Pageant
-
నేషనల్ అమెరికా మిస్ పోటీల్లో సత్తా చాటిన తెలుగమ్మాయి హన్సిక
హన్సిక నసనల్లి అచ్చమైన తెలుగమ్మాయి. తెలుగు జాతి కీర్తి పతాకాన్ని అమెరికాలో ఎగుర వేశారు. నేషనల్ అమెరికా మిస్ పోటీల్లో విజేతగా నిలిచారు. జూనియర్ టీన్ కేటగిరీల్లో జరిగిన ఈ పోటీల్లో అమెరికాలోని 50 స్టేట్స్ నుంచి 118 మంది పోటీ పడ్డారు. ఈ పోటీల్లో ఆమె నేషనల్ అమెరికన్ మిస్ జూనియర్ టీన్ విజేతగా నిలిచారు.ఇవే కాకుండా హన్సిక గత రెండు సంవత్సరాలుగా యూఎస్ఏ నేషనల్ లెవెల్ యాక్ట్రెస్ పోటీల్లో గెలిచారు. అకడమిక్ అచీవ్మెంట్ విన్నర్ అవార్డుని కూడా కైవసం చేసుకున్నారు. క్యాజువల్ వేర్ మోడల్ విన్నర్ కిరీటాన్ని కూడా సొంతం చేసుకున్నారు. అతి చిన్న వయసులోనే భరతనాట్యాన్ని నేర్చుకుని అరంగేట్రం చేసి అందరినీ ఆకట్టుకున్నారు.ఆరేళ్ల నుంచి ఈ పోటీల్లో పాల్గొంటూ గత నాలుగు సార్లు విజేతగా నిలిచారు. నేషనల్ అమెరికన్ మిస్, ఇంటర్నేషనల్ జూనియర్ మిస్, ఇంటర్నేషనల్ యూనైటెడ్ మిస్, యూఎస్ఏ ఇండియన్ మిస్ పెజంట్ పోటీల్లో గెలిచి సత్తా చాటారు. హన్సిక స్వస్థలం వనపర్తి. తండ్రి శేఖర్. తల్లి ప్రశాంతిని ప్రముఖ భరత నాట్య కళాకారిణి, నటి. కన్నడ, తెలుగులో నటించి గుర్తింపు తెచ్చుకున్న ప్రమోదిని అక్క కూతురు హన్సిక.మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ కిరీటాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా తన ప్రయాణాన్ని సాగిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. చదువులో ఉన్నతస్థాయిలో రాణిస్తూ బ్రౌన్ యూనివర్సీటీ లేదా హార్వార్డ్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో మెడిసిన్ చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. View this post on Instagram A post shared by Hansika Nasanally (@hansika_pageant) (చదవండి: 12th ఫెయిల్ హీరో విక్రాంత్ షాకింగ్ నిర్ణయం.. సరైనదే అంటున్న నిపుణులు!) -
మిసెస్ ఆసియాకు భారత్ తరపున మన హైదరాబాదీ..!
ప్రఖ్యాత క్లాసిక్ మిసెస్ ఆసియా ఇంటర్నేషల్ పేజెంట్ 2024లో భారత్ తరపున తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరానికి చెందిన ప్రముఖ విద్యావేత్త డాక్టర్ ఏ విజయ శారదా రెడ్డి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక పోటీ ఈ నెల 13 నుంచి 19 వరకూ థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో జరగనుంది. ఈ ఏడాది మిసెస్ ఇండియా టైటిల్‌ను కైవసం చేసుకున్న విజయ గతేడాది మిసెస్ ఇండియా– తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ టైటిల్‌ను సూపర్ క్లాసిక్ కేటగిరిలో సొంతం చేసుకోవడంతో జాతీయ వేదికపై తనదైన ముద్ర వేశారు. తాజాగా అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించడం ఆమె అసాధారణ ప్రతిభ, మహిళలను ప్రేరేపించే కృషికి సాక్ష్యంగా నిలుస్తోంది. ఎన్నో రంగాల్లో విజయకేతాలను ఎగురవేసిన విజయ రెండు సార్లు గిన్నిస్ వరల్డ్ రికార్డులు పొందడమే కాకుండా విద్య, వ్యాపార రంగాల్లో ఆమె చేసిన కృషికి జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వరించాయి. ఈ నేపథ్యంలో మిసెస్ ఆసియా ఇంటర్నేషనల్ పేజెంట్ 2024లో ఆమె పాల్గొనడం దేశానికే గర్వకారణంగా పేర్కొనవచ్చు. అందం, విజ్ఞానంలో ఉన్నత శిఖరాలు అధిరోహించారు. ఈ కాంటెస్టులో ఆసియా ఖండంలోని వివిధ దేశాలకు చెందిన వారు తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు. (చదవండి: శీతాకాలంలో గుండె ఆరోగ్యం కోసం తీసుకోవాల్సినవి..!) -
మిస్ యూనివర్స్ ఇండియా 2024గా రియా సింఘా! 'తాజ్ మహల్ కిరీటం"..!
ఈ ఏడాది మిస్ యూనివర్స్ ఇండియా 2024 కిరీటాన్ని గుజరాత్‌కి చెందిన రియా సింఘా దక్కించుకుంది. రాజస్థాన్‌లోని జైపూర్ వేదికగా జరిగిన గ్రాండ్ ఫినాలేలో రియా సింఘా విజయకేతనం ఎగరువేశారు. ఫైనల్లో మొత్తం 51 మందితో పోటిపడి ఈ కిరీటాన్ని సొంతం చేసుకుంది రియా. 2015లో మిస్ యూనివర్స్ ఇండియాగా కిరీటాన్ని దక్కించుకున్న ఊర్వశి రౌతేలా ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా వ్యవహరించడం విశేషం. ఊర్వసి చేతుల మీదుగానే 'తాజ్ మహల్ కిరీటం' పొందింది రియా. ఈ సందర్భంగా ఊర్వశీ మాట్లాడుతూ..ఆమె ఈ ఏడాది మిస్ యూనివర్స్ ఇండియాగా రియా కిరీటాన్ని గెలుపొందడం ఆనందంగా ఉంది. అంతేగాదు ఈ ఏడాది చివర్లో జరిగి ప్రపంచ మిస్ యూనివర్స్ 2024 పోటీల్లో భారత్‌కు రియా ప్రాతినిధ్యం వహించనుంది. ఆ పోటీల్లో కూడా రియానే గెలవాలని ఆశిస్తున్నా. ఈ పోటీలో అమ్మాయిలంతా కూడా చాలా అంకితభావంతో కష్టపడారని అన్నారు ఊర్వశి. ఇక టైటిల్ విజేత రియా మాట్లాడుతూ.. ఈ మిస్ యూనివర్స్ ఇండియా 2024 టైటిల్‌ను గెలుపొందినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ టైటిల్ దక్కించుకునేందుకు తాను అన్ని విధాల తగినదాన్ని అని ఆత్మవిశ్వాసంగా చెప్పింది. అలాగే తాను మునుపటి విజేతల నుంచి ఎంతో స్ఫూర్తి పొందానని సగర్వంగా చెప్పుకొచ్చింది రియా. ఇదిలా ఉండగా, రియా ఫైనల్లో షాంపైన్ గోల్డ్ గౌనులో పుత్తడి బొమ్మలా ధగధగ మెరిసిపోయింది. అందుకు తగ్గట్టు చెవులకు ధరించిన డైమండ్ రింగులు ఆమెకు మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి. కాగా, ఈ అందాల పోటీల్లో గుజరాత్‌కి చెందిన రియా సింఘా 18 ఏళ్ల వయసుకే పాల్గొని అందర్నీ ఆశ్చర్యపరిచింది. View this post on Instagram A post shared by Miss Universe India (@missuniverseindiaorg) (చదవండి: ఇంత టాలెంటా..! ఓ పక్క నృత్యం..మరోవైపు..!) -
మిస్ సుప్రానేషనల్ 2024 టైటిల్‌ని దక్కించుకున్న ఇండోనేషియా బ్యూటీ!
