లండన్: బ్రిటన్‌లో కరోనా డెల్టా వేరియంట్ కేసులు వారంలో 33,630కి పెరిగాయి. దీంతో దేశంలో మొత్తం డెల్టా వేరియంట్ కేసుల సంఖ్య 75,953కు చేరింది. ప్రస్తుతం దేశంలో నమోదవుతున్న కేసులన్నింటిలో 99 శాతం డెల్టా వేరియంట్‌కు సంబంధించినవేనని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. యూకేలో వేరియంట్ ఆఫ్ కన్సెర్న్(వీఓసీ– ఆందోళన కరమైన వేరియంట్) కేసులను పర్యవేక్షించే పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్(పీహెచ్‌ఈ), ప్రకారం ఆల్ఫా వీఓసితో పోలిస్తే డెల్టా వీఓసీతో ఆస్పత్రి పాలయ్యే రిస్కు అధికంగా ఉంది. దేశంలో ఇచ్చిన కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారికి డెల్టా వేరియంట్‌తో ఆస్పత్రి పాలయ్యే ముప్పు గణనీయంగా తగ్గిందని పీహెచ్‌ఈ గణాంకాలు వెల్లడించాయి.
కాగా జూన్ 14 నాటికి డెల్టా వేరియంట్ కారణంగా దేశంలో 806మంది ఆస్పత్రి పాలయ్యారు. వీరిలో 527 మంది టీకా తీసుకోనివారు కాగా, 84 మంది రెండు డోసులు తీసుకున్నవారున్నారు. డెల్టా వేరియంట్ కారణంగా మరణాలు ఎక్కువగాలేవని, అయితే సాధారణంగా కొత్త వేరియంట్లు వచ్చిన తర్వాత మరణాల రేటు కొన్ని వారాల అనంతరం పెరుగుతుందని, అందువల్ల డెల్టా వేరియంట్ మరణకారక రేటును ఇప్పుడే మదింపు చేయలేమని పీహెచ్‌ఈ తెలిపింది. కోవిడ్ టీకా తీసుకున్న వారిలో మరోమారు కరోనా వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు అధ్యయనాలు వెల్లడించాయని తెలిపింది. యూకేలో థర్డ్ వేవ్‌కు డెల్టా వేరియంట్ కారణమవుతుందన్న భయాలతో లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేయడానికి ప్రభుత్వం వెనకాముందాడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment