మలావీ ఎయిర్‌క్రాఫ్ట్‌ మిస్సింగ్‌ విషాదాంతం.. ఉపాధ్యక్షుడి దుర్మరణం | Malawi Confirms Death Of Vice-President In Plane Crash | Sakshi
Sakshi News home page

మలావీ ఎయిర్‌క్రాఫ్ట్‌ మిస్సింగ్‌ విషాదాంతం.. ఉపాధ్యక్షుడు సహా 10 మంది దుర్మరణం

Published Tue, Jun 11 2024 12:30 PM

Malawi Confirms Death Of Vice-President In Plane Crash

లిలాంగ్వే: మలావీ ఆర్మీ ఎయిర్‌క్రాఫ్ట్‌ మిస్సింగ్‌ ఉదంతం విషాదాంతంగా ముగిసింది. ఉపాధ్యక్షుడు సావులోస్‌ చీలిమా(51)తో పాటు మరో తొమ్మిది మంది ఈ ప్రమాదంలో మరణించినట్లు ఆ దేశ అధ్యక్ష భవనం మంగళవారం ఉదయం ప్రకటించింది. 

సోమవారం ఓ అధికారిక కార్యక్రమం కోసం ఆయన నేతృత్వంలోని బృందంగా బయల్దేరగా.. కాసేపటికే రాడార్‌ నుంచి  ఆ ఎయిర్‌క్రాఫ్ట్‌ సంబంధాలు తెగిపోయింది. దీంతో.. భారీగా సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. అయితే ఈ ఉదయం విఫ్య పర్వతాల్లోని చికంగావా అడవుల్లో కూలిన ఎయిర్‌క్రాఫ్ట్‌ శకలాలను గుర్తించారు. అందులో ఎవరూ సజీవంగా లేరని ఆ దేశ అధ్యక్ష భవనం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ఈ దుర్ఘటనపై అధ్యక్షుడు లాజరస్‌ చక్వేరా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

సోమవారం ఎంజుజు నగరంలో ఓ కేబినెట్‌ మాజీ మినిస్టర్‌ అంత్యక్రియల కోసం ఈ బృందం బయల్దేరింది. ఇందులో ఉపాధ్యక్షుడు సావులోస్‌తో పాటు మానవ హక్కుల సంఘం నేత, మలావీ మాజీ ప్రథమ పౌరురాలు షానిల్‌ జింబిరి కూడా ఉన్నారు.  షెడ్యూల్‌ ప్రకారం 45 నిమిషాల అనంతరం ఎంజుజు అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. కానీ, ఆ సమయానికి అక్కడికి చేరుకోలేదు. 

కాసేపటికే ఆ విమానం రాడార్ నుంచి మాయమైందని, దీంతో విమానయాన అధికారులు దాంతో కాంటాక్ట్‌ కోల్పోయారని అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఆ వెంటనే అన్ని దళాలు  చికంగావా అడవుల్లో ఎయిర్‌క్రాఫ్ట్‌ కోసం గాలింపు చేపట్టగా.. తన బహమాస్‌ పర్యటనను రద్దు చేసుకుని మరీ ఈ సెర్చ్‌ ఆపరేషన్‌ను పర్యవేక్షించారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement