air craft
-
Society Of The Snow Review: కన్నీళ్లు ఆపుకునే శక్తి ఉంటే ఈ సినిమా చూడండి
ఓటీటీ వేదికలు సినిమా అభిమానులకు బాగా దగ్గరయ్యాయి. సినిమా బాగుంది అంటే చాలు కొత్త, పాత అనే తారతమ్యం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ముఖ్యంగా సర్వైవల్ థ్రిల్లర్ మూవీ అంటే చాలు.. ఎన్ని పనులున్నా తప్పకుండా చూస్తున్నారు. చరిత్రలో జరిగిన భయంకరమైన సంఘటనను సినిమాగా తెరకెక్కించి ప్రేక్షకుల కోసం కొందరు మేకర్స్ విడుదల చేస్తుంటారు. ఈ క్రమంలో వచ్చిన హాలీవుడ్ చిత్రమే 'సొసైటీ ఆఫ్ ది స్నో'. గతేడాదిలో విడుదలైన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ వేదికగా తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. J. A. బయోనా దర్శకత్వం వహించారు. 96వ ఆస్కార్ అవార్డుల నామినేషన్స్‌లో ఉత్తమ విదేశీ (స్పెయిన్) చిత్రంగా ఎంట్రీ దక్కించుకుంది.కథేంటంటే..ప్రకృతి వల్ల ఏర్పడే ప్రమాదాన్ని ఊహించలేం. వాతావరణంలోని మార్పుల వల్ల 1972లో ఫ్లైట్-571 ఆండిస్ పర్వత శ్రేణుల్లో కూలిపోయింది. అందులో ఉరుగ్వేకు చెందిన 45 మంది సభ్యులతో కూడిన యువ రగ్బీ టీమ్ ఉంది. వారందరూ ఉరుగ్వే నుంచి టోర్నమెంట్ కోసం చిలీలోని శాంటియాగోకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరుగుతుంది. ఎవరూ ఊహించని విధంగా జరిగిన ఘోర ప్రమాదంలో కొందరు అక్కడికక్కడే మృతి చెందితే.. కొందరు మాత్రమే ప్రాణాలతో బయటపడతారు. కానీ, కొందరు తీవ్రంగా గాయపడి చావు బతుకుల మధ్య పోరాడుతుంటారు. చుట్టూ ఎత్తైన మంచు పర్వతాలు ఉండటం వల్ల మైనస్ 20 డిగ్రీలకు పైగా చలి ఉంటుంది. వారికి తినడానికి తిండి కూడా దొరకదు. టెక్నాలజీ అంతగా అందుబాటులో లేని ఆ రోజుల్లో వారు ఎలా బయటపడ్డారు..? 45 మందిలో చివరకు ఎంత మంది ప్రాణాలతో తిరిగొచ్చారు..? మనుసులే జీవించలేని ఆ మంచుకొండల్లో 72రోజుల పాటు వారు తీసుకున్న ఆహారం ఎంటి..? వారిని ఏవియేషన్ సిబ్బంది ఎలా కనిపెట్టారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే! ప్రేక్షకుల్లో కన్నీళ్లు తెప్పించే ఈ నిజజీవిత కథను మీరూ చూసేయండి.ఎలా ఉందంటే..సర్వైవల్ థ్రిల్లర్స్ కాన్సెప్ట్‌తో వచ్చే సినిమాలు ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అయిపోతాయి. రీసెంట్గా వచ్చిన మంజుమ్మల్ బాయ్స్ ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. 'సొసైటీ ఆఫ్ ది స్నో' చిత్రంలో కూడా 45 మంది ప్లేయర్స్ రెండు నెలల పాటు మంచు కొండల్లో చిక్కుకుని తీవ్రమైన చలిలో ఎలా బతికారనే కాన్సెప్ట్‌ను చాలా భావోద్వేగభరితంగా చూపించడంలో దర్శకుడు J. A. బయోనా విజయం సాధించాడు. మనిషి బ్రతకడానికి అవకాశమే లేని అత్యంత కఠినమైన పరిస్థితుల్లో కూడా ఆత్మవిశ్వాసం ఉంటే చాలు విజయం సాధించవచ్చు అనే స్ఫూర్తిని సినిమాలో ఆవిష్కరించారు. వారిలో ప్రేమ, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్ని ఈ కథలో అద్భుతంగా తెరకెక్కించాడు. రగ్బీ ఆడుతున్న యువకులతో సినిమాను ప్రారంభించిన దర్శకుడు నెమ్మదిగా అసలు కథలోకి తీసుకెళ్తాడు. ప్రారంభంలో కాస్త సమయం తీసుకున్నా ఒక్కసారి వారందరూ విమానం ఎక్కగానే అసలు కథ మొదలౌతుంది. వెండితెరపై కనిపించిన విమాన ప్రమాదం తీరు చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. చావుబతుకుల మధ్య వారందరూ పోరాడుతుంటే ప్రేక్షకుల్లో కన్నీరు తెప్పిస్తుంది. ప్రాణాలను నిలుపుకోవడానికి మరణించిన తమ స్నేహితుల శవాలను తినాల్సిందేనని వారు చర్చించుకునే తీరు, వారిలో కనిపించే తీవ్రమైన భావోద్వేగంతో కన్నీటిసుడులు తిరుగుతాయి. స్నేహితుల ఆహారం కోసం ప్రాణత్యాగం చేసేందుకు కూడా వెనకడుగు వేయరు. అలా 72 రోజుల తర్వాత సైన్యం వారిని కనిపెట్టినప్పుడు వారిలో కనిపించే సంతోషాన్ని చూసిన ప్రతి ప్రేక్షకుడు కూడా చలించిపోతాడు. ఆ సమయంలో వారి శరీరం కేవలం ఎముకల గూడుగా కనిపిస్తుంది.ఎవరెలా చేశారంటేసొసైటీ ఆఫ్ స్నో మూవీలో నటించిన వారందరూ కూడా హాలీవుడ్ వారే కావడంతో మనకు పెద్దగా వారి పరిచయాలు ఉండవ్. కానీ ఈ ఒక్క సినిమా వారిని మనకు దగ్గర చేస్తుంది. ఈ చిత్రంలో చాలా వరకు నూమా అనే పాత్ర అందరికీ కనెక్ట్ అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే అతనే హీరో అని చెప్పవచ్చు. ఆయన పాత్ర కూడా చాలా విషాదాంతంగానే ముగిసిపోతుంది. డైరెక్టర్ జె.ఎ. బయోనా ఈ చిత్రంలోని మంచు పర్వతాలను తెరపై ఆవిష్కరించిన తీరు చాలా బాగుంది. ఈ చిత్రాన్ని సర్వైవల్ థ్రిల్లర్‌గానే కాకుండా భావోద్వేగాలతో గుండెలను బరువెక్కేలా నిర్మించడంలో విజయం సాధించాడు. కథ నెమ్మదిగా సాగుతుంది. కాస్త ఓపికగా చూస్తే మిమ్మల్ని కూడా తప్పకుండా కన్నీళ్లు పెట్టిస్తుంది. నెట్‌ఫ్లిక్స్ నందు తెలుగులో కూడా అందుబాటులో ఉంది. -
మలావీ ఎయిర్‌క్రాఫ్ట్ మిస్సింగ్ విషాదాంతం.. ఉపాధ్యక్షుడి దుర్మరణం
లిలాంగ్వే: మలావీ ఆర్మీ ఎయిర్‌క్రాఫ్ట్ మిస్సింగ్ ఉదంతం విషాదాంతంగా ముగిసింది. ఉపాధ్యక్షుడు సావులోస్ చీలిమా(51)తో పాటు మరో తొమ్మిది మంది ఈ ప్రమాదంలో మరణించినట్లు ఆ దేశ అధ్యక్ష భవనం మంగళవారం ఉదయం ప్రకటించింది. సోమవారం ఓ అధికారిక కార్యక్రమం కోసం ఆయన నేతృత్వంలోని బృందంగా బయల్దేరగా.. కాసేపటికే రాడార్ నుంచి ఆ ఎయిర్‌క్రాఫ్ట్ సంబంధాలు తెగిపోయింది. దీంతో.. భారీగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. అయితే ఈ ఉదయం విఫ్య పర్వతాల్లోని చికంగావా అడవుల్లో కూలిన ఎయిర్‌క్రాఫ్ట్ శకలాలను గుర్తించారు. అందులో ఎవరూ సజీవంగా లేరని ఆ దేశ అధ్యక్ష భవనం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ఈ దుర్ఘటనపై అధ్యక్షుడు లాజరస్ చక్వేరా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.సోమవారం ఎంజుజు నగరంలో ఓ కేబినెట్ మాజీ మినిస్టర్ అంత్యక్రియల కోసం ఈ బృందం బయల్దేరింది. ఇందులో ఉపాధ్యక్షుడు సావులోస్‌తో పాటు మానవ హక్కుల సంఘం నేత, మలావీ మాజీ ప్రథమ పౌరురాలు షానిల్ జింబిరి కూడా ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం 45 నిమిషాల అనంతరం ఎంజుజు అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. కానీ, ఆ సమయానికి అక్కడికి చేరుకోలేదు. కాసేపటికే ఆ విమానం రాడార్ నుంచి మాయమైందని, దీంతో విమానయాన అధికారులు దాంతో కాంటాక్ట్ కోల్పోయారని అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఆ వెంటనే అన్ని దళాలు చికంగావా అడవుల్లో ఎయిర్‌క్రాఫ్ట్ కోసం గాలింపు చేపట్టగా.. తన బహమాస్ పర్యటనను రద్దు చేసుకుని మరీ ఈ సెర్చ్ ఆపరేషన్‌ను పర్యవేక్షించారు. -
మలావీ ఉపాధ్యక్షుడి ఎయిర్‌క్రాఫ్ట్ గల్లంతు.. కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాఫ్టర్ ప్రమాదం ఘటన మరువక ముందే.. మరొ విమానం మిస్సింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆఫ్రికా దేశమైన మలావీ ఉపాధ్యక్షుడు ప్రయాణిస్తున్న సైనిక విమానం అదృశ్యమైంది. ఈ విషయాన్ని ఆ దేశ అధ్యక్ష కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. మలావీ ఉపాధ్యక్షుడు సావులోస్ చీలిమా (Saulos Chilima)తోపాటు మరో తొమ్మిది మందితో ఓ సైనిక విమానం సోమవారం దేశ రాజధాని లిలాంగ్వే నుంచి బయల్దేరింది. షెడ్యూల్ ప్రకారం 45 నిమిషాల అనంతరం ఎంజుజు అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. కానీ, ఆ సమయానికి అక్కడికి చేరుకోలేదు. ఆ విమానం రాడార్ నుంచి మాయమైందని, దీంతో విమానయాన అధికారులు దాంతో కాంటాక్ట్ కోల్పోయారని అధ్యక్ష కార్యాలయం తెలిపింది. గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు వెల్లడించింది. మరోవైపు అధ్యక్షుడు లాజరస్ చక్వేరా.. తన బహమాస్ పర్యటనను రద్దు చేసుకుని సావులోస్ విమానం సెర్చ్ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నారు. సెర్చ్ ఆపరేషన్ కోసం ఇతర దేశాల సహాయం కోరుతున్నారాయన. మలావీ మాజీ ప్రథమ పౌరురాలు షానిల్ జింబిరి కూడా ఈ విమానంలో ఉన్నట్లు సమాచారం. తొమ్మిది మందితో కూడిన ఈ సైనిక విమానం జూజూ నగరంలో ఓ కేబినెట్ మాజీ మినిస్టర్ అంత్యక్రియలకు హాజరు అయ్యేందుకు వెళ్లింది. సరిహద్దు దేశంలో ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొని తిరిగొస్తున్న ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దట్టమైన అటవీ ప్రాంతంలో కూలిపోయింది. ఈ ఘటనపై అనుమానాల నేపథ్యంలో.. ఇంకా తుది వెలువడాల్సి ఉంది. -
IND Vs PAK: పాక్-భారత్ మ్యాచ్‌లో అనూహ్య పరిణామం
న్యూయార్క్: దాయాది దేశాల మధ్య పోరులో మరోసారి భారత్‌దే పైచేయి అయ్యింది. న్యూయార్క్ లోని నసావు కౌంటీ స్టేడియంలో జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ టీమిండియా విజయం సాధించింది. అయితే.. మ్యాచ్ కొనసాగుతున్న సమయంలో జరిగిన ఓ అనూహ్య పరిణామం అందరి దృష్టిని ఆకర్షించింది.మ్యాచ్ జరుగుతున్న టైంలో స్టేడియంపై ఓ ఎయిర్‌క్రాఫ్ట్ ఎగిరింది. అది ఓ బ్యానర్ ను ప్రదర్శిస్తూ వెళ్లింది. ఆ బ్యానర్ పై ఇమ్రాన్ ఖాన్ ను విడుదల చేయండి (Release Imran Khan) అని రాసి ఉంది. మరోవైపు మ్యాచ్ జరుగుతున్న టైంలో స్టేడియంలో కొందరు ఇమ్రాన్ ఖాన్ ఫొటోలతో జిందాబాద్ నినాదాలు చేయడమూ కనిపించింది.A plane with the message "Release Imran Khan" flies over the stadium during the India vs. Pakistan T20 World Cup match. #Imrankhan #T20WC24 #viral #BreakingPedia pic.twitter.com/OHlCuQUFRZ— Breakingpedia (@breakingpediaBP) June 10, 2024 Credits: Breakingpedia VIDEO CREDITS: TOP POSTఅయితే.. పాక్-భారత్ మ్యాచ్‌కు గట్టి భద్రత ఉంటుందని న్యూయార్క్ పోలీసులు ఇదివరకే ప్రకటించారు. ఈ తరుణంలో ఆ విమానాన్ని స్టేడియం మీద ఎగరడానికి ఎలా అనుమతించారు?. దానిని నడిపిందెవరు?. దీనంతటి వెనుక ఉంది ఎవరు? ఇలాంటి అంశాలపై అక్కడి అధికారుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. -
విమానంలో కూర్చుని బిర్యానీ తింటూ.. ప్రకృతి అందాలను చూస్తుంటే..కిక్కే కిక్కు!
సామాన్యులకు విమానం అంటేనే పెద్ద వింత. దానిలో ప్రయాణించాలని చాలామంది కలలు కంటుంటారు.. ఇక దానిలో భోజనం చేసే అవకాశం దొరికితే ఎగిరి గంతేస్తారు. నిజమే విమానంలో కూర్చొని బిర్యానీ తింటూ.. విండో నుంచి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తుంటే ఆ కిక్కే వేరు. విజయవాడ వాసులకు ఈ అవకాశం దొరకుతోంది. చదవండి: వామ్మో!... రూ. 7 లక్షలు టిప్పా!!... షాక్‌కి గురైన వెయిటర్! విజయవాడ – గన్నవరం జాతీయ రహదారిపై నిడమానూరు వద్ద మూలనపడ్డ ఓ పాత విమానంలో రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. ఇది ‘డియర్ ఫుడ్ లవర్స్, యువర్ కైండ్ అటెన్షన్ ప్లీజ్.. స్పెషల్ డిన్నర్ ఫ్లైట్ ఈజ్ రెడీ టు సర్వ్’ అంటూ ఆహ్వానం పలుకుతోంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
విజయవంతంగా ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ విక్రాంత్ సీ ట్రయల్స్
సాక్షి, విశాఖపట్నం : ఇండియన్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ విక్రాంత్ సీ ట్రయల్స్ ముగిశాయి. ఎయిర్‌క్రాఫ్ట్ విజయవంతంగా సీ ట్రయల్స్ నిర్వహించి తిరుగు పయణమైంది. కొచ్చి హిందూ మహాసముద్రంలో 4 రోజుల పాటు సీ ట్రయల్స్ జరగనున్నాయి. ఇండియన్ నేవీ గతంలో బేసిక్ ట్రయల్స్ నిర్వహించింది. కాగా, ఇండియన్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ విక్రాంత్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది. స్వదేశీ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ నిర్మాణం చేపట్టే దేశాల సరసన భారత్ చేరింది. 2022 నాటికి విమాన వాహన నౌక అందుబాటులోకి రానుంది. రెండు టేకాఫ్ రన్వేలు, ఒక ల్యాండింగ్ స్ట్రిప్ ఏర్పాటు కానున్నాయి. -
పొలంలో కుప్పకూలిన విమానం
భోపాల్: పైలెట్లతో వెళ్తున్న విమానం ప్రమాదవశాత్తు వ్యవసాయ పొలంలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పైలెట్లు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ శివారులో చోటుచేసుకుంది. ఓ ప్రభుత్వ సర్వేకు వెళ్తున్న ఈ విమానం వెళ్తున్నట్టు సమాచారం. అయితే దీనికి సంబంధించిన వివరాలు గాంధీనగర్ పోలీస్ అధికారి అరుణ్ శర్మ తెలిపారు. ఆయన ప్రకారం.. భోపాల్ నుంచి గుణకు ముగ్గురు పైలెట్లతో కూడిన శిక్షణ విమానం శనివారం మధ్యాహ్నం రాజభోజ్ విమానాశ్రయం నుంచి బయల్దేరింది. బయల్దేరిన కొద్దిసేపటికే భోపాల్ శివారులోని బిషన్‌కేడీ ప్రాంతంలో ఆ విమానం పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు పైలెట్లు గాయాలపాలయ్యారు. ఈ ఘటనతో స్థానిక ప్రజలు భయాందోళన చెందారు. అయితే వెంటనే విషయం గమనించి గాయపడిన వారిని పోలీసుల సహాయంతో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే విమానం కూలిపోవడానికి గల కారణాలు తెలియలేదు. మంటలు వ్యాపించడంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఆర్పేశారు. చదవండి: ‘ఇటుక’ దొంగతనం చేశాడని హీరోపై బీజేపీ ఫిర్యాదు చదవండి: మమతా బెనర్జీ ఆడియో క్లిప్ వైరల్ -
గవర్నర్ విమాన ప్రయాణానికి సీఎం అడ్డు
ముంబై: దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్లు, ముఖ్యమంత్రుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో వివాదాలు ఉన్నాయి. పశ్చిమబెంగాల్, మహారాష్ట్రలో ఆ పరిస్థితి తీవ్రంగా ఉంది. తాజాగా గవర్నర్ విమానంలో ప్రయాణించేందుకు సిద్ధమవగా ఆయనకు ప్రభుత్వ అనుమతి లేదని తెలిసి ఆయన ప్రైవేటు విమానంలో డెహ్రూడన్ వెళ్లారు. ఈ ఘటన మహారాష్ట్రలో వివాదం రాజుకుంది. గవర్నర్ విమాన ప్రయాణానికి ముఖ్యమంత్రి అడ్డు తగిలారనే విమర్శలు వస్తున్నాయి. మహారాష్ట్రలో ఎన్నికల అనంతరం సీఎం ఉద్దవ్ థాక్రే, గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి మధ్య విభేదాలు పెరిగాయి. అవి తగ్గకపోగా ఇంకా పెరుగుతున్నాయి. గవర్నర్ విమాన ప్రయాణానికి మహా అఘాడీ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఉత్తరాఖండ్‌లో ఇటీవల సంభవించిన విషాద సంఘటన గురించి తెలుసుకునేందుకు విమానంలో డెహ్రడూన్ వెళ్లేందుకు కోశ్యారి సిద్ధమయ్యారు. ఈ మేరకు ముంబైలోని విమానాశ్రయానికి వెళ్లి రెండు గంటల పాటు వేచి ఉన్నారు. ప్రభుత్వ విమానంలో కూర్చున్న తర్వాత 15 నిమిషాల తర్వాత టేకాఫ్‌కు అనుమతి రాలేదని ఎయిర్‌క్రాఫ్ట్ కెప్టెన్ చెప్పారు. దీంతో కోశ్యారి చివరికి మరో విమానంలో టికెట్ బుక్ చేసుకొని వెళ్లాల్సి వచ్చింది. వారం కిందటే గవర్నర్ పర్యటన గురించి ప్రభుత్వానికి చెప్పినా.. అనుమతి రాకపోవడం చాలా అసహజంగా ఉన్నదని గవర్నర్ కార్యాలయ వర్గాలు చెప్పాయి. దీనిపై డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అజిత్ పవార్ స్పందించారు. గవర్నర్‌కు విమానం ఇచ్చారో లేదో తనకు తెలియదని, కార్యాలయానికి వెళ్లి తెలుసుకుంటానని చెప్పారు. దీనిపై శివసేన ఎంపీ వినాయక్ రౌత్ కూడా స్పందించారు. ప్రభుత్వ విమానాన్ని వినియోగించుకునేందుకు గవర్నర్‌కు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఆయన ప్రభుత్వ అనుమతి కోరారని అయితే ఆ విమానం ప్రయాణించగలదా లేదా అని తెలియలేదని పేర్కొన్నారు. ఈ కారణంగానే గవర్నర్‌కి అనుమతి లభించకపోయి ఉండవచ్చని తెలిపారు. అయితే ప్రభుత్వ నిబంధనలు మాత్రం సీఎం, డిప్యూటీ సీఎం మాత్రమే ప్రభుత్వ విమానాన్ని వినియోగించుకునేందుకు హక్కు ఉంది. ఇతరులు వాడాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఈ కారణంగానే అనుమతి లభించలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే కక్షపూరితంగానే ప్రభుత్వం గవర్నర్‌కు విమానం అనుమతి ఇవ్వలేదని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. గవర్నర్‌కు, ముఖ్యమంత్రికి మధ్య గతంలోనే వివాదాలు ఉన్నాయి. లాక్డౌన్ అనంతరం రాష్ట్రంలో ఆలయాలను తెరిచేందుకు ప్రభుత్వం అనుమతివ్వకపోవడంపై గవర్నర్ ప్రశ్నించారు. దీనిపై సీఎం ఉద్దవ్ థాక్రే, గవర్నర్‌కు మధ్య లేఖల యుద్ధం జరిగింది. ఇప్పుడు తాజాగా విమాన అనుమతి విషయమై వివాదం రేగేలా ఉంది. -
ఎతిహాడ్ ఏయిర్‌వేస్ కీలక ప్రకటన
దుబాయ్: అబుదాబికి చెందిన ఎతిహాడ్ ఏయిర్‌వేస్ మంగళవారం కీలక ప్రకటన చేసింది. వంద కోట్ల అమెరికన్ డాలర్ల ఒప్పందంలో భాగంగా తన 38 ఏయిర్ విమానాలను పెట్టుబడి సంస్థ కేకేఆర్, లీజింగ్ కంపెనీ ఆల్టవైర్ ఎయిర్ ఫైనాన్స్‌కు విక్రయించనున్నట్లు పేర్కొంది. తాజా ఖర్చు తగ్గింపు చర్యల్లో భాగంగా ఎతిహాడ్ ఎయిర్వేస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 38 ఏయిర్ విమానాలు, 22 ఏయిర్ బస్-A330, 16 బోయింగ్ 7777- 300ER లను ఒప్పందంలో భాగంగా పెట్టుబడి సంస్థ కేకేఆర్, లీజింగ్ కంపెనీ ఆల్టవైర్ ఎయిర్ ఫైనాన్స్‌లకు విక్రయించినట్లు ఎతిహాడ్ ఏయిర్ వేస్ ఓ ప్రకటనలో తెలిపింది. 2020 ప్రారంభంలో కొనుగోలు చేసిన బోయింగ్ 777-300ER విమానాలను తిరిగి ఎతిహాడ్ సంస్థకు లీజుకు ఇస్తామని.. అదేవిధంగా ఏయిర్‌బస్ A330లను అంతర్జాతీయ ఖాతాదారులకు కేటాయిస్తామని కేకేఆర్ సంస్థ పేర్కొంది. ఈ ఒప్పందం స్థిరత్వాన్ని అందిస్తోందని.. అదే విధంగా తమ లక్ష్యాలకు అండగా నిలడబతుందని ఎతిహాడ్ సంస్థ తెలిపింది. -
విమానాశ్రయంలో ప్రమాదం.. ఇద్దరి మృతి
ఖాట్మండ్ : నేపాల్ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. ఐదుగురుకి తీవ్ర గాయాలయ్యాయి. టెన్జింగ్ హిల్లరీ లుక్లా ఎయిర్‌పోర్ట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. పార్క్ చేసిన చాపర్‌ను ఎయిర్‌క్రాఫ్ట్ డీకొట్టడంతో ఈ దుర్ఘటన సంభవించింది. -
ఏరో ఇండియా షోలో భారీ అగ్నిప్రమాదం
-
బెంగళూరులో ‘కారు’ చిచ్చు
సాక్షి, బెంగళూరు: బెంగళూరులోని యెలహంక వైమానిక స్థావరంలో జరుగుతున్న ఏరో ఇండియా షోలో మరో అపశ్రుతి చోటుచేసుకుంది. నాలుగో రోజైన శనివారం పార్కింగ్ ప్రదేశంలో మంటలు చెలరేగి 300కుపైగా సందర్శకుల కార్లు బుగ్గిపాలయ్యాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదానికి అసలు కారణం తెలియరాలేదు. ఎవరో సిగరెట్ కాల్చడం వల్ల మంటలు చెలరేగాయని, ఓ కారులోని సిలిండర్ పేలడంతో మంటలు చెలరేగాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఈ నెల 19న రెండు సూర్యకిరణ్ విమానాలు ఢీకొని పైలట్ మృతిచెందిన ఘటనను మరువక ముందే ఈ ప్రమాదం జరిగింది. కార్లు దగ్ధం కావడంపై కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు హోం మంత్రి ఎంబీ పాటిల్ చెప్పారు. ఎండ, గాలితో వేగంగా విస్తరించి.. తొలి మూడు రోజులు అధికారులు, వ్యాపారులు, మీడియా ప్రతినిధులు, ఇతర ప్రముఖులకు మాత్రమే పరిమితమైన ఏరో షోలో శనివారం సామాన్య ప్రజలను అనుమతించారు. నాలుగో శనివారం సెలవు దినం కావడంతో ప్రదర్శనకు భారీ ఎత్తున సందర్శకులు తరలివచ్చారు. ఎయిర్‌బేస్‌లోని అన్ని గేట్లు, పార్కింగ్ ప్రదేశాల్లో కార్లు కిక్కిరిసిపోయాయి. మధ్యాహ్నం 12గంటలవేళ ఐదో నంబర్ గేట్ పార్కింగ్ ప్రాంతంలో అగ్నికీలలు ప్రారంభమయ్యాయి. ఎండ, గాలి తోడవడంతో క్షణాల్లోనే మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించాయి. పార్కింగ్ ప్రాంతంలోని ఒక్కొక్క కారుకు మంటలు అంటుకుంటూ మొత్తం 300కు పైగా కార్లు కళ్లెదుటే కాలిపోయాయి. కార్లలోని ఇంధనం అగ్నికి ఆజ్యం పోసింది. ఎగిసిపడుతున్న మంటలు, దట్టమైన పొగ పరిసర ప్రాంతాల్లో వ్యాపించడంతో సందర్శకులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం తెలుసుకుని ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 15 ఫైరింజన్లతో మంటలను ఆర్పారు. ప్రమాదం నేపథ్యంలో సుమారు రెండు గంటల పాటు ఏరో షోలో ప్రదర్శన, వైమానిక విన్యాసాలు, తదితర కార్యక్రమాలను అధికారులు నిలిపేశారు. తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు పునరుద్ధరించారు. విలపించిన యజమానులు.. సందర్శకుల్లో చాలామంది తమ కార్లు కళ్ల ముందే కాలిపోతుంటే చూడలేక కన్నీటి పర్యంతమయ్యారు. కార్లలో ఉంచిన విలువైన వస్తువులు, పత్రాలు కూడా బూడిదైనట్లు కొందరు విలపిస్తూ చెప్పారు. అప్పులు చేసి మరీ కారు కొన్నామని, ఇప్పుడేం చేయాలో దిక్కుతోచడం లేదని కొందరు వాపోయారు. -
పైలట్‌గా మారిన బ్యూటీ
పైలట్ అయి విమానాన్ని నడిపేశానని సంబరపడిపోతోంది నటి కాజల్ అగర్వాల్. ఏంటీ ఇదేదో సినిమాలో ఈ బ్యూటీ పైలెట్‌గా నటిస్తోందని అనుకుంటున్నారా? కాదండీ బాబు. మగువ పైలెట్లయ్యారంటే ఒకప్పుడు నమ్మశక్యం కాదేమోగానీ, ఈ రోజుల్లో అసాధ్యమేమీ కాదు. మహిళలు అన్ని రంగాల్లోనూ పురుషులతో పోటీ పడుతున్నారు. అలా నటి కాజల్ విమానాన్ని ఈజీగా విమానాన్ని నడిపేసింది. సాహసాలు చేయడాన్ని చాలెంజ్‌గా తీసుకుంటానంటున్న కాజల్‌అగర్వాల్‌కు ఈ మధ్య అవకాశాలు తగ్గు ముఖం పట్టాయి. చేతిలో ఇప్పుడు రెండు చిత్రాలే ఉన్నాయి. దీంతో అమ్మడు తన స్నేహితులతో