జీఎస్‌టీకి లైన్ క్లియర్...ఆ ఒక్కటి తప్ప
న్యూఢిల్లీ: ఎన్‌డీఏ సర్కార్ ప్రతిష్టాత్మక బిల్లు జీఎస్‌టీకి దాదాపు లైన్ క్లియర్ అయింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో15 వ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశం శనివారం ప్రారంభమైంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జరిగిన అన్ని రాష్ట్ర ఆర్థిక మంత్రులు హాజరైన సమావేశంలో ట్రాన్సిషన్ అండ్ రిటర్న్ సహా పెండింగ్ లో ఉన్న ఇతర అన్ని అంశాలపై ఏకాభిప్రాయం కుదిరింది. జులై 1 నుంచి ఒకే దేశం ఒకే పన్ను (జీఎస్‌టీ) అమలుకు ఆమోదం లభించింది. దీంతో అన్ని రాష్ట్రాలు జీఎస్‌టీ డెడ్ లైన్ రడీ అయిపోయినట్టే.
అయితే బంగారంపై పన్ను రేటుపై మాత్రం ప్రతిష్టంభన కొనసాగుతోంది. 5శాతం పన్ను ఖరారు కావచ్చేనే అంచనాలు మాత్రం జోరుగా నెలకొన్నాయి. ఉదయం సెషన్ ముగిసింది. తిరిగి మధ్నాహ్నం 3. గంటలకు తిరిగి కౌన్సిల్ సమావేశం కానుంది. ఈ భేటీలో బంగారంపై పన్ను రేటు ఖరారు కానుంది. మరికొద్ది సేపట్లో అత్యంతకీలకమైన బంగారంపై జీఎస్‌టీ పన్నురేటు తేలనుంది.
కాగా గత నెలలో జరిగిన కౌన్సిల్ 5, 12, 18, 28 శాతం నాలుగు పన్ను పరిధులను నిర్ణయించిన సంగతి తెలిసిందే.
,
Delhi: 15th GST council underway at Vigyan Bhawan. Rates of commodities like gold, footwear, textiles, agriculture equipment to be decided. pic.twitter.com/OqDrQxmLBQ
— ANI (@ANI_news) June 3, 2017