న్యూయార్క్: దాయాది దేశాల మధ్య పోరులో మరోసారి భారత్‌దే పైచేయి అయ్యింది. న్యూయార్క్ లోని నసావు కౌంటీ స్టేడియంలో జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ టీమిండియా విజయం సాధించింది. అయితే.. మ్యాచ్ కొనసాగుతున్న సమయంలో జరిగిన ఓ అనూహ్య పరిణామం అందరి దృష్టిని ఆకర్షించింది.
మ్యాచ్ జరుగుతున్న టైంలో స్టేడియంపై ఓ ఎయిర్‌క్రాఫ్ట్ ఎగిరింది. అది ఓ బ్యానర్ ను ప్రదర్శిస్తూ వెళ్లింది. ఆ బ్యానర్ పై ఇమ్రాన్ ఖాన్ ను విడుదల చేయండి (Release Imran Khan) అని రాసి ఉంది. మరోవైపు మ్యాచ్ జరుగుతున్న టైంలో స్టేడియంలో కొందరు ఇమ్రాన్ ఖాన్ ఫొటోలతో జిందాబాద్ నినాదాలు చేయడమూ కనిపించింది.
A plane with the message "Release Imran Khan" flies over the stadium during the India vs. Pakistan T20 World Cup match. #Imrankhan #T20WC24 #viral #BreakingPedia pic.twitter.com/OHlCuQUFRZ
— Breakingpedia (@breakingpediaBP) June 10, 2024
Credits: Breakingpedia
VIDEO CREDITS: TOP POST
అయితే.. పాక్-భారత్ మ్యాచ్‌కు గట్టి భద్రత ఉంటుందని న్యూయార్క్ పోలీసులు ఇదివరకే ప్రకటించారు. ఈ తరుణంలో ఆ విమానాన్ని స్టేడియం మీద ఎగరడానికి ఎలా అనుమతించారు?. దానిని నడిపిందెవరు?. దీనంతటి వెనుక ఉంది ఎవరు? ఇలాంటి అంశాలపై అక్కడి అధికారుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment