ముంబై: గౌతమ్ అదానీకు చెందిన అదానీ గ్రూప్స్ ఎయిర్‌పోర్ట్ నిర్వహణ రంగంలో దూసుకుపోతున్నాయి. దేశ వ్యాప్తంగా సుమారు ఎనిమిది ఇంటర్నేషనల్, రిజనల్ ఎయిర్‌పోర్ట్‌ల నిర్వహణ చేస్తున్నాయి. కొన్ని రోజుల క్రితమే ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను జీవీకే నుంచి కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా విమానాశ్రయ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) ఏర్పాటు చేసిన మూడు కమిటీలు అదానీ గ్రూప్స్ నిర్వహిస్తోన్న అహ్మదాబాద్, మంగుళూరు, లక్నో విమానాశ్రయాల్లో రాయితీ ఒప్పందాలలో ఏఏఐ సూచించిన బ్రాండింగ్ నిబంధనలను ఉల్లఘిస్తున్నట్లు కనుగొంది. దీంతో అదానీ గ్రూప్స్ ఆయా ఎయిర్‌పోర్ట్‌ల్లో బ్రాండింగ్, డిస్‌ప్లే బోర్డులను మారుస్తోన్నట్లు తెలుస్తోంది.
మూడు విమానాశ్రయాల నిర్వహణ కోసం 2019 ఫిబ్రవరిలో అదానీ గ్రూప్ బిడ్లను గెలుచుకుంది. ఎయిర్‌పోర్టుల నిర్వహణ కోసం ఫిబ్రవరి 2020లో ఏఏఐతో అదానీ గ్రూప్స్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. నవంబర్ 2020 నుంచి ఎయిర్‌పోర్టుల నిర్వహణను అదానీ గ్రూప్స్ తీసుకున్నాయి. తాజాగా ఏఏఐ నిర్వహించిన తనిఖీల్లో అదానీ గ్రూప్స్ ఆయా ఎయిర్‌పోర్టులో బ్రాండింగ్ నిబంధనలను కాలరాస్తున్నట్లు గుర్తించారు. హోర్డింగ్స్ డిస్‌ప్లే విషయాల్లో ఏఏఊ సూచనలను అదానీ గ్రూప్స్ ఉల్లంఘించినట్లు గుర్తించారు. ఏఏఐ లోగోలను డిస్‌ప్లే చేయడంలో అదానీ గ్రూప్స్ నిబంధనల ప్రకారం ప్రదర్శించలేదు. కాగా ఈ విషయంపై స్పందించిన అదానీ గ్రూప్స్..ఆయా విమానాశ్రయాల్లో నిబంధనలను అనుగుణంగా డిస్‌ప్లే బోర్డులను వేస్తామని ఒక ప్రకటనలో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment