అందాల పోటీల్లో ఎందరో అతిరథ బ్యూటీలు పాల్గొని సత్తా చాటారు. విజేతలుగా గెలిచిన అందాల భామలు అసలైన అందానికి నిర్వచనం ఏంటో తమదైన శైలిలో వివరించి అందర్నీ మంత్ర ముగ్దుల్ని చేశారు. ఐతే ఈ పోటీల్లో పాల్గొనడానికి వయసు పరిమితి ఉండేది. అయితే ఓ నిర్ధిష్ట వయసు తర్వాత మఖ్యంగా మహిళలు తరుచుగా నిర్లక్ష్యానికి అవహేళనకు గురవ్వుతుంటారు. చెప్పాలంటే తల్లిగా మారే పరిణామ క్రమంలో వృధ్యాప్యానికి త్వరితగతిన చేరువయ్యేది మహిళలే. దీంతో వారికి గుర్తింపు ఉండదు సమాజంలో. ఆ తరహా ఆలోచనను మార్చి అందానికి అసలైన నిర్వచనం ఇచ్చేలా ఏకంగా 60 ఏళ్ల వయసులో అందాల పోటీల్లో పాల్గొని చరిత్ర సృష్టించనుంది వృద్ధురాలు. ఇంతకీ ఎవరామె అంటే..
అర్జెంటినాలో మేలో మిస్ యూనివర్స్ బ్యూనస్ ఎయిర్స్ 2024 అందాల పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో న్యాయవాది అయిన 60 ఏళ్ల అలెజాండ్రా మారిసో రోడ్రిగ్జ్ పాల్గొని చరిత్ర సృష్టించనుంది. ఆమె గనుక ఈ అర్జెంటినా మిస్ యూనివర్స్ బ్యూనస్ ఎయిర్స్ 2024 టైటిల్ గెలుచుకుంటే 60 ఏళ్ల వయసులో టైటిల్‌ని గెలుచుకున్న తొలి సీనియర్ సిటిజన్‌గా అలెజాండ్రా రికార్డులకెక్కడమే గాక సెప్టెంబర్‌లో జరగనున్న మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొన్న తొలి సీనియర్ సిటిజన్‌గా కూడా చరిత్ర సృష్టిస్తోంది.
స.
ప్రసుత్తం ఆమె మేలో జరగనున్న అర్జెంటినా మిస్ యూనివర్స్ బ్యూనస్ ఎయిర్స్ 2024 పోటీలకు సన్నద్ధమవుతుంది. ఈ టైటిల్‌ని గెలుచుకుంటే అలెజాండ్రా సెప్టెంబర్‌లో జరగనున్న మిస్ యూనివర్స్ పోటీల్లో అర్జెంటీనా తరుఫునా ప్రాతినిధ్యం వహించనుంది. ఆమె యువ పోటీదారులకు గట్టి పోటీ ఇచ్చేలా అద్భుతమైన దేహధారుడ్యంతోత్తా చాటనుంది. అంతేగాదు అందాల ప్రపంచంలో ఉన్న మూస పద్ధతులను తిప్పికొట్టి అందానికి వయసుతో సంబంధం ఉండదని ప్రూవ్ చేయనుంది.
ఆరోగ్యకరమైన జీవన శైలితో వయసుని కనిపించకుండా చేయగలిగే ప్రతి స్త్రీ గొప్ప అందగత్తేనని చెబుతోంది. ఇక అలెజాండ్రా ఆరోగ్యకరమైన అలవాట్ల తోపాటు కఠిన వ్యాయామ నియమావళిని అనుసరిస్తానని తెలిపింది. అవే తనకు ఈ అందాల పోటీల్లో సహకరిస్తాయని ఆత్మవిశ్వాసంగా చెబుతోంది అలెజాండ్రా. అలాగే 18 ఏళ్ల వయసులో ఉన్నట్లు దేహ సౌందర్యం ప్రతిమహిళకు వయసు రీత్యా విభిన్నంగా ఉండొచ్చు గానీ అందంగానే ఉంటారని అంటోంది. ఇక్కడ వయసుని అందానికి కొలమానంగా చూడకూడదని నొక్కి చెబుతోంది. అంతేగాదు సమాజానికి మహిళల అందాన్ని తక్కువ చేసి చూసే అవకాశం ఇవ్వకుండా తమపై శ్రద్ధ వహించేలా సమతుల్యమైన ఆహారపు అలవాట్లపై మహిళలంతా దృష్టి పెట్టాలని చెబుతోంది అలెజాండ్రా.
(చదవండి: ట్రోలర్లకు స్ట్రాంగ్ కౌంటరిచ్చిన ప్రాచీ: ఉచితంగా ట్రీట్ చేస్తామన్న వైద్యులు
Comments
Please login to add a commentAdd a comment