Miss Universe
-
పెళ్లి కాకుండానే ఇద్దరు పిల్లలకు ‘తల్లి’..మాజీ విశ్వ సుందరి (ఫోటోలు)
-
అందం అర్థం మారుతోంది..!
‘మిస్ యూనివర్స్’ పోటీలు ఎప్పుడూ ఆసక్తికరమే. అయితే తాజాగా మెక్సికోలో జరిగిన ‘మిస్ యూనివర్స్–2024’కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ పోటీ నేపథ్యంలో కేవలం విజేత గురించి మాత్రమే కాదు ఈ పోటీలోపాల్గొన్న ఎంతోమంది గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు. అందానికి సంబం«ధించిన సంప్రదాయ కొలమానాలను సవాలు చేసి వేదిక మీద నిలిచిన వారి మొదలు గృహహింస, లైంగిక హింస బాధితులుగా చీకట్లో మగ్గి ఆ చీకటి నుంచి బయటికి వచ్చి ప్రపంచ వేదికపై వెలిగిపోయిన వారు ఉన్నారు.నలభైలలో...40 ఏళ్ల వయసులో మిస్ యూనివర్స్ పోటీలోపాల్గొన్న మహిళగా బియాట్రిస్ నజోయా తన ప్రత్యేకతను చాటుకుంది. ఎన్నో అడ్డంకులను అధిగమించిన ‘మిస్ యూనివర్స్ మాల్టా’ నజోయా ఎంతోమందికి స్ఫూర్తిని ఇస్తోంది. నజోయా ముగ్గురు పిల్లలకు తల్లి. సింగిల్ మదర్.‘శారీరకంగా, మానసికంగా ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నాను. హీనమైన పరిస్థితులను చూశాను. మనకు తప్ప మన సంతోషానికి తెర వేసే శక్తి ఎవరికీ లేదని నిరూపించాలనుకున్నాను. ఆత్మగౌరవంతో ముందుకు వెళ్లాను. మనం బయటికి ఎలా కనిపించినా లోపల అందంగా ఉంటాం. ఆ అందాన్ని చూడగలగాలి’ అంటుంది నజోయా. ‘నిజానికి ఆమె ఎప్పటికీ విజేత. కంటికి కనిపించని కిరీటం ఆమె తలపై కనిపిస్తుంది’ అంటారు నజోయా అభిమానులు. ఎత్తు ఎంతైనా... అంతెత్తున!ష్యానే మెకింతోష్ అందాల పోటీలో పోటీపడిన వారిలో ఎత్తు తక్కువగా ఉన్న కంటెస్టెంట్‌గా చరిత్ర సృష్టించింది. ఆమె ఎత్తు 5 అడుగుల 1 అంగుళం. ‘మిస్ యూనివర్స్ జిబ్రాల్టర్’ ఫైనల్లో మెకింతోష్ ఇచ్చిన సమాధానం న్యాయ నిర్ణేతల హృదయాలను గెలుచుకుంది. ‘నేను చిన్నగా కనిపించవచ్చు... కానీ ఆత్మవిశ్వాసంతో అంతెత్తున కనిపిస్తాను’ ‘మిస్ యూనివర్స్ జిబ్రాల్టర్ 2024’ అందాల కిరీటాన్ని గెల్చుకున్న విజేతగా అందరి దృష్టిని ఆకర్షించింది ష్యానే మెకింతోష్. 34 ఏళ్ల తరువాత ‘మిస్ యూనివర్స్’ పోటీలో జిబ్రాల్టర్కుప్రాతినిధ్యం వహించిన తొలి మహిళగా రికార్డ్ సృష్టించింది. హిజాబ్‌తో...‘మిస్ యూనివర్స్’ పోటీలోపాల్గొన్న తొలి హిజాబీ (ముస్లిం సంప్రదాయ వస్త్రం హిజాబ్‌తో) మహిళగా ఖదీజా ఒమర్ చరిత్ర సృష్టించింది. 23 సంవత్సరాల ఖదీజా సోమాలియ నుంచి ‘మిస్ యూనివర్స్’ పోటీలోపాల్గొన్న తొలి మహిళ.కెన్యాలోని శరణార్థి శిబిరంలో జన్మించింది. యార్క్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేట్ అయిన ఖదీజా కమ్యూనిటీ బిల్డింగ్, బ్రాండ్ డెవలప్మెంట్లోప్రావీణ్యం సాధించింది. బ్యూటీ ఇన్ఫ్లూయెన్సర్, మోడల్, ఫొటోగ్రాఫర్‌గా రాణిస్తోంది. స్ఫూర్తిదాయకమైన కథలను చెప్పడంలో నేర్పరి. ‘మిస్ వరల్డ్ 2021’ కిరీటాన్ని గెలుచుకున్న మొదటి హిజాబీగా చరిత్ర సృష్టించింది. బార్బీ బొమ్మకు అందాల కిరీటం!‘ఈసారి విశ్వసుందరి కిరీటాన్ని బార్బీ బొమ్మ గెలుచుకుంది’ అనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ‘బార్బీ బొమ్మకు అందాల కిరీటం ఏమిటీ?!’ అనే ఆశ్చర్యంలో ఉండగానే అసలు విషయం తెలిసిపోయింది. ‘మిస్ యూనివర్స్–2024’ అందాల కిరీటాన్ని గెలుచుకున్న 21 సంవత్సరాల విక్టోరియా కెజార్ ముద్దు పేరు... బార్బీ డాల్. కెజార్ అచ్చం ‘బార్బీ’లా ఉంటుందని ఆలా పిలుస్తారు. బ్యూటీ స్పాట్...ఈసారి విశ్వసుందరి పోటీ విజేత కంటే ఎక్కువమంది దృష్టిని ఆకర్షించింది ఈజిప్ట్‌కు చెందిన లోగినా సలాహ్. చర్మంపై తెల్లటి మచ్చలు (బొల్లి) వల్ల ఎనిమిది సంవత్సరాల వయసు నుంచే ఎన్నో రకాల అవమానాలు ఎదుర్కొంది. సలాహ్ మిస్ యూనివర్స్ పోటీలోకి అడుగుపెట్టడం అనేది ఊహకు కూడా అందని విషయం. సంప్రదాయ సౌందర్య ప్రమాణాలను బ్రేక్ చేసిన వ్యక్తిగా ఎందరికో స్ఫూర్తినిచ్చే చారిత్రక సందర్భం కూడా. బ్లాగర్, ఇన్ఫ్లూయెన్సర్, మోడల్, మేకప్–ఆర్టిస్ట్‌గా రాణిస్తున్న సలాహ్‌కు సోషల్ మీడియాలో లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారు.‘స్కిన్పాజిటివిటీ’ని ప్రచార అంశంగా తన ప్రయాణాన్నిప్రారంభించి ఎంతోమంది యువతుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపింది సలాహ్. సలాహ్ సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమన్ మాత్రమే కాదు సానుకూల మార్పు, ఆత్మవిశ్వాసం... మొదలైన అంశాలలో వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి గొప్ప వక్తగా పేరు తెచ్చుకుంది. న్యూయార్క్‌లోని బెవర్లీ హిల్స్ ఇంటర్నేషనల్ బ్యూటీ స్కూల్ నుంచి లైసెన్స్ పొందిన సలాహ్ తన సోషల్ మీడియా ΄్లాట్ఫామ్లలో క్రియేటివ్ లుక్స్‌పై ట్యుటోరియల్స్‌ను నిర్వహించేది. 2023లో దుబాయ్ ఫ్యాషన్ వీక్లోపాల్గొనడం ద్వారా గ్లామర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.‘బియాండ్ ది సర్ఫేస్ మూమెంట్’ వేదిక ద్వారా బాలికలు, యువతులలో సామాజిక స్పృహ కలిగిస్తోంది. దుబాయ్‌లో నివసిస్తున్న 34 సంవత్సరాల సలాహ్ ఒక బిడ్డకు తల్లి. సింగిల్ మదర్.‘మిస్ యూనివర్స్ 2024’లో లోగినా సలాహ్ టాప్ 30లో చోటు సాధించింది. బంగారు పక్షి‘మిస్ యూనివర్స్’ కిరీటం మిస్ అయిపోయినా ‘గోల్డెన్ బర్డ్’ కాస్ట్యూమ్‌తో ఎంతోమంది హృదయాలను గెల్చుకుంది రియా సింఘా. ‘మిస్ యూనివర్స్’కు మన దేశం నుంచిప్రాతినిధ్యం వహించిన రియా సింఘా ధరించిన ‘ది గోల్టెన్ బర్డ్’ దుస్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ఏడాదిప్రారంభంలో ‘మిస్ యూనివర్స్ ఇండియా’ కిరీటాన్ని గెల్చుకున్న సింఘా సింబాలిక్ దుస్తుల్లో రన్‌వేపై నడుస్తూ ప్రేక్షకులను మంత్రముగ్థుల్ని చేసింది. శ్రేయస్సు, సంపదకు బంగారు పక్షి చిహ్నం. ఈ డ్రెస్‌ను వియత్నాం డిజైనర్ గుయెన్ ఎన్లోక్ డిజైన్ చేశారు. -
మన విశ్వ సుందరీమణులు వీరే.. ముగ్గురు మహిళా మణులు(ఫొటోలు)
-
Miss Universe 2024: 'విశ్వ సుందరి'గా డెన్మార్క్ బ్యూటీ
ప్రతిష్టాత్మక 73వ మిస్ యూనివర్స్ అందాల పోటీల్లో డెన్మార్క్‌కు చెందిన 21 ఏళ్ల యువతి గెలుపొందారు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఈ అందాల పోటీల్లో విశ్వ సుందరిగా డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ గెలుపొంది కిరీటాన్ని దక్కించుకున్నారు.మెక్సికో వేదికగా జరిగిన ఈ పోటీలలో 125 దేశాలకు చెందిన యువతులు పోటీ పడ్డారు. అయితే, 21 ఏళ్ల 'విక్టోరియా కెజార్' విజేతగా నిలిచారు. మొదటి రన్నరప్‌గా నైజీరియాకు చెందిన చిడిమ్మ అడెట్షినా, రెండో రన్నరప్‌గా మెక్సికోకు చెందిన మరియా ఫెర్నాండా బెల్ట్రాన్ నిలిచారు. ఈ అందాల పోటీలో టాప్ 5 ఫైనలిస్ట్‌లలో థాయిలాండ్‌కు చెందిన ఒపాల్ సుచతా చువాంగ్స్రీ, వెనిజులాకు చెందిన ఇలియానా మార్క్వెజ్ కూడా ఉన్నారు. 2023 మిస్ యూనివర్స్ విన్నర్ 'షెన్నిస్ పలాసియోస్' విజేతకు కిరీటాన్ని అందించారు. 'కొత్త శకం ప్రారంభమవుతుంది..! మా 73వ మిస్ యూనివర్స్ అయిన డెన్మార్క్ బ్యూటీకి అభినందనలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలకు స్ఫూర్తి నింపేలా మీ ప్రయాణం ఉండాలని ఆశిస్తున్నాం.' అని మిస్ యూనివర్స్ టీమ్ తెలిపింది. ఈ పోటీల్లో భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించిన రియా సింఘా టాప్ 5 వరకు కూడా చేరుకోలేకపోయారు. -
Miss Universe Korea : జస్ట్ 80!
సియోల్: పేరు: చోయి సూన్ హ్వా, వయస్సు:80. ఇటీవలే మిస్ యూనివర్స్ కొరియాఫైనలిస్ట్ల్లో ఒకరిగా నిలిచిరికార్డు బద్దలు కొట్టారు. త్వరలో జరగబోయే మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొని, వయోధికురాలిగా చరిత్ర సృష్టించబోతున్నారు. మిస్ యూనివర్స్ పోటీలు ప్రారంభమవ్వడానికి దశాబ్ధం ముందు 1952లో ఈమె జన్మించారు. ఈ నెలారంభంలో మిస్ యూనివర్స్ కొరియా పోటీలో ఫైనలిస్ట్‌గా నిలిచారు. సోమవారం మరో 31 మంది పోటీదారులతో ‘మిస్ యూనివర్స్ కొరియా’కిరీటం కోసం పోటీ పడనున్నారు. ఇందులో విజేతగా నిలిస్తే నవంబర్‌లో మెక్సికోలో జరిగే మిస్ యూనివర్స్ ఫైనల్స్‌లో దక్షిణ కొరియాకు ప్రాతినిథ్యం వహించే ఛాన్స్ కొట్టేయనున్నారు. ‘80 ఏళ్ల మహిళ ఇంత ఆరోగ్యంగా ఎలా ఉండగలిగారు? శరీర సౌష్టవాన్ని ఎలా నిలుపుకోగలిగారు? ఏ ఆహారం తీసుకుంటున్నారు? అని ఈ ప్రపంచాన్ని ఆశ్చర్యపరచాలనుకుంటున్నా’అని ఆమె సీఎన్ఎన్తో అన్నారు. హాస్పిటల్లో చిన్న ఉద్యోగం చేసి రిటైరైన చోయి..ఆర్థిక ఇబ్బందుల కారణంగా మళ్లీ ఆ ఉద్యోగంలో చేరారు. మోడలింగ్ రంగంలోకి వెళ్లాలని తన వద్దకు వచ్చే రోగి ఒకరు ప్రోత్సహించారని ఆమె చెప్పారు. ‘మొదట్లో ఆమె సలహా అర్థం లేనిదిగా అనిపించింది. ఆ తర్వాత నా చిన్ననాటి అభిరుచిని నెరవేర్చుకునేందుకు ఇదే సమయమని తోచింది’అని తెలిపారు. అదే సమయంలో అప్పులు ఆమెకు భారంగా మారాయి. అలా, 72 ఏళ్ల వయసులో మోడలింగ్ రంగంలోకి ప్రవేశించారు. 2018లో 74 ఏళ్ల వయస్సులో సియోల్ ఫ్యాషన్ వీక్‌లో మొట్టమొదటిసారిగా కనిపించారు. ఆ తర్వాత హార్పర్స్ బజార్, ఎల్ల్ మ్యాగజీన్లలో కనిపించారు. ఇప్పుడు, కొరియన్ ఫ్యాషన్ ప్రపంచంలో ఆమె తనకంటూ స్థానం సంపాదించుకున్నారు. -
మిస్ యూనివర్స్ ఇండియా 2024గా రియా సింఘా! 'తాజ్ మహల్ కిరీటం"..!
ఈ ఏడాది మిస్ యూనివర్స్ ఇండియా 2024 కిరీటాన్ని గుజరాత్‌కి చెందిన రియా సింఘా దక్కించుకుంది. రాజస్థాన్‌లోని జైపూర్ వేదికగా జరిగిన గ్రాండ్ ఫినాలేలో రియా సింఘా విజయకేతనం ఎగరువేశారు. ఫైనల్లో మొత్తం 51 మందితో పోటిపడి ఈ కిరీటాన్ని సొంతం చేసుకుంది రియా. 2015లో మిస్ యూనివర్స్ ఇండియాగా కిరీటాన్ని దక్కించుకున్న ఊర్వశి రౌతేలా ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా వ్యవహరించడం విశేషం. ఊర్వసి చేతుల మీదుగానే 'తాజ్ మహల్ కిరీటం' పొందింది రియా. ఈ సందర్భంగా ఊర్వశీ మాట్లాడుతూ..ఆమె ఈ ఏడాది మిస్ యూనివర్స్ ఇండియాగా రియా కిరీటాన్ని గెలుపొందడం ఆనందంగా ఉంది. అంతేగాదు ఈ ఏడాది చివర్లో జరిగి ప్రపంచ మిస్ యూనివర్స్ 2024 పోటీల్లో భారత్‌కు రియా ప్రాతినిధ్యం వహించనుంది. ఆ పోటీల్లో కూడా రియానే గెలవాలని ఆశిస్తున్నా. ఈ పోటీలో అమ్మాయిలంతా కూడా చాలా అంకితభావంతో కష్టపడారని అన్నారు ఊర్వశి. ఇక టైటిల్ విజేత రియా మాట్లాడుతూ.. ఈ మిస్ యూనివర్స్ ఇండియా 2024 టైటిల్‌ను గెలుపొందినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ టైటిల్ దక్కించుకునేందుకు తాను అన్ని విధాల తగినదాన్ని అని ఆత్మవిశ్వాసంగా చెప్పింది. అలాగే తాను మునుపటి విజేతల నుంచి ఎంతో స్ఫూర్తి పొందానని సగర్వంగా చెప్పుకొచ్చింది రియా. ఇదిలా ఉండగా, రియా ఫైనల్లో షాంపైన్ గోల్డ్ గౌనులో పుత్తడి బొమ్మలా ధగధగ మెరిసిపోయింది. అందుకు తగ్గట్టు చెవులకు ధరించిన డైమండ్ రింగులు ఆమెకు మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి. కాగా, ఈ అందాల పోటీల్లో గుజరాత్‌కి చెందిన రియా సింఘా 18 ఏళ్ల వయసుకే పాల్గొని అందర్నీ ఆశ్చర్యపరిచింది. View this post on Instagram A post shared by Miss Universe India (@missuniverseindiaorg) (చదవండి: ఇంత టాలెంటా..! ఓ పక్క నృత్యం..మరోవైపు..!) -
దక్షిణాఫ్రికా పొమ్మంది.. నైజీరియా పట్టం కట్టింది
లాగోస్: దక్షిణాఫ్రికాలో విదేశీయురాలని తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్న చిడిమా అడెత్సీనా మిస్ యూనివర్స్ నైజీరియాగా ఎన్నికైంది. నవంబరులో మెక్సికోలో జరిగే మిస్ యూనివర్స్ అందాల పోటీల్లో నైజీరియాకు ప్రాతినిధ్యం వహించనుంది. జాతీయతకు సంబంధించి ఆన్లైన్లో తీవ్రదాడి జరగడంతో అడెత్సీనా కిందటి నెల మిస్ సౌతాఫ్రికా పోటీ నుంచి వైదొలిగింది. నైజిరియాలో పోటీపడాల్సిందిగా వచి్చన ఆహ్వానాన్ని మన్నించింది. నైజీరియా తండ్రి, మొజాంబిక్ మూలాలున్న దక్షిణాఫ్రికా తల్లికి జని్మంచిందనే కారణంతో మిస్ సౌతాఫ్రికా పోటీల్లో పాల్గొనడానికి అడెత్సీనాకు అర్హత లేదనే వాదన మొదలైంది. ఆమె జాతీయతను దక్షిణాఫ్రికన్లు పశి్నంచారు. దాంతో అంతర్జాతీయ వేదికపై తండ్రి పుట్టినగడ్డకు ప్రాతినిధ్యం వహించే అవకాశంగా నైజీరియా అడెత్సీనాకు తమ ఆహ్వానాన్ని అభివరి్ణంచింది. చివరకు అదే నిజమైంది. ‘నా కల నిజమైంది. ఇదో అందాల కిరీటం కాదు. ఆఫ్రికా ఐక్యతకు పిలుపు’ అని అడెత్సీనా ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించింది. -
మిస్ యూనివర్స్ నైజీరియాగా దక్షిణాఫ్రికా బ్యూటీ!
