clears
-
జొమాటో బాయ్‌గా పనిచేస్తూనే.. చిరకాల స్వప్నాన్ని సాధించాడు..
చెన్నై: ఆశయాలు స్వప్నాలతో సాకారం కావు. నిబద్ధతతో పనిచేస్తే ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చు. ఇది నిజమని నిరూపించిన వారి నిజజీవిత కథలెన్నోమనం చూశాం. అలాంటి కోవలోకే చేరారు తమిళనాడుకు చెందిన విగ్నేష్. ఓ వైపు జొమోటో బాయ్‌గా పనిచేస్తూనే రాష్ట్ర స్థాయి పబ్లిక్ సర్వీసు పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ప్రభుత్వ ఉద్యోగాన్ని సొంతం చేసుకున్నాాడు. విగ్నేష్ తమిళనాడుకు చెందిన యువకుడు. డిగ్రీ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఖర్చుల కోసం ఓ వైపు జొమోటోలో ఉద్యోగం చేస్తూనే మిగిలిన సమయంలో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేవాడు. చివరికి తన చిరకాల స్వప్నాన్ని సాధించాడు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు. ప్రభుత్వ కొలువును చేజిక్కించుకున్నాడు. drop a like for Vignesh, who just cleared Tamil Nadu Public Service Commission Exam while working as a Zomato delivery partner ❤️ pic.twitter.com/G9jYTokgR5 — zomato (@zomato) July 24, 2023 ఈ విషయాన్నే జొమోటో తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. ఓ వైపు తమ సంస్థలో పనిచేస్తూనే రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షల్లో రాణించిన తమ ఉద్యోగి అంటూ విగ్నేష్ కుటుంబంతో సహా ఉన్న ఫొటోను పంచుకుంది. ఈ పోస్టు నెట్టింట వేగంగా వైరల్‌గా మారింది. 1337 లైకులు, 59 రీట్వీట్లు వచ్చాయి. నెటిజన్లు విగ్నేష్‌కు శుభాకాంక్షలు తెలిపారు. జీవితంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఇదీ చదవండి: వరదలతో రారాజు అగచాట్లు.. అడవిని విడిచి రోడ్డుపై.. వీడియో వైరల్.. -
రిలయన్స్ ‘మెట్రో’ డీల్ ఓకే, రూ.2,850 కోట్లతో కొనుగోలు
న్యూఢిల్లీ: ‘మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఇండియా’ని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ) సొంతం చేసుకునేందుకు కాంపిటిషన్ కమిషన్ (సీసీఐ) ఆమో దం తెలిపింది. జర్మనీకి చెందిన మెట్రో ఏజీ భారత్‌లోని తన హోల్‌సేల్ కార్యకలాపాలను విక్రయించేందుకు రిలయన్స్‌తో ఈ ఒప్పందం చేసుకోవడం గమనార్హం. మెట్రో క్యాష్ అండ్ క్యారీలో 100 శాతం వాటాలను రూ.2,850 కోట్లతో కొనుగోలు చేసేందుకు రిలయన్స్ తప్పనిసరి ఒప్పందంపై సంతకాలు చేసింది. రిలయన్స్ రిటైల్ వెంచర్స్, మెట్రో క్యాష్ అండ్ క్యారీ కొనుగోలు ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్టు ట్విట్టర్లో సీసీఐ ప్రకటించింది. ఇవీ చదవండి: ఇషా ట్విన్స్‌కు అంబానీ బ్రహ్మాండమైన గిఫ్ట్: వీడియో వైరల్ ముఖేష్ అంబానీ లగ్జరీ కార్లు.. రోల్స్ రాయిస్ నుంచి ఫెరారీ వరకు -
పెండింగ్ డీల్స్‌కు మోక్షం.. ఆరు ఒప్పందాలకు సీసీఐ ఆమోదం
న్యూఢిల్లీ: దాదాపు మూడు నెలల విరామం తర్వాత కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) విలీనాలు, కొనుగోలు ఒప్పందాలను పరిశీలించడం ప్రారంభించింది. ఈ క్రమంలో ఆరు డీల్స్‌కు ఆమోదం తెలిపింది. కీమెడ్‌లో 20 శాతం వాటాను ప్రైమ్ టైమా లాజిస్టిక్స్ టెక్నాలజీస్ ద్వారా అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్పర్సన్ శోభనా కామినేని కొనుగోలు చేస్తుండటం, లాంకో అన్పారా పవర్ (ఎల్ఏపీఎల్)ను మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రా (ఎంఈఐఎల్) కొనుగోలు చేయడానికి సంబంధించిన ఒప్పందాలు వీటిలో ఉన్నాయి. కీమెడ్ ప్రధానంగా ఔషధాల హోల్‌సేల్ విక్రయం, పంపిణీ వ్యాపారం చేస్తోంది. అటు హంట్స్మాన్ ఇంటర్నేషనల్‌ను ఆర్చ్‌రోమా ఆపరేషన్స్ కొనుగోలు చేయడం, హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ గ్లోబల్‌లో ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కేకేఆర్ వాటాలు దక్కించుకోవడం, హిందుస్తాన్ పోర్ట్స్‌లో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎన్ఐఐఎఫ్) వాటాలు తీసుకోవడానికి సంబంధించిన ఒప్పందాలు కూడా ఉన్నాయి. దీనితో నవంబర్ 3 వరకు పెండింగ్‌లో ఉన్న డీల్స్‌ను సీసీఐ క్లియర్ చేసినట్లయింది. సాధారణంగా నిర్దిష్ట పరిమితి దాటిన ఒప్పందాలకు సీసీఐ ఆమోదముద్ర అవసరమవుతుంది. అయితే, 2022 అక్టోబర్ 25న చైర్పర్సన్ అశోక్ కుమార్ గుప్తా రిటైరైన తర్వాత కోరం లేకపోవడంతో సీసీఐ విలీన, కొనుగోలు డీల్స్ పరిశీలన చేపట్టలేదు. ఫలితంగా పలు డీల్స్ పెండింగ్‌లో పడిపోయిన నేపథ్యంలో కేంద్రం నిర్దిష్ట నిబంధనను అమల్లోకి తేవడంతో పరిశీలన మళ్లీ మొదలైంది. -
RJ Malishka: ముంబై కీ రాణీ.. ఆమె స్పెషాలిటీ ఏంటంటే!
రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చెత్త కుండీలో చెత్త పేరుకుపోయి, దుర్గంధం వెలువడుతుంటే ముక్కు మూసుకుని గబగబా అక్కడి నుంచి వెళ్లిపోతాం. కానీ రేడియో జాకీ మలిష్క అలా చేయదు. ఆ చెత్తనంతటిని క్లియర్ చేసే అధికారులు వచ్చేంత వరకు దాని గురించి మాట్లాడుతూనే ఉంటుందామె. రేడియో జాకీ మలిష్క మెండన్సా ఆర్జే అయ్యిండి చెత్త గురించి మాట్లాడటం ఏంటీ? అని అంతా అనుకునేవారు. కానీ ముంబైలో పరిష్కారం కాని అనేక సమస్యలు.. సరిగా లేని రోడ్లు, వర్షంనీటితో నిండిపోయిన కాలనీలు... ఏవైనా సరే వాటి గురించి వెంటనే మలిష్క తన షోలో చెప్పేస్తుంది. అది మున్సిపల్ అధికారులకు చేరగానే వాటిని సరిచేస్తారు. కొన్నిసార్లు మలిష్క పద్ధతి అధికారులకు కోపం తెప్పించినప్పటికీ తను ఏమాత్రం వెనక్కు తగ్గదు. ఒకపక్క దేశంలోనే నంబర్ వన్ ఆర్జేగా శ్రోతల్ని అలరిస్తూ, మరోపక్క సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. దీంతో మలిష్కను సోషల్ మీడియాలో లక్షలమంది ఫాలో అవుతున్నారు. వినేకొద్ది వినాలనిపించే స్వరం, తన మాటల గారడీతో శ్రోతల్ని కట్టిపడేసే మలిష్క ముంబైలో పుట్టిపెరిగిన అమ్మాయి. పదమూడేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయింది. దీంతో ఆమె తల్లి లిల్లీ మెండన్సా అన్నీ తానై మలిష్కను పెంచారు. ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ, ముంబై యూనివర్సిటీలో మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్లో మాస్టర్స్ చేసింది మలిష్క. ముంబైకీ రాణీ చిన్నప్పటి నుంచి ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉండే మలిష్క చాలా యాక్టివ్‌గా స్టేజ్ మీద మంచి ప్రతిభ కనబరిచేది. స్కూల్లో జరిగే అన్ని కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేది, భరత నాట్యం, సంగీతంలో శిక్షణ తీసుకోవడంతో.. టీచర్స్‌డే, చిల్డ్రన్స్ డేకు తప్పకుండా తన ఫెర్ఫార్మెన్స్ ఉండి తీరేది. కాలేజీ రోజుల్లో కాలేజ్ బ్యాండ్‌లో గాయనిగా రాణించింది. చదువు పూర్తయిన వెంటనే, అడ్వరై్టజింగ్ ఇండస్ట్రీలో ఉద్యోగంలో చేరింది. బాలీవుడ్ దర్శకుడు ప్రహ్లాద్ కక్కర్ దగ్గర ఇంటర్న్‌గా పనిచేసింది. ఇక్కడ కొన్నాళ్లు పనిచేశాక, మానేసి హిందీ డిస్కవరి ఛానెల్లో వాయిస్ వోవర్ ఆర్టిస్ట్ గా పనిచేసింది. ఇలా రెండేళ్లు్ల పనిచేసాక...‘‘విన్ 94.6 ఎఫ్ఎమ్’’ లో ఆర్జేగా అవకాశం వచ్చింది. దీంతో మలిష్క ఆర్జే ప్రయాణం మొదలైంది. దీనిలో రెండేళ్లు చేసిన తరువాత రెడిఫ్ రేడియోకు మారింది. ఇక్కడ కొన్ని నెలలు మాత్రమే ఉంది. తరువాత రెడ్ ఎఫ్ఎమ్లో చేరింది. ఇక్కడ తను పాల్గొనే షోలలో మాటలతో గారడీ చేస్తూ, ముంబైలోని సామాజిక అంశాలపై మాట్లాడుతూ మంచి పేరు తెచ్చుకుంది. తన షోకు వచ్చే కాలర్స్‌ను అలరిస్తూ ‘ముంబై కీ రాణి’గా బాగా పాపులర్ అయ్యింది. ప్రస్తుతం రెడ్ ఎఫ్ఎమ్ 93.5లో ఆర్జేగా పనిచేస్తో్తంది. మలిష్క చేసిన.. మార్నింగ్ నంబర్ వన్ విత్ మలిష్క, ఎమ్ బోలే షోలు బాగా పాపులర్ అయ్యాయి. హిందీలో బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ షో గా ‘మార్నింగ్ వన్’ నిలిచి వరుసగా నాలుగేళ్లపాటు ఇండియన్ ఎక్స్‌లెన్స్ రేడియో అవార్డులను అందుకుంది. అంతేగాక ఓటీటీ అండ్ డిజిటల్ మార్కెటింగ్ అవార్డుల కార్యక్రమంలో ‘డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు మలిష్కకు దక్కింది. 2019లో తొలిసారిగా దాదాసాహేబ్ ఫాల్కే ఆర్జే అవార్డులను ప్రవేశపెట్టగా.. తొలి అవార్డుని మలిష్క అందుకుంది. ఆర్జేగానేగాక.. రేడియో జాకీగా పనిచేస్తూనే మున్నాభాయ్ ఎమ్‌బీబీఎస్, తుమారి సులులో విద్యాబాలన్ ఆర్జేగా నటించేందుకు మలిష్క శిక్షణ ఇచ్చింది. హాలీవుడ్ సినిమాలు ద ఇన్క్రెడి బుల్స్, మిరాగే, థోర్: రంగ్రూక్, స్క్రేపర్ –14 వంటి వాటికి హిందీలో డబ్బింగ్చెప్పింది. సామాజిక కార్యకర్తగా.. రాజకీయ నాయకులు, ముంబై మున్సిపల్ అథారటీ, బీఎమ్సీ కేంద్రంగా సమస్యలపై రేడియో కేంద్రంగా తన గళమెత్తడమేగాక, ప్రేమ పెళ్లిళ్ల గురించి యువతీ యువకులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించేది. ఈక్రమంలోనే సెక్స్ వర్కర్ల పిల్లలను కలవడానికి షారుఖ్ ఖాన్‌ను, చార్ బాటిల్ రాజ్ కా క్యాంపెయిన్‌కు సల్మాన్‌ఖాన్‌ను, అమితాబ్ బచన్ గార్డెన్ లో ధారావి మురికివాడల పిల్లలను ఆహ్వానించేలా కృషిచేసింది. గత పదిహేనేళ్లుగా ముంబై రెడ్ ఎఫ్ఎమ్లో సక్సెస్‌పుల్ రేడీయో జాకీగా... నంబర్‌వన్ ఆర్జేగా నిలుస్తూ ఎంతోమంది యువతీ యువకులకు ప్రేరణనిస్తోంది. -
ఢిల్లీలో మరో అంతర్జాతీయ విమానాశ్రయం
న్యూఢిల్లీ: గ్రేటర్ నోయిడాలో కొత్త విమానాశ్రయ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నోయిడాలో జెవెర్ లో ఈ కొత్త ఎయిర్ పోర్టు నిర్మాణ ప్రతిపాదను కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ తో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో ఇది రెండవ అంతర్జాతీయ విమానాశ్రయం కానుంది. గ్రేటర్ నోయిడాలో కొత్త విమానాశ్రయం నిర్మాణానికి మంత్రివర్గ ఆమోదం లభించిందని కేంద్ర విమానాయానశాఖ మంత్రి అశోక్ గజపతి రాజు శనివారం ప్రకటించారు. తద్వారా తదుపరి 10-15 సంవత్సరాల్లో సంవత్సరానికి 30-50 మిలియన్ ప్రయాణీకులకు సేవలు అందించనున్నామని చెప్పారు. 3వేల హెక్టార్లలో దీన్ని నిర్మించనున్నట్టు కేంద్రమంత్రి తెలిపారు. నోటిఫికేషన్ ఇచ్చిన ఈ ప్రాంతంలో తొలిదశలో 1000 హెక్టార్లలో అభివృద్ధి చేస్తామన్నారు. ఈ ప్రాజెక్టుకు రూ .20 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఆయన వివరించారు.పబ్లిక్ అండ్ ప్రయివేట్ పార్టనర్షిప్తో (పీపీపీ) తో దీన్ని నిర్మించనున్న ఈ విమానాశ్రయాన్ని అయిదేళ్లలో పూర్తి చేయనున్నట్టు చెప్పారు. మరోవైపు దేశీయ, అంతర్జాతీయంగా వస్తున్న డిమాండ్ నేపథ్యంలో కార్పోరేట్ హబ్ గా జెవెర్ విమానాశ్రయం నిలవనుందని ఉత్తర ప్రదేశ్ మంత్రి ఎస్ సింగ్ పేర్కొన్నారు. -
దివాలా చట్టానికి కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: బ్యాంకులు, ఆర్థిక సేవల సంస్థల కోసం ప్రత్యేకంగా దివాలా చట్టాన్ని రూపొందించే ఆలోచనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. బుధవారం జరిగిన కేంద్రమంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు, భీమా సంస్థలు, ఆర్ధిక రంగ సంస్థల్లో దివాలా పరిస్థితిని ఎదుర్కొనేందుకు సమగ్ర పరిష్కార కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన డిపాజిట్ బీమా బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. .ఈ ప్రత్యేక దివాలా చట్టంలోని ప్రతిపాదిత కార్పొరేషన్ బ్యాంకుల వ్యవస్థల్లోని స్థిరత్వాన్ని, పునరుద్ధరణను కాపాడుతుందని కేంద్రం పేర్కొంది. సాధ్యమైనంత వరకు సహేతుకమైన పరిమితి వరకు కవర్ బాధ్యతల వినియోగదారులను రక్షించడం, ప్రజా నిధులను రక్షించడమే లక్ష్యమని తెలిపింది. తద్వారా రిజల్యూషన్ కార్పొరేషన్ ఏర్పాటుకు మార్గం సుగమం కానుంది. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గారంటీ కార్పొరేషన్ చట్టం, 1961 బాధ్యతలు ఈ కార్పొరేషన్‌కు బదిలీ కానున్నాయని తెలిపింది. అలాగే వ్యవసాయ అభివృద్ధి కోసం పాలస్తీనాతో ఒక ఒప్పందాన్ని ఆమోదించాలని క్యాబినెట్ నిర్ణయించింది. దీంతో ప్రధానంగా మొండిబకాయిల సమస్క పరిష్కారానికి రూపొందించిన దివాలా చట్టం(ఐబీసీ), చిన్న బ్యాంకుల విలీనం ద్వారా బ్యాంకింగ్ రంగంలో కన్సాలిడేషన్‌కు తెరలేవనుందని ఎనలిస్టులు భావిస్తున్నారు. -
జీఎస్టీకి లైన్ క్లియర్...ఆ ఒక్కటి తప్ప
న్యూఢిల్లీ: ఎన్డీఏ సర్కార్ ప్రతిష్టాత్మక బిల్లు జీఎస్టీకి దాదాపు లైన్ క్లియర్ అయింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో15 వ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం శనివారం ప్రారంభమైంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జరిగిన అన్ని రాష్ట్ర ఆర్థిక మంత్రులు హాజరైన సమావేశంలో ట్రాన్సిషన్ అండ్ రిటర్న్ సహా పెండింగ్ లో ఉన్న ఇతర అన్ని అంశాలపై ఏకాభిప్రాయం కుదిరింది. జులై 1 నుంచి ఒకే దేశం ఒకే పన్ను (జీఎస్టీ) అమలుకు ఆమోదం లభించింది. దీంతో అన్ని రాష్ట్రాలు జీఎస్టీ డెడ్ లైన్ రడీ అయిపోయినట్టే. అయితే బంగారంపై పన్ను రేటుపై మాత్రం ప్రతిష్టంభన కొనసాగుతోంది. 5శాతం పన్ను ఖరారు కావచ్చేనే అంచనాలు మాత్రం జోరుగా నెలకొన్నాయి. ఉదయం సెషన్ ముగిసింది. తిరిగి మధ్నాహ్నం 3. గంటలకు తిరిగి కౌన్సిల్ సమావేశం కానుంది. ఈ భేటీలో బంగారంపై పన్ను రేటు ఖరారు కానుంది. మరికొద్ది సేపట్లో అత్యంతకీలకమైన బంగారంపై జీఎస్టీ పన్నురేటు తేలనుంది. కాగా గత నెలలో జరిగిన కౌన్సిల్ 5, 12, 18, 28 శాతం నాలుగు పన్ను పరిధులను నిర్ణయించిన సంగతి తెలిసిందే. , Delhi: 15th GST council underway at Vigyan Bhawan. Rates of commodities like gold, footwear, textiles, agriculture equipment to be decided. pic.twitter.com/OqDrQxmLBQ — ANI (@ANI_news) June 3, 2017 -
జీఎస్టీ నాలుగు బిల్లులకు రాష్ట్రపతి ఒకే
-
జీఎస్టీ నాలుగు బిల్లులకు రాష్ట్రపతి ఒకే
న్యూఢిల్లీ: గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ) అమలుకు సంబంధించిన మరో ప్రధానమైన,కీలకమైన అడుగు పడింది. జీఎస్టీ అమలు అతి కీలకంగా భావించే భారత రాష్ట్రపతి ఆమోదముద్ర పడింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గురువారం జీఎస్టీకి సంబంధించిన నలుగురు సహాయక చట్టాలకు ఆమోదం తెలిపారు. ఇటీవల పార్లమెంటులో ఆమోదం పొందిన నాలుగు జీఎస్టీ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదంతో ఈ ఏడాది జులై 1 నుంచి దేశ వ్యాప్తంగా ఒకే పన్ను విధానాన్ని అమలు చేసేందుకు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రయత్నానికి మార్గం మరింత సుగమమం కానుంది. సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ బిల్ ( సీజీఎస్టీ), ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ బిల్ (ఐజీఎస్టీ) గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (రాష్ట్రాలకు పరిహారం) బిల్లు, కేంద్ర పాలిత గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (యూటీజీఎస్టీ) బిల్లుకు ప్రణబ్ ఆమోదం తెలిపారు. జీఎస్టీ రేట్లపై మే 18-19 తేదీల్లో జిఎస్టి కౌన్సిల్ లో చర్చించనున్నారు. కాగా ఏప్రిల్ 6న పార్లమెంటు ఈ నాలుగు బిల్లులకు ఆమోదం తెలిపింది. కేంద్రం ప్రభుత్వం జూలై 1వతేదీనుంచి జీఎస్టీ అమలులోకి తేవాలని ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. -
ఎస్జీఎస్టీ, యూటీజీఎస్టీ లకు ఆమోదం
న్యూఢిల్లీ: జీఎస్టీ అమలులో కేంద్రం దాదాపు ఆఖరి అంకానికి చేరుకుంది. ఈ చట్టంలోని మరో కీలకమైన ఎస్జీఎస్టీ, యూటీజీఎస్టీలకు జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. గురువారం సమావేశమైన కౌన్సిల్ 12వ సమావేశంలో ఈ మేరకు ఈ చట్టాలను ఆమోదించింది. జూ సెంట్రల్ జీఎస్టీ (ఎస్జీఎస్టీ) గరిష్ట పన్ను 20శాతంగా ఇంటిగ్రేటెడ్ జిఎస్టి (సీజీఎస్టీ) గరిష్ట పన్ను 40శాతంగా, సగటు 28శాతంగా కౌన్సిల్ నిర్ణయించింది. ఈ అయిదు చట్టాల ఆమోదం తర్వాత జూలై 1న జీఎస్టీ బిల్లును పార్లమెంటులో ఆమోదింప చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. వీటిని కేంద్ర క్యాబినెట్ ఆమోదం అనంతరం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నామని ఆయన మీడియాకు తెలిపారు. అలాగే ఎస్జీఎస్టీ ని ఆయా రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించాల్సి ఉందని ఆయన చెప్పారు. లగ్జరీ వస్తువులపై పన్నును 15 శాతంగా నిర్ణయించినట్టు చెప్పారు. బొగ్గుపై టన్నుకు రూ.400గా , పాన్ మసాలా రూ. 135శాతం, సిగరెట్లపై 290 శాతం పన్ను నిర్ణయించగా, బీడీలపై పన్నును ఇంకా నిర్ణయించాల్సి ఉందని తెలిపారు. మరో నాలుగు అంశాలపై చర్చించేందుకు ఏప్రిల్ మొదటివారంలో జరిగే కౌన్సిల్ సమావేశంలో చర్చించనున్నట్టు జైట్లీ వివరించారు. పన్ను స్లాబ్‌లపై మార్చి 31 సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. బార్లు, రెస్టారెంట్లు, పాన్ మసాలాలు, లగ్జరీ కార్లు ప్యాకేజ్డ్ ఫుడ్ లాంటి డీమెరిట్ గూడ్స్ ప్రియం కానుండగా, ఫ్రిజ్‌లు, సబ్బులు, తల నూనెలు , టూత్ పేస్ట్ ల ధరలు చవక కానున్నాయి. అయితే అత్యవసర ధరలు యథాతథంగా ఉండే అవకాశాలు ఉన్నాయని ఎనలిస్టుల అంచనా. మరోవైపు సినిమాలపై విధించే ఎంటర్టైన్ మెంట్ టొబాకో, బీడీ ఉత్పత్తులపై విధించే పన్నులపై చర్చలు జరిగాయనీ, సెజ్ టాక్సేషన్ పై కౌన్సిల్ సమావేశంలో చర్చలు జరిగినట్టు మనీష్ సిసోడియా మీడియాకు తెలిపారు. కాగా సీజీ, ఐజీ, కాంపన్సేషన్ జీఎస్టీ చట్టాలను కౌన్సిల్ ఆమోదం తెలిపింది. అయితే ఫిట్మెంట్ రేట్లను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. -
నాలుగు కీలక డ్రాఫ్ట్‌లకు జీఎస్టీ కౌన్సిల్ ఒకే
