న్యూఢిల్లీ: కొత్తగా అభివృద్ధి చేసిన ‘గగన్’ నేవిగేషన్ వ్యవస్థ ఆధారిత విమానాలనే విమానయాన సంస్థలు ప్రవేశపెట్టడాన్ని తప్పనిసరిచేస్తూ కేంద్రం త్వరలో నోటిఫికేషన్ జారీచేసే వీలుంది. ఈ వ్యవహారానికి సంబంధించి గతేడాది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అన్ని భాగస్వామ్య పక్షాలతో సమావేశం జరిపింది.
ఇస్రో, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) సంయుక్తంగా రూ.774 కోట్ల ఖర్చుతో గగన్ (జీపీఎస్ ఎయిడెడ్ ఆగ్‌మెంటెడ్ నేవిగేషన్ )ను రూపొందించాయి. ఈ విధానంతో ఎయిర్‌లైన్స్ కార్యకలాపాల సామర్థ్యం పెరిగి, వ్యయం తగ్గుతుంది. ప్రస్తుతం భారత విమానయాన సంస్థలన్నింటికి కలిపి సుమారు 450 విమానాలున్నాయి. అయితే గగన్ కు మారాలంటే విమానయాన సంస్థకు భారీగా వ్యయం అవుతుంది.