ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014లో నిర్దేశించిన ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి
విమానాశ్రయాలపై అశోక్ గజపతి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014లో నిర్దేశించిన ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాల స్థాయిని పెంచి అంతర్జాతీయ విమానాశ్రయాలుగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు స్పష్టంచేశారు. ఎయిర్‌పోర్టులకోసం తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు అడుగుతున్నప్పటికీ... సాంకేతికంగా, రక్షణపరంగా, భద్రతపరంగా సాధ్యాసాధ్యాలను పరిశీలి స్తామని చెప్పారు. కొత్త ప్రతిపాదనలపై సాంకేతిక బృందాలు అధ్యయనం చేస్తున్నాయని ఆయన తెలిపారు.