
లండన్: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తన భారత భారత పర్యట నను రద్దు చేసుకు న్నారు. భారత్‌లో కరోనా తీవ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం వెల్లడించారు. ఆయన వచ్చే వారం భారత్‌కు రావాల్సి ఉంది అయితే తాజా నిర్ణయంతో ఆ పర్యటన రద్దైంది. దీనికి ముందు గణతంత్ర దినోత్సవ వేడుకలకే ఆయన రావాల్సి ఉండగా, అప్పుడు బ్రిటన్‌లో కరోనా తీవ్రంగా ప్రబలి ఉండటంతో రాలేకపోయారు. పర్యటన రద్దుపై ఆయన స్పందిస్తూ.. భారత్‌లో కరోనా తీవ్ర పంజా విసురుతున్న నేపథ్యంలో పర్యటనను రద్దు చేసుకోవడం మంచి నిర్ణయమని భావిస్తున్నట్లు తెలిపారు.
భారత ప్రధాని మోదీతో చర్చించిన అనంతరం ఇరువురూ కలసి ఈ నిర్ణయానికి వచ్చినట్లు పేర్కొన్నారు. గతంలో తాము కూడా కరోనా వల్ల దెబ్బతిన్నామని, అదే స్థితిలో ఇప్పుడు భారత్ ఉందని చెప్పారు. ఈ స్థితి నుంచి భారత్ కోలుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పర్యటన రద్దైన నేపథ్యంలో త్వరలోనే ఓ వర్చువల్ సమావేశం ఉంటుందని కేంద్రం ప్రకటించింది. ఈ ఏడాది చివర్లో వ్యక్తిగతంగా ఆ దేశ అధికారులను కలిసే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇలా ఉండగా, బ్రిటన్‌లో ఇటీవల భారత మూలాలున్న డబుల్ మ్యూటంట్ వైరస్ కేసులు 77 నమోదైన నేపథ్యంలో.. భారత్‌ను ప్రయాణ నిషేధ జాబితాలో చేరుస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది.
చదవండి: హే! హెర్డ్ ఇమ్యూనిటీ ఉత్త ముచ్చట
చదవండి: తస్మాత్ జాగ్రత్త! లింక్ నొక్కితే.. నిలువు దోపిడీ
Comments
Please login to add a commentAdd a comment