న్యూయార్క్‌లోని స్టేటన్ ఐల్యాండ్‌లో తొలిసారి జరిగిన మిస్ శ్రీలంక అందాల పోటీల్లో ఘర్షణ చోటుచేసుకుంది. శుక్రవారం పోటీలు ముగిసిన తరువాత ఏర్పాటు చేసిన పార్టీలో పలువురు కొట్టుకున్నారు. దాదాపు 300కుపైగా అతిథులు హాజరైన ఈ కార్యక్రమంలో రెండు గ్రూపులు తగువులాడుకున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయిది. ఇందులో కొంతమంది అబ్బాయిలు, అమ్మాయిలు ఒకరినొకరు నెట్టేసుకోవడం, పిడిగుద్దులు గుద్దుకోవడం కనిపిస్తోంది.
Miss Sri Lanka New York after party - video 2 pic.twitter.com/sp94xPe4lK
— Under The Coconut Tree (@Toddy_Lad) October 23, 2022
అయితే గొడవకు కారణమేంటనేది మాత్రం స్పష్టంగా తెలియరాలేదు. ఈ గొడవలో కొంత ఫర్నీచర్ కూడా దెబ్బతింది. ఘర్షణకు సంబంధించి పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.అయితే అందాల పోటీలో పాల్గొన్న 14 కంటస్టెట్లు ఎవరూ కూడా ఈ గొడవకు దిగలేదని మిస్ శ్రీలంక పోటీ నిర్వహాకులు పేర్కొన్నారు. కాగా ఈ ఏడాది మిస్ శ్రీలంక న్యూయార్క్ టైటిల్, కిరీటాన్ని ను ఏంజెలియా గుణశేఖర కైవసం చేసుకుంది.
చదవండి: Viral Video: కళ్లు చెదిరే ఆవిష్కరణ: కన్నే ఫ్లాష్ లైట్‌లా వెలుగుతుంది...
Miss Sri Lanka New York after party. 🤦♂️🤦♂️🤦♂️🤦♂️🤦♂️👊🤛 pic.twitter.com/VIG09wgSPx
— Under The Coconut Tree (@Toddy_Lad) October 23, 2022
దేశానికి అండగా..
అమెరికాలోని స్టేటన్ ఐల్యాండ్‌లో లంకేయులు ఎక్కువగా నివసిస్తుండటం కారణంగా ఈ ప్రాంతాన్ని పోటీలకు వేదికగా ఎంచుకున్నారు నిర్వాహకులు. ఆర్థిక సంక్షోభంలో కూరుకున్న తమ దేశానికి కష్ట సమయంలో నిధులు సేకరించడానికి, సాయం చేయాలన్న ఉద్ధేశ్యంతోనే స్టేట్ ఐలాండ్‌లో ఈ పోటీల కార్యక్రమం నిర్వహించినట్లు వారు తెలిపారు. పోటీ ద్వారా సేకరించిన నిధులను దేశంలోని క్యాన్సర్ ఆసుపత్రికి విరాళంగా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
ఇది కామన్
ఘర్షణకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో లంకేయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రవర్తనతో అమెరికాలో తమ పరువును దిగజార్చుతున్నారని మండిపడుతున్నారు. చూడటానికి అవమానకరంగా ఉందని, దీనికి కారకులైన వారిని శిక్షించాలని కోరుతున్నారు. మరికొందరు.. ‘ప్రతి వేడుకలో ఇలాంటి వివాదాలు సర్వసాధారణం. చిన్న పిల్లల నుంచి పెద్దలు, మహిళలు అందరూ గొడవ పడతారు. అది శ్రీలంక దేశస్థులే కానవసరం లేదు. అయితే ఇది చూడటానికి చాలా ఉత్సాహంగా ఉంది. అని కామెంట్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment