Directorate General of Civil Aviation
-
తప్పతాగి.. విమానంలో తోటి ప్రయాణికులపై మూత్రవిసర్జన!
న్యూయార్క్-న్యూఢిల్లీ అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఓ భారతీయుడు మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు. అయితే విమానయాన సంస్థ, విమానంలోని ప్రయాణీకుల వాంగ్మూలాలను రికార్డ్ చేసి, నిందితులను లా ఎన్ఫోర్స్మెంట్కు అప్పగించాయని దేశ విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ తెలిపింది. ప్రయాణికుడిపై ఎయిర్‌లైన్స్ సిబ్బంది ఫిర్యాదు చేసిన తర్వాత పౌర విమానయాన చట్టంలోని నాన్-కాగ్నిజబుల్ నేరాల కింద చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు డీజీసీఏ వెల్లడించింది. ఈ ఘటనపై సహ ప్రయాణికుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందలేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ ఏఏ292 విమానం ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ (IGI) విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తర్వాత సీఐఎస్ఎఫ్ అధికారులు ప్రయాణికుడిని అరెస్ట్ చేశారు. వరుసగా మూడోసారి గత ఏడాది నవంబర్ 26న ఎయిర్ ఇండియా న్యూయార్క్-ఢిల్లీ విమానంలో బిజినెస్ క్లాస్‌లో ఓ వ్యక్తి వృద్దిరాలిపై మూత్రం పోశాడు. డిసెంబర్ 6 న ఎయిర్ ఇండియా ప్యారిస్-న్యూఢిల్లీ విమానంలో ఓప్రయాణికుడు ఖాళీ సీటుపై, దుప్పటిపై మూత్ర విసర్జన చేశాడు. ఇలా వరుస ఘటనలపై డీజీసీఏ చర్యలు తీసుకున్నప్పటికీ తాజాగా మరో ఘటన వెలుగులోకి రావడం గమనార్హం. -
శిక్షణ విమానం శకలాల తరలింపు
పెద్దవూర: శిక్షణ విమానం కూలి ట్రైనీ మహిళా పైలట్ దుర్మరణం చెందిన ప్రదేశాన్ని ఆదివారం ఢిల్లీ నుంచి వచ్చిన ఏఏఐబీ(ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో) టీం అధికారులు అమిత్‌కుమార్, దినేష్‌కుమార్, కెప్టెన్ భవానీశంకర్లతో పాటు, హైదరాబాద్ నుంచి వచ్చిన డీజీసీఏ(డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) అధికారులు పరిశీలించారు. ఉదయం 8.15కు వచ్చిన ప్రత్యేక బృందం మధ్యాహ్నం 2 గంటల వరకు విచారణ చేపట్టింది. ఎయిర్‌క్రాఫ్ట్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. శకలాలను ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా రైట్బ్యాంకులోని ఫ్లైటెక్ ప్రైవేట్ ఏవియేషన్ అకాడమీకి తరలించారు. డీజీసీఏ బృందంలో డీజీసీఏ డైరెక్టర్ సురేందర్ టోపో, అసిస్టెంట్ డైరెక్టర్ శివ ఉన్నారు. రిపోర్ట్ ఆధారంగా కేసు విచారణ –వై. వెంకటేశ్వరరావు, డీఎస్పీ మిర్యాలగూడ తుంగతుర్తి గ్రామ సమీపంలో ఫ్టైటెక్ ప్రైవేట్ ఏవియేషన్ అకాడమీకి చెందిన ఎయిర్ క్రాఫ్ట్ చాపర్ శనివారం కూలిపోయి ట్రైనీ మహిళా పైలట్ మృతి చెందిన ఘటనలో ఢిల్లీలోని ఏఏఐబీ, హైదరాబాద్‌కు చెందిన డీజీసీఏ అధికారుల బృందాలు ఆదివారం విచారణ చేశాయి. శకలాలను స్వాధీనం చేసుకుని వాటిని విశ్లేషించి రిపోర్ట్ తయారు చేసి ఇస్తామన్నారు. వారిచ్చే రిపోర్ట్ ఆధారంగా తర్వాత విచారణ చేస్తాం. -
'టీడీపీ ఎంపీ చర్య నిజంగా సిగ్గుచేటు'
-
'టీడీపీ ఎంపీ చర్య నిజంగా సిగ్గుచేటు'
న్యూఢిల్లీ: ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బందితో గురువారం దురుసుగా ప్రవర్తించడంతో పాటు దుర్భాషలాడిన టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిపై విమానయాన సంస్థలు నిషేధం విధించాయి. జేసీ దివాకర్‌రెడ్డి తీరుపై సివిల్ ఏవియేషన్ మాజీ డైరెక్టర్ జనరల్ కాను గోహైన్ తీవ్రంగా మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎయిర్ లైన్స్ సిబ్బందిపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి దౌర్జన్యానికి పాల్పడటం నిజంగా సిగ్గుచేటన్నారు. సెక్యూరిటీ నియమాలను జేసీ ఉల్లంఘించారని పేర్కొన్నారు. ఎంపీలు తమ హద్దుల్లో ఉంటూ హుందాగా ప్రవర్తించాలని మాజీ డీజీసీఏ హితవు పలికారు. ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రకటించించిన వెంటనే ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా, స్పైస్‌జెట్, గో ఎయిర్, జెట్‌ఎయిర్‌వేస్‌లు కూడా జేసీపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇండిగో విమానంలో బెంగళూరుకు వెళ్లేందుకు గురువారం ఉదయం దివాకర్‌రెడ్డి 7.30 గంటలకు ఎయిర్పోర్ట్ టెర్మినల్ బిల్డింగ్‌లోకిð వెళ్లారు. ఆయన వెళ్లే విమానం 7.55 గంటలకు బయలుదేరనుంది. అయితే బోర్డింగ్ పాస్ ఇవ్వాలని కౌంటర్లో సిబ్బందిని అడగగా.. విమానం బయలుదేరే సమయానికి 45 నిమిషాల ముందే బోర్డింగ్ పాసులు జారీ చేశామని, ఆ సమయం దాటిన తర్వాత వచ్చిన వారికి ఇవ్వడానికి నిబంధనలు ఒప్పుకోవని చెప్పారు. తనకే రూల్స్ చెబుతారా అంటూ కౌంటర్లోకి చొరబడి ఓ ఉద్యోగిని మెడ పట్టుకుని గెంటేయడంతో పాటు బోర్డింగ్ పాస్‌లు జారీచేసే మెషీన్‌ను టీడీపీ ఎంపీ ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. ఆ సమయంలో వీఐపీ లాంజ్‌లో ఉన్న కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు వద్దకు వెళ్లి విమాన సిబ్బంది తనన అవమానించారని చెప్పారు. కేంద్ర మంత్రి విమాన సంస్థ అధికారులను ఒప్పించి బోర్డింగ్‌పాస్ ఇప్పించగా, ఇతర ప్రయాణికులకు అలాగే బోర్డింగ్ పాస్‌లు ఇవ్వవ పోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో గన్నవరం విమానాశ్రయంలోనూ ఎంపీ జేసీ ఇదే తరహాలో దాడులకు తెగబడ్డారనీ, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మహారాష్ట్ర ఎంపీ గైక్వాడ్ విషయంలో వ్యవహరించినట్లుగానే జేసీపైనా చర్యలు తీసుకోవాలని విమానయాన సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. -
విమానాలకు ‘గగన్ ’ తప్పనిసరి
న్యూఢిల్లీ: కొత్తగా అభివృద్ధి చేసిన ‘గగన్’ నేవిగేషన్ వ్యవస్థ ఆధారిత విమానాలనే విమానయాన సంస్థలు ప్రవేశపెట్టడాన్ని తప్పనిసరిచేస్తూ కేంద్రం త్వరలో నోటిఫికేషన్ జారీచేసే వీలుంది. ఈ వ్యవహారానికి సంబంధించి గతేడాది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అన్ని భాగస్వామ్య పక్షాలతో సమావేశం జరిపింది. ఇస్రో, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) సంయుక్తంగా రూ.774 కోట్ల ఖర్చుతో గగన్ (జీపీఎస్ ఎయిడెడ్ ఆగ్మెంటెడ్ నేవిగేషన్ )ను రూపొందించాయి. ఈ విధానంతో ఎయిర్‌లైన్స్ కార్యకలాపాల సామర్థ్యం పెరిగి, వ్యయం తగ్గుతుంది. ప్రస్తుతం భారత విమానయాన సంస్థలన్నింటికి కలిపి సుమారు 450 విమానాలున్నాయి. అయితే గగన్ కు మారాలంటే విమానయాన సంస్థకు భారీగా వ్యయం అవుతుంది. -
విమానాల్లో ఒక్క నెలలో కోటిమంది..!
