
ప్రఖ్యాత క్లాసిక్ మిసెస్ ఆసియా ఇంటర్నేషల్ పేజెంట్ 2024లో భారత్ తరపున తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరానికి చెందిన ప్రముఖ విద్యావేత్త డాక్టర్ ఏ విజయ శారదా రెడ్డి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక పోటీ ఈ నెల 13 నుంచి 19 వరకూ థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో జరగనుంది.
ఈ ఏడాది మిసెస్ ఇండియా టైటిల్‌ను కైవసం చేసుకున్న విజయ గతేడాది మిసెస్ ఇండియా– తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ టైటిల్‌ను సూపర్ క్లాసిక్ కేటగిరిలో సొంతం చేసుకోవడంతో జాతీయ వేదికపై తనదైన ముద్ర వేశారు. తాజాగా అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించడం ఆమె అసాధారణ ప్రతిభ, మహిళలను ప్రేరేపించే కృషికి సాక్ష్యంగా నిలుస్తోంది.
ఎన్నో రంగాల్లో విజయకేతాలను ఎగురవేసిన విజయ రెండు సార్లు గిన్నిస్ వరల్డ్ రికార్డులు పొందడమే కాకుండా విద్య, వ్యాపార రంగాల్లో ఆమె చేసిన కృషికి జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వరించాయి. ఈ నేపథ్యంలో మిసెస్ ఆసియా ఇంటర్నేషనల్ పేజెంట్ 2024లో ఆమె పాల్గొనడం దేశానికే గర్వకారణంగా పేర్కొనవచ్చు. అందం, విజ్ఞానంలో ఉన్నత శిఖరాలు అధిరోహించారు. ఈ కాంటెస్టులో ఆసియా ఖండంలోని వివిధ దేశాలకు చెందిన వారు తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment