ఢిల్లీలో మరో అంతర్జాతీయ విమానాశ్రయం
న్యూఢిల్లీ: గ్రేటర్ నోయిడాలో కొత్త విమానాశ్రయ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నోయిడాలో జెవెర్ లో ఈ కొత్త ఎయిర్ పోర్టు నిర్మాణ ప్రతిపాదను కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ తో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిధిలో ఇది రెండవ అంతర్జాతీయ విమానాశ్రయం కానుంది.
గ్రేటర్ నోయిడాలో కొత్త విమానాశ్రయం నిర్మాణానికి మంత్రివర్గ ఆమోదం లభించిందని కేంద్ర విమానాయానశాఖ మంత్రి అశోక్ గజపతి రాజు శనివారం ప్రకటించారు. తద్వారా తదుపరి 10-15 సంవత్సరాల్లో సంవత్సరానికి 30-50 మిలియన్ ప్రయాణీకులకు సేవలు అందించనున్నామని చెప్పారు. 3వేల హెక్టార్లలో దీన్ని నిర్మించనున్నట్టు కేంద్రమంత్రి తెలిపారు. నోటిఫికేషన్ ఇచ్చిన ఈ ప్రాంతంలో తొలిదశలో 1000 హెక్టార్లలో అభివృద్ధి చేస్తామన్నారు. ఈ ప్రాజెక్టుకు రూ .20 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఆయన వివరించారు.పబ్లిక్ అండ్ ప్రయివేట్ పార్టనర్‌షిప్తో (పీపీపీ) తో దీన్ని నిర్మించనున్న ఈ విమానాశ్రయాన్ని అయిదేళ్లలో పూర్తి చేయనున్నట్టు చెప్పారు.
మరోవైపు దేశీయ, అంతర్జాతీయంగా వస్తున్న డిమాండ్ నేపథ్యంలో కార్పోరేట్ హబ్ గా జెవెర్ విమానాశ్రయం నిలవనుందని ఉత్తర ప్రదేశ్ మంత్రి ఎస్ సింగ్ పేర్కొన్నారు.