బ్రిటన్‌తోపాటు కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, అమెరికాలు భాగస్వాములు కాగా... దక్షిణ కొరియా, ఆస్ట్రే లియాతోపాటు మనల్ని కూడా ప్రత్యేక ఆహ్వానితుల హోదాలో పిలవాలని అటు అమెరికా, ఇటు బ్రిటన్ నిరుడు నిర్ణయించాయి. 45 ఏళ్లనాటి ఈ సంస్థలో సోవియెట్ యూనియన్ పతనానంతరం రష్యాకు కూడా సభ్యత్వం లభించింది. అయితే 2013లో క్రిమియాను రష్యా విలీనం చేసుకున్నాక ఆగ్రహం వ్యక్తం చేసిన అగ్రరాజ్యాలు సంస్థ నుంచి దాన్ని బహిష్కరించాయి. 2019నాటి సదస్సులో ఆ దేశాన్ని మళ్లీ జీ–7లో చేర్చుకోవాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒత్తిడి తెచ్చారు. అయితే ఆయన వాదనను ఇతర దేశాలు ససేమిరా అంగీకరించలేదు. యూరప్ దేశాలకు ముప్పు కలిగిం చేలా వ్యవహరిస్తున్న రష్యా పోకడలు మారకుండా ఎలా చేర్చుకుంటామని అందరికందరూ ఎదురు తిరిగారు. దాంతో ట్రంప్ ఏకాకయ్యారు. వాస్తవానికి అమెరికాలో సదస్సు నిర్వహించి, ఆ సంస్థ సారథ్యాన్ని స్వీకరించి ఎలాగైనా రష్యాకు చోటీయాలని ఆయన నిర్ణయించుకున్నారు. కానీ కరోనా కారణంగా సదస్సు నిర్వహణ అసాధ్యమైంది. ఇప్పుడు జీ–7 ముందు చాలా సమస్యలే వున్నాయి. వర్థమాన దేశాలు చెల్లించాల్సిన రుణాలను పూర్తిగా లేదా పాక్షికంగా రద్దు చేయటం అందులో ఒకటి. సమీప భవిష్యత్తులో ఏ దేశమూ తీసుకున్న అప్పును చెల్లించే స్థితిలో లేదు. పైగా కోలుకోవటం కోసం వాటికి కొత్తగా భారీ రుణాలు అవసరమవుతాయి. ఆదాయాలు దారుణంగా పడిపోయి, వ్యయం అపారంగా పెరిగిన వర్తమానంలో అన్ని దేశాలూ గడ్డు పరిస్థితుల్లో కొట్టుమిట్టాడు తున్నాయి. మొన్న డిసెంబర్ మధ్యకు ప్రపంచ దేశాల రుణం 20 లక్షల కోట్ల డాలర్లుంది. ఇది వున్నకొద్దీ మరింతగా పెరుగుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకపక్క కరోనా వైరస్‌ను అరికట్టేందుకు వ్యాక్సిన్లు ఇవ్వటం మొదలుకాగా, మరోపక్క అది కొత్త రూపంతో కలవరపెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కరోనా తర్వాత విమాన రాకపోకల్ని నిలిపేసిన అనేక దేశాలు ఇప్పుడిప్పుడే వాటిని పునరుద్ధరిస్తుండగా తాజాగా పుట్టుకొ చ్చిన వైరస్ కారణంగా మళ్లీ వెనకడుగేస్తున్నాయి. నిషేధాలు విధిస్తున్నాయి. ఈ పరిస్థితి పూర్తిగా మారి, ఒక దేశం నుంచి మరో దేశానికి రాకపోకలు ముమ్మరంగా పెరిగితే తప్ప ఆర్థిక వ్యవస్థలు గాడినపడటం సాధ్యంకాదు. ఇదిగాక రష్యాకు సభ్యత్వమిచ్చే సమస్య సరేసరి. సదస్సు నాటికి ఎటూ ట్రంప్ స్థానంలో అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ వస్తారు గనుక ఆ విషయంలో ఆ దేశం వైఖరి మారుతుంది. జీ–7 దేశాల మధ్య ఆర్థిక రంగంతోపాటు పర్యావరణం, ఆరోగ్యం, వాణిజ్యం, సాంకే తికాభివృద్ధి వగైరా రంగాల్లో సైతం దృఢమైన సహకారం ఏర్పడాలని బోరిస్ జాన్సన్ ప్రతిపాది స్తున్నారు. సభ్య దేశాలతోపాటు సదస్సులో పాల్గొనే మూడు దేశాలనూ కలుపుకొంటే ప్రజాస్వామ్య దేశాల్లోని 60 శాతం జనాభాకు ప్రాతినిధ్యం ఇచ్చినట్టవుతుందని, దీన్ని మరింత మెరుగ్గా వినియో గించుకుంటే అందరూ ఎదగటానికి అవకాశం వుంటుందని బ్రిటన్ విశ్వసిస్తోంది. సంక్షోభంలోనే జీ–7 పుట్టింది. 1975లో ఒపెక్ దేశాల నిర్ణయం కారణంగా ఏర్పడిన చమురు సంక్షోభం నుంచి గట్టెక్కటానికి అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు దీన్ని స్థాపించాయి. అన్ని రంగా ల్లోనూ కలిసి కదలాలని, ప్రపంచ దేశాలన్నిటినీ కలుపుకొని తమ ఆధిపత్యాన్ని ప్రతిష్టించాలని భావించాయి. దాంతో పోలిస్తే ఈనాటి సంక్షోభం అనేక రెట్లు పెద్దది. ఒక అంచనా ప్రకారం కరోనా తర్వాత ఉపాధి కోల్పోయి ప్రపంచవ్యాప్తంగా దాదాపు పదికోట్ల మంది తీవ్ర దారిద్య్రంలో కూరుకు పోయారు. చిన్నా చితకా వ్యాపారాలు సైతం తీవ్ర నష్టాలను చవిచూశాయి. జీ–7 దేశాల్లోనే తీసుకుంటే ఒక్క జర్మనీ మినహా అన్నిచోట్లా నిరుద్యోగం ఉగ్రరూపం దాల్చింది. ప్రజల ఆదాయం కూడా భారీగా పడిపోయింది. ఈ గడ్డు పరిస్థితుల్లో భారీ మొత్తంలో నిధులు పారించి, ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటిస్తే తప్ప కోలుకోవటం అసాధ్యం. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను దాదాపు సున్నా శాతానికి తీసుకొచ్చింది. దాన్ని ఇప్పట్లో పెంచబోమని చెబుతోంది. అటు యూరొపియన్ సెంట్రల్ బ్యాంకు కూడా భిన్న మార్గాల్లో భారీగా నిధుల విడుదలకు సిద్ధమవుతోంది. ఇవన్నీ శిఖ రాగ్ర సదస్సునాటికి సత్ఫలితాలిస్తే సంపన్న దేశాలు ఉత్సాహంగా అడుగులేయటం ఖాయం. -
బ్రిటన్‌కు విమాన సర్వీసుల పునఃప్రారంభం
శంషాబాద్: బ్రిటిష్ ఎయిర్వేస్ సర్వీసులు శుక్రవారం నుంచి పునః ప్రారంభం కానున్నట్లు శంషాబాద్ విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి. కోవిడ్ రెండో రకం వైరస్‌తో భారత్–బ్రిటన్ మధ్య విమాన రాకపోకలపై జనవరి 7 వరకు కేంద్రం నిషేధం విధించింది. వీటిని శుక్రవారం నుంచి తిరిగి ప్రారంభిస్తున్నట్లు బ్రిటిష్ ఎయిర్వేస్ పేర్కొం ది. అయితే ప్రయాణానికి ముందు 72 గంటల్లోపు చేయించుకున్న ఆర్ టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టును కలిగి ఉండాలనే నిబంధనలను కఠినతరం చేశారు. కాగా బ్రిటన్‌లో స్ట్రెయిన్ కేసులు ఉధృతమవుతున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి మూడో వారం వరకు కఠిన నిబంధనలు అమలు చేస్తామని ప్రధాని బోరిస్ జాన్సన్ వెల్లడించారు.(చదవండి: స్ట్రెయిన్ విజృంభణ.. దేశవ్యాప్తంగా లాక్డౌన్) -
ప్రేమ వివాహం: ఆమెకు 81, అతనికి 35
లండన్ : ప్రేమకు భాషా, వయసు, సరిహద్దులతో సంబంధంలేదంటారు. ఎప్పుడు ఎవరు ఏ వయసులో ప్రేమలో పడతారో ఊహించడం చాలా కష్టతరమైన విషయం. కొందరికి యుక్త వయసులో ప్రేమ చిగురిస్తే మరికొందరికి లేటు వయసులో ప్రేమ పుడుతుంది. మనిషి అన్నాక జీవితంలో ఒక్కసారైనా ప్రేమరుచి చూడాల్సిందేనని చెబుతుంటారు కొందరు. అయితే బ్రిటన్‌లో ఓ మహిళ ఏకంగా 81 ఏళ్ల వయసులో ప్రేమ వివాహం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఓ జాతీయ మీడియా తెలిపిన కథనం ప్రకారం.. యునైటెడ్ కింగ్డమ్ (యూకే)కు చెందిన ఐరిష్ జోనిస్ (81) అనే వృద్ధురాలు ఈజిప్ట్‌కు చెందిన మహమ్మద్ అహ్మద్ ఇబ్రహీం (35) అనే వ్యక్తితో తొలుత పరిచయం ఏర్పడింది. రెండేళ్ల క్రితం ఈజిప్ట్ పర్యటనకు వెళ్లిన జోనిస్‌కు ఇబ్రహీంకు మధ్య ఏర్పడిన పరిచయం కొంత కాలంలోనే ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే లేటు వయసులోనూ రెండు మూడుసార్లు ప్రియుడ్ని కలవడానికి ఈజిప్ట్ వెళ్లారు. అయితే అక్కడి వాతావరణం ఆమెకు చాలా ఇబ్బందికరంగా అనిపించింది. వేడి వాతావరణంతో పాటు విపరీతమైన ట్రాఫిక్, ఆహారపు అలవాట్లు జోనిస్‌ను చాలా ఇబ్బందులకు గురిచేశాయి. దీంతో విసుగుచెందిన ఆమె ఇబ్రహీంతో యూకేలోనే సెటిల్ అవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే తనకంటే వయసులో 45 ఏళ్లు చిన్నవాడైన ప్రియుడిని వివాహం చేసుకున్నారు. అయితే అప్పటికే జోనిస్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారి వయసు 50 ఏళ్లకు పైబడే. కానీ ప్రేమ తల్లి వివాహానికి వారు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అవికాస్తా వైరల్ అయ్యాయి. లేటు వయసులో ఘాటు ప్రేమ అంటూ కొందరు కామెంట్ చేయగా.. ముసలిభార్య యంగ్ భర్త అంటూ మరికొందరు కామెంట్స్ చేశారు. పెళ్లి వయసుకు అడ్డు అదుపు లేనక్కర్లేదా అంటూ మరికొందరూ ఘాటుగా స్పందించారు. దీనిపై జోనిస్ మాట్లాడుతూ.. ‘నా మనసుకి నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇద్దరి మధ్య 45 ఏళ్లు తేడా ఉన్నా నాకేమీ అభ్యంతరం లేదు. 50 ఏళ్ల కిందటే నాభర్తతో విడాకులు తీసుకున్నాను. నా కుమారులు కూడా పెళ్లికి ఎలాంటి అభ్యంతరం తెలపలేదు’ అని సంతోషం వ్యక్తం చేశారు. అయితే అయితే వీరి వివాహం వస్తున్న కామెంట్స్ ఆశ్చర్యకరంగా అనిపిస్తున్నాయి. యూకేలో స్థిరపడాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఇబ్రహీంకు ఎంతకీ వీసా దొరకడంలేదు. అనేక ప్రయత్నాలు చేసి విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే అక్కడి మహిళను వివాహం చేసుకుంటే అక్కడే స్థిరపడొచ్చని ఓ మిత్రుడి సలహాను ఆచరించి జోనిస్‌ను వివాహం చేసుకున్నారని పలువురు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం వీరిద్దరు వివాహం చేసుకుని లండన్‌లో సెటిల్ అయ్యారు. -
అప్పటి కంటే 11శాతం ఎక్కువ మరణాలు
లండన్: కొత్త సంవత్సరం వేళ యూకేలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. బ్రిటన్ ప్రజలు ఆంక్షల చట్రం మధ్య బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. గత నెలరోజుల్లోనే రికార్డు స్థాయిలో నమోదైన కేసులు, మరణాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. కరోనా వైరస్ ఉధృతరూపం దాలుస్తోందని ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటూ నిబంధనల్ని పాటించాలని బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ హెచ్చరించారు. కేసుల తీవ్రత ఆధారంగా నాలుగు భాగాలుగా విభజించి వివిధ రకాలుగా ఆంక్షల్ని ప్రవేశపెట్టారు. కేసులు ఓ మాదిరిగా ఉంటే టైర్–1 అని, ఎక్కువ ఉంటే టైర్–2, అత్యధికంగా ఉంటే టైర్–3 అని పిలుస్తారు. ఇక టైర్–4లో ఉన్న ప్రాంతాల్లోని వారు అత్యవసరమైతే తప్ప ఇల్లు దాటి బయటకు రాకూడదు. నిత్యావసరాలు మినహా మిగతా మార్కెట్ అంతా మూసేశారు. ఈమధ్య కాలంలో టైర్–4 ప్రాంతాల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో డిసెంబర్ 31 అర్ధరాత్రి నుంచి మార్కెట్లన్నీ మూసివేయాలన్న నిర్ణయం తీసుకున్నారు. టైర్–4లో ఉన్న ప్రాంతాల్లో ఆంక్షలు ఏప్రిల్ వరకు కొనసాగుతాయి. కేసుల సంఖ్య ఇలాగే కొనసాగితే దేశమంతటా లాక్డౌన్ విధించే అవకాశాలు ఉన్నాయి. (కొత్త వైరస్: యూకే నుంచి తెలంగాణకు..!) యూకేలో ఎలా ఉందంటే..!! ► యూకే వ్యాప్తంగా మొదటి వేవ్‌తో పోల్చి చూస్తే 11శాతం ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయి. రికార్డు స్థాయిలో బుధవారం 50 వేలకు పైగా కేసులు నమోదు కాగా, గురువారం మరిన్ని పెరిగి కొత్తగా 55,892 కేసులు వచ్చాయి. బుధ, గురువారాల్లో దాదాపు 2వేల మందిని ఈ మహమ్మారి బలి తీసుకుంది. ► మొత్తం కేసులు 24,88,780కు, మొత్తం మరణాలు 73,512కు చేరుకున్నాయి. ► వేల్స్లో కేసులు శరవేగంగా పెరుగు తున్నాయి. ప్రతీ 60 మందిలో ఒకరికి వైరస్ సో కింది. వేల్స్ వ్యాప్తంగా లాక్డౌన్ విధించారు. ► ఇంగ్లండ్‌లో 2 కోట్ల మంది వరకు ఇళ్లకే పరిమితమయ్యారు. సెకండరీ స్కూల్స్‌కి క్రిస్మస్ సెలవుల్ని మరో 15 రోజులు పొడిగించారు. ► ఉత్తర ఐర్లాండ్‌లో 6 వారాల లాక్డౌన్. ► స్కాట్లాండ్లో టైర్–4లో ఉండడంతో కర్ఫ్యూ వాతావరణం నెలకొని ఉంది. స్కాట్‌ల్యాండ్ నుంచి యూకేలో ఇతర ప్రాంతాలైన ఇంగ్లండ్, వేల్స్,ఐర్లాండ్‌లకు రాకపోకలపై నిషేధం విధించారు. ► కొత్త రకం వైరస్ భయతో యూకే నుంచి విమాన రాకపోకలపై 40 దేశాలు నిషేధం విధించాయి. ఆస్ట్రాజెనెకా ఆదుకుంటుందా ? కరోనా కట్టడికి గేమ్ ఛేంజర్‌గా భావిస్తున్న ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తయారీలో సవాళ్లు ఎదురవుతున్నాయి. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌కు అత్యవసర అనుమతులు మంజూరు చేసిన ప్రభుత్వం జనవరి 4 నుంచి వ్యాక్సినేషన్‌కి సన్నాహాలు చేస్తోంది. ఆ రోజుకి 5 లక్షల 30 వేల డోసులు సిద్ధంగా ఉంటాయని ఆరోగ్య శాఖ మంత్రి మట్ హన్‌కాక్ చెప్పారు. ఆస్ట్రాజెనెకా కంపెనీ ఈ ఏడాది చివరి నాటికి 40 లక్షల వ్యాక్సిన్లు తయారు చేసి అందిస్తామన్న హామీ ఇచ్చింది. అయితే టీకా డోసులు తయారైనప్పటికీ వాటి నాణ్యతని పరీక్షించి విడుదల చేయడానికి సమయం పడుతుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. మరోవైపు వ్యాక్సిన్ వచ్చినంత మాత్రాన సాధారణ పరిస్థితులు వస్తాయని అనుకోవద్దని, ప్రతీ వ్యక్తి కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు. (చదవండి: పాములతో బాడీ మసాజ్.. గుండె ధైర్యం ఉంటేనే!) -
అమెరికా, బ్రిటన్‌లో కరోనా మృత్యుకేళి
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా, బ్రిటన్ దేశాలకు అత్యంత దుర్దినం ఈ రోజు. ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడి మున్నెన్నడు లేనంత ఎక్కువ మంది మృత్యువాత పడ్డారు. అమెరికాలో బుధవారం నాడు ఒక్క రోజే 3, 903 మరణించగా, లక్షా పాతిక వేల మంది ఆస్పత్రుల పాలయ్యారు. రాగల 24 గంటల్లో దాదాపు 82 వేల మంది మరణించే అవకాశం ఉందని వైద్య వర్గాలు అంచనా వేస్తున్నాయి. కరోనా సోకిన వారి సంఖ్య లక్షను దాటడం వరుసగా 29వ రోజు. 2021, జనవరి 23వ తేదీ నాటికి 3,83,000 నుంచి 4,24,000 మంది మరణించే అవకాశం ఉందని సీడీసీ అంచనా వేసింది. ఒక్క లాస్ఏంజెలిస్ కౌంటీలోనే బుధవారం నాటికి కరోనా మతుల సంఖ్య పదివేలను దాటిందని అధికార వర్గాలు ప్రకటించాయి. (కొత్త వైరస్‌తో మరణాలు ఎక్కువే!) ఇక బ్రిటన్‌లో బుధవారం ఒక్క రోజే కరోనా బారిన పడిన వారిలో 981 మంది మరణించారు. 50 వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గత బుధవారం నాటితో పోలిస్తే దేశంలో మతుల సంఖ్య 31 శాతం పెరిగింది. గత బుధవారం నాడు 744 మంది మరణించారు. అలాగే కేసుల సంఖ్య కూడా గత వారంతో పోలిస్తే 27 శాతం పెరిగింది. గత బుధవారం నాడు 39,237 కేసులు నమోదు కాగా, ఈ బుధవారం వారి సంఖ్య 50,023కు చేరుకుంది. దేశంలో రూపాంతరం చెందిన కొత్త రకం కరోనా విజంభణ పెరగుతుండడం వల్లన కేసుల సంఖ్య, మతుల సంఖ్య గణనీయంగా పెరగుతున్నట్లు వైద్యాధికారులు విశ్లేషిస్తున్నారు. -
కలకలం:ఎలా వచ్చారు.. ఎవరిని కలిశారు?
