AAI
-
గన్నవరం విమానాశ్రయానికి త్వరలో సీఐఎస్ఎఫ్ భద్రత
సాక్షి, అమరావతి: గన్నవరం విమానాశ్రయం భద్రతను త్వరలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) చేపట్టనుంది. ఈ మేరకు గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే ఆమోదించిన నిర్ణయాన్ని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) తాజాగా ఖరారు చేసింది. దీనిని కేంద్ర విమానయాన శాఖ త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది. దాంతో గన్నవరం విమానాశ్రయం భద్రతపట్ల సందేహాలకు తెరపడనుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ చొరవ గన్నవరం నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు పెరుగుతుండటంతో దేశంలోని ఇతర విమానాశ్రయాలతో సమాన స్థాయిలో సీఐఎస్ఎఫ్ భద్రత కల్పించాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. సీఐఎస్ఎఫ్ బలగాలు నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ భద్రత విధులు నిర్వర్తిస్తాయి.బంగారం, ఇతర స్మగ్లింగ్ కార్యకలాపాలను అడ్డుకుంటాయి. అందుకే వైఎస్సార్సీపీ ప్రభుత్వం సీఐఎస్ఎఫ్ భద్రత కోరింది. ఆ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో అంగీకరించింది. ఈ ఏడాది జూలై 2 నుంచి విమానాశ్రయం భద్రతను సీఐఎస్ఎఫ్కు అప్పగించనున్నట్లు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ప్రకటించింది. అడ్డుకున్న కూటమి ప్రభుత్వం కాగా, ఎన్నికల అనంతరం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ విమానాశ్రయం భద్రత రాష్ట్ర పోలీసు పరిధిలోని ప్రత్యేక భద్రతా విభాగం (ఎస్పీఎఫ్) చేతుల్లోనే ఉండాలని భావించింది. దాంతో జూలై 2న గన్నవరం విమానాశ్రయం భద్రతను సీఐఎస్ఎఫ్’కు అప్పగించే కార్యక్రమాన్ని రద్దు చేశారు. సీఐఎస్ఎఫ్ భద్రత ఇలా..ప్రస్తుతం ఎస్పీఎఫ్కు చెందిన 250 మంది గన్నవరం విమానాశ్రయం భద్రత విధుల్లో ఉన్నారు. అయితే, వారిలో 70 మంది మాత్రమే ప్రధాన గేటు, పార్కింగ్, చెక్ ఇన్ పాయింట్లు, రన్‌వే భద్రతను పర్యవేక్షిస్తున్నారు. సీఐఎస్ఎఫ్ భద్రత కల్పిస్తే ఏకంగా 350 మందిని కేటాయిస్తారు. వారిలో 150 మందిని ప్రత్యేకంగా ప్రధాన గేటు, పార్కింగ్, చెక్ ఇన్ పాయింట్లు, రన్ వే భద్రతకు నియోగిస్తారు. తద్వారా భద్రత మరింత పటిష్టమవుతుంది.బాంబు బెదిరింపులతో అప్రమత్తమైన కేంద్రం ఇటీవల విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు ఎక్కువయ్యాయి. గన్నవరం విమానాశ్రయానికి కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఏఏఐ అప్రమత్తమైంది. గతంలో ఆమోదించినట్టుగా గన్నవరం విమానాశ్రయానికి సీఐఎస్ఎఫ్ భద్రత కల్పించాలని నిర్ణయిస్తూ కేంద్ర విమానయాన, హోం శాఖలకు ప్రతిపాదనలు పంపింది. దీంతో జూలై 2న విమానాశ్రయం భద్రతను సీఐఎస్ఎఫ్కు అప్పగించే కార్యక్రమాన్ని రద్దు చేయడానికి కారణాలను కేంద్ర హోం శాఖ వాకబు చేసింది. సీఐఎస్ఎఫ్ భద్రతను కల్పించాల్సిందేనని తేల్చిచెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ ఎస్పీఎఫ్ బలగాలను వెనక్కి తీసుకోవాలని చెప్పింది. కాగా, వచ్చే జనవరిలోనే గన్నవరం విమానాశ్రయ భద్రత బాధ్యతలను సీఐఎస్ఎఫ్కు అప్పగించనున్నట్టు తెలిసింది. -
ఎయిర్‌బస్ @ ఓరుగల్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండో విమానాశ్రయ నిర్మాణానికి మార్గం సుగమమైంది. వరంగల్ శివారులోని మామునూరులో అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో ఎయిర్పోర్ట్ రూపొందబోతోంది. ఐదారేళ్ల తర్వాత ఎట్టకేలకు అవరోధాలు పరిష్కారం కావటంతో విమానాశ్రయ నిర్మాణం చేపట్టేందుకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) సంసిద్ధత ప్రకటించింది. దీనిని సొంతంగానే నిర్మించాలని నిర్ణయించగా, అనుమతులు, ఇతర అధికారిక ప్రక్రియను ఆరునెలల్లో పూర్తి చేసి టెండర్లు పిలవబోతోంది. ఎయిర్‌బస్ దిగేలా.. నాలుగేళ్ల క్రితం ఏఏఐ ఆధ్వర్యంలో జరిగిన టెక్నో ఎకనమిక్ ఫీజిబిలిటీ సర్వే రెండు రకాల నివేదికలు సమర్పించింది. చిన్న విమానాశ్రయం నిర్మించేందుకు 724 ఎకరాల భూమి, రూ.248 కోట్ల వ్యయం అవుతుందని, పెద్ద విమానాలను ఆపరేట్ చేసే స్థాయిలో నిర్మించాలంటే 1053 ఎకరాల భూమి, రూ. 345 కోట్ల వ్యయం అవుతుందని పేర్కొంది. తొలుత చిన్న విమానాశ్రయంగానే నిర్మించాలని నాటి ప్రభుత్వం సూచించింది. కానీ భవిష్యత్‌లో విస్తరణ ఇబ్బందిగా ఉంటుందని, కనీసం 30 ఏళ్ల అవసరాలకు తగ్గట్టుగా ఒకేసారి పెద్ద విమానాశ్రయమే నిర్మించాలని గతేడాది చివరలో ఏఏఐ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనికి ప్రభుత్వం సరే అనటంతో పెద్ద విమానాశ్రయమే రూపొందబోతోంది. ఇక్కడ ఎయిర్‌బస్ విమానం దిగేలా దాదాపు 2,800 మీటర్ల పొడవైన్ రన్‌వే నిర్మించబోతున్నారు. మామునూరులో నిజాం ప్రభుత్వం నిర్మించిన ఎయిర్‌్రస్టిప్ శిథిలం అయినా, నాటి రెండు రన్‌వేల ఆనవాళ్లు ఉన్నాయి. అందులో పెద్దది దాదాపు 1,400 మీటర్ల పొడవు ఉంది. ఇప్పుడు అదే డైరెక్షన్లో దానిపైనే కొత్త రన్‌వే నిర్మించనున్నారు. దాని పక్కన గ్లైడర్స్ దిగేందుకు మరో చిన్న రన్‌వే కూడా ఉంది. దానిని కూడా పునరుద్ధరించే యోచనలో ఉన్నారు. సొంతంగానే నిర్మాణం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జీఎమ్మార్ సంస్థ నిర్మించింది. ఎయిర్‌పోర్టుకు 150 కి.మీ. పరిధిలో మరో విమానాశ్రయం నిర్మించకూడదన్న నిబంధన ఉంది. వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఇది అడ్డంకిగా మారటంతో జీఎమ్మార్ సంస్థతో సంప్రదింపులు జరిపారు. వరంగల్ విమానాశ్రయాన్ని కూడా దానికే కేటాయించేలా కూడా చర్చలు జరిగాయి. చివరకు ఆ నిబంధనపై అభ్యంతరం పెట్టకూడదన్న దిశలో చర్చలు సానుకూలంగా జరిగాయి. ఆ మేరకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్ఓసీ తీసుకుంది. ఇప్పుడు ప్రైవేట్ సంస్థలకు కేటాయించకుండా సొంతంగానే వరంగల్ ఎయిర్‌పోర్టును చేపట్టాలని అది నిర్ణయించింది. – విమానాశ్రయానికి 700 మీటర్ల దూరంలో ఉన్న వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిని మళ్లించాల్సిన పరిస్థితి తలెత్తింది. దాదాపు కిలోమీటరు నిడివితో భారీ సొరంగమార్గం నిర్మించి వాహనాలను దాని గుండా మళ్లించాలని ప్రతిపాదించారు. కానీ దీనికి భారీ ఖర్చు అవుతున్నందున, దాని బదులు బైపాస్‌రోడ్డు నిర్మించాలన్న ప్రత్యామ్నాయ ప్రతిపాదనపై ఇప్పుడు పరిశీలిస్తున్నారు. – వరంగల్ మెగా టెక్స్టైల్ పార్కులో జపాన్, తైవాన్ లాంటి విదేశీ సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి. ఇవి కార్గో ఫ్లైట్ సేవలు కోరుతున్నాయి. కార్గో ఫ్లైట్ ఆపరేషన్ జరగాలంటే పెద్ద రన్‌వే ఉండాలి. దీంతో అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయంగానే దీనిని రూపొందించబోతున్నారు. మూడేళ్ల వయబిలిటీ గ్యాప్ ఫండ్.. మామునూరు విమానాశ్రయాన్ని ‘ఉడాన్’లోని రీజినల్ కనెక్టివిటీ స్కీంతో అనుసంధానించనున్నారు. ఇందులో మూడేళ్ల కాలానికి కేంద్రం వయబిలిటీ గ్యాప్ ఫండ్ అందిస్తుంది. రూట్ల వారీగా బిడ్డింగ్ నిర్వహిస్తే వాటిల్లో ఎంపికైన ఆపరేటర్లకు ఆయా రూట్లు కేటాయిస్తారు. ఆ ఆపరేటర్లు మాత్రమే ఆ రూట్లలో మూడేళ్లపాటు విమాన సర్వీసులు నిర్వహిస్తారు. ఈ కాలంలో సీట్ల వారీగా నష్టాలను బేరీజు వేసి.. డిమాండ్ అంచనా–వాస్తవ డిమాండ్.. ఈ రెంటి మధ్య ఉండే గ్యాప్‌ను కేంద్రం భర్తీ చేస్తుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. వేయి ఎకరాలు అవసరం కొత్త విమానాశ్రయానికి వేయి ఎకరాలు కావాలి. నిజాం కాలం నాటి పాత విమానాశ్రయానికి చెందిన 696 ఎకరాలు ప్రస్తుతం ఏఏఐ అధీనంలోనే ఉన్నాయి. మిగతా భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించాల్సి ఉంది. విమానాశ్రయం నిర్మించేందుకు రూ. 800 కోట్లు ఖర్చవుతాయని అంచనా. త్వరలో ఏఏఐ డీపీఆర్ సిద్ధం చేయనుంది. -
మామునూరుకు పెద్ద విమానాలు!
సాక్షి, హైదరాబాద్: వరంగల్ విమానాశ్రయాన్ని పెద్ద విమానాల ఆపరేషన్‌తోనే ప్రారంభించాలని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నిర్ణయించింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సమ్మతించడంతో ఆ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీలైనంత త్వరలో పనులు ప్రారంభించాలని భావిస్తున్నారు. అవరోధంగా ఉన్న రెండు ప్రధాన అంశాలను వెంటనే కొలిక్కి తెచ్చేలా త్వరలో రాష్ట్ర ప్రభుత్వం–పౌరవిమానయాన శాఖ మధ్య ఒప్పందం కుదరనుంది. విమానాశ్రయం నిర్మాణానికి కావాల్సిన భూమిని సేకరించే పనిని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనుండగా 150 కి.మీ. నిడివిలో మరో విమానాశ్రయం ఉండకూడదన్న అంశాన్ని అధిగమించేలా హైదరాబాద్ విమానాశ్రయాన్ని నిర్మించిన జీఎంఆర్‌తో పౌర విమానయాన శాఖ చర్చలు జరపనుంది. ఈ రెండు కీలక ప్రక్రియలు పూర్తయితే ఏడాదిన్నరలోపే విమానాశ్రయాన్ని సిద్ధం చేయాలని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ భావిస్తోంది. ఈ ప్రక్రియలు ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉండగా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఆలస్యం జరిగింది. ఇప్పటికే ఓ పెద్ద రన్‌వే, మరో చిన్న రన్‌వే.. రాష్ట్రంలో ప్రస్తుతం హైదరాబాద్ విమానాశ్రయమే అందుబాటులో ఉంది. బేగంపేటలోని పాత విమానాశ్రయం కేవలం ప్రముఖుల ప్రత్యేక విమానాల నిర్వహణకే పరిమితమైంది. దీంతో రెండో విమానాశ్రయం వెంటనే అవసరమని నిర్ణయించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం వరంగల్ విమానాశ్రయానికి చర్యలు చేపట్టింది. దాంతోపాటు ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్, నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి, కొత్తగూడెంలోని పాల్వంచ, మహబూబ్‌నగర్‌లోని దేవరకద్రలలో మరో ఐదు విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. మిగతా వాటి విషయంలో జాప్యం జరిగే పరిస్థితి ఉండటంతో వరంగల్ విమానాశ్రయాన్ని వెంటనే నిర్మించాలని చర్చల సందర్భంలో కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు గతంలోనే నిర్ణయించాయి. వరంగల్ శివారులోని మామునూరులో నిజాం కాలంలో ఎయిర్‌్రస్టిప్ అందుబాటులో ఉండేది. అక్కడ 1,400 మీటర్ల పొడవైన రన్‌వే, గ్లైడర్స్ దిగేందుకు మరో చిన్న రన్‌వే ఉంది. దశాబ్దాలుగా వాటి వినియోగం లేకపోవటంతో అవి బాగా దెబ్బతిన్నాయి. ఇప్పటికీ ఆ పాత్ ఎయిర్్రస్టిప్కు చెందిన 696 ఎకరాల భూమి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ అధీనంలోనే ఉంది. అక్కడే ఇప్పుడు కొత్త విమానాశ్రయాన్ని నిర్మించబోతున్నారు. పెద్ద విమానాశ్రయం నిర్మాణమంటే ఆలస్యమయ్యే అవకాశం ఉన్నందున చిన్న విమానాలు ఆపరేట్ చేసేలా ప్రస్తుతానికి చిన్న రన్‌వేతో చిన్న విమానాశ్రయాన్ని నిర్మించాలని గతంలో భావించారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా దాన్ని విస్తరిస్తూ పోవాలని అప్పట్లో నిర్ణయించారు. కానీ ఒకేసారి పెద్ద విమానాలను ఆపరేట్ చేసే పూర్తిస్థాయి విమానాశ్రయాన్నే నిర్మించాలని తాజాగా ఖరారు చేశారు. ఇటీవల కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన చర్చల్లో ఈ అంశం కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే ఉద్దేశంతో ఉండటంతో దీనికి మార్గం సుగమమవుతోంది. అదనపు భూసేకరణకు రంగం సిద్ధం.. అందుబాటులో ఉన్న భూమికి అదనంగా 253 ఎకరాలు కావాలని అథారిటీ ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అక్కడికి చేరువలోనే పశుసంవర్థక శాఖకు చెందిన స్థలం అందుబాటులో ఉండటంతో దాన్ని సేకరించనున్నారు. ఒక గ్రామాన్ని తరలించాల్సి ఉంటుంది. త్వరలో గ్రామ సభ ఏర్పాటు చేసి ప్రజలకు వివరించనున్నట్టు సమాచారం. విమానాశ్రయం వస్తే వరంగల్‌కు మరిన్ని పెట్టుబడులు.. హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో పెద్ద నగరంగా వరంగల్ విస్తరిస్తోంది. దాన్ని ఐటీ, ఇతర పరిశ్రమల స్థాపనతో వేగంగా అభివృద్ధి చేయాల్సి ఉందని చాలా ఏళ్లుగా నిపుణులు పేర్కొంటున్నారు. ఇటీవలే కాజీపేట శివారులో కొన్ని పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. మరింత వేగంగా పారిశ్రామీకరణ జరగాలంటే భారీ ఎత్తున పెట్టుబడులు అవసరం. పెట్టుబడులు రావాలంటే స్థానికంగా విమానాశ్రయం ఉండాలన్నది పారిశ్రామికవేత్తల అభిప్రాయం. ప్రస్తుతం హైదరాబాద్‌కు వరంగల్ 135 కి.మీ. దూరంలో ఉంది. వరంగల్ చేరుకోవాలంటే హైదరాబాద్‌లో విమానం దిగి దాదాపు మూడు గంటలు ప్రయాణం చేయాల్సి ఉంది. ఇది పెట్టుబడులకు కొంత ఆటంకంగా ఉందని ప్రభుత్వం గుర్తించింది. వరంగల్‌లోనే నేరుగా ల్యాండ్ అయ్యే ఏర్పాటు ఉంటే వేగంగా పెట్టుబడులు వస్తాయని తేల్చారు. ఇదే విషయాన్ని జీఎంఆర్ దృష్టికి తీసుకెళ్లి ఒప్పించాలని కేంద్రరాష్ట్రప్రభుత్వాలు భావిస్తున్నాయి. హైదరాబాద్ విమానాశ్రయాన్ని జీఎంఆర్ సంస్థ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అక్కడికి 150 కి.మీ. నిడివిలో మరో వాణిజ్య విమానాశ్రయం ఉండకూడదన్నది కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలతో ఆ సంస్థకు ఉన్న ఒప్పందం చెబుతోంది. ఈ నిబంధన ఇప్పుడు వరంగల్ విమానాశ్రయానికి అడ్డంకిగా మారుతోంది. దీన్ని అధిగమించేందుకు ఇందుకు త్వరలో ఓ కమిటీని ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ, కేంద్ర ప్రభుత్వం నుంచి ముగ్గురు ప్రతినిధులు ఇందులో ఉంటారని సమాచారం. ఈ కమిటీ సభ్యులు జీఎంఆర్‌తో సంప్రదింపులు జరిపి ఈ సమస్యను కొలిక్కి తేనున్నారు. -
ఆరు విమానాశ్రయాల లీజుతో ఏటా రూ. 515 కోట్లు ఆదా..
న్యూఢిల్లీ: ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) కింద ఆరు విమానాశ్రయాల నిర్వహణను లీజుకివ్వడం ద్వారా 2018 నుంచి ప్రభుత్వానికి ఏటా ర. 515 కోట్లు ఆదా అవుతోందని పౌర వివనయాన శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ రాజ్యసభకు తెలిపారు. ప్రైవేట్ కాంట్రాక్టరుకు (కన్సెషనైర్) లీజుకివ్వడానికి ముందు ఈ ఎయిర్‌పోర్టులపై ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) రూ. 2,767 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. ఆ మొత్తాన్ని కాంట్రాక్టరు ముందస్తుగా చెల్లించినట్లు పేర్కొన్నారు. 2018లో మంగళూరు, లక్నో, అహ్మదాబాద్, తిరువనంతపురంట్జైపూర్, గువాహటి వివనాశ్రయాలను లీజుకిచ్చారు. వీటిలో అహ్మదాబాద్ విమానాశ్రయంపై ఏటా రూ. 137 కోట్లు, జైపూర్ (రూ. 51 కోట్లు), లక్నో (రూ. 63 కోట్లు)మంగళూరు (రూ. 53 కోట్లు), తిరువనంతపురం (రూ.142 కోట్లు), గువాహటి వివనాశ్రయంపై రూ. 68 కోట్లు ఏటా ఆదా అయినట్లు వీకే సింగ్ చెప్పారు. ఆరు ఎయిర్‌పోర్టులకు సంబంధించి కన్సెషనైర్‌కు అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టుపై రూ. 506 కోట్లు, జైపూర్ (రూ. 251 కోట్లు), లక్నో (రూ. 365 కోట్లు) మంగళూరు (రూ. 118 కోట్లు), తిరువనంతపురం (రూ. 350 కోట్లు), గువాహటి విమానాశ్రయంపై రూ. 248 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రస్తుతం పీపీపీ కింద 14 వివనాశ్రయాలను ప్రైవేట్ ఆపరేటర్లు నిర్వహిస్తున్నారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్, బెంగళూరు, కొచ్చిన ఎయిర్‌పోర్టులు మాత్రమే లాభాలు నమోదు చేసినట్లు మంత్రి తెలిపారు. -
భారీగా పెరిగిన విమాన ప్రయాణికులు.. లాభాల్లో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ
న్యూఢిల్లీ: మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2022–23)లో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. నష్టాలను వీడి రూ. 3,400 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2021–22) దాదాపు రూ. 804 కోట్ల నికర నష్టం ప్రకటించగా.. 2020–21లో మరింత అధికంగా రూ. 3,176 కోట్ల నష్టం నమోదైంది. గతేడాది ప్రధానంగా దేశీ విమాన ప్రయాణికులు భారీగా పెరగడంతో కంపెనీ ఆర్థికంగా బలపడింది. వెరసి కరోనా మహమ్మారి బయటపడ్డాక కంపెనీ తిరిగి లాభాల బాట పట్టడం గమనార్హం! కాగా.. ఇవి ప్రొవిజనల్ ఫలితాలు మాత్రమేనని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఆడిట్ తదుపరి కంపెనీ తుది పనితీరు వెల్లడికానున్నట్లు తెలియజేశాయి. 2022లో దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య 47 శాతం జంప్‌చేసి 12.32 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది ఈ సంఖ్య 8.38 కోట్లు మాత్రమే. ఈ ఏడాది తొలి మూడు నెలల్లో ప్రయాణికుల సంఖ్య 52 శాతం ఎగసి 3.75 కోట్లకు చేరింది. ఇదీ చదవండి: ఈక్విటీలలో భారీ పెట్టుబడులు.. ఇప్పటివరకూ రూ.30,945 కోట్లు -
ఆర్ఆర్సీ– ఎన్సీఆర్లో భారీగా అప్రెంటిస్ ఖాళీలు
ప్రయాగ్‌రాజ్ ప్రధాన కేంద్రంగా ఉన్న రైల్వే రిక్రూట్మెంట్ సెల్(ఆర్ఆర్సీ).. నార్త్ సెంట్రల్ రైల్వే(ఎన్సీఆర్)కు చెందిన వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం ఖాళీల సంఖ్య: 1664 ► ట్రేడులు: ఫిట్టర్,వెల్డర్,మెషినిస్ట్, కార్పెంటర్,ఎలక్ట్రీషియన్,పెయింటర్,మెకానిక్ తదితరాలు. ► అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ(ఎన్సీవీటీ/ఎస్సీవీటీ) ఉత్తీర్ణులవ్వాలి. ► వయసు: 01.12.2021 నాటికి 15–24 ఏళ్ల మధ్య ఉండాలి. ► ఎంపిక విధానం:పదో తరగతి,ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 02.11.2021 ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది:01.12.2021 ► వెబ్సైట్: www.rrcpryi.org ఏఏఐలో 90 అప్రెంటిస్‌లు న్యూఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ).. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం ఖాళీల సంఖ్య: 90 ► ఖాళీల వివరాలు: ట్రేడ్ అప్రెంటిస్–24, డిప్లొమా అప్రెంటిస్–36, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్–30. ► విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఎయిరోనాటిక్స్, ఆర్కిటెక్ట్. ► అర్హత: సంబంధిత ట్రేడులు/విభాగాల్లో ఐటీఐ, ఇంజనీరింగ్ డిప్లొమా, ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. » వయసు: 30.09.2021 నాటికి 26ఏళ్లు మించకుండా ఉండాలి. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, ఇంటర్వ్యూ /సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 31.10.2021 ► వెబ్సైట్: https://www.aai.aero యూసీఐఎల్, జార్ఖండ్‌లో 242 అప్రెంటిస్‌లు జార్ఖండ్‌లోని యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(యూసీఐఎల్).. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం ఖాళీల సంఖ్య: 242(జాదుగూడ యూనిట్–108, నర్వాపహర్ యూనిట్ –54, తురామ్దిహ్ యూనిట్–80). ► ట్రేడులు: ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, టర్నర్/మెషినిస్ట్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మెకానిక్ డీజిల్ తదితరాలు. ► అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ(ఎన్సీవీటీ) ఉత్తీర్ణులవ్వాలి. ► వయసు: 29.10.2021 నాటికి 18–25ఏళ్ల మధ్య ఉండాలి. ► ఎంపిక విధానం: ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 29.10.2021 ► వెబ్సైట్: www.uraniumcorp.in -
బ్రాండింగ్ నిబంధనలను కాలరాస్తున్న అదానీ గ్రూప్స్..!
ముంబై: గౌతమ్ అదానీకు చెందిన అదానీ గ్రూప్స్ ఎయిర్పోర్ట్ నిర్వహణ రంగంలో దూసుకుపోతున్నాయి. దేశ వ్యాప్తంగా సుమారు ఎనిమిది ఇంటర్నేషనల్, రిజనల్ ఎయిర్‌పోర్ట్‌ల నిర్వహణ చేస్తున్నాయి. కొన్ని రోజుల క్రితమే ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను జీవీకే నుంచి కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా విమానాశ్రయ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) ఏర్పాటు చేసిన మూడు కమిటీలు అదానీ గ్రూప్స్ నిర్వహిస్తోన్న అహ్మదాబాద్, మంగుళూరు, లక్నో విమానాశ్రయాల్లో రాయితీ ఒప్పందాలలో ఏఏఐ సూచించిన బ్రాండింగ్ నిబంధనలను ఉల్లఘిస్తున్నట్లు కనుగొంది. దీంతో అదానీ గ్రూప్స్ ఆయా ఎయిర్‌పోర్ట్‌ల్లో బ్రాండింగ్, డిస్ప్లే బోర్డులను మారుస్తోన్నట్లు తెలుస్తోంది. మూడు విమానాశ్రయాల నిర్వహణ కోసం 2019 ఫిబ్రవరిలో అదానీ గ్రూప్ బిడ్లను గెలుచుకుంది. ఎయిర్‌పోర్టుల నిర్వహణ కోసం ఫిబ్రవరి 2020లో ఏఏఐతో అదానీ గ్రూప్స్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. నవంబర్ 2020 నుంచి ఎయిర్‌పోర్టుల నిర్వహణను అదానీ గ్రూప్స్ తీసుకున్నాయి. తాజాగా ఏఏఐ నిర్వహించిన తనిఖీల్లో అదానీ గ్రూప్స్ ఆయా ఎయిర్‌పోర్టులో బ్రాండింగ్ నిబంధనలను కాలరాస్తున్నట్లు గుర్తించారు. హోర్డింగ్స్ డిస్ప్లే విషయాల్లో ఏఏఊ సూచనలను అదానీ గ్రూప్స్ ఉల్లంఘించినట్లు గుర్తించారు. ఏఏఐ లోగోలను డిస్ప్లే చేయడంలో అదానీ గ్రూప్స్ నిబంధనల ప్రకారం ప్రదర్శించలేదు. కాగా ఈ విషయంపై స్పందించిన అదానీ గ్రూప్స్..ఆయా విమానాశ్రయాల్లో నిబంధనలను అనుగుణంగా డిస్ప్లే బోర్డులను వేస్తామని ఒక ప్రకటనలో తెలిపింది. -
కల సాకారం.. పాల్వంచలో విమానాశ్రయం ఏర్పాటుకు సానుకూల సంకేతాలు
సాక్షి, పాల్వంచ(ఖమ్మం): రాష్ట్రంలోనే అత్యధిక విస్తీర్ణం గల భధ్రాద్రి జిల్లాలో ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు టెక్నికల్ సర్వే బృందం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. విమానాశ్రయం ఏర్పాటుకు ఎలాంటి అడ్డంకులు లేవని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక సమర్పించింది. దీంతో జిల్లా వాసుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతం అయినప్పటికీ పారిశ్రామిక జిల్లాగా పేరుగాంచింది. ఇక్కడి భౌగోళిక పరిస్థితులు పరిశ్రమలకు అనుకూలంగా ఉండటంతో కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు పట్టణాల్లో సింగరేణి బొగ్గు గనులు, సారపాకలో ఐటీసీ, అశ్వాపురంలో భారజల కర్మాగారం, పాల్వంచలో కేటీపీఎస్, నవభారత్, ఎన్ఎండీసీ, మణుగూరు – పినపాక మండలాల సరిహద్దులో బీటీపీఎస్ వంటి అతి పెద్ద సంస్థలకు నిలయంగా మారింది. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయం రాష్ట్రంలోనే అత్యంత ప్రాధాన్యత గలదిగా పేరుగాంచింది. రామయ్య దర్శనానికి దేశంలోని అనేక ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. ఇక ఆయా పరిశ్రమల్లో పనిచేసేందుకు, ఇతర అవసరాల కోసం సైతం అనేక ప్రాంతాల నుంచి వస్తుంటారు. జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు చేస్తే వీరందరికీ ఎంతో ఉపయోగంగా ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏప్రిల్ 24న టెక్నికల్ సర్వే.. కొత్తగూడెం–పాల్వంచ ఇప్పటికే జంట పట్ట ణాలుగా విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలో పాల్వంచ కేంద్రంగా ఎయిర్పోర్ట్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై ఎయిర్పోర్ట్ ఆథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు పలు దఫాలు సర్వే నిర్వహించారు. సర్వే నంబర్ 999లో గల సుమారు 1000 ఎకరాల భూమిని అప్పటి కలెక్టర్ ఎంవి.రెడ్డి ఆధ్వర్యంలో పలుమార్లు పరిశీలించారు. అనంతరం ఏప్రిల్ 24న పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని పిల్లవాగు, పేట చెరువు, గుడిపాడు గ్రామ సమీపాల్లో పర్యటించారు. సర్వేయర్ కె.కె.అరివోలి ఎఎం, సీనియర్ జీఐఎస్ అనలిస్ట్‌లు గౌరవ్ కుమార్ ఉపాధ్యాయ్, కె.అభిరామ్, ఆర్అండ్బీ ఈఈ బి.బీమ్లా, తహసీల్దార్ స్వామి ఆధ్వర్యంలో టెక్నికల్, డిజిటల్ సర్వే నిర్వహించారు. అనుమతులు రాగానే పనులు.. టెక్నికల్ సర్వే నిర్వహించిన అధికారులు విమానశ్రయం ఏర్పాటుపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఫేస్–1లో 406 ఎకరాల్లో నిర్మాణానికి రూ.483 కోట్ల నిధులు అవసరం ఉంటుందని ప్రతిపాదనలు చేశారు. అయితే ఒకేసారి ఆరు విమానశ్రయాలు నెలకొల్పడం వల్ల భారీ బడ్జెట్ అవుతుండటంతో పౌర విమానయాన శాఖ అంగీకారం తెలిపితే వెంటనే మరో సారి సర్వే చేపట్టి పనులు ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటుకు టెక్నికల్ సర్వే బృందం ఆమోదం తెలపడంతో ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. హైదరాబాద్‌కు 300 కి.మీ.దూరం.. ఎయిర్పోర్ట్ అథారిటీ నిబంధనల ప్రకారం శంషాబాద్ విమానాశ్రయానికి 240 కి.మీ.దూరం లోపులో మరో ఎయిర్పోర్ట్ నిర్మించకూడదు. కానీ హైదరాబాద్ నుంచి కొత్తగూడెం జిల్లా కేంద్రం 300 కి.మీ.దూరంలో ఉంటుంది. అంతేకాకుండా జిల్లాకు ఆంధ్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలు సరిహద్దులో ఉన్నాయి. ఈ కారణాలతో కొత్తగూడెంలో విమానాశ్రయ నిర్మాణానికి ఎలాంటి అడ్డంకులు ఉండవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు హైదరాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం ఉండగా తాజాగా వరంగల్, ఆదిలాబాద్, బసంత్‌నగర్(పెద్దపల్లి), జక్రాన్‌పల్లి(నిజామాబాద్), పాల్వంచ(కొత్తగూడెం), దేవరకద్ర(మహబుబ్ నగర్)లలో కొత్తగా డొమెస్టిక్(దేశీయ) విమానాశ్రయాలను ఫేస్–1, ఫేస్–2లో ఏర్పాటు చేసే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందడుగు వేస్తున్నాయి. -
