ఈ ఏడాది మిస్ యూనివర్స్ ఇండియా 2024 కిరీటాన్ని గుజరాత్‌కి చెందిన రియా సింఘా దక్కించుకుంది. రాజస్థాన్‌లోని జైపూర్ వేదికగా జరిగిన గ్రాండ్ ఫినాలేలో రియా సింఘా విజయకేతనం ఎగరువేశారు. ఫైనల్లో మొత్తం 51 మందితో పోటిపడి ఈ కిరీటాన్ని సొంతం చేసుకుంది రియా. 2015లో మిస్ యూనివర్స్ ఇండియాగా కిరీటాన్ని దక్కించుకున్న ఊర్వశి రౌతేలా ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా వ్యవహరించడం విశేషం.
ఊర్వసి చేతుల మీదుగానే 'తాజ్ మహల్ కిరీటం' పొందింది రియా. ఈ సందర్భంగా ఊర్వశీ మాట్లాడుతూ..ఆమె ఈ ఏడాది మిస్ యూనివర్స్ ఇండియాగా రియా కిరీటాన్ని గెలుపొందడం ఆనందంగా ఉంది. అంతేగాదు ఈ ఏడాది చివర్లో జరిగి ప్రపంచ మిస్ యూనివర్స్ 2024 పోటీల్లో భారత్‌కు రియా ప్రాతినిధ్యం వహించనుంది. ఆ పోటీల్లో కూడా రియానే గెలవాలని ఆశిస్తున్నా. ఈ పోటీలో అమ్మాయిలంతా కూడా చాలా అంకితభావంతో కష్టపడారని అన్నారు ఊర్వశి.
ఇక టైటిల్ విజేత రియా మాట్లాడుతూ.. ఈ మిస్ యూనివర్స్ ఇండియా 2024 టైటిల్‌ను గెలుపొందినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ టైటిల్ దక్కించుకునేందుకు తాను అన్ని విధాల తగినదాన్ని అని ఆత్మవిశ్వాసంగా చెప్పింది. అలాగే తాను మునుపటి విజేతల నుంచి ఎంతో స్ఫూర్తి పొందానని సగర్వంగా చెప్పుకొచ్చింది రియా.
ఇదిలా ఉండగా, రియా ఫైనల్లో షాంపైన్ గోల్డ్ గౌనులో పుత్తడి బొమ్మలా ధగధగ మెరిసిపోయింది. అందుకు తగ్గట్టు చెవులకు ధరించిన డైమండ్ రింగులు ఆమెకు మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి. కాగా, ఈ అందాల పోటీల్లో గుజరాత్‌కి చెందిన రియా సింఘా 18 ఏళ్ల వయసుకే పాల్గొని అందర్నీ ఆశ్చర్యపరిచింది.
(చదవండి: ఇంత టాలెంటా..! ఓ పక్క నృత్యం..మరోవైపు..!)
Comments
Please login to add a commentAdd a comment