
న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే సమీపిస్తుండటంతో మువ్వన్నెల జెండాల వాడకం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర హోంశాఖ ప్రత్యేకంగా సూచనలు చేసింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు శుక్రవారం ఒక సర్క్యులర్ జారీ చేసింది.
జెండా వందన కార్యక్రమాలు పూర్తయ్యాక కాగితపు జెండాలను ఇష్టం వచ్చినట్లుగా నేలపై పారేయకూడదని కోరింది. జెండా గౌరవానికి భంగం కలగకుండా వాటిని గౌరవ ప్రదంగా, రహస్యంగా డిస్పోజ్ చేయాలని సూచించింది. ఈ విషయంపై అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. అన్ని ఇతర ఈవెంట్లలో వాడే జెండాలకు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది.
జనవరి 26న దేశం 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించనుంది. ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ముఖ్యఅతిథిగా హాజరవనున్నారు. గణతంత్ర వేడుకల కోసం ఢిల్లీలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదీచదవండి.. సభలో మోదీ నినాదాలు.. అసౌకర్యానికి గురైన సిద్ధరామయ్య