సాక్షి, రంగారెడ్డి జిల్లా: మళ్లీ కరోనా గుబులు మొదలైంది. బ్రిటన్ నుంచి వచ్చిన జిల్లా వాసి ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో జిల్లాలో కలకలం రేగుతోంది. యూకేలో కొత్త వైరస్ ఉధృతి మొదలైందన్న ప్రచారం దృష్ట్యా.. ఆ దేశం నుంచి జిల్లాకు పలువురు రావడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. ఇటీవల జిల్లాకు చెందిన 301 మంది ఆ దేశం నుంచి వచి్చనట్లు అధికారిక వర్గాల ద్వారా తెలిసింది. వీళ్లందరి చిరునామాలను గుర్తించడంలో యంత్రాంగం నిమగ్నమైంది. రెవెన్యూ, పోలీస్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు రంగంలోకి దిగి ఇప్పటివరకు 290 మంది ఆచూకీ కనుగొని ఆర్టీ–పీసీఆర్ విధానంలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఒకరికి మినహా ఇతరులకు కోవిడ్ లేదని అధికారులు ధ్రువీకరించారు. చదవండి: మనకూ బృందావన్ గార్డెన్స్ వీరంతా అక్కడినుంచి బయలుదేరే సమయంలో చేయించుకున్న పరీక్షల్లో నెగెటివ్‌గా తేలినట్లు సమాచారం. ప్రభుత్వ ఆదేశాల మేరకు.. ఇక్కడికి చేరుకున్నాక మరోసారి పరీక్షలు నిర్వహించినట్లు వైద్యాధికారులు పేర్కొంటున్నారు. నెగెటివ్ వచి్చనా హోం క్వారంటైన్ విధించారు. 17 రోజులపాటు ఎవరితోనూ సన్నిహితంగా మెలగకుండా ఇంటికే పరిమితం కావాలని సూచిస్తూ కట్టుదిట్టమైన ఆంక్షల్ని విధించారు. మరో పది మంది ప్రయాణికుల జాడ తెలియాల్సి ఉంది. వీరికి కోసం జల్లెడ పడుతున్నారు. పాజిటివ్‌గా వచి్చన వ్యక్తికి గచ్చిబౌలిలోని తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)లో వైద్యం అందిస్తున్నట్లు సమాచారం. ఈ వ్యక్తి ప్రైమరీ కాంటాక్ట్‌లను బల్కంపేటలోని నేచర్‌క్యూర్ హాస్పిటల్‌కు తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. బ్రిటన్ నుంచి వచ్చి క్వారంటైన్లో ఉన్న వారందరి ఆరోగ్య పరిస్థితిపై అధికారులు దృష్టిసారించారు. లక్షణా లు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని వారికి సూచించారు. చదవండి: భారత్‌లో కరోనా: పెరిగిన రికవరీ రేటు ఎక్కడెక్కడ తిరిగారు? ఈ నెల 9 తర్వాత యూకే నుంచి జిల్లాకు చేరిన వ్యక్తుల కదలికలతోపాటు సమగ్ర సమాచారాన్ని అధికారులు సేకరిస్తున్నారు. జిల్లాకు ఎప్పుడొచ్చారు? ఏ మార్గం గుండా ఇక్కడికి చేరుకున్నారు? వచి్చన తర్వాత నిబంధనల ప్రకారం హోం క్వారంటైన్లో ఉన్నారా? ఇంట్లో నుంచి బయటకు వెళ్తే ఎక్కడెక్కడ తిరిగారు? ఎలా వెళ్లారు? ఎవరెవరిని కలిశారు? విందులకు హాజరయ్యారా? తదితర అంశాల వారీగా పూర్తిస్థాయి సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇరుగుపొరుగు వారి నుంచి కూడా వివరాలు తీసుకుంటున్నారు. జిల్లాలో ఇప్పటికే జిల్లాలో వేల సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదయ్యాయి. పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. ప్రస్తుతం కూడా నిత్యం సగటున వందకుపైగా కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా బ్రిటన్ పరిణామాల నేపథ్యంలో మరోసారి జిల్లా ఉలిక్కిపడింది. గతంలో మర్కజ్ Ðð ళ్లొచి్చన వారిలో చాలామందికి పాజిటివ్ అని తేలడంతో మే, జూన్ నెలల్లో కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదయ్యాయి. కాగా, విదేశాల నుంచి వచ్చిన వారిలో జన్యు మారి్పడి అయిన కొత్త రకం వైరస్ ఉన్నట్లు గుర్తిస్తే అవసరమైన వైద్యం అందించడానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సిద్ధంగా ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. -
ఈయూతో యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
లండన్: యూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ కూటమితో యునైటెడ్ కింగ్డమ్(యూకే) భారీ ఒప్పందం కుదుర్చుకుంది. పోస్ట్–బ్రెగ్జిట్‌స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని(ఎఫ్‌టీఏ) ఇరు వర్గాలు గురువారం ఖరారు చేసుకున్నాయి. ఇందుకు తుది గడువు డిసెంబర్ 31 కాగా, వారం రోజుల ముందే ఒప్పందం కుదరడం విశేషం. ఇందుకు బెల్జియంలోని బ్రస్సెల్స్ నగరం వేదికగా మారింది. ఇది అతిపెద్ద ద్వైపాక్షిక ఒప్పందమని వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి. ఈ అగ్రిమెంట్ పూర్తి వివరాలు మరికొద్ది రోజుల్లో బహిర్గతం కానున్నాయి. ఒక స్వతంత్ర వాణిజ్య దేశంగా ఇకపై తమకు ఎన్నో కొత్త అవకాశాలు అందుబాటులోకి రానున్నాయని, ప్రపంచవ్యాప్తంగా ఇతర భాగస్వామ్య దేశాలతో మరిన్ని వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడానికి మార్గం సుగమమైందని యూకే అధికార వర్గాలు ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. జీరో టారిఫ్‌లు, జీరో కోటాల ఆధారంగా ఈయూతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించాయి. దీంతో ధనం, సరిహద్దులు, చట్టాలు, వాణిజ్యం, సముద్ర జలాలపై తమ ఆధిపత్యం మళ్లీ తిరిగి వస్తుందని తెలిపాయి. ఒక్కమాటలో చెప్పాలంటే 2021 జనవరి 1వ తేదీన తాము పూర్తిగా రాజకీయ, ఆర్థిక స్వేచ్ఛ పొందుతామని స్పష్టం చేశాయి. ఇదొక పారదర్శక, బాధ్యతాయుతమైన ఒప్పందమని యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు ఉర్సులా వన్‌డెర్ లెయెన్ అభివర్ణించారు. ఈయూకు యూకే దీర్ఘకాలిక భాగస్వామ్య దేశమని గుర్తుచేశారు. ఈయూ నుంచి విడిపోవడం కొంత బాధాకరమే అయినప్పటికీ, ఇది భవిష్యత్తు వైపు దృష్టి సారించాల్సిన సమయమన్నారు. ప్రధాని బోరిస్ హర్షం పోస్ట్–బ్రెగ్జిట్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడం పట్ల యూకే ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ‘ద డీల్ ఈజ్ డన్’ అంటూ ఒక మెసేజ్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అనంతరం 10 డౌనింగ్ స్ట్రీట్‌లోని తన నివాసం వద్ద ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. బ్రిటిష్ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానని చెప్పారు. అతి పెద్ద ఒప్పందాన్ని నేడు ఖరారు చేసుకున్నామని, ప్రజలు కోరుకున్నదే జరిగిందని తెలిపారు. మన ఉత్పత్తులు, వస్తువులను ఇకపై ఈయూ మార్కెట్లలో ఎలాంటి టారిఫ్‌లు, నియంత్రణల భారం లేకుండా విక్రయించుకోవచ్చని అన్నారు. తద్వారా యూకేలో కొత్త ఉద్యోగాలను, గ్రీన్ ఇండస్ట్రియల్ జోన్లను సృష్టించావచ్చని పేర్కొన్నారు. 1973 తర్వాత తొలిసారిగా మన సముద్ర జలాలపై పూర్తి నియంత్రణతో యూకే ఒక స్వతంత్ర తీరప్రాంతం ఉన్న దేశంగా మారుతుందని తెలిపారు. సముద్ర జలాల్లో చేపల వేటపై యథాతథ స్థితి ఒప్పందం మరో ఐదున్నరేళ్లు మాత్రమే అమల్లో ఉంటుందని, ఆ తర్వాత మన జాలర్లు మన సముద్ర జలాల్లో ఎన్ని చేపలయినా పట్టుకోవచ్చని బోరిస్ జాన్సన్ వెల్లడించారు. యూకే ఎప్పటికీ యూరప్‌తో సాంస్కృతికంగా, చరిత్రకంగా, వ్యూహాత్మకంగా, భౌగోళికంగా అనుసంధానమైన ఉంటుందని ఉద్ఘాటించారు. బ్రిటిష్ ఎంపీలు డిసెంబర్ 30న సమావేశమై, ఈ ఒప్పందానికి ఆమోదం తెలుపుతారని పేర్కొన్నారు. -
కోరలు చాస్తున్న కొత్త రకం
లండన్/నైరోబీ/బీజింగ్: యునైటెడ్ కింగ్డమ్లో వెలుగు చూసిన కరోనా వైరస్ కొత్త రకం(వేరియంట్) క్రమంగా ఇతర దేశాలకు వ్యాప్తి చెందుతోంది. తాజాగా ఉత్తర ఐర్లాండ్, ఇజ్రాయెల్‌లో ఈ కొత్త రకం కేసులు నమోదయ్యాయి. బాధితులు ఇటీవలే యూకే నుంచి వచ్చినవారు కావడం గమనార్హం. ఆఫ్రికా దేశమైన నైజీరియాలోనూ కరోనా కొత్త వేరియంట్ (పీ681హెచ్) ఆనవాళ్లు బయటపడ్డాయి. అయితే, దీని ప్రభావం, వ్యాప్తిపై మరింత అధ్యయనం అవసరమని నైజీరియా ప్రభుత్వం తెలిపింది. ఈ వేరియంట్ తొలుత దక్షిణాఫ్రికాలో పుట్టి, యూకేలోకి ప్రవేశించిందన్న వాదన వినిపిస్తోంది. దక్షిణాఫ్రికా నుంచి విమానాల రాకపోకలను యూకే రద్దు చేసింది. కరోనా వైరస్ కొత్త వేరియంట్ వ్యాప్తి పెరుగుతుండడంతో దాదాపు 40 దేశాలు యూకే నుంచి ప్రయాణాలను నిలిపివేశాయి. ఈ జాబితాలో తాజాగా చైనా, బ్రెజిల్ కూడా చేరాయి. ఎప్పటి నుంచి విమానాలు రద్దు చేస్తారన్న సమాచారాన్ని చైనా బయటపెట్టలేదు. నాన్–చైనీస్ పాస్‌పోర్ట్‌లు కలిగి ఉన్నవారు యూకే నుంచి తమ దేశంలోకి రాకుండా చైనా నవంబర్ నుంచే నిషేధం అమలు చేస్తోంది. కొత్త రకమైనా టీకాలు పనిచేస్తాయి కరోనా వైరస్‌లో ఎన్ని మార్పులు జరిగినా.. టb వ్యాక్సిన్ సమర్థంగా ఎదుర్కొంటుందని భావిస్తున్నట్లు మోడెర్నా, ఆస్ట్రాజెనెకా, ఫైజర్ ఫార్మా సంస్థలు ప్రకటించాయి. కొత్త వేరియంట్‌కు వ్యతిరేకంగా తమ వ్యాక్సిన్ రోగ నిరోధక శక్తిని ప్రేరేపిస్తుందని వెల్లడింరాయి. కొత్త వేరియంట్ భయానకం యూకేను బెంబేలెత్తిస్తున్న కరోనా కొత్త రకం వేరియంట్‌తో మున్ముందు పరిస్థితి మరింత దారుణంగా మారనుందని ‘లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్, ట్రోపికల్ మెడిసిన్’కు చెందిన సెంటర్ ఫర్ మ్యాథమెటికల్ మోడలింగ్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ కొత్త రకం వల్ల ఆసుపత్రుల్లో చేరే బాధితుల సంఖ్య, మరణాల రేటు వచ్చే ఏడాది భారీగా పెరుగుతుందని తెలియజేసింది. ఈ వేరియంట్ 56 శాతం అధిక వేగంతో వ్యాప్తి చెందుతుందని తెలిపింది. దీనిని అరికట్టడానికి కఠిన చర్యలు చేపట్టాలని, వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని పేర్కొంది. వారానికి కనీసం 20 లక్షల మందికి టీకా అందజేయాలని కోరింది. -
భారత్‌లో కొత్త రకం కరోనా ఎంట్రీ!
