Sitara Ghattamaneni Main Target Entry In Miss Universe And Miss World Competitions - Sakshi
Sakshi News home page

సితారకు ఇంత ఫేమ్‌ రావడానికి కారణం ఎవరో తెలుసా?

Published Fri, Jul 7 2023 10:06 AM | Last Updated on Fri, Jul 7 2023 11:22 AM

Sitara Ghattamaneni Main Target Entry in Miss Universe - Sakshi

టాలీవుడ్​ సూపర్​ స్టార్​ మహేశ్​ బాబు గారాల పట్టి సితార. కాదు.. కాదు.. 'సితార ఘట్టమనేని' అని చెప్పుకునే స్థాయికి చేరుకుంది. మొదట ప్రిన్స్‌ మహేష్‌ బాబు ఫేమ్‌తో గుర్తింపు దక్కినా తర్వాత తన టాలెంట్‌తో సపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌నే క్రియేట్‌ చేసుకునే స్థాయికి చేరుకుంది. సితార శాస్త్రీయ నృత్యం నేర్చుకుంది. దీంతో సోషల్‌ మీడియాలో డ్యాన్స్​ వీడియోలతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. గతంలో సినీ సెలబ్రిటీలను కూడా ఇంటర్వ్యూ చేసింది. అంతే కాకుండా ఇటీవలే ఓ ప్రముఖ జ్యూయెలరీ సంస్థకు బ్రాండ్​ అంబాసిడర్​గా సైన్​ చేసి.. ఆ సంస్థ నుంచి ఒక హీరోయిన్‌ అందకునేంత రెమ్యునరేషన్‌ తీసుకుంది. అంటే సుమారు కోటి రూపాయలకు పైగానే అని చెప్పవచ్చు.

(ఇదీ చదవండి: Sitara Ad Remuneration: చిన్న యాడ్.. కళ్లుచెదిరే మొత్తం ఇచ్చారు!)

గతంలో తన గురించి మహేష్‌ ఇలా అన్నారు. 'సితార ఎప్పుడో సూపర్‌ స్టార్‌ అయిపోయింది. తను ఇంగ్లీష్‌,తెలుగు చాలా చక్కగ మాట్లాడుతుంది. ముఖ్యంగా తను మాట్లాడేటప్పుడు అమెరికన్‌ యాక్సెంట్‌ ఉంటుంది. కానీ అలా మాట్లాడాలని మేము ఎప్పుడూ చెప్పలేదు. తనకు సొంతంగా వచ్చింది.' అని చెప్పారు.

సితార ఇంత వరకు ఎలాంటి సినిమాలు తీయలేదు. యూట్యూబ్‌,ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రమే తను కనిపిస్తుంది. అక్కడ కూడా తనకు మిలియన్ల కొద్ది ఫ్యాన్స్‌ ఉన్నారు. అయితే సితార ఒక స్టార్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం వెనుక ఆమె తల్లి నమ్రతా కృషి ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. అమెకు డ్యాన్స్‌,యాక్టింగ్‌లో హావ భావాలు పలికించడంలో రాటుతేలేందకు శిక్షణ ఇప్పించింది. ఈ విధంగా చాలా విషయాల్లో సితార మీద చిన్నప్పటి నుంచే ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది నమ్రత. దీంతో ఆమె ఒక స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుంది.

(ఇదీ చదవండి: ప్రభాస్‌ 'ప్రాజెక్ట్‌-కె' నుంచి బిగ్‌ అనౌన్స్‌మెంట్‌..!)

తాజాగా సినీ ఇండస్ట్రీ నుంచే కాకుండా  మహేష్ బాబు అభిమానుల్లో సితార గురించి ఒక వార్త ప్రచారం జరుగుతుంది. సితారని 'మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్' పోటీలకు నమ్రత సిద్ధం చేస్తోంది అని... ఆపై సితారను  హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలో  పరిచయం చెయ్యాలని అనుకుంటున్నారట.. ఇప్పుడు ఈ వార్త బాగా వైరల్‌ అవుతుంది. అయితే సితారకి ఇంకా పదకొండేళ్లే.. మిస్ యూనివర్స్ పోటీలలో పాల్గొనాలంటే ఇంకా సుమారుగా ఆరేళ్లు ఉండాల్సిందే.

మరీ ఇప్పటి నుంచే ఎందుకంటారా?  అలాంటి పోటీలకు శిక్షణ చాలా ముఖ్యం. అక్కడ రానించాలంటే లాంగ్‌ టర్మ్‌ తర్ఫీదు తప్పదు. ఈ శిక్షణల వల్లే తను బాలీవుడ్‌ టాప్‌ హీరోల పిల్లలను కూడా దాటేసి తనకంటు మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఈ యాడ్‌ రిలీజ్‌ అయ్యాక ఆమె మరింత పాపులర్ అవడం ఖాయం. ఒక రకంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సితార ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు సాగడం ఖాయం అని మహేష్‌ ఫ్యాన్స్‌ అంటున్నారు.


(ఇదీ చదవండి: 'రంగబలి' సినిమా రివ్యూ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement