![Namrata Shirodkar About Clashes With Mahesh Babu - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/17/mahesh%20namarta_650x400R.jpg.webp?itok=qCnGstwr)
టాలీవుడ్ క్యూట్ కపుల్స్‌లో మహేశ్‌బాబు-నమ్రత ఒకరు. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పిన నమ్రత భార్యగా, తల్లిగా బాధ్యతలు చేపడుతూనే, మరోవైపు మహేశ్‌కు సంబంధించిన వ్యాపారాలను చేసుకుంటూ బిజినెస్ విమెన్‌గానూ రాణిస్తుంది. అంతేకాకుండా భర్త మహేశ్‌కు సంబంధించిన కాస్ట్యూమ్స్ సహా పలు విషయాలను దగ్గరుండి చూసుకుంటుంది.
సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే నమ్రత తాజాగా ఓ ఇంటర్వ్యూలో నమ్రత తన పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన పలు విషయాలను షేర్ చేసుకున్నారు. ''మహేశ్-నేను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవడం నా జీవితంలోనే బెస్ట్ మూమెంట్. పెళ్లి తర్వాత నా ప్రపంచమే మారిపోయింది. మాతృత్వాన్ని పొందడం గొప్ప అనుభూతి.
ఇక భార్యభర్తలుగా మహేశ్‌కు, మీకు ఏ విషయంలో గొడవలు అవుతుంటాయి అన్న ప్రశ్నకు బదులిస్తూ.. మా ఇద్దరి మధ్య పిల్లల విషయంలోనే గొడవలు అవుతుంటాయి. వాళ్లు నన్ను అడిగితే నో చెప్తాను.. అందుకే పిల్లలు వాళ్లకు ఏం కావాలన్నా మహేశ్‌నే అడుగుతారు. ఆయన నో చెప్పరు. ఈ విషయంలో చిన్నచిన్న గొడవలు జరుగుతుంటాయి'' అంటూ చెప్పుకొచ్చింది నమ్రత.
Comments
Please login to add a commentAdd a comment