aircraft crash
-
మలావీ ఎయిర్‌క్రాఫ్ట్ మిస్సింగ్ విషాదాంతం.. ఉపాధ్యక్షుడి దుర్మరణం
లిలాంగ్వే: మలావీ ఆర్మీ ఎయిర్‌క్రాఫ్ట్ మిస్సింగ్ ఉదంతం విషాదాంతంగా ముగిసింది. ఉపాధ్యక్షుడు సావులోస్ చీలిమా(51)తో పాటు మరో తొమ్మిది మంది ఈ ప్రమాదంలో మరణించినట్లు ఆ దేశ అధ్యక్ష భవనం మంగళవారం ఉదయం ప్రకటించింది. సోమవారం ఓ అధికారిక కార్యక్రమం కోసం ఆయన నేతృత్వంలోని బృందంగా బయల్దేరగా.. కాసేపటికే రాడార్ నుంచి ఆ ఎయిర్‌క్రాఫ్ట్ సంబంధాలు తెగిపోయింది. దీంతో.. భారీగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. అయితే ఈ ఉదయం విఫ్య పర్వతాల్లోని చికంగావా అడవుల్లో కూలిన ఎయిర్‌క్రాఫ్ట్ శకలాలను గుర్తించారు. అందులో ఎవరూ సజీవంగా లేరని ఆ దేశ అధ్యక్ష భవనం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ఈ దుర్ఘటనపై అధ్యక్షుడు లాజరస్ చక్వేరా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.సోమవారం ఎంజుజు నగరంలో ఓ కేబినెట్ మాజీ మినిస్టర్ అంత్యక్రియల కోసం ఈ బృందం బయల్దేరింది. ఇందులో ఉపాధ్యక్షుడు సావులోస్‌తో పాటు మానవ హక్కుల సంఘం నేత, మలావీ మాజీ ప్రథమ పౌరురాలు షానిల్ జింబిరి కూడా ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం 45 నిమిషాల అనంతరం ఎంజుజు అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. కానీ, ఆ సమయానికి అక్కడికి చేరుకోలేదు. కాసేపటికే ఆ విమానం రాడార్ నుంచి మాయమైందని, దీంతో విమానయాన అధికారులు దాంతో కాంటాక్ట్ కోల్పోయారని అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఆ వెంటనే అన్ని దళాలు చికంగావా అడవుల్లో ఎయిర్‌క్రాఫ్ట్ కోసం గాలింపు చేపట్టగా.. తన బహమాస్ పర్యటనను రద్దు చేసుకుని మరీ ఈ సెర్చ్ ఆపరేషన్‌ను పర్యవేక్షించారు. -
ఆ్రస్టేలియాలో కూలిన అమెరికా నేవీ విమానం
కేన్బెర్రా: ఆ్రస్టేలియాలో జరుగుతున్న సైనిక విన్యాసాల్లో అమెరికాకు చెందిన నౌకా దళ విమానం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు నేవీ సభ్యులు మరణించారు. అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాలతో కలిసి ఆ్రస్టేలియాలోని మెలి్వలె ద్వీపంలో విన్యాసాల్లో శిక్షణ ఇస్తుండగా ఆదివారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో విమానంలో 23 మంది ఉండగా ముగ్గురు మరణించారు. 20 మంది గాయపడ్డారు. వారిలో అయిదుగురి పరిస్థితి విషమంగా ఉంది. -
నేపాల్ లో రన్‌వేపై కుప్ప కూలిన విమానం
-
గోవా తీరంలో కుప్పకూలిన మిగ్-29కే ఫైటర్ జెట్
పనాజీ: భారత నౌకాదళానికి చెందిన మిగ్-29కే ఫైటర్ జెట్ ప్రమాదానికి గురైంది. గోవా తీరంలో సాధారణ పెట్రోలింగ్‌కు వెళ్లి నేవీ బేస్‌కు తిరిగి వస్తున్న క్రమంలో సముద్రంలో కుప్పకూలిపోయింది. యుద్ధవిమానంలో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగానే కూలిపోయినట్లు నౌకదళం వెల్లడించింది. అయితే, ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. సమాచారం అందుకున్న వెంటనే పైలట్‌ను రక్షించి ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. మిక్-29కే యుద్ధ విమానం ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తునకు ఆదేశించింది నేవీ. 2019 నుంచి మిగ్-29కే ప్రమాదానికి గురికావటం ఇది నాలుగోది. ఫైటర్ జెట్‌లో రష్యా తయారు చేసిన కే-36డీ-3.5 జెట్ నుంచి విడిపోయే సీటు ఉంది. ఈ సాంకేతికత ప్రపంచంలోనే అత్యాధునికమైనదిగా చెబుతారు. హ్యాండిల్ లాగగానే ముందుగా వెనుక సీట్లో ఉన్న పైలట్, ఆ తర్వాత ముందు సీటులోని పైలట్ జైట్ నుంటి బయటపడతారు. ఇదీ చదవండి: ‘మాకు 5జీ ఫోన్లు కావాలి’, స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలకు కేంద్రం ఆదేశాలు -
29 మంది పైలట్లు దుర్మరణం: ప్రధాన కారణం ఇదే!
సాక్షి:హైదరాబాద్: విమాన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన పైలట్ల సమాచార సమాచారాన్ని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ)డేటా ప్రకారం 2014 నుండి ఇప్పటివరకు విమాన ప్రమాదాల్లో 29 మంది పైలట్లు మరణించినట్లు వెల్లడించింది. హైదరాబాద్‌కు చెందిన ఆర్టీఐ కార్యకర్త రాబిన్ జాకీస్ దాఖలు చేసిన సమాచార హక్కు పిటిషన్‌కు ప్రతిస్పందనగా ఈ సమాచారం అందించింది. గత ఎనిమిదేళ్లలో జరిగిన మొత్తం 19 ప్రమాదాల్లో ఆరు మహారాష్ట్రలోనే జరిగాయి. ఈ ఆరు ప్రమాదాల్లో 10 మంది పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్ర తర్వాత అత్యధిక ప్రమాదాలు మధ్యప్రదేశ్‌లో జరిగాయి. ఈ రాష్ట్రంలో రెండు ప్రమాదాల్లో ఇద్దరు పైలట్లు మృతి చెందారు. ప్రభుత్వ యాజమాన్యంలోని హెలికాప్టర్ సర్వీస్ ప్రొవైడర్ పవన్ హన్స్ మూడు విమాన ప్రమాదాలు జరగ్గా, ఇదే అత్యధికంగా ఆరు మరణాలకు దారితీసింది.ఈ 19 క్రాష్లలో చాలా వరకు ఐదు 2015లో, నాలుగు 2020లో, 2019, 2018 సంవత్సరాల్లో ఒక్కొక్కటి చోటుచేసుకున్నాయి. ఏఏఐబీ వెబ్సైట్లో ఉన్న నివేదికల ప్రకారం ప్రమాదాల వెనుక అత్యంత సాధారణ కారణం పైలట్ లోపం అని పేర్కొంది. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో జరిగిన విమాన ప్రమాదంలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. రన్‌వేపై ల్యాండ్ అవుతుండగా విమానం కుప్పకూలిన ఘటనలో పైలట్లిద్దరూ మరణించిన సంగతి తెలిసిందే. -
ల్యాండింగ్ చేస్తూ ఢీ కొట్టిన రెండు విమానాలు
వాషింగ్టన్: ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ చేసే సమయంలో రెండు మినీ విమానాలు ఢీకొని ఘోర ప్రమాదం జరిగింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన దుర్ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. వాట్సోన్‌విల్లే నగరంలోని స్థానిక విమానాశ్రయంలో రెండు విమానాలు ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నించగా ఈ ప్రమాదం జరిగినట్లు చెప్పారు. ‘వాట్సోన్‌విల్లే మున్సిపల్ ఎయిర్‌పోర్ట్‌లో 2 విమానాలు ల్యాండింగ్ చేసే ప్రయత్నంలో ఢీకొన్నాయి. ఈ సంఘటనపై పలు ఏజెన్సీలు సత్వరం స్పందించాయి. పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు మాకు సమాచారం ఉంది.’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు స్థానిక అధికారులు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మరోవైపు.. ఫెడరల్ ఏవియేషన్ ప్రకారం.. ట్విన్ ఇంజిన్ సెస్నా 340 విమానంలో ఇద్దరు, సింగిల్ ఇంజిన్ సెస్నా152 విమానంలో పైలట్ ఉన్నారు. ఎవరైనా ప్రాణాలతో బయటపడ్డారా? అనే విషయం తెలియరాలేదని పేర్కొంది ఎఫ్ఏఏ. Multiple agencies responded to Watsonville Municipal Airport after 2 planes attempting to land collided. We have reports of multiple fatalities. Report came in at 2:56pm. Investigation is underway, updates to follow. pic.twitter.com/pltHIAyw5p — City of Watsonville (@WatsonvilleCity) August 18, 2022 ఇదీ చదవండి: ఆకాశమే ఆమె హద్దు.. -
బంధం తెగినా.. ఒక్కటిగానే మృత్యువు ఒడిలోకి..
Indian Family Died in Nepal Plane Crash: మనస్పర్థలు పెరిగాయి. భార్యాభర్తల బంధానికి బీటలు వారింది. చట్టం దృష్టిలో విడాకులతో వాళ్లిద్దరూ విడిపోయారు. కానీ, కన్నబిడ్డల రూపంలో దగ్గరగా గడిపే అవకాశం దొరికింది ఆ జంటకు. వారి మధ్య సంతోషాన్ని చూసి ఆ విధికి కన్ను కుట్టిందేమో.. విషాదాంతంగా ముగిసింది ఆ కుటుంబం కథ. నేపాల్ ఎయిర్‌క్రాఫ్ట్ దుర్ఘటనలో ఇప్పటిదాకా 22 మృతదేహాలను గుర్తించారు. ఘటనస్థలం నుంచి బ్లాక్‌బాక్స్‌ను సేకరించి.. ప్రమాదానికి గల కారణాలను కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నారు. అయితే.. దుర్మరణం పాలైన వాళ్లలో భారత్‌కు చెందిన ఓ కుటుంబం కూడా ఉండడం.. విషాదాన్ని నింపుతోంది. ఒడిషాకు చెందిన అశోక్ కుమార్ త్రిపాఠి(54), ఆయన భార్య వైభవి బందేకర్ త్రిపాఠి(51)కి చాలాకాలం కిందటే వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకున్నారు. అశోక్ కుమార్ మరో వివాహం చేసుకున్నాడు. కానీ, వైభవి మాత్రం తన తల్లితో ఉంటూ.. కన్నబిడ్డలిద్దరి బాధ్యతలు చూసుకుంటోంది. అయితే విడాకులతో విడిపోయినా ఆ జంటకు కలిసే అవకాశం కల్పించింది న్యాయస్థానం. ఏడాదిలో పది రోజుల పాటు కొడుకు, బిడ్డతో కలిసి సరదాగా గడపాలని ఈ మాజీ జంటకు ఆదేశించింది. విడాకుల తర్వాత అశోక్ ఒడిషాలోనే ఉంటూ ఓ కంపెనీని రన్ చేస్తున్నాడు. థానే(ముంబై)లో ఉంటూ ఓ ఫైనాన్షియల్ కంపెనీని నడిపిస్తోంది వైభవి. ఈ క్రమంలో.. కొడుకు ధనుష్ (22), కూతురు రితిక(15)తో కలిసి ఈ ఏడాదికిగానూ హిమాలయా పర్యటనకు వెళ్లారు. ఆదివారం నేపాల్ టూరిస్ట్ సిటీ అయిన పొఖారాకు వెళ్లారు. అదే రోజు జరిగిన ఘోర ప్రమాదంలో ఈ కుటుంబం దుర్మరణం పాలైంది. వీళ్ల మరణ వార్తతో థానేలోని బల్కమ్ ఏరియాలో విషాదం నెలకొంది. ఇక్కడే రుస్తోమ్జీ అథేనా హౌజింగ్ సొసైటీలో వైభవి నివాసం ఉంటోంది. ప్రమాదం వార్త విని స్థానికులంతా షాక్‌లో ఉన్నారు. -
ఐదు గంటల సస్పెన్స్.. కాలిపోయిన స్థితిలో మృతదేహాలు