మిస్ సుప్రానేషనల్ 2024 అందాల పోటీలు పోలాండ్లోని మలోపోల్స్కాలో జరిగాయి. ఆ పోటీల్లో భారతదేశానికి చెందిన సోనాల్ కుక్రేజాతో సహా సుమారు 68 దేశాలకు చెందిన అందాల భామలు పాల్గొన్నారు. ఈ పోటీల్లో సోనాల్ 12వ స్థానంలో నిలిచింది. ఢిల్లీలోని జైపూర్‌లో జన్మించిన సోనాల్ యూఎస్ఏలోని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీలో మార్కెటింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్‌ను అభ్యసించింది. అంతేగాదు కొత్త క్రిప్టో సేవలతో భారతదేశ ఆర్థిక ప్రపంచాన్ని మార్చే ఒక స్టార్టప్ యునికాన్ వ్యవస్థాపకురాలు కూడా. మహిళల సామాజిక నిబంధనలను ఉల్లంఘించి ఆర్థికంగా స్వతంత్రంగా మారాలిని ఆమె కోరుకుంటోంది. అంతేగాదు ఆమె గతంలో లైవా మిస్ దివా సుప్రానేషనల్ 2023 టైటిల్‌ను కూడా గెలుచుకుంది. ఇక ఈ మిస్ సుప్రానేషనల్ 2024 టైటిల్‌ని ఇండోనేషియాకు చెందిన హరాష్ట హైఫా జహ్రా సొంతం చేసుకుంది. ఆమె ఇండోనేషియా ఎంట్రెప్రెన్యూర్, మోడల్, అందాల రాణి. ఆమె గతంలో పుటేరి ఇండోనేషియా 2024 కిరీటాన్ని పొందింది. ఆమె పర్యావరణ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ డిగ్రీని కూడా పూర్తి చేసింది. కాగా, ఈ అందాల పోటీల జాబితాలో ఫిన్లాండ్కు చెందిన అలెగ్జాండ్రా హన్నుసారి, థాయ్‌లాండ్‌కు చెందిన కసామా సూట్రాంగ్, ప్యూర్టో రికోకు చెందిన ఫియోరెల్లా మదీనా, ఫిలిప్పీన్స్‌కు చెందిన అలెథియా అంబ్రోసియో, దక్షిణాఫ్రికాకు చెందిన బ్రయోనీ గోవెండర్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందిన జెన్నా డైక్స్ట్రా, డెన్మార్క్ లార్సెన్‌కు చెందిన విక్టోరియా లార్సెన్ ఈ జాబితాలో చోటు సంపాదించారు. View this post on Instagram A post shared by Miss Diva (@missdivaorg) (చదవండి: కరణ్ జోహార్ ఫేస్ చేసిన బాడీ డిస్మోర్ఫియా అంటే..?ఎందువల్ల వస్తుంది?) -
మిస్ ఏఐ అందాల పోటీలో టాప్ 10 ఫైనలిస్ట్‌గా జరా శతావరి!
ప్రపంచంలోనే తొలిసారి ఏఐతో రూపొందించిన మోడల్‌ల కోసం అందాల పోటీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ అందాల పోటీల్లో టాప్ టెన్ ఫైనలిస్ట్‌గా భారతదేశానికి చెందిన జరా శతావరి నిలిచారు. ఆమె పీసీఓఎస్ , డిప్రెషణ యోధురాలు. ప్రపంచంలోనే తొలిసారిగా జరుగుతున్న వర్చ్యువల్ హ్యుమన్ అందాల పోటీల్లో పాల్గొన్న దాదాపు 1500 మంది అభ్యర్థులో భారతకి ప్రాతినిధ్యం వహిస్తున్న శతావరి ఎంపక కావడం విశేషం. అయితే ఈ పోటీల్లో అందం, సాంకేతికత, సోషల్ మీడియా ప్రభావం ఆధారంగా ఈ నెలాఖరులోగా విజేతలను నిర్ణయించడం జరుగుతుంది. ఇంతకీ ఎవరీమె అంటే..ఎవరీ జరా శతావరి.?ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు ఏడువేల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. జరాకి భోజనం, ట్రావెలింగ్ అంటే మహా ఇష్టం. ప్రజలను ఆరోగ్యం, వృత్తి, అభివృద్ధి, ఫ్యాషన్ పరంగా మంచి జీవితాన్ని గడిపేలా శక్తిమంతం చేయడం ఆమె లక్ష్యం. ఇక ఆమె వర్చువల్ ప్రయాణంలో జూన్ 2023 నుంచి పీఎంహెచ్ బయోకేర్కి బ్రాండ్ అంబాసిడర్" ఉంది. అలాగే ఆగస్టు 2024లో డిజిమోజో ఈ సర్వీస్ ఎల్ఎల్పీలో ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ టాలెంట్ మేనేజర్‌గా చేరింది.అంతేగాదు ఆమె 13 రంగాల్లో నైపుణ్యం కలిగి ఉంది. వ్యూహాత్మక ప్లానింగ్‌లో, కంటెంట్ అభివృద్ధి, డేటా విశ్లేషణ, బ్రాండ్ అవగాహన, బ్రాండ్ అడ్వకేసీ, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, సృజనాత్మక ఆలోచన, ఆరోగ్యం అండ్ సంరక్షణ కౌన్సిలింగ్, ఫ్యాషన్ స్టైలింగ్ అండ్ కెరీర్ డెవలప్మెంట్ గైడెన్స్లలో మంచి నైపుణ్యం ఉంది ఆమెకు. తనని తాను డిజిటల్ మీడియా మావెన్గా అభివర్ణించే రాహుల్ చౌదరి మిస్ ఏఐ అందాల పోటీల్లో శతావరి టాప్ 10లో ఉందని ప్రకటించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. దాదాపు 1500 మంది పాల్గొనే ఈ పోటీల్లో ఆమెకు టాప్ 10లో చోటు దక్కడం విశేషం అని చెప్పారు. అంతేగాదు ఇన్ఫ్లుయెన్సర్ కమ్యూనిటీకి ఆమె చేసిన అత్యుత్తమ సహకారానికి నిదర్శనమే ఫ్యాన్‌వ్యూ వరల్డ్ ఏఐ క్రియేటర్స్ అవార్డ్స్ ద్వారా వచ్చే ఈ గుర్తింపు అని రాహుల్ ప్రశంసించారు కూడా. ఈ ప్రపంచ వేదికపై ఆమె భారతదేశానికి, ఆసియాకి ప్రాతినిధ్యం వహించడం నిజంగా చాలా గొప్ప గౌరవం అని అన్నారు. అలాగే ఆసియా నుంచి పాల్గొన్ని ఇద్దరిలో శతావరి భారత నుంచి ఎంపికైన ఏకైక ఫైనలిస్ట్ కావడం విశేషం అన్నారు బ . కాగా, ఈ మిస్ ఏఐ తొలి మూడు విజేతల నగదు మొత్తం రూ. 16 లక్షలకు పైనే ఉంటుందట. అలాగే మిస్ ఏఐ క్రియేటర్ రూ. 4 లక్షల నగుదు బహుమితి అందుకోగా, ఏఐ మెంటర్ షిప్ ప్రోగ్రామ్‌లు, పీఆర్ సేవలకు మరిన్ని నగదు బహుమతులు పొందే అవకాశం ఉందని సమాచారం. (చదవండి: -
