kuchipudi dance
-
ఘనంగా కూచిపూడి పతాక స్వర్ణోత్సవాలు
కూచిపూడి(మొవ్వ): పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాపీఠం, కూచిపూడి హెరిటేజ్ ఆర్ట్ సొసైటీ సంయుక్త నిర్వహణలో శుక్రవారం కృష్ణాజిల్లా కూచిపూడిలోని వేదాంతం రత్తయ్యశర్మ వేదికపై కూచిపూడి పతాక స్వర్ణోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు మూడురోజులపాటు జరగనున్నాయి. మొదటిరోజు హైదరాబాద్, వరంగల్, కూచిపూడి, చెన్నై, న్యూఢిల్లీ, బెంగళూరు, రష్యా, ప్యారిస్, యూఎస్ఏ కళాకారులు ప్రదర్శించిన పలు అంశాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. ముందుగా గ్రామ సర్పంచ్ కొండవీటి వెంకట రమణ విజయలక్ష్మి, నాట్యాచార్యులు వేదాంతం వెంకట రామ రాఘవయ్య, పసుమర్తి శేషుబాబు, ఏలేశ్వరపు చలపతి శాస్త్రి, మాధవపెద్ది మూర్తి, సీతా కుమారి, డాక్టర్ చింతా రవి బాలకృష్ణ, డాక్టర్ ఏలేశ్వరపు శ్రీనివాసులు, డాక్టర్ పసుమర్తి వెంకటేశ్వర శర్మ, వనజా ఉదయ్‌లతోపాటు పలువురు నాట్యాచార్యులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశాయి.. నాట్యాంశాల్లో తొలిగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కూచిపూడి నాట్యకళాపీఠం విద్యార్థులు పూజా నృత్యంతో ప్రదర్శనలను ప్రారంభించారు. డాక్టర్ చింతా రవి బాలకృష్ణ శిష్య బృందం మోహినీ భస్మాసుర నృత్య రూపకం ప్రదర్శించారు. రష్యాకు చెందిన పుట్టు పద్మ రాగిణి, న్యూఢిల్లీకి చెందిన అభినయ నాగ జ్యోతి, వరంగల్‌కు చెందిన సు«దీర్ రావు శిష్య బృందం, యూఎస్ఏకు చెందిన అమేయ కింగ్, అయోస్ల, అవ్వారి మనస్విని, ప్రణమ్య సూరి, బెంగళూరుకు చెందిన సామా కృష్ణ, అనురాధ, మంజుల, అవిజిత్ దాస్, డాక్టర్ వీణ మూర్తి విజయ్, హైదరాబాద్‌కు చెందిన ప్రొఫెసర్ పసుమర్తి రామలింగ శాస్త్రి శిష్య బృందం, డాక్టర్ శ్రీకళ శిష్య బృందం, నాట్యరత్న రమణి సిద్ధి, చెన్నైకు చెందిన ఎం కిశోర్, శోభ ప్రదర్శించిన నృత్యాంశాలు ప్రేక్షకులను అలరించాయి. నాట్య ప్రదర్శనలు నిర్వహించిన గురువులను, కళాకారులను నిర్వాహకులు సత్కరించారు. కూచిపూడిలోని పురవీధుల్లో ఉదయం నగర సంకీర్తన, విద్యార్థులకు నాట్య శిక్షణ, అనంతరం నాట్య సదస్సులు నిర్వహించారు. -
రవీంద్ర భారతి : రక్తి కట్టించిన రుక్మిణీ కృష్ణ (ఫొటోలు)
-
స్టార్మర్ దీపావళి వేడుకలు
లండన్: బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. మంగళవారం రాత్రి తన అధికార నివాసం 10, డౌనింగ్ స్ట్రీట్ ముందు ఆయన స్వంగా దీపాలు వెలిగించారు. అనంతరం నుదుట కుంకుమ దిద్దుకుని హిందూ సంప్రదాయ ప్రార్థనల్లో పాల్గొన్నారు. అరుణిమా కుమార్ బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యాన్ని ఆస్వాదించారు. ప్రస్తుతం ప్రపంచాన్ని చాలారకాల చీకట్లు కమ్ముకున్నాయని ఈ సందర్భంగా స్టార్మర్ ఆవేదన వెలిబుచ్చారు. వాటన్నింటినీ పారదోలేలా ఈ వెలుగుల పండుగ మనందరికీ స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షించారు. దీపావళి భిన్న వర్గాల వారిని ఒక్కటి చేసే పండుగ అన్నారు. భారతీయులపై ప్రశంసల జల్లుబ్రిటిష్ ఇండియన్ సమాజం కష్టించి పని చేస్తుందని, తమ విలువలు, సేవా భావంతో సమాజంలో ఎనలేని గౌరవం సంపాదించుకుందని స్టార్మర్ కొనియాడారు. వారి భాగస్వామ్యం బ్రిటిష్ సమాజాన్ని సుసంపన్నం చేసిందన్నారు. ‘‘ప్రభుత్వ పనితీరులో వారెంతో కీలకం. నా అధికార నివాసం తలుపులు వారికోసం ఎప్పటికీ తెరిచే ఉంటాయి’’ అన్నారు. ఉప ప్రదాని ఏంజెలా రేయ్నర్, మంత్రులు సీమా మల్హోత్రా తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు. -
ప్రపంచ వారసత్వ దినోత్సవం: వారసత్వ మెట్లు.. ‘కూచిపూడి’ వెలుగులు (ఫొటోలు)
-
Maddali Usha Gayathri: నృత్య తపస్వి
ఆమె ప్రయాణం నాట్యం. ఆమె ప్రయత్నం నాట్యకళకు జీవం పోయడం. నాలుగేళ్ల వయసు నుంచి కూచిపూడిని జీవనాడిగా చేసుకుని., 69 ఏళ్ల వయసులోనూ కళను వీడలేదు హైదరాబాద్ వాసి మద్దాలి ఉషాగాయత్రి. సుదీర్ఘ నృత్య ప్రయాణంలో భారత్‌తోపాటు దేశ విదేశాల్లో ఎన్నో నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. వందల మంది ఔత్సాహికులు కూచిపూడి నృత్యంలో శిక్షణ ఇవ్వడమే కాకుండా 200కు పైగా నృత్యాంశాలకు సోలోగా కొరియోగ్రఫీ చేశారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలికి బ్యాలే చేసి, కేంద్ర ప్రభుత్వ అవార్డులు పొందారు. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రతిష్టాత్మక కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకున్న డా. ఉషా గాయత్రి నృత్య ప్రయాణం తెలుసుకుంటే ఈ కళాసేవ ఒక తపస్సులా అనిపించకమానదు. ‘‘కూచిపూడి నృత్యానికి సంబంధించిన సాహిత్యం, రచనలు చాలా తక్కువగా ఉన్నాయి. దీనికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని పుస్తకాలుగా తీసుకురావాలనేది నా చిరకాల స్వప్నం. దానిని నిజం చేయాలనే ప్రయత్నంలో ఉన్నాను’’ అని తనను తాను పరిచయం చేసుకున్న తపస్వి ఉషాగాయత్రి తన నృత్య జీవన గమ్యాన్ని ఇలా మనముందుంచారు. ‘‘నాలుగేళ్ల వయసులో ఉదయ్ శంకర్ శిష్యుడైన దయాల్ శరణ్ వద్ద నాట్యాభ్యాసం మొదలుపెట్టాను. ఇక్కడే కథక్, ఒడిస్సీ, సంగీతం కూడా నేర్చుకున్నాను. ఆ తర్వాత ప్రఖ్యాత గురువు వేదాంతం జగన్నాథ శర్మ వద్ద కూచిపూడి, పద్మశ్రీ వేదాంతం సత్యనారాయణ శర్మ, పద్మభూషణ్ డా.వెంపటి చినసత్యం, వేదాంతం ప్రహ్లాద శర్మ వద్ద యక్షగానాలు, ప్రఖ్యాత కళాక్షేత్ర గురువు కమలారాణి వద్ద నట్టువాంగం, పద్మశ్రీ డా.నటరాజ రామకృష్ణ వద్ద పదములు నేర్చుకున్నాను. 1988లో హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో ఎం.ఏ. పూర్తయ్యింది. అంతేకాకుండా ‘తెలుగు సాహిత్యంలో సత్యభామ పాత్ర వృద్ధి, వికాసం, నాట్యంలో అవతరణ‘ అనే అంశం మీద పరిశోధన చేసి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ పొందాను. రాజీవ్‌గాంధీ విశ్వవిద్యాలయంలోని నృత్య విభాగంలోనూ పనిచేశాను. ఆ తర్వాత దాదాపు పాతిక సంవత్సరాలు పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఉద్యోగం చేశాను. నాట్యానికే అంకితం అవ్వాలనే తపనతో ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను. ‘నృత్యకిన్నెర‘ పేరుతో ఏర్పాటు చేసిన సంస్థ ఆధ్వర్యంలో వందల మందికి శిక్షణనిస్తూ వచ్చాను. ఇందులో 50 మంది శిష్యులు నృత్యంలో డిప్లొమా సర్టిఫికెట్లు పొందారు. 10 మంది చిన్నారులు భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని సీసీఆర్టీ స్కాలర్షిప్ పొందారు. నా శిష్యులు దేశవిదేశాల్లో స్థిరపడటమే కాకుండా నృత్యంలో పీహెచ్డీ, ఎం.ఏ. పట్టాలు పొంది గురువులు, నర్తకులుగా అభివృద్ధి చెందారని చెప్పుకోవడం ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. పాదం కదపని వేదిక లేదు సంగీత నాటక అకాడమీ, సౌత్ జోన్ కల్చరల్ సెంటర్, టీటీడీ, రాష్ట్ర సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో ఎన్నో వందల ప్రదర్శనలు. దేశంలోని న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లోనే కాకుండా విదేశాల్లోనూ ప్రదర్శనలు ఇచ్చాను. భారత స్వాతంత్య్ర దినోత్సవ నేపథ్యంలో 1997లో మారిషస్‌లో ఇచ్చిన ప్రదర్శనకుగాను ఆనాటి ప్రెసిడెంట్ సత్కరించడం ఒక గొప్ప జ్ఞాపకం. ప్రదర్శనల కోసం శిష్యులతోపాటు యూకే, యూరోప్‌లలో పర్యటించాను. యూకేటీఏ, జయతే కూచిపూడి, అంతర్జాతీయ కూచిపూడి ఫెస్టివల్లో భాగంగా ప్రదర్శనలు ఇవ్వడం మరో గొప్ప అనుభూతి. ప్రధానంగా దాదాపు 200 లకు పైగా సోలో నృత్యాంశాలకు కొరియోగ్రఫి చేయడంతో పాటు ప్రతిష్టాత్మకమైన 16 బ్యాలేలు చేశాను. ఇందులో భాగంగా రచయిత ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ చారిత్రక నవల శివభక్త మార్కండేయ, మా తెలుగుతల్లికి మల్లెపూదండ, స్వర్ణోత్సవ భారతి, వందేమాతరం, సంక్రాంతి లక్ష్మి, రుక్మిణీ సత్య, అలిమేలుమంగ చరిత్ర, యశోదకృష్ణ వంటి బ్యాలేలు ప్రదర్శించాను. రవీంద్రుని గీతాంజలి మాట నిజమైన వేళ విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన గీతాంజలికి బ్యాలే చేయడం నా అదృష్టంగా భావిస్తాను. కలకత్తా వేదికగా ఈ ప్రదర్శన చేసిన సమయంలో ఒక విషయం నన్ను అమితమైన ఆనందానికి లోను చేసింది. ‘ఏదో ఒకనాడు, ఎవరో ఒకరు నా సాహిత్యానికి నృత్య రూపాన్ని తీసుకువస్తారు’ అని ఆనాడే రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన మాటలను అక్కడి వారు ప్రస్తావించడం మాటల్లో చెప్పలేనంత సంతోషాన్ని, సంతృప్తినిచ్చింది. కావ్యాలకు, కథనాలకు, నృత్యానికి ఎంతటి అనుబంధం ఉంటుందో ఆ సంఘటన రుజువు చేసింది. 12 గంటలు 12 మంది శిష్యులు నృత్యం దర్శయామిలో భాగంగా 72 సోలో నృత్యాంశాలైన శబ్దాలు, తరంగములు, దరువులు, తిల్లానాలు, అష్టపదులు, కీర్తనలు.. తదితర అంశాలతో 12 మంది శిష్యురాళ్లతో కలిసి 12గంటల పాటు అవిరామంగా నృత్యప్రదర్శన చేశాం. 12గంటల పాటు నిరంతరాయంగా నట్టువాంగం నిర్వహించి దానిని గురువు వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రికి అంకితం చేశాం. చేసిన సోలో ప్రదర్శనలు, బ్యాలేలు న్యూ ఢిల్లీ దూరదర్శన్ తో పాటు విదేశీ ఛానళ్లలోనూ ప్రసారమయ్యాయి. ఎంతో ప్రోత్సాహం.. ఈ నృత్య ప్రయాణంలో నా జీవిత భాగస్వామి మద్దాళి రఘురామ్ ప్రోత్సాహం ఎనలేనిది. ఎన్నో పురస్కారాలు, సత్కారాలు అందుకున్నాను. వాటిలో .. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో 2001లో అత్యంత ప్రతిష్టాత్మకమైన రాష్ట్రీయ అవార్డు ‘హంస పురస్కారాన్ని’, 2004లో తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ప్రతిభా పురస్కారం, యూరప్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ నర్తకిగా, న్యూయార్క్‌లో ఉత్తమ నాట్యగురువుగా, సిలికాన్ ఆంధ్ర అంతర్జాతీయ కూచిపూడి కన్వెన్షన్ లో ఆనాటి ప్రధానమంత్రి పి.వి. నరసింహారావు, మారిషస్ ప్రెసిడెంట్ చేతుల మీదుగా అవార్డులను అందుకున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నృత్యరత్న బిరుదుతోపాటు, ఉత్తమ నర్తకి–నాట్యగురు అవార్డులను పొందాను. 1984లో ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (న్యూ ఢిల్లీ) ఆధ్వర్యంలో ఉత్తమ కళాకారిణిగానూ, భారత్‌తో పాటు విదేశాల్లో నిర్వహించిన పలు అంతర్జాతీయ కూచిపూడి నృత్యోత్సవాలకు న్యాయనిర్ణేతగా సేవలందించాను. గత డిసెంబర్లో స్ట్రోక్ వచ్చి వీల్‌చెయిర్‌లో ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది. అయినా నా కళా తపన ఆగలేదు. వీల్ చెయిర్ నుంచే విద్యార్థులకు కూచిపూడి నృత్యంలో శిక్షణను అందిస్తున్నాను. ఈ నెల 6న రాష్ట్రపతి చేతుల మీదుగా కేంద్ర సంగీత నాటక పురస్కారాన్ని వీల్‌చెయిర్‌లో ఉండే అందుకున్నాను. నా శ్వాస ఉన్నంతవరకు కళాసేవలో తరించాలని, కళలో ఔత్సాహికులను నిష్ణాతులను చేయాలన్నదే నా తపన’ అంటూ ఉషాగాయత్రి తన సుదీర్ఘ నృత్య ప్రయాణాన్ని ఎంతో ఆనందంగా మన ముందు ఆవిష్కరించారు. – హనుమాద్రి శ్రీకాంత్, సాక్షి సిటీ, హైదరాబాద్ -
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో ‘కూచిపూడి డ్యాన్స్ లెసన్’
గచ్చిబౌలి (హైదరాబాద్): తెలుగు వారి ప్రాచీన నృత్యం కూచిపూడి డ్యాన్స్ లెసన్ గిన్నిస్ వరల్డ్ రికా ర్డ్స్లోకి ఎక్కింది. ఏకకాలంలో 3,783 మంది కళా కారులు కూచిపూడి నృత్యంచేసి కళా వైభవాన్ని ప్ర పంచానికి చాటారు. ఆదివారం రాత్రి గచ్చిబౌలి అథ్లెటిక్ స్టేడియంలో భారత్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వ ర్యంలో కూచిపూడి కళావైభవం పేరిట లార్జెస్ట్ కూచి పూడి డ్యాన్స్ లెసన్ ప్రదర్శించారు. స్టేడియం నలు మూలలా ఏడు నిమిషాలపాటు కళాకారులు నృత్యంచేస్తూ అలరించారు. గురువు పసుమర్తి శేషు బాబు ఆధ్వర్యంలో కళాకారులు ఏకకాలంలో నృత్యం చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కారు. గిన్ని స్ వరల్డ్ రికార్డ్స్ అడ్జుడికేటర్ రిషినాథ్ నిర్వాహ కులకు సర్టిఫికెట్‌ను అందజేశారు. 2020లో త్యాగ రాయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చెన్నైలో ఏక కాలంలో 1,183 మంది కళాకారులు కూచిపూడి డ్యాన్స్ లెసన్ ప్రదర్శించారని రిషినాథ్ తెలిపారు. కళలను ప్రోత్సహించి ప్రేరణ కల్గించాల్సిన అవస రం ఉందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. పాఠశాల స్థాయి లోనే కళలను ప్రోత్సహించే సంఘాలుండాలని ఆ యన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ కూచిపూడి నృత్యం తెలుగువారికి ఎంతో ఇష్టమైందని, ఈ నృత్యరూపకం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్ర మంలో భారత్ ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షురాలు లలిత, వ్యవస్థాపక అధ్యక్షుడు రమణారావు పాల్గొన్నారు. -
రూపకలాపం.. మంత్రముగ్ధం (ఫొటోలు)
-
రవీంద్రభారతి : దర్శకుడు త్రివిక్రమ్ సతీమణి సౌజన్య నృత్యరూపకం (ఫొటోలు)
-
రవీంద్ర భారతి : నమామి గంగే.. ఉత్సాహం ఉప్పొంగే (ఫొటోలు)
-
Video: కూచిపూడి డ్యాన్స్‌తో అలరించిన రిషి సునాక్ కూతురు
లండన్: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కూతురు అనౌష్క సునాక్ శుక్రవారం లండన్‌లో సంప్రదాయ నృత్యం కూచిపూడి ప్రదర్శన ఇచ్చింది. తొమ్మిదేళ్ల అనౌష్క కొంతకాలంగా కూచిపూడి నేర్చుకుంటోంది. ఈ క్రమంలో రేజ్- ఇంటర్నేషనల్ కూచిపూడి డ్యాన్స్ ఫెస్టివల్ 2022లో భాగంగా పలువురు చిన్నారులతో కలిసి కూచిపూడి నృత్యంలో పాల్గొన్నారు. అనౌష్క చేసిన కూచిపూడి నృత్యం అందరిని ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా యూకేలో జరిగే డ్యాన్స్ ఈవెంట్స్‌లో ఇదే అతిపెద్దది. నాలుగు నుంచి 85 ఏళ్ల వయసున్న దాదాపు వందమంది కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంగీత విద్వంసులు, డ్యాన్సర్స్, వీల్‌చెయిర్ నృత్యకారులు, పోలాండ్లోని నటరంగ్ గ్రూప్‌కు చెందిన అంతర్జాతీయ బర్సరీ విద్యార్థులు ఇందులో పాలుపంచుకున్నారు. ఈ డ్యాన్స్ ఈవెంట్‌కు రిషి సునక్ తల్లిదండ్రులతో పాటు అనౌష్క తల్లి అక్షతా మూర్తి హాజరయ్యారు. Watch: Rishi Sunak's Daughter Performs Kuchipudi At UK Event https://t.co/cTDhegSN9Y pic.twitter.com/IisEz55stc — NDTV (@ndtv) November 26, 2022 కాగా యూకే ప్రధాని పదవిని చేపట్టిన తొలి భారత సంతతికి చెందిన వ్యక్తిగా రిషి సునాక్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. 42 ఏళ్ల రిషి బ్రిటన్ పగ్గాలు చేపట్టిన అత్యంత పిన్న వయస్కుడిగా కూడా అవతరించారు. ప్రధాని రిషి సునాక్‌కు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కృష్ణ, అనౌష్క. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కూతురు అక్షతామూర్తిని రిషి పెళ్లి చేసుకున్నారు. చదవండి: బాక్సర్తో కలిసి మీసాలు తిప్పిన రాహుల్ గాంధీ.. వీడియో వైరల్ -
Vempati Chinna Satyam: కూచిపూడి విదుషీ ధీమణి
శాస్త్రీయ నృత్య రూపకాల్లో విశేషమైన ఆదరణ కలిగిన వాటిలో కూచిపూడి ఒకటి. ఇది తెలుగు నేల నుంచి ప్రస్థానం ప్రారంభించి యావత్ ప్రపంచాన్ని చుట్టేసింది. ఆంధ్ర రాష్ట్ర అధికారిక నృత్యం కూచిపూడి. అందులో అత్యద్భుతమైన నాట్యాచార్యులు ‘పద్మభూషణ్’ వెంపటి చిన సత్యం. 1929 అక్టోబర్ 15న కృష్ణా జిల్లా కూచిపూడిలో వెంపటి జన్మించారు. తమిళనాడులో భరతనాట్యం విరాజిల్లుతున్న తరుణంలో కూచిపూడి నృత్య సంప్రదాయాన్ని అక్కడి కళాభిమానులకు పరిచయం చేసి, దీటైన స్థానాన్ని సంపాదించి పెట్టారు. కూచిపూడి నాట్యంలో సరికొత్త ప్రయోగాలు చేయడానికి తన జీవితమంతా అంకితం చేసిన విదుషీ ధీమణి వెంపటి. రకరకాల జతులనీ, నాట్య ప్రక్రియలనీ విస్పష్టంగా వర్గీకరించి, సనాతన నాట్యశాస్త్ర సమగ్ర విధివిధానాలతో మేళవించి, ఎన్నెన్నో జతి స్వరాలూ, తిల్లానాలూ, వర్ణాలూ సృజించిన నాట్య పరమేష్టి ఆయన. కూచిపూడి నృత్య నాటికలను ఎన్నింటినో రూపొందించి వాటికి పేరు ప్రఖ్యాతులు వచ్చేలా చేశారు. శ్రీకృష్ణ పారిజాతం, చండాలిక, మేనకా విశ్వామిత్ర, రుక్మిణీ కల్యాణం, కిరాతార్జునీయం, క్షీరసాగర మథనం, పద్మావతీ శ్రీనివాసం, హరవిలాసం లాంటివి పేరెన్నిక గన్నవి. 1947లో మద్రాసుకు చేరుకున్న చిన సత్యం తన సోదరుడు వెంపటి పెద సత్యం వద్ద సినిమాలకు నృత్య నిర్దేశకత్వంలో సహాయకుడిగా పనిచేశారు. 1984లో అమెరికా పిట్స్‌బర్గ్‌లోని వేంకటేశ్వరస్వామి దేవస్థానం ఆస్థాన నాట్యాచార్యునిగా పనిచేశారు. 2011లో హైదరాబాదులో 2,800 మంది కళాకారులతో ఏకకాలంలో నిర్వహించిన కూచిపూడి నృత్యానికి గిన్నిస్ రికార్డు వచ్చింది. 1963లో చెన్నైలో కూచిపూడి ఆర్ట్ అకాడెమీని స్థాపించారు. దీని ద్వారా వైజయంతిమాల, ప్రభ, పద్మామీనన్, వాణిశ్రీ, శోభానాయుడు లాంటివారికి కూచిపూడి నేర్పించారు. హేమమాలిని, మంజుభార్గవి, చంద్రకళ, రత్నపాప వంటి వారంతా ఆయన శిష్యులే. 2012 జూలై 29న మరణించిన వెంపటి జన్మదినమైన అక్టోబర్ 15న ప్రపంచ కూచిపూడి దినోత్సవంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. ఆయన పేరిట 5 లక్షల రూపాయల స్మారక పురస్కారాన్ని ‘యక్షగాన సార్వభౌమ’ చింత సీతారామాంజనేయులుకు ప్రకటించింది. పర్యాటక, సాంస్కృతిక శాఖామాత్యులు ఆర్కే రోజా దీన్ని ప్రదానం చేస్తారు. – రేగుళ్ళ మల్లికార్జునరావు, సంచాలకులు, భాషా సాంస్కృతిక శాఖ, ఏపీ (అక్టోబర్ 15న వెంపటి చిన సత్యం జయంతి) -
నాట్య దీపిక.. దీపికారెడ్డి
నవరసాలను పలికించే కళ్లు. చూపు తిప్పుకోనివ్వని ఆహార్యం. అకుంఠిత దీక్ష... నిరంతర సాధన. అంతకు మించిన అంకితభావం. యాభై ఏళ్ల కిందట కట్టిన మువ్వలు నేటికీ లయబద్ధంగా రవళిస్తూనే ఉన్నాయి. కూచిపూడి నాట్యానికి... ఆమె చేయాల్సింది ఏదో మిగిలి ఉన్నట్లుంది. నటరాజు మరింతగా సేవ కోరుకుంటున్నాడు. సంగీత నాటక అకాడమీ బాధ్యతనిచ్చాడు. కూచిపూడి నాట్యం కోసం జీవితాన్ని అంకితం చేసిన దీపికారెడ్డి పౌరాణిక కథాంశాలకే పరిమితం కాకుండా ఆధునిక సామాజికాంశాలకు రూపకల్పన చేస్తున్నారు. ‘తెలంగాణ రాష్ట్రం, సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్’గా నియమితురాలైన సందర్భంగా ఆమె సాక్షితో మాట్లాడుతూ ‘నాట్యం అనేది అద్భుతమైన కళ. ఈ భారతీయ కళను ప్రపంచదేశాలకు పరిచయం చేయాలి. మనం ఎన్ని ప్రదర్శనలిచ్చాం అని లెక్కపెట్టుకోవడం కాదు, మనం ఎంతమంది కళాకారులను తయారు చేశామనేది ముఖ్యం. కళాకారులు నటరాజుకు సమర్పించే నమస్సుమాంజలి కళను విస్తరింపచేయడం ద్వారానే’ అన్నారు. ‘నాట్యం, సంగీతం వంటి కళలన్నీ నగరాల్లో కేంద్రీకృతమైపోతున్నాయి. గ్రామాల్లో, పట్టణాల్లో ఉన్న పిల్లలకు సరిగ్గా అందడం లేదు. ఈ కొత్త బాధ్యత ద్వారా ఈ కళలను జిల్లాల వారీగా ప్రణాళికలు వేసుకుని గ్రామాలకు చేరుస్తానని’ చెప్పారామె. కళ ఇచ్చిన మధుర జ్ఞాపకాలు! ‘‘కూచిపూడి కళ కోసం జీవితాన్ని అంకితం చేశాననే మాట నిజమే. కానీ ఈ కళ నాకు ఇచ్చిన మధురమైన జ్ఞాపకాలు ఎన్నో. ఖజురహో డాన్స్ ఫెస్టివల్స్‌లో నా పెర్ఫార్మెన్స్ చూసిన ఒక క్రిటిక్ మా అమ్మానాన్న దగ్గరకు వచ్చి ‘మీకు సరస్వతీదేవి పుట్టింది’ అన్నారు. ఆ ప్రశంస గుర్తొచ్చిన ప్రతిసారీ ఆయనకు మనసులోనే ప్రణమిల్లుతుంటాను. మరొకటి... ఢిల్లీలో నేషనల్ డాన్స్ ఫెస్టివల్లో ద్రౌపది పాత్ర అభినయించాను. ఆ మరుసటి రోజు ఆడియెన్స్ గ్యాలరీకి వెళ్తున్నప్పుడు... ముందు రోజు నా ప్రోగ్రామ్ చూసిన వాళ్లు గుర్తు పట్టి ఎక్సైట్మెంట్తో ‘ద్రౌపదిరెడ్డీ... ద్రౌపది రెడ్డీ’ అని గట్టిగా పిలిచారు. వీటన్నింటినీ మించిన జ్ఞాపకం సెర్బియాలో జరిగింది. సెర్బియా– టర్కీ టూర్లో బెల్గ్రేడ్లో ప్రదర్శన, విపరీతమైన చలి. నాట్యం చేసేటప్పుడు పాదరక్షలేవీ ఉండవు కదా. నాట్యం ఎలాగో చేసేశాను. కానీ ఫెలిసిటేషన్ సమయంలో పాదాలు నేల మీద ఆన్చలేకపోయాను. ఒక పాదం నేల మీద ఉంటే మరో పాదం నేలను తాకకుండా పాదాలను మార్చుకుంటూ ఇబ్బంది పడుతున్నాను. అప్పుడు ఒక పెద్దాయన వచ్చి తన కోటు తీసి నేల మీద పరిచి ఆ కోటు మీద నిలబడమన్నాడు. ఇవన్నీ ఈ నాట్యం ఇచ్చిన మధురానుభూతులే కదా! ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారైతే ‘రుక్మిణి– కృష్ణ’ ప్రదర్శన చూసి ‘దిస్ ఈజ్ ద బెస్ట్ డాన్స్ డ్రామా ఐ హావ్ సీన్’ అంటూ ‘న్యత్యభారతి’ అని ప్రశంసించారు. అంతకంటే ఇంకేం కావాలి. నేను అందుకున్న అవార్డులు ఇచ్చిన సంతోషానికి మించిన ఆనందక్షణాలివి. ఎస్పీబీగారు మెసేజ్‌లు పెట్టరు. మాట్లాడి వాయిస్ రికార్డు పంపిస్తారు. అలా నాకు పంపిన వాయిస్ రికార్డులన్నీ దాచుకున్నాను. నాట్యమే ఊపిరి నాకు హాబీ అంటూ ప్రత్యేకంగా ఏదీ లేదు. నాట్యం చేయడం, కొత్త ప్రయోగాల గురించి ఆలోచించడం, నాట్యం గురించి మాట్లాడడం... ఇష్టం. రాత్రి అందరూ పడుకున్న తర్వాత ఏ మధ్య రాత్రిలోనో ఓ కొత్త ఐడియా వస్తుంది. అప్పుడే ఆ ఐడియాను పేపర్ మీద రాసుకుని, నాట్యం చేస్తూ ఫోన్లో రికార్డు చేసుకోవడం, ఉదయానికంతా కొత్త రూపకాన్ని సిద్ధం చేయడం నాకలవాటు. కోవిడ్ సందర్భంగా రూపకం, ప్రకృతి సంరక్షణ కోసం ప్రకృతి రక్షతి రక్షితః, శాంతి జీవనం, రితు సంహార, తెలంగాణ వైభవం, వైద్యో నారాయణో హరి... వంటివన్నీ అలా రూపొందినవే. ఆరోగ్యం పెట్టిన పరీక్ష మహిళలకు అందరికీ మల్టీ టాస్కింగ్ వెన్నతో పెట్టిన విద్య అనే చెప్పాలి. ఇల్లు, పిల్లలను ఒకవైపు తన వృత్తి ప్రవృత్తులను మరో వైపు బాలెన్స్ చేసుకోవడంలో సక్సెస్ అవుతాం. కానీ తల్లిగా నేను బిడ్డ దగ్గర ఉండాల్సిన క్షణాల్లో ఉండలేకపోయానే అనే గిల్ట్ పారిస్ టూర్ సమయంలో ఎదురైంది. నిజానికి ఆ టూర్ రెండు రకాలుగా పరీక్ష పెట్టింది. బయలుదేరే సమయానికి పాపకు జ్వరం. అలాగే వదిలి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ ఇరవై ప్రదర్శనలిచ్చాం. ఒకరోజు నాకు నాలుగు నూట నాలుగు జ్వరం. మందులు వేసుకున్నా కూడా కంట్రోల్ కాలేదు. మేకప్ వేసుకుంటుంటే చేతులు వణుకుతున్నాయి. కళ్ల నుంచి నీళ్లు కారుతున్నాయి. నిలబడితే కాళ్లు వణుకుతున్నాయి. ఆర్గనైజర్స్ మొత్తం సిద్ధం చేశాక ‘నాకు జ్వరం, డాన్స్ చేయలేను’ అనడానికి మనసొప్పుకోలేదు. ఆర్కెస్ట్రా వాళ్లతో ‘ఒకవేళ నేను కళ్లు తిరిగిపడిపోతే వెంటనే లైట్లు ఆఫ్ చేయండి’ అని చెప్పి నాట్యం మొదలుపెట్టాను. పళ్లెం మీద నాట్యం అది. ఆ నటరాజే నాతో చేయించాడని నమ్ముతాను ఇప్పటికీ’’ అంటూ కళ్లు మూసుకుని దణ్ణం పెట్టుకున్నారు దీపికారెడ్డి. అమ్మమ్మ తాతయ్యల పెంపకం దీపికారెడ్డి తాత నూకల రామచంద్రారెడ్డి మాజీ మంత్రి. తండ్రి వీఆర్ రెడ్డి న్యాయవిద్యలో సంస్కరణలు తెచ్చిన విద్యావేత్త, అడిషనల్ సొలిసిటర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆమెకు ఆర్థిక బాధలు లేవు. కానీ, పేదరికం తెచ్చే కష్టాలు తెలుసన్నారామె. ‘‘వరంగల్‌లో తాతగారింట్లో పెరగడం వల్ల పేదవాళ్లకు ఆయన చేసిన సహాయాన్ని స్వయంగా చూశాను. నాట్య సాధన కోసం కొంతకాలం మా గురువుగారు వెంపటి చినసత్యం గారింట్లో ఉన్నాను. వాళ్లు నన్ను చాలా బాగా చూసు కున్నారు. అక్కడ నాట్యంతోపాటు చక్కటి డిసిప్లిన్ కూడా అలవడింది. నేలమీద పడుకోవడం, బావిలో నీరు తోడటం అలవాటయ్యాయి. తాత గాంధేయవాది. మమ్మల్ని అధికారిక వాహనాల్లో తిరగనివ్వలేదు. మా ప్రయాణం సైకిల్ రిక్షా, సిటీ బస్సులోనే. అమ్మమ్మ, తాత, గురువుగారు... ఈ ముగ్గురి స్ఫూర్తితో నన్ను నేను తీర్చిదిద్దుకున్నాను. నా శిష్యులకూ అదే నేర్పాను. నాట్యం నేర్చుకోవడానికి ఫీజు కట్టలేని అమ్మాయిలకు ఫ్రీగా నేర్పిస్తున్నాను. దేశం నలుమూలలా ప్రదర్శనలిచ్చాను, అలాగే విదేశాల్లోనూ. నా శిష్యులు కూడా వివిధ రాష్ట్రాల్లో, విదేశాల్లో పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు, డాన్స్ స్కూళ్లు నడుపుతూ కళాకారులను తీర్చి దిద్దుతున్నాను. కళ ఎంతగొప్పదంటే కళాకారులు గురువును మర్చిపోరు. గురుపూర్ణిమ రోజు వచ్చిన మెసేజ్‌లకు రిప్లయ్ ఇవ్వడానికి సమయం సరిపోలేదు. ప్రదర్శన ఉన్న రోజుల్లో బంధువులు, స్నేహితుల ఇళ్లలో వేడుకలకు వెళ్లలేకపోయేదాన్ని. నాట్యం కారణంగా దూరమైన సంతోషాలకంటే నాట్యం కారణంగా అందిన సంతోషాలే ఎక్కువ’’ అన్నారామె. నటరాజు కొలువైన ఆలయం జూబ్లీ హిల్స్‌లో ఉన్న ‘దీపాంజలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ కూచిపూడి’ లో అడుగుపెట్టగానే దీపికారెడ్డి యాభై ఏళ్ల నాట్యప్రపంచం కళ్ల ముందు ఆవిష్కారమైనట్లు ఉంటుంది. ఆమె గురువు వెంపటి చినసత్యం ఫొటో, 1976లో రంగప్రవేశం చేసినప్పటి ఫొటోతో మొదలు జ్ఞానపీఠ సినారె, ఇద్దరు రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతి, మాజీ ప్రధాని, ఐదుగురు గవర్నర్లు, ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, స్పీకర్లు, రాష్ట్రమంత్రుల చేతుల మీదుగా అందుకున్న పురస్కారాల చిత్రాలు కొలువుదీరి ఉన్నాయి. నాట్యం చేస్తున్న పరమశివుడి విగ్రహం నిత్యపూజలందుకుంటోంది. ఆమె శిష్యులు నేడు రవీంద్రభారతిలో ఇవ్వా ల్సిన ప్రదర్శన కోసం రిహార్సల్స్ చేస్తున్నారు. అమ్మానాన్నల సంతోషం! అత్యంత సంతోషకరమైన క్షణాలలో మొదటగా చెప్పాల్సింది సంగీత నాటక అకాడమీ అవార్డు అందుకోవడమే. రాష్ట్రపతి భవన్లో, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్నప్పుడు మా అమ్మానాన్న కళ్లలో సంతోషం చూశాను. అమ్మానాన్నలు అంతగా సంతోషపడిన ఆ సందర్భమే నాకు మరపురాని క్షణం. ఇక ఎప్పుడూ సంతోషపడే విషయం ఏమిటంటే భర్త, పిల్లలు నాకు ప్రోత్సాహమిస్తూ సపోర్టుగా ఉండడం. తల్లిదండ్రులకు నేను చెప్పేదొక్కటే. పిల్లలకు సంగీతం, నాట్యం... ఏదో ఒక కళను సాధన చేయించండి. అది జ్ఞాపకశక్తిని, క్రమశిక్షణను, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. సాధనతో ఏకాగ్రత అలవడుతుంది. ఏ రంగంలో అయినా చక్కగా రాణించగలుగుతారు. నా స్టూడెంట్స్ అందరూ ర్యాంక్ హోల్డర్సే. అలాగే కళ కోసం చదువుని మాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. – దీపికారెడ్డి, చైర్పర్సన్, సంగీత నాటక అకాడమీ, తెలంగాణ – వాకా మంజులారెడ్డి ఫొటోలు : గడిగె బాలస్వామి -
ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన
మాదాపూర్: కూచిపూడి నృత్యాంశాలతో కళాకారిణి ప్రణయ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. మాదాపూర్‌లోని శిల్పకళావేధికలో అదివారం కూచిపూడి నృత్యరూపకం ప్రదర్శనను నిర్వహించారు. కళాకారిణి ప్రణయ గూడిపాటి చేసిన నృత్యాలు సందర్శకులను అలరించాయి. అన్నమాచార్య కీర్తనలు, దశావతారాలు, తరంగం, థిల్లాన తదితర అంశాలను ప్రదర్శించి ఆకట్టుకుంది. కూచిపూడి నృత్యగురువు పొనూర్ క్రాంతి కిరణ్ సమక్షంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. నటువాంగం క్రాంతికిరణ్, వోకల్ మంతశ్రీనివాస్, మృదంగం నాగేశ్వరరావు, వయోలిన్ అనిల్‌కుమార్, ప్లూట్ ఉమావేంకటేశ్వర్లు , శ్రీధరాచార్యులు సంగీత సహకారాన్ని అందించారు. ప్రదర్శనకు పొట్టి శ్రీరాములు తెలుగుయూనివర్సిటి రిటైర్డ్ ప్రొఫెసర్, ఉత్తమ ఆచార్య అవార్డు గ్రహీత భాగవతుల సేతురామ్, కేంద్ర సంగీత నాటక అకాడమి అవార్డు గ్రహీత కళాక్రిష్ణ తదితరులు హాజరై అభినందించారు. -
ఆటాలో కూచిపూడికి పట్టం
తెలుగు వారి సాంప్రదాయ భారతీయ నాట్యం కూచిపూడికి ఆటా వేదికపై పట్టం కట్టించారు న్యూజెర్సీలోని సెంటర్ ఫర్ కూచిపూడి. ఇటీవల వాషింగ్టన్ డీసీ వేదికగా జరిగిన అమెరికన్ తెలుగు అసొసియేషన్ ప్రపంచ మహాసభల్లో సెంటర్ ఫర్ కూచిపూడి కళాకారిణులు అద్భుత ప్రదర్శనతో అలరించారు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగి కూచిపూడి నృత్యం అభ్యసించి.. అమెరికాలో సెంటర్ ఫర్ కూచిపూడి ఏర్పాటు చేశారు ఇందిరా శ్రీరాం రెడ్డి దీక్షిత్. న్యూజెర్సీ కేంద్రంగా గత 20 ఏళ్లుగా ఎంతో మందికి కూచిపూడిని నేర్పిస్తున్నారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలతో పాటు పలు చోట్ల కూచిపూడి ప్రదర్శనలు ఏర్పాటు చేసి దాని గొప్పదనాన్ని చాటి చెప్పుతున్నారు ఇందిరా శ్రీరాం దీక్షిత్. అమెరికన్ తెలుగు అసొసియేషన్ సభల్లో ఇందిరా టీంలోని సభ్యులు సాంప్రదాయ కూచిపూడితో పాటు కోలాట నృత్యాలు చేసి అలరించారు. -
సమ్మోహనం... లహరి కూచిపూడి అరంగేట్రం
వాషింగ్టన్: తెలుగు నేలపై ప్రాణం పోసుకున్న కూచిపూడి నాట్యం ఖండాంతరాలు దాటి తన ఉనికిని చాటుకుంటూనే ఉంది. అమెరికాలో స్థిరపడిన భారతీయ కుటుంబాలు తమ పిల్లలకు శాస్త్రీయ నృత్యాలను నేర్పిస్తూ సంస్కృతిని పరిరక్షిస్తున్నారు. జార్జియా రాష్ట్రం అట్లాంటాలో 17 ఏళ్ల లహరి పిసికె ప్రదర్శించిన కూచిపూడి ఆరంగేట్రం స్థానిక అమెరికన్లతో పాటు అహూతులైన తెలుగు వారిని విశేషంగా ఆకట్టుకుంది. అట్లాంటాలో పలు సాఫ్ట్ వేర్ సంస్థలు నిర్వహిస్తున్న వేణు కుమార్ రెడ్డి పిసికె, వాసవి దంపతుల కుమార్తె లహరి 8వ ఏట నుంచే అభ్యాసం ప్రారంభించి ఆదివారం నాడు తొలి అరంగేట్రం ప్రదర్శనతో అందరినీ అలరించింది. కూచిపూడిలోని అత్యంత కఠినమైన 100 రకాలు పాద ముద్రలు, శిల్ప సదృశ్య దేహ భంగిమలు, హస్త ముద్రలు, కళ్ల కదలికలతో ముఖంలో అనేక భావాలను పలికించి ప్రశంసలు పొందింది. విఘ్నేశ్వర, నటరాజ పూజలతో మొదలైన నాట్య ప్రదర్శన నాలుగు గంటల పాటు నిర్విరామంగా సాగింది. చదవండి👉🏻అదే భారత్ గొప్పతనం.. ‘సాక్షి’తో సద్గురు తల్లిదండ్రులు వేణు కుమార్ రెడ్డి పిసికె, వాసవిలతో.. లహరి వేణు స్వగ్రామం నల్లొండ జిల్లాలోని అల్వాల గ్రామం. 25 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) అనుబంధ సంస్థ అయిన అమెరికా క్రికెట్ బోర్డు వ్యవస్థాపక సభ్యుడిగా ఆయన కొనసాగుతున్నారు. చదవండి👉🏻మొసలిని పెళ్లాడిన మేయర్.. దాన్ని ముద్దుపెట్టుకుంటూ ఫోటోకు పోజులు -
సీతూ పాప చేసిన కూచిపూడి డ్యాన్స్ చూశారా? ఎంత బావుందో..
సూపర్ స్టార్ మహేశ్ బాబు గారాల పట్టి సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న వయసులోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సితార సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇటీవలె కళావతి పాటతో మెస్మరైజ్ చేసిన సితార..రీసెంట్గా పెన్నీ సాంగ్‌లో తళుక్కున మెరిసింది. ఇప్పటివరకు వెస్ట్రన్ డ్యాన్స్ స్టెప్పులతో ఆకట్టుకున్న సీతూ పాప తొలిసారిగా కూచిపూడి డ్యాన్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను మహేశ్ బాబు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. 'సితార మొదటి కూచిపూడి డ్యాన్స్ ఇది. ఈ శుభప్రదమైన శ్రీరామనవమి రోజున ఈ వీడియోను మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ శ్లోకం రాముడి గొప్పదనాన్ని తెలియజేస్తుంది. నా సీతూ పాప అంకితభావం, తన టాలెంట్ చూస్తుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నువ్వు నన్ను మరింత గర్వపడేలా చేస్తున్నావు. సితారకు కూచిపడి నేర్పించిన గురువులకు ధన్యవాదాలు. అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు' అంటూ మహేశ్ పేర్కొన్నారు. ఇక సితూ పాప చేసిన కూచిపూడి డ్యాన్స్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) -
శోభా నాయుడు కన్నుమూత
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ కూచిపూడి నాట్యకళాకారిణి శోభా నాయుడు కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించారు. 1956లో విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో జన్మించిన శోభా నాయుడు 12 ఏళ్ల వయసులోనే కూచిపూడిలో అరంగేట్రం చేశారు. వెంపటి చినసత్యం వద్ద శిష్యురాలిగా చేరిన ఆమె వెంపటి నృత్య రూపాలలో అన్ని పాత్రలను పోషించారు. సత్యభామ, పద్మావతి, చండాలిక పాత్రల్లో రాణించిన శోభా నాయుడు 2001లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం శోభా నాయుడు మృతి పట్ల రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. శోభా నాయుడు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
చికాగో తెలుగు సంఘాల సమర్పణలో ‘అర్ధనారీశ్వరం’
చికాగో : అమెరికా చికాగోలోని తెలుగు సంఘాలు సంయుక్తంగా సెప్టెంబర్ 7వ తేదీన నేపర్విల్లోని నార్త్ సెంట్రల్ కాలేజ్ ఫైఫర్ హాలులో సమర్పించిన కూచిపూడి సంగీత నృత్యరూపకం ‘అర్ధనారీశ్వరం’ తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరించింది. పద్మభూషణ్ వెంపటి చినసత్యం కూచిపూడి ఆర్ట్ అకాడమికి చెందిన 21 మంది కళాకారులు ఈ నృత్యరూపకాన్ని ప్రదర్శించారు. అనేక తెలుగు సంఘాలు సమైక్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రేక్షకులు తరలివచ్చి విజయవంతం చేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సంఘాల్లో అమెరికన్ తెలుగు అసోషియేషన్, శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ నార్త్ అమెరికా, ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్, చికాగో తెలుగు అసోషియేషన్, చికాగో ఆంధ్ర అసోషియేషన్ ఉన్నాయి. చికాగోలోని 8 డ్యాన్స్ స్కూళ్ల గురువులు కూడా ఈ కార్యక్రమానికి తమ వంతు సహకారం అందించారు. సహకారం అందించిన వారిలో ఆనంద డ్యాన్స్ థియేటర్ గురువు జానకి ఆనందవల్లి నాయర్, ఆచార్య పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అకాడమి గురు ఆశా అడిగ ఆచార్య, ఆనంద డ్యాన్స్ గురువు సంగీత రంగాల, కూచిపూడి నాట్య విహార గురువు శోభ తమ్మన, నృత్య తరంగ డాన్స్ అకాడమి గురువు అపర్ణ ప్రశాంత్, ప్రేరణ అకాడమి ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ గురువు అరుణ చంద్ర, సంస్కృతీ ఫౌండేషన్ గురువు శోభ నటరాజన్, డా వినీల చక్కులపల్లి కాకర్లలు ఉన్నారు. కార్యక్రమం ప్రారంభ సమయంలో ‘అర్ధనారీశ్వరం’ ప్రదర్శన దృశ్యాలను నిర్వహకులు ప్రేక్షకులకు వివరించారు. రెండు గంటల పాటు సాగిన ఈ సంగీత నృత్యరూపకంలో ఆరణ్యంలో గంగ కోసమై భగీరథుని తపస్సుతో ప్రారంభమై, బ్రహ్మాదిదేవతల ప్రవేశము, గంగ ప్రవేశము, కైలాసంలో ప్రమధగణాలతో శివుని తాండవం, పరమేశ్వరుడు భగీరథ ప్రార్థనను మన్నించడం, ఉత్తుంగ తరంగ గంగాప్రవాహినియైన గంగావతరణం, గౌరి అసూయ శివుని అనునయం, గౌరి కైలాసం నుంచి నిష్ర్కమించడం, గౌతమమహర్షి ఆదేశంతో గౌరి కేదారేశ్వర పూజ చేయడం, శివుడు ప్రత్యక్షంగా గౌరీశంకరులు ఏకమవ్వడం, అర్ధనారీశ్వరుని లాస్య తాండవ నృత్యం, ప్రమధాది భక్త గణముల నృత్యముతో రసవత్తరంగా కథ ముగుస్తుంది. నృత్య ప్రదర్శనలోని సన్నివేశాలను ప్రతిబింబించేలా స్టేజీ అలంకరణ ప్రేక్షకులను కట్టిపడేసింది. కూచిపూడి నాట్యకళాకారుల, గాయనీగాయకుల, వాద్యబృందం అద్భుత ప్రదర్శన ప్రేక్షకులను అకట్టుకుంది. 19 ఏళ్ల తర్వాత చికాగో విచ్చేసిన వెంపటి బృందం వారి నృత్య ప్రదర్శనను ఘనంగా ఏర్పాటు చేయడంలో కార్యనిర్వహక ముఖ్య సభ్యులు రామరాజ బి యలవర్తి, జగదీశ్ కానూరి, సుజాత అప్పలనేని, పద్మారావు అప్పలనేని విశేష కృషి చేశారు. -
శశిరేఖాపరిణయం
-
కళాత్మక దంపతులు
ఆ దంపతులు రెండు దశాబ్దాలుగా కూచిపూడి నృత్యకళకు జీవం పోస్తున్నారు. శ్రీ గీతిక నాట్య అకాడమీని స్థాపించి వందలాది మందికి తర్ఫీదునిస్తున్నారు. నాట్యమే ఆశగా, శ్వాసగా, ధ్యాసగా చేసుకుని ముందుకెళ్తున్నారు ఎర్రగడ్డ డివిజన్ కల్యాణ్‌నగర్ వెంచర్–3లో నివాసముంటున్న అనంత కృష్ణ, లక్ష్మీకృష్ణ దంపతులు. నగరంలోని రవీంద్రభారతిలో ఇటీవల కూచిపూడి అకాడమీ 20వ వార్షిక వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఆ విశేషాలేమిటో ఒకసారి చూద్దాం. – శ్రీనగర్‌కాలనీ ఏలూరుకు చెందిన లక్ష్మీకృష్ణ తన మూడో ఏట నుంచే కూచిపూడి నృత్యాన్ని నేర్చుకున్నారు. నాట్యగురువులు కేవీ సత్యనారాయణ, పార్వతీ రామచంద్రన్, డాక్టర్ కె. నర్సింహారావుల వద్ద నాట్యాన్ని అభ్యసించారు. అనంతరం స్టేజీ ప్రదర్శనలతో ప్రతిభ కనబరిచేవారు. ప్రముఖ నాట్యమణులు, గురువులు మంజుభార్గవి, శోభానాయుడు, జయలలిత లాంటి వారితో నాట్య ప్రదర్శనలు చేశారు. దూరదర్శన్, సీనియర్ ఎన్టీఆర్ విశ్వామిత్రలోనూ ఆమె నాట్య ప్రదర్శన చేశారు. అనంతరం స్టేజీ ప్రదర్శనలు, మరోపక్క గురువుగా తన నాట్య ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. ఇద్దరూ నాట్యగురువులే... క్లాసికల్, వెస్ట్రన్ డ్యాన్సర్ అయిన అనంతకృష్ణను లక్ష్మీకృష్ణ ప్రేమవివాహం చేసుకున్నారు. అనంతరం ఎన్ని కష్టాలొచ్చినా, అడ్డంకులు ఎదురైనా దంపతులిద్దరూ విద్యార్థులకు కూచిపూడి నాట్యంలో శిక్షణ ఇస్తున్నారు. పండగల సందర్భాల్లో కూచిపూడి నృత్యాలు, భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే ప్రదర్శనలతో తెలుగు వెలుగులను పంచుతున్నారు. పలు సేవా కార్యక్రమాలు సైతం అకాడమీ ద్వారా నిర్వహిస్తున్నారు. వేసవిలో సమ్మర్ క్యాంపులతో కూచిపూడి నృత్యంలో చిన్నారులకు శిక్షణనిస్తున్నారు. సేవా దృక్పథంతో కళా సేవలో ఉండటమే తమ ధ్యేయమని నాట్యగురువు అనంతకృష్ణ వెల్లడించారు. లక్ష్మీకృష్ణ ఇప్పటివరకు నాట్య సరస్వతి, నాట్య విద్యాధరి, నాట్య మయూరీ పురస్కారాలు అందుకున్నారు. కూచిపూడి నృత్యకళపై మక్కువతోనే.. విద్యార్థులకు కళల పట్ల మక్కువ పెంచుతూ భారతీయ కళలను నేర్పించాలన్నదే మా లక్ష్యం. భవిష్యత్తులో విదేశాలకు సైతం వెళ్లి అక్కడి ప్రవాస భారతీయులకు కళలను నేర్పించాలనుకుంటున్నాం. కూచిపూడి నృత్యకళ పట్ల మమకారంతో శ్రీ గీతిక కూచిపూడి అకాడమీని స్థాపించి వందలాది మందికి నృత్యంలో తర్ఫీదునిస్తున్నాం. – అనంతకృష్ణ, లక్ష్మీకృష్ణ దంపతులు -
పిట్ట కొంచెం... డ్యాన్స్ ఘనం
సాక్షి, సీతమ్మధార(విశాఖపట్నం) : పిట్ట కొంచెం..డ్యాన్స్ ఘనం అంటే ఆశినిచంద్రెడ్డి.మూడేళ్ల వయసులోనే కూచిపూడి నృత్యంలో తనకుంటూ ప్రత్యేకత చాటుకుంటోంది. ఇప్పటికే అనేక ప్రదర్శనలిస్తూ మెప్పిస్తోంది. రెండేళ్ల వయసులోనే టీవీలో వచ్చే డ్యాన్స్ షోలు ఆసక్తిగా చూసేది. రానురానూ డ్యాన్స్ ప్రొగ్రామ్స్ పెట్టమని గొడవ చేసేది. నాట్యంలో ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు శ్వేతరెడ్డి, చందు కూచిపూడి నేర్పించాలని నిర్ణయించుకున్నారు. నాట్య గురువు బేత సత్యనారాయణ సమక్షంలో కూచిపూడి శిక్షణ పొందుతోంది. ఇప్పటికే నగరంలో చాలా స్టేజ్ షోలిచ్చి ఆకట్టుకుంది. ఆమె స్టేజ్‌పై కాళ్లకు గజ్జెలు కట్టుకుని డ్యాన్స్ చేస్తూంటే ఆహూతులంతా కళ్లార్పకుండా చూస్తారు. రూపం..హావభావాలు... పాటకు తగ్గట్టు, లయ తప్పకుండా నాట్యం చేస్తుండడం ఆ చిన్నారి ప్రత్యేకత. ఇప్పటికే సామర్లకోట, విజయవాడ, అన్నవరంలోని దేవస్థానంలో, అలాగే భీమేశ్వరస్వామి ఆలయం కూచుపూడి నాట్య ప్రదర్శన చేసి మెప్పిచ్చింది. ఎన్నో అవార్డులు, ప్రశంసలు అందుకుంది. భవిష్యత్తులో ఆశిని ఉత్తమ నాట్యకారిణిగా గుర్తింపు పొందాలని ఆశిస్తున్నట్టు తల్లిదండ్రులు పేర్కొన్నారు. -
ప్రపంచానికి భారతం కావాలి
అమెరికాలోని గన్ కల్చర్ గురించి విన్నప్పుడు ‘ఇదేంటి.. అక్కడి పిల్లల్ని అమ్మానాన్నలు పట్టించుకోరా!’ అనిపిస్తుంది. ఎక్కడో అమెరికాలో జరిగిన ఘటనలకు ఇండియాలో ఉన్న మనకే ఇలా అనిపిస్తే.. ఇండియా నుంచి అమెరికాకు వెళ్లిన అరుణిమకు ఎలా ఉండాలి? అసలు కుటుంబ వ్యవస్థే పటిష్టంగా లేని వాతావరణంలో పిల్లలకు విలువలు ఎలా అలవడతాయి? ‘అందుకే మా పిల్లల్ని ఇండియాకు తీసుకొచ్చి మరీ అవన్నీ నేర్పించాను’ అన్నారు అరుణిమ. ప్రపంచానికి భారతీయత అవసరం ఎంతైనా ఉందని కూడా అంటున్నారామె. ఏప్రిల్ 27వ తేదీ. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో కూచిపూడి ప్రదర్శన జరుగుతోంది. అది అరుణిమ కూతురు ఇషిక అరంగేట్రం. గణేశ పంచరత్నం, రుక్మిణీ ప్రవేశం, మహిషాసుర మర్దని, బాలగోపాల తరంగం, పరులన్నమాట, శివాష్టకం ప్రదర్శించింది ఇషిక. గణేశ పంచరత్నం రూపకంలో ఇషికతోపాటు ఇషిక అమ్మ కూడా నాట్యం చేశారు. ఏ తల్లికైనా తనను... తన పిల్లల పేరు చెప్పి, వాళ్లకు తల్లిగా గుర్తిస్తే పట్టలేనంత సంతోషం కలుగుతుంది. తన ఐడెంటిటీ తన పిల్లలే అయినప్పుడు తల్లి పొందే ఆనందం అది. అలాంటి సంతోషాన్నే ఆస్వాదిస్తున్నారు అరుణిమ ఇప్పుడు. ఇషిక పుట్టింది అమెరికాలో. ఐదేళ్ల వయసులో తల్లి, తమ్ముడితోపాటు ఇండియాకి వచ్చేసింది. ఆ రావడానికి దారి తీసిన పరిస్థితులు ఎవరికైనా మనసును కదిలిస్తాయి. నిజానికి అవేవీ ఇషిక, అరుణిమల కుటుంబ సమస్యలు కావు. అమెరికా కుటుంబాల సమస్యలు. అమెరికాలో వేళ్లూనుకోని కుటుంబ వ్యవస్థ కారణంగా ఎదురవుతున్న సామాజిక సమస్యలు. గాల్లో దీపంలా మిణుకు మిణుకు మంటున్న అమెరికా పిల్లల బాల్యమే ఈ తల్లీబిడ్డలను ఇండియాకు తెచ్చింది. ఆ వివరాలను అరుణిమ సాక్షితో పంచుకున్నారు.‘‘నాకు 2000లో పెళ్లయింది. నా భర్త సత్యనారాయణ రాజు అప్పటికే యుఎస్‌లో ఉద్యోగం చేస్తున్నారు. పెళ్లయిన వెంటనే నేనూ అమెరికా వెళ్లాను. అక్కడ మెంటల్హెల్త్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేశాను. మానసిక స్థితి సరిగా లేని పిల్లల కేస్‌స్టడీలు చదువుతుంటే గుండె కలచివేసినట్లయ్యేది. అభివృద్ధి సాధించిన దేశంలో పిల్లలు ఇంతటి మానసిక అనారోగ్యానికి గురికావడం ఏమిటని కూడా అనిపించేది. అధ్యయనం చేసే కొద్దీ తెలిసిందేమిటంటే.. అక్కడ కుటుంబ వ్యవస్థ సరిగ్గా లేకపోవడమే ప్రధాన కారణం అని. మెంటల్ హెల్త్‌లో పాతికేళ్లు అమెరికాలోనే రీసెర్చ్ చేసిన ఒక మహిళా సీనియర్‌తో ఈ విషయాలను షేర్ చేసుకున్నప్పుడు ఆమె.. ‘ఈ పిల్లల్లో ఎక్కువ మంది సింగిల్ పేరెంట్ పెంపకంలో ఉన్న వాళ్లే. ఈ పిల్లల ఇంటి వాతావరణాన్ని మార్చగలిగితే వీళ్లను ఆరోగ్యవంతులను చేయడానికి మెంటల్ హెల్త్ ట్రీట్మెంట్ అవసరం ఉండదు కూడా’ అన్నారు. ఫ్యామిలీ బాండింగ్ ఉన్న కుటుంబాల్లో పిల్లల్లో ఇలాంటి ధోరణి తలెత్తదు. ఒకవేళ వేరే పిల్లల్ని చూసి అనుకరించినా సరే.. అమ్మానాన్నలు బాధ్యతగా వాళ్లకు వాల్యూస్ నేర్పించినట్లయితే అన్నీ సమసి పోతాయని కూడా చెప్పారామె. పిల్లల్ని అమెరికాలో పెంచుతూ ఇండియన్ ఫ్యామిలీ వాల్యూస్‌ని నేర్పించడం కంటే, ఇండియాలో పెంచడమే మంచిదనిపించి ఇండియాకి వచ్చేశాం. ఈ పదేళ్లలో మా రాజు గారికి ఇండియాకి– అమెరికాకి షటిల్ చేసినట్లయింది’’ అన్నారు అరుణిమ నవ్వుతూ. ప్రపంచానికి భారతం కావాలి పిల్లల పెంపకంలో ఒక తల్లి తీసుకోవాల్సిన జాగ్రత్తల కంటే.. అరుణిమ చాలా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అనిపించవచ్చు. కానీ ఆమె విశ్లేషణ మాత్రం సమాధానపరిచేటట్లే ఉంది. ‘‘పిల్లలను ఇండియాలో పెంచడం అనే నిర్ణయానికి గర్వపడుతున్నాను కూడా. ఎందుకంటే... అమెరికా.. పైకి ఓపెన్ సొసైటీగా కనిపిస్తుంది. కానీ అందులో మనం చాలా క్లోజ్డ్గా ఒక చట్రంలో జీవించేస్తాం. ఇండియాలో అనేక చట్రాల మధ్య జీవిస్తున్నట్లు ఉంటుంది. కానీ నిజమైన సమాజాన్ని చూడగలిగింది ఇండియాలోనే. జీవితపు గ్రౌండ్ రియాలిటీ తెలిసేది మనదేశంలో పెరిగినప్పుడే. ఇక కల్చర్ విషయానికి వస్తే.. నా వంతుగా తెలుగు భాషను, భారతీయ కుటుంబ విలువలను మరో తరం వరకు పరిరక్షించగలిగాను. అలాగే పిల్లలకు భారతీయ సంస్కృతిని వివరించగలిగాను. ‘బొట్టు ఎందుకు పెట్టుకోవాలి, గాజులు ఎందుకు వేసుకోవాలి’.. ఇలా ప్రతి ఆచారం వెనుక ఉన్న శాస్త్రీయతను చెప్తూ పెంచాను. అలాగని రోజూ పెద్ద బొట్టు పెట్టుకోమనే కండిషన్ ఏమీ ఉండదు. సంప్రదాయం కోసం పిల్లల సౌకర్యాన్ని హరించడమూ ఉండదు’’ అంటూ వెకేషన్లో ట్రాక్ సూట్లో సేదదీరుతున్న ఫ్యామిలీ ఫొటోలను చూపించారు. అంతరయానం... కలివిడితనం ఇండియా నుంచి వెళ్లి విదేశాల్లో ఉన్న వాళ్లలో ప్రతి ఒక్కరికీ కనీసం ఏదో ఒక్కటైనా సరే ఇండియన్ ఆర్ట్ వచ్చి ఉండాలని అరుణిమ అభిప్రాయం. మన కల్చరే గొప్ప అని ఎదుటి వాళ్లను తక్కువ చేయడానికి కాదు, ఇది మా కల్చర్ అని చెప్పుకోగలగడానికి మాత్రమేనంటారామె. ‘‘ఇషికకి కూచిపూడి నాట్యంలో శిక్షణ ఇప్పించాం. అయితే ఇంత బాగా పెర్ఫార్మ్ చేస్తుందని ఊహించలేదు. డాన్స్ మనిషికి తనలోకి తాను ప్రయాణించగలిగిన గొప్ప లక్షణాన్ని నేర్పిస్తుంది. ఆటలతో తోటి వాళ్లతో కలివిడిగా మెలగడం అలవడుతుంది. నేను చేసిన ఆ ప్రయత్నం ఇషికలో ఎంతటి పరిణితిని తెచ్చిందంటే.. తాను బాస్కెట్ బాల్ ప్లేయర్‌గా స్కూల్ టీమ్‌కు కెప్టెన్‌గా చేసింది. అప్పుడు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డును వరుసగా రెండేళ్లు అందుకుంది. అప్పుడు వచ్చిన విమర్శలను ఇషిక ఎంత సమర్థంగా చక్కదిద్దుకున్నదంటే.. ప్రిన్సిపల్‌ను కలిసి ‘మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డును పక్షపాత ధోరణిలో సెలెక్ట్ చేశారనే ఆరోపణ వచ్చిన తర్వాత నేను కెప్టెన్‌గా కొనసాగడం సరి కాదు. మరెవరినైనా కెప్టెన్‌గా నియమిస్తే నేను టీమ్‌లో ఒక ప్లేయర్‌గా నా లెవెల్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ చూపిస్తాను’ అని చెప్పింది. ప్రిన్సిపల్ ఎంత తరచి అడిగినా... తనను ట్రోల్ చేసిన వాళ్ల పేర్లు మాత్రం చెప్పనేలేదు. ప్రిన్సిపల్ నాతో ఆ సంగతి చెప్పినప్పుడు మా అమ్మాయిలో నాకు పరిపూర్ణమైన కొత్త ఇషిక కనిపించింది. మా నాన్నగారు ఎప్పుడూ నాతో ‘నీకు వరపుత్రిక పుట్టింది’ అంటుంటారు. ఆ మాట నిజమే అనిపించింది కూడా’’ అన్నారు అరుణిమ. – వాకా మంజులారెడ్డి ఒకరి త్యాగం అవసరమే ఆధునిక జీవనశైలిలో ప్రతి ఒక్కరూ కెరీర్ ఓరియెంటెడ్‌గా ఉండడం అవసరమే. అయితే పిల్లల కోసం తల్లిదండ్రుల్లో ఒకరు కొంత త్యాగం చేయకతప్పదనే చెప్పాలి. నేను వైజాగ్ సెయింట్ జోసెఫ్‌లో డిగ్రీ చేసి, కోయంబత్తూరులో హ్యూమన్ డెవలప్మెంట్లో పీజీ చేసి అదే కాలేజ్‌లో ఏడాది పాటు ఉద్యోగం చేశాను. పెళ్లితో నా కెరీర్ లైన్ మారింది. యుఎస్‌లో బిహేవియర్ థెరపీ చేసి మెంటల్ హెల్త్‌కి మారాను. పిల్లల కోసం ఇండియాకి వచ్చిన తర్వాత స్కూల్లో చేరి పాఠాలు చెప్పాను. మా అమ్మాయికి టెన్త్ అయిపోయింది. తనకు బయోటెక్నాలజీ ఇష్టం. అందుకే మళ్లీ అమెరికా ప్రయాణమవుతున్నాం. అక్కడికి వెళ్లిన తర్వాత నా కెరీర్ ప్లాన్స్ అన్నీ మళ్లీ కొత్తగా మొదలు పెట్టాలి. తల్లిగా విజయవంతమయ్యానా లేదా అని చెప్పడానికి ఇంకా కొంత టైమ్ కావాలి. అయితే మా అమ్మాయితో కలిసి కూచిపూడి నాట్యంలో వేదికను పంచుకోవడం, మా