
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తాజా సీజన్ మిస్సయిన పలువురు విదేశీ స్టార్ క్రికెటర్లకు మరో అవకాశం దక్కింది. మన దాయాది దేశం పాకిస్తాన్ వారిని అక్కున చేర్చుకుంది. ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని పలువురు విదేశీ క్రికెటర్లకు పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) అవకాశం కల్పించింది. ఇందులో స్టార్ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ కూడా ఉండడం విశేషం. వార్నర్ అయితే ఒక జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. కరాచీ కింగ్స్ జట్టుకు అతడు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇదే టీమ్‌లో విలియమ్సన్ కూడా ఉన్నాడు. వీరిద్దరూ ఫస్ట్‌టైం పీఎస్ఎల్‌లో ఆడుతున్నారు. అఫ్గానిస్తాన్ ఆల్ రౌండర్ మహ్మద్ నబీ, న్యూజిలాండ్ ప్లేయర్లు ఆడమ్ మిల్నే, టిమ్ సీఫెర్ట్ కూడా కరాచీ కింగ్స్ (Karachi Kings) జట్టులో ఉన్నారు. ఈ మూడు దేశాలతో పాటు ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, ఇంగ్లండ్, వెస్టిండీస్‌కు చెందిన క్రికెటర్లు కూడా పీఎస్ఎల్‌లో ఆడనున్నారు.
కోలిన్ మున్రో (న్యూజిలాండ్), రాస్సీ వాన్ డెర్ డుసెన్ (దక్షిణాఫ్రికా), రిలే మెరెడిత్, బెంజమిన్ డ్వార్షుయిస్ (ఆస్ట్రేలియా), జాసన్ హోల్డర్ (వెస్టిండీస్).. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
గత సంవత్సరం రన్నరప్ ముల్తాన్ సుల్తాన్స్ జట్టులో షాయ్ హోప్, గుడాకేష్ మోటీ, జాన్సన్ చార్లెస్(వెస్టిండీస్), మైఖేల్ బ్రేస్‌వెల్ (న్యూజిలాండ్), డేవిడ్ విల్లీ, క్రిస్ జోర్డాన్ (ఇంగ్లండ్) ఉన్నారు.
న్యూజిలాండ్‌కు చెందిన డారిల్ మిచెల్, శ్రీలంక క్రికెటర్ కుశాల్ పెరెరా, నమీబియా మాజీ క్రికెటర్ డేవిడ్ వైస్.. లాహోర్ ఖలందర్స్ టీమ్‌లో ఉన్నారు.
వెస్టిండీస్ సీమర్ అల్జారి జోసెఫ్, దక్షిణాఫ్రికాకు చెందిన జార్జ్ లిండే, ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ ఓవెన్.. పెషావర్ జల్మి జట్టుకు ఆడుతున్నారు.
కుశాల్ మెండిస్(శ్రీలంక), మార్క్ చాప్‌మన్, కైల్ జామీసన్, ఫిన్ అలెన్(న్యూజిలాండ్), రిలీ రోసౌ(దక్షిణాఫ్రికా).. క్వెట్టా గ్లాడియేటర్స్ టీమ్ తరపున బరిలోకి దిగనున్నారు.
కాగా, పీఎస్ఎల్ (PSL 2025) పదో సీజన్ ఏప్రిల్ 11 నుంచి ప్రారంభమవుతోంది. ఈసారి ఐపీఎల్‌కు సమాంతరంగా పాకిస్తాన్ క్యాష్ రిచ్ లీగ్ జరుగుతుండడంతో పీఎస్ఎల్‌కు ఆదరణ అంతంతమాత్రమేన్న వార్తలు వెలువడుతున్నాయి. వరల్డ్ క్రికెట్‌లోని స్టార్లు అందరూ ఐపీఎల్‌లోనే ఉండడం, మ్యాచ్‌లు కూడా ఉత్కంఠభరితంగా సాగుతుండడంతో పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఇండియా క్యాష్ రిచ్ లీగ్‌వైపే మొగ్గు చూపిస్తున్నారు. నేటి నుంచి మే 18 వరకు జరిగే పీఎస్ఎల్ 10వ ఎడిషన్‌లో 6 జట్లు పోటీపడతాయి. నాలుగు వేదికల్లో 34 మ్యాచ్‌లు జరుగుతాయి.
ఇస్లామాబాద్ యునైటెడ్
షాదాబ్ ఖాన్ (కెప్టెన్), ఆండ్రీస్ గౌస్ (వికెట్ కీపర్), ఆజం ఖాన్ (వికెట్ కీపర్), నసీమ్ షా, రిలే మెరెడిత్, హునైన్ షా, బెంజమిన్ ద్వార్షుయిస్, కోలిన్ మున్రో, రుమ్మన్ రయీస్, సల్మాన్ ఇర్షాద్, రాస్సీ వాన్ డెర్ డుసెన్, మాథ్యూ షార్ట్, ఇమాద్ వసీం, సల్మాన్ అగ్లీహమ్, సల్మాన్ అగ్లీహమ్, హోల్డర్ నవాజ్, సాద్ మసూద్, సాహిబ్జాదా ఫర్హాన్, ముహమ్మద్ షాజాద్.
ముల్తాన్ సుల్తాన్స్
మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్& వికెట్ కీపర్), ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్), షాయ్ హోప్ (వికెట్ కీపర్), జాన్సన్ చార్లెస్ (వికెట్ కీపర్), ఉసామా మీర్, మైఖేల్ బ్రేస్‌వెల్, డేవిడ్ విల్లీ, ఇఫ్తికార్ అహ్మద్, క్రిస్ జోర్డాన్, తయ్యబ్ తాహిర్, అమీర్ అజ్మత్, కమ్రాన్ గులామ్, మహ్మద్ జొహ్ల్ హస్నైన్, అకిఫ్స్ జొస్నాన్, లిటిల్, యాసిర్ ఖాన్, షాహిద్ అజీజ్, ఉబైద్ షా, ముహమ్మద్ అమీర్ బార్కీ.
కరాచీ కింగ్స్
డేవిడ్ వార్నర్ (కెప్టెన్), టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), లిట్టన్ దాస్ (వికెట్ కీపర్), అబ్బాస్ అఫ్రిది, ఆడమ్ మిల్నే, హసన్ అలీ, జేమ్స్ విన్స్, ఖుష్దిల్ షా, ఇర్ఫాన్ ఖాన్ నియాజీ, షాన్ మసూద్, మీర్ హమ్జా, కేన్ విలియమ్సన్, అమర్ జమాల్, అరాఫత్ బి మహ్మద్, ఓ జహీమా బి మహ్మద్, యు. అలీ, రియాజుల్లా, మీర్జా మామూన్, ఇంతియాజ్ మహ్మద్ నబీ.
లాహోర్ ఖలందర్స్
షాహీన్ అఫ్రిది (కెప్టెన్), సామ్ బిల్లింగ్స్ (వికెట్ కీపర్), మహ్మద్ అఖ్లాక్ (వికెట్ కీపర్), కుసల్ పెరీరా (వికెట్ కీపర్), ఫఖర్ జమాన్, డారిల్ మిచెల్, హరీస్ రవూఫ్, సికందర్ రజా, అబ్దుల్లా షఫీక్, సల్మాన్ అలీ మీర్జా, రిషద్ హుస్సేన్, ముహమ్మద్ నయీమ్, మహ్మద్ అజాబ్, డేవిడ్ ఖాన్, జమర్, డేవిడ్ ఖాన్, జహర్, మోమిన్ క్యూమ్, కుర్రాన్, ఆసిఫ్ ఆఫ్రిది, ఆసిఫ్ అలీ.
పెషావర్ జల్మి
బాబర్ ఆజం (కెప్టెన్), టామ్ కోహ్లర్-కాడ్మోర్ (వికెట్ కీపర్), మహ్మద్ హారీస్ (వికెట్ కీపర్), జార్జ్ లిండే, అహ్మద్ డానియాల్, అల్జారీ జోసెఫ్, నహిద్ రానా, సైమ్ అయూబ్, మహ్మద్ అలీ, హుస్సేన్ తలత్, అబ్దుల్ సమద్, ఆరిఫ్ యాకూబ్, మెహ్రాన్ ముంతాజ్, నజీమ్ అలీక్స్ బ్రయంట్, మాజ్ సదాకత్, మిచెల్ ఓవెన్, ల్యూక్ వుడ్.
చదవండి: పాక్ జట్టులో నో ఛాన్స్.. కట్ చేస్తే! అక్కడెమో ఏకంగా వైస్ కెప్టెన్
క్వెట్టా గ్లాడియేటర్స్
సౌద్ షకీల్ (కెప్టెన్), కుసల్ మెండిస్ (వికెట్ కీపర్), హసీబుల్లా ఖాన్ (వికెట్ కీపర్), ఫిన్ అలెన్, మార్క్ చాప్‌మన్, ఫహీమ్ అష్రఫ్, ఖవాజా నఫే, అబ్రార్ అహ్మద్, మొహమ్మద్ అమీర్, రిలీ రోసౌ, అకేల్ హోసేన్, మహ్మద్ వసీం జూనియర్, ఉస్మాన్ తారిజ్, ఉస్మాన్ తారిజ్ జీషన్, సీన్ అబాట్, కైల్ జామీసన్, హసన్ నవాజ్, షోయబ్ మాలిక్, అలీ మజిద్.