సాక్షి, న్యూఢిల్లీ: గౌతమ్ అదానీ గ్రూప్ సంస్థ అదానీ ఎంటర్‌ప్రైజెస్ విమాన సేవల రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఎయిర్‌పోర్ట్ అధారిటీ ఆఫ్ ఇండియా) నిర్వహించిన వేలంలో అత్యధిక బిడ్‌ను కోట్ చేసి దేశంలోనే ఐదు ప్రధాన ఎయిర్‌పోర్టుల ప్రాజెక్టులను సొంతం చేసుకుంది.
ప్రయివేటీకరణలో భాగంగా ఎయిర్‌పోర్ట్ అధారిటీ ఆఫ్ ఇండియా సోమవారం నిర్వహించిన వేలంలో అదానీ గ్రూపు అయిదు అంతర్జాతీయ విమానాశ్రయాలను సొంతం చేసుకుందని సీనియర్ అధికారులు ప్రకటించారు. అహ్మదాబాద్, తిరువనంతపురం, లక్నో, మంగళూరు, జైపూర్ ఎయిర్‌పోర్టుల బిడ్స్‌ను అదానీ ఎంటర్‌ప్రైజెస్ దక్కించుకుంది. మొత్తం ఆరు విమానాశ్రయాలకు బిడ్స్ దాఖలు చేయగా, వీటిలో అసోంలోని గౌహతి ఎయిర్‌పోర్ట్ బిడ్ రేపు (మంగళవారం) ప్రకటించనున్నామని అధికారులు వెల్లడించారు. మొత్తం 6 ఎయిర్‌పోర్టులకోసం 10 కంపెనీల నుంచి 32 బిడ్లు దాఖలు కాగా.. అన్నిటికంటే అదానీ చాలా ఎక్కువ కోట్ చేసి అయిందింటిని దక్కించుకుందని పేర్కొన్నారు. మరోవైపు ఈ వార్తలతో స్టాక్‌మార్కెట్‌లో అదానీ ఎంటర్‌ప్రైజెస్ కౌంటర్ దాదాపు 4 శాతం జంప్‌చేసింది. చివరికి 2 శాతం లాభాలతో ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment