ఆరేళ్లు ఉంటేనే ఒకటో తరగతిలో అడ్మిషన్‌: కేంద్రం | Centre Asks States UTs 6 Years Age For 1 Admission | Sakshi
Sakshi News home page

ఆరేళ్లు ఉంటేనే ఒకటో తరగతిలో అడ్మిషన్‌: కేంద్రం

Published Wed, Feb 22 2023 9:36 PM | Last Updated on Wed, Feb 22 2023 9:36 PM

Centre Asks States UTs 6 Years Age For 1 Admission - Sakshi

ఢిల్లీ: విద్యార్థుల అడ్మిషన్లపై కేంద్రం కొత్త రూల్‌ తీసుకురానుంది. విద్యార్థుల వయసు ఆరు ఏళ్లు ఉంటేనే ఒకటో తరగతిలో అడ్మిషన్‌ ఉండాలని నిర్ణయించింది. ఈ మేరకు.. ఈ నిబంధనను పాటించేలా చూడాలని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర విద్యాశాఖ ఉత్వర్వులు జారీ చేసింది. 

కొత్త జాతీయ విద్యా విధానం (NEP) ప్రకారం, పునాది దశలో పిల్లలందరికీ (3 నుండి 8 సంవత్సరాల మధ్య) ఐదు సంవత్సరాల అభ్యాస అవకాశాలను కలిగి ఉంటుంది, ఇందులో మూడు సంవత్సరాల ప్రీస్కూల్ విద్య(నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ) తర్వాత.. 1, 2 తరగతులు ఉంటాయి.

పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని చాలా చిన్న వయస్సులో పాఠశాలలకు పంపరాదని గత ఏడాది సుప్రీంకోర్టు సైతం వ్యాఖ్యానించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement