International Airports
-
ప్రపంచంలో తొలి 20 అత్యుత్తమ విమానాశ్రయాలు ఇవే..(ఫొటోలు)
-
అంతర్జాతీయ విమానాశ్రయం.. ప్రయాణ ‘వైభోగ’పురం
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ఉత్తరాంధ్ర అభివృద్ధే లక్ష్యంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వడివడిగా అడుగులేస్తోంది. ఇందులో భాగంగా ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని రెండేళ్లలోనే అందుబాటులోకి తేవాలని లక్ష్యం నిర్దేశించుకుంది. ఏటా 1.80 కోట్ల మంది ప్రయాణించేలా దీన్ని నిర్మించనున్నారు. నిర్మాణ బాధ్యతలను పలు అంతర్జాతీయ విమానాశ్రయాలను నిర్మించిన రికార్డు ఉన్న జీఎంఆర్ గ్రూప్ చేపట్టింది. ఇప్పటికే నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులను ప్రభుత్వం సాధించింది. వాస్తవానికి అంతర్జాతీయ విమానాశ్రయం పనులు ప్రారంభించాక అందుబాటులోకి తేవడానికి మూడేళ్ల సమయం పడుతుంది. అయితే ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో అన్ని కీలక అనుమతులు సాధించడంతో రెండేళ్లలోనే అందుబాటులోకి రానుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులకు మే 3న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భూమి పూజ చేసి నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభిస్తారు. కేంద్ర మంత్రులు ముఖ్య అతిథులుగా హాజరవుతుండటంతోఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం మూడు దశల్లో.. ఏటా 1.80 కోట్ల మంది ప్రయాణించేలా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూడు దశల్లో అభివృద్ధి చేయనున్నారు. ఇందులో భాగంగా తొలి దశలో 60 లక్షల మంది ప్రయాణించేలా రూ.5,000 కోట్లతో పనులు చేపడతారు. ఇక రెండో దశలో 1.20 కోట్ల మంది, మూడో దశలో 1.80 కోట్ల మంది ప్రయాణించేలా అభివృద్ధి చేస్తారు. మూడు దశల్లో ఒకేసారి 22 విమానాలు ఆగేలా 22 ఎయిర్‌బ్రిడ్జిలను నిర్మిస్తారు. ఇందులో భాగంగా తొలిదశలో ఏడు ఎయిర్‌బ్రిడ్జిలను అభివృద్ధి చేస్తారు. తొలి దశలో ప్యాసింజర్ టెర్మినల్, కార్గో కాంప్లెక్స్, విమానాల నిర్వహణ, మరమ్మతులకు ఎంఆర్వో యూనిట్, ఏవియేషన్ అకాడమీ, ప్లాంట్ క్వారంటైన్, యానిమల్ క్వారంటైన్ వంటి పలు సదుపాయాలను కల్పించనున్నారు. అలాగే విశాఖ నగరం వైపు అభివృద్ధి చేయనున్నారు. భారీ విమానాలకు అనువుగా.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ విమానాలు సురక్షితంగా దిగేలా 3.8 కి.మీ పొడవైన భారీ రన్‌వేను నిర్మించనున్నారు. తూర్పు తీరంలో విశాఖ చాలా వ్యూహాత్మక స్థానం కావడంతో రక్షణ అవసరాల కోసం ఎయిర్‌పోర్టులో 10 ఎకరాలను ప్రత్యేకంగా ప్రభుత్వం కేటాయించింది. ఇవి కాకుండా అంతర్జాతీయ విమాన సర్వి సులకు అవసరమైన కస్టమ్స్, ఇమిగ్రేషన్‌లతోపాటు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) టవర్లను ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఎయిర్‌పోర్టుకు ఆనుకొని ఉన్న 500 ఎకరాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏరో సిటీని అభివృద్ధి చేయనుంది. అడ్డంకులన్నీ అధిగమించి.. కీలక అనుమతులు సాధించి.. గత ప్రభుత్వం భూసేకరణ కూడా పూర్తి చేయకుండానే ఎన్నికల ముందు హడావుడిగా శంకుస్థాపన చేసింది. దానికి భిన్నంగా ప్రస్తుత ప్రభుత్వం అన్ని అనుమతులు వచ్చాకే నిర్మాణ పనులను ప్రారంభిస్తోంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై సుప్రీంకోర్టు, హైకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)ల్లో నమోదైన కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వం విజయం సాధించింది. అలాగే భూసేకరణకు సంబంధించిన అన్ని అడ్డంకులను అధిగమించింది. విమానాశ్రయం ప్రారంభించాక ప్రస్తుతం విశాఖలోని నేవీ విమానాశ్రయం నుంచి 30 ఏళ్లపాటు వాణిజ్య సేవలను నిలిపివేయడానికి కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) పొందింది. అలాగే ఎయిర్‌పోర్టు భద్రతకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఆమోదం, పలు సర్వి సు సేవలకు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), విదేశీ సర్వి సుల నిర్వహణకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖలతో పలు ఒప్పందాలను రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకుంది. నిర్వాసితులకు అండగా.. విమానాశ్రయ నిర్మాణం నేపథ్యంలో నాలుగు గ్రామాలకు చెందిన ప్రజలను పునరావాస గ్రామాలకు తరలించారు. ఇందుకోసం పోలిపల్లి, గూడిపవలస వద్ద 50.3 ఎకరాల్లో సుమారు రూ.77 కోట్లతో రెండు గేటెడ్ కమ్యూనిటీ తరహాలో పునరావాస గ్రామాలను ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ప్రైవేటు రియల్ ఎసేŠట్ట్ వెంచర్లకు దీటుగా కాలనీల్లో 30 అడుగుల సీసీ రోడ్లు, డ్రైనేజ్, ప్రతి ఇంటికీ తాగునీటి కుళాయి, కమ్యూనిటీ హాళ్లు, చిల్డ్రన్ పార్క్, పాఠశాల, పోస్టాఫీసు, షాపింగ్ కాంప్లెక్స్, దేవాలయాలు వంటి అనేక సదుపాయాలను కల్పించడంతో ప్రజలు సంతోషంగా గ్రామాలను వదిలి పునరావాస కేంద్రాలకు చేరుకున్నారు. 2025 నాటికి తొలి విమానం.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను ముఖ్య అతిథిగా ఆహ్వానించాం. 2025 నాటికి ఇక్కడి నుంచి తొలి విమానం ఎగరాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. మూలపేట పోర్టు, భోగాపురం ఎయిర్‌పోర్టులతో పారిశ్రామికంగా ఉత్తరాంధ్ర ముఖచిత్రం మారిపోతుంది. – గుడివాడ అమర్నాథ్, పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం.. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని అంతర్జాతీయ ప్రమాణాలతో ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేస్తున్నాం. సీఎం వైఎస్ జగన్ ఆశయాలకు అనుగుణంగా అన్ని అనుమతులు సాధించాకే నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నాం. దీంతో రెండేళ్లలోనే వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం రానుంది. అలాగే స్థానిక కుటుంబాలకు సాధ్యమైనంత ఎక్కువ సాయం అందించడానికి సీఎం ఆదేశాలకు అనుగుణంగా అత్యాధునిక వసతులతో పునరావాస గ్రామాలను అభివృద్ధి చేశాం. - వీఎన్ భరత్ రెడ్డి, ఎండీ, ఏపీఏడీసీఎల్ -
టాప్ 10 అంతర్జాతీయ విమానాశ్రయాలు (ఫోటోలు)
-
పట్టుకున్న బంగారం ఏం చేస్తారు?
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ విమానాశ్రయాల్లో బంగారం, వజ్రాలు, విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు అక్రమంగా తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబడడం తెలిసిందే. హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ ఇలాంటివి జరుగుతుంటాయి. అయితే ఇలా కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న పసిడి, వెండి, వజ్రాలు తదితర విలువైన వస్తువులను తర్వాత ఏం చేస్తారు? అనేది తెలుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. దీనితోపాటు మరికొన్ని ప్రశ్నలను నగరానికి చెందిన ఓ సమాచార హక్కు కార్యకర్త ఆర్టీఐ దరఖాస్తు ద్వారా అడిగితే ఏం సమాధానం వచ్చిందో తెలుసా? ‘‘మా వద్ద సమాచారం లేదు’’అని!! అది చదివి అవాక్కవడం అతని వంతైంది. పన్ను ఎగ్గొట్టే యత్నంలో.. యూఏఈ, సౌదీ అరేబియా తదితర గల్ఫ్ దేశాల నుంచి బంగారం, ఇతర దేశాల నుంచి పలు ఎలక్ట్రానిక్ పరికరాలు, విదేశీ కరెన్సీని కొందరు విమానాల ద్వారా అక్రమంగా హైదరాబాద్‌కు తెస్తుంటారు. పన్ను ఎగ్గొట్టే ఉద్దేశంతో నిబంధనలకు విరుద్ధంగా వీటిని తీసుకొస్తుంటారు. అత్యంత ఆధునిక విధానాల్లో వీటిని తెస్తూ కస్టమ్స్ అధికారుల కంట పడకుండా బురిడీ కొట్టిస్తుంటారు. అయితే, బాడీ స్కానింగ్ తదితర అధునాతన సాంకేతికత అందుబాటులోకి వచ్చాక.. స్మగ్లర్ల పప్పులు ఉడకడం లేదు. ఇలా పట్టుబడిన బంగారం, వెండి, వజ్రాలు, కరెన్సీ, విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలను కస్టమ్స్ అధికారులు ఏం చేస్తారు? వీటిని వేలం వేస్తారా? లేక ఇతర శాఖలకు పంపుతారా? కోర్టుకు స్వాధీనం చేస్తారా? అనే సందేహాలు తలెత్తుతుంటాయి. ఇవే ప్రశ్నలను సంధిస్తూ నగరానికి చెందిన రాబిన్ అనే సామాజిక ఉద్యమకారుడు శంషాబాద్‌లోని హైదరాబాద్ కస్టమ్స్ ఆఫీసుకు, సనత్‌నగర్‌లోని కస్టమ్స్ డిప్యూటీ కమిషనర్‌కు సమాచార హక్కు ద్వారా దరఖాస్తు చేశాడు. చెన్నై సీబీఐ లాకర్లా అయితే ఎలా?: రాబిన్ తన ప్రశ్నలకు కస్టమ్స్ అధికారులు ఎలాంటి సమాచారం లేదని చెప్పడంపై ఆర్టీఐ దరఖాస్తుదారుడు రాబిన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. నిత్యం కస్టమ్స్ వాళ్లు పట్టుకుంటున్న బంగారం, వెండి, విదేశీ కరెన్సీ వివరాల గురించి ప్రసార మాధ్యమాల్లో వార్తలు వస్తుంటాయని, స్వాధీనం చేసుకున్న వాటిన ఏంచేస్తారో ప్రజలకు చెప్పకపోవడం ఏంటని వాపోయాడు. అసలు ఈ వస్తువుల రికార్డు నిర్వహణ సరిగా ఉందా? అని నిలదీశాడు. నిర్వహణ సరిగా లేకపోతే ఇటీవల చెన్నైలోని సీబీఐ కస్టడీ నుంచి దాదాపు 100 కిలోల బంగారం మాయమైన తరహాలో జరిగితే ఏమేం మాయమయ్యాయనే సంగతి ఎలా తెలుస్తుందని ప్రశ్నిస్తున్నాడు. ఈ తొమ్మిది ప్రశ్నలు సంధించాడు! (1) 2015 నుంచి 2020 వరకు కస్టమ్స్ శాఖ సీజ్ చేసిన వస్తువుల వివరాలు (2) స్వాధీనం చేసుకున్న వస్తువులు ఏయే దేశాలవి? (3) 2015–2020 వరకు నమోదు చేసిన కేసులు (4) స్వాధీనం చేసుకున్న బంగారం, వెండి, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ఏం చేస్తారు? (5) ప్రస్తుతం హైదరాబాద్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ వద్ద ఉన్న వస్తువుల విలువ ఎంత? (6) సీజ్ చేసిన వçస్తువులను హైదరాబాద్ కస్టమ్స్ వేలం వేస్తుందా? (7) మీరు నిర్వహించిన వేలంలో విక్రయించిన పది వస్తువులు, వాటిని కొనుగోలు చేసిన వ్యక్తుల వివరాలు (8) వేలం సమాచారం ప్రజలకు ఎలా తెలియజేస్తారు? గత పది వేలంల గురించిన వివరాలు (9) హైదరాబాద్ కస్టమ్స్ శాఖ సీజ్ చేసిన వస్తువుల్లో ఎన్ని కస్టడీలో ఉన్నాయి? ఇతర విభాగాలు, కోర్టుకు ఎన్నింటిని అప్పగించారు? -
అదానీ చేతికి ఐదు విమానాశ్రయాలు
సాక్షి, న్యూఢిల్లీ: గౌతమ్ అదానీ గ్రూప్ సంస్థ అదానీ ఎంటర్ప్రైజెస్ విమాన సేవల రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఎయిర్పోర్ట్ అధారిటీ ఆఫ్ ఇండియా) నిర్వహించిన వేలంలో అత్యధిక బిడ్‌ను కోట్ చేసి దేశంలోనే ఐదు ప్రధాన ఎయిర్‌పోర్టుల ప్రాజెక్టులను సొంతం చేసుకుంది. ప్రయివేటీకరణలో భాగంగా ఎయిర్పోర్ట్ అధారిటీ ఆఫ్ ఇండియా సోమవారం నిర్వహించిన వేలంలో అదానీ గ్రూపు అయిదు అంతర్జాతీయ విమానాశ్రయాలను సొంతం చేసుకుందని సీనియర్ అధికారులు ప్రకటించారు. అహ్మదాబాద్, తిరువనంతపురం, లక్నో, మంగళూరు, జైపూర్ ఎయిర్‌పోర్టుల బిడ్స్‌ను అదానీ ఎంటర్ప్రైజెస్ దక్కించుకుంది. మొత్తం ఆరు విమానాశ్రయాలకు బిడ్స్ దాఖలు చేయగా, వీటిలో అసోంలోని గౌహతి ఎయిర్పోర్ట్ బిడ్ రేపు (మంగళవారం) ప్రకటించనున్నామని అధికారులు వెల్లడించారు. మొత్తం 6 ఎయిర్‌పోర్టులకోసం 10 కంపెనీల నుంచి 32 బిడ్లు దాఖలు కాగా.. అన్నిటికంటే అదానీ చాలా ఎక్కువ కోట్ చేసి అయిందింటిని దక్కించుకుందని పేర్కొన్నారు. మరోవైపు ఈ వార్తలతో స్టాక్మార్కెట్లో అదానీ ఎంటర్ప్రైజెస్ కౌంటర్ దాదాపు 4 శాతం జంప్‌చేసింది. చివరికి 2 శాతం లాభాలతో ముగిసింది. -
భూసేకరణ పూర్తయితే స్థాయి పెంపు
విమానాశ్రయాలపై అశోక్ గజపతి న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014లో నిర్దేశించిన ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాల స్థాయిని పెంచి అంతర్జాతీయ విమానాశ్రయాలుగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు స్పష్టంచేశారు. ఎయిర్‌పోర్టులకోసం తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు అడుగుతున్నప్పటికీ... సాంకేతికంగా, రక్షణపరంగా, భద్రతపరంగా సాధ్యాసాధ్యాలను పరిశీలి స్తామని చెప్పారు. కొత్త ప్రతిపాదనలపై సాంకేతిక బృందాలు అధ్యయనం చేస్తున్నాయని ఆయన తెలిపారు.