న్యూఢిల్లీ: మునుపెన్నడూ లేనంతగా దేశం లోపల విమానంలో ప్రయాణించేవారి సంఖ్య అమాంతం పెరిగింది. గత ఏడాదిలో మొత్తం 10 కోట్ల మంది దేశీయంగా స్వదేశీ విమానాల్లో ప్రయాణించారు. అయితే, ఒక్క డిసెంబర్లో ప్రయాణించిన వారి సంఖ్య దాదాపు కోటి ఉన్నట్లు విమాన సంస్థలకు చెందిన అధికారులు తెలిపారు. గత ఏడాది(2015)లో ఇదే డిసెంబర్లో 77.1లక్షలమంది మాత్రమే ప్రయాణించారు. డిసెంబర్ 2016లో స్వదేశీ విమానంలో ప్రయాణించినవారు దాదాపు 95.5కోట్లు ఉన్నారని ‘డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా’ పేర్కొంది. కిందటేడాదితో పోలిస్తే ఇది 23.2శాతం అధికం అని తెలిపారు. స్పైస్ జెట్ విమానాల్లో ఎక్కువగా ప్రయాణాలు చేసినట్లు తెలిసింది. పెద్ద నోట్లు రద్దయిన తర్వాత కూడా రూ.500, రూ.1000 నోట్లు ఉపయోగించవచ్చని కేంద్రం చెప్పిన నేపథ్యంలో కూడా విమాన సంస్థల ఆదాయం అమాంతం పెరిగినట్లు సమాచారం. -
సీఎం విమానం ల్యాండింగ్ వివాదం, పైలట్లపై వేటు
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న విమానం ల్యాండింగ్‌కు సంబంధించి ఇటీవల ఏర్పడిన గందరగోళం విషయంలో ఆరుగురు పైలట్లపై సస్పెన్షన్ వేటు పడింది. ఇండిగో, స్పైస్ జెట్, ఎయిర్ ఇండియా విమాన సంస్థలకు చెందిన ఆరుగురు పైలట్లపై వేటు వేస్తూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నిర్ణయం తీసుకుంది. ఒక్కో విమాన సంస్థ నుంచి ఇద్దరు పైలట్లపై వేటు పడింది. మమత ప్రయాణిస్తున్న ఇండిగో విమానం ల్యాండింగ్‌కు కొల్కతా విమానాశ్రయంలో 15 నిమిషాలు ఆలస్యంగా అనుమతివ్వడంతో కలకలం రేగిన విషయం తెలిసిందే. బిహార్‌లో నవంబర్ 30న ఓ ర్యాలీలో పాల్గొన్న మమత సాయంత్రం 7.30కు పట్నా నుంచి ఇండిగో విమానంలో తిరుగుపయనమయ్యారు. కోల్‌కతాకు 200 కి.మీ. దూరంలో ఉన్నప్పుడే.. ల్యాండింగ్ వరుసలో మమత విమానం 8వ స్థానంలో ఉందని ఏటీసీ నుంచి పైలట్‌కు సందేశం వచ్చింది. అయితే ఈ విమానంలో ఇంధనం తక్కువగా ఉందని, అత్యవసరంగా ల్యాండింగ్‌కు అవకాశం ఇవ్వాలని పైలట్ తెలపటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అప్పటికే మరో మూడు విమానాలు ఇంధనం తక్కువుందని చెప్పటంతో 15 నిమిషాల తర్వాత మమత విమానానికి ఏటీసీ క్లియరెన్సు ఇచ్చింది. అయితే మమతను మట్టుబెట్టేందుకు ప్రయత్నం జరుగుతుందనే అనుమానాన్ని ఉభయసభల్లో తృణమూల్ సభ్యులు లేవనెత్తి గందరగోళం సృష్టించారు. దీనిపై సంబంధిత మంత్రి వివరణ ఇస్తూ.. 3 విమానాలు ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు కోరటంతోనే మమత విమానం రావటం ఆలస్యమైందని తెలిపారు. ఈ వివాదంపై విచారణకు ఆదేశించిన డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పైలట్లపై వేటు వేసింది. కాగా.. పైలట్ల సస్పెన్షన్‌పై విమాన సంస్థలు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. -
విమానాల్లో సెల్ఫీలకు సెలవ్ ?
న్యూఢిల్లీ: భద్రతా కారణాల దృష్ట్యా ఇక విమానాల్లో సెల్ఫీలపై త్వరలో డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నిషేధం విధించనుంది. ఇందుకు సంబంధించి డీజీసీఏ నియమ నిబంధనలను రూపొందించే పనిలో ఉంది. విమానాల్లోని కాక్‌పిట్, ఇతర ప్రాంతాలలో సెల్ఫీలు, ఫొటోలు దిగడంపై నిషేధం విధించనున్నట్లు డీజీసీఏ ఉన్నతాధికారి చెప్పారు. ఈ నిబంధనలు పైలట్లు, విమాన సిబ్బందితోపాటు ప్రయాణికులకూ వర్తిస్తాయన్నారు. కాక్‌పిట్‌లో దిగే సెల్ఫీల వల్ల విమానంతో పాటు ప్రయాణికుల భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదముండటంతో డీజీసీఏ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ మధ్య కాలంలో స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టెక్నాలజీ వినియోగం పెరగడంతో విమానాల్లోనే పైలట్లతో సహా, విమాన సిబ్బంది, చాలామంది ప్రయాణికులు విమానాల్లో ఫొటోలు తీసుకుంటున్నారు. -
దేశీయ ఎయిర్ లైన్స్‌కు కేంద్రం షాక్?
న్యూఢిల్లీ : ట్రావెల్ సీజన్ లో, ప్రకృతి వైపరీత్యాల సమయంలో దేశీయ ఎయిర్ లైన్లు అమాంతం పెంచే టిక్కెట్ ధరలపై కేంద్రప్రభుత్వం దృష్టి సారించింది. పెరిగే ధరలనుంచి ప్యాసెంజర్ల రక్షించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. కొన్ని పరిస్థితుల్లో దేశీయ ధరలపై విధించిన పరిమిత ఆంక్షలను ప్రభుత్వం పరిశీలిస్తోందని ఏవియేషన్ కార్యదర్శి ఆర్ ఎన్ చౌబే తెలిపారు. పెరిగే ధరల నుంచి ప్యాసెంజర్లకు ఉపశమనం కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. పెస్టివల్స్ లాంటి పీక్ సీజన్ లో, ప్రకృతి వైపరిత్యాలు సంభవించినప్పుడూ ఎయిర్ లైన్లు ఎలాంటి అడ్డూ అదుపు లేకుండా ధరలు పెంచుతున్నాయని చౌబే అన్నారు. ఇటీవల చెన్నైకి కలిగిన భారీ వరద ముప్పుతో, సిటీకి దగ్గర్లో ఉన్న ఎయిర్ పోర్ట్ లో ధరలు పెరిగాయని తెలిపారు. పెరిగే ధరలనుంచి వినియోగదారులను ఉపశమనం కల్పించడానికి కన్సూమర్ ఫ్రెండ్లీ విధానాలను రూపొందిస్తున్నామని పేర్కొన్నారు.. దేశీయ ప్యాసెంజర్లు 15 కేజీల వరకూ కంటే అదనంగా తీసుకెళ్లే లగేజీపై ప్యాసెంజర్లు అదనపు చార్జీలు చెల్లించాల్సి ఉంటోంది. అయితే 15 కేజీలకంటే ఒకటి రెండు కేజీలు అదనంగా తీసుకెళ్లే లగేజీకి సాధారణ ధరల్లో తగ్గింపు ఇవ్వాలని ఎయిర్ లైన్లకు చౌబీ సూచించారు. అదేవిధంగా ల్యాప్ టాప్, లేడీస్ పర్స్ వంటి వాటిని 7కేజీల వరకూ ప్యాసెంజర్లకు తమతో పాటు లోపల తీసుకెళ్లడానికి అనుమతి ఇచ్చేవారు. ఈ వేయింట్ లిమిట్ ను కూడా తగ్గించి కేవలం ఒక్క బ్యాగ్ ను మాత్రమే తీసుకెళ్లేలా నిబంధనలను పరిశీలిస్తున్నామని చౌబే తెలిపారు. ప్యాసెంజర్ ఫ్రెండ్లీ విధానాలపై ప్రజల నుంచి స్పందన వచ్చిన అనంతరం పూర్తి నిబంధనలు తయారుచేసి, అమలుచేస్తామన్నారు. గత కొద్ది కాలంగా ధరల పెరుగుతున్నా పట్టించుకోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తీరుపై ప్యాసెంజర్లు విసుగెత్తిపోయారు. దీంతో ఈ కొత్త నిబంధనలను ప్రభుత్వం త్వరలోనే అమలు చేయనుంది. -
10 శాతం పెరిగిన ఎయిర్ ట్రాఫిక్
న్యూఢిల్లీ: దేశీయ విమానయానం అక్టోబర్‌లో పుంజుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌తో పోల్చితే అక్టోబర్‌లో ఎయిర్‌ట్రాఫిక్ 10 శాతం వృద్ధి చెందింది. మొత్తం ప్రయాణికుల్లో మూడో వంతు ప్రయాణికులు ఇండిగో విమానయాన సంస్థ ద్వారా ప్రయాణించారని డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) గణాంకాలు వెల్లడించాయి. దేశీయ విమానయానానికి సంబంధించిన ఈ వివరాల ప్రకారం..., 2012లో 4.83 కోట్ల మంది విమానయానం చేయగా, ఈ ఏడాది జనవరి-అక్టోబర్ కాలానికి 5.07 కోట్ల మంది విమానయానం చేశారు. 5 శాతం వృద్ధి నమోదైంది. సెప్టెంబర్‌లో 45.55 లక్షలుగా ఉన్న ప్రయాణికుల సంఖ్య అక్టోబర్‌లో 9.9 శాతం వృద్ధితో 50.08 లక్షలకు పెరిగింది. 30.2 శాతం మార్కెట్ వాటాతో ఇండిగో అగ్రస్థానంలో ఉంది. 20 శాతం మార్కెట్ వాటాతో స్పైస్ జెట్ రెండో స్థానంలో నిలిచింది. జెట్ ఎయిర్వేస్-జెట్‌లైట్‌లు సంయుక్తంగా 23.8 శాతం మార్కెట్ వాటాను సాధించాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఎయిర్ ఇండియా(డొమెస్టిక్)(18.4 శాతం), గో ఎయిర్(7.7 శాతం), ఎయిర్ కోస్టా(0.1 శాతం) ఉన్నాయి. -
పీహెచ్హెచ్ఎల్ అనధికారికంగా హెలిప్యాడ్లు నిర్మిస్తుంది: కాగ్
పవన్ హన్స్ హెలికాప్టర్స్ లిమిటెడ్ (పీహెచ్హెచ్ఎల్) సంస్థ ప్రముఖ యాత్ర స్థలాలు, పర్యాటక కేంద్రాలల్లో అనుమతి లేకుండా హెలిప్యాడ్లను నిర్మించిందని ద కంప్ట్రొలర్ అడిటర్ జనరల్ (కాగ్) ఆదివారం న్యూఢిల్లీలో వెల్లడించింది. గతేడాది జూన్‌లో ఫాత (అమర్నాథ్), కట్రా, పోర్ట్ బ్లయిర్, గంగాటక్,పాట్నా, కొరాపూట్, గడ్చిరోలిల్లో హెలిప్యాడ్లను ఏర్పాటు చేసిందని ఉదాహరించింది. ప్రయాణికులు లేదా లగేజీతో వెళ్లే విమానం,హెలికాప్టర్లు తమ స్వరీసులను విమానాశ్రయాల్లో దిగాలన్న, బయలుదేరాలన్న డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అనుమతి అవసరమని పేర్కొంది. అందులోభాగంగానే హెలిప్యాడ్ల నిర్మాణంలో కూడా అనుమతి కోరాలని తెలిపింది. అయితే ఆ విషయంలో పీహెచ్హెచ్ఎల్ పూర్తిగా పక్షపాతధోరణితో వ్యవహరించిందని కాగ్ ఆరోపించింది. ప్రయాణికుల భద్రతపై కొంచమైన శ్రద్ధ లేకుండా వ్యవహారిస్తుందని ఆ సంస్థను కాగ్ ఈ సందర్భంగా తీవ్రంగా ఆక్షేపించింది. ఈశాన్య భారతంలో ఆ సంస్థ నడుపుతున్న విమాన సర్వీసుల అంశాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించింది. అలాగే 2011,ఏప్రిల్‌లో పీహెచ్హెచ్ఎల్ సంస్థకు చెందని హెలికాప్టర్ 17 మంది ప్రయాణికులతో వెళ్తు తవాంగ్ వద్ద జరిగిన ప్రమాద సంఘటనపై పౌరవిమానయాన సంస్థ ఓ కమిటీని ఏర్పాటు చేసిన సంగతిని కాగ్ ఈ సందర్భంగా గుర్తు చేసింది. పవన్ హన్స్ హెలికాప్టర్స్ లిమిటెడ్ సంస్థపై కాగ్ రూపొందించిన నివేదికను గత వారం కాగ్ పార్లమెంట్‌కు నివేదించిన సంగతి తెలిసిందే.