states
-
దేశంలో అధిక ధనవంతులు గల రాష్ట్రాలు(ఫొటోలు)
-
ధనవంతులు ఎక్కువగా ఉన్న 10 రాష్ట్రాలు: తెలంగాణ ఎక్కడుందంటే..
2024లో దేశంలో ఎక్కువ మంది ధనవంతులున్న రాష్ట్రాల జాబితాను హురున్ ఇండియా రిచ్ లిస్ట్ వెల్లడించింది. ఇందులో ఏ రాష్ట్రంలో ఎంతమంది ధనవంతులనున్నారనే విషయాన్ని కూడా ప్రస్తావించింది. 2020తో పోలిస్తే ధనవంతుల సంఖ్య కొన్ని రాష్ట్రాల్లో గణనీయంగా పెరిగింది. ఇది ఆ రాష్ట్రాల ఆర్థిక కార్యకలాపాల పెరుగుదలను మాత్రమే కాకుండా.. సంపద సృష్టిని ప్రతిబింబిస్తుంది. ● భారతదేశంలో ఎక్కువమంది ధనవంతులున్న రాష్ట్రాల జాబితాలో అగ్రగామిగా మహారాష్ట్ర ప్రధమ స్థానంలో నిలిచింది. ఈ రాష్ట్రంలో మొత్తం 470 మంది ధనవంతులున్నట్లు సమాచారం. 2020తో (247 మంది) పోలిస్తే ఈ సంఖ్య 222 పెరిగినట్లు తెలుస్తోంది. ● 2020లో 128 మంది ధనవంతులతో రెండో స్థానంలో ఉన్న ఢిల్లీ.. ఇప్పుడు 213మందితో మళ్ళీ అదే స్థానంలో నిలిచింది. ● గుజరాత్ రాష్ట్రంలో 129 మంది, తమిళనాడులో 119 ధనవంతులున్నట్లు హురున్ ఇండియా రిచ్ లిస్ట్ వెల్లడించింది. ఈ రాష్ట్రాల్లో 2020లో వరుసగా 60, 65 మంది ధనవంతులు ఉన్నారు. దీన్నిబట్టి చూస్తే గుజరాత్, తమిళనాడులో కూడా ధనవంతుల సంఖ్య భారీగా పెరిగిందని స్పష్టమవుతోంది. ● తెలంగాణాలో 109 మంది ధనవంతులు, కర్ణాటకలో 108 మంది ధనవంతులున్నట్లు నివేదికలో వెల్లడైంది. 2020లో ఈ రెండు రాష్ట్రాల్లో 54, 72 మంది ధనవంతులున్నారు. తెలంగాణ ఇప్పుడు ఎక్కువమంది ధనవంతులున్న రాష్ట్రాల్లో కర్ణాటకకు అధిగమించింది. ● పశ్చిమ బెంగాల్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వరుసగా 70, 40, 36, 28 మంది ధనవంతులున్నారు. 2020లో ఈ రాష్ట్రాల్లో ఉన్న ధనవంతుల సంఖ్య వరుసగా 32, 16, 9, 9 మాత్రమే. 2024లో ఈ రాష్ట్రాల్లో కుబేరుల సంఖ్య కూడా భారీగా పెరిగినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.2020లో ధనవంతుల జాబితాలో ముందు వరుసలో ఉన్న తమిళనాడు, కర్ణాటక ఈ సారి కొంత వెనుకబడినట్లు తెలుస్తోంది. మొత్తం మీద 2024లో మన దేశంలో ఉన్న ధనవంతుల సంఖ్య 1,322 మంది. 2020లో ఈ సంఖ్య 693 మాత్రమే. దీని ప్రకారం 2024లో 629 మంది ధనవంతులు కొత్తగా జాబితాలోకి చేరినట్లు తెలుస్తోంది. -
పారిశ్రామిక మద్యంపై నియంత్రణ రాష్ట్రాలదే: సుప్రీం తీర్పు
న్యూఢిల్లీ: పారిశ్రామిక మద్యానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఇండస్ట్రీయల్ ఆల్కహార్ తయారీ, అమ్మకాలను నియంత్రించే చట్టాలను చేసే అధికారం రాష్ట్రాలకు కూడా ఉంటుందని సుప్రీంకోర్టు బుధవరం తీర్పునిచ్చింది. ఈ విషయంపై ప్రభుత్వాలకు ఉన్న అధికారాన్ని తొలగించలేనని పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని తొమ్మిది మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలోని ఎనిమిది మంది సభ్యులు ఈ పిటిషన్‌కు మద్దతు తెలపగా.. జస్టిస్ బీవీ నాగరత్న మాత్రం విభేదించారు. పారిశ్రామిక మద్యంపై శాసనాధికారం పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉండాలని ఆమె వాదించారు. దీంతో 8:1 మెజార్టీతో సుప్రీం ధర్మాసనం ఈ తీర్పును ప్రకటించింది.అయితే యూపీ స్టేట్ వర్సెస్ సింథటిక్స్ అండ్ కెమికల్స్ కేసులో పారిశ్రామిక మద్యపానాన్ని నియంత్రించే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి మంజూరు చేస్తూ 1990లో ఇచ్చిన ఏడుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పును తాజాగా సుప్రీం రద్దు చేసింది. సీజేఐ చంద్రచూడ్, మెజారిటీ అభిప్రాయాన్ని అందజేస్తూ.. ‘డినేచర్డ్ స్పిరిట్స్' అని పిలవబడే 'పారిశ్రామిక మద్యం'పై చట్టం చేసే అధికారం రాష్ట్రాలకు ఉందని, ఈ అధికారాలను రాష్ట్రాల నుండి తొలగించలేమని స్పష్టం చేశారు. వారి అధికార పరిధిలో పారిశ్రామిక మద్యం ఉత్పత్తి, సరఫరాను నియంత్రించడానికి వీలుందని ఆయన పేర్కొన్నారు. -
భిన్న రూపాల్లో బొజ్జ గణపయ్యలు (ఫోటోలు)
-
తెలుగు రాష్ట్రాల్లో భక్తులతో పోటెత్తిన ఆలయాలు ... భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాలు (ఫోటోలు)
-
పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం
దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. పర్వత ప్రాంతాలు మొదలుకొని మైదాన ప్రాంతాల వరకు అన్నిచోట్లా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గత రెండు రోజులుగా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి.రాజస్థాన్‌లో కురుస్తున్న కుండపోత వర్షాలకు సంభవించిన పలు ప్రమాదాలలో మరో ఎనిమిది మంది మృతి చెందారు. గడచిన రెండు రోజుల్లో 22 మంది వర్ష సంబంధిత ప్రమాదాల్లో మృతిచెందారు. కరౌలి, హిందౌన్లలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్యామ్‌లు, నదులు పొంగిపొర్లడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. విపత్తు సహాయక దళాలు కరౌలి, హిందౌన్‌లలో 100 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.హిమాచల్ ప్రదేశ్‌లో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఆకస్మిక వరదల కారణంగా రెండు జాతీయ రహదారులతో సహా మొత్తం 197 రోడ్లు మూసుకుపోయాయి. బీహార్‌లో గంగా నది సహా అన్ని ప్రధాన నదుల నీటిమట్టం పెరిగింది. రాజధాని పట్నాలో గంగ, పున్పున్ నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. గంగా నదికి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరింది.గంగానది నీటిమట్టం పెరగడంతో ముంగేర్, భాగల్పూర్, పట్నా తీర ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వరదల కారణంగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. -
బడ్జెట్లో 26 రాష్ట్రాల పేర్లులేవు: నిర్మలాసీతామరామన్ క్లారిటీ
న్యూఢిల్లీ: బడ్జెట్ ప్రసంగంలో 26 రాష్ట్రాల ఊసే లేదని, అంత మాత్రాన ఆ రాష్ట్రాలకు కేటాయింపులు జరపనట్లు కాదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. 2024 బడ్జెట్‌పై జరిగిన చర్చకు లోక్‌సభలో మంగళవారం(జులై 30) ఆమె సమాధానమిచ్చారు. రెండు రాష్ట్రాలకే అధిక కేటాయింపులు చేశామనడం సరికాదన్నారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోన్న ఆర్థికవ్యవస్థ అని చెప్పారు. గతంలో యూపీఏ పాలనలో రాష్ట్రాలకు కేటాయింపుల లెక్కలు వెల్లడించారు. వరుసగా మూడోసారి ఎన్డీయేకు అధికారం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలని, ప్రధాని మోదీపై ప్రజలు మరోసారి విశ్వాసం ఉంచి అధికారం ఇచ్చారన్నారు. -
‘వికసిత భారత్’ సాకారంలో... రాష్ట్రాలదే కీలక పాత్ర: మోదీ
న్యూఢిల్లీ: 2047 కల్లా వికసిత భారత్ కలను సాకారం చేసుకోవడంలో రాష్ట్రాలది ప్రధాన పాత్ర అని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. రాష్ట్రాలన్నీ అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. ‘‘పేదరిక నిర్మూలనే మన లక్ష్యం కావాలి. గ్రామం మొదలుకుని రాష్ట్రస్థాయి దాకా ఆ దిశగా కార్యాచరణ ఉండాలి. ఇందుకు ప్రతి జిల్లా, రాష్ట్రం 2047కు విజన్ డాక్యుమెంట్ తయారు చేసుకోవాలి. జిల్లా, బ్లాక్, గ్రామ స్థాయి దాకా వికసిత్ భారత్ ఆకాంక్ష చేరాలి’’ అని సూచించారు. నీతి ఆయోగ్ పాలక మండలి 9వ భేటీ శనివారం జరిగింది. కేంద్ర మంత్రులతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల గవర్నర్లు తదితరులు పాల్గొన్నారు. భేటీకి సారథ్యం వహించిన మోదీ మాట్లాడుతూ దేశాభివృద్ధే లక్ష్యంగా పాలనలో కేంద్ర, రాష్ట్రాలు కలిసి సాగాలని అభిలషించారు. ‘‘ఇది సాంకేతిక మార్పుల దశాబ్ది. ఎదిగేందుకు అపారమైన అవకాశాలున్నాయి. వాటిని రాష్ట్రాలు అందిపుచ్చుకోవాలి. పెట్టుబడులను ఆకర్షించాలంటే శాంతిభద్రతలు, సుపరిపాలన, మౌలిక సదుపాయాలు చాలా కీలకం. జల వనరుల సమర్థ వినియోగానికి రివర్ గ్రిడ్లు ఏర్పాటు చేసుకోవాలి’’ అని సూచించారు. ముఖ్యమంత్రులు తమ అవసరాలు, ప్రాథమ్యాలను వివరించారు. పేదరిక నిర్మూలన (జీరో పావరీ్ట) లక్ష్యాలను సాధించిన గ్రామాలను పేదరికరహిత గ్రామాలుగా ప్రకటిస్తామని నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రమణ్యం మీడియాకు వెల్లడించారు. భేటీలో చర్చించిన విషయాలపై 45 రోజుల్లో ‘విజన్ ఇండియా 2047’ డాక్యుమెంట్‌ను సిద్ధం చేస్తామని తెలిపారు. -
Weather Update: 9 రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దేశంలోని పలు ప్రాంతాల్లో రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఈ నేపధ్యంలో భారత వాతావరణశాఖ (ఐఎండీ) ఈరోజు (మంగళవారం) తొమ్మిది రాష్ట్రాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది. సోమవారం ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది.మరో ఐదు రోజుల పాటు ఢిల్లీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనావేసింది. ఈరోజు ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్‌గా ఉండవచ్చని తెలిపింది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈరోజు (మంగళవారం)9 రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, గోవా, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ ఉన్నాయి. దీంతో పాటు జార్ఖండ్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్ రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. -
పొంచివున్న వర్ష బీభత్సం.. పలు రాష్ట్రాలు అప్రమత్తం
న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దేశ ఆర్ధిక రాజధాని ముంబైతో పాటు పలు ప్రాంతాలకు వాతావరణశాఖ భారీ వర్ష సూచనలు జారీ చేసింది. వర్షాల కోసం వేచిచూస్తున్న జనానికి ఉపశమనం కలగడంతోపాటు ప్రతీరోజు వర్షాలు కురిసే అంచనాలున్నాయి. ఇప్పటికే వర్షాలు కురుస్తున్న రాష్ట్రాల్లో నదులు, కాలువలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. बिहार में 10-12 जुलाई, 2024 के दौरान अलग-अलग स्थानों पर भारी (64.5-115.5 मिलीमीटर) वर्षा से बहुत भारी (115.5-204.4 मिलीमीटर) वर्षा होने की संभावना है। Bihar is likely to get isolated heavy (64.5-115.5 mm) to very heavy rainfall (115.5-204.4 mm) during 10th-12th July, 2024. pic.twitter.com/Q3lsEOWQLK— India Meteorological Department (@Indiametdept) July 8, 2024భారత వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం జూలై 8 నుంచి 12 వరకూ హిమాలయప్రదేశ్, పశ్చిమబెంగాల్, సిక్కిం, బీహార్, అరుణాచల్‌ప్రదేశ్, అసోం, మేఘాలయ తదితర రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురియనున్నాయి. అదేవిధంగా జూలై 12 వరకూ జార్ఖండ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర తదితర రాష్టాల్లో భారీ వర్షాలు కురియనున్నాయి.మరోవైపు భారీ వర్షాల కారణంగా బీహార్‌లోని పలు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్రంలోని పూర్వ్ చంపారణ్, గోపాల్‌గంజ్, పశ్చిమ చంపారణ్ తదితర ప్రాంతాల్లోని పరిస్థితులను ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అధికారులతో సమీక్షించారు. భారీ వర్ష సూచనల నేపధ్యంలో ముంబై, ఠాణె, నవీ ముంబైతో పాటు రత్నగిరి, సింధుదుర్గ్ తదితర గ్రామీణ ప్రాంతాల్లో విద్యాలయాలకు సెలవులు ప్రకటించారు.तटीय कर्नाटक में 08 जुलाई, 2024 को अलग-अलग स्थानों पर भारी (64.5-115.5 मिलीमीटर) से बहुत भारी वर्षा (115.5-204.4 मिलीमीटर) के साथ अत्यंत भारी वर्षा (>204.4 मिलीमीटर) होने की प्रबल संभावना है। pic.twitter.com/7iaS8uRXCl— India Meteorological Department (@Indiametdept) July 8, 2024 -
వాతావరణశాఖ అలర్ట్: ఐదు రాష్ట్రాలకు రెడ్.. 16 రాష్ట్రాలకు ఆరెంజ్
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి. అసోంలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తూ, జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. అసోం పొరుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపధ్యంలో తాజాగా భారత వాతావరణశాఖ ఐదు రాష్ట్రాలకు రెడ్, 16 రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. అలాగే దక్షిణ మధ్య భారతదేశంలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.జమ్ముకశ్మీర్, రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో వాతావరణం నిర్మలంగా ఉండే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లలో వాతావరణం సామాన్యంగా ఉండనుంది. మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్‌తో పాటు ఉత్తర భారత్‌లోని రాష్ట్రాలకు వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఈశాన్య రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలో ఆదివారం 9 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. సోమవారం, మంగళవారాల్లో ఢిల్లీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో పిడుగులు పడే అవకాశం ఉంది. ఈ జాబితాలో మహారాష్ట్ర, బీహార్, రాజస్థాన్, గుజరాత్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, అరుణాచల్‌ప్రదేశ్ ఉన్నాయి. -
14 రాష్ట్రాలకు భారీ వర్షసూచన
ఢిల్లీ ఎన్సీఆర్తో సహా దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షం కారణంగా వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. కర్ణాటక, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, కేరళ,తమిళనాడు, పుదుచ్చేరి, మహారాష్ట్ర, గోవా, ఒడిశా, అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 24 గంటల్లో దేశంలోని 14 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కొన్ని రాష్ట్రాల్లో 115.5 నుంచి 204.4 మి.మీ. వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ సమయంలో బలమైన గాలులు కూడా వీచే అవకాశాలున్నాయని తెలిపింది.సోమవారం సాయంత్రం ఢిల్లీలో ఆకాశం మేఘావృతమై, పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. మంగళవారం ఉరుములతో కూడిన తేలికపాటి వర్షం కురుస్తుందని, బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ , కనిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్‌గా ఉండి, చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది.దేశంలో కొన్ని రాష్ట్రాలకు వాతావరణశాఖ హీట్‌వేవ్ హెచ్చరికను కూడా జారీ చేసింది. పంజాబ్, బీహార్‌లోని వివిధ ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. గత 24 గంటల్లో జైసల్మేర్ (పశ్చిమ రాజస్థాన్)లో అత్యధికంగా 45.0 డిగ్రీల సెంటీగ్రేడ్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. హర్యానా-చండీగఢ్-ఢిల్లీ, ఎన్సీఆర్, తూర్పు యూపీ, బీహార్‌లోని వివిధ ప్రాంతాల్లో 38 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ వివరించింది. -
నేడే ఆరో దశ పోలింగ్
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఆరో విడతకు రంగం సిద్ధమైంది. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో 58 లోక్‌సభ స్థానాలకు శనివారం పోలింగ్ జరగనుంది. హరియాణాలో మొత్తం 10, ఢిల్లీలోని 7 లోక్‌సభ స్థానాలతో పాటు పశి్చమబెంగాల్‌లోని గిరిజన ప్రాబల్య జంగల్‌మహల్ ప్రాంతంలోని పలు లోక్‌సభ స్థానాలు వీటిలో ఉన్నాయి. ఒడిశాలో 6 లోక్‌సభ స్థానాలతో పాటు వాటి పరిధిలోని 42 అసెంబ్లీ సీట్లలో కూడా పోలింగ్ జరగనుంది. దీంతో 486 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ పూర్తవనుంది. మిగతా 57 స్థానాలకు జూన్ 1న చివరి విడతతో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడవుతాయి. మండే ఎండల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని యంత్రాంగాన్ని ఈసీ ఆదేశించింది. బరిలో కీలక నేతలు కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, రావు ఇందర్జీత్ సింగ్, కృష్ణపాల్ గుర్జర్‌తో పాటు మేనకా గాం«దీ, సంబిత పాత్ర, మనోహర్‌లాల్ ఖట్టర్ (బీజేపీ), రాజ్‌బబ్బర్, కన్హయ్య కుమార్, దీపీందర్‌సింగ్ హుడా (కాంగ్రెస్), మెహబూబా ముఫ్తీ (పీడీపీ) తదితర ప్రముఖులు ఆరో విడతలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. హరియాణాలోని కర్నాల్ అసెంబ్లీ స్థానం నుంచి సీఎం నాయబ్‌సింగ్ సైటీ పోటీ చేస్తున్నారు. కురుక్షేత్ర సిట్టింగ్ ఎంపీ అయిన ఆయన ఇటీవలే సీఎంగా పగ్గాలు చేపట్టడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్నెల్ల లోపు అసెంబ్లీకి ఎన్నికవ్వాల్సి ఉంది. మరోవైపు హరియాణా, ఢిల్లీల్లో 2019లో క్లీన్‌స్వీప్ చేసిన బీజేపీకి ఈసారి మాత్రం కాంగ్రెస్–ఆప్ నుంచి గట్టి సవాలు ఎదురవుతోంది. -
ఐదో దశ ఓటింగ్‌పై ఎన్నికల సంఘం ఆందోళన?
2024 లోక్‌సభ ఎన్నికల ఐదవ దశలో ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 స్థానాలకు ఓటింగ్ జరిగింది. ఈసారి 57.5 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గత సారి అంటే 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల కంటే ఇప్పటి ఓటింగ్ ఐదు శాతం తక్కువ.2019 ఎన్నికల ఐదో దశలో 62.0 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇలా ఓటింగ్ ట్రెండ్ తగ్గుముఖం పట్టడం అటు రాజకీయ పార్టీల్లో, ఇటు ఎన్నికల సంఘంలో మరోసారి ఆందోళన పెంచింది. ఐదో దశలో మహారాష్ట్రలో 13, ఉత్తరప్రదేశ్‌లో 14, పశ్చిమ బెంగాల్లో 7, బీహార్‌లో 5, జార్ఖండ్‌లో 3, ఒడిశాలో 5, జమ్ము-కశ్మీర్, లడఖ్లలో ఒక్కో స్థానానికి పోలింగ్ జరిగింది.ఈ రాష్ట్రాల్లో అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో 73 శాతం, అత్యల్పంగా మహారాష్ట్రలో 48.88 శాతం పోలింగ్ నమోదైంది. బీహార్‌లో 52.55 శాతం, జమ్మూకశ్మీర్‌లో 54.21 శాతం, జార్ఖండ్‌లో 63 శాతం, ఒడిశాలో 60.72 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 57.43 శాతం, లడఖ్‌లో 67.15 శాతం ఓటింగ్ నమోదైంది. సోమవారం సాయంత్రం 7 గంటల వరకు అందుబాటులో ఉన్న ఎన్నికల సంఘం అధికారిక సమాచారం ప్రకారం ఈ దశలో అంచనా వేసిన ఓటింగ్ శాతం 57.38గా నమోదైంది.2019లో ఈ సీట్లలో నమోదైన ఓటింగ్ శాతం విషయానికొస్తే బెంగాల్‌లోని ఈ స్థానాల్లో 80 శాతానికి పైగా ఓటింగ్ జరిగింది. మహారాష్ట్రలో 55.7 శాతం, బీహార్‌లో 57.2 శాతం, జమ్మూ కాశ్మీర్లో 34.6 శాతం, జార్ఖండ్‌లో 65.6 శాతం, ఒడిశాలో 72.9 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 58.6 శాతం, లడఖ్‌లో 71.1 శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా లోక్‌సభ నియోజకవర్గంలో ఈసారి 54 శాతానికి పైగా ఓటింగ్ జరిగింది. ఇది దాదాపు నాలుగు దశాబ్దాలలో అత్యధికం. ఈసారి మొత్తం ఓటింగ్ శాతం 54.21, ఇది 1984లో ఈ నియోజకవర్గంలో 58.84 శాతం ఓటింగ్ తర్వాత అత్యధికం. లోక్‌సభ ఎన్నికలకు ఇంక రెండు దశలు మాత్రమే మిగిలాయి. మే 25న ఆరో దశ, జూన్ ఒకటిన చివరి దశ పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. లోక్‌సభ ఎన్నికల ఐదో దశ ముగియడంతో 428 స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. -
లోక్‌సభ ఎన్నికలు: నాలుగు దశల ఓటింగ్ ఖాతాలో విశేషాలివే..
దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో మొదటి, రెండవ, మూడవ, నాల్గవ దశలకు సంబంధించిన ఓటింగ్ పూర్తయ్యింది. నాలుగో దశతో దేశంలోని సగానికి పైగా లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి.దేశంలో మొత్తం 543 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఏప్రిల్ 19న తొలి దశలో 21 రాష్ట్రాల్లోని 102 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఏప్రిల్ 26న రెండో దశలో 12 రాష్ట్రాల్లోని 88 స్థానాలకు పోలింగ్ జరిగింది. మే 7న మూడో దశలో 11 రాష్ట్రాల్లోని మొత్తం 93 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. మే 13న 10 రాష్ట్రాల్లోని 96 స్థానాలకు ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది. మొత్తంమీద ఇప్పటి వరకు దేశంలోని 379 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇంకా ఐదో దశలో 49, ఆరో దశలో 58, ఏడో దశ(చివరి)లో 57 స్థానాలకు పోలింగ్ జరగనుంది.ఉత్తరాఖండ్, తమిళనాడు, కేరళ, గుజరాత్, రాజస్థాన్, కర్ణాటక, అస్సాం, డామన్ అండ్ డయ్యూ, దాద్రా నగర్ హవేలీ, గోవా, అసోం, త్రిపుర, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, మేఘాలయ, సిక్కిం, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అరుణాచల్‌లో నాలుగో దశతో లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగిసింది.దేశంలో అతి తక్కువ లోక్‌సభ స్థానాలు కలిగిన మొదటి ఈశాన్య రాష్ట్రం సిక్కిం. ఈ రాష్ట్రంలో ఒకే ఒక లోక్‌సభ స్థానం ఉంది. ఇది అన్రిజర్వ్డ్. ఏప్రిల్ 19న మొదటి దశలో ఇక్కడ ఓటింగ్ జరిగింది. దీని తరువాత తక్కువ లోక్‌సభ స్థానాలు కలిగిన రెండవ రాష్ట్రం నాగాలాండ్. ఇక్కడ కూడా ఒకే ఒక లోక్‌సభ స్థానం ఉంది. ఇది కూడా అన్రిజర్వ్డ్. తొలి దశలోనే నాగాలాండ్‌లో కూడా ఓటింగ్ జరిగింది. మిజోరంలో ఒక లోక్‌సభ స్థానం కూడా ఉంది. ఇది ఎస్టీ వర్గానికి రిజర్వ్ అయ్యింది. ఇక్కడ కూడా ఏప్రిల్ 19న ఓటింగ్ ప్రక్రియ జరిగింది.మొదటి దశలో అత్యధికంగా త్రిపురలో 80 శాతం ఓటింగ్ జరిగింది. బీహార్‌లో అత్యల్పంగా 48 శాతం ఓటింగ్ నమోదైంది. రెండో దశలో త్రిపురలో గరిష్టంగా 78.63 శాతం ఓటింగ్ జరిగింది. మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్‌లలో అత్యల్పంగా 54శాతం పోలింగ్ నమోదైంది. మూడో దశలో అసోంలో అత్యధికంగా 81.71 శాతం ఓటింగ్ జరిగింది. యూపీలో అత్యల్పంగా 57.34 శాతం ఓటింగ్ నమోదైంది.లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్లలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. ఏప్రిల్ 19న సిక్కింలోని 32 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని 60 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 19న పోలింగ్ జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాలకు మే 13న పోలింగ్ జరిగింది. ఒడిశాలోని 147 స్థానాలకు నాలుగు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తికానున్నాయి. -
Lok Sabha Election 2024: నాలుగో దశ ప్రచారానికి తెర
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల నాలుగో దశలో 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 96 స్థానాలకు ప్రచారం శనివారంతో ముగిసింది. అవినీతి, నిరుద్యోగం, పేట్రేగిన ధరలకుతోడు అదానీ, అంబానీల నుంచి కాంగ్రెస్‌కు టెంపోల కొద్దీ నల్లధనం తరలింపు ఆరోపణలు, దక్షిణాది భారతీయులు ఆఫ్రికన్లలా కనిపిస్తారన్న శ్యామ్ పిట్రోడా జాత్యహంకార వ్యాఖ్యానాలు, అయ్యర్ పాక్ అణుబాంబు మాటలపై బీజేపీ, కాంగ్రెస్ పరస్పర దూషణలు నాలుగోదశ ప్రచారానికి మరింత వేడిని అందించాయి. బరిలో దిగ్గజాలు.. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్(యూపీలోని కనౌజ్), కేంద్ర మంత్రులు గిరిరాజ్‌సింగ్ (బిహార్‌లోని బెగుసరాయ్), నిత్యానంద్ రాయ్(బిహార్‌లోని ఉజియాపూర్), కాంగ్రెస్ నేత అ«దీర్ రంజన్ చౌదరి(పశ్చిమబెంగాల్లోని బహరాంపూర్), బీజేపీ నాయకురాలు పంకజ ముండే(మహారాష్ట్రలోని బీడ్) తదితరులు మే 13న జరిగే నాలుగోదశ పోలింగ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 2021నాటి లఖీంపూర్‌ఖేరీ రైతుల మరణాల కేసులో నిందితుడైన ఆశిశ్ తండ్రి, కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా ఈసారి యూపీలోని ఖేరీ నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ విజయం కోసం చెమటోడుస్తున్నారు. నాడు 40 చోట్ల ఎన్డీఏ విజయం నగదుకు ప్రశ్నలు ఉదంతంలో పార్లమెంట్ సభ్యత్వం నుంచి బహిష్కరణకు గురైన తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా మరోసారి బెంగాల్‌లోని కృష్ణానగర్ నుంచి పోటీకి నిలబడ్డారు. జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్ స్థానంలో నేషనల్ కాన్ఫరెన్స్ తరఫున షియా నేత అఘా సయ్యద్ రుహుల్లా మెహ్దీ, పీడీపీ తరఫున వహీద్ పారా, ఆప్ తరఫున ఆష్రాఫ్ మీర్ పోటీచేస్తున్నారు. ఇండోర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి అక్షయ్ బామ్ చివరి నిమిషంలో నామినేషన్ ఉపసంహరించుకోవడంతో బీజేపీ అభ్యర్థి శంకర్ లాల్వానీ గెలుపు దాదాపు ఖాయమైంది. ఇక్కడ ‘నోటా’కు ఓటేయాలని కాంగ్రెస్ ప్రచారంచేసింది. నాలుగోదశలో పోలింగ్ జరుగుతున్న ఈ 96 స్థానాల్లో 2019 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 40 చోట్ల విజయం సాధించింది. ఐదో దశ మే 20న, ఆరో దశ మే 25న, ఏడో దశ జూన్ ఒకటిన జరగనున్నాయి. అన్నింటికీ కౌంటింగ్ జూన్ 4వ తేదీన చేపడతారు. ఒడిశాలో లోక్‌సభ ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు నాలుగుదశల్లో జరగనున్నాయి. వీటిలో తొలి దశలో 28 స్థానాలకు సంబంధించిన ప్రచారం సైతం శనివారమే ముగిసింది. -
Lok Sabha Election 2024: ఐదో విడత బరిలో..695 మంది
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 సీట్లకు ఈ నెల 20వ తేదీన ఐదో విడతలో పోలింగ్ జరగనుంది. మొత్తం 49 సీట్లకుగాను 1,586 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 3వ తేదీతో నామినేషన్ల పరిశీలన పూర్తికాగా 749 నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు గుర్తించామని ఈసీ తెలిపింది. బరిలో మొత్తం 695 మంది అభ్యర్థులున్నట్లు బుధవారం వెల్లడించింది. ఒక్కో నియోజకవర్గానికి సరాసరిన 14 మంది పోటీలో ఉన్నారు. -
Lok Sabha Election 2024: నేడే మూడో దశ పోలింగ్
అహ్మదాబాద్/బెంగళూరు: పరస్పర వివాదాస్పద ఆరోపణలు, ఈసీకి ఫిర్యాదు లతో రాజకీయ పార్టీలు పెంచిన ప్రచారవేడి చల్లారాక నేడు కేంద్ర ఎన్నికల సంఘం మూడో దశ పోలింగ్‌కు సిద్ధమైంది. 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ దశతో గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్‌లోని అన్ని స్థానా లకూ పోలింగ్ పూర్తి కానుంది. ఈ రాష్ట్రాల్లో 2019 ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగిన విష యం తెల్సిందే. ఈసారి మూడో దశలో 120 మంది మహిళలుసహా 1,300కు పైగా అభ్యర్థులు పోటీపడు తున్నారు.బరిలో అగ్రనేతలు, ప్రముఖులుకేంద్రమంత్రులు అమిత్ షా(గాంధీనగర్), జ్యోతిరాదిత్య సింధియా(గుణ), మన్సుఖ్ మాండవీయ(పోర్బందర్), పురుషోత్తం రూపాలా(రాజ్‌కోట్), ప్రహ్లాద్ జోషి (ధార్వాడ్), ఎస్పీ సింగ్ బఘేల్(ఆగ్రా), మధ్యప్రదేశ్ మాజీ సీఎంలు శివరాజ్‌సింగ్ చౌహాన్(విదిశ), దిగ్విజయ్‌సింగ్(రాజ్‌గఢ్), ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్, కర్ణాటక మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై (హవేరీ), బారామతిలో వదినా, మరదళ్లు సునేత్రా పవార్, సుప్రియా సూలే తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.283 చోట్ల పోలింగ్ పూర్తిఇప్పటికే గుజరాత్‌లోని సూరత్ నియోజక వర్గంలో బీజేపీ ఏకగ్రీవంగా గెల్చింది. గతంలో వాయిదాపడిన బైతుల్ నియోజ కవర్గంలో ఈరోజే పోలింగ్ నిర్వహిస్తు న్నారు. మూడోదశలో 11 కోట్లకుపైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పశ్చిమబెంగాల్లో ఈరోజు పోలింగ్ ఉన్న నాలుగు స్థానాల్లోనూ ముస్లిం ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. కర్ణాటకలో ఈరోజు పోలింగ్ ఉన్న 14 స్థానాలనూ 2019 ఎన్నికల్లో బీజేపీ క్వీన్‌స్వీప్ చేసింది. మూడో దశ ముగిస్తే మొత్తం 543 స్థానాలకుగాను ఇప్పటిదాకా పోలింగ్ పూర్తయిన స్థానాల సంఖ్య 283కి చేరుకుంటుంది. నాలుగో దశ మే 13న, ఐదో దశ మే 20న, ఆరో దశ మే 25న, ఏడో దశ జూన్ ఒకటో తేదీన నిర్వహిస్తారు. అన్ని స్థానాలకు ఓట్ల లెక్కింపును జూన్ 4న చేపడతారు.రాష్ట్రం సీట్లుగుజరాత్ 25కర్ణాటక 14మహారాష్ట్ర 11ఉత్తరప్రదేశ్ 10మధ్యప్రదేశ్ 9ఛత్తీస్‌గఢ్ 7బిహార్ 5అస్సాం 4బెంగాల్ 4గోవా 2దాద్రానగర్, హవేలీ, డయ్యూడామన్ 2 -
రెండోదశలో తగ్గనున్న ఓటింగ్ శాతం? కారణం ఇదే?
రెండో దశ లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 26న జరగనున్నాయి. ఈ దశలో 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 89 స్థానాలకు పోలింగ్ జరగనుంది. బీహార్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఆ రోజు ఓటింగ్ జరగనుంది. అయితే ఆ రోజుల్లో ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉండే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇది ఎన్నికల కమిషన్‌ను కూడా ఆందోళనకు గురిచేస్తోంది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఏప్రిల్ 26, రెండవ దశ ఓటింగ్ రోజున తూర్పు భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో వేడి గాలులు వీయనున్నాయి. రాబోయే ఐదు రోజుల పాటు అత్యధిక ఉష్ణోగ్రతలు ఉండనున్నాయి. పశ్చిమ బెంగాల్లో విపరీతమైన వేడి గాలులుల వీయనున్నాయనే అంచానాలున్నాయి. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటనున్నాయి. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో రెండు రోజుల తర్వాత వేడిగాలు వీచే అవకాశం ఉంది. కర్ణాటకలో ఐదు రోజుల పాటు హిట్ వేవ్ ఉండనుంది. ఏప్రిల్ 26న ఈ రాష్ట్రాలన్నింటిలో రెండో దశ పోలింగ్ జరగనుంది.మీడియాకు అందిన సమాచారం ప్రకారం వేసవి సవాళ్లను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎన్నికల సంఘం ఆయా రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించనుంది. పోలింగ్ కేంద్రాల్లో తాగునీటి సదుపాయం, ఫ్యాన్లు తదితర సౌకర్యాలు కల్పించనున్నారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాలలోని ఆరోగ్యశాఖ అధికారులను అప్రమత్తం చేయనున్నారు. ఓటర్లు వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రచారాన్ని ప్రారంభించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. -
Lok sabha elections 2024: ‘మూడో విడత’కు నేడు నోటిఫికేషన్
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక సమరంలో మూడో విడత ఎన్నికల ప్రక్రియకు రంగం సిద్ధమైంది. మూడో విడతలో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 94 లోక్‌సభ స్థానాల్లో మే 7వ తేదీన పోలింగ్ జరగనుంది. వీటితోపాటు అభ్యర్థి మృతితో రెండో విడతలో వాయిదా పడిన మధ్యప్రదేశ్‌లోని బేతుల్ లోక్‌సభ నియోజకవర్గానికి మే 7నే పోలింగ్ ఉంటుంది. శుక్రవారం మూడో విడత ఎన్నికల ప్రక్రియకు నోటిఫికేషన్ వచ్చాక నామినేషన్ల ప్రక్రియ మొదలుకానుంది. ఈ 94 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19 వరకు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 20న ఉంటుంది. మూడో విడతలో అస్సాం, బిహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌తదితర రాష్ట్రాల్లో మే 7న ఎన్నికలు జరుగనున్నాయి. గుజరాత్‌లోని విజాపూర్, ఖంభట్, వఘోడియా, మానవదర్, పోర్బందర్ అసెంబ్లీ స్థానాలతో పాటు, పశి్చమబెంగాల్‌లోని భగవాన్‌గోలా, కర్ణాటకలోని షోరాపూర్ (ఎస్టీ) అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. -
ఈ పండుగ కొందరికి హోలీ అయితే.. మరి కొందరికి ‘హోలా మొహల్లా’..
ఏటా వసంతాగమన వేళ వచ్చే హోలీ హిందువులకు రంగుల పండుగ. సిక్కులకు మాత్రం ఇది రంగుల పండుగ మాత్రమే కాదు, వీరవిద్యల వేడుక కూడా. హోలీ నాటితో మొదలై మూడు రోజులు కొనసాగే ఈ వేడుకను ‘హోలా మొహల్లా’ అంటారు. సిక్కుల గురువు గురు గోబింద్ సింగ్ ఈ వేడుకను జరుపుకొనే ఆనవాయితీని ప్రారంభించారు. హోలీ వేడుకల్లో ఒకరిపై ఒకరు రంగులు చల్లుకోవడమే కాకుండా, ఆరుబయట మైదానాల్లోకి చేరి యువకులు సంప్రదాయ వీరవిద్యలను ప్రదర్శిస్తారు. జోడు గుర్రాల మీద నిలబడి స్వారీ చేయడం, గుర్రపు పందేలు, ఒంటెల పందేలు నిర్వహిస్తారు. ‘హోలా మొహల్లా’ అంటే ఉత్తుత్తి యుద్ధం అని అర్థం. ఈ వేడుకల్లో కత్తులు, బరిసెలతో ఉత్తుత్తి యుద్ధాల్లో పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. తొలిసారిగా ‘హోలా మొహల్లా’ వేడుకలు 1701లో ఆనంద్‌పూర్ సాహిబ్‌లో జరిగాయి. అదే సంప్రదాయ ప్రకారం ఇప్పటికి కూడా ఆనంద్‌పూర్ సాహిబ్‌లో ఈ వేడుకలు ఆర్భాటంగా జరుగుతాయి. పంజాబ్, హర్యానాలతో పాటు పాకిస్తాన్లో కూడా సిక్కులు ఈ వేడుకను సంప్రదాయబద్ధంగా జరుపుకొంటారు. ఉదయం వేళ రంగులు చల్లుకోవడం, వీరవిద్యా ప్రదర్శనలు, ఆయుధ ప్రదర్శనలు; సాయంత్రం వేళలో ఆధ్యాత్మిక సంకీర్తనలు, సంగీత నృత్య ప్రదర్శనలు, కవి సమ్మేళనాలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. వేడుకల్లో పాల్గొనడానికి భారీ సంఖ్యలో వచ్చే జనాలకు సంప్రదాయక వంటకాలతో ఆరుబయట విందుభోజనాలను ఏర్పాటు చేస్తారు. ఇవి చదవండి: నాజూగ్గా ఉండే శిల్పాశెట్టి ఇంతలా ఫుడ్‌ని లాగించేస్తుందా..! -
కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: చిన్నారుల్లో పోషకాహారలోపం నివారించేందుకు కమ్యూనిటీ కిచెన్ల స్కీమ్‌ను తీసుకురావడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలాంటి ఆదేశాలివ్వలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పథకాలను సమీక్షించడంపై తమకున్న అధికారాలు పరిమితమని జస్టిస్ బేలా ఎమ్ త్రివేది, పంకజ్ మిట్టల్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్(ఎన్ఎఫ్ఎస్ఏ) చట్టం కింద కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అమలు చేస్తున్న స్కీమ్‌లకు ప్రత్యామ్నాయంగా మరో స్కీమ్ తీసుకురావాలని తాము ఆదేశించలేమని సుప్రీంకోర్టు తెలిపింది. కాగా, గతంలో కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేసి పిల్లల్లోపోషకాహార లోపాన్ని, ఆకలి చావులను నివారించేందుకు అవసరమైన చర్చలు జరపాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఆకలి, పోషకాహార లోపాన్ని ఎదుర్కోవడానికి కమ్యూనిటీ కిచెన్ల స్కీమ్ రూపొందించడానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సామాజిక కార్యకర్తలు అనున్ ధావన్, ఇషాన్ సింగ్, కునాజన్ సింగ్ ప్రజా పయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. ఆకలి, పోషకాహారలోపం కారణంగా రోజూ వందల సంఖ్యలో ఐదేళ్లలోపు పిల్లలు మరణిస్తున్నారని, ఈ పరిస్థితి పౌరులు జీవించే హక్కును ఉల్లంఘిస్తోందని పిటిషన్లో పేర్కొన్నారు. ఇదీ చదవండి.. రష్యాలోని భారతీయులకు కేంద్రం కీలక సూచన -
Supreme Court Of India: బుజ్జగింపు రాజకీయాలకు దారి తీస్తుంది
న్యూఢిల్లీ: వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ కోటాను రాష్ట్రాలు నిర్ణయించడం ప్రమాదకరమైన బుజ్జగింపు రాజకీయాలకు దారి తీస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఎస్సీలు, ఎస్టీల్లో ఉప వర్గీకరణ చేపట్టే అధికారం రాష్ట్రాలకు ఉంటుందా అనే అంశంపై గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం..అత్యంత వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ ప్రయోజనాలను అందజేసే క్రమంలో రాష్ట్రాలు ఇతరులను వదిలేయరాదని తెలిపింది. ఎస్సీలు, ఎస్టీలు సజాతీయ సమూహాలు అయినందున వీరిలో వెనుకబడిన, బలహీన కులాలకు కోటా కోసం వారిని మళ్లీ వర్గీకరించలేమంటూ 2004లో ఈవీ చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ధర్మాసనం గుర్తు చేసింది. -
Republic Day: జెండాల గౌరవం కాపాడండి : కేంద్రం
న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే సమీపిస్తుండటంతో మువ్వన్నెల జెండాల వాడకం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర హోంశాఖ ప్రత్యేకంగా సూచనలు చేసింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు శుక్రవారం ఒక సర్క్యులర్ జారీ చేసింది. జెండా వందన కార్యక్రమాలు పూర్తయ్యాక కాగితపు జెండాలను ఇష్టం వచ్చినట్లుగా నేలపై పారేయకూడదని కోరింది. జెండా గౌరవానికి భంగం కలగకుండా వాటిని గౌరవ ప్రదంగా, రహస్యంగా డిస్పోజ్ చేయాలని సూచించింది. ఈ విషయంపై అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. అన్ని ఇతర ఈవెంట్లలో వాడే జెండాలకు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. జనవరి 26న దేశం 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించనుంది. ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ముఖ్యఅతిథిగా హాజరవనున్నారు. గణతంత్ర వేడుకల కోసం ఢిల్లీలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదీచదవండి.. సభలో మోదీ నినాదాలు.. అసౌకర్యానికి గురైన సిద్ధరామయ్య -
అప్రమత్తంగా ఉందాం.. భయమొద్దు: కేంద్రం
సాక్షి, ఢిల్లీ: కరోనా కొత్త వేరియెంట్(ఉపరకం) జేఎన్.1 (COVID subvariant JN.1) కారణంగా దేశంలో కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఏడు నెలల తర్వాత కేసుల్లో ఒక్కసారిగా పెరుగుదల కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కోవిడ్ పరిస్థితులపై సమీక్ష కోసం బుధవారం ఉదయం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. వైరస్ వ్యాప్తి నియంత్రణ, ఆసుపత్రుల సన్నద్ధతపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మాన్షుక్ మాండవీయ రాష్ట్రాల అధికారుల కీలక సూచనలు చేశారు. ‘‘మనమంతా సమష్టిగా పనిచేయాల్సిన సమయమిది. మళ్లీ కొవిడ్ వ్యాప్తిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ, అప్రమత్తంగా ఉండాలి. ఆసుపత్రుల సంసిద్ధత, వైరస్ వ్యాప్తిని నిరోధించడం, ప్రజలకు అవగాహన కల్పించడంపై మనం సిద్ధంగా ఉండాలి. ఆసుపత్రుల్లో ప్రతి మూడు నెలలకోసారి మాక్ డ్రిల్ నిర్వహించాలి. ఆరోగ్యపరమైన అంశాలను రాజకీయం చేయొద్దు. రాష్ట్రాలకు కేంద్రం పూర్తిగా సహకరిస్తుంది’’ అని కేంద్రమంత్రి మాండవీయ రాష్ట్రాలకు తెలిపారు. आज देश के सभी राज्यों एवं UTs के स्वास्थ्य मंत्रियों व वरिष्ठ अधिकारियों के साथ respiratory illnesses (कोविड-19 समेत) और public health संबंधित तैयारियों को लेकर समीक्षा बैठक की। बैठक में सभी राज्यों ने स्वास्थ्य सुविधाओं के बेहतर क्रियान्वयन हेतु सकारात्मक दृष्टिकोण रखा। pic.twitter.com/rYkDCIkg2F — Dr Mansukh Mandaviya (@mansukhmandviya) December 20, 2023 పండగ సీజన్‌తో పాటు చలి కాలం నేపథ్యంలో వైరస్ వ్యాపించకుండా నియంత్రణ చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలను ఆయన కోరారు. దేశంలో గత కొన్ని రోజులుగా మళ్లీ కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. అయితే, ఈ జేన్.1 వేరియంట్‌పై భయపడాల్సిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా వెల్లడించింది. మరోవైపు.. వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు మార్గదర్శకాలు పాటించాలని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు లేఖలు రాసింది. రాష్ట్రాల్లో కొవిడ్ పరీక్షలను పెంచాలని అధికారులను సూచించింది. -
కరోనా కొత్త వేరియంట్‌పై రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్
-
కోవిడ్ కేసులు పైపైకి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం సూచనలు జారీచేసింది. కోవిడ్ కేసుల్లో పెరుగుదల, కేరళలో కరోనా కొత్త సబ్‌వేరియంట్ జేఎన్1 (బీఏ 2.86.1.1) వెలుగుచూసిన నేపథ్యంలో కేంద్రం సోమవారం ముందస్తు చర్యలకు దిగింది. ‘‘ కోవిడ్ కేసుల్లో ఉధృతి కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా చర్యలు తీసుకోవాలి. పెరుగుతున్న కేసులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాలన్నీ అప్రమత్తంగా ఉండాలి. భారత వాతావరణాన్ని తట్టుకుని వేరియంట్లు విజృంభించేలోపు ముందస్తు చర్యలతో సమాయత్తం అవుదాం’’ అని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి సుధాన్‡్ష పంత్ రాష్ట్రాలకు లేఖ రాశారు. ఆదివారం దేశవ్యాప్తంగా ఐదుగురు కోవిడ్‌తో కన్నుమూశారు. కొత్తగా వందలాది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. -
వివిధ రాష్ట్రాల అత్యంత ప్రసిద్ధ ఆహారం ఫోటోలు
-
కొత్త ఏడాదిలో నూతన ఎక్స్‌ప్రెస్‌వే.. నాలుగు రాష్ట్రాలకు నజరానా!
దేశంలోని నాలుగు రాష్ట్రాలను కలుపుతూ రాబోయే సంవత్సరంలో కొత్త ఎక్స్‌ప్రెస్‌వే నిర్మితం కానుంది. ఇది బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాలను అనుసంధానం చేయనుంది. ఈ రహదారి ఏర్పాటుతో బీహార్ ప్రజలకు అత్యధిక ప్రయోజనం చేకూరనుంది. ఈ వారణాసి-రాంచీ-కోల్‌కతా ఎక్స్‌ప్రెస్ వేకు సంబంధించిన కీలక సమాచారం వెలువడింది. ఈ ఎక్స్‌ప్రెస్ వే ఏడు ప్యాకేజీలుగా నిర్మాణం కానుంది. దీనిలోని ఐదు ప్యాకేజీలలో బీహార్‌లోని పలు ప్రాంతాలను అనుసంధానం చేస్తూ ఈ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించనున్నారు. ఈ ఎక్స్‌ప్రెస్‌వే అంచనా వ్యయం రూ.28,500 కోట్లు. ఇది 610 కిలోమీటర్ల పొడవైన ఎక్స్‌ప్రెస్‌వే. ఇది నాలుగు రాష్ట్రాల మీదుగా వెళుతుంది. దీనిలో 159 కిలోమీటర్ల పొడవైన మార్గం బీహార్ మీదుగా వెళుతుంది. ఈ ప్రత్యేక గ్రీన్‌ఫీల్డ్ ఆరు లేన్ల ఎక్స్‌ప్రెస్‌వే కోసం బీహార్‌లో 136.7 కిలోమీటర్ల మేరకు అవసరమైన భూమిని గుర్తించారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం కొత్త సంవత్సరం ప్రారంభంతో దీనికి సంబంధించిన నిర్మాణ పనులు జరిగే అవకాశం ఉంది. నాలుగు, ఐదు ప్యాకేజీల డీపీఆర్ కూడా సిద్ధమవుతున్నట్లు సమాచారం. వారణాసి రింగ్ రోడ్‌లోని చందౌలీలో ఉన్న బర్హులి గ్రామం నుండి ఎక్స్‌ప్రెస్‌వే రహదారి నిర్మాణం ప్రారంభం కానుంది. ఈ రహదారి బీహార్‌లోకి ప్రవేశించిన తర్వాత కైమూర్, రోహతాస్, ఔరంగాబాద్, గయ జిల్లాల మీదుగా వెళుతుంది. బీహార్‌లోని నాలుగు జిల్లాలను దాటి జార్ఖండ్‌కు చేరుకుంటుంది. ఇక్కడ ఐదు జిల్లాల గుండా వెళుతూ ఈ ఎక్స్‌ప్రెస్‌వే పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశిస్తుంది. అక్కడ నాలుగు జిల్లాల మీదుగా జాతీయ రహదారి- 19కి అనుసంధానమవుతుంది. జార్ఖండ్‌లో ఈ రహదారి పొడవు 187 కిలోమీటర్లు. పశ్చిమ బెంగాల్లో గరిష్టంగా 242 కిలోమీటర్లు. మొదటి ప్యాకేజీలో ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి ప్రారంభమై బీహార్‌లోని కొన్ని ప్రాంతాలతో అనుసంధానమవుతూ ముగుస్తుంది. రెండో ప్యాకేజీలో రహదారి నిర్మాణం ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి జిల్లా నుండి ప్రారంభంకానుంది. ఇది ఇక్కడి చందౌలీలో ఉన్న బర్హులీ గ్రామం మీదుగా బీహార్‌లోకి ప్రవేశిస్తుంది. తరువాత ఔరంగాబాద్, గయా జిల్లాల మీదుగా జార్ఖండ్‌లోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి ఛత్రా, హజీరాబాగ్, రామ్‌ఘర్, పీటర్‌బార్, బొకారో మీదుగా ఈ ఎక్స్‌ప్రెస్‌వే పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశిస్తుంది. అక్కడ పురూలియా, బంకురా, ఆరంబాగ్ మీదుగా వెళ్లే ఈ ఎక్స్‌ప్రెస్ వే ఉలుబెరియా వద్ద జాతీయ రహదారి 19 వద్ద ముగుస్తుంది. ఇది కూడా చదవండి: ‘శ్రీరామునికి రెండు నూలు పోగులు’ ఉద్యమానికి అనూహ్య స్పందన! -
నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో ‘నోటా’కు ఎన్ని ఓట్లు?
భారతదేశ ఎన్నికల వ్యవస్థలో ఓటర్లు ఏ అభ్యర్థినీ ఇష్టపడని పక్షంలో ఏమి చేయాలనే దానిపై గతంలో చర్చ జరిగింది. ఈ నేపధ్యంలోనే 2013 ఎన్నికల్లో నోటా ఆప్షన్‌ను ప్రవేశపెట్టారు. 2013 తర్వాత రెండు సార్వత్రిక ఎన్నికలతో పాటు పలు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. ఆ ఎన్నికల్లో నోటా ఆప్షన్ ప్రవేశపెట్టారు. అయితే నోటాపై ఓటర్ల స్పందన ఎలా ఉందనే ప్రశ్న ప్రతీ ఎన్నికల సందర్భంలోనూ అందరి మదిలో తలెత్తుతుంది. దీనిని తెలుసుకునేందుకు ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణ ఎన్నికల ఫలితాలలో నోటా వినియోగం గురిచం పరిశీలించినప్పుడు పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు పూర్తియిన నాలుగు రాష్ట్రాల డేటాను అనుసరించి చూస్తే.. మూడు రాష్ట్రాల్లో, ఒక శాతం కంటే తక్కువ మంది ఓటర్లు మాత్రమే నోటాను ఎంచుకున్నారని స్పష్టమైంది. మధ్యప్రదేశ్‌లో నమోదైన 77.15 శాతం ఓటింగ్‌లో 0.98 శాతం మంది ఓటర్లు మాత్రమే నోటాను ఎంచుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో 1.26 శాతం మంది ఓటర్లు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)లో నోటా బటన్‌ను నొక్కారు. తెలంగాణలో 0.73 శాతం మంది ఓటర్లు నోటాను ఎంచుకున్నారు. తెలంగాణలో 71.14 శాతం ఓటింగ్ నమోదైంది. రాజస్థాన్‌లో 0.96 శాతం మంది ఓటర్లు నోటాను ఎంచుకున్నారు. ఆ రాష్ట్రంలో 74.62 శాతం ఓటింగ్ జరిగింది. ‘నోటా’ ఆప్షన్ వినియోగం గురించి కన్స్యూమర్ డేటా ఇంటెలిజెన్స్ కంపెనీ ‘యాక్సిస్ మై ఇండియా’కు చెందిన ప్రదీప్ గుప్తా మాట్లాడుతూ నోటా అనేది ఎన్నికల్లో .01 శాతం నుంచి గరిష్టంగా రెండు శాతం వరకు ఉపయోగితమవుతోంది. భారతదేశంలో అమలవుతున్న ‘ఫస్ట్-పాస్ట్-ది-పోస్ట్’ సూత్రం గురించి ఆయన ప్రస్తావిస్తూ.. ఈ విధానంలో ఎక్కువ ఓట్లు పొందిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. అటువంటి పరిస్థితిలో ఓటర్లు.. ఎన్నికల్లో అభ్యర్థులెవరూ తమకు నచ్చలేదని భావించినప్పుడు వారు నోటాకు ఓటు వేయవచ్చు. అయితే నోటా ఆప్షన్‌ను ప్రజలు సక్రమంగా వినియోగించుకుంటేనే జనం నాడి తెలుస్తుందని, ప్రయోజనం ఉంటుందని, లేనిపక్షంలో అది లాంఛనప్రాయం అవుతుందని ప్రదీప్ గుప్తా అన్నారు. ఇది కూడా చదవండి: సీఎం రేసులో బాబా బాలక్‌నాథ్?.. అధిష్టానం నుంచి పిలుపు! -
చైనాలో పెరుగుతున్న కేసులు..ఆరు రాష్ట్రాల్లో అలర్ట్!
చైనాలో కొత్తగా నిమోనియా కేసులు పెరుగుతుండటంతో భారత్ అప్రమత్తమైంది. ముఖ్యంగా చైనాలోని చిన్నారులే ఈ నిమోనియా వ్యాధి బారిన పడటంతో సర్వత్రా తీవ్ర ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అలర్ట్ జారీ చేసింది. తమ పరిధిలో ప్రభుత్వాస్పత్రుల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఉన్నాయో లేదో అనే ఆరోగ్య సంసిద్ధతపై సమగ్రస్థాయిలో సమీక్ష నిర్వహించుకోవాలని ప్రకటన చేసింది. దీంతో దాదాపు ఆరు రాష్ట్రాలు తమ పరిధిలోని ఆరోగ్య మౌలిక సదుపయాలను అప్రమత్తం చేశాయి. ఈ మేరకు రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్, ఉత్తరాఖండ్, హర్యానా, తమిళనాడు తదితర రాష్ట్రాల ఆరోగ్య శాఖ శ్వాసకోసశ సంబంధిత సమస్యలతో వచ్చే రోగులకు సత్వరమే వైద్యం అందించేలా సంసిద్ధంగా ఉండేటమేగాక ఆరోగ్య సంసిద్ధతను సమీక్షించుకోవాలని ఆస్పత్రులను, సిబ్బందిని కోరింది. నిజానికి సీజనల్‌గా వచ్చే ఫ్లూ వంటి వ్యాధుల పట్ల పౌరులు అప్రమత్తంగా ఉండాలని కూడా ఆరోగ్య శాఖ పేర్కొంది. అలాగే కాలానుగుణంగా ఈ వ్యాధుల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే గైడ్‌లైన్స్‌లు కూడా వారికి అందించాలని పేర్కొంది. ఇక రాజస్థాన్ ఆరోగ్య శాఖ జారీ చేసిన ప్రకటన ప్రకారం..ప్రస్తుతం పరిస్థితి ఏమీ అంత ఆందోళనకరంగా లేదని తెలిపింది. అయినప్పటికీ వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి, అంటు వ్యాధులు వ్యాప్తి చెందకుండా నిరోధించడం తోపాటు పీడియాట్రిక్ యూనిట్లతో సహా మెడిసిన్ విభాగాలలో తగిన ఏర్పాట్లు చేయాలని పేర్కొంది. అలాగే గుజరాత్ ఆరోగ్య మంత్రి రుషికేశ్ మాట్లాడుతూ..ముందు జాగ్రత్త చర్యగా కోవిడ్ 19 మహమ్మారి సమయంలో ఉన్న ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలన్నింటిని బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. ఎప్పటికప్పుడూ ఆయా ప్రభుత్వ ఆస్పత్రులన్నీ తమ ఆరోగ్య సంసిద్ధతను సమీక్షించాలని ఆరోగ్య అధికారులను కోరారు. అదేవిధంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా శ్వాసకోశ వ్యాధులపై నిఘా పెంచాలని ఆరోగ్య అధికారులను ఆదేశించింది. పైగా ఉత్తరాఖండ్‌లోని దాదాపు మూడు జిల్లాలు చైనాతో సరిహద్దును పంచుకుంటున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అధికారులను మరింత కట్టుదిట్టమైన చర్యలను తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. హర్యానా రాష్ట్రం ప్రభుత్వం ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రులను శ్వాసకోస సమస్యకు సంబంధించిన కేసు వస్తే వెంటనే నివేదించాలని ఆరోగ్యశాఖ ఆదేశించింది. తమిళనాడు ఆరోగ్య శాఖ కూడా ఇదే విధమైన ఆదేశాలను జారీ చేసింది. ఇప్పటి వరకు పిల్లలకు సంబంధించిన న్యూమోనియో కేసులు నమోదు కానప్పటికీ ముందు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలను కోరింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ. ఒకవేళ ఏ కేసు అయినా నమోదైతే వెంటనే పరిష్కరించేలా ఆరోగ్య సంసిద్ధతను సమీక్షించుకునేలా అధికారుల అప్రమత్తంగా ఉండేందుకు ఈ ఆదేశాలను జారీ చేసినట్లు పేర్కొంది. ఆ కరోనా మహమ్మారి వచ్చిన నాలుగేళ్ల తర్వాత తొలిసారిగా చైనాలో పిల్లలో ఈ కొత్త తరహ నిమోనియా కేసులు నమోదవ్వడంతో ప్రపంచదేశాలన్ని ఉలిక్కిపడ్డాయి. అదీగాక ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడూ పరిస్థితి గురించి వెల్లడించాలని చైనాను ఆదేశించడంతో ప్రపంచదేశాలన్నీ కలవరపాటుకు గురయ్యాయి. చైనా మాత్రం శీతకాలం తోపాటు వివిధ వ్యాధి కారకాల వల్లే ఈ వ్యాధి ప్రబలినట్లు వివరణ ఇచ్చుకుంది. పైగా ఇది కోవిడ్-19 మహమ్మారి సమయం నాటి తీవ్రత కాదని కూడా స్పష్టం చేసింది చైనా. (చదవండి: శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల పెరుగుదలకు కారణమిదే : చైనా) -
చైనాలో మళ్లీ కేసులు.. రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్
న్యూఢిల్లీ: చైనాలో మళ్లీ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఉత్తర చైనాలో కొవిడ్ తొలిరోజుల్లో ఉన్న దృశ్యాలు మళ్లీ కనిపిస్తున్నాయి. చాలా స్కూళ్లలో చిన్నపిల్లల్లో న్యుమోనియా తరహ లక్షణాలు బయటపడుతున్నాయి. అంతేగాక ఈ వ్యాధి అత్యంత వేగంగా వ్యాప్తిచెందుతోంది. ఈ నేపథ్యంలో భారత ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అలర్ట్ జారీ చేసింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది, బెడ్లు, పీపీఈ కిట్లు, వెంటిలేటర్లు, టెస్టింగ్ కిట్లు, రీ ఏజెంట్స్ ఇతర సౌకర్యాలు ఎలా ఉన్నాయనేదానిపై సమీక్షించుకోవాలని రాష్ట్రాలను కోరింది. ఈ వసతులన్నీ సరిపడేలా ఉండేలా చూసుకోవాలని కోరింది. ఇవేగాక ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది. ఇన్ఫెక్షన్ కంట్రోల్ ప్రోటోకాల్ పకడ్బందీగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరింది. చిన్నారుల్లో తలెత్తే శ్వాస సంబంధిత వ్యాధుల వివరాలనుఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు నమోదయ్యే కేసుల డేటా ఎప్పటికప్పుడు జిల్లా, స్టేట్ సర్విలెన్స్ యూనిట్లలో అప్లోడ్ చేయాలని ఆరోగ్యశాఖ సూచించింది. డేటా కరక్టుగా ఉంటే పరిస్థితిని పక్కాగా పర్యవేక్షించడానికి వీలవుతుందని తెలిపింది. కొవిడ్ మహమ్మారితో ఇప్పటికీ దేశంలో ఎక్కడో ఒక చోట బాధపడుతున్న చైనా తాజాగా నమోదవుతున్న ఎనీమాటిక్ నుమోనియా కేసులతో బెంబేలెత్తుతోంది. స్కూలు పిల్లల్లో నమోదవుతున్న ఈ కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. అయితే ఈ నుమోనియా కేసులకు ఎలాంటి కొత్త వైరస్ కారణం కాదని చైనా హెల్త్ కమిషన్ క్లారిటీ ఇచ్చింది. అయినా ఈ కేసులపై మరింత సమాచారం అందజేయాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషేన్(డబ్ల్యూహెచ్‌వో) చైనా ప్రభుత్వాన్ని కోరడం గమనార్హం. ఇదీచదవండి..ప్రధాని భద్రతలో లోపాలు..ఏడుగురు పోలీసుల సస్పెన్షన్ -
అమ్మవారి నామాలే ఆ మహా నగరాలు!
విభిన్న నామాలతో, వివిధ రూపాలలో ఆయా ప్రాంతాల్లో కొలువైన ఆ ఆదిపరాశక్తి పేరు మీద ఏకంగా కొన్ని మహానగరాలే వెలిశాయంటే ఆశ్చర్యం కాక మరేమిటి? అమ్మవారి నామంతో వెలసిన అలాంటి నగరాలు కొన్ని... వాటి ప్రాశస్త్యం క్లుప్తంగా... కోల్‌కతా – కాళీమాత కోల్‌కతా పేరు చెప్పగానే ఆ మహానగరంలో వెలసిన కాళికాదేవి రూపంతోపాటు కాళీఘాట్‌లో ప్రతి యేటా అంగరంగ వైభవంగా జరిగే దసరా ఉత్సవాలు కళ్లకు కడతాయి. నల్లని రూపంతో, రక్త నేత్రాలతో, పొడవాటి నాలుక బయటపెట్టి ఎంతో రౌద్రంగా కనిపించే ఈ అమ్మవారు తనను పూజించే భక్తుల పాలిట కరుణామయి. కన్నతల్లిలా బిడ్డలను కాపాడుతుంది. కోల్‌కతాకు ఆ పేరు రావడం వెనక ప్రాచుర్యంలో ఉన్న కొన్ని పురాణ గాథలను చూద్దాం... ‘కాళీఘాట్’ అనే పదం నుంచి ఈ నగరానికి కోల్‌కతా అనే పేరొచ్చినట్లు చాలామంది చెబుతారు. అలాగే బెంగాలీ భాషలో కాలికా క్షేత్ర అంటే.. కాళికాదేవి కొలువై ఉన్న ప్రాంతం అని అర్థం. అమ్మవారు కొలువైన కాళీఘాట్ కాళీ దేవాలయానికి వందల ఏళ్ల చరిత్ర ఉన్నట్లు స్థల పురాణం చాటుతోంది. మంగళాదేవి పేరు మీదుగా మంగళూరు కర్ణాటకలోని ముఖ్య పట్టణాల్లో మంగళూరు ఒకటి. ఇక్కడ కొలువైన మంగళాదేవి పేరు మీదే ఈ నగరానికి మంగళూరు అనే పేరొచ్చింది. పురాణాల ప్రకారం మంగళాదేవి ఆలయాన్ని శ్రీ మహావిష్ణు దశావతారాల్లో ఆరో అవతారమైన పరశురాముడు స్థాపించినట్లు తెలుస్తుంది. ప్రతిసారీ దసరా శరన్నవరాత్రుల సమయంలో మంగళాదేవికి ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో సప్తమి రోజున ‘చండీ’ లేదా ‘మరికాంబ’గా, అష్టమి రోజున ‘మహా సరస్వతి’గా, నవమి రోజు ‘వాగ్దేవి’గా పూజలందుకుంటోందీ తల్లి. మహర్నవమి రోజున అమ్మవారి ఆయుధాలకు విశేష పూజలు నిర్వహించడంతోపాటు చండీయాగం కూడా చేస్తారు. దశమిరోజు అమ్మవారిని దుర్గా దేవిగా అలంకరించిన తర్వాత నిర్వహించే రథయాత్ర ఎంతో కన్నుల పండువగా సాగుతుంది. ముంబై – ముంబా దేవి దక్షిణ ముంబైలోని బులేశ్వర్ ప్రాంతంలో కొలువైన ఈ ఆలయంలోని అమ్మవారు వెండి కిరీటం, బంగారు కంఠహారం, రతనాల ముక్కుపుడకతో అత్యంత శోభాయమానంగా దర్శనమిచ్చే ఈ అమ్మల గన్న అమ్మను దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతమే అని చెప్పవచ్చు. ఇక్కడ దసరా ఉత్సవాలు మహాద్భుతంగా జరుగుతాయి. వాణిజ్యపరంగా దేశంలోకెల్లా అత్యంత సుప్రసిద్ధమైన ముంబై మహానగరానికి ఆ పేరు రావడంలో అక్కడ వెలసిన ముంబాదేవి ఆలయమే కారణం. ఇందుకో పురాణ కథనం ఉంది. పార్వతీమాత కాళికాదేవిగా అవతారమెత్తే క్రమంలో ఆ పరమశివుని ఆదేశం మేరకు ‘మత్స్య’ అనే పేరుతో ఇప్పుడు ముంబైగా పిలుస్తున్న ప్రాంతంలో ఓ మత్స్యకారుల వంశంలో పుట్టిందట. ఆమె అవతారం చాలించే సమయంలో మత్స్యకారుల కోరిక మేరకు ‘మహా అంబ’గా వెలిసిందని, కాలక్రమేణా ఆమె పేరు‘ముంబాదేవి’గా మారినట్లు స్థలపురాణం ద్వారా తెలుస్తుంది. శ్యామలాదేవి పేరు మీదుగా సిమ్లా సాక్షాత్తూ ఆ కాళీమాతే శ్యామలా దేవిగా వెలసిన పుణ్యస్థలి సిమ్లా అని స్థలపురాణం చెబుతోంది. ఈ గుడిని 1845లో బ్రిటిష్ పరిపాలనా కాలంలో బెంగాలీ భక్తులు జకు అనే కొండపై నిర్మించారట! ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో శ్యామవర్ణంలో మెరిసే దుర్గా మాత రూపం చూపరులను కట్టిపడేస్తుంది. చండీగఢ్ – చండీ మందిర్ అటు పంజాబ్‌కు, ఇటు హరియాణాకు రాజధానిగా విరాజిల్లుతోన్న చండీగఢ్ నగరానికి ఆ పేరు రావడం వెనక అమ్మవారి పేరే కారణం. చండీ అంటే పార్వతీదేవి ఉగ్రరూపమైన చండీమాత అని, గఢ్ అంటే కొలువుండే కోట అని అర్థం. ఇలా ఈ నగరానికి చండీగఢ్ అని పేరు వచ్చిందంటే అక్కడ కొలువైన చండీ దేవాలయమే కారణం. చండీగఢ్‌కు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంచకుల జిల్లాలో కల్క పట్టణంలో కొండపై వెలసిందీ దేవాలయం. పాటన్‌దేవి పేరుతో పట్నా శక్తి స్వరూపిణి ‘పాటన్‌దేవి’ అమ్మవారు కొలువైన ఆలయం ఉండటమే పట్నాకు ఆ పేరు రావడానికి కారణం. ఈ ఆలయం 51 సిద్ధ శక్తి పీఠాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. పురాణ గాథల ప్రకారం దక్షయజ్ఞం సమయంలో అగ్నికి ఆహుతైన సతీదేవి శరీరాన్ని మహావిష్ణువు ముక్కలుగా ఖండించగా, కుడి తొడభాగం ఈ ప్రాంతంలో పడిందట! అలా వెలసిన అమ్మవారిని మొదట్లో ‘సర్వానందకరి పాటనేశ్వరి’ అనే పేరుతో కొలిచేవారు. కాలక్రమంలో.. ఆ పేరు‘పాటనేశ్వరి’గా, ఇప్పుడు ‘పాటన్‌దేవి’గా రూపాంతరం చెందుతూ వచ్చింది. దసరా సమయంలో పది రోజులపాటు ఇక్కడ అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, హారతులతో కన్నుల పండువగా ఉత్సవాలు జరుగుతాయి. నైనాదేవి పేరుతో నైనిటాల్ ఆహ్లాదకరమైన వాతావరణం, అందమైన కొండ ప్రాంతాలతో అత్యంత శోభాయమానంగా అలరారే నైనిటాల్‌కు ఆ పేరు రావడం వెనక ఓ అద్భుతమైన చరిత్ర ఉంది, దక్షయజ్ఞంలో దహనమైన సతీదేవి శరీరాన్ని ఖండించినప్పుడు ఆమె నేత్రాలు ఈ ప్రదేశంలో పడినట్లుగా స్థల పురాణం చెబుతోంది. మహిషాసురుడిని సంహరించిన కారణంగా నైనాదేవి కొలువైన చోటును మహిషపీuŠ‡ అని కూడా పిలుస్తారు. అలా మహిషుడిని సంహరించిన సమయంలో దేవతలందరూ అమ్మవారిని ’జై నైనా’ అంటూ నినదించడం వల్ల ఈ అమ్మవారు అప్పట్నుంచి ‘నైనాదేవి’గా పూజలందుకుంటోందట. శక్తి పీఠాలలో ఒకటైన ఈ ఆలయంలో విజయదశమి ఉత్సవాలు మహాద్భుతంగా జరుగుతాయి. దుర్గా మాత పేరుతో విరాజిల్లే మరికొన్ని ప్రాంతాలు అంబాలా – భవానీ అంబాదేవి (హరియాణా) అంబ జోగే – అంబ జోగేశ్వరి/ యోగేశ్వరి దేవి (మహారాష్ట్ర) తుల్జాపుర్ – తుల్జా భవాని (మహారాష్ట్ర) హసన్ – హసనాంబ (కర్ణాటక) త్రిపుర – త్రిపురసుందరి (త్రిపుర) మైసూరు – మహిషాసురమర్దిని (కర్ణాటక) కన్యాకుమారి – కన్యాకుమారి దేవి (తమిళనాడు) సంబల్పూర్ – సమలాదేవి/ సమలేశ్వరి (ఒడిశా) (చదవండి: ఇంటిని పాజిటివ్ ఎనర్జీతో నింపేలా కళాత్మకంగా తీర్చిదిద్దుకోండిలా..! ) -
ఇప్పుడు తగ్గిస్తే ప్రయోజనం ఉంటుందంటావా..!
ఇప్పుడు తగ్గిస్తే ప్రయోజనం ఉంటుందంటావా..! -
విద్యుత్ కొరతపై రాష్ట్రాలకు హెచ్చరిక
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఏర్పడ్డ విద్యుత్ కొరత పరిస్థితులు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లోనూ కొనసాగుతాయని, ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలను హెచ్చరించింది. రానున్న గడ్డు పరిస్ధితుల కోసం ఇప్పుడే అప్రమత్తం కావాలని, థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని పెంచుకోవడానికి ఈ నెలాఖరు నాటికి బొగ్గును దిగుమతి చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి తాజాగా ఓ లేఖ పంపింది. ఈ ఏడాది ఆగస్టులో గరిష్ట డిమాండ్‌లో కొరత 23 శాతంగా ఉందని, ఇది ప్రపంచంలోనే అత్యధికమని కేంద్రం తెలిచ్చింది. కొన్ని రాష్ట్రాలు విద్యుత్ డిమాండ్‌ను తీర్చలేకపోయాయని చెప్పింది. నిజానికి ఈ ఏడాది ఆగస్టు 15 తరువాత బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి యూనిట్లను నిషేధించామని, పరిస్థితులు చక్కబడకపోవడంతో నిషేధాన్ని పక్కనపెట్టి అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించుకోవాలని వివరించింది. ఈ ఏడాది రుతుపవనాలు ఇప్పటివరకు సాధాౄరణం కంటే తక్కువగా ఉన్నందున సెప్టెంబర్‌లోనూ వర్షాలు ఆశించినంతగా లేనందున రిజర్వాయర్లలో నీటి మట్టాలు క్షీణించాయని, దానివల్ల గత ఏడాది 45 గిగావాట్లుగా ఉన్న గరిష్ట హైడ్రో పవర్ ఉత్పత్తి ఈ ఏడాది 40 గిగావాట్ల కంటే తక్కువగా ఉందని వెల్లడించింది. పవన ఉత్పత్తిలో కూడా ఇదే ధోరణి కనిపిస్తోందని, సెప్టెంబర్–అక్టోబర్ కాలంలో రుతుపవనాల ఉపసంహరణతో జల, గాలి ఉత్పత్తి మరింత క్షీణిస్తుందని అంచనా వేసినట్టు కేంద్రం తెలిపింది. థర్మల్ ప్లాంట్లు కూడా పూర్తి సామర్థ్యంతో నడవకపోవడం వల్ల 12–14 గిగావాట్ల థర్మల్ విద్యుత్ అందుబాటులో లేదన్నారు. వెంటనే వాటిని అందుబాటులోకి తేవాలని ఆదేశించింది. అలాగే థర్మల్, సోలార్, విండ్ వంటి కొత్త యూనిట్లను త్వరితగతిన ప్రారంభించాలని కోరింది. విద్యుత్ డిమాండ్ తీర్చేందుకు కొనుగోలు ఒప్పందాలు(పీపీఏ)లు కుదుర్చుకోవాలని, స్వల్పకాలిక టెండర్ల ద్వారా విద్యుత్‌ను బహిరంగ మార్కెట్ ద్వారా సమకూర్చుకోవాలని సూచించింది. -
ఆరు రాష్ట్రాల్లో ఉపఎన్నికలు.. కొనసాగుతున్న పోలింగ్
ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని ఏడు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు నేడు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభమైంది. దేశంలో వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇండియా కూటమికి, అధికార బీజేపీకి మధ్య మొదటి పోటీగా ఈ పోలింగ్‌ను రాజకీయ వర్గాలు చూస్తున్నాయి. Bypolls: Voting begins in six states for 7 assembly seats Read @ANI Story | https://t.co/6U9T1V6j1l#bypolls #UP #Tripura #Jharkhand #WestBengal pic.twitter.com/rlxhf6bo5k — ANI Digital (@ani_digital) September 5, 2023 జార్ఖండ్‌లోని డుమ్రి, త్రిపురలోని బోక్సానగర్, మధన్పూర్, ఉత్తరప్రదేశ్‌లోని ఘోసి, ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్, కేరళలోని పుతుపల్లి, పశ్చిమ బెంగాల్‌లోని ధూప్‌గురి నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. ఈ నెల 8న కౌంటింగ్ నిర్వహించనున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల మరణాల కారణంగా ధూప్‌గురి, పుతుపల్లి, బాగేశ్వర్, డుమ్రీ, బోక్సానగర్‌లలో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఘోసి, ధన్పూర్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసిన నేపథ్యంలో ఉపఎన్నికలు జరుగుతున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎమ్మెల్యే పదవికి దారా సింగ్ చౌహాన్ రాజీనామా చేయడంతో ఉత్తరప్రదేశ్‌లోని ఘోసిలో ఉప ఎన్నికలు వచ్చాయి. ఆయన రాజీనామా తర్వాత బీజేపీలో చేరారు. ఉపఎన్నికలకు ఎస్పీ సుధాకర్ సింగ్‌పై బీజేపీ దారా సింగ్ చౌహాన్‌ను రంగంలోకి దింపింది.దారా సింగ్ చౌహాన్ ఘోసీ నుంచి 2012 నుంచి 2017 వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ ఆ తర్వాత వరుసగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ తన మిత్రపక్షమైన ఎస్పీకి మద్దతునిస్తోంది. త్రిపురలోని ధన్‌పూర్‌లో బీజేపీ అభ్యర్థి ప్రతిమా భూమిక్ లోక్‌సభ స్థానానికి రాజీనామా చేయడంతో సీటు ఖాలీ అయింది. ప్రస్తుతం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా-మార్క్సిస్ట్ (సీపీఐ-ఎం) అభ్యర్థి కౌశిక్ చందాపై ప్రతిమా భూమిక్ సోదరుడు బిందు దేబ్‌నాథ్‌ను భాజపా బరిలోకి దింపుతోంది. అటు.. ఉమెన్ చాందీ మరణంతో పుతుపల్లి సీటు ఖాళీ కావడంతో ఈరోజు పోలింగ్ జరుగుతోంది. సీపీఎం అభ్యర్థి జైక్ సీ థామస్‌పై కాంగ్రెస్ నేతృత్వంలోని ఫ్రంట్ సీనియర్ నేత తనయుడు చాందీ ఉమెన్ను బరిలోకి దింపింది. ఇదీ చదవండి: కుల విభేదాల్ని మాత్రమే ఖండించా.. ఉదయ్‌నిధి స్టాలిన్ తాజా ప్రకటన -
వేగంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి
సాక్షి, అమరావతి: దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతోన్న ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తోందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్(సీఐఐ) ఏపీ చాప్టర్ చైర్మన్ లక్ష్మీప్రసాద్ చెప్పారు. దేశ స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ)లో అత్యధికంగా దక్షిణాది రాష్ట్రాల వాటా 30 శాతంగా ఉంటే అందులో ఏపీ వాటా 4.85 శాతం ఉందని తెలిపారు. మంగళవారం (జూన్ 27) విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘పోటీ–సుస్థిర ఆంధ్రప్రదేశ్ 2023–24’ నినాదంతో సీఐఐ ఏపీ చాప్టర్ పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు. ఏపీ సులభతర వాణిజ్యంలో ప్రథమ స్థానంలో ఉండటం, సముద్ర ఆధారిత ఎగుమతులతో వేగంగా వృద్ధిని సాధిస్తోందన్నారు. ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ 2025 నాటికి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి సిద్ధంగా ఉందని అన్నారు. ఈ ఏడాది జీడీపీ 6.5%–6.7%కి వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఇండస్ట్రీ 4.0లో భాగంగా పరిశ్రమల్లో యాంత్రీకరణ, టెక్నాలజీని పెంపొందించాలని సూచించారు. జాతీయ స్థాయి నుంచి ప్రాంతీయ స్థాయి వరకు 9 అంశాల ప్రధాన అజెండాగా సీఐఐ కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. దేశంలో స్టార్టప్‌కు మంచి అవకాశాలు ఉన్నాయని, సమృద్ధి వనరులు, నైపుణ్యం కలిగిన శ్రామికశక్తితో చైనా తర్వాత భారత్ తయారీ కేంద్రంగా ఉద్భవించిందన్నారు. నైపుణ్యం, తక్కువ ఖర్చుతో కూడిన మానవ వనరులను ఉపయోగించుకుని తయారీ రంగంపై దృష్టి సారించాలని సూచించారు. పారిశ్రామిక రాయితీలు, తక్కువ రేటుకే విద్యుత్ వంటి అంశాలపై ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించాలని ప్రభుత్వాలను కోరారు. గ్రీన్ బిజినెస్, గ్రీన్ ఎకానమీని సీఐఐ ప్రోత్సహిస్తోందని, పారిశ్రామిక సంస్థలు పర్యావరణ రక్షణను బాధ్యతగా తీసుకోవాలని కోరారు. సీఐఐ ఏపీ మాజీ చైర్మన్ డి.రామకృష్ణ మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీ, ఆటోమేషన్, డిజిటలైజేషన్‌తో ఇండస్ట్రీలో ఉత్పాదకత, నాణ్యత పెరుగుతుందన్నారు. సీఐఐ ఏపీ వైస్ చైర్మన్ మురళీకృష్ణ మాట్లాడుతూ భారత్‌లో మెడికల్ టూరిజానికి ఎక్కువ అవకాశం ఉందన్నారు. సీఐఐ విజయవాడ జోన్ వైస్ చైర్మన్ డీవీ రవీంద్రనాథ్ పాల్గొన్నారు. -
వణికిస్తున్న వడగాల్పులు.. పిట్టల్లా రాలుతున్న జనం.. కేంద్రం అలర్ట్..!
ఢిల్లీ: ఉత్తర భారతంలో వడగాల్పులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, బిహార్ వంటి రాష్ట్రాల్లో ఎండల తీవ్రతకు మరణాల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. వడగాల్పులపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆయా రాష్ట్రాలకు ఐదుగురు సభ్యుల బృందాన్ని పంపిస్తున్నట్లు పేర్కొన్నారు. వడగాల్పుల తీవ్రత నుంచి బయటపడటానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇప్పటికే తగు సూచనలు చేసినట్లు చెప్పారు. ప్రజలను రక్షించడానికి కావాల్సిన తగు చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. వడదెబ్బతో ఎవరూ మరణించకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. ఉత్తరప్రదేశ్, బిహార్, హర్యానా తమిళనాడు, మధ్యప్రదేశ్, జార్ఖండ్, విదర్భ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణల్లో విపరీతంగా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గత కొన్ని రోజులుగా దేశంలో వడగాల్పుల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటోంది. చాలా రాష్ట్రాల్లో మోతాదుకు మించి ఎండలు నమోదవుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో మూడు రోజుల్లోనే ఒకే జిల్లాలో 54 మంది మృతి చెందారు. 400 మంది అస్వస్థతకు గురయ్యారు. ఉత్తరప్రదేశ్, బిహార్, ఒడిశాల్లో ఎండల దృష్ట్యా వేసవి సెలవులను కూడా ప్రభుత్వం పొడిగించింది. ఇదీ చదవండి: రాజకీయ వివాదాల నడుమ.. ‘అందరికీ ఉచితంగా గుర్బానీ’ బిల్లు ఆమోదం -
జరుగుబాటు అంతంతే
న్యూఢిల్లీ: కీలకమైన అసెంబ్లీ సమావేశాలను రాష్ట్రాలు తక్కువ రోజుల్లోనే మమ అనిపిస్తున్నాయని మేధో సంస్థ పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ తాజా గణాంకాలు చాటుతున్నాయి. దేశవ్యాప్తంగా 2016 ఏడాది నుంచి అసెంబ్లీ సమావేశమైన రోజులు ఏటా తగ్గుతూ వస్తున్నాయని అధ్యయనం ఆందోళన వ్యక్తంచేసింది. అధ్యయనం ప్రకారం.. ► 2022లో 28 రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాలు సగటున కేవలం 21 రోజులే జరిగాయి. ► కర్ణాటకలో అత్యంత ఎక్కువగా 45 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. తర్వాతి స్థానాల్లో పశ్చిమబెంగాల్( 42 రోజులు), కేరళ(41 రోజులు) నిలిచాయి. ► ఎక్కువ రాష్ట్రాల్లో ఏడాదిలో రెండు లేదా మూడుసార్లు సెషన్స్ పెడుతున్నారు. జనవరి–మార్చి మధ్య బడ్జెట్ పద్దు సందర్భంగా ఒక సెషన్. వర్షాకాల, శీతాకాల సమావేశాల కోసం మరో రెండు. ► ఈశాన్య రాష్ట్రాల్లోని ఐదు రాష్ట్రాలు కలుపుకుని 12 రాష్ట్రాల్లో గత ఏడాది కేవలం రెండు సెషన్స్‌యే జరిగాయి. ► మొత్తంగా సమావేశ రోజుల్లో బడ్జెట్ కోసమే 61 శాతం రోజులను కేటాయిస్తున్నారు. తమిళనాడులో ఏకంగా 90 శాతం సిట్టింగ్స్ ఒక్క బడ్జెట్ సెషన్‌తోనే గడిచిపోయింది. 80శాతానికి మించి సెషన్స్‌తో గుజరాత్, రాజస్తాన్ అదే బాటలో పయనించాయి. ► 20 రాష్ట్రాల్లో సగటు సమావేశాల కాలం కేవలం ఐదు గంటలు. మహారాష్ట్రలో మాత్రమే ఈ సగటు ఎనిమిది గంటలుగా నమోదైంది. సిక్కింలో అత్యల్పంగా రెండు గంటలే సెషన్ నడిచింది. ► 2016–2022 కాలంలో 24 రాష్ట్రాల్లో సగటు సమావేశాల కాలం కేవలం పాతిక రోజులు. కేరళలో ఏడాదికి గరిష్ఠంగా 48 రోజులు అసెంబ్లీ నడిచింది. ఒడిశా(41 రోజులు), కర్ణాటక(35 రోజులు) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ► 2016 ఏడాది నుంచి సెషన్ రోజులు తగ్గుతూ వస్తున్నాయి. కోవిడ్ ఆంక్షల ధాటికి 2020లో ఈ సంఖ్య దారుణంగా పడిపోయింది. ► 2016లో 24 రాష్ట్రాల్లో సగటున 31 రోజులు, 2017లో 30 రోజులు, 2018లో 27 రోజులు, 2019లో 25 రోజులు, 2020లో 17 రోజులు, 2021లో 22 రోజులు సమావేశాలు నిర్వహించారు. ► అసెంబ్లీ సభ్యులను ప్రాతిపదికగా తీసుకుని సమావేశాల సంఖ్యపై కనీస పరిమితిని విధించుకుంటే మంచిదని రాజ్యాంగ పనితీరుపై సమీక్షకు జాతీయ కమిషన్(ఎన్సీఆర్డబ్ల్యూసీ) గతంలో రాష్ట్రాలను సూచనలు పంపడం గమనార్హం. ► కర్ణాటక, రాజస్తాన్, యూపీ వంటి రాష్ట్రాలు సంబంధిత లక్ష్యాలు నిర్దేశించుకున్నా అవి నెరవేరలేదు. ► రాజ్యాంగం నిర్దేశిన ప్రకారం ప్రతీ రాష్ట్రం తమ పద్దును అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించాలి. 2022లో 20 రాష్ట్రాల్లో బడ్జెట్‌పై చర్చకాలం సగటు కేవలం ఎనిమిది రోజులే. ఒక్క తమిళనాడు మాత్రమే 26 రోజులపాటు బడ్జెట్‌పై చర్చించింది. కర్ణాటక(15 రోజులు), కేరళ(14 రోజులు), ఒడిశా(14 రోజులు) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ► ఢిల్లీ, మధ్యప్రదేశ్, పంజాబ్ రెండ్రోజుల్లో ముగించగా, నాగాలాండ్ ఒక్కరోజుతో సరిపెట్టింది. ► 2022లో 28 రాష్ట్రాల్లో సగటున 21 బిల్లులు ఆమోదం పొందాయి. అస్సాంలో గరిష్టంగా 85 బిల్లులకు ఆమోదముద్ర పడింది. తమిళనాడు(51), గోవా(38) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ► విశ్లేషణాత్మక చర్చలేకుండానే ప్రభుత్వాలు బిల్లులను పాస్ చేస్తున్నాయి -
Covid-19: 'మహమ్మారి ఇంకా ముగియలేదు' అంటూ కేంద్రం లేఖ
దేశంలో గత కొద్ది నెలలుగా కరోనా కేసుల తోపాటు మరణాలు సంభవిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్రం అప్రమత్తంగా ఉండాలంటూ విజ్ఞప్తి చేస్తూ.. ఎనిమిది రాష్ట్రాలకు లేఖలు రాసింది. ఈ మేరకు లేఖలో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్.. దేశంలో కరోనా మహమ్మారి ఇంకా ముగిసిపోలేదు, అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే మహమ్మారి నిర్వహణలో మనం సాధించిన విజయ నిర్వీర్యం కాక మునుపే మేల్కోవాలి. ఏ స్థాయిలోనైన అలసత్వం వహించకూడదని ఆ లేఖలో తెలిపారు. కోవిడ్ కారణంగా ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య, మరణాల సంఖ్య తక్కువే అయినప్పటికీ రాష్టాలు, జిల్లాల్ల వారిగా పెరుగుతున్న కేసులు వైరస్ సంక్రమణని సూచిస్తోందన్నారు. అందువల్ల రోజువారిగా రాష్ట్రాలు, జిల్లాలోని పెరుగుతున్న కేసులు, పాజిటివిటీ రేటుని నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రారంభ దశలోనే కేసుల పెరుగుదలను నియంత్రించేలా అవసరమైన ప్రజారోగ్య చర్యలను చేపట్టాలని రాజేష్ భూషణ్ నొక్కి చెప్పారు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్, తమిళనాడు, రాజస్తాన్, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, హర్యాన, ఢిల్లీతో సహా ఎనిమిది రాష్ట్రాలు ఈ లేఖలను అందుకున్నాయి. ఆయా రాష్ట్రాల్లోని జిల్లాలో యూపీ(1), తమిళనాడు(11), రాజస్తాన్(6), మహారాష్ట్ర(8), కేరళ(14), హర్యానా(12), ఢిల్లీ(11) తదితరాల్లో మొత్తంగా 10%కి పైగా పాజిటివిటి రేటు ఉంది. ఆయ జిల్లాలోని కోవిడ్ నిఘాను పటిష్టం చేస్తూ.. ఇన్ఫ్లుఎంజా లాంటి అనారోగ్యం (ILI), తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ (SARI) వంటి కేసుల పర్యవేక్షించాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. ఇదిలా ఉండగా, దేశంలో తాజగా కొత్తగా 11,692 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 66,170కి చేరుకుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగా ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ..దేశ రాజధానిలో కోవిడ్ కేసులు స్థిరంగా ఉన్నాయన్నారు. ఐతే ఇటీవల కొద్దిరోజులుగా మాత్రం కేసులు పెరుగుతున్నాయని, కాని రాబేయే రోజుల్లో తగ్గే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కేసుల్లో చాలా వరకు తీవ్రమైన అనారోగ్యాలు ఉన్నవారే కావడం యాదృచ్చికం అన్నారు. ఏదైనా మరణాలు సంభవించడం అనేది దురదృష్టకరమని, ఇలా జరగకూడదన్నారు ఆరోగ్య మంత్రి భరద్వాజ్. (చదవండి: సూడాన్‌లోని భారతీయుల పరిస్థితిపై మోదీ అత్యవసర సమీక్ష!) -
కేంద్ర పథకాల పేర్లు మారిస్తే నిధులు కట్!
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాల పేర్లను మారుస్తూ కొన్ని రాష్ట్రాలు తమకు లబ్ధి కలిగేలా కొత్త పేర్లు పెట్టడం ఇకపై కుదరదు. పార్లమెంట్ ఆమోదం పొందిన పథకాల పేర్లను మార్చడం అంటే కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని, పాత్రను ఉద్దేశపూర్వకంగా బేఖాతరు చేయడమే అవుతుందని కేంద్ర వర్గాలు భావిస్తున్నాయి. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని, పథకాల పేర్లను మార్చే రాష్ట్రాలకు నిధులు నిలిపివేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై), పీఎం గరీబ్ కల్యాణ్ అన్నయోజన (పీఎంజీకేఏవై), ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలకు వివిధ రాష్ట్రాలు తమకు అనుకూల పేర్లను పెట్టి అమలు చేస్తున్నాయి. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లను పంజాబ్ ప్రభుత్వం ‘ఆమ్ ఆద్మీ క్లినిక్’లుగా మార్చింది. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం పీఎంఏవై పథకాన్ని బంగ్లా ఆవాస్ యోజనగా మార్చి ఆ రాష్ట్ర సీఎం ఫోటోతో ప్రచారం చేసుకుంటోంది. ఢిల్లీలో దీనిని న్యూఢిల్లీ ఆవాస్ యోజన అని పిలుస్తున్నారు. అలాగే తమిళనాడు, తెలంగాణ, జార్ఖండ్‌ల్లోనూ ఈ పథకం పేరు మార్చారంటూ పార్లమెంట్ సమావేశాల్లో కొందరు ఎంపీలు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. నిబంధనలు పాటిస్తేనే నిధులు.. ఈ క్రమంలో కేంద్ర పథకాల పేర్లను మార్చకుండా నిబంధనల మేరకు అమలు చేస్తున్న రాష్ట్రాలకే నిధులు పొందే అర్హత ఉంటుందన్న షరతును కచి్చతంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. దీనిపై త్వరలోనే ఆదేశాలు వెలువడనున్నట్లు సమాచారం. ఇటీవల లోక్‌సభలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాట్లాడుతూ.. కొన్ని రాష్ట్రాలు ఆయుష్మాన్ భారత్‌కు కేంద్రం పెట్టిన పేరు మార్చాయి. ఇది నిబంధనల ఉల్లంఘనే. ఈ పద్ధతి నిధుల విడుదల నిలిపివేయడానికి దారి తీస్తుంది’అని హెచ్చరించడం గమనార్హం. చదవండి: మోయలేని రుణ భారంతో... దేశాలే తలకిందులు -
ఆరేళ్లు ఉంటేనే ఒకటో తరగతిలో అడ్మిషన్: కేంద్రం
ఢిల్లీ: విద్యార్థుల అడ్మిషన్లపై కేంద్రం కొత్త రూల్ తీసుకురానుంది. విద్యార్థుల వయసు ఆరు ఏళ్లు ఉంటేనే ఒకటో తరగతిలో అడ్మిషన్ ఉండాలని నిర్ణయించింది. ఈ మేరకు.. ఈ నిబంధనను పాటించేలా చూడాలని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర విద్యాశాఖ ఉత్వర్వులు జారీ చేసింది. కొత్త జాతీయ విద్యా విధానం (NEP) ప్రకారం, పునాది దశలో పిల్లలందరికీ (3 నుండి 8 సంవత్సరాల మధ్య) ఐదు సంవత్సరాల అభ్యాస అవకాశాలను కలిగి ఉంటుంది, ఇందులో మూడు సంవత్సరాల ప్రీస్కూల్ విద్య(నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ) తర్వాత.. 1, 2 తరగతులు ఉంటాయి. పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని చాలా చిన్న వయస్సులో పాఠశాలలకు పంపరాదని గత ఏడాది సుప్రీంకోర్టు సైతం వ్యాఖ్యానించింది. -
కేంద్రం తీపికబురు: రూ. 16,982 కోట్ల జీఎస్టీ బకాయిలు చెల్లింపు
న్యూఢిల్లీ: జీఎస్టీ పెండింగ్ బకాలను రాష్ట్రాలకు వెంటనే క్లియర్ చేయనున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి జీఎస్టీ బకాయిలు రూ. 16,982 కోట్లను ఈ రోజునుంచి చెల్లిస్తామని శనివారం వెల్లడించారు. జూలై 2017 నుండి ఐదేళ్ల బకాయిలను ఆయా రాష్ట్రాలకు కేంద్రం చెల్లించనుంది. ఈ మొత్తం నిజంగా నష్టపరిహార నిధిలో అందుబాటులో లేనప్పటికీ, తమ సొంంత వనరుల నుండి విడుదల చేయాలని నిర్ణయించుకున్నామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అలాగే ఈ మొత్తాన్ని ఫ్యూచర్ కాంపెన్సేషన్ నుంచి తిరిగి పొందుతామన్నారు. అలాగే పలు వస్తువులపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ) తగ్గిస్తున్నట్లు ఈసందర్భంగా ప్రకటించారు. నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 49వ జీఎస్టీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న ఇతర నిర్ణయాలు: ట్యాగ్లు, ట్రాకింగ్ పరికరాలు లేదా డేటా లాగర్స్‌పై జీఎస్టీ తొలగింపు. అంతకుముందు 18 శాతం బొగ్గు వాషరీకి లేదా వాటి ద్వారా సరఫరా చేయబడిన కోల్డ్ రిజెక్ట్స్ పై కూడా జీఎస్టీ లేదు. పెన్సిల్ షార్పనర్లపై జీఎస్టీని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించారు. ద్రవ బెల్లంపై జీఎస్టీని తొలగింపు. అంతకుముందు 18 శాతంగా ఉంది. ప్యాక్ చేసిన ,లేబుల్డ్ లిక్విడ్ బెల్లంపై జీఎస్టీ18 శాతం నుండి 5 శాతానికి తగ్గింపు. పాన్ మసాలా, గుట్కాపై సామర్థ్య ఆధారిత పన్ను విధింపుపై మంత్రుల బృందం (GoM) సిఫార్సును GST కౌన్సిల్ ఆమోదించింది. Centre will also clear the admissible final GST Compensation to those states who've provided revenue figures certified by the Accountant General which amounts to Rs 16,524 crores. - Smt @nsitharaman. pic.twitter.com/p7iAuRUMSc — NSitharamanOffice (@nsitharamanoffc) February 18, 2023 -
వాహనాల తుక్కు ‘సింగిల్ విండో’లోకి 11 రాష్ట్రాలు
న్యూఢిల్లీ: కాలం చెల్లిన వాహనాలను తుక్కుగా మార్చేందుకు ఉద్దేశించిన ‘నేషనల్ సింగిల్ విండో సిస్టమ్’ పరిధిలోకి 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చేరాయి. ఈ విషయాన్ని కేంద్ర రవాణా, రహదారుల శాఖ ప్రకటించింది. వాహనాలను తుక్కుగా మార్చే కేంద్రాల ఏర్పాటుకు 2022 నవంబర్ 14 నాటికి 117 మంది ఇన్వెస్టర్ల నుంచి దరఖాస్తులు వచ్చినట్టు తెలిపింది. ఇందులో 36 దరఖాస్తులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదం తెలిపినట్టు పేర్కొంది. ఆంధప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, అసోం, గోవా, ఉత్తరాఖండ్, చండీగఢ్ ఇందులో చేరాయి. 2022 ఏప్రిల్ 1 నుంచి వాహనాల తుక్కు విధానం అమల్లోకి రావడం గమనార్హం. ఇతర రాష్ట్రాలను కూడా ఇందులో త్వరగా భాగస్వామ్యం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర రవాణా శాఖ తెలిపింది. 11 రాష్ట్రాల పరిధిలో 84 ఆటేమేటెడ్ టెస్టింగ్ కేంద్రాలను రాష్ట్రాల నియంత్రణలో ఏర్పాటుకు ప్రతిపాదించినట్టు పేర్కొంది. చదవండి: iPhone 14: వావ్ ఐఫోన్ పై మరో క్రేజీ ఆఫర్! ఇంకెందుకు ఆలస్యం..ఇప్పుడే సొంతం చేసుకోండి! -
తెలుగు రాష్ట్రాల్లో న్యూ ఇయర్ జోష్
-
Lok Sabha: రాష్ట్రాల అప్పుల వివరాలు ఇవిగో..
సాక్షి, ఢిల్లీ: దేశంలో వివిధ రాష్ట్రాల అప్పుల జాబితాపై ఓ స్పష్టత వచ్చింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా.. లోక్ సభలో సోమవారం రాష్ట్రాల అప్పులపై టీఆర్ఎస్ ఎంపీలు లిఖితపూర్వక ప్రశ్న సంధించారు. దీనికి స్పందించిన కేంద్ర ఆర్థిక శాఖ(సహాయ) మంత్రి పంకజ్ చౌదరి.. రాష్ట్రాల అప్పుల వివరాలను వెల్లడించారు. దేశంలో అప్పుల్లో తమిళనాడు రాష్ట్రం నెంబర్ వన్‌గా ఉంది. 2022 నాటికి తమిళనాడు అప్పు రూ. 6,59,868 కోట్లుగా తేలింది. రెండో స్థానంలో ఉత్తరప్రదేశ్ అప్పు రూ. 6,53,307 కోట్లు, మూడో స్థానంలో మహారాష్ట్ర అప్పు రూ. 6,08,999 కోట్లు, నాలుగో స్థానంలో పశ్చిమబెంగాల్ అప్పు రూ. 5,62, 697 కోట్లుగా తేలింది. ఇక ఐదో స్థానంలో రాజస్థాన్ అప్పు రూ. 4,77,177 కోట్ల రూపాయలుగా ఆర్థిక శాఖ ప్రకటించింది. ఆరో స్థానంలో కర్ణాటక అప్పు రూ. 4,61,832 కోట్లతో నిలిచింది. ఏడు స్థానంలో గుజరాత్ అప్పు రూ. 4,02,785 కోట్లుగా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. అప్పుల్లో 8వ స్థానంలో ఆంధ్రప్రదేశ్, 11వ స్థానంలో తెలంగాణ నిలిచాయి. ఏపీ అప్పు రూ. 3,98,903 కోట్ల రూపాయలు, తెలంగాణ అప్పు రూ. 3,12,191 కోట్ల రూపాయలుగా తెలిపింది కేంద్రం. ఏపీ అప్పుల పెరుగుదల 10.7 శాతంతో దేశంలో 15వ స్థానంలో నిలవగా.. తెలంగాణ మాత్రం 16.7 శాతంతో అప్పుల పెరుగుదలలో దేశంలో ఆరో స్థానంలో నిలిచింది. -
ఈ తొమ్మిది రాష్ట్రాల్లో ‘సీబీఐ’కి నో ఎంట్రీ
న్యూఢిల్లీ: ముందస్తు అనుమతిలేకుండా తమ రాష్ట్రాల్లో కేసులను దర్యాప్తు చేయడానికి వీల్లేదంటూ సీబీఐని తొమ్మిది రాష్ట్రాలు నిరోధించాయని కేంద్రం బుధవారం వెల్లడించింది. తెలంగాణ, పశ్చిమబెంగాల్, కేరళ, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మేఘాలయ, మిజోరం, పంజాబ్ రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయని మంత్రి జితేంద్రసింగ్ సభలో పేర్కొన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వంతో బేదాభిప్రాయాలు, ఇతరత్రా ప్రత్యేక కారణాలను చూపుతూ కొన్ని రాష్ట్రాలు సీబీఐకి సాధారణ అనుమతికి నిరాకరించిన విషయం తెల్సిందే. ఈ విషయాన్ని కేంద్రం బుధవారం పార్లమెంట్ సాక్షిగా వెల్లడించింది. ఇదీ చదవండి: Tawang dominates Parliament: ‘చైనా’పై చర్చించాల్సిందే -
ఎక్కువ అప్పులు చేశారంటూ జగన్ సర్కార్‌పై ఎల్లో మీడియా విషం
-
ఏపీ సర్కార్‌పై ఎల్లో మీడియా విషం.. పార్లమెంట్ సాక్షిగా వెల్లడైన వాస్తవాలు
సాక్షి, ఢిల్లీ: వివిధ రాష్ట్రాల అప్పుల వివరాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు తీసుకున్న అప్పుల వివరాలను వెల్లడించారు. దేశంలోనే అత్యధిక అప్పులున్న రాష్ట్రాలు మూడు ఉన్నాయి. రూ.6 లక్షల కోట్లకు పైగా అప్పులున్న రాష్ట్రాలు తమిళనాడు, యూపీ, మధ్యప్రదేశ్.. రూ.5 లక్షల కోట్లకు పైగా అప్పులున్న రాష్ట్రం బెంగాల్. రూ. 4లక్షల కోట్లకు పైగా అప్పులున్న రాష్ట్రాలు కర్ణాటక, గుజరాత్. జనాభా తక్కువ ఉన్న కేరళ అప్పులు రూ.3.35 లక్షల కోట్లు ఉండగా, అప్పుల్లో తమిళనాడు నంబర్‌వన్‌గా ఉంది. చదవండి: మరింత పారదర్శకత, జవాబుదారీతనం పెరగాలి: సీఎం జగన్ తమిళనాడు అప్పులు రూ.6.59 లక్షల కోట్లు కాగా.. రెండు, మూడు స్థానాల్లో యూపీ, మధ్యప్రదేశ్ ఉన్నాయి. బీజేపీ పాలిత యూపీ అప్పులు రూ.6.53 లక్షల కోట్లు, బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ అప్పులు రూ.3.17 లక్షల కోట్లు, బీజేపీ పాలిత గుజరాత్ అప్పులు రూ.4.02 లక్షల కోట్లు, కాంగ్రెస్ పాలిత రాజస్థాన్ అప్పులు రూ.4.77 లక్షల కోట్లు. తృణమూల్ అధికారంలో ఉన్న బెంగాల్ అప్పులు రూ.5.62 లక్షల కోట్లు. ధనిక రాష్ట్రమైన తెలంగాణకు 3.12 లక్షల కోట్ల అప్పులు ఉండగా, ఏపీకి అప్పులు రూ.3.98 లక్షల కోట్లు ఉన్నాయి. ఎక్కువ అప్పులు చేశారంటూ సీఎం జగన్ ప్రభుత్వంపై ఎల్లో మీడియా విషం చిమ్ముతున్న సంగతి తెలిసిందే. పార్లమెంట్ సాక్షిగా వాస్తవాలు వెల్లడయ్యాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు తీసుకున్న అప్పులు ఆంధ్రప్రదేశ్: 3,98,903 లక్షల కోట్లు అరుణాచల్ ప్రదేశ్: 15, 122 వేల కోట్లు అస్సాం: 1,07,719 లక్షల కోట్లు బీహార్: 2,46,413 లక్షల కోట్లు చత్తీస్‌గఢ్: 1,14,200 లక్షల కోట్లు గోవా: 28,509 వేలకోట్లు గుజరాత్: 4,02,785 లక్షల కోట్లు హర్యానా: 2,79,022 లక్షల కోట్లు హిమాచల్ ప్రదేశ్: 74,686 వేల కోట్లు ఝార్ఖండ్: 1,17,789 లక్షల కోట్లు కర్ణాటక: 4,62,832 లక్షల కోట్లు కేరళ: 3,35,989 లక్షల కోట్లు మధ్యప్రదేశ్: 3,17,736 లక్షల కోట్లు మహరాష్ట్ర: 6,08,999 లక్షల కోట్లు మణిపూర్: 13,510 వేల కోట్లు మేఘాలయ: 15,125 వేల కోట్లు మిజోరాం: 11,830 వేల కోట్లు నాగాలాండ్: 15,125 వేల కోట్లు ఒడిశా: 1,67,205 లక్షల కోట్లు పంజాబ్: 2,82,864 లక్షల కోట్లు రాజస్థాన్: 4,77,177 లక్షల కోట్లు సిక్కిం: 11,285 వేల కోట్లు తమిళనాడు: 6.59 లక్షల కోట్లు తెలంగాణ: 3,12,191 లక్షల కోట్లు త్రిపుర: 23,624 వేల కోట్లు ఉత్తప్రదేశ్: 6,53,307 లక్షల కోట్లు ఉత్తరాఖండ్: 84,288 వేల కోట్లు వెస్ట్ బెంగాల్: 5,62,697 లక్షల కోట్లు -
స్టార్టప్ ర్యాంకులు: కమింగ్ సూన్
సాక్షి, న్యూఢిల్లీ: స్టార్టప్ వ్యవస్థకు దన్నుగా నిబంధనల వాతావరణాన్ని సులభతరం చేసే బాటలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ర్యాంకింగ్స్ విడుదల చేయనుంది. ఈ ఏడాది 24 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం స్టార్టప్ ఎకో సిస్టమ్‌లో రాష్ట్రాలవారీగా సోమవారం(4న) ర్యాంకులను ప్రకటించ నుంది. ఇది మూడో ఎడిషన్ కాగా.. అంతక్రితం 2020 సెప్టెంబర్‌లో ర్యాంకులను ప్రకటించింది. గుజరాత్ టాప్ ర్యాంకులో నిలిచిన సంగతి తెలిసిందే. వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్.. స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు అండగా నిలిచిన రాష్ట్రాలు, ప్రాంతాలవారీగా ర్యాంకులను విడుదల చేయనున్నారు. పోటీ, సహకార సమాఖ్య విధానాల ద్వారా దేశీ విజన్‌ను ప్రోత్సహించేందుకు పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ(డీపీఐఐటీ) ర్యాంకింగ్‌ను చేపట్టింది. స్టార్టప్‌ల వృద్ధికి అనుగుణంగా సరళతర నియంత్రణల అమలుతోపాటు వ్యవస్థ పటిష్టతకు మద్దతుగా నిలిచిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో తొలుత 2018లో ర్యాంకింగ్ విధానానికి తెరతీసింది. -
స్వతంత్ర భారతి: భిన్నత్వంలో ఏకత్వంలా... భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటు
భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటు చేస్తే దాని వల్ల కుల మత పరమైన వైషమ్యాలు అణగిపోతాయని ఆశించారు. 1956 లో చేపట్టిన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు ఈ సూత్రమే ఆధారం. దీనిని మూడు విడతలుగా.. 1956లో దక్షిణాది రాష్ట్రాలలో (ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం), 1960 నాటికి పశ్చిమ రాష్ట్రాలలో (గుజరాత్), 1966 నాటికి వాయవ్య ప్రాంతంలో (పంజాబ్, హర్యానా, హిమాచల్) అమలు పరిచారు. తర్వాత ఈశాన్య ప్రాంత విభజన (1964, 71) గిరిజన జనాభా ప్రాతిపదికన జరిగింది. జార్ఖండ్, ఉత్తరాంచల్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలనూ ఏర్పాటు చేస్తూ 2000 లో ఉత్తరాది కేంద్రభాగంలో మినీ–పునర్వ్యవస్థీకరణ జరిపారు. భిన్నత్వంలో ఏకత్వం అనే భావనకు ఇది ఒక అరుదైన ప్రయోగం. భాషాపరమైన వ్యవస్థీకరణ భారతదేశ సమాఖ్య వ్యవస్థకు పుష్టిని ఇచ్చింది. 1956లో మొదలైన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ నిరంతరం కొనసాగేలానే ఉంది. ఈ క్రమంలోనే 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. విదర్భ కోసం డిమాండ్లు నేటికీ వినిపిస్తూ ఉన్నాయి. కర్నూలు రైల్వే స్టేషన్లో 1953 అక్టోబర్ 2న జవహర్లాల్ నెహ్రూ ఆ ముందు రోజే ఆంధ్ర రాష్ట్ర అవతరణ. మూడేళ్లకు 1956 నవంబర్ 1న ఆంధ్రా, తెలంగాణాలతో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైంది. -
సెక్స్ వర్కర్లను గౌరవించండి.. వేధించొద్దు!
న్యూఢిల్లీ: ‘‘సెక్స్ వర్కర్లూ అందరిలాంటి మనుషులే. వారికి తగిన గౌరవమివ్వాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిపై వేధింపులకు పాల్పడరాదు’’ అని పోలీసులకు సుప్రీంకోర్టు సూచించింది. మనుషుల మర్యాదకు కనీస భద్రత కల్పించడం బాధ్యతగా గుర్తించాలని పేర్కొంది. సెక్స్ వర్కర్లకు గౌరవం, భద్రత కల్పించడానికి చట్టమేదీ లేదు. అందుకే తాము జోక్యం చేసుకుంటున్నామని పేర్కొంది. సెక్స్‌వర్కర్లపై వేధింపులపై 2016లో దాఖలైన వ్యాజ్యంపై జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ బి.ఆర్.గావై, జస్టిస్ ఎ.ఎస్.బోపన్నతో కూడిన ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది. దీనిపై సుప్రీంకోర్టు ప్యానెల్ సిఫార్సులను అమలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. వేధించడం, దూషించడం గానీ, భౌతికంగా గానీ సెక్స్‌వర్కర్ల మీద దాడి చేసే హక్కు గానీ పోలీసులకు ఉండబోదని కోర్టు పేర్కొంది. సెక్స్ వర్కర్ల పనిని ‘‘వృత్తి’’గా గుర్తించే ముఖ్యమైన క్రమంలో.. చట్టం ప్రకారం గౌరవం, సమాన రక్షణకు సెక్స్ వర్కర్లు అర్హులని వ్యాఖ్యానించింది. అలాగే సెక్స్ వర్కర్లను వ్యభిచార కూపం నుంచి రక్షించే సమయంలో.. సెక్స్‌వర్కర్ల ఫొటోలు, గుర్తింపును బయటపెట్టొద్దంటూ కోర్టు మీడియాకు ఆదేశాలు జారీ చసింది. ఐపీసీ సెక్షన్ 354సీ voyeurism (ఇతరులు నగ్నంగా ఉన్నప్పుడు.. శారీరకంగా కలుసుకున్నప్పుడు తొంగి చూడడం లాంటి నేరం) కిందకే వస్తుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను మీడియాకు జారీ చేయాలని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ద్వారా సంక్రమించిన అధికారాన్ని ఉపయోగించుకొని సుప్రీంకోర్టు ఈ మేరకు పోలీసులకు, మీడియాకు ఆదేశాలిచ్చింది. -
ఏక భాష వద్దు.. ‘నాకు హిందీ తెలియదు’
ఇంగ్లీషుకు ప్రత్యామ్నాయంగా హిందీని అంగీకరించాలని, స్థానిక భాషలను కాదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ప్రజలపై హిందీ భాషను బలవంతంగా రుద్దేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్న వాదన తెరపైకి వచ్చింది. గత వారం న్యూఢిల్లీలో జరిగిన పార్లమెంటరీ అధికార భాషా కమిటీ 37వ సమావేశానికి అధ్యక్షత వహించిన అమిత్ షా మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యకలాపాలు అధికార భాషలో ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించారని, ఇది కచ్చితంగా హిందీ ప్రాముఖ్యతను పెంచుతుందని పేర్కొన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు హిందీని విస్తరించేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ‘వివిధ రాష్ట్రాల పౌరులు కమ్యూనికేట్ చేసేటప్పుడు అది భారతదేశ భాషలో ఉండాలి. అదే సమయంలో ప్రాంతీయ భాషల నుంచి పదాలను ఇముడ్చుకునేందుకు అనువుగా హిందీని మార్చాల’ని అమిత్ షా వ్యాఖ్యానించారు. హిందీ ఎక్కువగా మాట్లాడేవారు ఉంటే.. అది దేశాన్ని ఒక్కటిగా ఉంచుతుందన్న భావన కలుగుతుందని అన్నారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో 10వ తరగతి వరకు హిందీని తప్పనిసరి చేయాలనే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు పలు రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అసోం, బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ సహా పలు రాష్ట్రాల నాయకులు దీనిపై స్పందించారు. భాషాపరమైన ఆధిపత్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు. ప్రజలను ఏకం చేసే పేరుతో హిందీని అందరిపై రుద్దేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. హిందీని బలవంతంగా రుద్దడం మానుకుని.. స్థానిక భాషలను పరిరక్షించడం, ప్రోత్సహించడంపై దృష్టి పెట్టాలని కేంద్రాన్ని అసోం సాహిత్య సభ కోరింది. తమిళనాడు నుంచి డీఎంకే, అన్నాడీఎంకేతో పాటు బీజేపీ కూడా కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకించాయి. ఈ చర్య దేశ సమగ్రతను దెబ్బతీస్తుందని డీఎంకే పేర్కొంది. భారతీయుడని నిరూపించుకోవడానికి హిందీ నేర్చుకోవాల్సిన అవసరం లేదని తమిళనాడు బీజేపీ నేతలు అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ కూడా మోదీ సర్కారు చర్యను తప్పుబట్టింది. తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విటర్లో తన అభిప్రాయాన్ని తెలిపారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ బలంగా గళం వినిపించారు. హిందీని తప్పనిసరి చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో #StopHindiImposition హాష్‌ట్యాగ్‌తో ప్రచారం చేశారు. ‘నాకు హిందీ తెలియదు’ అనేది కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్, సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ వంటి సెలబ్రిటీలు కూడా ట్విటర్ వేదికగా తమ నిరసన వ్యక్తం చేశారు. (క్లిక్: నన్ను పట్టించుకోవడం లేదు.. కొత్త పెళ్లికొడుకులా ఉన్నా..) కేవలం హిందీ భాష ద్వారా మాత్రమే భారతదేశానికి గుర్తింపు వస్తుందన్న కేంద్రం వాదనలో పస లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బిహార్ మినహా ప్రతి రాష్ట్రానికి స్వంత భాష ఉందని వెల్లడించారు. అలాంటప్పుడు హిందీ భాషను అన్ని రాష్ట్రాలపై రుద్దడం సరికాదని అంటున్నారు. భాష అనేది కేవలం కమ్యూనికేషన్ సాధనం మాత్రమే కాదని.. సంస్కృతి, గుర్తింపు కూడానని వివరించారు. భాషా వైవిధ్యాన్ని కాపాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, ఏక భాష విధానం సమర్థనీయం కాదని స్పష్టం చేస్తున్నారు. (క్లిక్: ఆరెస్సెస్ అలాంటిది కాదని ఆయనకు చెప్పా) -
తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు.. ఆంక్షలు సడలింపు
భారత్‌లో కరోనా మహమ్మారి దాదాపు నాలుగు వారాల నుంచి స్థిరమైన క్షీణతను చూపుతున్నట్లు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి బుధవారం జనవరి 21 నుంచి కేసులు సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోందంటూ అన్నిరాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శులకు, నిర్వాహకులకు పంపిన లేఖలో వెల్లడించారు. అంతేకాదు ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్థిక లావాదేవీలకు అవాంతరం కలగకుండా రాష్ట్రాల సరిహద్దుల వద్ద అదనపు ఆంక్షలను తొలగించమని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా భారత్‌లో కరోనా మహమ్మారి ఎపిడెమియాలజీ మారుతున్నందున, కొత్త కరోనా ఉధృతి తగ్గుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఉన్న మార్గదర్శకాలు సమీకరించి నవీకరించిందని తెలిపారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తదనుగుణంగా ఫిబ్రవరి 10న అంతర్జాతీయ రాకపోకల మార్గదర్శకాలను సవరించిందని ఆయన చెప్పారు. అలాగే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎప్పటికప్పుడూ కేసుల ఉధృతి, తగ్గుదలను పర్యవేక్షించాల్సిందేనని లేఖలో నొక్కి చెప్పారు. అయితే దేశవ్యాప్తంగా కొత్త కరోనావైరస్ కేసులు తగ్గుముఖం పట్టడంతో, కొత్త కేసులు, సానుకూలత రేటును పరిగణనలోకి తీసుకుని కోవిడ్-19 పరిమితులను సడలించమని కేంద్రం రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరిందన్నారు. గత వారంలో సగటు రోజువారీ కేసులు 50,476 కాగా, 24 గంటల్లో 27,409 కొత్త కేసులు నమోదయ్యాయని, రోజువారీ కేసు సానుకూలత రేటు బుధవారం 3.63 శాతానికి తగ్గిందని రాజేష్ భూషణ్ వెల్లడించారు. (చదవండి: భయపడకండి! మరిన్ని విమానాలను పంపిస్తాం!) -
డెల్టా కంటే 3 రెట్లు వేగం.. ఒమిక్రాన్‌తో బహుపరాక్.. రాష్ట్రాలకు కేంద్రం సూచన
న్యూఢిల్లీ: డెల్టా వేరియంట్‌ను మించి మూడురెట్ల వేగంతో వ్యాపిస్తున్న కరోనా వేరియంట్ ఒమిక్రాన్‌తో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖలు రాశారు. ‘దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే వేరియంట్ ఆఫ్ కన్సర్న్‌గా డెల్టా వేరియంట్ ఉంది. తాజాగా, వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అయిన ఒమిక్రాన్ అందుకు మూడు రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు ప్రస్తుతం ఆధారాలున్నాయి. అందుకే, అన్ని స్థాయిల్లోనూ అప్రమత్తత, డేటా ఎనాలిసిస్, నిర్ణయాత్మకంగా వ్యవహరించడం, కంటైన్మెంట్ విషయంలో చురుగ్గా ఉండాలి’అని ఆయన పేర్కొన్నారు. ‘వార్‌రూంలను క్రియాశీలకం చేయాలి. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కేసుల్లో చిన్నపాటి పెరుగుదల కనిపించిన ప్రాంతాలపైనా దృష్టిపెట్టాలి. జిల్లా, స్థానిక స్థాయిల్లో కంటెయిన్మెంట్ చర్యలను కట్టుదిట్టం చేయాలి. అవసరమైన చోట్ల రాత్రి కర్ఫ్యూ విధించాలి. పెళ్లిళ్లు, ఉత్సవాల్లో ప్రజలు భారీగా గుమికూడకుండా నియంత్రించాలి. వైరస్ బాధితుల హోం ఐసోలేషన్ సమయంలో నిబంధనలను తు.చ.తప్పకుండా పాటించాలి’అని ఆయన పేర్కొన్నారు. ‘డోర్ టు డోర్ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అర్హులైన మొదటి, రెండో డోస్ లబ్ధిదారులందరికీ టీకా వేగంగా అందేలా చూడాలి. వ్యాక్సినేషన్లో జాతీయ సగటు కంటే తక్కువగా నమోదైన జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి’అని ఆయన కోరారు. గత వారం రోజులుగా టెస్ట్ పాజిటివిటీ రేటు 10%, అంతకంటే ఎక్కువగా ఉన్న, ఐసీయూ బెడ్ ఆక్యుపెన్సీ 40%, ఆపైన ఉన్న ప్రాంతాలపై ప్రధానంగా దృష్టి పెట్టాలని సూచించారు. క్లస్టర్లలో సేకరించిన శాంపిళ్లను తక్షణమే తప్పనిసరిగా జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం ఇన్సాకాగ్ ల్యాబ్‌లకు పంపాలన్నారు. ప్రస్తుతం పిల్లలకు టీకా అక్కర్లేదు ప్రస్తుతానికి దేశంలో చిన్నారులకు కోవిడ్–19 టీకా అవసరం లేదని వ్యాధి నిరోధకతపై ఏర్పాటైన జాతీయ సాంకేతిక సలహా బృందం(ఎన్టీఏజీఐ) స్పష్టం చేసింది. ఈ మేరకు ఎన్టీఏజీఐ వర్కింగ్ గ్రూప్‌లో నిర్ణయించినట్లు పేర్కొంది. ‘పిల్లలకు కోవిడ్ ముప్పు అంతగా లేదు. అందుకే, చిన్నారులకు కోవిడ్ వ్యాక్సినేషన్ అవసరం లేదు. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియజేశాం’అని మంగళవారం ఎన్టీఏజీఐ తెలిపింది. -
భారత్‌లో ఒమిక్రాన్ ప్రకంపనలు.. అప్రమత్తమైన రాష్ట్రాలు
సాక్షి,న్యూఢిల్లీ: కరోనా కేసులు తగ్గుముఖం పట్టి, బతుకులు మళ్లీ గాడిన పడుతున్న తరుణంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఈ వేరియంట్ మన దేశంలోకి విస్తరించి, మరో వేవ్‌కు దారి తీయవచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు మళ్లీ ఆంక్షల బాటపడుతున్నాయి. ఒమిక్రాన్ ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతున్నాయి. మహారాష్ట్రలో.. విదేశాల నుంచి మహారాష్ట్రలోకి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ వేయించుకోవాలని లేదా 72 గంటల ముందు ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలని నూతన మార్గదర్శకాలు జారీ చేయడంతో పాటు దక్షిణాఫ్రికా నుంచి ముంబయికి వచ్చేవారు తప్పనిసరిగా క్వారంటైన్లో ఉండాలని ఆ ప్రభుత్వం స్పష్టం చేసింది. అప్రమత్తమైన దేశ రాజధాని బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించేలా చూడాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఆదేశించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆస్పత్రులను సన్నద్ధం చేయాలని సూచించారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందకూండా కేంద్రం ముందస్తు చర్యలు చేపట్టాలని.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ కోరారు. ఒమిక్రాన్ వేరియంట్ వెలుగుచూసిన దేశాల నుంచి భారత్‌కు విమానాలను నిలిపివేయాలని ప్రధానికి కేజ్రివాల్ విజ్ఞప్తి చేశారు. (చదవండి: ఎన్టీఆర్ పార్కు ముందు బీభత్సం.. హుస్సేన్ సాగర్‌లోకి దూసుకెళ్లిన కారు) విదేశీ ప్రయాణికులపై ఆంక్షలు విదేశీ ప్రయాణికుల విషయంలో గుజరాత్ ప్రభుత్వం కొత్త ఆంక్షలను ప్రకటించింది. యూరప్, బ్రిటన్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ , బోట్స్వానా, చైనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాబ్వే, హాంకాంగ్ నుంచి గుజరాత్‌లోకి వచ్చేవారు పూర్తి స్థాయి కరోనా టీకా తీసుకోనట్లైతే.. విమానాశ్రయాల్లో ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని ఆదేశించింది. పూర్తి స్థాయి టీకా తీసుకున్నవారికి కూడా స్క్రీనింగ్ పరీక్షలు చేసి, ఎలాంటి లక్షణాలు లేకపోతేనే.. రాష్ట్రంలోకి అనుమతిస్తామని చెప్పింది. ఆర్టీ-పీసీఆర్ నెగెటివ్ ధ్రువపత్రం ఉంటేనే కర్ణాటకలోకి కేరళ, మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రయాణికులు ఆర్టీ-పీసీఆర్ నెగెటివ్ ధ్రువపత్రం చూపిస్తేనే తమ రాష్ట్రంలోకి అనుమితిస్తామని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. 16 రోజుల క్రితం కేరళ నుంచి వచ్చిన విద్యార్థులు.. మరోసారి ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలని చెప్పింది. ప్రభుత్వ కార్యాలయాలు, మాల్స్‌లో పని చేసే వారంతా తప్పనిసరిగా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తెలిపారు. విమానాశ్రయాల్లో నిఘా పెంచాం: కేరళ విదేశాల్లో కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి దృష్ట్యా కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తి కట్టడి కోసం ముందుజాగ్రత్త చర్యలు చేపట్టామని ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. విమానాశ్రయాల్లో నిఘా పెంచామని చెప్పారు. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించాలని, అందరూ టీకా తీసుకోవాలని ఆమె కోరారు. చదవండి: కోవిడ్ ‘ఒమిక్రాన్’ వేరియెంట్‌తో ప్రపంచవ్యాప్తంగా కలవరం -
అత్యంత పేద రాష్ట్రాల జాబితా విడుదల.. అతి తక్కువ పేదరికం ఉన్న రాష్ట్రం కేరళ
న్యూఢిల్లీ: భారత్‌లో అత్యంత పేద రాష్ట్రాలు బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ అని నీతి ఆయోగ్ వెల్లడించింది. ఈ మేరకు తన తొలి జాతీయ బహుముఖీన పేదరిక సూచిక(ఎంపీఐ) నివేదికను తాజాగా విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం బిహార్ జనాభాలో సగానికి పైగా.. అంటే 51.91 శాతం మంది నిరుపేదలే ఉన్నారు. జార్ఖండ్‌లో 42.16 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 37.79 శాతం మంది దారిద్య్రం అనుభవిస్తున్నారు. జనాభాలో 36.65 శాతం మంది పేదలతో నాలుగో స్థానంలో మధ్యప్రదేశ్, 32.67 శాతం మంది పేదలతో ఐదు స్థానంలో మేఘాలయ ఉన్నాయి. ఇక అతి తక్కువ పేదరికం ఉన్న రాష్ట్రాల్లో కేరళ(0.71 శాతం), గోవా(3.76 శాతం), సిక్కిం(3.82 శాతం), తమిళనాడు(4.89 శాతం), పంజాబ్(5.59 శాతం) ముందు వరుసలో నిలిచాయి. కేంద్ర పాలిత ప్రాంతాలైన దాద్రానగర్ హవేలిలో 27.36 శాతం, జమ్మూకశ్మీర్, లద్ధాఖ్‌లో 12.58 శాతం, డయ్యూ డామన్‌లో 6.82 శాతం, చండీగఢ్‌లో 5.97 శాతం మంది పేదలు ఉన్నారు. అతి తక్కువగా పుదుచ్చేరిలో 1.72 శాతం మంది పేదరికం అనుభవిస్తున్నారు. లక్షద్వీప్‌లో 1.82 శాతం, అండమాన్ నికోబార్ దీవుల్లో 4.30 శాతం, ఢిల్లీలో 4.79 శాతం మంది పేదలు ఉన్నట్లు తేలింది. పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న ప్రజల సంఖ్యలోనూ బిహార్‌దే అగ్రస్థానం కావడం గమనార్హం. దేశంలో బహుముఖీన పేదరిక సూచికను తయారు చేయడానికి ఆక్స్ఫర్డ్ వర్సిటీ, ఐక్యరాజ్యసమితి అభివృద్ధి చేసిన మెథడాలజీని ఉపయోగించినట్లు నీతి ఆయోగ్ వెల్లడించింది. 2015–16 నాటి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే గణాంకాలను ఆధారంగా తీసుకున్నట్లు తెలిపింది. -
దేశంలో అత్యంత పేదరికంలో ఉన్న రాష్ట్రాలు ఇవే : నీతి ఆయోగ్
నీతి ఆయోగ్‌కు చెందిన మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ (ఎంపీఐ) పై రిపోర్ట్లు విడుదలయ్యాయి. ఈ రిపోర్ట్లలో దేశంలో మొత్తం ఐదు రాష్ట్రాలు దేశంలో అత్యంత పేద రాష్ట్రాలుగా కొనసాగుతున్నాయని నీతి ఆయోగ్ కీలక వ్యాఖ్యలు చేసింది. నివేదిక ప్రకారం..ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ (OPHI),యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (UNDP)ల ఆధ్వర్యంలో సర్వే జరిగింది. ఈ రెండు సంస్థలు ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాలు, పోషకాహారం, పిల్లలు, కౌమర దశలోని మరణాలు, ప్రసవానంతర సంరక్షణ, పాఠశాల విద్య, పాఠశాల హాజరు, వంట గ్యాస్, పారిశుద్ధ్యం, మద్యపానం వంటి 12 అంశాల ఆధారంగా దేశంలోని ఏఏ రాష్ట్రాలు పేదరికంలో ఉన్నాయనే విషయాల్ని వెల్లడిస్తాయి. ఆ సంస్థలు చేపట్టిన అభిప్రాయ సేకరణ ఆధారంగా బీహార్‌లో 51.91 శాతం మంది పేదరికంలో ఉన్నట్లు అభిప్రాయం సేకరణలో వెల్లడైంది. ఇక బీహార్ తరువాత జార్ఖండ్ 42.16 శాతంతో రెండో స్థానంలో, ఉత్తరప్రదేశ్ 37.79 శాతంతో మూడో స్థానంలో, మధ్యప్రదేశ్ 36.65 శాతంతో నాలుగో స్థానంలో ఉండగా, మేఘాలయ 32.67 శాతం ఐదో స్థానాల్లో ఉన్నాయి. ఆ తరువాత కేరళ 0.71 శాతం, గోవా 3.76 శాతం, సిక్కిం 3.82 శాతం, తమిళనాడు 4.89 శాతం, పంజాబ్ 5.59 శాతంతో దేశంలో పేదరికం తక్కువగా ఉన్న రాష్ట్రాలుగా ఉన్నాయని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ తెలిపారు. చదవండి : బెంబేలెత్తిస్తున్న కరోనా, అక్షరాల రూ.14 లక్షల కోట్లు బూడిదపాలు -
చైల్డ్ పోర్న్ వీడియోలు.. దేశవ్యాప్తంగా కొరడా ఝుళిపిస్తున్న సీబీఐ
న్యూఢిల్లీ: ఆన్లైన్లో చైల్డ్ పోర్న్ వీడియోలను అరికట్టడానికి సీబీఐ కఠిన చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆన్లైన్ చైల్డ్ పోర్న్ రాకెట్‌పై కొరడా ఘుళిపించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఇప్పటికే 83 మంది నిందితులపై 23 కేసులు నమోదు చేసిన సీబీఐ 14 రాష్ట్రాల్లో 76 ప్రాంతాల్లో దాడులు చేస్తోంది. నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ, యూపీ, పంజాబ్, బీహార్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఆ రాష్ట్రాల్లో సోదాలో నిర్వహించడంతో పాటు ఇప్పటికే పలు వీడియోలను కూడా సీజ్ చేసింది. చిన్నారుల పోర్న్ వీడియోలను చూడటం, డౌన్లోడ్, అప్లోడ్ చేయడం లాంటివాటిని కేంద్రం నిషేదించిన సంగతి తెలిసిందే. In a major crackdown, CBI is today conducting searches at around 76 locations across India in 14 States/UTs. CBI has registered 23 separate cases on 14th November 2021 against total 83 accused on the allegations related to Online Child Sexual Abuse & Exploitation. — Prasar Bharati News Services पी.बी.एन.एस. (@PBNS_India) November 16, 2021 చదవండి: కజిన్‌తో గొడవ.. అతని భార్యని టార్గెట్‌గా చేసుకుని ఎనిమిది నెలలుగా.. -
విద్యుత్ కొరత: మిగులు కరెంట్‌ని అమ్మితే చర్యలు: కేంద్రం
ఢిల్లీ: దేశంలోని వివిధ థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు కొరత వల్ల విద్యుత్ కొరత ఏర్పడనుందని అనేక రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విద్యుత్ కొరతపై కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మిగులు విద్యుత్ ఉత్పత్తి ఉన్న రాష్ట్రాలు, కొరత ఉన్న రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా చేయాలని విజ్ఞప్తి చేసింది. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ స్టేషన్ల వద్ద ఉన్న 15 శాతం అన్ అలకేటెడ్ కోటా నుంచి విద్యుత్ వాడుకోవాలని విన్నవించింది. (చదవండి: విద్యుత్ సంక్షోభం.. జనాలకు ఢిల్లీ ప్రభుత్వం వింత రిక్వెస్ట్) బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాల నుంచి ప్రస్తుతం డిమాండ్ బాగా పెరిగింది.కొన్ని రాష్ట్రాలు ప్రజలకు విద్యుత్ కోతలు పెడుతూ బయట రాష్ట్రాలకు పవర్ అమ్ముతున్నారు. ఈ క్రమంలో కేంద్రం మిగులు కరెంట్‌ను పవర్ ఎక్స్చేంజిలలో అమ్మితే ఆ రాష్ట్రాల కేటాయింపులు తగ్గించేస్తామని కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్ శాఖ మంగళవారం రాష్ట్రాలకు లేఖ రాసింది. చదవండి: తెలంగాణలో బొగ్గు కొరత లేదు -
షాకింగ్ సర్వే,దక్షిణాది కుటుంబాలలో అప్పులే అధికం
ముంబై: భారత్‌లో ఇతర ప్రాంతాలతో పోల్చితే దక్షిణాది ప్రాంతాల కుటుంబాల రుణ భారాలు అధికంగా ఉన్నట్లు ఇండియా రేటింగ్స్ తన తాజా నివేదికలో పేర్కొంది. 2013 నుంచి 2019 వరకూ దేశంలోని కుటుంబాల రుణ భారాలపై ఆల్ ఇండియా డెట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ (ఏఐడీఐఎస్) నిర్వహించిన సర్వే గణాంకాలను ఈ సందర్భంగా ఇండి యా రేటింగ్స్ ఉటంకించింది.దక్షిణాదిలో అటు గ్రామీణ, ఇటు పట్టణ ప్రాంతాల కుటుంబాల రుణాలు దేశ ఇతర ప్రాంతాలతో పోల్చితే అధికంగా ఉన్నట్లు వివరించింది. 2019 లో తెలంగాణ 67.2 శాతంతో గ్రామీణ కుటుంబాలలో అత్యధిక శాతం అప్పులు కలిగి ఉంది. ఈ విషయంలో నాగాలాండ్ 6.6 శాతంతో కనిష్ట స్థాయిలో ఉంది. ఇందుకు సంబంధించి పట్టణ ప్రాం తాల విషయంలో 47.8 శాతంతో కేరళ మొదటి స్థానంలో ఉంటే, మేఘాలయ 5.1 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. ఇక తలసరి ఆదాయం విషయంలో దక్షిణాది రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలకన్నా ముందున్నాయి. ఆస్తులు–అప్పుల నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటకలు తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి. కోవిడ్ నేపథ్యంలో గృహ రుణాలు భారీగా పెరిగాయి. 2020–21 అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో గృహ రుణ భారం జీడీపీలో 37.9 శాతం ఉంది. 2019–20లో నాల్గవ త్రైమాసికంలో ఈ నిష్పత్తి 33.8 శాతంమే కావడం గమనార్హం. చదవండి: ధనిక,పేదల మధ్య భారీ అంతరం -
పెట్రోల్, డీజిల్ ధరలపై కీలక వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి..!
ఆకాశమే హద్దుగా పెరుగుతున్న ఇంధన ధరలతో సామన్యుడికి చుక్కలు కన్పిస్తున్నాయి. గత పదిహేను రోజుల నుంచి ఇంధన ధరల్లో ఎలాంటి మార్పులు లేవు.దీంతో వాహనదారులకు కాస్త ఉపశమనం లభించింది. కాగా తాజాగా పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి ఇంధన ధరలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు దిగిరావడంలేదంటే... పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీలోకి తెచ్చేందుకు రాష్ట్రాలు ఒప్పుకోవని వెల్లడించారు. పెట్రోలు, డీజిల్ జీఎస్టీ పరిధిలోకి తెచ్చే అంశంపై రాష్ట్రాలు సిద్దంగా లేవని మీడియాతో తెలిపారు. చదవండి: జేమ్స్‌బాండ్-007 భాగస్వామ్యంతో స్పెషల్ ఎడిషన్ బైక్..! పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తున్న హర్దీప్ సింగ్‌పురి టీఎమ్సీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. టీఎమ్సీ ప్రభుత్వం భారీగా పన్నులను మోపడంతో పశ్చిమబెంగాల్లో పెట్రోల్ రూ. 100 మార్క్‌ను దాటిందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎమ్‌సీ) పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను పెంచే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. చదవండి: పవర్ఫుల్ పర్ఫార్మెన్స్తో మార్కెట్లలోకి నయా డుకాటీ మాన్స్టర్...! -
మెరుగుపడుతున్న రాష్ట్రాల ఆదాయాలు!
ముంబై: రాష్ట్రాల ఆదాయాలు క్రమంగా మెరుగుపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ (ఇండ్ రా)తన తాజా నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో 2021–22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల ద్రవ్యలోటు (ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం) 4.1 శాతానికి (రాష్ట్రాల స్థూల దేశీయోత్పత్తిలో) పరిమితి కావచ్చని అంచనా వేసింది. చదవండి: భారీగా పుట్టుకొస్తున్న సాస్ స్టార్టప్‌లు, ఐపీఓకి జోష్ ఇంతక్రితం వరకూ ఈ అంచనాను సంస్థ 4.3 శాతంగా పేర్కొంది. ఇక రాష్ట్రాల జీడీపీలో రుణ నిష్పత్తి కూడా 34 శాతం నుంచి 32.4 శాతానికి తగ్గుతుందన్న అంచనాలను వెలువరించింది. వ్యాక్సినేషన్ విస్తృత స్థాయిలో కొనసాగుతోందని, ఈ నేపథ్యంలో ఆర్థిక రికవరీ కూడా ఊపందుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని వివరించింది. ఆయా అంశాలు రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాల మెరుగుపడ్డానికి దోహపడతాయని పేర్కొంది. కరోనా ప్రేరిత మూడవ వేవ్ భయాలు తొలిగిపోతే వ్యాపారాలు, వాణిజ్య కార్యకలాపాలపై ఆంక్షలను ప్రభుత్వాలు మరింత సడలించే అవకాశం ఉందని ఏజెన్సీ అంచనావేస్తోంది. ఆయా పరిస్థితుల్లో రెవెన్యూ లోటు క్రితం అంచనాలను కూడా 1.5 శాతం నుంచి (రాష్ట్రాల జీడీపీల్లో) 1.3 శాతానికి మెరుగుపరుస్తున్నట్లు తెలిపింది. నివేదికకు సంబంధించి కీలక అంశాలను పరిశీలిస్తే.. ►2021–22 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) 14 రాష్ట్రాల నుంచి అందిన సమాచారం విశ్లేషణ ప్రకారం ఈ కాలంలో ఆయా రాష్ట్రాల ఆదాయం 30.8 శాతం పెరిగి రూ.3.95 లక్షల కోట్లకు చేరింది. ►2020 ఇదే కాలంలో పోల్చి చూసినా సమీక్షా కాలంలో వృద్ధిరేటు 1.5 శాతంగా ఉంది. ► పన్ను, పన్నుయేతల ఆదాయాలు వరుసగా 77 శాతం, 46 శాతం చొప్పున ఎగశాయి. కరోనా సెకండ్ వేవ్ రాష్ట్రాల ఆదాయాలపై పెద్దగా ప్రతికూల ప్రభావం చూపలేదని భావించవచ్చు. ►రాష్ట్రాల స్థూల మార్కెట్ రుణాలు 2020–21లో రూ.7.88 లక్షల కోట్లు. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూలై మధ్య స్థూల మార్కెట్ రుణాలు రూ.1.94 లక్షల కోట్లు. ► 2020 ఏప్రిల్–జూలై మధ్య స్థూల మార్కెట్ రుణాలు రూ.2.1 లక్షల కోట్లు. ►అయితే 2020–21తో పోల్చితే స్థూల మార్కెట్ రుణాలు రూ.8.2 లక్షల కోట్లకు పెరుగే అవకాశం ఉంది. ఇది క్రితం క్రితం రూ.8.4 లక్షల కోట్ల అంచనాకన్నా తక్కువ. ఇక నికర మార్కెట్ రుణాలు 2020–21లో రూ.6.45 లక్షల కోట్లుకాగా, ఇది 2021–22 నాటికి 6.2 లక్షల కోట్లకు తగ్గే అవకాశం ఉంది. -
కరోనా ఉధృతి: ఆర్ ఫ్యాక్టర్ పెరుగుతోంది: కేంద్రం హెచ్చరిక
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వృద్ధిని తెలియజేసే ఆర్ ఫ్యాక్టర్ (రీప్రొడక్టివ్ నంబర్) పెరుగుతోందని కేంద్రం ఆందోళన వ్యక్తంచేసింది. తమిళనాడు, కేరళ, హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్ సహా 8 రాష్ట్రాల్లో ఆర్ ఫ్యాక్టర్ ఒకటి కంటే ఎక్కువగా ఉందని పేర్కొంది. కోవిడ్ సోకిన ఒక వ్యక్తి సగటున ఎంతమందికి వ్యాధిని వ్యాప్తి చేస్తున్నాడన్న విషయాన్ని వైద్య పరిభాషలో ఆర్ ఫ్యాక్టర్‌గా చెబుతారు. ఆర్ ఫ్యాక్టర్ ఒకటి కంటే తక్కువ ఉంటే కరోనా వ్యాప్తి తక్కువగా ఉందని ఒకటికంటే ఎక్కువ నమోదైతే వ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉందని అర్థం. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆర్ ఫ్యాక్టర్ పెరుగుతుండటంతో చర్యలు తీసుకోవాలంటూ కేంద్రం ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు సూచిస్తోంది. దేశంలో సెకెండ్ వేవ్ ఇంకా ముగియలేదని అధికారులు పేర్కొంటు న్నారు. ప్రపంచవ్యాప్తంగా రోజుకు 4.7 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. భారత్‌లో సైతం 44 జిల్లాల్లో వారాంతపు పాజిటివిటీ రేటు 10కి పైగా నమోదవుతోందని కేంద్రం తెలిపింది. మరోవైపు గత నాలుగు వారాలుగా కేరళ, మహారాష్ట్ర, మణిపూర్ అరుణాచల్ ప్రదేశ్‌లలోని 18 జిల్లాల్లో కరోనా కేసులు ఆరోహణ క్రమంలో పెరుగుతూ రావడం కూడా ఆందోళనకరమని చెప్పింది. గత వారంలో నమోదైన మొత్తం కేసుల్లో దాదాపు 50శాతం కేసులు కేరళలోనే నమోదయ్యాయి. 42,625 మందికి కరోనా పాజిటివ్ దేశవ్యాప్తంగా బుధవారం నాటి గణాంకాల ప్రకారం మరో 42,625 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,17,69,132కు చేరుకుందని కేంద్రం తెలిపింది. 24 గంటల వ్యవధిలో ఈ మహమ్మారి బారిన పడిన మరో 562మంది చనిపోవడంతో మొత్తం మరణాలు 4,25,757కు పెరిగాయి -
కోవిడ్ మరణాలపై డేటా ఇవ్వండి: కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా సెకండ్‌వేవ్ సమయంలో ఆక్సిజన్ కొరత కారణంగా ఒక్కరు కూడా చనిపోలేదని, దీనికి సంబంధించిన రిపోర్టులేవీ తమ వద్ద లేదన్న కేంద్రం తాజాగా కీలక ఆదేశాలు చేసినట్టు తెలుస్తోంది. ఆక్సిజన్ కొరతతో మరణాల సమాచారం కోసం కేంద్రం రాష్ట్రాలకు లేఖ రాసింది. దీంతో పార్లమెంటు వర్షాకాల సమావేశాల లోపే ఆయా రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలు ఈ డేటాను సమర్పించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మెడికల్ ఆక్సిజన్ కొరతతో చనిపోయిన కరోనా బాధితుల డేటాని సమర్పించాల్సిందిగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం కోరింది. ప్రస్తుత పార్లమెంట్ సెషన్ ముగిసే (ఆగస్టు 13) నాటికి ఈ డేటాను పార్లమెంటులో సమర్పించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కాగా కరోనా రెండో దశలో వేవ్ ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఎలాంటి మరణాలు సంభవించలేదన్న కేంద్రం ప్రకటనపై విమర్శలు చెలరేగాయి. ఈ నెల 20న రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ అడిగిన ప్రశ్నకు కోవిడ్ మరణాలపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రత్యేక మరణాలను నివేదించలేదని ఆరోగ్యశాఖ సహాయమంత్రి సమాధానం పెద్ద దుమారాన్నే రాజేసింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కేంద్రంపై మండిపడిన సంగతి తెలిసిందే. -
రాష్ట్రాలకు భంగపాటు!
ఉన్న ఒకే ఒక్క ఆశ అడుగంటింది! భారత్‌లో వ్యాక్సిన్లు ఉత్పత్తి చేస్తున్న రెండు సంస్థలూ సకాలంలో అవసరమైనన్ని వ్యాక్సిన్లు అందజేయలేని స్థితిని గమనించి, ఇక చేసేది లేక సొంతంగా ప్రపంచ మార్కెట్లో కొనుగోలు చేయాలని ఆత్రపడిన రాష్ట్రాలకు భంగపాటు ఎదురైంది. టీకాల విషయంలో మీతో మాట్లాడలేమని మొన్న మోడెర్నా సంస్థ పంజాబ్‌కు చెప్పగా...ఇప్పుడు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మోడెర్నా ఒక్కటే కాదు...ఫైజర్ సైతం మొండి చేయి చూపింది. తాము వ్యాక్సిన్ల గురించి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతాం తప్ప రాష్ట్రాలతో కాదని ఆ సంస్థలు జవాబిచ్చాయి. ఈ రెండు రాష్ట్రాలే కాదు...ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, ఒదిశా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలు సైతం వ్యాక్సిన్ల కొనుగోలుకు గ్లోబల్ టెండర్లు జారీ చేశాయి. ఇదంతా గత నెలాఖరులో జరిగింది. నెల తర్వాత ఇప్పుడు రెండు రాష్ట్రాలకు ‘కుదరదు పొమ్మ’ని జవాబొచ్చింది. మిగిలిన రాష్ట్రాలకు ఆ సంస్థలనుంచి భిన్నమైన ప్రత్యుత్తరం వస్తుందని ఆశించనవసరం లేదు. అంతర్జాతీయ మార్కెట్లో ఇలా మన దేశంనుంచే ఎవరికి వారు పోటీ పడితే వ్యాక్సిన్ల ధర కాస్తా కొండెక్కి కూచుంటుందన్నది నిజమే. కానీ గ్లోబల్ టెండర్లకు వెళ్లాలని సూచించింది కేంద్ర ప్రభుత్వమే. తీరా ఈ జవాబొచ్చిందంటే ఏమనుకోవాలి? ఏడాదిక్రితం కరోనా మహమ్మారి దేశంలో విస్తరించినప్పటినుంచి కేంద్రం వైఫల్యాల పర్యవసానంగా ఏర్పడుతున్న పరిణామాల పరంపరలో ఇది తాజా ఘట్టం. ఒకటి రెండు వారాలుగా దేశంలో కరోనా కేసుల సంఖ్య కొద్దో గొప్పో తగ్గుముఖం పడుతున్న సూచనలు కనబడటం కొంత ఆశాజనకంగా వున్న మాట వాస్తవమే అయినా దేశంలో మూడింట రెండు వంతుల జిల్లాల్లో పాజిటివిటీ రేటు 20 శాతానికి మించివుందని పదిరోజులక్రితం నిపుణులు తెలిపారు. నిజానికి చాలా రాష్ట్రాల గ్రామసీమల్లో అరకొర వైద్య సదుపాయాలున్నాయి. వచ్చింది సాధారణ జ్వరమో, ఈ మహమ్మారి విరుచుకుపడిందో నిర్ధారణగా చెప్పడానికి అవసరమైన సిబ్బందిగానీ, ఆ పరీక్షలకు కావలసిన ఉపకరణాలుగానీ అక్కడ లేవు. కనుక వెల్లడవుతున్న సంఖ్యలకు మించి కరోనా రోగులు వుండొచ్చని కొందరంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణ పౌరులు ఎంత కలవరపడతారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నిరుడు కరోనా పంజా విసిరినప్పటి పరిస్థితి వేరు. అప్పటికి అన్ని దేశాలూ నిస్సహాయ స్థితిలో వున్నాయి. దాన్ని నియంత్రించడానికి అవసరమైన వ్యాక్సిన్ల మాట అటుంచి, కనీసం చికిత్సపై కూడా అయోమయం. ఇప్పుడు ఎంతో కొంత చికిత్స విధానాలు మెరుగుపడ్డాయి. పైగా వ్యాక్సిన్లు అందుబాటులోకొచ్చాయి. దాదాపు అన్ని దేశాలూ తమ తమ స్థోమత మేరకు పౌరులకు యుద్ధ ప్రాతిపదికన టీకాలిస్తున్నాయి. అత్యంత బీద దేశాల సంగతి మినహాయిస్తే అందరూ ఎంతో ముందు చూపుతో వ్యాక్సిన్ తయారీదార్లకు అడ్వాన్సులిచ్చారు. ఒక అంచనా ప్రకారం చూస్తే అలా అడ్వాన్సులిచ్చిన దేశాలకు ముందనుకున్నట్టు వ్యాక్సిన్ సరఫరా చేయడానికి దాదాపు అన్ని ఫార్మా సంస్థలకూ కనీసం ఆర్నెల్లు పడుతుంది. మోడెర్నా, ఫైజర్ల పరిస్థితి కూడా అదే అయివుంటుంది. మరి పంజాబ్, ఢిల్లీ ప్రభుత్వాలకు ఆ కారణాన్ని చెప్పకుండా తాము కేంద్రంతో మాత్రమే లావాదేవీలు చేస్తామనడం ఎందుకో అంతుపట్టదు. మన దేశంలో ఫెడరలిజం ఎంత సొగసుగా అమలవుతున్నదో వారికి కూడా అర్థమైనట్టుంది! గ్లోబల్ టెండర్లకు వెళ్లొచ్చని రాష్ట్రాలకు చెప్పిననాటికే విదేశాల్లో ఉత్పత్తవుతున్న ముఖ్యమైన వ్యాక్సిన్లకు అనుమతులిచ్చివుంటే...మా రాష్ట్రాలు మీతో లావాదేవీలు చేస్తాయని ఆ సంస్థలకు చెప్పివుంటే వేరుగా వుండేది. కానీ దేశీయ వ్యాక్సిన్లు కోవీషీల్డ్, కోవాగ్జిన్‌లకూ... గత నెలలో స్పుత్నిక్ (రష్యా) వ్యాక్సిన్‌కు ఇచ్చిన అనుమతులు తప్ప ఇతర టీకాలకు మనదేశంలో అనుమతులు లేవు. ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్‌లకు నిరుడు డిసెంబర్లోనే అమెరికా అనుమతులిచ్చింది. ఫైజర్‌ను బ్రిటన్ కూడా డిసెంబర్లోనే గుర్తించింది. మొత్తంగా దాదాపు 90 దేశాలు ఫైజర్‌కు, 41 దేశాలు జాన్సన్ అండ్ జాన్సన్‌కూ అనుమతులిచ్చివున్నాయి. కొన్ని దేశాలు స్పుత్నిక్ వైపు మొగ్గాయి. మరి మనకేమైంది? ప్రజారోగ్యం ప్రధానం కనుక ఆ వ్యాక్సిన్ల పనితీరుపై అతి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సివుందన్నది వాస్తవమే అయినా... అందుకు ఆర్నెల్ల సమయం అవసరమా? కోవాగ్జిన్ రూపకల్పనలో భారతీయ వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలు కూడా పాలుపంచుకున్నాయి గనుక ఇతర సంస్థలకు కూడా దాన్ని ఉత్పత్తి చేసే అవకాశమివ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించాక మరో రెండు మూడు సంస్థలకు కూడా అనుమతులిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. కానీ దీన్నింకా విస్తరిస్తే తప్ప ఎక్కువమంది జనాభాకు టీకాలివ్వటం సాధ్యం కాదు. జాతీయంగా, అంతర్జాతీయంగా టీకాల లభ్యత విషయంలో ఇంత అలసత్వం ప్రదర్శిస్తూ పద్దెనిమిదేళ్లు పైబడిన పౌరులందరికీ వ్యాక్సిన్లు ఇస్తామని ఈ నెల 1న ప్రకటించారు. దానికి ఆన్లైన్ నమోదు ఇప్పటికే సాగుతుండగా, సోమవారం నుంచి నేరుగా వ్యాక్సినేషన్ కేంద్రాల్లో నమోదు మొదలైంది. కానీ అవసరమైనన్ని టీకాలేవి? కనీసం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చురుగ్గా నిర్ణయాలు తీసుకోవాలి. అంతర్జాతీయ మార్కెట్లో పంజాబ్, ఢిల్లీ ప్రభుత్వాలకు ఇప్పుడెదురైన చేదు అనుభవంలాంటిది మరే రాష్ట్రానికీ కలగకుండా కేంద్రం అవసరమైన చర్యలు తీసుకోవాలి. -
ఇప్పటివరకు దేశంలో లాక్డౌన్ ప్రకటించిన రాష్ట్రాలు ఇవే
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విలయం తాండవం చేస్తోంది. కరోనా వైరస్ తొలిదశ కంటే రెండోదశ విజృంభించడంతో కేసుల సంఖ్యతో పాటూ మరణాల సంఖ్య పెరిగిపోతుంది. తొలిదశలో రోజూవారి నమోదయ్యే కేసుల సంఖ్య వేలల్లో ఉంటే కోల్పోయే ప్రాణాలు పదుల్లో ఉండేవి. కానీ రెండో దశలో అలా కాదు కరోనా దాని స్వరూపం మార్చేసి సామాన్యుడిపై ప్రతాపాన్ని చూపిస్తోంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కభళించేందుకు దూసుకు రావడంతో రోజూ వారి కేసుల సంఖ్య మూడు నుంచి నాలుగు లక్షలు కరోనా సోకుతుంటే మరణాల సంఖ్య వేలల్లో నమోదవుతున్నాయి.దీనికి తోడు దేశంలో ఎన్నికల నిర్వహణ కరోనా వ్యాప్తికి మరింత ఊతమిచ్చినట్లైంది. అయితే ఈ నేపథ్యంలో దేశంలోని పలు రాష్ట్రాలు తాత్కాలిక లాక్ డౌన్ వైపు మొగ్గు చూపుతున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 11,21,102 పైగా కరోనా సోకగా.. వారిలో 9,82,297 మందికి తగ్గుముఖం పట్టింది. 8053 మంది మరణించారు. ఇక తెలంగాణలో 4,51వేల మందికి కరోనా సోకి.. 3లక్షల 68వేల మందికి తగ్గింది. 2,368 మంది మరణించారు. అయితే తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు నైట్ కర్ఫ్యూని విధించాయి. తెలుగు రాష్ట్రాలతో పాటూ ఏ రాష్ట్రాల్లో ఎన్ని కరోనా కేసులు నమోదయ్యాయి. ఎక్కడెక్కడ లాక్ డౌన్ విధించారో తెలుసుకుందాం. State/UT Confirmed Cases Active Case Cured/Discharged Death Lockdown/Curfew Status అండమాన్/ నికోబార్ దీవులు 6046 205 5773 68 ఆంధ్రప్రదేశ్ 1121102 130752 982297 8053 నైట్ కర్ఫ్యూ రాత్రి 10 నుండి 5 వరకు అరుణాచల్ ప్రదేశ్ 18636 1387 17190 59 పాక్షిక లాక్ డౌన్ అస్సాం 256576 26374 228872 1330 నైట్ కర్ఫ్యూ రాత్రి 8 నుండి ఉదయం 6 వరకు బీహార్ 484106 108203 373261 2642 నైట్ కర్ఫ్యూ సాయంత్రం 6 నుండి 6 వరకు చండీగఢ్ 43446 7222 35735 489 వారం రోజుల లాక్ డౌన్ ఛత్తీస్‌గఢ్ 744602 121099 614693 8810 ఎనిమిది జిల్లాల్లో లాక్ డౌన్ దాద్రా మరియు నగర్ హవేలి మరియు డామన్ మరియు డియు 7712 1867 5841 4 ఢిల్లీ 1174552 96747 1061246 16559 మే 10వరకు లాక్ డౌన్ కొనసాగింపు గోవా 93355 23884 68249 1222 మే 3 వరకు లాక్డౌన్ గుజరాత్ 581624 145139 429130 7355 20 నగరాల్లో రాత్రి 8 నుంచి ఉదయం 6 వరకు హరియాణా 501566 102516 394709 4341 మే 31 వరకు పాక్షిక లాక్డౌన్ & నైట్ కర్ఫ్యూ హిమాచల్ ప్రదేశ్ 102038 19928 80585 1525 మే 10 వరకు 4 జిల్లాల్లో కరోనా కర్ఫ్యూ జమ్మూ- కాశ్మీర్ 179915 30343 147242 2330 మే 3 వరకు 11 జిల్లాల్లో కరోనా కర్ఫ్యూ జార్ఖండ్ 239734 58437 178468 2829 మే 6 వరకు లాక్ డౌన్ కర్ణాటక 1564132 405088 1143250 15794 మే 9 వరకు కరోనా కర్ఫ్యూ కేరళ 1606819 324169 1277294 5356 రాత్రి 9 నుండి ఉదయం 5 వరకు కర్ఫ్యూ లడఖ్ 14086 1400 12542 144 వీకెండ్ కర్ఫ్యూ లక్షద్వీప్ 2923 1438 1481 4 మధ్యప్రదేశ్ 575706 88511 481477 5718 కరోనా కర్ఫ్యూ మే 7 వరకు మహారాష్ట్ర 4665754 665837 3930302 69615 మే 15 వరకు లాక్డౌన్ మణిపూర్ 31905 1652 29843 410 మే 7 వరకు లాక్డౌన్ మేఘాలయ 17108 1659 15275 174 మిజోరం 6299 1299 4985 15 నాగాలాండ్ 14134 1353 12674 107 నైట్ కర్ఫ్యూ ఒడిశా 454607 61505 391048 2054 నైట్ కర్ఫ్యూ పుదుచ్చేరి 60001 10263 48921 817 పంజాబ్ 377990 58229 310601 9160 నైట్ కర్ఫ్యూ రాత్రి 8 నుండి ఉదయం 5 వరకు రాజస్థాన్ 615653 182301 428953 4399 మే 3 వరకు లాక్డౌన్ సిక్కిం 8211 1647 6416 148 తమిళనాడు 1186344 117405 1054746 14193 నైట్ కర్ఫ్యూ మరియు ఆదివారం పూర్తి లాక్డౌన్ తెలంగాణ 450790 80695 367727 2368 రాత్రి కర్ఫ్యూ రాత్రి 9 నుంచి ఉదయం 5 వరకు త్రిపుర 35589 1471 33720 398 ఉత్తర ప్రదేశ్ 1282504 301833 967797 12874 మే 4 వరకు లాక్డౌన్ ఉత్తరాఖండ్ 186014 51127 132156 2731 మే 1 వరకు లాక్డౌన్ పశ్చిమ బెంగాల్ 845878 116659 717772 11447 -
గుడ్ న్యూస్: ధర విషయంలో దిగొచ్చిన కోవిషీల్డ్
భారత్‌లో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఫ్రంట్‌లైన్ వర్కర్లతోపాటు 45 ఏళ్లు పైబడిన వాళ్లందరికి కలిసి దేశవ్యాప్తంగా కొవిడ్-19 వ్యాక్సినేషన్ 14.77 కోట్లు దాటింది. ప్రస్తుతానికి కేంద్రమే వ్యాక్సినేషన్‌ను కొనుగోలు చేసి రాష్ట్రాలకు అందిస్తుంది. అయితే మే 1 నుంచి వ్యాక్సిన్ ఉత్పత్తి దారులు 50శాతం డోసులను కేంద్రానికి ఇచ్చి మిగతా 50 శాతాన్ని నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలు, బహిరంగా మార్కెట్లో అమ్ముకునేందుకు కేంద్రం వీలు కల్పించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చే ఒక్కో డోస్ ధర 400 రూపాయలుగా సీరమ్ సంస్థ ప్రకటించింది. ప్రైవేట్ ఆస్పత్రులకు ఇచ్చే ఒక్కో డోస్ ధర రూ.600గా నిర్ణయించింది. కేంద్రానికి మాత్రం కోవిషీల్డ్ ఒక్కో డోసును 150 రూపాయలకు సీరమ్ సంస్థ అందిస్తోంది. తాజాగా ధర విషయంలో కోవిషీల్డ్ తగ్గింపు ప్రకటించింది. రాష్ట్రాలకు విక్రయించే డోసులను 400 రూపాయల నుంచి రూ.300కు తగ్గించినట్లు వెల్లడించింది. గతంలో ప్రకటించిన ధర కంటే ఇది 25% తక్కువ. రాష్ట్రాలకు ఖర్చు తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఈఓ అదర్ వూనావాల పేర్కొన్నారు. ‘‘సీరమ్ సంస్థ నుంచి ఓ ముందడుగు. రాష్ట్రాలకు విక్రయించే కోవిషిల్డ్ టీకా ధరను 300కి తగ్గించాం. ఇది తక్షణమే అమల్లోకి రానుంది. దీని ద్వారా వేల కోట్ల రాష్ట్ర నిధులు ఆదా కానున్నాయి. టీకాలతో మరిన్ని ప్రాణాలు కాపాడండి’. అంటూ ట్విటర్లో పేర్కొన్నారు. అయితే గత వారం రాష్ట్రాలు, ప్రైవేట్ ఆసుపత్రులకు కోవిషిల్డ్ అధిక ధరలను ప్రకటించడంతో అనేక విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే ధరలు తగ్గించినట్లు తెలుస్తోంది. కాగా మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు వేయనున్నట్టు ఇటీవలే కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: కోవిషీల్డ్: ప్రైవేటు మార్కెట్లో టీకా ధరలను ప్రకటించిన సీరమ్ As a philanthropic gesture on behalf of @SerumInstIndia, I hereby reduce the price to the states from Rs.400 to Rs.300 per dose, effective immediately; this will save thousands of crores of state funds going forward. This will enable more vaccinations and save countless lives. — Adar Poonawalla (@adarpoonawalla) April 28, 2021 -
కేంద్రం అలర్ట్: కరోనా కట్టడికి ‘ట్రిపుల్ టీ’లు
న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. వైరస్ కట్టడి చేసేందుకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. వైరస్ కట్టడికి ముఖ్యంగా మూడు ‘టీ’లు ప్రతిపాదించింది. టెస్ట్.. ట్రాక్.. ట్రీట్ అంటే పరీక్షలు చేయడం.. పాజిటివ్ తేలితే వారు ఎవరెవరినీ కలిశారో ట్రేస్ చేయడం.. అనంతరం చికిత్స అందించడం అని అర్థం. కరోనా పరీక్షలు పెంచండి.. జాగ్రత్తలు పాటించండి అని ఆదేశాలు జారీ చేసింది. ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు 70 శాతం పెంచాలి. పాజిటివ్ వచ్చిన వారిని క్వారంటైన్లో ఉంచి వైద్యం అందించాలి. పాజిటివ్ బాధితులు ఎవరెవరిని కలిశారో ట్రేసింగ్ చేయాలి. కేసులు అధికంగా ఉంటే కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించాలి. ఆ జోన్లో ఇంటింటి సర్వే చేసి పరీక్షలు చేయాలి. రద్దీ ప్రాంతాలు, బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాలు కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు. మాస్క్‌లు, భౌతిక దూరం, శానిటైజర్ వినియోగం పెంచాలి. నిర్లక్క్ష్యం చేసే వారిపై జరిమానా విధించాలి. వైరస్ తీవ్రతను బట్టి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మరిని ఆంక్షలు, చర్యలు తీసుకోవచ్చు. అంతరాష్ట్ర రాకపోకలపై నిషేధం విధించలేదు. ప్రజలతో పాటు సరుకు రవాణాకు రాష్రా్టల మధ్య అనుమతులు అవసరం లేదు. విద్యాలయాలు, కార్యాలయాలు, రవాణా, హోటళ్లు, రెస్టారెంట్లు, థియేటర్లు ఉద్యానవనాలు, జిమ్ కేందద్రాలు తదితర ప్రాంతాల్లో కరోనా నిబంధనలు విధిగా పాటించాలి. వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగాలి. వీలైనంత ఎక్కువగా ప్రజలకు వ్యాక్సిన్ పంపిణీ ముమ్మరం చేయాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నూతన మార్గదర్శకాల్లో తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి 30 వరకు మార్గదర్శకాలు వర్తిస్తాయి. కరోనా వ్యాప్తి దృష్ట్యా రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలి. చదవండి: తెలంగాణలో విద్యాసంస్థలు బంద్ -
న్యూ ఇయర్.. రాష్ట్రాలకు కేంద్రం లేఖ
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో యూకే స్ట్రెయిన్(రూపాంతరం చెందిన కొత్త రకం కరోనా వైరస్) కేసులు పెరుగుతుండటంతో కేంద్రం రాష్ట్రాలకు లేఖ రాసింది. బుధవారం రాసిన ఈ లేఖలో కేంద్రం న్యూ స్ట్రెయిన్ కేసులు పెరగకుండా రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇందుకోసం కేంద్రం రేపు, ఎల్లుండి జరిగే కొత్త సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించాలని రాష్ట్రాలకు సూచించింది. కాగా బ్రిటన్‌లో కొత్త వైరస్ న్యూ స్ట్రెయిన్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులపై కేంద్రం ఆంక్షలు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. జనవరి 31వ తేదీ వరకు ప్రత్యేక విమానాలు, అంతర్జాతీయ ఎయిర్ కార్గోలకు మాత్రమే అనుమతిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. -
15వ ఆర్థిక సంఘం నివేదిక రాష్ట్రపతి ముందుకు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని పన్నులు ఆదాయాలలో కేంద్ర, రాష్ట్రాల వాటాలను నిర్ణయించే 15వ ఆర్థిక కమిషన్ తన తుది వేదికను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు అందించింది. ఎన్కే సింగ్ నేతృత్వంలోని కమిషన్ 2022-26 వరకు సంబంధించిన సిఫారసులను సోమవారం సమర్పించింది. కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చే నిధుల్లో భారీగా కోత విధించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న 42 శాతం నిధుల బదలాయింపును తగ్గిస్తూ సిఫారసులు చేసింది. కోవిడ్-19 సంక్షోభం, భారీగా క్షీణించిన ఆదాయాలు నేపథ్యంలో సంఘం సిఫారసులను ప్రభావితం చేసినట్టు అంచనా. ప్రతి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను లోతుగా కమిషన్ విశ్లేషించిందనీ, అలాగే ప్రధానంగా ఆఆయార రాష్ట్రాలు ఎదుర్కొంటున్న ముఖ్య సవాళ్లను పరిష్కరించేందుకు నిర్దిష్ట పరిశీలన చేసినట్టు సమాచారం. 'ఫైనాన్స్ కమిషన్ ఇన్ కోవిడ్ టైమ్స్' పేరుతో ఈ నివేదికను సమర్పించింది. అంతకుముందు 10శాతం పెంపుతో కేంద్ర పన్ను వసూళ్లలో 42 శాతం రాష్ట్రాలకు ఇవ్వాలని 14వ ఫైనాన్స్ కమిషన్ సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. అయితే 15వ ఆర్ధిక సంఘం దీనికి భిన్నంగా 2020-21సంవత్సరానికి 41 శాతం రాష్ట్రాలకు బదిలీ చేయాలని సిఫారసు చేసినట్టు తెలుస్తోంది. అలాగే దీనికి ఒక శాతం తగ్గింపు (41 శాతం)తో కొత్తగా ఏర్పడిన జమ్మూ కాశ్మీర్, లడాఖ్‌కు చెల్లించాలని చెప్పింది. దీంతో నిధుల్లో తగ్గుదల వల్ల అనేక రాష్ట్రాలు చేపడుతున్న సంక్షేమ పథకాలకు గట్టి దెబ్బ పడనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. సాంప్రదాయ నిధుల కేటాయింపు సిఫారసులతోపాటు వచ్చే ఐదేళ్ళలో కేంద్రానికి ఆర్థిక ఏకీకరణ దిశగా ఒక మార్గాన్ని రూపొందించాలని కూడా కేంద్రానికి సిఫారసు చేసింది. రక్షణ, అంతర్గత భద్రతకు నిధులు సమకూర్చడానికి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయవలసిన అవసరాన్ని అలాంటి, యంత్రాంగాన్ని ఎలా అమలు చేయవచ్చో కూడా పరిశీలించాలని కేంద్రాన్ని కోరింది. 2019-20లో కేంద్రం రూ .21.6 ట్రిలియన్లు వసూలు చేస్తుందని అంచనా వేయగా, (సవరించిన అంచనాలు) కాని రాష్ట్రాల వాటా కేవలం రూ .6.6 ట్రిలియన్లుగా ఉంది. ఇది మొత్తం పన్ను మొత్తంలో కేవలం 30.3 శాతం మాత్రమే. 14 వ ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల ప్రకారం ఇది 42 శాతంగా ఉండాలి. కేంద్రం రాష్ట్రాలు కలిపి దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) లో 2.5 శాతం ఆరోగ్య రంగానికి ఖర్చు చేయాలని కమిషన్ సిఫారసు చేసినట్టు తెలేస్తోంది. ప్రస్తుతం, వారు 0.9 శాతం మాత్రమే. 0.3 శాతం కేంద్రం నుండి 0.6 రాష్ట్రాల నుండి వెచ్చిస్తున్నాయి. అనేక ప్రత్యేకమైన, విస్తృత సమస్యలపై కమిషన్ తన సిఫారసులను ఇవ్వమని కమిషన్ కోరింది. వివిధ పన్నుల పంపిణీ, స్థానిక ప్రభుత్వ నిధులు, విపత్తు నిర్వహణ నిధులు కాకుండా, విద్యుత్ రంగం, డీబీటీ స్వీకరణ వంటి అనేక రంగాలలో రాష్ట్రాలకు పనితీరు ప్రోత్సాహకాలను పరిశీలించి సిఫారసు చేయాలని కమిషన్ కోరినట్టు తెలుస్తోంది. ఈ నివేదిక కాపీని ఈ నెలాఖరుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అందజేస్తారు. రాబోయే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి సమర్పించే కేంద్ర బడ్జెట్‌తోపాటు, ఈ నివేదికను పార్లమెంటులో ప్రవేశపెట్టేవరకు పూర్తి వివరాలు తెలిసే అవకాశం లేదు. -
జీఎస్టీ : 21 రాష్ట్రాలు కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి ప్రభావంతో ఏర్పడిన జీఎస్టీ లోటు భర్తీకి సంబంధించి 21 రాష్ట్రాలు కీలక నిర్ణయాన్ని తీసుకున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదించిన "ఆప్షన్ 1" ఎంచుకున్నాయని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది జీఎస్టీ ప్రతిపాదించిన రుణాలు తీసుకోవడానికే ఈ రాష్ట్రాలు నిర్ణయించాయి. తద్వారా ఆర్థిక మంత్రిత్వ శాఖ సమన్వయంతో ఒక ప్రత్యేక విండో కింద రుణాల ద్వారా 97,000 కోట్ల అంచనా లోటును అప్పుగా తీసుకోవడానికి వీలు కల్పిస్తుందని వెల్లడించాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు అందించిన సమచారం ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్న వాటిల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న పాండిచేరి ఒకటి కావడం విశేషం. ఇంకా ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అసోం, బీహార్, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, ఒడిశా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి. దీనికి సంబంధించి ఇతర కాంగ్రెస్ లేదా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు తమ నిర్ణయాన్ని ప్రకటించలేదని తెలిపాయి. అలాగే మిగిలిన రాష్ట్రాలు అక్టోబరు 5న జరగనున్న కౌన్సిల్ సమావేశాని కంటే ముందు తమ నిర్ణయాన్ని తెలియజేయాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. లేదంటే బకాయిల కోసం జూన్, 2022 వరకు వేచి ఉండాల్సి ఉంటుందని స్పష్టం చేశాయి.('జీఎస్టీ రుణాల్ని కేంద్రమే చెల్లిస్తుంది') కాగా జీఎస్టీ అమలు ద్వారా రాష్ట్రాలు నష్టపోతున్న మొత్తం 97,000 కోట్లుగా లెక్కించాం. ఆ మొత్తాన్ని రాష్ట్రాలు కేంద్ర ఆర్థికశాఖ ఏర్పాటు చేసిన స్పెషల్ విండో ద్వారా రుణం రూపంలో పొందవచ్చు అని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో ప్రకటించారు. కోవిడ్ నష్టాన్ని కలుపుకుంటే మొత్తం లోటు రూ. 2,35,000 కోట్లుగా లెక్కించామనీ, ఈ మొత్తాన్ని రాష్ట్రాలు మార్కెట్ నుంచి రుణాలు పొందడం రెండో ఆప్షన్ గా పేర్కొన్నారు. ఈ రుణం తిరిగి కేంద్రం చెల్లిస్తుందని, కానీ వడ్డీని రాష్ట్రాలే భరించాల్సి ఉంటుంద న్నారు. రాష్ట్రాలు ఈ రెండు విధానాల్లో ఏదైనా ఎంచుకోవచ్చనీ, 41వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కూలంకుషంగా చర్చించామనీ ఆమె తెలిపారు. రాష్ట్రాలకు రెండు ఆప్షన్స్ ఇచ్చామని ఆర్థికమంత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. -
వివిధ రాష్ట్రాలకు సుప్రీంకోర్టు రూ.లక్ష జరిమానా
సాక్షి, న్యూఢిల్లీ: గ్రామ న్యాయాలయాల చట్టం–2008ని అమలు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై గత అక్టోబరులో ఇచ్చిన నోటీసులకు స్పందించని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సుప్రీం కోర్టు రూ.లక్ష జరిమానా విధించింది. జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం బుధవారం సంబంధిత పిటిషన్ విచారించింది. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ సొసైటీస్ ఫర్ ఫాస్ట్ జస్టిస్ సంస్థ దాఖలు చేసిన ఈ వ్యాజ్యం విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు తీసుకున్న చర్యలపై అఫిడవిట్లు సమర్పించాలని ధర్మాసనం గతంలో ఆదేశించినా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు స్పందించలేదని, వాటికి జరిమానా విధించాలని కోరారు. ఈ నేపథ్యంలో ధర్మాసనం తెలంగాణతో పాటుగా ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రూ.లక్ష జరిమానా విధిస్తూ విచారణను 4 వారాలపాటు వాయిదా వేసింది. -
ఒక దేశం ఒక రేషన్ కార్డ్ పథకం అమలుకు కేంద్రం కసరత్తు
-
రాష్ట్రాలు బలపడితేనే దేశాభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: అన్ని రాష్ట్రాలు ఆర్థికంగా బలోపేతమై అభివృద్ధిలో ముందువరుసలో నిలిచినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని, కేంద్రం అనుసరిస్తున్న అధికార కేంద్రీకృత విధానాల్లో మార్పురావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు. తమ రాష్ట్రంలోని పరిస్థితులకు అనుగుణంగా ప్రాధమ్యాలను నిర్ధారించుకుని అమలు చేసుకునే వెసులుబాటు రాష్ట్రాలకు కల్పించాలని ఆయన కోరారు. గతనెల్లో రాష్ట్రంలో పర్యటించిన 15వ ఆర్థిక సంఘానికి ఓ నివేదిక రూపంలో తన అభిప్రాయాలను, జాతీయ ఆలోచనా విధానాన్ని వెల్లడించారు. ఆదివారం కరీంనగర్ వేదికగా జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఈ విషయాన్ని ప్రస్తావించిన కేసీఆర్.. దేశరాజకీయాల్లో మార్పు తీసుకురావాలనే తమ లక్ష్యం, కసరత్తు ఇప్పటిది కాదని, చాలా కాలంగా జరుగుతోందని చెప్పారు. ‘విశాల జాతీయ ప్రయోజనాలు– నా ఆందోళన’ అనే పేరుతో 15వ ఆర్థిక సంఘానికి సీఎం కేసీఆర్ నివేదిక ఇచ్చారు. కేసీఆర్ ఇచ్చిన నివేదికలోని కీలకాంశాలు.. ‘ఇప్పటివరకు దేశాభివృద్ధి కోసం తీసుకున్న అరకొరచర్యలు సరిపోవని నేను అభిప్రాయపడుతున్నాను. మన వ్యవస్థ కోసం, ఒక రూపావళి తయారుచేసుకోవాలి. దేశంలో 40 కోట్ల వ్యవసాయ యోగ్యభూమి, 70 వేల టీఎంసీల ఉపరితల నీరు అందుబాటులో ఉంది. కేవలం 40వేల టీఎంసీలతోనే దేశంలోని ప్రతి ఎకరానికి నీరందించవచ్చు. డ్రిప్, స్ప్రింక్లర్, పైపుల తో నీటి సౌకర్యం కల్పించడం ద్వారా తక్కువ నీటితో సేద్యం చేయవచ్చు. ఇప్పటివరకు దేశంలో తీసుకున్న అనేక చర్యల ద్వారా 14% అంటే 5.5కోట్ల ఎకరాల భూమికే కాల్వల ద్వారా నీరు అందించగలుగుతున్నాం. అంతరాష్ట్ర సమస్యలు, న్యాయ వివాదాలు, భూసేకరణలో జాప్యం, పునరావస కల్పన, ప్రణాళిక– ఆచరణలోని లోపాలు నీటి ప్రాజెక్టులకు ప్రధాన ఆటంకాలుగా భావిస్తున్నాను. అంతర్ర్రాష్ట్ర నదీజలా ల వివాదాలపై తీర్పులిచ్చేందుకు ట్రిబ్యునళ్లు దశా బ్దాల సమయం తీసుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏ రాష్ట్రమైనా ఏం చేయగలదు? అసమర్థులైన వ్యక్తులు, సంస్థలు, విధానాల వల్ల ఏ దేశమైనా తన వనరులను వృధా చేసుకుంటుందా? వ్యక్తులతో కూడిన ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేయడం కంటే.. దేశంలో నదీజలాల వివాదాల పరిష్కారానికి శాశ్వత ట్రిబ్యునల్ భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలి. మరొక ప్రధాన అవరోధం ప్రజాప్రయోజన వాజ్యాల రూపంలో ఎదురవుతోంది. అంతులేని, కళ్లెం వేయలేని, పనికిమాలిన ఈ వాజ్యాలను నిరోధించగలిగే మార్గాన్ని కనుగొనగలిగామా? పేద దేశాలూ పరపతి పెంచుకుంటున్నాయి మనకంటే పేద దేశాలు కూడా ఆర్థిక పరపతి పెంచుకుంటూ అద్భుత ప్రగతిని సాధిస్తున్నాయి. 1979వ సంవత్సరం నుంచి చైనా దేశం సుస్థిర ఆర్థికాభివృద్ధి సాధిస్తోంది. ఆ అభివృద్ధి 1992 తర్వాత మరింత పుంజుకుంది. 1971 కంటే ముందు మన జీడీపీ కంటే చైనా జీడీపీ తక్కువ ఉండేది. ఇప్పుడు మన కన్నా 4 రెట్లు ఎక్కువ జీడీపీని చైనా సాధించింది. మనమెందుకు ఇది సాధించలేము? గత 4 దశాబ్దాలుగా చైనా సాధిస్తున్న అభివృద్ధి అక్కడి ప్రభుత్వ విజన్‌కు అద్దం పడుతోంది. ఇక దక్షిణ కొరియా, సింగపూర్, తైవాన్లతో పాటు మలేసియా, ఇండోనే షియా, థాయిలాండ్, వియత్నాం, ఫిలిప్పైౖన్స్ లాంటి దేశాలు మానవాతీతమైన అభివృద్ధిని సాధిస్తున్నా యి. హిరోషిమా దాడుల తర్వాత బూడిద స్థాయి నుంచి జపాన్ దేశం ప్రపంచంలోనే అత్యధిక తలసరి ఆదాయం ఉన్న దేశంగా ఎదిగింది. మన దేశ అంతర్గత శక్తి, ఆర్థిక వ్యవస్థల పరపతిని మనం పెంచుకోలేమా? ఈ విషయంలో మనల్ని అడ్డుకుంటున్నదేంటి? ఇది అధిగ మించలేని సమస్య కూడా కాదు. సమస్యల్లా మన ఆలోచనా విధానమే. 70 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా కనీస అవసరాల కోసం పోరాడాల్సిన పరిస్థితి నుంచి మనం బయటపడడానికి ఓ దిశ కావాలి. దేశంలో పెద్ద సంఖ్యలో నిరుద్యోగం, పేదరికం ఉంది. మంచి విధానాల గురించి ఆలోచించడం కన్నా తదుపరి విధానమేంటనే దానిపై దృష్టి పెట్టాలి. మూస పద్ధతులు మాని భారీ ప్రణాళికలు రూపొందించాలి. రాష్ట్రాలకు సాధికారత అవసరం జాతీయ ఎజెండా మారాలి. ఏటా బడ్జెట్లు పెట్టడం, సాధారణ పద్ధతుల్లో ముందుకెళ్లడం, సంప్రదాయ విధానాలను అనుసరించడంలో మార్పు రావాలి. పేదరికం అనే ఆలోచన నుంచి విముక్తి పొందడానికి భారీ ప్రణాళికలు అవసరం. మూస ఆలోచనా విధా నం నుండి బయటపడటం తక్షణావసరం. దేశం అభివృద్ధి చెందాలంటే రాష్ట్రాలు సాధికారత పొందాలి. అభివృద్ధి కేంద్రీకృత జాతీయ ఎజెండా ద్వారా కొత్త భారతాన్ని ఆవిష్కరించుకోవాలి. అధికార కేంద్రీకరణ నుంచి బయటపడాలి. రాష్ట్రాలు ముందుండే కొత్త ఆర్థిక మోడల్ ఈ దేశానికి అవసరం. రాష్ట్రాల అభివృద్ధే దేశాభివృద్ధి. దేశంలో గరిష్టంగా 8–10 రాష్ట్రా లు మాత్రమే అభివృద్ధి దిశలో ఉన్నాయి. మిగిలిన దేశంలో జరుగుతున్న అభివృద్ధి ఏమీ లేదు. ఇతర రాష్ట్రాలు చాలా వెనుకబడి ఉన్నాయి. అన్ని రాష్ట్రాలు వాటి వనరులు, సామర్థ్య పరపతిని పెంచుకోగలగాలి. రాష్ట్రాలు వాటి స్థాయిలోనే ప్రాధామ్యాలను నిర్ధారించుకునే అవకాశం పెరగాలి. రాష్ట్రాల జాబి తాలో ఉన్న అంశాల్లో కూడా చాలా కేంద్ర ప్రాయో జిత పథకాలు అమలవుతున్నాయి. సర్కారియా కమిషన్ చర్చల్లో కూడా ఉమ్మడి జాబితా అంశాలను రద్దు చేయాలని రాష్ట్రాలు ప్రతిపాదించాయి. ఉమ్మడి జాబితాలోని అంశాలు గుత్తాధిపత్య ధోరణితో కేం ద్రం ఏకపక్షంగా అమలు చేస్తోందని రాష్ట్రాలు అభిప్రాయపడ్డాయి. క్రిమినల్ లా, అడవులు, దివాళా సంస్థలు, ట్రేడ్ యూనియన్లు, కార్మిక సంక్షేమం, న్యాయ, ౖవైద్య, ఇతర వృత్తులు తదితర ఉమ్మడి జాబితాలోని అంశాలపై పార్లమెంటు చట్టాలు చేసింది. గతంలో రాష్ట్రాల జాబితాలో ఉన్న విద్య, అడవులు, తూనికలు, కొలతలు, వన్యప్రాణులు, పక్షుల సంరక్షణ, న్యాయపాలన లాంటి అంశాలను కూడా ఉమ్మ డి జాబితాలో చేర్చారు. ఈ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాలతో ముందస్తు సంప్రదింపులు జరపాలని, ఆ తర్వాత సంయుక్తంగా అంతర్రాష్ట్ర కౌన్సిల్లో చర్చిం చాలని సిఫారసు చేసింది. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి, గృహనిర్మా ణం, తాగునీరు, పారిశుద్ధ్యం, మహిళా, శిశు సంక్షే మం లాంటి ప్రజలను ప్రత్యక్షంగా ప్రభావితం చేసే అంశాలను రాష్ట్రాలకు వదిలేయడమే మంచిది. ఈ విషయంలో కేంద్రం పునఃపరిశీలన చేయాలి. ఆయా రంగాల్లో కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు, ప్రాధాన్యాలను నిర్ణయించే అధికారాలను స్థానిక పరిస్థితుల ఆధారంగా రాష్ట్రాలకు ఇచ్చేయాలి. కేంద్రానికి లభించే పన్ను ఆదాయంలో 42% రాష్ట్రాలకు సంక్రమింపజేయడం ఇప్పటివరకు జరగలేదు. సెస్సుల రూపంలో మళ్లీ తీసుకుంటున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, విదేశీ పెట్టుబడుల ఆకర్షణతో పాటు అభివృద్ధిని వెనక్కునెట్టే సమస్యలను పరిష్కరించుకునే దిశలో ఆర్థిక సంస్కరణలు భారతదేశానికి అవసరం. రాష్ట్రాలను ఆర్థికంగా బలోపేతం చేయడం ద్వారా ఆయా రాష్ట్రాల్లో అపార అభివృద్ధి సాధించడం వల్ల మన దేశాన్ని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, ప్రభావితమైన దేశంగా తయారుచేయవచ్చని నేను నమ్ముతున్నాను’అని 15వ ఆర్థిక సంఘానికి ఇచ్చిన నివేదికలో కేసీఆర్ తన జాతీయ ఆలోచనా విధానాన్ని, గుణాత్మక మార్పు నకు అవసరమైన పరిస్థితిని వివరించారు. చేసి చూపించాం రాష్ట్రంలోని ప్రతీ ఇంటికి తాగునీటి సరఫరా చేయొ చ్చని మిషన్ భగీరథ ప్రాజెక్టు ద్వారా మేము చేసి చూపించాం. రాబోయే ఐదారేళ్లలో దేశంలోని ప్రతీ గ్రామానికి నీటిసరఫరా చేసే లక్ష్యంతో ముందుకు సాగాలి. దీనికి 8–10 లక్షల కోట్లు ఖర్చు కావొచ్చు. కనీస మద్దతు ధరను రూ.500 లేదా ప్రస్తుతమున్న ఎమ్మెస్పీకి మూడోవంతు పెంచడమో చేయాలి. ఉద్యోగుల డీఏలో మాదిరిగా ధరల సూచీకి అనుగు ణంగా ఈ ఎమ్మెస్పీని ఏటా పెంచాలి. వ్యవసాయరంగంలో లాభాలు, ఉత్పాదకత తక్కువగా ఉన్నందున రైతులు–వినియోగదారుల ధరల్లో భారీ వ్యత్యాసం ఉంటోంది. ఈ నేపథ్యంలో రైతుబంధు పథకం కింద ఏడాదికి ఎకరానికి రూ.10 వేలు రైతులకు అందిస్తున్నాం. సాగునీటి రంగంలో మహారాష్ట్ర, కర్ణాటకలతో ఉన్న పలు విభేదాలను సంప్రదింపులతో అధిగమిం చగలిగాం. దీనికి కాళేశ్వరం ప్రాజెక్టే ఓ సజీవ సాక్ష్యం’ అని ఆ నివేదికలో కేసీఆర్ పేర్కొన్నారు. -
‘సర్వీస్ రూల్స్‌పై స్టేటస్ కో ఎత్తేయండి’
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ పై హైకోర్టులో ఉన్న స్టేటస్ కో ఎత్తేయడానికి కృషి చేయాలని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ను పీఆర్టీయూటీఎస్ నేతలు కోరారు. ఆగస్టు 1న జరగనున్న విచారణలో వాదనలు వినిపించేందుకు సీనియర్ న్యాయవాదిని నియమించాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఈ మేరకు ఢిల్లీలో రాజ్‌నాథ్ సింగ్‌ను ఎంపీలు జితేందర్‌రెడ్డి, సీతారాంనాయక్, మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు కె.జనార్దన్‌రెడ్డి, పూల రవీందర్, పీఆర్టీయూటీఎస్ అధ్యక్షుడు సరోత్తంరెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్‌రావు కలిశారు. -
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు
-
నాలుగేళ్లలో 14 మంది ముఖ్యమంత్రులు!
దాదాపు నాలుగేళ్ల క్రితం 2014 మే 26న కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక జరిగిన 19 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 11 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. అప్పటికే బీజేపీ పాలనలో ఉన్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ సీఎంలు, తర్వాత ఫిరాయింపులతో అధికారంలోకి వచ్చిన అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖండూ, కొద్ది రోజుల్లో ప్రమాణం చేసీ త్రిపుర సీఎంతో కలిపి బీజేపీ ముఖ్యమంత్రుల సంఖ్య 14కు పెరుగుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన కేంద్రంలో ఎన్డీఏ(బీజేపీ) ప్రభుత్వం ఏర్పడ్డాక 2014 ద్వితీయార్థంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన హరియాణా, మహారాష్ట్ర, జార్ఖండ్‌లో తొలిసారి బీజీపీ ముఖ్యమంత్రులు (వరుసగా మనోహర్‌లాల్ ఖట్టర్, దేవేంద్ర ఫడణవీస్, రఘుబర్ దాస్) అధికారంలోకి వచ్చారు. మహారాష్ట్రలో ఎన్నికల తర్వాత శివసేనతో చేతులు కలిపి సంకీర్ణ సర్కారుకు నాయకత్వం చేపట్టింది. జమ్మూకశ్మీర్‌లో సీఎం మెహబూబూ ముఫ్తీ నేతృత్వంలోని జమ్మూకశ్మీర్ పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీతో చేతులు కలిపి సంకీర్ణ భాగస్వామిగా కొత్త సర్కారులో చేరింది. మరుసటి ఏడాది 2015లో జరిగిన దిల్లీ (కేంద్రపాలిత ప్రాంతం), బిహార్ ఎన్నికల్లో కాషాయపక్షం ఓడిపోయింది. అయితే, 2017 జులైలో బిహార్ సీఎం నితీష్ కుమార్(జేడీయూ) తన సంకీర్ణ సర్కారు ప్రధాన భాగస్వామి ఆర్జేడీతో తెగతెంపులు చేసుకుని బీజేపీతో చేతులు కలిపారు. బీజేపీ భాగస్వామిగా వెంటనే సంకీర్ణ ప్రభుత్వం నితీష్ నాయకత్వాన ఏర్పడడంతో బిహార్ కూడా ఏన్డీఏ పాలిత రాష్ట్రాల జాబితాలో చేరింది. బీజేపీ ఖాతాలో మొదటిసారి చేరిన అస్సాం 2016లో కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ, అస్సాం అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ తొలిసారి అస్సాంలో మెజారిటీ సాధించి అధికారం చేపట్టింది. బీజేపీ నేత సర్బానంద సోనోవాల్ ప్రాంతీయపక్షమైన ఏజీపీ, బీపీఎఫ్‌తో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుచేశారు. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్లో బీజేపీకి అతి స్వల్ప సంఖ్యలో సీట్లు దక్కాయి. తొలిసారి కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక సీటు గెలుచుకుంది. తర్వాత పశ్చిమ బెంగాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ రెండో స్థానం సాధించి సీపీఎంను మూడో స్థానానికి పరిమితం చేసింది. బీజేపీ నెమ్మదిగా తృణమూల్ కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా అవతరిస్తుందేమో అనేలా బలపడుతోంది. 2017లో ఆరు రాష్ట్రాల్లో విజయం 2017లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన గోవాలో అతికష్టం మీద బీజేపీ అధికారం నిలబెట్టుకుంది. పంజాబ్‌లో అకాలీదళ్-బీజేపీ కూటమి ఘోర పరాజయం పాలైంది. ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్‌లో కాంగ్రెస్‌ను ఓడించి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈ మొదటి మూడు రాష్ట్రాల్లో కాషాయపక్షానికి మంచి మెజారిటీ వచ్చింది. మణిపూర్‌లో కాంగ్రెస్ కన్నా తక్కువ సీట్లు వచ్చినాగాని చిన్న పార్టీల మద్దతు కూడగట్టి సీఎం పదవి కైవసం చేసుకుంది బీజేపీ. దాదాపు 20 ఏళ్లుగా అధికారంలో ఉన్న గుజరాత్లో అతి కష్టంమీద బీజేపీ హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో విజయం సాధించింది. 2018లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన త్రిపురలో బీజేపీ తన మిత్రపక్షం ఐపీఎఫ్టీతో కలిసి 59 సీట్లలో 43 కైవసం చేసుకుని ఘన విజయం సాధించింది. కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో రెండుశాతం కూడా సీట్లు రాని ఈ చిన్న బెంగాలీ రాష్ట్రంలో తొలిసారి బీజేపీ నేత సీఎం పదవి చేపట్టబోతున్నారు. నాగాలాండ్‌లో ఎక్కువ సీట్ల గెలుచుకున్న మిత్రపక్షం ఎన్డీపీపీ నాయకత్వంలో ఏర్పడే సంకీర్ణ సర్కారులో బీజేపీ భాగస్వామిగా చేరాలని భావిస్తోంది. మేఘాలయలో బీజేపీకి కేవలం రెండే సీట్లు దక్కడంతో ఇక్కడ ఈ పార్టీ పాత్ర పరిమితమే. ఈ ఏడాది చివర్లో అసెంబీ్ల ఎన్నికలు జరిగే మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ 2003 డిసెంబర్ నుంచీ అధికారంలో కొనసాగుతోంది. ఈ రెండింటితో పాటు ఎన్నికలు జరిగే రాజస్థాన్‌లో 2013లో అధికారంలోకి వచ్చింది. ఈ మూడు హిందీ రాష్ట్రాల్లో ప్రభుత్వాలపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని వస్తున్న అంచనాల నేపథ్యంలో బీజేపీ మళ్లీ అధికారం నిలబెట్టుకోవడం కష్టమేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ పాలనలోని కర్ణాటకలో వచ్చే మేలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కైవసం చేసుకోవడానికి బీజేపీ నేతలు గట్టి వ్యూహాలు పన్నుతున్నారు. మొత్తం 29 రాష్ట్రాల్లో త్రిపురతో కలిపి 14 చోట్ల బీజేపీ ముఖ్యమంత్రుల పాలనలోకి వచ్చాయి. జమ్మూకశ్మీర్, ఆంధ్రప్రదేశ్, బిహార్‌ను పాలిస్తున్న సంకీర్ణ ప్రభుత్వాల్లో బీజేపీ జూనియర్ భాగస్వామిగా ఉంది. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
రాకెట్లా ఎగిసిన రాష్ట్రాల లోటు
ముంబై : ఆ రెండు రాష్ట్రాలు దేశానికి అత్యంత కీలకం. ఒకటి అత్యంత ఎక్కువ జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్ కాగ, మరొకటి అతిపెద్ద రాష్ట్రం రాజస్తాన్. కానీ వాటి వాణిజ్య లోటులు మాత్రం భారీగా ఎగిశాయి. ఆ రెండు రాష్ట్రాలివే కాక, మిగతా రాష్ట్రాల వాణిజ్య లోటులు కూడా స్కై రాకెట్ లా ఎగిసినట్టు తెలిసింది. 1991 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల వాణిజ్య లోటు రూ.18,790కోట్లుంటే, అవి కాస్త, 2016 ఆర్థిక సంవత్సరానికి రూ.4,93,360కోట్లకు పెరిగినట్టు తాజా ఆర్బీఐ డేటా పేర్కొంది. ఆర్బీఐ రెండో ఎడిషన్ గణాంకాల ప్రచురణ ''హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ స్టేట్స్ 2016-17'' కింద ఈ డేటాను ఆర్బీఐ నేడు వెల్లడించింది. ప్రస్తుతం ఈ వాణిజ్య లోటును రూ.4,93,360 కోట్ల నుంచి రూ.4,49,520 కోట్లకు తగ్గించుకోవాలని అన్ని రాష్ట్రప్రభుత్వాలు తమ బడ్జెట్ లలో అంచనాలు వేసుకున్నాయి. ఉత్తరప్రదేశ్ వాణిజ్య లోటు 1991లో రూ.3070 కోట్లు ఉండగా.. 2016లో ఇది రూ.64,230కోట్లకు పెరిగింది. అయితే 2017 ఆర్థికసంవత్సరంలో వాణిజ్య లోటు కొంత మెరుగుపరుచుకుని రూ.49,960కోట్లగా ఉంచాలని బడ్జెట్ లో ఆ రాష్ట్రం నిర్ణయించింది. 2016 వాణిజ్యలోటులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రమే మొదటి స్థానంలో ఉంది. అంతేకాక రాజస్తాన్ స్థూల వాణిజ్య లోటు కూడా 1991 కంటే 2016లో భారీగానే రూ.67,350 కోట్లకు పెరిగింది. దీన్ని లోటును కూడా రూ.40,530 కోట్లకు తగ్గించాలనుకుంటున్నారు.. పట్టణీకరణలోనూ, పరిశ్రమలోనూ ఎక్కువగా అభివృద్ది చెందిన రాష్ట్రాల్లో ఒకటైన మహారాష్ట్ర వాణిజ్య లోటు కూడా 1991 నుంచి 2016కు బాగానే పెరిగినట్టు తెలిసింది. 1991లో ఈ రాష్ట్ర లోటు రూ.1,020 కోట్లుంటే, 2016లో రూ.37,950 కోట్లగా నమోదైనట్టు ఆర్బీఐ డేటా పేర్కొంది. అయితే ముందటేడాది కంటే ఈ ఏడాది కాస్త మెరుగుపరుచుకోవాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి. అత్యంత వేగంగా పారిశ్రామిక రంగంలో అభివృద్ధి చెందిన గుజరాత్ లో కూడా లోటు పెరగడం తక్కువేమీ కాదని ఆర్బీఐ పేర్కొంది. ఈ రాష్ట్రంలో 1991లో 1,800 కోట్ల వాణిజ్య లోటు ఉంటే, 2016లో రూ.22,170కోట్లకు తాజా గణాంకాలు చెప్పాయి. ఆంధ్రప్రదేశ్ లో కూడా వాణిజ్య లోటు బాగానే పెరిగినట్టు తెలిసింది. ఈ రాష్ట్రంలో 1991లో రూ.970 కోట్ల లోటు ఉంటే, అది కాస్త 2016 నాటికి రూ17,000 కోట్లకు పెరిగినట్టు గణాంకాలు పేర్కొన్నాయి. గతేడాది కంటే అత్యధిక వాణిజ్యలోటును నమోదుచేసిన రాష్ట్రంగా తమిళనాడు, కర్నాటక, కేరళలు ఉన్నాయి. -
బంగారం, వెండిపై జీఎస్టీ భారమెంత?
న్యూఢిల్లీ : ఏకీకృత వస్తుసేవల పన్ను విధానం అమలుకు ఇంకా కొన్ని రోజులే సమయముంది. బంగారం, వెండిపై ఎంత పన్ను రేటు విధించాలనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే బంగారం, వెండిపై 4 శాతం జీఎస్టీ విధింపుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఫైనాన్సియల్ సర్వీసెస్ లపై ప్రత్యేక రేటును నిర్ణయించనున్నట్టు సమాచారం. జూలై నుంచి జీఎస్టీ అమలుకు రంగం సిద్దమవుతుండగా.. బంగారం, వెండి సెక్టార్ల నుంచి లాబీయింగ్ జోరుగా సాగుతోంది. దక్షిణ ప్రాంత రాష్ట్రాల్లో బంగారం, వెండిపై 6 శాతం లెవీకి మొగ్గుచూపుతుందడగా.. కొన్ని రాష్ట్రాలు 5 శాతం వరకు వ్యాట్ కే సమ్మతిస్తున్నాయి. కొన్ని పశ్చిమరాష్ట్రాలు చాలా తక్కువగా 1 శాతానికే ఓకే చెబుతున్నాయి. వస్తువులపై శ్లాబులు నిర్ణయించిన జీఎస్టీ కౌన్సిల్, బులియన్, సర్వీసులపై నిర్ణయాన్ని ప్రస్తుతానికి పక్కనపెట్టింది. అయితే సర్వీసులపై రెండు విధాల జీఎస్టీ రేట్లుంటాయని రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా సంకేతాలిచ్చారు. 18 శాతం, 12 శాతం లెవీని సర్వీసులపై విధించనున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. బంగారం, వెండి జీఎస్టీ రేట్లపైనే కాక, హ్యాండ్ లూమ్, హ్యాండీ క్రాఫ్ట్స్, బీడీలను టాక్స్ నెట్ లోకి తీసుకురావాలా? లేదా? అనే దానిపై కూడా చర్చలు జరుగుతున్నాయి. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధినేతగా రాష్ట్రాల ఆర్థికమంత్రులతో కూడిన అత్యున్నత నిర్ణయాత్మక బాడీ జీఎస్టీ కౌన్సిల్ ఈ మేరకు చర్చలు జరుపుతోంది. బీడీలను ప్రస్తుతం టాక్స్ నెట్ నుంచి మినహాయింపు ఉంది. కానీ వీటిని కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని యోచిస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. వీటన్నింటిపై నిర్ణయాలు తీసుకోవడానికి జీఎస్టీ కౌన్సిల్ మే 18, 19న శ్రీనగర్ లో భేటీ నిర్వహించబోతుంది.