పిల్లలిద్దరూ స్టేట్ బాస్కెట్‌బాల్ ప్లేయర్స్ కావడం తల్లిగా నేను అత్యంత సంతోషాన్ని పొందిన క్షణాలు. తల్లి ఎంత మంది పిల్లలను కన్నా సరే... తొలిబిడ్డను కన్నప్పుడు పొందినంత సంతోషాన్ని ప్రతిసారీ ఆస్వాదిస్తుంది. పిల్లల పురోగతి కూడా అలాంటిదే. చిన్న అచీవ్మెంట్ అయినా సరే ఎవరెస్ట్‌ను అధిరోహించినంత మురిసి పోయేది తల్లి మాత్రమే. వాళ్ల కోసం చేసిన త్యాగం కష్టమనిపించదు. అవసరమైన పనే చేశాననే సంతృప్తి తల్లికి ఉంటుంది. – అరుణిమ, ఇషిక తల్లి అమ్మకు అడుగులు నేర్పాను అమ్మ డాన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు తన స్టెప్స్‌ని కరెక్ట్ చేసేదాన్ని. అమ్మను కరెక్ట్ చేసే చాన్స్ వచ్చిందని చాలా ఎంజాయ్ చేశాను. గత వారం తిరుమలకు వెళ్లాం. అక్కడ నాద నీరాజనం వేదిక మీద డాన్స్ చేస్తున్న గొప్ప గొప్ప కళాకారులను చూసినప్పుడు నేను కూడా ఎప్పటికైనా ఆ వేదిక మీద నాట్యం చేయాలనిపించింది. ఇప్పుడు అమెరికా వెళ్లిన తర్వాత కూడా ప్రాక్టీస్ ఆపను. -
అభినయం.. అద్వితీయం
-
కూచిపూడికి క్రాంతి ఒరవడి
నృత్యంలో సాధారణంగా ఆడపాత్రలను సైతం మగవారే వేయడం కనిపిస్తుంటుంది. అయితే క్రాంతి మగ పాత్రలే ఎక్కువగా పోషించి తనకంటూ ఒక ప్రత్యేకత సాధించారు. అయితే అదొక్కటే ఆమె ప్రత్యేకత కాదు! ►ఉన్నతోద్యోగాన్ని వదులుకుని కూచిపూడి సేవకు అంకితం ►పేదలకు సంప్రదాయ నృత్యాన్ని నేర్పించడమే లక్ష్యం ►‘రూపానురూపకం’ ద్వారా మరింత ప్రత్యేకంగా దేశవిదేశాల్లో ప్రదర్శనలు ►‘మోహినీ భస్మాసుర’ నాట్యానికి సాహిత్యం లేకుండా సంగీతంతో చేసిన సరికొత్త ప్రయోగానికి దేశవిదేశాల్లో స్టాండింగ్ ఒవేషన్ తెలుగు సంప్రదాయ కూచిపూడి నృత్యమే జీవితంగా క్రాంతి నారాయణ తుపాకుల ముందుకెళుతున్నారు. కూచిపూడినే శ్వాసగా భావిస్తున్న ఆమె సాధ్యమైనంత ఎక్కువమంది పేదలకు ఈ నృత్యాన్ని నేర్పించేందుకు తనవంతుగా కృషి చేస్తున్నారు. మన సంప్రదాయ కూచిపూడి నృత్యాన్ని అనేకమంది నాట్య ప్రవీణులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నత స్థాయిలో నిలబెట్టగా, ఆ ఒరవడిని మరింతగా కొనసాగించేందుకు క్రాంతి పాటుపడుతున్నారు. ఇందులో భాగంగా తన గురువు శోభానాయుడు మార్గదర్శకత్వంలో కొందరికే ప్రత్యేకమైన ‘రూపానురూపకం’ ద్వారా మగపాత్రలతో కూచిపూడి ప్రదర్శనలు ఇచ్చి దేశవిదేశాల్లో మంచి పేరు సంపాదించారు. కొన్నేళ్ల క్రితం వరకు ఆడపాత్రలను సైతం మగవారే వేసేవారు. అయితే క్రాంతి మాత్రం మగ పాత్రలే ఎక్కువగా పోషించి తనకంటూ ఒక ప్రత్యేకత సాధించారు. శివుడు, రాముడు, రావణుడు, విష్ణుమూర్తి, గౌతమబుద్ధ, అశోకుడు, నానవలి తదితర పాత్రలతో కూచిపూడి ప్రదర్శిస్తూ ప్రత్యేకత సాధించారు. అదేవిధంగా ‘మోహినీ భస్మాసుర’ నాట్యాంశాన్ని సరికొత్త ప్రయోగంతో ప్రదర్శించి దేశవిదేశాల్లో స్టాండింగ్ ఒవేషన్ పొందారు. సాంప్రదాయ నాట్యం చేసేందుకు సహజంగా సంగీతంతో పాటు సాహిత్యం ఉంటుంది. అయితే క్రాంతి నారాయణ ఈ నృత్య రూపకానికి సాహిత్యం (లిరిక్స్) లేకుండా కేవలం సంగీత వాయిద్యాలను మాత్రమే ఉపయోగించి సరికొత్త ప్రయోగంతో ప్రదర్శించి ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలవారికి అర్థమయ్యేలా చేశారు. భరతనాట్యమే ప్రధానంగా భావించే తమిళనాడు నుంచి అనేక ఇతర దేశాల్లోనూ ఈ కూచిపూడి ప్రదర్శనకు స్టాండింగ్ ఒవేషన్ సాధించారు క్రాంతి. సంగీతం అనేది యూనివర్సల్ లాంగ్వేజ్ కావడంతో దీని ద్వారా ప్రయోగం చేశారు. లాభాపేక్షతో కాకుండా ఎక్కువమంది పేదలకు సంప్రదాయ నృత్య కళ నేర్పించడమే లక్ష్యమని, ఇలా చేస్తే కళ ఎప్పటికీ నిలిచి ఉంటుందని క్రాంతి చెబుతున్నారు. అదేవిధంగా సంస్కృతి, సాంప్రదాయాల పట్ల ప్రేమ, అనురాగం పెరుగుతాయంటున్నారు.ఇప్పటివరకు దేశవిదేశాల్లో అనేక ప్రదర్శనలు చేసి తనకంటూ ప్రత్యేకత సంపాదించుకున్న క్రాంతికి అనేక అవార్డులు వచ్చాయి. మరోవైపు ఆమెకు అనేక పెద్ద స్థాయి పెళ్లి సంబంధాలు వచ్చాయి. ఇప్పటివరకు ఆమె సాధించినదాన్ని చూసి అభినందిస్తూనే పెళ్లి అయిన తరువాత కొనసాగించకూడదని నిబంధన పెట్టడంతో క్రాంతి అన్ని సంబంధాలను తిరస్కరించి కూచిపూడిని తన జీవిత సర్వస్వంగా భావించారు. ఈ కళను వదిలేస్తే అన్నివర్గాలకు కూచిపూడిని చేరువ చేయాలనే లక్ష్యాన్ని చేరుకోలేనని ఆమె చెబుతున్నారు. దేవుడు తనను కళారంగంవైపు పిలవడంతోనే ఇటు వచ్చానని అంటున్నారు. శోభానాయుడు సంశయించారు! భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెంకు చెందిన తుపాకుల క్రాంతి స్థానిక సెయింట్‌మేరీస్ పాఠశాలలో ప్రాథమిక విద్యనభ్యసించారు. నాలుగో తరగతి చదువుతున్నప్పుడు కొన్ని నెలలు కూచిపూడి నేర్చుకున్నారు. ఆ సమయంలో పలు ప్రదర్శనలు చేశారు. తండ్రి మాత్రం వేరే రంగంలో ఎదగాలని సూచించారు. ఈ క్రమంలో అప్పుడు ఆమె నృత్యం ఆపేశారు. అయితే నృత్యం నేర్చుకోవాలనే ఆకాంక్ష బలంగా ఉండడంతో ఉస్మానియా క్యాంపస్‌లో బీఈ మెకానికల్ తృతీయ సంవత్సరంలో శోభానాయుడు వద్దకు వెళ్లి కూచిపూడి నేర్పించమని అడిగారు. ఇంజనీరింగ్ వాళ్లు ఈ రంగాన్ని మధ్యలోనే వదిలేస్తారని శోభానాయుడు నాట్యం నేర్పించేందుకు సంశయించారు. అయితే ఈ రంగంలోనే కొనసాగుతానని మాటిచ్చిన క్రాంతి ఆమె వద్ద నేర్చుకుని ఈ రంగంలోకొచ్చారు. బీఈ తరువాత ఉస్మానియాలో ఎంబీఏ చేస్తూనే క్రాంతి అనేక ప్రదర్శనలు ఇచ్చారు. ఎంబీఏ తరువాత మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం సాధించిన క్రాంతి ఆ కంపెనీ ద్వారా రక్షణ విభాగంలో దేశంలో పలుచోట్ల పనిచేశారు. 2007 నుంచి 2009 వరకు రెండున్నరేళ్లపాటు ఉద్యోగం చేసి దాన్ని మానేశారు. అనంతరం కృష్ణా జిల్లా కూచిపూడిలో ఎంఏ (మాస్టర్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్) కోర్సు చేశారు. వేదాంతం రామలింగశాస్త్రి సారథ్యంలో ఆ కోర్సు పూర్తి చేసి ఈ రంగంలో కొనసాగుతున్నారు. దేశంలోని పలు రాష్ట్రాలతో పాటు, విదేశాల్లో క్రాంతి అనేక ప్రదర్శనలు ఇచ్చారు. 2013లో హైదరాబాద్‌లో క్రాంతి కూచిపూడి నాట్యాలయ స్థాపించి నృత్యంపై శిక్షణ ఇస్తున్నారు. అదేవిధంగా సొంతూరిపై మమకారంతో 2017 నుంచి కొత్తగూడెంలోనూ శని, ఆదివారాల్లో ఇన్స్టిట్యూట్ నడిపిస్తున్నారు. విశ్వభారతి, నాట్య అభినయ కౌముది, కళాంజరి, నటరాజ సంగీత తరంగ్ యువ పురస్కారం, అవుట్‌స్టాండింగ్ యంగ్ ఉమెన్ ఆఫ్ ఇయర్ తదితర అవార్డు, ఇంకా మరెన్నో అవార్డులు అందుకున్నారు. తూమాటి భద్రారెడ్డి, సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా -
‘పరాశక్తి అమ్మోరు డ్యాన్స్ డ్రామా’