దక్షిణాఫ్రికాలో నైజీరియన్ తండ్రికి జన్మించిన చిదిమ్మా అడెత్షినా అందాల కిరిటాన్ని కైవసం చేసుకునేందుకు ఎదుర్కొన్న అడ్డంకులు అవమానాలు అన్నీ ఇన్నీ కావు. కేవలం ఆమె గుర్తింపు కారణంగా అందాల పోటీ నుంచి చివరి నిమిషంలో వైదొలగాల్సి వచ్చింది. ఎంతో మందిని దాటుకుంటూ దక్షిణాఫ్రికా అందాల పోటీల ఫైనల్‌కి చేరుకుంటే. జస్ట్ ఆమె గుర్తింపే జాతీయ వివాదానికి దారితీసి అనర్హురాలిగా చేసింది. ఐతేనేం చివరికి అనుకున్నది సాధించి అందరినోళ్లు మూయించింది. ఐడెంటిటీతో ఏ మనిషి టాలెంట్‌ని తొక్కేయలేమని చాటిచెప్పింది. వివరాల్లోకెళ్తే..దక్షిణాప్రికాకు చెందిన చిదిమ్మా అడెత్షినా ఈ నెల ప్రారంభంలో దక్షిణాఫ్రికా అందాల పోటీల్లో ఫైనలిస్ట్‌గా ఎంపిక కావడం పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆమె నైజీరియన్ వారసత్వం పోటీకి అనర్హురాలిగా చేసింది. ఆమె తన తల్లి ఐడెంటిటీతో దక్షిణాప్రికన్గా గుర్తింపును తెచ్చుకుందంటూ ఆరోపణలు వచ్చాయి. అంతేగాదు ఈ అందాల పోటీల్లో అడెత్షినా దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించకూడదని పలు వాదనలు వినిపించాయి. దీంతో ఆమె వెంటనే ఆ పోటీ నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నట్లు ఇన్స్టాగ్రామ్ వేదికగా పేర్కొంది. తన కుటుంబ శ్రేయస్సు కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది. ఈ పోస్ట్ పెట్టిన మరుసటి రోజే అందాల పోటీల నిర్వాహకుల నుంచి అడెత్షినాకు ఆహ్వానం అందింది. అంతర్జాతీయ వేదికపై ఆమె తన తండ్రి మాతృభూమికి ప్రాతినిధ్యం వహించగలదని పేర్కొన్నారు నిర్వాహకులు. ఆ తర్వాత ఆమె శనివారం (ఆగస్టు 31)న మిస్ యూనివర్స్ నైజీరియాగా అందాల కిరీటాన్ని గెలుచుకుంది. ఎట్టకేలకు తన కలను నెరవేర్చుకున్నా అన్న భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఈ కిరీటం అందానికి మాత్రం కాదు 'ఐక్యతకు పిలుపు' అని న్యాయ విద్యార్థి అయిన అడెత్షినా గద్గద స్వరంతో చెప్పింది. "ఈ అందమైన కల చివరికి నిజమయ్యింది. ఈ కిరీటాన్ని ధరించడం ఎంతో గర్వంగానూ, గౌరంవంగానూ ఉంది. ఈ అత్యున్నత గౌరవాన్ని స్వీకరిస్తున్న సందర్భంగా ఎన్నేళ్లుగానో బాధను రగిలిస్తున్న ఆవేదనను పంచుకోవాలనుకుంటున్నా అన్నారు. ఆఫ్రికన్ ఐక్యత గురించి మాట్లాడాలనుకుంటున్నా. మనమంతా శాంతియుత సహజీనంతో మెలుగుతూ మనల్ని వేరుచేసే అడ్డంకులను చేధించుకుందాం. ప్రతి ఆఫ్రికన్ పక్షపాతం లేకుండా స్వేచ్ఛగా బతికేలా ఆ గొప్ప ఖండం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా". అని ఇన్‌స్టాగ్రాంలో రాసుకొచ్చింది అడెత్షినా. కాగా, అడెత్షినా నైజీరియన్ తండ్రి, దక్షిణాఫ్రికా తల్లి జన్మించిన మహిళ. మొజాంబికన్ సంతతికి చెందింది. సోవెటోలో జన్మించింది. ఐతే 1995 తర్వాత నుంచిఆ దేశ ప్రభుత్వం దక్షిణాప్రికాలోనే జన్మించిన వారికి లేదా శాశ్వత నివాసికి దక్షిణాఫ్రికా పౌరసత్వాన్ని మంజూరు చేసింది. ఆ నేపథ్యమే అడెత్షినాకి దక్షిణాఫ్రికా అందాల పోటీల్లో అడ్డంకి మారి తీవ్ర అవమానాల పాలయ్యేలా చేసింది. ఏదైతేనేం చివరికి ఆమె తన కలను సాధించడమే గాక గెలుపుతో విమర్శకుల నోళ్లు మూయించింది.(చదవండి: ఈ తెలంగాణ మిస్ డ్రీమ్.. 'మిస్ ఇండియా'!) -
Aishwarya Sushmita: వనితా విశేషణం..
యాక్ట్రెస్, సింగర్, మోడల్, బెల్లీ డాన్సర్, నేషనల్ లెవెల్ బాడ్మింటన్ ప్లేయర్.. ఈ విశేషణాలన్నింటి కలబోత ఐశ్వర్యా సుష్మితా! ‘బ్యాడ్ కాప్’ సిరీస్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.ఐశ్వర్యా సుష్మితా పుట్టింది బిహార్‌లోని దర్భంగాలో. పెరిగింది ఢిల్లీలో. నాన్న.. నారాయణ్ వర్మ, ఎస్బీఐ ఉద్యోగి. అమ్మ.. నీతా వర్మ, గృహిణి. ఐశ్వర్యా.. ఫిలాసఫీలో పోస్ట్‌గ్రాడ్యుయేట్.ఐశ్వర్యా ఆసక్తిని గమనించి, తల్లిదండ్రులూ ఆమెను మోడలింగ్ వైపే ప్రోత్సహించారు. దాంతో ఢిల్లీ బేస్డ్ మోడలింగ్ ఏజెన్సీలో జాయిన్ అయింది ఐశ్వర్యా. అక్కడే ప్రింట్ అడ్వర్టయిజ్మెంట్స్కి మోడల్‌గా పనిచేసింది.స్కూల్ డేస్‌లో ఆమె లక్ష్యం ఐఏఎస్ కావాలని. అందుకే కాలేజీకొచ్చాక ఫిలాసఫీ సబ్జెక్ట్‌ని ఎంచుకుంది. ఆమెకు స్పోర్ట్స్ అంటే కూడా చాలా ఇష్టం. బాడ్మింటన్ ప్లేయర్‌గా జాతీయ స్థాయిలో రాణించింది. అంతేకాదు అందాల పోటీల్లోనూ పాల్గొని, 2016, ఎన్డీటీవీ గుడ్ టైమ్ కింగ్‌ఫిషర్ సూపర్మోడల్స్కీ ఎంపికైంది. ఇవన్నీ ఆమె లక్ష్యాన్ని మార్చాయి.ఆ టైమ్‌లోనే ముంబై మోడలింగ్ ఏజెన్సీల నుంచీ ఆఫర్స్ రావడం మొదలుపెట్టాయి. ముంబై వెళ్లింది. మనీశ్ మల్హోత్రా, అనితా డోంగ్రే, రేణు టాండన్, మానవ్ గంగ్వానీ, రాహుల్ ఖన్నా వంటి సూపర్ డిజైనర్స్‌కి మోడల్‌గా పని చేసింది. టీవీ కమర్షియల్స్‌లోనూ నటించింది. ఆ ఫేమే ఆమెకు ‘స్పెషల్ ఆప్స్ 1.5’ అనే వెబ్ సిరీస్‌లో అవకాశాన్నిచ్చింది.ఆ నటన ఆమెను తాజాగా ‘బ్యాడ్ కాప్’ వెబ్ సిరీస్‌లో ప్రాధాన్యమున్న పాత్రకు ప్రమోట్ చేసింది. ప్రస్తుతం ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది.ఐశ్వర్యాకు సంబంధించి ఇంకో విశేషం, విశేషణం ఏంటంటే ఆమెకు స్పోర్ట్స్ బైక్ రైడింగ్ అంటే ప్రాణం. ఏ కొంచెం వీలు దొరికినా బైక్ రైడింగ్ చేస్తుంది. ఆమె ఫిట్నెస్ ఫ్రీక్ కూడా! రోజూ యోగా చేస్తుంది."నా పేరు విని అందరూ ఆశ్చర్యపోతారు సంబంధం లేకుండా రెండు పేర్లేంటని! ఐశ్వర్యా రాయ్, సుస్మితా సేన్లు మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ క్రౌన్స్ గెలుచుకున్న ఏడాదే పుట్టాను. మా పేరెంట్స్‌కి వాళ్లిద్దరంటే విపరీతమైన అభిమానం. ఆ అభిమానం కొద్దే నాకు ఆ ఇద్దరి పేర్లను కలుపుతూ ఐశ్వర్యా సుష్మితా అని పెట్టారు. అదన్నమాట నా పేరు వెనుకున్న స్టోరీ!" – ఐశ్వర్యా సుష్మితా -
మిస్ యూనివర్స్ స్టేట్ గ్రాండ్ ఫినాలే.. బ్యూటీ క్వీన్స్ క్యాట్ వాక్ (ఫోటోలు)
-
వైద్యురాలు కమ్ మోడల్: తొలి మిస్ యూనివర్స్ పెటిట్గా కన్నడ బ్యూటీ!
