ఐపీఎల్-2024 సీజన్‌కు తెరపడిన వారం రోజుల వ్యవధిలోపే మరో టీ20 ప్రపంచకప్-2024 రూపంలో మరో మహా సంగ్రామానికి తెరలేవనుంది. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా ఈవెంట్ జూన్ 1 మొదలుకానుంది.
ఈ ఐసీసీ టోర్నీలో ఈసారి ఏకంగా 20 జట్లు పాల్గొనబోతున్నాయి. ఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్‌నకు సిద్ధమయ్యే క్రమంలో ఇప్పటికే అమెరికాకు బయల్దేరిన టీమిండియా సోమవారం న్యూయార్క్‌లో ల్యాండ్ అయింది.
కాగా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, శుబ్‌మన్ గిల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్ తదితరులు ఆదివారమే విమానం ఎక్కేసిన విషయం తెలిసిందే.
ముంబైలో నుంచి వీళ్లంతా అమెరికాకు బయల్దేరగా అక్కడి సిబ్బంది కేక్ కట్ చేసి ఆటగాళ్లకు ఆల్ ది బెస్ట్ చెబుతూ సెండాఫ్ ఇచ్చారు. ఈ క్రమంలో సోమవారం టీమిండియా న్యూయార్క్‌లో అడుగుపెట్టినట్లు తెలుపుతూ బీసీసీఐ ఓ వీడియో విడుదల చేసింది.
కాగా మిగిలిన ఆటగాళ్లలో స్టార్లు విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, యజువేంద్ర చహల్, రింకూ సింగ్ తదితరులు రెండో బ్యాచ్‌లో అమెరికాకు పయనం కానున్నట్లు సమాచారం.
ఇక జూన్ 5న ఐర్లాండ్‌తో మ్యాచ్ సందర్భంగా భారత జట్టు తమ వరల్డ్‌కప్ ప్రయాణం మొదలుపెట్టనుంది. అంతకు ముందు బంగ్లాదేశ్‌తో జూన్ 1 వార్మప్ మ్యాచ్ ఆడనుంది.
టీ20 ప్రపంచకప్-2024కు భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్.
రిజర్వ్: శుబ్‌మన్ గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్.
✈️ Touchdown New York! 🇺🇸👋#TeamIndia 🇮🇳 have arrived for the #T20WorldCup 😎 pic.twitter.com/3aBla48S6T
— BCCI (@BCCI) May 27, 2024
Comments
Please login to add a commentAdd a comment