సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ప్రస్తుతం 'గుంటూరు కారం' సినిమాతో బిజీగా ఉన్నాడు. మరోవైపు రాజమౌళి మూవీ కోసం ఇప్పటినుంచి ఫిజికల్‌గా సరికొత్త లుక్‌లో కనిపించేందుకు ప్రిపేర్ అవుతున్నాడు. మరోవైపు కూతురు సితార కూడా యాడ్స్ లో నటిస్తోంది. ఇలా అంతా హ్యాపీగా ఉన్న ఈ ఫ్యామిలీలో తాజాగా విషాదం నెలకొంది. ఈ విషయమై కన్నీళ్లు పెట్టుకున్న సితార.. ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఇంతకీ ఏం జరిగింది?
(ఇదీ చదవండి: విజయ్ దేవరకొండకు కాబోయే భార్యపై సామ్ కామెంట్స్ వైరల్)
విషాదం అంటే మనుషులు ఎవరికీ ఏం కాలేదు. దాదాపు ఏడేళ్ల నుంచి మహేశ్ ఇంట్లో ఫ్లూటో అనే కుక్కని పెంచుకుంటున్నారు. ఇప్పుడు అది చనిపోయింది. ఈ విషయాన్ని తట్టుకోలేకపోయిన సితార.. పప్పీతో బాండింగ్ ని గుర్తు చేసుకుని ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. దీనికి తల్లి నమ్రత కామెంట్ పెట్టింది. 'ఫ్లూటో ఎప్పటికీ మన గుండెల్లో ఉంటుంది' అని రాసుకొచ్చింది. అలానే తన ఖాతాలోనే ఫ్లూటో చనిపోవడంపై పోస్ట్ చేసింది. ఈ క్రమంలోనే మహేశ్ అభిమానులు, సితారని ఓదార్చేలా కామెంట్స్ పెడుతున్నారు.
(ఇదీ చదవండి: ఏపీలో పవన్ పొలిటికల్ భవిష్యత్‌పై మంచు విష్ణు కామెంట్!)
Comments
Please login to add a commentAdd a comment