అమెరికాలో పొట్టి మహిళల కోసం నిర్వహించే అందాల పోటీల్లో విజయకేతనం ఎగురవేసింది కన్నడ బ్యూటీ. భారతదేశంలోని ఓ చిన్న పట్టణంలో ఉండే ఈ మోడల్ అతిపెద్ద కలను సాకారం చేసుకుంది. ప్రతి అమ్మాయి తాను అందాల రాణిని కావాలని ఆకాంక్షిస్తుంటది. అది సాధ్యం కానీ లక్ష్యమే అయినా పట్టుదలగా దాన్ని సాకారం చేసుకుని మరీ అందర్నీ ఆశ్చర్యపరిచింది ఈ కన్నడ మోడల్. ఆమె పేరు శృతి హెగ్డే. ఎవరీమె..? ఎలా ఈ అంతర్జాతీయ అందాల పోటీల్లో పాల్గొన కలిగిందంటే..బెంగళూరుకు చెందిన శృతి హెగ్డే అనే వైద్యురాలు మోడల్‌గా మారి అంతర్జాతీయ అందాల పోటీల్లో పాల్గొని సత్తా చాటింది. ఈ అందాల పోటీ అంత సులభమైనది కాదు. ఇది పొట్టి మహిళలకు అవకాశం కల్పించేందుకు 2009లో ప్రారంభించిన అందాల పోటీ. ఈ పోటీల్లో పాల్గొన్న వాళ్లంతా అమేజనోనియన్ ప్రమాణాల ప్రకారం మరుగుజ్జుగా ఉంటారు. ప్రతి ఏడాది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని ఫ్లోరిడాలోని టంపాలో ఈ పోటీలు నిర్వహిస్తారు.నిజానికి శృతి డాక్టర్‌గా పనిచేస్తూ మరోవైపు మోడల్‌గా ఈ అందాల పోటీల్లో పాల్గొనేందుకు ప్రిపేరయ్యేది. ఆస్పత్రిలో 36 గంటల షిఫ్ట్‌ల తోపాటు విశ్రాంతి తీసుకొని మెడికల్ ఎమర్జెన్సీని కూడా ఎదుర్కోంది. అందాల రాణి కావాలన్నది ప్రతి అమ్మాయి కల..అయితే తాను జస్ట్ ఒక ప్రయత్నం చేద్దాం అనుకున్నా, దీనికి తన అమ్మ అందించిన సపోర్టు కూడా ఎంతో ఉపయోగపడిందని అంటోంది హెగ్డే. తాను 2018 మిస్ ధార్వాడ్ పోటీకి సైన్ అప్ చేసింది. ఈ పోటీలో గెలిచేందుకు సన్నద్ధమవుతున్న క్రమంలో తాను చాలా పాఠాలను నేర్చుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. ముందుగా తన వైద్య రంగాన్ని, మోడలింగ్ కెరీర్‌ని బ్యాలెన్స్ చేయడం చాలా సవాలుగా ఉండేది. ఒక్కోసారి విశ్రాంతి తీసుకునేంత తీరిక లేని పనులతో ఉక్కిరిబిక్కిరిగా ఉండేదని చెబుతోంది. ఇంతలో 2019లో తనకు గర్భాశయ కణితులు ఉన్నట్లు నిర్ధారణ అయిందని చెప్పింది. దీంతో ఓ రెండేళ్లు ట్రీట్‌మెంట్‌తోనే గడిచిపోయింది. ఇక కెరీర్ ముగిసిపోయింది. ఈ అందాల పోటీల్లో పాల్గొనలేను అనుకున్న సమయాన్ని ఆమె తల్లి అందించిన మద్దతుతో తిరిగా మళ్లీ అందాల పోటీల్లో పాల్గొనడం మొదలు పెట్టింది. అలా మిస్ ఆసియా ఇంటర్నేషనల్ ఇండియా 2023 రెండో రన్నరప్‌గా టైటిల్‌ని దక్కించుకుంది. ఎప్పుడైతే ఈ టైటిల్ గెలిచిందో అప్పుడు ఆమె మీద ఆర్థిక ఒత్తిడి తగ్గింది. అంతకమునుపు ఓ పక్క ట్రీట్మెంట్ మరోవైపు పోటీల ప్రీపరేషన్తో ఆర్థిక భారం ఎక్కువగా ఉండేది. దీంతో పోటీల్లో ప్రదర్శని ఇచ్చేందుకు కేవలం రెండు దుస్తులే ఉండేవి. వాటినే వేర్వురు ప్రదర్శనల్లో ధరించేదాన్ని అని చెబుతోంది. ఇప్పుడు ఆమెకు స్పాన్సర్లు లభించడంతో ఈ ఆర్థిక భారం నుంచి కాస్త ఉపశమనం పొందింది. ఆమె కష్టానికి ఫలితమే దక్కి గత నెల జూన్ 10న భారతదేశపు తొలి మిస్ యూనివర్సల్ పెటైట్‌గా కిరీటాన్ని గెలుచుకుంది. (చదవండి: స్పేస్‌లో భోజనం టేస్ట్ ఎలా ఉంటుందంటే..!) -
Sushmita Sen Throwback Photos: అందానికి పట్టాభిషేకం.. మిస్ యూనివర్స్‌గా 'సుస్మితా సేన్' 30 ఏళ్ల నాటి ఫోటోలు
-
Miss Universe: సుస్మితా సేన్ అందానికి దక్కిన కిరీటానికి 30 ఏళ్లు పూర్తి
బాలీవుడ్ హీరోయిన్, మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్‌కు ఈరోజు చాలా ప్రత్యేకం. తాను విశ్వసుందరిగా కిరీటాన్ని గెలుచుకుని నేటితో 30 ఏళ్లు. ఆ రోజులను గుర్తుచేసుకుంటూ ఆమె ఒకఫోటోను షేర్ చేసింది. 1994లో విశ్వ సుందరి కిరీటం గెలిచి భారత జాతి ఖ్యాతి పెంచిన సుస్మిత ఆపై సినిమాలతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేస్తూ పేరు తెచ్చుకుంది.మే 21, 1994న మిస్ యూనివర్స్ టైటిల్‌ను గెలుచుకున్న మొదటి భారతీయురాలుగా సుస్మిత రికార్డ్ క్రియేట్ చేసింది. అప్పటి ఫోటోను షేర్ చేస్తూ సుస్మిత ఇలా చెప్పుకొచ్చింది. 'ఈ ఫొటో తీసినప్పుడు నా వయసు 18ఏళ్లు. నేను అనాథాశ్రమంలో ఈ చిన్నారిని కలిసిన క్షణంలో నేను జీవితంలో ఎన్నో పాఠాలు నేర్చుకోవాని నిర్ణయించుకున్నాను. అత్యంత అమాయకమైన ఆ చిన్నారి చూపు నన్ను కట్టిపడేసింది. 30 ఏళ్ల క్రితం నేను ఏదైతే అలాంటి వారికి చేయాలని అనుకున్నానో ఇప్పుడు అదే చేస్తున్నాను.ప్రతి ఏడాది మే 21ని చాలా గర్వంగా సెలబ్రెట్ చేసుకుంటాను. 21 మే 1994 నా జీవిత చరిత్రలో చెరిగిపోని ఒక పేజీ.. ఆ క్షణాలు ఇప్పటికీ నా కళ్లముందు కనిపిస్తున్నాయి. భారతదేశం ఎల్లప్పుడూ నాకు గొప్ప గుర్తింపు, శక్తిని ఇచ్చింది. గత మూడు దశబ్ధాలుగా అభిమానులు అంతులేని ప్రేమను నాకు అందిస్తున్నారు. ఈ సంతోషం సందర్భంగా నాకు మెసేజ్‌లు పంపుతున్న అందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ నా హృదయంలో ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది.' అని ఆమె తెలిపింది.1975, నవంబర్ 19న ఓ బెంగాలీ కుటుంబంలో సుస్మితా సేన్ జన్మించింది. తండ్రి షుబీర్ సేన్ భారత వైమానిక దళంలో వింగ్ కమాండర్‌గా పని చేయగా, తల్లి శుభ్రా సేన్ నగల డిజైనర్. సుస్మిత హైదరాబాద్‌లో జన్మించినా చదువంతా ఢిల్లీలో సాగింది.తెలుగులో నాగార్జున సరసన 'రక్షకుడు' చిత్రంలో నటించింది. 2013 సంవత్సరానికి సుస్మితాసేన్ మదర్‌థెరిస్సా ఇంటర్నేషనల్ అవార్డు అందుకుంది. సామాజిక న్యాయం కోసం కృషిచేసేవారిని గుర్తించి గౌరవించేందుకు ద హార్మనీ ఫౌండేషన్ అనే సంస్థ ఈ అవార్డు నెలకొల్పింది. 2015 లోనే సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సుస్మితా సేన్.. ఓటీటీ కోసం ఆర్య, తాళి వంటి వెబ్ సీరిస్‌లలో నటించింది. View this post on Instagram A post shared by Sushmita Sen (@sushmitasen47) -
సడెన్‌గా మిస్ యూఎస్ఏ స్థానం నుంచి తప్పుకుంటున్న మోడల్!కారణం ఇదే..
