
లండన్: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కూతురు అనౌష్క సునాక్ శుక్రవారం లండన్‌లో సంప్రదాయ నృత్యం కూచిపూడి ప్రదర్శన ఇచ్చింది. తొమ్మిదేళ్ల అనౌష్క కొంతకాలంగా కూచిపూడి నేర్చుకుంటోంది. ఈ క్రమంలో రేజ్- ఇంటర్నేషనల్ కూచిపూడి డ్యాన్స్ ఫెస్టివల్ 2022లో భాగంగా పలువురు చిన్నారులతో కలిసి కూచిపూడి నృత్యంలో పాల్గొన్నారు. అనౌష్క చేసిన కూచిపూడి నృత్యం అందరిని ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా యూకేలో జరిగే డ్యాన్స్ ఈవెంట్స్‌లో ఇదే అతిపెద్దది. నాలుగు నుంచి 85 ఏళ్ల వయసున్న దాదాపు వందమంది కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంగీత విద్వంసులు, డ్యాన్సర్స్, వీల్‌చెయిర్ నృత్యకారులు, పోలాండ్‌లోని నటరంగ్ గ్రూప్‌కు చెందిన అంతర్జాతీయ బర్సరీ విద్యార్థులు ఇందులో పాలుపంచుకున్నారు. ఈ డ్యాన్స్ ఈవెంట్‌కు రిషి సునక్ తల్లిదండ్రులతో పాటు అనౌష్క తల్లి అక్షతా మూర్తి హాజరయ్యారు.
Watch: Rishi Sunak's Daughter Performs Kuchipudi At UK Event https://t.co/cTDhegSN9Y pic.twitter.com/IisEz55stc
— NDTV (@ndtv) November 26, 2022
కాగా యూకే ప్రధాని పదవిని చేపట్టిన తొలి భారత సంతతికి చెందిన వ్యక్తిగా రిషి సునాక్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. 42 ఏళ్ల రిషి బ్రిటన్ పగ్గాలు చేపట్టిన అత్యంత పిన్న వయస్కుడిగా కూడా అవతరించారు. ప్రధాని రిషి సునాక్‌కు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కృష్ణ, అనౌష్క. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కూతురు అక్షతామూర్తిని రిషి పెళ్లి చేసుకున్నారు.
చదవండి: బాక్సర్‌తో కలిసి మీసాలు తిప్పిన రాహుల్ గాంధీ.. వీడియో వైరల్