న్యూఢిల్లీ: జీఎస్టీ పెండింగ్ బకాలను రాష్ట్రాలకు వెంటనే క్లియర్ చేయనున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి జీఎస్టీ బకాయిలు రూ. 16,982 కోట్లను ఈ రోజునుంచి చెల్లిస్తామని శనివారం వెల్లడించారు. జూలై 2017 నుండి ఐదేళ్ల బకాయిలను ఆయా రాష్ట్రాలకు కేంద్రం చెల్లించనుంది.
ఈ మొత్తం నిజంగా నష్టపరిహార నిధిలో అందుబాటులో లేనప్పటికీ, తమ సొంంత వనరుల నుండి విడుదల చేయాలని నిర్ణయించుకున్నామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అలాగే ఈ మొత్తాన్ని ఫ్యూచర్ కాంపెన్‌సేషన్ నుంచి తిరిగి పొందుతామన్నారు. అలాగే పలు వస్తువులపై వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) తగ్గిస్తున్నట్లు ఈసందర్భంగా ప్రకటించారు. నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 49వ జీఎస్టీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న ఇతర నిర్ణయాలు:
ట్యాగ్‌లు, ట్రాకింగ్ పరికరాలు లేదా డేటా లాగర్స్‌పై జీఎస్టీ తొలగింపు. అంతకుముందు 18 శాతం
బొగ్గు వాషరీకి లేదా వాటి ద్వారా సరఫరా చేయబడిన కోల్డ్ రిజెక్ట్స్ పై కూడా జీఎస్టీ లేదు.
పెన్సిల్ షార్పనర్లపై జీఎస్టీని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించారు.
ద్రవ బెల్లంపై జీఎస్టీని తొలగింపు. అంతకుముందు 18 శాతంగా ఉంది.
ప్యాక్ చేసిన ,లేబుల్డ్ లిక్విడ్ బెల్లంపై జీఎస్టీ18 శాతం నుండి 5 శాతానికి తగ్గింపు.
పాన్ మసాలా, గుట్కాపై సామర్థ్య ఆధారిత పన్ను విధింపుపై మంత్రుల బృందం (GoM) సిఫార్సును GST కౌన్సిల్ ఆమోదించింది.
Centre will also clear the admissible final GST Compensation to those states who've provided revenue figures certified by the Accountant General which amounts to Rs 16,524 crores.
— NSitharamanOffice (@nsitharamanoffc) February 18, 2023
- Smt @nsitharaman. pic.twitter.com/p7iAuRUMSc
Comments
Please login to add a commentAdd a comment