జీ- అదానీ ఎంటర్ప్రైజెస్.. హైజంప్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించినప్పటికీ మీడియా దిగ్గజం జీ ఎంటర్టైన్మెంట్(జీల్) కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. కోవిడ్-19 కట్టడికి లాక్‌డవున్‌ల అమలు కారణంగా కంటెంట్ ప్రొడక్షన్‌కు సమస్యలు ఎదురైనట్లు ఫలితాల విడుదల సందర్భంగా జీల్ పేర్కొంది. అయితే ప్రస్తుతం తిరిగి ప్రొడక్షన్ తదితర పనులు ప్రారంభంకావడంతో ఇకపై మెరుగైన పనితీరు చూపగలమని చెబుతోంది. ఈ నేపథ్యంలో జీ ఎంటర్టైన్మెంట్ కౌంటర్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ షేరు దాదాపు 13 శాతం దూసుకెళ్లి రూ. 196 వద్ద ట్రేడవుతోంది. క్యూ1 ఇలా ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్) కాలంలో జీ నికర లాభం రూ. 29.3 కోట్లకు పరిమితమైంది. గత క్యూ1లో రూ. 530 కోట్ల లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 2112 కోట్ల నుంచి రూ. 1338 కోట్లకు క్షీణించింది. ప్రకటనల ఆదాయం రూ. 1187 కోట్ల నుంచి రూ. 421 కోట్లకు భారీగా నీరసించినట్లు జీ తెలియజేసింది. కోవిడ్-19 కారణంగా ఇతర త్రైమాసిక ఫలితాలతో వీటిని పోల్చిచూడ తగదని తెలియజేసింది. అదానీ ఎంటర్ప్రైజెస్ ఎయిర్‌పోర్ట్స్ అధారిటీ(ఏఏఐ) ప్రతిపాదనను నేడు కేంద్ర కేబినెట్ పరిశీలించనుందన్న అంచనాలతో అదానీ ఎంటర్ప్రైజెస్ కౌంటర్ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 9 శాతం జంప్‌చేసి రూ. 233 వద్ద ట్రేడవుతోంది. తొలి దశ ప్రయివేటైజేషన్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుంచి బిడ్డింగ్ ద్వారా అదానీ ఎంటర్ప్రైజెస్ ఆరు ఎయిర్పోర్ట్ ప్రాజెక్టులను గెలుచుకున్న సంగతి తెలిసిందే. వీటిలో అహ్మదాబాద్, లక్నో, మంగళూరు ఎయిర్‌పోర్టులకు ఏఏఐ నుంచి ఒప్పందాలను కుదుర్చుకుంది. మిగిలిన మూడు ఒప్పందాలు వాయిదా పడ్డాయి. పబ్లిక్ ప్రయివేట్ భాగస్వామ్యం కింద గువాహటి, జైపూర్, తిరువనంతపురం విమానాశ్రయాల అభివృద్ధికి ఒప్పందాలు కుదిరే వీలున్నట్లు తెలుస్తోంది. అయితే విమానాశ్రయాల ప్రయివేటైజేషన్పై విచారణ జరుగుతున్న కారణంగా కోర్డు ఆదేశాలకు లోబడి ఒప్పందాలు కుదరవచ్చని సంబంధితవర్గాలు తెలియజేశాయి. కాగా.. రూ. 1,000 కోట్ల ముందస్తు చెల్లింపులకు అదానీ గ్రూప్ మరింత గడువు కోరిన నేపథ్యంలో అహ్మదాబాద్, మంగళూరు, లక్నో ఎయిర్‌పోర్టుల అప్పగింత పెండింగ్‌లో పడినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. -
కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటు..?
సాక్షి, కొత్తగూడెం : కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని తాజాగా ప్రభుత్వం ప్రతిపాదించడంతో ఈ ప్రాంత వాసుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. నాలుగేళ్ల క్రితం లక్ష్మీదేవిపల్లి మండలం పునుకుడచెలక వద్ద సుమారు 1600 ఎకరాల్లో విమానాశ్రయం నిర్మించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం అధ్యయనం చేసి వెళ్లింది. ఇక్కడ ఎయిర్‌పోర్టు నిర్మించేందుకు చర్యలు తీసుకోవచ్చని తెలిపింది. అయితే ఇక్కడ భూసేకరణ ప్రధాన సమస్యగా ఉంది. అదేవిధంగా సమీపంలోనే అభయారణ్యం ఉండడంతో పర్యావరణ అనుమతులు సైతం తీసుకోవాల్సి ఉంది. ముఖ్యంగా భూసేకరణ అంశం కీలకం కానుంది. పునుకుడచెలక వద్ద ఉన్న భూములు అత్యధికం ఆదివాసీలవే కావడం గమనార్హం. తమ భూములను ఇచ్చేది లేదని వారు చెబుతుండడంతో కొంత సందిగ్ధం నెలకొంది. ఏఏఐ బృందం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినా స్థల సమస్య రావడంతో ఈ అంశం వెనక్కు వెళ్లింది. అయితే తాజాగా రాష్ట్రంలో ఈనెల 20 నుంచి 23 వరకు మరోసారి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో త్రిసభ్య బృందం పర్యటించనుంది. రాష్ట్రంలో ఆరు చోట్ల ఎయిర్‌పోర్టులు నిర్మించే విషయమై రాష్ట్ర ప్రభుత్వం సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసే బాధ్యతను ఏఏఐకు అప్పగించింది. దీంతో గతంలో ఏఏఐ బృందం కొత్తగూడెం, వరంగల్, మహబూబ్‌నగర్ ఏరియాల్లో పర్యటించి అధ్యయనం చేసింది. సంబంధిత నివేదికను ఆ బృందం ఉన్నతాధికారులకు అందజేసింది. ప్రస్తుతం రానున్న బృందం ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి ప్రాంతాల్లో పర్యటించనుంది. 20న ఢిల్లీ నుంచి నాగ్‌పూర్ రానున్నారు. 21న నాగ్‌పూర్ నుంచి నేరుగా ఆదిలాబాద్ వస్తారు. 22న నిజామాబాద్, పెద్దపల్లి ప్రాంతాల్లో పర్యటించనున్నారు. 23న హైదరాబాద్ మీదుగా అవసరాన్ని బట్టి మరోసారి మహబూబ్‌నగర్‌లో పర్యటించి ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ బృందంలో అమిత్‌కుమార్, నీరజ్గుప్తా, కుమార్ వైభవ్ ఉన్నారు. ఈ మేరకు ఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డైరక్టర్ డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు పర్యటన వివరాలు ప్రకటించారు. కొత్తగూడెంలో ఎయిర్‌పోర్టు నిర్మిస్తే మిలటరీ అవసరాలకు... కొత్తగూడెం విమానాశ్రయం నిర్మాణం పూర్తి చేసుకుంటే బహుముఖ అవసరాలకు ఉపయోగపడుతుందనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచనగా తెలుస్తోంది. ఇక కొత్తగూడెంలో ఎయిర్‌పోర్టు నిర్మించేందుకు భూసేకరణ ప్రధాన సమస్య. ఇతరత్రా చూసుకుంటే అనుకూల అంశాలు ఉన్నాయి. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 200 కిలోమీటర్ల లోపు ఎయిర్‌పోర్టు నిర్మించకూడదనే ఒప్పందం ఉంది. అయితే కొత్తగూడెం శంషాబాద్ నుంచి 280 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో దీనికి ఆ సమస్య లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పారిశ్రామిక ప్రాంతం కావడంతో ఇక్కడ విమానాశ్రయం కోసం అనేక ఏళ్లుగా డిమాండ్ ఉంది. అశ్వాపురం మండలంలోని హెవీవాటర్ ప్లాంట్ ఉద్యోగులు కొత్తగూడెం ఎయిర్‌పోర్టు సాధన కమిటీ సైతం వేసుకోవడం గమనార్హం. అదేవిధంగా జిల్లాలో మణుగూరు, కొత్తగూడెం, ఇల్లెందు ప్రాంతాల్లో సింగరేణి, సారపాకలో ఐటీసీ, పాల్వంచలో ఎన్ఎండీసీ, నవభారత్ పరిశ్రమలు ఉన్నాయి. ఇక దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎయిర్‌పోర్టు అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఇక్కడ విమానాశ్రయం ఏర్పాటు చేస్తే మిలటరీ అవసరాలకు సైతం ఉపయోగపడుతుందనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో అభయారణ్యం విస్తరించి ఉన్న ప్రాంతాల్లో వామపక్ష తీవ్రవాద ప్రభావం ఉంది. జిల్లాకు ఆనుకుని ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉండడంతో పాటు సమీపంలో ఒడిశా, మహారాష్ట్ర సరిహద్దులు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో దండకారణ్యం విస్తరించి ఉంది. సరిహద్దుల్లో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య నిరంతరం పోరు నడుస్తోంది. ఈ నేపథ్యంలో కొత్తగూడెంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేస్తే అత్యవసర సమయాల్లో మిలటరీ అవసరాలకు సైతం ఉపయోగపడుతుందని రెండు ప్రభుత్వాల ఆలోచనగా తెలుస్తోంది. -
‘ఎయిర్‌ట్రాఫిక్’పై ఏఏఐ, బోయింగ్ జట్టు
న్యూఢిల్లీ: భారత్‌లో విమానాల నిర్వహణ వ్యవస్థను ఆధునీకరించేందుకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ)తో కలిసి పదేళ్ల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయనున్నట్లు బోయింగ్ తెలియజేసింది. ఈ రోడ్‌మ్యాప్‌ను రూపొందించేందుకు తాము సాంకేతిక సహకారం అందించేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. ఈ కార్యాచరణ ప్రణాళిక 18 నెలల్లో సిద్ధం కావచ్చని, అమెరికా ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ ఏజెన్సీ(యూఎస్టీడీఏ) నిధులతో దీన్ని చేపట్టనున్నామని సంస్థ తెలిపింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఏఏఐ నేతృత్వంలో 125 విమానాశ్రయాలను కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా, స్థానికంగా ఉన్న అత్యుత్తమ ప్రమాణాలకు లోబడి జాతీయ ఎయిర్‌స్పేస్ వ్యవస్థను ఆధునీకరించడానికి ఈ రోడ్‌మ్యాప్ మార్గదర్శకత్వం వహిస్తుంది. ఎయిర్‌స్పేస్ సామర్థ్యాన్ని గరిష్ట స్థాయిలో వినియోగించుకునేలా, కమ్యూనికేషన్స్‌ను పెంచడం, నిఘా, విమానాల రద్దీ నియంత్రణలోనూ ఈ రోడ్‌మ్యాప్ ఉపకరిస్తుందని బోయింగ్ పేర్కొంది. ఈ విషయంలో డీజీసీఏతోనూ కలసి పనిచేస్తామని ప్రకటించింది. ఆధునిక టెక్నాలజీలు, అంతర్జాతీయ విధానాలను అమలు చేయడం ద్వారా భారత్ తన గగనతల సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకోగలదని ఏఏఐ చైర్మన్ గురుప్రసాద్ మొహపాత్రా పేర్కొన్నారు. -
వైజాగ్ ఎయిర్పోర్ట్ మూసివేయం: ఏఏఐ
హైదరాబాద్: విశాఖపట్నం విమానాశ్రయాన్ని మూసివేసే ఉద్ధేశం లేదని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) స్పష్టం చేసింది. కొత్తగా నిర్మించనున్న భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తే విశాఖ ఎయిర్‌పోర్టును మూసివేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. ‘వైజాగ్ ఎయిర్‌పోర్టు కొనసాగుతుంది. ఈ విషయాన్ని మా మంత్రి పార్లమెంటులో స్పష్టం చేశారు కూడా. మూసివేత విషయమై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన వచ్చింది. దీనికి మేం స్పందించలేదు. దీనికి కారణం ఈ ప్రతిపాదనను మేం పరిగణలోకి తీసుకోవడం లేదు’ అని ఏఏఐ ఫైనాన్స్ సభ్యులు ఎస్.సురేశ్ వ్యాఖ్యానించారు. ఏఏఐతో తాము చర్చిస్తున్నట్టు ఏపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ తెలిపారు. వైజాగ్ ఎయిర్‌పోర్టులో చేసిన పెట్టుబడిని భర్తీ చేయాలని ఏఏఐ కోరిందని చెప్పారు. ఈ విషయాన్ని తేల్చాల్సిందిగా ఏఏఐ చెబుతోందన్నారు. ఎంత పెట్టుబడి పెట్టారో తెలపాలని, ఆ మొత్తాన్ని తాము చెల్లిస్తామంటూ లేఖ రాశామని ఆయన వివరించారు. ప్రస్తుతమున్న విమానాశ్రయం వైజాగ్ సిటీకి సమీపంలో ఉంది. వైజాగ్ సిటీ నుంచి 45 కిలోమీటర్ల దూరంలో భోగాపురం ఉంది. -
అదానీ చేతికి ఐదు విమానాశ్రయాలు
సాక్షి, న్యూఢిల్లీ: గౌతమ్ అదానీ గ్రూప్ సంస్థ అదానీ ఎంటర్ప్రైజెస్ విమాన సేవల రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఎయిర్పోర్ట్ అధారిటీ ఆఫ్ ఇండియా) నిర్వహించిన వేలంలో అత్యధిక బిడ్‌ను కోట్ చేసి దేశంలోనే ఐదు ప్రధాన ఎయిర్‌పోర్టుల ప్రాజెక్టులను సొంతం చేసుకుంది. ప్రయివేటీకరణలో భాగంగా ఎయిర్పోర్ట్ అధారిటీ ఆఫ్ ఇండియా సోమవారం నిర్వహించిన వేలంలో అదానీ గ్రూపు అయిదు అంతర్జాతీయ విమానాశ్రయాలను సొంతం చేసుకుందని సీనియర్ అధికారులు ప్రకటించారు. అహ్మదాబాద్, తిరువనంతపురం, లక్నో, మంగళూరు, జైపూర్ ఎయిర్‌పోర్టుల బిడ్స్‌ను అదానీ ఎంటర్ప్రైజెస్ దక్కించుకుంది. మొత్తం ఆరు విమానాశ్రయాలకు బిడ్స్ దాఖలు చేయగా, వీటిలో అసోంలోని గౌహతి ఎయిర్పోర్ట్ బిడ్ రేపు (మంగళవారం) ప్రకటించనున్నామని అధికారులు వెల్లడించారు. మొత్తం 6 ఎయిర్‌పోర్టులకోసం 10 కంపెనీల నుంచి 32 బిడ్లు దాఖలు కాగా.. అన్నిటికంటే అదానీ చాలా ఎక్కువ కోట్ చేసి అయిందింటిని దక్కించుకుందని పేర్కొన్నారు. మరోవైపు ఈ వార్తలతో స్టాక్మార్కెట్లో అదానీ ఎంటర్ప్రైజెస్ కౌంటర్ దాదాపు 4 శాతం జంప్‌చేసింది. చివరికి 2 శాతం లాభాలతో ముగిసింది. -
ఎయిర్‌పోర్ట్‌ల ప్రైవేటీకరణ ప్రక్రియ ముమ్మరం
సాక్షి, న్యూఢిల్లీ : ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నిర్వహణలో ఉన్న ఆరు విమానాశ్రయాల ప్రైవేటీకరణ ప్రక్రియ వేగవంతమైంది. వీటి నిర్వహణ కోసం పది కంపెనీల నుంచి మొత్తం 32 సాంకేతిక బిడ్స్‌ను ఏఏఐ స్వీకరించింది. గౌహతి, తిరువనంతపురం, లక్నో, మంగళూర్, అహ్మదాబాద్, జైపూర్ విమానాశ్రయాల నిర్వహణ, ఆపరేషన్స్, అభివృద్ధి కోసం అంతర్జాతీయ బహిరంగ బిడ్డింగ్ ప్రక్రియ కింద బిడ్లను ఆహ్వానించింది. ఈ ఆరు విమానాశ్రయాల నిర్వహణ కోసం మొత్తం పది కంపెనీల నుంచి 32 సాంకేతిక బిడ్స్ అందాయని ఏఏఐ వర్గాలు వెల్లడించాయి. సాంకేతిక బిడ్స్‌కు ఈ నెల 14 ఆఖరు తేదీ కాగా, ఈనెల 28న ఫైనాన్షియల్ బిడ్స్‌ను ఏఏఐ తెరవనుంది. గెలుపొందిన బిడ్డర్ల వివరాలను ఈనెల 28న ఏఏఐ వెల్లడిస్తుంది. ప్రయాణీకులు సహా వివిధ భాగస్వాములకు అంతర్జాతీయ మౌలిక వసతులు కల్పించేందుకు ఈ ఆరు విమానాశ్రయాలను ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంలో అభివృద్ధిపరచేందుకు ఏఏఐ ఈ చర్యలు చేపట్టింది. -
మూడో విడత ఉడాన్ రూట్ల వేలం
ముంబై: చిన్న పట్టణాలకు చౌక విమాన సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ఉద్దేశించిన ఉడాన్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం మూడో విడతలో రూట్ల వేలానికి బిడ్లను ఆహ్వానించింది. ప్రాథమిక బిడ్లను డిసెంబర్ 10లోగా ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కు సమర్పించాల్సి ఉంటుంది. రూట్లను దక్కించుకున్న ఎయిర్‌లైన్స్ పేర్లను జనవరి 7 లోగా ప్రకటించడం జరుగుతుంది. వేలంలో పాల్గొనాలని భావిస్తున్న బిడ్డర్ల కోసం నవంబర్ 6న ప్రి–బిడ్ సమావేశం ఉంటుంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఆర్సీఎస్ పోర్టల్‌లో ఉంచారు. ప్రధానంగా పర్యాటక ఆకర్షణ ఉండే ప్రాంతాలపై ఈ విడతలో దృష్టి సారిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ సంయుక్త కార్యదర్శి ఉషా పధీ తెలిపారు. 2016 మార్చిలో ప్రకటించిన ఉడాన్ స్కీమును ఏఏఐ అమలు చేస్తోంది. పెద్ద సంఖ్యలో రూట్లను వేలం వేసినా, ఇప్పటికీ ఆశించినంత స్థాయిలో కనీసం సగం రూట్లలో కూడా సర్వీసులు అందుబాటులోకి రాలేదని విమర్శలు ఉన్నాయి. ఈ స్కీము కింద గంట ప్రయాణ దూరాలకు గరిష్టంగా రూ. 2,500 చార్జీ ఉంటుంది. -
ఎయిర్‌పోర్టుల్లో ఎమ్మార్పీకే టీ, స్నాక్స్!
న్యూఢిల్లీ: ప్రభుత్వాధీనంలోని 90కి పైగా విమానాశ్రయాల్లో కొన్ని రకాల తినుబండారాలు, పానీయాలు ఇకపై సరసమైన ధరలకే లభించనున్నట్లు భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ) శనివారం ప్రకటించింది. ప్రైవేటు సంస్థలు నిర్వహిస్తున్న ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి మహానగరాల్లోని విమానాశ్రయాలకు ఇది వర్తించదు. పలు వస్తువులను గరిష్ట చిల్లర ధర (ఎమ్మార్పీ)కే అమ్మేందుకు ఎయిర్‌పోర్టుల్లోని వ్యాపారులు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసుకుంటారని ఏఏఐ అధికారి ఒకరు చెప్పారు. టీ, కాఫీ వంటి వాటినీ అత్యధిక ధరలకు అమ్ముతున్నారంటూ ప్రయాణికుల నుంచి ఫిర్యాదులొస్తున్నాయి. మధ్య తరగతి వారు కూడా విమాన ప్రయాణాలు చేస్తున్న అంశాన్ని పరిగణనలోని తీసుకుని పలు వస్తువులను ఎమ్మార్పీకే అమ్మేందుకు నిర్ణయించామని ఏఏఐ అధికారి చెప్పారు. -
ఏఏఐ టెండర్లు రద్దు చేసిన చంద్రబాబు
-
మూడో స్థానంలో ‘శంషాబాద్’!
సాక్షి, సిటీబ్యూరో: బ్యాగేజ్ లిఫ్టింగ్... ఒకప్పుడు విమాన ప్రయాణికులను తీవ్రస్థాయిలో కలవరపెట్టిన సమస్య. విమానం ఎక్కేప్పుడు తమ బ్యాగేజ్‌ను ఎయిర్‌లైన్స్ సిబ్బందికి అప్పగించే ప్రయాణికులు తిరిగి దిగిన తర్వాత తీసుకుంటూ ఉంటారు. ఈ మధ్య కాలంలో బ్యాగేజ్లు.. లేదా వాటిలో ఉండే వస్తువులు మాయమయ్యేవి. ఇటీవల కాలంలో విమానాశ్రయాల్లో పెరిగిన సీసీ కెమెరాల పర్యవేక్షణతో ఈ సమస్య చాలావరకు తీరింది. అయినప్పటికీ ఇప్పుడూ బ్యాగేజ్ లిఫ్టింగ్ కేసులు నమోదవుతున్నాయని ఎయిర్‌పోర్ట్స్ అ«థారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) సంస్థ వెల్లడించింది. ఇటీవల పార్లమెంట్‌కు సమర్పించిన నివేదికలో వాటికి సంబంధించిన గణాంకాలు, కారణాలను సైతం నివేదించింది. 2012 నుంచి 2015 వరకు ఈ నివేదిక ప్రకారం శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం బ్యాగేజ్ లిఫ్టింగ్ కేసుల్లో దేశంలో మూడో స్థానంలో ఉంది. ఈ నాలుగేళ్లలో 34 కేసులు నమోదయ్యాయి. దేశంలోని ఇతర మెట్రోల విషయానికి వస్తే 144 కేసులతో ఢిల్లీ ప్రథమ, 40 కేసులతో ముంబై రెండు, మూడు కేసులతో బెంగళూరు నాలుగు, మూడు కేసులతో చెన్నై ఐదో స్థానాల్లో నిలిచాయి. ఒకప్పుడు ఈ కేసుల సంఖ్య వందల్లో ఉండేదని, ఏఏఐతో పాటు విమానాశ్రయాలకు భద్రత కల్పించే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) తీసుకుంటున్న చర్యల కారణంగా గణనీయంగా తగ్గిందని నివేదిక స్పష్టం చేసింది. విమానాశ్రయాల్లో ఎక్కడిక్కడ సీసీ కెమెరాలు, కంట్రోల్ రూమ్స్ ద్వారా నిరంతర పర్యవేక్షణ, బ్యాగేజ్ల వ్యవహారాలు చూసే వారిపై నిఘా పెంచడంతో పాటు ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకంగా సెక్యూరిటీ సిబ్బందిని నియమించడం ఫలితాలు ఇచ్చిందని ఏఏఐ పేర్కొంది. అయితే ఢిల్లీ, ముంబై విమానాశ్రయాల్లో రాకపోకలు సాగించే విమానాలతో పాటు బ్యాగేజ్ సంఖ్య భారీగా ఉండటం, వీటి నిర్వహణకు ఒకటి కంటే ఎక్కువ సంస్థలను వినియోగిస్తుండటం ప్రధాన కారణాలుగా గుర్తించినట్లు ఏఏఐ స్పష్టం చేసింది. బ్యాగేజ్ లిఫ్టింగ్ కేసులను పూర్తిగా రూపుమాపడానికి కొన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా విమానాశ్రయాల్లో బ్యాగేజ్ల నిర్వహణ ఒకే సంస్థ చేపట్టేలా చర్యలు తీసుకోనుంది. ఈ సంస్థలో పని చేసే వారిపై నిత్యం కన్నేసి ఉంచేలా ఆదేశాలు జారీ చేయనుంది. సాధారణంగా బ్యాగేజ్ నిర్వహణ పని చేసే వారు తమతో తీసుకువెళ్ల సొంత వస్తువుల్లోనే బ్యాగేజ్ నుంచి తస్కరించిన వాటిని పెట్టుకుని పట్టుకుపోతున్నట్లు గుర్తించామన్న ఏఏఐ... ఆయా ఉద్యోగులు విమానాశ్రయం లోపలకు సొంత బ్యాగులు వంటివి తీసుకువెళ్లకుండా కట్టడిచేసే అంశాన్నీ పరిశీలిస్తున్నామని ఏఏఐ పేర్కొంది. -
‘భోగాపురం’లో గ్లోబల్ స్కాం!
సాక్షి, అమరావతి: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ టెండర్లలో గ్లోబల్ స్కాంకు తెరలేచింది! భోగాపురం ఎయిర్‌పోర్టు పనులను బిడ్‌లో దక్కించుకుని అత్యధిక రెవెన్యూ వాటా ఇచ్చేందుకు ఎయిర్‌పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ముందుకొచ్చినా ఆ టెండర్లను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో ముడుపులు, కమీషన్లు రావనే ‘ముఖ్య’నేత ఈ టెండర్లను రద్దు చేసినట్లు అధికార వర్గాలు బహిరంగంగానే పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ ఈ నెల 17వ తేదీన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులకు ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదనలను ఆహ్వానించింది. ఎక్కువ మంది పాల్గొనకుండా...! ప్రైవేట్ సంస్థకు అది కూడా ‘ముఖ్య’నేతకు భారీ ఆర్థిక ప్రయోజనం చేకూర్చేవారికే భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు పనులను అప్పగించాలనే రాష్ట్ర సర్కారు ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోందని ఉన్నతాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. అందులో భాగంగానే ముందుగా నిర్ణయించుకున్న ప్రైవేట్ సంస్థకు పనులు అప్పగించేందుకు వీలుగా గ్లోబల్ టెండర్ల నిబంధనలకు పాతర వేశారని పేర్కొన్నారు. గ్లోబల్ టెండర్ల దాఖలుకు కనీసం 45 రోజులు సమయం ఇవ్వాలి. అయితే భోగాపురం ఎయిర్‌పోర్టు విషయంలో ఈ నిబంధనను పట్టించుకోకుండా ఆసక్తి వ్యక్తీకరణకు 10 రోజులు, బిడ్ల దాఖలుకు 8 రోజులు మాత్రమే గడువు ఇవ్వడం గమనార్హం. ఎక్కువ మంది టెండర్లలో పాల్గొనకుండా కావాల్సిన వారికి మాత్రమే అవకాశం కల్పించేందుకే హడావుడిగా ముగిస్తున్నారని అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ఏఏఐ అత్యధికంగా రెవెన్యూ వాటా ఇస్తామన్నా... భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులను చేపట్టేందుకు ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదనల దగ్గర నుంచి బిడ్ల దాఖలుకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఏకంగా 13 నెలలు సమయాన్ని ఇచ్చింది. ఎయిర్‌పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియాతో పాటు, జీఎంఆర్ అప్పుడు బిడ్లు దాఖలు చేశాయి. 2016 జూన్‌లో ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదనలను ఆహ్వానించి 2017 జూలై 31 వరకు గడువు పొడిగిస్తూ వచ్చారు. అనంతరం జీఎంఆర్, ఏఏఐ బిడ్లు సక్రమంగా ఉన్నాయని తేల్చారు. ఏఏఐ అత్యధికంగా 30.2 శాతం రెవెన్యూ వాటాతో పాటు 26 శాతం ఈక్విటీ ఇస్తానందని, ఎకరానికి ఏటా రూ.20 వేల లీజు చెల్లించేందుకు ముందుకొచ్చినట్లు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కార్పొరేషన్ లిమిటెడ్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. జీఎంఆర్ కేవలం 21.6 శాతం మాత్రమే రెవెన్యూ వాటా ఇస్తానందని, ఈ నేపథ్యంలో ఏఏఐకి పనులు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. అయితే ఏఏఐకి ఎయిర్‌పోర్టు పనులు అప్పగించేందుకు ఇష్టం లేని రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఏరో సిటీ, ఏవియేషన్ అకాడమీ లాంటి అదనపు పనులు చేపట్టాలనే సాకుతో గత డిసెంబర్ 20వ తేదీన టెండర్ల రద్దుకు ఆదేశించింది. అనంతరం ఈ ఏడాది జనవరి 20వ తేదీన భోగాపురం విమానాశ్రయం టెండర్లను రద్దు చేస్తూ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పునరాలోచనకు నిరాకరణ అయితే రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న ఆ అదనపు పనులు కూడా తామే చేపడతామని, బిడ్ల దాఖలు గడువును పొడిగించాలని ఏఏఐ కోరినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్ సూచించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించు కోకుండా టెండర్లను రద్దు చేస్తూ మళ్లీ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజాగా కొత్త టెండర్లను ఆహ్వానించింది. ఈ నెల 17వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదనలను సమర్పించాలని పేర్కొంది. -
భోగాపురంలో ఏఏఐ టెండర్లు రద్దు
-
ఏఏఐకి భోగాపురం ఎయిర్పోర్ట్
30.2 శాతం రెవెన్యూ షేర్ ఇస్తానన్నందుకే.. సాక్షి, అమరావతి: విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించ తలపెట్టిన ఎయిర్పోర్ట్ అభివృద్ధి పనుల ఫైనాన్షియల్ బిడ్ ఖరారైంది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ టెండర్‌ను దక్కించుకున్నట్టు ఏపీ మౌలిక వసతుల విభాగం ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్ తెలిపారు. ఎయిర్‌పోర్ట్‌ను అభివృద్ధి చేసిన సంస్థకే దాని వాణిజ్య కార్యాకలాపాలపై సర్వాధికారాలుంటాయి. అయితే, వచ్చే ఆదాయంలో ఎవరు ఎక్కువ ఇస్తే వారికి ఈ పనులు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ఎయిర్పోర్ట్ అథారిటీ 30.2 శాతం, జీఎంఆర్ ఇన్ఫ్రా 21.6 శాతం రెవెన్యూ షేర్ ఇవ్వటానికి ముందుకొచ్చాయి. అత్యధికంగా వాటా ఇచ్చేందుకు సిద్ధపడిన ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకే ఈ పనులు అప్పగించాలని నిర్ణయించారు. -
విమానాలకు ‘గగన్ ’ తప్పనిసరి
న్యూఢిల్లీ: కొత్తగా అభివృద్ధి చేసిన ‘గగన్’ నేవిగేషన్ వ్యవస్థ ఆధారిత విమానాలనే విమానయాన సంస్థలు ప్రవేశపెట్టడాన్ని తప్పనిసరిచేస్తూ కేంద్రం త్వరలో నోటిఫికేషన్ జారీచేసే వీలుంది. ఈ వ్యవహారానికి సంబంధించి గతేడాది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అన్ని భాగస్వామ్య పక్షాలతో సమావేశం జరిపింది. ఇస్రో, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) సంయుక్తంగా రూ.774 కోట్ల ఖర్చుతో గగన్ (జీపీఎస్ ఎయిడెడ్ ఆగ్మెంటెడ్ నేవిగేషన్ )ను రూపొందించాయి. ఈ విధానంతో ఎయిర్‌లైన్స్ కార్యకలాపాల సామర్థ్యం పెరిగి, వ్యయం తగ్గుతుంది. ప్రస్తుతం భారత విమానయాన సంస్థలన్నింటికి కలిపి సుమారు 450 విమానాలున్నాయి. అయితే గగన్ కు మారాలంటే విమానయాన సంస్థకు భారీగా వ్యయం అవుతుంది. -
గుజరాత్ కు రెండు విమాన సర్వీసులు
అహ్మదాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ కు రెండు అంతర్జాతీయ విమానాలు సర్వీసులు దక్కాయి. అహ్మదాబాద్-లండన్, సూరత్- దుబాయ్ అంతర్జాతీయ విమానాలకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) ఆమోదం తెలిపింది. ఏఏఐ చైర్మన్ ఎస్ రహేజాతో అహ్మదాబాద్ లో పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి సౌరభ్ పటేల్ సమావేశం తర్వాత ఈ మేరకు ప్రకటన వెలువడింది. ఈ సమావేశంలో గుజరాత్ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.