GST Council
-
సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీ పెంపు?
సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ని గణనీయంగా పెంచాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. 2026 మార్చి 31 నాటికి ఈ ఉత్పత్తులపై పరిహార సెస్(కంపెన్సేషన్ సెస్-రాష్ట్రాలకు చెల్లించె పన్ను విధానం)ను దశలవారీగా ఎత్తివేయాలని ప్రభుత్వం యోచిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తెరపైకి వచ్చింది. ప్రతిపాదిత విధానం ద్వారా ప్రజారోగ్య సమస్యలను పరిష్కరిస్తూ పన్ను ఆదాయాన్ని కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.ప్రస్తుత పన్నులు ఇలా..ప్రస్తుతం సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులపై 28 శాతం జీఎస్టీతో పాటు అదనపు సుంకాలు విధిస్తున్నారు. దాంతో మొత్తం పన్ను భారం 53 శాతంగా ఉంది. అయితే ఇది ఇప్పటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన 75% పన్ను విధానం కంటే తక్కువగానే ఉంది. ఈ ఉత్పత్తులపై 5 శాతం జోడించే పరిహార సెస్‌ను నిలిపివేయాలని యోచిస్తున్నారు. అదే సమయంలో మరింత భారీగా పన్నులు విధించాలని చూస్తున్నారు.ప్రతిపాదిత మార్పులుపొగాకు ఉత్పత్తులపై జీఎస్టీని గరిష్టంగా 40 శాతానికి పెంచడంతో పాటు అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధించాలని కూడా జీఎస్టీ కౌన్సిల్ పరిశీలిస్తోంది. పరిహార సెస్ నిలిపేసిన తర్వాత ఈ ఉత్పత్తుల నుంచి పన్ను ఆదాయం తగ్గకుండా ఇది తోడ్పడుతుంది. 2026 అనంతరం పరిహార సెస్ పరిస్థితులను సమీక్షించడానికి, ప్రత్యామ్నాయ పన్ను పద్ధతులను అన్వేషించడానికి కౌన్సిల్ ఇప్పటికే మంత్రుల బృందాన్ని నియమించింది. ఈ బృందం దీనిపై నిర్ణయం తీసుకోనుంది.ప్రజారోగ్యం, ఆర్థిక ప్రభావంపొగాకు ఉత్పత్తులను ‘హానికారక వస్తువులు’గా పరిగణిస్తున్నారు. వీటిపై అధిక పన్నులు విధిస్తే వినియోగం తగ్గుతుందనేది ప్రభుత్వం భావన. కాగా, పొగాకు, పొగాకు ఉత్పత్తుల ద్వారా 2022-23లో ప్రభుత్వానికి రూ.72,788 కోట్ల ఆదాయం సమకూరింది. పన్నులు మరింత పెంచితే ఆదాయం కూడా అధికమవుతుంది. ప్రతిపాదిత పన్ను పెంపు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనలకు లోబడి ఉంటుందని కొందరు అధికారులు పేర్కొన్నారు. ఈ కొత్త విధానం ద్వారా పొగాకు వినియోగాన్ని తగ్గించడం, తద్వారా ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నారు.ఇదీ చదవండి: భారత్‌లోకి టెస్లా.. మస్క్ వైఖరి ‘చాలా అన్యాయం’సవాళ్లు ఇవే..ప్రభుత్వం పన్నులను పెంచడానికి ఆసక్తిగా ఉన్నప్పటికీ పొగాకు పరిశ్రమ, దానిపై ఆధారపడిన కార్మికుల స్థితిగతులు, వారి ఉపాధి ప్రభావితం చెందుతుందనే ఆందోళనలు ఉన్నాయి. దీనికి తోడు కొన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం కొత్త సెస్ విధానాన్ని ప్రవేశపెట్టడానికి సంకోచిస్తున్నాయి. జీఎస్టీను పరిగణించి పోగాకు ధరలు పెంచాలంటే సెస్‌ల విధింపే కీలకం కానుంది. దాంతో ఈ వ్యవహారంపై తుది నిర్ణయం తీసుకునేటప్పుడు జీఎస్టీ కౌన్సిల్ ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. -
బీమా ప్రీమియంపై జీఎస్టీ నిర్ణయం వాయిదా
బీమా ప్రీమియంపై జీఎస్టీ తగ్గిస్తారని ఎంతగానో ఎదురుచూస్తున్న పాలసీదారుల ఆశలపై మంత్రుల బృందం నీరు చల్లింది. శనివారం జరుగుతున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ప్రారంభంలోనే ఈ అంశంపై ఆర్థిక మంత్రుల బృందం చర్చించింది. అయితే కొన్ని కారణాలవల్ల ఈ నిర్ణయం వాయిదా పడినట్లు మండలి తెలిపింది. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు మరింత పరిశీలన అవసరమని మండలి భావించినట్లు తెలిసింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. ఇందులో పలు వస్తువులపై జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ, శ్లాబుల్లో మార్పులు వంటి వాటిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే ఆరోగ్య బీమా, టర్మ్ జీవిత బీమా పాలసీలపై జీఎస్టీని మినహాయించాలనేలా గతంలో మంత్రుల బృందం (జీఓఎం) నవంబర్‌లో సమావేశమై చర్చించింది. దాంతో పాలసీదారులకు ప్రీమియం తగ్గే అవకాశం ఉందని ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ 55వ కౌన్సిల్ సమావేశంలో దీనిపై నిర్ణయాన్ని వాయిదా వేశారు.ఇదీ చదవండి: ఎస్సీడీఆర్సీ నిర్ణయాన్ని కొట్టివేసిన సుప్రీంకోర్టుఎవరు హాజరయ్యారంటే..కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహించిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, గోవా, హరియాణా, జమ్ము కశ్మీర్, మేఘాలయ, ఒడిశా ముఖ్యమంత్రులు, అరుణాచల్ ప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, తెలంగాణ ఉప ముఖ్యమంత్రులు, వివిధ రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, రెవెన్యూ శాఖ కార్యదర్శులు, సీబీఐసీ ఛైర్మన్లు, సభ్యులు, ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో తీసుకున్న తుది నిర్ణయాలు ఈ రోజు సాయంత్రానికి వచ్చే అవకాశం ఉంది. -
బీమా ప్రీమియంపై పన్ను మినహాయించేనా?
జైసల్మేర్: జీవిత బీమా, ఆరోగ్య బీమా ప్రీమియంపై పన్ను భారం తొలగించాలన్న కీలక డిమాండ్‌పై జీఎస్టీ కౌన్సిల్ ఈ రోజు భేటీలో నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. అదే సమయంలో ఖరీదైన చేతి గడియారాలు, పాదరక్షలు, వస్త్రాలపై పన్ను పెంపు, కొన్ని రకాల ఉత్పత్తులపై 35 శాతం ప్రత్యేక సిన్ (హానికారక) ట్యాక్స్‌పైనా చర్చించనున్నట్టు సమాచారం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 55వ జీఎస్టీ కౌన్సిల్ భేటీ రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో జరగనుంది. కౌన్సిల్లో సభ్యులుగా ఉన్న రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కూడా పాల్గొననున్నారు.148 ఉత్పత్తుల పన్ను రేట్ల క్రమబద్దీకరణపై జీవోఎం నివేదిక కూడా కౌన్సిల్ అజెండాలో ముఖ్యాంశంగా ఉంటుందని తెలుస్తోంది. విమానయాన ఇంధనాన్ని (ఏటీఎఫ్) జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్‌పైనా చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లు జొమాటో, స్విగ్గీపై 18 శాతం పన్ను (ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌తో) ఉండగా, ఇన్పుట్ ట్యాక్స్ ప్రయోజనం లేకుండా 5 శాతానికి తగ్గించాలన్న ప్రతిపాదన సైతం ఉంది. వినియోగించిన ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీలు), చిన్న పెట్రోల్, డీజిల్ వాహనాలపై పన్ను రేటును 12 శాతం నుంచి 18 శాతానికి పెంచాలంటూ ఫిట్మెంట్ కమిటీ కౌన్సిల్‌కు నివేదించనున్నట్టు తెలిసింది. ప్రధాన అంశాలు ఇవే..టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై జీఎస్టీని పూర్తిగా మినహాయించేందుకు బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి అధ్యక్షతన ఏర్పాటైన మంత్రుల బృందం నవంబర్లోనే అంగీకారం తెలిపింది.రూ.5 లక్షల సమ్ అష్యూరెన్స్ వరకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం, 60 ఏళ్లు నిండిన వారికి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై పూర్తి పన్ను మినహాయింపునకు సైతం అంగీకరించింది. ఇందుకు సంబంధించి జీవోఎం ప్రతిపాదనలకు కౌన్సిల్ ఆమోదం తెలపాల్సి ఉంది.రూ.5 లక్షలకు మించిన హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై పన్ను రేటులో ఎలాంటి ఉపశమనం ఉండదని తెలుస్తోంది.ఎయిరేటెడ్ బెవరేజెస్, సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై పన్ను రేటును 28 శాతం నుంచి 35 శాతానికి పెంచాలని జీవోఎం ఇప్పటికే తన సిఫారసులను సమర్పించడం గమనార్హం.గేమింగ్ డిపాజిట్లపై కాకుండా ప్లాట్‌ఫామ్ ఫీజులపైనే 28 శాతం జీఎస్టీ విధించాలని స్కిల్ ఆన్లైన్ గేమ్స్ ఇనిస్టిట్యూట్ (ఎస్వోజీఐ) డిమాండ్ చేసింది. తద్వారా ఆఫ్‌షోర్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లు పన్ను ఆర్బిట్రేజ్ ప్రయోజనం పొందకుండా అడ్డుకున్నట్టు అవుతుందని ప్రభుత్వానికి సూచించింది.ఉపాధి కల్పన, జీడీపీలో కీలక పాత్ర పోషించే గేమింగ్ పరిశ్రమ పూర్తి సామర్థ్యాల మేరకు రాణించేందుకు సహకరించాలని ప్రభుత్వాన్ని కోరింది.ఆన్లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లు, క్యాసినోల్లో గేమర్లు చేసే డిపాజిట్లపై పన్ను రేటు 18 శాతం ఉండగా, 2023 అక్టోబర్ 1 నుంచి 28 శాతానికి పెంచడం గమనార్హం.ఇదీ చదవండి: పెద్ద మొత్తంలో డబ్బు విత్‌డ్రా చేయాలంటే..?అదనపు ఫ్లోర్ స్పేస్‌పై జీఎస్టీ వద్దు: క్రెడాయ్ అదనపు ఫ్లోర్ స్పేస్ (విస్తీర్ణం) కోసం చెల్లించే ఛార్జీలపై జీఎస్టీ విధించొద్దంటూ ప్రభుత్వాన్ని క్రెడాయ్ కోరింది. డిమాండ్‌ను దెబ్బతీస్తుందన్న ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖకు రియల్టర్ల మండలి క్రెడాయ్ ఒక లేఖ రాసింది. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్ఎస్ఐ)/ అదనపు ఎఫ్ఎస్ఐ కోసం స్థానిక అధికారులకు చెల్లించిన ఛార్జీలపై 18 శాతం జీఎస్టీని విధించాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం పునరాలోచించాలని కోరింది. ఈ ఛార్జీ విధింపు నిర్మాణ వ్యయాలను పెంచేస్తుందని, ఫలితంగా దేశవ్యాప్తంగా ఇళ్ల ధరలు 10 శాతం వరకు పెరగొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రాజెక్టు వ్యయాల్లో ఎఫ్ఎస్ఐ/అదనపు ఎఫ్ఎస్ఐ అధిక వాటా కలిగి ఉన్నట్టు క్రెడాయ్ ప్రెసిడెంట్ బొమన్ ఇరానీ తెలిపారు. ప్రతిపాదిత జీఎస్టీ విధింపు ఇళ్ల సరఫరా, డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం చూపిస్తుందన్నారు. -
జీఎస్టీ మినహాయింపు వీటిపైనే?
వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలులోకి వచ్చిన ఏడు సంవత్సరాల తర్వాత మొదటిసారి పన్ను రేట్లలో భారీ మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే దీనిపై తుది నిర్ణయం ఈనెల 21న జరిగే 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో వెలువడుతుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరగబోయే ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక మంత్రులు పాల్గొననున్నారు. ఈ సమావేశం రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో నిర్వహిస్తున్నారు. ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం ఈ సమావేశంలో తీసుకుబోయే నిర్ణయాలు కింది విధంగా ఉంటాయని ఊహాగానాలు వస్తున్నాయి.మినహాయింపులు..జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీ రేట్లను తగ్గించే ప్రతిపాదనలున్నాయి.సీనియర్ సిటిజన్లు చెల్లించే ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీ మినహాయింపు.సీనియర్ సిటిజన్లు కాకుండా ఇతర వ్యక్తులకు రూ.5 లక్షల వరకు కవర్ చేసే పాలసీలకు ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీ మినహాయింపు.రూ.5 లక్షల కంటే ఎక్కువ కవరేజీ ఉన్న పాలసీల ప్రీమియంలపై 18% జీఎస్టీ కొనసాగిస్తారని అంచనా.మార్పులు..జీఎస్టీ హేతుబద్ధీకరణపై మంత్రుల బృందం విలాసవంతమైన వస్తువులు, సిన్ గూడ్స్ (అత్యంత ఖరీదైన దిగుమతి చేసుకునే వస్తువులు)పై పన్ను పెంచుతారు.చేతి గడియారాల ధర రూ.25,000 ఉంటే జీఎస్టీ 18% నుంచి 28%కి పెంపు.రూ.15,000 కంటే ఎక్కువ ధర ఉన్న షూస్‌పై జీఎస్టీ 18% నుంచి 28%కి పెంపు.రూ.1,500 వరకు ధర ఉన్న రెడీమేడ్ దుస్తులపై 5% జీఎస్టీ.రూ.1,500-రూ.10,000 మధ్య ధర ఉన్న దుస్తులపై 18% జీఎస్టీ.రూ.10,000 కంటే ఎక్కువ ధర ఉన్న రెడీమేడ్ దుస్తులపై 28% జీఎస్టీ.కొన్ని పానీయాలు, సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై ప్రస్తుతం ఉన్న 28% జీఎస్టీను కొత్తగా 35% స్లాబ్‌లోకి తీసుకురాబోతున్నట్లు అంచనా.ఇదీ చదవండి: వాట్సప్‌లో చాట్‌జీపీటీ.. అందుకు ఏం చేయాలంటే..పన్ను తగ్గింపు..ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ (20 లీటర్లు, అంతకంటే ఎక్కువ)పై జీఎస్టీ 18% నుంచి 5%కి తగ్గింపు.రూ.10,000 కంటే తక్కువ ధర ఉన్న సైకిళ్లపై జీఎస్టీ 12% నుంచి 5%కి తగ్గింపు.నోట్‌బుక్‌లపై 12% నుంచి 5%కి తగ్గింపు. -
సెకెండ్ హ్యాండ్ వాహనాలపై భారీ పన్ను?
పాత, వాడిన ఎలక్ట్రిక్ వాహనాలు (EV), తేలికపాటి పెట్రోల్, డీజిల్ వాహనాలపై వస్తు సేవల పన్ను (GST) పెరిగే అవకాశం ఉంది. జీఎస్టీ కౌన్సిల్ ఫిట్మెంట్ కమిటీ సిఫార్సు ఆధారంగా పన్ను రేటు 12 శాతం నుండి 18 శాతానికి పెంచవచ్చని సీఎన్‌బీసీ టీవీ 18 రిపోర్ట్ పేర్కొంది. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో డిసెంబర్ 20-21 తేదీలలో జరగనున్న కౌన్సిల్ సమావేశంలో ఈ ప్రతిపాదనను చర్చించనున్నట్లు తెలుస్తోంది.ఈ ప్రతిపాదన అమలు చేస్తే.. సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారి సంఖ్య తగ్గే అవకాశం ఉంది. గ్రీన్ మొబిలిటీని ప్రోత్సహించడానికి ప్రస్తుతం ప్రభుత్వం కొత్త ఈవీలకు రాయితీపై 5 శాతం జీఎస్టీ మాత్రమే విధిస్తోంది. అలాగే పాత, వాడిన విద్యుత్ వాహనాలపై 12 శాతం పన్ను అమలవుతోంది. దీన్ని 18 శాతానికి తీసుకెళ్లాలని తద్వారా రీసేల్ మార్కెట్ సౌలభ్యాన్ని తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. పాత, సెకెండ్ హ్యాండ్ వాహనాలపై విధించే జీఎస్టీ సరఫరాదారు మార్జిన్‌కు మాత్రమే వర్తిస్తుంది.ప్రస్తుత విధానంలో 1200 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం, 4000 ఎంఎం కంటే ఎక్కువ పొడవు కలిగిన పెట్రోల్ వాహనాలపై 18 శాతం జీఎస్టీ అమలవుతోంది. అదేవిధంగా 1500 సీసీ పైగా ఎక్కువ ఇంజన్ సామర్థ్యం, 4000 ఎంఎం కంటే ఎక్కువ పొడవు కలిగిన డీజిల్ వాహనాలు, అలాగే 1500 సీసీ కంటే ఎక్కువ ఇంజన్లు కలిగిన ఎస్‌యూవీలపై కూడా 18 శాతం పన్ను విధిస్తున్నారు.ఇదీ చదవండి: ఈ-టూవీలర్స్లోనూ పెద్ద కంపెనీలే..ఇక ఈవీలు, చిన్న కార్లతో సహా అన్ని ఇతర వాహనాలు ప్రస్తుతం 12 శాతం పన్ను పరిధిలోకి వస్తాయి. ఈవీలతో సహా 12 శాతం కేటగిరీలోని అన్ని వాహనాలకూ 18 శాతం పన్ను విధించాలని ఫిట్మెంట్ కమిటీ సిఫార్సు చేసింది. జీఎస్టీ కౌన్సిల్ తదుపరి సమావేశంలో ఈ ప్రతిపాదనపై తుది నిర్ణయం తీసుకోనుంది. ఇది ఆమోదం పొందితే అన్ని పాత, సెకెండ్ హ్యాండ్ వాహనాలపై ఏకరీతిలో 18 శాతం పన్ను అమలవుతుంది. -
ఈ వస్తువులపై భారీగా పెరగనున్న జీఎస్టీ!
గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (GST) అమలులోకి వచ్చిన ఏడు సంవత్సరాల తర్వాత.. మొదటిసారి పన్ను రేట్లలలో భారీ మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే దీనిపైన తుది నిర్ణయం ఈనెల 21న జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో వెలువడుతుంది.పన్ను రేటు హేతుబద్దీకరణలో భాగంగా సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల మీద మాత్రమే కాకుండా శీతలపానీయాల మీద జీఎస్టీని 28 శాతం నుంచి 35 శాతానికి పెంచే అవకాశం ఉంది. రెడీమేడ్ వస్త్రాలపై కూడా జీఎస్టీ రేటు పెరుగుతుందని.. బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరీ అధ్యక్షతన జరిగిన జీవోఎం సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు 5, 12, 18, 28 శాతం అనే నాలుగు అంచెల పన్ను శ్లాబులు మాత్రమే ఉండేవి. త్వరలో 35 శాతం కొత్త రేటు కూడా శ్లాబులో చేరనున్నట్లు సమాచారం.రూ.1,500 విలువైన రెడీమేడ్ దుస్తులపై 5 శాతం, రూ.1,500 నుంచి రూ.10,000 మధ్య ధర ఉన్న దుస్తులపై 18 శాతం, రూ. 10వేలు కంటే ఎక్కువ ధర ఉన్న వస్త్రాల మీద 28 శాతం జీఎస్టీ విధించనున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు కొత్తగా 148 ఉత్పత్తులపై ట్యాక్స్ విధించనున్నట్లు జీవోఎం సూచించింది. సౌందర్య సాధనాలు, గడియారాలు, బూట్లు వంటి వాటిపై కూడా ట్యాక్స్ పెంచే అవకాశం ఉందని జీవోఎం ప్రతిపాదించింది.ఇదీ చదవండి: రూ.2000 నోట్లపై ఆర్బీఐ అప్డేట్..జిఎస్టి కౌన్సిల్ డిసెంబర్ 21న జైసల్మేర్‌లో సమావేశం కానుంది. ఈ సమావేశంలో జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపై కూడా కీలక ప్రతిపాదనలు వెల్లడించే అవకాశం ఉంది. కార్లు, వాషింగ్ మెషిన్స్ వంటివి 28 శాతం జీఎస్టీ కింద ఉన్నాయి. వీటిని 35 శాతం శ్లాబులోకి చేరుస్తారా? లేదా.. 28 శాతం వద్దనే ఉంచుతారా అనే విషయాలు 21వ తేదీ తెలుస్తుంది. -
బీమా ప్రీమియంపై జీఎస్టీ.. మంత్రుల సంఘం ఏర్పాటు
బీమా పాలసీల ప్రీమియంపై జీఎస్టీను సరళీకరించేందుకు మంత్రుల సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియంపై జీఎస్టీ రేటుకు సంబంధించి 13 మందితో కూడిన ఈ మంత్రుల సంఘం సూచనలిస్తుంది. అక్టోబర్ 30న ఈ కమిటీ తన నివేదిక సమర్పించాల్సి ఉంటుంది.జీఎస్టీ మండలి ఏర్పాటు చేసిన ఈ కమిటీకి బిహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ ఛౌధ్రి నేతృత్వం వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, కేరళ, గోవా, మేఘాలయ, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల మంత్రుల సంఘం సిఫారసులు అందించనుంది. గతంలో జరిగిన పార్లమెంట్ సమావేశంలో ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌కు కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ బీమా ప్రీమియంపై జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని తెలిపారు. ఈమేరకు ఆర్థికమంత్రికి లేఖ సైతం పంపించారు. అంతకుముందే బీమా ప్రీమియంపై జీఎస్టీ సరళీకరించాలనే ప్రతిపాదన కేంద్రం వద్ద ఉంది. దాంతో త్వరలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఇటీవల జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో ప్రభుత్వ ప్రతినిధులు తెలిపారు. అందులో భాగంగానే తాజాగా మంత్రుల సంఘాన్ని ఏర్పాటు చేసి నివేదిక కోరుతున్నారు.ఇదీ చదవండి: సెబీ చీఫ్‌పై మరోసారి కాంగ్రెస్ ఆరోపణలునవంబర్లో జరిగే జీఎస్టీ మండలి సమావేశంలో దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం బీమా ప్రీమియంలపై 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో దీన్ని 5 శాతానికి తగ్గించాలనే డిమాండ్ ఉంది. మరి కొన్నింటిలో ప్రీమియంపై పూర్తిగా జీఎస్టీను ఎత్తివేయాలని కోరుతున్నారు. -
బీమాపై జీఎస్టీ కోతకు ఓకే!
న్యూఢిల్లీ: ఆరోగ్య, జీవిత బీమా పాలసీల ప్రీమియంపై జీఎస్టీ తగ్గించాలన్న డిమాండ్ పట్ల జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో విస్తృత ఏకాభిప్రాయం వచి్చంది. దీనిపై వచ్చే నెల చివర్లోగా నివేదిక సమర్పించాలని బిహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి అధ్యక్షతన గల మంత్రుల బృందాన్ని (జీవోఎం) కోరినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ తెలిపారు. ఈ నివేదిక అందిన తర్వాత దీనిపై జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు. ప్రస్తుతం టర్మ్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ల ప్రీమియంపై 18 శాతం జీఎస్టీ అమలవుతోంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 54వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం సోమవారం జరిగింది. ఇందులో బీమా పాలసీలపై ప్రీమియం తగ్గింపు ప్రధానంగా చర్చకు వచి్చంది. నెలవారీ జీఎస్టీ వసూళ్లు పెరుగుతుండడంతో పన్ను రేటు తగ్గింపు పట్ల చాలా రాష్ట్రాలు సానుకూలంగా ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. జీఎస్టీ తగ్గిస్తే ఆ మేరకు ప్రీమియం రేట్లు దిగొస్తాయి. ఇది కోట్లాది మంది పాలసీదారులకు ఉపశమనాన్ని కలి్పంచనుంది. జీఎస్టీకి ముందు బీమా పాలసీల ప్రీమియంపై 12% సరీ్వస్ ట్యాక్స్ వసూలు చేసేవారు. కేన్సర్ ఔషధాలపై జీఎస్టీ తగ్గింపు: కొన్ని రకాల కేన్సర్ ఔషధాలపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి.. కేదార్నాథ్ తదితర పర్యటనల కోసం వినియోగించుకునే హెలికాప్టర్ సేవలపై జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలని కౌన్సిల్ నిర్ణయించింది. చార్టర్ హెలీకాప్టర్లపై ఎప్పటి మాదిరే 18 శాతం జీఎస్టీ అమలు కానుంది. ఆన్లైన్ గేమింగ్‌పై 2023 అక్టోబర్ 1 నుంచి 28 శాతం జీఎస్టీని అమలు చేయడం వల్ల ఆదాయం 412 శాతం పెరిగి రూ.6,909 కోట్లకు చేరుకున్నట్టు మంత్రి సీతారామన్ తెలిపారు. విదేశీ ఎయిర్‌లైన్స్ సంస్థలు దిగుమతి చేసుకునే సేవలపై జీఎస్టీని మినహాయించాలని కౌన్సిల్ నిర్ణయించింది. -
బీమా ప్రీమియంపై జీఎస్టీ మినహాయింపు..?
ఆరోగ్యబీమా ప్రీమియంపై జీఎస్టీ మినహాయింపు అంశానికి సంబంధించి త్వరలో కీలక ప్రకటన వెలువడనుంది. ఈ నెల 9వ తేదీన జరగబోయే జీఎస్టీ కౌన్సిల్లో ఈమేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒకవేళ అనుకున్న విధంగానే ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీ మినహాయిస్తే రూ.650 కోట్ల నుంచి రూ.3,500 కోట్లు వరకు కేంద్ర ఖజానాపై భారం పడనుంది.దేశంలో చాలామంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల ఖర్చు ఏటా పెరుగుతోంది. కొన్ని సర్వేల ప్రకారం వైద్య ఖర్చులు ఏటా 30-40 శాతం మేర అధికమవుతున్నాయి. దాంతో చాలామంది ఆరోగ్య బీమా తీసుకుంటున్నారు. అయితే ప్రతివ్యక్తి ఎప్పుడో ఒకప్పుడు ఈ సదుపాయాన్ని ఉపయోగిస్తున్నాడు. కాబట్టి పాలసీదారులకు అండగా నిలిచేలా ప్రభుత్వం తాము చెల్లిస్తున్న బీమా ప్రీమియంపై జీఎస్టీని మినహాయించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి.ఇదీ చదవండి: ప్రపంచంలోనే అత్యంత బలమైన బ్రాండ్గతంలో జరిగిన పార్లమెంట్ సమావేశంలోనూ ప్రతిపక్ష నేతలు, నితిన్ గడ్కరీ వంటి పాలకపక్ష నేతలు ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీను తొలగించాలని ఆర్థికశాఖకు సిఫార్సు చేశారు. దాంతో త్వరలో జరగబోయే సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకుంటారనే ఊహాగానాలు వస్తున్నాయి. ప్రీమియంపై జీఎస్టీ మినహాయిస్తే బీమా కంపెనీలు మరింత ఎక్కువగా పాలసీలు జారీ చేసే అవకాశం ఉంది. దాంతో ఆయా కంపెనీల రెవెన్యూ పెరుగుతుందని మార్కెట్ భావిస్తోంది. ప్రస్తుతం ఆరోగ్య బీమా ప్రీమియంపై 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. ఇదిలాఉండగా, జీఎస్టీని పూర్తిగా మినహాయించకుండా కొన్ని షరతులతో పన్ను తగ్గించే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. -
జీఎస్టీ శ్లాబులు తగ్గింపు..?
జీఎస్టీ శ్లాబులను మరింత సరళతరం చేయాలని ప్రభుత్వం యోచిస్తుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ ఛైర్మన్ సంజయ్ అగర్వాల్ తెలిపారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) నిర్మాణాన్ని క్రమబద్ధీకరించేందుకు ప్రస్తుతం అమలవుతున్న నాలుగు శ్లాబులను మూడుకు తగ్గించేలా చర్చలు సాగుతున్నాయని చెప్పారు.ఈ సందర్భంగా సంజయ్ అగర్వాల్ మాట్లాడుతూ..‘ప్రస్తుతం అమలవుతున్న జీఎస్టీ శ్లాబుల విధానంలో చాలా వస్తువుల వర్గీకరణపై వివాదాలున్నాయి. వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. పన్ను చెల్లింపులను మరింత సరళతరం చేసేందుకు ప్రస్తుతం ఉన్న నాలుగు జీఎస్టీ శ్లాబులను మూడుకు తగ్గించేలా చర్చలు జరుగుతున్నాయి. జులై 2017లో జీఎస్టీను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఆదాయ వృద్ధి మెరుగుపడింది’ అన్నారు.ఇదీ చదవండి: ఈఎస్ఐ పథకంలోకి భారీగా చేరిన ఉద్యోగులుకేంద్ర బడ్జెట్ 2024-25 ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ..‘జీఎస్టీ ప్రయోజనాలను పెంచడం కోసం పన్ను నిర్మాణాన్ని మరింత సరళీకృతం చేసేందుకు ప్రయత్నిస్తాం. జీఎస్టీ పరిధిని ఇతర రంగాలకు విస్తరిస్తాం’ అని చెప్పారు. మార్చి 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ రాబడుల్లో స్థిరమైన వృద్ధి నమోదైంది. ఏప్రిల్ 2024లో ఆల్ టైమ్హై రూ.2.10 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైంది. ప్రస్తుతం జీఎస్టీ శ్లాబులు 5%, 12%, 18%, 28%గా ఉన్నాయి. -
నకిలీ ఇన్వాయిస్ల కట్టడికి బయోమెట్రిక్ అథెంటికేషన్
నకిలీ ఇన్వాయిసింగ్ కేసులను అరికట్టడానికి దేశవ్యాప్తంగా బయోమెట్రిక్ అథెంటికేషన్ విధానాన్ని అమలు చేయనున్నట్లు 53వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. మోసపూరిత ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ లను ఎదుర్కోవడానికి ఆధార్ ఆథెంటికేషన్ దోహదపడుతుందని ఆర్థిక మంత్రి తెలిపారు.మోదీ ప్రభుత్వం 3.0 ఏర్పడిన తర్వాత జరిగిన తొలి జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఇదే కావడం గమనార్హం. ఈ సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.ఆలిండియా ప్రాతిపదికన బయోమెట్రిక్ ఆధారిత ఆధార్ అథెంటికేషన్ వ్యవస్థను దశలవారీగా అమలు చేస్తామని, ఇది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మోసాలను అరికట్టడంలో సహాయపడటంతో పాటు, జీఎస్టీలో రిజిస్ట్రేషన్ ప్రక్రియను బలోపేతం చేస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. -
GST Council: జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలు ఇవే..
సాక్షి, ఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులతో వారి అభిప్రాయాలను తీసుకోవడానికి బడ్జెట్‌కు ముందు సంప్రదింపులు జరిపారు. ఆ తర్వాత నేడు జీఎస్టీ (గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్) కౌన్సిల్ 53వ సమావేశం జరిగింది. ఇందులో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు.చదువుకునే వారు కాలేజీలో కాకుండా.. బయట హాస్టల్ వసతి పొందుతున్నప్పుడు నెలకు 20వేల రూపాయలు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని పాలకమండలి సిఫార్సు చేసింది. అయితే విద్యార్ధి తప్పనిసరిగా 90 రోజులు హాస్టల్లో ఉండాలి. ఈ ప్రయోజాన్ని హోటళ్లు ఉపయోగించకుండా ఉండటానికి ప్రవేశపెట్టారు.#WATCH | On the 53rd GST Council Meeting, Union Finance Minister Nirmala Sitharaman says "Council recommended to prescribe 12% GST on all solar cookers whether it has single or dual energy source. Services provided by Indian Railways to the common man, sale of platform tickets,… pic.twitter.com/pJGBydgVz5— ANI (@ANI) June 22, 2024ప్రయాణికులకు రైల్వే అందించే పలు సర్వీసుల్లో కూడా జీఎస్టీ మినహాయిపు ఉంటుంది. ఇందులో రైల్వే ఫ్లాట్‌ఫామ్ టికెట్స్, ప్రయాణికులు ఉండటానికి కేటాయించిన గదులు, లగేజీ సర్వీసులకు, బ్యాటరీతో నడిచే వాహనాలు, ఇంట్రా-రైల్వే వంటి సేవలపై కూడా జీఎస్టీ మినహాయింపు ఉంటుంది.అన్ని రకాల పాల క్యాన్లపైన, కార్టన్ బాక్సులపైన జీఎస్టీ 12 శాతానికి తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. కార్టన్ బాక్సులపై జీఎస్టీ తగ్గింపు యాపిల్, ఇతర పండ్ల వ్యాపారాలకు మేలు చేస్తుంది. వీటితో పాటు అంతే కాకుండా అన్నిరకాల స్ప్రింకర్లను 12 శాతం జీఎస్టీ పరిధిలోకి తెచ్చారు. అన్నిరకాల సోలార్ కుక్కర్ల మీద 12 శాతం జీఎస్టీ విధించారు.నిర్దిష్ట సంస్కరణలు చేపట్టేందుకు రాష్ట్రాలకు కేంద్రం 50 ఏళ్ల వడ్డీ లేని రుణం ఇచ్చే పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్మల సీతారామన్ రాష్ట్రాలను కోరారు. ఈ మొత్తాన్ని విద్య, వైద్య, నీటి పారుదల, మంచి నీటి సరఫరా వంటి వాటికి ఉపయోగిపొంచుకోవచ్చు. రాష్ట్రాల మూల ధన వ్యయాలను పెంచాలనే ఉద్దేశ్యంతో 2020-21లో ఈ పథకాన్ని మొదటిసారి ప్రవేశపెట్టారు.ఇంధనాన్ని (పెట్రోల్ & డీజిల్) జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం గురించి అడిగినప్పుడు.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తీసుకొచ్చిన జీఎస్టీ ఉద్దేశం పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీలో చేర్చడమే. రాష్ట్రాలే దీనిపైనా ఒక నిర్ణయానికి వస్తే.. జిఎస్టిలో పెట్రోల్ మరియు డీజిల్‌ను చేర్చాలని మేము కోరుకుంటున్నామని అన్నారు.#WATCH | On being asked about bringing fuel under GST, Union Finance Minister Nirmala Sitharaman says "...At the moment, the intention of the GST as it was brought in by former Finance Minister Arun Jaitley is to have the petrol and diesel in GST. It is up to the states to decide… pic.twitter.com/SoKpm3hlbI— ANI (@ANI) June 22, 2024 -
GST Council meet: ఎరువులపై జీఎస్టీ తగ్గించేనా?
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల తర్వాత జీఎస్టీ కౌన్సిల్ తొలిసారి భేటీ అవుతోంది. ఎరువులపై సబ్సిడీ రేటు తగ్గించాలంటూ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చేసిన సూచనతోపాటు, ఆన్లైన్ గేమింగ్‌పై పన్ను అంశాలు శనివారం నాటి సమావేశంలో చర్చకు రానున్నాయి. 53వ జీఎస్టీ కౌన్సిల్ భేటీకి కేంద్ర ఆరి్థక మంత్రి అధ్యక్షత వహిస్తుండగా, రాష్ట్రాల ఆరి్థక మంత్రులు సైతం పాల్గొననున్నారు. జీఎస్టీలో ప్రస్తుతమున్న వివిధ రకాల రేట్లను కుదించాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉండగా, దీనిపై ఏర్పాటైన మంత్రుల బృందం ఇప్పటి వరకు సాధించిన పురోగతి సైతం చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎరువులపై జీఎస్టీలో 5 శాతం రేటు అమలవుతోంది. ఎరువుల తయారీలోకి వినియోగించే సల్ఫూరిక్ యాసిడ్, అమ్మోనియాపై 18 శాతం రేటు అమల్లో ఉంది. ఎరువుల తయారీలోకి వినియోగించే ముడి సరుకులతోపాటు పంట పోషక ఉత్పత్తులపైనా రేటు తగ్గించాలని ఈ రంగానికి సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫారసు చేసింది. ఎరువులపై రేట్ల తగ్గింపు ప్రతిపాదనను జీఎస్టీ కౌన్సిల్ 45వ, 47వ సమావేశాల అజెండాల్లో చోటు కలి్పంచినప్పటికీ.. ఈ దిశగా మండలి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. చివరిగా జీఎస్టీ కౌన్సిల్ 52వ సమావేశం గతేడాది అక్టోబర్ 7న జరగడం గమనార్హం. ఆన్లైన్ గేమింగ్, పందేల మొత్తంపై 28 శాతం జీఎస్టీ రేటు 2023 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచి్చంది. ఆరు నెలల తర్వాత దీనిపై సమీక్ష చేపడతామని అప్పట్లోనే మండలి ప్రకటించింది. దీంతో ఇది చర్చకు వస్తుందని భావిస్తున్నారు. -
పెరిగిన జీఎస్టీ వసూళ్లు.. ఎంతంటే..
జీఎస్టీ వసూళ్లు ప్రతినెల భారీగా వసూలు అవుతున్నాయి. మార్చి నెలకుగాను రూ.1.78 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే నెలలో వసూలైన దానితో పోలిస్తే ఇది 11.5 శాతం అధికం. అలాగే జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత రెండో అతిపెద్ద వసూళ్లు కూడా ఇదే కావడం విశేషం. గరిష్ఠంగా ఏప్రిల్ 2023లో రూ.1.87 లక్షల కోట్లు వసూలయ్యాయి. ఇదే ఏడాది ఫిబ్రవరిలో వసూలైన రూ.1.68 లక్షలకోట్ల కంటే ఈసారి అధికంగానే జీఎస్టీ ఖజానాకు చేరింది. ఈసారి సెంట్రల్ జీఎస్టీ కింద రూ.34,532 కోట్లు వసూలవగా, స్టేట్ జీఎస్టీ కింద రూ.43,746 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ.87,947 కోట్లు వసూలయ్యాయి. మరోవైపు, గడిచిన ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.20.14 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైంది. అంతక్రితం ఏడాదికంటే 11.7 శాతం అధికం. గత నెలలో తెలంగాణలో జీఎస్టీ వసూళ్లు 12 శాతం మేర పెరిగాయి. ఏడాది క్రితం మార్చి నెలలో రూ.4,804 కోట్లు వసూలవగా, ఈసారి ఇది రూ.5,399 కోట్లకు పెరిగాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే ఏపీలో జీఎస్టీ వసూళ్లు 16 శాతం ఎగబాకి రూ.3,532 కోట్ల నుంచి రూ.4,082 కోట్లకు చేరుకున్నాయని వెల్లడించింది. ఇదీ చదవండి: ప్రయాణికులకు క్షమాపణ చెప్పిన ప్రముఖ సంస్థ -
ఆన్లైన్ గేమింగ్ కంపెనీలపై పన్ను పిడుగు
న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్ కంపెనీలపై పన్ను పిడుగు పడింది. పన్ను ఎగవేతకు సంబంధించి రూ.లక్ష కోట్ల మేర చెల్లించాలని కోరుతూ జీఎస్టీ అధికారులు షోకాజు నోటీసులు జారీ చేశారు. ఈ విషయాన్ని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. అక్టోబర్ 1 తర్వాత భారత్‌లో నమోదు చేసుకున్న విదేశీ గేమింగ్ కంపెనీలకు సంబంధించి డేటా లేదన్నారు. విదేశాల నుంచి కార్యకలాపాలు నిర్వహించే గేమింగ్ కంపెనీలు, జీఎస్టీ చట్టం కింద నమోదు చేసుకోవడాన్ని అక్టోబర్ 1 నుంచి కేంద్రం తప్పనిసరి చేసింది. ఆన్లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో బెట్టింగ్ పూర్తి విలువపై 28 శాతం పన్ను వసూలు చేస్తామని జీఎస్టీ కౌన్సిల్ ఆగస్ట్‌లోనే స్పష్టం చేయడం గమనార్హం. డ్రీమ్11, డెల్టా కార్ప్ తదితర సంస్థలు భారీ మొత్తంలో పన్ను చెల్లింపులకు సంబంధించి గత నెలలో షోకాజు నోటీసులు అందుకోవడం తెలిసిందే. గేమ్స్క్రాఫ్ట్ సంస్థ రూ.21,000 కోట్ల పన్ను ఎగవేసిందంటూ గతేడాది జీఎస్టీ అధికారులు షోకాజు నోటీసులు జారీ చేశారు. దీంతో సంస్థ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించి, సానుకూల ఆదేశాలు పొందింది. దీనిపై కేంద్ర సర్కారు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు డ్రీమ్11 సంస్థ రూ.40,000 కోట్ల పన్ను ఎగవేతకు సంబంధించి షోకాజు నోటీసులు అందుకుంది. డెల్టా కార్ప్, దాని అనుబంధ సంస్థలకు రూ.23,000 కోట్లకు సంబంధించి షోకాజు నోటీసులు జారీ అయ్యాయి. ఈ నోటీసులపై డెల్టాకార్ప్ బోంబే హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. న్యాయస్థానాలు ఇచ్చే తదుపరి ఆదేశాలకు అనుగుణంగా పన్ను వసూళ్లు ఆధారపడి ఉన్నాయి. -
అక్టోబర్ 7న జీఎస్టీ మండలి కీలక భేటీ
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో వచ్చే నెల 7వ తేదీన జీఎస్టీ మండలి కీలక సమావేశం జరగనుంది. న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్లో ఈ జీఎస్టీ మండలి 52వ సమావేశం జరగనుందని ఎక్స్‌లో ఒక అధికారిక ప్రకటన పోస్టయ్యింది. జీఎస్టీ మండలి నిర్ణయాల్లో కేంద్ర ఆర్థికమంత్రితోపాటు రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థికమంత్రులు కూడా భాగస్వాములుగా ఉండే సంగతి తెలిసిందే. ఆగస్టు 2వ తేదీన జరిగిన గత జీఎస్టీ మండలి భేటీలో క్యాసినోలు, గుర్రపు పందాలు, ఆన్లైన్ గేమింగ్ల పన్ను విధానాలపై కీలక నిర్ణయాలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ మూడింటికి సంబంధించిన పందాల పూర్తి ఫేస్ వ్యాల్యూపై 28 శాతం జీఎస్టీ విధించాలని ఈ సమావేశాల్లో నిర్ణయించడం జరిగింది. -
ఆన్లైన్ స్కిల్ గేమింగ్‌ను వేరుగా చూడాలి
న్యూఢిల్లీ: గేమింగ్ పరిశ్రమను 28 శాతం జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తూ ఇటీవలే జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని పరిశ్రమలోని కొన్ని వర్గాలు విభేధిస్తున్నాయి. ఏ గేమ్ అన్న దానితో సంబంధం లేకుండా గేమింగ్ పరిశ్రమ మొత్తాన్ని గరిష్ట పన్ను పరిధిలోకి తీసుకురావడం తెలిసిందే. దీన్ని సుమా రు 120 ఆన్లైన్ క్యాజువల్ స్కిల్ గేమింగ్ కంపెనీలు వ్యతిరేకిస్తున్నాయి. పన్ను విషయంలో ఫ్యాంటసీ స్పోర్ట్స్ నుంచి తమను (స్కిల్ గేమింగ్/నైపుణ్యాలను పెంచుకునేవి) వేరుగా చూడాలని కోరు తూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి, జీఎస్టీ కౌన్సిల్ సభ్యులకు లేఖ రాశాయి. అంతర్జాతీయంగా ప్రైజ్ మనీతో కూడిన ఫ్యాంటసీ స్పోర్ట్స్‌పై పన్ను అనేది ఆన్లైన్ స్కిల్ గేమింగ్‌తో పోలిస్తే భిన్నంగా ఉన్నట్టు మంత్రి దృష్టికి తీసుకెళ్లాయి. లాటరీలు, ఫ్యాంటసీ స్పోర్ట్స్‌తో పోలిస్తే ఆన్లైన్ స్కిల్ గేమింగ్ వినియో గం భిన్నంగా ఉంటుందని వివరించాయి. అలాగే, వ్యాపార నమూనా, సామాజిక ఔచిత్యం వేర్వేరు అని పేర్కొన్నాయి. రియల్ మనీ గేమింగ్ పరిశ్రమలో ఫ్యాంటసీ స్పోర్ట్స్ అనేది ప్రత్యేక విభాగమని పరిశోధనా సంస్థలైన కేపీఎంజీ, రెడ్‌సీర్ సైతం వర్గీకరించినట్టు తెలిపాయి. ఆన్లైన్ స్కిల్ గేమింగ్ పూర్తి విలువపై 28 శాతం జీఎస్టీ అనేది పరిశ్రమకు మరణశాసనంగా మారుతుందని ఈ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. కనుక పరిశ్రమ మనుగడకు వీలుగా తమపై పన్ను భారాన్ని తగ్గించాలని కోరాయి. -
ఆన్లైన్ గేమింగ్‌లో పెట్టుబడులకు విఘాతం
న్యూఢిల్లీ: రియల్ మనీ ఆన్లైన్ గేమింగ్‌పై 28 శాతం పన్ను విధించాలన్న జీఎస్టీ మండలి నిర్ణయంతో పెట్టుబడులకు తీవ్ర విఘాతం కలుగుతుందని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇప్పటివరకు చేసిన 2.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులను రైటాఫ్ చేయాల్సిన పరిస్థితి వస్తుందని ప్రధాని నరేంద్ర మోదీకి దేశ, విదేశాలకు చెందిన 30 ఇన్వెస్ట్మెంట్ సంస్థలు సంయుక్తంగా లేఖ రాశాయి. అలాగే, వచ్చే 3–4 ఏళ్లలో రాబోయే సుమారు 4 బిలియన్ డాలర్ల పెట్టుబడులపైనే ప్రభావం పడుతుందని పేర్కొన్నాయి. లేఖ రాసిన ఇన్వెస్టర్లలో పీక్ ఫిఫ్టీన్ క్యాపిటల్, టైగర్ గ్లోబ ల్, డీఎస్టీ గ్లోబల్, ఆల్ఫా వేవ్ గ్లోబల్ మొదలైనవి ఉన్నాయి. జీఎస్టీ మండలి నిర్ణయం తమను షాక్‌కు గురి చేసిందని, ఇలాంటి వాటి వల్ల గేమింగ్‌పై మాత్రమే కాకుండా భారత్‌లో ఇతరత్రా వర్ధమాన రంగాలపైనా ఇన్వెస్టర్ల విశ్వాసం సన్నగిల్లుతుందని అవి తెలిపాయి. -
కొత్త కారు కొనేవారికే కష్టమే! జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయంతో..
సాధారణంగా ఎప్పటికప్పుడు వాహన తయారీ సంస్థలు తన ఉత్పత్తుల ధరలను పెంచుతూనే ఉంటాయి. ముడిసరుకుల ధరల కారణంగా.. ఇతరత్రా కారణాలు చూపిస్తూ ఏడాదికి కనీసం ఒక్క సారైనా పెంచుతుందన్న విషయం అందరికి తెలిసిందే. కాగా తాజాగా జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలతో మల్టీ యుటిలిటీ వెహికల్స్ (MUV), క్రాస్ఓవర్ యుటిలిటీ వెహికల్స్ (XUV) ధరలు పెరిగినట్లు స్పష్టంగా తెలిసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మంగళవారం జరిగిన 50వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కొత్త కారు కొనాలనుకునే వారికి జీఎస్టీ కౌన్సిల్ పెద్ద షాక్ ఇచ్చింది. ఎంపిక చేసిన మోడళ్ల మీద జీఎస్టీ సెస్ పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కావున ఇప్పుడు కొత్త ఎమ్‌యూవీ కార్లను కొనుగోలు చేసేవారు ఎక్కువ ధరలు చెల్లించాల్సి వస్తుందని తెలుస్తోంది. 28 శాతం జీఎస్టీ ఉండగా.. దీనిపైన 22 శాతం సెస్ విధించారు. దీంతో వాహన ధరలకు రెక్కలొచ్చాయి. (ఇదీ చదవండి: షాకిచ్చిన ఇన్ఫోసిస్.. తీవ్ర నిరాశలో ఉద్యోగులు - కారణం ఇదే!) ఎస్యూవీ అంటే పొడవు 4 మీటర్ల కంటే ఎక్కువ ఉండటమే కాకుండా.. ఇంజిన్ కెపాసిటీ 1500 సీసీ కంటే ఎక్కువ ఉండాలి. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 170 మీమీ కంటే ఎక్కువ ఉండాలి. ఇవన్నీ ఉన్న కార్లు మాత్రమే ధరల పెరుగుదల అందుకుంటాయని తెలుస్తోంది. గతంలో సెస్ అనేది 20 శాతంగా ఉండేది. ఇది తాజాగా రెండు శాతం పెరిగి సెస్ 22 శాతానికి చేరింది. ధరల పెరుగుదల సామాన్య ప్రజల మీద ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉందని భావిస్తున్నాము. -
అభివృద్ధికి నిధులివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను మంత్రి హరీశ్‌రావు కోరారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అనంతరం నిర్మలా సీతారామన్‌తో మంత్రి హరీశ్‌రావు ప్రత్యే కంగా భేటీ అయ్యారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవ స్థీకరణ చట్టం 2014 లోని సెక్షన్ 94(2) ప్రకారం ఈ మేరకు నిధులు ఇవ్వాలని అభ్యర్థిస్తున్నామని వివరించారు. 2015–16, 2016–17, 2017–18, 2018–19, 2020–21 సంవత్సరాలకుగానూ ఏడాదికి రూ.450 కోట్లు మేర నిధులు ఇవ్వడం జరిగింది. 2014–15, 2019–20, 2021–22, 2022–23 ఆర్థిక సంవత్సరాలకు గాను తెలంగాణకు నిధులు మంజూరు చేయలేదన్న అంశాన్ని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలలో తెలంగాణలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు గాను ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం నిధులు మంజూరు చేయాలని కోరారు. జీఎస్టీ సమస్యల పరిష్కారానికి అధికారులను నియమించాలి తెలంగాణకు రావాల్సిన ఐజీఎస్టీ నిధులు, ఇతర సమస్యలను వెంటనే పరిష్కరించాలని మంత్రి హరీశ్‌రావు జీఎస్టీ కౌన్సిల్‌ను కోరారు. ఈ విషయమై అధికారుల బృందాన్ని ఏర్పాటు చేయాలంటూ చాలా కాలంగా జీఎస్టీ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందన్నారు. మంగళవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత జరిగిన 50 వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో హారీశ్‌రావు పాల్గొన్నారు. తెలంగాణకు రావాల్సిన ఐజీఎస్టీ నిధుల అంశాన్ని ప్రస్తావిస్తూ, మహారాష్ట్రకు చెందిన ఒక టాక్స్ పేయర్ రూ.82 కోట్లు తెలంగాణకు చెల్లించాల్సి ఉన్నదని... ఇదే విషయాన్ని ఆ టాక్స్ పేయర్ కూడా అంగీకరించారని వివరించారు. అయితే తనకు రీఫండ్ రాగానే చెల్లిస్తామని సదరు టాక్స్ పేయర్ హామీ ఇచ్చినప్పటికీ తనకు రీఫండ్ ఇంకా పెండింగ్‌లోనే ఉండిపోయిందన్న అంశాన్ని జీఎస్టీ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లారు. గతంలో జరిగిన 47వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలోనే ఈ అంశాన్ని లేవనెత్తామని... ఆఫీసర్లతో కూడిన కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు హామీ లభించినా ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదన్నారు. కాగా ఈ ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక మంత్రి సానుకూలంగా స్పందించారు. 47వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగులో చర్చించుకున్నట్లుగా ఆఫీసర్లతో కూడిన కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. -
GST: పోటీ పరీక్షలు రాసేవారికి శుభవార్త.. తగ్గనున్న ఫీజులు!
పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. కేంద్ర, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ యూనివర్సిటీలు, ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలకు ప్రవేశ పరీక్షలను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని లెవీ పరిధి నుంచి మినహాయిస్తూ జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సు చేసిందని పేర్కొన్నారు. అలాగే పెన్సిళ్లు, షార్పనర్లపైనా లెవీని తగ్గించాలని జీఎస్టీ మండలి సిఫార్సు చేసింది. విద్యార్థులు దేశవ్యాప్తంగా పలు యూనివర్సిటీలు, విద్యా సంస్థల్లో ప్రవేశం కోసం వివిధ పరీక్షలకు సిద్ధమవుతుంటారు. వీటికి చెల్లించే ఫీజుపై ఇప్పటివరకు 18 శాతం జీఎస్టీని చెల్లించాల్సి వచ్చేది. తాజాగా ప్రవేశ పరీక్ష ఫీజులపై జీఎస్టీని పూర్తిగా మినహాయించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించడం విద్యార్థులకు ఊరట కలిగించే అంశం. ఈ మేరకు ఫీజులు తగ్గే అవకాశం ఉంది. అలాగే విద్యార్థులకు ఊరట కలిగించే మరో అంశం పెన్సిల్, షార్పనర్లపై విధించే జీఎస్టీని తగ్గించడం. వీటిపై ప్రస్తుతం జీఎస్టీ 18 శాతంగా ఉంది. దీన్ని 12 శాతానికి తగ్గించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. (ఇదీ చదవండి: కేంద్రం తీపికబురు: రూ. 16,982 కోట్ల జీఎస్టీ బకాయిలు చెల్లింపు) -
49th GST Council Meeting: జీఎస్టీ ఫైలింగ్ ఆలస్య రుసుము తగ్గింపు
న్యూఢిల్లీ: జీఎస్టీ వార్షిక రిటర్నుల ఫైలింగ్ ఆలస్య రుసుమును హేతుబద్ధీకరిస్తూ జీఎస్టీ మండలి 49వ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 2022–23 ఆర్థిక సంవత్సరానికిగాను నమోదిత వ్యక్తులు ఫామ్ జీఎస్టీఆర్–9కు సంబంధించి రూ.5 కోట్ల వరకు టర్నోవర్ ఉంటే ఆలస్య రుసుము రోజుకు రూ.50, రూ.5–20 కోట్ల టర్నోవర్ ఉంటే రోజుకు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ రుసుము రూ.200 ఉంది. పన్ను చెల్లింపుదార్లకు ఉపశమనం కలిగించడానికి ఫామ్ జీఎస్టీఆర్–4, ఫామ్ జీఎస్టీఆర్–9, ఫామ్ జీఎస్టీఆర్–10లో పెండింగ్‌లో ఉన్న రిటర్నులకు సంబంధించి షరతులతో కూడిన మినహాయింపు లేదా ఆలస్య రుసుము తగ్గించడం ద్వారా క్షమాభిక్ష పథకాలను జీఎస్టీ మండలి సిఫార్సు చేసింది. రాష్ట్రాలకు పరిహార బకాయిలు.. 2022 జూన్‌కు సంబంధించి రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ పరిహార బకాయిలు రూ.16,982 కోట్లు, అలాగే ఆరు రాష్ట్రాలకు మరో రూ.16,524 కోట్లు విడుదల చేస్తున్నట్టు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ప్రకటించారు. కేంద్రం తన సొంత వనరుల నుంచి ఈ మొత్తాన్ని విడుదల చేయాలని నిర్ణయించుకుందని, భవిష్యత్తులో పరిహార రుసుము వసూళ్ల నుంచి ఈ మొత్తాన్ని తిరిగి పొందుతామని ఆమె చెప్పారు. దీంతో జీఎస్టీ చట్టం 2017 ప్రకారం ఐదేళ్ల కాలానికి తాత్కాలికంగా అనుమతించదగిన మొత్తం పరిహార బకాయిలను కేంద్రం క్లియర్ చేస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటన వెల్లడించింది. రాష్ట్రాలు వారి అకౌంటెంట్ జనరల్ నుంచి సర్టిఫికేట్లను ఇచ్చినప్పుడు పెండింగ్‌లో ఉన్న ఏవైనా పరిహార రుసుము మొత్తాలను వెంటనే క్లియర్ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. పరిహార బకాయి కింద ఆంధ్రప్రదేశ్‌కు రూ.689 కోట్లు, తెలంగాణకు రూ.548 కోట్లు సమకూరనున్నాయి. బెల్లం పానకంపై తగ్గింపు.. ఇక విడిగా విక్రయించే బెల్లం పానకంపై ప్రస్తుతం 18 శాతం ఉన్న జీఎస్టీ ఎత్తివేస్తూ మండలి నిర్ణయం తీసుకుంది. ప్యాక్, లేబులింగ్ చేసి బెల్లం పానకం విక్రయిస్తే 5 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. పెన్సిల్ షార్ప్నర్స్కు 18 శాతం నుంచి జీఎస్టీని 12 శాతానికి చేర్చారు. పన్ను ఎగవేతలను ఆరికట్టడంతోపాటు పాన్ మసాలా, గుట్కా, నమిలే పొగాకు వంటి వస్తువుల నుండి ఆదాయ సేకరణను మెరుగుపరచడానికి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చేసిన సిఫార్సులను జీఎస్టీ మండలి ఆమోదించింది. -
కేంద్రం తీపికబురు: రూ. 16,982 కోట్ల జీఎస్టీ బకాయిలు చెల్లింపు
న్యూఢిల్లీ: జీఎస్టీ పెండింగ్ బకాలను రాష్ట్రాలకు వెంటనే క్లియర్ చేయనున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి జీఎస్టీ బకాయిలు రూ. 16,982 కోట్లను ఈ రోజునుంచి చెల్లిస్తామని శనివారం వెల్లడించారు. జూలై 2017 నుండి ఐదేళ్ల బకాయిలను ఆయా రాష్ట్రాలకు కేంద్రం చెల్లించనుంది. ఈ మొత్తం నిజంగా నష్టపరిహార నిధిలో అందుబాటులో లేనప్పటికీ, తమ సొంంత వనరుల నుండి విడుదల చేయాలని నిర్ణయించుకున్నామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అలాగే ఈ మొత్తాన్ని ఫ్యూచర్ కాంపెన్సేషన్ నుంచి తిరిగి పొందుతామన్నారు. అలాగే పలు వస్తువులపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ) తగ్గిస్తున్నట్లు ఈసందర్భంగా ప్రకటించారు. నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 49వ జీఎస్టీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న ఇతర నిర్ణయాలు: ట్యాగ్లు, ట్రాకింగ్ పరికరాలు లేదా డేటా లాగర్స్‌పై జీఎస్టీ తొలగింపు. అంతకుముందు 18 శాతం బొగ్గు వాషరీకి లేదా వాటి ద్వారా సరఫరా చేయబడిన కోల్డ్ రిజెక్ట్స్ పై కూడా జీఎస్టీ లేదు. పెన్సిల్ షార్పనర్లపై జీఎస్టీని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించారు. ద్రవ బెల్లంపై జీఎస్టీని తొలగింపు. అంతకుముందు 18 శాతంగా ఉంది. ప్యాక్ చేసిన ,లేబుల్డ్ లిక్విడ్ బెల్లంపై జీఎస్టీ18 శాతం నుండి 5 శాతానికి తగ్గింపు. పాన్ మసాలా, గుట్కాపై సామర్థ్య ఆధారిత పన్ను విధింపుపై మంత్రుల బృందం (GoM) సిఫార్సును GST కౌన్సిల్ ఆమోదించింది. Centre will also clear the admissible final GST Compensation to those states who've provided revenue figures certified by the Accountant General which amounts to Rs 16,524 crores. - Smt @nsitharaman. pic.twitter.com/p7iAuRUMSc — NSitharamanOffice (@nsitharamanoffc) February 18, 2023 -
జనవరిలో జీఎస్టీ వసూళ్లు@ రూ. 1.55 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: జనవరిలో వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) వసూళ్లు రూ. 1.55 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇంత అత్యధికంగా వసూలు కావడం ఇది రెండోసారి. జనవరి 31 సాయంత్రం 5 గం.ల వరకు రూ. 1,55,922 కోట్ల స్థూల జీఎస్టీ వసూలైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ఇందులో సీజీఎస్టీ రూ. 28,963 కోట్లు కాగా, ఎస్జీఎస్టీ రూ. 36,730 కోట్లు, ఐజీఎస్టీ రూ. 79,599 కోట్లుగా ఉన్నట్లు వివరించింది. గత ఆర్థిక సంవత్సరం జనవరి వరకూ కాలంతో ఈ ఆర్థిక సంవత్సరం జనవరి వరకూ వ్యవధి పోలిస్తే జీఎస్టీ ఆదాయం 24 శాతం పెరిగినట్లు పేర్కొంది. వసూళ్లు రూ. 1.50 లక్షల కోట్లు దాటడం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది మూడోసారి. ఏప్రిల్‌లో అత్యధికంగా రూ. 1.68 లక్షల కోట్లు వసూలయ్యాయి. చదవండి: Union Budget 2023: నిర్మలమ్మా ప్రధానంగా ఫోకస్ పెట్టే అంశాలు ఇవేనా! -
జీఎస్టీ కౌన్సిల్ అజెండాలో కీలక అంశాలు
న్యూఢిల్లీ: జీఎస్టీ కౌన్సిల్ భేటీ ఈ నెల 17న జరగనుంది. జీఎస్టీ నిబంధనల ఉల్లంఘనలను నేరాలుగా పరిగణించకపోవడం అన్నది ముఖ్యమైనది. అలాగే, జీఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఏర్పాటు, పాన్ మసాలా, గుట్కా కంపెనీల పన్ను ఎగవేతలు తదితర అంశాలు చర్చకు రానున్నాయి. జీఎస్టీ కింద నిబంధనల ఉల్లంఘనలో ప్రాసిక్యూషన్ చేపట్టే వాటి ద్రవ్య పరిమితి (కేసు విలువ) మూడు రెట్లు పెంచాలని జీఎస్టీ కౌన్సిల్‌కు సంబంధించి న్యాయ కమిటీ సిఫారసు చేసింది. దీనిపై జీఎస్టీ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే, జీఎస్టీ ఉల్లంఘనలదారుల నుంచి వసూలు చేసే ఫీజును కూడా తగ్గించడాన్ని తేల్చనుంది. ముఖ్యంగా ఆన్లైన్ గేమింగ్, క్యాసినోలు, గుర్రపు పందేలపై పన్ను రేటు పెంపు అంశాన్ని ఈ విడత జీఎస్టీ కౌన్సిల్ సమావేశం చర్చకు చేపట్టకపోవచ్చని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీనిపై మంత్రుల బృందం ఇంకా నివేదిక సమర్పించాల్సి ఉందని పేర్కొన్నాయి. -
పెరుగు, లస్సీపై జీఎస్టీ విషయంలో వెనక్కి తగ్గిన కేంద్రం
-
జీఎస్టీ: బాదుడే బాదుడు..రేపటి నుంచే సామాన్యుడిపై ధరల దరువు!
ఉప్పు నుంచి పప్పు దాకా.. కూరగాయల నుంచి పాల పాకెట్ దాకా పెరిగిపోతున్న వస్తువుల ధరల దరువుకు సామాన్యులు అల్లాడిపోతున్నారు. అది చాలదన్నట్లు రేపటి నుంచి నిత్యావసర సరుకులపై గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ విధింపు అనివార్యంమైంది. దీంతో నోట్లోకి ముద్ద దిగాలన్నా నోట్ల ఖర్చు పెట్టాల్సి పరిస్థితి నెలకొనడంతో కొనుగోలు దారులు లబోదిబోమంటున్నారు. గత నెలలో జరిగిన జీఎస్టీ 47వ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు రకాల నిత్యావసర ఉత్పత్తులపై జీఎస్టీ పెంపు విధింపు నిర్ణయం తీసుకుంది. దీంతో పెరిగిన కొత్త జీఎస్టే రేట్లు రేపటి నుంచి (జులై18) అమల్లోకి రానున్నాయి. ఆర్ధిక శాఖ మంత్రి నిర్మాల సీతారామన్ అధ్యక్షతన జూన్‌లో రెండు రోజుల పాటు వస్తు సేవల పన్ను (జీఎస్టీ) మండలి సమావేశంలో కొత్త జీఎస్టీని పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. లీగల్ మెట్రాలజీ యాక్ట్ ప్రకారం..జులై 18 నుంచి ప్రీ ప్యాక్డ్ అండ్ ప్రీ లేబుల్డ్ రీటైల్ ప్యాకెట్ ఉత్పత్తులపై ఉదాహరణకు పెరుగు,లస్సీ, బటర్ మిల్క్ ప్యాకెట్లపై 5శాతం జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు చెక్కులు (లూజ్ లేదా బుక్ రూపంలో) జారీ చేయడానికి బ్యాంకులు వసూలు చేసే రుసుముపై 18 శాతం జీఎస్టీ, ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్‌లో 12 శాతం నుంచి 18 శాతానికి సవరించాలని జీఎస్టీ కౌన్సిల్ సిఫారసుతో ఎల్ఈడీ లైట్లు, మ్యానిఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో ఉపయోగించే ఫిక్సర్లు(టూల్స్), ఎల్ఈడీ ల్యాంప్స్ ధరలు పెంపునకు సిద్ధంగా ఉన్నాయి. కాస్ట్లీగా ఆసుపత్రి గదులు, హోటల్స్ రూమ్స్ ప్రతి రోగికి రోజుకు రూ.5000 కంటే ఎక్కువ ఉన్న ఆసుపత్రి గది అద్దె (ఐసీయూ మినహాయించి) ఐటిసి లేకుండా గదికి 5 శాతం వసూలు చేయనున్నారు. గతంలో దీనికి గూడ్స్ యాడ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ) నుంచి మినహాయింపు ఉండేది. కాగా, ప్రస్తుతం పన్ను మినహాయింపు కేటగిరీకి భిన్నంగా హోటల్ గదులను రోజుకు రూ.1,000 లోపు 12 శాతం జీఎస్టి శ్లాబ్ పరిధిలోకి తీసుకురావాలని జీఎస్టి కౌన్సిల్ నిర్ణయించింది. చదవండి: జీఎస్టీ బాదుడు, మరింత ఖరీదుగా నిత్యావసర వస్తువులు! -
ఇక జీఎస్టీ మూడు శ్లాబులేనా.. వాటి ధరలు పెరగనున్నాయా?
జీఎస్టీ కౌన్సిల్ తన తదుపరి సమావేశంలో అతి తక్కువ పన్ను శ్లాబ్ రేటును 5 శాతం నుంచి 8 శాతానికి పెంచాలని భావిస్తున్నట్లు సమాచారం. తద్వారా ఆదాయాలు పెరిగి రాష్ట్రాలు నష్ట పరిహారం కోసం కేంద్రంపై ఆధారపడకుండా ఉండటానికి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ వ్యవస్థలో మార్పులు చేయాలని చూస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అతి తక్కువ శ్లాబ్ 5 శాతంను పెంచడంతో పాటు ఆదాయాన్ని పెంచడానికి వివిధ చర్యలను సూచిస్తూ రాష్ట్ర ఆర్థిక మంత్రుల బృందం ఈ నెల చివరినాటికి తన నివేదికను జీఎస్టీ మండలికి సమర్పించే అవకాశం ఉంది. 5 నుంచి 8కి.. ప్రస్తుతం, జీఎస్టీ కింద 5, 12, 18 & 28 శాతం పన్ను రేటు గల 4 శ్లాబులు ఉన్నాయి. కొన్ని అత్యావశ్యక వస్తువులకు పన్ను నుంచి మినహాయింపు లభిస్తే, మరికొన్ని వాటి మీద అతి తక్కువ మాత్రమే పన్ను విధిస్తున్నారు. ఇంకా లగ్జరీ, డీమెరిట్ ఐటమ్ ఉత్పత్తులకు అత్యధికంగా 28 శాతం పన్ను వర్తిస్తుంది. జీఎస్టీ తీసుకొచ్చిన కారణంగా రాష్ట్రాలు నష్టపోయిన ఆదాయాన్ని భర్తీ చేయడానికి కొత్తగా జీఎస్టీ పన్ను వ్యవస్థలో మార్పు చేయాలని కేంద్రం భావిస్తుంది. 5 శాతం శ్లాబును 8 శాతానికి పెంచడం ద్వారా కేంద్రానికి అదనంగా రూ.1.50 లక్షల కోట్ల వార్షిక ఆదాయం రావచ్చు అని అధికార వర్గాలు తెలిపాయి. ఆ సంఖ్యను కూడా తగ్గించాలి ప్రధానంగా ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలపై విధిస్తున్ శ్లాబును 1 శాతం పెంచడం ద్వారా వార్షికంగా రూ.50,000 కోట్ల ఆదాయ లాభం లభిస్తుంది. హేతుబద్ధీకరణలో భాగంగా 5 శాతం రేటును 8 శాతంగాను, 12 శాతం రేటు గల వస్తువులను 18 శాతం శ్లాబులో కలపాలని, 28 శాతం రేటును యధాతథంగా ఉంచాలని కేంద్రం భావిస్తుంది. ఈ ప్రతిపాదన అమలులోకి వస్తే, ప్రస్తుతం 12 శాతం పన్ను విధించే అన్ని వస్తువులు మరియు సేవలు 18 శాతం శ్లాబ్ కిందకు మారతాయి. అంతేకాకుండా, జీఎస్టీ నుంచి మినహాయించిన వస్తువుల సంఖ్యను తగ్గించాలని కూడా జివోఎం ప్రతిపాదించింది. జూన్ నెలతో గడువు ముగింపు ప్రస్తుతం అన్ ప్యాకేజ్డ్, అన్ బ్రాండెడ్ ఫుడ్ & డైరీ ఐటమ్స్'కు జీఎస్టీ నుంచి మినహాయింపు లభిస్తుంది. జీఎస్టీ కౌన్సిల్ ఈ నెల చివర్లో లేదా వచ్చే నెల ప్రారంభంలో సమావేశమై జివోఎం నివేదికపై చర్చించి తదనుగుణంగా చర్యలు తీసుకుంటుందని వర్గాలు తెలిపాయి. గత కొన్ని ఏళ్లుగా జీఎస్టీ అమలులోకి తీసుకొని రావడం వల్ల రాష్ట్రాలు నష్టపోయే ఆదాయాన్ని కేంద్రమే చెల్లిస్తుంది. ఈ ప్రక్రియకు జూన్ నెలతో గడువు ముగిస్తుంది. జీఎస్టీ నష్టపరిహార ప్రక్రియ ముగింపుకు రావడంతో రాష్ట్రాలు కేంద్రంపై ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించడానికి కేంద్రం జీఎస్టీ పన్ను వ్యవస్థలో మార్పులు చేయాలని భావిస్తుంది. జూలై 1, 2017న జీఎస్టీ అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి జూన్ 2022 వరకు రాష్ట్రాలకు 5 సంవత్సరాల పరిహారం చెల్లిస్తామని పేర్కొంది. 2015-16 సంవత్సరాన్ని బేస్ ఇయర్‌గా చేసుకొని సంవత్సరానికి 14 శాతం వృద్దిని పరిగణలోకి తీసుకొని నష్టాన్ని లెక్కిస్తామని కేంద్రం అంగీకరించింది. అయితే, అనేక వస్తువులపై జీఎస్టీ తగ్గడం వల్ల ఈ 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రాల ఆదాయం భారీగా తగ్గింది. కొన్ని సంవత్సరాలుగా జీఎస్టీ కౌన్సిల్ తరచుగా వాణిజ్యం & పరిశ్రమలకు అనుగుణంగా పన్ను రేట్లను సవరించింది. ఉదాహరణకు, జీఎస్టీ అమలులకి వచ్చిన కొత్తలో 28 శాతం పన్ను శ్లాబుల ఉన్న సంఖ్య 228 అయితే.. ప్రస్తుతం ఆ సంఖ్య 35కు తగ్గింది. (చదవండి: సామాన్యులకు మరో కొత్త టెన్షన్.. ఇక మనం వాటిని కొనలేమా?) -
వస్త్ర పరిశ్రమకు ఊరట
న్యూఢిల్లీ: వస్త్రాలపై (టెక్స్టైల్స్) జీఎస్టీని 5 శాతం నుంచి 12 శాతానికి పెంచాలన్న నిర్ణయాన్ని జీఎస్టీ కౌన్సిల్ నిలిపివేసింది. పలు రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో నిలిపివేస్తూ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వాస్తవానికి జనవరి 1 నుంచి నూతన రేటు అమల్లోకి రావాల్సి ఉంది. నిర్ణయాన్ని వాయిదా వేయాలంటూ రాష్ట్రాల నుంచి డిమాండ్లు రావడంతో అత్యవసరంగా జీఎస్టీ మండలి శుక్రవారం భేటీ అయి ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. రాష్ట్రాల ఆర్థిక మంత్రుల కమిటీకి ఈ అంశాన్ని అప్పగించి, ఫిబ్రవరి నాటికి పన్ను రేటుపై సిఫారసు చేయాలని కోరినట్టు మంత్రి సీతారామన్ చెప్పారు. పాదరక్షలకు సంబంధించిన ఇదే డిమాండ్‌కు అంగీకరించలేదన్నారు. రేట్ల హేతుబద్ధీకరణను పరిశీలిస్తున్న రాష్ట్రాల ఆర్థిక మంత్రుల బృందాన్ని.. టెక్స్‌టైల్స్‌పై పన్ను రేటును పరిశీలించాలని కోరినట్టు చెప్పారు. ప్రస్తుతం మానవ తయారీ ఫైబర్‌పై 18 శాతం, మానవ తయారీ యార్న్‌పై 12 శాతం, ఫ్యాబ్రిక్స్‌పై 5 శాతం రేటు అమల్లో ఉంది. ఇన్ని రకాల పన్ను రేటు కాకుండా.. రేట్ల వ్యత్యాసానికి ముగింపు పలికి అన్ని రకాల వస్త్రాలపై (కాటన్ మినహా) జనవరి 1 నుంచి 12 శాతం రేటును అమలు చేయాలని సెప్టెంబర్‌లో జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. అలాగే అన్ని రకాల పాదరక్షలపైనా 12 శాతం రేటును అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. వస్త్రాలపై 12 శాతం రేటుకు సుముఖంగా లేమని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, పశ్చిమబెంగాల్, రాజస్తాన్, తమిళనాడు తదితర రాష్ట్రాలు తెలియజేయడం గమనార్హం. డిమాండ్ల వల్లే.. కౌన్సిల్ సమావేశం అనంతరం మంత్రి సీతారామన్ వివరాలు వెల్లడించారు. ‘‘డిసెంబర్ నుంచి ప్రతిపాదనలు రావడం మొదలైంది. గుజరాత్ ఆర్థిక మంత్రి నుంచి కూడా లేఖ అందింది. దీంతో అత్యవసరంగా భేటీ అయి 12 శాతం రేటుకు వెళ్లకుండా యథాతథ స్థితిని కొనసాగించాలని నిర్ణయించాం. కనుక రేట్ల పరంగా దిద్దుబాటు ఉండదు’’ అని వివరించారు. మంత్రుల ప్యానెల్ ఇచ్చే సిఫారసులపై ఫిబ్రవరి చివర్లో లేదా మార్చి మొదట్లో నిర్వహించే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో చర్చిస్తామని చెప్పారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అధ్యక్షతన గల మంత్రుల బృందంలో పశ్చిమబెంగాల్, కేరళ, బిహార్ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉన్నారు. పరిశ్రమ ఒత్తిడి ఉండొచ్చు.. టెక్స్‌టైల్స్‌పై రేట్ల హేతుబద్ధీకరణకు అన్ని రాష్ట్రాలు అంగీకరించాయి. కానీ రాత్రికిరాత్రి ఒత్తిడి వెనుక.. ధరలు పెరగడం భారంగా పరిణమిస్తుందంటూ పరిశ్రమలో ఒక వర్గం చెప్పడం వల్ల కావచ్చు. అసంఘటిత రంగం రూపంలో ఒత్తిళ్లు రావచ్చని పరిశ్రమ భావించి ఉంటుంది. కొనుగోలు దారులపై భారం పడుతుందన్న ఆలోచన కూడా ఉంది. అందుకనే ఈ అంశం తిరిగి కమిటీ ముందుకు వెళ్లింది. మరింత లోతైన అధ్యయనం చేసి వివరాలను కౌన్సిల్ ముందు ఉంచుతుంది అని సీతారామన్ చెప్పారు. -
తప్పుడు లెక్కలు తగవు: బుగ్గన
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వృద్ధి రేట్లపై ప్రతిపక్ష టీడీపీ తప్పుడు లెక్కలతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఏమాత్రం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. వ్యవసాయాన్ని హేళన చేసిన టీడీపీ అగ్ర నాయకత్వం ప్రతిపక్షంలోనూ అదే ధోరణితో వ్యవహరిస్తూ రాష్ట్రానికి జీవనాధారమైన రంగం వృద్ధి రేటును కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. ఆర్థిక వ్యవస్థలో నిజమైన వృద్ధిని అంచనా వేసేందుకు స్థిరమైన ధరలను వినియోగిస్తారని, ప్రతిపక్ష నాయకులు మాత్రం ప్రస్తుత ధరలపై వృద్ధి రేట్లతో వంచనకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ మేరకు ఆర్థిక మంత్రి బుగ్గన శుక్రవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. అంచనాలకు మించి పనితీరు సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పుకునే యనమల కరోనా సంవత్సరాన్ని కూడా కలిపి లెక్కలు కట్టి ఆర్థిక వృద్ధి లేదంటూ తప్పుదోవ పట్టిస్తున్నారు. కోవిడ్ వల్ల 2020–21లో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్న విషయం తెలియదా? గత సర్కారు వైదొలగే నాటికి రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో వృద్ధి రేటు క్షీణిస్తూ వచ్చింది. రాష్ట్ర జీఎస్డీపీ 2017–18లో 10.09 శాతం వృద్ధి రేటు ఉంటే 2018–19లో 4.88 శాతానికి పడిపోయింది. ఇది దేశంలోని ప్రధాన రాష్ట్రాలలో అతి తక్కువ. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 2019–20లో రాష్ట్రం 7.23 శాతం వృద్ధి నమోదు చేసి దేశంలో నాలుగో స్థానంలో నిలిచింది. 2019–20లో రాష్ట్రం వ్యవసాయ రంగంలో 7.91 శాతం, పారిశ్రామిక రంగంలో 10.24 శాతం, సేవారంగంలో 6.20 శాతం వృద్ధితో అంచనాలకు మించి పనితీరు కనబరిచింది. నిరుద్యోగంపైనా తప్పుడు లెక్కలే రాష్ట్రంలో 6.5 శాతం నిరుద్యోగ రేటు ఉందని చెప్పడం కూడా అవాస్తవమే. కేంద్ర సర్వే సంస్థ లెక్కల ప్రకారం రాష్ట్ర నిరుద్యోగ రేటు (15 – 59 ఏళ్ల వయసు) 2018–19లో 5.7 శాతం ఉంటే 2019 –20లో 5.1 శాతానికి తగ్గింది. యనమల తప్పుడు లెక్కలతో రాజకీయ లబ్ధి కోసం పాకులాడటం దురదృష్టకరం. ఎస్‌డీజీల్లో మరింత మెరుగ్గా 3వ ర్యాంకు సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచీ, పేదరికం, ఆర్థిక అసమానతల నిర్మూలనలో రాష్ట్రం మెరుగుపడలేదంటూ ప్రతిపక్ష నాయకులు చేస్తున్న విమర్శల్లో ఏమాత్రం వాస్తవం లేదు. 2018–19 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచీలో కేరళ, హిమాచల్‌ప్రదేశ్, తమిళనాడు మొదటి మూడు స్థానాల్లో నిలవగా ఏపీ నాలుగో స్థానంలో ఉంది. 2019 –20, 2020–21 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచీల్లో ఏపీ మెరుగ్గా 3వ స్థానంలో ఉంది. టీడీపీ హయాంలో 2018–19లో రాష్ట్రం పెర్ఫార్మర్ కేటగిరీలో ఉంటే ఇవాళ ఫ్రంట్‌రన్నర్ కేటగిరీకి ఎదిగాం. 67 నుంచి 81కి పెరిగిన మార్కులు నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం గత రెండేళ్లలో పేదరిక నిర్మూలనలో 5వ స్థానంలో నిలిచి ఎస్డీజీ మార్కులను 67 నుంచి 81కి (మొత్తం 100 మార్కులకు) పెంచుకుని పేదలను కరోనా కష్టకాలంలో కాపాడుకున్నాం. రాష్ట్రంలో ఆర్థిక అసమానత 32 నుంచి 43 శాతానికి పెరిగిందని ఆరోపణలు చేస్తున్న యనమల ఏ లెక్కల ప్రకారం ఇలాంటి అసత్యాలు ప్రచారం చేస్తున్నారో చెప్పాలి. చెప్పే సంఖ్యలు, లెక్కలకు ఎలాంటి ఆధారాలు లేకుండా అనుకూల మీడియాలో పత్రికా ప్రకటనలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలనుకోవడం తగదు. ఎస్డీజీ సూచీల్లో అసమానతల తగ్గింపు ఆశయంలో రాష్ట్రం 2018–19లో 15వ స్థానంలో ఉండగా 2020 – 21లో 6వ స్థానానికి మెరుగుపడింది. జీఎస్టీ పరిహారాన్ని కొనసాగించాలి ►45వ కౌన్సిల్ సమావేశంలో కేంద్రానికి ఆర్థిక మంత్రి బుగ్గన వినతి సాక్షి, అమరావతి: జీఎస్టీ అమలు తర్వాత రాష్ట్ర పన్నుల ఆదాయంలో వృద్ధి రేటు తగ్గిపోవడంతో 2022 తర్వాత కూడా పరిహారాన్ని మరికొన్నేళ్లు కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం జీఎస్టీ కౌన్సిల్‌ను కోరింది. శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 45వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనలను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కౌన్సిల్‌కు తెలియచేశారు. జీఎస్టీ అమలుకు ముందు రాష్ట్ర వాణిజ్య పన్నుల ఆదాయంలో సగటు వృద్ధి రేటు 14 నుంచి 15 శాతం ఉండగా 2017లో జీఎస్టీ అమలు నాటి నుంచి 10 శాతానికి పరిమితమైందని బుగ్గన వివరించారు. దీంతో ఏటా పరిహారాన్ని తీసుకోవాల్సి వచ్చిందని, కోవిడ్ సంక్షోభంతో గత రెండేళ్లుగా జీఎస్టీ ఆదాయం మరింత క్షీణించిందని చెప్పారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని ఏటా 14 శాతం వృద్ధి రేటు కంటే తక్కువగా నమోదైన మొత్తాన్ని పరిహారంగా ఇచ్చే విధానాన్ని 2022 తర్వాత కూడా కొనసాగించాల్సిందిగా కోరారు. పెట్రోల్, డీజిల్‌పై పన్నులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే అంశాన్ని పరిశీలించాలని కేరళ హైకోర్టు సూచించిన నేపథ్యంలో ఈ విషయంలో రాష్ట్ర నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాట్ పరిధిలో ఉన్న రెండు ఉత్పత్తులను అదేవిధంగా కొనసాగించాల్సిందిగా కోరారు. ఆగస్టు వరకు పరిహారాన్ని త్వరగా ఇవ్వాలి ప్రస్తుతం నాపరాళ్లపై 18 శాతంగా ఉన్న పన్నును 5 శాతానికి తగ్గించాలన్న విజ్ఞప్తిపై నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించారు. సోలార్ పవర్, లిక్కర్ తయారీలో జాబ్ వర్క్‌లపై పన్ను రేట్లను తగ్గించాల్సిందిగా బుగ్గన కోరారు. రాష్ట్ర విభజన తర్వాత ఆదాయం గణనీయంగా పడిపోయిందని, సంక్షేమ పథకాలు సజావుగా అమలు కోసం ఆగస్టు వరకు జీఎస్టీ పరిహారాన్ని త్వరగా విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిని కోరారు. సమావేశంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, స్టేట్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ రవిశంకర్ నారాయణ్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. -
అనూహ్యం.. ఇక ఫుడ్ డెలివరీ యాప్‌లకూ జీఎస్టీ!
జీఎస్టీ కౌన్సిల్ అనూహ్య నిర్ణయానికి సిద్ధమైంది. ఫుడ్ డెలివరీ యాప్‌లను రెస్టారెంట్స్ పరిధిలోకి తీసుకురాబోతోంది. జీఎస్టీ విధించే ఉద్దేశంతోనే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇక మీదట ఫుడ్ డెలివరీ యాప్‌లకు 5 శాతం జీఎస్టీ విధించే దిశగా ఆలోచన చేస్తోంది. ఈ-కామర్స్ ఆపరేటర్లైన ఫుడ్ డెలివరీ సర్వీసులు.. జొమాటో, స్విగ్గీలాంటి ఫుడ్ సర్వీస్ స్టార్టప్‌లకు జీఎస్టీ భారం తప్పేలా కనిపించడం లేదు. శుక్రవారం(సెప్టెంబర్ 17న) లక్నోలో జీఎస్టీ కౌన్సిల్ కీలక భేటీ కానుంది. ఈ సమావేశంలో చర్చించబోయే 48 ప్రతిపాదనల్లో.. ఫుడ్ డెలివరీ యాప్‌లపైనా జీఎస్టీ విధించే అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ జీఎస్టీ కౌన్సిల్ గనుక ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపితే.. ఆన్లైన్ డెలివరీ యాప్‌లను రెస్టారెంట్ పరిధిలోకి తీసుకొచ్చి మరీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ వసూలు చేస్తారు. భారీ నష్టం కారణంగానే.. ఒకవేళ ఈ నిర్ణయం గనుక అమలు చేస్తే.. సాఫ్ట్వేర్లు అప్డేట్ చేసుకోవడానికి సదరు యాప్‌లకు కొంత టైం ఇవ్వాలని జీఎస్టీ కౌన్సిల్ బావిస్తోంది. ఇక నిర్ణయం వల్ల కస్టమర్లపై ఎలాంటి భారం ఉండబోదని చెబుతోంది. ప్రస్తుతం ఉన్న జీఎస్టీ రూల్స్ ప్రకారం.. ఫుడ్ డెలివరీ యాప్‌లను ట్యాక్స్ కలెక్టర్స్ ఎట్ సోర్స్‌గా భావిస్తున్నారు. అయితే గత రెండేళ్లలో ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ల అండర్-రిపోర్టింగ్ కారణంగా ఖజానాకు పన్ను నష్టం రూ .2,000 కోట్లు వాటిల్లినట్లు కేంద్రం లెక్కగట్టింది!. రెస్టారెంట్ కార్యకలాపాలను అన్‌రిజిస్ట్రర్ పద్ధతిలో నిర్వహించడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ట్యాక్స్ తక్కువే అయినా.. డెలివరీ వాల్యూమ్స్ ఎక్కువ కాబట్టి పన్ను ఎగవేత మొత్తం కూడా గణనీయమైనదిగా భావిస్తున్నట్లు ఓ అధికారి వెల్లడించారు. అందుకే జీఎస్టీ విధించాలనే నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. చదవండి: జొమాటో అతలాకుతలం -
ఏపీకి రూ.4,052 కోట్ల జీఎస్టీ బకాయిలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం రూ.4,052 కోట్ల జీఎస్టీ బకాయిలు చెల్లించాల్సి ఉందని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. జీఎస్టీ బకాయిలపై లోక్‌సభలో పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. స్పెషల్ బారోయింగ్ ప్లాన్‌లో భాగంగా 2020–21కి సంబంధించి రూ.1.10 లక్షల కోట్లు, 2021–22కి సంబంధించి రూ.1.59 లక్షల కోట్లను రాష్ట్రాలకు అందించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుందని వివరించారు. ఈనెల 15న రాష్ట్రాలకు రూ.75,000 కోట్లు విడుదల చేశామని వెల్లడించారు. ఇంకా ఏపీకి 2020–21కి రూ.2,493 కోట్లు, 2021–22కి సంబంధించి రూ.1,559 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని తెలిపారు. తెలంగాణకు 2020–21కి గాను రూ.2,515 కోట్లు, 2021–22కి సంబంధించి రూ.1,558 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. -
జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్? కేంద్రం క్లారిటీ
సాక్షి న్యూఢిల్లీ: సెంచరీ మార్క్ దాటి వాహనదారులకు చక్కలు చూపిస్తున్న పెట్రోల్ , డీజిల్ ధరలపై మరోసారి నిరాశే ఎదురైంది. పెట్రోల్, డీజిల్‌ను వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోకి తీసుకురావాలనే ప్రతిపాదన ఏదీ ఇంతవరకు రాలేదని ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. దీనికి తోడు పెరుగుతున్న ఇంధన ధరలు, వంట నూనెల ధరలపై లోక్‌సభలో వాడి వేడి చర్చ జరిగింది. ప్రధానంగా పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో చర్చ జరిగిందా, దీనిపై కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా ప్రాతినిధ్యాలు వచ్చాయా? వస్తే ఎలాంటి చర్యలు తీసుకున్నారు? దీనిపై రాష్ట్రాలతో ఏదైనా చర్చ జరిగిందా అనే ప్రశ్నలను సభలో సభ్యులు లేవ నెత్తారు. ఈ ప్రశ్నలకు సమాధానంగా, జీఎస్టీ పెట్రోల్, డీజిల్ చేర్చాలంటే కౌన్సిల్ సిఫారసు అవసరమని ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి చెప్పారు. ఇది జీఎస్టీ కౌన్సిల్ పరిధిలోని దనీ, ఆదాయం సహా, సంబంధిత అంశాలను దృష్టిలో ఉంచుకుని కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. గతనెల (జూన్,12) జరిగిన 44వ సమావేశంలో పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలనే ప్రతిపాదన ఏదీ చర్చకు రాలేదన్నారు. ప్రస్తుత 2021-22 ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్ ధరను 39 సార్లు, డీజిల్ ధరను 36 సార్లు పెంచినట్లు స్వయంగా మంత్రి లోకసభలో వెల్లడించారు. ఈ కాలంలో ఒక ఒకసారి పెట్రోల్ ధరను, రెండుస్లారు డీజిల్ ధరను తగ్గించగా, మిగిలిన రోజుల్లో ఎటువంటి మార్పు లేదని తెలిపారు. గత ఏడాది 2020-21లో, పెట్రోల్ ధరను 76 సార్లు పెంచగా,10సార్లు తగ్గించారు, డీజిల్ రేట్లు 73 సార్లు పెరగ్గా, 24 సందర్భాలలో తగ్గించామని తెలిపారు. కాగా రికార్డు స్థాయిలో పెరుగుతున్న ధరలకు కళ్ళెం వేసేందుకు పెట్రోల్, డీజిల్ ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావాలన్న డిమాండ్ చాలాకాలంగా ఉంది. మరోవైపు పెట్రోల్,డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలనే ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువస్తే, కేంద్ర ప్రభుత్వం దానిని పరిశీలిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఇంతకుముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. -
వ్యాక్సిన్ దిగుమతికి చర్యలు చేపట్టాలి: హరీష్‌రావు
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్‌పై 44వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ వ్యాక్సిన్ ను కేంద్రం త్వరగా పంపిణీ చేయాలని ఆయన కోరారు. అవసరాలకు అనుగుణంగా వ్యాక్సిన్ ను విదేశాల నుంచి దిగుమతికి చర్యలు చేపట్టాలన్నారు. కోవిడ్ 19 చికిత్సకు సంబంధించిన మందులు, ఇతర సామగ్రిపై జీఎస్టీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చేసిన పన్నుల సిఫారసులకు మద్ధతు తెలిపారు. అవసరాల తగినంతగా దేశీయంగా కోవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తి కావడం లేదని, దేశ అవసరాల మేరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకోని అయినా ప్రణాళికాబద్ధంగా, వేగంగా ప్రజలకు అందించాలని సూచించారు. రెండో దశలో కరోనా సృష్టించిన విలయం, థర్డ్ వేవ్ కూడా మరింత ఉధృతంగా రానుందన్న అంచనాల మధ్య కేంద్రం వ్యాక్సినేషన్ కార్యక్రమం త్వరగా చేపట్టాలన్నారు. కోవిడ్ 19 చికిత్సకు అవసరమైవ ఆక్సిజన్, ఆక్సీమీటర్లు, హ్యాండ్ శానిటైజర్లు, వెంటిలేటర్ సహా ఇతర వైద్య సామగ్రిపై పన్నుల విధింపుపై మేఘాలయ సీఎం కన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సిఫారసులకు మద్దతు తెలిపారు. కమిటీ లోని సభ్యులకు, అధికారులకు ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కరోనా కోవిడ్ ఉధృతి, లాక్డౌన్ కారణంగా ఆర్థికంగా తమ రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందని పేర్కొన్నారు. మే నెలలోలాక్ డౌన్ వల్ల రూ. 4100కోట్లు ఆదాయాన్ని కోల్పోయమని తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఎఫ్ఆర్బీఎంను నాలుగు నుంచి ఐదు శాతానికి పెంచాలని కేంద్రాన్ని కోరారు. ఎఫ్ఆర్బీఎం పెంపు వల్ల దేశ, రాష్ట్ర ఆర్థిక కార్యక్రమాలు పుంజుకుంటాయని, ఉద్యోగ కల్పన పెరుగుతుందన్నారు. -
లాక్డౌన్ తర్వాత ఏపీలోనే వ్యాపార లావాదేవీలు అధికం
సాక్షి, అమరావతి: లాక్డౌన్ తర్వాత ఆర్థికవ్యవస్థ వేగంగా పుంజుకున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో లాక్డౌన్ తర్వాత జూన్ నుంచి మార్చి వరకు జరిగిన వ్యాపార లావాదేవీల్లో వృద్ధి నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ఉన్న మహారాష్ట్రల్లో క్షీణత నమోదయితే మన రాష్ట్రంలో ఏకంగా 8.83 శాతం వృద్ధి నమోదైంది. దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధిక వృద్ధిరేటు నమోదు చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. జీఎస్టీ కౌన్సిల్ విడుదల చేసిన గణాంకాల ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి. 2020 జూన్ నుంచి 2021 మార్చి వరకు మన రాష్ట్రంలో జీఎస్టీ పరిధిలోకి వచ్చే వ్యాపార లావాదేవీలు 8.83 శాతం వృద్ధితో రూ.22,407.46 కోట్ల నుంచి రూ.24,386.66 కోట్లకు చేరినట్లు ఈ గణాంకాల్లో పేర్కొన్నారు. దీనిద్వారా రాష్ట్రంలో జీఎస్టీ ఫైలింగ్ ఎంత బాగా జరుగుతోందన్న విషయం కూడా తెలుస్తోందని అధికారులు పేర్కొంటున్నారు. జీఎస్టీ వ్యాపార లావాదేవీలు కేవలం ఆ రాష్ట్రంలో జరిగిన వ్యాపార లావాదేవీలను తెలియచేస్తాయి. అంతర్ రాష్ట్ర జీఎస్టీ (ఐజీఎస్టీ) బదలాయింపుల తర్వాత ఆ రాష్ట్రానికి వచ్చిన తుది జీఎస్టీ ఆదాయం లెక్కిస్తారు. ఆదుకున్న సంక్షేమం: ఇదే సమయంలో దక్షిణాది రాష్ట్రాల్లో మన రాష్ట్రంలోనే వ్యాపార లావాదేవీల్లో వృద్ధి నమోదైంది. గత ఏడాది జూన్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు వ్యాపార లావాదేవీలను పరిగణనలోకి తీసుకుంటే అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే కర్ణాటకలో 0.18%, తెలంగాణలో 0.81%, కేరళలో 1.07%, తమిళనాడులో 3.78% వృద్ధి మాత్రమే నమోదైంది. కోవిడ్ సంక్షోభ సమయంలో మన రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో ఆర్థికవ్యవస్థలో నగదు లభ్యత పెంచే విధంగా చర్యలు తీసుకోవడమే దీనికి కారణమని వాణిజ్యపన్నుల అధికారులు పేర్కొంటున్నారు. -
పెట్రోల్, డీజిల్ ధరలపై బ్యాడ్‌న్యూస్ చెప్పిన నిర్మలమ్మ
న్యూఢిల్లీ: విరామమెరుగక రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అందరూ భావిస్తుండగా అదేం లేదు ప్రజల ఆశలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ బ్యాడ్ న్యూస్ చెప్పారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గేందుకు రిజర్వ్ బ్యాంక్, ప్రతిపక్షాలు చేసిన సలహాను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అంతటితో ఆగకుండా బీమా రంగంలో ప్రైవేటుపరం చేసే చర్యలను కార్యరూపం దాల్చారు. పార్లమెంట్లో సోమవారం జరిగిన చర్చ సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మల సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా పెట్రోల్, డీజిల్, జెట్ ఫ్యూయల్, సహజ వాయువులను జీఎస్టీ మండలి పరిధిలోకి తెచ్చే అంశం పరిశీలనలో లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. 2017 జూలై 1వ తేదీన వచ్చిన జీఎస్టీలో పెట్రోలియం ఉత్పత్తులను చేరిస్తే ధరలు తగ్గుతాయని అందరూ చెబుతున్నారు. అయినా కూడా కేంద్రం పెడచెవిన పెట్టేసింది. దీంతో కేంద్రం తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. ఒక కేంద్రమంత్రి చలికాలం అయిపోగానే పెట్రోల్ ధరలు తగ్గుతాయని ప్రకటించిన విషయం తెలిసిందే. అదీ కూడా ఇప్పుడు లేదని పేర్కొంటున్నారు. తాజాగా బీమా రంగంలో ఎఫ్‌డీఐల ప్రవేశంపై తీసుకొచ్చిన కొత్త బిల్లు ప్రకారం మొత్తం 74 శాతం బీమా రంగంలో ఎఫ్‌డీఐలకు అనుమతి ఇవ్వనున్నారు. అయితే ఈ బిల్లును ఆమోదం పొందితే బీమా రంగంలో కూడా ప్రైవేటు శక్తులు ఆధిపత్యం చలాయించనున్నాయి. -
పరిహార బకాయిలను తక్షణమే విడుదల చేయాలి
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి రావాల్సిన పరిహార బకాయిలను తక్షణమే విడుదల చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి జీఎస్టీ కౌన్సిల్‌ను కోరారు. ఢిల్లీలో సోమవారం 42వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి బుగ్గన హాజరయ్యారు. కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు రూ.67 లక్షల కోట్లు వ్యయం చేయగా, వాటిలో రాష్ట్రాలు రూ.40 లక్షల కోట్లు(60%), కేంద్రం రూ.27 లక్షల కోట్లు (40%) వ్యయం చేస్తున్నాయన్నారు. వాటిలో రక్షణ రంగం, ఇతరాలు తీసివేయగా కేంద్ర ప్రభుత్వం 35% మాత్రమే వ్యయం చేస్తోందన్నారు. అందువల్ల రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ► రాష్ట్రాలకు ప్రస్తుతం ఉన్న పరిమితులకు రెండు శాతాన్ని అదనంగా రుణాన్ని సేకరించడానికి అనుమతులు ఇవ్వాలి. పరిహార బకాయిల విషయంలో ఎంత మేరకు రుణాన్ని సేకరించాలనే విషయంలో, 2019–20 ఆర్థిక సంవత్సరం అసలు వృద్ధిరేటు (సుమారు 3%)గా పరిగణించాలి. ► జీఎస్టీ పరిహార విషయంలో రాష్ట్రాలకు చెల్లించాల్సిన బకాయిలను రుణంగా సేకరించినట్లయితే, బకాయిలను ప్రథమంగా చెల్లించాలి. తరువాత బకాయిల వడ్డీని, చివరి ప్రాధాన్యంగా బకాయిల అసలు చెల్లించాలి. -
జీఎస్టీ తగ్గింపు!- ఆటో షేర్లు రయ్రయ్
ద్విచక్ర వాహనాలపై పన్ను తగ్గించాలంటూ ఆటో పరిశ్రమ చేస్తున్న వినతులను పరిశీలించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్న నేపథ్యంలో ఆటో రంగ కౌంటర్లు జోరందుకున్నాయి. ప్రధానంగా ద్విచక్ర వాహనాలపై ప్రస్తుతం వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) 28 శాతంగా అమలవుతోంది. ద్విచక్ర వాహనాలు.. అటు విలాసవంత(లగ్జరీ) కేటగిరీలోకి లేదా ఇటు డీమెరిట్లోకీ రావని సీతారామన్ వ్యాఖ్యానించారు. దీంతో జీఎస్టీ కౌన్సిల్ ద్విచక్ర వాహనాలపై పన్ను తగ్గింపునకు వీలుగా సవరణలు చేపట్టనున్నట్లు ఆర్థిక మంత్రి హామీనిచ్చారు. పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) సభ్యులతో నిర్వహించిన ప్రశ్నోత్తర కార్యక్రమంలో భాగంగా నిర్మలా సీతారామన్ ఈ విషయాలను ప్రస్తావించారు. కాగా.. గురువారం జీఎస్టీ కౌన్సిల్ సమావేశంకానున్నప్పటికీ సెప్టెంబర్ 17న నిర్వహించనున్న సమావేశంలో ద్విచక్ర వాహన పన్ను తగ్గింపును చేపట్టవచ్చని సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ఈ నేపథ్యంలో ఆటో రంగ కౌంటర్లకు డిమాండ్ పెరిగింది. ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఆటో రంగ ఇండెక్స్ దాదాపు 2 శాతం ఎగసింది. షేర్లు జూమ్ ఆటో కౌంటర్లలో మొత్తం రుణ భారాన్ని తగ్గించుకోనున్న ప్రణాళికల నేపథ్యంలో టాటా మోటార్స్ 8 శాతం దూసుకెళ్లింది. ఈ బాటలో జీఎస్టీ రేట్ల తగ్గింపు అంచనాలతో హీరో మోటో, టీవీఎస్ మోటార్, బజాజ్ ఆటో, అపోలో టైర్ 6-3.3 శాతం మధ్య జంప్‌చేయగా.. బాలకృష్ణ ఇండస్ట్రీస్, అశోక్ లేలాండ్, ఎంఅండ్ఎం, ఐషర్ మోటార్స్, ఎంఆర్ఎఫ్ 2-0.5 శాతం మధ్య ఎగశాయి. -
‘జీఎస్టీలో రాష్ట్రాల వాటా చెల్లింపుపై మెలిక’
సాక్షి, న్యూఢిల్లీ : 2017లో జీఎస్టీ వ్యవస్ధ అమల్లోకి వచ్చిన అనంతరం రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ వాటాపై తొలిసారిగా కేంద్రం చేతులెత్తేసింది. రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లించాల్సిన వాటాపై చావుకబురు చల్లగా వినిపించింది. జీఎస్టీ చట్టానికి అనుగుణంగా జీఎస్టీ రాబడుల్లో రాష్ట్రాల వాటాను చెల్లించేందుకు ప్రస్తుతం తమ వద్ద డబ్బు లేదని అంగీకరించింది. 2019 ఆగస్ట్ నుంచి అంటే లాక్‌డౌన్‌కు ముందే జీఎస్టీ వసూళ్లలో సగమే సమకూరుతున్న పరిస్ధితి. కొన్ని వస్తువులపై పన్నులు పెంచడం, లేదా పన్ను పరిధిలోకి మినహాయించిన వస్తుసేవలను తీసుకురావడంతో దీన్ని భర్తీ చేయాలని భావించారు. ఇక జీఎస్టీ చట్టంలో పేర్కొన్న తరహాలో రెవెన్యూ షేర్ కింద రాష్ట్రాలకు చెల్లించాల్సిన వాటాను కేంద్ర ప్రభుత్వం చెల్లించే పరిస్ధితిలో లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ కమిటీకి కేంద్ర ఆర్ధిక కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే స్పష్టం చేశారు. పాండే ప్రకటనపై పార్లమెంటరీ కమిటీలోని విపక్ష సభ్యులు విరుచుకుపడుతున్నారు. బీజేపీ సభ్యుడు జయంత్ సిన్హా నేతృత్వంలోని ఆర్థిక మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ కమిటీ ఎదుట పాండే ఈ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. చదవండి : శానిటైజర్లపై 18శాతం జీఎస్టీ ఎందుకంటే..? కమిటీ తొలి భేటీకి హాజరైన కాంగ్రెస్ సహా ఇతర పార్టీల సభ్యులు ఆర్థిక శాఖ కార్యదర్శి ప్రకటనపై మండిపడుతున్నారు. కొద్దినెలలుగా రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ నిధులను విడుదల చేయడం లేదని ఈ సమావేశంలో విపక్ష సభ్యులు ప్రస్తావించారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోందని, ఈ పరిస్ధితుల్లో జీఎస్టీ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయాలని కోరారు. జీఎస్టీ బకాయిలను రాష్ట్రాలకు చెల్లించే పరిస్థితి లేదని ఆర్థిక శాఖ కార్యదర్శి పాండే చేసిన ప్రకటనపై విపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బడ్జెట్ తర్వాత జీఎస్టీ రేట్ల సవరణ
సాక్షి, అమరావతి: దేశంలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చి మూడేళ్లు అవుతున్న సందర్భంగా వివిధ వస్తువులపై ఉన్న పన్ను రేట్లను పునః సమీక్షించనున్నారు. అత్యధిక వస్తువులను తక్కువ శాతం పన్ను పరిధిలో ఉండటంతో ఆదాయం పెంచుకునే దిశగా అడుగులు వేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక సూత్రప్రాయ అంగీకారానికి వచ్చాయి. ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాల తర్వాత రేట్ల సమీక్షించాలని కిందటి నెలలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో సూత్రప్రాయ అంగీకారానికి వచ్చాయి. ప్రస్తుతం 150కిపైగా వస్తువులను జీఎస్టీ పరిధి నుంచి మినహాయించగా, సుమారు 260 వస్తువులు 5 శాతం శ్లాబులో ఉన్నాయి. నిర్దేశిత ఆదాయ లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమవుతుండటంతో జీఎస్టీ పరిధి నుంచి మినహాయించిన వస్తువులను సమీక్షించి నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఈ ఏడాది ప్రతి నెలా సగటు జీఎస్టీ ఆదాయం రూ.1.12 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా వేయగా, లక్ష కోట్లు దాటడమే గగనంగా మారింది. 9 నెలలకు సగటు నెల జీఎస్టీ ఆదాయం రూ.1,00,646 కోట్లకు పరిమితమయ్యింది. ఇదే సమయంలో రాష్ట్రాలకు చెల్లించాల్సిన పరిహార భారం పెరిగిపోతోంది. దీంతో ఆదాయం భారీగా కోల్పోతున్న సున్నా పన్ను పరిధిలో ఉన్న వస్తువులను గుర్తించి వాటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకు వచ్చేయోచనలో ఉన్నారు. ప్రస్తుతం 5%, 12%, 18%, 28% శ్లాబులు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలు ఈ నాలుగు ట్యాక్స్ శ్లాబులను మూడు శ్లాబులుగా మార్చమని సూచిస్తున్నాయి. 5%, 12% శ్లాబుల్లో ఉన్న వస్తువులను కలిపి 8–9 శాతం పన్ను పరిధిలోకి తీసుకురావడం లేదా, 12, 18% శ్లాబులను కలిపి 15–16 శాతంగా చేయాలని సూచిస్తున్నాయి. ఈ పన్ను రేటు సవరింపును ఒకేసారిగా కాకుండా దశలవారీగా చేపట్టాలని సూచిస్తున్నారు. దీర్ఘకాలంలో స్థిర ఆదాయం వచ్చే దిశగా మార్చి నెలలో జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశముంది. -
జీఎస్టీ ఫిర్యాదుల పరిష్కారానికి యంత్రాంగం
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) చెల్లింపుదారులకు జీఎస్టీ కౌన్సిల్ ఒక ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ నెల 18న జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 38వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జీఎస్టీకి సంబంధించి, అలాగే, పన్ను చెల్లింపుదారుల సాధారణ ఫిర్యాదుల పరిష్కారం కోసం నిర్మాణాత్మక పరిష్కార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కౌన్సిల్ భావించినట్టు బుధవారం విడుదలైన ప్రభుత్వ అధికారిక ప్రకటన తెలియజేసింది. రాష్ట్రాల స్థాయిలో, జోనల్ స్థాయిలో ఫిర్యాదుల పరిష్కార కమిటీలను ఏర్పాటు చేస్తారు. కేంద్ర, రాష్ట్రాల పన్ను అధికారులు, వాణిజ్య, పారిశ్రామిక రంగాల ప్రతినిధులు, జీఎస్టీ ఇతర భాగస్వాములకు కమిటీలో చోటు కల్పిస్తారు. రెండేళ్ల కాలానికి కమిటీలను ఏర్పాటు చేస్తామని, సభ్యుల పదవీ కాలం కూడా అదే విధంగా ఉంటుందని ప్రభుత్వం తన ప్రకటనలో వివరించింది. పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న అన్ని రకాల అంశాలకు పరిష్కారం చూపించడం ఈ కమిటీ విధుల్లో భాగం. ప్రతీ త్రైమాసికానికి ఒక సారి, అవసరానికి అనుగుణంగాను కమిటీ సమావేశం అవుతుంది. ఫిర్యాదుల నమోదు, నిర్ణీత కాల వ్యవధిలోపు వాటిని పరిష్కరించే విధంగా జీఎస్టీఎన్ ఒక పోర్టల్‌ను కూడా ఏర్పాటు చేస్తుందని ప్రభుత్వ ప్రకటన తెలియజేసింది. -
లాటరీపై 28 శాతం పన్ను
న్యూఢిల్లీ: లాటరీలపై 28 శాతం పన్ను విధిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. బుధవారం జరిగిన 38వ కౌన్సిల్ మీటింగ్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. లాటరీ పన్ను పెంపు 2020 మార్చి నుంచి అమల్లోకి వస్తుందని రెవిన్యూ సెక్రటరీ పాండే తెలిపారు. అల్లిన బ్యాగులపై పన్నును 12 నుంచి 18 శాతానికి పెంచినట్లు పేర్కొన్నారు. మరిన్ని ఇండస్ట్రియల్ పార్క్‌లు వచ్చేందుకు ఇండస్ట్రియల్ ప్లాట్స్ మీద పన్ను మినహాయించామని చెప్పారు. గతంలో జరిగిన 37 కౌన్సిల్ సమావేశాల్లో జీఎస్స్టీ రేట్లపై అందరూ కలసి ఒకే నిర్ణయం తీసుకోగా, ఈ భేటీలో మొదటిసారి ఓటింగ్ ప్రక్రియను అమలు చేశారు. -
ఏపీ ఉడుంపట్టుతో ‘చింత’ తీరింది!
సాక్షి, అమరావతి: సామాన్యుడికి భారీ ఊరట కల్పిస్తూ చింతపండుపై పన్నును ఎత్తివేసేలా జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ గట్టి వాదనలు వినిపించింది. ఉత్తరాది రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ ఏపీ గళాన్ని సమర్థంగా వినిపించడం ద్వారా చింతపండుపై పన్నును ఎత్తివేసేలా ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విజయం సాధించారు. గోవాలో శుక్రవారం జరిగిన 37వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తన వాదనతో బుగ్గన దేశం దృష్టిని ఆకర్షించారు. దక్షిణాది ప్రజల వంటకాల్లో కీలకమైన ఎండు చింతపండును పన్ను పరిధిలోకి తేవటాన్ని రాష్ట్రం తొలినుంచి వ్యతిరేకిస్తూ వచ్చింది. ఆహార ధాన్యాలను జీఎస్టీ పరిధి నుంచి తప్పించి చింతపండును మాత్రం సుగంధ ద్రవ్యాల విభాగంలో చేర్చి పన్ను విధించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. తొలుత చింతపండుపై 12 శాతం పన్ను విధించగా ఆ తర్వాత 5 శాతానికి తగ్గించారు. అయితే నిత్యం వంటల్లో వినియోగించే చింతపండుపై పన్నును పూర్తిగా తొలగించాలని ఏపీ గట్టిగా పట్టుబట్టింది. స్పైసెస్ ఎలా అవుతుంది? అడవుల్లో గిరిజనులు సేకరించి విక్రయించే చింతపండు సుగంధ ద్రవ్యాల పరిధిలోకి రాదని జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో బుగ్గన గట్టిగా వాదించారు. ఉత్తరాది రాష్ట్రాలు వ్యతిరేకించినా బుగ్గన వాదనకు దక్షిణాది రాష్ట్రాల నుంచి గట్టి మద్దతు లభించింది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఉపయోగించే ఒక రకమైన చనాదాల్ (పచ్చి శనగపప్పు)ను పన్ను నుంచి ఉపసంహరించినప్పుడు చింతపండుపై ఎందుకు తొలగించకూడదని బుగ్గన ప్రశ్నించారు. ఆంగ్లేయులే చింత అవసరాన్ని గుర్తించారు... చింతపండు ఆవశ్యకతను గుర్తించిన ఆంగ్లేయులే చింతచెట్లను వంట చెరుకు కోసం కొట్టివేయకూడదంటూ చట్టం తెచ్చారని బుగ్గన కౌన్సిల్ దృష్టికి తెచ్చారు. ఈ అంశంపై దాదాపు 15 నిమిషాలకుపైగా చర్చ జరగ్గా బుగ్గన వాదనతో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర రెవిన్యూ శాఖ కార్యదర్శి ఏకీభవించారు. దీంతో చింతపండుపై ఉన్న 5 శాతం పన్నును తొలగిస్తూ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో అనంతపురం, చిత్తూరు జిల్లాలతోపాటు ఉత్తరాంధ్రలోని గిరిజనులకు ఊరట లభించనుంది. పట్టుబట్టి మరీ సాధించి... రాష్ట్రంలో 2018–19లో 5,252 హెక్టార్లలో చింత సాగు చేయగా 57,738 టన్నుల చింతపండు ఉత్పత్తి అయినట్లు ఉద్యానవన శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత రెండేళ్లుగా 36 సమావేశాలు నిర్వహించగా మన రాష్ట్రం ఇప్పటిదాకా ఇంత గట్టిగా వాదించిన సందర్భం లేదని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ విజయంతో నాపరాళ్లు, చుట్ట పొగాకు తదితరాలపై పన్ను తొలగింపు డిమాండ్‌ను నెరవేర్చుకోగలమనే నమ్మకం ఏర్పడిందని చెబుతున్నారు. -
మార్కెట్‌కు ‘ప్యాకేజీ’ జోష్..!
ముంబై: దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా మూడో విడత ఉద్దీపన చర్యలను ప్రకటించారు. జీడీపీ వృద్ధిలో అత్యంత కీలకమైన ఎగుమతులు పుంజుకునేందుకు, రియల్ ఎస్టేట్ రంగంలో జోష్ నింపడం కోసం రూ.70,000 కోట్ల ప్యాకేజీని శనివారం ప్రకటించారు. వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్టస్థాయికి పడిపోయిన నేపథ్యంలో ఇప్పటికే రెండుసార్లు పలు ఉద్దీపన చర్యలను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా మరో ప్రకటన చేసి దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును నిలబెట్టేందుకు శతవిధాల ప్రయతి్నస్తున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇచి్చంది. ఈ జోష్‌తో మార్కెట్ సెంటిమెంట్ మెరుగుపడి ప్రధాన సూచీలు ఊర్థ్వ ముఖంగా ప్రయాణించే అవకాశం ఉందని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. ఉద్దీపన చర్యల అంశానికి అంతర్జాతీయ సానుకూలతలు జతైతే మార్కెట్లో కొనుగోళ్లు ఊపందుకుంటాయని ఎపిక్ రీసెర్చ్ సీఈఓ ముస్తఫా నదీమ్ అన్నారు. రానున్న పండుగల సీజన్లో వినియోగదారుల వ్యయం ఏ విధంగా ఉండనుందనే అంశానికి ప్రాధాన్యత ఇస్తూ కొనుగోళ్లు జరిగేందుకు ఆస్కారం ఉందని సామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమిత్ మోడీ విశ్లేíÙంచారు. ఆరి్థక అంశాలపై మార్కెట్ దృష్టి..! ఆగస్టు నెల టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణ(డబ్ల్యూపీఐ) డేటా సోమవారం విడుదలకానుంది. సెప్టెంబర్ 13తో ముగిసిన వారానికి విదేశీ మారక నిల్వల సమాచారం, జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కరెంట్ అకౌంట్ డేటా శుక్రవారం వెల్లడికానున్నాయి. ఇక గోవాలో జీ ఎస్టీ కౌన్సిల్ శుక్రవారం సమావేశంకానుంది. ఎఫ్ఓఎంసీ సమావేశం ఈవారంలోనే.. అమెరికా ఫెడరల్ రిజర్వ్ రెండు రోజుల సమావేశం.. మంగళ, బుధవారాల్లో జరగనుంది. ఈ సమావేశంలో వడ్డీ రేట్లు మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గేందుకు అవకాశం ఉందని అబాన్స్ గ్రూప్ చైర్మన్ అభిõÙక్ బన్సాల్ అన్నారు. బ్యాంక్ ఆఫ్ జపాన్ తన వడ్డీ రేటు నిర్ణయాన్ని గురువారం ప్రకటించనుంది. సెపె్టంబర్లో రూ.1,841 కోట్ల పెట్టుబడి... విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) సెపె్టంబర్లో ఇప్పటివరకు రూ.1,841 కోట్ల పెట్టుబడిపెట్టినట్లు డిపాజిటరీల డేటా ద్వారా వెల్లడయింది. ఈనెల 3–13 కాలానికి ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.2,031 కోట్లను ఉపసంహరించుకున్నట్లు తేలింది. అయితే, డెట్ మార్కెట్లో రూ.3,872 కోట్లను పెట్టుబడి పెట్టడం ద్వారా క్యాపిటల్ మార్కెట్లో వీరి నికర పెట్టుబడి రూ.1,841 కోట్లుగా డేటాలో వెల్లడయింది. ఇక ఈక్విటీ, డెట్ మార్కెట్లలో కలిపి ఆగస్టులో రూ.5,920 కోట్లు, జూలైలో రూ.2,986 కోట్లను వీరు ఉపసంహరించుకున్నారు. -
‘ఎలక్ట్రిక్’కు కొత్త పవర్!!
న్యూఢిల్లీ: పర్యావరణ అనుకూల రవాణా సదుపాయాల్ని ప్రోత్సహించే క్రమంలో కేంద్ర జీఎస్టీ మండలి శనివారం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రస్తుతం ఉన్న 12 శాతం జీఎస్టీని 5 శాతానికి తగ్గించింది. ఈ కొత్త రేటు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తుంది. దీంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలకు ఉపయోగించే ఛార్జర్లు, ఛార్జింగ్ స్టేషన్లపై కూడా జీఎస్టీని ప్రస్తుత 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. అంతేకాకుండా మున్సిపాలిటీల వంటి స్థానిక సంస్థలు గనక 12 మంది కన్నా ఎక్కువ మందిని రవాణా చేయటానికి ఎలక్ట్రిక్ వాహనాలను అద్దెకు తీసుకుంటే... వాటిపై పూర్తిగా జీఎస్టీ మినహాయింపు ఉంటుంది. ఈ నిర్ణయాలన్నీ ఆగస్టు 1 నుంచీ అమల్లోకి వస్తాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ మండలి సమావేశానంతరం ఆర్థిక శాఖ ఈ మేరకు ప్రకటన చేసింది. ఇటీవలి బడ్జెట్లో సైతం ఎలక్ట్రిక్ వాహనాల్ని ప్రోత్సహించడానికి కేంద్రం కొన్ని చర్యలు ప్రకటించింది. కొన్ని విడి భాగాలపై కస్టమ్స్ సుంకాన్ని తొలగించటంతో పాటు... రుణంపై గనక ఎలక్ట్రిక్ వాహనం కొంటే... దానికి చెల్లించే వడ్డీలో 1.5 లక్షలకు పన్ను రాయితీ ఉంటుందని కూడా ప్రకటించింది. తాజా మండలి సమావేశంలో జీఎస్టీ చట్టానికి సంబంధించిన సవరణలపై కూడా నిర్ణయాలు తీసుకున్నారు. అవి.. ► ప్రత్యేక సేవలందించే సప్లయర్లు తాము పన్ను చెల్లిస్తామని జీఎస్టీ సీఎంపీ–02 ద్వారా సమాచారమిస్తూ దాన్ని ఫైల్ చేయటానికి ప్రస్తుతం చివరి తేదీ జులై 31గా ఉంది. దాన్ని సెప్టెంబరు 30కి పొడిగించారు. ► జూన్ త్రైమాసికానికి సంబంధించి సెల్ఫ్ అసెస్మెంట్ పత్రాల్ని జీఎస్టీ సీఎంపీ–08 ద్వారా దాఖలు చేయటానికి కూడా గడువును జులై 31 నుంచి ఆగస్టు 31కి పొడిగిచారు. -
ఊహించినట్టుగానే జీఎస్టీ తగ్గింపు
సాక్షి, న్యూఢిల్లీ : ఊహించినట్టుగానే జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో భేటీ అయిన 36 వ జీఎస్టీ కౌన్సిల్ విద్యుత్తు వాహనాలు, ఈ వాహనాల చార్జీలపై జీఎస్టీ తగ్గింపునకు నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని నర్ణయించింది. ఈవీ చార్జర్లపై జీఎస్టీనీ 18 నుంచి తగ్గించి 5 శాతంగా ఉంచింది. అలాగే స్థానిక అధికారులకు ఎలక్ట్రిక్ బస్సుల వినియోగంపై జీఎస్టీ నుంచి మినహాయింపునివ్వడానికి కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఈ కొత్త పన్ను రేట్లు ఆగస్టు 1 వ తేదీనుంచి అమల్లోకి రానున్నాయి. అలాగే రానున్న సమావేశాలోల బీఎస్- 6వాహనాలపై చర్చించనుంది. అయితే ఇ-వాహనాలపై జీఎస్టీ తగ్గింపు నిర్ణయాన్ని ఢిల్లీ, పంజాబ్, పశ్చిమ బెంగాల్ ప్రతినిధులు పూర్తిగా సమర్ధించలేదు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత తొలి జీఎస్టీ మండలి భేటీ ఇదే కావడం విశేషం. -
ప్రసాద్ ఐమ్యాక్స్‌పై సెంట్రల్ ట్యాక్స్ విచారణ!
