సూపర్ స్టార్ మహేశ్ బాబు గారాల పట్టి సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న వయసులోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సితార సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇటీవలె కళావతి పాటతో మెస్మరైజ్ చేసిన సితార..రీసెంట్‌గా పెన్నీ సాంగ్‌లో తళుక్కున మెరిసింది. ఇప్పటివరకు వెస్ట్రన్ డ్యాన్స్ స్టెప్పులతో ఆకట్టుకున్న సీతూ పాప తొలిసారిగా కూచిపూడి డ్యాన్స్ చేసింది.
దీనికి సంబంధించిన వీడియోను మహేశ్ బాబు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. 'సితార మొదటి కూచిపూడి డ్యాన్స్ ఇది. ఈ శుభప్రదమైన శ్రీరామనవమి రోజున ఈ వీడియోను మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ శ్లోకం రాముడి గొప్పదనాన్ని తెలియజేస్తుంది.
నా సీతూ పాప అంకితభావం, తన టాలెంట్ చూస్తుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నువ్వు నన్ను మరింత గర్వపడేలా చేస్తున్నావు. సితారకు కూచిపడి నేర్పించిన గురువులకు ధన్యవాదాలు. అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు' అంటూ మహేశ్ పేర్కొన్నారు. ఇక సితూ పాప చేసిన కూచిపూడి డ్యాన్స్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment