పెద్దవూర: శిక్షణ విమానం కూలి ట్రైనీ మహిళా పైలట్ దుర్మరణం చెందిన ప్రదేశాన్ని ఆదివారం ఢిల్లీ నుంచి వచ్చిన ఏఏఐబీ(ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో) టీం అధికారులు అమిత్‌కుమార్, దినేష్‌కుమార్, కెప్టెన్ భవానీశంకర్‌లతో పాటు, హైదరాబాద్ నుంచి వచ్చిన డీజీసీఏ(డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) అధికారులు పరిశీలించారు.
ఉదయం 8.15కు వచ్చిన ప్రత్యేక బృందం మధ్యాహ్నం 2 గంటల వరకు విచారణ చేపట్టింది. ఎయిర్‌క్రాఫ్ట్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. శకలాలను ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా రైట్‌బ్యాంకులోని ఫ్లైటెక్ ప్రైవేట్ ఏవియేషన్ అకాడమీకి తరలించారు. డీజీసీఏ బృందంలో డీజీసీఏ డైరెక్టర్ సురేందర్ టోపో, అసిస్టెంట్ డైరెక్టర్ శివ ఉన్నారు.
రిపోర్ట్ ఆధారంగా కేసు విచారణ –వై. వెంకటేశ్వరరావు, డీఎస్పీ మిర్యాలగూడ
తుంగతుర్తి గ్రామ సమీపంలో ఫ్టైటెక్ ప్రైవేట్ ఏవియేషన్ అకాడమీకి చెందిన ఎయిర్ క్రాఫ్ట్ చాపర్ శనివారం కూలిపోయి ట్రైనీ మహిళా పైలట్ మృతి చెందిన ఘటనలో ఢిల్లీలోని ఏఏఐబీ, హైదరాబాద్‌కు చెందిన డీజీసీఏ అధికారుల బృందాలు ఆదివారం విచారణ చేశాయి. శకలాలను స్వాధీనం చేసుకుని వాటిని విశ్లేషించి రిపోర్ట్ తయారు చేసి ఇస్తామన్నారు. వారిచ్చే రిపోర్ట్ ఆధారంగా తర్వాత విచారణ చేస్తాం.
Comments
Please login to add a commentAdd a comment