న్యూఢిల్లీ: గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ చట్టాన్ని అందుబాటులోకి తెచ్చే చర్యల్ని కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. ఈ మేరకు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో సమావేశమైన జీఎస్టీ కౌన్సిల్ నాలుగు డ్రాఫ్ట్‌లను ఆమోదించింది. జీఎస్టీ రాజ్యాంగ సవరణ కింద ఈ నాలుగు కీలకమైన అంశాలకు కౌన్సిల్ ఆమోదం తెలిపినట్టు అరుణ్ జైట్లీ ప్రకటించారు. రాష్ట్రాల పరిహార బిల్లుతో సహా నాలుగు డ్రాఫ్ట్ లను ఒకే చేసినట్టు చెప్పారు. ఏకీకృత పన్ను పాలనకు రూపొందించిన ఫైనల్ డ్రాఫ్ట్ కు ఆమోదం తెలపడానికి ఉదయ్ పూర్ లో శనివారం భేటీ అయిన కౌన్సిల్ సమావేశమైంది. సమావేశం అనంతరం విలేఖరులతో మాట్లాడిన జైట్లీ పరిహారం ముసాయిదా బిల్లుతో పాటు ముఖ్యమైన బిల్లులను న్యాయ పరిశీలనకు పంపనున్నట్లు లిపారు. జీఎస్టీ బిల్లుకు సంబందించిన తుదిమెరుగులను తదుపరి సమావేశంలో దిద్దనున్నట్టుచెప్పారు. వివిధ వస్తు సేవలకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ, కేంద్ర జిఎస్టీ చట్టాల ముసాయిదాలను ఆమోదం కోసం మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. మార్చి 4 -5 తేదీల్లో ఢిల్లీలో జరిగే తదుపరి సమావేశాల్లో ఆమోదం పొందుతుందన్నారు. అలాగే మార్చి 9 న మొదలయ్యే బడ్జెట్ సమావేశాల ద్వితీయార్థంలో పార్లమెంటులో ఆమోదం పొందనుందని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. అలాగే వివిధ వస్తు సేవలకు సంబంధించి శ్లాబ్‌ల ఆమోదం కోసం మరోసారి సమావేశం అయితే సరిపోతుందని చెప్పారు. గతంలో లేవనెత్తిన 57 అంశాలను ఈ నాటి సమావేశంలో పరిష్కరించినట్టు కమిటీ ప్రకటించింది. కాగా పన్ను నియంత్రణపై కేంద్ర, రాష్ట్రాల మధ్య ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి అమలుచేయాల్సిన జీఎస్టీ వాయిదాపడింది. దీంతో 2017 జూలై 1 నుంచి జీఎస్టీని అమలు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్న సంగతి తెలిసిందే. -
ఉద్యోగులకు తీపి కబురు
న్యూఢిల్లీ: 7వ వేతన సంఘం సిఫారసులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సంబరాల్లో మునిగితేలనున్నారు. 7వ వేతన సంఘం సిఫార్సుల అమలుపై కేంద్రం మంత్రివర్గం ఉద్యోగులకు సానుకూలంగా కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించిన కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల పెంపుపై ఆర్థిక మంత్రిత్వ శాఖ రూపొందించిన నివేదికకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. అయితే యథాతథంగా అమలు చేసిందా.. మార్పులు ఏమైనా చోటు చేసుకున్నాయా అన్నది.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 7వ వేతన సంఘం సిఫార్సులకనుగుణంగా జీతం, పెన్షన్, అలవెన్సుల్లో 23.55 శాతం పెరుగుదలను యథాతథంగా అమలు చేస్తే.. ఉద్యోగుల ఫిట్మెంట్ 2.57 నుంచి 2.7కు పెరగనుంది. కొత్తగా చేరేవారి జీతం రూ.18,000 నుంచి రూ.23,000కు చేరనుంది. సుమారు 47 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 52 లక్షల మంది పెన్షర్లకు లబ్ధి చేకూరనుంది. ఈ ఏడాది జనవరి 1 నుంచి వర్తించే వేతనాల పెంపు వల్ల కేంద్రంపై సుమారు లక్ష కోట్ల ఆర్థిక భారం పడనుంది.