గతేడాది 2023లో మిస్ యూఎస్ఏ విజేతగా ఎంపికైన నోలియా వోయిగ్ట్ సడెన్‌గా తన స్థానం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. తన కిరీటాన్ని వెనక్కి ఇచ్చేస్తున్నట్లు పేర్కొంది. దీంతో ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు ఆమె అభిమానులు. మానసిక ఆరోగ్యం కారణంగానే తాను ఈ అత్యున్నత స్థానానికి రాజీనామా చేస్తున్నట్లు ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొంది. ఆరోగ్యమే మహా సంపద అని అందువల్ల ముందు తన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తానని తెలిపింది. అలాగే మిస్ యూఎస్ఏగా తన జర్నీ చాలా అర్థవంతంగా సాగిందని చెప్పింది. మిస్ యూఎస్ఏ టైటిల్‌ని గెలుచుకున్న తొలి మెనిజులా అమెరికన్ మహిళ. తాను మిస్ యూఎస్ఏ 2023 టైటిల్‌కు రాజీనామా చేయాలన కఠినమైన నిర్ణయం తీసుకున్నాని వోయిగ్ట్ పేర్కొన్నారు. ఇది నాకు కొత్త అధ్యయనం అని తెలుసని, అందువల్ల స్థిరంగా ఉండేందుకు యత్నిస్తా. మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు మిస్ యూఎస్ఏ ఆర్గనైజేషన్ ప్రతినిధి మాట్లాడుతూ..వోయిగ్ట్ తన విధుల నుంచి తప్పుకోవాలని తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తాం. మా టైటిల్ హోల్డర్లకు ముందు ప్రాధన్యత ఇస్తాం. ఈ సమయంలో ఆమెకు తనకు తానుగా అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది అని మేము గుర్తించాం. తన భాద్యతలకు వారసునిగా చేయడం కోసం చూస్తున్నారని అర్థమయ్యింది.త్వరలో ఆమె కోరుకున్నట్లుగానే కొత్తమిస్ యూఎస్ఏని ప్రకటించడం కూడా జరుగుతుంది. అని అన్నారు. ఇన్‌స్టాగ్రాంలో సంస్థ మోడల్‌కి మద్దతను ఇవ్వడమే గాక ఆమె చేసిన సేవకు ధన్యావాదాలు తెలిపింది. కాగా, హవాయికి చెందిన సవన్నా గాంకీవిచ్ మొదటి రన్నరప్‌గా నిలిచారు. ఆమె తదుపరి కొత్త యూఎస్ఏ కిరీటాన్ని పొందే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాల సమాచారం. ఇక వోయిగ్ట్ మిస్ యూఎస్ఏగా డేటింగ్ హింసకు వ్యతిరేకంగా, ఇమ్మిగ్రేషన్ హక్కులు, లాభప్రేక్ష లేని స్మైల్ ట్రైన్‌తో పనిచేయడం వంటి పలు సేవలందించారు. ఈ వేదిక తన కలను సాకారం చేసుకునేలా చేసింది. పైగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తులతో కనెక్ట్ అయ్యేలా చేసిందని అందుకు తాను ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉంటానని సోషల్ మీడియా పోస్ట్‌లో రాసుకొచ్చింది.(చదవండి: సోమవారాల్లో నలిగిన బట్టలే ధరించండి! సీఎస్ఐఆర్ పరిశోధన సంస్థ) -
మిస్ యూనివర్స్ అందాల పోటీల్లో 60 ఏళ్ల వృద్ధురాలు..!
అందాల పోటీల్లో ఎందరో అతిరథ బ్యూటీలు పాల్గొని సత్తా చాటారు. విజేతలుగా గెలిచిన అందాల భామలు అసలైన అందానికి నిర్వచనం ఏంటో తమదైన శైలిలో వివరించి అందర్నీ మంత్ర ముగ్దుల్ని చేశారు. ఐతే ఈ పోటీల్లో పాల్గొనడానికి వయసు పరిమితి ఉండేది. అయితే ఓ నిర్ధిష్ట వయసు తర్వాత మఖ్యంగా మహిళలు తరుచుగా నిర్లక్ష్యానికి అవహేళనకు గురవ్వుతుంటారు. చెప్పాలంటే తల్లిగా మారే పరిణామ క్రమంలో వృధ్యాప్యానికి త్వరితగతిన చేరువయ్యేది మహిళలే. దీంతో వారికి గుర్తింపు ఉండదు సమాజంలో. ఆ తరహా ఆలోచనను మార్చి అందానికి అసలైన నిర్వచనం ఇచ్చేలా ఏకంగా 60 ఏళ్ల వయసులో అందాల పోటీల్లో పాల్గొని చరిత్ర సృష్టించనుంది వృద్ధురాలు. ఇంతకీ ఎవరామె అంటే..అర్జెంటినాలో మేలో మిస్ యూనివర్స్ బ్యూనస్ ఎయిర్స్ 2024 అందాల పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో న్యాయవాది అయిన 60 ఏళ్ల అలెజాండ్రా మారిసో రోడ్రిగ్జ్ పాల్గొని చరిత్ర సృష్టించనుంది. ఆమె గనుక ఈ అర్జెంటినా మిస్ యూనివర్స్ బ్యూనస్ ఎయిర్స్ 2024 టైటిల్ గెలుచుకుంటే 60 ఏళ్ల వయసులో టైటిల్‌ని గెలుచుకున్న తొలి సీనియర్ సిటిజన్‌గా అలెజాండ్రా రికార్డులకెక్కడమే గాక సెప్టెంబర్‌లో జరగనున్న మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొన్న తొలి సీనియర్ సిటిజన్‌గా కూడా చరిత్ర సృష్టిస్తోంది.స. ప్రసుత్తం ఆమె మేలో జరగనున్న అర్జెంటినా మిస్ యూనివర్స్ బ్యూనస్ ఎయిర్స్ 2024 పోటీలకు సన్నద్ధమవుతుంది. ఈ టైటిల్‌ని గెలుచుకుంటే అలెజాండ్రా సెప్టెంబర్‌లో జరగనున్న మిస్ యూనివర్స్ పోటీల్లో అర్జెంటీనా తరుఫునా ప్రాతినిధ్యం వహించనుంది. ఆమె యువ పోటీదారులకు గట్టి పోటీ ఇచ్చేలా అద్భుతమైన దేహధారుడ్యంతోత్తా చాటనుంది. అంతేగాదు అందాల ప్రపంచంలో ఉన్న మూస పద్ధతులను తిప్పికొట్టి అందానికి వయసుతో సంబంధం ఉండదని ప్రూవ్ చేయనుంది. ఆరోగ్యకరమైన జీవన శైలితో వయసుని కనిపించకుండా చేయగలిగే ప్రతి స్త్రీ గొప్ప అందగత్తేనని చెబుతోంది. ఇక అలెజాండ్రా ఆరోగ్యకరమైన అలవాట్ల తోపాటు కఠిన వ్యాయామ నియమావళిని అనుసరిస్తానని తెలిపింది. అవే తనకు ఈ అందాల పోటీల్లో సహకరిస్తాయని ఆత్మవిశ్వాసంగా చెబుతోంది అలెజాండ్రా. అలాగే 18 ఏళ్ల వయసులో ఉన్నట్లు దేహ సౌందర్యం ప్రతిమహిళకు వయసు రీత్యా విభిన్నంగా ఉండొచ్చు గానీ అందంగానే ఉంటారని అంటోంది. ఇక్కడ వయసుని అందానికి కొలమానంగా చూడకూడదని నొక్కి చెబుతోంది. అంతేగాదు సమాజానికి మహిళల అందాన్ని తక్కువ చేసి చూసే అవకాశం ఇవ్వకుండా తమపై శ్రద్ధ వహించేలా సమతుల్యమైన ఆహారపు అలవాట్లపై మహిళలంతా దృష్టి పెట్టాలని చెబుతోంది అలెజాండ్రా.(చదవండి: ట్రోలర్లకు స్ట్రాంగ్ కౌంటరిచ్చిన ప్రాచీ: ఉచితంగా ట్రీట్ చేస్తామన్న వైద్యులు -
విశ్వసుందరి పోటీల్లో సౌదీ ముద్దుగుమ్మ! ఇంతకీ ఎవరీమె..?
ఇస్లాం సంప్రదాయవాదానికి చిరునామాగా నిలిచే సౌదీ అరేబియా నుంచి ఒక ముద్దుగుమ్మ మిస్ యూనివర్స్ పోటీలకు సిద్ధమైంది. సౌదీ నుంచి ఇలా ఒక అమ్మాయి అంతర్జాతీయ అందాల పోటీలకు ప్రాతినిధ్యం వహించడం చరిత్రలో ఇదే తొలిసారి. మలేసియాలో జరగనున్న విశ్వసుందరి పోటీల్లో సౌదీ తరఫున 27 ఏళ్ల మోడల్ రూబీ అల్ఖాతానీ ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ అందాల రాశికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. తొలి పార్టిసిపెంట్‌గా ఆమె.. సౌదీ అరేబియాలో మహిళలపై ఎలాంటి ఆంక్షలుంటాయో అందరికి తెలిసిందే. కఠిన ఆంక్షలతో ఫక్తు సంప్రదాయవాదిగా పేరుమోసిన 38 ఏళ్ల సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ ఇటీవలి కాలంలో సౌదీని సంస్కరణల బాటలో పయనింపజేస్తున్నారు. ఇటీవలి కాలంలో పలు ఆంక్షల్ని సడలించి వార్తల్లో నిలిచారు. ఈ మేరకు ఆయన మహిళా డ్రైవర్లపై నిషేధం ఎత్తివేయడం, ఆహార్యం విషయంలో పెట్టిన నిబంధనల్ని సడలించడం, పురుషుల తోడు లేకుండా బయటికి వెళ్లే స్వేచ్ఛను అక్కడి మహిళలకు కల్పించడం.. వంటి పలు మార్పులు తీసుకొచ్చారు. అయితే అందాల పోటీల్లో పాల్గొనే విషయంలో కూడా నియమాల్ని సడలించడం విశేషం. ఎందుకంటే..ఇప్పటిదాకా అంతర్గతంగా జరిగే అందాల పోటీల్లో పాల్గొనేందుకు అక్కడి మహిళలకు అనుమతిచ్చిన ఈ దేశం.. తొలిసారి అంతర్జాతీయంగా జరిగే అందాల పోటీల్లో పాల్గొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేగాదు ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరగబోయే ‘మిస్ యూనివర్స్’ పోటీల్లో ఈ దేశం కూడా పాలుపంచుకుంటోంది. విశ్వ సుందరి పోటీల్లో సౌదీ తరఫున 27 ఏళ్ల రుమీ అల్ ఖతానీ పోటీ పడనుంది. దీంతో ‘మిస్ యూనివర్స్’ పోటీల్లో పాల్గొననున్న తొలి సౌదీ అరేబియన్ మహిళగా రుమీ చరిత్ర సృష్టించనుంది. రుమీ రియాద్‌లో పుట్టి పెరిగింది. చిన్నతనం నుంచి ఎంతో ముద్దుగా, క్యూట్‌గా ఉండే ఆమెకు అందాల పోటీల్లో పాల్గొనాలన్నది చిరకాల కోరిక. అందువల్లే టీనేజ్ దశ నుంచే ఇటువైపుగా అడుగులు వేసి మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది. కంటెంట్ క్రియోటర్గా.. అందాల పోటీలపై ఎంత మక్కువ ఉన్నా చదువును మాత్రం నిర్లక్ష్యం చేయలేదు రుమీ. దంత వైద్యంలో డిగ్రీ పట్టా పుచ్చుకుంది. కొత్త విషయాలు తెలుసుకోవడమన్నా, కొత్త భాషలు నేర్చుకోవడమన్నా ఈ ముద్దుగుమ్మకు చాలా ఇష్టమట! ఈ మక్కువతోనే అరబ్, ఫ్రెంచ్, ఇంగ్లిష్ భాషల్ని అనర్గళంగా మాట్లాడడం నేర్చుకున్న రుమీ.. మరిన్ని భాషలు నేర్చుకునే పనిలో ఉన్నానంటోంది. తన వ్యక్తిగత, కెరీర్ అనుభవాల్ని నలుగురితో పంచుకోవడంలో ఎప్పుడూ ముందే ఉంటుంది రుమీ. ఈ క్రమంలోనే మోడల్‌గా తాను సాధించిన ఘనతల్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ నెటిజన్ల ప్రశంసలందుకుంది ఈ సౌదీ భామ. ఫ్యాషన్, అందం, లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై అందరిలో అవగాహన కల్పిస్తూ పోస్టులు పెడుతూ.. కంటెంట్ క్రియేటర్‌గా మంచి పేరు కూడా తెచ్చుకుంది. అంతేగాదు ఇన్‌స్టాలో కూడా ఆమెను 10 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. కుటుంబమే నా బలం.. ప్రయాణాలంటే ఈ అందాల ముద్దుగుమ్మకు మహా ఇష్టమట. తాను సందర్శించే దేశాలు, అక్కడి ప్రత్యేకతల్ని ఫొటోలు, రీల్స్ రూపంలో ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. విభిన్న ఫ్యాషన్స్‌ని ఫాలో అవడం, కొత్త ఫ్యాషన్లను ట్రై చేయడంలో ఎప్పుడూ ముందే ఉంటుంది రుమీ. ఫ్యాషనబుల్ దుస్తుల్లో మెరిసిపోతూ రుమీ తీయించుకున్న ఫొటోషూట్స్‌ని ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా.. అవన్నీ వైరల్ అవుతుంటాయి. ఇలా ‘ఫ్యాషన్ క్వీన్’గానూ పేరు తెచ్చుకుందీ ఈ బ్యూటీ. తన వద్ద ఉన్న ఖరీదైన వస్తువులు, యాక్సెసరీస్, వాటికి సంబంధించిన ఫొటోల్నీ అందరితో పంచుకోవడానికి ఇష్టపడతుంది రుమీ. అంతేగాదు ఆమె వద్ద ఉన్న లగ్జరీ జ్యుయలరీ కలెక్షన్లను చూసి నెటిజన్లు ఫిదా అవుతుంటారు. తన కుటుంబమే తన బలం అని రుమీ తరచుగా చెబుతుంటుంది. అంతేగాదు తన కుటుంబ సభ్యులు, సోదరీమణులతో దిగిన ఫొటోల్ని కూడా సోషల్‌మీడియాలో షేర్ చేస్తుంటుంది. ఇక రుమీ ఇప్పటికే పలు అందాల పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది. అలా ఆమె ‘మిస్ సౌదీ అరేబియా’, ‘మిస్ అరబ్ పీస్’, ‘మిస్ ఉమన్ సౌదీ అరేబియా’, ‘మిస్ యూరప్ సౌదీ అరేబియా’, ‘మిస్ ప్లానెట్ సౌదీ అరేబియా’, ‘మిస్ మిడిల్ ఈస్ట్ సౌదీ అరేబియా’, ‘మిస్ అరబ్ యునిటీ సౌదీ అరేబియా’, ‘మిస్ ఆసియా సౌదీ అరేబియా’.. వంటి ఎన్నో టైటిళ్లు దక్కించుకుంది. "ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛగా, స్వతంత్రంగా, సమానత్వంతో జీవించే హక్కు ఉంది. వయసు, స్త్రీ-పురుష భేదాలు, శక్తి సామర్థ్యాలు, ఆహార్యం/శరీరాకృతి పరంగా ఎవరూ వివక్షకు గురికాకూడదు. అప్పుడే వాళ్లు తామేంటో చూపించుకోగలరు.." అంటూ సోషల్ మీడియాలో స్ఫూర్తినింపే పోస్టులను పెడుతుంటుంది. కాగా, ఈ ఏడాది జరగబోయే ‘మిస్ యూనివర్స్’ పోటీల్లో తన దేశం తరఫున పాల్గొంటున్నందుకు ఆనందంలో మునిగితేలుతోంది ఈ ముద్దుగుమ్మ. అంతేగాదు ఈ ఏడాది మిస్ యూనివర్స్-2024 పోటీల్లో తన దేశానికి ప్రాతినిథ్యం వహించడం గర్వంగానూ సంతోషంగానూ ఉందని చెబుతోంది. ఈ ఏడాది తొలిసారిగా నా దేశం ఈ పోటీల్లో పోటీ పడుతుండడం, పైగా అందులో తానే తొలి పార్టిసిపెంట్‌ని కావడం ఎంతో సంతోషంగా అనిపించిందని సోషల్ మీడియా పోస్ట్‌లో రాసుకొచ్చింది రుమీ. (చదవండి: హీరోయిన్లా కనిపించాలని వందకు పైగా సర్జరీలు! అందుకోసం..) -
మిస్ యూనివర్స్ పోటీలో తొలిసారి సౌదీ సుందరి
రియాద్: ఇస్లాం సంప్రదాయవాదానికి చిరునామాగా నిలిచే సౌదీ అరేబియా నుంచి ఒక ముద్దుగుమ్మ మిస్ యూనివర్స్ పోటీలకు సిద్ధమైంది. సౌదీ నుంచి ఇలా ఒక అమ్మాయి అంతర్జాతీయ అందాల పోటీలకు ప్రాతినిధ్యం వహించడం చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. త్వరలో మలేసియాలో జరగబోయే విశ్వసుందరి పోటీల్లో తాను సౌదీ తరఫున పాల్గొనబోతున్నట్లు 27 ఏళ్ల మోడల్ రూబీ అల్ఖాతానీ సోమవారం ప్రకటించారు. సౌదీలోని రియాద్ నగరం ఈమె స్వస్థలం. ఇప్పటికే పలు అందాల పోటీల్లో పాల్గొన్నారు. కొద్ది వారాల క్రితం మలేసియాలో జరిగిన మిస్ అండ్ మిసెస్ గ్లోబల్ ఏషియన్లోనూ పాలుపంచుకున్నారు. ప్రపంచ సంస్కృతులపై అవగాహన పెంచుకుంటూనే మా సౌదీ సంప్రదాయాలు, సంస్కృతి, వారసత్వాన్ని విశ్వ వేదికలపై వివరిస్తా’ అని అరబ్ న్యూస్‌తో రూబీ అన్నారు. ఇప్పటికే మిస్ సౌదీ అరేబియా కిరీటాన్ని దక్కించుకున్న ఈమె మిస్ మిడిల్ ఈస్ట్(సౌదీ అరేబియా), మిస్ అరబ్ వరల్డ్ పీస్–2021, మిస్ ఉమెన్(సౌదీ అరేబియా) టైటిళ్లను గెలుపొందారు. ఈమెకు ఇన్‌స్టా గ్రామ్‌లో లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈమె మోడల్‌గానే కాదు కంటెట్ క్రియేటర్ గానూ రాణిస్తున్నారు. కఠిన ఆంక్షలతో ఫక్తు సంప్రదాయవాదిగా పేరుమోసిన 38 ఏళ్ల సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ ఇటీవలి కాలంలో సౌదీని సంస్కరణల బాటలో పయనింపజేస్తున్నారు. మహిళల డ్రైవింగ్‌కు, పురుషుల పార్టీలకు వెళ్లేందుకు, పురుష సంరక్షులు లేకున్నా పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అనుమతించారు. పూర్తి మద్యనిõÙధం అమల్లో ఉండే సౌదీలో తొలిసారిగా దౌత్యకార్యాలయాలుండే ప్రాంతంలో మద్యం అమ్మకాలకు అనుమతి మంజూరు చేశారు. -
Miss Universe 2023 : అదరహో అనిపించిన సుందరీమణులు వీళ్లు (ఫొటోలు)
-
‘వీలైతే నేను మలాల అవుతా’
72వ మిస్ యూనివర్స్ అందాల పోటీలు సెంట్రల్ అమెరికాలోని ఎల్ సాల్వడార్లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ పోటీల్లో నికరాగ్వా సుందరి షెన్నిస్ పలాసియోస్ ప్రతిష్టాత్మకమైన మిస్ యూనివర్స్–2023 కిరీటం దక్కించుకోగా ఫస్ట్ రన్నరప్‌గా థాయిలాండ్ భామ ఆంటోనియా పోర్సిల్డ్ నిలిచింది. అయితే ఈ పోటీల్లో ఆఖరి రౌండ్ ప్రశ్నలు చాలా ఆసక్తికరంగానూ గమ్మత్తుగా ఉంటాయి. అందుకు తగ్గట్టుగానే అందాల భామలు తమదైన శైలిలో చెప్పి జడ్జిలను మత్రముగ్గుల్ని చేసి కీరిటాన్ని దక్కించుకుంటారు. ఇక్కడ ఈ ముగ్గుర్నీ ఒకే ప్రశ్న అడిగారు. అయితే ఆ ప్రశ్నకు థాయిలాండ్ భామ ఆంటోనియా పోర్సిల్డ్ చెప్పిన సమాధానం అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. ఊహించిన రీతిలో ఆమె నుంచి వచ్చిన సమాధానం అక్కడున్న వారిని షాక్ గురి చేయడమే గాక సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది. ఇంతకీ పోర్సిల్డ్ ఏం చెప్పిందంటే..మిమ్మల్ని ఒక ఏడాది వేరొక మహిళల ఉండమంటే ఎవర్ని ఎంపిక చేసుకుంటారని జడ్జిలు ప్రశ్నించగా..అందుకు పోర్సిల్డ్ తాను మలాలా యూసఫ్‌జాయ్‌ని ఎంచుకుంటానని తేల్చి చెప్పింది. ఆమె ఈ రోజు ఆ స్థాయికి చేరుకోవడానికి ఎన్ని కష్టాలు ఫేస్ చేసిందో మనకు తెలుసు. మహిళల విద్యకోసం పోరాడింది. అందుకోసం ప్రాణాలను పణంగా పెట్టి అత్యంత బలంగా పోరాడింది మలాలా. అందువల్ల నేను ఎంచుకోవాల్సి వస్దే ఆమెను సెలక్ట్ చేసుకుంటానని సగర్వంగా చెప్పింది. ఐతే ఇదే ప్రశ్నకు కిరీటం దక్కించుకున్న నికరాగ్వా సుందరి షెన్నిస్ పలాసియోస్ పోర్సిల్డ్ మాదిరిగానే మహిళల హక్కుల కోసం పాటుపడిన మేరీ వోల్‌స్టోన్‌క్రాఫ్ట్‌ను ఎంచుకుంటాను చెప్పగా, మరో విశ్వసుందరి ఆస్ట్రేలియన్ మోరయా విల్సన్ మాత్రం తన తల్లిని ఎంచుకుంటానని చెప్పింది. ఆమె వల్ల ఈ రోజు ఇక్కడ వరకు రాగలిగానని, అందువల్ల తన తల్లిని ఎంపిక చేసుకుంటానని చెప్పింది. ఇక్కడ థాయిలాండ్ భామ పోర్సిల్డ్ పాక్‌కి చెందిన ఐకానిక్ మహిళ, నోబెల్ శాంతి గ్రహిత మలాలా యూసుఫ్ జాయ్‌ని చెప్పడం అందర్నీ షాక్‌కి గురి చేసింది. ఆమె సమాధానం ప్రతి ఒక్కరిని కదిలించింది, ఆలోచింప చేసేలా ఉందంటూ నెటిజన్లు ఆమెపై ప్రశంసల జల్లు కురిపించారు. కాగా సెంట్రల్ అమెరికా 1975 తర్వాత మళ్లీ తొలిసారిగా ఈ మిస్ యూనివర్స్ పోటీలను నిర్వహించింది. FINAL Q&A starting with Thailand! @porxild#72ndMISSUNIVERSE #MissUniverse2023 @TheRokuChannel pic.twitter.com/w71IH4kEvY — Miss Universe (@MissUniverse) November 19, 2023 (చదవండి: ఎవరికీ కనిపించనివి కనిపిస్తున్నాయా?.. వినిపించనివి వినిపిస్తున్నాయా?) -
ప్రపంచ సుందరిగా ఎంపికైన నికరాగ్వా భామ!
మిస్ యూనివర్స్ 2023 టైటిల్‌ను నికరాగ్వా భామ నిలిచింది. నికరాగ్వా దేశానికి చెందిన షెన్నిస్ పలాసియోస్ ఈ ఏడాది ప్రపంచసుందరిగా ఎంపికైంది. ప్రపంచవ్యాప్తంగా అందాల పోటీల్లో ఎంతో ప్రాముఖ్యత సొంతం చేసుకున్న 'మిస్ యూనివర్స్' కిరీటం షెన్నిస్ దక్కించుకుంది. కాగా.. మాజీ విశ్వ సుందరి ఆర్ బానీ గాబ్రియేల్ ప్రపంచసుందరి కిరీటాన్ని ఆమెకు అలంకరించారు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు విశ్వ సుందరికి నెటిజన్లు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. శాన్ సాల్వడార్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో దాదాపు 84 దేశాలకు చెందిన అందాల భామలు పోటీ పడ్డారు. మన దేశం తరఫున ఈ పోటీల్లో శ్వేతా శార్దా పాల్గొన్నారు. MISS UNIVERSE 2023 IS @sheynnispalacio !!!! 🇳🇮👑@mouawad #72ndMISSUNIVERSE #MissUniverse2023 pic.twitter.com/mmR90DJ16m — Miss Universe (@MissUniverse) November 19, 2023 -
మిస్ యూనివర్స్ పోటీల్లో దేవకన్యలా మెరిసిపోయిన శ్వేత
ప్రతిష్టాత్మక 72వ మిస్ యూనివర్స్ అందాల పోటీలు ఫైనల్‌కు చేరుకున్నాయి.ఎల్ సాల్వడార్లో వేదికగా ఆదివారం ఉదయం 9గంటలకు(భారత కాలమానం ప్రకారం).. మిస్ యూనివర్స్2023 ఎవరో తేలిపోనుంది. 90 దేశాలకు చెందిన అందాల భామలు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. భారత్ నుంచి 23ఏళ్ల శ్వేతా శార్దా ప్రాతినిధ్యం వహిస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం జరిగిన నేషనల్ కాస్ట్యూమ్ షోలో శ్వేత ధరించిన కాస్ట్యూమ్స్ ఇప్పుడు నెట్టింట సెన్సేషన్‌గా మారాయి. రీగల్ ఎంబ్రాయిడరీతో చేసిన దుస్తులు ధరించి శ్వేత దేవకన్యలా మెరిసింది. జాతీయ పుష్పం కమలం స్ఫూర్తితో రూపొందించిన కిరీటం ధరించి ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది.దీంతో పాటు జాతీయ పక్షి నెమలి ప్రతిబింబించేలా కాస్ట్యూమ్‌ను ఎంబ్రాయిడరీతో తీర్చిదిద్దారు. సవాళ్లను ఎదుర్కొనే, అభివృద్ధి చెందుతున్న దృఢమైన భారత్‌కు ప్రతీకగా ఈ కాస్ట్యూమ్‌ను డిజైన్ చేసినట్లు డిజైనర్ నిధి యశా తెలిపింది. ప్రస్తుతం శ్వేతా శార్దా లేటెస్ట్ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by Miss Diva (@missdivaorg) ఎవరీ శ్వేతా శార్దా? చండీగఢ్‌కు చెందిన 23 ఏళ్ల శ్వేతా శార్దా ప్రతిష్టాత్మక మిస్ యూనివర్స్ అందాల పోటీలో ఈ ఏడాది భారత్ తరపున ప్రాతినిధ్యం వహిస్తోంది. 16 ఏళ్ల వయసులో తన తల్లితో కలిసి ముంబై చేరిన శ్వేత చిన్నతనంలోనే డ్యాన్స్‌పై మక్కువ ఏర్పరుచుకుంది. ఇప్పటివరకు ‘డ్యాన్స్ ఇండియా డ్యాన్స్’, ‘డ్యాన్స్ దీవానే’ వంటి పలు రియాలిటీ షోల్లో ఆమె పాల్గొంది. ఫెమినా మిస్ ఇండియా గ్రూప్‌లో భాగమైన ‘మిస్ దివా యూనివర్స్-2023’ కిరీటాన్ని సొంతం చేసుకుంది. మరి మిస్ యూనివర్స్‌గా సత్తా చాటుతుందా అన్నది చూడాల్సి ఉంది. భారత్ నుంచి చివరగా 2021లో హర్నాజ్ సంధు మిస్ యూనివర్స్‌గా గెలుపొందిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Miss Diva (@missdivaorg) -
