Foreign Players
-
జాతీయ జట్టులోకి విదేశీ ఆటగాళ్లు!
సాక్షి, హైదరాబాద్: ఇతర దేశాల్లో మాదిరిగా భారత్‌లో కూడా విదేశీ ప్లేయర్లను జాతీయ జట్టు తరఫున ఆడించే నిబంధనలను అమల్లోకి తెస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని భారత ఫుట్‌బాల్ జట్టు గోల్‌కీపర్ గుర్ప్రీత్ సింగ్ అభిప్రాయపడ్డాడు. చాలా దేశాల్లో విదేశీ క్రీడాకారులు నిర్దిష్ట సమయంపాటు నివసిస్తే వాళ్లకు ఆ దేశం తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశం ఇచ్చే నిబంధన అమల్లో ఉంది. అయితే భారత్‌లో మాత్రం అలాంటి అవకాశం లేదు. ఈ నేపథ్యంలో మన కేంద్ర ప్రభుత్వం, అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) ఆ దిశగా ఆలోచన చేయడం మంచిదని గుర్ప్రీత్ సూచించాడు. దాని కోసం ప్రత్యేక నిబంధనలు తీసుకువస్తే మంచిదని సూచనాప్రాయంగా అన్నాడు. ఇలా విదేశీ ప్లేయర్లు జాతీయ జట్టు తరఫున ఆడితే... మన ప్లేయర్లకు కూడా చాలా ఉపయుక్తకరంగా ఉంటుందని పేర్కొన్నాడు. ఏఎఫ్సీ ఆసియా కప్‌నకు అర్హత సాధించడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమన్న గుర్ప్రీత్... కొత్త కోచ్ మానొలో సారథ్యంలో జట్టు మంచి విజయాలు సాధించగలదని ఆశాభావం వ్యక్తం చేశాడు. వచ్చే ఏడాది జరగనున్న ఆసియా కప్ క్వాలిఫయింగ్ టోర్నీకి ముందు భారత్ చివరి అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్ ఈ నెల 18న హైదరాబాద్ వేదికగా మలేసియాతో తలపడుతుంది. మలేసియా జట్టులో పలువురు విదేశీ ప్లేయర్లు ఉన్న నేపథ్యంలో గుర్ప్రీత్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో బుధవారం గుర్ప్రీత్ ఆన్లైన్లో మాట్లాడుతూ... ‘గతం గురించి ఎక్కువ ఆలోచించడం లేదు. జరిగిందేదో జరిగింది. ప్రతీసారి గెలవాలనే లక్ష్యంతోనే మైదానంలో అడుగు పెడతాం. కొన్నిసార్లు అది సాధ్యం కాదు. మలేసియాతో పోరు కోసం బాగా సన్నద్ధమవుతున్నాం. ఆసియా కప్ క్వాలిఫయర్స్‌కు ముందు మాకు ఇదే చివరి మ్యాచ్. మలేసియా జట్టులో విదేశాలకు చెందిన 14 మంది ప్లేయర్లు ఉన్నారు. స్పెయిన్‌కు చెందిన మారాలెస్, బ్రెజిల్‌కు చెందిన ఎన్డ్రిక్ డాస్, సాన్టోస్ వంటి పలువురు ఆటగాళ్లు మలేసియా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నిబంధన వల్ల వాళ్లకు అదనపు ప్రయోజనం చేకూరడం ఖాయం. మనం కూడా ఆ దిశగా ఆలోచిస్తే మంచిది. శ్రీలంక జట్టు కూడా ఇలా విదేశీ ఆటగాళ్లకు అవకాశం ఇస్తోంది’ అని అన్నాడు. భారత్‌లో మాత్రం అలాంటి అవకాశం లేదు. ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడు కల్యాణ్ చౌబే గతంలో విదేశాల్లోస్థిరపడిన భారత సంతతి ఆటగాళ్లను తిరిగి తీసుకువచ్చే ప్రయత్నం చేసినా... అది కార్యరూపం దాల్చలేదు. -
ఆ ఐపీఎల్ ఆటగాళ్లకు జీతాలు కట్..
దుబాయ్: కరోనా కారణంగా అర్ధంతరంగా ఆగిపోయిన ఐపీఎల్ 2021 సీజన్‌ను యూఏఈ వేదికగా సెప్టెంబర్-అక్టోబర్ మధ్యలో నిర్వహిస్తామని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఇటీవలే అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో షెడ్యూల్ రూపొందించే పనిలో బిజీగా ఉంది. అయితే సెకండాఫ్ మ్యాచ్‌లకు విదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉండరన్న ఊహాగానాల నేపథ్యంలో ఫ్రాంచైజీల యాజమాన్యాలు ఆయా దేశాలకు చెందిన ఆటగాళ్లపై చర్యలకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఐపీఎల్ సెకండ్ లెగ్ మ్యాచ్‌లు ఆడేందుకు యూఏఈకి రాని విదేశీ ఆటగాళ్ల జీతాల్లో కోత విధించాలని నిర్ణయించినట్లు బీసీసీఐకి చెందిన ఓ ముఖ్య అధికారి తెలిపారు. ఇప్పటి వరకు వారు ఆడిన మ్యాచ్‌లకు మాత్రమే వేతనాలు చెల్లిస్తామని, మిస్ కాబోయే మ్యాచ్‌లకు ఎటువంటి జీతం చెల్లించబోమని ఆయన వెల్లడించారు. అయితే బీసీసీఐతో ఒప్పంద కుదుర్చుకున్న ఆటగాళ్లకు మాత్రం ఎలాంటి కోత ఉండబోదని పేర్కొన్నారు. కాగా, విదేశీ ఆటగాళ్లు పూర్తిగా ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడకపోతే పారితోషికంలో కోత పెట్టే హక్కు ఫ్రాంచైజీ యాజమాన్యలకు ఉంటుందని సదరు అధికారి తెలిపారు. ఇదిలా ఉంటే, ఎవరు వచ్చినా రాకపోయినా ఐపీఎల్ మాత్రం ఆగదని ఇటీవలే బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. ఫ్రాంచైజీల తాజా నిర్ణయంతో ఐపీఎల్‌కు డుమ్మా కొట్టాలనుకున్న విదేశీ ఆటగాళ్లలో ఆందోళన మొదలైంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌కు చెందిన కొందరు క్రికెటర్లు ద్వైపాక్షిక సిరీస్‌ల నేపంతో ఐపీఎల్ ఆడబోమని ఇదివరకే స్పష్టం చేశారు. చదవండి: ముంబై కోచ్‌గా దేశవాళీ క్రికెట్ దిగ్గజం.. -
వాళ్లు లేకపోయినంత మాత్రానా ఐపీఎల్ నిర్వహణ ఆగదు..
దుబాయ్: విదేశీ ఆటగాళ్లు అందుబాటులో లేకపోయినంత మాత్రానా ఐపీఎల్ 2021 సీజన్ నిర్వహణ ఆగదని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ప్రణాళిక ప్రకారమే యూఏఈ వేదికగా సెప్టెంబరు 18 నుంచి అక్టోబరు 10 మధ్యలో లీగ్‌ను నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. టీ20 ప్రపంచకప్‌కు ముందు ఐపీఎల్ మిగిలిన మ్యాచ్‌లను ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని బీసీసీఐ పట్టుదలతో ఉన్నట్లు పేర్కొన్నారు. కొందరు విదేశీ ఆటగాళ్లు లీగ్‌కు దూరంగా ఉన్నా, భారత స్టార్ ఆటగాళ్లు లీగ్‌కు వన్నె తెస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. వెస్టిండీస్ పర్యటన నిమిత్తం కొందరు, వ్యక్తిగత కారణాలచే మరికొందరు ఆసీస్ ఆటగాళ్లు ఐపీఎల్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వస్తున్న వార్తలు వాస్తవమేనని, ఈ విషయమై ఆయా ఫ్రాంఛైజీలు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించే పనిలో నిమగ్నమై ఉన్నాయని ఆయన తెలిపారు. ఐపీఎల్ నిర్వహణ ప్రణాళిక, షెడ్యూల్ తదితర అంశాలపై చర్చించేందకు బీసీసీఐ ఆఫీస్ బేరర్లు త్వరలోనే యూఏఈలో సమావేశమవుతారని ప్రకటించారు. కాగా, పలువురు విదేశీ ఆటగాళ్లు తమతమ అంతర్జాతీయ జట్లకు ప్రాతినిధ్యం వహించాల్సి ఉండటంతో లీగ్‌కు దూరంగా ఉంటారని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో శుక్లా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇదిలా ఉంటే, భారత్‌లో కరోనా కేసులు అధికమవడం కారణంగా మే 4న ఐపీఎల్ 14 ఎడిషన్ నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. చదవండి: ప్రేయసిని హత్తుకుని భావోద్వేగానికి లోనైన ఆసీస్ క్రికెటర్.. -
ఐపీఎల్లో విదేశీ ఆటగాళ్లు ఉండాల్సిందే: నెస్ వాడియా
న్యూఢిల్లీ: విదేశీ ఆటగాళ్లు లేకుండా ఐపీఎల్ నిర్వహించడంలో అర్థమే లేదని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని నెస్ వాడియా అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో బీసీసీఐ... లీగ్ నిర్వహణపై ఓ నిర్ణయానికి రావడం తొందరపాటే అవుతుందన్నాడు. ‘ప్రపంచంలో ఐపీఎల్ ఉన్నతమైన క్రికెట్ ఈవెంట్. దీనికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉంది. ఇందులో కచ్చితంగా అంతర్జాతీయ స్టార్ ప్లేయర్లు ఆడాలి. కానీ ప్రయాణ ఆంక్షల కారణంగా టోర్నీ జరిగే నాటికి ఎంతమంది విదేశీ ఆటగాళ్లు భారత్‌కు రాగలరనేది చూడాలి. ఇందులో ఎన్నో అంశాలు ముడిపడి ఉన్నాయి. కాబట్టి టోర్నీ ఎప్పుడు జరుగుతుందో చెప్పడం బీసీసీఐకి కూడా కష్టమే’ అని వాడియా పేర్కొన్నాడు. కరోనా కారణంగా అంతర్జాతీయ ప్రయాణ ఆంక్షల నేపథ్యంలో ఐపీఎల్ నిర్వహణపై ఫ్రాంచైజీలన్నీ భిన్న అభిప్రాయాలను వెలిబుచ్చుతున్నాయి. ఈ ఏడాది కేవలం భారత ఆటగాళ్లతో లీగ్‌ను నిర్వహించాలని రాజస్తాన్ రాయల్స్ పేర్కొనగా... చెన్నై సూపర్ కింగ్స్ ఈ ప్రతిపాదనను ఖండించింది. -
ఐఎస్ఎల్ డ్రాఫ్ట్‌లో 49 మంది విదేశీ ఆటగాళ్లు
న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) నిర్వాహకులు అంతర్జాతీయ ఆటగాళ్ల డ్రాఫ్ట్‌కు 49 మందితో జాబితా విడుదల చేశారు. స్పెయిన్, ఫ్రాన్స్, చెక్ రిపబ్లిక్, బ్రెజిల్, పోర్చుగల్, కొలంబియా, దక్షిణ కొరియా, అర్జెంటీనా, కెనడా, సెర్బియాలకు చెందిన ఈ ఆటగాళ్లను ఫ్రాంచైజీలు వచ్చే వారం జరిగే డ్రాఫ్ట్‌లో సొంతం చేసుకుంటాయి. మొత్తంగా 56 మంది విదేశీ ఆటగాళ్లుండగా ఏడుగురితో ఇప్పటికే నాలుగు క్లబ్‌లు నేరుగా ఒప్పందాలు చేసుకున్నాయి.