న్యూఢిల్లీ: కొత్త రకం కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. కోవిడ్-19 మహమ్మారి ముప్పు త్వరలో తొలగిపోనుందన్న ఆశలపై నీళ్లు చల్లుతూ.. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదకర వైరస్‌గా బ్రిటన్‌లో మొదట గుర్తించిన ‘వీయూఐ 202012/1’ ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేస్తోంది. ఇప్పటివరకు డెన్మార్క్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, బెల్జియం, ఇటలీ దేశాల్లోనూ అడుగుపెట్టన ఈ వైరస్ తాజాగా భారత్‌లో కూడా వెలుగులోకి వచ్చినట్లు వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లండన్ నుంచి వచ్చిన ప్రయాణికులలో కరోనా వైరస్ బయటపడింది. ఇప్పటి వరకు లండన్ నుంచి వచ్చిన 8 మందికి కరోనా వైరస్ సోకింది. చదవండి: కరోనా 2.O: వైరస్ కొత్త రూపం, అసలు కథేంటి? సోమవారం రాత్రి ఢిల్లీకి వచ్చిన 266 మంది ప్రయాణికులలో కొత్తగా ఎనిమిది మంది ప్రయాణికులకు కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్థారణ అయింది.ఈ క్రమంలో కరోనా నిర్థారణ అయిన వారిలో ‘వీయూఐ 202012/1’ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైరస్ నిర్థారణ అయిన ఎనిమిది మందిలో ఢిల్లీకి చెందిన వారు ఐదుగురు, కోల్‌కతా ఇద్దరు, చెన్నైకి చెందిన ఒకరు ఉన్నారు. చెన్నైకి చెందిన వైరస్ బాధితుడి నమూనాలను పుణేకు పంపినట్లు వైద్యులు తెలిపారు. పూర్తిస్థాయి నివేదికలు వెల్లడయ్యేవరకు కొత్త కరోనా వైరస్‌ను నిర్ధారించలేమని వైద్యులు పేర్కొన్నారు. చదవండి: బ్రిటన్ విమానాలపై నిషేధం -
రైతులకు మద్దతుగా లండన్‌లో నిరసనలు..
లండన్ : భారతదేశంలో కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనకు దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. ఈ క్రమంలో యూకేలోని వివిధ ప్రాంతాల నుంచి సెంట్రల్ లండన్‌లోని భారత హైకమిషన్ భవనం వద్దకు చేరుకొని నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు. ఈ నిరసనలపై స్పందించిన బ్రిటిష్ హైకమిషన్.. ఈ సమస్యపై మెట్రోపాలిటన్ పోలీసులు, అక్కడి భారత బృందంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సోమవారం తెలిపింది. "నిరసనలు మెట్రోపాలిటన్ పోలీసులకు సంబంధించిన విషయం. నిరసన గురించి లండన్‌లోని భారత హైకమిషన్, మెట్రోపాలిటన్ పోలీసుల నుంచి మేము వివరాలు సేకరిసస్తున్నాం" అని బ్రిటిష్ హైకమిషన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. చదవండి: భారత్ బంద్; కాసేపట్లో హైదరాబాద్- బెంగళూర్ హైవే దిగ్భందం కాగా యూకేలో పెద్ద మొత్తంలో ప్రవాస భారతీయులు ఉన్నారు. దీంతో భారత్‌లో రైతులు చేస్తున్న నిరసనల ప్రభావం యూకేలోని పంజాబీలపై పడుతుందని భావించిన బ్రిటిష్ సిక్కు లేబర్ ఎంపీ తన్మన్జీత్ సింగ్ ధేసీ నేతృత్వంలోని 36 మంది బ్రిటిష్ ఎంపీల బృందం యూకే విదేశాంగ కార్యదర్శి డొమినిక్ రాబ్‌కు లేఖ రాశారు. అనంతరం రైతులకు మద్దతుగా లండన్‌లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇక భారతదేశంలోని రైతులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలు 2020 కి వ్యతిరేకంగా భారీ ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. కొత్త వ్యవసాయ చట్టాల్లో కనీస మద్దతు ధరకు భద్రతా లేకపోవడం, కార్పొరేట్ సంస్థలకు ఈ చట్టాలు అనుకూలంగా ఉన్నాయన్న కోణంలో రైతులు ఆందోళనలు దిగారు. చదవండి: పాత చట్టాలతో కొత్త శతాబ్దం నిర్మించలేం కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు: 1. రైతుల ఉత్పత్తుల వర్తక, వాణిజ్యం బిల్లు 2020 2. ధరల హమీ వ్యవసాయ సేవాల బిల్లు 2020 3. నిత్యవసర వసస్తువుల(సవరణ) బిల్లు 2020.. సెప్టెంబర్‌లో అమల్లోకి వచ్చిన ఈ మూడు వ్యవసాయ చట్టాలు వ్యవసాయ రంగంలో ప్రధాన సంస్కరణలుగా ప్రభుత్వం భావించింది. మధ్యవర్తులను తొలగించి, దేశంలో ఎక్కడైనా ధాన్యం విక్రయించడానికి వీలు కల్పించింది. -
గణతంత్ర వేడుకలకు బ్రిటన్ ప్రధాని?
లండన్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆçహ్వానాన్ని అంగీకరిస్తే, 1993 తరువాత బ్రిటన్ ప్రధాని తొలిసారి భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రధాని నరేంద్రమోదీ నవంబర్ 27న బ్రిటిష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్‌తో ఫోన్లో మాట్లాడుతూ జనవరి 26న భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలంటూ ఆహ్వానించారు. అలాగే వచ్చేయేడాది బ్రిటన్‌లో జరిగే జీ–7 సమ్మిట్‌కి ప్రధాని మోదీని, బోరిస్ ఆహ్వనించారు. ప్రధాని నిర్ణయంపై అంతా ఆశ్చర్యపోయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ బ్రిటన్ సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ప్రధాని మోదీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని నిపుణులు అభిప్రాయపడ్డారు. రాబోయే దశాబ్దంలో భారత్, బ్రిటన్ల మధ్య సత్సంబంధాలను పెంచుకోవడానికి తన మిత్రుడు బోరిస్ జాన్సన్‌తో సుహృద్భావ చర్చలు జరిపినట్లు నవంబర్ 27న మోదీ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. చివరిసారి 1993లో బ్రిటన్ ప్రధాని జాన్ మేజర్ భారత గణతంత్ర వేడుకలకు హాజరయ్యారు. -
'మెస్సేజ్ ఇన్ ఏ బాటిల్' తో కొత్త సందేశం
సాక్షి, న్యూఢిల్లీ : మురికి కాల్వల్లో మనం పడేసే ప్లాస్టిక్ బాటిళ్లు ఇతర జల మార్గాల్లో కలసి, వాటి నుంచి నదులకు, నదుల నుంచి సముద్రాలకు చేరి వాటిలొని సకల జల చరాలకు ప్రాణాంతకం అవుతున్నాయనే విషయం తెల్సిందే. అయితే ఇలా పడేసే ప్లాస్టిక్ బాటిళ్లు జల మార్గాల్లో ఎంత దూరం ప్రయాణిస్తాయో తెలిస్తే అంతులేని ఆశ్చర్యం కలగక మానదు. మానవాళికి పర్యావరణ పరిస్థితులపై అవగాహన కల్పించేందుకు ' నేషనల్ జియోగ్రాఫిక్ సొసైటీ' తరఫున బ్రిటన్‌లోని ఎక్సిటర్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు భారత్‌లోని గంగా నదిలో, బంగాళాఖాతంలో, హిందూ మహాసముద్రంలో 500 ఎంఎల్ కలిగిన కొన్నిబాటిళ్లను వదిలి పెట్టారు. వారి గమనాన్ని ఎప్పటికప్పుడు తెలసుకునేందుకు వీలుగా వాటిలో శాటిలైట్, జీపీఎస్ ట్యాగ్‌లను ఏర్పాటు చేశారు. వాటిలో ఆశ్చర్యంగా గంగా నదిలో వదిలేసిన ఓ ప్లాస్టిక్ బాటిల్ మిగితా రెండు వేర్వేరు సముద్రాల్లో వదిలేసిన బాటిళ్లకన్నా ఎక్కువ దూరం ప్రయాణించింది. 94 రోజుల్లో ఆ బాటిల్ 1768 మైళ్లు, అంటే 2, 845 కిలోమీటర్లు ప్రయాణించింది. ఈ ప్రయోగానికి స్ఫూర్తినిచ్చిందీ ' మెస్సేజ్ ఇన్ ఏ బాటిల్' అనే హాలీవుడ్ సినిమా. 1999లో లూయీ మండోకి దర్శకత్వంలో వెలువడిన ఆ ప్రేమ కథా చిత్రం నాటి కుర్రకారును ఎంతో ఆకట్టుకుంది. అందుకేనేమో అదే చిత్రం స్సూర్తితో ఈ ప్రయోగానికికూడా 'మెస్సేజ్ ఇన్ ఏ బాటిల్' అని పేరు పెట్టారు. ఇలాగే ప్రపంచ మానవాళి నిర్లక్ష్యంగా పడేసే ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు ఏటా సముద్రాలకు 80 లక్షల టన్నులు చేరుకుంటోందని 'ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేషన్' లెక్కలు తెలియజేస్తున్నాయి. సముద్రాలకు చేరుతున్న ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాల్లో 80 శాతం నదుల ద్వారా వస్తున్నవేనని కనుగొన్నారు. డాక్టర్ ఎమిలీ డంకన్ పరిశోధనకు నేతృత్వం వహించారు. పలు కారణాల వల్ల కొన్ని ప్లాస్టిక్ బాటిళ్లు మార్గమధ్యంలో ఆగిపోవచ్చనే ఉద్దేశంతో మొత్తం ప్రయోగానికి 25 బాటిళ్లను ఉపయోగించారు. వాటిలో 22 బాటిళ్లు సరాసరి దూరం 165 మైళ్లు, అంటే దాదాపు 267 కిలోమీటర్లు చేరుకున్నాయని పరిశోధకులు వివరించారు. ఆ తర్వాత వాటిలో 14 బాటిళ్ల ఆచూకీ చిక్క లేదని, వాటిలో కొన్ని ప్రజల చేతికి చిక్కగా మిగతావి శాటిలైట్ యాంటెన్నా పాడై పోవడం వల్ల వాటి గమ్యాన్ని గుర్తించలేక పోయామని పరిశోధకులు తెలిపారు. గంగా నదిలోనే ప్లాస్టిక్ బాటిళ్లు ఎక్కువగా చిక్కుకుపోయే అవకాశం ఉండడంతో ఆ నదిలోనే ఎక్కువ బాటిళ్లను వదిలేసినట్లు వారు చెప్పారు. -
జేమ్స్ బాండ్ హీరో కన్నుమూత
బహమాస్: ప్రముఖ హాలీవుడ్ నటుడు, జేమ్స్ బాండ్ పాత్రధారి సీన్ కానరీ (90) కన్నుమూశారు. ఆయన మృతి చెందినట్లు యూకే మీడియా వెల్లడించింది. జేమ్స్ బాండ్ పాత్రలతో అలరించిన ఆయన నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. ఆస్కార్‌తో పాటు మూడు గోల్డెన్ గ్లోబ్ అవార్డులను సీన్ కానరీ సొంతం చేసుకున్నారు. 1962లో విడుదలయిన ‘డాక్టర్ నో’తో తొలి బాండ్‌గా కనిపించారు షాన్ కానరీ. ఆ తర్వాత వచ్చిన ఐదు జేమ్స్ బాండ్ సినిమాల్లో బాండ్‌గా చేశారాయన. ‘ఫ్రమ్ రష్య విత్ లవ్, గోల్డ్‌ఫింగర్, తండర్‌బాల్, యూ ఓన్లీ లివ్ ట్వైస్, డైమండ్స్ ఆర్ ఫరెవర్’ సినిమాల్లో బాండ్‌గా కనిపించారు షాన్ కానరీ. ఆ తర్వాత ‘ఆన్ హర్ మెజెస్టిక్ సీక్రెట్ సర్వీస్’ సినిమాలో జార్జ్ లెజెన్బీ బాండ్ అయ్యారు. మై నేమ్ ఈజ్ బాండ్. జేమ్స్ బాండ్. సుమారు 58 ఏళ్లుగా ఈ పంచ్ డైలాగ్‌ను వింటూనే ఉన్నాం. అయితే ఇప్పటికీ జేమ్స్ బాండ్ చిత్రాలకు ఉన్న పాపులారిటీ అలాంటిది. ఇక బాండ్.. జేమ్స్ బాండ్.. నేను జేమ్స్ బాండ్ 007’ అంటూ తమ ధైర్యసాహసాలను ప్రదర్శించడానికి ఆ పాత్రతో తమను పోల్చుకుంటారు పిల్లలు. అంతలా ఈ క్యారెక్టర్ పిల్లలకు దగ్గరైపోయింది. ఇక, పెద్దల సంగతి సరే సరి. తెరపై ఈ సీక్రెట్ ఏజెంట్ చేసే విన్యాసాలు వారినీ ఆకట్టుకుంటాయి. అలా ఇంటిల్లిపాదికీ దగ్గరైన ఈ పాత్ర చేయడం అంటే చిన్న విషయం కాదు. జంపింగులూ, రన్నింగులూ, చాకచక్యంగా తుపాకీ పేల్చడం.. వాట్ నాట్.. బోల్డన్ని చేయాలి. అందుకే, ఈ పాత్ర చేసేవాళ్లను అద్భుతమైన నటులుగా కితాబులిస్తారు. -
చీవినింగ్తో లైఫ్ చిల్!
సాక్షి, హైదరాబాద్: నేర్చుకోవడం జీవితాంతం సాగే ప్రక్రియ. ఒకసారి ఉద్యోగం అనే బతుకు యుద్ధంలోకి ప్రవేశించాక చదివే తీరిక ఎక్కడుంటుంది. అవకాశాలూ అంతంత మాత్రమే! ఇదీ మనలో చాలామంది అనుకునేది. కానీ వాస్తవం వేరు అంటున్నారు పరకాల ప్రత్యూష, భరత్‌కుమార్‌లు. బ్రిటన్ ప్రభుత్వం ఇచ్చే చీవినింగ్ స్కాలర్‌షిప్‌నకు తెలుగు రాష్ట్రాల నుంచి వీరు ఎంపికయ్యారు. ఉద్యోగాల్లో స్థిరపడినా కూడా నేర్చుకోవాలన్న ఆసక్తితో ఈ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. లండన్‌లో చదువు ఎలా ఉంటుంది? యూనివర్సిటీల తీరు తెన్నులేంటి? చీవినింగ్ స్కాలర్లుగా తమ ప్రాథమ్యాలేమిటి? భవిష్యత్ ప్రణాళికలేంటి.. తదితర విషయాలను వారు ఇలా పంచుకున్నారు. పర్యావరణ కోసం: పరకాల ప్రత్యూష ‘చీవినింగ్ స్కాలర్షిప్ మన జీవితాన్ని మార్చే అరుదైన అవకాశం. 2018లో అంటార్కిటికా యాత్రలో పాల్గొన్న ఏకైక తెలుగు మహిళగా రికార్డు సృష్టించా. చీవినింగ్ స్కాలర్‌గా ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ అండ్ పాలిటిక్స్‌పై బర్మింగ్‌హామ్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ చేస్తున్నా. సుస్థిరాభివృద్ధి, విధాన రూపకల్పన వంటి అంశాల్లో పనిచేస్తుంటాను. 2021లో కోర్సు పూర్తయిన కొంత సమయానికే బ్రిటన్‌లో జరగనున్న కాప్–26 కోసం పనిచేయాలని భావిస్తున్నాను. భారత్ తిరిగి వచ్చాక పర్యావరణ, సుస్థిరాభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటా’అని పరకాల ప్రత్యూష పేర్కొన్నారు. వర్సిటీల గురించి.. ‘బ్రిటన్‌లో విశ్వవిద్యాలయాల వ్యవస్థ చాలా వినూత్నమైంది. ఎంపిక చేసుకునేందుకు బోలెడన్ని కోర్సులు ఉన్నాయి. నా కోసం కూడా ఓ ప్రత్యేకమైన కోర్సు సిద్ధం చేసుకోవచ్చు. ఇక్కడి సిబ్బంది ఆయా రంగాల్లో నిష్ణాతులైనా కూడా చాలా కలుపుగోలుగా ఉంటారు. ఓపికతో, మర్యాదపూర్వకంగా నడుచుకుంటారు. ఈ లక్షణాలన్నింటి వల్ల ఇక్కడి చదువు సంతృప్తినిస్తుందని చెప్పొచ్చు. ఇక్కడ అందరూ అందరినీ గౌరవిస్తారు. ఎవరినీ చులకన చేసి మాట్లాడరు. విద్యార్థులందరి అభిప్రాయాలు, ఆలోచనలకు విలువ ఉంటుంది. దేశవిదేశాల నుంచి వచ్చిన విద్యార్థులతో కలసి చదువుకోవడం వల్ల వారి సంస్కృతులు తెలుస్తాయి. చీవినింగ్ స్కాలర్షిప్ అనేది జీవితకాలంలో దొరికే అద్భుత అవకాశం. ఈ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోవాలని భావిస్తే మీరిచ్చే సమాధానాలు వీలైనంత నిజాయితీగా ఉండేలా జాగ్రత్త పడండి’ అంటూ చెప్పుకొచ్చారు. ప్రత్యేక గుర్తింపు కోసం: భరత్‌కుమార్ ‘ప్రజారోగ్య రంగంలో నాదైన గుర్తింపు పొందాలనేది నా లక్ష్యం. విశాఖపట్నంలో కెమికల్ ఇంజనీరింగ్ డిప్లొమా, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి బీఏ చదివాను. సంజీవని వంటి స్వచ్ఛంద సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉంది. గిరిజన సమాజాల అభివృద్ధికి నా వంతు సాయం చేశాను. విశాఖ జిల్లా గిరిజనులపై నేను జరిపిన అధ్యయం టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో చేరేలా చేసింది. అక్కడే ఎంఏ పూర్తి చేశా. వేర్వేరు స్థాయిల్లో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల్లో పని చేయడం ప్రజారోగ్యం ప్రాముఖ్యాన్ని తెలియజేసింది. అందుకే చీవినింగ్ స్కాలర్షిప్లో భాగంగా లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్‌లో ఉన్నత చదువు అభ్యసించేందుకు ఎంపిక కావడం సంతోషాన్నిస్తోంది. ప్రజా రోగ్య రంగంలో తాజా పరిశోధనలను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం వచ్చింది. జాతీయస్థాయిలో వినియోగదారుల ఆహారపు అలవాట్లలో మార్పులు తెచ్చేందుకు ప్రయత్నిస్తా. ప్రజారోగ్యాన్ని మానవాభివృద్ధి సూచీలో భాగమయ్యేలా చేసేందుకు కృషి చేస్తా’అని భరత్ కుమార్ వివరించారు. ఏమిటీ చీవినింగ్ స్కాలర్షిప్? బ్రిటన్ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు దేశాల్లో అమలు చేస్తున్న స్కాలర్షిప్ పథకం ఇది. బ్రిటన్‌లోని సుమారు 150 యూనివర్సిటీల్లో సుమారు 12 వేల కోర్సుల్లో మీకు నచ్చిన దానిలో చేరేందుకు వీలు కల్పిస్తుంది. ఇప్పుడు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఎంపికైతే బ్రిటన్‌లో ఏడాది కోర్సు పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని ఖర్చులను ఆ దేశ ప్రభుత్వమే భరిస్తుంది. చీవినింగ్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే వారికి రెండేళ్ల వృత్తి అనుభవం ఉండాలి. దరఖాస్తుకు గడువు ఈ ఏడాది నవంబర్ 3వ తేదీ. 1983లో ప్రారంభమైన చీవినింగ్ స్కాలర్షిప్, ఫెలోషిప్‌ల ద్వారా ఇప్పటివరకు సుమారు 3,200 మంది స్కాలర్లు బ్రిటన్‌లో విద్యను అభ్యసించారు. -
డ్రోన్ల ద్వారా కరోనా టెస్ట్ కిట్ల సరఫరా
లండన్: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. యునైటెడ్ కింగ్డమ్(యూకే)లో ఇద్దరు ట్రైనీ డాక్టర్లు ప్రారంభించిన స్టార్టప్ ప్రాజెక్టు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్శిస్తోంది. హమాద్ జిలానీ, క్రిస్టోఫర్ లా అనే ఈ వైద్యులు మెడికల్ డ్రోన్ డెలివరీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ప్రజల నుంచి సేకరించిన కరోనా వైరస్ నమూనాలు, టెస్టింగ్ కిట్లు, పీపీఈ కిట్లను ఒక ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి.. ఆసుపత్రుల నుంచి ఇళ్లకు డ్రోన్ల ద్వారా చేరవేయడమే దీని ఉద్దేశ్యం. ఈ డ్రోన్లకు చిన్న రెక్కలు ఉంటాయి. ఇవి దాదాపు 2 కిలోల బరువును 96 కిలోమీటర్లదాకా మోసుకెళ్లగలవు. మెడికల్ డ్రోన్ డెలివరీ ప్రాజెక్టును అభివృద్ధి చేయడానికి దాదాపు రూ.12.48 కోట్ల ఆర్థిక సాయం అందజేయడానికి యూకే అంతరిక్ష పరిశోధనా సంస్థ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ముందుకొచ్చాయి. వైరస్ శాంపిల్స్, టెస్టింగ్ కిట్లను డ్రోన్లతో చేరవేస్తే కరోనా వ్యాప్తిని చాలావరకు అరికట్టవచ్చని జిలానీ, క్రిస్టోఫర్ లా చెబుతున్నారు. -
‘సినీ వరల్డ్’ మూత ఉద్యోగుల కోత
సాక్షి, న్యూఢిల్లీ : బ్రిటన్‌లో దేశవ్యాప్తంగా చెయిన్ 127 సినిమా థియేటర్ల నెట్వర్క్ కలిగిన ‘సినీ వరల్డ్’ తన కార్యకలాపాలను కొంతకాలం పాటు పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించింది. జేమ్స్ బాండ్, స్టార్‌వార్స్ సిరీస్‌కు చెందిన తాజా చిత్రాల విడుదలపై ఆశలు పెట్టుకొని ఇంతకాలం నెట్టుకొచ్చిన ‘సినీ వరల్డ్’ ఆ సినిమాల విడుదల కూడా మరోసారి వాయిదా పడడంతో తన కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించింది. ఇప్పటికే 350 కోట్ల పౌండ్ల అప్పుకలిగిన ‘సినీ వరల్డ్’కు స్కై, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ, అమెజాన్, బ్రిట్ బాక్స్ సంస్థల నుంచి ఆన్లైన్ చిత్రాల ద్వారా గట్టి పోటీ ఏర్పడడంతో తన కార్యకలాపాలకు తెర దించాల్సి వచ్చింది. హారీ పాటర్ సిరీస్ చిత్రాలకు మంచి డిమాండ్ ఉన్నప్పటికీ, ఆ చిత్రాలను సినిమా థియేటర్లలోనే చూడాలని ప్రేక్షకులు కోరుకుంటున్నప్పటికీ ఆ ఒక్క బ్రాండ్ చిత్రాలపై ఆధారపడి పరిశ్రమను నడిపించలేమని ‘సినీ వరల్డ్’ భావించింది. సినీ వరల్డ్ నిర్ణయం దేశవ్యాప్తంగా వారి నెట్ వర్క్‌లో పని చేస్తోన్న 4,500 ఉద్యోగులు ఉపాధిని కోల్పోయి రోడ్డున పడనున్నారు. -
‘క్వారంటైన్’లోకి ఇటలీ, స్వీడన్, జర్మనీ
సాక్షి, న్యూఢిల్లీ : యూరప్‌లో ప్రాణాంతక కరోనా వైరస్ కేసులు తగ్గకపోగా మరింతగా పెరుగుతుండడంతో బ్రిటిష్ ప్రభుత్వం ఇటలీ, స్వీడన్, జర్మనీ దేశాలను ‘క్వారంటైన్’ జాబితాలో చేర్చింది. అదే సమయంలో 14 రోజుల క్వారెంటైన్ పీరియడ్‌ను 8 రోజులకు తగ్గించే విషయాన్ని పరిశీలిస్తోంది. ఇటలీ, స్వీడన్, జర్మనీ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు 8 రోజులపాటు కచ్చితంగా స్వీయ నిర్బంధంలో ఉండాల్సి ఉంటుంది. ఎనిమిదవ రోజున కరోనా పరీక్షలు నిర్వహించి నెగటివ్ వస్తే స్వీయ నిర్బంధం ముగిసినట్లే. కరోనా పరీక్షలో పాజిటివ్ అని వస్తే మరో వారం రోజుల పాటు స్వీయ నిర్బంధాన్ని పొడిగిస్తారు. బ్రిటన్‌లో కరోనా కేసులను కట్టడి చేయడంలో భాగంగా రాత్రి పది గంటలకే అన్ని బార్లు, పబ్బులు, క్లబ్బులను మూసివేయాలంటూ తాజా ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఐర్లాండ్ దేశంలోనయితే మరోసారి 15 రోజుల లాక్‌డౌన్‌ను అమలు చేయాలంటూ అక్కడి వైద్య నిపుణుల బృందం సిఫార్సు చేసింది. ఇక 5,15,571 పాజిటివ్ కేసులతో యునైటెడ్ కింగ్డమ్ 12 స్థానంలో కొనసాగుతోంది. తొలి మూడు స్థానాల్లో అమెరికా, భారత్, బ్రెజిల్ దేశాలున్నాయి. యూకే కరోనా బారినపడి ఇప్పటివరకు 42,369 మంది మరణించారు. (చదవండి: ట్రంప్‌పై నెటిజన్లు ఫైర్, బాధ్యతలేకుండా...) -
యూకేలో సరికొత్త వీసా నిబంధనలు
లండన్: విదేశీ విద్యార్థుల కోసం యూకే ప్రభుత్వం సరికొత్త వీసా నిబంధనలను గురువారం వెల్లడించింది. అయితే సరికొత్త వీసా రావాలంటే కనీసం 70పాయింట్లు పరిమితిని విధించారు. ఈ నేపథ్యంలో మెరిట్ విద్యార్థులకు అవకాశం కల్పించే విధంగా నూతన వీసా విధానం అమలు చేయనున్నట్లు తెలిపారు. అయితే విద్యార్థులు కోర్సు ప్రారంభానికి 6 నెలల ముందే వీసా అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభించాలని తెలిపారు. అయితే గత ఆర్థిక సంవత్సరం 50,000 మంది దేశీయ విద్యార్థులు యూకేలో వీసా పొంది చదువుకున్నట్లు బ్రిటిష్ అధికారులు తెలిపారు. అయితే కోర్సు పూర్తయిన తరువాత కూడా కొందరు విద్యార్థులు అక్రమంగా ఉంటున్నారని, వీసా నిబంధనలు పాటిస్తున్న వారికి ఎలాంటి ఢోకా ఉండదని యూకే వర్గాలు పేర్కొన్నాయి. -
దగ్గు రాకపోయినా దగ్గితే పనిష్మెంట్
లండన్: ఇప్పట్లో కోవిడ్ దశ ముగిసే సూచనలు కనిపించడం లేదు. దీంతో ఎన్నాళ్లని లాక్డౌన్ అంటూ భయంతో బతుకు వెళ్లదీయడం అని ఒక్కొక్కటిగా అన్నిరకాల కార్యకలాపాలను తెరుచుకునేందుకు అనుమతులు ఇస్తున్నారు. అందులో భాగంగానే బడులకు కూడాఆ పచ్చజెండా ఊపుతున్నారు. దీంతో యునైటెడ్ కింగ్డమ్లో నిన్నటి నుంచే స్కూళ్లు పున: ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా తూర్పు ససెక్స్‌లోని ఆర్క్ అలెక్జాండ్ర అకాడమీ కరోనా వైరస్ రెడ్ లైన్స్ పేరిట ప్రత్యేక నిబంధనలను రూపొందించింది. "విద్యార్థులు ఉద్దేశపూర్వకంగా దగ్గకూడదు, తుమ్మకూడదు. కరోనా గురించి ఎవరూ అనుచిత వ్యాఖ్యలు చేయరాదు. వ్యక్తికి వ్యక్తికి మధ్య కనీస దూరం ఉండాల్సిందే. (చదవండి: 66 రోజుల్లో అందరికీ ఉచితంగా వ్యాక్సిన్?) ఈ ఆంక్షలను ఉల్లంఘించే విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వారిని స్కూలు నుంచి ఇంటికి పంపించేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు" అని పాఠశాల యాజమాన్యం హెచ్చరించింది. ఒక్క మాటలో చెప్పాలంటే దగ్గు రాకపోయినా సరే దగ్గుతూ నటించినా, కరోనా మీద కుళ్లు జోకులు వేసినా వారిపై చర్యలు తప్పవు. కఠినంగా అనిపిస్తోన్న ఈ నిబంధనలను పిల్లలు అలవాటు చేసుకుంటారో, లేదా రూల్స్ అతిక్రమించి పనిష్మెంట్ తీసుకుంటారో! కాగా వీటితో పాటు ప్రభుత్వం ఆదేశించిన నిబంధనలను కూడా విద్యార్థులు పాటించాల్సిందే. ఫేస్ మాస్క్ ధరించడం, ఒకరికి మరొకరికి మధ్య భౌతికదూరం పాటించడం వంటివి తప్పనిసరి. (చదవండి: ‘టీసీ’ లేకున్నా అడ్మిషన్..) -
‘ఆ ఒప్పందంతో విదేశాలకు వెళ్లొచ్చు’
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని దేశాలు విదేశీయుల రాకపోకలపై ఆంక్షలు విధించాయి. ఇటీవల అమెరికా అధ్యక్షుడు విదేశీయుల రాకపోకలపై కఠినమైన ఆంక్షలు విధించారు. కానీ ప్రస్తుతం కరోనా నేపథ్యంలో దేశంలో ఉంటూ విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఓ ఓప్పందం వరంగా మారనుంది. ఎయిర్ బబుల్ ఒప్పందంతో పాటు దృవీకరించిన వీసా ఉంటే అమెరికా, యూకే, కెనడా తదితర దేశాలకు వెళ్లొచ్చని సివిల్ ఏవియేషన్ అధికారులు తెలిపారు. ఇటీవల ఎయిర్ బబుల్ ఒప్పందంతో భారతీయులు అత్యధికంగా ఫిలిప్పైన్స్కు వెళ్లారని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ పూరి తెలిపారు. కాగా విదేశాలలో ఎలాంటి నిబంధనలు ఉన్న దేశంలో మాత్రం వీసాల మంజూరులో కఠినమైన నిబంధనలు ఉన్నాయని హోంశాఖ వర్గాలు పేర్కొన్నారు. చదవండి: ‘రష్యా టీకా అడ్వాన్స్ స్టేజ్‌లో లేదు’ -
కరోనాపై 141 రోజుల పోరాటం...
సాక్షి, న్యూఢిల్లీ : బ్రిటన్‌కు చెందిన 35 ఏళ్ల ఫాతిమా బీడిల్ సుదీర్ఘకాలం పాటు, అంటే 141 రోజులపాటు కోవిడ్–19 తో పోరాటం చేసి విజయం సాధించారు. అన్ని రోజుల్లో ఆమె 105 రోజులపాటు వెంటిలేటర్‌పై, 40 రోజులపాటు కోమాలోకి వెళ్లి కోలుకోవడం విశేషమని ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్ జనరల్ ఆస్పత్రి వైద్య వర్గాలు తెలిపాయి. బహుశ కోవిడ్–19 పై ఇంతకాలంపాటు పోరాటం చేసి గెలిచిన తొలి రోగి, మహిళ ఫాతిమా బీడిల్లే కావచ్చని ఆ వర్గాలు పేర్కొన్నాయి. బీడిల్ మొరాకోలోని ఇస్లాం పవిత్ర మందిరాల సందర్శనకు వెళ్లినప్పుడు ఆమెకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. తాను వెంటిలేటర్‌పై ఉన్నప్పుడు ఛాతిలో భయంకరపైన నొప్పితో బాధ పడ్డానని, తాను బతుకుతానని ఏ కోశానా నమ్మకం కలగలేదని ఆమె స్థానిక మీడియాకు ఆదివారం తెలిపారు. తాను బతికి బయటపడడానికి ఎన్హెచ్ఎస్ ఆస్పత్రి వైద్య సిబ్బందే కారణమని, వారిని మెడల్స్‌తో సత్కరించాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పారు. కాగా, బీడిల్ రెండు ఊపిరితిత్తులకు వైరస్ సోకగా, ఒకటి పూర్తిగా దెబ్బతిన్నది. ఇక ఆమె జీవిత కాలంలో ఆ ఊపిరితిత్తి మెరగుపడే అవకాశం లేదని, ఒకే ఊపిరితిత్తితోనే బతకాల్సి ఉంటుందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. (అమెరికాలో విస్తృతంగా వ్యాప్తిస్తోన్న కరోనా..) -
నిరాడంబరంగా బ్రిటన్ ప్రిన్సెస్ వివాహం
లండన్ : ప్రిన్స్ ఆండ్రూ పెద్ద కుమార్తె ప్రిన్సెస్ బీట్రెస్(31) వివాహం శుక్రవారం ఓ వ్యాపారవేత్తతో జరిగింది. బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 మనవరాలు అయిన బ్రీట్రెస్ ఇటలీకి చెందిన మాపెల్లి మొజ్జిని(37) పెళ్లి చేసుకున్నారు. కరోనా వైరస్ కరాణంగా వీరి వివాహం నిరాడంబరంగా జరిగినట్లు బకింగ్హమ్ ప్యాలెస్ వర్గాలు ధృవీకరించాయి. ('క్వీన్ ఎలిజబెత్ ఆరోగ్యంపై దిగులుగా ఉంది') అయితే ప్రిన్సెస్ బ్రీట్రెస్, మాపెల్లిల పెళ్లి మొదటగా మే 29న లండన్‌లోని సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో జరగాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వీరి వివాహం వాయిదా పడింది. అనంతరం జూలై 17న శుక్రవారం ఉదయం 11 గంటలకు విండ్సర్లోని రాయల్ లాడ్జ్‌లోని రాయల్ చాపెల్ ఆఫ్ ఆల్ సెయింట్స్ వద్ద వీరి వివాహం జరిగినట్లు రాజ కుటుంబం ఓ ప్రకటలో తెలిపింది. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలోనే ఈ వేడుక జరిగినట్లు తెలుస్తోంది.(ఆ విషయంలో అమెరికా తర్వాత ఇండియానే) -
ఫ్రీ వైఫై; 80 వేల పోర్న్ వీడియోలు డౌన్లోడ్
లండన్: ఓ ట్రాన్స్‌జెండర్ ఆస్పత్రిలోని వైఫై ఉపయోగించుకుని ఏకంగా 80 వేల పోర్న్ వీడియోలను డౌన్లోడ్ చేసింది. ఈ షాకింగ్ ఘటన యూకేలో చోటు చేసుకుంది. 54 ఏళ్ల జూలీ మార్షాల్ అనే ట్రాన్స్‌జెండర్ 2017 ఆగస్టులో గుండెపోటుతో ఆస్పత్రిలో చేరింది. బెడ్డుపై పేషెంటు స్థితిలో ఉన్న ఆమె అక్కడ ఉన్న పబ్లిక్ వైఫైను తన ఫోన్‌కు, ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ చేసుకుంది. అనంతరం 80 వేల వరకు పోర్న్ ఫొటోలు, వీడియోలను ల్యాప్‌టాప్‌లో డౌన్లోడ్ చేసింది. అవన్నీ కూడా పిల్లల పోర్న్ ఫొటోలే కావడం గమనార్హం. అయితే పెద్ద మొత్తంలో ఉండే ఇంటర్నెట్ ప్యాక్ ఎంతో తొందరగా అయిపోవడంతో ఆస్పత్రి వర్గాలు అసలేం జరుగుతోందని ఆరా తీశాయి. అప్పుడు ఆ ట్రాన్స్‌జెండర్ అసలు రంగు బయటపడింది. (చివరి క్షణాల్లో చావు నుంచి తప్పించిన ఫోటోగ్రాఫర్!) ఉన్న నెట్టంతా అసభ్య ఫొటోలు, వీడియోలు డౌన్లోడ్ చేసుకోడానికే ఆమె వినియోగించిందని తేలింది. దీంతో వెంటనే ఆస్పత్రి వర్గాలు పోలీసులకు సమాచారం అందించాయి. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమె దగ్గర నుంచి ఫోన్‌ను, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు. ఆమెపై అనుమానంతో ఇంటికి వెళ్లి చూడగా కుప్పలుగా పడి ఉన్న సీడీలను సైతం స్వాధీనం చేసుకున్నారు. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన న్యాయస్థానం తాజాగా ఆమెకు తొమ్మిదేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే ఇప్పుడు పోలీసులకు అసలైన చిక్కొచ్చి పడింది. ట్రాన్స్‌జెండర్‌ను మహిళల జైల్లో ఉంచాలా? లేదా మగవాళ్ల జైల్లో ఉంచాలా? అనేది అర్థమవక తలలు పట్టుకుంటున్నారు. (జోక్ చేశాడని హత్య చేశారు!) -
లైవ్: అమ్మా, ఆ యాంకర్ పేరేంటి?
లండన్: కరోనా కారణంగా అన్ని పనులు ఇంటి నుంచే పూర్తి చేసుకుంటున్నాం. ఉద్యోగానికి కూడా గడప దాటాల్సిన పరిస్థితి లేకుండా అనేక కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని కల్పించాయి. అయితే పిల్లలు ఉన్న ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునేవారికి తల ప్రాణం తోకకొస్తుంది. ముఖ్యంగా టీవీ జర్నలిస్టులకు ఇది మరింత కష్టం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టీవీ డిబేట్లలో పాల్గొనే వారు కూడా ఇంటి నుంచే లైవ్‌లో వీడియో ద్వారా చర్చిస్తున్నారు. (పోలీసులకు ఫోన్: పిచ్చిపట్టిన దానిలా..) ఈ క్రమంలో ఓ వాతావరణ యాంకర్.. వెదర్ అప్డేట్స్ ఇస్తున్న సమయంలో పిల్లి రావడం, మరో యాంకర్ ఇంటి నుంచే లైవ్ చేస్తుండగా, ఆమె భర్త అర్ధ నగ్నంగా దర్శనమివ్వడం.. ఇలాంటి ఎన్నో వింతలు చూడాల్సి వచ్చింది. తాజాగా బీబీసీ లైవ్‌లో పాల్గొన్న జర్నలిస్టుకు కూడా ఇలాంటి ఇబ్బందికర ఘటన ఎదురైంది. డా. క్లేర్ వెన్హామ్ అనే నిపుణురాలు ఇంగ్లాండ్‌లో లాక్డౌన్ పరిస్థితిపై లైవ్‌లో సీరియస్‌గా చర్చిస్తోంది. ఇంతలో ఆమె కూతురు ఇంటర్వ్యూలో ప్రత్యక్షమైంది. (యాంకర్ రవి 'తోటబావి' టీజర్) అమ్మను పిలుస్తూ డ్రాయింగ్ ఫొటో ఎక్కడ పెట్టాలంటూ చూపించసాగింది. ఇదేవీ పట్టించుకోకుండా ఆమె చెప్పుకుపోతూ ఉండగా ఆ చిన్నారి మళ్లీ తల్లిని డిస్టర్బ్ చేస్తూనే ఉంది. సైలెంట్‌గా ఉండు అంటూ కూతురికి సైగ చేసినా ఆ చిన్నారి అల్లరి ఆపడం లేదు. దీంతో బీబీసీ యాంకర్ క్రిస్టియన్ ఫ్రాజర్ స్పందిస్తూ.. "మీ కూతురు పేరేంటి?" అని అడిగాడు. అందుకు ఆమె పెదాలపై చిరునవ్వుతో 'స్కార్లెట్' అని సమాధానమిచ్చింది. అనంతరం ఫ్రాజర్ ఆ డ్రాయింగ్ ఎక్కడ పెట్టాలో చెప్పి, అద్భుతంగా ఉందని మెచ్చుకున్నాడు. అప్పుడు ఆ పాప కూడా లైవ్‌లో కనిపిస్తున్న యాంకర్‌ను చూస్తూ.. "అతని పేరేంటి అమ్మా?" అని అడిగింది. దీనికి యాంకర్ "నా పేరు క్రిస్టియన్" అంటూ వినయంగా సమాధానమిచ్చాడు. ఈ వీడియోను బీబీసీ యూకే ట్విటర్లో షేర్ చేయగా వైరల్ అవుతోంది. లైవ్‌లో యాంకర్ ప్రవర్తించిన తీరుకు నెటిజన్లు అబ్బురపడుతున్నారు (వైరల్: మనసు మార్చుకున్న దొంగలు!) “Mummy what's his name?” Dr Clare Wenham, we understand your struggles of working from home and looking after children 😂https://t.co/vXb15EQatL pic.twitter.com/4f3PODtJWA — BBC News (UK) (@BBCNews) July 1, 2020 -
నెలలుగా మూగబోయిన గొంతు.. చివరకు
లండన్: తలకు బలమైన గాయం తగలడంతో ఓ మహిళ కొన్ని నెలల తరబడి మాట్లాడలేకపోయింది. అయితే అనూహ్యంగా ఆమె ఇప్పుడు నాలుగు యాసల్లో గలగల మాట్లాడేస్తోంది. యూకేకు చెందిన ఎమిలీ ఈగన్ అనే మహిళ ఇంగ్లండ్‌లో నివసిస్తోంది. కొద్ది నెలల క్రితం ఆమె తల(మెదడు)కు గాయమైంది. అప్పటినుంచి ఆమె నోరు మూగబోయింది. గొంతు నుంచి మాట పెగిలేదే కాదు. అలా కొన్ని నెలలు గడిచాక ఆమె తిరిగి మామూలు మనిషైంది. పెదాలు కదిలిస్తూ మాట్లాడగలుగుతోంది. నిజం చెప్పాలంటే అంతకు ముందుకన్నా ఇప్పుడే ఎక్కువగా మాట్లాడుతోంది. దీంతో ఈ ఆనందాన్ని పంచుకునేందుకు థాయ్‌లాండ్ పర్యటనకు వెళ్లిన తల్లిదండ్రులకు ఫోన్ చేసి సంభాషించింది. (30 ఏళ్ల తర్వాత ఆ రహస్య చీటీలు చూసి..) ఆమె నోటి పలుకులు వినగానే వారు ఓ క్షణం సంతోషించినా మరో క్షణం అయోమయంలో పడ్డారు. దీనికి కారణం ఆమె తన అసలైన యాసలో మాట్లాడకపోవడమే. అంతకుముందు మాట్లాడే ఎస్సెక్స్ యాస ఇప్పుడామెకు పలకడానికే రావట్లేదు, కానీ ఎంతో కష్టమైన ఈస్టర్న్ యూరోపియన్ యాసల్లో గలగలా మాట్లాడుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఫ్రెంచ్, ఇటాలియన్, రష్యన్ యాసల్లో సులువుగా మాట్లాడుతోంది. దీన్ని వైద్యులు "ఫారిన్ యాక్సెంట్ సిండ్రోమ్"గా గుర్తించారు. ఇక ఈ విషయం గురించి ఆమె మీడియాతో మాట్లాడుతూ.. "మాటల్లోనే కాదు, రాతలోనూ తేడా వచ్చింది. ఇప్పుడు నేను కొత్తకొత్త పదాలను కూడా ఉపయోగిస్తున్నాను. అంతేకాదు, ఆలోచనల్లోనూ మార్పు వచ్చింది" అని తెలిపింది. (వైరల్: పాము నీళ్లు తాగడం చూశారా?) -
ఆ వాహనాలు కొనేవారికి బంపర్ ఆఫర్
లండన్ : ఎలక్ర్టిక్ వాహనాల వినియోగాన్ని పలు దేశాలు ప్రోత్సహిస్తున్న క్రమంలో బ్రిటన్ ఓ ఆకర్షణీయ ప్రతిపాదనతో ముందుకురానుంది. డీజిల్, పెట్రోల్ వాహన యజమానులు ఎలక్ర్టిక్ వాహనాల కొనుగోలుకు ముందుకు వస్తే వారికి 6000 పౌండ్లు అందించేందుకు బ్రిటన్ కసరత్తు చేస్తోంది. నూతన వాహనాలకు డిమాండ్ పెంచడంతో పాటు పర్యావరణ పరిరక్షణ వంటి రెండు ప్రయోజనాలు నెరవేరేలా ఈ ప్రతిపాదనపై బ్రిటన్ యోచిస్తోంది. ఫ్రాన్స్, జర్మనీ వంటి పలుదేశాలు ఎలక్ర్టిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్న క్రమంలో బ్రిటన్ ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. కోవిడ్-19 సంక్షోభ సమయంలో ఆటోమొబైల్ రంగానికి ఊతమిచ్చేందుకు కార్ స్క్రాపేజ్ స్కీమ్‌ను బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పరిశీలిస్తున్నారని టెలిగ్రాఫ్ పేర్కొంది. కరోనా లాక్‌డౌన్‌తో కార్ల తయారీదారుల ఉత్పత్తి, సరఫరాలు తగ్గుముఖం పట్టడమే కాకుండా వాహనాలకు డిమాండ్ సైతం రికార్డు కనిష్టాలకు పడిపోయింది. కొత్తగా ఎలక్ర్టిక్ వాహనాల కొనుగోళ్లకు రాయితీలు అందిస్తే బ్రిటన్‌లో వాహన తయారీ కంపెనీలకు ఊతమిచ్చినట్టు అవుతుందని టెలిగ్రాఫ్ పేర్కొంది. భారత్‌లోనూ.. పాత కార్లను వదిలించుకుని ఎలక్ర్టిక్ వాహనాలు, నూతన వాహనాలను కొనుగోలుచేసే వారికి ప్రోత్సాహకంగా కార్ స్ర్కాపేజ్ పాలసీకి భారత్ తుదిమెరుగులుదిద్దుతోంది. ఈ ప్రతిపాదన భారత ఆటోమొబైల్ పరిశ్రమకు కొత్త ఊపునిస్తుందని భావిస్తున్నారు. ఈ దిశగా నూతన విధానానికి శ్రీకారం చుడతామని ఎంఎస్ఎంఈ, ఉపరితల రవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల సానుకూల సంకేతాలు పంపారు. చదవండి : మాల్యా అప్పగింతలో మరింత జాప్యం