Aishwarya Rai Birthday : నీలి కళ్ల సుందరి ఐశ్వర్య రాయ్ 50వ పుట్టినరోజు.. ప్రత్యేకమైన ఫోటోలు
-
ఎవరూ ఊహించలేని టార్గెట్ వైపు అడుగులేస్తున్న 'సితార'
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు గారాల పట్టి సితార. కాదు.. కాదు.. 'సితార ఘట్టమనేని' అని చెప్పుకునే స్థాయికి చేరుకుంది. మొదట ప్రిన్స్ మహేష్ బాబు ఫేమ్‌తో గుర్తింపు దక్కినా తర్వాత తన టాలెంట్‌తో సపరేట్ ఫ్యాన్ బేస్‌నే క్రియేట్ చేసుకునే స్థాయికి చేరుకుంది. సితార శాస్త్రీయ నృత్యం నేర్చుకుంది. దీంతో సోషల్ మీడియాలో డ్యాన్స్ వీడియోలతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. గతంలో సినీ సెలబ్రిటీలను కూడా ఇంటర్వ్యూ చేసింది. అంతే కాకుండా ఇటీవలే ఓ ప్రముఖ జ్యూయెలరీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా సైన్ చేసి.. ఆ సంస్థ నుంచి ఒక హీరోయిన్ అందకునేంత రెమ్యునరేషన్ తీసుకుంది. అంటే సుమారు కోటి రూపాయలకు పైగానే అని చెప్పవచ్చు. (ఇదీ చదవండి: Sitara Ad Remuneration: చిన్న యాడ్.. కళ్లుచెదిరే మొత్తం ఇచ్చారు!) గతంలో తన గురించి మహేష్ ఇలా అన్నారు. 'సితార ఎప్పుడో సూపర్ స్టార్ అయిపోయింది. తను ఇంగ్లీష్,తెలుగు చాలా చక్కగ మాట్లాడుతుంది. ముఖ్యంగా తను మాట్లాడేటప్పుడు అమెరికన్ యాక్సెంట్ ఉంటుంది. కానీ అలా మాట్లాడాలని మేము ఎప్పుడూ చెప్పలేదు. తనకు సొంతంగా వచ్చింది.' అని చెప్పారు. సితార ఇంత వరకు ఎలాంటి సినిమాలు తీయలేదు. యూట్యూబ్,ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రమే తను కనిపిస్తుంది. అక్కడ కూడా తనకు మిలియన్ల కొద్ది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే సితార ఒక స్టార్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం వెనుక ఆమె తల్లి నమ్రతా కృషి ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. అమెకు డ్యాన్స్,యాక్టింగ్‌లో హావ భావాలు పలికించడంలో రాటుతేలేందకు శిక్షణ ఇప్పించింది. ఈ విధంగా చాలా విషయాల్లో సితార మీద చిన్నప్పటి నుంచే ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది నమ్రత. దీంతో ఆమె ఒక స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుంది. (ఇదీ చదవండి: ప్రభాస్ 'ప్రాజెక్ట్-కె' నుంచి బిగ్ అనౌన్స్మెంట్..!) తాజాగా సినీ ఇండస్ట్రీ నుంచే కాకుండా మహేష్ బాబు అభిమానుల్లో సితార గురించి ఒక వార్త ప్రచారం జరుగుతుంది. సితారని 'మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్' పోటీలకు నమ్రత సిద్ధం చేస్తోంది అని... ఆపై సితారను హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలో పరిచయం చెయ్యాలని అనుకుంటున్నారట.. ఇప్పుడు ఈ వార్త బాగా వైరల్ అవుతుంది. అయితే సితారకి ఇంకా పదకొండేళ్లే.. మిస్ యూనివర్స్ పోటీలలో పాల్గొనాలంటే ఇంకా సుమారుగా ఆరేళ్లు ఉండాల్సిందే. మరీ ఇప్పటి నుంచే ఎందుకంటారా? అలాంటి పోటీలకు శిక్షణ చాలా ముఖ్యం. అక్కడ రానించాలంటే లాంగ్ టర్మ్ తర్ఫీదు తప్పదు. ఈ శిక్షణల వల్లే తను బాలీవుడ్ టాప్ హీరోల పిల్లలను కూడా దాటేసి తనకంటు మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఈ యాడ్ రిలీజ్ అయ్యాక ఆమె మరింత పాపులర్ అవడం ఖాయం. ఒక రకంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సితార ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు సాగడం ఖాయం అని మహేష్ ఫ్యాన్స్ అంటున్నారు. View this post on Instagram A post shared by sitara 🍓 (@sitaraghattamaneni) (ఇదీ చదవండి: 'రంగబలి' సినిమా రివ్యూ) -
ప్రపంచ సుందరి కిరీటం ఈసారి అగ్రరాజ్యం సొంతం
-
మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకున్న అమెరికా సుందరి
మిస్ యూనివర్స్ కిరీటాన్ని ఈసారి అగ్రరాజ్యం సొంతం చేసుకుంది. అమెరికాకు చెందిన ఆర్‌బోనీ గాబ్రియల్ మిస్ యూనివర్స్ 2022 విజేతగా నిలిచింది. విన్నర్ గాబ్రియల్‌కు భారత్‌కు చెందిన మాజీ విశ్వ సుందరి హర్నాజ్ సంధు ఈ కిరీటాన్ని బహుకరించి శుభాకాంక్షలు తెలిపారు. కాగా గడిచిన పదేళ్లలో యూఎస్ఏకు ఇది తొలి విజయం. ఇప్పటి వరకు తొమ్మిది విశ్వసుందరి టైటిళ్లను దక్కించుకోగా.. పోటీ చరిత్రలో అత్యధిక సార్లు గెలిచిన దేశంగా యూఎస్ఏ రికార్డు సృష్టించింది. ఇక మిస్ వెనిజులా ఆమంద డుడామెల్ తొలి రన్నరప్‌గా నిలవగా.. మిస్ డొమిన్‌కన్ రిపబ్లిక్ ఆండ్రీనా మార్టినెజ్ రెండో రన్నరప్‌గా నిలిచింది. భారత్ తరపున ప్రాతినిథ్యం వహించిన మిస్ ఇండియా దివిట రాయ్ టాప్ 5లో సైతం చోటు దక్కించుకోలేకపోయింది. కేవలం టాప్ 16లో చోటు దక్కించుకొని సరిపెట్టుకుంది. అమెరికా లూసియానాలో వైభవంగా జరిగిన ఈ పోటీలో దాదాపు 80కుపైగా చెందిన అందాల భామలు పోటీ పడ్డారు. The new Miss Universe is USA!!! #MISSUNIVERSE pic.twitter.com/7vryvLV92Y — Miss Universe (@MissUniverse) January 15, 2023 మరోవైపు 2021 మిస్ యూనివర్స్ హర్నాజ్ సంధు చివరి సారిగా వేదికపై ర్యాంప్ వాక్ చేశారు. హర్నాజ్ ర్యాంప్ మీదకు వస్తుండగా పోటీదారులందరూ చప్పట్లతో ఉత్సహంగా ఆమెకు గ్రాండ్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె భావోద్వేగానికి లోనయ్యింది. వేదికపై నడుస్తూ కంటి నుండి వస్తున్న కన్నీళ్లను ఆపుకునేందుకు ప్రయత్నించారు. అనంతరం తన చేతుల మీదుగా కొత్త మిస్ యూనివర్స్‌కు కిరిటాన్ని అందించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేగాక విశ్వ సుందరి స్టేజ్‌పై హర్నాజ్ రెండు డిఫరెంట్ గౌన్లతో మెరిసిపోయారు. కాగా ఆమె ధరించిన స్పెషల్ గౌనుపై 1994 లో మిస్ యూనివర్స్‌గా గెలిచిన సుష్మితా సేన్ ఫోటో ఉండటం విశేషం.. కాగా హర్నాజ్ సంధు దాదాపు 21 ఏళ్ల తర్వాత భారత్‌కు మిస్ యూనివర్స్ టైటిల్‌ను అందించిన విషయం తెలిసందే. తన కంటే ముందు 1994లో సుష్మితా సేన్.. 2000 సంవత్సరంలో లారా దత్తా ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు. Hold back tears as @HarnaazKaur takes the stage one last time as Miss Universe! #MISSUNIVERSE pic.twitter.com/L0PrH0rzYw — Miss Universe (@MissUniverse) January 15, 2023