
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2023 సీజన్ విజయవంతంగా నడుస్తోంది. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ డానీ మోరిసన్ లీగ్‌లో కామెంటేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ మాజీ క్రికెటర్ ఎక్కడ ఉంటే అక్కడ సందడి వేరుగా ఉంటుంది. ఆటలో గొప్ప బౌలర్‌గా పేరు పొందిన డానీ మోరిసన్ ఆట తర్వాత కూడా అదే జోష్‌ను కంటిన్యూ చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు.
తాజాగా డానీ మోరిసన్ చర్య ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మార్చి 5న(ఆదివారం) కెట్టా గ్లాడియేటర్స్, ఇస్లామాబాద్ యునైటెడ్ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియన్ టీవీ ప్రజెంటర్.. మాజీ క్రికెటర్ బెన్ కటింగ్ భార్య ఎరిన్ హాలండ్‌తో కలిసి మోరిసన్ మాట్లాడాడు. ఈ క్రమంలో అందరూ చూస్తుండగానే సడన్‌గా ఎరిన్ హాలండ్‌ను ఎత్తుకొని తన తొడపై కూర్చొబెట్టుకున్నాడు. ఈ చర్యతో ఎరిన్ హాలండ్ షాక్‌కు గురైనప్పటికి ఫన్నీగానే తీసుకుంది.
దీనికి సంబంధించిన వీడియోనూ ఎరిన్ హాలండ్ ట్విటర్‌లో షేర్ చేస్తూ.. ''లవ్ యూ అంకుల్ @SteelyDan66'' అని రాసుకొచ్చింది. దీనిపై స్పందించిన మోరిసన్.. ''నిన్ను నీ పాదాలపై నిల్చునేలా చేశాను మిసెస్ కటింగ్'' అంటూ రిప్లై ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు వినూత్న రీతిలో కామెంట్స్ చేశారు. ''బెన్ కటింగ్ ఎక్కడున్నావు''.. ''బెన్ కటింగ్ చూశాడో నీ పని అయిపోతుంది మోరిసన్'' అంటూ ఫన్నీవేలో పేర్కొన్నారు.
అయితే ఇలా చేయడం డానీ మోరిసన్‌కు కొత్తేం కాదు. గతంలో ఐపీఎల్‌లోనూ రెండు సందర్భాల్లో మోరిసన్ ఇలానే ప్రవర్తించాడు. ఒకసారి చీర్ లీడర్‌ను తన భుజాలపై మోసుకెళ్లిన మోరిసన్.. మరోసారి మాజీ ఐపీఎల్ ప్రజంటేటర్.. నటి కరిష్మా కొటక్‌ను కూడా తన తొడలపై కూర్చొబెట్టుకున్నాడు. అప్పట్లో దీనికి సంబంధించిన ఫోటో బాగా వైరల్ అయింది. తాజాగా పీఎస్‌ఎల్‌లోనూ సేమ్ సీన్ రిపీట్ చేసిన డానీ మోరిసన్ మరోసారి వార్తల్లో నిలిచాడు.
ఇక 57 ఏళ్ల డానీ మోరిసన్ 1987లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. 1994లో టీమిండియాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో హ్యాట్రిక్ తీయడం ద్వారా మోరిసన్ అందరి దృష్టిని ఆకర్షించాడు. 1997లో కివీస్ తరపున ఆఖరి మ్యాచ్ ఆడిన మోరిసన్ తన 10 ఏళ్ల కెరీర్‌లో 48 టెస్టుల్లో 160 వికెట్లు, 96 వన్డేల్లో 126 వికెట్లు పడగొట్టాడు.
Love ya uncle @SteelyDan66 😂 @thePSLt20 pic.twitter.com/9reSq6ekdN
— Erin Holland (@erinvholland) March 5, 2023
Just keeping you on your toes Mrs Cutting!!! 🤣💃 #PSL8 https://t.co/r1i5Oebc5l
— Danny Morrison (@SteelyDan66) March 5, 2023
Comments
Please login to add a commentAdd a comment