టూర్లు చెక్కేస్తూ తెగ ఎంజాయ్ చేస్తోంది. అంతేకాదు సాహస విన్యాసాలు చేసేస్తోంది. ఆ సంగతేంటో కాజల్‌నే అడుగేద్దాం. ఏంటీ తెగ ఆనందపడిపోతున్నారన్న ప్రశ్నకు కాజల్ బదులిస్తూ ‘జీవితంలో నిజమైన సంతృప్తి మనం ఊహించని విధంగా చేసే సాహసంతో కలుగుతుంది. కొంచెం ధైర్యం, తెలివి ఉంటే చాలు అలాంటి అనుభవాలను పొందవచ్చు. అలాంటి అనుభవాలను నేను చాలా చవి చూశాను. అందులో విమానాన్ని నడిపిన అనుభవం ఒక్కటి. అదో మధురమైన అనుభవం. స్నేహితులతో కలిసి ఇటీవల కౌలాలంపూర్ వెళ్లాను. అక్కడ ఒక ప్రైవేట్ జెట్ విమానాన్ని తీసుకున్నాం. నలుగురు మాత్రమే కూర్చోవడానికి అందులో వీలవుతుంది. నేను పైలట్ పక్క సీటులో కూర్చున్నాను. అ సమయంలో విమానాన్ని నడపాలన్న కోరిక పుట్టింది. అందుకు పైలెట్ సహకరించారు. ఆయన సూచనలతో నేనే విమానాన్ని నడిపి ఆకాశాన్ని చుట్టొచ్చాను. ఎత్తైన భవనాల మధ్య విమానం దూసుకుపోతుంటే భలే థ్రిల్ ఫీలయ్యా. ఆ సమయంలో ట్విన్ టవర్పైగా విమానాన్ని నడపాలని ఆశ కలిగింది. అయితే అలా పయనించకూడదని పైలెట్ చెప్పడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాను. మొత్తం మీద విమానాన్ని నడిపిన అనుభూతి మరచిపోలేనిది. ఇలాంటి సాహసాలు ఇంతకు ముందు కూడా చాలా చేశాను’ అని కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చారు. -
కొత్త నోట్ల తరలింపు ఖర్చు రూ.29.41 కోట్లు
న్యూఢిల్లీ : భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) నోట్ల రద్దు సమయంలో రూ.500, రూ.2000ల నోట్లను తరలించటానికి ఏకంగా రూ. 29 కోట్లు ఖర్చు చేసింది. తక్కువ సమయంలో ఎక్కువ మొత్తం డబ్బులు రవాణా చేయటానికి వీలుగా సైనిక విమానాలను ఉపయోగించటం వల్ల ఈ మొత్తం ఖర్చు అయినట్లు సమాచారం. నవంబర్ 8, 2016న 500, 1000 రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు భారత ప్రధాని మోదీ ప్రకటించారు. దీంతో అత్యధిక భాగం సరఫరాలో ఉన్న డబ్బు చెల్లుబాటులో లేకుండా పోయింది. ఆర్బీఐ వీటి స్థానంలో కొత్త నోట్లను అందుబాటులోకి తెచ్చింది. వాటిని దేశం మొత్తం సరఫరా చేయటానికి సీ-17, సీ-130 సూపర్ హెర్క్యులీస్ వంటి సైనిక విమానాలను ఉపయోగించింది. దీంతో ఆ విమానాల నిర్వహణకు పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వచ్చింది. రిజర్వ్ బ్యాంక్ కొత్త 500, 2000 రూపాయల నోట్లు ముద్రించటానికి 2016-17 సంవత్సరానికి గానూ దాదాపు రూ. 7,965 కోట్లు ఖర్చు చేసింది. గత సంవత్సరం మిగిలిన చిల్లర మొత్తాలను ముద్రించటానికి రూ. 3,421కోట్లు ఖర్చు చేసింది. ఉపసంహరణకు గురైన పాత నోట్లు 99శాతం బ్యాంకులకు చేరుకున్నాయని రిజర్వ్ బ్యాంకు తెలిపింది. కొత్త నోట్ల రవాణా కోసం సైనిక విమానాలను కాకుండా మామూలు విమానాలను ఉపయోగించి ఉంటే బాగుండేదని రిటైర్డ్ ఆర్మీ కమాండర్ లోకేష్ బట్రా అభిప్రాయపడ్డారు. -
ఘోరం : హెలికాప్టర్, విమానం ఢీ
లండన్ : హెలికాప్టర్, లైట్ వెయిట్ ఎయిర్క్రాప్ట్లు ఒకదాన్ని మరొకటి ఢీ కొని నలుగురు దుర్మరణం పాలైన ఘటన యూనైటెడ్ కింగ్డమ్లో శనివారం చోటు చేసుకుంది. ఐలెస్బ్యూరీ చేరువలో ఈ ప్రమాదం జరిగినట్లు ఎయిర్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్(ఏఏఐబీ) పేర్కొంది. క్రాష్ జరిగిన సమయంలో పెద్ద శబ్దం వినిపించినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఘటన అనంతరం సహాయక బృందాలు హుటాహుటిన అక్కడకు చేరుకున్నాయి. కానీ అప్పటికే అందరూ చనిపోయినట్లు తెలిసింది. మృతుల కుటుంబాలకు అధికారులు సమాచారం అందించారు. -
విమానాన్ని తయారుచేశాడు కానీ ?
తిరువనంతపురం: అతనో పుట్టు మూగ చెవిటి. చదవింది 7వ తరగతి మాత్రమే. అయితేనేం..టాలెంట్ కేమీ కొదవ లేదు. అనుకున్నది సాధించాలన్న పట్టు వీడలేదు. అతని సాంకేతిక నైపుణ్యాన్ని గుర్తించిన డిస్కవరీ ఛానల్ ఒక డాక్యుమెంటరీ కూడా చేసింది. కానీ ఇపుడు భార్యాబిడ్డలను పోషించుకోవడానికి ఏదైనా ఓ చిరుద్యోగం దొరికితే బావుండు అని ఎదురు చూస్తున్నాడు.... వివరాల్లోకి వెళితే కేరళకు చెందిన సాజి థామస్ (45) మాట్లాడలేడు.. వినలేడు. అయితేనేమీ విభిన్నమైన ఆలోచనలు అతని మదిలో నిరంతరం మెదిలేవి. ఎపుడూ మోటార్లు, మెషీన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, వాటి రిపేర్లు ఇదే అతడి లోకం. మొదట్లో అతని భార్య మరియాకు ఇదేమీ అర్థం కాలేదు. భర్త ఓ మంచి ఎలక్ట్రీషియన్ స్థిరపడితే బావుండు కదా..ఎందుకు ఈ పనికిరాని పనులు అనుకునేది. కానీ భర్తకున్న ఆసక్తిని గమనించి అతని అన్ని విధాలుగా అండగా నిలిచింది. అలా 14 ఏళ్లు అతనికి తోడ్పాటు అందించింది. ముందు ఒక హెలికాప్టర్ నమూనా తయారుచేశాడు. ఆ తరువాత ఇద్దరు ప్రయాణించడానికి వీలుగా అతి తేలికైన విమానాన్ని రూపొందించాడు. వీటిపైనే డిస్కవరీ ఛానల్ ఒక కార్యక్రమాన్ని కూడా రూపొందించింది. ఆ తరువాత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీతో కూడా సాజికి పరిచయం ఉంది. సాజిలో ఉన్న ఉత్సుకతను గమనించిన రాజీవ్ తప్పకుండా సాయం చేస్తానని హామీ కూడా ఇచ్చారు. కానీ 1991 లో రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు. అయినా సాజి నిరుత్సాహపడలేదు. పట్టుదల మరింత పెరిగింది. విమానాన్ని తయారు చేయాలన్న తన ప్రయత్నాన్ని కొనసాగించాడు. సుమారు అయిదేళ్ల కఠోర దీక్ష, శ్రమ తరువాత ఒక చిన్న విమానానికి (రెండు చక్రాల ఇంజిన్ కలిగిన) రూపకల్పన చేశాడు. మధురైకి సమీపంలోని అంబా సముద్రం ఎయిర్ లైన్ అకాడమీ అతని విమానాన్ని పరిశీలించింది. చీఫ్ ఇన్స్ట్రక్టర్ , మాజీ విమానదళ అధికారి కొన్ని నిమిషాలపాటు దీన్ని గాల్లో చక్కర్లు కొట్టించారు. కానీ అతనికిగానీ, అతను కనిపెట్టిన విమానానికి గానీ లైసెన్స్ లభించలేదు. నిబంధనలు అనుమతించడంలేదని అధికారులు సమాధానమిచ్చారు. సాజి దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయాడు. కుటుంబాన్ని ఎలా పోషించాలో అర్థంకాక అయోమయంలో ఉన్నాడు. కాగా ఈ విమానాన్ని తయారుచేయడానికి 13 లక్షల రూపాయల వెచ్చించాడు. ఈ క్రమంలో తన హాబీ కోసం మొత్తం ఉన్న ఆస్తి అంతా ఖర్చుపెట్టాడు. దాదాపు 25 లక్షలు హారతికర్పూరంలా కరిగిపోయాయి. దీంతో సాజి కుటుంబంలో కష్టాల్లో పడింది. అధికారులు ఇప్పటికైనా తన భర్తకు సరైన ప్రోత్సాహాన్నివ్వాలని సాజి భార్య మరియా కోరుతోంది. అతని ప్రతిభను గుర్తించి ఆదుకోవాలని విజ్క్షప్తి చేస్తోంది. ప్రభుత్వం తన భర్తకు ఉద్యోగాన్ని కల్పించి తమ కుటుంబానికి వేడుకుంటోంది. తద్వారా తమ బిడ్డ జోషు(13) కొడుకును మంచి సాంకేతిక నిపుణుడుగా చేయాలని తమ కోరికను నెరవేర్చాంటూ కన్నీళ్లతో అభ్యర్థిస్తోంది. తన భర్తపై రూపొందించిన ఈ డాక్యుమెంటరీ త్వరలో ప్రసారం కానుందని తెలిపింది. అటు ఇదిక్కి జల్లాలో గ్రామ ప్రజలు కూడా సాజికి మద్దతు తెలిపారు. ప్రభుత్వం అతనిని ఆదుకోవాలని కోరుతున్నారు.