గమ్యస్థానానికి చేరుకోవాల్సింది అరగంటలోపే. కానీ, నింగికి ఎగసిన పావుగంటకే జాడ లేకుండా పోయింది. ఐదు గంటలపాటు సస్పెన్స్‌తో హైడ్రామా నడిచింది. చివరకు ప్రమాదానికి గురైందన్న ప్రకటనతో.. ప్రయాణికుల బంధువుల రోదనలు మిన్నంటాయి. విషాదాంతంగా ముగిసిన నేపాల్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రమాదంలో ప్రయాణికుల మృతదేహాలు పూర్తిగా కాలిన స్థితిలో లభ్యం అయ్యాయి. నేపాల్ తారా ఎయిర్‌లైన్స్ విమాన ప్రమాదంలో శకలాలను సోమవారం ఉదయం గుర్తించారు. ప్రయాణికుల మృతదేహాలు కాలిపోయాయని, కొన్ని మృతదేహాలు అసలు గుర్తుపట్టలేనంతగా ఉన్నాయని పోలీసులు చెప్తున్నారు. నేపాల్ ఆర్మీ, రెస్క్యూ ట్రూప్స్‌తో కలిసి చేపట్టిన ఆపరేషన్ ఆదివారం సాయంత్రం మంచు వర్షం కారణంగా ఆపేశారు. అయితే ఈ ఉదయం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించిన కాసేపటికే మనపతీ హిమాల్ కొండచరియల దగ్గర శకలాలను గుర్తించారు. ముస్తాంగ్ జిల్లా కోవాంగ్ గ్రామ శివారులో ఈ తేలికపాటి విమానం ప్రమాదానికి గురైంది. నలుగురు భారతీయలతో పాటు మొత్తం 22 మంది ప్రయాణికులు ఈ విమానంలో ఉన్నట్లు నిర్ధారించారు. సోమవారం ఉదయం సానోస్వేర్ వద్ద తగలబడుతున్న శకలాలు కనిపించాయని అధికారులు వెల్లడించారు. చనిపోయిన వాళ్లలో నేపాలీలతో పాటు నలుగురు భారతీయులు ఒకే కుటుంబానికి చెందిన వాళ్లని, వాళ్ల స్వస్థలం మహారాష్ట్ర థానే అని పేర్కొన్నారు. Nepal | Crashed Tara Air aircraft located at Sanosware, Thasang-2, Mustang The aircraft with 22 people including four Indians onboard went missing yesterday. (Photo source: Nepal Army) pic.twitter.com/W4n5PV3QfA — ANI (@ANI) May 30, 2022 కెనడా నిర్మిత 9ఎన్- ఏఈటీ జంట ఇంజన్ ఆధారిత ఎయిర్‌క్రాఫ్ట్.. ఆదివారం ఉదయం 9గం.55 ని. ప్రాంతంలో పోఖారా నుంచి టేకాఫ్ అయ్యింది. జోమోసోమ్లో అది ల్యాండ్ అవ్వాల్సి ఉండగా.. టేకాఫ్ అయిన పదిహేను నిమిషాలకే సంబంధాలు తెగిపోయింది. ఈ మార్గం పాపులర్ టూరిస్ట్ ప్లేస్. ప్రయాణానికి కేవలం 20 నుంచి 25 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. జీపీఎస్ ద్వారా పైలట్ ప్రభాకర్ మొబైల్ సిగ్నల్ష్ ట్రేస్ చేసి.. విమానం జాడ కనిపెట్టారు అధికారులు. అయితే ప్రమాదానికి గల కారణాలు, విమానం గమ్యస్థానం వైపు కాకుండా మరోవైపు డైవర్షన్ కావడం వెనుక కారణాలు తేలాల్సి ఉంది. -
రెండు శిక్షణా విమానాలు ఢీ... ముగ్గురు మృతి
2 South Korea Air Force Planes Collide: దక్షిణ కొరియా వైమానిక దళానికి చెందిన రెండు శిక్షణా విమానాలు శుక్రవారం గాలిలో ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు పైలెట్లు మరణించగా, మరోకరు గాయపడినట్లు అధికారులు తెలపారు. రెండు కేటీ-1 శిక్షణా విమానాలు ఢీకొన్న తర్వాత ఆగ్నేయ నగరమైన సచియోన్ పర్వతంపై కూలిపోయిందని వైమానిక దళ అధికారులు చెప్పారు. మూడు హెలికాప్టర్లు, 20 వాహనాలు, డజన్ల కొద్దీ అత్యవసర సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. కేటీ-1 రెండు సీట్ల విమానమని, విమానంలో పైలెట్లు సురక్షితంగా బయటపడేందుకు ప్రయత్నించారని వైమానిక దళం ప్రకటించింది. (చదవండి: అందుకే రష్యా బలగాలు వెనక్కి మళ్లాయి: ఉక్రెయిన్) -
కుప్పకూలిన నాటో విమానం.. ‘ఉక్రెయిన్–రష్యా యుద్ధంతో సంబంధం లేదు’
హెల్సింకీ: నార్వేలో ఆర్కిటిక్ సర్కిల్లో కోల్డ్ రెస్పాన్స్ పేరిట ‘నాటో’ దేశాలు నిర్వహిస్తున్న సైనిక విన్యాసాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అమెరికా నావికా దళానికి చెందిన ఎంవీ–22బీ ఓస్ప్రే ఎయిర్‌క్రాఫ్ట్ కుప్పకూలింది. ఇందులో ఉన్న నలుగురు అమెరికా నావికాదళం సైనికులు మృత్యువాత పడ్డారు. ఉత్తర నార్వేలోని నార్డ్ల్యాండ్ కౌంటీలో శుక్రవారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటన జరిగింది. ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి ఈ సంఘటనతో సంబంధం లేదని నార్వే ప్రధానమంత్రి జోనాస్ గెహర్ స్టొయిరీ, రక్షణ శాఖ అధికారులు శనివారం ప్రకటించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే, ప్రతికూల వాతావరణం వల్లే అమెరికా విమానం కూలిపోయిందని నార్వే పోలీసులు వెల్లడించారు. ఈసారి నాటో సైనిక విన్యాసాల్లో 27 దేశాలకు చెందిన 30 వేల మంది సైనికులు, 220 విమానాలు, 50 నౌకలు పాల్గొంటున్నాయి. నాటోయేతర దేశాలైన ఫిన్‌ల్యాండ్, స్వీడన్ కూడా ఈ విన్యాసాల్లో పాలు పంచుకుంటున్నాయి. ఇవి ఏప్రిల్ 1న ముగియనున్నాయి. (చదవండి: ఉక్రెయిన్‌పై ‘అణు’ ఖడ్గం!) -
శిక్షణ విమానం శకలాల తరలింపు