Sushmita Sen Throwback Photos: అందానికి పట్టాభిషేకం.. మిస్ యూనివర్స్‌గా 'సుస్మితా సేన్' 30 ఏళ్ల నాటి ఫోటోలు
-
మిస్ యూనివర్స్ అందాల పోటీల్లో 60 ఏళ్ల వృద్ధురాలు..!
అందాల పోటీల్లో ఎందరో అతిరథ బ్యూటీలు పాల్గొని సత్తా చాటారు. విజేతలుగా గెలిచిన అందాల భామలు అసలైన అందానికి నిర్వచనం ఏంటో తమదైన శైలిలో వివరించి అందర్నీ మంత్ర ముగ్దుల్ని చేశారు. ఐతే ఈ పోటీల్లో పాల్గొనడానికి వయసు పరిమితి ఉండేది. అయితే ఓ నిర్ధిష్ట వయసు తర్వాత మఖ్యంగా మహిళలు తరుచుగా నిర్లక్ష్యానికి అవహేళనకు గురవ్వుతుంటారు. చెప్పాలంటే తల్లిగా మారే పరిణామ క్రమంలో వృధ్యాప్యానికి త్వరితగతిన చేరువయ్యేది మహిళలే. దీంతో వారికి గుర్తింపు ఉండదు సమాజంలో. ఆ తరహా ఆలోచనను మార్చి అందానికి అసలైన నిర్వచనం ఇచ్చేలా ఏకంగా 60 ఏళ్ల వయసులో అందాల పోటీల్లో పాల్గొని చరిత్ర సృష్టించనుంది వృద్ధురాలు. ఇంతకీ ఎవరామె అంటే..అర్జెంటినాలో మేలో మిస్ యూనివర్స్ బ్యూనస్ ఎయిర్స్ 2024 అందాల పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో న్యాయవాది అయిన 60 ఏళ్ల అలెజాండ్రా మారిసో రోడ్రిగ్జ్ పాల్గొని చరిత్ర సృష్టించనుంది. ఆమె గనుక ఈ అర్జెంటినా మిస్ యూనివర్స్ బ్యూనస్ ఎయిర్స్ 2024 టైటిల్ గెలుచుకుంటే 60 ఏళ్ల వయసులో టైటిల్‌ని గెలుచుకున్న తొలి సీనియర్ సిటిజన్‌గా అలెజాండ్రా రికార్డులకెక్కడమే గాక సెప్టెంబర్‌లో జరగనున్న మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొన్న తొలి సీనియర్ సిటిజన్‌గా కూడా చరిత్ర సృష్టిస్తోంది.స. ప్రసుత్తం ఆమె మేలో జరగనున్న అర్జెంటినా మిస్ యూనివర్స్ బ్యూనస్ ఎయిర్స్ 2024 పోటీలకు సన్నద్ధమవుతుంది. ఈ టైటిల్‌ని గెలుచుకుంటే అలెజాండ్రా సెప్టెంబర్‌లో జరగనున్న మిస్ యూనివర్స్ పోటీల్లో అర్జెంటీనా తరుఫునా ప్రాతినిధ్యం వహించనుంది. ఆమె యువ పోటీదారులకు గట్టి పోటీ ఇచ్చేలా అద్భుతమైన దేహధారుడ్యంతోత్తా చాటనుంది. అంతేగాదు అందాల ప్రపంచంలో ఉన్న మూస పద్ధతులను తిప్పికొట్టి అందానికి వయసుతో సంబంధం ఉండదని ప్రూవ్ చేయనుంది. ఆరోగ్యకరమైన జీవన శైలితో వయసుని కనిపించకుండా చేయగలిగే ప్రతి స్త్రీ గొప్ప అందగత్తేనని చెబుతోంది. ఇక అలెజాండ్రా ఆరోగ్యకరమైన అలవాట్ల తోపాటు కఠిన వ్యాయామ నియమావళిని అనుసరిస్తానని తెలిపింది. అవే తనకు ఈ అందాల పోటీల్లో సహకరిస్తాయని ఆత్మవిశ్వాసంగా చెబుతోంది అలెజాండ్రా. అలాగే 18 ఏళ్ల వయసులో ఉన్నట్లు దేహ సౌందర్యం ప్రతిమహిళకు వయసు రీత్యా విభిన్నంగా ఉండొచ్చు గానీ అందంగానే ఉంటారని అంటోంది. ఇక్కడ వయసుని అందానికి కొలమానంగా చూడకూడదని నొక్కి చెబుతోంది. అంతేగాదు సమాజానికి మహిళల అందాన్ని తక్కువ చేసి చూసే అవకాశం ఇవ్వకుండా తమపై శ్రద్ధ వహించేలా సమతుల్యమైన ఆహారపు అలవాట్లపై మహిళలంతా దృష్టి పెట్టాలని చెబుతోంది అలెజాండ్రా.(చదవండి: ట్రోలర్లకు స్ట్రాంగ్ కౌంటరిచ్చిన ప్రాచీ: ఉచితంగా ట్రీట్ చేస్తామన్న వైద్యులు -
భారత్‌లో ‘మిస్ వరల్డ్-2024 ఈవెంట్, 28 ఏళ్ల తర్వాత
అందాల పోటీలకున్న క్రేజే అంతా ఇంతా కాదు. అందులోనూ ప్రపంచ అందగత్తెలంతా పోటా పోటీగా ఒక చోట చేరితే.. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత భారత దేశంలో ఇదే జరగబోతోంది. 71వ ప్రపంచ సుందరి పోటీలకు ఇండియా ఆతిథ్యం ఇవ్వనుంది. 1996 తరువాత మిస్ వరల్డ్ ఈవెంట్ జరగబోతోంది. ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2022 సినీ శెట్టి మిస్ వరల్డ్ 2023కి భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనుంది. ఈవెంట్ నిర్వాహకులు అందించిన సమాచారం ప్రకారం ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 వరకు ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ఈ పోటీలను అట్టహాసంగా నిర్వహించనున్నారు. మార్చి 9న నిర్వహించే ఫైనల్ పోటీలను రాత్రి 7.30 గంటల నుంచి 10.30 గంటల వరకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. . ఫిబ్రవరి 20న న్యూఢిల్లీలోని హోటల్ అశోకాలో ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ITDC) ఆధ్వర్యంలో "ది ఓపెనింగ్ సెర్మనీ" , "ఇండియా వెల్కస్ ది వరల్డ్ గాలా"తో ఈవెంట్ షురూ అవుతుంది. మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఛైర్ పర్సన్, సీఈవో జూలియా మోర్లీ స్వయంగా ఈ విషయాన్ని మిస్ వరల్డ్ అధికారిక పేజీ ట్విటర్ పేజీలో షేర్ చేశారు. మిస్ వరల్డ్‌కు ఆతిథ్యం ఇచ్చే దేశంగా భారతదేశాన్ని ప్రకటించడం గర్వంగా ఉందంటూ హర్షం వ్యక్తం చేశారు. అందం, వైవిధ్యం సాధికారత మేళవింపుగా జరగబోతున్న ఈ అద్భుతమైన ప్రయాణానికి సిద్ధంగా ఉండండి అంటూ ట్వీట్ చేసింది. 2017లో మానుషి చిల్లార్ తర్వాత మరో ఇండియన్, మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకోలేదు. Chairman of Miss World, Julia Morley CBE stated "Excitement fills the air as we proudly announce India as the host country for Miss World. A celebration of beauty, diversity, and empowerment awaits. Get ready for a spectacular journey! 🇮🇳 #MissWorldIndia #BeautyWithAPurpose — Miss World (@MissWorldLtd) January 19, 2024 అందాల రాణులుగా నిలిచిన భారతీయ భామలు ఎవరో తెలుసా? రీటా ఫరియా - 1966 ఐశ్వర్యా రాయ్ - 1994 డయానా హేడెన్ - 1997 యుక్తా ముఖి - 1999 ప్రియాంకా చోప్రా - 2000 మానుషి చిల్లార్ - 2017 -
పొడవాటి జుట్టు లేదు.. అయినా మిస్ ఫ్రాన్స్‌గా కిరీటం..!
ఫ్రాన్స్ అందాల పోటోల్లో జడ్జీలు విభిన్నమైన దానికి ప్రాధాన్యత ఇస్తు జడ్జిమెంట్ ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అందాల పోటీకి అసలైన నిర్వచనం ఏంటో క్లియర్‌గా చెప్పారు. ఓ మహిళ నీకు సరిలెవ్వరూ. ప్రతి స్త్రీ అందంగా విభిన్నంగా ఉంటుంది. ఎవరీ అందం వారిదే. స్త్రీల అందాన్ని ఎవరూ డిక్టేట్ చేయకూడదనే ఉద్దేశ్యంతో పొడవాటి కురులు లేకపోయినా మగవాళ్ల మాదిరిగా జుట్టు ఉన్న అమ్మాయిని ఎంపిక చేసి ఆశ్చర్యపరచడమే గాక పలువురు విమర్శులు అందుకున్నారు. ఈ మేరకు నార్డ్ పాస్ డి కైలస్కు చెందిన 20 ఏళ్ల గిల్లెస్ మిస్ ఫ్రాన్స్‌గా కిరీటాని దక్కించుకుంది. దీంతో 103 ఏళ్ల ఫ్రాన్స్ అందాల పోటీల చరిత్రలో పొడవాటి జుట్టు లేని మహిళగా గిల్లెస్ నిలిచింది. పిక్సీ కట్ ఉన్న గిల్లెస్ని విజేతగా ప్రకటించడం గురించి మీడియా ప్రశ్నించగా.. ఇంతవరకు పొడవాటి జుట్టుతో అందమైన మిస్లనే చూడటం అలవాటు చేసుకున్నాం కానీ పొట్టి జుట్టుతో ఆండ్రోజినస్ లుక్‌ని ఎంచుకోవాలని నిర్ణయిచామని ఈ పోటీకి జడ్జీలుగా వ్యవహరించినవారు అన్నారు. ప్రతి స్త్రీ విభిన్నంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఓ ప్రత్యేకం. ఎవర్నీ డిక్టేట్ చేయలేమని చెప్పేందుకే ఆమెను సెలక్ట్ చేశామని అన్నారు. మిస్ యూనివర్స్ లేదా ఫ్రాన్స్ కావడానికి ప్రత్యేకమైన అర్హత అంటూ దేన్ని పరిగణలోనికి తీసుకోం. వేదికపైకి వచ్చే ప్రతి రూపాన్ని స్వీకరిస్తాం, వారిలోని ఆత్మవిశ్వాసాన్ని బేరీజు వేసి ఎన్నిక చేస్తామని అందాల పోటీల నిర్వాహకులు చెబుతున్నారు. ఈ మేరకు కిరీటాన్ని దక్కించుకున్న గిల్లిస్ మాట్లాడుతూ..నేను బలమైన మహిళగా ఉండాలనుకుంటున్నాను. మహిళలు విభిన్నమైవారిని చూపాలనుకున్నాను. ఇక్కడ నా జుట్టు ప్రత్యేకం కాదు. నేను జీవితాన్ని ఇవ్వడం లేదా శ్వాసించడం లేదా జీవించడం వల్లే తాను ప్రత్యేకమని చెబుతోంది గిల్లేస్. కాగా, మిస్ఫ్రాన్స్ ఫైనల్‌కి ఏడుగురు మహిళలు రాగా ప్రజల ఓటు తోపాటు న్యాయనిర్ణేతల నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకుని విజేతలను ప్రకటించడం జరుగుతుంది. నిజానికి మిస్ ఫ్రాన్ కిరీటం దక్కించుకున్న గిల్లెస్ మూడో స్థానంలో ఉన్నప్పటికీ జ్యూరీ(జడ్జీల)ఓటు కారణంగా అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాది మిస్ ఫ్రాన్ పోటీల్లో ఎక్కు వైవిధ్యాన్ని అనుమతించింది. అలాగే ఇకపై పోటీల్లో వయోపరిమితి లేదు, వివాహమైన, పిల్లలు ఉన్నా, టాటుల ఉన్నా కూడా పాల్గొనవచ్చునని నిర్వాహకులు పేర్కొన్నారు. (చదవండి: డయానా ధరించిన డ్రెస్ ధర ఏకంగా రూ. 9 కోట్లు! మరోసారి రికార్డు స్థాయిలో..) -
మిస్‌వరల్డ్ పోటీలకు వేదికగా భారత్.. ఎంపిక జరుగుతుందిలా..
న్యూఢిల్లీ: ఈ ఏడాది జరగనున్న ప్రపంచ సుందరి ఎంపిక పోటీలకు భారత దేశం వేదికగా నిలవనుంది. ఈ మేరకు గురువారం ఢిల్లీలో జరిగిన ఓ మీడియా సమావేశంలో మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్, సీఈవో జూలియా మోర్గే ప్రకటన చేశారు. అప్పుడెప్పుడో 1996లో.. ప్రపంచంలోని అందగత్తెలంతా ఒకచోట చేరి తమ అందచందాలతో హొయలొలికిస్తూ, తెలివితేటలను ఇనుమడింపజేస్తూ ఆయా దేశాల కీర్తి పతాకాలను రెపరెపలాడించే భిన్నమైన వేదిక. అయితే ఈసారి జరగబోయే పోటీలకు వేదికగా నిలవనుంది భారత దేశం. గతంలో 1996లో ప్రపంచ సుందరి పోటీలకు వేదికగ నిలిచిన భారత్ సరిగ్గా 27 సంవత్సరాల తర్వాత మరోసారి ఈ పోటీలకు ఆతిధ్యమివ్వనుంది. ఈ పోటీల్లో మిస్ ఇండియా వరల్డ్ సినీ శెట్టి భారత దేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఇదే విషయాన్ని ఢిల్లీ మీడియా సమావేశంలో స్పష్టం చేశారు మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఛైర్ పర్సన్, సీఈవో జూలియా మోర్లే. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఈసారి పోటీలను భారతదేశంలో నిర్వహించడం చాలా సంతోషకరం. నవంబర్ నెలలో జరగబోయే 71వ ప్రపంచ సుందరి పోటీలకు సంబంధించిన వేదికతో పాటు తేదీ వివరాలు ఇంకా ఖరారు కావాల్సి ఉంది. మొతం 130 దేశాలకు చెందిన సుందరీమణులు ఈ పోటీల్లో పాల్గొననున్నారని తెలిపారు. పోటీల్లో భాగంగా సుందరీమణులు ప్రతిభా పాటవాలు, సేవాతత్వ దృక్పధం, క్రీడా ప్రతిభ తోపాటు ఇతర అంశాల్లో కూడా రౌండ్లవారీగా పోటీ పడతారు. మిస్ వరల్డ్ గా ఎంపికయ్యే సుందరీమణి మార్పునకు రాయబారిగా వ్యవహరించనున్నారు కాబట్టి ఈ అంశాలన్నిటినీ స్పృశించి ప్రపంచ సుందరిని ఎంపిక చేయడం జరుగుతుందని అన్నారు జూలియా. ఈ కార్యక్రమంలో 2022 ప్రపంచ సుందరి కరోలినా బియెలావ్ స్కా కూడా పాల్గొని.. నా చేతులతో నా వారసురాలికి ఈ కిరీటం ధరింపజేయడానికి ఎదురుచూస్తున్నానని సాంప్రదాయానికి ప్రతిరూపమైన భారత్‌లో ఈ పోటీలు జరగడం సంతోషంగా ఉందన్నారు. ఇది కూడా చదవండి: భారత విద్యార్థులకు భరోసానిచ్చిన కెనడా ప్రధాని -
అందాల పోటీల్లో భార్య ఓటమి.. కోపంతో భర్త ఏం చేశాడంటే..
బ్రెజిల్ దేశంలో జరిగిన ఓ అందాల పోటీల్లో తన భార్యని కాకుండా వేరే యువతిని విజేతగా ప్రకటించడంతో కోపోద్రిక్తుడైన ఆమె భర్త ఒక్క ఉదుటున డయాస్ మీదకు దూకి విజేతకు ధరింపజేసే అందాల కిరీటాన్ని లాక్కుని నేలకేసి బలంగా విసిరికొట్టాడు. అందాల భామ నెత్తిన వయ్యారంగా ఒదిగిపోవాల్సిన ఆ కిరీటం కాస్తా ముక్కలు ముక్కలైపోయింది. వివరాల్లోకి వెళ్తే... బ్రెజిల్లో ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మిస్ గే మాటో గ్రోసో అందాల పోటీని ఈ ఏడాది కూడా నిర్వహించారు. చాలామంది అందగత్తెలు ఈ పోటీల్లో హొయలొలికించారు. రౌండ్ల వారీగా పోటీదారులను జల్లెడ పట్టగా, విజేతను ప్రకటించే సమయానికి పోటీలో చివరికి నథాలీ బెకర్, ఇమాన్యులీ బెలి అనే ఇద్దరు మాత్రమే మిగిలారు. ఈ క్రమంలో విజేతను ప్రకటించే సమయంలో వీరిద్దరిని ఎదురెదురుగా నిలబెట్టి మధ్యలో కిరీటాన్ని చేత్తో పట్టుకుని విజేతకు ధరింపజేసే క్రమంలో న్యాయ నిర్ణేత కొంత డ్రామా నడిపించింది. ఈ వ్యవధిలో తన భార్య నథాలీ బెకర్‌కు కాదని ఇమాన్యులీ బెలినిని విజేతగా ప్రకటించనున్నారని గ్రహించిన భర్త అమాంతం స్టేజి మీదకు దూకేశాడు. విజేతను ప్రకటించే లోపే న్యాయనిర్ణేత చేతుల్లో ఉన్న కిరీటాన్ని బలవంతంగా లాక్కుని నేలకేసి కొట్టాడు. అందరూ చూస్తుండగానే కోపంతో ఊగిపోయిన ఈ అతడు అక్కడితో ఆగకుండా తన భార్య చేయి పట్టుకుని అక్కడి నుండి తీసుకువెళ్లే సాహసం చేశాడు. ఇంకేముంది అక్కడే ఉన్న సెక్యూరిటీ వారు నథాలీ బెకర్ భర్తను పట్టుకుని దేహశుద్ధి చేసి విచారణ చేపట్టారు. నా భార్య ఓటమిని తట్టుకోలేకపోయా.. న్యాయనిర్ణేతలు నిర్ణయం సరైనది కాదని.. తన భార్యే ఈ పోటీల్లో గెలిచిందని, కానీ చివర్లో విజేతను తారుమారు చేస్తున్నారని అనిపించి ఆలా చేశానని నథాలీ బేకర్ భర్త వివరించాడు. అనంతరం ఈ పోటీల నిర్వాహకులు మాట్లాడుతూ.. అందాల పోటీ ముగింపు దశలో ఇలా జరగడం విచారకరమని, తమ నిర్ణయం సరైనదేనని చెప్పి ఇమాన్యులీ బెలినిని మిస్ గే బ్రెజిల్ 2023 విజేతగా ప్రకటించారు. Revolta na final do concurso Miss Brasil Gay 2023. Torcedor arranca coroa da vencedora e joga no chão durante a cerimônia de premiação. pic.twitter.com/rb6duFvAEn — Bruno Guzzo® (@brunoguzzo) May 28, 2023 -
Video: మిస్ శ్రీలంక పోటీల్లో రచ్చ రచ్చ.. కొట్టుకున్న అమ్మాయిలు, అబ్బాయిలు
న్యూయార్క్‌లోని స్టేటన్ ఐల్యాండ్‌లో తొలిసారి జరిగిన మిస్ శ్రీలంక అందాల పోటీల్లో ఘర్షణ చోటుచేసుకుంది. శుక్రవారం పోటీలు ముగిసిన తరువాత ఏర్పాటు చేసిన పార్టీలో పలువురు కొట్టుకున్నారు. దాదాపు 300కుపైగా అతిథులు హాజరైన ఈ కార్యక్రమంలో రెండు గ్రూపులు తగువులాడుకున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయిది. ఇందులో కొంతమంది అబ్బాయిలు, అమ్మాయిలు ఒకరినొకరు నెట్టేసుకోవడం, పిడిగుద్దులు గుద్దుకోవడం కనిపిస్తోంది. Miss Sri Lanka New York after party - video 2 pic.twitter.com/sp94xPe4lK — Under The Coconut Tree (@Toddy_Lad) October 23, 2022 అయితే గొడవకు కారణమేంటనేది మాత్రం స్పష్టంగా తెలియరాలేదు. ఈ గొడవలో కొంత ఫర్నీచర్ కూడా దెబ్బతింది. ఘర్షణకు సంబంధించి పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.అయితే అందాల పోటీలో పాల్గొన్న 14 కంటస్టెట్లు ఎవరూ కూడా ఈ గొడవకు దిగలేదని మిస్ శ్రీలంక పోటీ నిర్వహాకులు పేర్కొన్నారు. కాగా ఈ ఏడాది మిస్ శ్రీలంక న్యూయార్క్ టైటిల్, కిరీటాన్ని ను ఏంజెలియా గుణశేఖర కైవసం చేసుకుంది. చదవండి: Viral Video: కళ్లు చెదిరే ఆవిష్కరణ: కన్నే ఫ్లాష్ లైట్లా వెలుగుతుంది... Miss Sri Lanka New York after party. 🤦♂️🤦♂️🤦♂️🤦♂️🤦♂️👊🤛 pic.twitter.com/VIG09wgSPx — Under The Coconut Tree (@Toddy_Lad) October 23, 2022 దేశానికి అండగా.. అమెరికాలోని స్టేటన్ ఐల్యాండ్‌లో లంకేయులు ఎక్కువగా నివసిస్తుండటం కారణంగా ఈ ప్రాంతాన్ని పోటీలకు వేదికగా ఎంచుకున్నారు నిర్వాహకులు. ఆర్థిక సంక్షోభంలో కూరుకున్న తమ దేశానికి కష్ట సమయంలో నిధులు సేకరించడానికి, సాయం చేయాలన్న ఉద్ధేశ్యంతోనే స్టేట్ ఐలాండ్‌లో ఈ పోటీల కార్యక్రమం నిర్వహించినట్లు వారు తెలిపారు. పోటీ ద్వారా సేకరించిన నిధులను దేశంలోని క్యాన్సర్ ఆసుపత్రికి విరాళంగా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇది కామన్ ఘర్షణకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో లంకేయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రవర్తనతో అమెరికాలో తమ పరువును దిగజార్చుతున్నారని మండిపడుతున్నారు. చూడటానికి అవమానకరంగా ఉందని, దీనికి కారకులైన వారిని శిక్షించాలని కోరుతున్నారు. మరికొందరు.. ‘ప్రతి వేడుకలో ఇలాంటి వివాదాలు సర్వసాధారణం. చిన్న పిల్లల నుంచి పెద్దలు, మహిళలు అందరూ గొడవ పడతారు. అది శ్రీలంక దేశస్థులే కానవసరం లేదు. అయితే ఇది చూడటానికి చాలా ఉత్సాహంగా ఉంది. అని కామెంట్ చేస్తున్నారు. -
మేకప్ లేకుండా.. మిస్ ఇంగ్లాండ్ అందాల పోటీలోకి.. చరిత్రలో తొలిసారి
మామూలుగానే ఆడవాళ్లు అలంకారాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు.. ఇక అందాల పోటీలో పాల్గొనే అతివలైతే మేకప్‌పై మరింత దృష్టి పెడుతుంటారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఏ బ్యూటీ కాంటెస్ట్‌లో అయినా అందానికి మెరుగులు దిద్దుకున్న భామలే కనిపిస్తుంటారు. కానీ లండన్‌కు చెందిన 20 ఏళ్ల మెలీసా రవూఫ్ దశాబ్దాలుగా సాగుతున్న ఈ తంతుకు బ్రేక్ వేసింది. మిస్ ఇంగ్లాండ్ అందాల పోటీలో ఎటువంటి మేకప్ లేకుండా పాల్గొన్న తొలి మహిళగా నిలవడం ద్వారా 94 ఏళ్ల ఈ పోటీ చరిత్రను తిరగరాసింది. తాజాగా ఈ పోటీల ఫైనల్స్ వరకు దూసుకెళ్లింది. వాస్తవానికి 2019లో జరిగిన మిస్ ఇంగ్లాండ్ పోటీలో మేకప్ లేకుండా కంటెస్టెంట్లు పాల్గొనే ఒక రౌండ్‌ను నిర్వాహకులు ఏర్పాటు చేసినప్పటికీ పోటీ ఆసాంతం ఓ యువతి ఇలా మేకప్ లేకుండా పాల్గొనడం ఇదే తొలిసారి. అతివలు అంతఃసౌందర్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని చాటిచెప్పేందుకు.. అడ్వర్టైజర్లు చెప్పే అందం నిర్వచనాలు, కొలమానాలు, ప్రమాణాలను సవాల్ చేసేందుకే మేకప్ లేకుండా ఈ పోటీలో పాల్గొంటున్నట్లు మెలీసా తెలిపింది. ఈ చర్యకుగాను మెలీసాను ప్రపంచవ్యాప్తంగా ప్రశంసిస్తోంది. మిస్ ఇంగ్లాండ్ కిరీటం కోసం అక్టోబర్ 17న జరిగే ఫైనల్స్‌లో మరో 40 మందితో మెలీసా పోటీపడనుంది. -
బాప్రే!...ఒంటెల అందాల పోటీలు.. రూ. 500 కోట్ల ప్రైజ్‌మనీ!!
Camels get disqualified: ఇటివల కాలంలో మంచి శరీరాకృతికోసం సెలబ్రిటీలు, ప్రముఖులు, అందాల పోటీల్లో పాల్లోనేవారు రకరకాల సౌందర్య ఉత్పత్తులను వాడటం గురించి ఉన్నాం. అంతెందుకు మంచి శారీరక ధారుడ్యం కోసం నిషేధిత ఉత్ప్రేరకాలను వాడి కటకటాల పాలైన వాళ్ల గురించి కూడా విని ఉన్నాం. కానీ అచ్చం అదే తరహాలో సౌదీఅరేబియన్ వాసులు జంతువుల అందంగా ఆకర్షణీయంగా ఉండట కోసం నిషేధిత ఉత్ప్రేరకాలను వాడి వాటిని హింసకు గురి చేశారు. (చదవండి: బిపిన్ రావత్‌కి వినూత్న నివాళి!... ఆకు పై ప్రతి రూపం చెక్కి!!) అసలు విషయంలోకెళ్లితే...సౌదీ రాజధాని రియాద్‌కు ఈశాన్యంలో ప్రసిద్ధ కింగ్ అబ్దుల్ అజీజ్ ఒంటెల పండుగ ఏటా నెల రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. అంతే కాదు ఈ ఉత్సవంలో అందాల ఒంటెల పోటీలు నిర్వహించి అందమైన ఒంటెల పెంపకం దారులకు రూ. 500 కోట్లు ప్రైజ్ మనీ ఇచ్చి సత్కరిస్తుంది. అయితే నిర్వాహకులు ఒంటెలను ఆకర్షణీయంగా మార్చడానికి బొటాక్స్ ఇంజెక్షన్లు, ఫేస్ లిఫ్ట్‌లు వంటి ఇతర సౌందర్య సాధనాలను వినియోగించుకూడదనే ఒక నియమం విధించారు. ఈ మేరకు ఒంటెల తలలు, మెడలు, మూపురం, దుస్తులు, వాటి భంగిమల ఆకారాన్ని బట్టి నిర్వహకులు విజేతను నిర్ణయిస్తారు. అయితే ఈ ఏడాది నిర్వహించే ఒంటెల పోటీల్లో మోసపూరిత చర్యలను అరికట్టే నిమిత్తం అత్యధునిక టెక్నాలజీని వినియోగించి ఒంటెలను తనఖీలు చేశారు. దీంతో 40కి పైగా ఒంటెలు ఈ అందాల పోటీకి అనర్హులు అని నిర్వాహకులు ప్రకటించారు. చాలామంది ఒంటెల పెంపకందారులు బొటాక్స్‌తో ఇంజెక్షన్లు ఇచ్చి, వాటి అవయవాలకు రబ్బరు బ్యాండ్లు వేసి శరీర భాగాలను పెంచే ప్రయత్నంలో వాటిని బాగా హింసించినట్లు నిర్వాహకులు గుర్తించి ఆయా ఒంటెలకు అనర్హత వేటు విధించడమే కాక పెంపకందారులకు కఠిన జరిమాన కూడా విధించినున్నట్లు తెలిపారు. (చదవండి: పక్షిలా షి‘కారు’) -
ఏనుగుల అందాల పోటీల్లో అపశ్రుతి
-
వైరల్ : ఏనుగు రంకెలు.. జనం పరుగులు
కొలంబో : బౌద్ధ మతస్తులు శ్రీలంకలో ప్రతియేటా జరుపుకునే ఏనుగుల అందాల పోటీల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. అందంగా ముస్తాబైన ఏనుగుల కవాతు జరుగుతుండగా ఊహించని ఘటన కలకలం రేపింది. ఓ ఏనుగు ఉన్నట్టుండి రంకెలు వేసింది. జనంపైకి లగెత్తింది. ఏనుగు ఉగ్రరూపంతో పోటీలు వీక్షిస్తున్న ప్రజలు, పక్కనే ఉన్న భక్తులు బతుకుజీవుడా అని పరుగులు పెట్టారు. ఈ క్రమంలో చేతికి చిక్కిన వారందరినీ తొండంతో, కాళ్లతో ఏనుగు చావబాదింది. ఈ దాడిలో 18 మంది గాయపడ్డారు. ఏనుగుపై ఉన్న మావటి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటన రాజధాని కొలంబో సమీపంలోని కొటే పట్టణంలో శనివారం రాత్రి జరిగింది. క్షతగాత్రుల్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. స్వల్ప గాయాలపాలైన 16 మంది డిశ్చార్జి అయ్యారని, మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారని వైద్యులు వెల్లడించారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. శ్రీలంకలో ఏనుగులు కలిగిఉండటం సంపన్నులు గౌరవంగా భావిస్తారు. ప్రతియేట బౌద్ధాలయాల్లో వాటికి అందాల పోటీలు నిర్వహిస్తారు. ఇదిలాఉండగా.. కొన్ని రోజుల క్రితం జరిగిన ఇదే తరహా పోటీల్లో 70 ఏళ్ల ముసలి ఏనుగు ‘టికిరి’ని పోటీలకు దింపిన సంగతి తెలిసిందే. బొక్కల గూడులా ఉన్న దాని శరీరం కనిపించకుండా నిండుగా బట్టలతో అలంకరించారు. అయితే, ఆ గుట్టు కాస్తా బయటపడటంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. జంతుప్రేమికులు ఆగ్రహంతో అధికారులు చర్యలు చేపట్టారు. టికిరిని పోటీలను నుంచి తప్పించి, వైద్యం చేయించారు. -
‘అప్పుడే ధైర్యంగా ముందడుగు వేశా’
లండన్ : భారత సంతతికి చెందిన భాషా ముఖర్జీ(23) మిస్ ఇంగ్లండ్‌గా ఎంపికయ్యారు. గురువారం సాయంత్రం వెలువడిన ఫలితాల్లో అందాల రాణి కిరీటం దక్కించుకున్నారు. ఈ క్రమంలో ప్రపంచ సుందరి పోటీలో పాల్గొనేందుకు ఆమె అర్హత సాధించారు. కాగా భారత్‌లో జన్మించిన భాషా ముఖర్జీ.. తొమ్మిదేళ్ల వయస్సులో తల్లిదండ్రులతో కలిసి యూకే వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ప్రస్తుతం ఆమె వైద్య విద్యనభ్యసిస్తున్నారు. అలా అనుకోవడం తప్పు అందాల పోటీల్లో భాగంగా భాషా మాట్లాడుతూ..‘ చాలా మంది మేము గాల్లో విహరిస్తూ ఏవేవో కలలు కంటూ ఎవరినీ లెక్కచేయమని అనుకుంటారు. నిజానికి సమయం వచ్చినపుడు ప్రత్యేక సందర్భాల్లో మేము అందరికీ అండగా ఉంటాం. మెడికల్ స్కూల్లో ఉన్నప్పుడు మోడలింగ్ ఎంచుకున్నాను. అయితే చదువును, కెరీర్‌ను సమతుల్యం చేసుకోగలననే నమ్మకం వచ్చిన తర్వాతే ధైర్యంగా ముందడుగు వేశా’ అని పేర్కొన్నారు. ఇక కాబోయే సర్జన్‌గానే గాకుండా 5 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగే ప్రవీణురాలిగా కూడా ఈ ముద్దుగుమ్మ గుర్తింపు పొందారు. అదే విధంగా పలు మేధా పోటీల్లో(ఐక్యూ 146) విజేతగా నిలిచి జీనియస్ అనిపించుకున్నారు కూడా. -
పురుషుల అందాల పోటీల్లో ట్రాన్స్‌జెండర్..!
బ్రజీలియా : లింగమార్పిడి చేసుకున్న ఓ వ్యక్తి సరికొత్త చరిత్ర సృష్టించనున్నారు. పురుషుల అందాల పోటీల్లో పాల్గొన్న తొలి ట్రాన్స్‌జెండర్‌గా నిలవనున్నారు. పుట్టుకతో స్త్రీ అయిన 23 ఏళ్ల బెర్నార్డో రిబేరో.. లింగమార్పిడి చేయించుకుని పురుషుడిగా మారారు. బ్రెజిల్లో జరుగనున్న ‘మిస్టర్ బ్రెజిల్’ అందాల పోటీలకు ఎంపికయ్యాడు. ‘పుట్టుకతో అమ్మాయినైనా.. ఎప్పుడూ అలా అనిపించలేదు. నాలో పురుష లక్షణాలే అధికం. అందుకే లింగమార్పిడి చేయించుకున్నా. మిస్టర్ బ్రెజిల్ టైటిల్ సాధించడమే నా కల. రియోడాస్ పెడ్రాస్ పట్టణం నుంచి పోటీలో ఉన్నాను. ఇప్పుడు మోడల్‌గా పనిచేస్తున్నాను. మనదైన జీవితాన్ని పొందకుండా వెనకాడుతున్న చాలామందికి స్ఫూర్తిగా నిలవాలనుకుంటున్నాను’అని బెర్నార్డో చెప్పుకొచ్చారు. కాగా, స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తూ బ్రెజిల్ చట్టం చేసింది. ఈ చట్టం ఉనికిలోకి వచ్చిన వారంలోపే బెర్నార్డో పోటీ విషయం బయటికి రావడం విశేషం. రియో పట్టణంలో ఈ పోటీలు జరుగనున్నాయి. బెర్నార్డోతో పాటు మరో 19 మంది బరిలో ఉన్నారు. -
గౌనుల్లో మెరిసిన అందాలు
-
మిస్ యూనివర్స్ పోటీలో మానసి మోగి
రష్యాలోని మాస్కోలో జరిగిన మిస్ యూనివర్స్-2013 ప్రిలిమినరీ పోటీలో భారత్ తరఫున మిస్ ఇండియా మానసి మోగి పాల్గొంది. క్రోకస్ సిటీ హాల్లో జరిగిన పోటీలో మానసి వినూత్న దుస్తులతో కనువిందు చేసింది. ఈ నెల 9న శనివారం జరిగే ఫైనల్ పోటీలో మిస్ యూనివర్స్ కిరీటాన్ని ఏ సుందరీమణి దక్కుతుందో తేలనుంది. ప్రిలిమినరీ పోటీలో స్విమ్ సూట్లో మిస్ ఇండియా మానసి మోగి. మిస్ యూనివర్స్ ప్రిలిమినరీ గ్రూప్ ఫోటో సెషన్ లో పాల్గొన్న సుందరీమణులు. రష్యాలోని మాస్కోలో ఈ నెల 9న జరిగే ఫైనల్ పోటీలో మిస్ యూనివర్స్ 2013 కిరీటం కోసం క్రోకస్ సిటీ హాల్లో పోటిలో ఉన్న సుందరీమణులు. మిస్ యూనివర్స్-2013 మాస్కోలోని గ్రూప్ క్రోకస్ సిటీ హాల్లో జరిగిన ఫోటో సెషన్ లో పాల్గొన్న సుందరీమణులు.