ashok gajapathi raju
-
విజయనగరం టీడీపీలో మంత్రి పదవుల చిచ్చు
ఏపీ నూతన మంత్రివర్గంలో పదవుల పందేరం విజయనగరం జిల్లాలో అసంతృప్తి జ్వాలలకు కారణం అయింది. చంద్రబాబు ప్రమాణ స్వీకారం జరుగుతుండగానే జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల టీడీపీ వాట్సప్ గ్రూపుల్లో పార్టీ కార్యకర్తలు నాయకత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. మంత్రి పదవులు దక్కని వారంతా సీనియర్ నేత అశోక్ గజపతి రాజు తీరుపై మండిపడుతున్నారు. విజయనగరం రాజు మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరు?ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గ కూర్పుతో విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీలో మంటలు రేగుతున్నాయి. మంత్రి పదవులు తప్పనిసరిగా దక్కుతాయనుకున్నవారికి పార్టీ అధినేత చంద్రబాబు షాక్ ఇచ్చారు. చంద్రబాబు, బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా చర్చల వరకు మంత్రి పదవులు లిస్ట్ లో చీపురుపల్లి ఎమ్మెల్యే కళావెంకటరావు, బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన పేర్లు ఉన్నాయని స్థానికంగా ప్రచారం జరిగింది.అయితే అనూహ్యంగా గవర్నర్ కు ఇచ్చిన జాబితాలో వీరిద్దరి పేర్లు మాయం అయ్యాయి. సీనియర్లకు బదులుగా ఎన్నికలకు రెండు నెలల ముందు పార్టీలోకి వచ్చి టికెట్ కొట్టేసిన ఎన్.ఆర్.ఐ, గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాస్ కు మంత్రి పదవి దక్కింది. పార్టీ కోసం ఏనాడు పనిచేయని శ్రీనివాస్ కు మంత్రి పదవి ఎలా ఇస్తారని సీనియర్ లు దుమ్మెత్తి పోస్తున్నారు.విజయనగరం జిల్లా రాజకీయాల్లోకి కళా వెంకట్రావు రాకను అశోక్ గజపతిరాజు తొలినుండి అడ్డుకుంటూనే ఉన్నారు. కళా వెంకటరావు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుండి వీళ్ల మద్య విభేదాలు ఉన్నాయనే టాక్ ఉంది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల టికెట్ ఆశించిన కళావెంకటర్రావుని విజయనగరం జిల్లా చీపురుపల్లి నుండి పోటీకి దింపారు.ఇక్కడ బొత్స సత్యన్నారాయణపై గెలిస్తే మంత్రి పదవి దక్కుతుందని చంద్రబాబు చెప్పినట్టు అప్పట్లో జిల్లాలో వార్తలు వినిపించాయి. చంద్రబాబు హామీ మేరకు..ఎన్నికల్లో విజయం సాధించిన కళావెంకటరావు మంత్రి పదవి ఆశించారు. విజయనగరం జిల్లా టిడిపిలో కూడా కళాకే మంత్రి పదవి అంటూ హోరెత్తించారు. మరో పక్క బొబ్బిలి ఎమ్మెల్యే బేబి నాయనకు కూడా చంద్రబాబు మంత్రి పదవి హామీ ఇచ్చారని ఎన్నికల ప్రచారంలోనే ఆయన చెప్పుకున్నారు.ఇక్కడే జిల్లాలో సీనియర్ నేత, మాజీ కేంద్రం మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. బొబ్బిలి రాజులకు విజయనగరం రాజులకు ఉన్న శతాబ్దాల వైరం కారణంగా.. ఇప్పుడు బొబ్బిలి రాజ వంశస్తుడు అయిన బేబినాయనకి మంత్రి పదవి దక్కకుండా అశోక్గజపతరాజు అడ్డు చక్రం వేశారని సమాచారం. ఇదే విషయం బొబ్బిలి టిడిపి వాట్సప్ గ్రూపుల్లో హల్ చల్ చేసింది. దీనికి బేబినాయన కూడా వాయిస్ మెసేజ్ ద్వారా కేడర్ కు సమాధానం చెప్పుకున్నారు.రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షుడు కళా వెంకటరావుకు, అశోక్ గజపతిరాజు, ప్రస్తుత రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడులతో గతంలో ఉన్న విభేదాలే ఆయనకు మంత్రి పదవిని దూరం చేశాయి. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నుండి కళా వెంకటరావును అచ్చెన్నాయుడు తరిమేయగా, విజయనగరం జిల్లాలో బొత్స సత్యన్నారాయణ లాంటి ఉద్దండుడుపై ఓటమి తప్పదనే పోటీకి అవకాశం ఇచ్చారు. అయితే ఎవరూ ఊహించని విధంగా కళా వెంకటరావు గెలిచారు. అయినప్పటికీ ఆయనకు మంత్రి పదవి రాకుండా అశోక్ గజపతి రాజు అడ్డుకున్నారంటూ జిల్లాలో చర్చసాగుతోంది.రాజాం, ఎస్.కోట నియోజకవర్గాల నుండి గెలిచిన కొండ్రు మురళీ మోహన్, కోళ్ల లలిత కుమారి కూడా మంత్రి పదవి ఆశించిన వారిలో ఉన్నారు. సామాజికవర్గం ప్రాధాన్యతల దృష్ట్యా అవకాశం కోసం లాబీయింగ్ చేసుకున్నా వీళ్లకూ అశోక్ గజపతి రాజు ఆశీస్సులు దక్కలేదు. విజయనగరం జల్లాలో మంత్రిపదవులు ఆశించి భంగపడ్డ సీనియర్ల అసంతృప్తికి అశోక్ గజపతిరాజే కారణం అని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. -
ఆ కష్టాలు మాకొద్దు ‘రాజా’..!
విజయనగరం: విజయనగరం.. చారిత్రక నేపథ్యం కలిగిన నగరం. ఏళ్ల తరబడి రాజుల పాలనలో ఉన్నా అభివృద్ధి శూన్యం. రాజులను నమ్మి జనం అధికారం కట్టబెట్టినా అది అలంకార ప్రాయంగానే చూశారు. ప్రజల కష్టాలు అరణ్యరోదనగానే మిగి లాయి. ఏ నాడూ ప్రజల సమస్యలు తెలుసుకోవాలన్న ధ్యాస, మంచిచేయాలన్న తపన రాజరిక కుటుంబానికి లేకపోవడమే దీనికి కారణం. ఓ వైపు నగర జనాభా పెరుగుతున్నా... కాలనీలు విస్తరించినా ఆ స్థాయిలో సౌకర్యాలు కల్పించేందుకు కనీ సం కృషి చేయలేదు. ఆ ఆలోచన కూడా రాలేదు. కేంద్ర మంత్రిగా పనిచేసిన అశోక్ గజపతిరాజు కోటదాటి బయటకు వచ్చిన సందర్భాలు అరుదు. జనానికి రాజు మొహం కనిపించిందంటే అదే మహాభాగ్యంగా ఉండేది. ఎన్నికల వేళ జనంలోకి రావడం.. తర్వాత బంగ్లాకు లేదంటే ఢిల్లీకి పరిమితం కావ డమే ఏళ్ల తరబడి సాగుతున్న తంతు. 2014–19 మధ్య టీడీపీ హయాంలో నగర వాసులు దాహార్తితో అల్లాడినా మంత్రిగా ఉండి కనీసం పట్టించుకోలేదు. గుక్కెడు తాగునీటి కోసం బంగ్లా వద్ద ఆందోళనలు చేసినా కనికరించలేదు. రోడ్ల విస్తరణ పరిస్థితీ అంతే. తవ్వేసి వదిలేశారు. పాడైన రోడ్లపై రాకపోకలకు పట్టణ వాసుల అవస్థలు వర్ణనాతీతం. పదవీ కాలమంతా కోట, పరిసరాలను అందంగా తీర్చిదిద్దేందుకే పరిమితమయ్యారు. అన్ని రంగాల్లో నగర అభివృద్ధిని మసకబారించారన్న అపవాదను అశోక్ మూటగట్టుకున్నారు. కార్పొరేషన్ స్థాయిలో సదుపాయాల కల్పనకు అశోక్ కనీసం ఆలోచన చేయలేదని జనం బహిరంగంగానే విమర్శిస్తున్నారు. నగరంలోని శివారు కాలనీల పరిస్థితి అయితే ఐదేళ్ల కిందట దుర్భరం. తాగునీరు, డ్రైనేజీలు, రోడ్ల సదుపాయాలు కల్పించాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అశోక్ కనీసం పట్టించుకోలేదు. ఇప్పుడు కుమార్తె తరఫున ప్రచారానికి వస్తున్న అశోక్‌ను జనం బహిరంగంగానే నిలదీస్తున్నారు. మీరు పదవులు అనుభవించడమే తప్ప జనానికి ఏ రోజైనా మేలు చేశారా..? కనీసం మా సమస్యలు ఆలకించారా..? మాట్లాడేందుకు అవకాశం కల్పించారా..? అంటూ ప్రశ్నిస్తున్నారు.జనాభా పెరిగినా..విజయనగరంలో 2001 సంవత్సరంలో సుమారు లక్ష వరకు ఓటర్లు ఉండగా... 2005 నాటికి 1.05 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 2.44 లక్షల జనాభా ఉండగా.. 2014 సంవత్సరం నాటికి జనాభా సంఖ్య సుమారు 3 లక్షలు ఉండేది. అప్పట్లో గాజులరేగ, జమ్ము, ధర్మపురి, అయ్యన్నపేట, వేణుగోపాలపురం, కెఎల్‌పురం ప్రాంతాలను విజయనగరం మున్సిపాలిటీలో విలీనం చేయడంతో పట్టణ విస్తీర్ణం పెరిగింది. వీటి పరిధిలో గుర్తింపు పొందిన మురికివాడలు 80 వరకు ఉండేవి. వీరిలో అర్హులైన వారికి హౌస్‌ఫర్ ఆల్ పథకంలో ఇళ్ల నిర్మాణానికి దరఖాస్తులు స్వీకరించగా.. లబ్ధిదారుల నుంచి టీడీపీకి చెందిన దిగవ స్థాయి నాయకులు లంచాలు వసూలు చేసి చివరికి ఇల్లు అప్పగించకుండా మోసం చేసినట్టు కొందరు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. 2014–19 మధ్య రూ.279 కోట్లతో రెండువేల పనులు చేపట్టేందుకు అప్పటి టీడీపీ పాలకవర్గం ఆమోదించగా... అందులో రూ.93 కోట్లతో 700 పనులు మాత్రమే పూర్తిచేయగలింది.నాటికి నేటికీ తేడా చూడు..రాజులు కోట, బంగ్లాకే పరిమితమైతే.. నేటి పాలకులు జనం మధ్యనే ఉంటూ.. జనం అవసరాలు తెలుసుకుంటూ అభివృద్ధి పనులు చకచకా పూర్తిచేస్తున్నారు. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా నగరాన్ని తీర్చిదిద్దుతున్నారు. కేవలం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ 59 నెలల పాలనలో ఇది మన విజయనగరం అని మురిసిపోయేలా.. గర్వంగా చెప్పుకునేలా అన్ని కూడళ్లను అందంగా తీర్చిదిద్దారు. నగరవాసులకు ఆహ్లాదాన్ని పంచేలా చెరువు గట్లను పార్కులుగా మలిచారు. మహిళల కోసం రాష్ట్రంలోనే తొలిసారిగా పార్కును నిర్మించారు. తాగునీటి పథకాలు నిర్మించి నగరవాసులకు శాశ్వతంగా తాగునీటి కష్టాలను దూరం చేశారు. శివారు కాలనీలకు రోడ్లు వేశారు. విద్య, వైద్య సదుపాయాలను అందుబాటులోకి తెచ్చారు. సరస్వతీ నిలయాలకు సొబగులద్దారు. నగరంలో రోడ్ల విస్తరణ పనులు పూర్తిచేశారు. నగరానికి ఏ వైపు నుంచి వచ్చిన వారికై నా ఇది మన విజయనగర వైభవం అని చాటిచెప్పేలాహంగులు కల్పించారు.పాలకుడంటే జనం కష్టాలు తెలిసిన వాడు.. తెలుసుకునేవాడై ఉండాలి.. ప్రజల అవసరాలు ఎప్పటికప్పుడు తీర్చగలగాలి. ఆపద సమయంలో నేనున్నాంటూ ఆపన్నహస్తం అందించి ఆదుకోవాలి. ఓ విజన్‌తో నగరాభివృద్ధికి కృషిచేస్తూ.. ప్రతీ ఒక్కరికీ మంచి చేయాలన్న తపనతో ముందుకు సాగాలన్నది జనం మాట. అధికారాన్ని అలంకారంగా భావించి.. కష్ట కాలంలో కోటదాటని పాలకులు.. ఎన్నికల వేళ ప్రజల వద్దకు వస్తుంటే ఛీకొడుతున్నారు. దాహార్తితో అల్లాడుతున్నా పట్టించుకోని రాజులు.. రోడ్ల విస్తరణ పనులు పూర్తిచేయనివారు.. విజయనగర వైభవాన్ని మసకబారించేలా వ్యవహరించే రాజరిక పాలన మాకొద్దంటూ మొహంమీదే చెబుతున్నారు. అనునిత్యం అందుబాటులో ఉంటూ.. కార్పొరేట్ స్థాయికి తగ్గట్టుగా విజయనగర అభివృద్ధికి అనునిత్యం పాటుపడే నాయకుడే పాలకుడుగా ఉండాలని సుస్పష్టం చేస్తున్నారు. -
టీడీపీ పని ఔటేనా? అశోక్ గజపతి రాజు మాటల్లో అంతరార్థం ఏంటీ?
తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందా? పార్టీ చరిత్రలోనే ఇంతటి అధ్వాన్న పరిస్థితులు ఎన్నడూ లేవా? చంద్రబాబు నాయకుడి అసమర్ధ సారధ్యమే తెలుగుదేశం పార్టీకి ఈ దుస్థితిని తెచ్చిపెట్టిందా? ఇక పార్టీకి భవిష్యత్తు లేనట్లేనా? టిడిపి సీనియర్ నేత మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు మనోభావాలను గమనిస్తే ఈ ప్రశ్నలన్నింటికీ ఔను అన్న సమాధానాలే వస్తాయి. పార్టీ దుస్థితిని చూసి తట్టుకోలేకపోయిన అశోక్ గజపతి రాజు వంటి సీనియరే ఇక పార్టీలో యాక్టివ్‌గా ఉండలేనని చెప్పేసినట్లు సమాచారం. అంతగా అవసరం అనుకుంటే సలహాలు మాత్రమే ఇస్తానని ఆయన అన్నారని పార్టీ వర్గాల్లోనే కలకలం రేగుతోంది. తెలుగుదేశం పార్టీ నడక ఎలా సాగుతోంది? ఒకప్పుడు ఎలా ఉండేది? ఇపుడు ఎంత బలహీనంగా అడుగులు పడుతున్నాయి? ఎన్టీయార్ టిడిపిని స్థాపించినప్పుడు ఆయనతో పాటు చాలా మంది నేతలు రాజకీయ ప్రస్థానాలు ప్రారంభించారు. చాలా మంది రాజకీయ జీవితాలు అప్పుడే మొదలయ్యాయి. అప్పటి టిడిపి నేతలందరికీ అది ఒక స్వర్ణ యుగం. ఎన్నో విలువలతో ఏర్పడిన నాటి టిడిపి ఎన్టీయార్ తోనే కనుమరుగు అయిపోయింది. ఇపుడున్న టిడిపి చంద్రబాబు నాయకత్వంలో పాతాళం దిశగా శరవేగంగా దిగజారిపోతోంది. కాంగ్రెస్ వ్యతిరేకతలోంచి ఎన్టీయార్ టిడిపిని స్థాపించారు. ఆ కాంగ్రెస్ అధినేతలు రాహుల్ గాంధీతో నేరుగా చేతులు కలిపిన రోజునే టిడిపిలో ఎన్టీయార్ తాలూకు ఆనవాళ్లు ఏమన్నా ఉంటే అవి మాయం అయిపోయాయి గత సిద్ధాంతాలకు కాలం చెల్లింది. చంద్రబాబు నాయుడి అవకాశవాద రాజకీయాలు టిడిపిని దివాళా తీయించాయనే చెప్పాలి. ఎన్టీయార్ పార్టీ పెట్టినపుడు అందులో ఉండి ఆ తర్వాత ఎన్టీయార్ కు వెన్నుపోటు పొడిచినపుడు చంద్రబాబుతో అంటకాగిన సీనియర్ నేతలు సైతం టిడిపిని చంద్రబాబు నడిపిస్తోన్న తీరు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇటువంటి పార్టీలో ఇక క్రియాశీలకంగా కొనసాగలేం అని నిర్ణయించేసుకుంటున్నారు. తాజాగా ఉత్తరాంధ్రలో ఎన్టీయార్ హయాంలో మంత్రిగా పనిచేసి ఆయన వెన్నుపోటు సమయంలో చంద్రబాబు శిబిరంలో ఉన్న అశోక్ గజపతి రాజు ప్రస్తుతం టిడిపి తీరుపై కోపంగా ఉన్నారు. ఒకపక్క బిజెపితో ప్రత్యక్ష స్నేహం. మరోవైపు కాంగ్రెస్ తో చీకటి స్నేహం. ఇంత దగుల్బాజీ రాజకీయాలను తన కెరీర్ లోనే చూడలేదని అశోక్ గజపతి రాజు తన అనుయాయులతో అంటున్నట్లు సమాచారం. పార్టీ అధినేతగా చంద్రబాబు అనుసరిస్తోన్న వైఖరి..ఆయన మాటల తీరు కూడా అభ్యంతరకరంగానే ఉన్నాయని అశోక్ గజపతిరాజు భావిస్తున్నారని అంటున్నారు. ఎన్నికల ప్రచారంలో నిన్న కాక మొన్ననే చంద్రబాబు నాయుడు శింగనమల నియోజక వర్గంలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఒక టిప్పర్ డ్రైవర్ కు టికెట్ ఇస్తే చంద్రబాబు నాయుడు దాన్ని హేళన చేస్తూ పేదలను అవమానిస్తూ డ్రైవర్ల పట్ల తనకున్న ఏవగింపును చాటుకున్నారు. దీనిపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. దీనికి కౌంటర్ గా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఔను చంద్రబాబూ.. మాది పేదల పార్టీ కాబట్టే పేదవాడైన టిప్పర్ డ్రైవర్ కు ఇచ్చాం..మరో చోట ఉపాధి హామీ కూలీకి టికెట్ ఇచ్చాం? మీలా మాది పెత్తందార్ల పార్టీ కాదు కదా అని చురకంటించారు. ఇపుడు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడి వెకిలి మాటలు.. దానికి జగన్ మోహన్ రెడ్డి దీటైన సమాధానం పైనే చర్చ నడుస్తోంది. దీంతోనే సెల్ఫ్ గోల్ వేసుకున్న చంద్రబాబు నాయుడు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తెచ్చిన వాలంటీర్ వ్యవస్థపై కక్ష సాధింపుతో ఎన్నికల వేళ వాలంటీర్ల చేత పింఛన్లు, సంక్షేమ పథకాలు ఇప్పించకుండా ఆంక్షలు విధించాలంటూ నిమ్మగడ్డ రమేష్ చేత ఈసీకి ఫిర్యాదు చేయించారు. ఆ ఫిర్యాదు అందుకున్న ఈసీ వాలంటీర్లపై ఆంక్షలు విధించింది. దాంతో ఒకటో తారీఖున తెల్లవారు జామునే పింఛన్లను తమ ఇంటికి తెచ్చి ఇచ్చే వాలంటీర్లు ఏప్రిల్ ఒకటో తేదీన రాకపోవడంతో అవ్వాతాతలు, దివ్యాంగులు నరకయాతన పడ్డారు. దీనికంతటికీ కారణం చంద్రబాబు నాయుడి టిడిపి పార్టీయే అని తెలుసుకుని వారు మండిపడుతున్నారు. ఎన్నికల వేళ వాలంటీర్లపై ఆంక్షలు విధించేలా చేసి ఏదో విజయం సాధించామని చంద్రబాబు అనుకున్నారు. కానీ ఈ నేలబారు రాజకీయంతో ప్రజల్లో ఆయనపట్ల వ్యతిరేకత ఎన్నో రెట్లు పెరిగిందంటున్నారు రాజకీయ పండితులు. ఇక పొత్తుల కోసం బిజెపి అగ్రనేతల కాళ్లా వేళ్లా పడి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో వెంపర్లాడ్డం కూడా టిడిపి సీనియర్లకు నచ్చడం లేదు. ఒక్క శాతం ఓట్లు కూడా లేని బిజెపితో పొత్తుకోసం చంద్రబాబు నాయుడు అంతలా దేబిరించాల్సిన అవసరం ఏముందని? సీనియర్లు నిప్పులు చెరుగుతున్నారు. ఈ తరుణంలోనే ఉత్తరాంధ్ర సీనియర్ నేత అశోక్ గజపతి రాజు తన అనుచరులతో మాట్లాడుతూ టిడిపి ఇంత అధ్వాన్న స్థితికి పడిపోడానికి కారణం చంద్రబాబు అసమర్ధ నాయకత్వమే అని పెదవి విరిచారట. ఇక ఈ పార్టీలో యాక్టివ్ గా ఉండలేనని అస్త్ర సన్యాసం ప్రకటించారట. పార్టీ నాయకత్వానికి కావాలని అనుకుంటే సలహాలు సూచనలు ఇస్తాను తప్ప నేనైతే యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండలేని అని తేల్చి చెప్పేశారట. ఈ ఎన్నికల్లో టిడిపి ఘోర పరాజయం ఖాయమన్న సంకేతాలను చాలా సర్వేలు అందించాయి. జగన్ మోహన్ రెడ్డి నిర్వహిస్తోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్రకు లక్షలాదిగా జనం తరలి వస్తోంటే చంద్రబాబు నాయుడి ప్రజాగళానికి జనం మొహం చాటేస్తున్నారు. ప్రజలు ఎటు వైపు మొగ్గు చూపుతున్నారో ఈ కార్యక్రమాలే చాటి చెబుతున్నాయంటున్నారు రాజకీయ పండితులు. ఈ ఎన్నికల్లో టిడిపి ఓటమి తర్వాత పార్టీలోని సీనియర్లంతా ఒక్కసారిగా చంద్రబాబు పై తిరుగుబాటు చేయడం ఖాయమంటున్నారు వారు. -
చంద్రబాబు నాయకత్వ తీరుపై గుర్రుగా ఉన్న అశోక్ గజపతి రాజు
-
పార్టీ కోసం ఇంత కష్టపడి పని చేస్తే.. వేదికపైకి పిలవరా..?
బాదుడే బాదుడు కార్యక్రమం పేరుతో పొందూరు మండలం దళ్లవలసకు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు హాజరైన దృశ్యమిది. పార్టీకి మంచి ఊపు వచ్చిందని.. జనాలంతా టీడీపీవైపే ఉన్నారంటూ చంద్రబాబు హడావుడి చేసిన సందర్భమిది. కానీ, అప్పట్లో ఆ సభకు జనాల్లేక కుర్చీలు వెలవెలబోయాయి. ప్రాంగణమంతా ఖాళీ కుర్చీలతో దర్శనమిచ్చింది. సాక్షాత్తు చంద్రబాబు హాజరైన సభకొచ్చిన దుస్థితి ఇది. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : అటు చంద్రబాబు హాజరైన సభ, ఇటు టీడీపీ జిల్లా కేడర్ అంతా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మినీ మహానాడు సభ చూస్తే టీడీపీకి అంత సీన్ లేదని స్పష్టమవుతోంది. తమకు వాపు తప్ప బలం లేదనే విషయం టీడీపీ కేడర్‌కు, ఆ పార్టీ శ్రేణులకు బోధపడుతోంది. బయట ఎంత హంగామా, హడావుడి చేసినా.. జనాల్లోనే కాదు టీడీపీ సానుభూతి పరుల్లో కూడా ఆదరణ లేదని విషయం అర్థమయ్యేలా గత ఏడాది చంద్రబాబు సభ, ఈ ఏడాది మినీ మహానాడు సభ తేటతెల్లం చేసింది. నమ్మినోళ్లను మోసగించడమే తప్ప చేసేందేమీ లేకపోవడం వల్ల ఈ పరిస్థితి దాపురించిందనే వాదన జిల్లా వ్యాప్తంగా వినిపిస్తోంది. ఎందుకీ పరిస్థితి..? ఓట్లేసిన ప్రజల్నే కాదు పార్టీని నమ్ముకుని పనిచేసే నాయకులకు కూడా విలువ లేకపోవడంతోనే టీడీపీకి ఈ దుస్థితి అని ఆ పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి. అధికారంలో ఉన్నంత సేపు ప్రజల్ని మోసగించాం, కష్టపడి పనిచేసే కేడర్‌ను నియంతృత్వ పోకడతో ఇబ్బంది పెడుతున్నాం, ఇక సభలకు, సమావేశాలకు జనాలు, పార్టీ శ్రేణులు ఎందుకొస్తారు, ఎవరు తీసుకొస్తారనే వాదన ఆ పార్టీలోనే మొదలైంది. వాస్తవంగా టీడీపీ మినీ మహానాడును భారీ జన సమీకరణతో నిర్వహించాలని జిల్లా నాయకత్వం భావించింది. అందుకు తగ్గ సన్నాహాక సమావేశాలు కూడా నిర్వహించుకుంది. ఎవరెవరు ఎక్కడెక్కడ నుంచి ఎంతమందిని తీసుకురావాలి అనేదానిపై ప్లాన్ చేసుకున్నారు. కానీ, వారి వ్యూహాలు బెడిసికొట్టాయి. ప్రజలే కాదు టీడీపీ సానుభూతి పరులు కూడా ఆసక్తి చూపలేదు. మినీ మహానాడుకు ముఖం చాటేశారు. ప్రజల నుంచి స్పందన లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని టీడీపీ శ్రేణులు విశ్లేషించుకుంటున్నాయి. ఎన్ని ఏర్పాట్లు చేసినా, ఎంత హడావుడి చేసినా స్పందన లేకపోవడం చూసి ఇంతవరకు తమకున్నది వాపే తప్ప బలుపు కాదనే విషయం స్పష్టమవుతోందని పలువురు చర్చించుకున్న పరిస్థితి కన్పించింది. గొండు, మామిడిలకు అవమానం శ్రీకాకుళం, పాతపట్నం, ఎచ్చెర్ల నియోజకవర్గాల నుంచి టికెట్ రేసులో ఉన్న గొండు శంకర్, మామిడి గోవిందరావు, కలిశెట్టి అప్పలనాయుడే ప్రస్తుతం పార్టీలో యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. తమకు టిక్కెట్ వస్తుందన్న ఆశతో భారీగా ఖర్చు పెట్టి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కానీ, పార్టీ అధిష్టానం గానీ, జిల్లా నాయకత్వం గానీ గుర్తించడం లేదు. అయినప్పటికీ ఏదో ఒక రోజున పార్టీ గుర్తించక మానదా అని లక్షలు ఖర్చు పెట్టి, పార్టీ ఫండ్ కింద లక్షలాది రూపాయలిచ్చి ప్రజల్లో ఉంటున్నారు. ఎంతో కొంతమందిని తమవైపు తిప్పుకుని పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వీరిని కూడా జిల్లా నాయకత్వంతో పాటు అధిష్టానం తరచూ అవమానాలకు గురి చేస్తోంది. కరివేపాకులా గొండు శంకర్‌ను శ్రీకాకుళం నియోజకవర్గంలో తీసిపారేస్తుండగా, పాతపట్నంలో యూజ్ అండ్ త్రో మాదిరిగా పార్టీ కోసం ఖర్చు పెట్టించుకుని మామిడి గోవిందరావును వదిలేస్తున్నారు. ఇక, ఎచ్చెర్లలో కలిశెట్టి అప్పలనాయుడు పరిస్థితి చెప్పనక్కర్లేదు. కాకపోతే, కాశీకి వెళ్లడం వలన కలిశెట్టి అప్పలనాయుడు బుధవారం మినీ మహానాడుకు హాజరు కాలేదు. అదే ఆయనకు అదృష్టమని చెప్పాలి. లేదంటే తీవ్ర అవమానానికి గురయ్యేవారేమో!. వేదికపైకి పిలవరా..? టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మినీ మహానాడుకు అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు తదితర కీలక నేతలు రావడంతో తమ బలం చూపించి, అధిష్టానం మెప్పు పొందుదామని భావించిన గొండు శంకర్‌కు, మామిడి గోవిందరావుకు తీవ్ర అవమానమే ఎదురైంది. కార్యక్రమం కోసం భారీగా ప్లెక్సీలను దారి పొడవునా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా తమ బలం చూపుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించి తమ వెంట వచ్చిన జనాన్ని తీసుకొచ్చారు. కానీ, జిల్లా నాయకత్వం వీరిని కనీసం గుర్తించలేదు. పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి, కార్లతో శ్రేణులను తీసుకొచ్చిన గొండు శంకర్‌ను, మామిడి గోవిందరావును వేదికపైకి పిలవలేదు. కిందనే కూర్చోమని హుకుం జారీ చేశారు. దీంతో గొండు శంకర్, మామిడి గోవింద వెంట వచ్చిన టీడీపీ శ్రేణులు ఒక్కసారి షాక్‌కు గురయ్యారు. పార్టీ కోసం కష్టపడుతున్న నాయకులను వాడుకుని వదిలేస్తారా? అని ఒక్కసారిగా వారి అనుచరులు అంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు. వచ్చిన కొద్దిపాటి కార్యకర్తలు కూడా వెళ్లిపోవడంతో మినీ మహానాడు సభా ప్రాంగణమంతా ఖాళీ కుర్చీలతో బోసిపోయింది. గొండు శంకర్‌కు, మామిడి గోవిందరావుకే కాకుండా టీడీపీకి అవమానకరంగా సభ సాగింది. టీడీపీ శక్తియుక్తులన్నీ ఉపయోగించి, జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన టీడీపీ మినీ మహానాడు సభ ఇది. టీడీపీ పెద్దలంతా హాజరైన సభకు భారీగా జన సమీకరణ చేశారు. జనం అదే ట్రీట్మెంట్ ఇచ్చారు. అధికారంలో ఉండగా మేలు చేయని పార్టీ...మళ్లీ ఏదో చేస్తుందని ఎలా నమ్మగలమంటూ ప్రజలే కాదు ఆ పార్టీ శ్రేణులు కూడా మొఖం చాటేశాయి. దీంతో కుర్చీలన్నీ ఖాళీగా వెలవెలబోయాయి. జనం లేక చాలాసేపు సభను ప్రారంభించలేని పరిస్థితిని టీడీపీ ఎదుర్కొంది. -
సెల్ఫీలు తీసుకుని బాబు, అశోక్ గజపతిరాజు సెల్ఫిష్ లుగా మారారు : రోజా
-
‘అశోక విలాపం’ ఇప్పుడెందుకు.. ఇన్నాళ్లకు నిద్రలేచి నిందలు వేస్తారా?
సాక్షి,రాజమండ్రి(తూర్పు గోదావరి): 'మీరు అధికారంలో ఉన్నారు.. కేంద్ర మంత్రిగా పనిచేశారు.. అప్పుడు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించలేకపోయారు.. ఇన్నాళ్ళ తరువాత నిద్రలేచి నిందలు వేస్తారా అశోక్ గజపతి రాజు గారూ..' అంటూ వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ సూటిగా ప్రశ్నించారు. వైసీపీ ఎంపీల పనితీరు బాగోలేదని అశోక గజపతి రాజు చేసిన వ్యాఖ్యలను ఎంపీ భరత్ దృష్టికి పలువురు విలేకరులు తీసుకువచ్చారు. ఈ అంశంపై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వంలో అశోక గజపతి రాజు కేంద్ర మంత్రి కదా.. కేబినెట్లో ప్రత్యేక హోదా ఇవ్వం.. స్పెషల్ ప్యాకేజీ ఇస్తాం అన్నప్పుడు ఈ మంత్రి గారు నిద్రపోయారా’ అని ప్రశ్నించారు. ఆ ముంపు మండలాలు ఇస్తేనే సీఎంగా ప్రమాణం చేస్తానన్న చంద్రబాబు ఆనాడు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తేనే సీఎంగా ప్రమాణం, సంతకం చేస్తానంటే అప్పుడే వచ్చేది కదా' అన్నారు. టీడీపీ చంద్రబాబు వల్ల ఈ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందన్నారు. ఆనాడే ప్రత్యేక హోదా ఇవ్వకుంటే ఎన్డీఏ నుండి బయటకు వస్తే.. రాష్ట్రానికి ఈ ఖర్మ ఉండేది కాదన్నారు. మేము అప్పటి టీడీపీ ఎంపీల్లా సన్నాయి నొక్కులు నొక్కడం లేదని, అవకాశం వచ్చినప్పుడల్లా కేంద్ర ప్రభుత్వాన్ని మొహమాటం లేకుండా నిలదీస్తూనే ఉన్నామన్నారు. ఉత్తర కుమారా..లోకేష్ నీకతేంది? ఉత్తర ప్రగల్భాలు పలుకుతున్న ఉత్తర కుమారా.. లోకేష్ అసలు నీ కతేందీ.. ధరలు పెరిగాయని ఈ గందర గోళం ఏమిటని ఎంపీ భరత్ ప్రశ్నించారు. అసలు నీ భాష ఏంటో, నీ బాధ ఏంటో మాకు సరే.. నీ కూడా తిరిగే వారికే అర్థం కాదన్నారు. యువగళమా అది గందరగోళమో అర్థం కావడం లేదన్నారు. నీ కుటుంబ సభ్యులకు అక్షరాభ్యాసం చేసేటప్పుడు అయినా బూతులు రాకుండా చూసుకో.. మొన్నా మధ్య సోషల్ మీడియాలో ఒక పోస్ట్ హల్చల్ అవుతుంటే చూస్తే.. ఏందిరా బాబూ.. ఆ అక్షరాలు దిద్దించడం.. అసలు ఫస్ట్ నువ్వు అక్షరాలు నేర్చుకో అంటూ హితబోధ చేశారు. కాపురం చూస్తే తెలంగాణాలో.. రాజకీయ డ్రామాలు ఆంధ్రప్రదేశ్ లోనా, మీలాంటి వారి చేతిలో ఎలా ఈ రాష్ట్రాన్ని పెడతారని అనుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు. ఏపీలో ప్రజలు చాలా విజ్ఞులని, గతంలో చేసిన మీ పాలన చూశాక మళ్ళా ఈ రాష్ట్ర ప్రజలు అధికారం ఇస్తారని ఎలా అనుకుంటున్నారని ప్రశ్నించారు. నేనెప్పుడూ..సూపర్ స్టార్ నే ఎంపీ రఘురామ రాజు చేసిన వ్యాఖ్యలపై ఎంపీ భరత్ స్పందించారు. నేను ఏక చిత్ర నటుడినైనా.. హీరోనే.. చేయాలనుకుంటే ఎన్ని సినిమాలోనైనా హీరోగా నటిస్తా, ప్రజలను మెప్పిస్తా.. సూపర్ స్టార్ అనిపించుకుంటా అన్నారు. నీకూ ఒక కామెడీ క్యారెక్టర్ ఇప్పిస్తా..గోచీ పెట్టుకుంటావు కదా అంటూ ఎద్దేవా చేశారు. అరటి ఆకు స్టోరీ.. పార్లమెంటరీలో అందరూ నవ్వుకున్నారు.. నోరు అదుపులో పెట్టుకో రఘూ అంటూ ఎంపీ భరత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అభివృద్ధిని స్వాగతించండి.. విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో రూ.13లక్షల కోట్ల ఎంఓయూలు వచ్చాయని, ఇవి చూసి ప్రతిపక్షాలు ఏడుస్తున్నాయని ఎంపీ భరత్ వ్యాఖ్యానించారు. రాయలవారి కొలువులో అష్ట దిగ్గజాల మాదిరిగా దేశ విదేశాల నుండి ఎందరో పారిశ్రామిక దిగ్గజాలు వస్తే..అభినందించడం పోయి దీనికి కూడా వారి సహజసిద్ధమైన విమర్శలు చేయడం ప్రతిపక్షాల నైజాం బయటపడిందన్నారు. ఆరోగ్యకరమైన విమర్శలు ప్రగతికి దోహదపడతాయి కానీ..ఇలా ప్రతీ దానికీ విమర్శిస్తే ప్రజల్లో నవ్వులపాలవుతారని ఎంపీ భరత్ అన్నారు. చదవండి: నాడు కూలీ... నేడు ఓనర్! కాదేది అతివకు అసాధ్యం -
ఆస్పత్రికి అశోక్ గజపతిరాజు కుటుంబం గజం భూమి ఇవ్వలేదు : కోలగట్ల
-
పవర్ఫుల్ లీడర్ పవర్‌ను టీడీపీ జీరో చేసిందా.. రాజుగారి పరిస్థితేంటి?
ఆ రాజుగారి గతం ఎంతో ఘనం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన రాజుగారి ప్రస్తుత పరిస్థితి దయనీయంగా మారింది. ఆయన ప్రభ మసకబారింది. పదవుల్లో ఉన్నపుడు రూల్స్ గురించి చెప్పారు. ఇప్పుడు తెలుగు తమ్ముళ్ళు తనను పట్టించుకోవడంలేదని బాధపడుతున్నారు. విజయనగరం జిల్లా తెలుగుదేశంలో ఒకప్పుడు పూసపాటి అశోకగజపతి రాజు చెప్పిందే వేదం. జిల్లా నాయకులు, కేడర్ అంతా రాజుగారిని కలసి వెళ్ళేందుకు పడిగాపులు కాసేవారు. అంతటి మోస్ట్ పవర్ ఫుల్ పొలిటీషియన్‌గా ఆయన వెలిగారు. ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో 40ఏళ్ల పాటు పదవులు నిర్వహించినా... ఒంటినిండా రాజరికపు దర్పం మాత్రం కొనసాగుతోంది. రాజావారి నియంత్రత్వ పోకడలు ఇన్నాళ్లూ ఎలాగో గడిచిపోయాయి. ఇంతకాలం హీరో అనిపించుకున్న ఈయన్ను ఇప్పుడు టిడిపి ఢమాల్న కింద పడేసి జీరోని చేసిందని తెగ ఫీల్ అయిపోతున్నారు. ఇటీవల మంగళగిరి పార్టీ ఆఫీసులో జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో తనను జిల్లా నాయకులు ఎవరూ పట్టించుకోవడం లేదని, సపోర్ట్ చేయడం లేదని చంద్రబాబు ఎదుట గగ్గోలు పెట్టారు. జిల్లాలో టిడిపి నియోజకవర్గ ఇన్చార్జిలు, సీనియర్ నాయకులు సొంతూరు విజయనగరంకు చెందిన మీసాల గీతతో సహా జిల్లాలోని ఏ నియోజకవర్గానికి చెందిన నాయకులూ అశోక్‌గజపతి రాజుకు విలువ ఇవ్వడంలేదని అర్థమవుతోంది. అధికార పదవుల్లో ఉన్నపుడు తన అధికార దర్పాన్ని చూపించడం తప్ప ఏనాడూ అక్కడి నాయకులు, కార్యకర్తలను రాజుగారు పట్టించుకోలేదు. రాష్ట్ర పదవుల్లో ఉన్నపుడు గాని..కేంద్రమంత్రిగా ఉన్నపుడు గాని తెలుగుదేశం పార్టీ రాజకీయాలను తన తోట బంగ్లా లోపలే కట్టిపడేసారు. నాయకులు, కార్యకర్తలతో అశోక్ వ్యవహరిస్తున్న తీరును చంద్రబాబుకు చెప్పినా ఆయనా ఎప్పుడూ పట్టించుకోలేదు. ఇప్పుడు రాజుగారికి గౌరవం ఇవ్వండని...పార్టీ అధినేత చంద్రబాబు చెప్పినా కేడర్ పట్టించుకునే పరిస్థితి లేదు. పలు వివాదాల్లో చిక్కుకుని, పోలీసు కేసులు, కోర్టు కేసుల్లో ఇరుక్కున్నా, జిల్లా నాయకుల్లో ఎవరూ అశోక్ పట్ల కనీస సానుభూతి చూపించడం లేదు. దీంతో ఒక నాయకుడికి కార్యకర్తల అవసరం ఎంతఉంటుందో... అశోక్ గజపతి రాజుకు తొలిసారి అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది. పదవుల్లో ఉన్నపుడు జిల్లా నాయకులు, కార్యకర్తలకు తాను ఇచ్చిందే.. వారు ఇప్పుడు తనకు తిరిగి ఇస్తున్నారని ఆయనకు అర్థమవుతోంది. అధికారం పోయి.. పరువు పోగొట్టుకుని బంగ్లా గేటు బయటకు వచ్చి నాపై సానుభూతి చూపించండయ్యా అని అందరినీ వేడుకోవాల్సి వస్తుంది. కానీ కేడర్ మాత్రం ఆయన పట్ల కనికరం చూపించే పరిస్థితి కనిపించడం లేదు. అశోక్ గజపతి రాజు అవుట్ డేటెడ్ పోలిటిక్స్ ఇప్పటి కాలంలో చెల్లుబాటు కావని జిల్లాలో టాక్ వినిపిస్తోంది. -
విజయనగరం కోటలో అలజడి: ఆయన రాజ్యంలో ఏం జరుగుతోంది?
ఆ కోటలో రాజుగారికి తిరుగు లేదు. ఆ వూరిలో రాజుగారు చెప్పిందే వేదం, చేసిందే చట్టం. కాని కొద్ది రోజులుగా రాజు మీద తిరుగుబాటు మొదలైంది. పార్టీలో పోరు ప్రారంభమైంది. అధినాయకత్వం రాజు వెంట... కార్యకర్తలు బీసీ నేత వెంటా నడుస్తున్నారు. ఇంతకీ ఆ రాజు ఎవరో..ఆయన రాజ్యంలో ఏం జరుగుతోంది? విజయనగరం కోటలో అలజడి రేగింది. గత ఎన్నికల వరకు విజయనగరం జిల్లాలో పూసపాటి వారి మాటకు ఎదురు లేదు. వారు చెప్పిందే చట్టం. అయితే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జిల్లా నుంచి తుడిచిపెట్టుకుపోయింది. అయినప్పటికీ రాజుగారి మాటే తెలుగుదేశం పార్టీలో వేదంగా కొనసాగుతోంది. 2014లో విజయనగరం అసెంబ్లీ సీటుకు టీడీపీ తరపున పోటీ చేసిన మీసాల గీత విజయం సాధించారు. ఆమె ఇటీవల రాజుగారికి వ్యతిరేకంగా ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. బీసీలు ఎక్కువగా ఉన్న విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో బీసీలకే టికెట్ ఇవ్వాలన్నది ఆమె డిమాండ్. ఈ నేపథ్యంలో అశోక్ గజపతి రాజు నిర్వహిస్తున్న కార్యక్రమాలకు ఆమె డుమ్మా కొడుతున్నారు. 2014లో అశోక్‌గజపతి రాజు లోక్‌సభకు పోటీ చేయగా... మీసాల గీత అసెంబ్లీకి పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో ఇద్దరూ గెలిచారు. గత ఎన్నికల్లో గీతకు సీటు ఇవ్వలేదు. లోక్‌సభకు అశోక్‌గజపతి, అసెంబ్లీకి ఆయన కుమార్తె పోటీ చేశారు. ఇద్దరు ఓడారు. వచ్చే ఎన్నికల్లో మీసాల గీత.. తనకే టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తన డిమాండ్‌ను, బీసీల జనాభా సంఖ్యను ఆధారాలతో పార్టీ అధినేత చంద్రబాబుకు ఆమె అందించారు. అలాగే చూద్దాం అంటూ ఆమెకు హామీ ఇచ్చిన చంద్రబాబు.. తర్వాత అశోక్ చెప్పిన మాటే వింటున్నారని తెలుగు తమ్ముళ్లు చెప్పుకుంటున్నారు. అసలే జిల్లాలో పార్టీ వీక్‌గా ఉందంటే ఇదేం గొడవ అని తలలు పట్టుకుంటున్నారు. ఈ గొడవలన్నీ ఇలా ఉండగానే.. కోట బయట మీసాల గీత పార్టీ ఆఫీస్ పెట్టగా దాన్ని అశోక్ తొలగించారు. ఆపై తన దివాణంలోనే ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ విషయంలో కూడా గీత మాట చెల్లలేదు. చంద్రబాబు గోడ మీద కూర్చుని వినోదం చూస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయనగరం నియోజకవర్గంలో ఉన్న బీసీల జనాభాను కులాలవారీగా ఫ్లెక్సీల రూపంలో పట్టణంలో అనేక చోట్ల ఏర్పాటయ్యాయి. రాజుగారి కోట బయట కూడా ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో బీసీలు లక్షా అరవై వేల మంది ఉన్నారని.. రాజ్యాధికారం బీసీలకే ఇవ్వాలంటూ బీసీ ఐక్యవేదిక పేరుతో వెలసిన ఫ్లెక్సీలు పట్టణంలో కలకలం రేపాయి. అయితే ఈ ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేశారన్న దానిపై క్లారిటీ లేదు. అయితే ఇది మీసాల గీత వర్గీయుల పనే అంటూ అశోక్ గజపతి వర్గం ఎటాక్ ప్రారంభించింది. అయితే జిల్లాలో అశోక్‌గజపతి రాజు మాట కాదని చంద్రబాబు ఏమీ చేయలేరనే విషయం అందరికీ తెలుసు. 2014లో గెలిచినప్పటికీ తనకు 2019లో మెండి చేయి చూపిన టీడీపీ అధినాయకత్వం మీద మీసాల గీత తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు సీటు ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేయడానికి సిద్ధమనే సంకేతాలు ఇస్తున్నారు. -
టీడీపీలో కలవరపెడుతున్న ఫ్లెక్సీలు
-
విజయనగరం టీడీపీలో ఫ్లెక్సీ వార్.. అశోక్ గజపతి రాజుపై ధిక్కార స్వరం
సాక్షి, విజయనగరం: విజయనగరం టీడీపీలో విభేదాలు మదిరిపాకాన పడ్డాయి. మాజీ మంత్రి అశోక్ గజపతి రాజుపై బీసీ మహిళా, మాజీ ఎమ్మెల్యే మీసాల గీత గత కొద్ది రోజుల క్రితం ధిక్కార స్వరం వినిపించారు. బీసీలు ఎక్కువగా ఉన్న విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో బీసీలకే టికెట్ ఇవ్వాలన్నది ఆమె డిమాండ్. ఈ నేపథ్యంలో అశోక్ గజపతి రాజు నిర్వహిస్తున్న కార్యక్రమాలకు ఆమె డుమ్మా కొడుతున్నారు. నేరుగా చంద్రబాబుతోనే అమె టచ్‌లో ఉంటున్నారు. చదవండి: ‘చంద్ర’గ్రహణం వీడుతున్న కుప్పం మరోపక్క నియోజకవర్గంలో అశోక్ గజపతి రాజును వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో బీసీలు లక్షా అరవైవేల మంది ఉన్నారంటూ, రాజ్యాధికారం బీసీలకే ఇవ్వండంటూ బీసీ ఐక్యవేదిక పేరుతో ఫ్లెక్సీలు విజయనగరం పట్టణంలో కీలక ప్రాంతాల్లో వెలిశాయి. అయితే ఈ ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేశారు అన్నదానిపై ఇంకా క్లారిటీ లేదు. అయితే ఇది మీసాల గీత వర్గీయుల పనే అంటూ అశోక్ గజపతి వర్గం కౌంటర్ ఎటాక్ మొదలు పెట్టింది. -
అశోక్ గజపతిరాజుకు 41ఏ సీఆర్పీసీ నోటీసులు
విజయనగరం: రామతీర్థం ఘటనకు సంబంధించి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అశోక్‌గజపతిరాజుకు 41ఏ సీఆర్పీసీ నోటీసులను పోలీసులు అందజేశారు. అవసరమైనప్పుడు విచారణకు హాజరుకావాలని పోలీసుల నోటీసులు ఇచ్చారు. కాగా,, రెండో భద్రాద్రిగా భాసిల్లుతున్న విజయనగరం జిల్లా రామతీర్థం బోడికొండపై కోదండ రామస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు టీడీపీ నేత పూసపాటి అశోక్ గజపతిరాజు అడ్డు తగిలి వీరంగం సృష్టించిన సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం శంకుస్థాపన సమయానికి ముందుగానే కొందరు టీడీపీ కార్యకర్తలను వెంటబెట్టుకుని ఆయన బోడికొండ పైకి చేరుకున్నారు. రామతీర్థం దేవస్థానం తన పూర్వీకులదని, అభివృద్ధి పనులకు ప్రభుత్వం ఎలా శంకుస్థాపన చేస్తుందంటూ దేవదాయ శాఖ అధికారులపై చిందులేశారు. శంకుస్థాపన కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని కిందకి తోసేశారు. అనువంశిక ధర్మకర్తనైన తనకు తెలియకుండా ముహూర్తం ఎలా నిర్ణయిస్తారంటూ కేకలు వేశారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న మంత్రులతో వాగ్వాదానికి దిగారు. ఆలయ ఈవో ప్రసాద్ ఫిర్యాదు మేరకు నెలిమర్ల పోలీస్ స్టేషన్లో అశోక్ గజపతిరాజు కేసు నమోదైన సంగతి తెలిసిందే. రామతీర్థంలో రామాలయ పునర్నిర్మాణ శంకుస్థాపనను అడ్డుకొని ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించారని అశోక్‌గజపతిరాజుపై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అశోక్‌గజపతిరాజుపై 427, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీనిలో భాగంగా తాజాగా అశోక్ గజపతిరాజుకు అవసరమైనప్పుడు విచారణకు హాజరుకావాల్సి ఉంటుందంటూ 41ఏ సీఆర్పీసీ నోటీసులు ఇచ్చారు. -
అశోక్ గజపతిరాజుపై కేసు నమోదు చేసిన పోలీసులు
-
అశోక్‌గజపతిరాజుపై కేసు నమోదు
విజయనగరం: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అశోక్‌గజపతిరాజుపై కేసు నమోదైంది. బుధవారం రామతీర్థం ఘటన నేపథ్యంలో ఆలయ ఈవో ప్రసాద్ ఫిర్యాదు మేరకు నెలిమర్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రామతీర్థంలో రామాలయ పునర్నిర్మాణ శంకుస్థాపనను అడ్డుకొని ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించారని అశోక్‌గజపతిరాజుపై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అశోక్‌గజపతిరాజుపై 427, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. చదవండి: బోడికొండపై 'దండు'యాత్ర.. కాగా, రెండో భద్రాద్రిగా భాసిల్లుతున్న విజయనగరం జిల్లా రామతీర్థం బోడికొండపై కోదండ రామస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు టీడీపీ నేత పూసపాటి అశోక్ గజపతిరాజు అడ్డు తగిలి వీరంగం సృష్టించిన సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం శంకుస్థాపన సమయానికి ముందుగానే కొందరు టీడీపీ కార్యకర్తలను వెంటబెట్టుకుని ఆయన బోడికొండ పైకి చేరుకున్నారు. రామతీర్థం దేవస్థానం తన పూర్వీకులదని, అభివృద్ధి పనులకు ప్రభుత్వం ఎలా శంకుస్థాపన చేస్తుందంటూ దేవదాయ శాఖ అధికారులపై చిందులేశారు. శంకుస్థాపన కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని కిందకి తోసేశారు. అనువంశిక ధర్మకర్తనైన తనకు తెలియకుండా ముహూర్తం ఎలా నిర్ణయిస్తారంటూ కేకలు వేశారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న మంత్రులతో వాగ్వాదానికి దిగారు. -
అశోక్ గజపతిరాజు హుందాగా వ్యవహరించాలి:మంత్రి వెల్లంపల్లి
-
దేవుడి ఆలయాన్ని సర్కస్ కంపెనీ అంటారా..?: మంత్రి వెల్లంపల్లి
సాక్షి, విజయనగరం: పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం నీలాచలం బోడికొండపై ఆలయ ధర్మకర్త అశోక్‌గజపతిరాజు వీరంగం సృష్టించడంపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. 'అశోక్ గజపతి రాజు హుందాగా వ్యవహరించాలి. ఆలయ ధర్మకర్తగా ఆలయ అభివృద్ధిని అడ్డుకోవడం హేయమైన చర్య. ధర్మకర్త అని చెప్పుకోవడమే తప్ప దేవాలయాన్ని ఏనాడైనా అభివృద్ధి చేశారా?. రాష్ట్ర ప్రభుత్వం రాతి ఆలయాన్ని పటిష్టంగా నిర్మిస్తుంటే సర్కస్ కంపెనీ అని అశోక్ గజపతి అనడంపై చర్యలు తీసుకొవడం జరుగుతుంది. ఏం జరగకపోయినా ఏదో జరిగినట్లు అశోక్‌గజపతిరాజు రాద్ధాంతం చేస్తున్నారు. ఇన్నాళ్లు ఆలయ అభివృద్ధి చేయకపోవడం, ఇప్పుడు ఆలయ నిర్మాణాన్ని అడ్డుకోవడం చూస్తుంటే రాముని విగ్రహం ధ్వంసంలో వీళ్ల పాత్ర ఉందేమోనని అనుమానం కలుగుతోంద'ని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. చదవండి: (రామతీర్థం బోడికొండపై అశోక్‌గజపతిరాజు వీరంగం) -
రామతీర్థం బోడికొండపై అశోక్‌గజపతిరాజు వీరంగం
సాక్షి, విజయనగరం: పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం నీలాచలం బోడికొండపై రూ.3కోట్ల వ్యయంతో నిర్మించనున్న శ్రీ కోదండ రామాలయ పునఃనిర్మాణానికి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఉపముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణితోపాటు జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, దేవస్థాన అధికారులు హాజరయ్యారు. శంకుస్థాపన అనంతరం వించ్ మోటారు సహకారంతో ట్రాక్ మీదుగా శిలా ఖండాలను ఒక్కొక్కటిగా కొండపైకి చేరవేసి ఆలయాన్ని నిర్మించడానికి ఏర్పాట్లు చేశారు. మండపంతోపాటు ధ్వజస్తంభం, ఆలయ ప్రాకారం, వంటశాలను నిర్మించనున్నారు. నీటి కొలను సుందరీకరణ, మెట్ల మార్గం ఆధునికీకరిస్తారు. శంకుస్థాపన అనంతరం ఆరు నెలల్లో నిర్మాణం పూర్తి చేసేందుకు దేవదాయశాఖ ఇంజినీరింగ్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రస్తుతం దిగువున ప్రధాన ఆలయంలో ఏర్పాటు చేసిన బాలాలయంలో కోదండ రాముడు నిత్య పూజలు అందుకుంటున్నాడు. కొండపై నిర్మాణం పూర్తయిన వెంటనే విగ్రహాలను నూతన ఆలయంలో పునఃప్రతిష్టిస్తారు. అశోక్‌గజపతిరాజు వీరంగం రామతీర్థం బోడికొండపై అశోక్ గజపతి రాజు వీరంగం సృష్టించారు. దుండగులు ధ్వంసం చేసిన ఆలయాన్ని ప్రభుత్వం నిర్మించడాన్ని అశోక్ గజపతి రాజు తప్పుబట్టారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేరున ఉన్న శిలాఫలకాన్ని తొలగించాలని అశోక్ అధికారులపై చిందులు తొక్కారు. ఆ క్రమంలోనే శంకుస్థాపం బోర్డును సైతం అశోక్‌గజపతిరాజు పీకిపారేశారు. -
అశోక్‌గజపతిరాజు వీరంగం
-
మాన్సాస్ ట్రస్టు: సుమారు 846 ఎకరాల భూమిని అన్యాక్రాంతం చేశారు
-
మాన్సాస్ ట్రస్టు: సుమారు 846 ఎకరాల భూమిని అన్యాక్రాంతం చేశారు
విశాఖపట్నం: సింహాచలం దేవస్థాన ఆస్తులను కాపాడుతామని రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అశోక్ గజపతి రాజు మాన్సాస్ ట్రస్టు చైర్మన్‌గా ఉన్నప్పుడు దేవస్థానానికి సంబంధించి రూ. 8 వేల కోట్లను దోచుకున్నారని మండిపడ్డారు. ఇంతటి అవినీతికి పాల్పడిని అశోక్ గజపతిరాజు ధర్మకర్త? అధర్మకర్తా? అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాగా, సుమారు 846 ఎకరాల దేవస్థాన భూమిని అన్యాక్రాంతం చేశారని విమర్షించారు. త్వరలోనే భూ సమస్యను పరిష్కారిస్తామని ఎంపీ విజయ సాయిరెడ్డి పేర్కొన్నారు. చదవండి: ఏపీ పోలీస్ శాఖకు 5 జాతీయ అవార్డులు: డీజీపీ గౌతమ్ సవాంగ్ -
ఏపీ హైకోర్టులో ఊర్మిళ గజపతిరాజు పిటిషన్
-
‘అశోక గజపతిరాజును చైర్మన్‌గా తొలగించాలి’
సాక్షి, అమరావతి: మాన్సాస్ ట్రస్ట్ చైర్‌పర్సన్‌గా తనను నియమించేలా ఆదేశాలివ్వాలంటూ ఊర్మిళ గజపతిరాజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్భంగా ఊర్మిళ తరఫున లాయర్ మాట్లాడుతూ.. ఆనంద గజపతి రాజు మొదటి భార్య కుమార్తె సంచాయతిను.. రెండో భార్య కుమార్తె ఊర్మిలనును ప్రభుత్వం వారసులుగా గుర్తించిందని కోర్టుకు తెలిపాడు. కనుక అశోక గజపతి రాజును చైర్మన్‌గా తొలగించి.. ఆ స్థానంలో ఊర్మిళ గజపతి రాజును చైర్మన్‌గా నియమించాలని న్యాయవాది కోర్టును కోరారు. ఈ వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. -
మాన్సాస్ జీతాల వివాదం: చోద్యం చూస్తున్న అశోక్ గజపతిరాజు
సాక్షి, విజయనగరం: మాన్సాస్ ట్రస్ట్ ఆధీనంలోనున్న 12 విద్యాసంస్థల సిబ్బంది, ఉద్యోగుల జీతాల వ్యవహారం చినికిచినికి గాలివానలా మారుతోంది. ట్రస్టు చైర్మన్ హోదాలో దీన్ని పరిష్కరించాల్సిన టీడీపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు చోద్యం చూస్తున్నారు. ఇదే అదనుగా ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు నిరాటకంగా చేస్తూనే ఉన్నారు. సంచయిత నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లిన ఆయన సానుకూల తీర్పునే పొందారు. చైర్మన్‌గా పునర్నియామకమై దాదాపు రెండు నెలలైనా ట్రస్టు బోర్డును మాత్రం పట్టించుకోలేదు. కనీసం బోర్డు సమావేశాన్నీ ఏర్పాటు చేయలేదు. నిబంధనల ప్రకారం బోర్డు తీర్మానాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉండగా ఏకపక్షంగానే వ్యవహరిస్తున్నారు. ఉద్యోగుల జీతాలకు సంబంధించి ఇన్నాళ్లూ విద్యా సంస్థల కరస్పాండెంట్‌గా నిర్ణయాలు తీసుకుంటున్న కేవీఎల్ రాజు పూర్తిగా ముఖం చాటేస్తున్నారు. కరస్పాండెంట్‌తో సంయుక్తంగా చెక్ పవర్ ఉన్న చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ (సీఎఫ్ఓ) హర్నీద్ర ప్రతాప్ సింగ్‌ను బోర్డు తీర్మానంతో సంబంధం లేకుండా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా బాధ్యతల నుంచి తప్పించేశారు. అశోక్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన రెండురోజులకే ఆ నిర్ణయం జరిగిపోయింది. బ్యాంకింగ్ లావాదేవీల్లో జాయింట్ చెక్ పవర్ ఉన్న అధికారిని తొలగించేస్తే ఆ స్థానంలో మరొకరిని నియమించాల్సి ఉంది. అదీ బోర్డు తీర్మానంతో జరగాలి. బోర్డును సమావేశపరచకుండా ఈ రెండు నెలలూ నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించిన అశోక్ గజపతిరాజు... ఉద్యోగుల జీతాలు నిలిచిపోయినందుకు నెపాన్ని ప్రభుత్వంపై నెట్టేసే ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇదీ పరిస్థితి... ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాల, ఎంఆర్ కళాశాల, ఎంఆర్ మహిళా కళాశాల, ఎంఆర్ ఫార్మసీ, ఎంఆర్ పీజీ, మాన్సాస్ ఇంగ్లిష్ మీడియం తదితర 12 విద్యాసంస్థలు మాన్సాస్ ట్రస్ట్ పరిధిలోనే నిర్వహిస్తున్నారు. ఈ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న దాదాపు 800 మంది ఉద్యోగులు, సిబ్బందికి జీతాల చెల్లింపుల ప్రక్రియను మొదటి నుంచి విద్యా సంస్థల కరస్పాండెంట్ చూసుకుంటున్నారు. ఆ ఖర్చుల కోసం బోర్డు తీర్మానంతోనే నిధులు విడుదలవుతాయి. ట్రస్ట్ కార్యకలాపాలన్నీ సవ్యంగా జరిగేలా పర్యవేక్షించడానికి ప్రభుత్వం ఒక కార్యనిర్వాహణాధికారి (ఈవో)ను నియమిస్తోంది. బోర్డు తీర్మానం మేరకు రూ. 3.50 కోట్ల ఫండ్‌ను మొదటి విడతలో, మరో రూ.2.50 కోట్ల రివాల్వింగ్ ఫండ్‌ను రెండవ విడతలో ఈఓ ఏటా విడుదల చేస్తున్నారు. ఈ మొత్తాన్ని ఏవిధంగా వినియోగించారన్నదీ విద్యా సంస్థల కరస్పాండెంట్ ఈఓకు యుటిలైజేషన్ సర్టిఫికెట్ల (యూసీల)ను సమర్పిస్తున్నారు. ఇదీ ఏటా జరుగుతున్న ప్రక్రియే. కానీ కొన్ని దశాబ్దాలుగా ఆడిటింగ్ జరగకపోవడంతో ట్రస్టులో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రస్టులో ప్రక్షాళన ప్రారంభించింది. చట్టం ప్రకారం ట్రస్టులో నియామకాలు చేపట్టింది. విచ్చలవిడిగా నిధుల వ్యయానికి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో బోర్డు తీర్మానం మేరకు సీఎఫ్ఓను నియమించింది. కరస్పాండెంట్, సీఎఫ్ఓల జాయింట్ అకౌంట్ ద్వారా జీతాలు, ఇతర ఖర్చుల వ్యవహారాలు జరిపించాలని ఆదేశాలు జారీ చేసింది. వారిద్దరి నిర్ణయాలతో గత ఏడాదిగా మాన్సాస్ ట్రస్టు విద్యాసంస్థల్లో ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపు ప్రక్రియ జరుగుతోంది. అశోక్ సహా 11 మందిపై కేసు నమోదు మాన్సాస్ ట్రస్టు ఉద్యోగులు దాడి చేశారంటూ ఈఓ డి.వెంకటేశ్వరరావు విజయనగరం వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి ప్రేరేపించిన అశోక్, కరస్పాండెంట్‌తో పాటు దాడి చేయడంతో పాటు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన పది మంది ఉద్యోగులపై కేసు నమోదు చేసినట్టు సీఐ జె.మురళీ వెల్లడించారు. అశోక్ పునరాగమనంతో చిక్కుముడి.. మాన్సాస్ ట్రస్టుకు చైర్మన్‌గా సంచయితను నియమిస్తూ ప్రభుత్వం 2020 మార్చి 3వ తేదీన జీఓలు 73, 74 జారీ చేసింది. అదే సమయంలో మాన్సాస్ బోర్డు సభ్యులను నియమిస్తూ జీఓ 75ను విడుదల చేసింది. ఈ బోర్డులో అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజు, ఆనంద గజపతిరాజు కుమార్తె ఊర్మిళా గజపతిరాజుతో పాటు ఆర్వీ సునీత ప్రసాద్, అరుణ్ కపూర్, విజయ్ కె.సోంథీ, విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ సభ్యులుగా ఉన్నారు. మాన్సాస్ ట్రస్టు చైర్మన్ పదవి నుంచి తనను తప్పించడాన్ని సవాల్ చేస్తూ అశోక్ హైకోర్టును ఆశ్రయించారు. జీఓలు 73, 74లను సవాల్ చేశారు. అయితే, ఆయన పిటిషన్లో బోర్డుకు సంబంధించిన జీఓ 75ను ప్రస్తావించలేదు. హైకోర్టు జీఓలు 73, 74లను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. ఆ ప్రకారం అశోక్ చైర్మన్‌గా తిరిగి బాధ్యతలు చేపట్టారు. అయితే, బోర్డును మాత్రం ఇప్పటివరకూ సమావేశపరచిన దాఖలాల్లేవు. బోర్డు తీర్మానం లేకుండానే సీఎఫ్ఓను అశోక్ ఏకపక్షంగా తొలగించేశారు. పూర్వ పద్ధతిలోనే కరస్పాండెంట్ జీతాలు చెల్లించాలని ఆదేశించారు. కానీ నిబంధనల ప్రకారం కరస్పాండెంట్‌తో పాటు సీఎఫ్ఓ కూడా సంతకం చేస్తేనే బ్యాంకు నుంచి విత్‌డ్రా కుదరని పరిస్థితి ఏర్పడింది. అది సవ్యంగా జరిగితేనే డబ్బులు ఇస్తామని బ్యాంకులు తేల్చి చెప్పేశాయి. బ్యాంకులతో ఏర్పడిన చిక్కుముడికి తానే కారణమన్న విషయాన్ని అశోక్, కరస్పాండెంట్ కేవీఎల్ రాజు రాజకోట రహస్యం చేసేశారు. జీతాలు నిలిచిపోవడానికి కారణం ఈఓనే అంటూ ఉద్యోగులను ఉసిగొల్పడం గమనార్హం. జీతాల చెల్లింపు మా పరిధి కాదు... నిబంధనల మేరకు ట్రస్ట్‌లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నా బోర్డు ఆమోదం తప్పనిసరి. విద్యాసంస్థల జీతాల చెల్లింపు అంతా కరస్పాండెంట్ చూస్తున్నారు. ఈఓగా కేవలం నిధుల కేటాయింపు వరకే చూస్తాం. బోర్డు సమావేశం నిర్వహించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నా ఇప్పటివరకూ జరగలేదు. చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత బోర్డు సమావేశం గురించి మాకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. కొత్త సీఎఫ్ఓ ఎవరో ఇప్పటివరకూ నిర్ణయం తీసుకోలేదు. కరస్పాండెంట్, సీఎఫ్ఓ సంతకాలు చేస్తేనే బ్యాంకుల నుంచి ఉద్యోగులకు జీతాల సొమ్ము విడుదల అవుతుంది. – డి.వెంకటేశ్వరరావు, ఈఓ, మాన్సాస్ ట్రస్టు -
కాలేజీ పేరుతో కాజేశారు
సాక్షి, అమరావతి: మెడికల్ కాలేజీ ముసుగులో టీడీపీ పెద్దలు వందల ఎకరాల మాన్సాస్ భూములను అమ్మేశారు. మెడికల్ కాలేజీ ఏర్పాటుకు కనీసం దరఖాస్తు కూడా చేయకపోగా ఆ పేరుతో విశాఖ నగరానికి సమీపంలో మాన్సాస్ ట్రస్టు పేరిట ఉన్న 150.09 ఎకరాలను, మరో 1,430 చదరపు గజాల వాణిజ్య భూమి కారుచౌకగా తమకు కావాల్సిన వారికి కట్టబెట్టేయడం గమనార్హం. 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే ‘ముఖ్య’నేత ఈ భారీ మాయకు తెరతీస్తే మాన్సాస్ ట్రస్టు చైర్మన్‌గా ఉన్న అశోక్ గజపతిరాజు తన వంతు సహాయ సహకారాలను అందజేశారు. సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, మాన్సాన్ ట్రస్టులలో చోటు చేసుకున్న అక్రమాలపై దేవదాయ శాఖ ముగ్గురు ఉన్నతాధికారులతో ప్రాథమిక విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక అందచేయడం తెలిసిందే. విజయనగరంలో మెడికల్ కాలేజీ పేరుతో మాన్సాస్ ట్రస్టు భూముల విక్రయాల్లో జరిగిన అక్రమాలను నివేదికలో పేర్కొన్నారు. మన భూమి అయితే ఇలాగే అమ్ముతామా..? భూమిని అమ్ముకుంటే ఎవరైనా సరే పూర్తి విస్తీర్ణం మేరకు లెక్కగట్టి డబ్బులు తీసుకుంటారు. ఆ స్థలంలో రోడ్లు వేసేందుకు కొంత భూమి కేటాయించాల్సి వస్తే అంతమేరకు తగ్గించుకుని డబ్బులు తీసుకుంటారా? ఒకవేళ అలా చేయాల్సి వస్తే ఇళ్ల ప్లాట్ల ధరకు తగట్టుగానే భూమి ధరను నిర్ణయించి విక్రయిస్తారు. కానీ మాన్సాన్ భూములు అమ్మిన తీరు చూస్తే ఎవరికైనా కళ్లు బైర్లు కమ్మకమానవు. మెడికల్ కాలేజీ పేరుతో గత సర్కారు మాన్సాన్ భూములను నాలుగు ప్రాంతాల్లో విక్రయించింది. అందులో ఒకటి విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం కొత్తవలసలో భూముల అమ్మకం. అక్కడ ట్రస్టు పేరిట ఉన్న భూముల్లో 53.40 ఎకరాల అమ్మకానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వగా 43.40 ఎకరాల విక్రయానికి తెరతీశారు. రోడ్లు వేయాలంటూ.. కొత్త వలసలో 43.40 ఎకరాల అమ్మకమన్నారు. అయితే కొనుగోలుదారులు అంతర్గతంగా 80 అడుగుల రోడ్లు ఏర్పాటు చేసుకుంటే 2.98 ఎకరాల భూమి వృధా అవుతుందంటూ దాన్ని విక్రయించే భూమి నుంచి ముందే మినహాయించారు. ఇక ఇళ్ల ప్లాట్లకు అనువుగా లేదంటూ మరో 4.31 ఎకరాలను మినహాయించారు. ఇలా మొత్తం 7.29 ఎకరాలను మినహాయించి మిగిలిన 36.11 ఎకరాలకు మాత్రమే కొనుగోలుదారుడి నుంచి డబ్బులు తీసుకున్నారు. 10.98 ఎకరాలు ఉచితంగా... ఇదొక ఎత్తు కాగా ఈ భూములను అమ్మిన తర్వాత ట్రస్టుకు అక్కడ మరో పది ఎకరాల స్థలం ఉండాలి. అయితే ఇప్పుడు 6.31 ఎకరాలే మిగిలినట్లు అధికారుల కమిటీ నిర్ధారించింది. అంటే అక్కడ మరో 3.69 ఎకరాలు ఈ అమ్మకం లావాదేవీల తర్వాత కనిపించకుండా పోయింది. అంటే మొత్తంగా ట్రస్టుకు చెందిన 10.98 ఎకరాల భూమికి ఎటువంటి ప్రయోజనం పొందకుండా కొన్నవారికి ధారాధత్తం చేశారు. 36.11 ఎకరాల్లో రూ.74 కోట్లు దోపిడీ.. మాన్సాన్ ట్రస్టు భూములను అమ్మిన కొత్తవలసలో రిజిస్ట్రేషన్ ధర ఎకరం రూ.89 లక్షలు ఉంది. అయితే ఆ భూమిని అమ్మే సమయంలో అక్కడ మార్కెట్ ధర ఎకరం రూ.2.51 కోట్లు ఉన్నట్లు దేవదాయ శాఖ అధికారులు నిర్ధారించారు. కానీ మార్కెట్ ధర కంటే సగం ధరకే ఎకరం రూ.1,20,70,000 చొప్పున విక్రయించారు. ఒకవైపు 10.98 ఎకరాల భూమిని కోల్పోతూ మరోవైపు మార్కెట్ కంటే సగం ధర తక్కువకు అమ్మేశారు. మెడికల్ కాలేజీ అంటూ మభ్యపెట్టి గత సర్కారు 150.09 ఎకరాల మాన్సాన్ ట్రస్టు భూములను అమ్మగా అందులో 36.11 ఎకరాల భూముల విక్రయంతో ట్రస్టుకు వచ్చింది రూ.43.58 కోట్లు అయితే నష్టపోయింది రూ.74.22 కోట్లకుపైనే ఉంటుందని దేవదాయ శాఖ అధికారుల కమిటీ నిర్ధారించింది. మొత్తం 150.09 ఎకరాల అమ్మకాల తీరును విశ్లేషిస్తే ఈ దోపీడీ రూ.250 కోట్లకు పైబడి ఉండవచ్చని తాజాగా భావిస్తున్నారు. సింగిల్ బిడ్ టెండర్లతోనే అమ్మకం.. కొత్తవలస భూముల కొనుగోళ్లలో కేవలం ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ మాత్రమే పాల్గొంది. భూములు అమ్మే సమయంలో ఏమాత్రం పారదర్శకంగా వ్యవహరించలేదు. బహిరంగ వేలం పాటకు సంబంధించిన నోటీసులను మాన్సాన్ ట్రస్టు కార్యాలయం, విజయనగరం మున్సిపల్ కమిషనర్ కార్యాలయం, భూములను అమ్ముతున్న ప్రాంతం, కనీసం నోటీసు బోర్డులో కూడా ఉంచలేదు. తగిన ప్రచారం కల్పించి ఉంటే ఎక్కువ మంది బహిరంగ వేలంలో పాల్గొని ఆ భూములకు మంచి ధర పలికి ఉండేదని అధికారులు నిర్ధారించారు. దేవదాయ శాఖ భూములను విక్రయించాలంటే నిబంధనల ప్రకారం అవన్నీ పాటించాలి. గత ప్రభుత్వ పెద్దలకు సన్నిహితులైన హైదరాబాద్‌కు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థకు ప్రయోజనం కల్పించేందుకు తూతూ మంత్రంగా వ్యవహరించినట్లు స్పష్టమవుతోంది.