పెద్దవూర: శిక్షణ విమానం కూలి ట్రైనీ మహిళా పైలట్ దుర్మరణం చెందిన ప్రదేశాన్ని ఆదివారం ఢిల్లీ నుంచి వచ్చిన ఏఏఐబీ(ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో) టీం అధికారులు అమిత్‌కుమార్, దినేష్‌కుమార్, కెప్టెన్ భవానీశంకర్లతో పాటు, హైదరాబాద్ నుంచి వచ్చిన డీజీసీఏ(డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) అధికారులు పరిశీలించారు. ఉదయం 8.15కు వచ్చిన ప్రత్యేక బృందం మధ్యాహ్నం 2 గంటల వరకు విచారణ చేపట్టింది. ఎయిర్‌క్రాఫ్ట్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. శకలాలను ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా రైట్బ్యాంకులోని ఫ్లైటెక్ ప్రైవేట్ ఏవియేషన్ అకాడమీకి తరలించారు. డీజీసీఏ బృందంలో డీజీసీఏ డైరెక్టర్ సురేందర్ టోపో, అసిస్టెంట్ డైరెక్టర్ శివ ఉన్నారు. రిపోర్ట్ ఆధారంగా కేసు విచారణ –వై. వెంకటేశ్వరరావు, డీఎస్పీ మిర్యాలగూడ తుంగతుర్తి గ్రామ సమీపంలో ఫ్టైటెక్ ప్రైవేట్ ఏవియేషన్ అకాడమీకి చెందిన ఎయిర్ క్రాఫ్ట్ చాపర్ శనివారం కూలిపోయి ట్రైనీ మహిళా పైలట్ మృతి చెందిన ఘటనలో ఢిల్లీలోని ఏఏఐబీ, హైదరాబాద్‌కు చెందిన డీజీసీఏ అధికారుల బృందాలు ఆదివారం విచారణ చేశాయి. శకలాలను స్వాధీనం చేసుకుని వాటిని విశ్లేషించి రిపోర్ట్ తయారు చేసి ఇస్తామన్నారు. వారిచ్చే రిపోర్ట్ ఆధారంగా తర్వాత విచారణ చేస్తాం. -
కుప్పకూలిన విమానం: షాకింగ్ వీడియో
-
కుప్పకూలిన విమానం: షాకింగ్ వీడియో
మాస్కో: రష్యాకు చెందిన కార్గో విమానం కుప్పకూలింది. ఇద్దరు పైలట్లతోపాటు మరో ఇంజనీర్ ఈ ప్రమాదంలోముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ప్రముఖ పైలట్, హీరో ఆఫ్ రష్యా నికోలాయ్ కుయిమోవ్తో సహా ముగ్గురు వ్యక్తులు మరణించారని అధికారిక న్యూస్ ఏజెన్సీ టాస్ ప్రకటించింది. ఈ ఘటనకు సంబంధించి వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మాస్కోకు పశ్చిమాన 45 కిలోమీటర్ల (28 మైళ్ళు) దూరంలో కుబింకా ఎయిర్ బేస్ వద్ద మంగళవారం ఈ విషాదం చోటు చేసుకుంది. సైనిక రవాణా విమానం కూలిపోయిందని రష్యా యునైటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్ కార్పొరేషన్ కూడా ధృవీకరించింది. కొత్త ప్రోటోటైప్ మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇల్యూషిన్ ఇల్ Il-112 వీ క్రాష్ అయిందంటూ పలు వార్తా సంస్థలు నివేదించాయి. విమానం ల్యాండింగ్ సమయంలో కుడి ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో అటవీ ప్రాంతంలో కూలిపోయిందని న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. మరోవైపు దర్యాప్తు నిమిత్తం ఒక కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నట్టు రోస్టెక్ డిఫెన్స్ తెలిపింది. -
కూలిన అగ్నిమాపక విమానం, 8 మంది దుర్మరణం
ఇస్తాంబుల్: టర్కీ అడవుల్లో చెలరేగిన మంటలను అర్పేందుకు రష్యా నుంచి వచ్చిన యాంఫిబియస్ బెరివ్ బీఈ–200 అగ్నిమాపక విమానం కుప్పకూలిన ఘటనలో 8 మంది మరణించారు. ఈ ఘటన దక్షిణ టర్కీలోని అదానా ప్రావిన్సులో చోటు చేసుకుందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రమాదాన్ని పరిశీలించేందుకు దర్యాప్తు బృందం ఘటనా స్థలానికి బయలుదేరిందని టర్కీ ప్రభుత్వ మీడియా తెలిపింది. ప్రమాదం పట్ల టర్కీ విదేశాంగ మంత్రి మెవ్లుత్ కావుసోగ్లు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారి త్యాగాలను టర్కీ మరచిపోదని వ్యాఖ్యానించారు. ప్రమాదానికి ముందు విమానంతో కమ్యూనికేషన్ తెగిపోయిందని, ఆ తర్వాత విమానం కూలినట్లు తెలిసిందని స్థానిక గవర్నర్ ఒమర్ ఫరూక్ కోస్కున్ తెలిపారు. ఈ ప్రమాదం పట్ల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంతాపం వ్యక్తం చేశారు. ఇందులో టర్కీ పౌరులు మరణించడంపై టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్‌కు పుతిన్ తన సంతాపం తెలిపారు. ఈ రెండు ఇంజిన్లు కలిగిన యాంఫిబియస్ అగ్నిమాపక విమానం 270 మెట్రిక్ టన్నుల నీటిని మోసుకెళ్లగలదు. చదవండి : చూపుడు వేలుపై 3 గంటలకు పైగా -
గల్లంతైన మిగ్ పైలెట్ లెటర్ వైరల్
న్యూఢిల్లీ: భారత నేవీ ఎయిర్ క్రాఫ్ట్ మిగ్-29కే శిక్షణ విమానం గురువారం సాయంత్రం ప్రమాదవశాత్తు సముద్రంలో కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఒక పైలెట్ సురక్షితంగా బయటపడగా.. నిషాంత్ సింగ్ అనే మరో పైలెట్ గల్లంతయ్యాడు. ప్రస్తుతం అతడిని క్షేమంగా తిరిగి తీసుకొచ్చేందుకు నేవీ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా.. నిషాంత్ సింగ్‌కు సంబంధించిన ఓ లెటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. అతడి సృజానత్మకతకి నెటిజనులు ఫిదా అవుతున్నారు. త్వరగా.. క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థిస్తున్నారు. ఏడు నెలల క్రితం నిషాంత్ సింగ్ వివాహం చేసుకున్నాడు. ఇందుకు గాను సీనియర్ అధికారుల అనుమతి కోరుతూ రాసిన ఉత్తరం ప్రస్తుతం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఈ ఉత్తరంలో నిషాంత్ పెళ్లి చేసుకోవడం అంటే జీవితాన్ని త్యాగం చేయడం వంటిదే అన్నాడు. తెలిసి తెలిసి ఇందులోకి దూకుతున్నానని.. ఇక జీవితంలో మరోసారి ఇలాంటి తప్పు చేయనని.. కనుక ఈ ఒక్కసారి బుల్లెట్‌ని కొరకడానికి అనుమతివ్వాల్సిందిగా సీనియర్లను కోరాడు. అంతేకాక తన త్యాగానికి అధికారులంతా సాక్ష్యంగా ఉండాలని.. కావున వారంతా ఈ కార్యక్రమానికి తప్పక హాజరు కావాలని నిషాంత్ అభ్యర్థించాడు. ఈ ఏడాది మే 9న ఉన్నతాధికారులకు నిషాంత్ రాసిన లెటర్ ఇలా కొనసాగింది.. ‘ఇంత తక్కువ సమయంలో మీ మీద ఇలాంటి బాంబు వేశాను. కానీ మీరు అంగీకరించాలి. స్వయంగా నా మీద నేనే ఓ న్యూక్లియర్ బాంబ్ వేసుకుంటున్నానని గమనించాలి. కంబాట్‌లో ఓ పక్క వేడిని భరిస్తూనే సెకన్ల వ్యవధిలో నిర్ణయాలు తీసుకోవడం అలవాటయ్యంది. అందుకే ఈ నిర్ణయం తీసుకోవడానికి.. మరోసారి దీని గురించి ఆలోచించడానికి నేను ఎక్కువ సమయం తీసుకోలేదు. మూడేళ్ల కాల వ్యవధి గల ఎస్‌సీటీటీ(సర్వైవబిలిటీ అండ్ కంపాటిబిలిటీ టెస్టింగ్ ట్రయల్స్)ట్రైనింగ్‌ని విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత నేను, మిస్ నయాబ్ రంధవా ఓ నిర్ణయానికి వచ్చాం. ఇక మిగిలిన జీవితం అంతా ఒకరినొకరం చంపుకోకుండా కలిసి బతకాలని నిర్ణయించుకున్నాం. మా నిర్ణయాన్ని ఇరు కుటుంబాల పెద్దలు ఆమోదించారు. కరోనా సమయం కావడంతో జూమ్ వీడియో కాల్ ద్వారా ఆశీర్వదించారు. నా జీవితంలోని ప్రశాంతతని కోల్పోవడమే కాక, డ్యూటీకి సంబంధం లేని మరి ముఖ్యంగా చెప్పాలంటే .. నా జీవితాన్ని త్యాగం చేయాలని భావిస్తూ స్వయంగా నా చేతులారా నేను తీసుకున్న ఈ నిర్ణయానికి మీ అనుమతి కావాలి’ అంటూ నిశాంత్ తన లెటర్లో అధికారులను కోరాడు. (చదవండి: పైలట్ కోసం సిక్కుల ఔదార్యం) కొనసాగిస్తూ.. ‘ఇక ఈ అయోమయ పరిస్థితి నుంచి బయటపడటానికి నా పఠనాసక్తి కూడా సాయం చేయలేకపోయింది. కావాలనే చేస్తోన్న ఈ తప్పును మీరు మనసులో పెట్టుకోకుండా నన్ను క్షమిస్తారని భావిస్తున్నాను. ఇక ఇలాంటి తప్పును నేను గాలిలో ఉండగా కూడా చేయను. అలానే నా ట్రైనీలకు ఇలాంటి తప్పులు చేయడం నేర్పను’ అంటూ ఉత్తరాన్ని ముగించాడు. ఇక చివర్లో మీ విధేయుడు అని రాసే చోట.. ‘సాధారణంగా మీ విధేయుడు అనే రాయాలి.. కానీ ఇక మీదట నేను తనకు విధేయుడిని’ అంటూ తన పేరు రాసి ముగించాడు. ఇంత సృజనాత్మంగా లెటర్ రాస్తే.. ఎవరు మాత్రం నో చెప్పగలరు. అందుకే అధికారులు కూడా అతని వివాహానికి అనమతించారు. నేవీ సాంప్రదాయం ప్రకారం, యువ అధికారులు వివాహం చేసుకోవడానికి వారి సీఐల అనుమతి తీసుకోవాలి. ఇక సుశాంత్ తెలివిగా లెటర్ హెడ్డింగ్‌ని "బుల్లెట్‌ని కొరకడానికి అనుమతించండి" అని పెట్టడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. -
కుప్పకూలిన నేవీ ఎయిర్ క్రాఫ్ట్ మిగ్-29కే
న్యూఢిల్లీ: భారత నేవీ ఎయిర్‌క్రాఫ్ట్ మిగ్-29కే శిక్షణా విమానం ప్రమాదవశాత్తూ సముద్రంలో కూలిపోయింది. ఈ ఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకున్నట్లు ఆర్మీ అధికారులు ఇవాళ ఉదయం వెల్లడించారు. ఈ ప్రమాదం నుంచి ఒక పైలట్‌ను సురక్షితంగా కాపాడారు. మరొకరు గల్లంతు అయినట్లు తెలిపారు. గల్లంతు అయిన పైలట్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టమని నేవీ అధికారులు చెప్పారు. ఈ ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
విమాన ప్రమాదం.. పైలట్ల దుర్మరణం
భువనేశ్వర్: శిక్షణ విమానం కూలిపోవడంతో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఒడిశాలోని ధెన్కనల్ జిల్లాలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. మృతుల్ని ట్రైనీ పైలట్, అతని శిక్షకుడిగా గుర్తించారు. బిరసాలలోని ప్రభుత్వ ఏవియేషన్ ట్రైనింగ్ ఇన్స్‌స్టిట్యూట్ (గతి)లో ఈ ప్రమాదం చోటుచేసుకుందని జిల్లా అదనపు మెజిస్ట్రేట్ బీకే నాయక్ తెలిపారు. సాంకేతిక లోపం కారణంగా ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అభిప్రాయపడ్డారు. ఘటనపై విచారణ చేపట్టామని వెల్లడించారు. (చదవండి: పరీక్షల కోసం ప్రాణాలు రిస్కులో పెట్టలేం!) -
కుప్పకూలిన విమానం, విషాదం
మధ్యప్రదేశ్‌లో విమాన ప్రమాదం విషాదాన్ని నింపింది. సాగర్ జిల్లాలో శుక్రవారం రాత్రి ప్రైవేట్ ఏవియేషన్ అకాడమీకి చెందిన ట్రైనర్ విమానం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో విమానంలో ఉన్న ఇద్దరు మృతి చెందినట్లు జిల్లా పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కమల్ నాథ్ మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారనీ సీఎంఓ ట్వీట్ చేసింది. `చిమ్స్ అకాడమీ 'విమానం (సెస్నా172) ధానా ఎయిర్‌స్ట్రిప్ వద్ద ల్యాండ్ అవ్వడానికి ప్రయత్నిస్తుండగా, అదుపు తప్పి పక్కనే ఉన్న మైదానంలో కూలిపోయిందని సాగర్ పోలీస్ సూపరింటెండెంట్ అమిత్ సంఘి తెలిపారు. రాత్రి 10 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ట్రైనర్ అశోక్ మక్వానా (58), ట్రైనీ పియూష్ సింగ్ (28) మృతి చెందారని తెలిపారు. పొగమంచు కప్పేయడంతో రన్‌వే సరిగా కనిపించక ప్రమాదం జరిగినట్టుగా భావిస్తున్నామన్నారు. అటు ఈ సంఘటనను చిమ్స్ అకాడమీ స్థానిక నిర్వాహకుడు రాహుల్ శర్మ ధృవీకరించారు. సెస్నా 172లో గ్లాస్ కాక్‌పిట్‌తో పాటు రాత్రిపూట ప్రయాణానికి అవసరమైన అన్ని సౌకర్యాలున్నాయని అకాడమీ వర్గాలు తెలిపాయి. అకాడమీ వెబ్సైట్ ప్రకారం, ఇది కమర్షియల్ పైలట్ లైసెన్స్, ప్రైవేట్ పైలట్ లైసెన్స్ కోర్సులను నడుపుతుంది. प्रदेश के सागर की ढाना हवाई पट्टी पर एक विमान हादसे में दो प्रशिक्षु पायलेट की मौत का दुःखद समाचार प्राप्त हुआ। परिवार के प्रति मेरी शोक संवेदनाएँ। ईश्वर उन्हें अपने श्रीचरणो में स्थान व पीछे परिजनो को यह दुःख सहने की शक्ति प्रदान करे। — Office Of Kamal Nath (@OfficeOfKNath) January 3, 2020 -
గాల్లో విమానం.. పడిపోయిన ఇంధన ట్యాంక్!
చెన్నై: భారత వైమానిక దళానికి చెందిన విమానం గాలిలో ఉండగానే ఇంధన ట్యాంక్ కింద పడిపోయిన ఘటన కలకలం రేపింది. తమిళనాడులోని ఓ పొలంలో జెట్ ఇంధన ట్యాంక్ పడిపోవడంతో అధికారులు విచారణకు ఆదేశించారు. ఈ ఘటన మంగళవారం ఉదయం కోయంబత్తూరులో చోటు చేసుకుంది. సులూరు వైమానిక దళానికి సమీపంలో ఉన్న పొలంలో ఇంధన ట్యాంక్ పడిపోవడం గమనించి వెంటనే అప్రమత్తమైన పైలట్.. దానిని సురక్షితంగా నేలపైకి దింపాడు. దీంతో పెనుప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం గానీ, పేలుళ్లు గానీ సంభవించలేదని వైమానిక దళం అధికారులు వెల్లడించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపారు. కాగా ఐఏఎఫ్‌నకు చెందిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌ను పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. గాల్లోనే ఇంధనం నింపగలిగే సామర్థ్య పరీక్షను తేజస్ గతేడాది విజయవంతంగా పూర్తి చేసి అరుదైన ఘనత సాధించింది. -
శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్ల మృతి
బెంగళూరు: వైమానిక దళానికి చెందిన శిక్షణ విమానం కూలడంతో అందులో ఉన్న ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. బెంగళూరు సమీపంలోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) విమానాశ్రయంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. మిరేజ్–2000 రకం శిక్షణ యుద్ధ విమానం హెచ్ఏఎల్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అవుతుండగా కూలిపోయింది. దీంతో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించి మంటల్లో చిక్కుకుంది. మంటల నుంచి బయట పడేందుకు అందులో ఉన్న ఇద్దరు పైలెట్లు యత్నించినా సాధ్యం కాలేదు. సమీపంలోని అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చి, పైలట్లను రక్షించేందుకు యత్నించారు. అయితే, అప్పటికే ఒక పైలట్ సజీవ దహనం కాగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు. మృతులను ఎయిర్‌క్రాఫ్ట్ అండ్ సిస్టమ్స్ టెస్టింగ్ ఎస్టాబ్లిష్మెంట్ విభాగానికి చెందిన స్క్వాడ్రన్ లీడర్ సమీర్ అబ్రాల్, స్క్వాడ్రన్ లీడర్ సిద్ధార్థ నేగిగా గుర్తించారు. -
కుప్పకూలిన శిక్షణ విమానం..!
కిలోమీటర్ దూరంలోనే బాహుపేట గ్రామం.. పక్కనే నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్– వరంగల్ జాతీయ రహదారి.. ఓ వెంచర్లో పనులు చేసుకుంటున్న పలువురు కూలీలు... ఈ క్రమంలోనే అకస్మాత్తుగా ఓ శిక్షణ విమానం పెద్దశబ్దంతో ఆ వెంచర్‌లోని నిర్మానుష్య ప్రదేశంలో కళ్లుమూసి తెరిచేలోపే కుప్పకూలింది. ఏం జరిగిందో తెలుసుకునేలోపే విమాన శకలాలు అల్లంతదూరాన పడ్డాయి. విమానం ఆనవాళ్లు లేకుండా కాలిబూడిదైపోయింది. ఉహించని ఘటనతో మండల పరిధిలోని బాహుపేట ఉలిక్కిపడింది. ప్రత్యక్ష సాక్షులు, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట (ఆలేరు) : హైదరాబాద్ హకీంపేటలోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్శిక్షణ కేంద్రానికి చెందిన ఫైటర్ విమానంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యోగేష్ యాదవ్ శిక్షణ తీసుకుంటున్నాడు. మరో 15 రోజులైతే శిక్షణ పూర్తి చేసుకునే దశలో యోగేష్ నడుపుతున్న ఫైటర్ విమానంలో హకీంపేట నుంచి బయలుదేరాడు. బాహుపేట సమీపంలోకి రాగానే.. బుధవారం ఉదయం సుమారు 11.40 గంటల ప్రాంతంలో యాదగిరిగుట్ట మండలం బాహుపేట సమీపంలోకి రాగానే ఫైటర్ విమానంలోని ఇంజన్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో ఎయిర్ ఫోర్స్‌కు చెందిన అధికారులతో ఎప్పటికప్పుడు పైలట్ యోగేష్ యాదవ్ సమస్యకు సంబంధించిన వివరాలు అందిస్తూనే ఉన్నాడు. విమానంలో తలెత్తిన సమస్య మరింత తీవ్రంగా మారింది. ఈ విషయాన్ని అధికారులకు తెలియజేసి, పైలట్ యోగేష్ యాదవ్ విమానంలో ఉన్న ప్యారాచూట్, ఇతర సామగ్రి సహాయంతో బయటికి దూకాడు. దీంతో సుమారు అర కిలోమీటర్ దూరంలోకి వెళ్లి విమానం భారీ శబ్దంతో కుప్ప కూలిపోయి.. పూర్తిగా దగ్ధమైంది. భారీగా మంటలు వ్యాపించడంతో స్థానిక ప్రజలు, వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై నుంచి వెళ్లె ప్రజలు అధిక సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. సుమారు అర కిలోమీటర్ దూరంలో పడిపోయిన పైలెట్ యోగేష్ యాదవ్‌ను స్థానికులు వెళ్లి పరామార్శించారు. ఏం జరిగిందంటూ.. బాహుపేట సమీపంలో కుప్పకూలిన ఫైటర్ విమానం చూసి యాదగిరిగుట్ట, ఆలేరు మండలాల ప్రజలు ఒక్కసారిగా ఉలికిపడ్డారు. శిక్షణ తీసుకుంటున్న పైలట్‌కు చెందిన ఫైటర్ విమానం సాంకేతిక లోపంతో కుప్పకూలిపోయింది.. అదే సయమంలో వివిధ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం కోసం ప్రముఖ నాయకులు అప్పుడే బహిరంగ సభలకు బయల్దేరిన హెలికాప్టర్ ఏమైనా కుప్పకూలిందా అనే సందేహాలు ప్రజల్లో నెలకొన్నాయి. ఇటీవల వివిధ పార్టీలకు చెందిన ప్రముఖులు హెలికాప్టర్లో పర్యటనలు చేస్తున్నారు. బుధవారం అధికంగా ప్రముఖులు వివిధ ప్రాంతాలకు పర్యటించే క్రమంలో ఏమైన ప్రమాదం జరిగాందా అనే అనుమానంతో అధిక సంఖ్యలో ప్రజలు, వివిధ పార్టీల నాయకులు అధిక సంఖ్యలో చేరుకున్నా రు. శిక్షణ తీసుకుంటున్న విమానం కుప్పకూలిందని తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అంతే కాకుండా ప్రమాదం జరిగిన ప్రదేశంలో కూడా ఎవరు లేకపోవడంతో ప్రాణహాని జరగలేదని అధికారులు తెలిపారు. ఘటనాస్థలిని పరిశీలించిన ఎయిర్‌ఫోర్స్ అధికారులు ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన అధికారులు సంఘటన స్థలానికి 15 నుంచి 20 నిమిషాల వ్యవధిలో చేరుకున్నారు. తొలుత హెలికాప్టర్లో ఆర్మీకి చెందిన వైద్యులు నలుగురు అక్కడికి చేరుకున్నారు. పైలెట్‌కు వైద్య పరీక్షలు చేసి, మెరుగైన చికిత్స నిమిత్తం హెలికాప్టర్లో తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు చేస్తున్న సమయంలోనే మరో హెలికాప్టర్ ఆకాశంలో నాలుగు సార్లు తిరిగి దిగింది. అందులో ప్రమాదం జరిగిన తీరును పరిశీలించడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన సాంకేతిక నిపుణులు వచ్చి అక్కడ ఖాళీ బూడిదైన శకలాలను పరిశీలించారు. అంతకు ముందే భువనగిరి ఏసీపీ జితేదర్రెడ్డి, యాదగిరిగుట్ట ఎస్ఐ రమేష్‌లు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించి, ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. గాయాలతో పైలెట్.. సెల్ఫీలతో యువకులు... శిక్షణ విమానంలో గాయాలైన పైలెట్‌ను రక్షించకుండా స్థానిక యువకులు సెల్ఫీ తీసుకున్నారు. కనీస మానవతాదృక్పథంతో ఆలోచించకుండా ఖాళీ బూడిదైన విమానం వద్ద, గాయాలై కిందపడిపోయిన పైలెట్ వద్దకు వెళ్లి కొందరు యువకులు సెల్ఫీలు తీసుకోవడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ శబ్దం వచ్చింది మేము వెంచర్లో పనులు చేస్తున్నాం. అప్పుడే మా సార్ కారులో వస్తున్నాడు. ఒక్క సారిగా విమానం ఆకాశంలో నుంచి కిందకి వస్తుంటే అందులో నుంచి ఓ వ్యక్తి బెలున్ కట్టుకొని కిందకు దూకాడు. కళ్లు తెరచి మూసే లోపే భారీ శబ్దంతో విమానంలో భూమిపై పడిపోయింది.దీంతో భారీగా మంటలు వ్యాపించాయి. దానిని చూసి షాక్‌కు గురయ్యాం. భయమేసింది. నోట్లో నుంచి మాటలు కూడా రాలేదు. కొద్ది సేపటికి తేరుకొని చూసే సరికి జనమంతా సంఘటన స్థలానికి చేరుకున్నారు. కిందపడిన వ్యక్తితో మాట్లాడే ప్రయత్నం చేసిన.. భాష అర్థం కాలేదు. ఇలాంటి ప్రమాదం చూడడం ఇదే ప్రథమం. – నిర్మల, బాలలక్ష్మి, ప్రత్యక్ష సాక్షులు -
కూలిన ఐఏఎఫ్ హెలికాప్టర్: ఫైలట్ మృతి
గాంధీనగర్ : గుజరాత్‌లోని కచ్ జిల్లాలోని ముంద్రా వద్ద మంగళవారం ఐఏఎఫ్ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఫైలట్, ఎయిర్ కమాండర్ దుర్మరణం చెందారు. ముంద్రా వద్ద పొలాల్లో జాగ్వార్ ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోయినట్లు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారులు ధృవీకరించారు. శిక్షణలో భాగంగా జామ్‌నగర్ నుంచి వెళ్లిన కాసేపటికే ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు. #Gujarat: An aircraft has crashed in Kutch's Mundra, pilot missing. More details awaited. pic.twitter.com/2Q1SPxvMF0 — ANI (@ANI) June 5, 2018 -
ఆ 20 నిమిషాల పాటు ప్రత్యక్ష నరకం..
న్యూయార్క్ : అది సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం. ఫ్లైట్ నంబర్ 1380. మంగళవారం ఉదయం 11 గంటలకు 144 మంది ప్రయాణికులతో పాటు ఐదుగురు సహాయక సిబ్బందితో న్యూయార్క్ నుంచి డల్లాస్‌కు బయల్దేరింది. కానీ అంతలోనే పేలుడు శబ్దం వినపడటంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇంజన్ పేలిపోయిందని తెలుసుకున్న ప్రయాణికులు.. అప్పటివరకు పిల్లల కేరింతలను ఆస్వాదిస్తూ కాలక్షేపం కోసం సుడోకు ఆడుతూ, పాటలు వింటూ, సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్న వారంతా భయంతో హాహాకారాలు చేయడం మొదలుపెట్టారు. విమానం ఫ్యాన్ బ్లేడ్ చెడిపోవడంతో పదునైన రెక్క దూసుకురావడంతో కిటికీ పాక్షికంగా చెదిరిపోయింది. కిటికీ పక్కనే ఉన్న రియోర్డాన్ అనే ప్రయాణికురాలు ఒక్కసారిగా జారి కిందపడబోయింది. భూమి నుంచి 30 వేల అడుగుల ఎత్తులో.. ఊహించని ఈ పరిణామాలతో ప్రయాణికులు తమకు ఇక మరణం తప్పదనే నిర్ణయానికి వచ్చేశారు. స్నేహితులకు బంధువులకు ఫోన్లు చేసి ఇవే తమ ఆఖరి క్షణాలు అంటూ భోరున విలపించారు. దేవుడా నువ్వే దిక్కు.. 7 ఏళ్ల వయస్సులో తండ్రిని కోల్పోయిన షేరీ పియర్స్ అనే ప్రయాణికురాలు తన 11 ఏళ్ల కూతురుకి కూడా అదే కష్టం వస్తుందేమో అని బాధపడుతూ.. ‘ఈ బాధ, యాతన భరించలేను. దేవుడా త్వరగా తీసుకెళ్లు’ అంటూ ప్రార్థించడంతో తోటి ప్రయాణికులు కూడా కన్నీటి పర్యంతమాయ్యారు. విమానంలో ఉన్న ఓ జంట ‘ముగ్గురు పిల్లల్ని చూడకూడకుండానే చనిపోతున్నాం. దేవుడా నువ్వే వారికి దిక్కు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘జీసస్ నువ్వు మాత్రమే మమ్మల్ని కాపాడాలి’ అంటూ ప్రయాణికులు చేసిన ప్రార్థనలు ఫలించాయి. 20 నిమిషాల పాటు ప్రత్యక్ష నరకం అనుభవించిన తర్వాత పైలట్ చాకచక్యం వల్ల ఫిలడెల్ఫియాలో విమానం సేఫ్‌గా ల్యాండ్ అవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కానీ కిటికీ నుంచి జారిపడి పోయిన రియెర్డాన్ను లోపలికి లాగినప్పటికీ తీవ్రగాయాల పాలైన ఆమె.. కొన ఊపిరితో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతూ ప్రాణాలు కోల్పోగా మరో ఏడుగురు గాయపడ్డారు. ఆమె ధైర్యం వల్లే.. అమెరికన్ నేవీలో పనిచేసిన మొదటి మహిళా పైలట్లలో టామ్ జో షల్ట్స్ ఒకరు. సూపర్సోనిక్ ఎఫ్‌జె-18 హార్నెట్స్ వంటి విమానాలు నడిపిన ఘనత ఆమె సొంతం. ఆ అనుభవంతోనే 30 వేల అడుగులో ఇంజన్ పేలిపోయినా ఆమె ధైర్యం చెక్కు చెదరలేదు. ప్రయాణికుల ప్రాణాలు కాపాడటమే ఆమె ముందున్న లక్ష్యం. అందుకే ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం ఫిలడెల్ఫియా అధికారులకు సమాచారం ఇచ్చింది. వారు కూడా వెంటనే స్పందించి కావాల్సిన సహాయం అందించారు. క్షేమంగా ల్యాండ్ అవడానికి అప్పటికీ ఆమెకున్న అవకాశాలు తక్కువే. అయినప్పటికీ ధైర్యం చేసింది. ప్రయాణికుల ప్రాణాలు కాపాడి ధీర వనితగా అందరిచే ప్రశంసలు అందుకుంది. అయితే అమెరికా ఎయిర్‌లైన్స్‌కు చెందిన జరిగిన విమాన ప్రమాదాల్లో 2009 తర్వాత ఇదే మొదటి మరణం అని అధికారులు తెలిపారు. మంగళవారం జరిగిన ఫ్లైట్-1380 విమాన ప్రమాదం వల్ల అప్రమత్తమయ్యామని వారు పేర్కొన్నారు. ఇంజన్‌లోని బ్లేడ్ పాతబడటం వల్లే పేలుడు సంభవించిందని తెలిపారు. -
ఢాకా-కఠ్మాండూ విమానాల నిలిపివేత
కఠ్మాండూ: నేపాల్ విమాన సేవలకు కఠ్మాండూ విషాదం సెగ తగిలింది. నేపాల్ రాజధాని కఠ్మాండూ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఘోర ప్రమాదం కారణంగా ఢాకా నుంచి కఠ్మాండూ వెళ్లే విమానాల్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నుట్లు యూఎస్- బంగ్లా ఎయిర్‌లైన్స్ తెలిపింది. ‘ఆ విషాదానికి సంబంధించి పైలట్‌కు ఐటీసీ నుంచి తప్పుడు సంకేతాలు వెళ్లాయని మాత్రమే తెలుసు. ఇది తప్ప మా దగ్గర ఎటువంటి అదనపు సమాచారం లేదని, ఈ విషయమై తమకెవరిపై అనుమానాలు లేవని’ యూఎస్- బంగ్లా ఎయిర్‌లైన్స్ తన వెబ్సైట్లో పేర్కొంది. నేపాల్ ప్రభుత్వం చేపట్టిన విచారణకు పూర్తిగా సహకరిస్తామని తెలిపింది. ఇలాంటి ప్రమాదాలు సంభవించినపుడు సమాచార లోపం ఉండకూడదనే ఉద్దేశంతోనే ఢాకాలో అత్యవసర స్పందన కేంద్రాన్ని ఏర్పాటు చేశామని స్పష్టం చేసింది. మరోవైపు పైలట్‌కు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు మధ్య సమాచార లోపం వల్లే ప్రమాదం సంభవించిందనే అనుమానాలు భారీగా నెలకొన్నాయి అటు ఈ అంశంపై విచారణ జరిపేందుకు నేపాల్ ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కాగా విమాన ప్రమాదంలో గాయపడిన నేపాలీ, బంగ్లాదేశ్ ప్రయాణికులు కఠ్మాండూలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కఠ్మాండూ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం జరిగిన ప్రమాదంలో 50 మంది ప్రయాణికులు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. -
కన్ఫ్యూజన్లో విమానం కూల్చారు
సాక్షి, కఠ్మాండు : నేపాల్ రాజధాని కఠ్మాండూ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఘోర విమాన ప్రమాదం గురించి కొత్త విషయం తెలిసింది. సాంకేతిక సమస్యవల్ల ఆ ప్రమాదం జరగలేదని సమాచార బదిలీ విషయంలో అస్పష్టత ఏర్పడి చోటు చేసుకున్నట్లు తెలిసింది. కన్ఫ్యూజన్లో పైలెట్ విమానాన్ని కూల్చినట్లు స్పష్టమైంది. విమానం దింపే సమయంలో పక్కకు తిప్పాలని చెప్పినప్పటికీ తన వాయిస్ సరిగా వినకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ చెప్పాడు. కఠ్మాండూ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 50 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నుంచి 67 మంది ప్రయాణికులతో బయల్దేరిన విమానం త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే, తొలుత సాంకేతిక సమస్య ఇందుకు కారణం అని అనుకున్నారు. అయితే, వాస్తవానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, పైలట్‌కు మధ్య సంభాషణలో తికమకే అంతమంది ప్రాణాలుపోవడానికి కారణమని తెలిసింది. రేడియో ద్వారా జరిగిన వారి సంభాషణ చాలా కన్ఫ్యూజ్గా సాగిందంటూ ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణ సంస్థ వెబ్సైట్లో పేర్కొంది. అందులో పేర్కొన్న ప్రకారం విమానం సరిగ్గా ల్యాండ్ అయ్యే సమయంలో మాత్రమే పైలట్ తాము దిగొచ్చా అని అడిగాడు. అప్పటికే ఆలస్యం అయింది. అది చూసిన కంట్రోలర్ వణికిపోతున్న స్వరంతో వెంటనే వెనక్కు తిప్పాలని ఆదేశించాడు. ఆ వెంటనే ఫైర్ సిబ్బంది కూడా రన్‌వే వైపు ఫాస్ట్‌గా వెళ్లాలని ఆదేశించాడు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. 'రన్‌వేకి తగినట్లు విమానం రాలేదు. అప్పటికీ ఎయిర్ కంట్రోల్ టవర్ నుంచి పైలట్‌ను ఈ విషయంపై పలుసార్లు చెప్పినా అతడు మాత్రం అంతా బాగానే ఉందని, అన్నింటికీ యస్ అంటూ బదులిచ్చాడు' అని జనరల్ మేనేజర్ రాజ్‌కుమార్ చేత్రి చెప్పారు. కాగా, అమెరికా-బంగ్లా ఎయిర్‌లైన్స్ సీఈవో ఇమ్రాన్ అసిఫ్ మాత్రం ఢాకాలో మాట్లాడుతూ 'ఇదే స్పష్టమైన కారణం అని మేం చెప్పలేం.. కానీ, కచ్చితంగా కఠ్మాండు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ మా పైలట్లను రన్ వే విషయంలో తప్పుదారి పట్టించింది. పైలట్లకు, టవర్‌కు మధ్య జరిగిన సంభాషణ విన్న తర్వాత మా పైలట్ల నిర్లక్ష్యం లేదని స్పష్టమైంది' అని అన్నారు.