సాక్షి, హైదరాబాద్: ప్రసాద్ ఐమ్యాక్స్ థియేటర్‌పై సెంట్రల్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ విచారణ చేపట్టింది. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించిన విధంగా రూ.100 దాటిన సినిమా టికెట్లపై జీఎస్టీని 28 నుంచి 18 శాతానికి తగ్గించకుండానే ప్రేక్షకుల నుంచి రుసుము వసూలు చేస్తున్నారని ఈ విచారణ చేపట్టినట్లు సమాచారం. ఈ ఏడాది జనవరి 1 నుంచి అన్ని థియేటర్లలో ఈ తగ్గించిన రుసుమును టికెట్లపై వసూలు చేయాల్సి ఉంది. అయితే, సినిమా థియేటర్లు దీన్ని అమలు చేస్తున్నాయా లేదా అనే విషయాన్ని పరిశీలించేందుకు కస్టమ్స్ శాఖ పరిధిలోని ప్రత్యేక విభాగం అధికారులు కొన్ని థియేటర్లను పరిశీలించగా, ఐమ్యాక్స్ థియేటర్లో తగ్గించలేదని తేలింది. ఆధారాలను కూడా సేకరించిన కస్టమ్స్ విభాగం దీనిపై విచారణ జరిపించేందుకు రాష్ట్ర స్థాయి స్క్రీనింగ్ కమిటీకి సంబంధిత అధికారులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. -
జీఎస్టీ మండలి నిర్ణయాలపై పరిశ్రమ వర్గాల హర్షం
న్యూఢిల్లీ: జీఎస్టీ కౌన్సిల్ 23 రకాల వస్తు, సేవలపై పన్ను రేటును తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంపై పారిశ్రామిక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. 32 అంగుళాల టీవీలు, కంప్యూటర్ మానిటర్లు, వీడియోగేమ్స్, లిథియం అయాన్ పవర్ బ్యాంకులు, రీట్రేడెడ్ టైర్లు, వీల్ చైర్లు, సినిమా టికెట్లు సహా 17 రకాల వస్తువులు, ఆరు సేవలపై పన్ను శ్లాబులను కౌన్సిల్ మార్చింది. 28 శాతం నుంచి 18 శాతానికి, కొన్ని 18 శాతం నుంచి 12, 5 శాతానికి మార్చిన విషయం గమనార్హం. ‘‘రేట్లను గణనీయంగా తగ్గించడం ద్వారా జీఎస్టీ కౌన్సిల్ ఆచరణాత్మక విధానాన్ని అనుసరించింది. ఈ నిర్ణయాలు జీఎస్టీ విధానాన్ని మరింత బలోపేతం, స్థిరపడేలా చేస్తాయి’’అని ఫిక్కీ తన ప్రకటనలో పేర్కొంది. ‘‘బలమైన వినియోగం వృద్ధిని వేగవంతం చేస్తుంది. వివిధ తరగతి ప్రజలు వినియోగించే వస్తువులపై పన్ను రేట్ల తగ్గింపుతో ఆ ర్థిక రంగానికి అవసరమైన ఊతం లభిస్తుంది’’ అని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. పరోక్ష పన్ను వసూళ్లలో స్థిరమైన వృద్ధికి తోడు అధిక జీఎస్టీ రేట్లను తగ్గించడం అనేవి... పన్ను చెల్లించే పరిధి పెరిగిందని, ఆర్థిక కార్యకలాపాలు విస్తరిస్తున్నాయని తెలుస్తోందని పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ రాజీవ్ తల్వార్ పేర్కొన్నారు. -
40 వస్తువులపై జీఎస్టీ రేటు తగ్గింపు
-
‘బై వన్, గెట్ వన్’ ఆఫర్లపై గుడ్‌న్యూస్
న్యూఢిల్లీ : ఒకటి కొంటే ఒకటి ఉచితం.. ఒకటి కొంటే రెండు ఉచితం... మా దగ్గర వస్తువులు కొంటే 50 శాతం డిస్కౌంట్ ఇస్తాం... మా దగ్గర షాపింగ్ చేస్తే 80 శాతం రాయితీ ఇస్తాం... ఇవన్నీ మాల్స్, దుకాణదారుల ఆఫర్లు. ఎఫ్ఎంసీజీ నుంచి ఫార్మాస్యూటికల్, టెక్ట్స్‌టైల్, ఫుడ్, రిటైల్ చైన్ కంపెనీల వరకు అన్ని కంపెనీలు ఈ మార్కెటింగ్ టెక్నిక్‌నే ఎక్కువగా ఉపయోగించేవి. అయితే ఈ ఉచితాలన్నింటికీ గతేడాది అమల్లోకి వచ్చిన జీఎస్టీ మంగళం పాడేసింది. వాటిని కూడా పన్ను పరిధిలోకి తెచ్చింది. దీంతో కంపెనీలన్నీ ఈ ఉచితాలను పక్కనపెట్టేశాయి. ప్రస్తుతం ఈ ఉచితాలపై గుడ్‌న్యూస్ చెప్పబోతుంది జీఎస్టీ కౌన్సిల్. బై-వన్-గెట్-వన్-ఫ్రీ వంటి కంపెనీల ఉచిత ఆఫర్లను పన్ను పరిధి నుంచి మినహాయించాలని చూస్తోంది. జీఎస్టీ కౌన్సిల్ నేతృత్వంలోని ఓ ప్యానల్ అధికారులు.. ఉచితాలపై జీఎస్టీని తీసివేసే ప్రతిపాదనకు అనుకూలంగా ఓటేశారని తెలిసింది. ఈ విషయంపై జీఎస్టీ కౌన్సిల్ భేటీ కూడా జరుపబోతుందని ప్రభుత్వ అధికారులు చెప్పారు. అంతేకాక ఉచితంగా ఉత్పత్తిని అమ్ముతున్నట్టు కంపెనీలు వర్గీకరిస్తే ఇన్ని రోజులు వ్యాపారస్తులు ఇన్పుట్ క్రెడిట్‌ను కూడా కోల్పోయేవారు. అయితే ఇక నుంచి గిఫ్ట్‌లు, శాంపుల్స్‌పై ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను నిరాకరించకూడదని కూడా కమిటీ నిర్ణయించింది. ప్రమోషనల్ స్కీమ్స్‌లో బై-వన్-గెట్-వన్-ఫ్రీ అనేది చాలా పాపులర్. కానీ జీఎస్టీ అమల్లోకి వచ్చాక, చాలా కంపెనీలు దీన్ని తీసేశాయి. కొంతమంది దీన్ని అవలంభించినా.. పన్ను డిపార్ట్మెంట్ నుంచి వారికి నోటీసులు వెళ్లాయి. వ్యాపారం కోసం ఉచిత ధరలకు ఏదైనా అందించినా.. లేదా శాంపుల్స్ సరఫరా చేసినా.. ఇన్పుట్ క్రెడిట్‌పై ఎలాంటి పరిమితులు విధించకూడదని పీడబ్ల్యూసీ పరోక్ష పన్ను అధికారి ప్రతీక్ జైన్ చెప్పారు. -
మరిన్ని ఉత్పత్తులపై జీఎస్టీ తగ్గింపు
న్యూఢిల్లీ : అధిక పన్ను రేట్లతో సతమవుతున్న సామాన్యులకు జీఎస్టీ కౌన్సిల్ ఉపశమనమిస్తూ వెళ్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు ఉత్పత్తులపై పన్ను రేట్లను తగ్గించిన జీఎస్టీ కౌన్సిల్, మరికొన్ని ఉత్పత్తులపై కూడా పన్ను రేట్లను తగ్గించబోతుందట. ఒకవేళ రెవెన్యూలు పెరిగితే, మరిన్ని ఉత్పత్తులపై కూడా జీఎస్టీ రేట్ల కోత ఉంటుందని ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. జీఎస్టీ చట్టాల గురించి లోక్‌సభలో మాట్లాడిన పీయూష్ గోయల్ ఈ విషయాన్ని వెల్లడించారు. పీయూష్ గోయల్ ప్రసంగానికి విపక్షాలు పలుమార్లు అడ్డుపడినప్పటికీ, మంత్రి తన స్పీచ్‌ను కొనసాగించారు. ‘గత సమావేశాల్లో చాలా ఉత్పత్తులు, సర్వీసులపై జీఎస్టీ కౌన్సిల్ పన్ను రేట్లను తగ్గించింది. ఈ పరోక్ష పన్ను విధానం ద్వారా వినియోగదారులపై ఉన్న పన్ను భారాన్ని కాస్త తగ్గించాలనుకుంటున్నాం. గత ఏడాదిగా జీఎస్టీ కౌన్సిల్ 384 ఉత్పత్తులు, 68 సర్వీసులపై పన్ను రేట్లను తగ్గించింది. 186 ఉత్పత్తులు, 99 సర్వీసులకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చింది. శానిటరీ ప్యాడ్స్ కూడా జీఎస్టీ మినహాయింపు పొందిన ఉత్పత్తుల్లో ఉన్నాయి’ అని పీయూష్ గోయల్ తెలిపారు. దేశీయ ఆర్థిక లోటుకు అనుగుణంగా జీఎస్టీని సేకరిస్తున్నామని చెప్పారు. అంచనావేసిన దానికంటే భారత వృద్ధి మెరుగ్గానే ఉందని ఆయన పేర్కొన్నారు. ఐఎంఎఫ్ విడుదల చేసిన రిపోర్టులో కూడా 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ 7.5 శాతంగా ఉంటుందని అంచనావేసింది. తన ప్రసంగం సమయంలో కాంగ్రెస్ చేసిన నిరసనలపై స్పందించిన పీయూష్ గోయల్, ‘మీ పార్టీని ఈ దేశం ఎప్పటికీ మర్చిపోదు. సభను నిర్వహించకుండా కాంగ్రెస్ నేతలు అంతరాయం సృష్టిస్తూనే ఉన్నారు. దేశ భద్రత విషయంలో కాంగ్రెస్ నేతలు అంత సీరియస్‌గా లేరని తెలుస్తోంది. మీరు విఫలమైన వాటిని మోదీ పూరించారు. తర్వాత సాధారణ ఎన్నికల్లో మీకు 4 సీట్లు కూడా రావంటూ’ మండిపడ్డారు. అయితే జీఎస్టీ ఎలా అమలు చేయాలో కేంద్ర ప్రభుత్వానికి తెలియదని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే చెప్పారు. జీఎస్టీ అమలు సరిగ్గా లేకపోవడంతో, తమిళనాడులో 50వేల చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడ్డాయని విమర్శించారు. -
జీఎస్టీ బొనాంజా..
న్యూఢిల్లీ: సామాన్య, మధ్యతరగతి ప్రజలకు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మండలి మరోసారి తీపి కబురు చెప్పింది. వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, టీవీలు (27 అంగుళాలు, అంతకంటే చిన్నవి) సహా వివిధ రకాల వస్తువులపై జీఎస్టీ రేటును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. అలాగే శానిటరీ న్యాప్కిన్లపై పన్నును పూర్తిగా ఎత్తివేసి దాదాపు ఏడాది కాలంగా ఉన్న డిమాండ్‌ను నెరవేర్చింది. మొత్తం 88 రకాల వస్తువులపై పన్ను రేట్లను తగ్గించినట్లు కేంద్ర తాత్కాలిక ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ చెప్పారు. కొత్త పన్ను రేట్లు ఈ నెల 27 నుంచి అమల్లోకి వస్తాయన్నారు. గోయల్ అధ్యక్షతన జీఎస్టీ మండలి 28వ సమావేశం శనివారం ఢిల్లీలో జరిగింది. జీఎస్టీ రిటర్నులను దాఖలు చేసే విధానంలో వ్యాపారులకు జీఎస్టీ మండలి కొంత సడలింపునిచ్చింది. రూ. 5 కోట్ల లోపు టర్నోవర్ ఉన్న వాణిజ్య సంస్థలు ప్రస్తుతం ప్రతి నెలా రిటర్నులు దాఖలు చేస్తుండగా, వారు ఇకముందు మూడు నెలలకోసారి మాత్రమే రిటర్నులు సమర్పిచేలా విధానాన్ని సరళీకరించింది. పన్నులు మాత్రం ప్రతి నెలా కట్టాల్సిందే. దీనివల్ల 93 శాతం మంది వ్యాపారులు, చిన్న వాణిజ్య సంస్థలకు ప్రయోజనం చేకూరుతుందనీ, అయితే కొత్త విధానం అమల్లోకి రావడానికి కొంత సమయం పడుతుందని గోయల్ చెప్పారు. కాగా, గుజరాత్ ఎన్నికలకు ముందు గతేడాది నవంబరులోనూ 178 వస్తువులపై 28 శాతంగా ఉన్న పన్ను రేటును తగ్గించడం తెలిసిందే. ఆదాయం తగ్గడంపై చింత లేదు పన్ను రేటు తగ్గడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం తగ్గడం గురించి పట్టించుకోకుండా, ఉద్యోగ కల్పన, ఆర్థిక వృద్ధిపైనే ఎక్కువగా దృష్టి పెట్టాలని జీఎస్టీ మండలి నిర్ణయించిందని గోయల్ చెప్పారు. తాజా రేట్ల తగ్గింపుతో ప్రభుత్వానికి ఏడాదికి 8 నుంచి 10 వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గుతుందని అంచనా. ఈ విషయాన్ని ప్రస్తావించగా, రిటర్నుల దాఖలును సరళీకరించినందున మరింత ఎక్కువ మంది పన్నులు కడతారనీ, ఆదాయం తగ్గినా ఆ ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని అన్నారు. ‘ఈరోజు సమావేశంలో అనేక నిర్ణయాలను ఏకగ్రీవంగా తీసుకున్నాం. సరళీకరణ, హేతుబద్ధీకరణకు అత్యంత ప్రాధాన్యతనిచ్చాం. మొత్తం 88 వస్తువులపై పన్ను రేట్లు తగ్గించాం’ అని గోయల్ చెప్పారు. కేంద్ర మంత్రి జైట్లీ ఓ ట్వీట్ చేస్తూ ఇక 28 శాతం పన్ను శ్లాబులో కొన్ని ఉత్పత్తులే మిగిలాయనీ, ఉత్పాదకత పెరగడానికి పన్ను రేట్ల తగ్గింపు దోహదపడుతుందని పేర్కొన్నారు. పన్ను ఎగవేతలను నియంత్రించేందుకు ఉద్దేశించిన ఆర్సీఎం (రివర్స్ చార్జ్ మెకానిజం) అమలును వచ్చే ఏడాది సెప్టెంబరు 30 వరకు వాయిదా వేయాలని జీఎస్టీ మండలి నిర్ణయించింది. కాంపొజిషన్ పథకం పరిమితిని రూ. 1.5 కోటికి పెంచడం సహా జీఎస్టీ చట్టంలో మొత్తం 40 సవరణలకు ఆమోదం తెలిపింది. జీఎస్టీ మండలి 29వ సమావేశం ఆగస్టు 4న జరగనుంది. ఎంఎస్ఎంఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, రూపే, భీమ్ యాప్ ద్వారా చేసే చెల్లింపులకు ప్రోత్సాహకాలు తదితరాలను ఆ భేటీలో చర్చించనున్నారు. రేట్లు తగ్గనున్న వస్తువులు 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గేవి ► వాషింగ్ మెషీన్లు ► రిఫ్రిజిరేటర్లు ► టీవీలు (27 అంగుళాలు, అంతకంటే చిన్నవి) ► విద్యుత్తు ఇస్త్రీ పెట్టెలు ► వీడియో గేమ్స్ పరికరాలు ► వ్యాక్యూమ్ క్లీనర్లు ► లారీలు, ట్రక్కుల వెనుక ఉండే కంటెయినర్లు ► జ్యూసర్ మిక్సర్లు, గ్రైండర్లు ► షేవింగ్ పరికరాలు ► హెయిర్, హ్యాండ్ డ్రయ్యర్లు ► వాటర్ కూలర్లు, స్టోరేజ్ వాటర్ హీటర్లు ► పెయింట్లు, వాల్‌పుట్టీలు, వార్నిష్లు ► లిథియం–అయాన్ బ్యాటరీలు ► పర్ఫ్యూమ్లు, టాయిలెట్ స్ప్రేలు 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గేవి ► ఇథనాల్ ► పాదరక్షలు (రూ. 500–1,000 ధరలోనివి) ► ఈ–పుస్తకాలు ► శానిటరీ న్యాప్కిన్లు (ప్రస్తుతం 12 శాతం), పోషకాలు కలిపిన పాలు (ప్రస్తుతం 18 శాతం), స్మారక నాణేలపై పన్నును పూర్తిగా ఎత్తివేశారు. ► హోటళ్లలో రూములు తీసుకున్నప్పుడు బిల్లు రూ. 7,500 కన్నా ఎక్కువ ఉంటే 28 శాతం, రూ. 2,500–రూ.7,500 మధ్య ఉంటే 18 శాతం, రూ. 1,000–రూ. 2,500 మధ్య ఉంటే 12 శాతం పన్ను వర్తిస్తుంది. ► హస్తకళతో తయారైన చిన్న వస్తువులు, రాతి, చెక్క, పాలరాతితో తయారైన విగ్రహాలు, రాఖీలు, చీపురు కట్టలు, చెట్టు ఆకుల నుంచి తయారైన విస్తర్లపై జీఎస్టీని పూర్తిగా ఎత్తేశారు. ► హ్యాండ్ బ్యాగులు, నగలు దాచుకునే పెట్టెలు, ఆభరణాల వంటి ఫ్రేమ్ కలిగిన అద్దాలు, చేతితో తయారైన ల్యాంపులపై పన్ను రేటు 12 శాతానికి తగ్గింది. ► వెయ్యి రూపాయల లోపు విలువైన అల్లిక వస్తువులపై పన్ను 5 శాతానికి తగ్గింపు -
పెట్రోలియంపై జీఎస్టీ కౌన్సిల్‌దే తుది నిర్ణయం
న్యూఢిల్లీ: రాజ్యాంగపరంగా పెట్రోలియం ఉత్పత్తులు వస్తుసేవల పన్ను(జీఎస్టీ) పరిధిలోనే ఉన్నాయని కేంద్రం బుధవారం పార్లమెంటుకు తెలిపింది. పెట్రోలియం ఉత్పత్తుల్ని జీఎస్టీ పరిధిలోకి ఎప్పటి నుంచి తీసుకురావాలన్న అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మంత్రులు సభ్యులుగా ఉన్న జీఎస్టీ కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకుంటుందని కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం రాజ్యాంగపరంగా పెట్రో ఉత్పత్తులు జీఎస్టీ పరిధిలోనే ఉన్నాయని పేర్కొంది. ఇటీవల చమురు ధరలు పెరగడంపై రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమాధానమిస్తూ.. ‘భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 279ఏ(5) ప్రకారం పెట్రోలియం ఉత్పత్తులపై వస్తుసేవల పన్నును ఎప్పటి నుంచి విధించాలన్న విషయమై జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సు చేస్తుంది. కాబట్టి రాజ్యాంగపరంగా పెట్రో ఉత్పత్తులు జీఎస్టీ పరిధిలోనే ఉన్నాయి’ అని చెప్పారు. ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో లీటర్‌కు రూ.2 మేర ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినట్లు తెలిపారు. -
దశలవారీగా జీఎస్టీలోకి పెట్రోలియం ఉత్పత్తులు
న్యూఢిల్లీ: పెట్రోలియం ఉత్పత్తులను కూడా వస్తు, సేవల పన్నుల విధానం పరిధిలోకి తెచ్చే అంశాన్ని జీఎస్టీ కౌన్సిల్ పరిశీలిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి హస్ముఖ్ అధియా తెలిపారు. వీటిని జీఎస్టీలోకి చేర్చడం దశలవారీగా జరగవచ్చని పేర్కొన్నారు. జీఎస్టీని సమగ్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని, అయితే మరింత మెరుగుపర్చేందుకు చేయాల్సినది ఇంకా చాలా ఉందని అధియా తెలిపారు. మొత్తం రీఫండ్ ప్రక్రియ అంతా కూడా ఆటోమేటిక్‌గా జరిగిపోయేలా తగు విధానాలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. రేట్లు, శ్లాబ్స్‌ని మరింత సరళం చేయాల్సిన అవసరం ఉన్న సంగతిని ప్రభుత్వం కూడా గుర్తించిందని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తాము చేయగలిగినంత చేశామని అధియా పేర్కొన్నారు. జీఎస్టీలో ప్రస్తుతం 5%, 12%, 18%, 28 శాతం చొప్పున నాలుగు శ్లాబులు ఉన్నాయి. ప్రస్తుతం డీజిల్, పెట్రోల్, ముడిచమురు, సహజ వాయువు, విమాన ఇంధనం మొదలైనవి దీని పరిధిలో లేవు. రాష్ట్రాలు వీటిపై విలువ ఆధారిత పన్నులు విధిస్తున్నాయి. ఎయిర్‌లైన్స్ నిర్వహణ వ్యయాల్లో సింహభాగం వాటా ఉండే విమాన ఇంధనంపై (ఏటీఎఫ్) భారీ పన్నులపై ఆందోళన వ్యక్తం చేస్తూ పౌర విమానయాన శాఖ కేంద్ర ఆర్థిక శాఖకు లేఖ కూడా రాసింది. సాధ్యమైనంత త్వరగా పూర్తి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లభించేలా ఏటీఎఫ్‌ను జీఎస్టీలోకి చేర్చాలని కోరింది. ఆర్థిక శాఖ కూడా ఇందుకు సుముఖంగానే ఉంది. -
జీఎస్టీ రేట్లపై గుడ్‌న్యూస్?
న్యూఢిల్లీ : జీఎస్టీ రేట్లపై మరో గుడ్‌న్యూస్ వినబోతున్నారు. జీఎస్టీ పన్ను రేట్లు అత్యధికంగా ఉన్నాయంటూ.. ఇప్పటికే పలు వర్గాల నుంచి నిరసన వ్యక్తమవుతుండటంతో ఆ పన్ను రేట్లను తగ్గించేందుకు జీఎస్టీ కౌన్సిల్ కృషిచేస్తోంది. జీఎస్టీ రేట్లను హేతుబద్ధం చేసేందుకు జీఎస్టీ కౌన్సిల్ కృషిచేస్తుందని తెలిసింది. కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ చేపట్టిన 7వ ఎడిషన్ ఢిల్లీ ఎస్ఎంఈ ఫైనాన్స్ సమిట్‌లో ఈ విషయాన్ని ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ్ ప్రతాప్ శుక్లా చెప్పారు. జీఎస్టీ రేట్లను హేతుబద్ధం చేసేందుకు జీఎస్టీ కౌన్సిల్ పనిచేస్తోంది.. దీనిపై ప్రభుత్వం నుంచి ఓ పెద్ద ప్రకటన వచ్చేస్తోంది అని శివ్ ప్రతాప్ అన్నారు. ప్రస్తుతం జీఎస్టీ నాలుగు శ్లాబుల్లో అమలవుతోంది. అవి 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం. కానీ ఈ రేట్లు అత్యధిక మొత్తంలో ఉన్నాయని నిరసన వ్యక్తమవుతోంది. జనవరి నెల ప్రారంభంలో జీఎస్టీ కౌన్సిల్ 54 సర్వీసులు, 24 ఉత్పత్తుల రేట్లను తగ్గించింది. వీటిలోముఖ్యంగా హస్తకళలు, వ్యవసాయ ఉత్పత్తులు ఉన్నాయి. అంతేకాక 2017 నవంబర్ సమావేశంలో కూడా 28 శాతం కేటగిరీలో ఉన్న 178 ఉత్పత్తులను, ఆ శ్లాబు నుంచి తొలగించింది. మరోవైపు పెట్రోలియం ఉత్పత్తులను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని పెద్ద ఎత్తున్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ధరలను అదుపులో ఉంచవచ్చని పలువురు పేర్కొంటున్నారు. కేంద్రం సైతం పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు తీవ్ర కసరత్తు చేస్తోంది. -
జీఎస్టీ రిటర్నులు ఇక ఈజీ!
న్యూఢిల్లీ: వ్యాపారులకు కాస్తంత భారంగా మారిన జీఎస్టీ రిటర్నుల దాఖలు ఇక సులభం కానుంది. ప్రస్తుతం ప్రతి నెలా ఒకటికి మించి రిటర్నులు దాఖలు చేయాల్సి వస్తుండగా, ఇకపై ఒకే ఒక్క రిటర్న్ దాఖలు చేసే విధానాన్ని జీఎస్టీ కౌన్సిల్లో ఆమోదించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అధ్యక్షతన శుక్రవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 27వ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జీఎస్టీఎన్ను ప్రభుత్వ సొంత సంస్థగా మార్చాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. కొన్ని రాష్ట్రాల నుంచి వ్యతిరేకత రావడంతో చక్కెరపై సెస్సు విధించే ప్రతిపాదన వాయిదా పడింది. డిజిటల్ చెల్లింపులకు ప్రోత్సాహం అందించే ప్రతిపాదనను ఐదు రాష్ట్రాల ఆర్థిక మంత్రలు కమిటీకి నివేదించారు. కాంపోజిషన్ డీలర్లు మినహా పన్ను చెల్లింపు దారులు నెలవారీ పలు రిటర్నుల స్థానంలో ఒక్క జీఎస్టీ రిటర్ను దాఖలు చేస్తే సరిపోతుందని సమావేశానంతరం అరుణ్ జైట్లీ చెప్పారు. కాంపోజిషన్ డీలర్లు మాత్రం ఎటువంటి లావాదేవీలు లేకపోతే మూడు నెలలకు ఒకసారి రిటర్ను వేయొచ్చన్నారు. కొత్త విధానం ఆరు నెలల్లో అమల్లోకి వస్తుందని ఆర్థిక శాఖ కార్యదర్శి హస్ముఖ్ అధియా తెలిపారు. ప్రస్తుతం ఉన్న జీఎస్టీఆర్ 3బి, జీఎస్టీఆర్ 1 పత్రాలు మరో ఆరు నెలలకు మించి ఉండబోవన్నారు. డిజిటల్ చెల్లింపులు పెంచే యోచన డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించాలన్న ప్రతిపాదనపై కౌన్సిల్ చర్చించింది. జీఎస్టీలో పన్ను రేటు 3 అంతకంటే ఎక్కువ ఉన్న చోట 2 శాతం తగ్గింపు ఇవ్వాలన్న ప్రతిపాదనకు చాలా రాష్ట్రాలు అంగీకరించాయి. చెక్కు, డిజిటల్ విధానంలో చేసే చెల్లింపులకు ఈ ప్రోత్సాహం వర్తిస్తుంది. గరిష్టంగా రూ.100 వరకే పరిమితి. అయితే, కొన్ని రాష్ట్రాలు ‘ప్రతికూల జాబితా’ ఉండాలని (కొన్ని వస్తువులకు ప్రోత్సాహం వద్దని) డిమాండ్ చేశాయి. దీంతో దీన్ని ఐదు రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన కమిటీకి నివేదిస్తూ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. -
ఇబ్బందుల్లేకుండా జీఎస్టీ అమలు
సాక్షి, న్యూఢిల్లీ: జీఎస్టీ అమలు వల్ల క్షేత్రస్థాయిలో వ్యాపారులకు, పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. జీఎస్టీ అమలు వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించడంపై ఏర్పాటైన వివిధ రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులతో కూడిన ఉప సంఘ సమావేశం మంగళవారం ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఈటల మీడియాతో మాట్లాడారు. జీఎస్టీ వల్ల ఎదురవుతున్న సమస్యలను తెలుసుకునేందుకు సమావేశానికి దేశంలో ఉన్న ట్యాక్స్ కన్సల్టెంట్లను, ఫిక్కీ, సీఐఐ సంస్థల ప్రతినిధులను ఆహ్వానించినట్టు తెలిపారు. వారిచ్చిన సలహాలను వచ్చే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ముందుంచి.. ఆమోదించి జీఎస్టీ అమలును సరళతరం చేస్తామని చెప్పారు. పన్ను చెల్లింపుదారులకు, ట్రేడర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, పన్ను ఎగవేతదారులకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇక అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు 15వ ఫైనాన్స్ కమిషన్ చేయూత ఇవ్వాలే తప్పా.. రాష్ట్ర ప్రభుత్వాల జీఎస్డీపీలో 25 శాతం ఎఫ్ఆర్బీఎం రుణం పొందే అవకాశాన్ని 20 శాతానికి తగ్గించే ప్రయత్నాలకు తాము వ్యతిరేకమని చెప్పారు. క్షేత్రస్థాయిలో నగదు కొరత.. రాష్ట్రంలో నగదు కొరతపై ఈటల స్పందిస్తూ.. తెలంగాణకు గతంలో కంటే ఎక్కువ డబ్బు సరఫరా చేసినట్టు కేంద్రం లెక్కలు చెబుతోందని, అయితే క్షేత్రస్థాయిలో కొరత ఉందన్నారు. ‘దేశంలో ఈ రోజుల్లో ఒక్కొక్కటిగా బ్యాంకు మోసాలు బయటపడుతున్నాయి. ఈ క్రమంలో బ్యాంకుల్లో డబ్బులు పెట్టడం సరికాదన్న ఆలోచనా ధోరణిలో ప్రజలు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇస్తున్న పెట్టుబడి సాయానికి నిధుల కొరత ఉండదని ఆశిస్తున్నాం. ఈ పథకం అమలు చేస్తున్నాం కాబట్టి రూ.6 వేల కోట్ల నగదు సరఫరా చేయాలని గతంలో కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీని కోరాం. ఆయన సానుకూలంగా స్పందించారు’అని అన్నారు. -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
-
భారీగా పెరిగిన పెట్రోల్ ధర, మరింత పైకే..
ముంబై : పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగాయి. పెట్రోల్ ధరలు మూడేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. దీంతో ముంబైలో లీటరు పెట్రోల్ ధర 80 రూపాయలకు దగ్గరిలో రూ.79.44గా రికార్డైంది. అంటే ఒక్కరోజులోనే 17పైసల మేర పైకి ఎగిసింది. ఢిల్లీ, కోల్కత్తా, చెన్నైలో కూడా పెట్రోల్ ధరలు లీటరుకు రూ.71.56గా, రూ.74.28గా, రూ.74.20గా నమోదయ్యాయి. అదేవిధంగా డీజిల్ ధరలు కూడా ముంబైలో బుధవారం కంటే 21 పైసలు ఎక్కువగా రూ.66.30గా నమోదయ్యాయి. ఢిల్లీలో కూడా లీటరు డీజిల్ ధర ఒక్కరోజులోనే 19 పైసలు పెరిగి రూ.62.65గా ఉంది. ఇలా కోల్కత్తా, చెన్నై, హైదరాబాద్‌లో కూడా డీజిల్ ధరలు రికార్డులు సృష్టిస్తున్నాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.75.32ను క్రాస్ కాగ, డీజిల్ ధర లీటరుకు రూ.67.09గా ఉంది. ఇవి ఇక్కడ ఆల్-టైమ్ హైగా తెలిసింది. గతవారం నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. గ్లోబల్ క్రూడ్ ధరలు పెరుగుతుండటంతో, దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ ధరలు మరింత పెరిగే అవకాశమే కనిపిస్తుండటంతో, పెట్రోల్, డీజిల్ ధరలను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్ష పార్టీల అనంతరం, కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రి కూడా జీఎస్టీ కింద ఆయిల్, నేచురల్ గ్యాస్ తీసుకురావాలని ప్రతిపాదిస్తోంది. మరోవైపు పలు ప్రధాన అంశాలపై నేడు జీఎస్టీ కౌన్సిల్ భేటీ అయింది. దీనిలో పెట్రోల్, డీజిల్ ధరలు జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం ప్రధాన అంశంగా తెలుస్తోంది. -
బడ్జెట్‌కు ముందు భేటీ : రిలీఫ్ ఉండొచ్చు
న్యూఢిల్లీ : గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్(జీఎస్టీ) కౌన్సిల్ 25వ సమావేశం ఈ నెల 18న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరుగబోతుంది. మోదీ ప్రభుత్వానికి ఎంతో కీలకమైన బడ్జెట్‌కు కాస్త ముందుగా ఈ సమావేశాన్ని జీఎస్టీ కౌన్సిల్ నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 1న మోదీ ప్రభుత్వం తమ చివరి బడ్జెట్‌ను పార్లమెంట్ ముందు ప్రవేశపెడుతుంది. బడ్జెట్‌కు ముందుగా జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరుగబోతుండటంతో, పలు ఊరటనిచ్చే ప్రకటనలు వెలువడే అవకాశముందని అంచనాలు వెలువడుతున్నాయి. రిజిస్ట్రేషన్ ప్రక్రియను, రిటర్నుల ఫైలింగ్‌ను, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను క్లయిమ్ చేసుకోవడం వంటి ప్రక్రియలను జీఎస్టీ కౌన్సిల్ సులభతరం చేయనుందని తెలుస్తోంది. జీఎస్టీ కౌన్సిల్ చివరి సమావేశం డిసెంబర్ 16న జరిగింది. ఆ సమావేశంలో నిర్ణయించిన అంతరాష్ట్రాల ఈ-వే బిల్లు 2018 ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రాబోతుంది. జీఎస్టీను అనుసరించి ఏవేనీ రెండు రాష్ట్రాల మధ్య రూ.50 వేలకు మించి విలువ కలిగిన సరకులను రవాణా చేయాలంటే ఫిబ్రవరి 1 నుంచి ఈ-వే బిల్లు తప్పనిసరని ఓ ఉన్నతాధికారి తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఆధ్వర్యంలోని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఈ నిర్ణయం తీసుకున్నారు. -
ఇక ఆ ఉత్పత్తులు జీఎస్టీలోకి..
న్యూఢిల్లీ : దేశమంతా ఏక పన్ను విధానం విజయవంతంగా అమల్లోకి వచ్చింది. ఈ పన్ను విధానంలోకి మరికొన్ని ఉత్పత్తులను తీసుకురావాలని జీఎస్టీ కౌన్సిల్ చూస్తోంది. ఎలక్ట్రిసిటీ, పెట్రోలియం, రియాల్టీని తీసుకురావాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయిస్తోందని బిహార్ ఆర్థిక మంత్రి సుశిల్ మోదీ చెప్పారు. ఎలక్ట్రిసిటీ, రియల్ ఎస్టేట్, స్టాంప్ డ్యూటీ, పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీలోకి తీసుకురావాలనుకుంటున్నామని ఇండస్ట్రి ఛాంబర్ ఫిక్కీ వార్షిక సమావేశంలో ఆయన తెలిపారు. అయితే ఏ సమయం వరకు వీటిని జీఎస్టీలోకి తీసుకొస్తామో చెప్పడం కష్టమన్నారు. చట్టాన్ని సవరణ చేయకుండానే వీటిని కలుపబోతున్నట్టు పేర్కొన్నారు. ఒకవేళ పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పాలనలోకి తీసుకొస్తే, ఇవి అత్యధిక మొత్తంలో పన్ను శ్లాబులోకి వచ్చే అవకాశముంటుంది. అదేవిధంగా రాష్ట్రాలు తమ రెవెన్యూలను కాపాడుకోవడానికి సెస్‌ను విధించబోతున్నారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 40 శాతం రెవెన్యూలను పెట్రోలియం ఉత్పత్తుల నుంచి ఆర్జిస్తున్నాయి. జీఎస్టీ పన్ను విధానంలో ఐదు పన్ను శ్లాబులు 0 శాతం, 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం ఉన్నాయి. కొన్ని ఉత్పత్తులపై అదనంగా జీఎస్టీ సెస్ విధిస్తున్నారు. వీటిలో అత్యధిక పన్ను శ్లాబుగా ఉన్న 28 శాతాన్ని 25 శాతానికి తగ్గించబోతున్నారు. లేదా 12 శాతం, 18 శాతం పన్ను శ్లాబులను ఒకటిగా కలుపబోతున్నారు. -
బిగ్గెస్ట్ ట్యాక్స్ కట్ : చౌకగా 200 వస్తువులు?
-
గుజరాత్ ఎన్నికలకు కేంద్రం కీలక నిర్ణయం
-
బిగ్గెస్ట్ ట్యాక్స్ కట్ : చౌకగా 200 వస్తువులు?
సాక్షి, న్యూఢిల్లీ : చేతితో రూపొందించిన ఫర్నీచర్ నుంచి శాంపు, శానిటరీ వేర్, ప్లే వుడ్ వరకు మొత్తం 200 పైగా వస్తువులు ఇక చౌకగా లభ్యం కానున్నాయి. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ నేతృత్వంలో గౌహతిలో జరుగుతున్న భేటీలో నేడు జీఎస్టీ కౌన్సిల్ ఈ మేరకు నిర్ణయం తీసుకోనుంది. ఎక్కువగా వినియోగదారులు వాడే వస్తువులపై పన్ను రేట్లు కోత విధించబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం 28 శాతం శ్లాబులో ఉన్న సేవలు, వస్తువుల్లో 80 శాతం ఇకపై 18 శాతం పన్ను పరిధిలోకి రాబోతున్నట్లు సమాచారం. రెస్టారెంట్లపై విధిస్తున్న పన్ను రేట్లను కూడా తగ్గించబోతున్నట్టు తెలుస్తోంది. పన్ను రేట్లను తగ్గించాలని అభ్యర్థిస్తూ రెస్టారెంట్ల యజమానులు జీఎస్టీ కౌన్సిల్‌తో భేటీ అయి తమ గోడును వినిపించుకున్నారు. జీఎస్టీ 28 శాతం శ్లాబు పరిధిలో ఉన్న 227 ఐటమ్స్‌లో దాదాపు 80 శాతం ఐటమ్స్‌ను 18 శాతం శ్లాబులోకి తెచ్చే అవకాశం ఉందని బిహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ చెప్పారు. అంతేకాకుండా ప్రస్తుతం 18 శాతం జీఎస్టీ పరిధిలో ఉన్నవాటిలో చాలా ఐటమ్స్‌ను 12 శాతం జీఎస్టీకి తగ్గించాలని కూడా జీఎస్టీ ఫిట్మెంట్ కమిటీ సిఫారసు చేసిందన్నారు. ఎక్కువ మొత్తంలో పన్ను రేట్లు భరిస్తున్న కొన్ని ఉత్పత్తులను సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలే తయారీ చేస్తుండటంతో, వీరిపై ఒత్తిడి అధికంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పన్ను రేట్లను పునఃసమీక్షించాల్సి ఉందని నిర్ణయించినట్టు తెలుస్తోంది. నేడు పన్ను రేట్లు తగ్గబోతున్న వస్తువులు... చేతితో రూపొందించిన ఫర్నీచర్, షాంపు, శానిటరీ వేర్, స్యూట్‌కేస్, వాల్ పేపర్, ప్లేవుడ్, స్టేషనరీ ఆర్టికల్స్, వాచ్, ప్లే ఇన్స్ట్రుమెంట్స్ రెస్టారెంట్లపై కూడా పన్ను రేట్లు తగ్గించేందుకు ప్యానెల్ నిర్ణయం కాంపోజిషన్ స్కీమ్ కింద కవర్ చేయని ఏసీ, నాన్-ఏసీ రెస్టారెంట్ల మధ్య పన్ను రేటు వ్యత్యాసం ఉండకూడదని అస్సాం ఆర్థికమంత్రి హిమంత్ బిస్వా శర్మ ఆధ్వర్యంలోని ప్యానెల్ ప్రతిపాదించింది. ఒకే విధంగా 12 శాతం పన్ను రేటు ఉండాలని పేర్కొంది. ప్రస్తుతం నాన్ ఏసీ రెస్టారెంట్లకు 12 శాతం జీఎస్టీ, ఏసీ రెస్టారెంట్లకు 18 శాతం పన్ను రేట్లు ఉన్నాయి. ప్రస్తుతం 28 శాతం పన్ను కేటగిరీలో ఉన్న 5-స్టార్ హోటళ్లను ప్రత్యేక కేటగిరీ కింద ఉంచడం కాకుండా.. రూమ్ టారిఫ్ రూ.7500 దాటిన వారందరికీ ఒకే విధంగా 18 శాతం పన్ను విధించాలని ప్యానెల్ నిర్ణయించింది. కోటికి వరకు వార్షిక టర్నోవర్ ఉన్న వ్యాపారస్తులు కాంపోజిషన్ స్కీమ్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. దీంతో ఎలాంటి ఇన్పుట్ క్రెడిట్లు లేకుండా ఫ్లాట్ రేటులో పన్ను చెల్లించుకోవచ్చు. చిన్న వ్యాపారస్తులకు పడుతున్న ఒత్తిడి మేరకు, ప్రతి నెలా మూడు సార్లు ఫైల్ చేయాల్సిన రిటర్నులపై కూడా జీఎస్టీ కౌన్సిల్ సమీక్ష జరుపుతోంది. జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ పన్ను విధానంపై ప్రతి నెలా జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరుపుతోంది. జీఎస్టీ కింద ప్రస్తుతం 5, 12, 18, 28 శాతం పన్ను శ్లాబులున్నాయి. -
28% పన్ను శ్లాబు ఉత్పత్తులకు గుడ్‌న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ : అత్యధిక జీఎస్టీ శ్లాబు 28 శాతం అమలవుతున్న ఉత్పత్తులకు మంచి రోజులు రాబోతున్నాయి. ఎక్కువగా వినియోగించే ఉత్పత్తులకు, నాన్-లగ్జరీ ఉత్పత్తులకు ఈ రేటును తగ్గించాలని పాలసీ తయారీదారులు నిర్ణయిస్తున్నారు. వీటిని 18 శాతం పన్ను శ్లాబులోకి తీసుకురావాలని యోచిస్తున్నారు. వీటికి మరింత డిమాండ్‌ను పెంచడానికి ఈ ఉత్పత్తుల ధరలు తగ్గించాలని చూస్తున్నారు. 28 శాతం శ్లాబును పునఃసమీక్షించాల్సి ఉందని ఓ సీనియర్ ప్రభుత్వాధికారి చెప్పారు. ఎక్కువ మొత్తంలో పన్ను రేట్లు భరిస్తున్న కొన్ని ఉత్పత్తులను సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలే తయారీ చేస్తుండటంతో, వీరిపై ఒత్తిడి అధికంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పన్ను రేట్లను పునఃసమీక్షించాల్సి ఉందని నిర్ణయించినట్టు తెలుస్తోంది. 28 శాతం పన్ను శ్లాబులో వాషింగ్ మిషన్లు, రిఫ్రిజిరేటర్లు, ఎలక్ట్రిక్ ఫిట్టింగ్స్, సిమెంట్ సీలింగ్ ఫ్యాన్స్, వాచ్‌లు, ఆటోమొబైల్స్, టుబాకో ఉత్పత్తులు, న్యూట్రిషినల్ డ్రింకులు, ఆటో పార్ట్లు, ప్లాస్టిక్ ఫర్నీచర్, ప్లేవుడ్లున్నాయి. పాలసీ తయారీదారులు ప్రస్తుతం తీసుకుంటున్న ఈ నిర్ణయాన్ని జీఎస్టీ కౌన్సిల్ ఆమోదించాల్సి ఉంది. నవంబర్ 9-10వ తేదీల్లో జీఎస్టీ కౌన్సిల్ గౌహతిలో భేటీ కాబోతుంది. ఈ భేటీలో ఈ అంశాలు చర్చకు రానున్నాయి. 28 శాతం పన్ను శ్లాబు అనేది నిజమైన జీఎస్టీ విధానానికి, లక్ష్యానికి విఘాతం కల్గిస్తుందని ఆల్ ఇండియా ట్రేడర్స్ కాన్ఫిడరేషన్ విమర్శిస్తోంది. లగ్జరీ ఉత్పత్తులకు మాత్రమే దీన్ని అమలు అయ్యేలా చూడాలని కోరుతోంది. ఇదే విషయాన్ని ముఖ్యంగా కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు వచ్చే జీఎస్టీ కౌన్సిల్ భేటీలో ప్రస్తావించనున్నట్టు కూడా తెలుస్తోంది. -
జీఎస్టీ : రెస్టారెంట్లు, వస్త్రాలపై పన్ను తగ్గింపు
సాక్షి, న్యూఢిల్లీ : వినియోగదారులు, వ్యాపారుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో కొన్ని కీలక రంగాలు, వస్తువులపై పన్నుల శాతాన్ని తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు తీసుకుంది. ప్రధానంగా రెస్టారెంట్లపై 18 శాతంగా ఉన్న పన్నులు 12 శాతానికి, వస్త్రాలపై 12 శాతాన్ని 5 శాతానికి తగ్గించింది. శుక్రవారం ఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 22వ సమావేశం నిర్ణయాలను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మీడియాకు వెల్లడించారు. మరో రెండు నెలల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఇప్పటికే ఆందోళనలు చేస్తోన్న అక్కడి వస్త్రవ్యాపారులను శాంతింపజేసేందుకే వస్త్రాలపై జీఎస్టీ భారీగా తగ్గించినట్లు తెలుస్తోంది. జైట్లీ చెప్పిన విషయాల్లో ముఖ్యాంశాలు.. ⇒చిన్న పరిశ్రమలకు ఊరట : జీఎస్టీ కాంపోజిషన్ స్కీం పరిధిని రూ.75 లక్షల నుంచి రూ.1 కోటికి పెంచారు. ఈ నిర్ణయంతో చిన్నతరహా పరిశ్రమలకు లబ్ధిచేకూరనుంది. ⇒ఎగుమతిదారులకు పన్ను మినహాయింపు : విదేశాలకు సరుకులు పంపే ఎగుమతిదారులను జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చారు. వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఎలాంటి పన్నులు ఉండవని, 2018, ఏప్రిల్ 1 నుంచి ఆ రంగంలో తప్పనిసరి ఈ-వాలెట్ విధానాన్ని అమలులోకి తేనున్నారు. ⇒ గ్రానైట్ పరిశ్రమకు ఊరట : తెలంగాణ సహా పలు రాష్ట్రాల డిమాండ్‌కు తలొగ్గిన జీఎస్టీ కౌన్సిల్.. గ్రానైట్ పరిశ్రమపై విధించిన పన్ను శాతాన్ని 28 నుంచి 18కి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ⇒ రెస్టారెంట్లు : 18 శాతం పన్ను పరిధిలో ఉన్న రెస్టారెంట్లను 12 శాతం శ్లాబ్‌లోకి చేర్చారు. ⇒ వస్త్రాలపై పన్నును 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. ⇒ స్కూల్ స్టేషనరీ, రబ్బర్‌బ్యాండ్స్, మామిడిపండ్ల రసం, పాపడాలు తదితర వస్తువులపై అమలవుతోన్న పన్నును 12 శాతం నుంచి 5 శాతానికి కుదించారు. ⇒ అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అవుతోన్న ఆహార ప్యాకెట్లపై పన్ను 18 నుంచి 5 శాతానికి తగ్గింపు ⇒ ప్లాస్టిక్, రబ్బర్, పేపర్ వేస్ట్‌లపై 12గా ఉన్న ఉన్న పన్ను 5 శాతానికి కుదింపు ⇒ అన్‌బ్రాండెడ్ ఆయుర్వేద మందులు 18 నుంచి 5 శాతానికి ⇒ డీజిల్ ఇంజన్ విడిభాగాలపై పన్ను 28 నుంచి 18 శాతానికి తగ్గింపు -
22వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ప్రారంభం
సాక్షి, న్యూఢిల్లీ: 22వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఢిల్లీలో ప్రారంభమైంది. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సమక్షంలో ఈ కౌన్సిల్ నేడు సమావేశమైంది. వివిధ వర్గాలకు దీపావళి కానుకగా ఈ సమావేశంలో 60 వస్తువులపై పన్నులు భారం తగ్గించబోతున్నారని తెలుస్తోంది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలతో పాటు వస్త్ర పరిశ్రమకూ ఊరట కల్పించాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోంది. ఈ మేరకు నేడు జరుగుతున్న జీఎస్టీ కౌన్సిల్లో నిర్ణయాలు తీసుకునే అవకాశముందని సమాచారం. జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి ఒక్కరోజు ముందు ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో అత్యవసరంగా సమావేశమయ్యారు. జీఎస్టీ అమలుతో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించాల్సిందిగా అధికారులను కోరాననీ, వాటిని త్వరలోనే సరిదిద్దుతామని ప్రధాని ఇప్పటికే చెప్పారు. -
దేశ ఆర్థిక పరిస్థితిపై నోరు విప్పిన మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : విపక్షాలకుతోడు స్వపక్షం నుంచీ వ్యక్తమవుతోన్న తీవ్ర విమర్శలకు ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా సమాధానమిచ్చారు. నోట్లరద్దు, జీఎస్టీల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ కుదేలైందన్న వాదనలో నిజం లేదని తేల్చిచెప్పారు. స్థూల దేశీయ ఉత్పత్తి(జీడీపీ) వృద్ధిరేటు కనిష్టస్థాయిలో ఉండటం గత కాంగ్రెస్ హయాంలోనూ జరిగిందని గుర్తుచేశారు. రెండో త్రైమాసికంలో వృద్ధిని తప్పక చూస్తారని భరోసా ఇచ్చారు. సిన్హా, శౌరీలకు పంచ్ : దేశ ఆర్థిక పరిస్థితిపై కొందరు నిరాశావాదులు అతిశయోక్తులు మాట్లాడుతున్నారని, అలాంటివారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని బీజేపీ మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, కాంగ్రెస్ నేత అరుణ్ శౌరీల పేర్లు చెప్పకుండా మోదీ పరోక్ష విమర్శలు చేశారు. నోట్లరద్దు, జీఎస్టీలు ముమ్మాటికి సరైన నిర్ణయాలేనని, 21 రంగాలకు సంబంధించి తాము చేసిన 87 సంస్కరణలు సత్ఫలితాలిచ్చేవేనని ఉద్ఘాటించారు. బుధవారం ఢిల్లీలో జరిగిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో ప్రధాని మాట్లాడారు. ‘ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 5.7 శాతంగాగా నమోదయింది వాస్తవమే. అయితే ఇలాంటి పరిస్థితులు గత యూపీఏ(కాంగ్రెస్) హయాంలో చాలా సార్లు జరిగింది. వాళ్ల పాలనలో వృద్ధిరేటు ఏనాడూ 1.5 శాతంను మించలేదు. నాటిలోపాలను సవరిస్తూ ఎన్డీఏ సంస్కరణలు చేసింది. రెండో త్రైమాసికంలో వృద్ధిని చూడబోతున్నాం’ అని ఆయన అన్నారు. మోదీ ప్రసంగంలోని కొన్ని కీలక అంశాలు ఏమంటే.. ⇒ దేశానికి హాని చేసే నిర్ణయాలను నేను ఏనాడూ అనుమతించబోను. ⇒ మనం గొప్ప మార్పు దశలో ఉన్నాం. ప్రభుత్వం నిజాయితీగా, పారదర్శకంగా పనిచేస్తున్న విషయాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు. ⇒ పెద్ద నోట్ల రద్దు తర్వాత 3లక్షల డొల్ల కంపెనీలను గుర్తించాం. వాటిలో 2.1 లక్షల కంపెనీల అనుమతులను రద్దు చేశాం. ⇒ భారత ఆర్థిక వ్యవస్థ మూలాలు చాలా బలమైనది. సుస్థిరతను దృష్టిలో ఉంచుకునే సంస్కరణలు చేపడుతున్నాం ⇒ నోట్లరద్దు సూపర్ సక్సెస్ అయింది. జీడీపీలో నగదును 9శాతానికి కుదించగలిగాం. 2016, నంబంర్ 8 నాటికి జీడీపీలో నగదు శాతం 12 శాతంగా ఉండేది. ⇒ జీఎస్టీ కౌన్సిల్‌కు నేను గట్టిగా సూచించా.. వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, ఆయా వర్గాల నుంచి అందుతోన్న సూచనల మేరకు అవసరమైనమేర చట్టంలో మార్పులు చేయాలని ఆదేశించా. -
టయోటా కార్ల రేట్లు పెంపు
రూ. 13 వేల నుంచి రూ. 1.6 లక్షల దాకా పెరుగుదల న్యూఢిల్లీ: జీఎస్టీకి సంబంధించి కేంద్రం తీసుకున్న నిర్ణయం దృష్ట్యా తమ కార్లలో నిర్దిష్ట మోడల్స్ తాలూకు రేట్లను రూ.13,000 నుంచి రూ. 1.6 లక్షల దాకా పెంచుతున్నట్లు టయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకేఎం) వెల్లడించింది. జీఎస్టీ కౌన్సిల్ మధ్య స్థాయి, పెద్ద కార్లు, ఎస్‌యూవీలపై సెస్సును 2–7 శాతం మేర పెంచిన దరిమిలా సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇన్నోవా క్రిస్టా ధర సుమారు రూ. 78,000, కరోలా ఆల్టిస్ రేటు రూ. 72,000, ఎతియోస్ ప్లాటినం ధర రూ. 13,000, ఫార్చూనర్ రూ. 1.6 లక్షల మేర పెంచినట్లు టీకేఎం డైరెక్టర్ ఎన్ రాజా తెలిపారు. చిన్న, హైబ్రీడ్ కార్ల ధరల్లో ఎలాంటి మార్పులు ఉండవని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం సెస్సును పెంచడంతో మధ్య స్థాయి కార్లపై జీఎస్టీ రేటు మొత్తం మీద 45 శాతానికి, పెద్ద కార్లపై 48 శాతానికి, ఎస్‌యూవీలపై 50 శాతానికి చేరిన సంగతి తెలిసిందే. -
జీఎస్టీ కౌన్సిల్‌కు నిరసనల సెగ
-
జీఎస్టీ కౌన్సిల్‌కు నిరసనల సెగ
► పలు రాష్ట్రాలకు చెందిన కార్మికుల ఆందోళన ►జీఎస్టీని ఎత్తివేయాలని నిరసన ►మాదాపూర్‌లో పరిస్థితి ఉద్రిక్తం ►నిరసనకు వామపక్షాల మద్దతు.. సీపీఐ నేత నారాయణ అరెస్ట్ హైదరాబాద్: హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో జరు గుతున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశాలకు నిరసన సెగ తగిలింది. జీఎస్టీ తమ బతుకులను ఛిద్రం చేస్తోం దని పలు రాష్ట్రాలకు చెందిన చేనేత, బీడీ, జౌళి కార్మికులు ఆందోళనకు దిగారు. వెంటనే జీఎస్టీని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలకు వామపక్షాలు మద్దతు తెలిపాయి. దీంతో సమావేశాలు నిర్వహిస్తున్న హెచ్ఐసీసీ రోడ్డులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రంగంలోకి దిగిన సైబరాబాద్ పోలీసులు ఐదు బృందాలుగా ఏర్పడి నిరసనకారులను అరెస్ట్ చేశారు. నిరసన కారులకు, పోలీసులకు మధ్య జరిగిన తోపులా టలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కిందపడిపోయారు. పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహా రాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన 200 మందికి పైగా కార్మికులను అరెస్ట్ చేసి రాయ దుర్గం, గచ్చిబౌలి, నార్సింగి, మియాపూర్, ఆర్సీపురం పోలీస్ స్టేషన్లకు తరలించారు. కేంద్రానికి తెలుగు రాష్ట్రాల వత్తాసు.. ‘జీఎస్టీని వ్యతిరేకించడంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు విఫలమయ్యాయి. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి వత్తాసు పలుకుతు న్నాయి. జీఎస్టీ నుంచి రైతులను, చేనేత కార్మికులను మినహాయించకపోతే దేశంలో వారి ఆత్మహత్యలు పెరిగే అవకాశం ఉంది. పెద్ద పెద్ద కార్ల కంపెనీలకు జీఎస్టీలో రాయితీలు ఇవ్వడం సమంజసం కాదు. వంద రూపాయల వస్తువును ఉత్పత్తి చేస్తే దానిపై రూ.18 నుంచి రూ.22కు పెంచి విక్రయించాలంటే సాధ్యపడదు. చేతి వృత్తి కార్మికుల ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించాలి. –సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాల్స్ మమ్మల్ని దెబ్బతీశాయి.. మేము ఉత్పత్తి చేసిన దుస్తులు తక్కువ ధరకు కొని షాపింగ్ మాల్స్‌లో ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన మార్కెట్ కల్పించకపోవడంతో నష్టాల బారిన పడుతున్నాం. స్థాని కంగా మార్కెట్ అవకాశాలు లేకపోవడాన్ని షాపింగ్ మాల్స్ అనుకూలం గా మలుచుకుంటున్నాయి. పెద్ద షాపింగ్ మాల్స్‌కు రాయితీలు ఇచ్చి, చేతి వృత్తి కార్మికులు కొనుగోలు చేసే ముడి సరుకులకు రాయితీలు ఇవ్వడం లేదు. చేతి వృత్తి కార్మికుల ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించాలి’. – టి.వెంకటరాములు, తెలంగాణ చేనేత కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి -
ఖాదీకి గుడ్‌న్యూస్.. కార్లకు బ్యాడ్‌న్యూస్
-
ఖాదీకి గుడ్‌న్యూస్.. కార్లకు బ్యాడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: ఓవైపు ఖాదీకి శుభవార్త చెప్పిన జీఎస్టీ కౌన్సిల్... మరోవైపు కార్లపై పన్ను రేట్లను బాదేసింది. ఖాదీ వస్తువులను పూర్తిగా జీఎస్టీ నుంచి మినహాయిస్తున్నట్టు చెప్పిన ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ... పెద్ద కార్లపై పన్నులను 43 శాతం నుంచి 48 శాతం పెంచారు. మధ్యస్థాయి కార్లపై 2 శాతం, పెద్ద కార్లపై 5 శాతం, ఎస్‌యూవీలపై 7 శాతం సెస్‌ను పెంచుతున్నట్టు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. దీంతో ఎస్‌యూవీలపై మొత్తం పన్ను 43 శాతానికి బదులు, 50 శాతం మోతక్కనుంది. చిన్నకార్లు, 13 సీట్లు, హైబ్రిడ్ వాహనాలపై మాత్రం జీఎస్టీ కౌన్సిల్ స్టేటస్ క్వోను పాటించినట్టు చెప్పారు. ఈ పండుగ సీజన్లో చిన్న కార్లను కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ ప్రకటన ఊరటగా మారింది. మరోవైపు మధ్యరకం కార్ల విడిభాగాలపై పన్ను రేట్లను 5 శాతం తగ్గించారు. ఈ పన్ను రేట్లు 48 శాతం నుంచి 43 శాతానికి దిగొచ్చాయి. హైదరాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన జీఎస్టీ 21వ కౌన్సిల్ భేటీ ముగిసిన అనంతరం జైట్లీ మీడియాతో మాట్లాడారు. ట్రేడ్‌మార్కు, బ్రాండెడ్ ఆహారపదార్థాలపై 5 శాతం పన్నును విధించినున్నట్టు చెప్పారు. జీఎస్టీ అమల్లోకి వచ్చాక రెండోసారి భేటీ అయ్యామని, జీఎస్టీ పురోగతిపై సమావేశంలో చర్చించామని తెలిపారు. నేడు జరిగిన సమావేశంలో 30 వస్తువుల పన్నురేట్లపై చర్చలు జరిపినట్టు తెలిపారు. అర్హులైన వారిలో 70 శాతానికిపైగా జీఎస్టీలోకి మారినట్టు చెప్పారు. జీఎస్టీ ఫైల్చేయడంలో కొన్ని సాంకేతిక సమస్యలున్నాయని వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సులభతరమైన ప్రక్రియ కోసం కమిటీని కూడా ఏర్పాటుచేయాలని కౌన్సిల్ నిర్ణయించినట్టు తెలిపారు. సాంకేతిక కారణాల సమస్యతో జీఎస్టీఆర్-1 ఫైల్చేయడానికి గడువును కూడా అక్టోబర్10 వరకు జీఎస్టీ కౌన్సిల్ పొడిగించింది. -
ప్రజోపయోగ పనులపై జీఎస్టీ వద్దు
-
ప్రజోపయోగ పనులపై జీఎస్టీ వద్దు
జీఎస్టీ కౌన్సిల్ భేటీలో ప్రతిపాదిస్తాం: ఈటల - కుదరకుంటే 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని కోరతాం - హైదరాబాద్ వేదికగా నేడే కౌన్సిల్ 21వ సమావేశం సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం చేపట్టే ప్రజోపయోగ పనులపై జీఎస్టీని రద్దు చేయాలని, లేదంటే దాన్ని ప్రస్తుతమున్న 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గిస్తూ సవరించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయనున్నట్లు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. శనివారం హైదరాబాద్ వేదికగా జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ 21వ సమావేశంలో జీఎస్టీ అమలుతో రాష్ట్రంపై పడుతున్న ఆర్థిక భారాన్ని మరోసారి ప్రస్తావిస్తామన్నారు. తెలంగాణలో ఏయే రంగాలపై ఆ ప్రభావముంది.. ఎంత నష్టం జరుగుతుందో అంచనాలు తయారు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలగకుండా పన్నుల విధానముండాలని తొలి నుంచీ చెబుతున్నామని, అందుకు అనుగుణంగానే కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. ఈసారి జరిగే సమావేశం తెలంగాణకు అనుకూలంగా ఉంటుందని మంత్రి ఈటల ఆశాభావం వ్యక్తం చేశారు. ఉదయం 11 గంటల నుంచి 5 గంటల వరకు జరిగే ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక మంత్రి, జీఎస్టీ కౌన్సిల్ చైర్మన్ అరుణ్ జైట్లీ సారథ్యం వహించనున్నారు. మూడు అంశాలను ప్రస్తావిస్తాం... ‘‘పన్నుల విధానం అనుసరణీయంగా ఉండాలని తొలి నుంచీ చెబుతున్నాం. అం దుకే తెలంగాణ లేవనెత్తే డిమాండ్లను దేశం లోని చాలా రాష్ట్రాలు బల పరుస్తున్నాయి. నిర్మాణంలో ఉన్న సాగు, తాగునీటి ప్రాజెక్టులు, గృహ, రహదారుల నిర్మాణంపై 12 శాతం జీఎస్టీ విధించడంతో తెలంగాణలోనే దాదాపు రూ. 9 వేల కోట్ల నష్టం రానుంది. అందుకే వాటిపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని కోరతాం. అంతర్రాష్ట్ర జీఎస్టీ (ఐజీఎస్టీ) నుంచి రాష్ట్రాలకు వాటా త్వరగా రావట్లేదు. పన్నుల్లో రాష్ట్రాల వాటా కూడా ఆలస్యమవుతోంది. ఆన్లైన్లో ఉన్న ఇబ్బందులను కూడా ఇందులో ప్రస్తావిస్తాం. జీఎస్టీ అమలుతో లాభమా నష్టమా అనేది వచ్చే నెలలో స్పష్టత వస్తుంది. ఐజీఎస్టీ ద్వారా తెలంగాణకు ఎంత ఆదాయం వస్తుందనేది ఇంకా తేలలేదు’’అని ఈటల వివరించారు. ఏర్పాట్లపై సమీక్ష... జీఎస్టీ కౌన్సిల్ భేటీ హైదరాబాద్‌లో తొలిసారి జరుగుతుండటంతో ఈ సమావేశానికి అన్ని ఏర్పాట్లూ చేశామని, అతిథులకు ఇబ్బందుల్లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామని ఈటల చెప్పారు. సీఎం కేసీఆర్ ఢిల్లీలో ఉన్నందున జీఎస్టీ కౌన్సిల్ సమావేశ బాధ్యతలను ఈటలతోపాటు పర్యవేక్షిస్తున్న డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి హరీశ్‌రావు శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌తో ఏర్పాట్లపై చర్చలు జరిపారు. జీఎస్టీ భేటీ తర్వాత స్థానిక వ్యాపార, వాణిజ్య వర్గాలు వినతులను అరుణ్ జైట్లీకి సమర్పిస్తాయని ఈటల వివరించారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి ముందు అన్ని రాష్ట్రాల మంత్రుల సమావేశం జరుగుతుంది. రాష్ట్రాలవారీగా డిమాండ్లపై ఇందులో చర్చలు జరుగుతాయి. కౌన్సిల్లో అన్ని రాష్ట్రాలు తమ ప్రతిపాదనలు సమర్పిస్తాయి. ఎజెండాకు స్వీకరించిన అంశాలపై ఓటింగ్ సమయంలో ఒక్కో రాష్టం నుంచి ఒక్కరే పాల్గొంటారు. మధ్యేమార్గంగా కమిటీకి! నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, పను లపై జీఎస్టీని తగ్గించాలన్న డిమాండ్‌పై కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇప్పటికే తొలుత 18% ఉన్న పన్నును గత కౌన్సిల్ సమావేశంలో 12 శాతానికి కుదించింది. అయినా రాష్ట్రం ఏకంగా పన్ను రద్దు చేయాలని లేదా 5 శాతానికి కుదించాలని ఒత్తిడి పెంచుతోంది. జీఎస్టీపై వివిధ రాష్ట్రాల ఫిర్యాదులపై ఏర్పాటు చేసిన కమిటీకి కేంద్రం ఈ అంశాన్ని అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో విందు జీఎస్టీ సమావేశంలో రాష్ట్రం తరఫున డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌తోపాటు ఉన్నతాధికారులు పాల్గొంటారు. సమావేశం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున జైట్లీ, వివిధ రాష్ట్రాల మంత్రులు, అతిథుల బృందానికి ఫలక్‌నుమా ప్యాలెస్‌లో విందు ఇవ్వనున్నారు. సమావేశానికి వచ్చే అతిథులకు పోచంపల్లి చేనేత వస్త్రాలతోపాటు రాష్ట్ర పర్యాటక వివరాలు, చారిత్రక సాంస్కృతిక వైభవానికి అద్దంపట్టే జ్ఞాపికలను బహూకరించనున్నారు. -
ఆతిథ్యం అదిరిపోవాలి
- జీఎస్టీ మండలి సమావేశానికి విస్తృత ఏర్పాట్లు - 9న హెచ్ఐసీసీలో భేటీ.. తాజ్ ఫలక్‌నుమాలో డిన్నర్ - ఇంకా ఖరారుకాని అరుణ్‌జైట్లీ పర్యటన..! సాక్షి, హైదరాబాద్: వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) అమలులో కీలకపాత్ర పోషించే జీఎస్టీ మండలి సమావేశం నిర్వహణ కోసం రాష్ట్ర రాజధానిలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి నిర్వహిస్తున్న ఈ భేటీకి ఘన ఆతిథ్యం ఇచ్చేలా వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఈ నెల 9న ఉదయం 11 గంటల నుంచి హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(హెచ్ఐసీసీ)లో జీఎస్టీ మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కౌన్సిల్ చైర్మన్ హోదాలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో పాటు దేశంలోని 29 రాష్ట్రాలకు చెందిన ఆర్థిక మంత్రులు, వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులు, కేంద్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు హాజరుకానున్న నేపథ్యంలో ప్రభుత్వం దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముచ్చటగా.. మూడు రోజులు అన్ని రాష్ట్రాల నుంచి దాదాపు 160 మంది ప్రతినిధులు రానున్న నేపథ్యంలో వారికి ఎలాంటి లోటు రాకుండా వాణిజ్య పన్నుల శాఖ జాగ్రత్తలు తీసుకుంటోంది. విమానాశ్రయం నుంచి ఆతిథ్య ప్రదేశం, సమావేశ మందిరం, నగరంలో పర్యటనలు.. ఇలా అన్ని చోట్లా ఆహ్వానితులకు అం దుబాటులో ఉండేలా సీనియర్ అధికారులను నియమించింది. 9న సమావేశం జరగనుండగా, 8వ తేదీ ఉదయం నుంచే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. నగరంలోని చారిత్రక ప్రదేశాలన్నింటినీ సందర్శించేలా ప్రణాళిక రూపొందించారు. 8సాయంత్రం వరకు వచ్చిన ఆహ్వానితులకు గోల్కొండ కోటలో లైట్ అండ్ సౌండ్ షో చూపించనున్నారు. జీఎస్టీ మండలి సమావేశం ముగిసిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున తాజ్ ఫలక్‌నుమాలో విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకుగానీ, సమావేశానికిగానీ సీఎం కేసీఆర్ హాజరవుతారని సమాచారం. ఇక సమావేశం మరుసటి రోజు ఆహ్వానితులు చార్మినార్, చౌహమల్లా ప్యాలెస్, సాలార్జంగ్ మ్యూజియం, నిజాం జూబ్లీ పెవిలియన్‌ను సందర్శించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అతిథులందరికీ నోవాటెల్, వెస్టిన్ హైదరాబాద్ హోటళ్లలో బస ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించాల్సిన అరుణ్‌జైట్లీ పర్యటన ఖరారు కాకపోవడం కొంత ఉత్కంఠ రేపుతోంది. -
పన్ను రేటు తగ్గించరూ..!
జీఎస్టీ కౌన్సిల్‌కు వినతుల వెల్లువ ► 133 ఉత్పత్తులపై అభ్యర్థనలు న్యూఢిల్లీ: ఉత్పత్తులపై పన్నులు తగ్గించాలని కోరుతూ జీఎస్టీ కౌన్సిల్ ముందుకు భారీగా దరఖాస్తులు వచ్చి చేరుతున్నాయి. హెల్మెట్ల నుంచి హైబ్రిడ్ కార్ల వరకు మొత్తం 133 ఉత్పత్తులకు సంబంధించి వినతులు ఇందులో ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. జీఎస్టీలో భాగంగా 5, 12, 18, 28 శాతం చొప్పున నాలుగు రకాల పన్ను శ్లాబుల్లో అన్ని వస్తువులు, సేవలను సర్దుబాటు చేశారు. అంతకుముందుతో పోలిస్తే కొన్నింటిపై రేట్లు తగ్గగా, కొన్నింటిపై పెరిగిపోయాయి. దీంతో నూతన పన్ను రేట్లపై కొన్ని రంగాలు సంతృప్తికరంగా లేవని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఐటీ రంగం భారీ సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పిస్తుండటంతో ఈ రంగానికి చెందిన ఉత్పత్తులు, సేవలపై పన్నును ప్రస్తుతమున్న 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించాలన్నది ఇందులో ఒకటి. అలాగే, ఐటీ హార్డ్వేర్పై 28 శాతం పన్నును 18 శాతానికి తగ్గించాలన్న డిమాండ్ కూడా ఉంది. ఇక జీఎస్టీలో హెల్మెట్లపై పన్నును 18 శాతం వేశారు. దాన్ని 5 శాతానికి తగ్గించాలని ఈ రంగం కోరుతోంది. అలాగే, టెక్స్‌టైల్స్‌పై 5 శాతం పన్ను రేటును పూర్తిగా ఎత్తేయాలని ఈ రంగం డిమాండ్ చేస్తోంది. ట్రాక్టర్లపై పన్నును 12 శాతం నుంచి 5 శాతానికి, గ్రానైట్ శ్లాబులపై 28 శాతం నుంచి 18 శాతానికి, నమ్కీన్, భూజియాస్, ఆలుగడ్డ చిప్స్‌పై 12 నుంచి 5 శాతానికి, కుల్ఫీ, వేరుశనగ చక్కీలపైనా పన్ను రేటును సవరించాలన్న డిమాండ్లు జీఎస్టీ కౌన్సిల్ ముందుకు వచ్చాయి. ఇక సేమ్యాపై 5 శాతం పన్ను ఉండగా, అదే తరహా ఉత్పత్తులైన మాక్రోనీ/పాస్తా/నూడుల్స్‌పై 18 శాతం పన్ను అమలవుతోంది. దీంతో వీటిపైనా పన్నును 5 శాతానికి తగ్గించాలన్న వినతులు వచ్చాయి. తాగేనీరు, మోటారుసైకిళ్లపైనా... 20 లీటర్ల మంచి నీటి క్యాన్లు, పౌచుల్లో విక్రయించే తాగే నీరుపై 18% పన్ను విధిస్తున్నారు. వీటితోపాటు హెయిర్‌పిన్, ఎల్పీజీ స్టవ్‌లు, గొడుగులు, రాసే పరికరాలు, వెట్ గ్రైండర్లు, బరువు తూచే యంత్రాలు, నమిలే పొగాకు ఉత్పత్తులు, ప్రింటర్లు, చేతి తయారీ కార్పెట్లు, టెక్స్టైల్ యంత్రాలపైనా పన్ను తగ్గించాలని అభ్యర్థనలు వచ్చాయి. 350సీసీ సామర్థ్యానికి మించిన మోటారు సైకిళ్లపై 28% పన్ను రేటుకు అదనంగా 3% సెస్సు అమలవుతోంది. రాయల్ ఎన్ఫీల్డ్ ఉత్పత్తులన్నీ ఈ సామర్థ్యం ఉన్నవే. దేశీయ తయారీని ప్రోత్సహించే చర్యల్లో భాగంగా ఈ సెస్సును తీసేయాలన్న డిమాండ్ కూడా ఉంది. హైబ్రిడ్ కార్లపై 15% సెస్సును 3 శాతానికి తగ్గించాలని, పర్యావరణానికి అనుకూలమైనవి కనుక వీటిని ప్రోత్సహించాలన్న సూచనలు కూడా ఉన్నాయి. ఇంకా పన్ను తగ్గించాలంటూ వచ్చిన దరఖాస్తుల్లో ఎండుచేపలు, ప్లాస్టి క్ తుక్కు, చేపల వలలు, ఫర్నిచర్, ముడి గ్రానైట్, ఫినిష్డ్ గ్రానైట్, ఫ్లైయాష్ బ్రిక్స్ కూడా ఉన్నాయి. ఈ వినతుల్లో కొన్నింటిని ఫిట్మెంట్ కమిటీకి ప్రతిపాదించడం జరిగిందని, కమిటీ సూచనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. -
ప్రాజెక్టులపై జీఎస్టీ అన్యాయం : కేసీఆర్
-
ప్రాజెక్టులపై జీఎస్టీ అన్యాయం
కేంద్ర ప్రభుత్వంపై న్యాయపోరాటం చేస్తాం: ముఖ్యమంత్రి కేసీఆర్ ► నిర్మాణంలోని సాగు, తాగునీటి ప్రాజెక్టులపై పన్ను సరికాదు ► దీనితో తెలంగాణకు రూ.19 వేల కోట్ల నష్టం ► కేంద్రం ఏకపక్ష తీరును నిలదీస్తాం ► వెంటనే నిర్ణయాన్ని మార్చుకోవాలి ► నేడు ప్రధాని మోదీకి లేఖ రాయనున్న సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్ ఇప్పటికే ప్రారంభమై నిర్మాణంలో ఉన్న సాగు, తాగునీటి ప్రాజెక్టులకు కూడా వస్తుసేవల పన్ను (జీఎస్టీ) విధించాలన్న కేంద్ర ప్రభుత్వం, జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం ఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలపై నిరసన వ్యక్తం చేశారు. నిర్మాణంలోని ప్రాజెక్టులపై 12 శాతం జీఎస్టీ విధించడం వల్ల తెలంగాణతో పాటు చాలా రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఆదివారం ప్రధాని మోదీకి లేఖ రాయాలని నిర్ణయించారు. అంతేగాకుండా కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరుపై న్యాయ పోరాటం చేయాలని యోచిస్తున్నారు. ప్రాజెక్టులపై పన్ను వద్దు.. సాగునీరు, తాగునీటి పథకాలు, గృహ నిర్మాణం, రహదారుల నిర్మాణం వంటి వాటిపై జీఎస్టీ విధించవద్దని రాష్ట్ర ప్రభుత్వం తొలి నుంచీ డిమాండ్ చేస్తోంది. గతంలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశాల్లో ఈ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించింది. శనివారం ఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి హాజరైన మంత్రి కేటీఆర్.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరోసారి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ప్రజోపయోగ పథకాలకు జీఎస్టీ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఈ నాలుగు అంశాలపై జీఎస్టీని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గిస్తూ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు సైతం ఈ 12 శాతం జీఎస్టీ వర్తిస్తుందని పేర్కొంది. అయితే ఈ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ఓ ప్రకటనలో తీవ్రంగా వ్యతిరేకించారు. పురోగతిలో ఉన్న ప్రాజెక్టులకు జీఎస్టీని వర్తింపజేయడం అన్యాయమని స్పష్టం చేశారు. రాష్ట్రానికి భారీగా నష్టం జీఎస్టీ అమల్లోకి వచ్చిన జూలై ఒకటో తేదీ కన్నా ముందే ప్రారంభమై కొనసాగుతున్న ప్రాజెక్టులకు కూడా జీఎస్టీ వర్తింపజేయడంతో తెలంగాణకు ఏకంగా రూ.19 వేల కోట్లు నష్టం జరుగుతుందని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ మాత్రమే కాకుండా అన్ని రాష్ట్రాలూ నష్టపోతాయని.. దీనిని జాతీయ సమస్యగా పరిగణించాలని పిలుపునిచ్చారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత తీసుకున్న నిర్ణయం కావడం వల్ల అమలు చేయటం కూడా సమస్యగా మారుతుందని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల వ్యయాన్ని బడ్జెట్లో పొందుపర్చాల్సి ఉంటుందని.. జీఎస్టీ వర్తింపు వల్ల పెరిగే అంచనా వ్యయాలను బడ్జెట్లో పొందుపర్చలేమన్నారు. కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే దీనిపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. -
గుప్పుమనాలంటే.. జేబుకు చిల్లే!
న్యూఢిల్లీ: సిగరెట్లపై విధించే సెస్‌ను పెంచుతూ జీఎస్టీ కౌన్సిల్ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో పొగరాయుళ్ల జేబులు గుల్లకానున్నాయి. ఇప్పటికే జీఎస్టీ శ్లాబులో 28 శాతం పన్ను సిగరెట్లపై ఉండగా.. మరో 5 శాతం సెస్‌ను పెంచుతున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. దీంతో ప్రతి వెయ్యి సిగరెట్లకు అదనంగా రూ.485/- నుంచి రూ.792/-ల పన్ను భారం పెరగనుంది. సిగరెట్లపై అదనంగా సెస్ విధించడం ద్వారా కేంద్రానికి రూ.5 వేల కోట్ల ఆదాయం సమకూరనుంది.